విజయనగర సామ్రాజ్యం - పీస్, నూనిజ్ యాత్రాకథనాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మాయమైన మహా నగరం[మార్చు]

సుమారు ఐదువందల సంవత్సరాల క్రితం ఇంచుమించు దక్షిణ భారత దేశమంతా వ్యాపించి సర్వతోముఖాభివృద్ధి చెందింది విజయనగర సామ్రాజ్యం. కొన్ని శతాబ్దాల పాటు అఖండ వైభోగంతో విలసిల్లింది. ఈ సామ్రాజ్య ఘన చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. అనేక మంది విదేశాల రాయబారులు, యాత్రికులు శతాబ్దాల క్రితం విజయనగరానికి వచ్చి, ఇక్కడి విశేషాలను చూసి వారి అనుభవాలను గ్రంథస్థం చేసారు. వారు చెప్పిన ఈ విజయనగర విశేషాలు వారి మాటల్లోనే సంక్షిప్తంగా ..)

1. నికోలో కొంటి యను ఇటలీ దేశస్తుడు 1420 లో విజయనగరానికొచ్చి లాటిన్ భాషలో ఇలా రాసుకున్నాడు. "విజయ నగరము పర్వతముల సమీపమున కట్టబడినది. చుట్టుకొలత 20 మైళ్లు. కొండలమద్య పల్లపు ప్రదేశములలో జన నివాసము లుండెను. ఉద్యాన వనములు, ఫల వృక్షములు, పంట కాలవలు మిక్కిలిగా కలవు. అచ్చటచ్చట ప్రసిద్ద దేవాలయములు కలవు."

2.క్రీ.శ. 1443 ఏప్రిల్ మాసంలో అబ్దుల్ రజాక్ ఈ విజయ నగరానికొచ్చి తన గ్రంథంలో ఇలా రాసుకున్నాడు.

"విజయనగరము వంటి మహానగరమును మేమెన్నడు చూసి వుండలేదు. అటువంటి నగరము ప్రపంచమున యొకటి వున్నట్లు కూడా విని యుండ లేదు. ఇది ఏడు ప్రాకారముల మహా నగరము. మొదటి మూడు ప్రాకారములలో పంట పొలములు, గృహములు, ఉద్యాన వనములతో నిండి యుండెను. ఇందు బజారులు విశాలముగా వున్నవి. అందు ముత్యములు, కెంపులు, నీలములు, వజ్రములు మొదలగునవి బహిరంగముగా విక్రయించు చుండిరి."

వీరిద్దరు 15 వ శతాబ్దంలో విజయనగరాన్ని సందర్శించారు. వీరి తర్వాత 16 వ శతాబ్దంలో ఈ మహా నగరం అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు దాన్ని సందర్శించి తన భావాలకు అక్షర రూపమిచ్చిన వారిలో ఒకడు డొమింగో పీస్. ఇతడు 1520 లో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఇతని తర్వాత "నూనిజ్" ఆనే అతడు 1535 - 1537 ప్రాంతంలో అచ్యుత రాయల కాలంలో ఈ విజయనగరాన్ని సందర్శించాడు. వీరిద్దరు తాము చూసిన విజయనగర విశేషాలను గ్రందంస్థం చేసి తమ దేశం లోని రాజులకు పంపించారు.

ఫెర్నావో నూనిజ్ సామాన్య శకం 1535 - 37 లో విజయనగరాన్ని సందర్శించాడు. ఆ సమయంలో విజయనగరాన్ని అచ్యుత రాయలు పరిపాలిస్తున్నాడు. నూనిజ్ విజయ నగరాన్ని గురించి రాసిన దాంట్లో ఎక్కువగా చారిత్రక అంశాలున్నాయి. మనకు కావలసినది అలనాటి ప్రజల జీవన విధానము, పరిపాలన విధానము కనుక ఆ విషయాలను మాత్రమే తీసుకున్నాను. ఇతను డొమింగో పీస్ వ్రాసిన విషయాలను కూడా వ్రాసాడు. వాటిలో కొన్నింటిని వదిలి, కొన్నింటిని తీసుకున్నాను. విషయం మాత్రం యథాతథంగా రాసాను.

వనరులు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]