Jump to content

వృక్షశాస్త్రము/తోటకూర కుటుంబము

వికీసోర్స్ నుండి

351

లవండరు నిచ్చెడు మొక్కకూడ ఈకుటుంబము లోనిదే గాని మన దేశములో పెరుగుటయే లేదు.

పుదీన
- తోటలయందు పెరుగు చిన్న మొక్క. కింజల్కములు దళవలయముల కంటే బొడుగుగా నుండును. ఆకులుకు కొంచము ఘాటు వాసన గలదు. ఈ ఆకును అరోగ్యకర మందురు.
పర్ణము
- అస్ఫుట దళ వంతము.


తోటకూర కుటుంబము.


తోట కూరను చాల చోట్లనే సేద్యము చేయుచున్నారు.

ప్రకాండము
- గుల్మము. నున్నగాను పొడుగుగా నుండును.
ఆకులు
- ఒంటరి చేరిక, లఘు పత్రములు. అండాకారము. సమాంచలము. రెండు వైపుల నున్నగా నుండును. విషమ రేఖ పత్రము. కొన గుండ్రము. తొడిమ పొడుగుగా నుండును.
పుష్ప మంజరి
- కణుపు సందులనుండి గాని, కొమ్మల చివరల నుండి గాని కలుగును. పువ్వులు ఆకు పచ్చగను, చిన్నవి గను నున్నవి. అసంపూర్ణ ఏకలింగ పుష్పములు.
పుష్పవిచోళము
- అసంయుక్తము. 3 దళములు సన్నముగానున్నవి. నీచము.
పురుష పుష్పము
- కింజల్కములు 5. అయిదు కంటె తక్కువ కూడకలుగు చుండును. పుప్పొడి తిత్తులు రెండుగదులు. 352
స్త్రీ పుష్పము
పుష్పనిచోళము
- వైదాని యందు వలెనే యుండును.
అండకోశము
- ఉచ్చము 2 గదులు కాయ పీఠికాఫలము. గింజలు గుండ్రముగా నుండును.
కోడి జుట్టు
- మొక్కలను తోటలలో పెంచు చున్నారు. ఇదియు తోట కూర మొక్క వలె నుండును.
ఆకులు ఒంటరి చేరిక, లభు పత్రములు, కణుపు పుచ్ఛములుండవు. ఆకు లన్నియు కాకారమున నొకరీతి నుండవు.
పుష్ప మంజరి
- కంకి మృథువుగా మహిమలవలె నుండును. వీనిలో పుష్పములు చేటిక గలవు. పుష్పములు చిన్నవి. అసంపూర్ణము మిధున పుష్పములు.
పుష్పనిగోళము
- అసంయుక్తము నీచ రంగు గలదు. నీచము.
కింజల్కములు.- 5 . పుష్ప గోళపు పత్రముల కెదురుగా నుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు.

అండ కోశము:- అండాశయము ఉచ్చము. 1 గది. అండములు చాల గలవు. గింజలు వంపుగా చిక్కుడు గింజలవలె నుండును. కీలము కాయముమీద మధ్యగానె యున్నవి. కీలాగ్రము గుండ్రము.

ఈ కుంటుంబక్వ్ములోని వన్నియు గుల్మములే ఆకులు ఒంటరిచేరిక. వానికి కణుపు పుచ్ఛములుండవు. వీనిపువ్వుల 353 న్నియు చిన్నవే. వానికె మంచిరంగు గాని సువాసన గాని లేది. పువ్వులలోను దళ వలయము లేదు. కొన్ని ఏక లింగపుష్పములే. కింజల్కములు 5 గాని తక్కువ గాని యుండును. కొన్నిటిలో గొడ్దు కింజల్కములు కూడ గలవు. ఈ కింజల్కములు పుష్ననిచోళపు పత్రముల కెదురుగా నుండును. కొన్నిటిలో పుప్పొడి తిత్తులులొక్కొకకటియె; ముఖ్యముగా నీ భేదమును బట్టియె ఈ కుటుంబమును విభజించి యున్నారు. వీని ఫలములు పేటికా ఫలములు.

తోట కూర అకుకూరలలో ప్రధానమైనది. వీనిలో కొన్నిటి కాడ లెర్రగా నుండును. ఇదియే ఎర్రతోటకూర. కొన్నిటికాడలు 5, 6 అడుగులెత్తు కూడ పెరుగును. ఇది చౌకగ దొరుకుటచే కాబోలు కొందరు ధనికులు దీని కూరను హీనముగా చూతురు గాని, ఇది ఏ కాయకూరలకును తీసి పోదు. ఆహార పదార్థములలో ముఖ్యముగ వలసిన నత్రజనము ఆకులలోనే మెండుగ నుండును.

చిలకతోటకూర తోటకూర వలెనే యుండును. మొక్కలు చిన్నవి. ఆకులెక్కువ ముదురు రంగుగా నుండును. దీనిని కొందరుకూరవండుకొందురు. 354

ముళ్ళతోటకూర వర్షాకాలములో విశేషముగ పెరుగును. దీనికి ఆదుల వద్ద ముండ్లు గలవు.

కొయ్యతోట కూర కొంచెమించు మించు చిలక తోట కూర వలె నుండును. ఈ మొక్కలు దాని కంటె కొంచెము చిన్నవి. దీనిని కూర వండు కొందురు.

పొన్నగంటికూర ఆకులొక్కొకచో రెండు రెండున్నవి. దీనిని కూడ కూర వండు కుందురు. ఆకుల నెండ బెట్టి వరుగు చేసి నిలువ కూడ చేసి కొందురు.

దుగ్గల కూర మంచి నేలలందు అడుగెత్తు పెరుగును. ఆకులు చతురము వలె నుండును. కాయ కంటె పుష్పకోశము పొడవు.

చిరకూర చిన్నమొక్క. కొమ్మలు నేల మీద ప్రాకు చుండును. మగ పుష్పములు చాల గలవు. దీనిని కూడ కొందరు తిందురు గాని ఎచ్చటను సేద్యము చేయుట లేదు.

కోడిజుట్టుమొక్క కంకి మిక్కిలి అందముగానుండుటచే పెంచు చున్నారు. వీనిలో కొన్నిపచ్చగానుండును.

చంచలి మొక్క ఆకులు బల్లెపాకారము. పువ్వులెర్రగా నుండును. లేతాకులు కూర వండుకొందురు. 355

ఉత్తిరేణి.

ఉత్తరేణి పలు చోట్ల మొలచు చున్నది. దీని కంకి చాల పొడుగుగా నుండును. కాయలు పుష్ప కోశములోనే యుండును. కాయలు ముదరగనే, అవి (పుష్ప కోశములు) తల క్రిందులుగ వంగును. అట్లువంగియుండుటవలన మన బట్టలకు, వాని 356

కేమిదగిలిన వాని నన్నిటి నంటుకొని, కంకినుండి విడుచుటకు వీలుగ నున్నది. అవి ఏ గొర్రెనో, ఏ బట్టనో అంటుకొని ఎక్కడ నైనను రాలినయెడల నచ్చట మొలచును. ఇదియే వాని కావలసినది. ఇట్లేఅవి సాధరణముగ వ్యాపకము చెందు చున్నవి.

ఉత్త రేణి వేళ్ళ్తతో దంత ధావనము చేయుట మంచిదందురు.

పొగడ బంతిమొక్కలిసుక నేలలో మెలచును. ఆకులకు తొడిమలేదు. కొన్ని పువ్వుల గుత్తులు ఎర్రగాను, కొన్ని తెల్లగాను వుండును.


బచ్చలి కుటుంబము.


ఈ కుటుంబములో బెద్ద చెట్లు లేవు. ఆకులు లఘుపత్రములు. ఒంటరి చేరిక, వీనికి గణుపు పుచ్చములుండవు. కొన్నిటి పువ్వులు మిధున పుష్పములు. కొన్నిటిలో ఏక లింగ పుష్పములే గలవు. పుష్పకోశము నీచము, మూడు మొదలైదు వరకు తమ్మెలుండును. లేద, రక్షక పత్రములు విడివిడిగానే వుండును. ఇవి మొగ్గలలో అల్లుకొనియుండును. ఆకర్షణ పత్రములు లేవు. కింజల్కములు రక్షక పత్రముల కెదురుగా నుండును. అండాశయము ఉచ్చము. ఒక గది అండ