Jump to content

విష్ణు సహస్రనామ స్తోత్రము

వికీసోర్స్ నుండి

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం

పూర్వపీఠిక :
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం|
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్||

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః||

అవికారాయ శుద్ధాయ నిత్యాయపరమాత్మనే|
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే||

యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్|
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే||
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే

శ్రీ వైశంపాయన ఉవాచ :
శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః|
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత||

యుధిష్టిర ఉవాచ :
కిమేకం దైవతం లోకే కిం వా ప్యేకం పరాయణం|
స్తువంతః కం క మర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్||

కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః|
కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్||

శ్రీ భీష్మ ఉవాచ :
జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం|
స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః

తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం|
ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ||

అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం|
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్||

బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం|
లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్||

ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః|
యద్భక్త్యా పుణ్డరీకాక్షం స్తవైరర్చే న్నర స్సదా||

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః|
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్||

పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం|
దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా||

యత స్సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే|
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే||

తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే|
విష్ణో ర్నామసహస్రం మే శృణు పాపభయాపహం||

యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః|
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే||

విష్ణో ర్నామసహస్రస్య వేదవ్యాసో మహా నృషిః|
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే||

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః
చందో నుష్టుప్ తథా దేవోః భగవాన్ దేవకీసుతః|

అమృతాం శూద్భవో బీజం శక్తిర్దేవకి నందనః|
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే||

విష్ణుజిష్ణుం మహా విష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం|
అనేక రూపదైత్యాంతం నమామి పురుషోత్తమం||

అస్య శ్రీ విష్ణోః దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య |
శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః|
అనుష్టుప్ఛన్ధః |

శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా |

అమృతాంశూద్భవో భానురితి భీజం |

దేవకీ నందన స్రష్టేతి శక్తిః |

ఉద్భవః క్షోభణోదేవ ఇతి పరమోమన్త్రః |

శంఖభృన్నందకీ చక్రీతి కీలకం |

శారంగ ధన్వా గదాధర ఇత్యస్త్రం |

రధాంగపాణి రక్షోభ్య ఇతినేత్రం |

త్రిసామా సామగస్సామేతి కవచం |

ఆనందం పరబ్రహ్మేతి యోనిః |

ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్భందః|

శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం |

శ్రీ మహావిష్ణు (కైంకర్యరూపే) ప్రీత్యర్ధే శ్రీ సహస్రనామ స్తోత్రజపే వినియోగః ||

ధ్యానమ్ :
క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం
మాలాకౢప్తాసనస్ధః స్ఫటికమణి నిభైః, మౌక్తికైః మణ్డితాంగః|
శుభ్రైరభ్రైరదభ్రైః ఉపరి విరచితైః ముక్తపీయూషవర్షైః|
ఆనందీ నః పునీయాత్ అరినళిన గదా శంఖపాణిః ముకుందః||

భూఃపాదౌ యస్యనాభిః వియదసురనిలః చంద్రసూర్యౌచనేత్రే|
కర్ణావాసాశ్శిరోద్యౌః ముఖమపి దహనో యస్యవాస్తేయమబ్ధిః|
అన్తస్థం యస్యవిశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః
చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి|

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం|
లక్ష్మీకాన్తం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వన్దే విష్ణుంభవభయహరం సర్వలోకైక నాధమ్||

మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకంకౌస్ధుభోద్భాసితాంగం|
పుణ్యోపేతం పుణ్డరీకాయతాక్షం విష్ణుం వన్దే సర్వలోకైకనాధమ్||

సశంఖ చక్రం సకిరీటకుణ్డలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం|
సహారవక్షస్ధల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్||

|| హరిః ఓం ||

విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః||
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః||

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః|
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞోక్షర ఏవ చ||

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః|
నారసింహవపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః||

సర్వశ్శర్వ శ్శివ స్ధాణుః భూతాది ర్నిధి రవ్యయః|
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః||

స్వయంభూశ్శంభు రాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః|
అనాది నిధనో ధాతా విధాతా ధారురుత్తమః||

అప్రమేయా హృషీకేశః పద్మనాభో మరప్రభుః||
విశ్వకర్మా మనుస్త్వష్టా స్ధవిష్ఠః స్ధవిరో ధ్రువః||

అగ్రాహ్యాః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః|
ప్రభూత స్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరమ్||

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః|
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః||

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః|
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్||

సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః|
అహ స్సవంత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః||

అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః|
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః||

వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమ్మిత స్సమః|
అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః||

రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః|
అమృత శ్శాశ్వతః స్ధాణుః వరారోహో మహాతపాః||

సర్వగ స్సర్వవిద్భానుః విష్యక్సేనో జనార్దనః|
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః||

లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః|
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః||

భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః|
అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః||

ఉపేన్ద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః|
అతీన్ద్ర స్సంగ్రహా స్సర్గో ధృతాత్మా నియమో యమః||

వేద్యో వైద్య స్సదా యోగీ వీరహా మాధవో మధుః|
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః||

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః|
అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్||

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః||
అనిరుద్ధ స్సురానందో గోవిన్దో గోవిదాం పతిః||

మరీచి ర్దమనో హంసః సువర్ణో భుజగోత్తమః|
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః

అమృత్యు స్సర్వదృక్సింహః సన్ధాతా సన్ధిమాన్ స్ధిరః|
అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా||

గురు ర్గురుతమో ధామః సత్యస్సత్య పరాక్రమః|
నిమిషో నిమిష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః||

అగ్రణీర్ద్రామణీ శ్శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః|
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్||

ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః|
అహస్సంవర్తకో వహ్ని రనిలోధరణీధరః

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ సృగ్విశ్వభుగ్విభుః|
సత్కర్తా సత్కృతస్సాధుః జహ్నుర్నాయణో నరః||

అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృచ్ఛుచిః|
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిద సిద్ధి సాధనః||

వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః|
వర్థనో వర్ధమానశ్చ వివిక్త శ్ర్శుతిసాగరః||

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః|
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః||

ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః|
ఋద్ధఃస్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః||

అమృతాంశూద్భవో భానుః శశిబిందుస్సురేశ్వరః|
ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః||

భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః||

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః|
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనన్తజిత్||

ఇష్టోవిశిష్ట శ్శిష్టేష్టః శిఖణ్ణీ నహుషో వృషః|
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః||

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః|
అపాంనిధి రధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః

స్కందః స్కందధరో ధుర్యోవరదో వాయువాహనః|
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురన్దరః||

అశోక స్తారణ స్తారః శూరశ్శౌరి ర్జనేశ్వరః|
అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః||

పద్మనాభోరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్|
మహర్థి ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః||

అతులశ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః|
సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః||

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర స్సహః|
మహీధరో మహాభాగో వేగవానమితాసనః||

ఉద్భవ క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః|
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః||

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః||
పరర్థిః పరమస్పష్టః తుష్టః పుష్టశ్శుభేక్షణః||

రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః||
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః|

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః||

ఋతుస్సుదర్శనః కాలఃపరమేష్ఠీ పరిగ్రహః|
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః||

విస్తారః స్ధావర స్ధాణుః ప్రమాణం బీజమవ్యయం|
అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః||

అనిర్విణ్ణః స్థవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః|
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః||

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః|
సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం||

సువ్రతస్సుముఖసూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్|
మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః||

స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్|
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశరః||

ధర్మకృబ్ధర్మకృద్ధర్మీ సదసక్షర మక్షరం|
అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః||

గభస్తినేమిస్సత్వస్ధః సింహో భూతమహేశ్వరః|
ఆదిదేవో మహాదేవో దేవోశో దేవభృద్గురుః||

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః
శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః||

సోమపో మృతపస్సోమః పురుజిత్పురుసత్తమః|
వినయోజయస్సత్ససన్ధో దాశార్హ స్సాత్వతాం పతిః||

జీవో వినయితా సాక్షీ ముకున్దోమిత విక్రమః|
అమ్భోనిధి రనన్తాత్మా మహోదధిశయో న్తకః||

అజో మహర్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః|
ఆనన్దో నన్దనో నన్దః సత్యధర్మా త్రివిక్రమః

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః|
త్రిపదస్త్రిదశాధ్యక్షః మహాశృంగకృతాన్తకృత్||

మహావరాహో గోవిన్దః సుషేణః కానాకాంగదీ|
గుహ్యోగభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః||

వేదాస్వ్యాంగో జితఃకృష్ణోదృఢస్సంకర్షణోచ్యుతః|
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహమనాః||

భగవాన్ భగహానన్దీ వనమాలీ హలాయుధః|
ఆదిత్యో జ్యోరిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః||

సుధన్వా ఖణ్డపరశుః దారుణో ద్రవిణః ప్రదః|
దివిస్పృక్సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః||

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్|
సన్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠాశాన్తిః పరాయణమ్||

శుభాంగశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః|
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః||

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః|
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః||

శ్రీదశ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిశ్శ్రీవిభావనః|
శ్రీధరశ్శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః||

స్వక్ష స్స్వంగ శ్శతానన్దో నన్దిర్జ్యోతి ర్గణేశ్వరః|
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః||

ఉదీర్ణస్సరతశ్చక్షుః అనీశ శ్శాశ్వతః స్ధిరః|
భూశయో భూషణో భూతిః విశోక శ్శోకనాశనః||

అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః
అనిరుద్ధో ప్రతిరధః ప్రద్యుమ్నోమితవిక్రమః||

కాలనేమినిహా శౌరిః శూర శ్శూరజనేశ్వరః|
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః||

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః|
అనిర్దేశ్యవపుః విష్ణుః వీరోనంతో ధనంజయః||

బహ్మణ్యోబ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మబ్రహ్మ వివర్థనః
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః||

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః|
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః||

స్తవ్యస్తవప్రియ స్తోత్రం స్తుత స్తోతారణప్రియః|
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః||

మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః|
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః||

సద్గతి స్సత్కృతిస్సత్తా సద్భూతి స్సత్పరాయణః|
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామునః||

భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః|
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః||

విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్|
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శ్శతాననః||

ఏకో నైక స్సవః కః కిం యత్తత్పద మనుత్తమం|
లోకబన్ధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః||

సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చన్దనాంగదీ|
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః||

అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||

తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః|
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః|

చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహః చతుర్గతిః|
చతురాత్మా చతుర్భావః చతుర్వేద విదేకపాత్||

సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః|
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా||

శుభాంగో లోకసారంగః స్తతన్తు స్తన్తువర్ధనః|
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః||

ఉద్భవ స్సుందర స్సున్దో రత్ననాభ స్సులోచనః|
అర్కో వాజసనః శృంగీ జయన్తః సర్వవిజ్జయీ||

సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః|
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః||

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనో నిలః|
అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః||

సులభ స్సువ్రత స్సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః|
న్యగ్రోధోదుంబరో శ్వత్థః చాణూరాన్ద్ర నిషూదనః||

సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైథా స్సప్తవాహనః|
అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః||

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|
అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||

భారభృత్ కథితో యోగీ యోగీశ స్సర్వకామదః|
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః||

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః|
అపరాజిత స్సర్వసహో నియన్తా నియమో యమః||

సత్త్వవాన్ సాత్విక స్సత్యః సత్యధర్మపరాయణః||
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః||

విహాయసగతి ర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః|
రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః||

అనన్తో హుతభుగ్భోక్తా సుఖదో నైకదో గ్రజః|
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః||

సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః|
స్వస్తిద స్స్యస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః||

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః|
శబ్దాతిగ శ్శబ్దసహః శిశిర శ్శర్వరీకరః||

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః|
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః||

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్యప్న నాశనః|
వీరహా రక్షణ స్సన్తో జీవనం పర్యవస్ధితః||

అనన్తరూపో నన్త శ్రీః జితమన్యుర్భయాపహః|
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః||

అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః|
జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః||

ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః|
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః||

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః
తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||

భూర్భువ స్స్యస్తరుస్తారః సవితా ప్రపితామహః|
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః|

యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః|
యజ్ఞాన్తకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవచ||

ఆత్మయోని స్స్యయంజాతో వైఖాన స్సామగాయనః|
దేవకీ నన్దన స్స్రష్టా క్షితీశః పాపనాశనః||

శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|
రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||

శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి
వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నన్దకీ|

శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు||
శ్రీ వాసుదేవోభి రక్షతు ఓం నమ ఇతి

ఉత్తర పీఠిక :
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః|
నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితమ్||

య ఇదం శృణుయాత్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్
నాశుభం ప్రాప్నుయాత్కించిత్ సో ముత్రేహచమానవః||

వేదాన్తగోబ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీ భవేత్|
వైశ్యో ధనసమృద్ధస్స్యాత్ శూద్ర స్సుఖ మవాప్నుయాత్||

ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మం అర్థార్థీ చార్ధమాప్నుయాత్
కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్ను యాత్ప్రజాః||

భక్తిమాన్య స్సదోత్థాయ శుచిస్తద్గత మానసః|
సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్ ప్రకీర్తయేత్||

యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవచ|
అచలాం శ్రియ మాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం||

న భయం క్వచి దాప్నోతి వీర్యం తేజశ్చ విన్దతి|
భవ త్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః||

రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బన్ధనాత్|
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే తాపన్న ఆపదః||

దుర్గాణ్యతితర త్యాశు పురుషః పురుషోత్తమం|
స్తువ న్నామసహస్రేణ నిత్యం భక్తి సమన్వితః||

వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః|
సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం||

న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్|
జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే|

ఇమం స్తవ మధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః|
యుజ్యే తాత్మ సుఖక్షాన్తిః శ్రీ ధృతి స్మృతి కీర్తిభిః||

నక్రోధో న చ మాత్సర్యం న లోభో నా శుభామతిః|
భవన్తి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే||

ద్యౌ స్సచంద్రార్కనక్షత్రం ఖం దిశో భూర్మహోదధిః|
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః||

ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసం|
జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం||

ఇన్ద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజోబలం ధృతిః||
వాసుదేవాత్మ కాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ||

సర్వాగమానా మాచారః ప్రథమం పరికల్పితః||
ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః||

ఋషయః పితరో దేవః మహాభూతాని ధాతవః|
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్||

యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శ్శిలాది కర్మచ|
వేదశ్శాస్త్రాణి విజ్ఞానం ఏతత్‌సర్వం జనార్దనాత్||

ఏకోవిష్ణు ర్మహద్భూతం పృథగ్భూతా న్యనేకశః|
త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః||

ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం|
పఠేద్య ఇచ్ఛేత్ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖానిచ||

విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభుమవ్యయం|
భజన్తి యే పుష్కరాక్షం నతే యాన్తి పరాభవమ్||
నతే యాంతి పరాభవమ్ ఓమ్ నమ ఇతి

అర్జున ఉవాచ :
పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ|
భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనర్ధన||

శ్రీ భగవానువాచ :
యోమాం నాం సహస్రేణ స్తోతు మిచ్ఛతి పాణ్డవ|
సో హ మేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః||
స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి

వ్యాస ఉవాచ :
వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం|
సర్వభూత నివాసో సి వాసుదేవ నమోస్తుతే||
శ్రీ వాసుదేవ నమోస్తుత ఓమ్ నమ ఇతి

పార్వత్యువాచ :
కేనోపాయేన లఘనా విష్ణోర్నామ సహస్రకం|
పఠ్యతే పండితిః నిత్యం శ్రోతు మిచ్ఛామ్యహం ప్రభో||

ఈశ్వర ఉవాచ :
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే|
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే||
శ్రీ రామనామ వరానన్ ఓమ్ నమ ఇతి

బ్రహ్మోవాచ :
నమో స్త్వనన్తాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే |
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీయుగధారిణే నమః ||
శ్రీ సహస్ర్రకోటీ యుగధారిణే ఓమ్ నమ ఇతి

సంజయ ఉవాచ :
యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః|
తత్రశ్రీః విజయోభూతిః ధ్రువా నీతిః మతిర్మమ||

శ్రీ భగవానువాచ :
అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే|
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం||

పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే||

ఆర్తా విషణ్ణాశ్శిథిలాశ్చభీతాః ఘోరేషుచవ్యాధిషు వర్తమానాః|
సంకీర్త్యనారాయణ శబ్దమాత్రం విముక్త ధుఃఖాస్సు ఖినోభవన్తి||

యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్|
తత్సర్వం క్షమ్యతాం దేవ! నారాయణ! నమోస్తుతే||

ఇతి శ్రీ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం
ఆనుశాసనిక పర్వణి మోక్షధర్మే శ్రీ భీష్మ-యుధిష్ఠిర సంవాదే
శ్రీ విష్ణోః దివ్యసహస్రనామ స్తోత్రం నామ ఏకోన పంచాశదధిక ద్విశతతమోధ్యాయః |

|| ఓం తత్ సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ||

హరిఓం


1.విశ్వం --- విశ్వము అంతా తానే ఐన వాడు (నామ రూపాత్మకమై, చిత్రాతి చిత్రమై, వికసించి, విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చరాచర జడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము) , సకల విషయములందును సంపూర్ణమైన వాడు. (అంతా తానైన వాడు). ఇది శ్రీ విష్ణుసహస్రనామములలో మొదటి నామము. అంతా భగవంతుడే అన్న భావంలో ఈ నామానికి భాష్యకారులు వ్యాఖ్యానం చెప్పారు

2.విష్ణుః --- అంతటనూ వ్యాపించి యున్నవాడు. సర్వ వ్యాపకుడు. (అంతటా తానున్నవాడు).

3.వషట్కారః --- వేద మంత్ర స్వరూపి, వషట్ క్రియకు గమ్యము (యజ్ఞములలో ప్రతిమంత్రము చివర మంత్రజలమును 'వషట్' అనే శబ్దముతో వదులుతారు); అంతటినీ నియంత్రించి పాలించు వాడు.

4.భూతభవ్యభవత్ ప్రభుః --- భూత కాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము - మూడు కాలములకు అధిపతి, మూడు కాలములలోను అన్నింటికి ప్రభువు.

5 .భూతకృత్ --- సకల భూతములను సృష్టించువాడు; ప్రళయ కాలమున సకల భూతములను నాశనము చేయువాడు (భూతాని కృన్తతి).

6.భూతభృత్ --- సమస్త భూతములను పోషించువాడు, భరించువాడు.

7.భావః --- అన్నింటికి ఉనికియైనవాడు. తనలోని సర్వ విభూతులను ప్రకాశింపజేయువాడు. సమస్త చరాచర భూతప్రపంచమంత వ్యాపించి యుండు భగవానుడు. తాను తయారు చేసిన సృష్టి తనకన్నా అన్యముగాక పోవుటవేత తాను సర్వవ్యాపి అయినాడు.

8.భూతాత్మా --- సమస్త భూతములకు తాను ఆత్మయై యుండువాడు. సర్వ జీవకోటియందు అంతర్యామిగా యుండువాడు. సర్వభూతాంతరాత్మకుడైన భగవానుడు సమస్త శరీర మనుగడకు కర్తయై, సాక్షియై యుండు చైతన్యము.

9.భూతభావనః --- అన్ని భూతములను సృష్టించి, పోషించి, నిలుపువాడు. జీవులు పుట్టి పెరుగుటకు కారణమైనవాడు. తల్లిదండ్రులవలె జన్మనిచ్చి, పెంచి, పోషించు వాడు భగవానుడు. అతడే జగత్పిత.

10.పూతాత్మా --- కర్మ ఫల దోషములు అంటని పవిత్రమైన ఆత్మ. 'పూత' అనగా పవిత్రమైన, 'ఆత్మా' అనగా స్వరూపము గలవాడు. పవిత్రాత్ముడు. భూతములు ఆవిర్భవించి, వృద్ధిచెందుటకు భగవానుడు కారణమైనను జీవగుణములతో సంబంధము లేనివాడు.

11.పరమాత్మా --- పరమమైన, అంతకు అధికము లేని, ఆత్మ. సర్వులకూ తానే ఆత్మ గాని, తనకు వేరు ఆత్మ యుండని వాడు. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్యకారణములకంటె విలక్షణమైనవాడు. తాను సర్వులకు ఆత్మయై తనకు మరొక ఆత్మ లేనివాడు.

12.ముక్తానాం పరమాగతిః --- ముక్తులైన వారికి (జనన మరణ చక్రమునుండి విముక్తి పొందిన వారికి) పరమాశ్రయమైన వాడు. ముక్తులకు ఇంతకంటె ఆశించవలసినది మరొకటి లేదు. ముక్త పురుషులకు పరమగమ్యమయిన వాడు - భగవంతుడు. గతి యనగా గమ్యము. పరమా అను విశేషణము యొక్క అర్ధము ఉత్తమము. ఏది గ్రహించిన పిదప మరొకటి గ్రహించనవసరములేదో, ఏ స్థానమును చేరిన జ్ఞానికి పునర్జన్మ ప్రాప్తించదో అదియే పరమగతియని తెలియదగును. నదికి సాగరము పరమగతి అయినట్లు-మానవులకు భగవానుడు పరమగమ్యమయి ఉన్నాడు. సాగరములో లయించిన నది తన వ్యక్తిత్వమును కోల్పోయి అనంత సాగరములో ఐక్యమయిన రీతిని భగవానుని చేరిన జీవి భగవద్వైభవములో లయించుట జరుగుచున్నది. అది కరిగిపోవు సమస్థితియేగాని తిరిగివచ్చు దుస్థితి కాదు. "దేనిని చేరిన పిదప జీవులు తిరిగి రాలేరో అట్టి పవిత్ర పరమగతియే నా నివాసము" అని భగవానుడు భగవద్గీతలో తెలియజేసి యున్నాడు.

13.అవ్యయః --- తరుగు లేని వాడు; తనను చేరిన వారిని మరల జనన మరణ చక్రములో పడనీయని వాడు. వినాశము కానివాడు మరియు వికారము లేనివాడు. గోచరమగునది యేదయినను పరిణామము చెందును. పరిణామశీలమయిన వస్తువు నశించి తీరును. భగవానుడలా పరిణామము చెందు వస్తు సముదాయములలో చేరడు.

14.పురుషః --- ముక్తులకు పుష్కలముగా బ్రహ్మానందానుభవమును ప్రసాదించువాడు; శరీరమందు శయనించియున్నవాడు; సమస్తమునకు పూర్వమే ఉన్నవాడు. జగత్తునకు పరిపూర్ణతనిచ్చువాడు.

15.సాక్షీ --- సర్వమును ప్రత్యక్షముగా (ఇంద్రియ సాధనములు అవుసరము లేకుండా) చూచువాడు; సమస్తము తెలిసినవాడు; భక్తుల ఆనందమును వీక్షించి ప్రీతితో కటాక్షించువాడు. సా+అక్షి = చక్కగా దర్శించువాడు. చక్కగా సమస్తమును దర్శించువాడు సాక్షి యని పాణిని వ్యాకరణము తెలియజేయుచున్నది.

16.క్షేత్రజ్ఞః --- ఈ శరీరమను క్షేత్రమున విలసిల్లుచు, నాశనరహితుడై, క్షేత్ర తత్వమును తెలిసిన వాడు; ముముక్షువుల పరమార్ధమైన శుద్ధ సచ్చిదానంద పర బ్రహ్మానుభవము తెలిసి, వారినక్కడికి చేర్చువాడు.

17.అక్షరః --- ఎన్నడునూ (కల్పాంతమునందు కూడ) నశింపక నిలచియుండువాడు; ముక్తులు ఎంత అనుభవించినా తరగని అనంత సచ్చిదానంద ఐశ్వర్య స్వరూపుడు

18.యోగః --- ముక్తి సాధనకు ఏకైక మార్గము, సాధనము, ఉపాయము; యోగము వలననే పొందదగినవాడు; కోర్కెలు తీరుటకు తిరుగులేణి ఉపాయము. ధ్యానము వలన, సమత్వ భావము వలన తెలియబడువాడు. యోగముచే పొందదగినవాడు - భగవానుడు. సాధ్య సాధనములు తానైన భగవానుడే సాధకులకు మార్గగామి. సాధ్యవస్తువయిన భగవానుడు తనకన్నా అన్యం కాదని గ్రహించిన సాధకుడు ఇంద్రియ మనోబుద్దులను నిగ్రహించి, యోగయుక్తుడయిన భగవానునితో కలసి కరిగిపోవుటయే యోగము.

19.యోగవిదాం నేతా --- తానే మార్గదర్శియై, నాయకుడై, యోగ సాధన చేయువారిని గమ్యమునకు చేర్చువాడు. యోగులకు నేత; కర్మజ్ఞానాది సాధనాంతరములకు ఫలమునొసగువాడు.

20.ప్రధాన పురుషేశ్వరః --- ప్రధానము (ఆనగా ప్రకృతి, మాయ), పురుషుడు (జీవుడు) - రెండింటికిని ఈశ్వరుడు (అధిపతి, నియామకుడు).

21.నారసింహ వపుః --- ప్రహ్లాదుని కాచుటకై శ్రీనారసింహావతారమును ధరించి అవతరించినవాడు; అభయమునొసగువాడు. మంగళ మూర్తి.

22 .శ్రీమాన్ --- రమణీయమైన స్వరూపము గలవాడు (శ్రీనారసింహ మూర్తిగా); సదా లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించినవాడు.

23.కేశవః --- సుందరమైన కేశములతో విరాజిల్లువాడు. కేశి అను రాక్షసుని సంహరించినవాడు. బ్రహ్మ, విష్ణు, శివ రూపములు ధరించువాడు (త్రిమూర్తి స్వరూపి); అందమైన కిరణములతో విశ్వమును చైతన్యవంతులుగా చేయువాడు. 'కేశ' యనెడి అసురుని వధించినవాడు - విష్ణుమూర్తి. మనోహరములైన శిరోజములు (కేశములు) కలిగియున్నవాడు - శ్రీ కృష్ణుడు. "క + అ + ఈశ" కలసి "కేశ" శబ్దమయినది. 'క' అనగా బ్రహ్మ. 'అ' అనగా విష్ణువు, 'ఈశ' అనగా ఈశ్వరుడు. ఈ త్రిమూర్తులకు ఆధారమయిన వాసుదేవ చైతన్యమే కేశవుడు.

24.పురుషోత్తమః --- పురుషులలో ఉత్తముడు; త్రివిధ చేతనులైన బద్ధ-నిత్య-ముక్తులలో ఉత్తముడు. క్షరుడు (నశించువాడు), అక్షరుడు (వినాశన రహితుడు) - ఈ ఇద్దరు పురుషులకు అతీతుడు, ఇద్దరికంటె ఉత్తముడైన వాడు.

25.సర్వః --- సర్వము తానెయైన వాడు. సృష్టి స్థితి లయములకు మూలము.

26.శర్వః --- సకల పాపమును పటాపంచలు చేయువాడు. సమస్త జీవుల దుఃఖములను, అనిష్టములను నాశనము చేయువాడు. ప్రళయ కాళములో సమస్త భూతములను తనలో లీనం చేసుకొనేవాడు.

27.శివః --- మంగళములనొసగు వాడు. శుభకరుడు.

28.స్థాణుః --- స్థిరమైన వాడు. భక్తుల పట్ల అనుగ్రహము కలిగి నిశ్చయముగా ఇష్ట కామ్యములు సిద్ధింపజేయువాడు. వృద్ధి క్షయ గుణములకు లోబడనివాడు.

29.భూతాదిః --- సకల భూతములకు మూలము, కారణము, సకల భూతములచే ఆత్రముగా కోరబడువాడు. పంచ భూతములను సృష్టించిన వాడు.

30.నిధిరవ్యయః --- తరుగని పెన్నిధి, ప్రళయకాలమునందు సమస్త ప్రాణికోటులను తనయందే భద్రపరచుకొనువాడు.

31.సంభవః --- తనకు తానుగానే (కర్మముల వంటి కారణములు, బంధములు లేకుండానే) అవతరించువాడు. శ్రద్ధా భక్తులతో కోరుకొన్నవారికి దర్శనమిచ్చువాడు.

32.భావనః --- కామితార్ధములను ప్రసాదించువాడు. మాలిన్యములు తొలగించి వారిని పునరుజ్జీవింపజేయువాడు.

33.భర్తా --- భరించువాడు; భక్తుల యోగ క్షేమములను వహించువాడు; సకల లోకములకును పతి, గతి, పరమార్ధము.

34.ప్రభవః --- దివ్యమైన జన్మ (అవతరణము) గలవాడు; కర్మ బంధములకు లోనుగాకుండనే అవతరించువాడు.

35.ప్రభుః --- సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు; బ్రహ్మాదులకు కూడ భోగ మోక్షములొసగు సమర్ధుడు.

36.ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.

37.స్వయంభూః --- స్వయముగా, ఇచ్ఛానుసారము, వేరు ఆధారము లేకుండ జన్మించువాడు.

38.శంభుః --- శుభములను, సుఖ సంతోషములను ప్రసాదించువాడు.

39.ఆదిత్యః --- సూర్య మండల మధ్యవర్తియై బంగారు వర్ణముతో ప్రకాశించువాడు; ద్వాదశాదిత్యులలో విష్ణువు;సమస్తమును ప్రకాశింపజేసి పోషించువాడు; అదితి కుమారుడైన వామనుడు. సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు - భగవానుడు. "ద్వాదశాదిత్యులు లో విష్ణువు అను పేరు గలవాడు తానే" యని భగవానుడు భగవద్గీత విభూతి యోగములో తెలియజేసి యున్నాడు. 'ఆదిత్యః' అనగా ఆదిత్యుని వంటి వాడని కూడా భావము. ఆదిత్య ఉపమానము ద్వారా ఈ అద్వైత సత్యమును నిత్యానుభవములోనికి తెచ్చుకొని సంతృప్తి చెందవచ్చును.

40.పుష్కరాక్షః --- తామరపూవు వంటి కన్నులు గల వాడు.

41.మహాస్వనః --- గంభీరమైన దివ్యనాద స్వరూపుడు; వేద నాదమునకు ప్రమాణమైనవాడు.

42.అనాదినిధనః --- ఆది (మొదలు, పుట్టుక) లేనివాడు మరియు నిధనము (తుది, నాశనము) లేనివాడు.

43.ధాతా --- బ్రహ్మను కన్న వాడు; నామ రూపాత్మకమైన ఈ చరాచర విశ్వమునంతను ధరించిన మహనీయుడు.

44.విధాతా --- బ్రహ్మను ఆవిర్భవింపజేసిన వాడు; విధి విధానములేర్పరచి, తగురీతిలో కర్మ ఫలములనొసగువాడు. కర్మఫలముల నందించువాడైన భగవానుడు. విశ్వ యంత్రాంగమంతయు అతని ఆజ్ఞకు లోబడి నడచుచున్నది. తనకు భయపడి ప్రకృతి ప్రవర్తించుచున్నది. సర్వమును కదిలించి, కదిలిన సర్వమును కనిపెట్టి, ధర్మబద్ధంగా ఫలితముల నందించి, పోషించుటచే ఆదిదేవుడు విధాత ఆయెను.

45.ధాతురుత్తమః --- బ్రహ్మకంటెను శ్రేష్ఠుడు, ముఖ్యుడు; సృష్టికి మూలములైన సమస్త ధాతువులలోను ప్రధానము తానే అయినవాడు.

46.అప్రమేయః --- ఏ విధమైన ప్రమాణములచేత తెలియరానివాడు; కొలతలకందనివాడు; సామాన్యమైన హేతు ప్రమాణముల ద్వారా భగవంతుని నిర్వచించుట, వివరించుట, అంచనా వేయుట అసాధ్యము.

47.హృషీకేశః --- ఇంద్రియములకు (హృషీకములకు) అధిపతి; సూర్య, చంద్ర రూపములలో కిరణములు పంచి జగముల నానందింప జేయువాడు. హృషీకములకు అనగా ఇంద్రియములకు ప్రభువు - భగవానుడు. సూర్యచంద్ర కిరణములు హరి ముంగురులని వేద ప్రవచనము. సూర్యచంద్ర రూపులగు భగవానుని కేశములు (కిరణములు) జగత్తునకు హర్షమును కలిగించుచున్నవి. అందుచేత కూడా తాను హృషీకేశుడయ్యెనని మహాభారత శ్లోకము వివరించుచున్నది.

48.పద్మనాభః --- నాభియందు పద్మము గలవాడు. ఈ పద్మమునుండే సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించెను. పద్మము నాభియందు కలిగియుండువాడు - భగవానుడు. అట్టి పద్మము నుండి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించెను. పద్మము జ్ఞానమునకు ప్రతీక. విష్ణుదేవుడు తన జ్ఞానశక్తిచే బ్రహ్మను సృష్టించి, తద్వారా సకల జీవులు పుట్టుటకు కారణమాయెను.

49.అమరప్రభుః --- అమరులైన దేవతలకు ప్రభువు

50.విశ్వకర్మా --- విశ్వమంతటికిని సంబంధించిన కర్మలను తన కర్మలుగా గలవాడు. విశ్వమును సృష్టించిన వాడు. విశ్వరచన చేయగలుగువాడు - భగవానుడు. విచిత్రమైన సృష్టినిర్మాణము చేయగల సామర్ధ్యమును కలిగియుండెను. బ్రహ్మ ఆవిర్భావమునకు పూర్వమే భగవానుదు సృష్టిరచన సాగించెను; కాని సృష్టిని అనుసరించలేదు. అందుచేత సృష్టిలోని అశాశ్వత లక్షణములు భగవానునియందు లేవు. "సర్వభూతములు నాయందున్నవి. నేను వానియందు లేను" అని భగవానుడు భగవద్గీత-రాజవిద్యా రాజగుహ్యమునందు తెలియజేసియున్నాడు.

51.మనుః --- మననము చేయు మహిమాన్వితుడు; సంకల్పము చేతనే సమస్తమును సృష్టించిన వాడు.

52.త్వష్టా --- శిల్పివలె నానా విధ రూపములను, నామములను తయారు చేసినవాడు; బృహత్పదార్ధములను విభజించి సూక్ష్మముగా చేసి ప్రళయ కాళమున తనయందు ఇముడ్చుకొనువాడు.

53.స్థవిష్ఠః --- బ్రహ్మాండమును తనయందు ఇముడ్చుకొన్న బృహద్రూప మూర్తి; సమస్త భూతజాలమునందును సూక్ష్మ, స్థూల రూపములుగా నుండు విశ్వ మూర్తి.

54.స్థవిరః --- సనాతనుడు; సదా ఉండెడివాడు

55.ధ్రువః --- కాలముతో మార్పు చెందక, ఒకే తీరున, స్థిరముగా ఉండెడివాడు

స్థవిరో ధ్రువః (ఆది శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించిరి) --- స్థిరుడై, నిత్యుడై, కాలాతీతుడైన వాడు

56.అగ్రాహ్యః --- తెలియరానివాడు. ఇంద్రియ, మనో బుద్ధులచే గ్రహింప నలవి కానివాడు.

57.శాశ్వతః --- కాలముతో మార్పు చెందక ఎల్లప్పుడు ఉండెడివాడు.

58.కృష్ణః --- సర్వమును ఆకర్షించువాడు; దట్టమైన నీల వర్ణ దేహము గలవాడు; సృష్ట్యాది లీలా విలాసముల వలన సర్వదా సచ్చిదానందమున వినోదించువాడు..

59.లోహితాక్షః --- తామర పూవు వలె సుందరమగు ఎర్రని కనులు గలవాడు; అంధకారమును తొలగించు ఎర్రని కనులు గలవాడు.

60.ప్రతర్దనః --- ప్రళయకాలమున అంతటిని (విపరీతముగ) నాశనము చేయువాడు.

61.ప్రభూతః --- పరిపూర్ణుడై జన్మించిన వాడు; జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజము మొదలగు సర్వగుణములు సమృద్ధిగా గలవాడు.

62.త్రికకుద్ధామః , త్రికకుబ్ధామః --- సామాన్యలోకము కంటె మూడు రెట్లు పెద్దదైన పరమ పదమందు ఉండెడివాడు; మూడు గుణ వర్గములకును ఆశ్రయమైన వాడు; ఊర్ధ్వ, మధ్య, అధో లోకములకు ఆధార భూతుడు; జాగ్రత్, స్వప్న, సుషుప్తి - మూడు అవస్థలందును వ్యాపించియున్నవాడు.

త్రికకుత్ --- మూడు కొమ్ములు (మూపులు) గల శ్రీవరాహమూర్తి

ధామః --- నివాస స్థానము, ప్రకాశవంతమైన కిరణము.

63.పవిత్రం --- పరమ పావన స్వరూపుడు, పరిశుద్ధమొనర్చువాడు.

64.మంగళం పరం --- అన్నింటికంటె మంగళకరమగు మూర్తి; స్మరణ మాత్రముననే అన్ని అశుభములను తొలగించి, మంగళములను ప్రసాదించువాడు.

65.ఈశానః --- సమస్తమునూ శాసించు వాడు; సకలావస్థలలోనూ సకలమునూ పాలించువాడు.

66.ప్రాణదః --- ప్రాణములను ప్రసాదించువాడు (ప్రాణాన్ దదాతి);ప్రాణములను హరించువాడు (ప్రాణాన్ ద్యాతి); ప్రాణములను ప్రకాశింపజేయువాడు (ప్రాణాన్ దీపయతి).

67.ప్రాణః --- ప్రాణ స్వరూపుడు; జీవనము; చైతన్యము.

68.జ్యేష్ఠః --- పూర్వులకంటె, వారి పూర్వులకంటె, పెద్దవాడు; తరుగని ఐశ్వర్య సంపదచే పెద్దవాడు, మిక్కిలి కొనియాడదగినవాడు.

69.శ్రేష్ఠః --- ప్రశంసింపదగిన వారిలోకెల్ల ఉత్తముడు.

70.ప్రజాపతిః --- సకల ప్రజలకు ప్రభువు, తండ్రి; నిత్యసూరులకు (పరమపదము పొందినవారికి) ప్రభువు.

71.హిరణ్యగర్భః --- రమణీయమగు స్థానమున నివసించువాడు, పరంధాముడు; సంపూర్ణానందమగువానిని ప్రసాదించువాడు; చతుర్ముఖ బ్రహ్మకు ఆత్మయై యున్నవాడు.

72.భూగర్భః --- భూమిని (కడుపులో పెట్టుకొని) కాపాడువాడు; విశ్వమునకు పుట్టినిల్లు అయినవాడు.

73.మాధవః --- మా ధవః -శ్రీమహాలక్ష్మి(మా)కి భర్త ; మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు; సకల విద్యా జ్ఞానములకు ప్రభువు; పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు; మధు (యాదవ) వంశమున పుట్టినవాడు; తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు); మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు.

74.మధుసూధనః --- మధు, కైటభులను రాక్షసులను సంహరించినవాడు; బంధకారణములైన కర్మఫలములను నాశనము చేయువాడు.

75.ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లేకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.

76.విక్రమీ --- విశిష్టమగు పాద చిహ్నములు గలవాడు; అమిత శౌర్య బల పరాక్రమములు గలవాడు.

77.ధన్వీ --- (దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు) శార్ఙ్గము అను ధనుసును ధరించినవాడు.

78.మేధావీ --- అసాధారణ, అపరిమిత మేధ (జ్ఞాపక శక్తి) గలవాడు; సర్వజ్ఞుడు.

79.విక్రమః --- బ్రహ్మాండమును కొలిచిన అడుగుల గలవాడు (శ్రీవామన మూర్తి); పక్షిరాజగు గరుత్మంతునిపై పాదములుంచి పయనించువాడు.

80.క్రమః --- సమస్తము ఒక క్రమవిధానములో చరించుటకు హేతువు (క్రమ - పద్ధతి); సమస్త జీవరాశులలోను చైతన్యము (క్రమ - కదలిక); అనంత, అసాధారణ వైభవ సంపన్నుడు (క్రమ - సంపత్తు); సంసార సాగరమును దాటించువాడు (క్రమణ - ఈదుట).

81.అనుత్తమః ---అంతకంటె ఉత్తమమైనది మరొకటి లేదు.

82.దురాధర్షః --- తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు.

83.కృతజ్ఞః --- నామ స్మరణము, శరణాగతి, పూజాది భక్తి కార్యములచే ప్రసన్నుడై భక్తులననుగ్రహించువాడు; పత్ర పుష్పాది అల్ప నివేదనల చేతనే సంతుష్టుడై కామితార్ధ మోక్షములను ప్రసాదించువాడు; సమస్త ప్రాణుల పుణ్య, అపుణ్య కర్మలనెరిగినవాడు.

84.కృతిః --- తన భక్తుల సత్కార్యములకు కారణమైనవాడు; తన అనుగ్రహముచే పుణ్య కర్మలను చేయించువాడు.

85.ఆత్మవాన్ --- సత్కార్యములొనర్చు ఆత్మలకు నిజమైన ప్రభువు; తన వైభవమునందే ప్రతిష్ఠుడైనవాడు.

86.సురేశః --- సకల దేవతలకును దేవుడు; దేవదేవుడు; భక్తుల కోర్కెలను తీర్చువారిలో అధిపుడు.

87.శరణం --- తన్ను శరణు జొచ్చినవారిని రక్షించువాడు; ఆర్తత్రాణ పరాయణుడు; ముక్తుల నివాస స్థానము.

88.శర్మ --- సచ్చిదానంద స్వరూపుడు; మోక్షగాముల పరమపదము.

89.విశ్వరేతాః --- విశ్వమంతటికిని బీజము, మూల కారణము.

90.ప్రజాభవః --- సకల భూతముల ఆవిర్భావమునకు మూలమైనవాడు, జన్మకారకుడు.

91.అహః --- ఎవరినీ ఎన్నడూ వీడనివాడు; పగటివలె ప్రకాశ స్వరూపుడై అజ్ఞానమును తొలగించి జ్ఞానోన్ముఖులను చేయువాడు; తన భక్తులను నాశనము కాకుండ కాపాడువాడు.

92.సంవత్సరః --- భక్తులనుద్ధరించుటకై (వెలసి)యున్నవాడు; కాల స్వరూపుడు.

93.వ్యాళః --- భక్తుల శరణాగతిని స్వీకరించి అనుగ్రహించువాడు; (సర్పము, ఏనుగు, పులి వంటివానివలె) పట్టుకొనుటకు వీలుగానివాడు (చేజిక్కనివాడు)

94.ప్రత్యయః --- ఆధారపడ దగినవాడు; విశ్వసింపదగినవాడు (ఆయనను నమ్ముకొనవచ్చును); ప్రజ్ఞకు మూలమైనవాడు.

95.సర్వదర్శనః --- తన కటాక్షపరిపూర్ణ వైభవమును భక్తులకు జూపువాడు; సమస్తమును చూచుచుండెడివాడు.

96.అజః --- జన్మము లేనివాడు; అన్ని అడ్డంకులను తొలగించువాడు; భక్తుల హృదయములందు చరించుచుండువాడు; అన్ని శబ్దములకు మూలమైనవాడు.

97.సర్వేశ్వరః --- ఈశ్వరులకు ఈశ్వరుడు, ప్రభువులకు ప్రభువు; ఎవరు తనను వేడుకొందురో వారి చెంతకు తానై వేగముగా వచ్చి అనుగ్రహించువాడు.

98.సిద్ధః --- పొందవలసిన సమస్త సిద్ధులను పొదియే యున్నవాడు; తన భక్తులకు అందుబాటులో నుండెడివాడు; ఏ విధమైన లోపములు లేని, సకల పరిపూరహనత్వమైన రూపము గలవాడు.

99.సిద్ధిః --- సాధనా ఫలము, పరమ లక్ష్యము; సర్వ కార్య ఫలములు తానై యున్నవాడు; భక్తులకు నిధివలె సిద్ధముగా నున్నవాడు.

100.సర్వాదిః --- సర్వమునకు మూలకారణము, ప్రప్రధమము; సకల సృష్టికి పూర్వమందే యున్న పరమాత్మ.

101. అచ్యుతః --- తన దివ్య తేజో విభూతి శక్తి సంపన్నత్వములనుండి యెన్నడును జారని (తరగని) వాడు; తన భక్తులెన్నడును పతనము చెందకుండ గాచువాడు; జన్మ, పరిణామ, వార్ధక్యము వంటి దశలకు అతీతమైనవాడు.

102.వృషాకపిః --- జలములలో (అధర్మములో) మునిగిపోవు భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; ధర్మ పరిరక్షకుడు.

103.అమేయాత్మా --- ఆ పరమాత్ముని స్వరూపము కొలుచుటకు (తెలిసికొనుటకు) సాధ్యము కాదు; ఆశ్రితులను అనుగ్రహీంచుటలో పరిమితి లేనివాడు.

104.సర్వ యోగ వినిసృతః --- అన్ని సంగములకు, బంధములకు, విషయ వాసనలకు అతీతుడు; ఎన్నో విధములైన (జ్ఞాన, కర్మ, భక్తి వంటి) యోగములద్వారా సులభముగా పందనగువాడు.

శ్లోకం 12సవరించు

105.వసుః --- సమస్త భూతములు తనయందు గలవాడు; తన భక్తుల హృదయములందు వసించువాడు; క్షీరసాగరమున వసించువాడు; భక్తులు కోరుకొను పరమార్ధము; అష్ట వసువులలో శ్రేష్టుడైన పావకుడు; అంతరిక్షమున వసించువాడు.

106.వసుమనాః --- శ్రేష్ఠమయిన, సకలైశ్వర్యవంతమయిన మనసు గలవాడు; ఏ విధమైన వికారములకును లోనుగాని పరమ శాంతిచిత్తుడు; తన భక్తులను గొప్ప నిధులుగా భావించువాడు.

107.సత్యః --- నిజమైనది, మూడు కాలములలోనుండునది, నాశనము లేనిది; ప్రాణము, పదార్ధము (అన్నము), సూర్యుడు అనే మూడింటిచే కూడిన రూపము గలవాడు; సత్ప్రవర్తనయందు ప్రీతిగలవాడు,

108.సమాత్మా --- సమమైన, భేదభావములేని, రాగద్వేష రహితమగు ఆత్మ;

109.సమ్మితః --- తన భక్తులచే ఇచ్ఛానుసారముగా నియంత్రింపబడువాడు (వారి అనుభవములకు గోచరించువాడు) ; ఋషులచే అంగీకరింపబడి, ఉపనిషత్తుల ద్వారా తెలుపబడినవాడు;

అసమ్మితః --- పరిచ్చేదింపబడజాలనివాడు; అంత్యము, హద్దు లేనివాడు

110.సమః --- అన్నింటియందును సమభావముగలవాడు; మార్పులేకుండ ఎల్లప్పుడు సమముగా (ఒకే తీరున) ఉండువాడు; (స మయా-) శ్రీలక్ష్మీ సమేతుడు.

111.అమోఘః --- తనను పూజించువారికి నిశ్చయముగ సత్ఫలితములనిచ్చువాడు (భగవంతుని ఆరాధన వ్యర్ధము కాదు).

112.పుణ్డరీకాక్షః --- తామరపూవు వంటి కన్నులు గలవాడు; అందరి హృదయ కమలమున వసించి సమస్తమును చూచువాడు; వైకుంఠవాసులకు కనుచూపువంటివాడు.

113.వృషకర్మా --- ధర్మమే తన నిజకర్మగా గలిగినవాడు.

114.వృషాకృతిః --- మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు.

శ్లోకం 13సవరించు

115.రుద్రః --- కన్నులలో నీరు తెప్పించువాడు (1. ప్రళయకాలమున ప్రాణుల లయము చేయునపుడు 2. తనను స్మరించు భక్తులను ఆనందపరచుచు) ; భక్తులకు శుభములను కలిగించువాడు; దుఃఖమును, దారిద్ర్యమును నాశనము చేయువాడు.

116.బహుశిరాః --- అనేకములైన శిరములు గలవాడు; ఆదిశేషునిగా అవతరించినవాడు; అనంతుడు.

117.బభ్రుః --- ఆధారమైనవాడు, భరించువాడు (ఆదిశేషుడై, ఆది కూర్మమై, ఆదివరాహ మూర్తియై)

118.విశ్వయోనిః --- విశ్వమునకు కారణమైనవాడు; తనను ఆశ్రయించిన భక్తులను తనలో విలీనము చేసుకొనువాడు.

119.శుచిశ్రవాః --- శుభప్రథమైన, శ్రవణమాత్రముననే పవిత్రులను చేయగల దివ్యనామములు గలవాడు; ధర్మపూరితములు, సత్యములునగు వాక్కులు విని ఆనందించువాడు; దివ్య సుందరమగు చెవులు గలవాడు.

120.అమృతః --- భక్తులకు తనివి తీరని అమృతమూర్తి; అజరుడు, అమరుడు.

121.శాశ్వత స్థాణుః --- కాళముతో నిమిత్తము లేకుండ నిశ్చలముగా, నిత్యమై, సత్యమై, నిరంతరమైనవాడు; ఆదిమధ్యాంత రహిత పరబ్రహ్మము; స్థిరుడై భక్తులకు నిత్యభోగమైనవాడు.

122.వరారోహః --- అన్నింటికంటె శ్రేష్టమగు ఊర్ధ్వగతి, పొందదగిన అత్యున్నత పదము; ఏ స్థానము చేరినపిదమ మరల తిరిగి జన్మింపరో అట్టి పరమోత్కృష్ట స్థానము గలవాడు; అత్యుత్తమమగు వృద్ధి గలవాడు; ఆదిశేషునిపై పవళించువాడు.

123.మహాతపాః --- గొప్ప తపస్సు (జ్ఞానైశ్వర్య ప్రతాపములు) గలవాడు; మహత్తరమైన జ్ఞానము గలవాడు.

శ్లోకం 14సవరించు

124.సర్వగః --- అంతటను గమనము గలవాడు; ఎక్కడైనా చేయూతనిచ్చువాడు.

125.సర్వవిత్ --- సమస్తము తెలిసినవాడు; సమస్తమునకు పునరుజ్జీవనము ప్రసాదించువాడు (వెలుపలికి తీయువాడు)

సర్వవిద్భానుః --- (శంకరాచార్యులు ఒకేనామముగా పరిగణించిరి) సర్వము తెలిసి, అవిరామముగ, అవికారముగ ప్రకాశించేవాడు.

126.భానుః --- ప్రకాశించువాడు.

127.విష్వక్సేనః --- లోక రక్షణార్ధము అన్ని దిక్కులందు సైన్యము గలవాడు; తన తలంపు మాత్రమున సర్వదానవ సైన్యమును నాశనము చేయువాడు.

128.జనార్దనః --- దుష్టులను శిక్షించువాడు; దుష్టుల బారినుండి సజ్జనులను రక్షించువాడు; భక్తుల రక్షణలో విఘ్నములు కలిగించువారిని పరిమార్చువాడు; కామితార్ధములకై భక్తులు ఎవరిని ఆశ్రయింతురో ఆ దేవుడు.

129.వేదః --- సమస్త జ్ఞానము మూర్తీభవించినవాడు; వేదమూర్తి.

130.వేదవిత్ --- వేదములను, వాని సారము (అర్థమును) సంపూర్ణముగా నెరిగినవాడు; వేదజ్ఞానము బోధీంచువాడు.

131.అవ్యఞ్గః --- ఏ విధమైన లోపములు లేనివాడు (వేద జ్ఞానమందు, గుణ వైభవమునందు). వేదాంగములు తానే అయినవాడు.

132.వేదాఞ్గః --- వేదములే శరీరముగా (అంగములుగా) గలవాడు; వేదమూర్తి.

133.వేదవిత్ --- వేదములనెఱుగుటయే గాక, వేదసారమైన ధర్మమునెరిగినవాడు.

134.కవిః --- సామాన్య దృష్టినధిగమించి, సునిశిత దర్శనము (సూక్ష్మ దృష్టి) కలిగిన వాడు; సకలమును దర్శించువాడు; రమ్యముగా కనుపించువాడు.

శ్లోకం 15సవరించు

135.లోకాధ్యక్షః --- లోకములకు స్వామి, త్రిలోకాధిపతి.

136.సురాధ్యక్షః --- దేవతలకు స్వామి; దేవదేవుడు.

137.ధర్మాధ్యక్షః --- ధర్మమునకు ప్రభువు.

138.కృతాకృతః --- ఇహపరములు రెండింటను ఫలములు ప్రసాదించువాడు; ప్రవృత్తి, నివృత్తి ధర్మములచే జీవులకు నిత్యఫలమునిచ్చువాడు; కారణ రూపమున అవ్యక్తమైనవాడు, కార్యరూపమున వ్యక్తమైనవాడు.

139.చతురాత్మా --- సృష్టి, స్థితి, లయములందు నాలుగేసి విభుతులతో నొప్పువాడు; (నాలుగు సృష్టి విభూతులు - బ్రహ్మ, దక్షుడు మున్నగు ప్రజాపతులు, కాళము, సర్వభూతములు; నాలుగు స్థితి విభూతులు - విష్ణువు, మనువు మొదలగువారు, కాళము, సర్వభూతములు; నాలుగు లయ విభూతులు - రుద్రుడు, కాలము, యముడు, సర్వభూతములు) ; నాలుగు విధములగు సాధనావస్థలకు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలకు) ప్రభువు.

140.చతుర్వ్యూహః --- నాలుగేసి వ్యూహములతో నొప్పువాడు (వ్యూహము = ఒక ప్రయోజనము కొరకు ఏర్పడిన ఆకారము) ; ప్రద్యుమ్న వ్యూహము - సృష్టి కార్యము నిర్వహించు ఐశ్వర్య, వీర్య సంపన్న స్వరూపము; అనిరుద్ధ వ్యూహము - స్థితికార్యము నిర్వహించు శక్తి, తేజో ప్రధాన స్వరూపము; సంకర్షణ వ్యూహము - లయ కార్యము నిర్వహించు జ్ఞాన బల గుణ ప్రధాన స్వరూపము; వాసుదేవ వ్యూహము - షడ్గుణ (జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజో) పరిపూర్ణ స్వరూపము, అనంత నిరవధిక శక్తి గుణ కాంతి సంపన్నుడు.

141.చతుర్దంష్ట్రః --- నాలుగు కోరపండ్లు కలవాడు (అభయ ప్రదాత శ్రీనృసింహస్వామిని స్మరించు మంగళ నామము).

142.చతుర్భుజః --- నాలుగు బాహువులతో నొప్పువాడు; శంఖ చక్ర గదా పద్మ ధారి.

శ్లోకం 16సవరించు

143.భ్రాజిష్ణుః --- స్వయంప్రకాశ స్వరూపుడు; తేజోమయుడు; (సాధన చేయు, శరణాగతులైన) భక్తులకు కనిపించువాడు.

144.భోజనం --- నోటితో గాని, జ్ఞానేంద్రియములతోగాని స్వీకరించు విషయములు (అన్నము, శబ్దము, స్పర్శ, గంధము వంటివి) అన్నియును భగవత్స్వరూపములే. ఇంద్రియముల ద్వారా గ్రహించు విషయముల రూపమునను, ఇతర పూజాదిక కార్యముల ద్వారా లభించు ఫల రూపమునను భక్తులకు ఆనందానుభూతిని ప్రసాదించువాడు; సచ్చిదానంద స్వరూపుడు.

145.భోక్తా --- భుజించువాడు; భోజన రూపమగు ప్రకృతి లేక మాయను పురుష రూపమున అనుభవించువాడు; భక్తితో నొసగిన కానుకలు స్వీకరించి సంతుష్టుడయ్యేవాడు; యజ్ఞములో అర్పించినదానిని గ్రహించువాడు.

146.సహిష్ణుః --- సహించి, క్షమించి, అనుగ్రహించు కరుణామయుడు; ఓర్పు కలిగి భరించు సర్వ సాక్షి, సహన మూర్తి; దుష్టులను సంహరించువాడు.

147.జగదాదిజః --- జగములన్నింటికంటే ముందుగా నున్నవాడు.

148.అనఘః --- పాపరహితుడు; కల్మషము లేనివాడు.

149.విజయః --- జయించుటయే స్వభావ స్వరూపముగా గలవాడు; బ్రహ్మ రుద్రాదుల విజయములకు కూడా కారణమైనవాడు; ప్రకృతిని జయించినవాడు; పాండవులలో అర్జునుడు.

150.జేతా --- జయించువాడు; అంతా ఆయన ఇచ్ఛానుసారమే జరుగును.

151.విశ్వయోనిః --- విశ్వమునకు జన్మ స్థానము, కారణము; విశ్వమే కారణముగా గలవాడు.

152.పునర్వసుః --- తన సృష్టి యందంతట సకల దైవములందును అంతరాత్మయై మరల మరల విలసిల్లువాడు; ప్రళయానంతరము మరల సృష్టి కావించువాడు.

శ్లోకం 17సవరించు

153.ఉపేంద్రః --- ఇంద్రునిపై ఇంద్రుడు (ఇంద్రునకు అధిపతి) ; ఇంద్రునకు తమ్ముడై (వామనుడై) అవతరించినవాడు; ఇంద్రియములకు అగోచరుడు.

154.వామనః --- పొట్టివానిగా అవతరించిన వాడు; చక్కనైన, కనులకింపైన, చూడ చిన్నదైన రూపము గలవాడు; ఇంద్ర రక్షణకు వామనావతారము దాల్చినవాడు.

155.ప్రాంశుః --- ఎంతో ఎత్తైన, ఉన్నతమైన, విస్తారమైన దేహముగలవాడు; త్రివిక్రముడై ముల్లోకములు ఆక్రమించినవాడు.

156.అమోఘః --- మహదాశయముతో విశేష పరిణామములు గల పనులు చేసెడివాడు; శ్రీహరి ప్రతి కార్యము విశేషించి కారణ యుక్తము, ఏదియును వ్యర్ధము కాదు, ప్రతి పనికిని పరమార్ధము ఉంది.

157.శుచిః --- పరమ పావన మూర్తి, ఏ విధమైన దోష మాలిన్యములు అంటనివాడు; ప్రత్యుపకారమేమియును కోరని పరిశుద్ధుడు; భక్తులను పవిత్రులుగా చేయువాడు.

158.ఊర్జితః --- అనంత శక్తి సామర్థ్య సంపన్నుడు; బలి చక్రవర్తిని పాతాళమునకు త్రొక్కిన మహాబలవంతుడు; ఐశ్వర్యము, శక్తి సంపన్నత, నిర్మలత్వము గలవన్నియును భగవద్విభూతులు (తేజోంశ సంభూతములు).

159.అతీంద్రః --- ఇంద్రునికంటె అధిపుడు; మనసు కంటే శ్రేష్ఠుడు.

160.సంగ్రహః --- ప్రళయ కాలమున సమస్తమును తనయందు చేర్చుకొనువాడు; సమస్తమును కలిపి తన అధీనములో నుంచుకొన్నవాడు; సులభముగా, కేవలము భక్తి వల్లనే పొందనగువాడు (అందుబాటులో ఉండేవాడు)

161.సర్గః --- తనను తానే సృష్టించుకొని, తననుండి సమస్తమును సృజించినవాడు; భక్తులననుగ్రహీంచుటకు తనను తానే సృష్టించుకొనువాడు (అవతరించువాడు).

162.ధృతాత్మా --- సకల జీవాత్మలకును ఆధారమైనవాడు (అన్ని ఆత్మలను ధరించువాడు) ; షడ్భావ వికారములు లేనివాడు.

163.నియమః --- శాసన కర్త; నియమములనేర్పఱచి, నియంత్రించి, నడపువాడు; భక్తుల శత్రువులను నిగ్రహించువాడు.

164.యమః --- పరిపాలించువాడు. సమస్తమును (ప్రకృతి శక్తులను) వశము చేసుకొన్నవాడు; జీవుల హృదయములందు అంతర్యామియై నడిపించువాడు.

శ్లోకం 18సవరించు

165.వేద్యః --- తెలిసికొనబడువాడు; తెలిసికొన దగినవాడు (మోక్షగాములకు).

166.వైద్యః --- విద్య లన్నియును తెలిసినవాడు, సర్వజ్ఞుడు; జనన మరణ చక్రమునుండి తన భక్తులను ముక్తులోనరింప నెరిగినవాడు; భవరోగ బంధన విమోచకమగు ఔషధ విద్యయందు ప్రవీణుడు.

167.సదాయోగీ --- భక్తులపట్ల ఎల్లపుడు జాగరూకుడై అందుబాటులోనుండెడివాడు; సర్వవ్యాపియై విశ్వమును అవిచ్ఛిన్నముగా నిలుపువాడు; సదా ధర్మమార్గానువర్తి యైనవాడు; యోగచింతనలో నిమగ్నుడైన సచ్చిదానంద పూర్ణ బ్రహ్మము; ఎల్లపుడు సమత్వ భావన కలిగినవాడు.

168.వీరహా --- బలవంతులగు దుష్టులను నాశనము చేయువాడు.

169.మాధవః --- (73, 169, 741 నామములు) మా ధవః -శ్రీమహాలక్ష్మి (మా) కి భర్త ; మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు; సకల విద్యా జ్ఞానములకు ప్రభువు; పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు; మధు (యాదవ) వంశమున పుట్టినవాడు; తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు) ; మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు; బ్రహ్మ విద్యను ప్రసాదించువాడు.

170.మధుః --- భక్తులకు తేనెవలె, అమృతమువలె అత్యంత ప్రియమైనవాడు; మంగళకరమగు జ్ఞానమయుడు.

171.అతీంద్రియః --- ఇంద్రియములకు అందనివాడు (ఇంద్రియముల ద్వారా తెలియరానివాడు).

172.మహామాయః --- అధిగమింపజాలని మాయామయుడు

173.మహోత్సాహః --- గొప్ప ఉత్సాహముతో కార్యాచరణ కావించువాడు; అంతులేని సహనముతో జగత్తును భరించువాడు.

174.మహాబలః --- అనంతమగు, అద్భుతమగు బలము కలవాడు; బలవంతులకంటె బలవంతుడు; అందరికిని (భక్తులకు) వివిధ బలములను ప్రసాదించువాడు (జీవనాధారము).

శ్లోకం 19సవరించు

175.మహాబుద్ధిః --- అనంతమగు బుద్ధి (జ్ఞానము, విచక్షణ, గ్రహణము) కలవాడు; అన్ని ప్రాణులలోను బుద్ధికి కారణమైనవాడు.

176.మహావీర్యః --- సకల సృజనాత్మక దివ్య శక్తులకును ఆఆరము; అచంచల మూర్తి; సృష్టిలోని చేతనత్వమంతా భగవంతుని అంశయే.

177.మహాశక్తిః --- సృష్ట్యాది సకల కార్యములకును ఆరణమగు శక్తిగలవాడు; క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తుల సంగమమైన అనంత శక్తి సంపన్నుడు; అన్ని శక్తులకు, అందరిలోని శక్తులకు మూలము. మహిమాన్విత శక్తిపరుడైన భగవానుడు. భగవానుని యందలి ఇచ్చాశక్తిచే సృష్టి ఊహించబడెను. ఆ పరమాత్మ యందలి జ్ఞానశక్తిచే సృష్టిక్రమము నిర్వహించబడెను. ఆ పావనాత్ముని యందలి క్రియాశక్తిచే క్రియారూపము దాల్చెను. ఈవిధంగా తనలోని శక్తిత్రయ ప్రభావముచే భగవానుడు సృష్టికార్యమును నిర్వహించెను. అందుచేత అతను మహాశక్తి అని పిలువబడెను.

178.మహాద్యుతిః --- అసమానమగు దివ్యమైన కాంతితో విరాజిల్లువాడు, తేజోమయుడు; సృష్టిలోని కాంతి అంతయు భగవంతుని ప్రకాశము వలననే కలుగుచున్నది.

179.అనిర్దేశ్యవపుః --- వర్ణించుటకు వీలు కానట్టి, ఊహింపనలవి కానట్టి దివ్య మంగళ మూర్తి.

180.శ్రీమాన్ --- (22, 180, 222 నామములు) దివ్యాభరణ శోభితుడు; సౌందర్యమూర్తి; సుందరాంగుడు; లక్ష్మీ వల్లభుడు; సకలైశ్వర్యయుతుడు.

181.అమేయాత్మా --- తెలియరాని స్వరూపము గలవాడు; ఊహింపరాని తత్వమూర్తి; దివ్య గాంభీర గుణ సంపన్నుడు.

182.మహాద్రిధృత్ --- / మహాద్రిధృక్ --- గొప్ప కొండలను ధరించినవాడు; క్షీరసాగర మథనమున శ్రీకూర్మమూర్తియై మందర గిరిని, చిన్నికృష్ణునిగా గోవర్ధన గిరిని ఎత్తినవాడు.

శ్లోకం 20సవరించు

183.మహేష్వాసః --- తిరుగులేని, గొప్ప బాణములు ప్రయోగించువాడు; బ్రహ్మాండమగు ధనుస్సును ధరించినవాడు; గొప్ప విలుకాడు.

184.మహీభర్తా --- భూభారమును వహించినవాడు - ఆదికూర్మమై భూమిని భరించియుండు కూర్మావతార మూర్తి, పాతాళాంతర్గతయైన భూదేవిని ఉద్ధరించిన భూవరాహమూర్తి.

185.శ్రీనివాసః --- సిరికి నిలయమైనవాడు, శ్రీమహాలక్ష్మికి తన హృదయమే నివాస స్థానముగా నున్నవాడు.

186.సతాంగతిః --- సత్పురుషులకు, ముముక్షువులకు పరమగతియైనవాడు.

187.అనిరుద్ధః --- ఎవరివల్లను, ఎన్నడైనను నిరోధింపబడనివాడు; అపరిమిత చేష్టామూర్తి.

188.సురానందః --- దేవతలకు ఆనందము ప్రసాదించు దేవదేవుడు.

189.గోవిందః --- దేవతలచే ప్రస్తుతింపబడు దేవదేవుడు; మహార్ణవమునుండి భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; గోవులను కాచేటి గోపాలుడు; వేదములనొసగిన, వేదముల ద్వారా పొందదగినవాడు, వేదవేద్యుడు.

190.గోవిదాం పతిః --- వేదార్ధములనెఱిగిన జ్ఞానులకు రక్షకుడు.

శ్లోకం 21సవరించు

191.మరీచిః --- కాంతి, కిరణము, తేజోమయుడు; తేజోవంతులలో దివ్యతేజోమూర్తి.

192.దమనః --- సంసార భారమును తొలగించి, బంధ విముక్తినొసగువాడు; అధర్మమార్గమున చరించువారిని శిక్షించువాడు; తన దివ్య తేజస్సుచే సమస్త ప్రాణుల తాపములను హరించువాడు.

193.హంసః --- భక్తులకు సంసార భయమును పోగొట్టువాడు; హంసవంటి గుణములు గలవాడు, హంసావతారమును ధరించినవాడు; సోహం అని తెలిపిన పరబ్రహ్మము; అన్ని శరీరములందలి అంతర్యామి.

194.సుపర్ణః --- చక్కనైన రెక్కలు గలవాడు (గరుత్మంతుడు, హంస) ; జ్ఞానము, కర్మ అను అందమైన రెక్కలనధిరోహింపజేసి సంసార సాగరమును తరింపజేయువాడు.

195.భుజగోత్తమః --- ఆదిశేషునకు ప్రభువు, శేషశాయి; సర్పములలో ఉత్తముడు (అనంతుడు, వాసుకి) ; వ్యాపనము, చలనము కలిగినవానిలో ఉత్తముడు (సర్వవ్యాపి).

196.హిరణ్యనాభః --- బంగారమువంటి, కళ్యాణప్రథము, మనోహరమునగు నాభియందు చతుర్ముఖ బ్రహ్మకు ఆధారమైనవాడు; బ్రహ్మను కన్న తండ్రి.

197.సుతపాః --- అత్యుత్తమ జ్ఞానమునకు ఆలవాలము; మూర్తీభవించిన తపము; బదరికాశ్రమమున నరనారాయణ రూపమున గొప్ప తపసు నాచరించినవాడు.

198.పద్మనాభః --- బొడ్డు తామరపూవు గలవాడు (బ్రహ్మకు జన్మస్థానము) ; అందరి హృదయ కమలములందు వసించువాడు; జ్ఞానమునకు నిలయము; బహు మనోహరుడు.

199.ప్రజాపతిః --- సకలజీవులకును ప్రభువు; బ్రహ్మాదులకు ప్రభువు.

శ్లోకం 22సవరించు

200.అమృత్యుః --- మరణము గాని, నాసనము గాని లేనివాడు.

201.సర్వదృక్ --- విశ్వ దర్శియై మహాజ్ఞానముతో జీవులు చేయు సర్వ కర్మలు చూచుచుండువాడు.

202.సింహః ---సింహము; నరసింహావతారము; పాపములను నశింపజేయువాడు.

203.సంధాతా --- జీవులను వారి కర్మఫలములకు ముడివేయు (అనుసంధానించు) వాడు; నిత్యము ఆశ్రితులను చేరదీయువాడు.

204.సంధిమాన్ --- భక్తులందు ఐక్యమై యుండువాడు; తాను స్వయముగా జీవరూపుడై కర్మఫలములను అనుభవించువాడు.

205.స్థిరః --- భక్తుల పట్ల బాంధవ్యము నిలకడగా గలాడు; నిశ్చలుడు, నిర్వికారుడు, నిత్యుడు.

206.అజః --- పుట్టుకలేనివాడు (స్తంభమునుండి అవతరించిన శ్రీనారసింహమూర్తి) ; అడ్డంకులను తొలగించువాడు; భక్తుల హృదయములందు చరించువాడు; భక్తుల మనములోని అజ్ఞానము హరించువాడు; సకల శబ్దములకును మూలము ('అ'కారము)

207.దుర్మర్షణః --- ఎదురులేనివాడు, అడ్డులేనివాడు; అసురులకు భరింపశక్యముగాని వాడు.

208.శాస్తా --- బోధించువాడు, జగద్గురువు; శాసించువాడు, భక్తుల మార్గము నవరోధించువారిని శిక్షించువాడు.

209.విశ్రుతాత్మా --- జగమంతయు విస్తృతముగా ఎవరి అద్భుత లీలా మహాత్మ్యములను గానము చేయునో ఆ దేవదేవుడు; సత్యము, జ్ఞానము, పరబ్రహ్మము - ఇత్యాది విశిష్ట నామములచే స్తుతింపబడు అనంతగుణ సంపన్నుడు; వివిధ స్వరూపములుగా కీర్తింపబడు సహస్రమూర్తి; విశేష, షడ్గుణ్య పరిపూర్ణ, పరమాత్మ.

210.సురారిహా --- దేవతల శతృవులను హరించువాడు.

211.గురుర్గురుతమః --- గురువులకు గురువు; గురువులందు సర్వశ్రేష్ఠుడు;

గురుః --- సర్వ విద్యలూ నేర్పు భగవానుడు;

గురుతమః --- ఆచార్యులకు పరమాచార్యుడు. (శంకరాచార్యులు 'గురుః', 'గురుతమః' అను రెండు నామములుగా పరిగణించిరి. పరాశర భట్టు 'గురుతమ గురువు' అనే ఒకేనామముగా పరిగణించిరి.

212.ధామ --- పరమపదము, అత్యుత్తమ నివాస స్థానము; సకల జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానము; ప్రళయమున చరాచరాధార భూతుడు; మార్గదర్శి; పరంజ్యోతి, దివ్య ప్రకాశము; సకల కామితార్ధములకును నిలయము.

213.సత్యః --- మంచి చేయునది; మేలు చేయువాడు.సత్యస్వరూపుడు.

214.సత్యపరాక్రమః --- నిజమైన, అనన్యమైన, తిరుగులేని పరాక్రమము కలవాడు; సత్ప్రవర్తనకు అండగా నిలుచు పరాక్రమము గలవాడు.

215.నిమిషః --- యోగనిద్రలో నున్నవాడు; తన భక్తుల శత్రువులపై కటాక్షవీక్షణలు పడనీయనివాడు (భక్తుల శతృవులయందు దయచూపనివాడు)

216.అనిమిషః --- ఎల్లపుడు కనులు తెరచియుండువాడు; భక్తుల రక్షణలో సదా మెలకువగా నుండువాడు.

217.స్రగ్వీ --- వైజయంతీ మాలను ధరించినవాడు; సూర్య చంద్రాది సమస్తలోకమును మాలగా ధరించినవాడు.

218.వాచస్పతిః --- వాక్కునకు ప్రభువు; గురువులకు గురువు, విద్యలకు విద్య; వేదములకు మూలము.

219.ఉదారధీః --- ఉదారమగు (కరుణాపూరితమగు) బుద్ధి (గుణము) కలిగినవాడు.

వాచస్పతి ఉదారధీః --- పరమశ్రేష్టమగు దివ్యజ్ఞానము. (శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించారు.)

శ్లోకం 24సవరించు

220.అగ్రణీః --- ముందుండి గమ్యస్థానమునకు దారిచూపువాడు, భక్తులకు ఉత్తమగతికి మార్గము చూపువాడు, మార్గదర్శి.

221.గ్రామణిః --- సకల సముదాయములకు (సామాన్యజీవులకు, దేవతలకు, ముముక్షువులకు) నాయకుడు; అందరికిని మోక్షమార్గము చూపు పెద్దదిక్కు; సత్యసూరులకు నాధుడు.

222.శ్రీమాన్ --- (22, 180, 222వ నామములు) శ్రీ అనగా కాంతి, తేజస్సు, వైభవము, సంపద; సకల సంపదలు మూర్తీభవించిన మూర్తి, సిరిగలవాడు; సమస్త వైభవము గలవాడు, శ్రీ, ధృతి, స్మృతి, కీర్తి గలవాడు; ప్రకాశించువాడు, తేజోమూర్తి; శ్రీమహాలక్ష్మీపతి; వక్షస్థలమున శ్రీదేవిని నిలుపుకొన్నవాడు; సకల శక్తిమంతుడు. 'శ్రీ' అనగా లక్ష్మీదేవి. సదా లక్ష్మీదేవితో కూడి యుండువాడు - విష్ణుమూర్తి. ఆదిదేవుని వక్షస్థలమున లక్ష్మీదేవి సదా వసించుచుండెను. లక్ష్మీదేవి ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరియించిన ఆదిదేవుడు. 'వక్షస్థలము' హృదయమును సూచించుటచే హృదయములో కల్యాణ సంపద కలిగియున్నవాడని భావము.

223.న్యాయః --- భక్తులకు తగురీతిలో (మోక్ష) ఫలము ప్రసాదించువాడు; పరబ్రహ్మజ్ఞానమునకు దారిచూపు తర్ము, యుక్తి; విశ్వమందు అంతటిని సక్రమముగా నియమముగా నడుపు శక్తి.

224.నేతా --- భక్తుల కోరికలను తీర్చువాడు; విశ్వమునందన్ని వ్యవహారములను నిర్వహించు అధికారి; భక్తులను తన నేతృత్వములో సన్మార్గ మోక్షమార్గములకు చేర్చువాడు.

225.సమీరణః --- అద్భుతమైన, మనోహరమైన కార్యములను నిర్వర్తించువాడు; ప్రాణమునకు కావలసిన వాయువు తానే అయి ఉన్నవాడు; సకల జీవుల శ్వాసను, తదితర చైతన్యమును నడపువాడు.

226.సహస్రమూర్ధా --- వేయి (లెక్క పెట్టలేనన్ని) శిరసులు గలవాడు;అంతటను ఉండువాడు.

227.విశ్వాత్మా --- విశ్వమునకే ఆత్మ; సకల భూతములకును అంతస్థితుడైన ఆద్యుడు.

228.సహస్రాక్షః --- వేయి (లెక్క పెట్టలేనన్ని) కన్నులు గలవాడు; అంతటిని చూచుచుండువాడు.

229.సహస్రపాత్ --- వేయి (లెక్క పెట్టలేనన్ని) పాదములు గలవాడు; అన్ని చోట్ల చరించువాడు.

శ్లోకం 25సవరించు

230.ఆవర్తనః --- సంసార చక్రమును పరిభ్రమింపజేయువాడు.

231.నివృత్తాత్మా --- (231, 454, 604, 780 నామములు) అన్నింటికంటె మహోన్నతమగు పరమపద తత్వమూర్తి; సంసార చక్రమును త్రిప్పువాడైనను కోర్కెలకు అతీతుడైనవాడు, మాయాతీతుడు; నివృత్తి ధర్మమును పాటించువారికి ఆత్మస్వరూపుడు; సంసార బంధములకు అతీతుడు; నిత్యవిభూతి యనెడు స్వరూపము గలవాడు.

232.సంవృతః --- కప్పబడియుండువాడు (తెలియజాలనివాడు) ; తమోగుణముచే మూఢులగువారికి కన్పించనివాడు; అజ్ఞానులైన మానవుల దృష్టికి మృగ్యుడై యున్నవాడు.

233.సంప్రమర్దనః --- చీకటిని, అజ్ఞానమును, మాయను పారద్రోలువాడు; (రుద్రుడు, యముడు వంటి రూపములలో) దండించువాడు; దుష్టులను మర్దించువాడు (హింసించు వాడు).

234.అహఃసంవర్తకః --- సూర్యుని రూపముననుండి దినములను (కాల చక్రమును) చక్కగా ప్రవర్తింపజేయువాడు.

235.వహ్నిః --- సమస్తమును వహించువాడు (భరించువాడు) ; దేవతలకు హవిస్సునందించు అగ్నిహోత్రుడు.

236.అనిలః --- (236, 818 నామములు) వాయువు; ప్రాణమునకు ఆధారమైన ఊపిరి; ప్రేరణ లేకుండానే (వేరెవరు చెప్పకుండానే) భక్తుల కోర్కెలు తీర్చువాడు; ఆది లేనివాడు (తానే స్వయముగా ఆది.) ; సంగమము (బంధము) లేకుండా, మంచి చెడులకు అతీతమైనవాడు; కరిగిపోనివాడు; సర్వజ్ఞుడు; భక్తులకు సులభముగా అందువాడు; స్థిరమైన నివాసము (నిలయము) లేనివాడు; ఇల (భూమి) ఆధారము అవుసరము లేనివాడు; అన్నిచోట్ల ఉండువాడు (ఎక్కడో దాగని వాడు) ; సదా జాగరూకుడైనవాడు.

237.ధరణీధరః --- భూమిని ధరించువాడు (భరించువాడు, పోషించువాడు).

శ్లోకం 26సవరించు

238.సుప్రసాదః --- అనంతమైన దయగలవాడు; అనుగ్రహ స్వరూపుడు; శుభకరమగు ఫలములను ప్రసాదించువాడు.

239.ప్రసన్నాత్మా --- సర్వకాల సర్వావస్థలయందును ప్రసన్నమైన, ప్రశాంతమైన మనసు గలవాడు; రాగాదులచే ప్రభావితము కానివాడు.

240.విశ్వసృట్, విశ్వసృడ్ --- విశ్వమును సృజించినవాడు;

విశ్వధృగ్ --- విశ్వమును తన అధీనములో ధరించి, బాగోగులు గమనించువాడు.

(పాఠాంతరములు) విశ్వసృగ్, విశ్వసృష్ట్

241.విశ్వభుగ్విభుః --- 'విశ్వ భుగ్ విభుః' అంతటను వ్యాపించి అన్నింటిని రక్షించువాడు.

శంకరాచార్యులు రెండు వేరువేరు నామములుగా వ్యాఖ్యానించిరి.

విశ్వభుగ్ --- జీవరూపమున విశ్వమును అనుభవించువాడు, భక్షించువాడు; అన్ని అనుభూతులను తనయందు లీనము చేసికొనును; అన్ని దిశలందును విస్తరించి విశ్వమును ఏర్పరచాడు

విభుః --- హిరణ్య గర్భుడై, అనేక రూపములు ధరించి, విశ్వమంతయును నిండి వెలుగుచున్న పరమేశ్వరుడు; సర్వము తానె యైనవాడు; అన్ని చోట్ల అన్నింటిని నింపువాడు; విశ్వమునకు ప్రభువు.

242.సత్కర్తా --- సజ్జనులను, పుణ్యవర్తనులను, ధర్మాత్ములను ఆదరించువాడు, సత్కరించువాడు.

243.సత్కృతః --- పూజనీయులచేత కూడా పూజింపబడువాడు; లోకైక పూజ్యుడు.

244.సాధుః --- (భక్తుల క్షేమమునకు అవుసరమైన పనిని) సాధించువాడు; సాధువర్తనుడు, సదాచార సంపన్నుడు.

245.జహ్నుః --- గుహ్యమైనవాడు, కానరానివాడు (మూఢులను విడనాడువాడు) ; ప్రళయకాలమున సమస్తమును లయము చేయువాడు; దోషులకు దూరముగానుండువాడు.

246.నారాయణః --- సకలాత్మలకు ఆధారమైనవాడు, జీవసముదాయములకు ఆశ్రయుడు; జగత్తంతయును (లోపల, వెలుపల) వ్యాపించియున్నవాడు; జలములకు (నారములకు) ఆధారము, జలములే నివాసము అయినవాడు; ప్రళయకాలమున జీవులకు నిలయమగువాడు.

247.నరః --- నాశనము (తుది) లేనివాడు; నడపించువాడు, నాయకుడు; నిత్యమగు చేతనాచేతనములకు విభూతిగా గలవాడు; జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడపువాడు..

శ్లోకం 27సవరించు

248.అసంఖ్యేయః --- లెక్కకు అందనన్ని, అనంతములైన గుణ, స్వరూప, నామములు కలవాడు.

249.అప్రమేయాత్మా --- కొలుచుటకు, పోల్చుటకు శక్యము కాని స్వరూపాదులు కలవాడు; ప్రత్యక్షముగాగాని, పరోక్షముగా గాని తెలిసికొన శక్యము కాని, ఎట్టి ప్రమాణములచేతను నిర్వచించుటకు వీలుగాని దివ్యాత్మ స్వరూపుడు; ఏ విధమైన జ్ఞానము చేతను పూర్తిగా అర్ధము కానివాడు.

250.విశిష్టః --- అతిశయించి యున్న వాడు; అన్నింటినీ మించువాడు, అందరికంటే అధికుడు; ఎవరిపైనా ఆధారపడనివాడు.

251.శిష్టకృత్ --- తన భక్తులను సదాచార సంపన్నులుగాను, ఉన్నతులుగాను చేయువాడు; శాసనము చేయువాడు.

252.శుచిః --- (157, 252 నామములు) పవిత్రమైనవాడు; పవిత్రము చేయువాడు.

253.సిద్ధార్థః --- సకలార్ధములు సిద్ధించినవాడు, సంపూర్ణుడు, నిత్యపూర్ణుడు.

254.సిద్ధసంకల్పః --- సిద్ధించిన సంకల్పము కలవాడు, అన్నికోరికలు నెరవేరినవాడు.

255.సిద్ధిదః --- భక్తులకు సిద్ధులను ప్రసాదించువాడు.

256.సిద్ధిసాధనః --- సిద్ధిని పొందుటకు సాధనమైనవాడు.

శ్లోకం 28సవరించు

257.వృషాహీ --- అనేక వృషాహములు (ధర్మ దినములు) ద్వారా సేవింపబడువాడు; ఇతనిని పందే మొదటి రోజు సకల శ్రేయస్సులకు ప్రారంభ దినములాగా ధర్మరూపముగా నుండును; ధర్మ స్వరూపుడై ప్రకాశించువాడు; తన భక్తులను ధర్మపరాయణులుగా చేసి పగటివలె వెలిగించువాడు; వృషాహ యజ్ఞమునకు దేవత; అగ్నివలె తేజోమయుడు, అన్ని తేజములకు ఆధారమైనవాడు. (దినమే సుదినము, సీతారామ స్మరణే పావనము, అక్కరతోడ భద్రాచలమునను చక్కని సీతారాముల జూచిన ఆ దినమే సుదినము)

258.వృషభః --- భక్తులపై కామితార్ధములు వర్షించు కరుణామూర్తి; అమృతమును వర్షించి సంసార తాపమును ఉపశమింపజేయువాడు; ధర్మమూర్తియై వెలుగొందువాడు.

259.విష్ణుః --- (2, 259, 663 నామములు) అంతటను వ్యాప్తిని పొంది భక్తులను ఎల్లెడల బ్రోచువాడు; కొండలంత వరములు గూపెడి కోనేటి రాయడు.

260.వృషపర్వా --- తనను చేరుకొనుటకై ధర్మము అను మెట్లదారిని ప్రసాదించినవాడు.

261.వృషోదరః --- ధర్మమును ఉదరమున ధరించినవాడు; ప్రళయ (వర్ష) కాళమున సమస్తమును ఉదరమున భద్రపరచువాడు; యజ్ఞయాగాదులలో అర్పించిన ఉపచారములను గ్రహించు ఉదరము కలిగినవాడు; ధర్మ నిర్వర్తకులగు బ్రహ్మాదులు ఆయన ఉదరమునుండి జన్మించిరి; ఉదరమున అగ్నిని ధరించినవాడు; భక్తులను కడుపులో పెట్టుకొని కాచువాడు.

262.వర్ధనః --- వర్ధిల్ల జేయువాడు;వృద్ధి పరంపరలు కలిగించువాడు; ఆశ్రితుల శ్రేయస్సును వృద్ధినొందించువాడు.

263.వర్ధమానః --- వర్ధిల్ల జేయుటయే గాక, అన్ని రూపములు తానై స్వయముగా వృద్ధి పొందువాడు.

264.వివిక్తః --- విలక్షణమైనవాడు, ప్రత్యేకమైనవాడు; లోకోత్తర చరిత్రుడగుటచే ఏకాంతి అయినవాడు; వేరెవరితోను, వేనితోను పోలిక గాని, బంధము గాని లేని నిర్లిప్తుడు.

265.శ్రుతిసాగరః --- వేదములకు సాగరము వంటివాడు; వేదములకు మూలము, వేద జ్ఞానమునకు పరమార్ధము ఆయనే.

శ్లోకం 29సవరించు

266.సుభుజః --- అందమైన భుజములు గలవాడు; జగద్రక్షకుడు, భక్త వరదుడు. (ఇందరికి నభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి)

267.దుర్ధరః --- ఎవరిచేతను ఆపబడజాలని భుజబలము కలవాడు (ఎదురు లేనివాడు) ; తెలిసికొనుటకు అందనివాడు (తెలియరాని వాడు) ; మనసులో నిలుపుకొనుటకు కష్టమైనవాడు (నిలువరాని వాడు) ; మరి దేనిచేతను ధరింపజాలనివాడు (భరింపరానివాడు)

268.వాగ్మీ --- మధురమైన, ప్రియమైన, స్తుతింపదగిన వాక్కుగలవాడు; శక్తిపూరితమైన వాక్కు గలవాడు; వేదములు ఆయన వాక్కునుండి ఉద్భవించెను.

269.మహేంద్రః --- మహత్తరమగు, అనన్యమగు ఈశ్వర్యము గలవాడు, సిరిగలవాడు; ఇంద్రునకును, దేవతలకును దేవుడు; అన్ని వెలుగులకు మూలము.

270.వసుదః --- సంపదల నిచ్చువాడు; భక్తుల అవసరములకు సకాలములో షడ్గుణైశ్వర్య సంపదలనే ధనము నిచ్చువాడు.

271.వసుః --- తాను ఇచ్చు ధనము కూడా తానే ఐనవాడు; జ్ఞానులైనవారు కాంక్షించు సంపద వాసుదేవుడే (ముంగిట నల్లదివో మూలనున్న ధనము).

272.నైకరూపః --- అనేక రూపములతో వెలయు విశ్వరూపుడు; ఒక రూపము అనికాక అనేక అవతారములు గలవాడు; (అన్ని రూపములు నీ రూపమైనవాడు, ఆది మధ్యాంతములు లేక అలరువాడు).

273.బృహద్రూపః --- మహాద్భుతమైన పెద్ద రూపము గలవాడు; వరాహ, నారసింహ, త్రివిక్రమ వంటి బ్రహ్మాండ స్వరూపములు గలవాడు.

274.శిపివిష్టః --- కిరణముల స్వరూపమున అంతటా వ్యాపించియున్నవాడు; యజ్ఞపశువునందు ఆవహించియున్నవాడు.

275.ప్రకాశనః --- తన విశ్వ రూపమును దర్శించు భాగ్యము భక్తులకు ప్రసాదించువాడు; సమస్తమును ప్రకాశింప జేయువాడు.

శ్లోకం 30

276.ఓజస్తేజోద్యుతిధరః --- పరిపూర్ణమగు ఓజస్సు (బలము), తేజస్సు (శతృవులను ఓడించు శక్తి), ద్యుతి (కీర్తి, కాంతి) కలిగినవాడు

277.ప్రకాశాత్మా --- ప్రకాశవంతమగు స్వరూపము గలవాడు; (మూర్ఖులు కూడా అంగీకరించేటట్లుగా, గొప్పగా) ప్రకాశించేవాడు.

278.ప్రతాపనః --- సూర్యాగ్నుల రూపమున వెలుతురును, జీవులలో ఉష్ణమును కలిగించి కాపాడువాడు; తన ఉగ్రరూపమున జగత్తును తపింపజేయువాడు; ప్రళయాగ్నియై జగత్తును లయము చేయువాడు.

279.ఋద్ధః --- అన్ని ఉత్తమ గుణములు సమృద్ధిగా కలిగిన పరిపూర్ణుడు.

280.స్పష్టాక్షరః --- స్పష్టమైన వేదాక్షరములు గలవాడు, అనగా వేదము లోని అక్షరముల ద్వారా స్పష్టమైనవాడు; దివ్యమగు ప్రణవ శబ్దము ద్వారా తెలియబడువాడు; విశ్వమును కలిపి పట్టియుంచువాడు.

281.మంత్రః --- తన నామమును మననము చేయువారిని రక్షించువాడు; వేద స్వరూపుడు, మంత్ర మూర్తి.

282.చంద్రాంశుః --- చంద్రుని కిరణములవలె (వెన్నెల వలె) చల్లగానుండి, ఆహ్లాదమును కలిగించి, సంసార తాపమును శమింపజేయువాడు; సస్యములను పోషించువాడు.

283.భాస్కరద్యుతిః --- సూర్యుని వంటి తేజస్సు గలవాడు; శత్రుదుర్నిరీక్ష్య పరాక్రమశీలి; సూర్యునికి కాంతిని ప్రసాదించువాడు.

శ్లోకం 31సవరించు

284.అమృతాంశూద్భవః --- అమృత కిరణ్మయుడగు చంద్రుని జననమునకు కారణము, చంద్రుని తన మనస్సునుండి పుట్టించినవాడు; జలములను వ్యాపింపజేసి జీవులను సృష్టించువాడు.

285.భానుః --- ప్రకాశించువాడు, కిరణ్మయుడు, సూర్యుడు; సూర్యునకు కూడా వెలుగును ప్రసాదించువాడు.

286.శశబిందుః --- దుర్మార్గులను విడనాడువాడు, శిక్షించువాడు; చంద్రుడు (కుందేలు వంటి మచ్చ గలవాడు) ; నక్షత్రముల, గ్రహముల గతులను నియంత్రించువాడు.

287.సురేశ్వరః --- దేవతలకు ప్రభువు; సన్మార్గమున నడచువారికి అండ.

288.ఔషధం --- భవరోగమును, భయంకరమగు జనన మరణ జరావ్యాధి పూరితమగు సంసారమను వ్యాధిని నయముచేయు దివ్యమగు నివారణ. (పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటిరాయడా! చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా, రోగాలడచి రక్షంచే దివ్యౌషధమా!)

289.జగతస్సేతుః --- మంచి, చెడుల మధ్య అడ్డుగా నిలచినవాడు; సంసారసాగరమును దాటుటకు ఉపయోగపడు వంతెన; చలించుచున్నవానిని అదుపులోనుంచువాడు; ప్రపంచమునకు, జీవునకు వంతెన వంటివాడు..

290.సత్యధర్మపరాక్రమః --- సదా నిజమైన ధర్మగుణము, పరాక్రమము కలిగినవాడు.

శ్లోకం 32సవరించు

291.భూతభవ్యభవన్నాథః --- మూడు కాలములకును (గడచినది, జరుగుచున్నది, రాబోవునది) అధిపతి; మూడు కాలములందును అందరికి అన్నింటికి అధిపతి.

292.పవనః --- వాయువు, ప్రాణము; సంచరించేవాడు, సర్వత్ర వ్యాపించియుండువాడు.

293.పావనః --- అంతటినీ పవిత్రము చేయువాడు.

294.అనలః --- తృప్తిలేని (తరగని) దయ గలిగినవాడు (దాశరథీ! కరుణా పయోనిధీ!) ; అగ్ని; పాప వినాశకుడు.

295.కామహా --- కోరికలను (భక్తులకు తగని కామములను) నాశనము చేయవాడు.

296.కామకృత్ --- భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు; కోర దగినవానిని సృష్టించువాడు; భక్తులకు తగిన మోక్షమును ప్రసాదించువాడు.

297.కాంతః --- అతి మనోహరుడు, సమ్మోహన రూపుడు, ఆత్మ బంధువు (నల్లనివాడు, పద్మ నయనమ్ములవాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, సుధా రసమ్ము పై జల్లువాడు - నీదు పలుకె పలుకురా! నీదు కులుకె కులుకురా! నీదు తళుకె తళుకురా! నిజమైన త్యాగరాజనుత! ఎందు కౌగిలింతురా? నిన్నెంతని వర్ణింతురా!)

298.కామః --- ప్రేమ స్వరూపుడు, కోరుకొన దగినవాడు, మన్మధుడు; ధర్మార్ధకామమోక్షములను అభిలషించువారిచే కోరబడువాడు.

299.కామప్రదః --- కోరినవి ఇచ్చేవాడు (కొండలంత వరములు గూపెడు కోనేటిరాయడు).

300.ప్రభుః --- (35, 300 నామములు) అందరికంటె అధికుడు; అందరిని అధిగమించువాడు; అందరి మనస్సులను తనవైపు లాగుకొను అధిష్ఠాత; ఘటనాఘటన సమర్ధుడు; దేవాధిదేవుడు.

శ్లోకం 33సవరించు

301.యుగాదికృత్ --- యుగమును ఆరంభించువాడు; యుగములను సృష్టించి యుగారంభమున సృష్టికార్యము చేయువాడు; వటపత్రశాయి.

302.యుగావర్తః --- యుగములను ప్రవర్తింపజేయువాడు, కాల చక్రమును నడుపువాడు; కాల స్వరూపుడు.

303.నైకమాయః --- అనేకములైన అద్భుతములకు ఆలవాలమైనవాడు; ఎన్నోవిధములైన మాయా స్వరూపములను ధరించువాడు.

304.మహాశనః --- విపరీతమైన ఆకలి గలవాడు, కల్పాంతమున సమస్తమును భక్షించువాడు; ప్రళయకాలమున అంతటిని తనయందు లయమొనర్చుకొనువాడు; గొప్పగా వ్యాపించినవాడు.

305.అదృశ్యః --- కానరానివాడు; ఇంద్రియ, మనోబుద్ధులకు కనరాని, ఊహింప శక్యము గాని చరిత్ర గలవాడు (ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా? ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా?).

306.వ్యక్తరూపః--- స్పష్టమైన రూపము కలవాడు, భక్తులకు దర్శనమొసగువాడు; స్వయంప్రకాశకుడు, అవతార మూర్తి, ప్రత్యక్షదైవము; యోగముచే కనుపించు రూపము కలవాడు.

అవ్యక్తరూపః --- తెలియరానివాడు.

307.సహస్రజిత్ --- వేలాది యుగములను జయించువాడు; వేలాది రాక్షసులను జయించువాడు (రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః)

308.అనంతజిత్ --- అంతులేని విజయములు కలిగినవాడు; అవధులు లేకుండా ప్రకాశించేవాడు; తన అనంత మహిమలను ఇతరులెరుగజాల నట్టివాడు.

301) యుగావర్త: - యుగములను త్రిప్పువాడు.

302) నైకమాయ: - తన మాయాశక్తిచే అనేక రూపములను ధరించి, ప్రదర్శించువాడు.

303) మహాశన: - సర్వమును కబళించువాడు.

304) అదృశ్య: - దృశ్యము కానివాడు.

30వ్యక్తరూప: - భక్తుల హృదయములలో వ్యక్తరూపుడై భాసిల్లువాడు.

306) సహస్రజిత్ - వేలకొలది రాక్షసులను సంగ్రామమున జయించువాడు.

307) అనంతజిత్ - అనూహ్యమైన శక్తి సామర్ద్యములు కలవాడై, రణరంగమున ఎదిరించువారిని జయించు శక్తి కలవాడు.

308) ఇష్ట: - ప్రియమైనవాడు.

309) అవిశిష్ట: - సర్వాంతర్యామియైనవాడు.

310) శిష్టేష్ట: - బుధజనులైన సాధుమహాత్ములకు ఇష్టుడైనవాడు.

311) శిఖండీ - శిరమున నెమలిపింఛమును ధరించినవాడు.

312) నహుష: - తన మాయచేత జీవులను సంసారమునందు బంధించువాడు.

313) వృష: - ధర్మస్వరూపుడైనవాడు.

314) క్రోధహా - సాధకులలోని క్రోధమును నశింపచేయువాడు.

315) క్రోధ కృత్కర్తా - క్రోధాత్ములగువారిని నిర్మూలించువాడు.

316) విశ్వబాహు: - బాహువులు విశ్వమంతట కలవాడు.

317) మహీధర: - భూమిని ధరించినవాడు.

318) అచ్యుత: - ఎట్టి వికారములకు లోనుగానివాడు. ( ఎటువంటి మార్పు పొందనివాడు.)

319) ప్రధిత: - ప్రఖ్యాతి నొందినవాడు.

320) ప్రాణ: - అంతటా చైతన్య స్వరూపమై నిండి, ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు.

321) ప్రాణద: - ప్రాణ బలము ననుగ్రహించువాడు.

322) వాసవానుజ: - ఇంద్రునకు తమ్ముడు.

323) అపాంనిధి: - సాగరమువలె అనంతుడైనవాడు.

324) అధిష్టానం - సర్వమునకు ఆధారమైనవాడు.

325) అప్రమత్త: - ఏమరు పాటు లేనివాడు.

326) ప్రతిష్ఠిత: - తన మహిమయందే నిలిచియుండువాడు.

327) స్కంద: - అమృత రూపమున స్రవించువాడు.

328) స్కందధర: - ధర్మమార్గమున నిలుపువాడు.

329) ధుర్య: - సర్వ జీవుల ఉత్పత్తి మొదలగు భారములను మోయువాడు.

330) వరద: - వరముల నొసగువాడు.

331) వాయువాహన: - సప్త వాయువులను బ్రహ్మాండమంతటను ప్రవర్తింపచేయువాడు.

332) వాసుదేవ: - అంతటను నిండియున్నవాడు.

333) బృహద్భాను: - ప్రకాశవంతమగు కిరణతేజముచే విశ్వమును ప్రకాశింపచేయువాడు.

334) ఆదిదేవ: - సృష్టి కార్యమును ప్రారంభించినవాడు.

335) పురంధర: - రాక్షసుల పురములను నశింపచేసినవాడు.

336) అశోక: - శోకము లేనివాడు.

337) తారణ: - సంసార సాగరమును దాటించువాడు.

338) తార: - గర్భ, జన్మ, జరా, మృత్యురూపమైన భయమునుండి తరింపజేయువాడు.

339) శూర: - పరాక్రమము గలవాడు.

340) శౌరి: - బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణిచినవాడు.

341) జనేశ్వర: - జనులకు ప్రభువు.

342) అనుకూల: - సర్వులకు అనుకూలుడైనవాడు.

343) శతావర్త: - ధర్మ రక్షణార్థము అనేక పర్యాయములు ఆవిర్భవించినవాడు.

344) పద్మీ - పద్మమును చేతియందు ధరించినవాడు.

345) పద్మనిభేక్షణ: - పద్మమువంటి నేత్రములు కలవాడు.

346) పద్మనాభ: - పద్మము నాభియందుండువాడు.

347) అరవిందాక్ష: - కమలరేకులవంటి కన్నులు గలవాడు.

348) పద్మగర్భ: - పద్మగర్భమున నివసించువాడు.

349) శరీరభృత్ - ప్రాణుల శరీరములను పోషించువాడు.

350) మహార్ది: - మహావిభూతులు కలవాడు.

351) బుద్ధ: - ప్రపంచాకారముతో భాసించువాడు.

352) వృద్ధాత్మా - సృష్టికి పూర్వమే ఉన్నవాడు.

353) మహాక్ష: - గొప్ప నేత్రములు గలవాడు.

354) గరుడధ్వజ: - తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడు.

355) అతుల: - సాటిలేనివాడు.

356) శరభ: - శరీరములందు ప్రత్యగాత్మగా ప్రకాశించువాడు.

357) భీమ: - భీకరమైన శక్తి సంపన్నుడు.

358) సమయజ్ఞ: - సర్వులను సమభావముతో దర్శించుటయే తన పూజగా భావించువాడు.

359) హవిర్హరి: - యజ్ఞములలో హవిర్భాగమును గ్రహించువాడు.

360) సర్వలక్షణ లక్షణ్య: - సర్వప్రమాణములచే సిద్ధించు జ్ఞానముచేత నిర్ణయింపబడినవాడు.

361) లక్ష్మీవాన్ - సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కలిగినవాడు.

362) సమితింజయ: - యుద్ధమున జయించినవాడు.

363) విక్షర: - నాశములేనివాడు.

364) రోహిత: - మత్స్యరూపమును ధరించినవాడు.

365) మార్గ: - భక్తులు తరించుటకు మార్గము తాను అయినవాడు.

366) హేతు: - సృష్టికి కారణము అయినవాడు.

367) దామోదర: - దమాది సాధనలచేత ఉదారమైన బుద్ధిద్వారా పొందబడువాడు.

368) సహ: - సహనశీలుడు.

369) మహీధర: - భూమిని ధరించినవాడు.

370) మహాభాగ: - భాగ్యవంతుడు.

371) వేగవాన్ - అమితమైన వేగము కలవాడు.

372) అమితాశన: - అపరిమితమైన ఆకలి గలవాడు.

373) ఉద్బవ: - ప్రపంచసృష్టికి ఉపాదానమైనవాడు.

374) క్షోభణ: - సృష్టికాలమందు కల్లోలము కల్గించువాడు.

375) దేవ: - క్రీడించువాడు.

376) శ్రీ గర్భ: - సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు.

377) పరమేశ్వర: - ఉత్కృష్ట మైనవాడు.

378) కరణమ్ - జగదుత్పత్తికి సాధనము అయినవాడు.

379) కారణమ్ - జగత్తునకు కారణమైనవాడు.

380) కర్తా - సమస్త కార్యములకు కర్తయైనవాడు.

381) వికర్తా - విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు.

382) గహన: - గ్రహించ శక్యముగానివాడు.

383) గుహ: - వ్యక్తము కానివాడు. కప్పబడినవాడు.

384) వ్యవసాయ: - మానవాళి అభ్యున్నతికి తానే కృషిచేయువాడు.

385) వ్యవస్థాన: - సర్వవ్యవహారములను యధావిధిగ నడుపువాడు.

386) సంస్థాన: - జీవులకు గమ్యస్థానమైనవాడు.

387) స్థానద: - వారివారి కర్మానుసారముగా స్థానముల నందించువాడు.

388) ధ్రువ: - అవినాశియై, స్థిరమైనవాడు.

389) పరర్థి: - ఉత్కృష్టమైన వైభవముకలవాడు.

390) పరమస్పష్ట: - మిక్కిలి స్పష్టముగా తెలియువాడు.

391) తుష్ట: - సంతృప్తుడు.

392) పుష్ట: - పరిపూర్ణుడు

393) శుభేక్షణ: - శుభప్రధమైన దృష్టిగలవాడు.

394) రామ: - నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు.

395) విరామ: - సకలజీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.

396) విరత: - విషయ వాంఛలు లేనివాడు.

397) మార్గ: - మోక్షమునకు మార్గము తానైనవాడు.

398) నేయ: - ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు.

399) నయ: - జీవులను నడిపించి పరమపదస్థితికి గొనిపోవువాడు.

400) అనయ: - తనను నడుపువాడు మరొకడు లేనివాడు.

401) వీర: - పరాక్రమశాలియైనవాడు.

402) శక్తిమతాం శ్రేష్ఠ: - శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు.

403) ధర్మ: - ధర్మ స్వరూపుడు.

404) ధర్మ విదుత్తమ: - ధర్మము నెఱింగినవారిలో శ్రేష్ఠుడు.

405) వైకుంఠ: - సృష్ట్యారంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు.

406) పురుష: - ఈ సర్వముకంటే పూర్వమునుండువాడు.

407) ప్రాణ: - ప్రాణరూపమున చేష్ట కల్గించువాడు.

408) ప్రాణద: - ప్రాణమును ప్రసాదించువాడు. ప్రాణము లిచ్చువాడు.

409) ప్రణవ: - ఓంకార స్వరూపుడు.

410) పృథు: - ప్రపంచరూపమున విస్తరించినవాడు.

411) హిరణ్యగర్భ: - బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు.

412) శత్రుఘ్న: - శత్రువులను సంహరించువాడు.

413) వ్యాప్త: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.

414) వాయు: - వాయురూపమున యుండి సకలమును పోషించువాడు.

415) అథోక్షజ: - స్వరూపస్థితి నుండి ఎన్నడును జాఱనివాడు.

416) ఋతు: - కాలరూపమై తెలియబడు ఋతువులై భాసించువాడు.

417) సుదర్శన: - భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు.

418) కాల: - శతృవులను మృత్యురూపమున త్రోయువాడు.

419) పరమేష్ఠీ - హృదయగుహలో తన మహిమచే ప్రకాశించువాడు.

420) పరిగ్రహ: - గ్రహించువాడు.

421) ఉగ్ర: - ఉగ్రరూపధారి

422) సంవత్సర: - సర్వజీవులకు వాసమైనవాడు.

423) దక్ష: - సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు.

424) విశ్రామ: - జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు.

425) విశ్వదక్షిణ: - అశ్వమేధయాగములో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు.

426) విస్తార: - సమస్త లోకములు తనయందే విస్తరించి ఉన్నవాడు.

427) స్థావర: స్థాణు: - కదులుట మెదలుట లేనివాడు.

428) ప్రమాణం - సకలమునకు ప్రమాణమైనవాడు.

429) బీజమవ్యయం - క్షయము కాని బీజము.

430) అర్థ: - అందరిచే కోరబడినవాడు.

431) అనర్థ: - తాను ఏదియును కోరనివాడు.

432) మహాకోశ: - అన్నమయాది పంచకోశములచే ఆవరించినవాడు.

433) మహాభాగ: - ఆనంద స్వరూపమైన భోగము కలవాడు.

434) మహాధన: - గొప్ప ఐశ్వర్యము కలవాడు.

435) అనిర్విణ్ణ: - వేదన లేనివాడు.

436) స్థవిష్ఠ: - విరాడ్రూపమై భాసించువాడు.

437) అభూ: - పుట్టుక లేనివాడు.

438) ధర్మయూప: - ధర్మము లన్నియు తనయందే ఉన్నవాడు.

439) మహామఖ: - యజ్ఞస్వరూపుడు.

440) నక్షత్రనేమి: - జ్యోతిష చక్రమును ప్రవర్తింపచేయువాడు.

441) నక్షత్రీ - చంద్ర రూపమున భాసించువాడు.

442) క్షమ: - సహనశీలుడు.

443) క్షామ: - సర్వము నశించినను తాను క్షయ మెరుగక మిగిలియుండువాడు.

444) సమీహన: - సర్వ భూతహితమును కోరువాడు.

445) యజ్ఞ: - యజ్ఞ స్వరూపుడు.

446) ఇజ్య: - యజ్ఞములచే ఆరాధించుబడువాడు.

447) మహేజ్య: - గొప్పగా పూజింపదగినవాడు.

448) క్రతు: - యజ్ఞముగా నున్నవాడు.

449) సత్రమ్ - సజ్జనులను రక్షించువాడు.

450) సతాంగతి: - సజ్జనులకు పరమాశ్రయ స్థానమైనవాడు.

451) సర్వదర్శీ - సకలమును దర్శించువాడు.

452) విముక్తాత్మా - స్వరూపత: ముక్తి నొందినవాడు.

453) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.

454) జ్ఞానముత్తమమ్ - ఉత్తమమైన జ్ఞానము కలవాడు భగవానుడు.

455) సువ్రత: - చక్కని వ్రతదీక్ష కలవాడు.

456) సుముఖ: - ప్రసన్న వదనుడు.

457) సూక్ష్మ: - సర్వవ్యాపి.

458) సుఘోష: - చక్కటి ధ్వని గలవాడు.

459) సుఖద: - సుఖమును అనుగ్రహించువాడు.

460) సుహృత్ - ఏ విధమైన ప్రతిఫలము నాశించకనే సుహృద్భావముతో ఉపకారము చేయువాడు.

461) మనోహర: - మనస్సులను హరించువాడు.

462) జితక్రోధ: - క్రోధమును జయించినవాడు.

463) వీరబాహు: - పరాక్రమముగల బాహువులు కలవాడు.

464) విదారణ: - దుష్టులను చీల్చి చెండాడువాడు.

465) స్వాపన: - తన మాయచేత ప్రాణులను ఆత్మజ్ఞాన రహితులుగాజేసి నిద్రపుచ్చువాడు.

466) స్వవశ: - సర్వ స్వతంత్రమైనవాడు.

467) వ్యాపీ - సర్వత్ర వ్యాపించియున్నవాడు.

468) నైకాత్మా - అనేక రూపములలో విరాజిల్లువాడు.

469) నైక కర్మకృత్ - సృష్టి, స్థితి, లయము మున్నగు అనేక కార్యములు చేయువాడు.

470) వత్సర: - సర్వులకు వాసమైనవాడు.

471) వత్సల: - భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు.

472) వత్సీ - తండ్రి వంటివాడు.

473) రత్నగర్భ: - సాగరము వలె తన గర్భమున రత్నములు గలవాడు.

474) ధనేశ్వర: - ధనములకు ప్రభువు.

475) ధర్మగుప్ - ధర్మమును రక్షించువాడు.

476) ధర్మకృత్ - ధర్మము నాచరించువాడు.

477) ధర్మీ - ధర్మమునకు ఆధారమైనవాడు.

478) సత్ - మూడు కాలములలో పరిణామ రహితుడై, నిత్యుడై ఉన్నవాడు.

479) అసత్ - పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు.

480) క్షర: - వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు.

481) అక్షర: - క్షరమగు ప్రపంచమున అవినాశియై భాసిల్లువాడు.

482) అవిజ్ఞాతా - తెలుసుకొనువాని కంటెను విలక్షణమైనవాడు.

483) సహస్రాంశు: - అనంత కిరణములు గలవాడు.

484) విధాతా - సర్వమునకు ఆధారమైనవాడు.

485) కృతలక్షణ: - వేదశాస్త్రములను వెలువరించినవాడు.

486) గభస్తినేమి: - మయూఖ చక్రమునకు కేంద్రమైనవాడు.

487) సత్వస్థ: - అందరిలో నుండువాడు.

488) సింహ: - సింహమువలె పరాక్రమశాలియైనవాడు.

489) భూతమహేశ్వర: - సర్వ భూతములకు ప్రభువైనవాడు.

490) ఆదిదేవ: - తొలి దేవుడు.

491) మహాదేవ: - గొప్ప దేవుడు.

492) దేవేశ: - దేవదేవుడు.

493) దేవభృద్గురు: - దేవతల ప్రభువైన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు.

494) ఉత్తర: - అందరికంటెను అధికుడై, ఉత్తముడైనవాడు.

495) గోపతి: - గోవులను పాలించువాడు.

496) గోప్తా - సర్వులను సంరక్షించువాడు.

497) జ్ఞానగమ్య: - జ్ఞానము చేతనే తెలియబడినవాడు.

498) పురాతన: - సృష్టికి పూర్వమే వున్నవాడు.

499) శరీరభూతభృత్ - శరీరముల నుత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు.

500) భోక్తా - అనుభవించువాడు.

501) కపీంద్ర: - వానరులకు ప్రభువైనవాడు.

502) భూరిదక్షిణ: - యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణ లిచ్చువాడు.

503) సోమప: - యజ్ఞముల యందు యజింపబడిన దేవతలరూపముతో సోమరసమును పానము చేయువాడు.

504) అమృతప: - ఆత్మానందరసమును అనుభవించువాడు.

505) సోమ: - చంద్రరూపమున ఓషధులను పోషించువాడు.

506) పురుజిత్: - ఒక్కడై అనేకమందిని ఎదురించి, జయించగల్గినవాడు.

507) పురుసత్తమ: - ఉత్తములలో ఉత్తముడైనవాడు.

508) వినయ: - దుష్టులను దండించి, వినయము కల్గించువాడు.

509) జయ: - సర్వులను జయించి వశపరుచుకొనువాడు.

510) సత్యసంధ: - సత్యసంకల్పములు, సత్యవాక్కులు గలవాడు.

511) దాశార్హ: - దశార్హుడనువాని వంశమున పుట్టినవాడు.

512) సాత్వతాంపతి: - యదుకులమునకు ప్రభువు.

513) జీవ: - జీవుడు.

514) వినయితా సాక్షీ - భక్తుల యందలి వినయమును గాంచువాడు.

515) ముకుంద: - ముక్తి నొసగువాడు.

516) అమిత విక్రమ: - అమితమైన పరాక్రామము గలవాడు.

517) అంభోనిధి: - దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు ఈ నాలుగు వర్గములు అంభశబ్ధార్థములు, అంభస్సులు తనయందే ఇమిడి యున్నవాడు.

518) అనంతాత్మా - అనంతమైన ఆత్మస్వరూపుడు.

519) మహోదధిశయ: - వైకుంఠమునందు క్షీరసాగరమున శేషతల్పముపై శయనించువాడు.

520) అంతక: - ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు.

521) అజ: - పుట్టుకలేనివాడు.

522) మహార్హ: - విశేష పూజకు అర్హుడైనవాడు.

523) స్వాభావ్య: - నిరంతరము స్వరూపజ్ఞానముతో విరాజిల్లువాడు.

524) జితమిత్ర: - శత్రువులను జయించినవాడు.

525) ప్రమోదన: - సదా ఆనందమునందుండువాడు.

526) ఆనంద: - ఆనందమే తన స్వరూపముగా గలవాడు.

527) నందన: - సర్వులకు ఆనందము నొసగువాడు.

528) నంద: - విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు.

529) సత్యధర్మా - సత్య, ధర్మ స్వరూపుడు.

530) త్రివిక్రమ: - మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు.

531) మహర్షి: కపిలాచార్య: - వేదవిదుడైన కపిలమునిగా అవతరించినవాడు.

532) కృతజ్ఞ: - సృష్టి, సృష్టికర్త రెండును తానైనవాడు.

533) మేదినీపతి: - భూదేవికి భర్తయైనవాడు.

534) త్రిపద: - మూడు పాదములతో సమస్తము కొలిచినవాడు. వామనుడని భావము.

535) త్రిదశాధ్యక్ష: - జీవులనుభవించు జాగ్రుత, స్వప్న, సుషుప్త్య వస్థలకు సాక్షియైనవాడు.

536) మహాశృంగ: - ప్రళయకాల సాగరములోని నావను గొప్పదియైన తన కొమ్మున బంధించి సత్యవ్రతుని ఆయన అనుచరులైన ఋషులను ప్రళయము నుండి రక్షించినవాడు.

537) కృతాంతకృత్ - మృత్యువుని ఖండించినవాడు.

538) మహావరాహ: - మహిమగల వరాహమూర్తి.

539) గోవింద: - గోవులకు ఆనందాన్నిచ్చువాడు. భూమికి ఆధారభూతమైనవాడు.

540) సుషేణ: - శోభనమైన సేన గలవాడు.

541) కనకాంగదీ - సువర్ణమయములైన భుజకీర్తులు కలవాడు.

542) గుహ్య: - హృదయగుహలో దర్శించదగినవాడు.

543) గభీర: - జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము మొదలగువానిచే గంభీరముగా నుండువాడు.

544) గహన: - సులభముగా గ్రహించుటకు వీలుకానివాడు.

545) గుప్త: - నిగూఢమైన ఉనికి గలవాడు.

546) చక్రగదాధర: - సుదర్శనమను చక్రమును, కౌమోదకీ యను గదను ధరించినవాడు.

547) వేధా: - సృష్టి చేయువాడు.

548) స్వాంగ: - సృష్టి కార్యమును నిర్వహించుటకు అవసరమగు సాధన సామాగ్రి కూడా తానే అయినవాడు.

549) అజిత: - ఎవనికి తలవొగ్గనివాడై జయింపవీలుకానివాడు.

550) కృష్ణ: - నీలమేఘ శ్యాముడు.

551) దృఢ: - చలించని స్వభావము కలవాడు.

552) సంకర్షణోచ్యుత: - విశ్వమంతయు ప్రళయకాలములో కదిలిపోయినను తానూ ఏ విధమైన పరిణామము చెందనివాడు.

553) వరుణ: - తన కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు.

554) వారుణ: - వరుణుని కుమారులైన వశిష్ఠుడు, అగస్త్యులుగా వ్యక్తమైనవాడు.

555) వృక్ష: - భక్తులకు అనుగ్రహఛాయ నందించువాడు.

556) పుష్కరాక్ష: - ఆకాశమంతయు వ్యాపించినవాడు.

557) మహామనా: - గొప్ప మనస్సు కలవాడు.

558) భగవాన్ - భగమను ఆరు లక్షణములు సమగ్రముగా యున్నవాడు.

559) భగహా - ప్రళయ సమయమున తన విభూతులను పోగొట్టువాడు.

560) ఆనందీ - ఆనందము నొసంగువాడు.

561) వనమాలీ - వైజయంతి అను వనమాలను ధరించినవాడు.

562) హలాయుధ: - నాగలి ఆయుధముగా కలవాడు.

563) ఆదిత్య: - అదితి యొక్క కుమారుడు. వామనుడు.

564) జ్యోతిరాదిత్య: - సూర్యునియందు తేజోరూపమై భాసిల్లువాడు.

565) సహిష్ణు: - ద్వంద్వములను సహించువాడు.

566) గతిసత్తమ: - సర్వులకు గతియై ఉన్నవాడు.

567) సుధన్వా - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.

568) ఖండ పరశు: - శత్రువులను ఖండించునట్టి గొడ్డలిని ధరించినవాడు.

569) దారుణ: - దుష్టులైన వారికి భయమును కలిగించువాడు.

570) ద్రవిణప్రద: - భక్తులకు కావలిసిన సంపదలను ఇచ్చువాడు.

571) దివ: సృక్ - దివిని అంటియున్నవాడు.

572) సర్వదృగ్య్వాస: - సమస్తమైన జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు.

573) వాచస్పతి రయోనిజ: - విద్యలకు పతి, మాతృగర్భమున జన్మించనివాడు.

574) త్రిసామా - మూడు సామ మంత్రములచే స్తుతించబడువాడు.

575) సామగ: - సామగానము చేయు ఉద్గాత కూడ తానే అయినవాడు.

576) సామ - సామవేదము తానైనవాడు.

577) నిర్వాణమ్ - సమస్త దు:ఖ విలక్షణమైన పరమానంద స్వరూపుడు.

578) భేషజం - భవరోగమును నివారించు దివ్యౌషధము తానైనవాడు.

579) భిషక్ - భవరోగమును నిర్మూలించు వైద్యుడు.

580) సంన్యాసకృత్ - సన్యాస వ్యవస్థను ఏర్పరచినవాడు.

581) శమ: - శాంత స్వరూపమైనవాడు.

582) శాంత: - శాంతి స్వరూపుడు.

583) నిష్ఠా - ప్రళయ కాలమున సర్వజీవులకు లయస్థానమైనవాడు.

584) శాంతి: - శాంతి స్వరూపుడు.

585) పరాయణమ్ - పరమోత్కృష్ట స్థానము.

586) శుభాంగ: - మనోహరమైన రూపము గలవాడు.

587) శాంతిద: - శాంతిని ప్రసాదించువాడు.

588) స్రష్టా - సృష్ట్యారంభమున జీవులందరిని ఉత్పత్తి చేసినవాడు.

589) కుముద: - కు అనగా భూమి, ముద అనగా సంతోషము. భూమి యందు సంతోషించువాడు.

590) కువలేశయ: - భూమిని చుట్టియున్న సముద్రమునందు శయనించువాడు.

591) గోహిత: - భూమికి హితము చేయువాడు.

592) గోపతి: - భూదేవికి భర్తయైనవాడు.

593) గోప్తా - జగత్తును రక్షించువాడు.

594) వృషభాక్ష: - ధర్మదృష్టి కలవాడు.

595) వృషప్రియ: - ధర్మమే ప్రియముగా గలవాడు.

596) అనివర్తీ - ధర్మ మార్గమున ఎన్నడూ వెనుకకు మఱలని వాడు.

597) నివృత్తాత్మా - నియమింపబడిన మనసు గలవాడు.

598) సంక్షేప్తా - జగత్తును ప్రళయకాలమున సూక్షము గావించువాడు.

599) క్షేమకృత్ - క్షేమమును గూర్చువాడు.

600) శివ: - తనను స్మరించు వారలను పవిత్రము చేయువాడు.

601) శ్రీవత్సవక్షా - శ్రీ వత్సమనెడి చిహ్నమును వక్షస్థలమున ధరించినవాడు.

602) శ్రీ వాస: - వక్షస్థలమున లక్ష్మీదేవికి వాసమైనవాడు.

603) శ్రీపతి: - లక్ష్మీదేవికి భర్తయైనవాడు.

604) శ్రీమతాంవరా: - శ్రీమంతులైన వారిలో శ్రేష్ఠుడు.

605) శ్రీ ద: - భక్తులకు సిరిని గ్రహించువాడు.

606) శ్రీ శ: - శ్రీ దేవికి నాథుడైనవాడు.

607) శ్రీనివాస: - ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులైనవారి హృదయముల యందు వసించువాడు.

608) శ్రీ నిధి: - ఐశ్వర్య నిధి.

609) శ్రీ విభావన: - సిరులను పంచువాడు.

610) శ్రీ ధర: - శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు.

611) శ్రీ కర: - శుభముల నొసగువాడు.

612) శ్రేయ: - మోక్ష స్వరూపుడు.

613) శ్రీమాన్ - సర్వ విధములైన ఐశ్వర్యములు గలవాడు.

614) లోకత్రయాశ్రయ: - ముల్లోకములకు ఆశ్రయమైనవాడు.

615) స్వక్ష: - చక్కని కన్నులు కలవాడు.

616) స్వంగ: - చక్కని అంగములు కలవాడు.

617) శతానంద: - అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా ఆనందించువాడు.

618) నంది: - పరమానంద స్వరూపుడు.

619) జ్యోతిర్గణేశ్వర: - జ్యోతిర్గణములకు ప్రభువు.

620) విజితాత్మ - మనస్సును జయించువాడు.

621) విధేయాత్మా - సదా భక్తులకు విధేయుడు.

622) సత్కీర్తి: - సత్యమైన యశస్సు గలవాడు.

623) ఛిన్నసంశయ: - సంశయములు లేనివాడు.

624) ఉదీర్ణ: - సర్వ జీవుల కంటెను ఉత్క్రష్టుడు.

625) సర్వతశ్చక్షు: - అంతటను నేత్రములు గలవాడు.

626) అనీశ: - తనకు ప్రభువు గాని, నియామకుడు గాని లేనివాడు.

627) శాశ్వతస్థిర: - శాశ్వతుడు స్థిరుడు.

628) భూశయ: - భూమిపై శయనించువాడు.

629) భూషణ: - తానే ఆభరణము, అలంకారము అయినవాడు.

630) భూతి: - సర్వ ఐశ్వర్యములకు నిలయమైనవాడు.

631) విశోక: - శోకము లేనివాడు.

632) శోకనాశన: - భక్తుల శోకములను నశింపచేయువాడు.

633) అర్చిష్మాన్ - తేజోరూపుడు.

634) అర్చిత: - సమస్త లోకములచే పూజింపబడువాడు.

635) కుంభ: - సర్వము తనయందుండువాడు.

636) విశుద్ధాత్మా - పరిశుద్ధమైన ఆత్మ స్వరూపుడు.

637) విశోధనః - తనను స్మరించు వారి పాపములను నశింపచేయువాడు

638) అనిరుద్ధః - శత్రువులచే అడ్డగింపబడనివాడు.

639) అప్రతిరథ: - తన నెదుర్కొను ప్రతిపక్షము లేని పరాక్రమవంతుడు.

640) ప్రద్యుమ్న: - విశేష ధనము కలవాడు.

641) అమిత విక్రమ: - విశేష పరాక్రమము గలవాడు.

642) కాలనేమినిహా - కాలనేమి యను రాక్షసుని వధించినవాడు.

643) వీర: - వీరత్వము గలవాడు.

644) శౌరి: - శూరుడను వాడి వంశమున పుట్టినవాడు.

645) శూరజనేస్వర: - శూరులలో శ్రేష్ఠుడు.

646) త్రిలోకాత్మా - త్రిలోకములకు ఆత్మయైనవాడు.

647) త్రిలోకేశ: - మూడు లోకములకు ప్రభువు.

648) కేశవ: - పొడవైన కేశములు గలవాడు.

649) కేశిహా: - కేశి యనుడి రాక్షసుని చంపినవాడు.

650) హరి: - అజ్ఞాన జనిత సంసార దు:ఖమును సమూలముగా అంతమొందించువాడు.

651) కామదేవ: - చతుర్విధ పురుషార్థములను కోరువారిచే పూజింపబడువాడు.

652) కామపాల: - భక్తులు తననుండి పొందిన పురుషార్థములను చక్కగా ఉపయోగపడునట్లు చూచువాడు.

653) కామీ - సకల కోరికలు సిద్ధించినవాడు.

654) కాంత: - రమణీయ రూపధారియైన వాడు.

655) కృతాగమ: - శ్రుతి, స్తృతి ఇత్యాది శాస్త్రములు రచించినవాడు.

656) అనిర్దేశ్యవపు: - నిర్దేశించి, నిర్వచించుటకు వీలుకానివాడు.

657) విష్ణు: - భూమ్యాకాశాలను వ్యాపించినవాడు.

658) వీర: - వీ ధాతువుచే సూచించు కర్మలచే నిండియున్నవాడు.

659) అనంత: - సర్వత్రా, సర్వకాలములందు ఉండువాడు.

660) ధనంజయ: - ధనమును జయించినవాడు.

661) బ్రహ్మణ్య: - బ్రహ్మను అభిమానించువాడు.

662) బ్రహ్మకృత్ - తపస్సు మొదలైనవిగా తెలియజేయుబడిన బ్రహ్మకు తానే కర్త అయినవాడు.

663) బ్రహ్మా - బ్రహ్మదేవుని రూపమున తానే సృష్టి చేయువాడు.

664) బ్రహ్మ - బ్రహ్మ అనగా పెద్దదని అర్థము.

665) బ్రహ్మవివర్థన: - తపస్సు మొదలైనవానిని వృద్ధి నొందించువాడు.

666) బ్రహ్మవిత్ - బ్రహ్మమును చక్కగా తెలిసినవాడు.

667) బ్రాహ్మణ: - వేదజ్ఞానమును ప్రబోధము చేయువాడు.

668) బ్రహ్మీ - తపస్యాది బ్రహ్మము తనకు అంగములై భాసించువాడు.

669) బ్రహ్మజ్ఞ: - వేదములే తన స్వరూపమని తెలిసికొనిన వాడు.

670) బ్రాహ్మణప్రియ: - బ్రహ్మజ్ఞానులైన వారిని ప్రేమించువాడు.

671) మహాక్రమ: - గొప్ప పద్ధతి గలవాడు.

672) మహాకర్మా - గొప్ప కర్మను ఆచరించువాడు.

673) మహాతేజా: - గొప్ప తేజస్సు గలవాడు.

674) మహోరగ: - గొప్ప సర్ప స్వరూపుడు.

675) మహాక్రతు: - గొప్ప యజ్ఞ స్వరూపుడు.

676) మహాయజ్వా - విశ్వ శ్రేయమునకై అనేక యజ్ఞములు నిర్వహించినవాడు.

677) మహాయజ్ఞ: - గొప్ప యజ్ఞ స్వరూపుడు.

678) మహాహవి: - యజ్ఞమునందలి హోమసాధనములు, హోమద్రవ్యములు అన్నిటి స్వరూపుడు.

679) స్తవ్య: - సర్వులచే స్తుతించబడువాడు.

680) స్తవప్రియ: - స్తోత్రములయందు ప్రీతి కలవాడు.

681) స్తోత్రం - స్తోత్రము కూడా తానే అయినవాడు.

682) స్తుతి: - స్తవనక్రియ కూడా తానే అయినవాడు.

683) స్తోతా - స్తుతించు ప్రాణి కూడా తానే అయినవాడు.

684) రణప్రియ: - యుద్ధమునందు ప్రీతి కలవాడు.

685) పూర్ణ: - సర్వము తనయందే గలవాడు.

686) పూరయితా - తన నాశ్రయించిన భక్తులను శుభములతో నింపువాడు.

687) పుణ్య: - పుణ్య స్వరూపుడు.

688) పుణ్యకీర్తి: - పవిత్రమైన కీర్తి గలవాడు.

689) అనామయ: - ఏవిధమైన భౌతిక, మానసిక వ్యాధులు దరిచేరనివాడు.

690) మనోజవ: - మనసు వలె అమిత వేగము కలవాడు.

691) తీర్థకర: - సకల విద్యలను రచించినవాడు.

692) వసురేతా: - బంగారము వంటి వీర్యము గలవాడు.

693) వసుప్రద: - ధనమును ఇచ్చువాడు.

694) వసుప్రద: - మోక్షప్రదాత

695) వాసుదేవ: - వాసుదేవునకు కుమారుడు.

696) వసు: - సర్వులకు శరణ్యమైనవాడు.

697) వసుమనా: - సర్వత్ర సమమగు మనస్సు గలవాడు.

698) హవి: - తానే హవిస్వరూపుడైనవాడు.

699) సద్గతి: - సజ్జనులకు పరమగతియైన వాడు.

700) సత్కృతి: - జగత్కళ్యాణమైన ఉత్తమ కార్యము.

701) సత్తా - సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన అనుభవ స్వరూపము.

702) సద్భూతి: - పరమోత్కృష్టమైన మేధా స్వరూపుడు.

703) సత్పరాయణ: - సజ్జనులకు పరమగతి అయినవాడు.

704) శూరసేన: - శూరత్వము గల సైనికులు గలవాడు.

705) యదుశ్రేష్ఠ: - యాదవులలో గొప్పవాడు.

706) సన్నివాస: - సజ్జనులకు నిలయమైనవాడు.

707) సుయామున: - యమునా తీర వాసులగు గోపకులచే పరివేష్ఠింప బడినవాడు.

708) భూతవాస: - సర్వ భూతములకు నిలయమైనవాడు.

709) వాసుదేవ: - తన మాయాశక్తిచే సర్వము ఆవరించియున్నవాడు. వసుదేవుని కుమారుడు.

710) సర్వాసు నిలయ: - సమస్త జీవులకు, ప్రాణులకు నిలయమైనవాడు.

711) అనల: - అపరిమిత శక్తి, సంపద గలవాడు.

712) దర్పహా - దుష్టచిత్తుల గర్వమణుచు వాడు.

713) దర్పద: - ధర్మమార్గమున చరించువారికి దర్పము నొసంగువాడు.

714) దృప్త: - సదా ఆత్మానందామృత రసపాన చిత్తుడు.

715) దుర్థర: - ధ్యానించుటకు, బంధించుటకు సులభసాధ్యము కానివాడు.

716) అపరాజిత: - అపజయము పొందనివాడు.

717) విశ్వమూర్తి: - విశ్వమే తన మూర్తిగా గలవాడు.

718) మహామూర్తి: - గొప్ప మూర్తి గలవాడు.

719) దీప్తమూర్తి: - సంపూర్ణ జ్ఞానముతో ప్రకాశించువాడు.

720) అమూర్తివాన్ - కర్మాధీనమైన దేహమే లేనివాడు.

721) అనేకమూర్తి: - అనేక మూర్తులు ధరించినవాడు.

722) అవ్యక్త: - అగోచరుడు.

723) శతమూర్తి: - అనేక మూర్తులు ధరించినవాడు.

724) శతానన: - అనంత ముఖములు గలవాడు.

725) ఏక: - ఒక్కడే అయినవాడు.

726) నైక: - అనేక రూపములు గలవాడు.

727) సవ: - సోమయాగ రూపమున ఉండువాడు. ఏకముగా, అనేకముగా తానే యుండుటచేత తాను పూర్ణరూపుడు.

728) క: - సుఖ స్వరూపుడు.

729) కిమ్ - అతడెవరు? అని విచారణ చేయదగినవాడు.

730) యత్ - దేనినుండి సర్వభూతములు ఆవిర్భవించుచున్నవో ఆ బ్రహ్మము.

731) తత్ - ఏది అయితే వ్యాపించిఉన్నదో అది అయినవాడు.

732) పదం-అనుత్తమం - ముముక్షువులు కోరు ఉత్తమస్థితి తాను అయినవాడు.

733) లోకబంధు: - లోకమునకు బంధువైనవాడు.

734) లోకనాధ: - లోకములకు ప్రభువు

735) మాధవ: - మౌన, ధ్యాన, యోగాదుల వలన గ్రహించుటకు శక్యమైనవాడు.

736) భక్తవత్సల: - భక్తుల యందు వాత్సల్యము గలవాడు.

737) సువర్ణవర్ణ: - బంగారు వంటి వర్ణము గలవాడు.

738) హేమాంగ: - బంగారు వన్నెగల అవయువములు గలవాడు.

739) వరంగ: - గొప్పవైన అవయువములు గలవాడు.

740) చందనాంగదీ - ఆహ్లాదకరమైన చందనముతోను కేయూరములతోను అలంకృతమైనవాడు.

741) వీరహా - వీరులను వధించినవాడు.

742) విషమ: - సాటిలేనివాడు.

743) శూన్య: - శూన్యము తానైనవాడు.

744) ఘృతాశీ: - సమస్త కోరికలనుండి విడువడినవాడు.

745) అచల: - కదలిక లేనివాడు.

746) చల: - కదులువాడు.

747) అమానీ - నిగర్వి, నిరహంకారుడు.

748) మానద: - భక్తులకు గౌరవము ఇచ్చువాడు.

749) మాన్య: - పూజింపదగిన వాడైన భగవానుడు.

750) లోకస్వామీ - పదునాలుగు భువనములకు ప్రభువు.

751) త్రిలోకథృక్ - ముల్లోకములకు ఆధారమైన భగవానుడు.

752) సుమేధా: - చక్కని ప్రజ్ఞ గలవాడు.

753) మేధజ: - యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు.

754) ధన్య: - కృతార్థుడైనట్టివాడు.

755) సత్యమేధ: - సత్య జ్ఞానము కలవాడు.

756) ధరాధర: - భూమిని ధరించి యున్నవాడు.

757) తేజోవృష: - సూర్యతేజముతో నీటిని వర్షించువాడు.

758) ద్యుతిధర: - కాంతివంతమైన శరీరమును ధరించినవాడు.

759) సర్వ శస్త్ర భృతాంవర: - శస్త్రములను ధరించినవారిలో శ్రేష్ఠుడైనవాడు.

760) ప్రగ్రహ: - ఇంద్రియములనెడి అశ్వములను తన అనుగ్రహము అనెడి పగ్గముతో కట్టివేయువాడు.

761) నిగ్రహ: - సమస్తమును నిగ్రహించువాడు.

762) వ్యగ్ర: - భక్తులను తృప్తి పరుచుటలో సదా నిమగ్నమై ఉండువాడు.

763) నైకశృంగ: - అనేక కొమ్ములు గలవాడు, భగవానుడు.

764) గదాగ్రజ: - గదుడను వానికి అన్న.

765) చతుర్మూర్తి: - నాలుగు రూపములు గలవాడు.

766) చతుర్బాహు: - నాలుగు బాహువులు గలవాడు.

767) చతుర్వ్యూహ: - శరీర, వేద, ఛందో మహద్రూపుడైన పురుషుడు. ఈ నలుగురు పురుషులు వ్యూహములుగా కలవాడు.

768) చతుర్గతి: - నాలుగు విధములైన వారికి ఆశ్రయ స్థానము.

769) చతురాత్మా - చతురమనగా సామర్ధ్యము.

770) చతుర్భావ: - చతుర్విద పురుషార్థములకు మూలమైనవాడు.

771) చతుర్వేదవిత్ - నాలుగు వేదములను తెలిసినవాడు.

772) ఏకపాత్ - జగత్తంతయు ఒక పాదముగా గలవాడు.

773) సమావర్త: - సంసార చక్రమును సమర్థతతో త్రిప్పువాడు.

774) అనివృత్తాత్మా - అంతయు తానైయున్నందున దేనినుండియు విడివడినవాడు.

775) దుర్జయ: - జయింప శక్యము గానివాడు.

776) దురతిక్రమ: - అతిక్రమింపరాని విధమును సాసించువాడు.

777) దుర్లభ: - తేలికగా లభించనివాడు.

778) దుర్గమ: - మిక్కిలి కష్టముతో మాత్రమే పొందబడినవాడు.

779) దుర్గ: - సులభముగా లభించనివాడు.

780) దురావాస: - యోగులకు కూడా మనస్సున నిలుపుకొనుటకు కష్టతరమైనవాడు.

781) దురారిహా: - దుర్మార్గులను వధించువాడు.

782) శుభాంగ: - దివ్యములైన, సుందరములైన అవయువములు గలవాడు.

783) లోకసారంగ: - లోకములోని సారమును గ్రహించువాడు.

784) సుతంతు: - జగద్రూపమున అందమైన తంతువువలె విస్తరించినవాడు.

785) తంతువర్థన: - వృద్ధి పరచువాడు, నాశనము చేయువాడు.

786) ఇంద్రకర్మా - ఇంద్రుని కర్మవంటి శుభప్రధమైన కర్మ నాచరించువాడు.

787) మహాకర్మా - గొప్ప కార్యములు చేయువాడు.

788) కృతకర్మా - ఆచరించదగిన కార్యములన్నియు ఆచరించినవాడు.

789) కృతాగమ: - వేదముల నందించువాడు.

790) ఉద్భవ: - ఉత్క్రష్టమైన జన్మ గలవాడు.

791) సుందర: - మిక్కిలి సౌందర్యవంతుడు.

792) సుంద: - కరుణా స్వరూపుడు.

793) రత్నగర్భ: - రత్నమువలె సుందరమైన నాభి గలవాడు.

794) సులోచన: - అందమైన నేత్రములు కలిగిన భగవానుడు.

795) అర్క: - శ్రేష్టులైన బ్రహ్మాదుల చేతను అర్చించబడువాడు.

796) వాజసన: - అర్థించు వారలకు ఆహారము నొసంగువాడని భావము.

797) శృంగీ - శృంగము గలవాడు.

798) జయంత: - సర్వ విధములైన విజయములకు ఆధారభూతుడు.

799) సర్వవిజ్జయీ - సర్వవిద్ అనగా సర్వము తెలిసినవాడు.

800) సువర్ణబిందు: - బంగారము వంటి అవయువములు గలవాడు.

801) అక్షోభ్య: - క్షోభ తెలియనివాడు.

802) సర్వవాగీశ్వరేశ్వర: - వాక్పతులైన బ్రహ్మాదులకు కూడ ప్రభువైన భగవానుడు.

803) మహాహ్రద: - గొప్ప జలాశయము.

804) మహాగర్త : - అగాధమైన లోయ వంటివాడు.

805) మహాభూత: - పంచభూతములకు అతీతమైనవాడు.

806) మహానిధి: - సమస్త భూతములు తనయందు ఉన్నవాడు.

807) కుముద: - కు అనగా భూమి . అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును కూర్చువాడు.

808) కుందర: - భూమిని చీల్చుకుపోయినవాడు.

809) కుంద: - భూమిని దానమిచ్చినవాడు.

810) పర్జన్య: - మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి,వారి మనస్సులను శాంతింపచేయువాడు భగవానుడు.

811) పావన: - పవిత్రీకరించువాడు.

812) అనిల: - ప్రేరణ చేయువాడు, సదా జాగరూకుడు.

813) అమృతాశ: - అమృతము నొసంగువాడు.

814) అమృతవపు: - అమృతస్వరూపుడు శాశ్వతుడు.

815) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.

816) సర్వతోముఖ: - ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడు.

817) సులభ: - భక్తితో తనను స్మరించువారికి సులభముగా లభ్యమగువాడు.

818) సువ్రత: - మంచి వ్రతము గలవాడు.

819) సిద్ధ: - సత్వస్వరూపుడై, పూర్ణరూపుడై భగవానుడు సిద్ధ: అని తెలియబడువాడు.

820) శత్రుజిత్ - శత్రువులను జయించువాడు.

821) శత్రుతాపన: - దేవతల విరోదులైన వారిని,సజ్జనులకు విరోధులైన వారిని తపింప చేయువాడు.

822) న్యగ్రోధ: - సర్వ భూతములను తన మాయచే ఆవరించి ఉన్నవాడు.

823) ఉదుంబర: - అన్నముచేత విశ్వమును పోషించువాడు.

824) అశ్వత్ధ: - అశాశ్వతమైన సంసార వృక్ష స్వరూపుడు.

825) చాణూరాంధ్ర నిషూదన: - చాణూరుడను మల్లయోధుని వధించినవాడు.

826) సహస్రార్చి: - అనంతకిరణములు కలవాడు.

827) సప్తజిహ్వ: - ఏడు నాలుకలుగల అగ్నిస్వరూపుడు.

828) సప్తైథా: - ఏడు దీప్తులు కలవాడు.

829) సప్తవాహన: -ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు.

830) అమూర్తి: - రూపము లేనివాడు.

831) అనఘ: - పాపరహితుడు.

832) అచింత్య: - చింతించుటకు వీలుకానివాడు.

833) భయకృత్ - దుర్జనులకు భీతిని కలిగించువాడు.

834) భయనాశన: - భయమును నశింపచేయువాడు.

835) అణు: - సూక్షాతి సూక్షమైనవాడు.

836) బృహుత్ - మిక్కిలి పెద్దది అయిన బ్రహ్మము స్వరూపము.

837) కృశ: - సన్ననివాడై, అస్థూలమైనవాడు.

838) స్థూల: - స్థూల స్వరూపము కలిగియున్నవాడు.

839) గుణభృత్ - సత్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు.

840) నిర్గుణ: - గుణములు తనలో లేనివాడు.

841) మహాన్ - దేశకాలాదుల నధిగమించి యున్నవాడు.

842) అధృత: - సర్వము తానే ధరించియుండి, తనను ధరించునది మరియొకటి లేనివాడు.

843) స్వధృత: - తనకు తానే ఆధారమైనవాడైన భగవానుడు.

844) స్వాస్య: - విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు.

845) ప్రాగ్వంశ: - ప్రాచీనమైన వంశము కలవాడు.

846) వంశవర్థన: - తన వంశమును వృద్ధినొందించువాడు.

847) భారభృత్ - భారమును మోయువాడు.

848) కథిత: - వేదములచేత సర్వోత్తముడుగా కీర్తించబడినవాడు.

849) యోగీ - ఆత్మజ్ఞానము నందే సదా ఓలలాడు వాడు.

850) యోగీశ: - యోగులకు ప్రభువు.

851) సర్వ కామద: - సకల కోరికలను తీర్చువాడు.

852) ఆశ్రమ: - జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.

853) శ్రమణ: - భక్తిహీనులను, వివేకరహితులను శ్రమ పెట్టువాడు.

854) క్షామ: - సర్వ జీవులను క్షీణింపజేయువాడు.

855) సుపర్ణ: - రమణీయ పత్రములు కలిగిన వృక్షము తానైనవాడు.

856) వాయువాహన: - వాయు చలనమునకు కారణభూతుడైనవాడు.

857) ధనుర్ధర: - ధనస్సును ధరించినవాడు.

858) ధనుర్వేద: - ధనుర్వేదము తెలిసినవాడు.

859) దండ: - దండించువాడు.

860) దమయితా - శిక్షించువాడు.

861) దమ: - శిక్షానుభవము ద్వారా ఏర్పడు పవిత్రత తానైనవాడు.

862) అపరాజిత: - పరాజయము తెలియనివాడు.

863) సర్వసహ: - సమస్త శత్రువులను సహించువాడు.

864) నియంతా - అందరినీ తమతమ కార్యములందు నియమించువాడు.

865) అనియమ: - నియమము లేనివాడు.

866) ఆయమ: - మృత్యుభీతి లేనివాడు.

867) సత్త్వావాన్ - సత్త్వము గలవాడు.

868) సాత్త్విక: - సత్త్వగుణ ప్రధానుడైనవాడు.

869) సత్య: - సత్పురుషుల విషయములో మంచిగా ప్రవర్తించువాడు.

870) సత్యధర్మ పరాయణ: - సత్య విషయమునందును, ధర్మ విషయమునందును దీక్షాపరుడైనవాడు.

871) అభిప్రాయ: - అభిలషించు వారిచేత అభిప్రాయపడువాడు.

872) ప్రియార్హ: - భక్తుల ప్రేమకు పాత్రుడైనవాడు.

873) అర్హ: - అర్పింపబడుటకు అర్హుడైనవాడు.

874) ప్రియకృత్ - తన నాశ్రయించినవారికి ప్రియము నొసగూర్చువాడు.

875) ప్రీతివర్ధన: - భక్తులలో భవవంతునిపై ప్రీతిని వృద్ధి చేయువాడు.

876) విహాయన గతి: - ఆకాశము ఆశ్రయముగ గలదియైన విష్ణుపదము తానైనవాడు.

877) జ్యోతి: - తన ప్రకాశము చేత సర్వమును ప్రకాశింపచేయువాడు.

878) సురుచి: - అందమైన ప్రకాశము గలవాడు.

879) హుతభుక్ - యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు.

880) విభు: - సర్వ లోకములకు ప్రభువైనవాడు.

881) రవి: - తన విభూతియైన సూర్యుని ద్వారా భూమినుండి సర్వరసములను గ్రహించువాడు.

882) విలోచన: - వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు.

883) సూర్య: - ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు.

884) సవితా: - సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు.

885) రవిలోచన: - సూర్యుడు నేత్రములుగా కలవాడు.

886) అనంత: - అంతము లేనివాడు.

887) హుతభుక్ - హోమద్రవ్యము నారిగించువాడు.

888) భోక్తా - భోగ్యవస్తువైన ప్రకృతిని అనుభవించువాడు.

889) సుఖద: - భక్తులకు ఆత్మసుఖము నొసంగువాడు.

890) నైకజ: - అనేక రూపములలో అవతరించువాడు.

891) అగ్రజ: - సృష్ట్యారంభమునకు ముందే ఆవిర్భవించినవాడు.

892) అనిర్వణ్ణ: - నిరాశ నెరుగనివాడు.

893) సదామర్షీ - సజ్జనుల దోషములను క్షమించువాడు.

894) లోకాధిష్టానం - ప్రపంచమంతటికి ఆధారభూతుడు.

895) అధ్బుత: - ఆశ్చర్య స్వరూపుడు.

896) సనాత్ - ఆది లేనివాడు.

897) సనాతన సమ: - సృష్టికర్త యైన బ్రహ్మకు పూర్వము కూడా యున్నవాడు.

898) కపిల: - ఋషులలో కపిలుడు తానైనవాడు.

899) కపి: - సూర్యరూపుడు.

900) అవ్యయ: - ప్రళయకాలము నందు సమస్తము తనలో లీనమగుటకు విశ్రామ స్థానమైనవాడు.

901) స్వస్తిద: - సర్వశ్రేయములను చేకూర్చువాడు.

902) స్వస్తికృత్ - శుభమును కూర్చువాడు.

903) స్వస్తి - సర్వ మంగళ స్వరూపుడు.

904) స్వస్తిభుక్ - శుభమును అనుభవించువాడు.

905) స్వస్తిదక్షిణ: - స్మరణ మాత్రముననే సర్వ శుభములు సమకూర్చువాడు.

906) అరౌద్ర: - రౌద్రము లేనివాడు.

907) కుండలీ - మకర కుండలములు ధరించినవాడు.

908) చక్రీ - సుదర్శనమను చక్రమును ధరించినవాడు.

909) విక్రమీ - గొప్ప శూరుడైన భగవానుడు.

910) ఊర్జిత శాసన: - ఉల్లంఘించుటకు వీలులేని శాసనములు కలవాడు.

911) శబ్దాతిగ: - వాక్కుకు అందనివాడు.

912) శబ్దసహ: - సమస్త వేదములు తెలియబడినవాడు.

913) శిశిర: - శిశిర ఋతువువలె చల్లబరుచువాడు.

914) శర్వరీకర: - రాత్రిని కలుగజేయువాడు.

915) అక్రూర: - క్రూరత్వము లేనివాడు.

916) పేశల: - మనోవాక్కాయ కర్మలచే రమణీయముగ నుండువాడై పేశల: అని స్తుతించబడును.

917) దక్ష: - సమర్థుడైనవాడు.

918) దక్షిణ: - భక్తులను ఔదార్యముతో బ్రోచువాడు.

919) క్షమిణాం వర: - సహనశీలు లైన వారిలందరిలో శ్రేష్ఠుడు.

920) విద్వత్తమ: - సర్వజ్ఞత్తము కలిగియుండి, అందరిలో ఉత్తమమైనవాడు.

921) వీతభయ: - భయము లేనివాడు.

922) పుణ్యశ్రవణ కీర్తన: - తనను గూర్చి శ్రవణము గాని, కీర్తన గాని పుణ్యము కలుగజేయును.

923) ఉత్తారణ: - సంసార సముద్రమును దాటించువాడు.

924) దుష్కృతిహా - సాధకులలో యున్న చెడువాసనలను అంతరింప చేయువాడు.

925) ప్రాణ: - ప్రాణులకు పవిత్రతను చేకూర్చు పుణ్య స్వరూపుడు.

926) దుస్వప్న నాశన: - చెడు స్వప్నములను నాశనము చేయువాడు.

927) వీరహా - భక్తులు మనస్సులు వివిధ మార్గములలో ప్రయాణించకుండ క్రమము చేయువాడు.

928) రక్షణ: - రక్షించువాడైనందున భగవానుడు రక్షణ: అని స్తవనీయుడయ్యెను.

929) సంత: - పవిత్ర స్వరూపుడు.

930) జీవన: - సర్వ జీవులయందు ప్రాణశక్తి తానైనవాడు.

931) పర్యవస్థిత: - అన్నివైపుల అందరిలో వ్యాపించి యున్నవాడు.

932) అనంతరూప: - అనంతమైన రూపములు గలవాడు.

933) అనంత శ్రీ: - అంతము లేని శక్తివంతుడైనవాడు.

934) జితమన్యు: - క్రోధము ఎఱగని వాడు.

935) భయాపహ: - భయమును పోగొట్టువాడు.

936) చతురశ్ర: - జీవులకు కర్మఫలములను న్యాయముగా పంచువాడు.

937) గభీరాత్మా - గ్రహింప శక్యము గాని స్వరూపము గలవాడు.

938) విదిశ: - అధికారులైన వారికి ఫలము ననుగ్రహించుటలో ప్రత్యేకత కలిగియున్నవాడు.

939) వ్యాదిశ: - వారి వారి అర్హతలను గమనించి బ్రహ్మాదులను సైతము నియమించి, ఆజ్ఞాపించువాడు.

940) దిశ: - వేదముద్వారా మానవుల కర్మఫలములను తెలియజేయువాడు.

941) అనాది: - ఆదిలేనివాడు.

942) భూర్భువ: - సర్వభూతములకు ఆధారమైన భూమికి కూడా భూ: ఆధారమైనవాడు.

943) లక్ష్మీ: - లక్ష్మీ స్వరూపుడు.

944) సువీర: - అనేక విధములైన సుందర పోకడలు గలవాడు.

945) రుచిరాంగద: - మంగళమైన బాహువులు గలవాడు.

946) జనన: - సర్వ ప్రాణులను సృజించినవాడు.

947) జన జన్మాది: - జన్మించు ప్రాణుల జన్మకు ఆధారమైనవాడు.

948) భీమ: - అధర్మపరుల హృదయములో భీతిని కలిగించు భయరూపుడు.

949) భీమ పరాక్రమ: - విరోధులకు భయంకరమై గోచరించువాడు.

950) ఆధార నిలయ: - సృష్టికి ఆధారమైన పృధ్వి, జలము, తేజము, వాయువు, ఆకాశము అను పంచ మహాభూతములకు ఆధారమైనవాడు.

951) అధాతా - తానే ఆధారమైనవాడు.

952) పుష్టహాస: - మొగ్గ పువ్వుగా వికసించునట్లు ప్రపంచరూపమున వికసించువాడు.

953) ప్రజాగర: - సదా మేల్కొనియుండువాడు.

954) ఊర్ధ్వగ: - సర్వుల కన్నా పైనుండువాడు.

955) సత్పధాచార: - సత్పురుషుల మార్గములో చరించువాడు.

956) ప్రాణద: - ప్రాణ ప్రదాత యైనవాడు.

957) ప్రణవ: - ప్రణవ స్వరూపుడైనవాడు.

958) పణ: - సర్వ కార్యములను నిర్వహించువాడు.

959) ప్రమాణ: - స్వయముగానే జ్ఞానస్వరూపుడై యున్నవాడు.

960) ప్రాణ నిలయ: - సమస్త జీవుల అంతిమ విరామ స్థానమైనవాడు.

961) ప్రాణభృత్ - ప్రాణములను పోషించువాడు.

962) ప్రాణజీవన: - ప్రాణ వాయువుల ద్వారా ప్రాణులను జీవింపజేయువాడు.

963) తత్త్వం - సత్యస్వరూపమైనందున భగవానుడు తత్త్వం అని తెలియబడిన వాడు.

964) తత్త్వవిత్ - సత్యవిదుడైన భగవానుడు తత్త్వవిత్ అని స్తుతించబడువాడు.

965) ఏకాత్మా - ఏకమై, అద్వితీయమైన పరమాత్మ

966) జన్మమృత్యు జరాతిగ: - పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పుచెందుట, కృశించుట నశించుట వంటి వికారములకు లోనుగానివాడు.

967) భూర్భువ: స్వస్తరు: - భూ: భువ: స్వ: అను వ్యాహృతి రూపములు 3 గలవాడు.

968) తార: - సంసార సాగరమును దాటించువాడు.

969) సవితా - తండ్రి వంటివాడైన భగవానుడు.

970) ప్రపితామహః - బ్రహ్మదేవునికి కూడా తండ్రియైనవాడు.

971) యజ్ఞ: - యజ్ఞ స్వరూపుడు.

972) యజ్ఞపతి: - యజ్ఞము నందు అధిష్టాన దేవత తానైన భగవానుడు.

973) యజ్వా - యజ్ఞము నందు యజమాని.

974) యజ్ఞాంగ: - యజ్ఞము లోని అంగములన్నియు తానే అయినవాడు.

975) యజ్ఞవాహన: - ఫలహేతువులైన యజ్ఞములు వాహనములుగా కలవాడు.

976) యజ్ఞభృత్ - యజ్ఞములను సంరక్షించువాడు.

977) యజ్ఞకృత్ - యజ్ఞములను నిర్వహించువాడు.

978) యజ్ఞీ - యజ్ఞములందు ప్రధానముగా ఆరాధించుబడువాడు.

979) యజ్ఞభుక్ - యజ్ఞఫలమును అనుభవించువాడు.

980) యజ్ఞసాధన: - తనను పొందుటకు యజ్ఞములు సాధనములుగా గలవాడు.

981) యజ్ఞాంతకృత్ - యజ్ఞఫలము నిచ్చువాడు.

982) యజ్ఞగుహ్యమ్ - గోప్యమైన యజ్ఞము తానైనవాడు.

983) అన్నం - ఆహారము తానైనవాడు.

984) అన్నాద: - అన్నము భక్షించువాడు.

985) ఆత్మయోని: - తన ఆవిర్భావమునకు తానే కారణమైనవాడు.

986) స్వయంజాత: - మరొకరి ప్రమేయము లేకనే తనకు తానుగ ఆవిర్భవించువాడు.

987) వైఖాన: - ప్రాపంచిక దు:ఖమును నివారించువాడు.

988) సామగాయన: - సామగానము చేయువాడు.

989) దేవకీనందన: - దేవకీ పుత్రుడైన శ్రీ కృష్ణుడు.

990) స్రష్టా - సృష్టికర్త

991) క్షితీశ: - భూమికి నాధుడైనవాడు.

992) పాపనాశన: - పాపములను నశింపజేయువాడు.

993) శంఖభృత్ - పాంచజన్యమను శంఖమును ధరించినవాడు.

994) నందకీ - నందకమను ఖడ్గమును ధరించినవాడు.

995) చక్రీ - సుదర్శనమును చక్రమును ధరించినవాడు.

996) శారంగ ధన్వా - శారంగము అనెడి ధనుస్సు కలవాడు.

997) గదాధర: - కౌమోదకి యనెడి గదను ధరించినవాడు.

998) రథాంగపాణి: - చక్రము చేతియందు గలవాడు.

999) అక్షోభ్య: - కలవరము లేనివాడు.

1000) సర్వ ప్రహరణాయుధ: - సర్వవిధ ఆయుధములు కలవాడు.