వృక్షశాస్త్రము/సీతాఫలపు కుటుంబము
సీతాఫలపు కుటుంబము.
సీతాఫలము చెట్లు మనదేశమునందంతటను బెరుగుచున్నవి.
ఆకులు: -- ఒంటరి చేరిక, కొమ్మకు రెండు వైపులనే యుండును. లఘుపత్రములు, కురుచ బొడిమ, కణుపుపుచ్చములు లేవు. సమ గోళాకారము, సమాంచలము కొనసన్నము.
పుష్పమంజరి: -- కణుపుసందుల నొక్కొక్క పుష్పముండును. సతాళము. అకు పసుపు రంగు.
పుష్పకోశము: -- రక్షక పత్రములు మూడు. చిన్నవి. నీచము.
దళవలయము: -- ఆకర్షణపత్రములు మూడు. పెద్దవి. సన్నముగ నిడివి చౌకపునాకారముగను దళసిరగను నుండును.
కింజల్కములు: -- అసంఖ్యములు. సంయోజకములు పుప్పొడి తిత్తులపైకివచ్చి యున్నవి.
అండకోశము: -- స్త్రీపత్రములన్నియు విడివిడిగా నున్నవి. అవి చాలగలవు. ఒక్కొక్క దాని కొక్కొక్క కీలమున్నది. స్త్రీపత్రములును గింజల్కములును గోపురమువలెనున్న వృతాగ్రముపై నున్నవి. ఫలము, కండకాయ.
ఈ కుటుంబములో బెద్దచెట్టును గుబురు మొక్కలును గలవు. కొన్ని తీగెలవలె నల్లుకొనును. ఈమొక్కలు శీతలదేశమునందంతగా లేవు, ఆకులు, ఒంటరిచేరిక. సాధారణముగ రెండు వరుసలుగా నేయుండును. కణుపుపుచ్చము లుండవు. సమాంచలము కొన్నిటియాకులకును సువాసన గలదు. వృతాగ్రముగోపురమువలెనుండును. రక్షకపత్రములును, ఆకర్షణ పత్రములును వలయమునకు మూడేసి గలవు. కింజల్కములును, స్త్రీ పత్రములును అసంఖ్యములు. కింజల్కపు కాదల సంయోగకములు పుప్పొడితిత్తుల పైకివచ్చియుండును. గింజలకు బీజపుచ్ఛము గలదు.
రామాఫలపు చెట్టు:-- ఇంచుమించు సీతాఫలమువలెనే యుండును. పండు మాత్రము కొంచమెర్రగను నున్నగను నుండును. ఈ మొక్కలను బెంచుటకష్టము లేదు. గింజలు నాటి గాని కొమ్మలను, పేదవేసి సిద్ధము చేసిన గుంటలలోబాతి గాని పెంచెదరు. తరువాత వర్షములు కురియు వరకు అప్పుడప్పుడు నీరు పోయుచుండవలెను. ఈ చెట్ల పండ్లుమిక్కిలిరుచిగా నుండును. బెరడును ఆకులును వేరులును మందులందు ఉపయోగపడుచున్నవి. వేరు రసమునకు విరేచనములు గలుగ జే
సంపంగి:-- గుబురుమొక్క,. ఆకర్షణ పత్రములు రెండు వరుసలుగానున్నవి. ఈ పుష్పము మిక్కిలి మనోహరమగు సువాసనవేయును.
నరమామిడి:... పొడుగుగా బెరుగు నొకచెట్టు ఆకులు బల్లెపునాకారము. అంచుతరళితము. దీనినే అశోక వృక్షమనికూడ నందురు.