శతావధానసారము/కాకినాడ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీమత్పరదేవతాయైనమః

శతావధానసారము.

తిరుపతివేంకటీయము.

(పూర్వార్థము.)

ఖర సంవత్సర ఆశ్వయుజ బ. 8 శనివారము కాకినాడలో శతావధానమందు రచించిన 103 టికి గొన్ని పద్యములు.

(సంశయించు సభానాయకునింగూర్చి చెప్పినది)

చ|| నిలిచియె వేయి పద్యముల నేర్పలరంగను సంస్కృతాంధ్రభా
     షలఁ దగఁ జెప్ప నేర్తు మని చాల బ్రతిజ్ఞ వహించినట్టిమే
     మెలమిని నూఱు పద్యముల నిప్పుడు చెప్పుట కెంతగొప్పయౌ?
     నిల వరబాదమన్వయపదీశసుధాకర? వేంకటాభిధా.
                  (శ్రీరామమూర్తి) సీసము.
     శ్రీమద్ధరణిజాత సీమంతినీమణీ హానద్విగుణిత ప్రభాబ్జకుండు
     నమితనిర్జరసంఘ కమనీయమకుట సంఘటిరత్న ప్రభాకలితవదుఁడు
     మహితమసృణ వనమాలాకలితగంధ వాసిత దిక్చక్రవాళకుండు
     ఖండితామరశత్రు మండల మణిగదాదండమండిత భుజాదండకుండు
తే||గీ|| భానువంశాబ్ధి సోముండు వగుణుండు
         నైన శ్రీరామచంద్రుం డనంతకృపను
         సకల సవత్సమృద్ధులఁ జక్క నిచ్చి
         ధరణి రక్షించు నాచంద్రతారకముగ.
                   (విక్టోరియా రాణిగారు) మత్తకోకిల
     సీరధారలు లేనిభూముల నీరధారల ముంపుచున్
     సారవత్తర మైనధాన్యము చక్కఁ బండఁగఁజేయుచున్
     భూరిసౌఖ్యము మానవిళికిన్ఁ బొల్పుమీఱఁగఁ జేయువి
     క్టోరియాభిధరాణి నెన్నఁ బటుల్ జగమ్మున లేరుగా.

                                (స్త్రీ వర్ణనము) సీసము.
నీరజాతముఁ బోలునెమ్మొగమ్మున మేలుకస్తురినామమ్ము కళలుగులుక
రంగారఁ గట్టిన బంగారు సరిగంచు చీరు పాదములపైఁ జిందులాడ
వలలోఁ బడిన జక్కవలఁబోలి కుచపాళి కంచెల ఖండించు కరణి నిగుడ
నిరువంకఁ గువలయసరము దాపినట్లతినీల నేత్రాంతగతులు సెలఁగ.

తే||గీ|| చెలి యొకతె వచ్చుచున్నది చెలులఁగూడి
        యలరువల్తుని మేల్పూవుట మ్మనంగ
        దానిఁ గూడంగఁ గల్గిన మానవులకుఁ
        వేఱె నాకాబలారతుల్ గోర నేల.
                            (ఇంగ్లీషు విద్య) మత్తేభము
తిరిపెం బెత్తెడివారి నెయ్యది మహాదేవేంద్రులం జేయునో
వరనీచాన్వయజాతు నెయ్యది మహావంశోత్తమున్ జేయునో
ధరణిన్ వైదికునైన నెయ్యది తగన్ దా హూణుఁగాఁ జేయునో
వరశోభాకర మట్టిహూణకల నే వర్ణింపఁగా నేర్తునే.
              (అతిబాల్య స్త్రీ వివాహము) చంపకమాల.
జనములు చిన్నికన్నెలకు సత్వర మొప్పఁగఁ బెండ్లి చేసినన్
ఘనమగు తెల్వి లేకునికిఁ గన్నియ లప్పుడు పెండ్లి యాడి యౌ
వనమున నాత్మకుం దగనివాఁడయినన్ దిగనాడి యాతనిన్
ఘనత దొలంగ జారరతికాంక్ష లొనర్చిన దోస మౌఁజుమీ.
              (దేశాటనము వలని లాభము)
ఆ||వె||దేశచాలనంబు తెల్వి పుట్టఁగఁ జేయుఁ
        గరుణ మనమునందుఁ గలుగఁ జేయు
        నతిధిపూజలందు నాసక్తి పుట్టించు
        ధైర్యమిచ్చు రిక్తదశ నడంచు.


ఇయ్యెడ రాజయోగి యను పత్రిక.

మాకాకినాడపురమ్మున పిఠాపురం రాజాగారి కాలేజిలో ఖర సం|| ఆశ్వయజ నాఁడును మరల నా బ ౧౪ నాఁడును బ్ర|| శ్రీ|| చెళ్లపిళ్ల వెంకటాచలశాస్త్రి. పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/15 పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/16 పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/17 పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/18 పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/19 పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/20

నందన సం. శ్రావణములో నమలాపురము శతావధానములో రచించిన 100 టికి గొన్ని పద్యములు.