Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కెనడా (చరిత్ర)

వికీసోర్స్ నుండి

కెనడా (చరిత్ర):

కెనడా, ఉత్తర అమెరికా ప్రధాన రాజ్యములలో నొకటి. కెనడా అనుమాటకు అమెరికా ఆదిమవాసులైన ఎఱ్ఱ ఇండియనుల (Red Indians) భాషలో పట్టణమని యర్థము. ఐరోపావారీ దేశమునకు రాకపూర్వమే సెంటు కెనడా (చరిత్ర) లారెన్సు నదీలోయలో కొంతభాగమును ఎఱ్ఱ ఇండియ నులు కెనడా యని పిలిచెడివారు. క్రమముగా దేశమంత టికి అదే పేరు వర్తించినది. విస్తీర్ణము-ఎల్లలు : ప్రపంచ రాజ్యములలో, వైశాల్య మున సోవియట్ రష్యా తరువాత పెద్ద రాజ్యము కెనడా. కెనడా వైశాల్యము ఇంచుమించు యూరప్ ఖండము నకు సమానము. తూర్పున అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణమున అమెరికా సంయుక్త రాష్ట్రములు (U.S.A), పశ్చిమమున అలాసారాష్ట్రము, పసిఫిక్ మహాసముద్రము, ఉత్తరమున ఆర్కిటిక్ మహాసముద్రము, అందలి గ్రీన్ లాండు కెనడాకు ఎల్లలు. వీని మధ్యనున్న కెనడా వైశాల్యము 38,45,744 చ. మైళ్ళు. కెనడాకు 24,000 మైళ్ళ తీర రేఖ గలదు. 1956 సం. లెక్కల ప్రకారము కెనడా జనా భా 1,60,80,791. అట్టావా (Ottava) కెనడాకు రాజధానీనగరము. నివసించు ప్రజలు : కెనడాలో పలు తెగల ప్రజలు చున్నారు. అందు 1,65,000 మంది ఆదిమవాసులు ; వీరిలో ఎఱ్ఱ ఇండియనులు, ఎస్కిమోలు ఎన్నదగినవారు. ఎఱ్ఱ ఇండియనులలో 'ఇరాకీ'లు, హ్యూరానులు, ఆల్ జొంకీలు మొదలైన తెగలు గలవు. ఐరోపా జాతులలో మొట్టమొదట కెనడాలో నివాస మేర్పరచుకొన్నది ఫ్రెంచివారు. తరువాత ఆంగ్లేయులు, స్కాట్, ఐరిష్ జాతులవారు, నార్వే, హంగరీ, ఇటలీ, రష్యా దేశముల వారు కెనడాకు వలసవచ్చిరి. 19వ శతాబ్దమున కెనడాలో వ్యవసాయపరిశ్రనులో పనిసంపాదించుకొనుటకై చైనా, జపాన్ దేశములవారు రాసాగిరి. 1908 లో జపాన్ వారి రాకను నిషేధించుచు కెనడా ప్రభుత్వ మొక శాసన మొన ర్చెను. అక్కడక్కడ నగరములలో నీగ్రోలు కన్పించుదురు. కెనడా పరిశోధన : అమెరికా ఖండముతో బాటు, ఆధు నికయుగ ప్రారంభముననే కెనడా, భూగోళ శాస్త్రమున చేరినది. కాని మధ్యయుగముననే కెనడా పరిశోధింపబడి నట్లు చరిత్రకారు లభిప్రాయపడుచున్నారు._10వ శతాబ్ద ముననే లీఫ్ ఎరిక్సన్ నాయకత్వమున, నార్వేదేశస్థులు గ్రీన్ లాండు ద్వీపము నాక్రమించి కెనడాలో ప్రవేశించి యుండవచ్చును. ఈ యాత్రవలన శాశ్వతమైన ప్రయోజ నములు కలుగలేదు. సంగ్రహ ఆంధ్ర ౨ ఆధునిక యుగారంభమున ఐరోపా ప్రజలలో భూగోళ పరిశోధనలయం దెక్కువ ఆసక్తి జనించినది. పశ్చిమాభి ముఖముగ బయలు దేరి తూర్పు దేశములకు సముద్ర మార్గము నన్వేషించుట కనేక ప్రయత్నములు జరిగెను. ఆ ఆశయముతో నే' క్రిస్టఫర్ కొలంబస్ 1492లో పశ్చిమ ఇండియా దీవులను కనుగొనెను. అదే ప్రయత్నములో బయలు దేరిన 'జాన్ కాబట్' అను ఇటాలియను నావికునకు కెనడాను పరిశోధించిన గౌరవము దక్కినది. ఇంగ్లండులో ట్యూడర్ రాజవంశ స్థాపకుడైన ఏడవ హెన్రీ సహాయ ముతో బ్రిస్టల్ రేవునుండి 'మోడ్యూ' అను నౌకలో బయలుదేరి కాబట్ 1497లో కెనడా చేరి “కెనడా కొలం బస్" అను బిరుదమం దెను. నాటినుండి ఐరోపాలోని బెస్తవాండ్రును, ఉన్ని వర్తకులును అసంఖ్యాక ముగ 2 కెనడాకు రాసాగిరి.

చేతులు కెనడా : ఫ్రెంచివారి వలస 15వ శతాబ్దమున, వర్తక వాణిజ్యములలోను, వలసరాజ్య స్థాపనములోను ఐరోపా రాజ్యములమధ్య భయంకరమయిన పోటీ చెల రేగెను. ఇందులో కెనడా మొదలైన రాజ్యములు పెక్కుమార్లు మారినవి. మొట్టమొదట తమ చక్రవర్తుల ప్రోత్సాహముతో ఫ్రెంచివారు కెనడాలో వలసలు స్థాపిం చిరి. మొదటి ఫ్రాన్సిస్ కాలమున (1534) జాక్విస్ కార్టియర్ అను ఫ్రెంచిసాహసికుడు, న్యూ ఫౌండు లాండ్ చేరి సెంటులా రెన్సు నదిపై మూడుమార్లు పరి శోధకయాత్ర సాగించెను. కెనడాలో ఫ్రెంచివలసలు స్థాపించిన వారిలో శామ్యుయల్ షాంప్లేన్ సుప్రసిద్ధుడు. ఫ్రెంచి చక్రవర్తి నాల్గవ హెన్రీ (1588-1610) యొక్క సహాయముతో షాంప్లేను సెంట్రెన్సు నదీప్రాంత మును, హ్యూరాన్, అంటారియో సరస్సులను పరిశో ధించి, అకేడియా (Acadea) అనబడు న్యూబ్రన్ స్విక్, నోవాస్కోషియా అను ప్రాంతములపై ఫ్రెంచిపతాకను ప్రతిష్ఠించెను. పోర్టురాయల్ (1604), క్విబెక్ (1808) నగరములను నిర్మించినదికూడ నితడే. నాటినుండి ఫ్రెంచి వారు తండోపతండములుగ కెనడాకు వలస వచ్చిరి. ఫ్రెంచి ప్రధానులైన కార్డినల్ రిష్ ల్యూ (Richelieu), కోల్ బర్టు (Colbert) కోల్ బర్టు (Colbert) లు కూడ వర్తక సంఘములు స్థాపించి, కెనడా ఆక్రమణను ప్రోత్సహించిరి. కాథలిక్ మత ప్రచారకులైన జెస్సూటులు (Jessuits) కష్టము లను లెక్కింపక హ్యూరాను ఇండియనులలో క్రిస్టియను మత ప్రచార మొనరింపసాగిరి. 1642 లో నిర్మింపబడిన మాంట్రియల్ నగరము జెస్సూటు మతాధికారులకు కేంద్రమైనది. హ్యూరానులు ఫ్రెంచివారియం దభిమానము వహించినను, ఇరాకీలు ఫ్రెంచివారిపై కత్తిగట్టిరి. 1882 లో ఇరాకీలు ఫ్రెంచి స్థావరములపై దాడి చేసి ప్రజల ననేక విధముల హింసించిరి. కాని గవర్నరైన ఫ్రాంటినాల్ ప్రభువు కింగ్స్టన్ దుర్గమును నిర్మించి, ఇరాకీల నణచి వలసలకు శాంతి చేకూర్చెను. ఫ్రెంచి ప్రభువులు కెనడాను తమ సామ్రాజ్యభాగముగా పరిగణించి, 'నవఫ్రాన్సు' (New France) అని వ్యవహరించిరి.

17వ శతాబ్ది ఉత్తరార్ధమున, అమెరికాలో ఫ్రెంచి సామ్రాజ్యము విస్తరించినది. పెట్టీ రాడిసన్, మేడార్టు షూవార్డులు పశ్చిమమునందున్న ప్రెయిరీ భూములలో ప్రవేశించిరి (1859). సుపీయర్ సరస్సుతీరమున 1862 వాటికే ఫ్రెంచి మతప్రచారకుల స్థావరము లేర్పడెను. 1882 నాటికి రెనీ రాబర్ట్ కెవిలియర్ అను నాతడు మిసిసిపీ నదీలోయ నాక్రమించి, తమ చక్రవర్తి యైన 14వ లూయీ (Louies XIV) పేర, దానికి లూయీ సియావా అని పేరిడెను. ఈ విధముగ నుత్తర అమె రికాలో ఫ్రెంచివారికి కెనడా, లూయీ సియానా అను రెండు పెద్దవలస లేర్పడెను.

ఆంగ్లేయుల రాక : ఆంగ్లేయులు కూడ తూర్పుదేశము లకు పశ్చిమోత్తర మార్గమును పరిశోధించు వాళ్లతో కెనడాను చేరిరి. ఇంగ్లండులోని మాస్కోవి వర్తక సంఘముయొక్క ప్రోత్సాహముతో, హెన్రీ హడ్సన్ అను నావికుడు ఆర్కిటిక్ మహాసముద్రములో నాలుగు లొనరించి 1600 లో కెనడా ఉత్తరమునందున్న అఖాతమును చేరెను. అది అతని పేర నేటికిని 'హడ్సన్ బే' అని వ్యవహరింపబడుచున్నది. నాల్గవయాత్రలో హడ్సన్ అనువులను కోల్పోయెను. కాని అతని పరిశోధన లాంగ్లే యులకు ప్రోత్సాహమిచ్చెను. 1870 లో ఆంగ్లేయులు హడ్సన్ లే కంపెనీనీ స్థాపించి కెనడా ఉత్తరప్రాంతము లలో వర్తక స్థావరములను నెలకొల్పసాగిరి.

ఆంగ్లేయులు, ఫ్రెంచివారు, పోటీ: ఆంగ్లేయులు హడ్సన్ బే తీరము నాక్రమించుటతో కెనడాలో ఫ్రెంచి విస్తరణమునకు ఆటంకము కలిగినది. నాటికే ఆం ఆంగ్లేయులు అట్లాంటిక్ తీరమున న్యూఇంగ్లండ్, మేరీలాండ్, వర్జీ నియా, న్యూయార్కు, పెన్సిల్వేనియా మున్నగు 18 వలసలు స్థాపించి యుండిరి. ఆ వలసలకు ఉత్తర దక్షిణములందు ఫ్రెంచి స్థావరములైన కెనడా, లూయీ సియానాలు గలవు.' అదే విధముగ ఫ్రెంచి కెనడా ఉత్తర దక్షిణములం దాంగ్ల వలసలున్నవి. ఫ్రెంచివారును, ఆంగ్లేయులును ఆగర్భ శత్రువులు; అందుచే అమెరికాలో వారిమధ్య సంఘర్షణము అనివార్యమైనది. ఫ్రెంచివారు ఫ్రాంటినాల్, నయాగరా, క్రౌన్ పాయింట్ మున్నగు దుర్గములను నిర్మించి ఆంగ్ల వలసలను దిగ్బంధన మొనర్చి, ఆంగ్లేయులను అమెరికానుండి తరిమివేయ ప్రయత్నింపు సాగిరి. ఫ్రెంచి యెత్తులకు ఆంగ్లేయు లెదురెత్తు లెత్తు చుండిరి. ఈ పరిస్థితులలో ఐరోపాఖండ రాజకీయములు ఆంగ్ల పరాసు స్పర్థకు పదును బెట్టుచు, సంఘర్షణమున కవకాశములు కల్గించుచుండెను.

కెనడా ఆంగ్లేయుల వశమగుట : కెనడాలో ఆంగ్ల - పరాను పోరాటము 1628 లోనే ప్రారంభమై, తాత్కాలికముగ 1632లో జరిగిన సెంట్ జర్మెయిన్ సంధితో ముగిసినది. తిరిగి ఐరోపాలో ఇంగ్లీషు వారసత్వ యుద్ధ మారంభమైనంతనే, కెనడాలో ఫ్రెంచివారును, ఆంగ్లేయులును పోరాడసాగిరి. 1690 లో సర్ విలియం ఫిలిప్సు, బోస్టన్ నుండి బయలుదేరి నోవస్కోషియాను జయించి క్విబెక్ ను ముట్టడించెను. కాని ఫ్రెంచి గవర్నరైన ఫ్రాంటినాల్ ఆంగ్లేయుల నోడించి క్విబెక్ ను రక్షింప గల్గెను. రిస్విక్ సంధితో ఈయుద్ధమాగినది. ఐరోపాలో జరిగిన స్పానిషు వారసత్వ యుద్ధమును (క్రీ.శ. 1718) ఫ్రాన్సు, ఇంగ్లండులు చెరియొక, పక్షము వహించి పోరాడెను. ఫ్రెంచి చక్రవర్తియైన 14 వ లూయీ యొక్క దురాశను, దురాక్రమణను అరికట్టుటకే ఈ యుద్ధము జరిగినది. ఇందు ఫ్రెంచివారు పూర్తిగా ఓడి 1718లో జరిగిన ఉ (Utrecht) సంధి ప్రకారము నోవాస్కోషియాను ఆంగ్లేయుల పర మొనర్చిరి. దీనితో ఫ్రెంచి అధికార భానుడు పశ్చిమాభిముఖుడై నాడు. ఫ్రెంచి సామ్రాజ్యపతనములో తుది అంకము సప్తసంవత్సర సంగ్రామము 1756 - 1789) ప్రపం చాధిపత్యమునకై తమ బలాబలములను తేల్చుకొనుటకై ఆంగ్లేయులు, ఫ్రెంచివారును ప్రష్యా, ఆస్ట్రియాల పడమున చెరియొకరు చేరి ఈ యుద్ధ మొన ర్చిరి. అమెరికా, ఇండియా, ఐరోపా రంగము లన్నిటి లోను ఫ్రెంచివారు పరాజయమందిరి. 1768లో జరిగిన పారిస్ శాంతిసంధిలో ఫ్రెంచివారు కెనడాను ఆంగ్లే యుల కొసగిరి. కెనడా ప్రభుత్వ సమస్య: కెనడాలో ఆం గ్లేయులు మొదట జనరల్ ముద్దై అధిపతిగా సైనిక ప్రభుత్వమును స్థాపించిరి. ఐనను కెనడా పరిపాలన వారికొక సమస్య యైనది. ప్రజలు ఫ్రెంచివారు, కాథలిక్ మతస్థులు. జన రల్ ముట్టే ఎంతసమర్థతతో పరిపాలనమును నిర్వహించి నను వారికి సమ్మతముకాలేదు. 1788 నుండి ఆంగ్లవలసలు మాతృదేశమునకు వ్యతిరేకముగ నారంభించిన ఉద్య మము ఫ్రెంచివారికి మరింత ప్రోత్సాహమొసగెను. ఈ అశాంతిని తుదముట్టించుటకు అంగ్లప్రభుత్వము కెనడాలో కొంతవరకు బాధ్యతాయుత పరిపాలన నేర్పరచుచు 1774లో క్విబెక్ శాసనము గావించెను. ఈ శాసనము ప్రకారము కెనడా గవర్నరునకు స్థానిక సలహాసంఘ మొకటి యేర్పాటుచేయబడినది. న్యాయస్థానములలో ఫ్రెంచి భాష నుపయోగించుట కనుమతి ఈయబడెను. కాథలిక్ మతమునకు గౌరవము లభించెను. కెనడా రాజ్యాంగశాసనము - 1791: అమెరికాస్వాతంత్ర్య యుద్ధమువలన కెనడాకు క్రొత్త సమస్య లేర్పడెను. వల సల తిరుగుబాటును వ్యతిరేకించి, మాతృదేశముపట్ల విశ్వాసము వహించిన (Loyalists) ఆంగ్లేయులు సుమారు 40,000 మంది ఎగువ కెనడాకు వలసవచ్చి స్థిర నివాసము లేర్పరచుకొనిరి. ఈ వలసనే 'అంటారియో' అందురు, క్రొత్తగా వలసవచ్చిన ఆంగ్లేయులు స్థానిక స్వపరిపాలనకు అలవాటుపడిన వారు. అదియునుగాక వీరికివి ఫ్రెంచివారికిని సంప్రదాయసిద్ధమగు సంఘర్షణ ప్రారంభ మైనది. అందుచేత - పరాసు సంఘర్షణల నాపుటకును, అంటారియో రాష్ట్రమున గూడ స్థానిక స్వపరిపాలన నెలకొల్పుటకును 1791 లో త్వము, కెనడా రాజ్యాంగ శాసనము నమలుజరిపెను. పై శాసనము ప్రకారము, కెనడా అంటారియో, క్విబెక్ రాష్ట్రములుగా విభజింపబడినది. ప్రతి రాష్ట్రము సకును ఒక లెఫ్టినెంటు గవర్నరు. ఆంగ్ల పార్వభౌమునిచే నియమింపబడిన సలహాసంఘము, శాశ వనభయు ఏర్పాటు T చేయబడెను. శాసనప భాసక్యులను ప్రజలే ఎన్నుకొందురు. కెనడా మొ స్తముపై నొక గవర్నరుండును. కెనడా రాజ్యాంగ శాసనము కెనడాలో శాంతి నెలకొల్పుటకు బదులు అసంతృప్తిని రెచ్చగొట్టినది. అంటారియో ఆంగ్ల రాష్ట్రము క్విక్ ఫ్రెంచి రాష్ట్రము; రాజ్యాంగము ఈ రెంటిని సమైక్యమొనర్చి కెనడాలో జాతీయతను నెలకొల్పుటకు బదులు, శాశ్వతముగా కెనడా వాసులలో అనైక్యతకు బీజములు వాటినది. 1812-14 మధ్య ఇంగ్లండు, సంయుక్తరాష్ట్రములకు యుద్ధము జరిగినది. అందు కెనడాకు సంయుక్తరాష్ట్ర ముల నుండి దండయాత్ర భయము కలిగినది; ఐనను ఆంగ్లేయులు, ఫ్రెంచివారు తమ విభేదములను విస్మరింప లేకపోయిరి. క్రమముగా వారిమధ్య సంఘర్షణలు కూడ ప్రారంభ మైనవి. అదియునుగాక పై శాసనము కెనడాలో నేర్పరచినది ప్రాతినిధ్య ప్రభుత్వమేగాని బాధ్యతాయుత పరిపాలన కాదు. ఈ కారణమువలన 1887 ప్రాంతమున దిగువ కెనడాలో లూయీ పెపివాల్ నాయకత్వమునను, ఎగువ కెనడాలో విలియం లియన్ మెకంజీ నాయకత్వ మునను, తిరుగుబాటులు జరి గెను. విక్టోరియా మహారాణి ప్రభుత్వ మీ తిరుగుబాటుల నణచివేసి, కెనడాల్లో ఇంతటి అశాంతి ప్రజ్వరిల్లుటకు గల కారణములను పరిశీలింపుమని రాజనీతి ధురంధరుడైన డర్ఘంప్రభువును నియమించెను. డర్హం నివేదిక (1838): డర్ఘంప్రభువు వలన పరి పాలనా విధానమును సవిమర్శక ముగ పరిశీలించి తన నివేదికను సమర్పించెను. "వలసల మాగ్నా కార్టా (హక్కుల పత్రము)" అని ప్రసిద్ధిపొందిన దర్ఘంని వేదిక బ్రిటిషు సామ్రాజ్యవాద చరిత్రలో నొక మైలురాయి. ఎగువ దిగువ కెనడాలను సమైక్య మొనరించవలెననియు, బాధ్యతాయుత పరిపాలన నేర్పరచవలెననియు, కెనడా మాతృదేశము పట్ల విశ్వాసము వహించియుండుటకది యే మార్గముగాని నిరంకుశ పరిపాలన కాదనియు వర్షం ప్రభువు తన నివేదికలో సూచించెను. అప్పటికి ఆంగ్ల ప్రభుత్వము డర్హం సూచనలను తిరస్కరించినను, క్రమ ముగా నివియే 'కామన్ వెల్తు' భావమునకు మార్గదర్శ కము లై నవి. ఆంగ్ల ప్రభుత్వము 1840 లో నొక శాసన మొనర్చి కెనడాలో శాంతి నెలకొల్పుటకు ప్రయత్నించెను గాని లాభము లేకపోయెను. కెనడా డొమినియను : కెనడా వాసులు గూడ 'ఐక మత్యమే బలము'అను సూత్రార్థమును గ్రహించి సమైక్య పరిపాలనా విధానమునకు ప్రయత్నములు సాగించిరి. 1862 లో క్విబెక్ నగరమునను, 1864 లో ఛార్లెట్ ఔనులోను సమావేశములను జరిపి తమ కోర్కెలను బ్రిటిషు పార్ల మెంటునకు విన్నవించిరి. న్యూఫౌండ్ లాండ్, ప్రిన్సు ఎడ్వర్డు దీవులు మాత్రము సమాఖ్యలో చేరుటకు సమ్మతించలేదు. మిగిలిన కెనడా ప్రాంతముల కోరిక ననుసరించి 1867 మార్చిలో పార్లమెంటు బ్రిటిష్ ఉత్తర అమెరికా శాసనము గావించెను. ఇదియే కెనడా రాజ్యాంగమునకు ప్రాతిపదిక యైనది. కెనడాకు డొమిని యను లేక అధినివేశ ప్రతిపత్తి లభించెను; అనగా అంత రంగిక వ్యవహారములలో కెనడా స్వతంత్రముగ వ్యవహ రించవచ్చును. కెనడాలో బాధ్యతాయుతమైన సమాఖ్య (Federal) ప్రభుత్వ మేర్పడెను. 1887 లో సమైక్య కెనడా డొమినియనుకు కన్సర్వేటివ్ పార్టీ నాయకుడైన సర్ జాన్. ఎ. మాక్డొనాల్డ్ మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై నాడు.. కెనడా విస్తరణము, వికాసము: 1867 నాటి కెనడా డొమినియనులో క్విబెక్, అంటారియో, నోవస్కోషియా, న్యూ బ్రన్సువిక్ అను 4 రాష్ట్రములు మాత్రముండెను. నేటి కెనడా విస్తీర్ణములోనది పదియవవంతు మాత్రమే. క్రమముగా 1867 తరువాత కెనడా విస్తరింప సాగినది. 1870 లో ఫ్రెంచి తిరుగుబాటు ఫలితముగ 'మానిటో డా'ను కెనడా ఆక్రమించినది. 'మానిటోబా' కెనడాలో 5 వ. రాష్ట్రమైనది. 1871 లో బ్రిటిష్ కొలంబియా, 1878 లో ప్రిన్సు ఎడ్వర్డుదీవి కెనడాలో చేరినవి; 1905 లో ఆల్బర్టా, సస్కాచివాను చేర్చుకొనబడెను. రెండవ ప్రపంచ యుద్ధానంతరమూ 1948 లో న్యూఫౌండ్ లాండ్ కెనడాలో పదవ రాష్ట్రముగా చేరినది. రాజకీయముగ ప్రశాంత వాతావరణ మేర్పడిన తరు

వాత కెనడా ఆర్థికాభివృద్ధి సాధింపగల్గెను. ప్రెయిరీ భూములలో వ్యవసాయ, పశుపాలనా పరిశ్రమ లభివృద్ధి చెందెను. 1880-1888 సం. ల మధ్యకాలమున వాంకూ వర్, మాంట్రియల్ నగరములను కలుపుచు కెనడియన్ పసిఫిక్ రైలుమార్గము నిర్మింపబడినది. దీనివలన రవాణా సౌకర్యములు పెంపొంది వర్తక వాణిజ్యములకు ప్రోత్సా హము కలిగెను. కెనడా ప్రభుత్వము యొక్క రక్షణ విధానము దేశీయ పరిశ్రమల వికాసమునకు తోడ్పడెను. కెనడా ; ప్రపంచయుద్ధములు : మొదటి ప్రపంచయుద్ధము : 1914 లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధములో కెనడా, మాతృదేశమున కపారమగు సహాయ మొనర్చెను. కన్సర్వేటివ్ ప నాయకుడైన సర్ రాబర్ట్ బోర్డెన్, లిబరల్ పక్షమును కలుపుకొని మిశ్రమ మంత్రివర్గ మేర్పరచి యుద్ధ ప్రయ త్నము లొనరించెను. కెనడా సైన్యములు, ఫ్రాన్సు రంగమున 11 ఫిబ్రవరి, 1915 తారీఖున ప్రవేశించి జర్మ నులతో హోరాహోరి పోరాడెను. వివిధ రంగములలో 60,000 మంది కెనడా సైనికులు వీరస్వర్గమును బడసిరి. ఇదిగాక మిత్రమండలి రాజ్యములకు కెనడా 70 కోట్ల డాలర్లకుపైగా ఋణ మొసం గెను. యుద్ధానంతర వికాసము: యుద్ధానంతరము కెనడా ప్రభుత్వము తన దేశముయొక్క ఆర్థిక పునర్నిర్మాణము నకు పూనుకొనెను. 1920 లో బోల్డెన్, మంత్రి పదవికి రాజీనామా చేసెను. 1921 ఎన్నికలలో లిబరల్ పథము అధికారములోనికి వచ్చి, విలియం మెకంజీ కింగ్ ప్రధాని యైనాడు. ఇతని కాలమున పెయిరీ భూములు పూర్తి ఆర్థిక వినియోగమునకు గొనిరాబడెను. రైలుమార్గ నిర్మాణము విశేషముగ జరిగెను. ఇంతలో 1229 నాటి ఆర్థికమాంద్యము కెనడాలోగూడ ప్రవేశించి వ్యవసా యము, పరిశ్రమలు, వాణిజ్యము నష్టపడినవి. 1980 లో రిచర్డు బి. బెన్నెట్ ప్రధానిగా కన్సర్వేటివ్ పార్టీ అధికా రములోకి వచ్చి వాణిజ్యాభివృద్ధికి కృషి చేసినది. 1982లో జరిగిన అట్టావా సామ్రాజ్య సమావేశము (Imperial Conference)లో బ్రిటిష్ కామన్ వెల్తులోని రాజ్యము లలో కెనడా వాణిజ్యసౌకర్యములను బడసెను, ఐరోపా రాజ్యములతోను, సంయుక్త రాష్ట్రములతోను, కెనడా వాణిజ్య ఒప్పందములు చేసికొని ఆర్థికమాంద్యమునుండి కోలుకొనసాగెను.

సంపూర్ణస్వాతంత్ర్యము: మొదటి ప్రపంచ యుద్ధానంత రము బ్రిటిషు సామ్రాజ్యము, బ్రిటిషు కామన్ వెల్తు ఆఫ్ నేషన్సుగా రూపొందినది. 1926 లో బాల్ఫరు ప్రభువు చేసిన ప్రకటన ననుసరించి డొమినియనులకు మాతృదేశ ముతో సమానమగు హోదాకలదనియు, అవి కామన్ -వెల్తులో స్వచ్ఛంద సభ్యత్వమును కలిగియుండుననియు స్పష్ట మొనర్పబడెను. 1931లో పార్లమెంటు చేసిన వెస్టు మిస్టర్ శాసన మీ సూత్రమును చట్టబద్ధ మొనర్చినది. వి దేశ వ్యవహారములలో గూడ కెనడా పూర్తి స్వతంత్ర రాజ్యమైనది. ఇందుకు ఉదాహరణము 1914 లో కెనడా పక్షమున బ్రిటనే జర్మనీపై యుద్ధమును ప్రకటించినది. రెండవ ప్రపంచ యుద్ధములో కెనడాయే స్వయముగ జర్మనీ, జపానులపై యుద్ధం ప్రకటన గావించెను. రెండవ ప్రపంచయుద్ధము: మొదటి నుండియు కెనడా, హిట్లర్ నియంతృత్వమును, దురాక్రమణలను నిరసించి నది. చివరకు 1939 సెప్టెంబరు 10వ తేదీనాడు జర్మనీ పైనను, పెరల్ హార్బరుపైనను దాడి జరిగిన మరునాడు (1941 డిసెంబరు 8) జపానుపైనను, కెనడా ప్రభుత్వము యుద్ధము ప్రకటించెను. 1940 లో అమెరికా సంయుక్త రాష్ట్రములతో కలిసి సంయుక్త రక్షణ సంఘమును స్థాపించి తన సర్వశక్తులు యుద్ధప్రయత్నముపైనే కేంద్రీ కరించి కృషి సల్పెను. కెనడా సైన్యములు, కెనడా నౌకాదళము, రాయల్ కెనడియన్ విమానదళమును వీరోచితమైన పాత్రను నిర్వహించినవి. జర్మన్ విమాన దాడులనుండి, నౌకాదిగ్బంధమునుండి, తామదేవతనుండి బ్రిటన్ రక్షింపబడుటకు కెనడా చేసిన సహాయ మసా మాన్యమైనది. ౨ యుద్ధానంతర కెనడా యుద్ధానంతరము ఐక్యరాజ్య ఉత్తర అట్లాంటిక్ సంధికూటమిలోను చేరి కెనడా ప్రపంచశాంతికి అవిరళమగు కృషి చేయుచున్నది. దక్షిణకొరియాపై ఉత్తరకొరియా దురాక్రమణ నరి కట్టుటకై సైన్యమునంపి ఐక్యరాజ్యసమితితో సహకరించి నది. సంయుక్త రాష్ట్రములతో కలిసి ఐరోపా ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమమున కెంతయో సహాయ

మొనర్చినది. ఐరోపాలో నిర్వాసులైనవారిలో పెక్కు మందికి కెనడాలో రక్షణ లభించెను. అణుశక్తి పరిశోధ నములోను, ని రాయుధీకరణ కార్యక్రమములోను కెనడా ప్రత్యేక శ్రద్ధ వహించుచున్నది. shatral కెనడా ప్రభుత్వము : కెనడా బ్రిటిషు కామన్ వెల్తులో సభ్యురాలు. అది బ్రిటనుతో సమానమైన హోదాకలిగిన స్వతంత్ర ప్రజాస్వామ్య రాజ్యము. 1887 మార్చిలో బ్రిటిష్ పార్లమెంటు చేసిన శాసనమే కెనడా రాజ్యాంగ మని చెప్పవచ్చును. దాని ప్రకారము కెనడా ఒకసమాఖ్య. రాష్ట్రములకు పెక్కు విషయములలో స్వాతంత్ర్య మున్నది. ఐనను కేంద్రమున పార్లమెంటరీ ప్రభుత్వ విధాన మనుసరింపబడినది. కెనడాలో వయోజనులై న (21 సం॥లు నిండిన) స్త్రీ పురుషు లందరికి వోటు హక్కు గలదు. కెనడాలో ఉన్నత కార్యనిర్వహణాధికారి గవర్నర్ జనరలు. ఇతనిని కెనడావాసులే ఎన్నుకొందురు; కాని నామకః ఇతడు ఆంగ్ల సార్వభౌమునిచే నియమింపబడును. ఇతనికి సహాయముగ మంత్రివర్గముండును. వీరు శాసన సభలకు బాధ్యులై యుందురు. 1958, సెప్టెంబరు 1వ తేదీన జాన్ జి. డీఫెన్ బేకర్ ప్రధానమంత్రిగా కన్సర్వే టివ్ పార్టీ మంత్రివర్గ మేర్పడినది. ఉండలు పైబడిన కేంద్రమున రెండుసభలు గల పార్లమెంటు గలదు. ఎగువసభకు సెనేట్ అని పేరు. ఇందలి సభ్యుల సంఖ్య 102; దిగువసభ సామాన్యులసభ (House of Commons) అని వ్యవహరింపబడును. దీనికి 5 సం॥ల కొకమారు, దేశజనాభా ననుసరించి ఎన్నికలు జరుగుచుండును. ప్రతి రాష్ట్రమునకు ఒక లెఫ్టి నెంట్ గవర్నరు, మంత్రి వర్గము, శాసనసభ ఉన్నవి. లెఫ్టినెంటు గవర్నరును గవ నియమించును. క్విబెక్ రాష్ట్ర శాసన సభలో రెండువిభాగము లున్నవి. మిగిలిన రాష్ట్రములకు ఒక్కటే శాసనసభ ఉండును.

వి. యస్. యల్. హరి