వికీపీడియాతో విజయవంతంగా పనిచేయడం ఎలా
వికీపీడియాతో
విజయవంతంగా
పనిచేయడం ఎలా
గ్యాలరీలు, గ్రంథాలయాలు, భాండాగారాలు, సంగ్రహాలయాలు,
విద్యాసంస్థలకు మార్గదర్శిని
ప్రతి మనిషి ఒక సంపూర్ణ విజ్ఞానభాండారాన్ని
అందరితో పంచుకోగలిగే ప్రపంచాన్ని
ఊహించండి.
ఆ ఆశయానికి మేం నిబద్ధులం.
- వికీపీడియా స్వేచ్ఛగా అంతర్జాలంలో అందుబాటులో ఉన్న విజ్ఞాన సర్వస్వము. వికీమీడియా ఉద్యమం యొక్క సుపరిచితమైన ప్రాజెక్టు వికీపీడియా. ఆ ఉద్యమంలో మూల పత్రాలు, పుస్తకాలు ఉండే వికీసోర్సు, సార్వజనీనంగా అందుబాటులో ఉండే డేటాసెట్లు కలిగి ఉన్న వికీడేటా, మీడియా భాండాగారమైన వికీమీడియా కామన్స్ వంటి స్వేచ్ఛా విజ్ఞాన ప్రాజెక్టుల కుటుంబం కూడా ఉన్నాయి.
- సంపూర్ణ మానవ విజ్ఞానం స్వేచ్ఛగా మానవులందరికీ లభించేలా చేయడం వికీమీడియా ఉద్యమ లక్ష్యం.
- మిగిలిన అన్ని వికీమీడియా ప్రాజెక్టుల్లాగానే వికీపీడియా కూడా స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమంలో భాగం. కనుక ఓపెన్ లైసెన్సు చేయబడిన సమాచారమే కలిగి ఉంటుంది, తద్వారా దాన్ని ఇతరులు స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు.
- వికీమీడియా వెబ్‌సైట్లను ప్రతి నెలా 50 కోట్లమంది వీక్షిస్తూంటారు, ఇంకెంతో మంది దానిలో సమాచారం మిర్రర్ సైట్ల ద్వారా, ఆఫ్‌లైన్ కాపీల ద్వారా పొందుతూంటారు. చేరుకునేందుకు కష్టమైన సమూహాలు ఈ సమాచారాన్ని చేరుకునే మార్గాలు అన్వేషించే ఎన్నో పథకాలకు వికీమీడియా ఫౌండేషన్ మద్దతునిస్తుంది.
- ఉదాహరణకు వికీపీడియా జీరో పథకం ద్వారా మొబైల్ సంస్థల నిర్వాహకులు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దింపుకునే భత్యం
(డౌన్‌లోడ్ అలోవెన్స్) ద్వారా కాకుండా వికీపీడియా ఉపయోగించడాన్ని ఉచితం చేశారు. అలానే జాలేతర ప్రయత్నాల ద్వారా వికీపీడియా కాపీలను లాప్ టాప్ లకు ఎక్కించేవీ ఉన్నాయి.
- సీఐఎస్ ఏ2కే అనేది భారతీయ భాషల్లో, దక్షిణాసియాలో స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమం అభివృద్ధి చెందడానికి ఉత్ప్రేరణ చెందేలా కృషి చేస్తుంటుంది.
వికీపీడియాతో సాంస్కృతిక సంస్థలు విజయవంతంగా పనిచేయడంలో మేము తోడ్పడతాము, మాతో పనిచేయడం ద్వారా మీరు మొత్తం వికీపీడియా సముదాయంతో కలవవచ్చు మరియు లెక్కించదగ్గ, నివేదించదగ్గ పద్ధతిలో ప్రభావాన్ని మీరు చూపించగలరు.
- వికీమీడియా వెబ్‌సైట్లు నెలకు 50 కోట్ల వీక్షకుల సంఖ్య కలిగి ఉన్నాయి
- నెలకు 2100 కోట్ల వరకూ పేజీ వీక్షణలు
- ప్రతి నెల 90 లక్షల వరకూ దిద్దుబాట్లు
- వికీమీడియా కామన్సులో 2 కోట్ల 10 లక్షల దస్త్రాలు
- ఒక్క ఆంగ్ల వికీపీడియాలోనే 45 లక్షలకు మించిన వ్యాసాలు
- 285 భాషలలో 2 కోట్ల 50 లక్షలకు మించిన వ్యాసాలు == కాలికట్ మెడికల్ కళాశాల, పాథాలజీ విభాగం-వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ ==
ప్రదేశం: కాలికట్, కేరళ
సంస్థ తరహా: విద్యాసంస్థ
వివరణ
[మార్చు]భారతదేశంలో మొట్టమొదటగా కాలికట్ మెడికల్ కళాశాల, పాథాలజీ విభాగంలో వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ స్థానం ఏర్పరిచారు. వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ గా పనిచేస్తున్న డాక్టర్ నేతా హుస్సేన్ కళాశాల వనరులు వికీమీడియాలో అందుబాటులోకి వచ్చేలా కృషిచేస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా పాథాలజీ విభాగానికి చెందిన స్పెసిమన్ల ఛాయాచిత్రాలు డిపార్ట్ మెంట్ ద్వారానే వికీమీడియా కామన్స్ లోకి స్వేచ్ఛానకలు హక్కుల్లో చేరుస్తారు. రోగి వివరాలు, పోలికలు గుర్తించేలాంటివి, అప్పటికే ప్రచురించినవి తప్ప మిగిలినవే ఎంచుకుంటారు. నిపుణులు ఆ ఫోటోకు తగిన వివరణను చేర్చి, వర్గీకరిస్తారు. ఆయా చిత్రాలను వికీమీడియా ప్రాజెక్టుల్లో ఉపయోగిస్తారు. పాథాలజీకి సంబంధించిన వ్యాసాలను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తారు.
వికీపీడియాలో పాథాలజీ అంశాల చర్చ పేజీల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అరుదైన పాథాలజీ కేసుల గురించి విస్తృతమైన చర్చకు ప్రయత్నిస్తున్నారు. కళాశాలలో స్వేచ్ఛా నకలు హక్కులు, స్వేచ్ఛా విజ్ఞానం వంటివాటికి సంబంధించిన విషయాలలో చైతన్యం పెరిగేందుకు వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ రాయబారిగా కృషిచేస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల కళాశాల వనరులు విస్తృతం అయిన ప్రయోజనాలు సాధిస్తున్నాయి.
ఫలితాలు, ప్రయోజనాలు
[మార్చు]- పాథాలజీ అంశానికి సంబంధించిన విలువైన పలు చిత్రాలు స్వేచ్ఛానకలు హక్కుల్లో వికీమీడియా కామన్స్ లో చేరుతున్నాయి.
- పలు భాషల వికీపీడియాల్లో సంబంధిత వ్యాసాల్లో చిత్రాలు చేరడమే కాక సమాచారం కూడా అభివృద్ధి చేశారు.
- పాథాలజీ విభాగం నిర్వహిస్తున్న లక్షలాది సంఖ్యలోని స్పెసిమన్ల సేకరణ సూత్రప్రాయంగా వికీమీడియా ప్రాజెక్టులకు అందుబాటులోకి వచ్చింది.
- కళాశాల సిబ్బందితో వికీమీడియా సముదాయానికి అనుబంధం బలపడి, వారి ప్రత్యేక నైపుణ్యం వికీపీడియాకు ఉపకరిస్తోంది.
- ప్రసార మాధ్యమాల్లో కార్యక్రమం గురించి విస్తృత ప్రచారం లభించింది. == పనిచేసే మార్గాలు ==
వికీపీడియాతో పనిచేయడం
అనువుగా ఉంటుంది
వికీపీడియాతో కలిసి పనిచేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మేం ఇప్పటికే చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకూ మొత్తం అన్ని స్థాయిల సాంస్కృతిక సంస్థలతోనూ భాగస్వామ్యాలు ఏర్పరుచుకున్నాం. మీకు పనిచేసే సరైన భాగస్వామ్యం వెతికిపట్టుకోవడమే ముఖ్యం.వికీపీడియాతో పనిచేసేందుకు అత్యుత్తమమైన మార్గాన్ని మీరు వెతకడంలో సహాయం చేయడమే 'సీఐఎస్ ఎ2కెలో మా పని. మా వద్ద ఉన్న వివిధ ఎంపికలు గురించి మీతో మాట్లాడగలం, విజయవంతమైన భాగస్వామ్యం దేని వల్ల ఏర్పడుతుందన్న విషయంపై మా అనుభవాలు పంచకుంటాం. ఆ విధంగా మీ సంస్థకీ, మీకున్న వనరులకు సరిపోయే పద్ధతిని ఏర్పాటుచేయవచ్చు.
మీరు చేరుకోవాల్సిన నిర్దిష్టమైన లక్ష్యాలు మీకుంటాయని మాకు తెలుసు. అవి అవుట్ రీచ్, బహుళభాషల సమాచారమో, మీ సేకరణను విస్తృతమైన ప్రేక్షకులకు చేర్చడమో, లేదా మీరు డిజిటైజ్ చేసిన చిత్రాలను భద్రపరచడమో ఏదైనా అయివుండొచ్చు.మేము ఎప్పుడూ వికీపీడియా వ్యాసాల విస్తృతిని పెంచి సుసంపన్నం చేయడానికి, వికీమీడియా కామన్స్ లోని వనరుల పరిధిని విస్తరించడానికి చూస్తూంటాం.అందుకు ప్రతిగా మీకు ఉత్సాహంతోనూ, డిజిటల్ విజ్ఞానంతోనూ ఉండే వికీమీడియా స్వచ్ఛంద కార్యకర్తల సముదాయంతో మిమ్మల్ని కలుపుతాం. మీ భాగస్వామ్యంలో వికీమీడియన్-ఇన్-రెసిడెన్స్ కి ఆతిథ్యమిచ్చి పనిచేయడమో, ఎడిట్-అ-థాన్ (వికీమీడియన్లు, నిపుణులు, కార్యకర్తలు కలిసి వికీపీడియాలో వ్యాసాలు మెరుగుపరిచే కార్యక్రమం), ఛాయాచిత్రాలను మెరుగుపరిచే ప్రత్యేక కార్యక్రమం కానీ, చిత్రాల విడుదల కానీ మరేదైన పూర్తిగా విభిన్నమైనది కానీ ఉండవచ్చు.మీకు చేయమంటే, మీ కార్యకర్తలను వికీపీడియా వాడుకరులుగా చేసే శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. వికీమీడియన్-ఇన్-రెసిడెన్స్ కి ఆతిథ్యమిచ్చి పనిచేయడమో,
ఎడిట్-అ-థాన్ (వికీమీడియన్లు, నిపుణులు, కార్యకర్తలు కలిసి వికీపీడియాలో వ్యాసాలు మెరుగుపరిచే కార్యక్రమం), ఛాయాచిత్రాలను మెరుగుపరిచే ఫోటో స్కావెంజర్ హంట్ కానీ, చిత్రాల విడుదల కానీ మరేదైన పూర్తిగా విభిన్నమైనది కానీ ఉండవచ్చు. మీకు చేయమంటే, మీ కార్యకర్తలను వికీపీడియా వాడుకరులుగా చేసే శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహిస్తాం.వికీమీడియన్-ఇన్-రెసిడెన్స్ కి ఆతిథ్యమిచ్చి పనిచేయడమో, ఎడిట్-అ-థాన్ (వికీమీడియన్లు, నిపుణులు, కార్యకర్తలు కలిసి వికీపీడియాలో వ్యాసాలు మెరుగుపరిచే కార్యక్రమం), ఛాయాచిత్రాలను మెరుగుపరిచే ఫోటో స్కావెంజర్ హంట్ కానీ, చిత్రాల విడుదల కానీ మరేదైన పూర్తిగా విభిన్నమైనది కానీ ఉండవచ్చు. మీకు చేయమంటే, మీ కార్యకర్తలను వికీపీడియా వాడుకరులుగా చేసే శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహిస్తాం.
మీ సంస్థతో ఎలాంటి భాగస్వామ్యం పనిచేస్తుంది అన్న విషయంలో మాట్లాడాలంటే
http://cis-india.org/contact-info వద్ద మమ్మల్ని సంప్రదించవచ్చు.
గోవన్ గ్రామాలు, పట్టణాల వ్యాసాల సృష్టి అభివృద్ధి
ప్రదేశం: పనజి, గోవా
సంస్థ తరహా: విద్యాసంస్థ
వివరణ:
[మార్చు]నిర్మల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, సీఐఎస్ ఎ2కె సంస్థల భాగస్వామ్యం ద్వారా కొంకణి భాషలో అంతర్జాల సమాచారం వృద్ధి చేసేందుకు, గోవన్ గ్రామాలు, పట్టణాల గురించి వికీపీడియాలో వ్యాసాలు పెంపొందించేందుకు సర్టిఫైడ్ వికీపీడియా శిక్షణ నిర్వహించారు.
కళాశాలలోని 100 మంది ఛాత్రోపాధ్యాయుల(బి.ఈడీ విద్యార్థులు)ను వికీపీడియాలో నమోదుచేసుకోవడం, వారిని ఒక జట్టుకు ఇద్దరుగా 50 జట్లుగా ఏర్పరచడం. కొంకణి వికీపీడియాలో ఒక్కో జట్టు ఒక్కో గోవన్ గ్రామ (లేదా పట్టణ) వ్యాసాన్ని తీసుకుని అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాలు సాధించేలా వికీపీడియా గురించి అవగాహన సదస్సులు, వర్క్ షాప్ వంటివి నిర్వహించాము. విద్యార్థులు వ్యాసాలు అభివృద్ధి చేయడానికి సాంకేతిక సహకారం అందించాము.
సాంకేతిక సహకారం అందించడం, సలహాలు-సూచనలు చేయడం వంటివి విద్యార్థుల అవసరానికి అనుగుణంగా అందించాము. విద్యార్థులు జట్టుగా పనిచేసి కొంకణి వికీపీడియాలో వారు ఎంచుకున్న వ్యాసాలు అభివృద్ధి చేశారు.
ఫలితాలు, ప్రయోజనాలు:
[మార్చు]- విద్యారంగానికి సంబంధించిన వివిధాంశాలపై అవగాహన ఉన్న వందమంది భావి ఉపాధ్యాయులు వికీమీడియన్లు అయ్యారు.
- జట్లుగా పనిచేయడం ద్వారా వికీ పద్ధతిలో అభివృద్ధి చేయడం గ్రహించి కొంకణి వికీపీడియా అభివృద్ధికి ఉపకరించే వికీమీడియన్లుగా శిక్షణ పొందారు.
- గోవన్ గ్రామాలు, పట్టణాలకు సంబంధించిన అనేక వ్యాసాలు కొంకణి వికీపీడియాలో అభివృద్ధి చెందాయి. సంస్థకు చెందిన ఆచార్యులు, ఉపాధ్యాయులు వికీపీడియన్లు అయిన విద్యార్థులకు, తద్వారా వికీపీడియా సముదాయానికి ఉపకరిస్తుంది.
- చేతన స్థితికి వచ్చే దశలో కొంకణి వికీపీడియా అభివృద్ధికి ఈ కృషి ఉపకరించింది. == వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ ==
వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్
అంటే ఏమిటి?
అంతర్గత, బహిరంగ కార్యకలాపాల ద్వారా వికీమీడియా ఉద్యమానికీ, సంస్థకీ మధ్య దగ్గరి సంబంధాలు నిర్మించేందుకు ఆ సంస్థలో బాధ్యతలు స్వీకరించిన వికీమీడియా వాడుకరిని వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ అంటారు. వారు వికీమీడియా ప్రాజెక్టుల సమాచారం, నాణ్యత మెరుగుపరిచేందుకు పనిచేయవచ్చు, కానీ దానికన్నా ప్రధానంగా ఆతిథ్యమిచ్చిన సంస్థలో స్వేచ్ఛా విజ్ఞానం విషయంలో రాయబారిగా వ్యవహరిస్తారు. స్వేచ్ఛా విజ్ఞానంపై కృషిని వికీమీడియా ద్వారా ముందుకు తీసుకువెళ్ళదలచిన ఏ సంస్థ అయినా అది వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా చేయవచ్చు.వారి కార్యకలాపాల్లో ఉండేవి:
- వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధిని అవగాహన చేసుకోవడాన్ని ప్రోత్సహించేందుకు కార్యక్రమాలను అంతర్గతంగానూ, బయటవారికీ నిర్వహించడం.
- సంస్థ డిజిటల్ వనరులు వికీమీడియా కామన్స్ లో పంచుకోవడానికి మార్గాలు అన్వేషించడం.
- సంస్థ సేకరణ, నైపుణ్యాలకు సంబంధించిన అంశాల్లో ప్రాధాన్యత కలిగినవాటిని గురించి వికీపీడియాలో వ్యాసాలు రాయడం, ఉన్న వ్యాసాలు విస్తరించడం వంటివాటి కోసం కార్యక్రమాలు నిర్వహించడం.
- కార్యక్రమాలు, చర్చావేదికలు, కేస్ స్టడీలు, డాక్యుమెంటేషన్ వంటివాటి ద్వారా సిబ్బందితో పనిచేస్తూనే వారికి వికీపీడియా, సంబంధిత ప్రాజెక్టుల్లో పని ఎలా సాగుతుంది, వారు వాటిపై ఎలా కృషిచేయవచ్చు వంటి అంశాలు వివరించడం.
- స్వేచ్ఛా విజ్ఞానాన్ని సమర్థించే ఇతర ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం.
రెసిడెన్సీలు పనిచేసే కాలావధి, పద్ధతి వంటివాటిలో చాలా అనువుగా ఉంటారు, ఇవి జీతభత్యాలు తీసుకునేవిగా కానీ, లేకుండా స్వచ్ఛందంగా చేసేవిగా కానీ ఉంటూంటాయి. జీతభత్యాలిచ్చే ఉద్యోగాల్లో కొన్ని తక్కువ కాలావధి కలవి. తక్కువ సమయంలోనివైనా భవిష్యత్ అవసరాలకు ఉపకరించేలా వారు పనిచేస్తారు. కొన్ని ఉద్యోగాలు ఆరు నెలలు ఆంతకన్నా ఎక్కువ సమయం ఉండి రెండు వైపుల సంబంధాలు పెంపొందించేలా ఉంటాయి. మరికొన్ని స్వచ్చందంగా చేసే పద్ధతిలోనో, ఇంటెర్న్ షిప్ విధానంలోనో ఉంటాయి. మిగిలినవి పార్ట్ టైం లేదా పూర్తి కాలపు పనికి జీతం తీసుకునేవిగా ఉంటూంటాయి. వికీమీడియా ప్రాజెక్టులకు గణనీయమైన లాభం కలుగుతుందన్న నిర్ధారణకు వస్తే సీఐఎస్ ఎ2కె వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ ఉద్యోగాలకు నిధులు మంజూరుచేస్తుంది. గతంలో వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం చేపట్టినప్పుడు సీఐఎస్ ఎ2కె కూడా నిధుల మంజూరు చేసి కార్యక్రమంలో భాగస్వామి అయింది. ఆ కార్యక్రమం ద్వారా వికీమీడియా కామన్స్ లోకి భారీ ఎత్తున విలువైన చిత్రాలు చేరడంతో పాటుగా, సంస్థలో స్వేచ్ఛా విజ్ఞానానికి అనుకూలంగా అంతర్గత విధాన మార్పులు జరిగాయి.వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ మీ సంస్థలో వాడుకరుల(వికీపీడియా రచయితలు)కు, చిత్రాలు చేర్చేవారికి శిక్షణ ఇవ్వడం, కార్యక్రమాలు సమన్వయం చేయడం, వికీపీడియాపై ఆసక్తిని పెంపొందించడం వంటివి చేయొచ్చు ఇంకా మీ సిబ్బందికి వికీపీడియాతో, వికీపీడియా సముదాయంతో మరింత బాగా కలసి పనిచేసేలా దోహదం చేయొచ్చు.భారతదేశంలో కాలికట్ వైద్యకళాశాలలో వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా బ్రిటీష్ వస్తు సంగ్రహాలయం (లండన్, యుకె), హౌటన్ గ్రంథాలయం (యుఎస్ఎ), స్విస్ జాతీయ గ్రంథాలయం కెటలన్ నెట్వర్క్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ (స్పెయిన్), రాయల్ ఒంటారియో వస్తు సంగ్రహాలయ (కెనడా), స్టేట్ లైబ్రరీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ (ఆస్ట్రేలియా), ఆఫ్రికా సెంటర్ (దక్షిణాఫ్రికా) వంటి సంస్థల్లో కూడా వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ లు ఉన్నారు.
వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ వల్ల మీ సంస్థకు ఎలా లాభిస్తుందో తెలసుకోవాలంటే,
http://cis-india.org/contact-info వద్ద మమ్మల్ని సంప్రదించవచ్చు. == గోవా విశ్వవిద్యాలయం- ==
కొంకణీ విశ్వకోశ్ స్వేచ్ఛా నకలు హక్కుల్లోకి
పునర్విడుదల, పాఠ్యీకరణ
ప్రదేశం:తలయ్ గోవా, గోవా
సంస్థ: విద్యాసంస్థ
"కొంకణీ వికీపీడియా భవిష్యత్తు తరాల
కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంకణీ
భాషా వ్యవహర్తల కోసం విజ్ఞాన కోశంగా
వ్యవహరిస్తుంది. కొంకణి విశ్వకోశ్
చదవాలనిపించినప్పుడు అంతర్జాలంలోకి
వెళ్ళి, కొంకణి వికీ ప్రాజెక్టు తెరచి
అందుబాటులోకి స్వీకరించి చదవే ఆనందం
కోసం ఎదురుచూస్తున్నాను"
- సతీష్ షెత్యె, ఉపాధ్యక్షుడు, గోవా
విశ్వవిద్యాలయం
వివరణ:
[మార్చు]కొంకణీ విశ్వకోశ్ అనేది గోవా విశ్వవిద్యాలయం 4 సంపుటాలుగా ప్రచురించిన కొంకణి భాషలోని విజ్ఞాన సర్వస్వం. కొంకణి విశ్వకోశ్ లో గోవా, కొంకణి, గోవన్ సంస్కృతి, జానపద సాహిత్యం, కళలు, చరిత్ర, భౌగోళిక స్థితిగతులు వంటివి సవివరంగానూ, ప్రపంచ సమాచారం క్లుప్తంగానూ ఉంది.కొంకణీ విశ్వకోశ్ ని గోవా విశ్వవిద్యాలయం స్వేచ్ఛానకలు హక్కుల్లో (సిసి బై ఎస్ ఎ 3.0) పునర్విడుదల చేసింది,
కొంకణీ విశ్వకోశ్ గ్రంథాన్ని పీడీఎఫ్ దస్త్రంగా స్కానింగ్ చేసి యూనీకోడ్ లో టైప్ చేసేందుకు స్వచ్ఛంద కార్యకర్తల కోసం పిలుపునిచ్చాము. విశ్వవిద్యాలయంలో ఈ లక్ష్యాల పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బంది, తదితరులు డిజిటైజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. వారికి వికీ మార్కప్ కోడ్, తదితర నైపుణ్యాలు పెంపొందించేలా వర్క్ షాప్ నిర్వహించగా, పని విభజన చేసుకుని ప్రణాళికాబద్ధంగా కృషిచేసి కొంకణీ విశ్వకోశ్ పాఠ్యీకరణ పూర్తిచేశారు.
ఫలితాలు, ప్రయోజనాలు:
[మార్చు]- కొంకణీ విశ్వకోశ్ స్వేచ్ఛానకలు హక్కుల్లో విడుదల చేయడం వల్ల అవసరమైన వారందరూ దాన్ని స్వేచ్ఛగా పంచుకుని, వినియోగించుకునే వీలు.
- 4 సంపుటాల్లో, 3632కు మించి పేజీల్లోని కొంకణీ విశ్వకోశ్ యూనీకోడ్ లో డిజిటైజ్ అయింది.
- 37మంది విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బంది తదితరులు ఈ కృషి వల్ల వికీమీడియా ప్రాజెక్టులపై అనుభవం, ఆసక్తి మరింత పెంచుకున్నారు.
- కొంకణీ విశ్వకోశ్ లోని వివిధ అంశాలకు చెందిన వ్యాసాలు కొంకణీ వికీపీడియా అభివృద్ధికీ, అంతర్జాలంలో కొంకణి భాషాభివృద్ధికీ సహాయపడతాయి.
- కార్యక్రమానికి సంబంధించి ప్రసార మాధ్యమాల్లో వార్తా కథనాలు వెలువడ్డాయి. పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/8 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/9 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/10 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/11 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/12 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/13 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/14 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/15 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/16 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/17 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/18 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/19 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/20 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/21 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/22 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/23 పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/24