శ్రీ వేంకటేశ్వర స్తుతి రత్నమాల/తాళ్ళపాక పెదతిరుమలాచార్యుడు
శ్రీ వేంకటేశ్వర స్తుతిరత్నమాల
తాళ్ళపాక పెదతిరుమలాచార్యుఁడు
ఈతఁడు 18 - వ శతాబ్దము వాఁడు. తండ్రి ఆన్నమాచార్యులు, తల్లి అక్కమాంబ. జన్మస్థానము రాజంపేట తాలూకాలోని తాళ్ళపాక. ఈతనికృతులు శృంగార సంకీర్తనలు, అధ్యాత్మసంకీర్తనలు, శృంగార దండకము, చక్రవాళమంజరి, శృంగారవృత్తశతకము, శ్రీవేంకటేశోదా హరణము, నీతి సీస శతకము, సుదర్శనరగడ, రేఫఱకార నిర్ణయము, ఆంధ్ర వేదాంతము (ద్విపద), ఆంధ్రహరివంశము, భగవద్గీత (వచనము), వెంకటేశ్వరవచనములు, శ్రీవేంకటేశ్వరప్రభాత స్త్రవము, యావజ్జీవము పరమ భాగవతుఁడుగాఁ గాలక్షేపమొనర్చిన మహనీయుఁడు. ఈతనికి వేదాంతాచార్య , కవితార్కిక కేసరి , శరణాగతవజ్రపంజరబిరుదములు గలవు. *[1] శ్రీ వేంకటేశ్వరప్రభాత స్త్రవము పూర్తిగా నీక్రింద నీయబడినది.
శ్రీగురుం డర్థితో శేషాద్రి యందు
యోగనిద్రాకేళి నున్న యత్తఱిని
వనజాస నాది దేవత లేఁగుదెంచి
వినుతించి రప్ప డవ్విధ మెట్టి దనిన
శ్రీకర ! వేంకటక్షితిధరావాస !
నా కేంద్రనుత రమూనాథ మేల్కొనుము
వసుదేవదేవకీ వరగర్భజాత
కిసలయాధర రామకృష్ణ మేల్కనుము
తపము పెంపున యశోదానం దులకును
గృపతోడ శిశువైన కృష్ణ మేల్కనుము
పూతనాకైతవ స్ఫురిత దుర్వార
చైతన్యహరణ ప్రశ_స్త్ర మేల్కనుము
అఱి ములకి శకటాసురాంగంబు లీల
విఱుగఁ దన్నిన యదువీర ! మేల్క_నుము
సుడిగా లిరా కాసి స్రుక్కడంగించి
కెడపిన యదుబాలకృష్ణ మేల్కనుము
మద్దులఁ గూల్చి యున్మదవృత్తి మెఱయు
ముద్దుల గోపాలమూర్తి మేల్క_నుము
అద్రిరూపం బైన యఘదైత్యుఁ eso3o
రౌద్రంబు మెఱయు భూరమణ మేల్కనుము
ఆననంబునఁ దల్లి కథిల లోకములు
పూని చూపిన యాది పురుష మేల్కనుము
ఖరధేనుకాసుర క్రకచ మేల్కనుము
వరగర్వఘనబకవైరి మేల్కనుము
చతురానను ఁడు వత్పసమితి నొంచి నను.
బ్రతి యొనర్చిన పరబ్రహ్మ మేల్కనుము
గురుతర గోపాల గోపికా మూస
తరణ గోవర్ధనోద్ధరణ మేల్కనుము
కాళియ ఫణిఫణాంగణనృత్యరంగ
లాలితచరణ విలాస మేల్కనుము
అతుల కుబ్దామనోహరుఁడ మేల్కనుము
చతురమాలాకార శరణ మేల్కనుము
వనజాక్ష : యక్రూరవరద మేల్కనుము
వినయవాక్యోద్ధవవినుత మేల్కనుము
కోకలిమ్మన్నఁ గైకొన కున్నఁ బట్టి
చాకిఁ గొట్టిన యట్టి సరస మేల్కనుము
భుజవిక్రమ క్రమస్పూర్తిమై భోజ
గజముఁ జంపిన బాహంగర్వ మేల్క_నుము
జెట్టి పోరను గిట్టి చీరి చాణూరు
చట్టలు వాపిన శౌరి మేల్కనుము
శంసింప జగదేక శరణంబ వైన
కంసుని తలగొండు గండ మేల్క_నుము
మానిత సామ్రాజ్య మండలి నుగ్ర
సేను నిల్పిన ధర్మశీల మేల్క_నుము
పరలోకగతులైన బాలుర దెచ్చి
గురున కిచ్చిన జగద్గురుఁడ మేల్కనుము
చండ భారతరణ చాతుర్య ధుర్య
గాండీవిసారధ్యకరణ మేల్క_నుము
బల భేది భేదించి పారిజాతంబు
నిలకుఁ దెచ్చిన జగదీశ ! మేల్కనుము
బాణబాణాసనోద్బట భీమ బాణ
పాణి ఖండన చక్రపాణి మేల్క_నుము
రాజసూయమున శూరతఁ జై_ద్యుఁ దునిమి
పూజలందిన జగత్పూజ్య మేల్కనుము
మురనరకాసుర ముఖ్య దానవులఁ
బొరిగొన్న యదు రాజపుత్ర మేల్కనుము
వీరకౌరవసభ విశ్వరూపంబు
ధీరతఁ జూపిన దేవ ! మేల్కనుము
ఇంపునఁ బృథుకంబు లిడిన కుచేలు
సంపన్నుఁ జేసిన చతుర ! మేల్కనుము
దారుణభూ భారతరణావతార
భూరివ్రతాపవిస్ఫురణ మేల్కనుము
సదమలానంద ! నిశ్చయముల కంద !
విదురుని వింద ! గోవింద ! మేల్కనుము
బోజక న్యాముఖాంభోజ ద్విరేఫ
రాజీవనయనాభిరావు ! మేల్కనుము
వరరూపవతి జాంబవతితోడి రతుల
నిరతిమై నోలాడు నిపుణ ! మేల్కనుము
మంజుల సత్యభామా మనస్సంగ
రంజితగాత్ర సంరంభ మేల్కనుము
లలిత కాళిందీవిలాసకల్లోల
కలిత కేళీలోల ఘనుఁడ మేల్కనుము
చారుసు దంతా విశాలాక్షి కుముద
సారప్రభాపూర్ణచంద్ర ! మేల్కనుము
నేత్రరాగవి శేష నిచిత ప్రతోష
మిత్రవిందారనోన్మేష ! మేల్కనుము
భద్రానఖాంకుర బాలచంద్రాంక
ముద్రిత భుజతటీమూల ! మేల్క_నుము
లక్షణాపరిరంభ లక్షి తోదార
వక్షోవిశాలకవాట ! మేల్కనుము
వేడుక బదియాఱు వేల కామినులఁ
గూడి పాయని పెండ్లికొడుక 1 మేల్కనుము
కలిత నక్రగ్రాహగంభీరజలధి
వలయిత ద్వారకావాస ! మేల్కనుము
జలదనీల శ్యామ ! జగదభిరామ
Tవెలయ మేల్కను మంచు విన్నవించుటయు
వీనులఁ గదిసిన వెలిదమ్మికన్నుఁ
గోనల నమృతంబు గురియ మేల్కా_ంచి
సరసిజాముఁడు దేవసంఘంబు మీఁద
కరుణాకటాక్షవీక్షణము నిగుడ్చి
శ్రీవేంకటాచల శిఖర మధ్యమున
సౌవర్ణమణిమయ సౌధంబు లోన
పూగ చంపక కుంద పున్నాగ వకుళ
నాగరంగప్రసూన విరాజమాన
తరులతా పరివేష్టితం బైన యట్టి
నిరుపమ కోనేరి నిర్మలాంబువులఁ
దిరుమజ్జనంబాడి ది వ్యాంబరంబు
ధరియించి దివ్యగంధము మేన నలఁ ది
నవరత్నమయ భూషణంబులు దాల్చి
వివిధ సౌరభముల విరు లోలి ముడిచి
ధారుణీ సురులకు దానంబు లొసఁగి
చేరి యక్షతములు శిరమునఁ దాల్చి
వినుతులు గావింప విబుధ సన్మునుల
మనవులు విని వారి మన్నించి మించి
యగణితరత్నసింహాసనారూఢుఁ
డగుచు మేరువు మీఁది యుధ్రంబు వోలెఁ
గరకంకణోజ్జ్వలక్వణనంబు లెసఁగ
సరసిజముఖులు వెంజామరల్ వీవ
బంగారు గుదియల పడవాళ్ళు దొరలు
భంగించి యటు బరాబరులు సేయంగ
నారదవీణా నినాదంబు లెసఁగ
చారణ మునిసిద్ధ సంఘంబు గొలువ
నానాప్సరస్సతుల్ నాట్యఘుల్ సేయ
మానవేశులు మహామహులు సేవింప
ఘనతర నిత్యభోగంబులు వెలయు
జనుల కెల్ల మహా ప్రసాదంబు లొనరఁ
గోరిన వారికిఁ గోర్కు లీడేర
నీరీతి జగముల నేలుచు నుండు
నని భక్తిఁ దాళ్ళపాకాన్నమాచార్యు
తనయుండు తిమ్మయ తగఁ బ్రస్తుతించె
నేచి యీ కృతి ధరణీశుల సభల
నాచంద్రతారార్కమై యొప్పఁ గాక !
- ↑ * 1845 సం||లో శ్రీవేంకటేశ్వర వచనములలో అచ్చయినది.