వృక్షశాస్త్రము/దేవదారువంశము
486
ధ్య స్త్రీ యల్పకణిశము దానికిరు పక్కల పురుష అల్పకణిశము గలవు. స్త్రీ అల్పకణికమునకు కాడ లేదు.
- వంశము.
వివృతబీజవంతము.
(దేవదారువంశము)
దేవదారుచెటేటును, ఇట్టి యితరచెట్లును మన దేశములో అంతగా బెరుగుట లేదు. ఆపెరుగునవి కొన్నియు పర్వతముల మీద పెరుగుచున్నవు. అవి శీతలప్రదేశములలో గాని వర్థిల్ల జాలవు. పూర్వ కాలమునందీ చెట్లే ప్రపంచమునండంతటను ఎక్కువగా నుండెడివి. వానిలో కొన్ని కుటుంబము లిప్పుడు పూర్తిగ అంతరించి పోయినవి. మరి కొన్ని మిక్కిలి తక్కువగనున్నవి.
ఈ చెట్లు మిక్కిలి ఎత్తుగా పెరుగును. వాని ఆకారమును అందముగా నుండును. కొమ్మలు మాను మీద అక్కడ నుండి, ఇక్కడ నుండి బుట్టి వంకర టింకరగా పెరుగక, ప్రతి కణుపు సందునందుండియు బుట్టుచు సరిగా పెరుగును. వీని ఆకులు మిక్కిలి తీసి పోయి యున్నవి. ఆకులలో రెండురకములుగా వచ్చుచున్నవి. కొన్ని చిన్నవి గాను పొలుసుల వలె నుండును. పొలుసుల మధ్య నుండి గుత్తులుగా సన్నని ఆకు పచ్చని ఆకులు పొడుగు పాటివి వచ్చుచున్నవి. 487
ఈపొడుగాకులు, పొలుసులమధ్య పుట్టిపుట్టకుండగనున్న కొమ్మమీద నుండి పుట్టుచున్నవి. ఇట్లు నిర్గోచరములగు కొమ్మల మీద పెద్దాకులును, పెద్ద కొమ్మల మీద చిన్నాకులును గల్గు చున్నవి. ఒక్కొకప్పుడు నిర్గోచరముగా నున్న కొమ్మలు కూడ పెద్దవై పెరుగును. అన్ని చెట్లయందును నాకులీరీతిని లేవు. కొన్ని చెట్లలో పొలుసులు లేవు. కొన్నిటిలో మిక్కిలి చిన్న చిన్నవిగా నున్నా ఆకులు కొమ్మల నంటి పెట్టుకొని యున్నవి. మరి కొన్నిటిలో అంగుళము పొడుగు అరంగుళము వెడల్పుగానున్నవి. మదనమస్తుచెట్టులో ఈతాకుల వలె పక్షవైఖరి నున్నవి.
మాను, ఆకులు అంతర్భాగముల నిర్మాణములో కొన్ని భేదములు తప్ప, ద్విదళ బీజకపు వృక్షములను పోలి యున్నవి. వీని పుష్పములందు మాత్రము వ్యత్యాసము చాల గలదు. పుష్పములు కొన్ని లక్షణములలో పర్ణములను పోలి యున్నవి. దేవ దారు మదన మస్తు మొదలగు చెట్ల యందు కణుపు సందులందుండి గాని, కొమ్మల చివరలందుండి గాని కంకులు పుట్టు చున్నవి. మధ్య కాడ నంటి పెట్టుకొని బిరుసుగ కొయ్య బారిన అరేకులు గలవు. ఈ పెద్ద రేకుల కడుగున చిన్న చిన్న పొలుసులున్నవి. ఆ పెద్ద రేకుల మీద అండములో, పు 488
ప్పొడి తిత్తులోగలవు. రెండును నొక దానిమీదలేవు. మరియు, ఒక కంకి మీద గూడలేవు. కొందరు, ఆచిన్న పొలుసును చేటిక అనియు, పెద్ద రేకును స్త్రీ పత్రమనియు నను చున్నారు. మరి కొందరు చిన్న పొలుసును స్త్రీ పత్రమనియు పెద్ద రేకును మిక్కిలి పెద్దదిగా పెరిగిన యండ లంబ స్తానమనియు అను చున్నారు. అండములు బహిరంగముగనే యున్నవి గాని మిగిలిన అన్ని చెట్లలోను నున్నట్లు అండాశయపు గదులలో నుండి రక్షింప బడుట లేదు. ఇదియే ఈ చెట్ల ముఖలక్షణము. పుప్పొడి యొక్కయు, అండముల యొక్కయు అంతర్భాగనిర్మాణము నందు, సంవృత భీజవంతములకును, వీనికిని భేదము గలదు. గాలికె గిరి వచ్చి పుప్పొడు అండములను చేరు చున్నది. కీలము గాని కీలాగ్రము గాని లేదు. ఆడ కంకులెదిగి యండములు సంయోగమునకు సిద్ధముగా నున్నప్పుడు పెద్ద రేకులు, పుప్పొడి వచ్చి చేరుటకు వీలుగ నుండు నట్లు కొంచము పిప్పారును,. సంయోగానంతర మితర యండమాదిరినే మార్పు చెంది గింజ అగును. ఈ చెట్లు పువ్వుల మూలముననే పెరుగును. కొమ్మల నుండి గాని కొట్టి వేసిన చెట్ల మొండెముల నుండి గాని పెరుగ లేవు.
దేవదారు హిమాలయా పర్వతముల యందు 6000 అడుగులెత్తుగా నున్న ప్రదేశములలో పెరుగు చున్నది. అది 489
సాధారణముగ 12 అడుగుల కైవారముగలమానుగ పెరుగునుకాని, మంచి నేలలైనచో మాను నలుబది ఏబది అడుగుల కైవారమునకు రెండు వందల ఏబది అడుగుల ఎత్తునను పెరుగును. ఈ చెట్లు నాలుగైదు సంవాత్సరముల కొక మారు గింజలు కాచును. వీనికి వర్షమంగ గా అక్కర లేదు. నీల గిరి పర్వతముల మీద రాగిడి నేల యొక్కవగా నుండుట చేతనో, వర్షములెక్కువగా నుండుట చేతనో గాని ఈ చెట్లు పెరుగ లేవు. హిందూ స్థానమునందీ కలప నెక్కువగా వాడెదరు. ఇది చిరకాలము గట్టిగా నుండును. చెక్కడపు పనులకు వీలుగ నుండును. ఈ చెట్ల నుండి కర్పూర తైలము వంటి పదార్థము వచ్చు చున్నది. దీనిని పశువుల రోగములు కుదుర్చుటలో వాడుదురు.
ఇట్టి చెట్లే హిమాలయ పర్వతములమీద మరికొన్ని గలవు. వాని నుండి గుగ్గిలమువంటి పదార్థము వచ్చు చున్నది. దీనికై చెట్టు మూడడుగు లెత్తున మాను చుట్టును కత్తితో నాటు బెట్టుదురు. అందులో ద్రవము చేరి చిక్కబడును. రెండు మూడు దినముల కొక మారు దానిని పోగు చేయు చుందురు. ఈచెట్లను పడ గొట్టిన వెనుక వేరులు దీసి తారు చేయుదురు. దీని ఆకులును కాగితము చేయుటలో బనికి 490
వచ్చుచున్నవి. ఇట్టిమరికొన్నిచెట్ల నుండి కూడ, కర్పూర తైలము వచ్చు చున్నది. చెట్టు నుండి తీసిన దానిని నీళ్ళలో గలపి బట్టి పెట్టుదురు. ఆవిరి రూపమున వచ్చు తైలమును చల్లార్చి ఒక దానిలో పోగు చేయుదురు. ఈ కర్పూర తైలమునకును, హారతి కర్పూరము, రస కర్పూరములకును సంబంధము లేదు. ఈ తైలము కొన్ని వ్యాధుల కుపయోగింతురు.
(వరగుణ) మదనముస్తు చెట్టును మన దేశములో విరివిగా పెరుగుట లేదు. వీని కంకుల నుండియే మదన మస్తును చేయుదురు.
- వర్గము
- పుష్ప రహితము. వంశము (దారు వంతము) పర్ణములు.
- వర్గము
- - పుష్పవంచము:
పువ్వుల తోటలలో కుండ్లయందు మొలచుచు ఎన్నడును పుష్పింపని చిన్నమొక్కలను మనము చూచు చున్నాము. అవియే పర్ణములు. కుండ్ల యందు మొక్కల వలె నున్నవి ఆకులే. వాని ప్రకాండము మట్టిలో గప్పబడి యున్నది. ఆకులు బహు భిన్న మిశ్రమ పత్రములై యుండుట చేత అవి కొమ్మల వలె నగపడు చున్నవి. ఇవి సాధరణముగ నన్నియు చిన్నమొక్కలే గాని కొన్ని చెట్ల వంటివి కూడ కలవు.