శుకుడు పరీక్షిత్తునకు ముక్తిమార్గంబుఁ దెలుపుట - 2

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మ. విను మంభోజవుండు మున్ను మదిలో వేదంబు ముమాఱు మ

ర్మనయజ్ఞత్వము దోఁప నంతయుఁ బరామర్శించి మోక్షంబు ద

క్కిన మార్గంబులవెంట లేదనుచు భక్తిం జింతసేసెన్ జనా

ర్దను నాత్మాకృతి నిర్వికాతుఁ డగుచున్ దన్మార్గ నిర్ణేతయై. (36 ).