Jump to content

శ్రీ రామాయణము - మొదటిసంపుటము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

మదరాసురాష్ట్రీయప్రభుత్వమువారి సమాదరణమున నేఁడు తంజావూరి శ్రీశరభోజీ సరస్వతీమహల్ గ్రంథాలయము వారిపక్షమున ప్రకటితమై శ్రీకట్టా వరదరాజకవి కృతమైన ద్విపద రామాయణము తెనుఁగుభాషయందలి ద్విపదవాఙ్మయశాఖకే గాక, రామాయణవాఙ్మయమునకు ప్రత్యేకవిశిష్టత చేకూర్చిన మహాగ్రంథము. ద్విపదవాఙ్మయశాఖలో గ్రంథపరిణామమున దీనిని మించిన గ్రంధము లేదు. రామాయణద్విపదలలో నధికవ్యాప్తిగల రంగనాధరామాయణమునకు కాలక్రమము ననుసరించిన నిది ద్వితీయమేయైనను యథావాల్మీకముగ మూలగ్రంథము ననువదించుటలో నిది యద్వితీయమని చెప్పనొప్పును. మఱియు కవిరాజశిఖామణి నన్నెచోడ మహాకవి మొదలు నిన్నటివఱకు కీర్తిమూర్తులై వెలయుచున్న ఆంధ్రరాజకవులలో నగ్రగణ్యుఁడగు కట్టా వరదరాజకవి కవితావైశద్యము నెఱుకపడుటకును, నపరిశీలితమగు దేశీయద్విపదవాఙ్మయమున నీరాజకవీంద్రున కెట్టి యున్నతస్థానము కలదో నిరూపించుటకును నీరామాయణగ్రంథము విశేషముగ తోడ్పడును. కావున నిట్టి భాషావాఙ్మయచారిత్రోపకారకమగు గ్రంథమును ముద్రించిన తంజావూరి పుస్తకభాండాగారము వారికి నాంధ్రవిద్వల్లోక మెంతయేని కృతజ్ఞత చూపఁదగియున్నది.

వ్రాతప్రతి వివరణము

నేఁడు ముద్రితమైన బాల, అయోధ్యాకాండములు గల భాగమునకు మాతృక సరస్వతీమహల్ గ్రంథాలయమున 51 సంఖ్యగల సంపూర్ణరామాయణతాళపత్రగ్రంథము నుండి పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/27 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/28 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/29 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/30 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/31 ముగా విద్యావతీదండకమును[1] చెప్పెను. కావున యాతడు 17వ శతాబ్ది ద్వితీయార్ధమం దున్నవాఁడు. వరదరాజు గ్రంథమునుండి యీతఁడు పద్యము గ్రహించుటచే వరదరాజు 17వ శతాబ్దిమధ్యనున్న వాఁడని నిశ్చితముగాఁ జెప్పవచ్చును.

రచనలు

వరదరాజు వైష్ణవమతాభిమాని. యతిరాజాచార్యుల శిష్యుఁడు.[2] శ్రీ వేంకటేశ్వరుఁ డీతని యిష్టదైవము. కావున నీతని రచనలన్నియు వేంకటేశ్వరాంకితములై యుండును - వీనిలో మొదటిది.

పరమభాగవతచరిత్ర

ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వాల్మీకి, వ్యాస, శుక, శౌనక, భీష్మ, దాల్భ్యాయన, రుక్మాంగద, అర్జున, వసిష్ఠ, విభీషణులను పదునలుగురు పరమభాగవతుల చరిత్ర పద్యకావ్యముగా రచియింపఁబడినది. ఇది యెనిమిదియాశ్వాసముల కావ్యము. శ్రీవేంకటేశ్వరస్వామి కంకితము. గ్రంథాంతగద్య యిట్లున్నది.

“ఇదీ శ్రీమదలమేలుమంగాసనాథ తిరువేంగళనాథకటాక్షరక్షితసకలసామ్రాజ్యవైభవ కట్ట హరిదాసరాజతనూభవ సాహితీభోజ వరదరాజప్రణీతంబైన పరమభాగవతచరిత్రం బను మహాప్రబంధమునం దష్టమాశ్వాసము.”

ఈ గ్రంధము తనరచనల కన్నిటికిని మున్నైనట్లు కవి తన శ్రీరంగమాహాత్మ్యముననే యిట్లు చెప్పినాఁడు. శ్రీ వేంకటేశ్వరస్వామి కలలో నీతనికిఁ బ్రత్యక్షమై :

“మున్ను నా పేర నంకితంబుగ నొనర్చితవనిలోఁ బొగడొంద భాగవతచరిత మిపు డొనర్చు ప్రబంధమ్ము నిమ్ము నాకు, నంకితమ్ముగ శ్రీ వేంకటాధిపతిని” అని పలికెను.

రామాయణమున స్వప్నసందర్భముననే యవతారికయందు :-

“నిను మెచ్చి వచ్చితి నీతలం పెఱిఁగి,
ననుఁ దిరువేంగళనాథుగాఁ దెలియు
పద్యకావ్యముఁ జేసి 'పరమభాగవత,
హృద్యచరిత్రంబు' నిచ్చితీ మాకు
మంగళప్రద మసామ్యము శతాధ్యాయి,
రంగమాహాత్మ్యంబు రచియించినావు
మా పేర నిపుడు రామాయణద్విపద,
యేపుమీఱుఁగ రచియింపు మింపలర.”

పై యుద్ధృతాంశములఁబట్టి వరదరాజకవి తొలుత పరమభాగవతచరిత్రమును నావెనుక శ్రీరంగమాహాత్మ్యమును నాపైని శ్రీరామాయణమును రచియించె ననియు నందు పరమభాగవతచరిత్రమే యాతని తొలిగ్రంథ మనియుఁ దెలియుచున్నది.

కాని యీగ్రంథమున పుండరీక, రుక్మాంగద చరిత్రములుగల రెండాశ్వాసములు మాత్రమే లభించుచున్నవి, గాని తక్కినగ్రంథము పూర్తిగ లభించుట లేదు - పై రెండు కథలు గల భాగములు తంజావూరి పుస్తకశాల గ్రంథవివరణపట్టికలో రెండుప్రత్యేకగ్రంథములుగా పేర్కొన్నారు[3]; దీని ననుసరించియే పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/34 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/35 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/36 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/37 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/38 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/39 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/40 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/41 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/42 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/43 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/44 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/45 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/46 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/47 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/48 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/49 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/50 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/51 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/52 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/53 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/54 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/55 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/56 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/57 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/58 పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/59

  అచ్చు మొదలిడిన నాయనుండి యామూలాగ్రముగ

నూలతాళ ప్మత్యప్రతితో దినిని పరిశీలించి,ప్రూపులు దిక్షుట యందును గ్రంథ సంస్క్రరణమునందును నాకు చేదోడువాదోడు గానున్న చిరంజీవి శివసుంద లేశ్వరశావునకు నాయాశీస్సులు

    గ్రంథరత్నమగు నీకృతి, రత్నము ముడాతరశాలలో

మ్ముద్రితమగుట నమంజనమేుగడా! మ్యుదణమును నకాలములో నింతచక్కగ సంతరించిన మదరాసు రత్నము ముద్రాక్షర శాలవారికి నాధన్యవాదములు.

               ఇలిశివమ్‌,

స్వాతంత్రయ్గినము ఇట్లు 15-8-60 విద్యారత్న;

                         నిడుదవోలు వేంకటరావు ఎం. వ,
                          మదరాసు విశ్వవిద్యాలయాంధ్ర
                             శాఖాధ్యక్షుడు 
  1. Edited by me for first time in the Bulletin of the Government Oriental Manocripts Library Vol I. No.I.
  2. రతిరాజు గురుకృపారాజితు విజిత ఆతరాజు యతిరాజుదాకారు యతిరాజయోగి మదాచార్యుచరణ శతపత్ర.
  3. పుట. 41 పరమభాగవతచరిత్ర, రుక్మాంగదచరిత్ర సంఖ్య 177

    పుట. 47 పుండరీకచరిత్రము సంఖ్య 189