వేయి కందములు
వేయి కందములు
[మార్చు]కవి: శ్రీ బ్రహ్మానంద శ్రీధర స్వామి ప్రణీతంబైన అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాన్త పద్య రత్నములు
[మార్చు]న్యూ యార్క్ ఉత్తర అమెరికా
[మార్చు]1
[మార్చు]శ్రీ సంగమేశ! మీ కృప |
యీ సంసారము హరించి | యిడుముల దీర్చున్ |
యే సంశయములు లేకను |
నే సంపూర్తిగ శరణని | నిను వేడితిలన్ ||
2
[మార్చు]పున్నమి వెన్నెల వలె మీ |
వున్నతమైన పరిపూర్ణ | బోధను జల్లీ |
నన్ను విముక్తుని సేయగ |
మన్నన నిక నిన్ను సేతు | మానవ చంద్రా! ||
3
[మార్చు]తల్లియు తండ్రియు దాతయు |
యుల్లములో వెలసినట్టి | యుగ పురుషుడవీ |
వల్ల కదా మము బ్రోవగ? |
చల్లని చూపుల ప్రభువర | సంగమ దేవా!||
4
[మార్చు]నీ పాద జలమె గంగయు |
నీ పాదయుగళమె విష్ణు|ని పదయుగళమౌ |
నీ పలుకులె తారకమిక |
నీ పర కృపయే జనులకు | నేరుగ ముక్తీ! ||
5
[మార్చు]మౌనము యేలను స్వామీ? |
మౌనముతో మీరు వున్న | మర్మము గనమీ |
మౌనము వీడియు మాకును |
మానవ ధర్మంబు బోధ | మనసిడి జెపుమా! ||
6
[మార్చు]పున్నమి రోజున భక్తులు |
మిన్నగ నీ పూజ జేసి | మేలుగ కొలచీ |
తిన్నగ మీ పద తీర్థము |
కన్నుల కద్దుకొని త్రాగి | కల విడిచిరిలన్ ||
7
[మార్చు]ఎన్నియొ జన్మల పుణ్యమొ? |
తిన్నని మీ పదములంటి | తేనీగ వలెన్ |
పన్నుగ బోధను జుఱ్ఱియు |
మిన్నగు యా పూర్ణ బయలు | మేల్కొన గంటీ! ||
8
[మార్చు]సిరికొండయందు పుట్టియు |
సిరిసిరి మువ్వల నడుమను | చిరుతల తోడన్ |
హరిహర భజనలు జేసియు |
చిరువయసులొ భక్తుడైన | చిన్మయ రూపా! ||
9
[మార్చు]మీ ముఖ వర్చస్సు గనియు |
ఆ మనమున బ్రహ్మ తేజ | మని తెలియ వలెన్! |
మీ ముఖ బింబమును దలుచ |
మా మనములు బ్రహ్మమయము | మానక కావో? ||