వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/నా కలం - నా గళం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నా కలం - నా గళం -తుర్లపాటి కుటుంబరావు

Download this featured text as an EPUB file. Download this featured text as a RTF file. Download this featured text as a PDF. Download this featured text as a Mobi. పుస్తకం దింపుకోండి!

నా కలం - నా గళం -తుర్లపాటి కుటుంబరావు

"నన్ను ఆత్మ కథ రాయాలని పదే పదే పెద్దలు - డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి గారి దగ్గర నుంచి నా సన్మాన సభలలో పాల్గొన్న ప్రముఖు లెందరో ఎప్పటి కప్పుడు నాపై ఒత్తిడి తెస్తూనేవున్నారు. అయితే, 'ఆత్మ కథ రాయడానికి అంత కథ నావద్ద లేదే!' అని ఆ పెద్దలతో వినమ్రతతో చెబుతూ వచ్చాను!

కాని, ఇటీవల జర్నలిస్టు మిత్రులనేకమంది, కొందరు రాజకీయ ప్రముఖులు "ఎందరో రాజకీయ, సినీ, సాహితీ ప్రముఖులతో మీరు కలిసిమెలిసి తిరిగారు. ప్రధానులు, ముఖ్యమంత్రులందరితో మీకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ సందర్భంగా మీకు ఎన్నో అనుభవాలు, ఆసక్తికర సంఘటనలు ఎదురై వుంటాయి. మీకు మాత్రమే తెలిసి, ఇతరులకు తెలియని ఎన్నో వింతలు, విశేషాల భాండాగారం మీ వద్ద వున్నది. అవి ఎవ్వరికీ తెలియకూడదనా మీ వుద్దేశం? అవి మీకు మాత్రమే పరిమితం కావాలనా మీ అభిప్రాయం? మీ "తదనంతరం" వాటిని ఎవరు చెప్పగలరు?" అంటూ వచ్చారు. అటువంటి అభ్యర్ధనలకు పుస్తకంరూపం ఇచ్చిన తుర్లపాటి కుటుంబరావు గారి ఆత్మకథే నా కలం - నా గళం .