Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొండపల్లి

వికీసోర్స్ నుండి

కొండపల్లి :

కొండపల్లి యాంధ్ర దేశమున కృష్ణామండల మందలి బెజవాడ తాలూకాలోని గ్రామము. ఈ గ్రామమునకు పడమటి దిశయందు దుర్గారణ్య పరివృతమగు పర్వతము గలదు. ఇది యున్నత మైన పర్వతము; దక్షిణమున కృష్ణా నదివరకును, ఉత్తరమున కొండూరు, జుజ్జూరుల వరకును పరివ్యాప్తి గలది. దీని కై వారము నూరుమైళ్ళు, ఎత్తు రమారమి రెండు మైళ్ళు. ఈ పర్వత ప్రాంతము క్రూర మృగములకు నివాసస్థానము. చోరుల కాటపట్టు. జన సంచారమునకు భయావహము.

అనాది నుండి కొండపల్లి గ్రామము మెత్తని చిత్ర విచిత్రపు కొయ్య బొమ్మలకు పెట్టినది పేరు. ఈ కొండ పల్లి బొమ్మల శిల్పచాతుర్య మనల్పము. కుటీర పరిశ్రమ లకు నిలయము. చాల కాలము వరకు కొండపల్లి కాగితపు పరిశ్రమ ప్రసిద్ధిలో నుండెను. దీని జనసంఖ్య క్రీ. శ. 1951 నాటికి 6212. ఇందు పురుషుల సంఖ్య 3161, స్త్రీలసంఖ్య 8051 మంది. రెడ్డి ప్రభువుల నిర్మాణములగు ప్రాచీన శివాలయ, వీరభద్రాలయములు నేటికిని ఆంధ్ర భక్తుల నాకర్షించుచున్నవి. మహమ్మదీయుల పండుగలు జరుగు టకు 'గవ్వలగుట్ట' యను నొక చిన్న గుట్టయు గలదు. ఈ గుట్ట వెన్నుదన్ని యే విద్యాధర గజపతివారి చెరు వున్నది. కొండవీడు రాజ్యములో నైదు బలిష్ఠ దుర్గము లుండెను. అందు కొండపల్లి దుర్గము చేరియుం డెను. కొండవీడు, వినుకొండ, బెల్ల (బిల) ముకొండ, నాగార్జు (నుని)న కొండ అనునవి ఇతర నాలుగు దుర్గములు. ఈ పంచగిరి దుర్గములే గాక కొండవీటి రాష్ట్రమునకు మొత్త మెనుబది నాలుగు దుర్గము లుండెడివి. ఇంత పెద్ద దైన కొండవీటి రాష్ట్రము మహమ్మదీయుల పరిపాలన మునకు లోబడినపుడు, కేవలము కొండవీడు, కొండపల్లి యను రెండు సర్కారులుగా మాత్రము విభజింపబడినది. మహమ్మదీయులు కొండపల్లి సర్కారును “ముస్తఫా నగర"మని పేర్కొనిరి. కొండవీటి సర్కారు నుండి పాములపాడు, గద్దం రావూరు, మద్దూరు, ఉండవల్లి. ఉప్పుమాగులూరు, ధరణికోట, పెనుమాక, రాయపూడి, తా డేపల్లి గ్రామములు కొండపల్లి సర్కారులో కలిసినట్లు “జై నినాగభట్టు" తన “దండకవిలె"లో చెప్పినాడు (క్రీ. శ. 1250 సంవత్సరము).

కొండవీటి రెడ్డి రాజులకు మూలపురుషు డగు కోమటి ప్రోలయ వేమారెడ్డి (1826-1953) కొండపల్లి గ్రామము నకు సమీపముననున్న “కవులూరు" అను గ్రామ నివాసిగా నుండె ననియు, ఇతడు గొప్ప భూస్వామిగా నుండి యుండెననియు, ఈత డొక బ్రాహ్మణునివలన స్పర్శవేధి సంపాదించి భాగ్యగరిమ చేతను, బాహాబలసంపద చేతను ప్రతాపరుద్రుని యొద్ద దండనాథుడుగ ప్రబలెననియు తెలి పెడు నైతిహ్య మొకటి కలదు.

కవులూరు గ్రామ వాస్తవ్యుడగు కోమటి ప్రోలయ వేమారెడ్డియే పుట్టకోటలుగా నున్న కొండవీడు, కొండ పల్లి దుర్గములను ప్రధానదుర్గములుగ నిర్ణయించి కోటల నిర్మాణమునకు బూనుకొ నెనని జనశ్రుతిగలదు. ఈకోమటి ప్రోలయ వేముడు కవులూరు నుండి కొండపల్లి కిని, కొండ పల్లి నుండి కొండవీటికిని క్రమముగ నివాసములను మార్చు కొనుచు కోటల నిర్మాణములను బూర్తి గావించెను.

కొండపల్లి దుర్గము కృష్ణాతీరమునకు ఐదుమైళ్ళ దూర మునందున్నది. దీనికి రెండుమైళ్ళ క్రిందిభాగమున నొక కోట ప్రాకారము కలదు. దీని చుట్టుకొలత పండ్రెండు మైళ్ళు. చుట్టును ప్రాకారమున్నది. ఈ పర్వత ప్రాకా రము నంటియున్న కోటకు దిగువ నలువైపులయందును కందకముగూడ ఒకటి గలదు. కందక మెల్ల వేళల పారు చుండెడు సెలయేటి ప్రవాహములచే పుష్కలోదక మై యుండును. క్రింది ప్రాకారమునకును, దుర్గమునకును ఒక మైలు దూరముండును. ఈ మైలు దూరములో నే దుర్గ ప్రవేశమునకు రెండుదారులు కలవు. అదొకటి రాచబాట రెండవది రాళ్ళబాట.

రాచబాట చతురంగ బలముల రాకపోకలకు వీలు కలది. రాళ్ళబాట రహస్యమార్గము. ఇది సంకట సమ యమునందు దుర్గములోనివారు ప్రాణ రక్షణార్థమై పారి పోవుటకు నుపయోగపడునట్టిది. ప్రతి ప్రాకారమునకును బురుజులు నిర్మింపబడినవి. ఈ బురుజులకడ సేనాధిపతులు కావలి కాయుచుండెడి వారు. ఈ ప్రాకారములు దుర్గము చుట్టును మహోన్నత మగు పర్వతముల నొరసికొని యున్నవి. నడుమ నడుమ కొండవరుసలే పెట్టని ప్రాకారములై దుర్గమునకు శ్రీరామరక్షలైనవి, ఈ సహజ ప్రాకారములు విచిత్ర శోభావహములు. ప్రాకార పరివేష్టితమైన యేడు బురుజులను దాటి పైకి పోయినచో నొక సింహద్వారము గానుపించును. ఆ ద్వారమును దాటి లోనికి పోయినచో మహోన్నత మైన యింకొక ప్రాకారము తగులును. ఈ ప్రాకారము దుర్గప్రదేశమును ఆవరించియుండును. ఇది వల్గదరివర్గ హయురఘట్టనలభేద్యము; శాత్రవ భయంకరము; మహృద్దర్శనీయము. ఈ ప్రాకార పంక్తుల మధ్యనున్న నిర్మాణములును, పౌధములును ప్రాచీన సభ్యతా శిల్ప సౌందర్యమునకు పరమావధులు. ఈ కట్టడములలో ధనాగారము లన్నియు నొకచోట నున్నవి. వాని కావల సేనాధిపతుల సౌధ ములు కలవు. వీనిసమీపమున నే రాజమహలులు, రాజాంగ వాంతఃపురములును, ఉద్యానవనములును ఉన్నవి. రాజవీధులు సామీప్యమున అరువది ధనుస్సుల దూర ములో దర్బారు భవన మొకటి కలదు. తద్భవనోపరి నిర్మిత శిలా విగ్రహములును, శిలాలతలును ప్రాచీన శిల్ప ప్రావీణ్యమున కతిభూములు. ఈ భవనమునకు అధో భాగమునగల గజాశ్వశాలలు అతి భయంకరములై కప్పడును. దుర్గ సంరక్షణార్థము చుట్టును పర్వత శ్రేణులపై నాలుగు రక్షణస్థలు లేర్పరుప బడినవి. కొండపల్లి దుర్గమునకు తూర్పు భాగమున హను ముంతు కొండ గలదు. రాజ భవనమునకును దీనికిని రమా డమి వేయి ధనుస్సుల దూరము. హనుమంతు కొండ బురుజుపై నొక చిన్న ద్వారమున్నది. అందు సైన్యా ధ్యక్షుడు నివసించుటకు సౌకర్యము లమర్పబడినవి. బురుజు నందే యైదువందల మంది సైనికులు ఖడ్గ కవచధారులై కాపుండెడివారు. ఈ కొండపై నుండి చూచినచో హైదరాబాదు పోవు దండుబాటయు, కృష్ణా మునగపడగలవు.

కొండపల్లి దుర్గమునకు దక్షిణ పార్శ్వమున ఎఱ్ఱ బురుజు గలదు. ప్రధాన దుర్గమునకును దీనికిని రమారమి రెండుమైళ్ళు దూరముండును. తూరుపు కనుమల వరుస నంటి సుమా రేబదిమైళ్ళు దూరములో గల ప్రదేశము లను గూడ చూచుటకు అనువుగా నీ బురుజు మిక్కిలి యెత్తైన స్థలమునందు కట్టబడినది. దీని నుండి అమరావతీ ప్రభృతి పుణ్యక్షేత్రములను సందర్శింప వచ్చును. ఈ బురుజు పై వేయి సంఖ్య గల సైనిక పటాల ముండెడిది. కొండపల్లి దుర్గమునకు పడమటి భాగమున ఎడ్లకొండ బురుజు గలదు. ఇదియు పైన ఉదాహృతములైన రెండు బురుజుల కంటె నున్నతమై యున్నది. అనల్ప శిల్ప విన్యా సము గల కోట ప్రాకారములచే నిది పరీవృతము. సైన్య ములను బురికొల్పుటకై నగారా మ్రోయించు సై నికుల కిది విడిదిపట్టుగా కట్టబడెను. ఇందు వేయి పటాలము లుండుచుండెను. దీని నుండి చూచినచో నందిగామ సీమ యంతయు గనబడగలదు. రాజులు కొండపల్లి కోట నిర్మాణ రహస్యమంతయు ఒంటి మన్యము బురుజు కట్టడమునందే గుప్తమైయున్నది. ఈ బురుజు నేలమట్టమునుండి యేడువందలగజముల యెత్తున నుండును దీని శిఖరాగ్రము నుండి పరీక్షించినచో కృష్ణా మండలమునకు ముఖ్యపట్టణమైన బందరు సముద్ర దృశ్యము దృగ్గోచరమగును. ఈ బురుజు మండియే రెడ్డి కొండవీటి దుర్గమును వీక్షించెడివారు. పైని బేర్కొన్న మూడు రక్షణ కేంద్రముల కంటే నిది కీలక స్థలము. ఇది యవలీలగ వేలకొలది శత్రువులను సంహ రించుటకువీలగునట్లు కట్టబడినది. దీనిని చేరుకొనుత్రోవలో మహా వృక్షములును, గండశిలలును, అల్లిబిల్లిగ నల్లుకొనిన తీవె జొంపములును అసంఖ్యాకములుగ నున్నవి. అటు పోవునపుడు కుంజపుంజము లెంత యానంద సంధాయక ములో పర్వత గుహల నుండి వెలువడు క్రూరమృగముల ధ్వనులును, ప్రతిధ్వనులును కీచురాలగానము అంత భీతా వహములు. ఒంటి మన్యముపై నొక ద్వారమున్నది. ఆ ద్వారము నొద్ద నొక సైనికుడు కావలి కాయుచుండెడి వాడు. శత్రు సైన్యములు పండ్రెం డామడల దూరమున నున్నపు డేకని పెట్టి రణ భేరి మ్రోయించుట తద్వార ని వేళిత సైనికుని ప్రప్రథమ కర్తవ్యము. సాయుధ మైన రెండు వేల సైనికదళ మీ బురుజునకు కావలి. ఇచ్చట రణభేరి మ్రోగుట యేమి, నాలుగు బురుజుల యందలి సేనాధి కారులు సమరసన్నద్ధు లగుట యేమి, రెండును ఒక్క త్రుటిలో జరుగుచుండెను. అంతఃపురములకును, రాజవీధులకును, వెనుక భాగము నందు రెండు గొప్ప తటాకము లున్నవి. అవి కాలక్రమ మున తటాకీను లైన వేమో! వీని కిప్పటికిని 'టాకి’ లను వాడుకకలదు. వీటి యందలి జలము పానయోగ్యమై, పాంథజన శ్రమాపనోదన శీతలమై యున్నది. ఈ తటాక ముల లోతు నిర్ణయింప లేము. వీటి తీరమున ఎవ రేని ఏమాత్రపు ఏమరపాటుగా నున్నను ప్రమాదమే. దర్బారు భవనమునకు పురోభాగమునం దొక సరో వర మున్నది. ఈ కొలనికి రాణులు చెలికత్తెలతో జల కేళి సవరింప వచ్చెడివారు. పరమేశ్వర సృష్టిలోని పక్షి సంతతి కంతయు నీ సరస్సు వినోద క్రీడాసీమ. దీనియందు ఆ దినములలో సాయం సంధ్యా వాయుసేవనార్థమై రాజ దంపతులు లక్కపడవలలో విహరించెడి వారు.

అన వేమా రెడ్డి (క్రీ. శ. 1364-1988) కొండపల్లి కోటను పాలించినాడు. ఈతడే కొండపల్లి దుర్గమును పాలించిన మొదటి రెడ్డి రాజు. పెద కోమటి వేమా రెడ్డి (14021420) తాను కొండవీటి రాజుగానుండి తన తమ్ముడైన మాచారెడ్డిని యువరాజ పట్టభద్రుని జేసి కొండపల్లి సీమకు పాలకునిగ నియమించెను. యువరాజగు మాచారెడ్డి కొండపల్లి రాజ్యమును సమర్థతతో పాలించి ప్రజానురంజకుడై నాడు. పెదకోమటి వేముని పిమ్మట రాజవేముని పాలనతో (1420 - 1424) రెడ్డి రాజ్యము గజపతుల హస్తగతమైనది. ఆ యొడైరా జన్ని సీమలను, కొండకోటలను ఆక్రమించెను. గజపతి వంశీయులైన ప్రతాపదేవరాయలు పదునే డేడులును, హరిహరరాయ లై దువత్సరములును, కొండ వీడు, కొండపల్లి రాజ్యముల నొకరి తరువాత నొకరు పరిపాలించినారు (క్రీ. శ. 1431-1454). వీరి కాలములో నీ రాజ్యము విజయనగర మహాసామ్రాజ్యములో కలుప బడినది. పిమ్మట కపిలేశ్వరగజపతి (క్రీ.శ. 1455-1461) విజయనగర సామ్రాజ్యాధికారులు నోడించి యాంధ్ర దేశ

మును, అందలి కొండపల్లి రాజ్యమును వశపరుచుకొని పాలించినట్లు బెజవాడ ఇంద్రకీల పర్వతముమీది శాసనము వలన తెలియుచున్నది. బహమనీ సుల్తానులలో నొకడగు రెండవ మహమ్మదు షా (క్రీ. శ. 1463-1482) ఆంధ్రదేశముపై కన్ను వేసి, గజపతులను జయించి తద్రాజ్యమంతయును ఆక్రమిం చెను. ఈతని కాలమునందే కొండపల్లి కోటయందు కొన్ని మార్పులు గలిగినవి. ఇతడు కోట పై భాగమును, దుర్గ మును గూడ బాగుచేయించెను. ఇతడు దుర్గముక్రింద నొక గ్రామమును గూడ నిర్మించెను. కాని నిర్మాణ మప్పుడు ప్రాకారములు నిలువకుండెనట! పునాదులు పదింబదిగా కూలిపోవుచుండెను. అప్పుడు “కొండ"డను నొక గొల్లవానిని, “పల్లె" యను నతని భార్యను బలి యిచ్చి, పునాదులు వేసి గోడలు కట్టిరట! అప్పుడు గోడలు నిలువబడినవట ! నాటితో క్రిందనున్న గ్రామమునకు "కొండపల్లి" యను పేరు సార్థకమైనదట! కపిలేశ్వర గజపతి పుత్రుడు అగు పురుషో త్తమ గజపతి మహారాజు మహమ్మదుషా పుత్రులను భారద్రోలి కొండపల్లి సీమకు రాజయ్యెను. నరసారావు పేట సమీప మునను బెజవాడ దగ్గర 'ముస్తాబాద' సమీపమునను గల 'పురుషోత్తమ పట్టణములు' ఈతని పేరిటనే నిర్మింప బడినవి. పిదప ఒరిస్సా రాజగు అంబర రాయలు కొండపల్లి దుర్గమును జయించి పాలించినాడు. ఈతడు తన తమ్ము డైన మంగళిరాయని వలని బాధ నోర్వలేక రెండవ మహమ్మదుషా ముఖ్యమంత్రి యగు మహమ్మదు గవా నుని సాహాయ్య మర్థించెను. కాని ఆ గవాను ఈ సోదరుల నిర్వురను వంచనచే పరిమార్చి ఆ రాజ్యమంతయు మహ మ్మదుషా రాజ్యములో విలీన మొనర్చినాడు (1471). ఆ యేడే ప్రతాపరుద్ర గజపతి మహమ్మదీయులను బార ద్రోలి తిరిగి కొండవీడు కొండపల్లి సీమలపరిపాలనమును నిష్కంటకముగ సాగించెను. ప్రతాపరుద్రుని యనంతరము వీరభద్ర గజపతి రాజై తన పేరిట కొండపల్లిలో గ్రామమునకు దక్షిణ ముగ నొక చెరువు త్రవ్వించినాడు. దానికి నేటికిని విద్యా ధర గజపతి చెరువని వ్యవహృతి. ఇతడు బెజవాడకు సమీప

మున గల విద్యాధరపురమును గూడ గట్టించెను.
కొండపల్లి దుర్గము - కృష్ణా జిల్లా
కొండపల్లి బొమ్మలు

విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు క్రీ. శ. (1509-1530) ఉదయగిరిని, కొండ వీటిని జయించి(1515) కృష్ణకు నుత్తరమున నున్న కొండపల్లిపై దృష్టిని సారించెను. మూడు మాసములు రాయలు ఇబ్రహీం పట్ట ణము నొద్ద సేనతో విడిసి కొండపల్లి దుర్గ ముట్టడించి, మును దానికి సేనాధ్యకు డై న రామదేవుని బంధించి విజయ యెట్ట కేలకు మును సాధించెను. చిత్రం - 6

కొండపల్లి బొమ్మలు - 1 రాయల సేనానులు కొండపల్లి దుర్గము నీ క్రింది విధ ముగ ముట్టడించిరి. ఎఱ్ఱఋరుజును ఆ దెప్పనాయకుడును, ఎడ్లకొండను తిమ్మప్ప నాయకుడును, హనుమంతు


చిత్రం 7

కొండపల్లి బొమ్మలు - 2 ఋరుజును కొండమరెడ్డియు, ఒంటి మన్యపు బురుజును కామానాయకుడును తమతమ సేనలతో చుట్టుముట్టిరి. ఇట్లు నాలుగు విభాగములైన రాయల సేనలు నలుమూల లనుండి దుర్గమును విధ్వంసము చేసినవి. గజపతివీరుల మొండెములతో, సై నిక క ళేబరములతో నెమ్మల రాసులతో, పాడరిన మహలులతో,

. సహస్రాధిక గజాశ్వ ఖండములతో నిండి ప్రేతభూమివలె నగ పడు కొండప ల్లికోటను శ్రీకృష్ణ దేవరాయలు క్రీ.శ. 1518 వ సంవత్స రము జనవరి నెలలో స్వాధీన మొనర్చు కొ నెను. కొండపల్లి లో బంధింపబడిన కటకే శ్వరపాత్రుని భార్యను, పుత్రుని, గజపతి ముఖ్య సైన్యాధీశులు ఏడుగురిని చెఱపట్టి విజయనగరమునకు పంపెను. కొండపల్లి ముట్టడి మూడు మాసములు పట్టినపుడు, నీటి సౌకర్యములేక రాయల సేన కటకట పడినది. అప్పుడు మంత్రి తిమ్మరుసు ఒక దిగుడు బావిని త్రవ్విం చెను. దానిని నేటికిని నా దెళ్ళ తిమ్మరుసు బావి యను చున్నారు. ఇది ఇబ్రహీం పట్టణపు రాచబాట ప్రక్క నున్నది. శ్రీ రాయలు క్రీ. శ. 1530 లో స్వర్గస్థుడ య్యె నని చెప్పు నొక శిలాశాసన మీ రాచబాటయందే పడి యుండి పరిశోధకులకు లభించినది. రాయల యనంతరము కొండపల్లి దుర్గమును ఒరిస్సా రాజులు పాలించిరి. ఒరిస్సా రాజులనుండి గెల్చి 'కులీ కుతుబ్ షాహ' (క్రీ. శ. 1512-1548) యను గోలకొండ సుల్తాను ఈ దుర్గము నేలినట్లు కొన్ని నిదర్శనముల వలన తెలియుచున్నది. ఈ కులీ కుతుబ్షా కొండపల్లి కోటకు 'జిల్లా' యను ఉరుదు పేరు పెట్టెను. రాయలచే నాశన మొనర్చబడిన కొన్ని మందిరములను ఇతడు బాగు చేయించి కోటకు నవ్యశోభను గూర్చినాడు. సదాశివరాయలు, వేంకటపతి రాయలు విజయనగర రాజులు తిరిగి ప్రబలిరి. అచ్యుత రాయలు, కొండపల్లి నేలిరి. ఈ విజయనగర రాజుల మువ్వురి కాలములో నెప్పుడో కొండపల్లి చెరువునకు పడమరగా శివాలయ మొకటి ప్రతిష్ఠింపబడినది. అది నేడు కనరాదు. అదియే యచటి మసీదుగా మారిపోయెనని అనుమానించుటకు అవకాశము గలదు. విజయనగర ప్రభువుల తరువాత గోలకొండ సుల్తానగు ఇబ్రహిం పాదుషా కొండవీటి సర్కారుకు ఏలిక యయ్యెను. అప్పుడు కొండవీటి నగరమునకు ముర్తజా ఖానుడు, కొండపల్లి నగరమునకు ముస్తఫా ఖానుడు దుర్గపాలకు అయిరి. అందుచే కొండవీటికి ముర్తజా నగరమనియు, కొండపల్లికి 'ముస్తఫా నగర' మనియు నూతన నామకరణములు చేయబడెను. కొండపల్లి జిల్లా పాలకుడగు ముస్తఫాఖానుడు హిందువులను ఉద్యోగ ములనుండి తొలగించినాడు. వారి దేవాలయములను ధ్వంస మొనర్చినాడు. అంతే కాదు, ఆయా ప్రదేశము లలో మసీదులను కూడ నిర్మించెను. తన ప్రభువైన

ఇబ్రహీం పాదుషా పేరు చిరస్థాయి యొనర్ప నీతడు కొండపల్లికి మూడు మైళ్ళలో ఇబ్రహీం పట్టణమును గట్టించి, దానిని కలపవర్తకమునకు ముఖ్యస్థానముగా నెలకొల్పేను. ఇబ్రహీం పట్టణమను గ్రామము ఇప్పటికి నున్నది. ఈ ముస్తఫా కొండపల్లి దుర్గముపై గల యొక దేవాలయమును నాశనము చేసి "హజరాత్ గాలబుషాహ దర్గా" యను పేరుతో ఒక మసీదును కట్టించెను. అదియు నేడున్నది. గ్రామమునం దితడు 'ముసాఫిర్ ఖానా' నొక దాని నేర్పరచినాడు. అది నేటికిని ఫకీరులను మహమ్మదీయ సాధువులకు నెలవు. దీని ప్రాకారము లెత్తైనవి అది యిప్పటికిని చెక్కు చెదరకుండ నున్నది. నే డది 'సరాయిఖానా' యని వ్యవహరింపబడుచున్నది. అమీనుల్ ముల్కు, పరాస్ ఖాన్, అసరస్ ఖాన్, యక లస్ ఖాన్ (క్రీ. శ. 1590-1611) అనువారలు కొండ పల్లికి క్రమముగ జిల్లా దారులై ప్రభుత్వము నెరపిరి. వీరి కాలమున అంతగ విశేషము లున్నట్లు తెలియుట లేదు . కొండపల్లి చరిత్రలో గుంటుపల్లి ముత్తనామాత్యునకు (క్రీ. శ. 1611-1656) ప్రముఖస్థాన మున్నది. ఇతడు ఆనాడు చేయని ప్రజోపయోగ కార్యము లేదు. ము తన మంత్రి జన్మస్థలము కొండపల్లి గ్రామము. దేశపాండ్యా గిరి సంపాదించి క్రమక్రమముగ అభ్యుదయ మొంది ఈతడు గోలకొండ సుల్తాను అబ్దుల్లా కుతుబుషా (క్రీ. శ. 1626 1672) యొక్క అనుగ్రహమునకు పాత్రుడయి 'దూసరా (రెండవ) పాదుషా' అను ప్రసిద్ధ నామము బడసెను. ఈ దూసరా పాదుషా కొండవీడు, వినుకొండ, బెల్లం (బిలం) కొండ, కొండపల్లి దుర్గములను, వీటి క్రింద గల సీమల నన్నిటిని దక్షతతో పరిపాలించినవాడు. ఇతడు మహా మేధాశాలియు, దానవీరుడును, మహాగ్రహార దాశయు, బహు శాసన నిర్మాతయునై యుండెను. సుల్తాన్ అబుల్ హసన్ తానాషా (క్రీ.శ. 1672-1687) కొండపల్లి దుర్గమునకు పడమటి దెసగా 'గోలకొండ దర్వాజా' యను నొక మహాద్వారమును నిర్మించినాడు. ఈ ద్వారమున కొండపల్లినుండి గోలకొండకు సైనిక పటాలములు వెళ్ళుచుండెడివట! మరియు దుర్గమందలి దర్బారు భవనపు టడుగు భాగమున కొండను తొలిచి, కొండపల్లినుండి గోలకొండ దుర్గమునకు రహస్యమార్గము మంచుటకు సొరంగ నిర్మాణము జరిగినది. ప్రస్తుత మీ పొరంగము మూయబడి యున్నది. ఈ ప్రభువు నివాసము గోలకొండయే యైనను ఎడనెడ నీతడు రాజధానిని "వదలి బెజవాడ కొండలయందును, కొండపల్లి కొండల యందును గల దుర్గములను పరిశీలించుచు మొనర్చు చుండెడివాడు.

మల్తాన్ అబుల్ హసన్ తానాషా, తన పాలనములో కొండపల్లి జిల్లాయందు దుర్గమునకు నుత్తరముగ నున్న ఒంటి మన్యము సమీపమున 'బాలహిస్సార్' అనునొక మహా సౌధమును కట్టించెను. అందలిది బర్మాదేశపు టేకు కలప. ఆ సౌధరాజము చిత్ర విచిత్ర శిల్పకళాసౌందర్య విలసితమయి మనోముగ్ధ కారిగా నుండెను. అది నేడు "భోగము దాని మేడ' యను నామాంతరముచే వ్యవహ దింపబడుచున్నది.

జనరల్ కెయిలాడ్ (క్రీ.శ. 1788-1859) అను నాతడు ఆంగ్లేయ పై న్యాధ్యక్షుడు. క్రీ.శ.1788 సం. మార్చి నెల మదియవ తేదీ యుదయము పదిగంటల సమయమున నీతడు కొండపల్లి దుర్గమును ముట్టడించి, మహమ్మదీయు అను ఓడించి, జిల్లా యంతటిని వశపరుచుకొనెను. అంత కొండపల్లి యాంగ్లేయుల పాలనములోనికి వచ్చెను. జన థల్ కెయిలాడ్ కొండపల్లి కోటను స్వాధీనపరచుకొనిన పిమ్మట దాని పునర్నిర్మాణమునకు 'స్టెలెన్స్' అను నొక (మంజనీయరును నియమించినాడు. ఇతని కాలమునందే కొండపల్లిలో 'మిలటరీ పాఠశాల' యొకటి కట్టబడినది. దానికే యిపుడు 'ట్రావెలర్సు బంగళా'గా నుపయో గెలుచుచున్నారు. ఈ దుర్గ సంరక్షణార్థము సైనిక బలము ఆకావశ్యకమని తలచి ఆంగ్ల ప్రభుత్వము వారు క్రీ. శ. 5 సం. లో దానిని అచటినుండి తొలగించిరి.

అటవీశాఖాధి కారులచే కొండపల్లి జిల్లాయందు సహ ప్రాధికముగ చందన వృక్షములు నాటబడినవి. అట్లే యన్మారు భవన సమీపమున రబ్బరుచెట్లు పెంచబడినవి. యున్నారు భవనము పై గల శిథిల ప్రాకారములమధ్య నొక విశ్రాంతి భవనమును గూడ నాంగ్లేయ ప్రభుత్వము వా రే కట్టినై. దాని కే 'ఫా రెస్టు బంగళా'యని నేటి వ్యవహారము.

ప్రభుత్వము గత నూరు సంవత్సరములలో అటవీశాఖ నించుక పెంపొందించి, ఇచ్చట చేతిపరిశ్రమల కేదో యాలంబన మిచ్చుచునే యున్నది. అయినను, నాటి గజాశ్వశాలలు, సేనానులమందిరములు, రాచకొట్టములు, రాజాంతఃపురములు, దర్బారు మందిరములు, నివి యవి యన నేల, భిల్లాయంతయు శిధిలమై రూపుమాసియున్నవి. అది గుడ్లగూబలకు, గబ్బిలములకు నాకరమై చూపరకు భయదుఃఖావహముగా నున్నది. రాచబాటయందు గల ఆంజనేయస్వామి విగ్రహ మొకటియే నేటికిని పురాంధ్ర శౌర్య ప్రతాపములను బ్రకటించుచు, ఇప్పటి దీనస్థితిని స్మరణకు దెచ్చుచు, కొండపల్లికి శ్రీరామరక్ష పెట్టు చున్నది.