Jump to content

శ్రీరామనామమే

వికీసోర్స్ నుండి

శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది

    శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది 

చ 1)ఘోరమైన పాతకములు గొట్టేనన్నది మమ్ము

    జేరకుండ నాపదలను చెండేనన్నది         ||శ్రీరామ|| 
  2)దారి తెలియని యమదూతల తరిమేనన్నది 
    శ్రీమన్నారాయణ దాసులకు చెలువైయున్నది  ||శ్రీరామ|| 
  3)మాయావాదుల పొందు మానుమన్నది -యీ 
    కాయ మస్థిరమని తలపోయుచున్నది         ||శ్రీరామ|| 
  4)వదలని దుర్విషయ వాంచ వదలమన్నది -నా
    మదిలో హరి భజన సంపత్కరమైయున్నది   ||శ్రీరామ|| 
  5)ముక్తిమార్గమునకిది మూలమన్నది -వి
    రక్తుడు భద్రాచల రామదాసు డన్నది     ||శ్రీరామ||