Jump to content

వృక్షశాస్త్రము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

వృక్షశాస్త్రము

ఉపోద్ఘాతము.


వృక్షములు మనవలెనే ప్రాణులనియు నవియు బుట్టుచు, నాహారమును సంపాదించుకొని పెరుగుచు, సంతానవృద్ధి గావించుకొని తుదకు సమసిపోవుచున్నవనియు మీరిదివరకే జీవశాస్త్రమునందు జదివియున్నారు. ఇప్పుడు ఆయావ్యాపారము లెట్లు జరుగుచున్నవో, వృక్షముల పరస్పర సంబంధము లెట్టివో, మనకు చెట్లె ట్లుపయోగకారు లగుచున్నవో దెలిసికొనుట యుచితము. అందుకై కొన్ని పారిభాషిక పదముల నేర్చుకొనుట అగత్యము. ప్రతిచెట్టు నందును వేరు శాఖ ఆకులను మూడు భాగము లుండును. అందు వేరును గూర్చి ముందు చర్చించెదము.

వేరు

గింజ అంకురింపగనే, మొలకను చలనములేక స్థిరముగ నిలువబెట్టుటకును, ఆహార పదార్థములను గొనివచ్చుటకును వేరు భూమిలోనికి బోవుచున్నది. ఎన్ని వంకరలుగ విత్తును బాతిపెట్టినను వేరు పైకివచ్చుటలేదు. ఇది దాని నైజము. అటు భూమిలోనికిబోయి పెరుగుచుండ దానినుండి శాఖోపశాఖలుగ కొన్ని వేరులు బుట్టుచున్నవి. ఆ మొదటి పెద్దవేరునకు తల్లివేరనియు, శాఖవేరులకు పిల్లవేరులనియు పేరు. నరి, ఈతమొక్క, జొన్న, గడ్డి మొదలగువానికి చిన్నప్పుడే తల్లివేరు చచ్చిపోయి, దానిమొదలు వద్ద సన్నని వేరులు పెక్కులు పుట్టుచున్నవి. ఇట్టివానిని నారవేరులం

దుము. మానున కడుగునుండి పుట్టక, చెఱుకు మర్రి (ఊడలు) మొగలి మొదలగువాని యందు కొన్ని వేరులు పైనుండియే బుట్టుచు క్రిందకు బోవుచున్నవి. ఇవి, వానిస్థలము తప్పి పుట్టుచున్నవిగాన, ఆగంతుక వేళ్లందుము. మిరియాల తీగయందును ఇట్లాగంతుక వేళ్లు బుట్టుచున్నవిగాని అవి భూమిలోనికి దిగవు. అవి విస్తారము పొడుగుగూడ నెదుగవు. తీగ దేనిమీద బ్రాకుచున్నదో దానిని అంటి పెట్టుకొని యుండి తీగను క్రింద బడిపోకుండునట్లు జూచుటయే వీని పని. బదనిక మొక్కల వేరులును భూమిలోనికి దిగుటలేదు. బదనికమొక్క లేచెట్టుమీద బెరుగుచున్నవో ఆ చెట్టు లోపలకు వేరులు చొచ్చుకొనిపోయి, అవి సంపాదించుకొనిన యాహార పదార్థములను దస్కరించుచున్నవి. ఇట్లు పరాన్న భుక్కు లగుటయే వాని పనియైయున్నది. వీనినే బదనికవేరు లందుము. చెట్లమీదనే పెరుగు చిన్నచిన్న మొక్కలు మరికొన్ని గలవు. వానివేళ్లును భూమిలోపలికేగవు. బదనికవేళ్లవలె కొమ్మలోపలికిబోయి దాని యాహారమును తస్కరించవు. భూమిలో నాటుకొనుటకు బదులు ఆ కొమ్మను అంటిపెట్టుకొని గాలిలో దొరకు నావిరిని బీల్చుకొనుచుండును. ఇట్టివి అంటువేరులు.

ఒక కొమ్మపై మరిక్యొక మొక్క మొలచి దాని యాహారము దీసికొనుచున్నది.


భూమిలోనికి బోయిన వేరులు కొన్ని ఆహారమును వెదకితెచ్చి పైకిపంపుట మాని తామే లావుబారి కండపట్టుచున్నవి. ముల్లంగి చిలగడదుంప మొదలగునవి ఇట్టివేరులు. ఆమొక్కలు మరసటి సంవత్సరములో పుష్పించి కాయలు గాయుట కీయేడు సంపాదించుకొనిన యాహారమును వేరులలో నిలువ చేసికొను చున్నవి.

ప్రకాండము.

గింజ అంకురింపగనే వేరుభూమిలోనికి బోవునట్లె ప్రకాండము కొమ్మ స్వతస్సిద్ధముగా బైకి పెరుగుచున్నది. వేరునందు వలెగాక దీనిమీద ఆకులు పువ్వులు పుట్టుచున్నవి. ఆకులు పుట్టు చోటును కణుపు అందుము. ప్రకాండమును ఆకును కలిసి కొనుటచే ఏర్పడు కోణము కణుపు సందందుము. రెండు కణుపుల మధ్య నున్న భాగమునకు స్కంధమని పేరు. కణుపు సందులందుండియే మొగ్గలు కొమ్మలు పుట్టును. అన్ని మొక్కల ప్రకాండములు ఒక తీరున లేవు. చింత, పనస, మామిడి మొదలగు వానివి చాల ఎత్తుగను లావుగను బెరుగుచున్నవి. జామ, దానిమ్మ, మొదలగు వానియందు, అంత ఎత్తుగాను లావుగను పెరుగుట లేదు; మరియు వీనికి కొమ్మలు మిక్కిలి క్రిందుగానే బుట్టి అన్నియు కొంచమించుమించు గుబురుగా బెరుగుచున్నవి. తోటకూర పసుపు, మెట్టతామర, కుంకపు పువ్వు మొక్క మొదలగు వాని యందు ఎత్తుగగాని లావుగా గాని లేదు; అదిగాక ఇవి తక్కినవాని వలె కొయ్యబారి గట్టిగా లేవు. ఈ భేదములెన్నుటకు, చింత మొదలగు వానిని వృక్షములు (పెద్దచెట్లు) అనియు, దానిమ్మ మొదలగు వానిని గుబురు మొక్కలనియు, మెట్టతామర మొదలగు వానిని గుల్మము లనియు, నందుము. కొన్నిటి ప్రకాండములు వాని కొమ్మలును పైకెదుగనే ఎదుగక పల్లేరు మొక్క యున్నట్లు నేలమీదనే బడియుండును. అట్లున్న కొన్ని కొమ్మలనుండి వేరులుకూడ పుట్టును. మరికొన్ని కొమ్మలు భూమిలోనికే బోయి అడ్డముగా బెరుగుచు తల్లిమొక్క దగ్గరనుండి కొంచెము దూర మేగిన తరువాత పైకి వచ్చును; లేదా దీని నుండి కొమ్మలు పుట్టి అవి పైకివచ్చును. ఇట్లు భూమిలో వ్వాపించి పైకివచ్చువానికి గామినులని పేరు.

రెండవ మొక్క మొదటి దానినుండి వచ్చిన గామిని వల్ల ఏర్పడినది.

కొన్నిటి ప్రకాండములు భూమిలోపలికి బోయి, మార్పు చెంది వేరొక పనిని చేయు చున్నవి. బంగాళ దుంప ఇట్టిదే. ఈ దుంప మార్పు చెందిన కొమ్మ. ఈ రీతిని కొమ్మలు భూమిలోనికి పోయి, లావెక్కిన వానిని గడ్డలందుము. అల్లము, పసుపు, అరటి, కంద దుంపలు కూడా ప్రకాండములే.

అల్లము మొదలగునవడ్డముగా బెరుగుచుండ వానిపై నుండి మొక్కలు పైకి వచ్చుచున్నవి. కంద గుండ్రముగా బెరుగుచున్నది. దీని మద్యనుండి యొక మొక్కగలదు. కంద చుట్టు చిన్న చిన్న పిలకలు గలవు. ఇవి క్రమ క్రమముగా బెద్దవగును. కందవలె గుండ్రముగా నుండు వానిని కందములనియు, పొడుగుగా నున్న అల్లము మొదలగు వానిని మూలవహములనియు ననుట వాడుక. ముల్లంగి మొదలగు వేళ్ళును లావుబార, కంద మొదలగు ప్రకాండములును లావుబార ఆ దుంపలు వేరుల మార్పులో, ప్రకాండముల మార్పులో తెలిసికొను టెట్లనెదరేని: .. అవి ప్రకాండము లైనచో,

వానిపై వేరులును, కణుపులును ఆ కణుపుల వద్ద ఆకులకు బదులు కొన్ని పొలుసులును జూడ నగును. మరియు వానిని ముక్కలుగ కోసి పాతి పెట్టినచో మొక్కలు మొలచును. అవి వేళ్లైనచో నట్లు మొలవవు.

ఉల్లిపాయ వేరును గాదు, ప్రంకాండమును గాదు. కండ బారి

బంగాళదుంపనుండి మొక్కలు పుట్టుచున్నవి.

రేకులవలె వచ్చినవి మార్పు చెందిన ఆకులు. పాయకు అడుగున పలుచగ, ముచ్చిక వలె నున్నదియె ప్రాకాండము. దీని యడుగు నుండి వేరులు వచ్చును. ఈ ఆకుల మధ్య ప్రకాండము నంటి మొగ్గలు గలవు. ఉల్లి పాయను కోసి చూచిన నివి ఆకు పచ్చగ నగుపించును. వీనినుండియే మొక్కలు పుట్టును. ప్రకాండముట్లు తీసి పోయి కండ గలిగిన ఆకులతో గూడియుండిన అది లశునమందురు.

పైకెదిగెడు ప్రకాండములు కొన్ని ఏదైన నాధారముండిన గాని పోలేవు. చిక్కుడు మొదల్గు తీగెలలో ప్రకాండ మేపందిరినో చెట్టునో జుట్టుకొని ఎగ బ్రాకును. ఇట్లు బ్రాకునవి తిరుగెడు తీగలు, గుమ్మడి, బీర, పొట్లతీగె

తిరుగుడు తీగెలు.

లిట్లు చుట్టుకొనవు. వానికి నులి తీగలు గలవు. ఇవి దేనినైన గట్టిగ జుట్టుకొని ప్రకాండమును పైకి లాగును. మిరియాల తీగె వేరు మూలమున నెగబ్రాకు చున్నది. గచ్చ పొద, ఆరు దొండ ముళ్ళ మూలమున పైకి బోవు చిన్నవి. కొన్ని నులి తీగెలు ప్రకాడము యొక్క మార్పులే. నల్లేరు ద్రాక్ష తీగలలో కాడకొక ప్రక్కను ఆకును, దాని కెదురుగ నొక నులి తీగయు గలవు. ఈనులితీగయె నిజమైన ప్రకాండము దీనిమీ 11

బొమ్మ ( గుమ్మడి తీగ)
గుమ్మడి తీగ

నే ఆకు బుట్టుచున్నది. ఈ ఆకు కణుపు సందులో నుండు మొగ్గయె పెరిగి కాట (ప్రకాందము) యగుచున్నచి. గుమ్మడి తేగలో కొన్ని యాకుల కణుపు సందులో నుండి పెరుగ వలసిన కొమ్మలు నులితీగెలుగ మారు చున్నవి. పాల జెముడు, నాగ జెముడు మొక్కలలో ఆకులు మిక్కిలి చిన్నవిగ నుండి త్వరగ రాలి పోవుటయో, లేకుండగనే పోవుటయో తట 12


స్థించు చున్నది. గనుక, కొమ్మలు ఆకు పచ్చగను, వెడల్పుగ నుండి ఆకుల పనిని కూడ జేసికొను చున్నవి.

ఆకులు.

ఆకులు వృక్షములకు ముఖ్యమైన యంగములు. వీనిలోనె, వేరుల మూలమున భూమిలో నుండి వచ్చిన పదార్థములును, గాలిలో నుండి ఆకులు సంపాదించిన పదార్థమును మిళితమై, ఆహారమై,జీవ పదార్థముగ మారుచున్నది.

ఆకులు కొమ్మమీద పుట్టు చోటునకు కణుపని పేరు. ఒక్కొక్క కణుపు వద్ద ఒకటో రెండో, అంతకంటె నెక్కువయో ఆకులుండును. ఒక్కొక్కటి యున్న యెడల ఆ ఏర్పాటును ఒంటరి చేరిక అందుము. ఉదాహరణ:... రామాఫలపు ఆకులు: (దీనికే జీవ శాస్త్రమునందు సర్ప ప్రసారమని యున్నది.)

బొమ్మ
,x,x,x,

రెండేసి యున్న యెడల, అరెండును ఒక దానికొకటి ఎదురుగా నుండును కాబట్టి అభిముఖ చేరి యందుము. ఉదా: బిళ్ళ గన్నేరు, లవంగము. 13

గన్నేరు మొక్కలో వలె మూడుగాని, అంతకంటె ఎక్కువ గాని యున్నచో కిరణ ప్రసార మందుము. ఆకులందు తొడిమ పత్రము పాదపీఠము అను మూడు భాగలులు గలవని ఇది వరకే జీవ శాస్త్రమునందు జదివియున్నారు. తొడిమ బొప్పాయి, గంగ రావి మొదలగు కొన్నింటిలో బొడుగుగా నుండును. పొన్న, రేగు మొదలగు కొన్నింటిలో పొట్టిగా నుండును.

బొమ్మ. (బఠాణి ఆకు చివర నులి తీగ వలె మారి యున్నది. కణుపు వుచ్ఛములు పెద్దవై పత్రము చేయు పనిని చేయుచున్నవి.)

నేల ఉసిరి ఆకులకును వాయింట యొక్క చిట్టి యాకులకును తొడిమ లేనేలేదు. తొడిమ నంటుకొని దాని కిరుప్రక్కల కణుపు వద్ద చిన్న రేకల వంటివి కొన్నిటిలో నుండును. ఉదా: గులాబి వానికి కణుపు పుచ్చములని పేరు. ఇవి ఆకులు మిక్కిలి చిన్నవి గా నున్నప్పుడు కణుపు సందు లందు మొలచెడు మొగ్గలకు నెండ దగులనీయ కుండ కాపాడు చుండును. రేగు చెట్లలోనివి ముండ్లుగా మారి యున్నవి. తొగరు చెట్లలో రెండాకులకును మధ్యగా 14

నున్నవి. బఠాణిమొక్కలో ........ ఆకుల వ్యాపారము చేయు చున్నవి. జామ, తొగరు, రావి ఆకులందువలె కొన్ని ఆకుల కొక పత్రమే గలదు. అట్లున్న యడల లఘుపత్రమందుము.

బొమ్మ
తొగరు లఘు పత్రము:

ఒకటి మిశ్రమ పత్రమో, కొమ్మయో నిర్థారణ కానిచో అది ఏ యాకుకణుపు సందులో నైన పెరుగు చున్నదో దని మీద నున్న ఆకుల కణుపు సందులో మొగ్గలేమైనా గలవో చూడవలెను. తుమ్మాకును తురాయి ఆకును మిశ్రమ పత్ర 15

బొమ్మ
(నేల ఉసిరి ఆకులకు దొడిమ లేదు. మిశ్రమ పత్రము వలె నగుపించునునవి కొమ్మలు) 16

ములే కాని తురాయి, తుమ్మ ఆకులలో పెద్దాకు రెండు సారులు విభజితమై యున్నది. కావున వీనిని ద్విభిన్న పత్రమందుము. ఇట్లే మూడు సారులు విభజితమై యున్న యెడల త్రి భిన్న

బొమ్మ(ములగ
త్రిభిన్న పత్రములు) 17

మనియు, ఇంక నెక్కువ సారులు విభజించి యున్న యెడల ల్బహు భిన్న పత్రమనియు నందుము. మిశ్రమ పత్రములందున్న చిన్న చిన యాకులను చిట్టి యాకులందుము. వేపాకులో చిట్టి యాకులు జతలు జతలుగా నుండి చివరి కొకటి గలదు;

బొమ్మ
( వేపాకు)....... ((తురాయి ఆకు)
తురాయిఆకు

ఆకుల సంఖ్య బేసి. తురాయి ఆకులో అన్నియు జతలు జతలుగానే యున్నవి. ఆకుల సంఖ్యసరి. కావున తురాయి ఆకును సమభిన్నపత్ర మనియు, వేపాకును విషమ భిన్న పత్ర మనియు చెప్పుదుము. వేపాకు, చింతాకు, తురాయి ఆకులలో చిట్టి యాకులు మధ్యనున్న కాడకు రెండు ప్రక్కల పక్షి రెక్కల మీదనున్న ఈకల వలె నుండుటచే అ ఆకును పక్షవైఖిరినున్న దందుము. 18

బూరుగాకు, కుక్కవాయింటాకును మిశ్రమ పత్రములే కాని ఇట్లు లేవు. మన చేతి వేళ్ళు తెరిచినప్పుడెట్లుండునో అట్లు చిట్టి యాకులన్నియు నున్నవి; లేదా ఇంచు మించు తాటి యాకులలో చీలిక లున్నట్లు ఉన్నవి. కావున ఇది తాళపత్ర వైఖరి నున్నదందుము.

బొమ్మ
(ఆముదపు ఆకు. 9 తమ్మెలున్నవి)
ఆముదపు చెట్టు/ఆకులు/పూలు/కయలు

ఆముదపాకులో ఆకులు సగము చీలి సగము చీలకయున్నవి. ఇవియు లఘు పత్రములే. తొడిమ వరకు గాని, మధ్య కాడ వరకు గాని (పక్ష వైఖరి ఆకులంఉ) చీలి యుండిన గాని మిశ్రమ 19

పత్రములు గావు. ఆముదపు ఆకులో ఆచీలికలకు తమ్మెలని పేరు.

బొమ్మ
(కుక్కవాయంట)
కుక్కవాయింట

ఆకు నాల్గవంతు మొదలు సగము వరకు దమ్మెల క్రింద జీలియున్నచో దానిని చ్చేదితము

 అందుము.  సగము మొదలు ముప్పాతిక వరకు జీలి యున్నచో విభాజిత మందుము.  ముప్పాతికకు మించెనా ఖండితమందుము. 20

ఆకులన్నియు నొక తీరున లేవు. వాని ఆకారమును బట్టి దీర్ఘాగాకము (పచ్చగన్నేరు) బల్లెపాకారము (నరమామిడి) నిడిఒవి చౌకపాకారము (చింతాకుల చిట్టి యాకులు) సమ గోళాకారము (బిళ్ళగన్నేరు, నారింజ, తెల్లడమర్) అండాకారము (మర్రి) హృదయాకారము (రావి) గుండ్రము (తామర) బాణాగ్రాకారము (చేం) అధశ్శిర అండాకారము (మావలింగము ఆకు) జీడి గింజాకారము కర్ణాకారము అనియు చెప్పుదుము. ఆకుల అంచులును ఒక తీరున లేవు. కొన్ని జామాకు

బొమ్మ
(1. దీర్ఘాకారము. 2. నిడివి చౌకము. 3. బల్లెపాకారము. 4. సమగోళాకారము. 5. అండాకారము. 6. హృదయాకారము 7. బాణాగ్రా కారము.)
పచ్చగెన్నేరు చెట్టు\ఆకులు\పూలు
వలెనే, గొగ్గి గొగ్గిలుగా నుండక సమముగా నుండును. అట్టి వాని అంచు సమాంచలము. గులాబి అకున గొగ్గి గొగ్గిలు కలవు. వానికి పోలికను బట్టి రంపపు పండ్లని పేరు వచ్చినది;
బొమ్మ
(1. సమాచలము. 2. అంచు: రంపపు పండ్లు. 3. దంతములు. 4. వలయ దంతములు.)
గులాబి ఆకు

ఇవి తిన్నగా నుండక కొంచము అయిమూలగ నున్నవి. మందారపు ఆకులలో వలె తిన్నగా నుండిన వానిని దంతములందుము. కొన్నింటిలో ఈ గొగ్గిల కొన సన్నముగా నుండక గుండ్రముగా నుండును. అవి వలయ దంతములు. తొగరు, నర మామిడి ఆకులయంచున గొగ్గిగొగ్గిలుగా లేదు గాని, పైకి క్రిందకు వంపులు గలిగి కెరటముల వలె నున్నది. ఇట్టి దానిని తరళిత మందుము. (వెనకటి పుటలలోని పటమును జూడుము) ఆకుల కొనయు కొన్నిటిలో రావి ఆకునందు వలె వాలము కలిగి యున్నది. గన్నేరు ఆకులో సన్నముగా నున్నది. మర్రిఆకులో గుండ్రముగా నున్నది. కొన్నిటిలో 22


ఆకుల కొనలు
బొమ్మ
1. గుండ్రము. 2. క్షిప్తము. 3. సన్నము. 4. ఖనితము. 5. వాలము. 23

గుండ్రముగా నుండి మధ్య నొక దంతమును గలిగి యున్నవి. కొన్నిటిలో మధ్యకు చీలి యుండి, ఆకును తలక్రిందులుగా బెట్టి చూచిన హృదయాకారముగ నగుపడుదు. వీనిని అధశ్శిర హృదయాకారమమందుము. ఇట్లే అధశ్శిర అండాకారము, కొన్నిటి చివర కొంచము లోపలకు దించుకు పోయినట్లుండును; ఇట్టి దానిని ఖనితమందుము. చించాకుల చిట్టిఆకులలో నున్నట్లు కొన్నిటి చివర ఒనదేరక, దోసి వేసి నట్లుండును. ఇట్టి దానిని క్షిప్తము అందుము.

బొమ్మ
విషమరేఖ పత్రము:
విషమ రేఖ పత్రము

అకులమీద సాధారణముగ మధ్యనొక పెద్ద ఈనె యుండి దాని నుండి చిన్న ఈనెలు వచ్చి ఒక దానితో నొకఆటి శాఖోపశాఖలై కలిగియున్నవి. ఇట్లు ఒక దానితో నొకటి కలియు చుండిన విషమ రేఖ పత్రమందుము. 24

మెట్టతామర, కొబ్బరి మొదలగు ఆకులలో ఈనెలు కొన వరకును గలియకుండనే బోవు చున్నవి. అవి సమ రేఖ పత్రములు. ప్రత్తి, గంగరావి ఆకులలో ఈనెలు తాళ పత్ర వైఖరిగ నున్నవి. అరటి యాకు వలె కొన్ని నున్నగా నుండును. మర్రి ఆకులవలె కొన్ని దట్టముగా నుండును. కొన్ని ఆకులు మీద మెత్తనివో బిరుసువో రోమమములు గలిగి వున్నవి.

బొమ్మ
(సమరేఖ పత్రము)
సమరేఖ పత్రము
పుష్పములు

మొలచుచున్న ప్రతి మొక్కయు పువ్వులను పూసి, కాయలను గాసి తన జన్మమును సార్థకము చేసికొన జూచు చున్నది. వాని సంతాన వృద్ధికి కారణమగు భాగము లీ పుష్పములే. పువ్వులు ఒక్కొక్కటి విడివిడిగా నైనను, ఒక కాడ మీద తురాయి మామిడి కొబ్బరి పువ్వులవలె కలిసి యైన వుండును. కొన్నిటిలో పువ్వులు కణుపు సందుల నుండి బయలు దేరును. కొన్నిటిలో గన్నేరు మొక్కలో వల్లె 25

కొమ్మల చివరల నుండి బయలు దేరును; ఒక కొమ్మ చిట్టచివర ఆకులను వేయుట మాని వేసి, పువ్వులనే బూయును. ఇట్లు ఆకులు వేసెడు కొమ్మలఏ పువ్వులు బూయుట చేతను, సాధారణముగ కొమ్మలు పుట్టెడు కణుపు సందులలో పువ్వులు పుట్టు చుండుట చేతను పువ్వుల కాడలను కొమ్మలేయని యూహింప వలసి యున్నది. ఈ కాడ కొమ్మ యొక్క మార్పు చెందిన రూప మైనపుడు, పువ్వుల రేకులును ఆకుల మారు రూపాలు గావలసి యున్నవి. ఇవి యట్లగుట జీవ శాస్త్రము నందిదివరకే మీరు చదివి యున్నారు. పువ్వుల కాడ మీద రేకులు ఆకుల వలె ఒంటరి చేరిక గను, అభిముఖ చేరిక గను నుండక అన్నియు నిల కణుపు వద్దనే నున్నవి. రేకులును కాడలు పుట్టెడు కణుపులు నొక దాని తోడ నొకటి కలియు చున్నవి. ఆందులవలెనే పుష్ప భాగములు కూడ కణుపుల వద్దనే పుట్టును.

తురాయి, ఆవిశ పువ్వులొక్కొక్క కాడ మీద పెరుగు చున్నవి. పువ్వులకును తొడిమలు గలవు. మధ్యనున్న పెద్ద కాడను వృంతమనియు ఈ తొడిమలను ఉప వృంతములనియు చెప్పుదుము. ఒక్కొక్క పువ్వే యున్న యెడల దానికాడనే వృంతమందుము. ఇట్లు వృంతములు, ఉప వృంతములు నుండి దిగువ నుండి పువ్వులు పూయుచు, వృంతము చివర నింకను మొగ్గలు పుట్టు చున్న యెడల ఆపుష్పములు సముదాయమును గెల అందుము. అట్లు పూచు పద్ధతిని మధ్యాభిసరణ మందుము. 26

విజ్ఞాన చంద్రికా గ్రంధమాల......30
వృక్ష శాస్త్రము
(విశేషముగా హిందూదేశపు వృక్షముల గురించి)



ఇయ్యది వి.శ్రీనివాస రాబు బి.ఏ. గారిచే రచింప బడినది.


ప్రకాశకులు

విజ్ఞాన చందికా మండలి. చెన్నపురి. సర్వ స్వామ్య సంకలితము: 1915. 27

రెమ్మ గెలవలెనే రెమ్మకంకులు, రెమ్మ గుత్తులు గలవు. బంతి, చామంతి, తుమ్మ పువ్వులు నిజముగా ఒక్కొక్క పువ్వు గాదు. మనమొతడి యనుకొనునది పుష్పముల సముదాయమే. బంతి పువ్వులోను చామంతి పువ్వులోను ఒక్కొక్క రేక ఒక్కొక్క పువ్వు. ఇటి పుష్ప సముదాయమునకు బంతి యనిపేరు.

బొమ్మ
(మధ్యారంభ మంజరి. వృశ్చికమ మంజరి, శంఖనకమ మంజరి.
మధ్యా

కొన్నిటిలో కడ మీది చివ్ర పువ్వులు మొతడ వికసింప నారంభించును. మూడు పువ్వులు కలిసి యుండి నపుడు మధ్య నున్నది మొదట వికసించును. ఈ పద్ధతి గల కాడకు మధ్యారంభ మంజరి అని పేరు. ఈ మధ్యారంభ మంజరిలో ప్రక్కనున్న పువ్వులకు బదులు వృంతములే యున్న యడల దానిని ద్వివృంతమధ్యారంభ మంజరి యందుము.

కొన్ని మధ్యారంభ మంజరులలో పువ్వులు రెండు వైపుల నుండక నొక వైపుననే ల్యుండుటచే కద వంగి నత్తగుల్లమీద చుట్టు లున్నట్లుండును గావున దీనికి శంఖనఖ మధ్యారంభమంజరి యని పేరు. మరికొన్ని మధ్యారంభ మంజరులలో 28

పువ్వులన్నియు పైదాని యందు వలె నొక వైపునకే నుండక ఒక మాటొక వైపునకు ఇంకొక మాటింకొక వైపునకు నుండును. ఇట్టి దానిని వృశ్చిక మధ్యారంభ మంజరి యందుము.

బొమ్మ (ఉమ్మెత్త పువ్వు. 2. అండ కోశము, కీలము, కీలాగ్రము, 3. దళవలయము కింజల్కము లగుపడునట్లు చీల్చ్ బడినది. 4. కింజల్కము, కాడ, పుప్పొడి తిత్తి.
తెల్ల ఉమ్మెత్త చెట్టు. పువ్వు
నల్ల ఉమ్మెత్త చెట్టు

పుష్ప భాగములు రక్షక పత్రములు, ఆకర్షణ పత్రములు, కింజల్కములు, స్త్రీ పత్రమని మీరీవరకే చదివి యున్నారు. రక్షక పత్రముల కన్నిటికి కలిపి పుష్ప కోశమనియు, ఆకర్షణ పత్రములకు దళవలయమనియు స్త్రీ పత్రమున కంతకు అండ కోశమనియు గూడ పేరులు గలవు. స్త్రీ పత్రము కొనయందుండు కాడను కీల మనియు, కొనదిమ్మను కీలాగ్రమనియు చెప్పుదురు. 29

మందార పువ్వు మీద పుష్ప కోశము వద్ద ఆకు పచ్చని రేకలు గలవు. ఇవియు, పువ్వుల రేకల వలె ఆకుల మార్పులే. వానికి చేటికలని పేరు. బంతి ప్రొద్దుతిరుగుడు పువ్వులలో (పువ్వుల బంతిలో) అడుగున ఆకు పచ్చగ గిన్నెవలె నేర్పడినవి చేటికలే. ఒక పుష్పములో నన్ని భాగములుండిన యుండును. లేదా లేక పోవచ్చును. వాని సంఖ్యయు అన్నిటి యందు నొక రీతి నుండదు. కలువ పువ్వులో, ఆకర్షణ పత్రములు కింజల్కములు చాలగలవు. అవి అసంఖ్యములు. కాని తరుచుగా ప్రతి వలయమునందును, ( అనగా, ఆకర్షణ పత్రములు, రక్షక పత్రములు, కింజల్కములు, అండకోశమునందును) పల్లేరు పువ్వులోనున్నట్లు అయిదేసి యుండుత వాడుక. పల్లేరు పువ్వులో అయిదేసి కింజల్కములున్న రెండు వలయములు గలవు. అన్ని ఏక దళ బీజములలోను, (కొబ్బరి, అరటి, వరి, మొదలగు వానిలో ) వలయమునకు మూడేసి యుండును. ఆముదపు వువ్వులలో పుష్ప కోశము, దళవలయమను రెండు లేవు.

ఆముదపు కొమ్మ.. పువ్వులు
బొమ్మ
(ఆముదపు కొమ్మ, పువ్వులు) 30

ఒకటి మాత్రమే కలదు. ది ఏదగునో చెప్పుత కష్టము గాన దానిని పుష్పనిచోళన మందుము. ఉల్లి, కేసరి, చెంగల్వ పువ్వుల్లోను రెండు వలయములు ఒక రీతినే యున్నవి. వీనినే భేదమెన్నుటయు కష్టమే. దీనిని పుష్పనిచోళన మందుము. రక్షక పత్రములును, ఆకర్షణ పత్రములును విడివిడిగా నైనను అన్నియు గలసి యైనను నుండును. విడివిడిగా నున్న

బొమ్మ
(కేశరి పుష్పము)

వీనిలో భేదమెన్నుటయు కష్టమే. దీనిని పుష్ప నిచోళనమందుము. రక్షక పత్రములు, ఆకర్షణ పత్రములును విడివిడిగా ననను అన్నియు గలసి యైనను నుండును. విడివిడిగా నున్న 31.

తెల్లడమరు
బొమ్మ
(తెల్లడమరు. అసంయుక్త డళ వలయము)

క్రింద, నొక ల్కాయ, రేకులు, కొన్ని కింజల్కములు దీని పువ్వు. 34. ఉచ్చమనియు, క్రింద నున్న ఎడల నీచమనియు చెప్పుదుము. పుష్ప కోశమును, దళవలయమును మొగ్గగా నున్నప్పుడు వికసించి నప్పుడున్నట్లే ఉండవు. రేకులు ఒకదాని నొకటి పప్పుచు నైన నుండును. గంగ రావి పువ్వుల ఆకర్షణ పత్రములు ఒకదానిని నొకటి గప్పుచు నున్నవి. ఇవి త్రాడు మెలి వేసి

బొమ్మ
(మావలింగము. ఆకర్షణ పత్రములకు పాదము గలదు.)
మావలింగము
కొనినట్లు మెలి వేసి కొనియున్నవి. మందార పువ్వులో కొన్ని ఆకర్షణ పత్రములు లోపలగా నున్నవి. వానిని గప్పుచు కొన్ని యున్నవి. కొన్ని ఒకదాని నొకటి తాకుచు మాత్ర ముండును. కొన్నిటిలో తాకకుండను నుండుట గలదు. గంగ రావి రేకులు మెలివెట్టికొని యున్నవందుము. మందారపు రేకులు అల్లుకొని యున్నవి. మిగిలినవి తాకుచునో విడివిడిగానో ఉన్నవందుము. తురాయి పువ్వులో ఆకర్షణ పత్రములు పెద్దవియే. కాని వాని మొదట లాచ సన్నముగనున్నది. అది కాడవలే నున్నది. దానిని పాదమందుము. దళ వలయము సంయుక్తమై ప్రొద్దు తిరుగుడు పువ్వులో మధ్యనున్న పువ్వుల వలె గొట్టము వలెనైనను చిలగడ దుంప పువ్వుల వలె గరాట వలెనైనను వంగ, మిరప వువ్వులవలె నక్షత్రాకరముగ నైనను బిళ్ళ గన్నేరు పువ్వులలో వలె ఛత్రాకారముగ నైనను నాగసరపు కాయల వలె నైనను, గంట వలెనైనను నుండును. చిక్కుడు
బొమ్మ
(అడ్డసరము. పుష్పము) 36

తులసి మొదలగు పువ్వులలో దళవలయము సరిగా లేదు. ఆసరాళముగ నున్నది. గుండ్రముగా నుండక కొంచము వంకరగా నున్నది. చిక్కుడు పువ్వు ఒకవిధమగు సీతాకోక చిలుక వలెనున్నది. దీనిలో ఒక రేకు పెద్దదిగా జండావలె నున్నది. దీనికే పతాక దళమని పేరు. దీని ప్రక్కను రెండు రెక్కలవలె గలవు. అవి పక్షదళములు. ఇంకొక రెండు రేకులు గలిసి

బొమ్మ
(బఠాణిపువ్వు) బఠాణి పువ్వు విడదీసిన రేకులు, పెద్దది పతాక దళము, ప్ర్క్కనున్నవి పక్ష దళములు.)

చుక్కాను వలె నేర్పడినవి. అవి ద్రోణీదళములు. తులసి అడ్డసరము పువ్వులు ఓష్టాకారముగ నున్నవి.

దానిమ్మ మొదలగు కొన్ని పువ్వులందు దళ వలయౌ పుష్పకోశము నండి యున్నది. దళవలయము తరువాత 37

కింజల్కములు గలవు. కింజల్కములే పురుషాంగములు. వీనిలో రెండు ముఖ్య మైన భాగములున్నవి. ఒకటి కాడ, రెండు పుప్పొడితిత్తులు. ఈ పుప్పొడి తిత్తులలో రెండు గదులుండును. కాడని పుప్పొడి తిత్తులను గలుపు నొక సన్నని కాడకు సంయోజక మని పేరు. సాధారణముగా ఒక్కొక్క కాడ రెండు ఆకర్షణ పత్రములకు మధ్యగా నుండును. కాని రేగు పువ్వులోను మరి కొన్నింటిలో కింజల్కములు అకర్షణ పత్రముల కెదురుగనే యున్నవి.

కుంకుడు, నారింజ, మొదలగు వాని యందు కింజల్కముల మధ్యనో, వాని చుట్టునో ఒక పళ్ళెము గలదు. ఇది వృంతము యొక్క భాగమే.

కింజల్కములు కొన్నింటిలో పుష్ప కోశమును, కొన్ని టిలో దశవలయమును, కొన్నిటిలో అండాశయమును గూడ అంటుకొని యుండుచున్నవి. కింజల్కములు, అండ కోశము, స్త్రీ పురుషాంగములు గనుక నవి రెండును ఉన్న పుష్పములను మిధున పుష్పములందుము. వీనిలోనేదైన ఒకటియే యుండిన నది ఏక లింగ పుష్పము. తాటి చెట్లలో వలె ఏకలింగ పుష్పములు వేరు వేరు చెట్ల మీద నున్నయెడల నవి ఏక లింగ వృక్షములందుము.

పుష్ప భాహము లన్నిటిలో అండ కోశమే చివర బయలు దేరుచున్నది. చిక్కుడు., చింత పువ్వులందు అండ కోశము ఒక పునర్యుక్తము. 39

సంయోగమనియు; బెండ, మందారము మొదలగు వానిలో స్థంభ సంయోగమనియు చెప్పుదుము.

బొమ్మ. (1.కుడ్య సంయోగము, 2. మధ్య సంయేగము. 3. స్థంభ సంయోగము


అండాశయములో నిల్లిక్క గదియే యున్న కొన్నిటిలో అండములు గదిగోడతో జేరక మధ్యగా నున్నవి. ఇట్టి దానిని మధ్య సంయోగమ మందుము. బంతి మొదలగు కొన్నిటియందు ఒక అండమే కలదు. అది అండాశయము యొక్క అడుగును జేరియున్నది. ఇది పీఠ సంయోగము. పుప్పొడి వచ్చి అండ కోశమును చేరుటయే పుష్పము లందలి గర్భాధానము. ఇది ఎట్లు సమకూరుచున్నదో, తరువాత సంయోగము, గర్భాధారణము ఎట్లు కలుగు చున్నవో మీరిది వరకే జీవ శాస్త్రమునందు చదివియున్నారు. గర్భాదానమైన పిదప అరక్షక పత్రములు, ఆకర్షణ పత్రములు, కింజల్కములు, కీలము రాలిపోవును. వాని పని నవి నెరవేర్చినవి. రక్షక పత్రముల పని మిగిలిన భాగములను కాపాడుటయే. ఆకర్షణ పత్రములే పుష్పమునకు అందము దెచ్చును. ఆముదము 40

దెచ్చుటయే వీని పని. సొంపుగ నుండి, భృంగాదులను రంగు చేతనో, వాసన చేతనో, ఆకర్షించి గర్భాదానము గావించును. అది యెడగూడిన తోడనే ఆకర్షణ పత్రములు రాలి పోవు చున్నవి. కింజల్కముల నుండి పుప్పొడి పోగానే అవియు వదిలి పోవుచున్నవి. కీలము ద్వార పుప్పొడి (కణ మొకటి) అండమును జేరిన పిమ్మట కీలమును రాలిపోవును. అండాశయమొక్కటి మాత్రమే నిలచి యుండి, గింజలతో గూడ బెరుగుచు, కాయ, పండు, అగును. వంగ, దానిమ్మ, జామ కాయలలో పుష్ప కోశము కూడ కాయ నంటి పెట్టుకొని స్థిరముగా నుండు చున్నది.

ఫలములు

కొన్ని కాయలు పండి ముదిరిన పిదప అరటి, మామిడి, ద్రాక్షపండ్ల వలె కండ గలిగి మెత్తగా నుండును: కొన్ని చిక్కుడు, బెండ, కాయలవలె ఎండిపోయి కండ లేకుండ నుండును. అరటి మొదలగువానిని గుంజ కాయలనియు, చిక్కుడు బెండ కాయలను ఎండు కాయలనియు, జెప్పుదుము. మామిడి పండులోని టెంక గింజ కాదు. గింజ ఆ టెంక లోపల నున్నది. టెంక కూడ పైచర్మము, గుంజు, వంటి భాగమే. అది మాత్రము గట్టిబడి నానినుండి విడియున్నది. ఇట్టి కాయలను లోపెంకు కాయలందుము. కొబ్బరికాయయు లోపెంకు కాయయె. పైన వుండవలసిన కండ పీచుగా మారి యున్నది. విత్తనమును, ఆకాయ లోపల నున్నది. అరటి పండు, నందును 41

బొమ్మ
కొబ్బరి కాయ/ 2. మామిడి, లోపెంకు కాయ. 3. వంకాయ, కండ కాయ.

కండ కాయలు, వెలగ పండు, బూడిగ గుమ్మడి, గుమ్మడి కాయలు గూడ కండ కాయలె. వీనిని పైపెంకుకాయలని గూడజెప్పుదురు. 42


తొగరు, పనస, అనాసకాయలలో చాల పుష్పములు గలసి ఒకకాయాగ ఏర్పడు చున్నది. ఇది మిశ్రమ ఫలము. ఒక్క సంపెంగ పువ్వునుండి చాల కాయలు వచ్చు చున్నవి. ఇవి సమూహ ఫలములు. జీడిమామిడి పండులో మనము గింజ అనునదియెకాయ. గింజనంటుకొని యున్న 'కండకాయ వృతమె పువ్వు యొక్క కాడ యందు కండ బట్టుటచే నిట్లేర్పడినది. కాశి రేగు పండులోను వృతమే కండపట్టుచున్నది. కాయవృంతము లోపల దించుకొని పోయి యున్నది. ఇది వృంతఫలములు. 43


బొమ్మ
ఏకవిధారణ ఫలము

చిక్కుడు ద్వివిదారాణ ఫలము 44

ఎండు కాయల సాధరణముగా పగులును. చిక్కుడు గులివింత కాయలవలె కొన్ని రెండు వైపుల బగులు. ఇవి ద్వివిదారణ ఫలములు. జిల్లేడు కాయ బిళ్ళగన్నేరు కాయ ఒకప్రక్కనే పగులు చున్నవి. ఇవి ఏక విదారణ ఫలములు. బెండ, గంగ రావి, కాయలు చాల చోట్ల పగులు చున్నవి గాన నివి బహు విదారణర ఫలము లందుము. దనియములు, నక్కెరెకాయలు, 45

తుత్తురుబెండకాయలు పగులుచున్నవి గాని గింజలు పైకి వచ్చుటలేదు. గింజలు మూసికొనియున్న గదులలోనె యున్నవి. గదులు మాత్రము విడిపోవు చున్నవి. ఇవి విభజన ఫలములు. తోట కూర, కోడిజుట్టు కాయలలో నొక గదియే గలదు.

బొమ్మ
1. లేతబెండ కాయ. 2. దీనిచీలిక. 3. ఎండి పగిలిన కాయ. 4. పదిలినవైఖరి, పగులు కోష్ట దారుణము.