Jump to content

వికీసోర్స్ చర్చ:విలువైన పుస్తకాల జాబితా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

రాజశేఖర్ గారి ప్రతిపాదనలు

[మార్చు]

వికీసోర్సులో ఇప్పటికే ఉన్నవి

[మార్చు]

కాపీహక్కులు సందేహం

[మార్చు]
  • రంగస్థల శాస్త్రము-రెండు భాగాలు: తెలుగు అకాడమీ-తెలుగు వికీపీడియాలో వ్యాసాలకు పనికివస్తుంది.
  • నా జీవితయాత్ర-టంగుటూరి ప్రకాశం: ఆంధ్రావతరణ గురించీ, తెలుగునాట స్వాతంత్రోద్యమ చరిత్ర గురించీ చాలా వివరాలు దొరుకుతున్నాయి. నాలుగోవంతు పూర్తయింది. కనుక కాపీహక్కుల చిక్కులు తీర్చగలిగితే బావుంటుంది.

కాపీహక్కులు లేనివి

[మార్చు]
  • ఆంధ్రదేశము విదేశయాత్రికులు: భావరాజు వేంకట కృష్ణారావు -
  • శ్రీ ఆంధ్ర కవి తరంగిణి-ఆరు సంపుటాలు: చాగంటి శేషయ్య - వికీపీడియాలో సాహిత్య సంబంధ వ్యాసాలు తయారుచేసేందుకు పనికివస్తుంది.
  • అబలా సచ్చరిత్రమాల: బండారు అచ్చమాంబ - వికీపీడియాలోని వ్యాసాలకు ఉపయుక్తం.
  • ఆంధ్రవీరులు(రెండవ సంపుటం): శేషాద్రి రమణ కవులు - వికీలో వ్యాసాల అభివృద్ధికి రెండవ సంపుటం ఉపయుక్తం.
  • ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం(రెండు నుంచి ఆరు సంపుటాలు):కొమఱ్ఱాజు వెంకట లక్ష్మణరావు - వికీపీడియాకు ఉపయోగకరం.
  • ఆంధ్రుల సాంఘిక చరిత్ర:సురవరం ప్రతాపరెడ్డి - అపురూపమైన ఈ గ్రంథం వికీపీడియాకి, పలువురు పోటీపరీక్షల విద్యార్థులకు ఎంతగానో ఉపయుక్తం.

వికీసోర్సులో లేనివి

[మార్చు]
  • సూర్యరాయాంధ్ర నిఘంటువు
  • ఆంధ్ర వ్యుత్పత్తి కోశము - కాపీహక్కుల పరిధిలో ఉన్న పుస్తకం, దీనిని కాపీహక్కులు గుర్తించి వారితో సంప్రదించిపెట్టాలి.

భాస్కర నాయుడు గారి ప్రతిపాదనలు

[మార్చు]
  • పదబంధ పారిజాతము-నార్ల వెంకటేశ్వర్లు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ-విక్ష్నరీకి చాలా ఉపయోగకరమైనది. దీని కాపీహక్కుల వివరాలు కూడా చూడాలి.

పవన్ సంతోష్ ప్రతిపాదనలు

[మార్చు]
  • అర్థశాస్త్రము: కట్టమంచి రామలింగారెడ్డి - కౌటిల్యుడి అర్ధశాస్త్రం ఆధారంగా చరిత్ర, సామాజిక అంశాలను అన్వయిస్తూ వ్రాసిన గ్రంధం. సామాజిక చారిత్రికాంశాల విషయంలో చాలా విలువైన గ్రంథం.
  • కట్టమంచి రామలింగారెడ్డి పీఠికలు - తెలుగులో ఆధునిక విమర్శ తీసుకువచ్చిన విలువైన విమర్శకులాయన. ఇప్పటికే ఉన్న పుస్తకాల వ్యాసాలకు ఆయన వ్యాఖ్యలు, రిఫరెన్సు చాలా మంచి చేర్పు అవుతుంది.
  • ప్రాచీన విద్యాపీఠములు :చిలుకూరి నారాయణరావు - ఆయన వ్రాసిన ఈ పుస్తకం నుంచి ప్రాచీన భారతీయ విద్య గురించి, విద్యాలయాల గురించి మంచి సమాచారం స్వీకరించవచ్చు. తద్వారా వ్యాసాల అభివృద్ధీను.
  • వైదిక వాఙ్మయ చరిత్ర:చిలుకూరి నారాయణరావు -