శ్రీ రామాయణము - మూడవసంపుటము/విషయసూచిక

వికీసోర్స్ నుండి

విషయసూచిక

1.సాగరలంఘనము

హనుమంతుఁడు మహేంద్రపర్వతముపై విశ్రమించుట
మహేంద్రపర్వతమునుండి సముద్రమును హనుమంతుఁడు లంఘించుట
మైనాకుఁడు సముద్రుని యానతిని హనుమంతునకు నాతిథ్య మొసగుట
దేవతలు హనుమంతుని శక్తిఁ బరీక్షించుటకు సురసను నడ్డగింపఁ బంపుట
సింహిక హనుమంతునడ్డగించుట - అతఁడామెను చంపి సముద్రములోఁ బడవేయుట

2. సీతాన్వేషణ

సముద్రముదాఁటి హనుమంతుఁడు త్రికూటాద్రి మీదఁనున్న లంకనుఁ జూచుట
లంకనుగాచు లంకిణి హనుమంతు నడ్డగింప నతఁ డామెను జయించి లంకలోఁ బ్రవేశించుట
హనుమంతుడు లంకలోని విశేషములను జూచుచు సీతను వెదకుట
హనుమంతుడు రావణుని యంతఃపురమున సీతను వెదకుట
హనుమంతుఁడు రావణుని రాణివాసమందిరములో సీతను వెదకుట - రాణివాసస్త్రీ వర్ణనము
హనుమంతుఁడు నిద్రించుచున్న రావణాసురునిఁజూచుట
హనుమంతుఁ డెంతవెదకినను సీతనుఁ గానక మిక్కిలి చింతిల్లుట
హనుమంతుఁడు సీతనుఁగానమికి దుఃఖించి ప్రాణత్యాగముఁ జేయ నిశ్చయించుట

3. సీతను చూచుట

హనుమంతుఁ డశోకవనమునఁ గనుగొనుట - అశోకవనవర్ణనము
అశోకవనమున హనుమంతుఁడు శింశుపావృక్షచ్ఛాయను సీతనుఁ గాంచుట
అశోకవనమున దుఃఖితయైన సీత పరిస్థితిఁ జూచి హనుమంతుఁడు విచారించుట
సీత గూర్చుండిన శింశుపా వృక్షముపై హనుమంతుఁడు చేరుట
అశోకవనమునకు వచ్చు రావణుని హనుమంతుఁడు చూచుట
రావణుఁడు సీతతో తనమనోరథముఁ దెలుపుట
సీతకోపముతో రావణుని మాటలకుఁ బ్రత్యుత్తరము జెప్పుట
రావణుఁడు సీత మాటలకుఁ గోపించి యామె ప్రత్యుత్తరమున కరువది దినములు గడువిచ్చుట
తనచుట్టునున్న రాక్షసస్త్రీలు సీతను రావణుని కోర్కి నెఱవేఱ్పుమని నయభయముల బోధించుట
సీత వారిమాటలకుఁ బ్రత్యుత్తరమిచ్చుట
రావణుని ప్రేరణచే సీతచుట్టును గాపున్న రాక్షసస్త్రీ లామెను రావణుని ప్రేమింపకున్న చంపెదమని భయపెట్టుట
సీత వారిమాటలకు శోకించుట
సీత రాక్షసాంగనలతో తనమనోనిశ్చయముఁ దెలుపుట
త్రిజట తన స్వప్నవృత్తాంతముఁ జెప్పుట
సీత తనకు మరణముకన్న వేఱుమార్గము లేదని యురిపోసికొన నిశ్చయించుట
హనుమంతుఁడు సీతతో మాటాడుటకిది మంచి సమయమని తెలిసికొని ముందువెనుక లాలోచించుట
సీతవినునట్లుగా హనుమంతుఁడు రామప్రశంస చేయుట
సీతయామాటలనువిని వితర్కించుట
హనుమంతుడు సీతకు నమస్కరించి మాట్లాడుట
సీత హనుమంతునితో సంభాషించుట
హనుమత్సీతాసంభాషణము
శ్రీరామరూపవర్ణనము
హనుమంతుని మాటలకు సీత సంతోషించుట
హనుమంతుఁడు సీతకు రాముని ముద్దుటుంగరము నానవాలుగా నిచ్చుట
శ్రీరాముని ముద్దుటుంగరము చూచి యానందభరితయై సీత హనుమంతునిఁ బ్రశంసించుట
శ్రీరాముఁడు తన్నెప్పుడు చెఱనుండి విడిపించునో యని సందేహముతో సీత యడుగుట
హనుమంతుఁడు తానీనృత్తాంతము తెలిపిన తక్షణమే శ్రీరాముఁడు రావణుని సంహరించి యామెను విడిపించునని ధైర్యము చెప్పుట
సీత యామాటలకు ధైర్యముఁ జెందుట
హనుమంతుఁడు సీతను రామునికడకుఁగొని పోవుదునని విన్నవించుట
సీత హనుమంతుని బలము సందేహించుట
హనుమంతుఁడు తన నిజస్వరూపమునుఁ జూవుట
సీత హనుమంతునకు సమాధానముఁ జెప్పుట
సీత హనుమంతునితో రామునికి కొన్ని గుఱుతులు చెప్పుమనుట
కాకాసుర వృత్తాంతము
సీత హనుమంతునితో శ్రీరామునికిఁ జెప్పఁదగిన సంవాదమునుఁ జెప్పి శిరోమణినిచ్చుట
సీత హనుమంతు నాశీర్వదించి పంపుట

4. లంకాదహనము

హనుమంతుఁడు రావణుని శక్తిని పరీక్షించుటకు నశోకవనమును పాడుచేయుట
సీతవద్ద కాపున్న రాక్షసస్త్రీలు రావణునితో అశోకవనభగ్నవృత్తాంతముఁ దెలుపుట
రావణుఁడు పదివేలమంది రాక్షసవీరులను హనుమంతునిపైఁ బంపుట
హనుమంతుఁడు వారినందఱిని సంహరించుట
రావణుఁడు జంబుమాలిని హనుమంతుని పైకి బంపుట
జంబుమాలి యుద్ధము - హనుమంతుఁడు జంబుమాలినిఁ జంపుట
రావణుఁడు మంత్రితనయుల నేడుగురిని హనుమంతునిపైకి బంపుట - ఆతఁడు వారిని దునుముట
తన మంత్రులైదుగురిని రావణుఁడు పంపుట
హనుమంతుఁడు వారితో యుద్ధము చేయుట - వారి నైదుగురిని సంహరించుట
రావణుఁడు యక్షకుమారునిఁ బంపుట
హనుమంత యక్షకుమారుల యుద్ధము
యక్షకుమారుని మరణము
రావణుఁ డింద్రజిత్తును హనుమంతుని పైకి పంపుట
హనుమ దింద్రజిత్తుల యుద్ధము
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రప్రయోగమున హనుమంతుని గట్టి వైచుట
హనుమంతుని రావణుని సమక్షమునకుఁ దీసికొనిపోవుట
హనుమంతుఁడు రావణుని రాజసమును వైభవమునుఁ జూచుట
ప్రహస్తుఁడు హనుమంతుని ప్రశ్నించుట
హనుమంతుని ప్రత్యుత్తరము - తాను రామకార్యార్థమై దూతగా వచ్చిన సంగతి నెఱుకపఱచుట
హనుమంతుని మాటలను విని యాతనిఁ జంపుటకాజ్ఞయిచ్చిన రావణుని విభీషణుఁడు నివారించుట
రావణుఁడు హనుమంతుని తోఁక కాల్చుట కాజ్ఞ యొసంగుట
సీతకు హనుమంతుని వృత్తాంతము దెలిసి యాతని కగ్ని యంటక, చల్లగానుండున ట్లామె వర మొసంగుట
హనుమంతుఁడు సీత యగ్నిలోదగ్ధమైనదని చింతించుట
దేవతలవలన సీత సురక్షితముగానున్నదని యెఱిఁగి యామెవద్ద సెలవు గైకొనుట

పునరాగమనము

హనుమంతు డరిష్టకాద్రిని దాటుట
హనుమంతుఁడు సముద్రము దాటుట
సముద్రతీరమున హనుమంతుని రాక కెదురుచూచుచున్న వానరులాతని రాకకు సంతోషించుట; సీతవృత్తాంతము నెఱుకపఱచుట
సీతవార్తకై వానరులు సంతోషము వెలిబుచ్చుట
జాంబవంతునితో హనుమంతుఁడు తన వృత్తాంత మెల్ల సవిస్తరముగా వినిపించుట
వానరులు హనుమంతునితోగూడి సీత వృత్తాంతమును రామునకు నివేదింప నరుగుట
దారిలో మధువనమునందలి సమస్తఫలములను గ్రహించుట
వనపాలకుఁడగు దధిముఖుఁడు వానరులనాజ్ఞ పెట్టుట
వానరులు తనమాటలను వినకపోవుటచేత దధిముఖుండు సుగ్రీవునితో వనము పాడుచేసిన వృత్తాంతముఁ దెలుపుట
సుగ్రీవుఁడు దధిముఖుండు చెప్పినది విని యందలి యథార్థము గ్రహించి యావానరులను తనవద్దకుఁ దోడ్కొని రమ్మనుట
హనుమదాదులగు వానరులు సుగ్రీవుని వద్దకువచ్చుట
రాముఁడు సుగ్రీవునితో సీతవృత్తాంతము దెలియలేదని చింతించుచు నడుగుట
సుగ్రీవుఁడు రామునకుఁ గార్యసాఫల్యమగునని ధైర్యము చెప్పుట
హనుమంతుఁడు సీతనుఁ జూచితినని శ్రీరామునితోఁ జెప్పుట
సీతయిచ్చిన శిరోమణిని శ్రీరామున కొసంగుట
హనుమంతుఁడు చెప్పిన సీత వృత్తాంతము విని శ్రీరాముఁ డానందము నొందుట
కాండాంతగద్య