శ్రీ అన్నపూర్ణాష్టకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నిత్యానందకరీ వరా2భయకరీ సౌందర్య రత్నాకరీ

నిర్దూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ

ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 1


నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ

ముక్తాహార విడంబ మాన విలసద్వక్షోజ కుంభాంతరీ

కాశ్మీరాగరు వాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 2


యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ

చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ

సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 3


కైలాసాచల కందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ

కౌమారీ నిగమార్థ గోచరకరీ హ్యోంకార బీజాక్షరీ

మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 4


దృశ్యాదృశ్య విభూతి వాహన కరీ బ్రహ్మాండ భాండోదరీ

లీలా నాటక సూత్ర ఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ

శ్రీ విశ్వేశ మనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 5


ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియా శాంకరీ

కాశ్మీర త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ

స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 6


ఉర్వీ సర్వ జనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ

నారీనీల సమాన కుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ

సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 7


చంద్రార్కానలకోటికోటి సదృశీ చంద్రాంశు బింబాధరీ

చంద్రార్కాగ్ని సమానకుంతలధరీ కాశీపురాధీశ్వరీ

మాలా పుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 8


దేవీ సర్వ విచిత్ర రత్న రచితా దాక్షాయణి సుందరి

వామా చారుపయోధరా మధురసా సౌభాగ్య మాహేశ్వరీ

భక్తాభీష్ట కరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 9


క్షత్ర త్రాణకరీ మహా భయహరీ మాతా కృపాసాగరీ

సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 10


అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే !

జ్ఞానవైరాగ్య సిద్యర్థం భిక్షాందేహి చ పార్వతి !! 11