సంకర్షణ మాంపాలయ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: ఆభోగి - చతురశ్ర రూపక తాళం

ప: సంకర్షణ మాంపాలయ
    పంకజనయన కృపాలయ॥

అ: పంకజభవ వినుత చరణ
      లంకాధిపహరణ నిపుణ॥

చ: భాసురశర కార్ముకధర - శాసితఖర మఖ నిశిచర
     కోసలనృప వరకుమార - వాసవాది పాలనపర
     శ్రీసమేత పీతాంబర - దాసవర్య మంగళకర
    భాసమాన మురళీధర - వాసుదేవ దామోదర॥