విఙ్ఞాన దీపమును వెలిగింపరారయ్య

వికీసోర్స్ నుండి

చిత్రం: చంద్రహారం (1954)

రచన: పింగళి నాగేంద్రరావు

సంగీతం: ఘంటసాల

గానం: ఘంటసాల, ఎ.పి.కోమల, కోమల-కోమల-బృందం

పాట: (టైటిల్ సాంగ్)


ఘంటసాల: ఓమ్!,

కోమల-బృందం: ఓమ్!, ఓమ్!

ఘంటసాల: విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య

కోమల-బృందం: విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య

ఘంటసాల: అజ్ఞాన తిమిరమును హరియింపరయ్యా

కోమల-బృందం: అజ్ఞాన తిమిరమును హరియింపరయ్యా

అందరు: విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య


ఘంటసాల: పరహితమె, పరసుఖమె, పరమార్థ చింతనమే...

కోమల-బృందం: పరహితమె, పరసుఖమె, పరమార్థ చింతనమె

అందరు: మానవుల ధర్మమని భావించరయ్యా

అందరు: విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య

ఘంటసాల: వినయమున, సహనమున విజయములు సాధించీ..

అందరు: వినయమున, సహనమున విజయములు సాధించి

దీనబలహీనులను కరుణతో పాలించి

ఘంటసాల: జీవులకు, దేవులకు భేదమే లేదనీ..

కోమల-బృందం: జీవులకు, దేవులకు భేదమే లేదనీ

భువిని ఈ సత్యమును చాటించరయ్యా

అందరు: విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య

అజ్ఞాన తిమిరమును హరియింపరయ్యా

విజ్ఞాన దీ..పం