వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/సంపూర్ణ నీతిచంద్రిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సంపూర్ణ నీతిచంద్రిక(1955)- బులుసు సీతారామశాస్త్రి

Download this featured text as an EPUB file. Download this featured text as a RTF file. Download this featured text as a PDF. Download this featured text as a Mobi. పుస్తకం దింపుకోండి!

పుస్తక ముఖచిత్రం


మూర్ఖులైన రాజపుత్రులకు సులభ రీతిలో రాజనీతి భోధించడానికి విష్ణు శర్మ అనే పండితుడు రూపొందించిన కథా సౌరభం. ఈ కథలు చాలా ఆసక్తి కరమై ఉండి చదువరులను చదివింప చేస్తాయి. మూల సంస్కృతంనుండి తొలిసారిగా పరవస్తు చిన్నయసూరి తెలుగు అనువాదం చేశాడు. ఆ తరువాత వచ్చిన అనువాదాలలో బులుసు సీతారామశాస్త్రి చేసిన అనువాదం లో మిత్రలాభం మిత్రబేధం భాగాలు ఈ పుస్తకంలో వున్నాయి. మచ్చుకి కొంత భాగము

చిత్రగ్రీవు డను కపోతరాజు వృత్తాంతము

పూర్వము గోదావరీతీరమున నొక గొప్ప బూరుగు చెట్టు గలదు. అన్ని దెసలనుండియు వచ్చి పక్షులు రాత్రి యా చెట్టుపై నివసించుచుండెడివి. ఒకనాటి వేకువవేళ లఘుపతనక మను కాకము మేలుకాంచి యమునివలె భయం కరుడై యున్న కిరాతు నొకని జూచి "లేవగానే యనిష్ట దర్శన మైనది. నే డేమి కీడు మూడునో కదా!" యని కలత నొందెను. అంతలో బోయవా డావృక్షముచెంత నూకలు చల్లి, వలపన్ని దాగి యుండెను. అనంతర మాకాశమున బరివారముతో సంచరించు చున్న చిత్రగ్రీవు డనెడి పావురములరాజు నేలమీద నున్న నూకలు జూచి భ్రమపడుచున్న తన తోడి పావురములతో నిట్లనెను. "నిర్జనమగు నీవనమున నూక లెట్లు వచ్చినవి? మన మీ నూకల కానపడినచో బూర్వము కంకణమునకై యాసించి పులిచేత జిక్కి మరణించిన బాటసారివలె నపాయము నొందవచ్చును. మీ కాకథ చెప్పెదను వినుడు.