వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/శివతాండవము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

Download this featured text as an EPUB file. Download this featured text as a RTF file. Download this featured text as a PDF. Download this featured text as a Mobi. పుస్తకం దింపుకోండి!

శివతాండవము(1985)-పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన శివతాండవం వారి నూటికి పైగా పుస్తకాలలో ఎక్కువ ఖ్యాతి తెచ్చింది . దీనిని కవి అనేక సంవత్సరాలుగా, అనేక సభల్లో విన్పించడం జరిగింది. విన్పించిన చోటంతా దాన్ని గూర్చిన పొగడ్తలే పొందారు. ఇతర భాషలవారు, తెనుగురానివారు కూడా దీన్ని విని ఎంతో మెచ్చుకొనేవారు. తిరువాన్కూరులో వున్నప్పుడు ఢిల్లీలో వున్నప్పుడు కూడా దీన్నిగూర్చిన పొగడ్తలే. ఆ కావ్యంలో అనుభూతంగా వచ్చే 'లయ' వాళ్ళ నంతగా ఆకర్షించి వుంటుంది. దీనిని వ్రాసేటప్పుడు ప్రొద్దుటూరులో అగస్త్యేశ్వర స్వామికి వారు చాలా నియమంగా ప్రదక్షిణాలు చేసేవారు. రోజూ 108 ప్రదక్షిణాలు. కోవెల చాలా పెద్దది. ఈ కావ్యంలో సంగీత, నాట్య సాహిత్య సంకేతాలు పెనవేసుకొనివున్నాయి. ఆ మూడింటి యొక్క సాంప్రదాయాలు కొంతకుకొంత తెలిస్తేగానీ, ఈ కావ్యం అర్థంగాదు. ఈ గ్రంథం ఇతర భాషల్లోకూడా అనువదించబడినది.

పూర్తి గ్రంథం చదవండి.