వేమన/ఏడవ యుపన్యాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


శ్రీ:

ఏడవ యుపన్యాసము

వేమన కవిత్వము, హాస్యము, నీతులు.

వేమన కవులని పేరు సంపాదింపని కవులలోఁ జేరిన వాఁడంటిని. పేరు. వచ్చుటకు రెండు హేతువులు : ప్రజయొక్క యభిరుచి నెఱిఁగి వారికి తృప్తిగా వ్రాసినవానికి వచ్చును ; కవియొక్క గొప్పతనము నెఱుంగగల ప్రజ యున్నను. వచ్చును. వేమన విషయమం దీ రెండును లేకపోయినవి.

ఇతcడు ఇతరులకు హితము గావలయునను నుద్దేశముతో వ్రాసెనే కాని, వారు తృప్తిపడవలయునని వ్రాసినవాఁడు కాఁడు. వారు తన్ను పొగడవలయునని, యాశపడి కాని, తిరస్కరింతురని వెఱచి కాని, తన త్రోవను వదలినవాఁడు కాఁడు. మనలో చాలనాళ్ళనుండి 'కావ్యం యశసేఒర్థకృతే" యను సిద్ధాంతము ముఖ్యముగా నెలకొన్నది. కావ్యములు వ్రాయుటకు మొదటి ఫలములు కీర్తి ; ద్రవ్యము కావున కీర్తినిచ్చు పండితులకును, ద్రవ్యమునిచ్చు రాజులకును ప్రీతిని గలిగించినచో కృతార్థుల మైతిమని యనేక కవులు తల(చిరి. దానికిఁ దగినట్లు 'కవిసార్వభౌముఁడు" మొదలగు బిరుదులును, ఎకరాల కొలఁది యినాములును అగ్రహారములును వారికి. లభించుచుండెను. తమ మనసుకు తృప్తి గల్లించినవారి విషయమున ప్రాచీనులు చూపిన మర్యాద, ఔదార్యము అత్యద్భుతములు. కాని కవికి స్వాతంత్ర్యము. పోయినది. ఇతఁ డితరులచేతి బొమ్మ యైపోయినాఁడు. కృష్ణదేవరాయలవంటి దొరయాజ్ఞను తిరస్కరించి, 'ఊరక కృతుల్ రచియింపమటన్న శక్యమే?" యని పెద్దనవలె ధీరముగాఁ జెప్పఁగల మగకవి లేకపోయినాఁడు. ఉన్న యభిరుచికి. ఉదాహరణము లిచ్చువారే కాని, దానిని సరియైన త్రోవలో మార్చి తిద్దఁగలిగిన ధీరులు లేరైరి. క్రమముగా కవిత్వమునకు జీవనము సంపాదించుకొనుట యొక యూనుసంగిక ఫలముగాఁ గాక, ప్రధాన ఫలముగా పరిణమించెను. ద్రవ్యము. గలవా రెవ రే విషయమున పద్యములు వ్రాయమని చెప్పినను ' నరే' యని కవి. నడుముగట్టుకొని సిద్ధముగా నుండవలసి వచ్చెను. ఏ పెద్దమనుష్యుఁ డూరికి వచ్చినను, ఏ గుమస్తాను వేరొక యూరికి మార్చినను, ఏ యెల్లయ్యకు దొరతనము వారి బిరుదు లభించినను, ఆ సందర్భములందెల్ల తప్పక, యేమూలలోనో యున్న కవిని జట్టు పట్టుకొని యిూడ్చుకొనివచ్చి, యందఱిముందుకు త్రోయుట విధిలేని. పనియైనది. కవి యను పేరుగలవాఁడు ఎవ్వరిని జూచుటకు పోయినను, వాని. యూరు పేరులు తెలిసికొని కలిపికొట్టి పద్యములు వ్రాసి పొగడుట ప్రథమ కార్య మైనది. కవికి స్నేహము, ద్వేషము, భక్తి, అభిమానము, అసహ్యము మొదలగు తన భావము లేవియున్నను లేనట్లే, తిట్టుట కధికారము లేదు. పొగడ్తలకు విలువ. లేదు; ఎందుకనఁగా, తాను తిట్టవలసియున్నను ఒకరు పొగడుమన్న వానిని పొగడ వలసినదే కాని, తన యిచ్చానుసారము కాదు గావున, ఇట్టి కవిత్వమును వ్రాసి ప్రఖ్యాతిని సంపాదించుట వేమనవంటి వారికి రుచించునా ? చూచిన వస్తువులందెల్ల తప్పలుపట్టు స్వభావము గలవాఁడు, పట్టిన తప్పలను స్పష్టముగా మొగము ముందర చెప్పక యుండలేనివాఁడు, ఇతరులను కీర్తికొఱకో, ద్రవ్యముకొఱకో ఊరక యెట్లు పొగడఁగలఁడు? ఒకని యందలి గుణ ములు తన మనసుకు నచ్చిన పక్షమున నంతోషించి పద్యములు వ్రాయు స్వభావము వేమన్నకు కలదని, గుంటుపల్లి ముత్తమంత్రి మీఁది పద్యము తెలుపుచున్నది. కాని ఆది, 'మా వాఁడు బుద్ధిమంతుడు' అని వాత్సల్యముతోఁ జెప్ప అభిమానపు మాట వలెనే యున్నదే కాని, యందులో ప్రపంచమందలి యందఱి తలవెండ్రుకలను తెలుపు చేయునట్టు ముత్తమంత్రి కీర్తి వర్ణింపఁబడినదా? లోకుల కెవరికిని త్రాగుటకు నీరును లేనట్లు, తెచ్చి పోసిన యతని దాన ధార వర్ణింపఁబడినదా? కాబట్టి యీ పద్యమును నెఱదాత యగు గుంటుపల్లి ముత్తమంత్రియే వినియున్నను, వేమన్న కొక గోటువక్కయు నిచ్చి యుండఁడు. తన దరిద్రావస్థలో ద్రవ్యార్జనకొఱకు బైలుదేఱినప్పడు ఇట్లు ధనికులను పొగడి వేమన్నయు పద్యములు వ్రాసినాఁడేమో యను నందేహమును గలిగించు పద్య మొకటి గలదు

               "ఆ. పడుచు నిచ్చువానిఁ బద్య మిచ్చినవాని
                     కడుపు చల్లఁజేసి గౌరవమున
                     నడపలేనివాఁడు..." (2375)

తక్కినది మీరు పుస్తకమందే చదువుకొనుఁడు. కాని, యీ పద్యముగూడ, ఇట్లు ద్రవ్యము కొఱకు తన యాత్మను జంపకొనియైన ముఖస్తుతిచేసి పద్యములు వ్రాసిన వానిపైఁగూడ *అయ్యోపాపము' లేక, వట్టి చేతులతో పంపించు 'బండగోవ" లను తిట్టి వేమన వ్రాసినదే యనియుఁజెప్పవచ్చును. ఇట్లగుటచే ఇతఁడు ఇతరుల కేది రుచించునని గమనించి, యాప్రకారము వ్రాయఁగల్గుట యసంభవము.

ఇదిగాక యితఁడు సహజముగా బహిరంగద్వేషి. అనఁగా దేని యందైనను ముఖ్యముగ గమనింపఁ దగినది. సారభూతమైన లోపలితత్త్వమే గాని, బైటి యాకారము, వేషము, పని మొదలగునవి కావనుట యితని సామాన్యదృష్టి. మనస్సు శుద్ధముగా నున్నఁ జాలును; బైటి స్నానపానాదు లక్కరలేదనువాఁడు. తాను గట్టిన 'చిఱుగుబట్ట' యే చీనాంబర మని, తన "ముఱికి యొడలే' 'ము క్తి' యని చెప్పచు, ఆక్షేపించినవారి నదరఁ గొట్టిన వాఁడు. 'భక్తిలేని పూజ ఫలము లేదు? గావున, అదికలవాఁడు దేవళములకుఁబోయి, పత్రి, తులసి కర్చుపెట్ట వలసిన పనిలేక 'మంచాననే మ్రొక్కు ( 2328) నని చెప్పినవాఁడు కాని మంచము నందైనను 'మ్రొక్కుట' తప్పనిది గదా ! అది బహిరంగమేకదా ? బహిరంగము అంతరంగము రెండును ఒకటికొకటి యనుకూలములే కాని ప్రతి గూలములు కావు. బలవంతముగా వానిని వేఱుపఱుప వచ్చునే కాని సహజముగా ఆ రెండును అన్యోన్యాశ్రయములు ; ఒకటినొకటి వదలనివి. భక్తిలేక పూజచేయ వచ్చును; పూజలేక భక్తియు సాధ్యమే ; కాని సహజముగాదు. అంతరంగము తనకు సంబంధించినది. బహిరంగము పరులకే యెక్కువగాఁ జేరినది; అనఁగా, తనకును అందు సంబంధము లేకపోలేదు. దానము చేయవలయునని యంతరంగ మందు బుద్దియున్నఁ జాలునా ! బహిరంగముగా చేయకున్న నితరులకు ఫలము లేదనుమాట యట్లండనిండు. అసలు తనకు తృప్తి కలుగునా ? హృదయము నిర్మలముగా నుండవలసినదే. కడుపులో అజీర్ణాదిమలములు లేకుండఁ జేసికొన వలసినదే. కాని అంతమాత్రమున దేహము పైభాగము ముఱికి ముద్దయై చీర పేలు పడి క్రుళ్లుచున్నను తొందఱ లేదన వచ్చునా ? ఇతరుల కసహ్యమనుట మఱచి పోదముగాక ! మన ముక్కుకే యది యోర్వవచ్చునా ? ఒక వేళ అట్లోర్చు కొనుట బలవంతముగా వాడుక చేసికొని బహిరింద్రియములను చంపుకొన వచ్చును గాని నిజముగా నది యుక్తమనవచ్చునా? కావున ఈ రెంటిని పరస్పరసహాయ ములుగాఁ జేసికొనుట బుద్ధిమంతుని లక్షణము మాత్రమే కాదు; సమర్ధుని లక్షణము గూడ.

వేమన యిట్టి తప్పుసిద్ధాంతమును కొంతవఱకును కవిత్వమునందును ఉపయోగించెను. కవిత్వమునకు భాష, చంధస్సు మొదలగునవి బహిరంగములు. అర్ధభావములంతరంగములు, అవి ఒక విశిష్ట విధముగా తీవ్రముగా నున్ననే కాని కవిత్వమను పేరురాదు. చూడుఁడు :

               "ఆ. పైరు నిడిన వాని ఫలమే సఫలమగు,
                     పైరు నిడనివాఁడు ఫలము గనునె ?
                     పైరు నిడని చాఁడు బహుసౌఖ్యవంతు(డౌ..." (2613)

ఈ పద్యమందు కవిత్వములేదు. వేమన్న యిది వ్రాయకుండినను నష్టము లేదు. అట్లే బహిరంగములైన భాషాఛందస్సులును ఒక విశిష్టవిధముగా నుండనిది కవిత్వమను పేరు రాదు. చక్కనిభాష, కుంటులేని ఛందస్సు గలిగియున్నను ఆంధ్రనామ సంగ్రహము సందు కవిత్వమెట్లులేదో, యట్లే అర్ధభావములు మంచి వైనను భాషాఛందస్సులు నాగరకతనుదప్పి యుండుటచేత నీక్రింది పద్యము నందును అదిలేదు :

               "వక్కుతండములైన పూదించి నలగొట్టి
                వకటిగా జేయొచ్చు వసుధలోన
                ఆత్మవేఱైన వెనుక అంటించుటకుదురా..విశ్వ." -
                                         కో. లక్ష్మణ మొదల్యారు గారి వేమనపద్యములు (2862)

వేమన యీ పద్యము నిట్లే వ్రాసెనో వ్రాయలేదో యనుమాటవేఱు. అతని పద్యములనేకములు వ్రాఁతప్రతులలోను అచ్చుప్రతులలోను నిట్లేయున్నవి. అనేక పద్యములందు ఆటవేలఁది నడకకును, సీసపునడకకును భేదమే యితఁడు గమనించినట్లు తో(పదు. భాషావిషయమందును శుద్ధమైన శబ్దప్రయోగమునకుఁగాని, సంధులను చక్కఁగా కలుపుటకుఁగాని, యితఁడు ప్రత్యేకముగ పరిశ్రమించినట్లే తో(పదు. అచ్చులకును 'హాకార 'య'కారములకును గల భేదమును పలుమాఱీతఁడు గమనింపలేదు. 'సమశివయనపచ్చు నారాయణనవచ్చు' (2159) ఇత్యాది నిరర్గళ ప్రయోగములు పెక్కులు గలవు. ఇక అసభ్యములగు పదములు, అర్ధములు లెక్కలేనివి.

ఇఁక సామాన్య ప్రజకు బహిరంగము ముఖ్యము. దేవళ్లపగోపురముల యెత్తు, దేవతకుఁగలనవరత్నాల సొమ్ములు, పూజారి మెడలోని తావళములసంఖ్య మొదలగు వానినిజూచి వానిమాహాత్మ్యమును వీనిభ క్తిని నిర్ణయించువారు వారు. ఇట్లు కవి వ్రాసిన పద్యములు గూడ శుద్ధమైనభాష, పందెపు గుఱ్ఱము నడకవంటి ఛందస్సుఁ గలిగి, అనుప్రాస యమ కాదులతో సభామందిరమును గడగడలాడించు నిట్లున్నది బలే యని మెచ్చుకొందురు. వేమనకవిత్వమందది యొక్కడిది?

మఱియు సామాన్యముగ కవిత్వమును విని సంతోషించు ప్రజలు రెండు తెగలుగా నుందురు ; పరులకు దాసులు ; స్వయంచానులు. మొదటి తెగవారు పామరులు. వీరెక్కువ చదువుసంధ్యలు నేరనివారు గావున, సామాన్యముగ మనసును తటాలున పట్టి యిూడ్చు వేమనవంటివానికవిత్వమునకు లొంగి లోలోపల నంతోషించినను, రాజసభలలోని పద్యాల పందెములో ఎదుటివారిని పరాభవించి, గండపెండేరములను బహుమానముగాఁ బడసిన బిరుదుకవులను జూచి బెరగై, వారినే సరస్వతియపరావతారములని పొగడి తప్పించుకొందురుగాని, వారితో వేమనను పోల్చిచూతమను ధైర్యమే వారికుండదు. సభలోనందఱు మహావిద్వాంసు లంగీకరించినవానిని కాదనుటకు ఈ నిరక్షర కుక్షుల కధికారమేమున్నది? ఆ విద్వాంసులే రెండవతెగవారగు స్వయంచానులు. ఏ కాలమందో యే కారణము చేతనో మనసులో నిలిచిన సిద్ధాంతములను యుక్తమా కాదా యని చర్చింపక ఆవియే సత్యములనియు తక్కినవి అసమంజసములనియు నిర్ణయించువారు వారు. కవిత్వమునందు దోషములు, గుణము, అలంకారములు, రసములు, కథలు, పాత్రములు, వర్ధనములు మొదలగునవన్నియు ఇట్టివనియు ఇన్ని యనియు నిస్సంశయముగా ఏర్పఱుచుకొనినవారు కావున, ఆ నియమములను స్వల్పముగా మీఱియున్నను గ్రంథకర్త తలవంచుకొని తిద్దుకొనవలయును; లేదా, సభ విడిచి నిరాశుఁడై పోవలయును. ఇంతేకాని వీరొక మొట్టును క్రిందికి దిగరు; దిగుట శాస్త్రప్రకారముతప్పనిమాత్రమే కాదు; దిగవలయునను అక్కరయే వారికి తో(పదు. ఇ(క పైవిషయములలో తెగిన గాలిపటము వంటి వేమన్నను వీరు కవియని యెట్లు పిలిచి సంభావింతురు.

ఇట్లు " శృంగేరీ బహిరస్మాకం వయంశృంగేరిణి బహిః ? అన్నట్లు విద్వాం సులు వేమన్నను గమనింపలేదు. వేమన్న విద్వాంసులను గమనింపలేదు. వేమన ప్రాచీనపురాణ కవుల రచనలను చదువుకొన్నవాఁడే కాని తరువాతి ప్రబంధకవుల దారి యత(డెఱుఁగఁడని మొదలే విన్నవించితిని. విద్వాంసులట్లు కాక, అక్షరాభ్యాస మునకు తరువాత కొన్నాళ్లు 'రఘువంశము', 'భారతము' మొదలగు మృదు కావ్యములను చదివిన శాస్త్రముచేసి, తరువాత 'నైషధము', 'వసుచరిత్ర ........మొదలగు ప్రౌఢ గ్రంథములలోఁ బడి మెదిలినవారు. ఇట్లు నిన్న మొున్నటి వారి కవిత్వములే చదువుకొని ప్రాచీనకవుల మార్గము లెఱుఁగక, తనకవిత్వమునందు తప్పలు పట్టు విద్వాంసులను లక్ష్యముచేయవలసిన యక్కర వేమన్నకు తోఁచలేదు. అతడు సుఖముగా ఇంటిలోనో, లేక యే చెట్లు క్రిందనో కాలుమీఁద కాలువేసుకొని : యిట్లన్నాడు.

              "ఆ. ఆదిమకపులవలె అల్పుండు తానెఱిగి
                   చెప్పలేఁడుగాని తప్పు బట్టు ;
                   త్రోయనేర్చుకుక్క దొంతులు బెట్టునా ?.." (ఓ. లై., 13-3-19)

కాని, యెన్నటికై స తనమాటలవిలుప నర్ధముచేసికొని యuగీకరింప వలసిన వారు పండితులే యగుదురుగాని, పామరులకంత సాధ్యముగాదని వేమన్న యొఱుఁ గక పోలేదు. చూడుఁడు : '

              "ఆ. వేము(డిట్లు చెప్ప వివరపువాక్యముల్
                    వేము(డిట్లు పోవు వెఱ్ఱిపోక,
                    పామరులకు నెల్ల ప్రతిపక్షమై యుండు
                    పండితులకు నెల్ల పరము వేమ" (ఓ. లై., 12-1-30)

చదువుకొన్నవారెల్ల పామరులనియును, చదువనివారే పండితులనియు వేమన్న తల(చెనని యూహింప సాధ్యముగాదుగదా? అట్లే అప్పటికిని ఇప్పటికిని చదువు కొన్నవా రితని కవిత్వపు విలువకు లొంగియే యున్నారు. జీవితమునం దితని పద్యముల నుపయోగింపని పండితుఁ డాంధ్రదేశమం దున్నా (డా ? వేమన్నను కవి యని బాహాటముగాఁజెప్పక పోవచ్చును : ఎఱుఁగకయు పోవచ్చును. అందుచే నతనికి బిరుదు బహుమానములీయక పోపచ్చును.దానికి కారణము వేఱు. కష్టపడినవారు కష్టముసకు వెలయిత్తురు.. నైషధమువంటి 'యౌషధ' కవిత్వమును అర్ధముచేసికొనుటకై తలపగులగొట్టుకొను నోర్పును సంపాదించుకొన్నవారు, మెదడున కేమాత్రమును శ్రమనియ్యని మెత్తని వేమనపద్యములపంటి వానిపై నెక్కువ శ్రద్ధపుచ్చుకొనుట సహజము గాదు. మిరియపకాయల మద్దయగు " గోంగూరపచ్చడి " తిని జీర్తించుకొనఁగల గుంటూరి వారికి ఆదివడ్డించినపుడే నోట నీళ్ళూరును; కాని వారికి పాలు పెరుగు రచింపదా ? వానిని వారు వదలిరా ? మఱియు పదార్ధమెంత విలువయైనదో యది యంత సులభముగా దొరకవలయు ననుట సృష్టి ధర్మము. ఎంతసులభమో యంత దానికి వెలతక్కువ యనుట యర్థశాస్త్రసిద్ధాంతము. గాలివంటి యమూల్యపదార్ధము మసకు సులభముగా లభింపకున్న మసగతియేమి ? సులభము గావుననే దానికి వెలయిచ్చువారెవరు? వేమనకవిత్వము గాలి వంటిది. అది దూరని చోటులేదు; దొరకని తావులేదు. కావుననే యుందఱును దాని నుపయోగింపక తీఱదైనను అతనిని పిలిచి మహాకవివని మర్యాదచేయుట కెపరికిని కాఁబట్టకపోయినది.

ఇట్టి సర్వవ్యాపిత్వమును వేమన పద్యములకు సంపాదించి యిచ్చిన కవితా గుణములేవి ? ఈ ప్రశ్నను తడవుటకు ముందు 'కవిత్వమనఁగా ఏమి? కొంత విచారింపవలసియున్నది. కాని కవిత్వము పరబ్రహ్మమువలె మాయతో నిండిన వస్తువు. ఉన్నదని భావింపవచ్చునుగాని చేతికి స్పష్టముగా దొరకునది కాదు. ఎందుకో మహామహు లెన్నియో విధముల దీనికి లక్షణము వ్రాయ బ్రయత్నించిరి గాని, యూ కవితాదేపత యందఱను చేతికందక నిలిచి మన ప్రక్క చూడ్కినిగిడించి యింకసు నవ్వుచునేయున్నది.మఱియు లక్షణమెప్పడును బహిరంగము లను తెలుపఁగలదుగాని యంతరంగమును దెలుపుశక్తి దానికి లేచు. మల్లెపూవును ఎన్నఁడును చూచి యెఱుఁగని దానికి దాని స్వరూపమును దెలుపుటకు ప్రయత్నించిన వారేమి చేయఁగలరు? రేకులు, కాఁడ మెదలగు వాని సంఖ్య, కొలత వన్నె మొదలగసవి యిట్టిపని చెప్పవచ్చును. కాని యితర పుష్పములం దెందును లేని దాని పరిమళము ఇట్టిదని పర్ణించిచెప్పి యొప్పించుటయెట్లు ? ముక్కుగలవాఁడు దానిని సాక్షాత్తుగా మూర్కొన్నప్పడు తప్ప తక్కినయే మార్గముచే నేవిధముగాఁ జెప్పినను వాని కది యర్ధముగాదు; ప్రతిపదార్ధముయోక్క తత్త్వమును ఇట్లే. సాక్షాత్తుగా అనుభవించిన వారికి అనుభవింపఁగల వారికిఁ దప్ప తక్కినవారి పాలికి లేదు. కవిత్వముగూడ నట్టివే. కాని తా ననుభవించిన వస్తువును అంగాంగములు పరీక్షించి యిదియిట్టిదని లక్షణము నేర్పఱుపఁ బ్రయత్నించుట మానవ స్వభావము. కాని యొంత ప్రయత్నించినను బహిరంగములు దాఁటి లోతుగా దిగినవారు లేరు. ప్రకృతము మనముగూడ నంతే చేయఁగలము.

సామాన్యముగ ఒక వస్తువును గూర్చి తనకుఁ గలుగు భావములను భాష మూలమున ఇతరుల మనసు కెక్కునట్లు వెలువఱించుట కవిత్వ మనవచ్చును. అనఁగా, భావించువాఁడు, అతని భావము, దానికి విషయమైన వస్తువు, దానిని వెల్ల డించుభాష, దానిని విని గ్రహించు సభ్యులు—ఈ యైదును కవిత్వసృష్టి యందలి పంచ మహాభూతములు. ఈ యైదింటిలో ఏది లేకున్నను కవిత్వము కొఱగాదు. కవిలేనిది కవిత్వముండదని చెప్పఁబనిలేదుగదా? అతనికి భావము లుండవలయును. భావమనఁగా పదార్ధములయొక్క స్వరూపజ్ఞానముగాని, యిదిమంచిది చెడ్డదియను నభిప్రాయముగాని కాదు. మఱి విషయమును గూర్చి మనకుఁగలుగు ద్వేషము, కోపము, అసూయ, అసహ్యము, ప్రేమ, భక్తి మొదలగునవి భావములనఁబడును. దొంగను ఉదాహరణముగాఁదీసికొందము-ఈ యనంతపురము సీమలో ప్రసిద్ధుఁడై యుండిన గజదొంగ 'నామాలసింగఁడు." వానినిగూర్చి చెప్పవలసినప్పడు వాని ఒడ్డు, పొడువ, వన్నె, కులము, భాష, ఆయుధములు మొదలగు వానిని కన్నులు మూసికొని చెప్పుట, వానిని గూర్చిన మన జ్ఞానమును తెలుపును. ఆతని వలన దేశమున కెంత నష్టకష్టములైనవో గమనించి యతఁడు చెడ్డవాఁడని తీర్మానించి చెప్పట యభిప్రాయము. ఈ రెండు సందర్భములందును కవిత్వమునకు చోటు లేదు. ఇదిగాక, అతనితో దెబ్బలు దోపులు దిన్నవారి కతనిపై కోపము జనించును : అతని సాహస కార్యములు చూచిన కొందఱి కాశ్చర్యము మెప్పును గలుగును. ఇత్యాదులే భావములు. ఇవిలేనిచోట తత్త్వశాస్త్రము, నీతిశాస్త్రము ఉండఁగలవే కాని కవిత్వముండదు. కావున కవిత్వముసకు భావములు ప్రాణముల వంటివి. ఇ(క భావములకు ఆధారమగు విషయము, దానిని వెలువఱుచుభాష కవిత్వమున కావశ్యకములని చెప్పనక్కరలేదు. ఐదవ మహాభూతము విని సంతసించువాఁడు. హృదయమున జనించిన భావములను ఎవరు విన్నను వినకున్నను బైలు పెట్టుట మనుష్య సామాన్య ధర్మము గావున, కవిగూడ నట్లే తన కొఱకే వ్రాసికొని మూసి పెట్టుకొనవచ్చును గాని యిది కవిత్వమగునా కాదాయని చర్చింపవలసిన, విని సంతోషింపవలసిన, మనములేకున్న, దాని పాలికి మన మెట్లు లేమో యట్లే మన పాలికదియులేదు కావున, కవితా సృష్టియందు సభ్యుడొక యావశ్యకమైన వస్తువే యని చెప్పక తీఱదు.

పైని యైదు వస్తువులలో భావము, విషయము అను రెంటిని గూర్చి మనకు చింతపనిలేదు. ఏ భావమైనను, ఏ విషయమును గూర్చియైనను కవికుండవచ్చును. కవికి, తానే సాక్షాత్తుగా చెప్పనప్పడు, మృదువులగు ప్రేమ, భక్తి, మెప్పుమొదలగు భావములే యుండవలయును కాని, తీవ్రములగు ఆసూయ, ద్వేషము, అసహ్యము, క్రూరత మొదలగునవి యుండరాదని కొందఱు తలఁతురు. నేనును ఇట్లు తల(చి యుండిన వాఁడనే. కాని యది పొరబాటు. కావ్యమునందు అన్ని భావములును హృద్యములుగానే యుండును. మనకు దేనిపై కోపమో ప్రీతియో కలదో దానిపై కవికిని అట్లేయుండపలయునని తలఁచుట యన్యాయము, అసాధ్యము. మనకుఁ గావలసినది ఆ భావమును కవియెంత నిజముగా తీప్రముగా తాననుభవించి, మసల ననుభవింపఁ జేసినాఁడనుటయే కాని వేఱుకాదు. ఇట్లే కొందఱు కవిత్వమునకు విషయములైన వస్తువులను నియమింప బ్రయత్నింతురు. ఇటీవల మోటారుబండ్లు, సిగరెట్ల మొదలగువానిని గూర్చి కూడ చేశాంతరములలో కవిత్వము బయలు దేఱుచున్నదనియు మన దేశమున కట్టియవస్థ రానీయరాదనియు వారు హెచ్చ రింతురు. నాకు మోటారుబండి శబ్ధముపై అసహ్యము. దాని వేగముపై ప్రతి. కావున ఈ భావములను బైలుపఱుచుచు పద్యములు నేనేల వ్రాయరాదు. మద్యమునుగూర్చి కాళిదాసు మొదలగు వారందఱును కమ్మని పద్యములు వ్రాసి యుండఁగా సిగరెట్లు చేసిన తప్పేమి ? భావము లిట్టివే కావలయునను నిర్బంధము లేనప్పడు విషయములకు మాత్రమేల నిర్బంధము ? ఎట్లు నిర్బంధింపఁ గలము?

తక్కిన కవి, భాష, వినువాఁడు అను మూఁడు పదార్ధములలో ప్రతియొక్క టియు కొంత విశేషధర్మము గలిగియుండవలెను. ఎవఁడైనను ఎట్టి భాషలలో వ్రాసినను ఆది యెవరిమనసున కైనను ఎక్కును అని చెప్పలేము. కవిత్వమందలి ముఖ్యజీవథర్మము ఇతరుల మనసు కెక్కుట, అదే మన కర్ధముగాని రహస్యము. 'ఇట్లు వ్రాసినదానిని విని మే మానందింతు మని శాస్త్రము వ్రాయుట యెవ్వరికిని సాధ్యముగాలేదు. అట్టి ఆకర్షణశక్తి యెవడో యొకనికి దేవుఁడు ప్రాసాదించి యుండును. అట్టివాఁడు తప్ప తక్కినవారు కవులు కా(జాలరు. అతఁడే తనకుఁ గావలసిన విషయములవలె తన భావములను వెలువఱచు భాషనుగూడ ఏఱు కొనును, స్థూలముగాఁ జూచిన, సంగ్రహము, స్పష్టత, సరళత మొదలగునవి కవిత్వభాష కుండవలసిన ప్రధానగుణములు, వినువారు సహృదయులుగా నుండ వలయును. అనఁగా, కవికెట్టి హృదయముగలదో యట్టిది కలవారనుట, హృదయ మందు జనించు భావములను ఏకారణము చేతనైనను అడఁచిపెట్టుకొని, క్రమ ముగా భావించుశక్తినే యనేకులు చంపుకొని యందురు. అట్లుగాక యేభావమైనను సంపూర్ణముగా ననుభవించు సహజమైన హృదయసత్వము గలవారు సహృదయులు. ఇట్టివారు కవిత్వమును విన్నప్పడు తమ హృదయమును మఱచి కవి హృదయముతో చూడఁగల్గుదురు. అనఁగా, కవిత్వమును విని యానందించుటకు అహంకారము పనికిరాదన్నమాట. అహంకారమనఁగా గర్వము కాదు. నేను, నాది, నా భావము, సిద్ధాంతము, అనునట్టి జ్ఞానము. అది యుండువఱకును కవి యేమి చెప్పినను అది నా కేవిధముగా నన్వయించును, నా యభిప్రాయముల కనుకూలముగా చెప్పి నాఁడా లేదా" యను దృష్టికలిగి, దానికి తగినట్లు మనకు సుఖమో దుఃఖమో కొపమో అసహ్యమో కలుగును. వేమన్న సమాధినుండి లేచివచ్చి, నాయకా యుపన్యా సములను విని వెక్కిరించి వేళాకోళముచేయుచు చక్కని పద్యములు రచించి నా మొగము ముందఱనే చదివినాఁడనుకొందము. అప్పడు నా యందు సహృద యత్వము గలదేని, అది యెందుకైన తరమగునేని, వేమన వెక్కిరింపులచే నాకుఁ గలుగు అవమానము, నిరాశ మొదలగు అహంకార గుణములను మఱిపించి, అతని పద్యమలందలి కవిత్వపు చక్క_cదనమును మాత్రము నేను గ్రహించి సంతో షించుసట్లు చేయవలయును. అనఁగా, కవిత్వమునకు విషయమైన వస్తువు పాలికి కవిత్వములేదు. చంద్రుఁడు, మల్లెపూవు మొదలగు జడవస్తువులపై నెంతమంచి కవిత్వమును వ్రాసినను అవి యెట్లు దాని సౌఖ్యము సనుభవింపలేవో యల్లే మనపై వ్రాసినను, మనము మనమైయుండు వఱకును, దాని మాధుర్యము నెఱుఁగలేము. అట్లుగాక మన యభిప్రాయములు, భావములు మఱచి కవితో నేకీభవింపఁ గలమేని, అప్పడు, ఇట్టిదని నిర్వచింపరాని యొక యూనందము కలుగును. ఈ యూనందము ప్రత్యక్ష సిద్దమే కాని, ప్రమాణములతో స్థాపించి చూపుట సాధ్యముగాదు. ఇట్లు కవితా ప్రపంచమందును మమతా పరిత్యాగ పూర్వకమైన సాయుజ్యమే మోక్షా నందమునకు కారణము.

ఈ సాయుజ్యమును గలిగించుటకు ఛందస్సొక గొప్ప సహకారి వస్తువు ఛందస్సునందు ముఖ్యముగా నుండు (ఉండవలసిన) గుణము లయము. లయ మనఁగా, ఇక్కడ, క్లుప్తమైన కొలఁతగల యొక విధమగు శబ్దముల నడక, దీనికి తక్కిన యే పదార్థముల సాహాయ్యమును లేకయే మనలను మఱపించుశక్తి కలదు. మనము ఏపని చేయుచున్నను, ఎక్కడనో యొక మూలలో వినవచ్చు మృదంగము తప్పెట మొదలగు వాద్యముల లయప్రకారము వేరైనను ఆడించక యుండలేము. మనకన్న నాగరకత తక్కువగలవారు దాని వెంట నిస్సంకోచముగా నాట్యమే చేయుదురు. తీవ్రమైన భావమునకు, దానిని వ్యంజించు భాషకు తోడుగా నిదియు చేరెనేని 'చిచ్చునకుఁదోడు కరువలి వచ్చి' నట్లేకదా ? కావుననే కవిత్వము యొక్క పరిపూర్ణ ఫలము పాటలందు పద్యములందు లభించునంత వట్టి గద్యమందు లభింపదు. గద్యమందు కవిభావములు కవిభాషయు నుండవచ్చునే కాని, వానిని స్పష్టముగా పట్టిచూపు పంజరముండదు. అది యుండనిండు.

కవిత్వస్వరూపమునుగూర్చి నేఁజెప్పిన పైవిషయములలో క్రొత్తది యేమియు లేదు. కాని యందులో నొక విషయమును మాత్రము ముఖ్యముగా నొత్తి చెప్పుట కింత వ్రాయవలసెను : అది వినువారి యహంకార త్యాగము. వేమననంటి స్వతంత్రుని కవిత్వమందలి మాధుర్య మనుభవించుట కదిలేనిది సాధ్యముగాదు. వేమన పెక్కు బండబూతుపద్యములు వ్రాసెను. అట్టి పదములు మననిట నుచ్చ రింపరానివను భావము మనము మఱచిపోవఱకును వాని యందలి కవితా ధర్మము మనకు గోచరింపదు. వేదముల కాలమునుండి మనలో బూతులున్నవి. మనలోనే యేల ? అందఱియందును గలవు. కామాతురులును, వారిని ఖండించు వారును అన్ని భాషలందును బూతుకవిత్వమును వ్రాసినవారే. నేఁటికిని అట్టి వ్రాయువారు, విని సంతసించు వారును విద్యావంతులలోనే కలరు. కాని వానిని బైలుపఱుపరాదను భావము ఇప్పడు బలమగుచున్నది. అంతమాత్రముచేత అది కవిత్వము కాదనలేము.

కాని, యెవ్వరికిఁగాని * తాను' అను పదార్థ మొకటి యుండువఱకును అది పూర్తిగా లేదనుకొని మఱచిపోవుట యసాధ్యము. ఇతరులను మఱపించి వశము చేసికొనుటయే ప్రధాన ధర్మముగాc గలిగిన కవిగూడ నీ తత్త్వమును మఱవరాదు. ' నేను' అను నీ యహంకార ముండువఱకును, ధర్మము, నీతి మొదలగు వానిని గూర్చి బుద్ధిచే నేర్పడిన సిద్ధాంతము లెప్పుడును మన వెంటనే యుండును. కవికిని మనకును హృదయసత్వ మొక తీఱుగానుండి యూ కారణముచేత అతనియలదు జనించిన ప్రేమశోకాది భావములు మన హృదయమునందును ప్రతిబింబింప వచ్చును గాని, యిరువురి బుద్ధులు, అనుభవములు వేఱువేగుటచే అతని సిద్ధాంతములన్నియు మన మంగీకరింపలేము. చూడుcడు. వేమన్న యిట్లు వ్రాసెను:

               "ఆ, సతులఁ గవయనేల? సుతులఁ బడయనేల ?
                    వెతలు పడఁగనేల? వెఱ్ఱితనము :
                    నేలమీఁదిరాయి నెత్తికెక్కినయట్లు." (3827)

ఈ సిద్ధాంతమును మనలో నంగీకరించువారెందఱు ? నూటికొక్కరు గలరా? కాని యీ పద్యముఁ జదువునపుడు అతని హృదయమందు గల సంసారము మీఁది యసహ్యమను భావము క్షణమాత్రము మన హృదయములందును సంక్రమించును. అంత మాత్రమున వెంటనే మనము కావిబట్టలు కట్టుకొస(బోము. కవి కవిత్వ మింతటితో చరితార్థమైనది. కవి సిద్ధాంతములు మన యభిప్రాయములును ఒకటిగా నుండెనా యట్లుండువఱకును అతని భావము మన హృదయమున నిలిచియుండి ఆ పద్యము పలుమాఱు జ్ఞప్తికి పచ్చను.

ఇట్లు కవి యభిప్రాయము లన్నియు మన మంగీకరించుట కవకాశ మియ్యని, బుద్ధి, అనుభవము మొదలగువాని భేదమట్లుండఁగా, వీనికన్నను బలవంతముగా నుండి మనుష్యులనహంకార త్యాగముచేయనియనివస్తువు వేరొకటి కలదు. అది నాగరకత. మనవేషము, భాష, నడత మొదలగు వాని స్వరూపము నిది నిర్ణయిం చును. అనేక కారణములచేత ఆప్పడపుడు నాగరకతకు సంబంధించిన యభి ప్రాయములు మాఱును. మన పూర్వికులు మగవారికిఁగూడ ఎలతేఁటి చాటులన బమ్మెరవోవఁదోలు తెగఁ బారెఁడు వెండ్రుక"లున్న నలంకార మనుకొనిరి. ఇప్ప డాఁడవారికిఁగూడ వెండ్రుకలెంత కుఱచగా కత్తిరించుకొన్న నంత నాగరకత యను భావము వ్యాపించుచున్నది. ఇటైనను మనము నీతిని ధర్మమునైనను వదలదుము గాని యనాగరకులముగా బైటవర్తింప నిష్టపడము. ఇతరులు మనలను నాగరకు లనవలెనను నాశతో మన మెంతో కష్టపడుదుము. అసత్యమునకైనను అంగీకరించి తిట్టవలసిస వానిని సభలో పొగడుదుము. కాబట్టి, కవి యొక్క పద్యములం దనాగరకపుమాటలు-అనఁగా, మన కాలమున నట్లు తలఁప(బడినవి. ఏమాత్ర మున్నను, అవి తటాలున అతని కవిత్వముచే మనకుఁ గలుగు మఱుపును మఱపించును. అభిప్రాయము వేరైనంతకష్టములేదు. వేమన పద్యములు ప్రజలయందీ నాగరకదృష్టిని పలుమాఱలు గమనింపక వ్రాయ(బడినవగుటచే వాని వ్యాప్తికిఁ గొంత విఘ్నము కల్గినదని వెనుకనే చెప్పితిని. కావున కవి సహృదయు లిరువురు పర స్పరము సర్దుకొనపలసినవారు. వీరిసామాన్యస్వభావము గమనించి మన్నించుచు అతడు తన స్వాతంత్ర్యమును కొంత వదలుకొసవలయును ; అతనియందలి విశేష గుణమువలని యానందఫల మనుభవించుటకై వీరు తమ స్వత్వమును చాలవఱకు త్యాగము చేయవలయును. వేమన్న తనధర్మము నిర్వహించుటలో కొంత యుదా సీనము చూపెను ; ఇప్పడతనిఁ దిట్టి ఫలములేదు. మనమును అతఁడు మాజాతిని దిట్టినాడని, మా పద్ధతులు తిరస్కరించినాఁడని, మా కసహ్యమైన యనాగరికపు మాటలుచెప్పి నాడని, మఱచిపోలెక మననము చేయుచుంటిమేని, యతని యసా ధారణ కవిత్వమునుండి కలుగఁగల యూనందమును లాభమును పోఁగొట్టుకొనిన వారమగుదుము.

వేమన కవిత్వమండలి యసాధారణుగుణములలో ముఖ్యమైనది భావముల తీవ్రత. అవి యంత తీవ్రముగా నుండుటకు కారణము ఆ భావము లతనివే కాని యితరులవి కాకపోవట, మనుష్యులలో ననేకులు ఎప్పడును ఇతరుల భావము లను తమపై నారోపించుకొనువారే. పదార్ధములు మంచివి చెడ్డవి యను సభిప్రాయ ములను అందఱును తమంతట పరిశీలించి యేర్పఱుచుకోలేరు. కావున "ననేక విషయములలో మన మితరుల యభిప్రాయములే యనువాదము చేయవలసి యున్నది. వంకాయ ఆరోగ్యకరమగునా కాదా యను విషయమున సామాన్యజను లందఱును వైద్యులయభిప్రాయమునే నమ్మవలయునుగదా ? కాని యది నా నాలుకకు రుచించునా రుచింపదా యను విషయమున(గూడ యితరుల మొగముఁ జూచి చెప్పవలసివచ్చెనేని, తక్కిన వెట్లైనను కవిత్వమున కది ప్రళయకాలము. ఈ విషయమున ప్రాచీనకవుల పారతంత్ర్యమును మొదలే విన్నవించితిని. ఇతరులకై వారు వ్రాసిన గ్రంథములలోనెల్ల సగానికి నగము కవిత్వము సున్న. ప్రాచీనులలో ననేకులు కవులనుట, వారి గ్రంథములకంటె, చాటు పద్యములలో నెక్కువగాఁ దోఁచును. అల్లసాని పెద్దిరాజు, తన ప్రభువగు కృష్ణదేవరాయలను మనుచరిత్రము పీఠిక యందెన్నియో తెఱఁగుల వర్ణించి, తనకతనియెడఁగల మొప్పు గౌరవము, ప్రేమ మొదలగు భావములు ప్రకటింపఁ బ్రయత్నించెను. కాని రాయల మరణానంతర మింటిలో మూలఁగూర్చుండి యేడ్చుచు చెప్పిన “యెదురైనచో తన మద కరీంద్రము డిగ్గి" అను పద్యము మన మనస్సులను గరఁగించినట్లు పై పీఠిక పద్య ములలో నొక్కటియును జేయఁజాలవనుట సహృదయ వేద్యము. కారణమిది శోకము పొంగిపొరలివచ్చునపుడు తనకొఱకే వ్రాసినది. అవి రామరాజభూషణముఁడు, రామభద్రుఁడు మొదలగువారి మొగములు చూచుచు వ్రాసినవి. ఈ దోషము ఆధునిక కవులలోను అనేకులకు కలదు. విచిత్రములయిన కల్పనలు చేయగల వాఁడు కవియని యిూ కాలపువారు తల(ప(గా, విచిత్రములైన భావములను జూపు వాఁడు కనియని యూ కాలపువారు తలఁచుచున్నారు. భరతమాత రాటము, రాధా కృష్ణులు మొదలగు విషయములఁ గూర్చి యీ కాలమున బయలు వెడలుచున్న యసంఖ్య పద్యములలో మక్కాలుమ్మువ్వీసము కవిత్వము సున్న. వీరుచూపు భక్తి, ప్రేమ, శోకము మొదలగు భావములన్నియు :సొంతముగా హృదయమం దుద్భవించినవిగాక, యే రవీంద్రనాథుని నుండియో, యే సరోజినీదేవినుండియో యెరవు తెచ్చుకొన్న పగుటచేత, ఈ పద్యములు, చిన్నబిడ్డలాడు నాటకములవలె కొంతవఱకు వినోదముగాను చాలపరకు అసహ్యముగాను ఉండును. వేమన యందిట్టి భావదాస్యములేదని వేఱుగ చెప్పఁబనిలేదు.

ఎప్పడు భావమిటు సహజమయ్యెనో, యుప్పడే భాషకొకవిధమైన బిగువును బలమును గలుగును. అది కృత్రిమమైన నిదియు సడలి తేపలుగా నుండును. భావము నిండు కడవవంటిది. భాష దానిని పైకీడ్చు త్రాడు. అసలు కడవయేలేని వట్టిత్రాటిని ఎంత నెమ్మదిగా నీడ్చినను అది చక్కగా దృడముగా మీఁదికి రాదు. ఊ(గులాడును; పరులుపడును; చే(దువానికి చేఁదునట్లే తో(పదు. అట్లే భావ దార్థ్యము లేని భాషలో ధారయుండదు ; పదముల చేరిక యొగుడుదిగుడుగా నుండును ; కంఠపాకమనుపించును గాని కవిత్వమనిపింపదు ; అధికపదములు దొర్లను. నాకుఁ జూడఁగా కవిత్వమున అపశబ్దములకంటె అధికపదములు గలుగుట పెద్దదోషము. అపశబ్దముచే వైయాకరణుల ముఖము చెడునుగాని కవి భావము చెడదు. అధికపదములచే తప్పక చెడును. తీవ్రమైన భావములు గల వానికే యట్టి తొడకులేని భాష వెడలఁ గలదు. అనగా, తీవ్రమైన బావములు వారికెల్ల అట్టి భాష వచ్చునని కాదు. అసలు కవి సృజింపఁబడినవానికే యీ న్యాయ మన్వయించును. తీవ్రమైన భావములు మనుష్యుల కందరికిని కలవు; కాని యా భావములను బైట బెట్టవలసినప్పడు మనకందరీకిని వచ్చునది కవిత్వముగాదు-నత్తి, కొందరి కది నాలుకకే యుంటియుండును. మరికొందరికిది వ్రాతలోను గలదు. కవులనఁబడువారిలో ననేకులిట్టి నత్తివ్రాఁతవారే. బుద్ధిమంతు లైన వారి కీరెంటికీని మందొకటే : చేతనైనంతవరకును మౌనము వహించుట.

వేమన యిట్లు తీప్రములైనభావములు, అడ్డులేని నాలుక కలవాఁడు కావననే యతని రచససలో భావము భాష యీ రెండును ఒకటితో నొకటి పందెము వేసికొని కుప్పించి యెగిరిసట్లు, హృదయమునుండి పైకివచ్చుచున్నవి. ఈ వేగమును నిరోధించుటకు ఛందస్సు యతిప్రాసలు మొదలగు ఏ నిర్బంధములకును చేతఁ గాదు. ఇవి వానికి లొంగి సర్దుకొనవలసినవే కాని యవి దీనికి లొంగి కుంటుచు నడవనేరవు. కావుననే యందఱికివలె నీ నిర్బంధములు సంకిళ్ళవలెనుండక, ఇతని కవితకు కడియము లుంగరాలవలె అలంకారములైనవి. మఱియు, కొన్నిచోట్ల పై నిర్బంధములను విడిచి తెగించి వ్రాసినను, మఱికొన్నిచోట్ల లేని నిర్బంధములను కల్పించుకొని, యంతే ధారాళముగా వ్రాసి, వేమన విచిత్రములైన దొమ్మరి లఘువులను చూపుచున్నాఁడు. మనలో వృత్తిజాతులందలి యక్షరసంఖ్యానియమమును ప్రాసనిర్బంధమును వదిలి యతినిమాత్ర ముంచుకొన్న చిన్నసులభమైస పద్యము ఆటవెలదిగదా ? దానిలోను ప్రాసమును చేర్చుకొని యితఁడుచేసిన సరళమైన సాము చూఁడుఁడు : '

               "ఆ, చదుపులందు పాడి మొదవులందుసు స్త్రీల
                     పెదవులందు రాజ్యపదవులందు
                     ఆశలుడిగినట్టి యుయ్యలు ముక్తులు..." (1479)

                "ఆ, ఆకులన్ని దిన్న మేక పోతులకేల
                     కాక పోయెసయ్య కాయసిద్ధి ?
                     లోకులెల్ల వెట్టి పోకిళ్ళఁ బోదురు..." (223)

ఇతనియందలియర్థముగాని కవితారహస్యములలో ఈ ఆటవెలఁది యొక్కటి. ఇంత చిన్న వృత్తములో, అంతగొప్ప భావములను, యతిస్థానములు వదలక, వెనుక ముందు అతుకులు తిరుగుడులు లేక, కత్తిరించినట్లున్న శబ్దార్ధములతో, ఎట్లితఁడు అచ్చువేసినాఁడురా?" యను ప్రశ్న పద్యములు వ్రాయుటకు చేయివేసిన వారి నెల్ల తెగనిది. ఇతని పద్యములు చదివినతరువాతఁగూడ ఆటవెల(దిలో వ్రాసెద నని చేయి వేయువాఁడు నాకుఁ జూడఁగా వెఱ్ఱివాఁడు. శ్రీనాథుఁడపురూపముగా నిదేపద్ధతిలో ఒక యూ టవెల(ది చాటుపదము ; వ్రాసెను

             "ఆ. చిన్న చిన్న రాళ్ళు చిల్లరవేపుళ్ళు
                  నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
                  సజ్ఞజొన్న కూళ్ళు సర్పంబులును దేళ్ళు
                  పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు"

కాని యిట్టివి నాలుగైనను వ్రాయకమునుపే యతనికి రెడ్డిరాజుల ముందు సభామందిరములలో చేయెత్తిపాడుటకు తగిన సీసపద్యపు గాంభీర్య దైర్ఘ్యములపై మనసుపోయినది. ఒక్కొక్కరి కొక్కొక్క జాతిపద్యముపై సహజమగు నభిమాన ముండును. కాళిదాసు "మందాక్రాంత", భవభూతి 'శిఖరిణి", తిక్కన 'కందము" సుప్రసిద్ధములే. తెలుఁగువారిలో తరువాత కవిచౌడప్ప, సుమతిశతకకర్త మొద లగు శతక కవులనేకులు కంద మందభిమాన మొక్కువగా చూపి, చక్కని పద్యము లను వ్రాసిరి, అట్లే వేమన్నకును 'ఆటవెల(ది పై నభిమానము సహజభావములలో నొక్కటి. కాని కారణమును గలదు. తమ యభిప్రాయమును స్పష్టముగా చిక్కు లేక చెప్పఁగోరు వారెవరుగాని పెద్దపెద్ద వృత్తములను వాడరు. వానికి చేయివేయుట యేనుఁగును గట్టినట్లు: కడుపునిండ దానికి తిండి మొదగించుటయే పెద్ద కష్టము. కాఁబట్టి యే ఆకలములనో తెచ్చి దాని పొట్ల నింపవలసి యుండును. అర్ధభావము లకు మితియున్నదిగాని భాషకులేదు. కావున ఏవో బొద్దు అక్షరాలుశబ్దమలచెత్తను బేర్చి పద్యములు నింపవచ్చును గాని యసలు వస్తువు చెడక తప్పదు. వేమన యిట్లు మొదలు చెఱచు బేహారి కాఁడు. కావుననే తెలుఁగు ఛందస్సులలో నెల్ల చిన్నదియగు ఆటవెలఁది నితఁడు పరిగ్రహించె ననవచ్చును. కందములు, తేటగీతి మొదలగు పద్యములు గూడ నితఁడు వాడినాఁడు గాని వానిలో చాలవఱకు ఈముద్దు, ఈ చెక్కిన చక్కcదనము, ఈ బిగువు, ఈ లగువు లేదు.

దీనిలో ఇతఁడు యతికిచ్చిన మర్యాద, అందము, అద్భుతమైనది. ఆంధ్ర వాజ్మయములో యతిని పరస్పర విరుద్ధముగా విచిత్రముగా వాడిన వారిద్దఱు : మొదటివాఁడు తిక్కన సోమయాజి-యతి కావలసినవారు ప్రయత్నముగా నితని కవిత్వమందు వెదకి చూడవలసినదే కాని, యది తప్పక యందుండినను సామాన్య ముగ చేతికిఁ జిక్కదు. లయాను సారముగా పాదమధ్య మందొకచోట పదము నిలుచుట యతి యని ప్రాచీన నియమము. దానిని వదలుకొని తెలుఁగువారు, అట్టి చోట మొదటి యక్షరము మరల నావృత్తి కావలయునని యొక మొండి పట్టు పట్టుకొన్నారు. వారి పీడను వదలించుకోలేక తిక్కన, యది వచ్చినదనిపించి ముందుకు వెడలినాఁడు

                        "గురుభీష్మాదులు సూచుచుండ సభమీకున
                         గీడు నాఁడట్లు ముష్కరులై చేసిరి యంతచేసియు
                         పశ్చాత్తాపముంబొంద నోపర.."
                                                          (భారతము, ఉద్యోగపర్వము)

అనృపుడు, 'అప్పకవీయము" చేతలేనివారి కందలి యతి కాన్పింపదు. ఈ తప్పించుకొని తిరుగు కౌశల్యము తిక్కన కచ్చినట్లు మఱెవరికిని అబ్బలేదు. కాని యీ మార్గమే కొంత సులభమని తక్కిన వారందఱు నాతోవనే తొక్కి0. నేనెఱిఁగి నంతవఱకు వేమన్న యొక్కఁడే ఈ విషయమున తిక్కన కెదురు తిరిగిన వాఁడు. ఎక్కడికి యతి యుండవలయునో యక్కడికి పదమే కాదు, ఆభిప్రాయమును తెగి నిలుచును. వెంటనే ఆద్యక్ష రా వృత్రియు తడవుకో నక్కరలేక సిద్ధముగా దా(పురించును. లేదా ప్రాసము సిద్ధము. చూడుడు :

                       "ఆ. కడుపు బోరగించి కన్నులు ముకిళించి
                             బిఱ్ఱ బిగుసుకొన్న బీదయోగి
                             యమునిబారిగొఱ్ఱె యతఁడేమి సేయును." (873)

                       "ఆ. కోతి(బట్టి తెచ్చి క్రొత్తపట్టము గట్టి
                             కొండముచ్చలెల్ల కొలిచినట్లు
                             నీతిహీను నొద్ర నిర్భాగ్యులుందురు..." (1201)

ఇతని భావములెట్లు కృత్రిమములు కానివో యితని భాషయు నట్లే. ఇదే నిజమైన యచ్చ తెనుగు. ప్రాచీనులకు సంస్కృతమువలె, ఆధునికులకు ఇంగ్లీషు వలె, స్వభాషా స్వరూపమును జెఱచునట్టి రెండవభాష యేదియు వేమన్న యెఱుఁగ(డు. కావుననే, యోగరహస్యములను తెలుపుచు పారిభాషిక పదములతో నిండిన పద్యములు తప్ప, తక్కిస యేమాట చెప్పినను, తెలుఁగు మాటలాడ నేర్చినవాని కెవ్వనికిని ఇతని పద్యము లర్ధము కానివి యుండవు. గొప్ప తత్త్వవిషయములు చెప్పునప్పుడును ఇతని ధార యిట్లే యుండును. 'ఈ సౌలభ్యమందే అనన్య సాధారణమయిన యతని కవితాశక్తి యడఁగి యున్నది." తాను చెప్పు ప్రతి న్యాయము నకును ఒక యుపమానము తప్పక యుండును. ఆ యుపమానములు గూడ ఊహా కల్పితములు గాక, యింటిచుట్టుముట్టుఁగల వస్తువు లగుటచే, వాని సొగసును బిగువును అంద అనుభవించి యానందింతురు. ఇదివరకే యెక్కువ యుదాహరించి తిని ; కాని మణి రెండైనను ఉదహరింపక యుండలేను :

                 "ఆ, పనుల వన్నెవేఱు పాలేక వర్ణమౌ ;
                       పుష్పజాతివేఱు పూజయొకటి ;
                       దర్శనములు వేఱు దైవం బదొక్కటి..." (2480)

                 “ఆ. తల్లి దండ్రిచావఁ దానాలితో గూడి
                       యిల్లు కట్టియున్న యింపులెల్ల
                       కొఱితిమీఁది దొంగ కూడదిగిన యట్లు...? (1851)

ఇట్లు వ్రాయ గలవాని యభిప్రాయములతో మనమేకీభవించిన నేమి ? ఏకీభ వింపకున్ననేమి? ఒక మాఱు విన్న తరువాత పండితుఁడుగాని పామరుఁడుగాని దీనిని మఱవఁగలడా ! సంపఁగిపూవుల వాసన తలనొప్పి దేవచ్చును. కాని యేమి చేయఁగలము? ముక్కెంతపొద్దు మూసికొనవచ్చును ? కోపము వచ్చిన పెరటిలోని చెట్టును గొట్టివేయపచ్చును. కాని మైసూరుసీమలో నెక్కడికిఁ బోయెనను పూచిన సంపఁగి మాఁకులే ! వేమన సిద్ధాంతముల సంగీకరింపనివారి కతనితోడి బతుకును అంతే.

ఇతని కవిత్వముకు కొంత మఱుగుఁపెట్టి దానిని దుర్వారబలముగల దానినిగాఁజేసినది హాస్యము. మనలో నయము తోడి హాస్యములేదని మొదలే విన్నవించి తిని. నవరసములలో హాస్యమునుగూcడా జేర్చియున్నను, ప్రాచీసుల హాస్యము అసహ్యములును, అసభ్యములును వర్ణించుట యందు మాత్రము చరితార్ధమైనది. కావుననే హాస్యరస ప్రాధానములగు ప్రా చీన ప్రహసనములను చదువుట కిప్పటి నాగరకత గలవా రేవగింతురు. ప్రాచీన నాటకములలో కొంచెము నాగరకత గల హాస్యమును జూపుటకై యేర్పడిన పాత్రము విదూషకుఁడు. కాని వాని హాస్యము గూడ, ఎద్దు మొద్దుతనము, తిండిపోతుతనము-దీనిచే నేర్పడునట్టి అసహ్యపు నవ్వే. కాళిదాసు మొదలు ఇట్టి పద్దతిని కొంతవఱకు తప్పించి మాళవికాన్నిమిత్ర నాటకమున కొంత జాణతనము, చురుకుఁదసముగల విదూషక పా త్రమును తయారు చేసెను. సంప్రదాయజ్ఞలు దానిని ఖండించుటచేతఁ గాఁబోలు,తరువాతి నాటకములలో యాథాప్రకారముగా తిండిపోతు విదూషకునినే యుచ్చు గొట్టెను. తరువాతి వారు సరేననిరి. తెలుఁగువారమగు మనము ఆన్ని విధముల సంస్కృతము వానినే యనుసరించిన వారము. ఆ విదూషక పాత్రమే యట్లే చెక్కుచెదరక కీర్తిశేషులు శ్రీ కోలాచల శ్రీనివాసరావు గారు మొదలగు ఇప్పటి వారి నాటకములలోకూడా వచ్చినది. చక్కని హాస్యమును సృజించగల సామర్ధ్యములను విని కడుపునిండ నవ్వుటకు శక్తిగాని మనలోలేక పోలేదు.ప్రాచీన సంస్కృతాంధ్ర పండితులలో సభ్యుముగా వినువాని కడుపులు చెక్కలగునట్లు నవ్వింపఁ గల వారిని నే నెఱుఁగుదును. కాని వాజ్మయమును, జీవితమును వేఱుచేసికొన్న వారగుట చేత, పేనా పట్టుకొని వ్రాయ నుపక్రమించిన యెక్కడలేని బొమముడులును అపుడు మనవారికి దాఁపురించును. మఱియు, సంప్రదాయమున దాసులై యభిప్రాయములందును, భావములందును, స్వాతంత్ర్యము లేని వారివద్ద హాస్యమునకు అవకాశమును చాల తక్కువ. హాస్యముసకు మూల ప్రకృతి యితరుల యందలి తప్పలను బైలు వెట్టుట. అందును తప్పకలదను నభిప్రాయమే సామాన్య జనులకు లేనట్టి చోటులందలి తప్పను ఆకస్మికముగా బైటికిఁ దీసినపుడు హాన్యమునకు బలమెక్కువ. ఇట్టి సూక్ష్మదృష్టి గలవాఁడు తన యందలి తప్పలను గూడ గమనించి, చెప్పకొనక, తనలోనే నవ్వుకొనును. అట్టి చోట తమవేషము, భాష, ఆచారము, విద్య ఇత్యాదులన్నియు నిష్కల్మషములని నమ్మినవారికి, ఇతరులందలి తప్పలను గమనించు సామర్థ్యమో సంప్రదాయ మోయున్నను, ఆందుచే వారియందసహ్యము జనించి తిట్టఁగలరు కాని నవ్వింపలేరు. కావుననే మొన్న మొన్న వీరేశలింగము పంతులుగారి వ్రాఁతలు బైలు పడువఱకును తెలుఁగు భాషలో నయమైనహాస్య మపురూప మయ్యెను. వారి హాన్యమునందును సంఘసంస్కార దృష్టి ప్రబలముగా నా వేశించి, స్వదోష దృష్టి చాలవరకు తప్పించుటచేత, తిట్లు ఎత్తిపాడుపులును ఎక్కువై రసము చెడినది. ఒకరి తప్పులను బైటఁబెట్టిన దెల్ల హాస్యము గానేరదు. బైటఁ బెట్టుటలోఁ గూడ మార్గమున్నది. హాస్యమును గల్గించుటయు నొక శిల్పము. ఇటుక గారలతో మాత్ర మిల్లెట్లుగాదోయట్లే తప్పులు పట్టిన మాత్రమున నితరులు నవ్వరు. ఆ రహస్యములు శిల్పి మాత్రమే యెఱుఁగును. హాన్యమువలని ఫలము జనుల చిత్తసంస్కారమైనను అదే ముఖ్యోద్దేశముగాఁ గలవాని వ్రాఁతలో హాస్యముండదు; నీతిని బోధింప వలయుననియే పద్యములు వ్రాయువారి వాఁతలో కవిత్వములేనట్లు వారిదృష్టి యంతయు ఫలముమీఁద నుండునుగాని శిల్పముమీఁద నుండదు. వీరేశలింగము పంతులుగారి హాస్వరన మిందువలననే చెడినది. వారి ప్రహసనములను చదివి నవ్వుటకు సామాన్యముగా నాకు సాధ్యముగాదు. నిజముగా తెనుఁగుభాషకు మొట్ట మొదట హాస్యరసము చవిచూపిన ధీరుఁడు గురజాడ అప్పారావుగారే. వారి *కన్యాశుల్క' మందున్నంత హాస్యరస నైర్మల్యము తక్కిన యెవరిగ్రంథము లందును లేదనుట యతిశయోక్తి కాదు.

వేమన్నయు గొప్ప బోధకుఁడును సంస్కర్తయుఁ గావున అతని యందును హాస్యరసము కలుషితమై యున్నను, అందందు సహజముగా అసభ్యరచనలు చేసినను, తెగిన గాలిపటమువంటి స్వతంత్రబుద్ధి కలవాఁడు కావున, ఒక్కొక్క మాఱు తనపని తాను మఱచి స్వచ్చమైన హాస్యముతో తృప్తి కలిగించు కొనును'

                  "ఆ. పాలసాగరమున పవ్వళ్ళంచినవాఁడు
                       గొల్లయిండ్ల పాలు కోరనేల ?... "

యను ప్రశ్న వచ్చినది. తక్కిన సమయములందు ఇవన్నియు "బూటక పురాణ కథలు' (2752) అని చెప్పియుండును. కాని యిప్పడా యుద్రేకము లేదు. ఇప్పటి జవాబు వేఱు“

                  "ఎదుటివారి సొమ్ములెల్ల వారికి తీపు..." (2509)

ఇది విన్న వాఁడెంత కృష్ణభక్తుఁడైనను నవ్వక యుండలేఁడు. 'గొప్పగురువులు ఊళ్ళలోనుండరు గాని కొండ గుహలలోనుండును. వారి యాశ్రయములేనిది ముక్తి మార్గము దుర్లభము" అని యెవఁడో యన్నాఁడు. ఔను నిజమని వేమన్నయు నన్నాఁడు.

                   "ఆ, గుహలలోనఁ జొచ్చి గురువుల వెదకంగ
                        క్రూరమృగ మొకుడు తారసిలిస
                        ముక్తి మార్గ మదియె ముందుగాఁ జూపురా.." (1328)

సామాన్యముగా ఇతరుల లోపములనెత్తి ఖండింపఁబూను కొన్నప్పడు గూడ దాని కెంత గావయలనోయంతటితో తృప్తిఁబొందక, యితరులకు నవ్వు గలిగింప వలయునను నుద్దేశముచేతనే కొన్ని కొసరుమాటలుచేర్చి వ్రాయుట యితనిపద్దతులలో నొక్కటి, లోభివాని నడుగుట నిష్పలము : గొడ్డుటావును బితికినట్లు ; మేక మెడ చన్ను గుడిచినట్లు-అని చెప్పినఁజాలును గదా. ఇతని కంతటితో తృప్తిలేదు.

                      "ఆ. గొడ్డుటావఁ బితుకc గుండ గొంపోయిన
                            పండ్లు రాలఁ దన్ను; పాలనీదు
                            లోభివాని నడుగ లాభంబు లేదయా ..." (1333)
                      "ఆ. మేక కుతికఁబట్టి మెడచన్ను
                            గుడువఁగా ఆ(కలేలమాను నాశ గాక,
                            లోభివాని నడుగ లాభంబు గలుగునా ?..." (372)

ఇందు కుండఁగొంపోవట, కుతికఁబట్టుట మొదలగునవి పాలు త్రాఁగఁబోవు దాని యాత్రమును స్పష్టంగా జూపి, వాని యజ్ఞానమునకు మనల నవ్వించును.

ఈ హాస్యప్రియత్వమునకుఁ జేరినదే వేరొక శక్తి, యితనియందుఁ గలదు. అందరికిని దెలిసిన సామాన్యన్యాయమునే గంభీరముఖముతో రెండుపాదములతోఁ జెప్పి, మూఁడవపాదములో దానిని తలఁపని తలంపుగా క్రొత్తతోవకు తటాలునతిప్పి చెప్పట, ఉపవాసమున్నయెడల దేహమందు జీర్ణముగాని మలమలన్నియు జీర్ణ మగునని వైద్యశాస్త్రము. వేమన్నయు నిట్లే తన పద్యము మొదలుపెట్టెను.

                      "ఆ. కూడుఁ బెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని
                            భక్షణంబు చేయుఁ గుక్షిమలము..."

ఈ మాట విన్నవారు 'ఏమిరా ! వేమన్న ఉపవాసద్వేషియే. ఇంతలో తన యబిప్రాయమునువే మార్చుకొన్నాఁడా? అట్లైన మన శాస్త్రములు బ్రతికినవే !' యని నంతోషించునంతలోనే పిడుగువలె మూఁడవపాదము వెడలి పడి నిరాశ చేసినది.

                      కూడు విడిచి మలము గుడుచురా యుపవాసి..." (1157)

దీనిని విని మససు నొచ్చుకొనువారే యెక్కువయైనను నవ్వఁగల రసికులును కొందఱుందురు. కాని యోక్రింది పద్యమునువిని నవ్వనివారుండరు :

                 "ఆ, సకలతీర్ధములను సకల యజ్ఞంబుల
                       తలలు గొరుగకున్న ఫలము లేదు.
                       మంత్రజలముకన్న మంగలిజల మెచ్చు." (3772)

పై కవితాధార, హాస్యము - దీనికి తోడు ఇతని నామము నాంధ్రదేశమున నాచంద్రార్క స్థాయిగాఁ జేసినవి ఇతనినీతులు. ఇహలోకమున ఇతరులకును, తనకును సౌఖ్యమును గలిగించునవి నీతులని మొదలే విన్నివించితిని. కావున ఇతని నీతులును స్వార్ధములని పరార్ధములని రెండు తెగలగును, తత్త్వవాదము లకువలె ఇతని నీతులకును అనుభవమే మూలముగాని పుస్తకములుకావు. కావుననే యవి యప్పుడును ఇప్పడును అనేకులన్నట్లు, ఇతనికి పుస్తకములు వ్రాయుటకును ఇతరుల కుపన్యసించుటకును మాత్రము కావు. మంచిచెడ్డలను రెంటిని తాను జేసి యందలితత్త్వమును చక్కఁగా నెఱిఁగి, యితరులకు బోధించినవాఁడగుటచే సామాన్య నీతిగ్రంథములలోలేని తీవ్రత యితని పద్యములలోఁ గలఁదు.

                   "ఆ. విన్నవానికన్న కన్నవా(డధిగుంగు
                         కన్నవారికన్న కలియువాఁడు." (3522)

అను మాట యితని నీతులందును అన్వయించును. నీతులు పరార్ధములని స్వార్థములని రెండు తెఱఁగులంటిని. కాని యనేక ధర్మశాస్త్రకారుల మతము పరీక్షించిన నన్నియు స్వార్థములే యగును. పరోపకార మెందుకు చేయవలయును? అని యడిగిన నీకు పుణ్యము వచ్చునని వారందురు. పుణ్యమునకు ఫలము ఇహ పరలోకములందు సుఖము. ఇట్లే పరుల కపకారము చేసిన పాపము వచ్చును. ఫలము నరకాదులు, కావున ఇతరులకు సుఖము గలుగఁజేయుటకు తనకు దానివలన సుఖముగల్లునను నాశయు, దు:ఖము కలుగఁజేయకుండుటకు తనకు దానివలన దుఃఖము గల్లునను భయమును నీతి సామాన్యమునకు మూలముగా మనలో నేర్పడినవి. కావున పరార్థనీతులును స్వార్థములే. 'తనవలన ఇతరులు సంతోషించిన తనకు నంతోషము కలుగవలయును. దుఃఖము గలిగిన తాను దుఃఖింపవలయును" అను నుదారభావమును ప్రజలలో వ్యాపింపఁజేసిన నీతిగ్రంథములు ప్రాచీనులలో నరుదు. ఇట్టి స్వార్ధబుద్ధితోనే వారు ఘనమైన నీతి కార్యము లెన్నో చేసినారనుట సత్యమే. దానిచే సామాన్యముగా జనులలో నిప్పటికంటె నపుడు పరోపకారబుద్ధి యెక్కువగా నుండె ననుటయు నేను మఱచి పోలేదు. కాని తనపనిచే ఇతరులకుఁ గల్గు సుఖమునకంటె తసకు కలుగఁబోవు సుఖమునందే దృష్టి యొక్కువగా నుండుటచే, ఇట్టిపనులు నిష్కల్మషముగా తృప్తికరముగా నుండవు. ఇప్పుడు సర్కారివారి బిరుదుల నాశించి సత్రములు గట్టించువానికి ఆ బిరుదు లభించిన తరువాత ఆ సత్రము గోడలెప్పుడు పడిపోయినను చింత యక్కరలేదు గదా ? ఇట్లే, స్వర్గాది సుఖముల నాశించువారికి, ధర్మశాస్త్రములందే పరోపకారము చేయవలెనని చెప్పఁబడినదో యదిమాత్రము చేసినఁ జాలును, తక్కిన వక్కరలేదు. అదిగూడ ఎంతసులభము చేసికొనుటకు సాధ్యమో యంతయు చేయుదురు. గోదానముచేసిన పక్షమున, అది పాలుపిండినను, ఎండినను, మనస్వర్గలోకపు త్రోవకడ్డముగానుండు వైతరణి నదిని దాటించుటకై మనకు అక్కడి దివ్యగోపు సిద్ధముగా నిలిచియుండును. కాని గోవులే లేనప్పడు దానికి బదులు సువర్ణదానము చేయవచ్చునని ధర్మశాస్త్రములే కలవు. సువర్ణము లేనప్పడు వెండికావచ్చును. ఇంతే వెండి యీయవలయునని నిర్ణయములేదు. ఇన్నాళ్ళవఱకును రెండణాల రూకయు వెండిదే. అదిలేనప్పడు రెండణాల రాగినాణెములు. వానిలో ఒకటి రెండు తగ్గినను బాధలేదు. కట్టకడపట నది యొక బొట్టుబిల్ల క్రిందికి దిగును. కాఁబట్టి ఈ పద్ధతి ప్రకారము గోవు వెల ఒక బొట్టు ! దానిని దానమిచ్చినను గోదానము చేసినట్లే. కాని యాబొట్టును గూడ మూఁడు దమ్మిడీలుగా పగులగొట్టవచ్చును గదా ? మితవ్యయము కుల ధర్మముగాఁ గల వైశ్యశిఖామణి యొకఁడు అది మఱిచిపోలేదు. కనుక అతఁడు తాను గట్టించిన సత్రములో బోజనమైన తరువాత బ్రాహ్మణులకు తప్పక నిత్యముకు తాంబూలములో ఒకదమ్మిడీపెట్టి ' సువర్ణపుష్పదక్షిణ ' సమర్పించుచున్నాడనుట యొఱుఁగుదును ! కాఁబట్టి యిట్టి స్వార్ధపరోపకారములో ఫలమెక్కువ యుండదని చెప్పఁబనిలేదు.

వేమన పరార్ధ నీతులందు ఈ స్వార్ణదృష్టి చాల తక్కువ. 'ఇంచుకంతబోన మీశ్వనార్పణమన్న పుణ్యలోకమునకుఁ బోవునతఁడు (348). ఇత్మాదిగా నొకటి రెండుమాఱులు చెప్పినను మొత్తముమీఁద లంచమాసపెట్టియో, భయపెట్టియో, పరోపకారము చేయించుట కతనికిష్టములేదు. పుణ్యము, పాపము అను భావములు మనుష్యులు కల్పించుకొన్నవే కాని దేవుడు చేసిసవి కాదని యితని మతము

                "ఆ. మేనమామబిడ్డ మెరసి పెండ్డామాయె
                      అరపలందు చెల్లెలాయెసదియు,
                      వలసిన పుణ్యంబు వలదన్న దోషంబు..." (ఓ. లై.,13-4-10)

మనుష్యులకు సహజముగా ఇతరుల దుఃఖమునకు దుఃఖించుట, సుఖము సంతోషించుట, యను నుదారగుణములును గలవు. కావున అట్టి దుఃఖమును గొట్టి సంతోషమును గలిగించుటచే తనకుఁగలుగు సంతోషమే పరోపకారమందలి మార్ధము. ఇదిగూడ స్వార్ధమేకదా యను సూక్ష్మతార్కికుల వాదముతో మనకు లేదు.

ఇట్టి పరార్థ కార్యములలో వేమన్న కెక్కువ యభిమతమైనది ఔదార్యము. ఇతరులు తన్ను యాచించుటకు ముందెదానముచేసినవాఁడె దాతయని యితని ప్రాయము. ఈ విషయ మందితడు అతివాదియని వెనుకనే విన్నవించితిని ? కావుననే యతనికి లోభివారిమీద చాల అసహ్యము పట్టినది. సాధ్యమైనచో ప్రపంచమందలి లోభులనెల్ల పట్టిచంపినను పాపము లేదని యితఁడు తలయున్నది. వారిని చంపుట కితని మందు.

                "ఆ. లోవానిఁ జంప లోకంబు లోపల
                      మందువలదు, వేఱుమతము గలదు,
                      పైక మడిగినంత భగ్గున(బడి చచ్చు." (3400)
ఇంత యసహ్యమునందును హాస్యములేకపోలేదు. ఇంకను వినుఁడు:
                "ఆ. పిసినివాని యింటఁ బీనుఁగు వెడలిన
                      కట్టె కోలలకును కాసులిచ్చి
                      వెచ్చమాయె ననుచు వెక్కి వెక్కేడ్చురా..." (2526)

ఇంత యుదారబుద్దియున్నను వేమన్నకు పాత్రాపాత్రవివేకము లేకపోలేదు. కేమున ఎవఁడు పాత్రము అని నిర్ణయించు నప్పడు ఇతనికి కులము, జాతి మొదలగు వానిమాట యట్లుండనిండు, గుణముగూడ నక్కరలేదు. ముఖ్యమైనది పేదఱికము. అదియున్న తక్కిన వేమున్నను లేకున్నను ఆతఁడు పాత్రమే.

                "ఆ. దోసకారియైన దూసరికా డైన
                      పగతుఁచైస వేదబాహ్యుడైన
                      వట్టిలేని పేదవాని కీఁదగు నివి
                      ధనికునకు నొసంగవలదు వేమ" (2095)

అన్నదానమునుగూర్చి యీతని మతము మొుదలె ఎఱిగితిమి తరువాత వీనికి కన్యాదానముపై నితని కభిమానమెక్కువ. స్త్రీప్రజ యిప్పటికంటె పూర్వ కాలమందు తక్కువ యని కానవచ్చుచున్నది. మఱియు బలవంతులగు మనవారు పలువురు బహుపత్నీత్వము నాశ్రయించి యుండిరి. కావున యా కాలపు మగవారు పెండ్లికైపడు కష్టములకథలు పూర్వకాలమువారిప్పుడును వింతగా చెప్పుదురు.అప్పటి పెండ్లి కన్యాదానము. ఇప్పడది వరదానముగా పరిణమించి అనగా, వరదక్షిణలు మొదలగుసవి యపేక్షింపక ధర్మబుద్ధితో పెండ్లిచేసికొన్న వారికి; లేనివారికి వరవిక్రయమే. ధర్మశాస్త్రములు వ్రాయుకాలము పోయినది లేకున్న, ఏమియు వరదక్షిణ లాశింపక పేదల యింటిపిల్లను పెండ్లి చేసికొన్న రికి జన్మాంతరమందు త్రిలోకాధిపత్యము వచ్చుననియు, వరదక్షిణ లోయలోని తిరస్కరించువారికి ఆ చంద్రార్కము అన్ని నరకబాధలును ఏక కాలనునఁ గలుగుచుండు ననియును, నేనిప్పడు శాస్త్రములు వ్రాసి పరాశరుల పేరు పెట్టియందును. ఇప్పటి యాఁడుబిడ్డల తండ్రుల కష్టమును, కొడుకులుగన్న తండ్రుల కొవ్వును, దేవుఁడు చూచుచున్నవాఁడేని నేను ధర్మశాస్త్రము వ్రాసినను వ్రాయ కున్నను పై ఫలములతఁడు తప్పక యియ్యవలసి యున్నది. వేమన కాలమందిది విపరీతముగా నుండెను. ఐశ్వర్యవంతు లెట్లోతమయిండ్లకు భార్యలను కోడండ్రం , తెచ్చుకొనుచుండిరి. కాని పేదలకు పెండ్లయగుట కష్టముగా నుండెను. కావుననే యీ దానముగూడ ధనవంతులకు చేయరాదనియు, పేదలకే చేయవలయుననియు వేమన శాసించెను. ఇట్లుచేయుట ధర్మమే కాదు, ఇందుచే సుఖమును గలదు--

              "ఆ, కలిమిఁజూచి యియ్యఁగాయమిచ్చినట్ల
                    సమునకియ్య నదియు సరసతనము
                    పేదకిచ్చుమనువు పెనవేసినట్లుండు." (988)

నిజముగా పరుల కుపకరింపవలె సను జ్ఞానమున్నవానికి పరులను పీడింప రాదనుభావము వెంటనే యుండును. ఈ యహింసా ప్రతముపై వేమన్నకు చాల ప్రీతి:

              "ఆ. జీవి జీవి(జంప శిపుని జుపుటె యగు
                    జీవఁడరసి తెలియ నివఁడె కా(డె...." (1625)

కావుననే యితఁడు యజ్ఞకర్మములను చాల నిందించెను. స్పష్టముగా హింన కానవచ్చుచున్న ఈ యజ్ఞములను జైనులు, బౌద్ధులు మొదలుగా నందఱున మొదటినుండియు ఖండించిరి.

                  "యువం కృత్వా పశూస్ హత్వాకృత్వారుదిర కర్దమమ్
                    యద్యేవం గమ్యతే స్వర్గే నరకే కేన గమ్యతే!"*[1]
                                                                   (తిలకమంజరి పీఠిక పు.4)

అని ధనపాలకవి యఱచెను. వైదిక కర్మము లందు శ్రద్ధాభకులుగల బ్రాహ్మ ణులలోనే మాధ్వులు ప్రత్యక్షముగా పశువును జంపుటు వదలి, పిండితో పశువును జేసి కార్యము నెఱవేర్చుచు, అహింసాధర్మమున తక్కినవారికంటె నొక మెట్టు ముందుపడిరి. శ్రీవైష్ణవులలో తెలగలవారు యజ్ఞము లనావశ్యకములని త్రోసి వైచిరి. తక్కినవారిలో యజ్ఞములు చేయువారే యపురూపమైనారు. కాని శాస్త్రమునకేమో యజ్ఞములలోని హింస హింసకాదని చెప్పకొనుచున్నారు. వేమన్న కీ హింసమాత్రమే కాదు. తన శత్రువును గూడ హింసించుట కిష్టములేదు—

                "ఆ. చంపఁదగినయటి శతృవు తనచేత
                      చిక్కెనేని కీడు చేయరాదు,
                      సఁగ మేలుచేసి పొమ్మనుటే చాలు..." (1494)

నిజమే. శత్రుత్వము చావవలయునే గాని, శత్రువు చావవలయునని కోరుటయన్యాయము గదా ? ప్రకృతము మనుష్యు లింత దూరము అహింసావ్రతమును పాలింపజాలరు కాని, యెవఁడిట్లు చెప్పెనో యతని పేరనే గొఱ్ఱెలు, బఱ్ఱెలు బలి యిచ్చటనైనను, నిలుపఁ బ్రయత్నించుట వేమనయందలి యాభిమాసము గలవారి కెల్ల ముఖ్యధర్మ మనుటలో సందేహము లేదుగదా!

ఇతని స్వార్ధనీతులలో స్వానుభవము, వివేకము ఇంకను ఎక్కువగాఁ గాన మనుష్యుల కీలోకమందు నెమ్మదిగా బ్రదుకుట కావశ్యకములగు ఓర్పు, మొదలగు గుణములనివి బోధించుచు, నందరికిని ప్రియములుగా . చూడుఁడు : శౌర్యము మంచిదే కాని, యిది సమానుల విషయమందు పనికివచ్చును. తనకంటె దుర్బలులైన వారియెడల శౌర్యమును జూపుటమే యని యంద అంగీకరింతురు. తనకన్న బలవంతులయెడ ప్రయోగించితిని జూచి " బలే " యని మెచ్చుకొనువారు కొందఱున్నను అది యవివేక మెక్కువ. వేమనయు నీ వివేకుల గుంపులో చేరినవాఁడే.

              "ఆ.ఎదుటి తనబలంబు లెంచుకో నేరక
                  దీకొని చలముననెదిర్చె నేని
                  ఎలుగు దివిటి సేవ కేర్పడు చందంబు..." (646)

            "ఆ. అనువగానిచోట నధికులమనరాదు,
                  కొంచెముండు టెల్ల కొదువగాదు,
                  కొండ యద్ద మందు కొంచెమైయుండదా?..." (128)

ఇట్లే యితరుఁ డెవఁడైనను, తన్ను దండించినయెడల సహింపక తిరుగcబడు "ధైర్యముగానే తోఁపవచ్చునుగాని, అట్లు దండించుటవలన తనకు మేలేయగు నని సహించుకొని యుండుటయే వివేకమని వేమన్న మతము'

             "ఆ, చాకి కోక లుదికి చీకాకుపడఁ జేసి
                   మైలఁ దీసి లెన్స మడిచినట్లు
                   బుద్ధిఁ జెప్పవాఁడు గ్రుద్ధితే నేమయూ ?..." (1502)

పై రెండు విధముల నీతులను సాక్షాత్తుగాఁ జెప్పట యొక తీఱు. వాని నాచరిం చుటచేతను, విడుచుటచేతను గలుగు ప్రాపంచికస్థితులను ఉన్నదున్నట్లుగాఁ చేయుట మూలముగా పై నీతులను వ్యంజింపఁజేయుట యంతకన్న బలవంతమైన మార్గము. వేమన కీమార్గమం దాశ యొక్కువ. శక్తియు నెక్కువ. డు :

              "ఆ, ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి
                    వేఱె పోవువాఁడు వెట్టివాఁడు
                    కుక్కతోఁకబట్టి గోదావరీఁదునా ?.” (298)

స్పష్టముగాc జెప్పట యొక విధము. ఈ క్రిందిదంతకన్న బలవంతమైన గార్గము :

             "ఆ. ఆలివంకవారు ఆప్తబంధువులైరి
                   తల్లివంక వారు తగినపాటి,
                   తండ్రివంక వారు దాయాది పగవారు." (300)

ఇట్లే ప్రపంచమందు పలుకుబడి, మర్యాద సంపాదించుటకు తక్కినయన్నిటి ద్రవ్యము ముఖ్యము గావున, దానిని నంపాదింపుఁడని న్పష్టముగాఁ జెప్పట ఈ క్రింది పద్యముసందలి వస్తుస్థితికథనము ఎక్కువ ఫలకారి :

              "ఆ. కులము గలుగువారు గోత్రంబు గలవారు
                   విద్యచేత విఱ్ఱవీఁగువారు,
                   పసిఁడి గల్గువాని బానినకొడుకులు..." (1138)

ఇట్టి మఱి రెండు పద్యములు :

  1. * యూప స్తంభమునాటి, పశువులను జంపి, నెత్తుటిబురదను గలిగించి ఇందుచే స్వర్గమునకుఁ బోగలమేని నరకమునకిఁక పోపువాఁ డెపఁడు?-అని తాత్పర్యము.