విజయనగర సామ్రాజ్యం - పీస్, నూనిజ్ యాత్రాకథనాలు/ఫెర్నావో నూనిజ్ కథనం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

విజయనగరంలో శ్రీ క్రిష్ణ దేవరాయలు వయస్సులో వున్నప్పుడు చిన్నా దేవి అనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. అప్పట్లో ఆమెతో సరదాకు "నేను రాజు నయ్యాక నిన్ను పేడ్లిచేసుకుని మాహా రాణిని చేస్తాను" అని అన్నాడు. నిజంగానే రాజు అయ్యాడు. కాని అతను తన మాటను మర్చిపోలేదు. ఆమెను పెళ్లాడి మహారాణిని చేసాడు. ఆమెపై తనకున్న ప్రేమకు గుర్తుగా "నాగలాపురము" అనే పట్టణాన్ని కట్టించాడు. అందులో పెద్ద పెద్ద వీదులతో అందమైన భవనాలను నిర్మించాడు. అంతేగాక ప్రముఖులను ఇక్కడ భవనాలను నిర్మించమని ఆదేశించాడు. (ఈ నగరమే నేటి హోస్పేట. ఈ విషయం డొమింగో ఫీస్ చెప్పిన దానికి సరిపోయింది)

ఆచ్యుత రాయలు కాలంలో రాజు ఉపయోగించే వస్తువులన్నీ బంగారు, వెండి తో చేసినవే. బేసిన్లు, గిన్నెలు, స్టూళ్లు, జగ్గులు వంటి పాత్రలన్ని బంగారు, వెండి తో చేసినవె. అతనికి భార్యలు పడుకునే పడకలు వెండి పలకలతొ కప్పబడి వున్నవి. అలాగే రాజు గారి మంచం కాళ్లు బంగారుపువి. మంచం మీద పట్టు బట్ట పైన నాలుగు తలగడలు, అదే విదంగా కాళ్లవద్ద నాలుగు దిండ్లు, అన్ని పట్టు బట్టతొ చేసినవి. ఇతనికి ఐదు వందలమంది భార్యలు. ఇతని మరణా నంతరము వీరందరూ అగ్ని ప్రవేశం చేయవలసిందే. ఇతను ఎప్పుడైనా ప్రయాణమైతే ఇతని వెంబడి సుమరు 25--30 మంది భార్యలు వెంబడిస్తారు. అందరికి తలా ఒక పల్లకి వుంది. మహా రాణి పల్లకి మాత్రం పట్టు బట్ట, దాని లో ముత్యాలు కుట్టబడి వున్నాయి. పల్లకి కర్ర బంగారం తో కప్ప బడి ఉంటుంది. రాజు గారు వుండే పల్లకి కుడివైపు వెళ్లుతుంది ఇది బంగారం తో అలంకరించబడి వున్నది.

రాజు గారి అంతఃపురంలో స్త్రీలు, సేవకులు, నపుంసకులు అందరూ కలిసి సుమారు ౫౦౦ మంది వుంటారు. ఇతని భార్యలకు కూడ ఇదే విదంగా సేవకులుంటారు కాని వారందరు ఆడ వారే. రాజు గారికి నమస్కరించే విదానము. రాజు గారు ప్రతి రోజు ఉదయం పది-. పదకొండు గంటలకు బయటకు వచ్చి తన ఆసనంలో కూర్చోగానే, రాజ ప్రముఖులు, ఇతర అదికారులు ఒక్కొక్కరుగా వచ్చి రాజు గారి ముందు తలవంచి చేతులు జోడించి నమస్కారం చేస్తారు. అప్పుడు వారు ఇలా చెప్తారు- "పలనా పేరుగల నేను- పలనా అధికారి యైన నేను ప్రభువులకు నమస్కారం చేస్తున్నాను". ప్రస్తుతం అచ్యుతరాయలు అనే రాజు రాజ్యం చేస్తున్నాడు. ఇతని గుర్రపు శాలలో ఏడు వందల గుర్రాలున్నాయి. అలాగే నాలుగు వందల ఏనుగులున్నాయి..

రాజుగారు బయట ప్రదేశానికి ప్రయాణమైతే తన వెంట కొంత మంది అంతరంగికులని తీసుకెళ్తాడు.. రాజు గారు ఎవ్వరితొ ఏమి మాట్లాడినా ఎవరికి ఏమి హామీ ఇచ్చినా, ఇంకా ఎటువంటి వాగ్దానాలు చేసినా వీరు అన్నింటినీ ఒక పుస్తకంలో రాస్తుంటారు. వీరి మాటలకు చాల గౌరవం ఉంటుంది. కనుక రాజు గారిచ్చిన ఆదేశాలకు ఎటువంటి లిఖిత పూర్వకమైనది వుండదు. వీరు రాసిన పుస్తకం లో చూసుకుని గుర్తుంచు కుంటారు. కాని కొన్ని సందర్బాల్లో లిఖిత పూర్వక మైనది ఇవ్వాల్సివస్తే దాని మీద రాజుగారి ఉంగరం ముద్ర లక్క మీద వేస్తాడు.దాంతో ఆ పత్రానికి హాక్కు లబిస్తుంది. విజయనగర రాజులు అన్ని రకాల మాంసం, చేపలు, పక్షులను తింటారు. కాని ఆవులను ఎద్దులను వీరు చంపరు, తినరు. వీటిని పూజిస్తారు. మాంసం కొరకు జంతువులను పక్షులను బ్రతి కుండగానె అమ్ముతారు. ఇక్కడ అనేక రకాల పండ్లు, కూడ చాల తక్కువ ధరకే దొరుకును. మార్కెట్టు లో ఒక "ఫర్దావ్" కు పన్నెండు గొర్రెలు కొనవచ్చు. అవే పల్లెలలో పదునాలుగు పదునైదు వస్తాయి. రాజు గారు తాను తాగే నీరు ఒక ప్రత్యేకమైన బావి నుండి తెప్పిస్తారు. ఆ నీటిని ఒక పాత్రలో పోసి మూత పెట్టి దానికి "సీలు" వేసి ఒక నమ్మకస్తు డైన వాని ఆదీనంలో వుంచుతారు.

ప్రముకులను గౌరవించే విదానమ[మార్చు]

రాజుగారు ఎవరిపై నన్న ప్రత్యేక గౌరవం చూపాలంటే అతనికి బంగారు పిడి కలిగి.. దానికి వజ్రాల వంటి విలువైన రాళ్లు పొదిగిన తెల్లటి వింజామరను బహూకరిస్తాడు. ఇది అత్త్యున్నత మైన గౌరవం. విజయనగర రాజులు దశరా వుత్సవాల సందర్బంగా దేవి పూజానంతరం పవిత్రమైన రత్న ఖచిత సింహాసనం మీద కూర్చుంటాడు ధర్మ పారాయణుడై ఎల్లప్పుడు సత్యమునే పలుకు రాజులు మాత్రమే ఈ సింహాసానాన్ని అదిష్టించడానికి అర్హులు. అంచేత ప్రస్తుతం రాజ్యం చేస్తున్న రాజు గారు అచ్చ్యుత రాయలవారు అంత ధర్మ బద్దుడు కాదు గనుక సింహాసనం మీద కూర్చొన లేదు. ( శ్రీక్రిష్ణ దేవరాయులు సింహాసనం మీద కూర్చున్నాడని డొమింగో ఫీస్ రాశాడు)-->

ఈ దేశ ప్రజలు ప్రతి శని వారము ఉపవాసముంటారు. పగలు గాని రాత్రి గాని ఏమి తినరు. నీళ్లు కూడ త్రాగరు. రెండు లవంగాలు మాత్రం నములుతారు. ఈ రాజ్యంలోని అధికారులు వారు నడుస్తున్నప్పుడు వారి హోదాను బట్టి నాలుగు నుండి పన్నెండు కాగడాలు వారి వెంట తీసుకెళ్లు తారు. రాజు గారి వెంబడి 100---150 కాగడాలు వెళ్తాయి. ఎవరికైనా ఏదేని కష్టం కలిగినా వారు దాన్ని రాజు గారికి విన్నవించు కో దలిస్తే వారు నేలపై బోర్లా పడుకొని ఏమికావాలో నని అడుగు నంతవరకు అలా వుండాలి. గుర్రం మీద వెళ్లుతున్నవారు తన రాజు గారికి తన కష్టాన్ని నివేదించా లనుకుంటే- పొడవాటి కర్రకు చెట్టు కొమ్మను కట్టుకొని అరుస్తూ వెళితే అతనికి రాజు గారి దర్శనం లభిస్తుంది. అప్పుడు రాజు గారు తన అధికారి నొకరిని అతని వెంబడి పంపి అతని కోరికను నెరవేర్చమని ఆదేశిస్తాడు. ఒక వేళ ఆ వచ్చిన వ్యక్తి తాను దొంగలచే దోచుకోబడ్డానని చెప్పితె ఆ దొంగతనం ఏ ప్రదేశంలో జరిందో తెలుసుకుని ఆ ప్రదేశపు అధికారి ద్వారా వెంటనే అదొంగను పట్టి దొంగలించ బడిన వాటిని సొంత దారునికి ఇప్పిస్తారు. ఒక వేళా దొంగ దొరకక పోతే ఆ అధికారి స్యంతంగా దొంగలించ బడిన వస్తువుల విలువను తిరిగి అతనికి ఇస్తాడు.

దొంగ తనాల నివారణ ఎలా జరిగేది.[మార్చు]

నగరంలో జరిగిన దొంగ తనాలగురించి.. కొన్ని వివరాలు, అనగా దొంగిలించ బడిన సరకు వివారాలు, దొంగ యొక్క ఆనవాలు చెప్ప గలిగితే వెంటనే మంత్ర గాళ్లను పిలిపించి దొంగ ఆచూకి కనుగొంటారు. ఇటు వంటి మంత్ర గాళ్లు ఈ దేశంలో చాల మంది వున్నారు. అందు చేత ఈ దేశంలో దొంగలు తక్కువ.

అంతఃపుర పరివారము[మార్చు]

రాజుగారి అంతః పురంలో సుమారు 400 మంది స్త్రీ జన సేవికలుంటారు. వీరిలొ సేవకులు సహాయకులు, ద్వార పాలకులు, వంటవారు, నాట్యగత్తెలు, శోది చెప్పెవారు ఇలాంటి వారుంటారు. అంతే గాక రాజుగారికి స్వంతంగా వంట చేయడానికి పది మంది వంటవారు వున్నారు. వంట గది ద్వారం వద్ద నపుంసకులు కాపలా వుంటారు. వీరు ఎవ్వరిని లోనికి అనుమతించరు. రాజుగారి భొజన సమయంలో కొంత మంది స్త్రీలు వచ్చి మూడు కాళ్ల గుండ్రని బల్ల మీద అన్ని సిద్దంచేస్తారు. అది బంగారం తో చేయ బడింది. వంట పాత్రలు కూడ బంగారంతొ చేయ బడినవి. ఈ రాజు ఒకసారి తొడిగిన బట్టలను టోపీలను మరొక్క సారి ధరించడు. ఇవి పట్టు బట్టతో చేసినవై అందులో బంగారు పనితనం కూడ వుంటుంది. విడిచిన బట్టలను ఇంకొకరికి ఇవ్వరు.

ఈ రాజ్యంలొ శిక్షలు ఎలా వూండేవి?-.[మార్చు]

ఈ రాజ్యంలొ శిక్షలు ఈ విదంగా వుంటాయి. దొంగకి కాలు చెయ్యి తీసెయ్యడం. దొంగతనం పెద్దదయితే ..లేక .. మానబంగం వంటి నేరాలకు మరణ శిక్ష. నమ్మక ద్రోహులకు బతికుండగానే కడుపులో ఒక కర్ర గుచ్చి నాలుగు వీదుల కూడలిలో నిలబెడతారు. ఇంకొన్ని శిక్షలు ఈ విదంగా వుంటాయి. ఎనుగులచే తొక్కించడము, వీపుమీద ఒక బండ రాయిని పెట్టి వీదులలొ నిలబెట్టడం వంటివి. నీచ కులస్తు లెవరైనా ఎటువంటి నేరాలు చేసినా నడివీదిలో వారి తల నరకడమే శిక్ష.

విజయనగర సామ్రాజ్యం లో సతీ సహగమనము జరుగు విదాన మెట్టిదనగా..[మార్చు]

ఈ రాజ్యంలోని ప్రజలందరూ విగ్రహా రాధకులే. స్త్రీలు చనిపోయిన తమ భర్తలతో బాటు చితిలో దూకి మరణించుటం వీరి అచారం దీన్ని వీరు గౌరవ ప్రదమైన చర్యగా భావిస్తారు. భర్త మరణించి నపుడు భార్య బందు వర్గంతో కలిసి రోదిస్తుంది. కానీ ఆ రోధన ఒక నిర్నీత స్థాయిని మించితే .. ఆ స్త్రీ తన భర్తతో బాటు సహాగమనానికి సిద్దంగా లేదని భావిస్తారు. ఆమె ఏడుపు మానగానే అమెను సహగమనానికి పురిగొల్పుతారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారానికి/ సంప్రదాయానికి బంగం కలిగించ వద్దని భోదిస్తారు. ఆ తర్వాత మరణించిన వ్యక్తిని చెట్టు కొమ్మలతో చేసిన వేదికపై (ఇది వెదురు కర్రల తో చేసిన పాడె అయివుండును)--> పూలతో అలంకరిస్తారు. అతని భార్యను ఒక గుర్రంపై కూర్చో బెట్ట శవం వెంబడి పంపుతారు. అప్పుడామె తనకున్న అన్ని ఆభరణాలు ధరించి వుంటుంది. అన్ని రకాల పూలను కూడ ధరించి వుంటుంది. చేతిలో అద్దంకూడ వుంటుంది. వెంబడి ఆనేక సంగీత వాయద్యాలు, బాజ బజంత్రీలు రాగా వెనుక బందుజన సముదాయం నడుస్తుంటుంది. వీ రందరూ చాల సంతోషంగా వుంటారు. ఒక వ్యక్తి ఒక వాయద్యాన్ని వాయుస్తూ ఆ స్త్రీ వైపు చూసి ఇలా పాట పాడుతాడు. "నీవు నీ భర్తను చేరడానికి వెళ్లుతున్నావు-." ఆ స్త్రీ దానికి సమాదానంగా "అవును నేను నా భర్త వద్దకు వెళుతున్నాను.." అని పాట ద్వారా తెలుపుతుంది.

శవాన్ని స్మశానానికి తీసుకెళ్లి అక్కడ అదివరకే సిద్దంచేసిన వేదిక (చితి)పై పెడ్తారు. మరణించిన వ్యక్తి యొక్క దగ్గరి బందువు ఒకరు తలమీద ఒక నీటితో నిండిన కుండను ఎత్తుకొని చేతిలో ఒక కాగడా ధరించి ఆ వేదిక (చితి) చుట్టు మూడు సార్లు తిరుగుతాడు. ప్రతి చుట్టుకు ఆ కుండకు ఒక రంద్రం చేస్తారు. చివరగా ఆ కుండను అక్కడ పడేసి .. అ కాగడాను శవాన్ని పడుకోబెట్టిన కట్టెల వేదికపైకి విసురుతాడు. అప్పుడు అక్కడ వున్నవారు శవానికి నిప్పు పెడతారు. శవం కాలాక అతని భార్య పూజారులతొ కలిసి అక్కడ కొస్తుంది. వారు ఆమె పాదాలను కడిగి వారి ఆచారాలకు సంబందించిన కార్య క్రమాలు చేస్తారు. ఆప్పుడు ఆమె తన చేతులతో తన మీదున్న ఆబరాణాలను తీసి తన బందువులైన స్త్రీలకు పంచి ఇస్తుంది. ఆమెకు కొడుకులున్నచో వారిని తనకు ముఖ్యమైన బందువులకు అప్పచెప్తుంది. ఆమె శరీరం పైనున్న వన్ని తీసేశాక ఆమెకు ఒక సాదారణ పశుపు బట్టను కట్టబెట్టతారు. ఆమె బందువులు ఆమె చేతిని పట్టుకోగా ఆమె మరో చేతిలొ ఒక కొమ్మను పట్టుకొని వుంటుంది. ఆమెను మూడు సార్లు ఆ చితి చుట్టూ తిప్పుతారు. అప్పుడు ఒక చాపను ఆమెకు ముందు అడ్డంగా పట్టుకుని మంటలు కనబడకుండా చేస్తారు. అప్పుడు ఒక బట్ట, బియ్యం, దువ్వెన, అద్దం, తమలపాకులు, వంటి వాటిని ఆ మంటలో పడేస్తారు. ఇవన్ని తన భర్త తరుపున వస్తువులని వారి నమ్మకం. చివరగా ఆమె అక్కడున్న వారందరి వద్ద శలవు తీసుకిని-నెత్తిన నూనె తో నిండిన కుండతో తనంత తాను ధైర్యంగా మండుచున్న అగ్ని కీలలోనికి ప్రవేసిస్తుంది. వెనువెంటనే, అప్పటికే చేతులలో కర్రలతో సిద్దంగా వున్న ఆమె బందువులు అందరూ ఆ కర్రలతో ఆమెను కప్పేస్తారు. ఆ తర్వాత బిగ్గరగా తమ విచారాన్ని వ్యక్త పరుస్తారు. ఈ విదానము చాల ధైర్యంతో కూడుకున్నదే గాక నాకుచాల ఆచ్యర్యాన్ని కలిగించింది. ఈ పద్దతి ఇక్కడి అధికారులకే గాక రాజు కు కూడ వర్తిస్తుంది. ఒక వేళ ఎవరికైనా చాలా మంది భార్యలు వుంటే అతని మరణాంతరం వారందరిలా అగ్ని ప్రవేశం చేయవలసిందే. తెలుగు వారికి మాత్రం ఈ ఆచారం లో కొంత మార్పు వుంది. వారు శవాన్ని భూమిలో పూడ్చి పెడాతారు గనుక-భర్త శవాన్ని పూడ్చి పెట్టే గోతిలోనే భార్య కొరకు ఇంకో స్తానం సిద్ద చేస్తారు. భర్త శవానికి ప్రక్కన భార్య ను పడుకోబెట్టి ఇద్దరిని పూడ్చి పెడ్తారుఅప్పుడు భార్య కూడా మర్తణిస్తుంది.

బ్రాంహణులు వారి మరణా నంతరం చేసె కార్యక్రామాలు[మార్చు]

ఒక బ్రాంహాణుడు రోగ పీడితుడై చావుకు దగ్గరా నున్నప్పుడు అతని గురించి కొన్ని పూజా కార్యాక్రమాలు చేసి దేవున్ని ప్రార్దిస్తారు. అతనికి దాన ధర్మాలు చేయమని భోదిస్తారు. ఈ పూజానంతరం అతనికి శిరోముండనం చేసి వారి పద్దతి ప్రకారం స్నానం చేయిస్తారు. అప్పుడు ఒక ఆవు-- దూడను తీసుకొస్తారు. అక్కడ కొద్ది మంది బ్రాంహణులు మాత్రమే వుంటారు. వారు చాల బీద వారు ---పూట గడవని అతి బీద వారు. ఆవు మెడకు ఒక తలాపాగాను కట్టి ఇంకో కొసను ఆ బ్రాంహణుని చేతికిచ్చి దానిని అనగా ఆవు దూడను ఆ పూజా కార్య క్రమాలాను నిర్వ హించిన అ పూజారులకు దానమిప్పిస్తారు. ఆ సందర్బంగా ఆ బ్రంహణుడు తన శక్తి కొలది ఇతర బ్రాంహణులకు దాన ధర్మాలు చేస్తాడు. ఆ తర్వాత ఇందు కొరకు పిలిపించిన ఇతర బ్రంహణులకు అన్నదానం చేస్తాడు. ఈ కార్యక్రమం వలన ఆ రోగపీడితునికి ఆయుష్షు ఉంటే రోగం నయమయి సుఖంగా జీవిస్తాడు, లేనిచో త్వరలోనె మరణిస్తాడు, అని వారి నమ్మకం. ఒక వేళ ఆ బ్రాంహణుడు మరణిస్తే ఆతను మరణించిన ప్రదేశమంతా ఆవు పేడతో అలికి దాని మీద ఆతని శవాన్ని పడుకో బెడతారు. మరణించిన వారు భూమి మీద గాక మంచం మీదనో మారేదాని మీదనో తుదిశ్వాస విఢిస్తే ఆతను చాల పాప కర్మలు చేసుంటాడని భావిస్తారు. ఆ మరణించిన వ్యక్తి శవాన్ని అత్తి చెట్టు కర్రలతో చేసిన వేదికపై పడుకోబెట్టి స్నానం చేయిస్తారు. తర్వాత కొన్ని సుగంద ద్రవ్యాలను చల్లి ఒక కొత్త బట్టను కప్పి పాడి మీద పెడ్తారు. మరణించిన వ్యక్తి దగ్గరి బందువు మొదటగా ఆ పాడిని ఒక ప్రక్కనుండి పైకెత్త తాడు., అప్పుడు మరో ముగ్గురు అతనికి సహాయంగా వచ్చి పాడిని ఎత్తి మోసుకుంటూ శ్మశానానికి వెళతారు. శవం ముందు బ్రాంహణులందరూ పాటలు పాడుతు ముందుకు సాగుతారు. ఆందరి కంటే ముందు మరణించిన బ్రాంహణుడి కొడుకు గాని కొడుకు లేకుంటే తమ్ముడుగాని లేదా దగ్గరి బందువు --- చేతిలో నిప్పులను తీసుకుని నడుస్తాదు. శ్మశానాని కొచ్చిన వెంటనే-- అతని శక్తానుసారం డబ్బును వెద అల్లుతారు. శవం పూర్తిగా కాలి నంతవరకు వుండి తర్వాత అందరూ దగ్గరలోని చెరువు కెళ్ళి స్తానం చేస్తారు. తల కొరివి పెట్టిన వ్యక్తి తొమ్మిది రాత్రులపాటు ఏ ప్రదేశంలో ఆ వ్తక్తి మరణించాడో ఆ స్తానంలో నిద్రించాలి. మరణాంతరము తొమ్మిది రాత్రులు గడిచిన తర్వాతా కొందరు పూజారులు వచ్చి- తలకొరివి పెట్టిన వ్యక్తికి శిరో ముండనం చేయిస్తారు. ఈ తొమ్మిది రోజులు బీదసాదలకు అన్న దానం చేసి మరణించిన వ్యక్తికి సంబందించిన బట్టలు, మంచం, ఇతర వస్తువులను కొంత ధనంతో కలిపి బీదలకు దానం చేస్తారు. మరణించిన వ్యక్తి ధనవంతు డైనచో అతని స్తాయిని బట్టి పంట పొలాలు, తోటలు కూడా దానం చేస్తారు. పదో రోజున మరణించిన వ్యక్తిని కాల్చిన చితిప్రదేశానికి వెళ్లి తలకొరివి పెట్టిన వ్యక్తితో అక్కడున్న చితా బస్మం పై కొన్ని పూజా కార్యక్రమాలు చేయిస్తారు. తర్వాత ఆ చితా బస్మాన్ని ఒక పాత్రలో సేకరించి అక్కడే ఒక గొయ్యి త్రవ్వి అక్కడె పూడ్చి పెడ్తారు. తర్వాత ఆ చితా బస్మాన్ని-ఇక్కడికి చాలా దూరంలోవున్న పవిత్ర నదిలో నిమజ్జనం చేయడానికి దాన్ని జాగ్రత్తగా కాపాడుతారు. చాల దూరంలోవున్న ఆ పవిత్రనదీ ప్రాంతంలో అతి పెద్ద ఆలయం వుంది. ఇక్కడికొచ్చే భక్తులు-ఇక్కడే మరణిస్తే వారు నేరుగా స్వర్గానికి వెళతారని వీరి నమ్మకం. అలాగె మరణించిన వ్యక్తి చితా భస్మాన్ని ఈ పవిత్ర నదిలో కలిపితే అమరణించిన వ్యక్తికూడ పుణ్య లోకాలకు వెళతాడని కూడ వీరి నమ్మకం. అయినా ఇక్కడికెళ్లే వారి సంఖ్య చాల తక్కువ. ఎందు కంటే ఆ ప్రదేశం ఇక్కడికి చాలా దూరంలో వుంది. (ఇది కాసి/ గంగా నది)--> మరణించిన వ్యక్తికి సంబందించిన వారసులు పదకొండు రోజులపాటు ఇరవై ఏడు మంది బ్రాంహణులకు, ఇరవై ఒక్క రోజులపాటు ముగ్గురు ఇతరులకు, పన్నెండు రోజుల పాటు ఏడుగురి బ్రాంహణులకు, ఇక ఇరవై ఏడు రోజులపాటు ముగ్గురి బ్రాంహణులకు నెలలో చివరి మూడు రోజులు ముగ్గురు ఇతరులకు అన్న దానం చేయడం వీరి అచారం. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు నెలకొకసారి ముగ్గురి బ్రాంహణులకు అన్నదానం చేస్తారు. ఆ తర్వాత నెలకొక సారి తప్ప అన్నదానాలుండవు, కానీ ప్రతి సంవత్స రానికి ఒకసారి మాత్రం అన్నదానం వుంటుంది. మరణించిన సంవత్సరాని కొక సారి ప్రతి యేడు ఆరుగురికి ఆన్నదానం చేయడం వీరి పద్దతి. అందులో ముగ్గురు దేవతలు, మిగతా ముగ్గురిలో ఒకరు తనతండ్రి, ఒకరు తన తాత మరియు ఇంకొకరు తన ముత్తాత గా వీరు బావిస్తారు. ఒక వేళ ఈ అన్న దానాలు కార్య క్రమం చేయ డానికి శక్తి లేకుంటే ఇతర బ్రంహణులను బిక్షం కోరుతారు. ఈ ఆరుగురికి భోజనానికి ముందు వీరి కాళ్లు కడిగి పూజారులు చెప్పిన ఇతర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.