Jump to content

వికీసోర్స్:కార్యక్రమం/విశాఖపట్టణం/సారస్వత జ్యోత్స్న 2018

వికీసోర్స్ నుండి

సారస్వత జ్యోత్స్న 2018 అన్నది పద్య సౌందర్యం అన్న వాట్సాప్ సముదాయ వార్షికోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పలువురు భాషాభిమానులు, భాష కోసం పనిచేయగలిగినవారిని పరిచయం చేసుకుని, వారికి వికీసోర్సును పరిచయం చేయవచ్చన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నాలు ఈ పేజీలో చదవవచ్చు. ఆ పరిధికి మించి సారస్వత జ్యోత్స్న 2018 కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నివేదిక కాదని పాఠకులు గుర్తించగలరు.

కార్యక్రమ వివరాలు

[మార్చు]
తేదీలు
2018 జూలై 28, 29.
ప్రదేశం
విశాఖపట్టణం
నిర్వహణ
హంస ఫౌండేషన్

పాల్గొన్నవారు

[మార్చు]

కార్యక్రమంలో పాల్గొన్నది పలువురు అయినా ఆ కార్యక్రమానికి అనుబంధంగా సాగిన తెలుగు వికీసోర్సు వ్యక్తిగత శిక్షణల్లో పాల్గొన్నవారి వివరాలే ఇక్కడ ఇస్తున్నాం. గమనించగలరు.

సభ్యులు
నేర్పినవారు

నివేదిక

[మార్చు]

మొదటి రోజున రామేశం, పవన్ సంతోష్ సభ్యులతో సంభాషించి వారిలో తెలుగు వికీసోర్సు మీద పనిచేయగలవారు ఎవరెవరు అన్నది తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెండవ రోజున పవన్ సంతోష్, రామేశం సభ్యుల్లో ఆసక్తి కల కొద్దిమందికి వికీసోర్సులో పద్యసాహిత్యాన్ని భద్రపరచడంలో ఉన్న ప్రయోజనాన్ని, ఆవశ్యకతను వివరించారు.

  • అవధానం చంద్రశేఖరశర్మ కుమారులు అవధానం అవధానం విశ్వనాథ శర్మతో తండ్రి రచించిన శ్రీ దేవీసువర్ణమాల పుస్తకాన్ని సీసీ-బై-ఎస్‌ఎ లైసెన్సులో పునర్విడుదల చేయించి, వారే టైపు చేసేలా శిక్షణనిచ్చారు, అయితే వారిది మొబైల్ మాధ్యమం కావడం వల్ల వికీసోర్సులో టైపు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొని వాటిని కొంతమేరకు పరిష్కరించుకోవడం జరిగింది.
  • వై.వి.ఎస్.ఎన్.మూర్తి గారికీ తెలుగు వికీసోర్సులో మౌలిక శిక్షణను ఇచ్చి, తర్వాత వారు టైపు చేయడంలో, మార్కప్‌కోడ్ నేర్వడం వంటివి ఫాలో-అప్ చేస్తున్నాను. ఈ ప్రయత్నాలలో పద్యసౌందర్య సభ్యులు, తెలుగు వికీసోర్సు వాడుకరి గుంటుపల్లి రామేశం చక్కని సహకారం అందించారు.

ఇతర సభ్యులు మరికొందరు కూడా వికీసోర్సు వేదిక ద్వారా కృషిచేయడానికి ఆసక్తి చూపిస్తూండడంతో ఒక కార్యశాలను ప్రత్యేకించి వీరికోసమే చేయవచ్చన్న నిర్ణయానికి రామేశం, పవన్ సంతోష్ వచ్చారు.