Jump to content

వ్రతరత్నాకరము/గరుడపంచమీవ్రతము

వికీసోర్స్ నుండి

గరుడపంచమీ వ్రతము


'శుక్లాంబరధరమిత్యాదిధ్యానమ్ గణాధిపతయే నమః, ఇత్యన్తమ్ ప్రాణానాయమ్య. ఓంభూః. . . వరోమ్.మమ ఉపాత్త సమస్తదురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే..., నామవత్సరే దక్షిణాయనే వర్షర్తౌ శ్రావణమాసే శుక్ల పక్షై పఞ్చమ్యాం... వాసర నక్షత్రయుక్తాయామస్యాం శుభతిధౌ అస్మాకం సహకుటుం బానాం క్షేమ స్థైర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం దీర్ఘసుమఙ్గలీత్వసిద్ధ్యర్థం సమస్త మఙ్గలావాప్త్యర్థం వర్షే వర్షే పూజ్యమానాం ఫణిగౌరీదేవతా ముద్దిశ్య ఫణిగౌరీ దేవతాప్రీత్యర్ధం యావచ్ఛక్తి షోడశోపచార పూజాం కరిష్యే. (కలశపూజ, గణాధిపతి పూజ, ఫణిగౌరీ ప్రాణప్రతిష్ట ఇవి యెక్కటివెంబడి నొక్కటి చేయవలయును. వీనివిధానము వినాయక వ్రతమునందుఁ జూడుఁడు.)

ఫణిగౌరీ పూజా

ఆగచ్ఛ దేవ దేవేశి శంకరార్ధశరీరిణి,
ఆవాహయామి భక్త్యా త్వాం ఫణిగౌరి నమో౽స్తు తే.

ఫణిగౌరీ దేవతాయై ఆవాహనం సమర్పయామి.

మాణిక్యవజ్రవైడూర్యనీలరత్నాదిశోభితం,
రత్నసింహాసనం దివ్యం గృహాణ పరమేశ్వరి.

ఫణి గౌరీ. . . ఆసనం సమర్పయామి.

గఙ్గాగోదావరీతోయం కృష్ణవేణీ సముద్భవం,
అర్ఘ్యం దాస్యామి తే దేవి ఫణిగౌరినమో౽స్తు తే.

ఫణీగౌరీ...అర్ఘ్యం సమర్పయామి. మధుపర్కంచ సమర్పయామి.

పయోదధిసమాయుక్తం ఘృతశర్కరసంయుతం,
పఞ్చామృతైః స్నానమిదం గృహాణాసురమర్దని
ఆపోహిష్ఠామయో భువః. . .చనః.

ఫణిగౌరీ. . .యై శుధ్ధోదకస్నానం సమర్పయామి.

రక్తపీతమయం వస్త్రం దుకూలం చ మనోహరం,
మయా దత్తమిదం వస్త్రం ధార్యతే భండమర్దని.

ఫణి... యై వస్త్రయుగ్మం సమర్పయామి.

బ్రహ్మసూత్రం శుభ్రమిదం త్రిగుణం త్రిగుణైర్యుతం,
బ్రహ్మగ్రన్ధియుతం దేవి ఫణిగౌరి నమో౽స్తుతే.

ఫణిగౌరీ... యజ్ఞోపవీతం సమర్పయామి.

మంత్రము...

గౌరీమిమాయుసలిలానిదక్షత్యేకపదీద్విపదీసా చతుష్ప
ద్యష్టాపదీనవపదీ బభూవుషి సహస్రాక్షరాపరమేవ్యోమన్.

ఫణి. . .యై కుఙ్కుమాదిపరిమళద్రవ్యాణి సమర్పయామి..

ముక్తామాణిక్యవైడూర్యరత్న హేమాదినిర్మితం,
దివ్యమాభరణం దేవి గిరిజూయై నమో౽స్తు తే.

ఫణిగౌ... యై ఆభరణాని సమర్పయామి-

శ్రీగన్ధం చన్దనోన్మిశ్రంకస్తూర్యాదిసమన్వితం,


గన్ధం గృహాణ దేవేశి మయా దత్తమిదం శుభే.

ఫణిగౌ...యై గంధా౾ధారయామి

అక్షతాన్ ధవళాకారాన్ శాలీతణ్డులమిశ్రితాన్
హరిద్రాచూర్ణ సంయుక్తాం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్.

ఫణి. . .యై అక్షతాన్ సమర్పయామి.

చామన్తికావకుళచమ్పకసాటలాబ్జై
పున్నాగజాజికరవీరరసాలపుష్పైః
బిల్వప్రవాళతులసీదళమల్లికా ద్యైః
త్వాంపూజయామి జగదీశ్వరి తే పదాబ్జె.

ఫణి...యై పుష్పాణి పూజయామి.

అథ అఙ్గ పూజా

శివాయై నమః పాదౌ పూజయామి.
భవాన్యై ,, గుల్ఫౌ ,,
రుద్రాణ్యై ,, ఉరూ ,,
శర్వాణ్యై ,, జఙ్ఘే ,,
సర్వమఙ్గళాయై ,, కటిం ,,
అపర్ణాయై ,, స్తనౌ ,,
మృడాన్యై ,, కణ్ఠం ,,
చణ్డికాయై ,, బాహూ ,,
ఆర్యాయై ,, ముఖం ,,
సత్యై ,, నాసికాం ,,
సునేత్రాయై ,, నేత్రే ,,
సుకర్ణాయై ,, కర్ణే ,,

మేనకాత్మజాయై నమః లలాటం పూజయామి.
ఫణిగౌర్యై నమః శిరః పూజయామి.
మహాగౌర్యై నమః సర్వాణ్యఙ్ఞాని పూజయామి.


అథ అష్టోత్తరశత (108) నామావళిః

నమః” అని ప్రతినామముకడఁ జేర్పవలయును.

ఓమ్ మహాగౌర్యై నమః రౌద్య్రై
మహాదేవ్యై కాలరాత్యై 20
జగన్మాత్రే తపస్విన్యై
సరస్వత్యై శివదూత్యై
చణ్డికాయై విశాలాక్ష్యై
లోకజనన్యై చాముణ్డాయై
సర్వ దేవాది దేవతాయై విష్ణుసోదర్యై
పార్వత్యై చిత్కళాయై
పరమాయై చిన్మయాకారాయై
ఈశాయై 10 మహిషాసుర మర్దన్యై
నగేన్ద్రతనయాయై కాత్యాయన్యై
సత్యై కాలరూపాయై 30
బ్రహచారిణ్యై గిరిజాయై
శర్వాణ్యై మేనకాత్మజాయై
దేవమాత్రే భవాన్యై
త్రిలోచన్యై మాతృకాయై
బ్రహ్మణ్యాయై గౌర్యై
వైష్ణవ్యై రమాయై

110

వ్రతరత్నాకరము


రామాయై విరూపాక్ష్యై
శుచిస్మి తాయై విరాజితాయై
బ్రహస్వరూపిణ్యై 40 హేమాభాయై
రాజ్యలక్ష్మై సృష్టిరూపాయై
శివప్రియాయై సృష్టిసంహారకారిణ్యై
నారాయణ్యై రఞ్జనాయై
మహాశక్త్యై యౌవనాకారాయై
నవోఢాయై పరమేశ్వర ప్రియాయై
భాగ్యదాయిన్యై పరాయై 70
అన్న పూర్ణాయై పుష్పిణ్యై
సదానన్దాయై పురుషాకారాయై
యౌవనాయై మహారూపాయై
మోహిన్యై మహారౌద్య్రై
జ్ఞానశుధ్ధై 50 మహాపాతకనాశిన్యై
జ్ఞానగమ్యాయై కామాక్ష్యై
నిత్యా నిత్యస్వరూపిన్యై వామదేవ్యై
కమలాయై వరదాయై
కమలాకారాయై భయనాశిన్యై
రక్తవర్ణాయై వాగ్దేవ్యై
కళానిధయే వచస్యై
మధు ప్రియాయై వారహ్యై
కల్యాణ్యై విశ్వమోహిన్యై
కరుణాయై పర్ణ నిలయాయై
జనస్థానాయై 60 విశాలాక్ష్యై
వీరపత్న్యై కులసమ్పత్ప్రదాయిన్యై

ఆర్తదుఃఖచ్ఛేదదక్షాయై కార్యై
అమ్బాయై వాగ్భవ్యై
నిఖిల యోగిన్యై దేవ్యై 100
సదాపురుషస్థాయిన్యై 90 క్లీంకార్యై
తరోర్యూలతలంగతాయై సంవిదే
హరవాహసమాయుక్తాయై ఈశ్వర్యై
మునిమోక్షప్రదాయై హ్రీంకారాక్షరబీజాయై
ధరాధరభవాయై శాంభవ్యై
ముక్తాయై ప్రణవాత్మికాయై
పురమన్త్రాయై శ్రీమహాగౌర్యై
వరప్రదాయై ..

ఫణిగౌరీ. . .యై అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి.

వనస్పత్యుద్భవ్యైర్దివ్యైః .. ప్రతిగృహ్యతామ్.

ఫణిగౌర్యై ధూపమాఘ్రాపయామి

భక్త్యా దత్తం మయా దీపం త్రివర్తిఘృతసంయుతం,
అన్ధకారనివృత్త్యర్థం గృహాణాజ్ఞాననాశిని.

ఫణి...యై దీపం దర్శయామి.

భక్ష్యైర్భోజ్యైః సచో ష్యైశ్చ సరమాన్నం సశర్కరం,
నై వేద్యం గృహ్యతాం దేవి శమ్భుపత్ని నమోస్తుతే.

ఫణి గౌరీ. . .యై నైవేద్యం సమర్పయామి.

పూగీ......గృహ్యతామ్.

ఫణి. . . తామ్బూలసువర్ణ పుష్పదక్షిణాః సమర్పయామి.

112

వ్రతరత్నాకరము


మంత్రము :

మానో హింసీజ్జాతవేదో గామశ్వం పురుషంజగత్ ,
అబిభ్రదగ్న ఆగహి శ్రీయా మా పరిపాతయ.

ఫణి. . .యై నీరాజనం దర్శయామీ.

జాతవేదసే, సునవామ సోమమరాతీయతో నిదహాతి వేద,
సనఃపరుషదతి దుర్గాణి విశ్వా నావేవ సిధ్ధుందురితాత్యగ్నిః

ఫణి. . .యై మన్త్రపుష్పం సమర్పయామి,

యానికాని... పదేపదే, ఫణి. . .యై ఆత్మప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి.

ఫణిగౌరి నమస్తేఽస్తు కైలాసనిలయే స్థితే,
లోకమాతర్నమస్తుభ్యం సౌభాగ్యం దేహి మే సదా.

ఫణిగౌరీ దేవతా ప్రార్థనా


దశగ్రన్ధిసమాయుక్తం కుజ్కుమాక్తం సుదోరకం,
కరె బధ్నామి వరదే తవ ప్రీతికరం శుభమ్.

తా. దోరమును పదిముళ్లు వేసి పూజ చేసి కట్టుకొనవలయును.

ఫణిగౌరీ చ గృహ్ణాతు ఫణిగౌరీ దదాతి చ,
తారకా ఫణీగౌరీ చ ఫణిగౌరి నమోఽస్తు తే.

తా. ఈశ్లోకము చెప్పి బ్రాహణునికి వాయనము నియ్యవలయును. తర్వాత ఫణిగౌరికి పునఃపూజ చేయవలయును.

యస్య స్మృత్యాచ... భక్తిహీనం మహేశ్వరి, యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే.

అనేక కల్పోక్తప్రకారేణ కృతేన పూజావిధానేన ఫణిగౌరీ దేవతా సుప్రసన్నా వదా భవతు.

ఫణిగౌరీపూజావిధానం సమాప్తమ్,


కథాప్రారంభము

సూత ఉవాచ:

శ్లో.శృణుధ్వం మునయః సర్వే వ్రతానా ముత్తమం వ్రతం,
   యస్యానుష్ఠానమాత్రేణ నారీ మజ్జలతో భవేత్ .

1. భ్రాతృమత్యా చ కర్తవ్యం పఞ్చమిా వ్రతముత్తమం, శుక్లే శ్రావణికే మాసే పంచమ్యాం చ శుభే వినే.

2.సువాసినీ వ్రతమిదం కుర్యాదశసువత్సరాన్.శౌనక ఉవాచ.సూత సూత మహాప్రాజ్ఞ యాదృశం వ్రతముత్తమం, శ్రద్ధధానాయ మహ్యం త్వం బ్రూహి తద్వదతాంపక.

3.సూతఉవాచ: యయాకయా సువాసిన్యా భాతృమత్యా విశేషతః.

4.శ్రావణే మాసి సంప్రాప్తె పంచమ్యాం ప్రాతరుత్థిత, నారీ సుమంగళ ద్రవ్యైహరిద్రాచూర్ణ సంయు తైః.

5.కృత్వా తు మూలస్నానం ధౌతవస్త్రాణి ధాయేత్ .

6.తతః ఫలసుమాధ్యైశ్చ మణ్డపం చ ప్రకల్పయేత్,తతో మణ్డపమధ్యే తు రఙ్గవల్లీం చ కారయేత్ .

7.తన్మధ్యే చాసనం దివ్యం సంస్థాప్య చ యథాక్రమం,తస్మింస్తు తణ్డులం న్యస్య కుసుమాక్షతసంయుతమ్.

8.స్వర్ణేన రాజతేనాపి తామ్రేణాపి కృతః ఫణీ, అథవా మృణ్మయేనాపి విత్త శాఠ్యం న కారయేత్.

9. ఫణేర్మధ్యే చ గౌరీం తాం ధ్యానేనావాహనాదిభిః, పఙ్చామృతైః పఙ్చగవ్యైర్వస్తైరాభరణైః శుభైః.

10.గన్ధాక్షతైః పుష్పమాల్యైర్ధూపదీపై ప్రపూజయేత్ , నైవేద్యం షడ్రసోపేతైర్భక్ష్యైర్భోజ్యైశ్చ లేహ్యకైః.

11.తామ్బూలస్వర్ణ పుష్పాది మన్త్ర పుష్పైః ప్రపూజయేత్,తతఃప్రదక్షిణం కుర్యాన్నమస్కారాదిపూర్వకమ్.

12.దశ గ్రంథియుతం దివ్యం దోరకం చ ప్రపూజయేత్ , తద్దోరకం కరే ధృత్వా

వాయనం చ ద్విజాతయే.

13.సదక్షిణం సతామ్బూలం గౌరీభక్తి సమన్వితా, బ్రాహ్మణాయసముర్బ్యాథస్వయంభుఞ్జీతభక్తితః.

14.ఏవం ప్రతం తు యానారీ దశాబ్దం చ సమాచరేశ్,తస్యాం ఫలన్తి సర్వే౽ర్థాః పతిలోకం చ గచ్ఛతి, ఇహ భుక్త్వా సువిపులాన్ సర్వాన్ భోగాన్ యథేప్సితాన్.

15. అనుభూయ సుఖేనైవ చాన్తే కై వల్యమాప్నుయాత్,శౌనకాదయ ఊచుః.సూత సూత మహాభాగ గరుడస్య మహాత్మనః.

16.జన్మ కర్మ చ వీర్యాణి శ్రోతుమిచ్ఛామ హే వయమ్, సూతః కశ్యపో నామ బ్రహ్మర్షిర్బహ్మపుత్రో౽భవత్పురా.

17.తస్య భార్యా సుపర్ణీచ తస్యాం పుత్ర మజీజనత్,గరుత్మానికి విఖ్యాతో మహాబలపరాక్రమః.

18.దాసీకర్మచ సంప్రాప్తాం మాతరం వీక్ష్య సాదరః,సపత్నీ నిలయే మాతః కిమర్థం దాస్యమర్హసి.

19.అమృతాన యనేనైవ దాస్యమద్య నీవర్తతే,ఇతి తద్వచనం శ్రుత్వా శీఘ్రం గత్వా సురాలయమ్.

20.అమృతాహరణార్థాయ గరుత్మాన్ యత్ర తిష్ఠతి, ఇన్ద్రాదయస్తు తం దృష్ట్వా సర్వే శస్త్రాస్త్రపాణయః.

21. గరుడం ఛాదయామాసుః పరిఘాయసపట్టపైః, పక్షాభ్యాం వారయామాస క్షణమాత్రేణ పశ్యతామ్.

22.ఆనీతమమృతం శీఘ్రం తార్క్ష్యపుత్రేణ ధీమతా, సపత్నీ మాతరం దృష్ట్వా అమృతం తే మయార్పితమ్.

23.తథేతి కద్రూః సంగృహ్య సువర్ణీ మిదమబ్రవీత్ , దాస్యం త్వయా నివృత్తం మే గృహం గచ్ఛ యథాసుఖమ్.

24. ఇన్ద్రాదయః సమాగత్య గృహీత్వా మృతమాయయుః, ఏవంవిథాని కర్మాణి బహూన్యాచగితానిచ.

25. తస్య జన్మ చ మాహాత్మ్యం విస్తార్య కథితం మయా,

పఞ్చమ్యాం జాయమానత్వాతృఞ్చమిా తార్క్ష్యపంచమీ.

26.యే చరన్తి వ్రతమిదం యే పఠన్తి ద్విజాతయః, తే తు పాప వినిర్ముక్తా యాస్యన్తి పరమాం గతిమ్. 27.ఇతి గరుడ పఞ్చమి వ్రతకథా సమ్పూర్ణా,

__________


గరుడపంచమిా వ్రతకథ


సూతుడు శౌనకాది మహామునుల నందఱిని జూచి, “మునీంద్రులారా ! అనుష్ఠించినమాత్రముననే స్త్రీలకు సకల సంపదల నొసఁగునట్టి వ్రతములలో నెల్ల సుత్తమం బగువ్రతం బొక్కటి గలదు. ఈపంచమిా వ్రతంబును తొఁడబుట్టువులుగల సుమంగలి శ్రావణశుద్ధపంచమిదినంబునఁ జేయవలెను” అని చెప్పఁగా శౌనకమహాముని సూతపౌరాణికునిఁజూచి, “ఓమహాపండితుడా!వ్రతంబులలో నెయ్యది యుత్తమ వ్రతమో, ఆ వ్రతంబు నా కానతిండు. నేను వినగోరుచున్నాను. అట్టి వ్రతంబు నాకెఱిఁగింపవలయు” నని వేఁడఁగా సూతపౌరాణికుఁడు శౌనకాది మహామునులతో నిట్లనియె.

“ఓమునీంద్రులారా! యీ వ్రతంబు నేసుమంగలియైనను జేయవచ్చును. అయినను ముఖ్యముగా నన్న దమ్ములుగల యాడుది తప్పక యీవ్రతంబు నాచరింపవలయును. అట్టి కాంత శ్రావణశుద్ధ పంచమిరాఁగానే యుదయమున లేచి, పసుపు సువాసనగల నలుఁగుఁబిండి మొదలగు సువాసన గలపోళ్లను చేహము నకు రుద్దికొని మంగళస్నానము చేసి, యుదికినమడిబట్టలను గట్టుకొని, మండపము పండ్లు ఆకులు మొదలగువానితో నలం కరించి ఆమంటమున మ్రుగ్గులుపెట్టి యామంటకమునడుమ దివ్యమైన యాసనంబు నమర్చి దానిమీఁద బియ్యముపోసి,పూవు లక్షతలుచల్లి, శక్తివంచన లేకుండ బంగారుతోఁగాని,వెండితోఁగాని, రాగితోఁగాని తుదకు మంటితోగాని ఆదిశేషుని ప్రతిమ నొకదానిని జేయించి దానిమీాఁద బెట్టి యా ప్రతిమ యందు గౌరీదేవి నావాహనము చేసి, ఆసనాఘ్యపాద్యాచమనీయస్నాన వస్త్ర, యజ్ఞోపవీత గంధపుష్పాక్షతాభరణాలంకార ధూపదీపనైవేద్యతాంబూల నీరాజన మంత్రపుష్పాదు లగు సకలపూజలను గావించి, ప్రదక్షిణ నమస్కారములు సల్పి,దోర పూజసేసి దోరము గట్టుకొని వృద్ధ బ్రాహ్మణునికి వాయనం బొసఁగి సకల బ్రాహ్మణులకు సంతర్పణంబు గావించి, తాను తన యిష్టబంధుజన సమేతముగా భుజియించి, వ్రతమును పూర్తిచేయవలెను. ఏసుదతి యీ వ్రతంబును బదిసంవత్సవములు విడువక చేయుచున్నదో ఆసుమంగలి యిహలోకంబున సకల సౌఖ్యంబుల ననుభవించి, యంతమున మోక్షసామ్రాజ్యము నొండఁగలదు"అని సూతమహాముని చెప్పఁగా, శౌనకాది మునీంద్రులు వెండియు న మ్మునీంద్రుని జూచి, “ఓమునీంద్రా! మేము గరుత్మంతుని జననము, కార్యములు, వీర్యమునుగూర్చి వినఁ గోరుచున్నాము: సెల వి"మ్మని యడుగఁగా, సూతపౌరాణికుడు ఆగరుడుని జననాదులనుగూర్చి వారి కిత్తెఱగున 'నెఱిఁగించె. “ఓమునులారా ! తొల్లి బ్రహపుత్రుఁడయిన కాశ్యపుఁడనెడి పేరుగల యొకమహర్షి యుండెను.ఆయనకు సుపర్ణి యను భార్య యొక్క తే యుండెను. ఆయన కాసుపర్ణియందు గరుత్మంతుఁ డనెడియొకకొమరుఁడు పుట్టెను. అతఁడు మితి మీఱిన బలపరాక్రమంబులు గలవాడు, ఆతఁడు తల్లిదగ్గఱఁ బెరుగుచునుండునప్పు డొక్కదినంబునఁ దల్లినిజూచి, “ఓతల్లీ ! నీ వేల సవతియింటఁ బనికత్తెవై యున్నావు?” అని యడిగెను. ఆమాటకు సుపర్ణి తనకొడుకుతో “ఓరీనాయనా ! నీవిప్పుకు స్వర్గలోకము నుండి యమృతంబుతెత్తు వేని నాదాస్యము తొలఁగిపోవు" ననిచెప్పెను. అంత గరుడుఁ డమృతంబు తెచ్చుటకై స్వర్గలోకం బునకుఁబోయెను.ఇంద్రుడు మొదలగు వేల్పులందఱు శస్త్రాస్త్రములను గైకొని యమృతంబు గొనిపోవచ్చిన యాగరుత్మతుని నడ్డగించిరి, ఆగరుడుఁడు వారి బాణములను వారిని తనఱెక్క డెబ్బలతో నడంచి, వారందఱు చూచునప్పుడే క్షణములోపల నమృతంబు గైకొనిపోయి తనసవతితల్లి ముందట నుంచెను. అది చూచి యాసవతి తల్లి యగు కద్రువు దానిని గైకొని “నీ దాస్యము తొలఁగెను. సుఖముగా పొమ్మ” అని వినతకు దాస్యవిమోచనము నొసఁగెను. ఇంద్రాదులు వచ్చి యాయమృత కలశమును గైకొనిపోయిరి. ఇట్టికార్యముల నాగరుడుఁ డెన్నియో యాచరించియున్నాడు. అతనిజననమును సామర్థ్యమును గూర్చి మీకు విస్తరించి వేఱొకచోటఁ జెప్పితిని. ఇతఁడు ఈ పంచమినాఁడు పుట్టుటచే నీదినమునకు గరుడపంచమి యని నామంబు వచ్చెను. (ఎవ రీగరుడపంచమి వ్రతంబు నాచరించి,యీకథను వినుచున్నారో, లేక, చదువుచున్నారో వారు సకలపాప వినిర్ముక్తులై యుత్తమగతిని బొందుచున్నారు.)

ఇది గరుడపంచమీ వ్రతకథ సంపూర్ణము.