శ్రీ రామాయణము - మూడవసంపుటము/పీఠిక
పీఠిక
మదరాసురాష్ట్రీయ ప్రభుత్వమువారి సమాదరణమున తంజావూరి శ్రీ శరభోజీ సరస్వతీ మహలు భాండాగారమువారిచే ప్రకటితమగుచున్న కట్టావరదరాజ కవికృత ద్విపద రామాయణమున నీ వఱకు బాల అయోధ్యాకాండములుగల మొదటి సంపుటమును అరణ్య కిష్కింధా కాండములుగల రెండవ సంపుటమును వెలువడినవి. ప్రస్తుతము వెలువడినది మూఁడవ సంపుటము సుందరకాండము వెంటనే యుద్ధ కాండముకూడ ప్రత్యేక సంపుటముగ వెలువడును. మొదటి రెండు సంపుటముల వలెనే యుద్ధకాండ మొక్కటియే ప్రత్యేక సంపుటము కాదగినంత పెద్ద గ్రంథమగుటచేత, సుందరకాండము దానితో కలుపుటకు వీలులేకపోయినది. మఱియును సుందరకాండ పారాయణ గ్రంథమగుటచేత ప్రత్యేకముగ నొక సంపుటముగనే ముద్రించిన నది కేవలము పండితులైన సాహిత్య విద్యోపాసకులకేగాక, భక్తులకు, స్త్రీలకు, పాఠకలోకమునకు ననుకూలముగనుండునను నభిప్రాయముతో నిట్లు కావింపఁబడినది.
వరదరాజకవినిగూర్చి ప్రథమ సంపుటము పీఠికలో విపులముగ నుండుటచేత నిచట వ్రాయ లేదు. ఆతడు క్రీ. శ. 1630 ప్రాంతమున ప్రసిద్ధుఁడైన రాజకవి.
ఈ సుందరకాండ రచనము, తక్కినకాండముల రచనమువలె, మూలానుసరణమై సులభగ్రాహ్యమైయున్నది. ఈసుందర కాండ రచనా ప్రస్తావగ మాత్రమే యీ పీఠికయందు చేయు చున్నాడను.
సుందరకాండము రామాయణమునఁ బ్రధానత్వమునుబడ యుటకనేక కారణములుగలవు. హనుమంతుఁడు సీతాసందర్శనముచేఁ గృతకృత్యుడయ్యెను గాన నా కాండమును బారాయణము చేసిన నట్లేకృతకృత్యులగుదురని కొందఱి భావము. అది నిశ్చయమే. హనుమంతునంతటి భక్తునకుఁ గృతకృత్యత గల్గుటలో లోపమెంతమాత్రమునుండదు. చాలమంది యాపత్సమయముల సుందర కాండమునే పారాయణము చేయుదురు. ఇతర కాండములట్టవి కావని కాదు. ఇది యుత్తమోత్తమమును వారి భావము నకు కారణముపైన వివరించినట్టు లేయని యెఱుంగునది. శ్రీరామజనన సత్కథాభూషితమగు బాల కాండ మట్టిది కాదా యని ప్రశ్నింపరాదు. గతాను గలిక న్యాయము మఱుపునకు రాఁగూడదు. హనుమన్మంత్రములో సుందర హనుమన్మంత్రము గలదు. ఆ మంత్రము హనుమన్మంత్రములోఁ బ్రధానము. ఆ మంత్రము నుపాసించుచుఁ దల్పౌరుష చిహ్నమగు సుందర కాండమును 'భారాయణము చేసిన చో శీఘ్ర ఫలప్రదమని ప్రాజ్ఞులైన పెద్దల యభిప్రాయము. మంత్రాధి కారము లేనివారుకూడ నీ సుందర కాండమును బారాయణము చేయుటగలదు. నిశ్చల భక్తి భావనతో నట్లు పారాయణము చేసిన యా హనుమంతుఁ డే శ్రీ రామచంద్రు నానతిని సకలపురుషార్ధములును సమకూర్చును.
ఇంతేకాక నీకాండమున స్వభక్త ప్రతిరూపమున స్వమహిమా ప్రదర్శన మనువదింపఁ బడినది. భక్తునకు నచంచల భావనయున్న కార్య సాఫల్యమగునని నిరూపితమైనది. కవితా 19 10. ఉన్నారు మొదలగువానిలో 'నా'కు వ్యంజనయతి “నను నెదిరింపనున్నారు ఈవీటి” (8588) 11. “మలచిన కంబముల్ మాటాకు లెత్త” (867 పంక్తి) 12. “కన్ను లఁజూచినఁ గానాదు తనువు. పన్నలు వొగడసాఫల్యము నొందు!” పన్నలు - పరిచారకులు. (1004 పంక్తి) ఇంకను, గగనమహలు, (772) బురనీసులు (1019) శ్రీరామదాసుఁడు (8684) (హనుమంతుని విశేషము) విజయవిలా సము (8358) మొదలగు పదము లీతని జాతీవార్తానై వుణ్యమును బ్రకటించుచున్నవి. మఱియు నీతంబుతోఁక వీనికి నాస్తిగాన నిజముగాఁతోక వీనికి నా నాస్తి చేసి ' 4106-7 e అను సరస శ్లేషలును నచ్చటచ్చట గలవు. పెర తేనియలుకుండ బుటు తేనియలు కురజ తేనియలును కొమ్మ తేనియలు బుట్టు తేనియలును బొదల తేనియలు జుట్టు తెంటులుఁ బీల్చుచుండి తేనియలు (4670) ఇందు పలువిధములకు తేనియలు బేర్కొనబడినవి. గణప వరపు వెంకటకవి తన ప్రబంధరాజమున వీనిని గ్రహించి యున్నాఁడు ఇది మూలమున లేదు,