వాసుదేవ మనిశం నమామ్యహం
స్వరూపం
రాగం: కానడ - ఖండ త్రిపుట తాళం
ప: వాసుదేవ మనిశం నమామ్యహం
భూసురాది నుతపదాంభోరుహం శ్రీ॥
అ: భాసమాన మణిభూషితదేహం
శ్రీసమేతమనఘం ఖగవాహం శ్రీ॥
చ:
వారణార్తి హరణం సురశరణం
నారదాదిమునిజన సంతోషణం॥
శారదేందు వదనం భృతభువనం
మారజనక మహిపతివర శయనం॥