వృక్షశాస్త్రము/దాల్చిన కుటుంబము

వికీసోర్స్ నుండి

367

కాయల పైచర్మమె జాపత్రి. దీని నొలవగనే ఎండలో పెట్టుదురు.

జాజి కాయలనుండియు జాపత్రినుండియు కూడ చమురు దీసి దానిని సుగంధ ద్రవ్యములలో వాడు చున్నారు. దీనిని మనము తరుచుగ గాంబూలమునందు వాడు చున్నాము. వీనిని ఔషధములలో కూడ వాడు చున్నారు.


దాల్చిన కుటుంబము.


దాల్చిన చెట్టు మనదేశ్ములో ఎక్కువగాలేవు.

ఆకులు
- ఒంటరి చేరిక. కణుపు పుచ్చములు లేవు. అండాకారము దట్టముగాను బిరుసు గానుండును. రోమములు లేవు. మూడు పెద్ద ఈనెలు గలవు. కొనగుండ్రము. ఆకులకు సువాసన గలదు.
పుష్ప మంజరి
- కణుపు సందులందుండి మధ్యారంభమంజరులగు రెమ్మ గెలలు. ఇవి ఆకులకంటె పొడుగగా నున్నవి. వాని మీదరోమములు గలవు. మిథున పుష్పములును స్త్రీ పుష్పములును గలవు. స్త్రీ పుష్పములు పెద్దవి.
పుష్పవిచోళము
- సంయుక్తము. 5 తమ్మెలు గలవు. ఇవి కొంచెము హెచ్చు తగ్గుగ సమముగనే యున్నవి.
కింజల్కములు
- 9 తొమ్మిదికి తక్కువకూడ గలుగుచుండును. ఒక వరుస గొడ్డుకింజల్కములు గూడ కలవు. మూడవ వరుస వానిలో గ్రంధి కణములున్నవి. పుప్పొడితిత్తులు నాలుగుగదులు. 368
అండకోశము
అండాశయము ఉచ్చము ఒక గది. పుష్పనిచోళములో అడుగు గా నుండును. కీలము అండాశయము చివర నుండియే వచ్చు చున్నది.

ఈ కుటుంబపు మొక్కల ఆకులు సువాసన వేయును. ఆకులలో గ్రంధి కణములు గలవు. అవి ఒంటరి చెరికగా నున్నవి. వానికి, కణుపు పుచ్చములు లేవు. పుష్ప మంజరులు కణుపు సందులందుండి మధ్యారంభ మ్ంజరులుగా వచ్చు చున్నవి. కింజల్కములు రెండు మూడు వరుసలుగా నుండును. వానిలో కొన్నిటి మొదట గ్రంధి కణములు గలవు. అండాశయమొకగది.

దాల్చిన చెట్లను మన దేశములో అంతశ్రద్ధతో పెంచుట లేదు. అవి పడమటి కనుమల మీద బెరుగు చున్నవి. సాధారణముగ అన్ని నేలలందును పెరుగ గలవుకాని, మంచి నేలలు కానిచో చెక్క బాగుండదు. ఈ చెట్లు కొమ్మలను పాతినగాని గింజలనుబాతినగాని మొలచును. ఆరేడడుగుల దూరమున గోతులు తీసి వానిలో నాలుగైదేశ కాయలను పాతుదురు. మొక్కలు బాగుగ నెదిగిన పిమ్మట వానిని గురించి మనమంత జాగ్రత పుచ్చుకొన నక్కర లేదు. వాని చుట్తు నుండు చెత్త మొక్కలను పెరిగి వైచిన చాలును. కొంత ఎత్తు ఎదిగిన పిమ్మట వాని చిగుళ్ళను గోసి వేయుదురు. ఆరేడేండ్లెదిగిన 369

పిమ్మట బెరడును గొయ్యవచ్చును. మానుకును చుట్టుగాక రెండు వైపులనే గోయుదురు. కోయుట వర్షకాలములో నయ్యేఅ బెరడు సులభముగ వచ్చును. బెరడును గోసిస తరువాత నొక చెక్కమీద నొక దానిని జేర్చి గట్టిగా బిగించి కట్టి ఒక దినముంచెదరు. మరునాడు ఆ చెక్కలపై నున్న పొరను కత్తితో గీసి వైచి వానిని నీడలో ఆర బెట్టుదురు. దానినే ముక్కలుగా కోసి అమ్మదెచ్చు చున్నారు.

దాల్చిన అరకు, ఆకులనుండియు వ్రేళ్ళనుండియు గూడ తీయుదురు. చెక్కను వేళ్ళను గూడ ఔషధములలో వాడుదురు. దాల్చిన చెక్క సుగంధ ద్రవ్యములలో నొకటి.

ఈ చెట్లలో చాలరకములు గలవు.

తాళసపత్రి కొందలమీద బాగుగ పెరుగును. తోటలలో దీనిని తరచుగా, పనస, పోక చెట్లతో గలసి పెంచుదురు. విశేష వర్షము వెంటనే తీక్షణమగునెండ, ఇట్లు ఒక దానివెనుక నొకటి యున్నచో అవి బాగుగ పెరుగును. వర్షము సర్వదా గురియు చున్న యెడల సువాసన తగ్గును. వీని విత్తనములు పాతిన 5 ఏండ్లకు మొక్కలను దీసి దూర దూరముగా పాతుదురు. కొన్నిచోట్ల చిన్నమొక్క అడుగెత్తుగా నున్న 370

ప్పుడేదీసి వేరుచోట బాతుదురు. ఇవి పదేండ్లకు ఫలితమునకు వచ్చును.

వర్షములును లేక, ఎండ ఎక్కువగను లేనప్పుడే ఆకులను కోయుట ఆరంబింతురు. లేత చెట్ల కేటేట కోయుదురు గాని ముదురు వాని ఆకులు రెండేసి ఏండ్ల కొక మాటే కోయుచుందురు. ఇట్లు చెట్టునకు నూరు సంవత్సరముల వరకు కోయవచ్చును.

దీని ఆకులను కొందరు వంటలో ఉప యోగించెదరు. కరక్కాయలతో గలిపి రంగు వేయుటలో వాడుదురు. మరియు ఔషధములలో వాడుదురు.


అగరు కుటుంబము.


అగరుచెట్టు కొండలమీద బెరుగును. లేకొమ్మల మీద పట్టు వంటి రోమములు గలవు.

ఆకులు
- ఒంట్రి చేరిక. లఘు పత్రములు బల్లెపాకారము. పొడవు 2 - 3/2 అంగుళములు. విషమరేఖపత్రము. సమాంచలము కొన వాలము గలదు.
పుష్పమంజరి
- రెమ్మగుత్తి. తెలుపు ఎకలింగపుష్పములు.
పుషనిచోళము
- సంయుక్తము 5 తమమెలు అల్లుకొని యుండును నీచము.