వావిలాల సోమయాజులు సాహిత్యం-3/మేక్బెత్
'గ్లామిస్ నిద్రనే హత్య చేశాడు. కౌడర్ ఇక నిద్రపోడు'
-మేక్బెత్
భూమిక మేక్బెత్ - ఆధారాలు మేక్బెత్ నాటకరచనకు మూలమైన కథనిచ్చి తోడ్పడిన రచన 1577లో పుట్టిన హాలిన్ షెడ్ మహాశయుని స్కాట్లండు రాజవంశావళి. మేక్సెల్లో కొన్ని ప్రకృతివిరుద్ధమైన విశేషాలు మంత్రగత్తెలు, వారి చేష్టలు, విశ్వాసాలు మొదలైనవి కనిపిస్తున్నవి. వీటిని సంగ్రహించటం విషయంలో షేక్స్పియర్ మహాకవికి, అతని కాలంలోని నమ్మకాలతోపాటుగా 1584లో పుట్టిన రెజనాల్గు స్కాట్ 'డిస్కవరీ ఆఫ్ విచ్ క్రాఫ్ట్' అన్న గ్రంథం కూడా తోడ్పడివుంటుంది. షేక్స్పియర్ మహాకవి నాటకనిర్మాణ విషయంలో హాలిన్ షెడ్ క్రానికిల్లోని రెండు ప్రత్యేక భాగాలను ఉపయోగించాడు. అందులోని "హిస్టరీ ఆఫ్ మేక్బెత్" అన్న భాగాన్ని ప్రధానకథకు, ఫోర్రెస్ దుర్గాధిపతి డోన్వాల్డు డఫ్ రాజును చేసిన హత్యాచరిత్రను డంకన్ రాజు హత్యను నిరూపించే సందర్భానికి ఉపయోగించుకొన్నాడు. నాటకీయ శక్తినిపాతమే ప్రధానాశయంగా గల షేక్స్పియర్ మహాకవి, ఆధార గ్రంథాల్లోని అంశాలను స్థలం, కాలం, వ్యక్తుల విషయంలో అనేకరీతులుగా మార్చాడు. అందుచేత మేక్బెత్ 'కేవల చరిత్రాత్మక నాటకమని అంటానికి వీలు లేదు. కథాకల్పనం, పాత్రపోషణ, రసనిరూపణాది కళాకౌశలమంతా షేక్స్పియర్ మహాకవిదే. ఆ మహనీయశిల్పి హస్తాన మేక్బెత్ హృదయస్పంది అయిన ఒక విషాదాంతనాటకంగా పరిణమించింది. మేక్బెత్ - హాలినైడ్ రచన విషాదాంత నాటకతత్త్వం గల మేక్బెత్ కథావస్తువు షేక్స్పియర్ మహాకవికి హాలిన్ షెడ్ రచనలో లభ్యమైంది. అనేక ప్రధానాంశాల విషయంలో ఆయన ఆ రచనను అనుసరించాడు. శక్తిహీనుడైన డంకన్ మహారాజు బలవంతుడు, జయశీలి అయిన 325 మేకెత్ సేనానిమీద అంతర్బహిశ్శత్రువులను సాధించే విషయంలో ఆధారపడటం, మేక్బెత్ రాజౌతాడనీ, బాంకో సంతానంవల్ల రాజపరంపర ఏర్పడుతుందని మువ్వురు మంత్రగత్తెలు జోస్యం చెప్పటం, మేక్బెత్ ప్రభ్వి దురాశవల్ల భర్తను హత్యకు పురికొల్పటం, డంకన్ పుత్రులమీద అనుమానపడటం, హత్యాసమయంలో ప్రకృతివిరుద్ధమైన తుఫాను మొదలైన అరిష్టసూచనలు కనిపించటం, ప్రథమహత్య జరిపిన తరువాత మేక్బెత్ శీలం పతనంకావటం ప్రారంభించటంతో, అతడు ప్రతివారినీ అనుమానించటం ఆరంభించి, సమస్త నీతినియమాలను విసర్జించటం, భయంవల్ల బాంకోను అనుమానించటం వల్లను, అతని సంతానంవల్ల రాజపరంపర ఏర్పడుతుందన్న మంత్రగత్తెల జోస్యప్రభావంవల్లను బాంకోను, అతని కుమారుడు ఫ్లియాన్సును హత్య చేయించటానికి మేక్బెత్ పూనుకుంటే బాంకో హత్యకు గురై ఫ్లియాన్సు తప్పించుకొని పారిపోవటం, స్కాట్లండునుండి పారిపోవటం, మాక్డఫ్ను అనుమానించి అతడు చిక్కకపోవటం చేత అతని కుటుంబాన్నంతటినీ నాశనం చెయ్యటం, మంత్రగత్తెలిచ్చిన ధైర్యంవల్ల మేక్బెత్ ప్రమాదస్థితి త్రోసుకొనివస్తున్నా ఎట్టి భయంలేదని గాఢంగా విశ్వసించటం, మాక్డఫ్-మాల్కొంల మధ్య జరిగిన సంభాషణను యథాతథంగా గ్రహించి నడిపించటం, ఆంగ్లేయుల సహాయంతో మాల్కొం స్కాట్లండును క్రూరనిరంకుశుడైన మేక్బెత్ పాలనలోనుంచి ఉద్దరించటం మొదలైన అంశాలు షేక్స్పియర్ నాటకంలోను, హాలిన్ షెడ్ రచనలోను నమూనాలై కన్పిస్తున్నవి. మాక్డొనాల్డు విప్లవం, స్వెనోదండయాత్ర, కాన్యూట్ సైన్యం స్కాట్లండుపై ఎత్తిరావటం అన్న మూడు అంశాలు హాలిన్ షెడ్ రచనలో ప్రత్యేకంగా మూడు సమయాల్లో జరిగినట్లుంది. సైనికుడుగా మేక్బెత్ ఎంతటి అధికుడో నిరూపించటం కోసం, షేక్స్పియర్ ఈ ఉదంతాలు మూడూ ఏకకాలంలో జరిగినట్లు మార్పు చేశాడు. హాలిన్ షెడ్ రచనలో మాక్డోనాల్డు ఆత్మహత్య చేసికొన్నట్లున్నది. మన కథానాయకుడైన మేక్బెత్కు వీరగుణాన్ని కల్పించటంకోసం షేక్స్పియర్ అతణ్ణి మేక్బెత్ రణరంగంలో హతమార్చినట్లు మార్చాడు. హలిన్ షెడ్ రచనలో డర్రాజును దుర్గాధిపతియైన డోనాల్డు నియమించిన నలుగురు హంతకులు హత్యచేసినట్లుంది. షేక్స్పియర్ హత్యలోని భయానకత్వాన్ని నిరూపించటం కోసమూ, మేక్బెత్ నైతికపతనాన్ని చిత్రించటంకోసమూ, ఆ హత్యను మేక్బెత్ స్వహస్తాలతో జరిగించినట్లు పరివర్తన చేశాడు. మేక్బెత్ చేసిన విందునుంచి తిరిగి వస్తుండగా బాంకోను హత్యచేసినట్లు హాలిన్ షెడ్ లో ఉంది. షేక్స్పియర్ మేక్బెత్ను, అతని పత్ని మేక్బెత్ ప్రభ్విని ఒక 326 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 విచిత్రసన్నివేశంలో ప్రదర్శించి చూపించటంకోసం విందుకు ముందే ఆ హత్య జరిగిపోయినట్లు మార్చాడు. హాలిన్ షెడ్ రచనలో మేక్బెత్ రాజు పదిహేడు సంవత్సరాలు పాలించినట్లుంటే, కథాగమనానికి అంతటికాల విలంబం తగదు గనుక షేక్స్పియర్ ఆ కాలంలో జరిగిన అంశాలన్నీ స్వల్పకాలంలోనే జరిగిపోయినట్లు నిరూపించి, విషాదాంతనాటకానికి అవశ్యకమైన గమనతీవ్రతను కల్పించాడు. రాజ్యహరణానంతరం కొంతకాలం మేక్బెత్ ధర్మప్రవృత్తితో ఉదాత్తంగా రాజ్యపాలన చేసినట్లు హాలిన్ షెడ్ రచన చెబుతున్నది. మంత్రగత్తెల ప్రభావానికి లోనైన మేక్బెత్ నిజరక్షణకోసం చేసే రక్తపాతం విషయంలో కాలవిలంబం పనికిరాదు కనుక, అతణ్ణి షేక్స్పియర్ రాజ్యహరణం చేసిన తొలినాటినుండి కూడా క్రూరనిరంకుశు ణ్ణిగానే నిరూపించాడు. హాలిన్ షెడ్ రచనలో డంకన్ రాజు శక్తిహీనుడు, యువకుడు. రాజ్యవ్యవహారాలను పట్టించుకోకపోవడం వల్ల సర్వ వ్యవహారాలకూ మేక్బెత్ మీద ఆధారపడ్డాడు. కానీ షేక్స్పియర్ మహాకవి మేక్బెత్ హత్యాదోషాన్ని తీవ్రతరంగా ప్రదర్శించడం కోసం, డంకన్ న్ను వృద్ధుడైన ఆదర్శప్రభువుగా రూపొందించినాడు. హాలిన్ షెడ్ రచనలో బాంకో మేక్బెత్కు తోడ్పాటునిచ్చినట్లుంది. నాటకంలో షేక్స్పియర్ ఇతణ్ణి మేక్బెలు ప్రతిపాత్రగా గ్రహించి సర్వసద్గుణాన్వితుడైన మహోదాత్తమూర్తిగా మలచాడు. మేక్బెత్ ప్రభ్వి హాలినెడ్ రచనలో రాజీనామంకోసం ఆరని దాహాన్ని వహించి, భయాన్ని కల్పించేటంతటి అత్యంత స్వార్థపరురాలైన అతివగా కనిపిస్తుంది. షేక్స్పియర్ నాటకంలో మేక్బెత్ ప్రభ్వి శీలాన్ని కొంతగా సరిదిద్దాడు. మేక్బెత్ రూపకంలో ఆమెలోని స్త్రీత్వం కొంత లోపించినా, మూలంలోని అత్యంతస్వార్థపరత్వం అదృశ్యమై గోచరిస్తుంది. ఆమె నిర్వహించిన సమస్తం తనకోసం కాక భర్తయైన మేక్బెత్ కోసమని స్పష్టమౌతుంది. స్త్రీత్వం లోపం, క్రౌర్యతీక్షత లుంచినా షేక్స్పియర్ ఆమెకు స్వార్థత్యాగ మొక గుణవిశేషంగా కల్పించాడు. చరిత్రలో ఈ మేక్బెత్ పత్ని జీవితం ఏమైందీ కన్పట్టదు. షేక్స్పియర్ నాటకంలోని 'నిద్రాగమనదృశ్యానికి' (అం. V దృI) గాని, 'విందు దృశ్యానికి' (అంIII దృ6) గాని, 'ఛురికాదృశ్యానికి' (అం దృI)గాని చరిత్రలో ఎట్టి ఆధారాలూ లేవు. చరిత్ర షేక్స్పియర్కు కేవలం ఛాయామాత్రమైన రూపాన్నే ఇవ్వగలిగింది. జగదేకనాటకకర్త అన్న విఖ్యాతిగన్న ఈ మహాశిల్పి, ఘనవిషాదాంత నాటకచతుష్టయంలో ఒకటిగా పరిగణితమవుతున్న 'మేక్బెత్ 'లోని కళావిలసనమంతా రచయితదే! 327 'మేక్బెత్' - చరిత్ర షేక్స్పియర్ మహాకవి హాలిన్ షెడ్ కథనాన్ని అత్యంత సన్నిహితంగా అనుసరించలేదు. అందులోని అంశాలను అవసరమైనంతవరకూ స్వేచ్ఛగా స్వీకరించాడు. అదీకాక హాలిన్ షెడ్ కథనంగా చరిత్రను ప్రధానాంశాల విషయంలోనైనా యథాతథంగా నిరూపించలేదన్న అభిప్రాయం ఉండనే ఉంది. అందువల్ల చరిత్రలో సత్యంగా జరిగిన విశేషాలేవో గమనించటం అవసరం. మాల్కొం II తరువాత అతని మనుమడు డంకన్ స్కాట్లండుకు రాజై, 1034 - 1040 మధ్యకాలంలో రాజ్యపాలనం చేశాడు. దక్షిణదిక్కుకు దండయాత్ర చేసి డర్హాం దగ్గిర ఓడిపోవటం వల్ల, వెన్నంటి తరుముకువస్తున్న అతనిజ్ఞాతి ధోర్ఫిన్ సైన్యాల శక్తినుంచి స్కాట్లండును రక్షించటంకోసం, డంకన్ తిరోగమింపవలసి వస్తుంది. పెంట్లండ్ ఫిర్త్ యుద్ధం తరువాత ఇతను ఓడిపోయి, ధోర్ఫిన్ పక్షంలో చేరిపోయిన తన సేనాని మేక్బెత్ విద్రోహఛురికకు గురికావటం జరిగింది. మేక్బెత్ మాల్కొం II కుమార్తెయైన డయోడాకు, రాస్కు (గ్లామిస్కు కాదు) పాలకుడైన ఫిన్లేకు పుత్రుడు. ఒక తుములయుద్ధంలో మాల్కొం II తన తండ్రియైన ఫిన్లేను చంపటం వల్ల, మేక్బెత్కు అతని వారసుడైన డంకన్తో బంధుకలహం సంప్రాప్తిస్తుంది. మేక్బెత్ మోరై పాలకుడైన గిల్కోంగ్రెస్ విధవ గ్రౌచ్ని వివాహమాడి, ఆమె కుమారుడు బాలుడు కావటంచేత మోరైకు పాలకుడైనాడు. మేక్బెత్ పత్నియైన గ్రౌచ్ మాల్కొం II రాజ్యభ్రష్టుని చేసి చంపిన కెన్నెత్ III కు పుత్రుడైన బొయటే కుమార్తె మాల్కొం II డంకన్ ను సింహాసనాధిష్ఠితుణ్ణి చేయటానికి నిశ్చయించి, ఆమె ఏకైకసోదరుణ్ణి కూడా హతమార్చాడు. ఇందువల్ల - తండ్రిని, సోదరుని మాల్కొం II చంపటంవల్ల - మేక్బెతు, అతని పత్నికి మాల్కొంకు వారసుడైన డంకన్ మీద ప్రతీకారేచ్ఛ కలిగింది. ప్రతీకార నిర్వహణానంతరం స్కాట్లండుకు రాజైన మేక్బెత్ (1040-57) పదిహేడు సంవత్సరాల సామర్థ్యంతో, ప్రజానురాగంతో రాజ్యపాలనం చేశాడు. శక్తిమంతుడై సివర్డు దండయాత్రలను తిరుగగొట్టగలిగాడు. తుదకు లంప్ హానన్ యుద్ధంలో గాడ్విన్ ప్రభువు సహాయంతో ఎత్తివచ్చిన యువ మాల్కొంతో పోరాడుతూ మరణించాడు. ఇతని అనంతరం లులాగ్, కమ్మోరు సింహాసనానికి వారసులై 1093 దాకా రాజ్యపాలనం చేశారు. ఇవి చరిత్రలో జరిగిన సత్యాలైన అంశాలు. డంకన్ పాలనకాలంలో విప్లవం చేసిన కౌడర్ థేన్ విషయం, 328 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 నార్వే ప్రభువైన స్వైనో దండయాత్రోదంతాలు లేనే లేవు. బాంకో, ఫ్లియాన్సు చారిత్రికపురుషు కారు. మాక్డఫ్, మాక్డఫ్ ప్రభ్విని గురించి విశ్వసింపతగ్గ విశేషాలు చరిత్రలో ఏమీ కన్పట్టవు. మేక్బెత్ ప్రభ్వి మృత్యువిధానాన్ని గురించి ఏమీ తెలియదు. చరిత్రలో మేక్బెత్ వృద్ధసివద్దు ఎత్తి రావటంవల్ల ఓడిపోవటం లేకపోగా, ఎత్తివచ్చిన నార్తంబ్రియా ఎరలను తరిమివేసి తరువాత బహుకాలం జీవించి రాజ్యపాలన చేసినట్లు కనిపిస్తున్నది. మేక్బెత్ పాలనలో ప్రభుత్వం అతిశక్తిమంతంగా నడిచిందనీ, ప్రజలు సుభిక్షంగా ఉన్న దేశంలో సర్వ సౌఖ్యాలను అనుభవించారన్న విషయాన్ని చరిత్రలన్నీ ఏకకంఠంతో అంగీకరిస్తున్నవి. మేక్బెత్ - ఆంగ్లనాటక సాహిత్యంలో దానిస్థానం 'మేక్బెత్' షేక్స్పియర్ రచనకాలంలోని తృతీయావస్థలో (1601-1608) జన్మించిన ఒక విషాదాంతరూపకం. ఈ దశలో ఆ మహాకవి మేక్బెత్, హామ్లెట్, లియర్ రాజు, ఒథెల్లో, రోమక నాటకాలైన ఆంటోనీ - క్లియోపాత్రా, కొరియ లానస్లను రచించినాడు. లోకంలోని నిరంకుశత్వం అసత్యప్రియత్వం, విశ్వాసఘాతుకత్వం, కృతఘ్నత ఈ కాలంలో షేక్స్పియర్ మహాకవి మనస్సును ఆవరించి, విషాదభావశబలితం చేశాయి. అందువల్ల ఆయన మానవహృదయనైచ్యతలోని లోతులను ఈ దశలోని తన రూపకాలలో త్రవ్విపోసినాడు. విమర్శకులు 'మేక్బెత్'ను ఆంగ్లనాటక సాహిత్యంలో అత్యుత్తమనిధిగా భావిస్తున్నారు. ఈ రూపకంలో కన్పించే విషాదమహత్వాన్ని తిరిగి చూడాలంటే, ఈ స్కైలస్ కవితను ఆశ్రయించవలసిందేనని వారి అభిప్రాయం. ఇందలి దృశ్యసౌభాగ్యం, కవితావైశిష్ట్యం మనోహరాలు, ఈ రూపకంలో రచయిత పాఠకులను ఒక అతీతప్రపంచంలోకి నడిపించుకోపోయి, తన కావ్యభాషాశిల్పవిశేషాల సహాయంతో సృష్టించిన సర్వం చైతన్యోపేతమైన సత్యజగత్తన్నట్లుగా నిరూపిస్తాడు. ఉద్రేకోత్సాహాలతో, అంధవిశ్వాసాలతో, దృఢప్రత్యయాలతో ఇందలి పాత్రలు పఠితల వెన్నాడగల పరమశిల్పమూర్తులు. మేక్బెత్ దుర్గంలోనికి డంకన్ స్వయంగా ప్రవేశించటం, మేకెత్ ప్రభ్వి 'నిద్రా - గమనం', డంకన్ హత్య, మేక్బెత్ దంపతుల సమావేశాలు మొదలైనవి ఈ రూపకంలో వ్యక్తిగతంగా వైశిష్ట్యాన్ని పొందిన దృశ్యాలు. హత్యానిర్వహణ, నిర్వహణానంతరవేళల్లో మేక్బెత్ మనోవైక్లబ్య ప్రదర్శనం, హృదయవిదారకమైన అపురూపచిత్రాలు. 329 ఈ సందర్భాలల్లో నాటకకర్త ఉపయోగించిన కవితాసాధన ఏ యుగంలోనూ కన్నట్టనిది. కనుక 'ఆంగ్లనాటక సాహిత్యంలో మేక్బెత్ అత్యుత్తమనిధి' అన్న విమర్శకాభిప్రాయం ఎంతో సమంజసమైంది. మేక్బెత్ - ఏకకర్తృకమా? I నేడు ఉపలభ్యమౌతున్న మేక్బెత్ షేక్స్పియర్ మహాకవి రచించిన రూపంలో కాక, అనేకమైన ప్రక్షిప్తభాగాలతో కనిపిస్తున్నదన్న వాదం ఒకటి ప్రబలంగా ఉంది. ప్రక్షిప్తాలలో ప్రధానాలుగా ఎన్నబడుతున్నవి సార్జెంటు దృశ్యం (అం 1 దృ2), హెకేట్ సంభాషణలు (అం III దృ5), ద్వారపాలకుని సంభాషణ (అం IV దృ4గ), మేక్బెత్ సంభాషణ (అం IV దృ4 లో మూలంలోని 135-153 పంక్తులు), నాటకాంతదృశ్యంలోని కొంత భాగం (అం V -దృ 8లో 35-75 పంక్తులు). ఛందస్సు సక్రమంగా లేకపోవటంవల్లను, శైలి నిరర్థకశబ్దపుష్టిని సూచిస్తుండటంవల్లనూ, తీవ్రంగా గాయాలు తగిలిన వీరుని విజయవార్తను చెప్పటానికై పంపించటం అనుచితంగా ఉండటంవల్లనూ, సార్జెంటుదృశ్యం ఒక ప్రక్షిప్తభాగమని ఒక అభిప్రాయం. దీనికి వ్యతిరేకులైనవారు ఛందస్సు సక్రమంగా లేకపోవటం, నాటకకర్త ఇతరరచనల్లోకూడా కనిపిస్తుందనీ, ఇందులో శైలి సామాన్యవీరుడు రాజుతో చేసే ప్రసంగానికి యోగ్యంగానే ఉందనీ, సార్జెంటు రాక కేవలం విజయవాతావరణాన్ని కల్పించటానికి ఉద్దేశింపబడ్డదేగాని, నిజమైన వార్తాహరి రాస్ అనీ చెప్పి, పై అభిప్రాయాన్ని త్రోసిపుచ్చుతున్నారు. ఈ దృశ్యం షేక్స్పియర్ కృతమే అని నిరూపించటానికి వెరిటీమహాశయుడు కొన్ని ఉపపత్తులను చూపించాడు. ఈ దృశ్యంవల్లనే మేక్బెత్ మహాయోధుడని నిరూపితమౌతున్నది. వీరగుణప్రదర్శన ద్వారా మేక్బెత్ విషాదాంతపతనాన్ని అత్యంతరమణీయం చేయటంకోసం, అతని సేవలకు మెచ్చుకొని డంకన్ అతణ్ణి గౌరవించటం భవిష్యత్తులో అతని కృతఘ్నతాభావ తీవ్రతను నిరూపించటానికీ, ఈ గౌరవమే హత్యాచరణకు దోహదంగా వర్తించేటట్లు చేయటంకోసమూ, మేక్బెత్ విజయమే మాల్కొంను యువరాజుగా ప్రకటించటానికి పురికొల్పి మేక్బెత్ను హత్యాచరణకు త్వరపెట్టటాన్ని కల్పించదలచుకోవటం వల్లనూ, మహాకవి షేక్స్పియరే ఈ దృశ్యాన్ని రచించివుంటాడు. నాటకశిల్పదృష్టితో పరికిస్తే, ఇది ప్రధానకథ కత్యావశ్యకమైన భాగంగా కన్పించటంవల్ల ప్రక్షిప్తభాగం కాజాలదు. 330 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మిడిల్ టన్ వ్రాసిన 'ది విచ్' అనే నాటకం నుంచి హేకెట్కు సంబంధించిన భాగాలు 'మేక్బెత్' నాటకంలో ప్రక్షిప్తాలుగా ప్రవేశించాయని ఫ్లియే అన్న విమర్శకుడు ఒక సిద్ధాంతాన్ని లేవదీశాడు. 'ది విచ్' అన్న నాటకానికీ, మేక్బెత్కు అనేక సామ్యాలు కన్పిస్తున్నాయనీ, రెండు నాటకాలలోని మాంత్రికురాండ్రు ఒకేరీతిగా ఉన్నారనీ, రంగసూచికల్లో ఇవ్వబడిన రెండు గేయాలు (అం III దృ5 - 33), (o IV ) 1-43) 'ది విచ్'లో నుంచి మేక్సెల్లో ప్రవేశించాయని ఫ్లియే అభిప్రాయం. గుణవిశేషం విషయంలో మిడిల్ టన్ వ్రాసిన 'ది విచ్' మేక్బెత్తో ఏకోశానా పోలకపోవటంవల్ల, విమర్శకుల వింత అభిప్రాయాన్ని త్రోసిపుచ్చి మేక్బెత్ నుంచే మిడిల్టన్ కొన్ని విశేషాలను గ్రహించివుంటాడని నిశ్చయించారు. తీవ్రంగా పరిశీలించి రెండు నాటకాల్లోని మంత్రకత్తెలకు సామ్యాలకంటే వైషమ్యాలే విశేషంగా ఉన్నాయని వారు నిరూపించారు. అందలి శైలీపారుష్యాలనుబట్టి కొందరు ద్వారపాలక సంభాషణ (అం III దృ 3) షేక్స్పియర్ మహాకవికృతం కాదని భావిస్తున్నారు. కోల్రిడ్జి మహాశయుడే సామాన్య ప్రేక్షకులకోసం దీనినెవరో రచించి మేక్సెల్లో ప్రవేశపెట్టి వుంటారన్న అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నాడు. భయానక విషాదాంత సన్నివేశాల మధ్య ఇటువంటి దృశ్యానికి అవకాశం లేదన్న భావమే ఇట్టి ఊహలకు కారణం. కాని ద్వారభేదనదృశ్యాన్ని ఉంచినపుడు ద్వారపాలక సంభాషణ ఉండితీరవలసిరావటం వల్లనూ, భయానక సన్నివేశాలమధ్య కొంత విశ్రాంతికోసం ఇది అవసరమనిపించటంవల్లనూ, ఈ సంభాషణ నాటకగమనానికి అనుగుణంగానే ఉండటం వల్లనూ, ఇందలి శైలి, భాష షేక్స్పియర్ కావటం వల్లనూ, ఈ ద్వారపాలక సంభాషణ షేక్స్పియర్ కృతమేనని హేల్సు మహాశయుడు నిర్ణయించాడు. మేక్బెత్ను తొలుత ఆనీరాణి కాలంలో, ఆమె సోదరుడు డెన్మార్కు రాజు అయిన క్రిష్టియన్ IV సోదరిని దర్శించటానికి వచ్చిన సందర్భంలో, అతని గౌరవార్థం ప్రదర్శించారట. తరువాత జేమ్సు కాలంలో ప్రదర్శించినప్పుడు ఆయన మెప్పుకోసం రాజును గురించిన సంభాషణ (అం IV దృ III 135-154) లు అందులో ప్రవేశపెట్టారన్న అభిప్రాయం ఉంది. కాని ఇందులోని భాష శైలి షేక్స్పియర్ కావటంవల్ల అది ప్రక్షిప్తం కాదనీ, ఒక వేళ ప్రక్షిప్తమైనా షేక్స్పియరే తరువాతి కాలంలో దాన్ని ప్రవేశపెట్టాడనీ విమర్శకాభిప్రాయం. 331 ఇది ప్రధానంగా ఉత్తమపాలకుడైన ఎడ్వర్డుకు, దుష్టపాలకుడైన మేక్బెత్కు ఉన్న తారతమ్యాన్ని ప్రదర్శిస్తుండటంవల్లనూ, వింతైన సన్నివేశంలో నుంచి అప్పుడే బయటపడ్డ మాక్డఫ్ చిత్తవృత్తికి నిలకడను కల్పించటానికి ఇది తోడ్పడటంవల్లనూ, నాటకీయంగా ఇది అనుచితం కాదు గనుకనూ, ఇది షేక్స్పియర్ మహాకవి కృతమే అన్న అభిప్రాయం స్థిరపడింది. తుది దృశ్యంలోని (అం Vదృ 8 -35-75) నలుబది పంక్తులు ప్రక్షిప్తాలన్న వాదంలో కూడా బలంలేదు. ప్రక్షిప్తభాగమనటానికి ఒక కారణంగా చెప్పబడిన మాల్కొం మేక్బెత్ ప్రభ్విని 'భూతం వంటి రాష్ట్రాని' అని వ్యవహరించటం, మేక్బెత్ 'భావనాత్మకమైన విషాదాంతం' కావటంవల్లనే అని చెప్పి సమర్థించటం జరిగింది. మేక్బెత్ చారిత్రిక నాటకమా? విషాదాంతమా? మేక్బెత్ రూపకాన్ని 'విషాదాంతంగా' రచించటమే షేక్స్పియర్ లక్ష్యం. అందువల్ల ఆయన చారిత్రిక వాతావరణాన్ని ఆధారమాత్రంగా గ్రహించి, భావనామూర్తియైన మేక్బెత్ అంతరంగయుద్ధాన్ని నిరూపించదలచుకొన్నాడు గనుక, నాటకాన్ని మనోవృత్తి వివరణంగా రూపొందించాడు. తన నాటకంలో సత్యమైన స్కాట్లండు దేశచరిత్రలోని అంశాలను దృశ్యరూపంలో నిరూపించటం ఆయన ఉద్దేశం కాదు గనుక, మేక్బెత్ చరిత్రాత్మక రూపకం కాజాలదు. ఒక నైతికసూత్రానికి కట్టుబడి, క్రమశిక్షణతో వర్తించని మనోవృత్తిగల వ్యక్తిలో స్థానాన్ని చేకూర్చుకొన్న అత్యాశ పొందిన పరిణామం వల్ల కలిగే దుష్ఫలితాలను ప్రదర్శించి చూపటమే మేక్బెత్ రచనలో నాటకకర్తకు ప్రధానాశయం. ఈ కారణంవల్లనే నాటక నిర్మాణవిషయంలో షేక్స్పియర్ మహాకవి కాల, స్థల, వ్యక్తుల విషయంలో ఎన్నో మార్పులు చేసుకోవలసివచ్చింది. ఉపజ్ఞతో ఉత్తమశిల్పి ఇందువల్లనే హాలిన్ షెడ్తో ఎట్టి సంబంధమూ లేని నూతనవాతావరణాన్ని సృష్టించుకోవలసి వచ్చింది. మేక్బెత్న అత్యుత్తమ విషాదాంత నాటకంగా రూపొందించిన మరుభూమి దృశ్యం (I.1) ఛురికాదృశ్యం, విందు దృశ్యం, నిద్రాగమనదృశ్యం, డంకన్ హత్యకు పూర్వం మేక్బెత్ హృదయగవేషణం మొదలైన విషాదాంత విశేషాలన్నీ షేక్స్పియర్ మహాకవి కల్పనలే. షేక్స్పియర్కు మేక్బెత్ రచనమూలంగా ఒక చరిత్రను రూపకంగా రచిద్దామన్న ఉద్దేశం లేదు. అస్థిపంజరమాత్రంగా చరిత్రనుంచి కథను గ్రహించి, అత్యాశాశబలితమైన కృతఘ్నప్రవృత్తిచే విషాదాంతనాయకుడై వర్తించి పతనాన్ని పొందిన 332 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మేకెత్ను చిత్రించి చూపటమే షేక్స్పియర్ ఉద్దేశం. కనుక మేక్బెత్ 'విషాదాంతమే' కాని 'చరిత్ర' కాదు. మేక్బెత్ - విషాదాంత నాటకం భద్రతాసౌఖ్యాలను అనుభవిస్తున్న ఉన్నతవర్గానికి సంబంధించిన వ్యక్తి అదృష్టానికి అజ్ఞాతంగా పరిపూర్ణవైపరీత్యం ఏర్పడటం ఒక విషాదాంత కృత్యంగా భావింప బడుతుంది. ఈ విషయంలో మహాకవి షేక్స్పియర్ దృష్టి వేరు. అది విశేషపురోగమనం కలది. షేక్స్పియర్ విషాదాంత నాటక నాయకులందరూ విశేషంగా మహారాజులు, రాజపుత్రులు, ప్రజానాయకులు అయి ఉంటుంటారు. వీరికి కలిగే విషాదాంత పతనం ఏదో అర్థరహితమైన విధి చేష్టవల్ల కాక, సకారణమై వుంటుంది. ఆయన విషాదాంత నాటకాలలో కేంద్రం శీలంవల్ల నిర్వర్తితమైన కార్యంలో కాని లేదా కార్యంవల్ల నిరూపితమయ్యే శీలంలోగాని ఉంటుంది. సర్వసామాన్యంగా నాయకుని ఒకానొక కృత్యంవల్లనే విషాదంతపతనం సంభవిస్తుంటుంది. షేక్స్పియర్ విషాదాంత నాటక నాయకులు ఘనత వహించినవారై వుంటుంటారు. అయినా ఒక దిక్కున వారి పక్షపాతమో, లోభమో, ఆశో లోపమై, దానిని వారు చక్కదిద్దుకోలేక పతనమవు తుంటారు. ఉదాత్తప్రకృతిగల ఒథెల్లో ఈర్ష్యవల్ల పతనమైనాడు. హామ్లెట్ వంటి విజ్ఞాని అతిశయమైన ఆదర్శతత్త్వంవల్ల అంతమొందాడు. మహావీరుడైన మేక్బెత్ కృతజ్ఞతాగుణరహితమైన అత్యాశవల్ల హతమారిపోయినాడు. ఈ ఉదాహరణలన్నింటిలో ప్రధానపాత్రలలోని ఏకైకలోపమే కన్పిస్తుంది. ఆ ఏకవిషయకమైన వ్యసనాన్నో లేక లాభాన్నో విడిచిపుచ్చితే, షేక్స్పియర్ మహాకవి విషాదాంత నాటక నాయకులందరూ ఉదాత్తులు, ఘనులు. అందువల్లనే, వీరి వినాశం కరుణను, భయాన్ని మనలో కల్పించగలుగుతున్నది. మహాకవి షేక్స్పియర్ ఊహించిన విషాదాంతం ఆత్మవినాశం, లేదా ఆత్మ పునరుద్ధరణం, మానవజీవితాలకు సంబంధించి వుంటుంది. అంటే దానికి వస్తువు లోకంలోని మంచి చెడ్డలే... వీటిలో మహాకవి షేక్స్పియర్ పరిష్కరించటానికి అవకాశం లేని కొన్ని సమస్యలను ప్రతిపాదిస్తుంటాడు. ఆయన మిల్టన్ చెడుగు మూలమేమో దాన్ని వివరించటానికి పూనుకోడు. డాంటీలా అంతులేని బాధాచక్రాలమూలంగా ఆత్మనుద్ధరించి చూపడు. మంచి చెడ్డలు రెండు ఉన్నవని ప్రదర్శించి చూపటమే 333 ఆయన పెట్టుకొన్న పని. లోకంలో ద్వేషం ఎలా ఉంటుందో, అలాగే దౌష్ట్యం నుంచి లోకాన్ని ఉద్దరించాలన్న పవిత్రభావం కూడా ఉంటుందని ఆయన నిరూపిస్తుంటాడు. అవి రెండూ తగ్గ ప్రతిఫలాలను ఈ లోకంలోనే అనుభవించటం ఆయన రచనల్లో కనిపిస్తుంది. షేక్స్పియర్ విషాదాంతాలలో కథ ప్రధానంగా ఒకరికి - నాయకుడికి లేదా ఇరువురికి - నాయికానాయకులకు సంబంధించి ఉంటుంది. ఇందులో విపదనుభవ పతనాలు విశిష్టంగా ఉంటాయి. అవి ఒక అసామాన్యవ్యక్తికి సంబంధించినవై ఉంటాయి. పూర్వం ఆ వ్యక్తి కీర్తి వైభవాలను అనుభవించినవాడై ఉంటాడు. ఆపదలు, చర్యలనుబట్టి వ్యక్తుల చర్యలనుబట్టి ఉద్భవిస్తుంటాయి. విషాదాంత కేంద్రం పాత్రలశీలంనుంచి ఉద్భవించిన చర్యలోగాని లేదా చర్యలవల్ల జనించిన శీలంలోగాని ఉంటుంది. పాత్రల శీలమే విశేషంగా ఈ చర్యలకు మూలాధారమై ఉంటుంది. పాత్రలోని ఏకైక విషయపక్షపాతం వల్లనో, ఏకైకాశయ నిమగ్నత వల్లనో, ఏకైకభావమనో నిశ్చలత వల్లనో విషాదాంతగుణం ప్రదర్శిత మౌతుంది. ఈ గుణం విషాదాంత నాటక నాయకుని ఇతరవిషయాలలో అశక్తుని చేస్తుంటుంది. ఈ విషాదాంతగుణమే అతని ఏకైకగుణమై పతనాన్ని ప్రాప్తింపజేస్తుంటుంది. మేక్బెక్లో తనది కానిదానిని పొందవలెనన్న స్వార్థపరమైన అత్యాశ, మేక్బెత్ ప్రభ్వి అంతకంటే శక్తిమంతమైన ప్రణయ, స్వార్థరాహిత్యాలతో కూడిన అత్యాశ, స్వేచ్ఛా సంచారం చేసి ఉత్తములైన ఆ దంపతుల పతనానికి దారి తీసింది. ఉత్తమకార్యసాధకులు కాదగ్గ వారిరువురూ అత్యాశవల్ల వినాశాన్ని పొందటం చేత, వారి కథావస్తువుతో గూడిన మేక్బెత్ను విమర్శకులు 'అత్యాశావిషాదాంతము' అని భావించారు. స్నిడర్ మహాశయుడు మేక్సెత్ను 'భావవిషాదాంత' మన్నాడు. బాహ్యదృష్టికి మేక్బెత్ విధి సోదరీమణుల ప్రేరణం వల్ల నిర్దోషి యైన డంకన్ ను హత్య చేసినట్లు కన్పించినప్పటికీ, ఈ చర్యకు బాధ్యత అంతా అతనిదే. ఈ విధి సోదరీమణుల రూపాలు అతని కాంక్షలు, అత్యాశాదులవల్ల కళవళపాటును పొందుతున్న మనస్సు నుండి ఉద్భవించి స్వాతంత్ర్యాన్ని పొందినవే. బాహ్యంగా మేక్బెత్ కొంత శిక్షను అనుభవించినా అతడు, అతని పత్ని మేక్బెత్ ప్రభ్వి విశేషంగా మానసిక భావనలవల్ల అధిక వేదనను అనుభవించారు. అందువల్ల మేక్బెత్ను 'భావనావిషాదాంత' మనటం సమంజసమే. 334 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మేక్బెత్ - కెల్టుల నాటి స్కాట్లండు వాతావరణం మేక్బెత్ రూపకంలో షేక్స్పియర్ కెల్టిక్ స్కాట్లండు వాతావరణాన్ని యథాతథంగా ప్రదర్శించటం కనిపిస్తుంది. ప్రథమాంకంలోని మూడో దృశ్యంలో ఫొర్రేస్ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని వర్ణించటంలోను, ప్రథమాంకంలోని ఆరో దృశ్యంలో ఇన్వర్నెస్ దుర్గాన్ని గురించి చేసిన వర్ణనలోను, షేక్స్పియర్కు ఆ ప్రదేశాలతో ప్రత్యక్షపరిచయం ఉన్నదా అన్న అనుమానం కలుగుతుంది. షేక్స్పియర్కు మూలాలైన చరిత్రలు, స్కాట్లండు ప్రకృతి వాతావరణవర్ణనల విషయంలో సత్యానికి భిన్నాలుగా ఉండటంవల్ల, ఆయనకు విశేషంగా తోడ్పడి వుండటానికి అవకాశం లేదు. స్కాట్లండుదేశంలోని భూతవిద్యకు, మేక్బెర్లోని మంత్రగత్తెల చరిత్రకు చాలా సామ్యాలు కనిపిస్తున్నవి. మేక్బెత్ పఠనం వల్ల షేక్స్పియర్కు ఆ నాటి స్కాట్లండుదేశపు స్థానికాచార వ్యవహారాలతోనూ, విశ్వాసవిలాసాలతోను, ప్రకృతితోను గాఢపరిచయం ఉన్నదని సర్వత్రా గోచరిస్తుంది. అందువల్ల 1601లో అబర్డీన్ టౌన్ కౌన్సిలు రిజిస్టరులో విచ్చేసినట్టు రిజిస్టరైన లారెన్సు ఫ్లెచ్చెర్ సంఘంలో ఒక సభ్యుడుగా, షేక్స్పియర్ స్కాట్లండు దేశాన్ని దర్శించి వుండవచ్చునని కొందరూహిస్తున్నారు కానీ, ఒక దేశపు ప్రకృతితోను, ఆచార వ్యవహారాలతోను పరిచయాన్ని గ్రంథంలో ప్రదర్శించినంత మాత్రం చేత ఆ దేశాన్ని దర్శించాడని చెప్పవలసిన అగత్యం లేదు. షేక్స్పియర్ రోమన్ ఇటాలియన్ నాటకాలలో రోముతోనూ, ఇటలీతోనూ విశేష పరిచయమున్నట్లు కనిపిస్తాడు. అంతమాత్రంచేత ఆయన ఇటలీ దేశాన్ని పర్యటించాడనిగాని, రోమును దర్శించాడనిగాని ఊహించటానికి అవకాశం లేదు. జేమ్సు | రాజు ఆంగ్ల సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత లండన్ నగరానికి విశేషంగా రాకపోకలు చేస్తున్న స్కాటులతో చేసిన గోష్ఠుల వల్ల, షేక్స్పియర్ స్కాన్దేశప్రకృతికి, వాతావరణానికి సంబంధించిన అనేకాంశాలను సంగ్రహించి వుండవచ్చు. 1603కు పూర్వం షేక్స్పియర్కు ఫ్లెచ్చెర్తో పరిచయమున్నట్టు ఆధారాలేవీ లేవు గనుక, 1601లో ఫ్లెచ్చెర్ నాయకత్వాన స్కాట్లండును దర్శించిన సంఘంలో షేక్స్పియర్ ఒక సభ్యుడవటం పొసగదు. అదీకాక, 1601లో తండ్రి మరణించటంవల్ల షేక్స్పియర్ స్కాట్లండుయాత్రను తలపెట్టటానికి అవకాశం కూడా లేదు. స్కాచ్ మిత్రులతో సలిపిన గోష్ఠులవల్లనే షేక్స్పియర్ మేక్బెత్ నాటకానికి ఆవశ్యకమైన వర్ణనాంశాలను, వాతావరణవిశేషాలను సేకరించాడని భావించటమే సర్వవిధాలా సమంజసం. 335 మేక్బెత్ - మాంత్రికురాండ్రు “మేక్బెట్లోని మంత్రగత్తెలు విచిత్రసృష్టి. వీరు సామాన్యంగా జనవిశ్వాసంలో కన్పించే మాంత్రికురాండ్రవంటివారు కారు. ఇంతకంటే ఎంతో శక్తిమంతలు. విధి దేవతలవంటివారు. మానవజాతి కతీతమైన భవిష్యద్విజ్ఞానం వీరికున్నట్లు విస్పష్టంగా గోచరిస్తుంది. మాంత్రికురాండ్రను గురించి తన కాలంలో ఉన్న అభిప్రాయాలను గ్రహించి, షేక్స్పియర్ ఈ మాంత్రికురాండ్రను భావించి వారికి ఎన్నో అతీతశక్తులను ప్రసాదించాడు. సామాన్య జనశ్రుతిలో చీపురుకట్టలతో కన్పించే మంత్రగత్తెలు కారు. వీరు విరూపలైనా ఉదాత్తత లోపింపనివారు. వీరు మహాశిల్పి మైకలాంజెలో చిత్రించిన మానవ జీవితతంతువుల ననుయించే వృద్ధవనితలతో తుల్యమైన స్థానాన్ని ఆక్రమింపదగ్గవారు” అన్న డౌడన్ మహాశయుని అభిప్రాయం గమనింపదగినది. మేకెత్లోని మంత్రగత్తెలలో రెండు తెగలవారున్నారనీ, అందులో మొదట కన్పించినవారు (అం దృ1) స్కాండినేవియా దేశంలోని భూతభవిష్యద్వర్తమానాలకు అధిదేవతలైన నోర్సన్లనీ, రెండవమారు కన్పించినవారు (అం IV దృ 1 ) సామాన్య జనశ్రుతిలోని మాంత్రికురాండ్రవంటి వారనీ ఒక అభిప్రాయముంది. ఈ అభిప్రాయాన్ని ఖండించి త్రోసిపుచ్చి, షేక్స్పియర్ సృష్టించిన మంత్రగత్తెలు సామాన్య జనశ్రుతిలోని మాంత్రికురాండ్రేగాని, దేవతలైన నోరన్లు కారని విమర్శకులు నిరూపించారు. మేక్బెత్ : నాటకీయ ఏకత ఎంత రమణీయమైలైనప్పటికినీ, కొన్ని కథాసన్నివేశాలనుగాని, లేదా కొన్ని కథాభాగాలను గాని ఒకచోట చేర్చినంతమాత్రాన నాటకం కాజాలదు. అందువల్లనే గ్రీకు నాటకతత్త్వవేత్త అరిస్టాటిల్ నాటకంలో ఆదిమధ్యాంతాలందు ఒక కార్యపరిణామాన్ని మాత్రమే ప్రదర్శించవలెనని నిర్ణయించాడు. ఇట్లే స్థలైక్యం, కాలైక్యంగూడా ప్రాచీన లాక్షణికు లేర్పరచినప్పటికీ, అనుసరించి వాటికి విశేషప్రాముఖ్యాన్నివ్వటం తరువాతి నాటకకర్తలు మానివేశారు. మేక్బెత్ నాటకంలో సమస్తమూ మేక్బెత్ ఉదయాస్తమయాల మీద కేంద్రీకృతమైంది. ఇందులో ప్రాసంగికకథ అంటూ ఏమీ లేదు. నాటకీయోపశమనానికో లేక తులనాత్మక రసభావ ప్రదర్శనలలో ప్రవేశపెట్టిన ఇతరసన్నివేశాలు కూడా అల్పసంఖ్యాకాలు. మంత్రగత్తెలు మేక్బెత్ను జోస్యంతో మోసగించటం ప్రథమాంకంలోనే ప్రారంభమౌతుంది. తృతీయాంకంలోని తృతీయ దృశ్యంలో ఫ్లియాన్సును కూడా హత్య 336 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 చేయించటంలో విఫలుడు కావటంతో, అంతవరకూ అవిచ్ఛిన్నంగా సర్వకృత్యాలలో విజయాన్ని పొందుతూ వస్తున్న మేక్బెత్క, 'దుర్గతి' ప్రారంభమౌతుంది, అప్పటినుంచీ పతనోన్ముఖత ప్రారంభమై, అన్ని విషయాలలోనూ మేక్బెత్ అపజయాలనే పొందుతాడు. మాల్కొం, మాక్డఫ్ తుదకు అతణ్ణి రూపుమాపటంతో అతని విషాదకథ పరిసమాప్తిని పొందుతుంది. 'ఉదాత్తపాత్ర ప్రలోభానికి లొంగిపోవచ్చు. ఈ ప్రలోభం అతనిచేత ఒక పాపకృత్యాన్ని చేయించటానికి పురికొల్పటంలో క్రమంగా అతడు ఒకదాని తరువాత మరొక పాపకృత్యాన్ని ఆచరించటానికి వెనుదీయకపోవటం జరుగుతుంది.. ఈ పాపకృత్యాలకు, వాని తీవ్రతకు అనుగుణమైన ఉచితశిక్ష అనుభవింపక తీరదు’ అన్నది మేక్బెత్ నాటకానికి మూలభావంగా కనిపిస్తున్నది. మంత్రగత్తెలు రాజ్యాశను కల్పించి మేక్సెత్ను ప్రలోభపెట్టారు. అతడు డంకన్ రాజును హత్య చేయటంతో పాపకార్యాచరణాన్ని ఆరంభించాడు. ఇక తిరోగమనమన్నది లేకపోవటం వల్ల అతడు నీతికరుణలను విడిచిపుచ్చి దారుణహత్యాకాండను కొనసాగించటం జరిగింది. తుదకు పశ్చాత్తాపం వల్ల ఆత్మనైనా ఉద్దరించుకోటానికి అవకాశం లేని దారుణమరణంతో గాని అతనికి బాధోపశమనం కలగలేదు. ఈ రీతి పరిశీలనవల్ల మేక్బెత్ నాటకంలో షేక్స్పియర్ మహాకవి భావైక్యాన్ని మహామనోజ్ఞంగా సంపాదించడం గోచరిస్తుంది. మేక్బెత్ - నాటకీయోపశమనం మేక్బెత్ నాటకంలో మొదటినుంచీ తుదివరకూ ఒకదాని తరువాత మరొక భయానక సన్నివేశం కనిపిస్తుంది. ఇటువంటి భీకరసన్నివేశాలను దర్శిస్తున్నప్పుడు ప్రేక్షకుల మనస్సు విశేషంగా అలసట పొందుతుంటుంది. అందువల్ల మధ్యమధ్య ఉపశమనంకోసం, కథాగమనాన్ని అడ్డుకోని కొన్ని అన్యరసభావసన్నివేశాలకు మహాకవి షేక్స్పియర్ ఈ రూపకంలో ప్రవేశాన్ని కల్పించాడు. సామాన్యంగా షేక్స్పియర్ నాటకాలలో విదూషకపాత్ర ఇటువంటి విషాదాంతభారాన్ని భరించడంలో తోడ్పడుతుంటాడు. కానీ తీవ్రవిషాదాంత నాటకమైన మేక్బెక్లో దాని నిర్మాణరీతులకు, ప్రధానరసభావాలకు భంగం కలుగుతుంది. కనుక హాస్యరసస్ఫూర్తులతో కూడిన విదూషపాత్రను ప్రవేశపెట్టటానికి అవకాశం లేదు. అందువల్ల షేక్స్పియర్ మహాకవి ఈ ఉపశమన సంతరింపునకు అన్యమార్గాలను 337 అన్వేషించాడు. డంకనన్ను హత్య చేయటానికి వెళ్ళబోయేముందు మేక్సెత్కు కవితాత్మను ప్రసాదించి పంపించాడు. మాక్డఫ్ కుటుంబాన్ని హత్య చేయించే సందర్భంలో, ఆ కాలంలో పక్వమైన బాలుని తొక్కు పలుకుల మూలంగా అక్కడి భయానకతకు కొంత ఉపశమనాన్ని కల్పించాడు. కథాంతవేళలో మేక్బెత్ 'వైద్యుణ్ణి నే పాలించే భూమికి పటిష్టమూ, స్వచ్ఛమూ అయిన ఆరోగ్యాన్ని చేకూర్చగలవా?' అని ప్రశ్నించి కవితాత్మతో వ్యవహరించటం వల్ల, అతని తుదివేదనావస్థను కొంతగా కప్పిపుచ్చాడు. మహాకవి షేక్స్పియర్ కొంత అనుదాత్తస్థాయితో కల్పించిన దృశ్యాల మూలంగా కూడా ఈ ఉపశమనాన్ని సంతరిస్తుంటాడు. డంకన్ హత్యకు సిద్ధపడుతున్న మేక్బెత్ మనోవేదనను దర్శించి శ్రమగొన్న ప్రేక్షకుల బుద్దికి, ద్వారపాలకుని దృశ్యం మూలంగా నాటకకర్త కొంత విశ్రాంతిని చేకూర్చాడు. లేకపోతే హత్య ఎరుకపడిన తరువాత వచ్చే భయానక సన్నివేశాలను వారు భరించటం కష్టమౌతుంది. అంకం II దృశ్యం 4 మూలంగా ప్రేక్షకులను మేక్బెత్ దుర్గం నుంచి దూరంగా తీసుకుపోయి, వారి బుద్ధిని తాత్కాలికంగా హత్యావ్యవసాయానికి దూరం చేయటం కూడా ఈ ఉపశమనసంతరింపు కోసమే. బాంకో హత్య తరువాత మంత్రగత్తెలకు 'హెకేటుకు జరిగిన సంభాషణకు, ఆ హత్యావ్యవసాయం చేత అనిబద్ధభీతిని పొందిన మేక్బెత్ను దర్శించినపుడు కలిగే శ్రమనుంచి ప్రేక్షకులకు కొంత విశ్రాంతి కల్పించటమే ప్రయోజనం' అంకం III దృశ్యం 4లో కూడా ఇట్టి ప్రయోజనమే ఉద్దేశితమైంది. షేక్స్పియర్ మహాకవి చతుర్థాంకంలోని తృతీయదృశ్యాన్ని మాక్డఫ్ సత్యసంధతను మాల్కొం పరీక్షించటం, మాక్డఫ్ తన భార్యాపుత్రుల వధను గురించి వినడం అన్న రెండు భాగాలుగా విభజించి వస్తుగమన వైపరీత్యంతో ప్రేక్షకబుద్ధికి ఒక విచిత్రోపశమనాన్ని కల్పించటం ప్రశంసాయోగ్యమైన నాటకీయశిల్ప కౌశలవిశేషం. కథాపరిచ్ఛేదం ప్రథమాంకం - ప్రలోభం ఒక మరుభూమిలో మువ్వురు మాంత్రికురాండ్రు సమావేశమై, విప్లవాన్ని అణచి విజయాన్ని చేకొని యుద్ధభూమినుంచి డంకన్ రాజును హత్య చేయాలన్న నిశ్చితపథకంతో వస్తున్న మేక్బెత న్ను, 'ఒక క్షేత్రసీమ'లో కలుసుకోటానికి నిశ్చయిస్తారు. ఇతరుల మనస్సులో ప్రవేశించి సర్వాన్నీ గ్రహింపగల శక్తి ఉన్న దుష్టమాంత్రికురాండ్రు 338 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 పూర్వమెరుగని మేక్బెత్ మనస్సులోని పథకాన్ని గుర్తించటంవల్లనే అతడు వారిని ఆకర్షించటం జరుగుతుంది. దుష్టత్వం, దుష్టత్వానికి తోడ్పడాలని ఉత్సహించటమే ఇందుకు కారణం. ఈ స్వల్పదృశ్యం వల్ల భయానకాద్భుతవాతావరణం సూచితమౌతుంది (దృశ్యం1). ఫోర్రెస్ లోని ఒక శిబిరం దగ్గర ఉండగా, స్కాట్లండు రాజైన డంకన్, నార్వీజియన్ రాజు సహాయంతో మేక్డొనాల్డు చేసిన తిరుగుబాటును తన పినతల్లి కుమారుడైన మేక్బెత్ అణచివేసి విజయం చేకొన్నాడన్న వార్తను వింటాడు. ఈ సమయంలో కౌడర్ థేను చేసిన విద్రోహాన్ని తెలుసుకొని డంకన్ రాజు ప్రాణహరణమే అతనికి శిక్షగా చెప్పి, కౌడర్ థేన్ బిరుదాన్ని మేక్బెత్కు ప్రసాదిస్తాడు. ఈ దృశ్యం మేక్బెత్ కీర్తి ప్రశస్తితో ముగిసి అతనికి విషాదాంత నాటక నాయకత్వానికి అర్హతను ప్రదర్శిస్తున్నది. ఇంతలో, డంకన్ మేక్బెత్కు చేసిన గౌరవం ఇతఃపూర్వమే అతని మనస్సులో మొలకెత్తిన అత్యాశకు దోహదమై, హత్యకు అతణ్ణి మరింతగా ప్రేరేపిస్తుంది. (దృశ్యం 2) తరువాత తొలుత నిశ్చయించుకొన్నట్లుగా మాంత్రికురాండ్రు యుద్ధభూమి నుంచి విజయంతో వస్తున్న మేక్బెత్ను కలుసుకొని, మేక్బెత్ను "గ్లామిస్ థేన్, కౌడర్ థేన్ భవిష్యస్కాట్లండు ప్రభూ!" అన్న బిరుదాలతో జయవెట్టుతారు. అతని వెంట వున్న బాంకోతో 'నీవు రాజువు కాకపోయినప్పటికీ రాజపరంపరకు మూలపురుషుడవౌతా'వని తెలియజెప్పుతారు. ఇంతలో వార్తాహరులు వచ్చి మేక్బెత్తో రాజు 'మిమ్మల్ని కౌడరుకు థేనును చేసినా'డని విన్నవిస్తారు. మంత్రగత్తెలు చెప్పిన జోస్యంలో పూర్వార్ధం సత్యం కావటం వల్ల, ఉత్తరార్ధం కూడా సత్యమై తీరుతుందని అతడు విశ్వసించటం ప్రారంభిస్తాడు. తన యత్నమేమీ లేకుండానే ఆ జోస్యం ఫలించవచ్చునని అతడు ఊహిస్తాడు. (దృశ్యం 3). కౌడర్ మరణదండన జరిగిపోయిందని విన్నతరువాత, డంకన్ రాజు దర్శనానికి వచ్చిన బాంకో, మేక్బెత్ల వీరగుణాన్ని ప్రశంసిస్తాడు. సింహాసనాన్ని గురించి భవిష్యత్తులో ఎటువంటి అంతఃకలహాలూ పుట్టకుండా ఉండటంకోసం అతడు తన పుత్రుడైన మాల్కొంను యువరాజని ప్రకటిస్తాడు. అందువల్ల తాను స్కాట్లండుకు రాజు కావటానికి డంకన్ మాల్కొంకే కాక మున్ముందు డొనాల్బెయిన్ మొదలైనవారు కూడా అడ్డుకావచ్చును కనుక, ఆ నాటి రాత్రికే తలపెట్టిన హత్య జరిగిపోవాలని మేక్బెత్ నిశ్చయిస్తాడు. 339 ఇట్టి స్థితిలో డంకన్ రాజు తానే మేక్బెత్ దుర్గమైన ఇన్వర్నెన్కు ఆతిథ్యాన్ని స్వీకరించటానికి వస్తున్నాని మేక్బెతు తెలియజేస్తాడు (దృశ్యం 4). ఇన్వర్నెస్ దుర్గంలోని సౌధంలో మంత్రగత్తెలు చెప్పిన జోస్యాన్ని గురించి మేక్బెత్ వ్రాసిన ఉత్తరాన్ని చదువుతూ, అందులో అప్పటికే కొంతభాగం సత్యమైనందుకు సంతోషించి, మిగిలిన భాగాన్ని పూర్తిచేయటం కోసం భర్తను త్వరపెట్టి డంకన్ ను హత్య చేయించటానికి మేక్బెత్ ప్రభ్వి నిశ్చయిస్తుంది. ఒక వార్తాహరి వచ్చి డంకన్ రాజు వారి దుర్గానికి అతిథిగా వస్తున్నాడన్న వార్తను మేక్బెత్ ప్రభ్వికి నివేదిస్తాడు. స్వల్పకాలంలో మేక్బెత్ వస్తాడు. మేక్బెత్ ప్రభ్వి భర్తను మాంత్రికురాండ్రు జయవెట్టిన రీతిగా ఆహ్వానిస్తుంది. ఆమె సార్వభౌమాధికారాన్ని సంపాదించాలంటే డంకన్ హత్య అత్యవసరమని, అన్యమార్గం లేదని భర్తకు మంతనం చెబుతుంది (దృశ్యం 5). మేక్బెత్ దుర్గం దగ్గరికి వచ్చి డంకన్ రాజు అచ్చటి ప్రకృతి విలాసాన్ని, ప్రశాంత వాతావరణాన్ని ప్రశంసిస్తాడు. ఆయాతుడైన రాజును అత్యాదరంతో మేక్బెత్ ప్రభ్వి ఆహ్వానించి స్వాగతం చెబుతుంది. (దృశ్యం 6) మేక్బెత్ తనకు అతిథిగా వచ్చిన మహారాజు డంకను హత్య చేయటమా, చేయకపోవటమా అని డోలాందోళితమనస్కుడై కళవళపాటు పొందుతుంటాడు. అనుమానభయాలు ఆవరిస్తున్నప్పుడు మేక్బెత్ ప్రభ్వి ప్రవేశించి అతని భీరుత్వాన్ని నిందించి, ప్రతిజ్ఞాభంగం చెయ్యవద్దని ఉద్బోధించి హత్యకాతణ్ణి స్థిరనిశ్చయుణ్ణి చేస్తుంది. ద్వితీయాంకం - ప్రథమవిద్రోహం మేక్బెత్ సౌధప్రాంగణంలో రాత్రి బహుకాలం గడచిన తరువాత, మేక్బెత్ బాంకోను, అతని పుత్రుడు ఫ్లియాన్సులను కలుసుకొని, మంత్రగత్తెల జోస్యం బాంకోమీద ఎలా పనిచేస్తున్నదో తెలుసుకో యత్నిస్తాడు. బాంకో సమాధానాల వల్ల అతడు డంకన్ హత్యలో తనతోబాటు భాగస్వామి కాడని అతడు గ్రహిస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయినతరువాత ఏకాంతంగా ఉన్న సమయంలో మేక్బెత్కు డంకన్ కక్ష్యవైపునకు దారి చూపిస్తూ ఉన్న ఒక ఛురికాఛాయామూర్తి కనిపిస్తుంది. ఇంతలో మేక్బెత్ ప్రభ్వి ఇచ్చిన సూచనను అందుకొని, అతడు డంకన్ ను హత్య చేయటానికి అతడి కక్ష్యకు వెళ్ళుతాడు (దృశ్యం 1). ఏమైందో అన్న ఉద్వేగంతో మేక్బెత్ ప్రభ్వి తహతహపడుతుండగా, మేక్బెత్ డంకన్ ను హత్య చేసి రక్తపంకిలాలైన హస్తాలతో ఆమెదగ్గరికి వస్తాడు. బాహ్యస్మృతి 340 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 లేకుండా అతడు కాపలావాళ్ళదగ్గర విడిచిరావలసిన ఛురికలను వెంట తెస్తాడు. మేక్బెత్ ప్రభ్వి అతణ్ణి తిరిగి వాటిని లోపలికి తీసుకోపోయి కాపలావాళ్ళదగ్గరి పెట్టి, అనుమానం వాళ్ళమీద పడేటందుకుగాను వారి ఒడళ్ళనిండా రక్తాన్ని పులిమి రమ్మని చెపుతుంది. అతిభీతివల్ల మేక్బెత్ ఆ పని చెయ్యటానికి నిరాకరించినప్పుడు, మేక్బెత్ ప్రభ్వి భర్త హస్తాలలో నుంచి ఛురికలను లాగుకొనివెళ్ళి, తానే ఆ పని చేసివస్తుంది. డంకన్ కక్ష్యనుంచి ఆమె తిరిగివచ్చిన వెంటనే ద్వారం దగ్గిర గట్టిగా తట్టిన చప్పుళ్ళు వినిపిస్తాయి. మేక్బెత్ ప్రభ్వి చేతులు కడుగుకొని నిద్రను నటించటం తమ కర్తవ్యమని త్వరపెట్టి భర్తను వెంట తీసుకోపోతుంది (దృశ్యం2). డంకన్ కక్ష్యకు ప్రక్కన ఉన్న కక్ష్యలో విడిది చేసిన మాక్డఫ్, లెన్నాక్స్ పెద్దగా చప్పుడు చేసి నిద్రిస్తున్న ద్వారపాలకుణ్ణి మేల్కొల్పుతారు. అతడు అర్థరహితమైన ప్రలాపం చేసి తలుపు తీస్తాడు. ఇంతలో మేక్బెత్ వచ్చి వారిని కలుసుకొంటాడు. మాక్డఫ్ డంకన్ కక్ష్యలోకి వెళ్ళి, నిహతుడైన డంకనన్ను చూసి వచ్చి, ఆ హత్యావిషయాన్ని మేక్బెత్కు ఎరుకపరిచి కేకలు పెట్టి సౌధంలో వాళ్ళనందరినీ మేల్కొల్పుతాడు. ఇంతలో మేక్బెత్ ప్రభ్వి, బాంకో కూడా అక్కడికి వస్తారు. మేక్బెత్, లెన్నాక్స్ ఇరువురూ డంకన్ కక్ష్యకు వెళ్ళినప్పుడు మేక్బెత్ తీవ్రకోపాన్ని నటించి అక్కడి కాపలావారిని చంపివేస్తాడు. వారు తిరిగి వచ్చేటప్పటికి మాల్కొం డొనాల్బెయిన్ కూడా అక్కడికి చేరుతారు. వారికి మేక్బెత్ కోపతీవ్రతలో తాను రాజును హత్యచేసిన కాపలావారిని చంపివేశానని చెపుతాడు. ఈ వార్త విన్నవెంటనే మేక్బెత్ ప్రభ్వి మూర్ఛపొందుతుంది. ఆమెను తీసుకోవెళ్ళినతరువాత కొలది కాలానికి, దుష్టబుద్ధి ఐన మేక్బెత్ విద్రోహాన్ని గ్రహించి డంకన్ రాజుపుత్రులైన మాల్కొం, డొనాల్బెయిన్ ఇంకా అక్కడ ఉంటే తమ ప్రాణాలకు కూడా ప్రమాదం సంభవిస్తుందని భావించి, స్కాట్లండునుంచి పారిపోవటానికి నిశ్చయించుకుంటారు. (దృశ్యం 3) మేక్బెత్ సౌధానికి బయట డంకన్ రాజు హత్య జరిగిన నాటి రాత్రి కనుపట్టిన శకునాలను, అశుభసూచనల గురించి రాస్ మరొక వృద్ధుడితో చర్చిస్తుంటాడు. ఇంతలో మాక్డఫ్ అక్కడికి వచ్చి పారిపోవటంవల్ల రాజును కుమారులే హత్యచేశారని ప్రజలు అనుమానిస్తున్నట్లు తెలియజేస్తాడు. రాస్ అతనితో ప్రజలు మేక్బెత్ను ప్రభువుగా ఎన్నుకొన్నారని, త్వరలోనే అతనికి కిరీట ప్రదానోత్సవం స్కోన్లో జరుగనున్నదనీ తెలియజేస్తాడు (దృశ్యం 4) 341 తృతీయాంకం - ద్వితీయవిద్రోహం ఫోర్రెస్ సౌధంలో మేక్బెత్కు అతిథిగా ఉన్న బాంకో మంత్రగత్తెలు చెప్పిన జోస్యాన్ని గురించి ఏవేవో ఊహలు చేస్తుండగా, మేక్బెత్, మేక్బెత్ ప్రభ్వి వచ్చి అతణ్ణి రాజసౌధంలో ఆ నాటి రాత్రి జరుగుతున్న విందుకు ఆహ్వానిస్తారు. రాజపదవి అబ్బిన మేక్బెత్, బాంకో సంతానపరంపర రాజ్యపాలన చేస్తుందని మంత్రగత్తెలు చెప్పిన జోస్యాన్ని మరచిపోలేదు. అందుకని అతడు బాంకోను, అతని కుమారుడైన ఫ్లియాన్సును హత్య చేయటానికి నిశ్చయిస్తాడు. ఈ కృత్యాన్ని నిర్వహించటానికని మేక్బెత్ ఇరువురు హంతకులను నియమిస్తే, వారు తగిన పథకం వేస్తారు (దృశ్యం 1). బాంకో హత్యనుగూర్చిన పథకాన్ని ఎరుగని మేక్బెత్ ప్రభ్వి ఆ విషయాన్ని తెలుసుకొంటుంది. గడచిపోయిన విషయాలను గురించి పదేపదిగా ఆలోచనా నిమగ్నుడౌతూ, ఉన్మత్తుడిలా ప్రవర్తిస్తున్న మేక్బెత్ చర్యను ఆమె నిందిస్తుంది. అప్పుడు అతడు తాను బాంకో, ఫ్లియాన్సు తనను సింహాసనం నుంచి దింపివేస్తారేమోనని భయపడుతున్న విషయం ఆమెకు తెలియజేస్తాడు. (దృశ్యం 2). మేక్బెత్ సౌధానికి సన్నిహితంగా ఉన్న ఒక ఉద్యానవనంలో హంతకులు బాంకోను హత్య చేస్తారు. ఫ్లియాన్సు తప్పించుకొని పారిపోతాడు. (దృశ్యం 3). రాజసౌధంలో విందుకు ఏర్పాట్లు జరుగుతాయి. రాజు, రాజ్ఞి - మేక్బెత్, మేక్బెత్ ప్రభ్వి - అతిథులను, ప్రియవాక్యాలతో ఆహ్వానిస్తారు. బాంకోను హతమార్చిన హంతకులలో ఒకడు ద్వారప్రదేశానికి వచ్చి కనిపిస్తే, మేక్బెత్ అక్కడికి వెళ్ళి అతడితో స్వల్పంగా సంభాషించి వస్తాడు. ఫ్లియాన్సు తప్పించుకొని పారిపోవటం మేక్బెత్ను విశేషంగా కలతపెట్టటం ప్రారంభించింది. అతిథుల సంగతిని పట్టించుకోకుండా ఆలోచనావీథిలో పడిపోయిన మేక్బెత్న, అతనిస్థానం దగ్గిరకు పిలుచుకొనివచ్చి ఉత్సాహాన్ని కల్పించటానికి మేక్బెత్, ప్రభ్వి యత్నిస్తుంది. తన స్థానందగ్గరికి వచ్చిన మేక్బెత్ బాంకో ప్రేతరూపం తన ఆసనాన్ని ఆక్రమించుకొన్నట్లుగా విభ్రాంతిని పొందుతాడు. అప్పుడతడు ప్రదర్శించిన భయావేశం అతిథులనందరినీ ఆశ్చర్య చకితులను చేస్తుంది. మేక్బెత్ ప్రభ్వి తన భర్తను అటువంటి భావావేశాలను పొందటం యౌవనకాలం నుంచీ అలవాటని నచ్చజెప్పి, అతిథులను వెళ్ళిపోకుండా కూర్చోపెడుతుంది. మేక్బెత్ మనస్సును చిక్కబట్టుకొని ఒక ద్రాక్షాసవాన్ని అందరికీ ఇప్పిస్తున్న సమయంలో, బాంకో ప్రేతరూపం మళ్ళా అతనికి కన్పించి ఉద్విగ్నుణ్ణి చేస్తుంది. విందు యత్నమంతా భగ్నమౌతుంది. తరువాత మేక్బెత్ ప్రభ్వి మాక్డవ్ వారివిందుకు రావటానికి 342 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 నిరాకరించనట్లుగా భర్తకు తెలియజేస్తుంది. మేక్బెత్ తన భవిష్యత్తును గురించి మాంత్రికురాండ్రతో మళ్ళా ఒకమారు మాటాడి, వారి సలహాను పొంది రావటానికి నిశ్చయిస్తాడు. (దృశ్యం 4). ఒక క్షేత్రసీమలో తనకు తెలియజేయకుండానే మేక్బెత్తో స్వతంత్రంగా వ్యవహరించారని మంత్రగత్తెలను కోపించి, వారి విద్యాధిదేవత అయిన హెకేట్, తాను మేక్బెత్ను వినాశనం చెయ్యటానికి నిశ్చయించినట్లుగా తెలియజేసి, తన పథకాన్ని వారికి వివరిస్తుంది (దృశ్యం 5). ఫోర్రెస్ సౌధంలో మేక్బెత్ ప్రవర్తన కొందరు ప్రభువులకు అనుమానాన్ని కల్పించింది. డంకను, బాంకోను మేక్బెత్తే హత్య చేశాడని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నట్లు, లెన్నాక్స్ మరొక ప్రభువుతో చేసిన సంభాషణ వల్ల తెలుస్తుంది. క్రూరవిద్రోహియైన మేక్బెత్ పాలననుంచి దేశాన్ని ఉద్దరించటానికి, ఆంగ్లప్రభువు సహాయాన్ని అర్థించటంకోసం మాక్డఫ్ ఇంగ్లండు వెళ్ళినట్లు ఆ ప్రభువు లెన్నాక్స్కు తెలియజేస్తాడు. (విందు దృశ్యం 6). చతుర్థాంకం - ప్రతిచర్య ఒక చీకటి గుహలో మాంత్రికురాండ్రు శక్తిమంతమైన ఒక 'కవచాన్ని' తయారుచేస్తుంటారు. వారివల్ల తన భవిష్యత్తును తెలుసుకోదలచిన మేక్బెత్ ప్రవేశించి, నాకు ముందేమి జరుగనున్నదో తెలుపవలసిందని ఆజ్ఞాపిస్తాడు. మంత్రగత్తెలు అతనికి మూడు ఛాయారూపాలను చూపించి తుదకు ధైర్యం చెప్పటం జరుగుతుంది. కనిపించిన మొదటి పిశాచరూపం 'మాక్డఫ్ను గురించి జాగ్రత్త' అనీ, రెండో పిశాచరూపం 'స్త్రీకి జన్మించినవాడికి నీవు భయపడ పనిలేదనీ, మూడో పిశాచరూపం 'బిర్నాం మహారణ్యం డన్స్నేన్ వరకూ కదలి వచ్చేదాకా నీవు విప్లవానికిగాని, యుద్ధానికిగాని భయపడవ'ద్దని మేక్బెతు తెలియజేస్తాయి. తరువాత అతడు బాంకో సంతానం ఎప్పటికైనా స్కాట్లండుకు రాజులౌతారేమో తెలియజేయవలసిందని శాసిస్తాడు. అప్పుడు మంత్రగత్తెలు అతనికి బాంకో వంశపరంపరలోని ఎనిమిదిమంది రాజుల ఛాయారూపాలను చూపించి, అదృశ్యమైపోతారు. ఆ దృశ్యాన్ని చూచిన తరువాత మేక్బెత్ క్రోధోన్మత్తుడై మంత్రగత్తెలను తిట్టిపోస్తాడు. ఇంతలో లెన్నాక్స్ వచ్చి, మాక్డఫ్ ఇంగ్లండుకు పారిపోయినట్లు మేక్బెత్కు నివేదిస్తాడు. మేక్బెత్ పట్టజాలని కసితో మాక్డఫ్ ప్రభ్విని, ఆమె సంతానాన్ని చంపివేయటానికి 343 నిశ్చయిస్తాడు. (ఇది పిశాచావాహన దృశ్యం 1) ఫైఫ్లో మాక్డఫ్ దుర్గం, ఒక వార్తాహరి ప్రవేశించి మాక్డఫ్ ప్రభ్వితో ఆమెకు ఆపద రానున్నది కనుక వెంటనే పారిపోవలసిందని విన్నవిస్తాడు. అంతలోనే హంతకులు ప్రవేశించి ఆమెను, ఆమె పుత్రుని వధిస్తారు (దృశ్యం 2). ఆంగ్ల రాజసౌధమందు మాక్డ అంతకుపూర్వమే ఆంగ్లేయ ఆస్థానాన్ని చేరుకొన్న మాల్కొంను కలుసుకుంటాడు. మాల్కొం తొలుతగా మాక్డఫు అనుమానించినా, అనతికాలంలోనే అతడు విశ్వాసపాత్రుడని నమ్మి, స్కాట్లండు దండయాత్రకు ప్రయత్నాలెంతవరకు కొనసాగింది అతనికి ఎరుక చేస్తాడు. ఇంతలో మాక్డఫ్కు తన భార్యను, బిడ్డలను మేక్బెత్ హత్య చేసినట్లు తెలుస్తుంది. అతడు మేక్బెత్ యెడ ప్రతీకారం చేసితీరుతానని ప్రతిజ్ఞ చేస్తాడు (దృశ్యం 3). పంచమాంకం - దుర్దశ మేక్బెత్, మేక్బెత్ ప్రభ్వి బలిష్ఠమైన డన్స్నేన్ దుర్గంలో వసిస్తుంటారు. మేక్బెత్ ప్రభ్వికి చిత్తవైక్లబ్యం ఏర్పడి నిద్రావస్థలో, హత్యాసందర్భాన తాను భర్తకిచ్చిన తోడ్పాటును గురించి అసంబద్ధంగా ప్రలాపిస్తుంటుంది. అనుతాపానికి పాలైన ఆమె ఆరోగ్యం పరిపూర్ణంగా భగ్నమైపోయి ఉంటుంది (దృశ్యం 1). డన్స్నను సమీపంలో ఉన్న ఒక గ్రామప్రాంతాన స్కాచైసైన్యం వస్తున్న మాల్కొం సైన్యంతో చేరిపోవటానికి సిద్ధపడుతుంటుంది. సైనికులు, ప్రజలు ఒక్కొక్కరే మేక్బెత్ పక్షాన్ని విడిచిపెట్టి మాల్కొం పక్షంలో చేరటానికి వెళ్ళిపోతుంటారు. (దృశ్యం 2). అనుచరులందరూ తన్ను విడిచిపెట్టి పారిపోతూ శత్రుపక్షంలో చేరిపోతున్నారన్న వార్తలు మేక్బెత్ను చేరుతాయి. మంత్రగత్తెలు చెప్పిన జోస్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ధైర్యం వహిస్తూ, తుదిదాకా డన్స్నేన్లో ఉండి, మేక్బెత్ దానిని, తన్ను రక్షించుకోటానికి నిర్ణయిస్తాడు (దృశ్యం 3). బిర్నాం అరణ్యాన్ని చేరిన మాల్కొం శత్రువులు, తమ సంఖ్య ఎంతో తెలిసికొనటానికి వీలులేకుండా తన సైనికులతో తలా ఒక కొమ్మను విరిచి ముందు పెట్టుకొని నడవమని ఆజ్ఞాపిస్తాడు (దృశ్యం 4). డన్స్నేన్ దుర్గంలో మేక్బెత్ తన జెండాలను దుర్గంమీద ఎగురవేయవలసిందని శాసిస్తాడు. ఇంతలో అతని భార్య మరణించిందన్న వార్తను వింటాడు. ఒక వార్తాహరి వచ్చి బిర్నాం మహారణ్యం కదలి డన్స్నేన్ వంకకు వస్తున్నట్లు తెలియజేస్తాడు. ఈ వార్త మేక్బెతు విశేషంగా 344 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 కళవళపెడుతుంది. సైనికులను యుద్ధానికి సిద్ధపడవలసిందని శాసించి నిష్క్రమిస్తాడు. (దృశ్యం 5). దండెత్తి వచ్చిన మాల్కొం సైన్యం డన్స్నేన్ మైదానాన్ని చేరుకొంటుంది. అక్కడ సైనికులందరూ తమ చేతుల్లోని కొమ్మలను క్రింద పారేస్తారు. దుందుభిధ్వనులతో యుద్ధమారంభ మౌతుంది. (దృశ్యం 6). డన్స్నేన్ రణభూమిలో యుద్ధం సాగుతుంటుంది. మేక్బెత్ యువ సివర్డును చంపి, తనకు స్త్రీకి జన్మించినవాని చేతిలోని ఆయుధాలవల్ల ఎట్టి ప్రమాదం లేదని పరిహసించి, నిష్క్రమిస్తాడు. విశేషప్రతిఘటన లేకపోవటంవల్ల దుర్గం అనతికాలంలోనే మాల్కొంకు వశమౌతుంది. ఆయన అందులో ప్రవేశిస్తాడు. (దృశ్యం 7). మాక్డఫ్, మేక్బెత్ను ఎదుర్కొని యుద్ధం చేయవలసిందని పిలుస్తాడు. మేక్బెత్ అతనితో తనది దివ్యశరీరమనీ, తాను స్త్రీకి జన్మించిన వాడికెవడికీ లొంగనని అంటాడు. సమాధానంగా మాక్డఫ్ తాను తల్లి గర్భాన సామాన్యరీతిని జన్మించలేదనీ, కనుక యుద్ధమైనా చేయవలసింది, లేకపోతే ఒక క్రూరజంతువులాగా అందరిముందూ ప్రదర్శించటానికి పనికివచ్చేటట్లు లొంగిపోవలసింది అని మేక్బెత్తో అంటాడు. అప్పుడు కోపాన్ని తెచ్చుకొని మేక్బెత్ పోరాడటానికి పైబడగా, మాక్డఫ్ అతణ్ణి హతమారుస్తాడు. విజయాన్ని చేకొన్న మాల్కొం పక్షంలోని వీరులందరూ యుద్ధభూమిలో సమావేశమై ఉండగా, మేక్బెత్ శిరస్సుతో మాక్డఫ్ ప్రవేశిస్తాడు. అందరూ మాల్కొంను స్కాట్లండుకు రాజువని ప్రకటిస్తారు (దృశ్యం 8). పాత్రలు - పురుషులు మేక్బెత్ మేక్బెత్ హృదయరహితుడు. అత్యాశాపరుడైన స్వార్థపరుడు. పశ్చాత్తాపరహితుడైన క్రూరవిద్రోహి. సర్వవిధదుష్కార్యాచరణానికి చాలినంత శారీరకపుష్టి కలవాడు. నైతికచైతన్యం విషయంలో ఆచారభయంచేత తొలుత హత్యావ్యవసాయానికి కొంతగా తట్టాడినా, అత్యాశ ఇచ్చిన దోహదం చేత తట్టుకొని అనన్యసామాన్యహంతకుడై, అసలీతనికి దయాంతఃకరణ లేకోశాన్నైనా ఉన్నవాడేనా అన్న శంకకు తావలమైనవాఁడు. మహాకవి షేక్స్పియర్ మేక్బెత్ను కథాగమనాన్ని అనుసరించి పరిణమిస్తూ వచ్చిన పాత్రనుగా చిత్రించి, మానసికపరిశీలనకు మహోదాహరణంగా రూపించాడన్న 345 విమర్శకాభిప్రాయమొక టున్నది. మేక్బెత్ సహజంగానే దుష్టబుద్ధి, మూర్తీభవించిన క్రౌర్యం అన్న అభిప్రాయం కలిగినప్పుడు పునరాలోచనలో కాడేమో అనిపిస్తుంది. సహజంగానే అతడు క్రూరుడు, దుష్టబుద్ధి అయి ఉన్నట్లయితే మేక్బెత్ ప్రభ్వి అతణ్ణి గురించి "మీ ప్రకృతి దాక్షిణ్యక్షీరరసంతో పరిపూరితమైంది” అని అనటం ఎలా సంభవిస్తుంది? విప్లవాన్ని అణచివేసే సందర్భంలో అతడు ప్రదర్శించిన వీరగుణాలకు ముగ్ధులై, సాటియోధులు అతణ్ణి ఘనంగా మహోదాత్తుడని ప్రశంసించటం గూడా పొసగదు. ప్రకృతితః మేక్బెత్ మంచికి గాని, చెడుగుకు గాని తీవ్రరూపం పరిణమించగల తీక్షచైతన్యం గలవాడనీ, స్థితిగతులనుబట్టి పరమక్రూరుడుగా పరివర్తన పొందాడనీ భావించవలసి ఉంటుంది. అంటే ఇతని ప్రకృతిలో తొలుతనే సద్గుణదుర్గుణాలు రెండూ బీజరూపంలో ఉండి, కాలక్రమాన దుర్గుణాలకు ప్రాబల్యం హెచ్చి దుర్గుణుడుగాను, తుదకు నీచుడుగాను తీర్చిదిద్దటం జరిగిందన్నమాట. నాటకారంభదశలో మేక్బెల్లో గోచరించే సద్గుణాలలో ప్రథమతః మనదృష్టినాకర్షించే గుణవిశేషం అతని సాహసం. యుద్ధభూమిలో అతడు మేక్డొనాల్డు, స్వెనోలతో పోరాడేటప్పుడు ప్రదర్శించిన వీరగుణవిశేషాన్ని స్వయంగా చూసివచ్చిన సార్జెంటు, "సాహసానికి సార్థకనాముడైన మేక్బెత్ అదృష్టాన్ని ధిక్కరించి పరాక్రమానికి ప్రియపుత్రుడో అన్నట్లు నిహతుల రక్తధారలతో పంకిలమైన నిస్త్రింశిక సహాయాన త్రోవ చేసుకొంటూ ఆ బానిసను ముఖాముఖిగా, ఎదుర్కొనేటంతవరకూ చొచ్చుకొనిపోయినాడు” అని వర్ణించాడు. రాస్ అతణ్ణి 'బెల్లోనావరుడని ప్రశంసించాడు. మేక్బెత్ వీర గుణానికి అతడే తన్ను గురించి చెప్పుకొంటూ "వీడు పురుషుడు అని అనిపించుకోటానికి ప్రమాణమెంతో అంతా చేసితీరుతాను” అన్న వాక్యాలు ఉపోద్బలకాలుగా కనిపిస్తున్నవి. అతని ప్రకృతి బాగా ఎరిగిన మేక్బెత్ ప్రభ్వి, మేక్బెత్ను గురించి అతడు దయాగుణవిశిష్టుడనీ, అందువల్లనే సన్నిహితమార్గంలో రాజ్యాన్ని సంపాదించటానికి అతడు అంగీకరించలేడని అన్నది. కానీ ఈ దయాగుణం అతడు మంత్రగత్తెలను కలుసుకున్న తరువాత పూర్తిగా లోపించటమే కాకుండా, అతనిలో ఉన్న దుష్టశక్తుల నన్నింటినీ బహిర్గతం చేసింది. సాహసానికి తరువాత మనను విశేషంగా ఆకర్షించే మేక్బెత్ గుణవిశేషం అత్యాశ. ఈ అత్యాశవల్ల జనించిన దురూహలు బహుకాలం నుంచీ అతనిలో ఉన్నప్పటికీ "మేక్బెత్, భవిష్యన్మహారాజా!" అని మంత్రగత్తెలు అతడికి జయవెట్టినప్పటినుంచి అవి బయటపడటం ప్రారంభించాయి. 346 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మంత్రగత్తెలు జయవెట్టినప్పుడు అతడు తొలుత చలించి బెదరటం ప్రారంభించాడు. దాన్నిగురించి బాంకో "ఇంతటి ప్రియమైన వార్త విన్నప్పుడు ఇలా బెదురుతున్నారేమిటి?" అని ప్రశ్నించినపుడు, అతని దుష్టచిత్తం ఒక్కమాటుగా తన రహస్యం బయటపడ్డదో అన్నట్లు చకితమైనదన్నమాట! డంకన్ రాజు అతణ్ణి "కౌడర్ థేనును చేశా" డని విన్న తరువాత, మేక్బెత్ ఆశాపరత స్వేచ్ఛాసంచారం చేసింది. అతడి భావవీథిలో డంకన్ హత్యాకాంక్ష స్ఫురించి ఒకమారు భయపెట్టింది. అత్యాశాపరుడైన మేక్బెత్కు ఈ హత్యాకాంక్ష అప్పుడు కలిగింది కాదు. మేక్బెత్ ప్రభ్వి సంభాషణవల్ల (అం I దృ 7) అది ఎన్నడో కలిగినట్లు, భార్యాభర్తల మధ్య దానిని గూర్చి చర్చలు జరిగినట్లు అవగతమౌతున్నది. డంకన్ రాజు తన కుమారుడైన మాల్కొంను కంబర్లాండు యువరాజుగా నియమించినప్పుడు, మేక్బెత్ ఆశాపరత్వానికి లక్ష్యమైన సింహాసన సంపాదనకు నిశ్చితసాధనమైన హత్య కంటిముందు పొడకట్టింది. “నేను సింహాసనాన్ని అధిరోహించే విషయంలో నా మార్గమధ్యాన ఒకమెట్టు ఏర్పడింది. నేను దీన్ని తట్టుకొనిపడవచ్చు లేదా దుమికి బయటపడవచ్చు. ఓ తారకల్లారా! మీ మీ తేజాలను తిరోహితాలు చెయ్యండి!! కలుషాలైన నా రహస్యాకాంక్షలను బయటపెట్టకండి!" అని మేక్బెత్ అనటం లక్ష్యసిద్ధికోసం అప్పుడే అతడు అమూల్యాలైన సర్వమూల్యాలను, సర్వనైతిక సూత్రాలను పరిత్యజించాడని వ్యక్తం చేస్తున్నది. డంకన్ హత్యకు తన అత్యాశ తప్ప అన్యమైన బలవత్తరకారణం ఏమీలేదని అతడికి బాగా తెలుసును. హత్యా నిర్ణయ విషయంలో అతడు కొంత ఆందోళనను, వ్యాకులపాటును ప్రదర్శించటం ధర్మభీతి వల్ల కాదు! మంచిచెడ్డల మధ్య మనస్సులో కలిగిన మథనవల్ల అంతకంటే కాదు. అదంతా బయటపడిపోతామేమోనన్న భయభావం వల్ల పడ్డ యాతన. ప్రథమాంకంలోని ఏడో దృశ్యంలో కనిపించే దీర్ఘమైన మేక్బెత్ స్వగతాన్నంతటినీ ఇందుకు ప్రధానోదాహరణగా గ్రహించవచ్చు. అందువల్లనే డౌడన్ మహాశయుడు "మేక్బెత్ తన్నొక బండవానిగను, నీచదోషిగను రూపొందించుకొనగల మంచితనాన్ని నిల్పుకొన్నాడేగాని, దోషం నుంచి దూరునిగా నిల్పగలిగినంత మంచితనాన్ని వహించలేకపోయినాడు" అని అనాడు. మేక్బెత్ విశ్వాసఘాతుకుడు. ఈ గుణవిశేషం అతనికి తొలుత భీతిని కలిగించింది. డంకన్ ను హత్యచేసే విషయంలో అతడు మొదట కలిగిన ఉద్దేశాన్ని మానివేయటానికి సగంవరకూ నిశ్చయం చేశాడు. కానీ అతడు తన భార్యను కలుసుకొన్న తరువాత, 347 ఆమె అతని లోపాలను ఎరిగింది కనుక అతణ్ణి శక్తిహీనుడవని, స్థిరనిశ్చయుడవు కావనీ, భీరువువనీ నిందించి లొంగదీసింది. అతనికి సమయం, స్థలం ఎంతో అనుకూలంగా ఉండటాన్ని నచ్చచెప్పి నమ్మించటంతో అతడు పడిపోయి విశ్వాసఘాతుక కృత్యానికి అంగీకరించాడు. అపార గౌరవాలతో తనను బహూకరించి, నమ్మి తన గృహానికి అతిథిగా విచ్చేసిన మహారాజును ఆత్మ బంధువులు, హత్య చేయటానికి నిశ్చయించి "నా మనసిప్పుడు కుదుటబడ్డది. నేనిక నా సర్వావయవాలను ఈ దారుణచర్యకనుకూలంగా దిద్దుకొంటాను. ఆనందాభినయంతో కాలాన్ని హసించి మోసగిద్దాం. క్రూరహృదయం భావించే ఘోరచర్యలను మోసకారియైన ముఖం మరుగుపరచవలసి ఉంది" అని అంటాడు. విశ్వాసఘాతుకుడై డంకన్ ను హత్యచేసి, రాజ్యాపహరణంవల్ల తన అత్యాశాఫలమైన సార్వభౌమత్వాన్ని సంపాదించిననాటినుంచీ, మేక్బెత్ శీలం పరివర్తన పొందటం ఆరంభించింది. ఆ స్థితిలో అతని హృదయంలో మంచిచెడుల మధ్య సంఘర్షణ లేదు. బయటపడిపోతానేమో అన్న భయంవల్ల కలిగే జంకు పొడచూపటం మానివేసింది. భార్యయైన మేక్బెత్ ప్రభ్వి కఠిన వాక్యాలతో పదేపదిగా ఉద్బోధించవలసిన అవసరం తప్పింది. రక్తదాహం అయినప్పుడల్లా, ఊహాపోహలమధ్య ఉర్రూతలూగ కుండానే స్థిరశక్తితో నిర్ణయాలను చేసి నిర్వర్తించాడు. బాంకో హత్యగాని, మాక్డఫ్ కుటుంబహత్యగాని అతనికి అణుమాత్రమైన సంశయాన్ని కూడా కల్పింపలేదు. పరమదౌష్ట్యంవల్ల బండబారిన వ్యక్తిలా ప్రవర్తించాడు. రక్తపాతం అతని జీవితానికి ఒక రక్ష అయినట్లు, ఒక వ్యసనమైనట్లు, తీవ్రవిదాహంతో అతడు ఆటవికమైన హత్యాకాండను కొనసాగించాడు. నిరాశను కవచంగా చేసుకొని సమస్తం ఛాయాస్వరూపం, అసత్యమని అతడు వింత సిద్ధాంతాన్ని ప్రతిపాదించనారంభించాడు. అతడు ఎంత చేసినా మనకు అతని యెడ ఒక దయ ఎందుకో ఉండనే ఉంటున్నది. ఇది బహుశా జన్మతః సైనికుడై అతడు తొలుత ప్రదర్శించి సాహసగుణం వల్లనై ఉంటుంది. మోసగింపబడ్డ అతడు పశ్చాత్తాపాన్ని గాని ప్రకటింపకుండా సర్వాన్నీ ఎదుర్కొంటున్నప్పుడు, అతని సాహసం మనను ఆకర్షిస్తున్నది. సాహసి. సమరయోధుడు, రాజుకు సన్నిహితబంధువు, సదవకాశాలెన్నో కలవాడు అయిన ఈ మేక్బెత్ సక్రమంగా జీవించివుంటే, సకలశ్రేష్ఠుడన్న ప్రపంచవిఖ్యాతి గడించేవాడు. నైతికచిత్త స్థైర్యం లేకపోవటంవల్ల అత్యాశ విజృంభించి అతణ్ణి అధఃపతితుని చేసింది. 348 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మేక్బెత్ గొప్ప భావుకుడు. అతని భావుకత నాటకంలో సర్వేసర్వత్ర గోచరిస్తుంది. డంకన్ హత్యకు పూర్వం రక్తచిహ్నితమైన ఛురిక కన్పించటం, హత్యానంతరం కొన్ని కంఠాలు వినిపించటం, బాంకో ప్రేతమూర్తిని విందువేళ అతడొక్కడే చూడటం మొదలైనవన్నీ ఇందుకు నిదర్శనాలు. మేక్బెత్ భావుకతలో సుస్పష్టత, తీవ్రత రెండూ ఉన్నవి. ఈ రెండు గుణాలవల్ల అతని భావుకత అతడికి మానవాతీతశక్తులతో సంబంధాన్ని కల్పించింది. అతని బలానికి గాని, భయానికిగాని ఈ భావుకతే మూలశక్తి అయింది. ఈ భావుకతే మేక్బెత్ను హృదయంలో క్రూరహంతకుడైన బుద్ధిలో కవి అని అనేటట్లు చేసింది. బాంకో బాంకో మేక్బెత్కు భిన్నమైన ప్రకృతి గల పాత్ర. అతనివలె మహాయోధుడు. విప్లవాన్ని అణచటంలో అతడితో తుల్యంగా కృషి చేసినవాడు. ఆశాపరుడే. అయినా ఉదాత్తప్రకృతి గలవాడు. సత్యసంధుడైన ఇతణ్ణి మంత్రగత్తెల మాటలు రాజవిద్రోహబుద్దిని కల్పించి మోసగించపోయినవి. అత్యాశాపరత్వం వల్ల మేక్బెత్ మంత్రగత్తెల మాటలు విన్న మరుక్షణంలోనే విద్రోహభావాలకు జన్మభూమి అయిపోయి విపరీతోద్రేకాన్ని పొందినప్పుడు, బాంకో పరిపూర్ణమైన స్థిరచిత్తంతో వర్తించాడు. “నేను మీ ఆదరాన్ని అర్థించేవాణ్ణి కాను మీరు అసహ్యించుకుంటే అంతకంటే జంకేవాణ్ణి కాను” అని పలికి మంత్రగత్తెలను తనతో మాటాడవలసిందిగా శాసించాడు. మంత్రగత్తెల మాటలు మేక్బెత్ను ఎంతగా తారుమారు చేశాయో గమనించి, “ప్రబలమైన ఆపదలను కల్పించబోయేముందు ప్రధానాంశాలలో మనను మోసగించటంకోసం, కొంత విశ్వాసం కుదరటానికని సైతానుకు ప్రతినిధులైన యీ మంత్రగత్తెలు స్వల్పవిషయాల వల్ల సత్యం చెప్పటం తరచుగా జరుగుతుంటుంది" అని దురాశ గాని, దురాలోచనలు గాని కలిగి ఉంటే, తొలగించుకోటం మంచిదని బాంకో మేక్బెత్కు సూచించాడు. ఈతడు ఆద్యంతాలు ఒకేరీతిగా తన ఉదాత్తప్రకృతిని ప్రదర్శించాడు. ఈతని ఉదాత్తప్రకృతిలోని 'రాజసం' తనను కేవలం కౌగిలించుకొని తన సహచరుడైన మేక్బెతు బిరుదు అధికారాన్ని ఇచ్చినప్పుడు, ఎట్టి ఈర్ష్యాసూయలను వహించకుండా సహించి, రాజు యెడ, మేక్బెత్ ఎడ ఉదారంగా ప్రవర్తించటంలో విశేషంగా వ్యక్తమౌతున్నది. ఈ సందర్భంలో లోలోపల ఇతని ప్రకృతిని గురించి మేక్బెత్ ఈర్ష్య వహిస్తున్నప్పుడు, ఈ బాంకో మేక్బెత్ను గురించి రాజుతో గొప్పగా చెప్పటం గొప్ప విషయం. మంత్రగత్తెలు 'నీవు ఒక రాజవంశపరంపరకు మూలకర్త నౌతా" వన్నప్పుడు 349 ఆశ కలిగినా వారిజోస్యాన్ని అతడు గాఢంగా పట్టించుకోకపోవటంవల్ల, అది ఈతని దృష్టిని తాత్కాలికంగా ఆకర్షించటం తప్ప మరేమీ చేయలేకపోయిందని స్పష్టమౌతున్నది. ఆశ కలవాడే అయినా బాంకో వశీకృతచిత్తుడు. అన్ని ప్రలోభాలను సంయమనంతో ఎదుర్కొన్నాడు. పాపపుటూహలు కలగకుండా ఉండటానికని ఇతడు నిద్రతో గూడా పోరాడవలసివచ్చింది. "సీసంలా బరువైన నిద్ర నన్నాహ్వానిస్తున్నది. కానీ నాకు నిద్రపోవాలని లేదు. నిద్రావేళ కలల్లో కూడా దయాన్వితాలైన దివ్యశక్తులు పాపపుటూహలనుంచీ నన్ను దూరం చేయుగాక!" అని ఇతడు మనఃపూర్వకంగా వాంఛించటం ఈతని సత్యసంధతకు చక్కని నిదర్శనం. మేక్బెత్ కూడా ఇతణ్ణి ప్రలోభపెట్టటానికి "నేను రూపొందించుకొన్న పథకానికి కార్యరూపాన్ని కల్పించటంలో నీవు సాయపడితే ఆ చర్య నీకు గౌరవాన్ని తెచ్చిపెట్టేటట్లు నేను చూస్తాను" అన్నాడు. అప్పుడు బాంకో “అయితే నేను దోషరహితమైన చిత్తం కలవాణ్ణి. నా రాజభక్తి అమలినమైంది. అధికగౌరవాన్ని అన్వేషించటంలో ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా ఉండేటట్లయితే, నేను మీకు తప్పక తోడ్పడుతాను" అని చెప్పటంలో హృదయస్వచ్ఛతతో పాటు పరేంగితజ్ఞత గూడా వ్యక్తమౌతున్నది. మేక్బెత్ రాజును హత్య చేసిన తరువాత, బాంకో మేక్బెత్ను అనుమానించాడు. కానీ మాల్కొండొనాల్బెయిను, పారిపోయినా తాను దేశంలోనే ఉన్నాడు. క్రొత్తరాజైన మేక్బెత్క తన భక్తివిశ్వాసాలను ప్రకటించటంలో వ్యతిరేకతను చూపలేదు. అయితే చేష్టల్లో, మాటల్లో అతిజాగరూకతను వహిస్తూ వచ్చాడు. కానీ ఇతడు తన శరీర రక్షణ విషయంలో ఆలోచన చేసి ఒక నిశ్చయానికి శ్రద్ధవహించకపోవటం ఇతని ప్రధానదోషం. దీన్ని 'అకర్మ' అనవచ్చు. ఇటువంటి అకర్మవల్లను, రాజభక్తి ప్రదర్శన వల్లనే మేక్బెత్కు నమ్మకం కల్పించి అతణ్ణి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించనిస్తే, తన వంశరాజపరంపర రావటానికి అవకాశం కల్పించినవాడి నౌతానన్న అభిప్రాయంతో, బాంకో ఇట్టి ప్రవర్తనను ప్రదర్శించాడా? 'అయితే ఆ కిరీటం నీ వంశంలో నిలువదనీ, నేను అనేకరాజులకు మూలపురుషు డనౌతాననీ వారు జోస్యం చెప్పారు. నీ విషయంలో వారి జోస్యాలు చిత్రరీతిన నిరూపితాలైనాయి. నా విషయంలోకూడా ఎందుకు సత్యాలు కాకూడదు?' (అం I దృI) అన్న బాంకో మాటలవల్ల, తాను రాజపరంపరకు మూలకర్తనౌతానన్న ఆశమాత్రముండదని వ్యక్తమౌతున్నది. ముందు రానున్న ప్రయోజనం కోసం ఇతఁడు మేక్బెత్ కత్తిని ఎదుర్కోటానికి పూనుకొని ఉండకపోవచ్చు. అయితే ఈ 'అకర్మ', 'అశ్రద్ధ'లే బాంకో అంతానికి 350 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 I దారితీశాయి. "ఇలాగే నీ విషయంలో వారి వచనాలు నిరూపితసత్యాలై భాసించినట్లు నా విషయంలో కూడా ఎందుకు సత్యాలు కాకూడదు? అవి నాకెందుకు ఆశలు కల్పించకూడదు?" (అం దృ1) ఇత్యాది వాక్యాలవల్ల మేక్బెత్ను బాంకో సమయం చూసి హత్య చేయటానికి ఉద్దేశించాడనీ, అందువల్ల మానసికంగా అతడు దోషి అనీ, ఆ దోషానికే మృత్యువు పాలవటమనే శిక్షను అనుభవించవలసి వచ్చిందనీ ఒక అభిప్రాయం ఉంది. మంత్రగత్తెల జోస్యాలకు పరిపూర్తిని కల్పించటంకోసం మహాపురుషుడైన మహారాజును మేక్బెత్ హత్య చేశాడా అన్న క్రోధం వల్ల, ఒకవేళ తాత్కాలికంగా మేక్బెత్ను నేను హత్య చేస్తేనో అన్న భావం తోచినా, సంయమనశక్తి గల బాంకో, పునరాలోచనలో సర్దుకోగలిగినవాడు. మేక్బెత్కు భిన్నప్రకృతిగా బాంకోను సృష్టించదలచుకొన్న షేక్స్పియర్ భవిష్యత్తులో హత్య చేయనుద్దేశించి కాలంకోసం కనిపెట్టుకొన్న ఒక హంతకుణ్ణిబాంకో పాత్రమూలంగా ప్రదర్శించటం ఉద్దేశం కూడా కాదు. మాక్డఫ్ తొలి దృశ్యాలలో మాక్డఫ్కు విశేషప్రాముఖ్యం లేదు. బాంకోవధకు తరువాత కథలో ఇతనికి ప్రముఖస్థానం లభ్యమైంది. వివేచనజ్ఞానం, దూరదృష్టి, విస్పష్టదర్శనం కలవాఁడు. సత్యసంధుఁడు, దేశభక్తుడు, రాజభక్తుడు, ప్రేమపూరితహృదయుడు, ఉదాత్తుడు. ఈతని నైతికాధిక్యాన్ని గమనించి మేక్బెత్ భయపడటం, అసహ్యించుకోవటం ఇతని గొప్పదనానికి నిదర్శనాలు. డంకన్ రాజు శరీరం ఇతని దృష్టిలో పవిత్రీకృతమైన ఆలయం, ఆయన హత్యాదృశ్యం ఇతడికి కొంగొత్త గార్డెన్ చేసిన చర్యలా తోచింది. మొదట ఇతడు, డంకన్ రాజుపుత్రులైన మాల్కొం, డోనాల్బెయిన్లే పరిచారికులను ప్రేరేపించి యీ పని చేయించి వుంటారని నమ్మాడు. (అంII దృ2). స్వేచ్ఛగా జంకులేకుండా ఆయభిప్రాయాన్ని వెల్లడించాడు. తరువాత ఇతని అనుమానం మేక్బెత్ అనంతరచేష్టల వల్ల అతనిమీదికి తిరిగింది. సత్యం అర్థమైపోయిన తరువాత, ఆ క్రూరనిరంకుశుని పాలనలోనుంచి దేశాన్ని ఉద్దరించాలన్న ఉద్వేగం కలిగింది. ఆవేశంతో భార్యాపుత్రుల స్థితి ఏమౌతుందోనని ఊహించకుండానే ఆంగ్లదేశానికి వెళ్ళి, ప్రభుపుత్రుడైన మాల్కొంను కలుసుకొన్నాడు ఇంతకుపూర్వమే మేక్బెత్ ద్రోహి అని విశ్వసించిన తరువాత, అతని కిరీటధారణోత్సవానికి వెళ్ళటం మానివేశాడు. వచ్చి కలుసుకోవలసిందని 'క్రొత్తరాజు’ వార్త పంపించినా ధైర్యసాహసాలు గల ఇతడు వెళ్లటం మానివేశాడు. 351 మాక్డఫ్ ప్రభువు ఏ పని చేసినా ఉద్రేకంతో, తొందరపాటుతో చేస్తుంటాడు. అంతవరకూ అతిజాగరూకతతో ఉన్నవాడు, హఠాత్తుగా తరువాత తన కుటుంబపరిస్థితి ఏమౌతుందో ఆలోచించుకోకుండా ఆంగ్లదేశానికి పారిపోవటం అటువంటి చర్యల్లో ప్రముఖమైంది. కొందరు దీనికి అతని పిరికితనం కారణమన్నారు. కానీ కథాగమనంలోని ఈతని చర్యలను పరికిస్తే ఇతడు పిరికివాడని అనటానికి అవకాశం లేదు. ఈ సమయంలోని ఈతని ప్రవర్తన ఇతని భార్యకే అర్థం కాలేదు. ఆమెకు ఉన్మాదకృత్యంగా తోచింది. "భార్యాబిడ్డలను, సౌధాలను, ఇతరాలైన ఆస్తిపాస్తులను ఎక్కడనుంచి తాము పారిపోతున్నారో ఆ ప్రదేశంలోనే విడిచిపుచ్చటం వివేకంతో చేసిన పనా? వారికి మేమంటే ప్రేమ లేదు. ఇదంతా వారికోసమైన భయమేగాని, ఇతరుల కోసమైన ప్రేమ మాత్రం కాదు" (అంIV దృI) అని అనుకొన్నది. మాక్డఫ్ ఆంగ్లదేశానికి పారిపోవటం అతిశయమైన రాజభక్తితోను, దేశభక్తితోను చేసిన పని. దేశంనుంచి వెంటనే వెళ్ళిపోతేగాని తనకు, దేశానికి క్షేమంలేదని ఇతనికి సద్య స్ఫురణగా తోచింది. భార్యాపుత్రులను వెంట తీసుకొనిపోయే అవకాశం అందువల్ల లేకపోయింది. మాల్కొంను కలుసుకున్నపుడు అతడు ఇతణ్ణి శత్రువునకు గూఢచారి అన్నభావంతో పరీక్ష ప్రారంభించాడు. ఇతడు ఉద్వేగంతో నైతికోన్నతిని, నిష్కాపట్యాన్ని ప్రదర్శించి అతని పరీక్షలకు తట్టుకొన్నాడు. మహారాజుల కుండవలసిన సద్గుణాలు తనకు లేవనీ, తాను మూర్తీభవించిన ఈర్ష్యాకామక్రోధాలేనని మాల్కొం చెప్పినపుడు, ఈ మాక్డఫ్ మహోదార శోకవివశత్వంతో "రక్తంలో మునిగితేలుతున్న రాజదండంతో, సింహాసనాన్ని కాజేసిన ఒక క్రూరనిరంకుశ రాజ్యాపహర్త పరిపాలనకు లోనైన ఓ నా దేశమా! నీవెంతటి దీనావస్థ ననుభవిస్తున్నావు! సత్యమైన నీ రాజవంశంలోని వారసుడు తనయెడ తానే దోషారోపణం చేసుకొని తనరాజవంశాన్ని నిందిస్తున్నాడు" మొదలైన వాక్యాలతో ఇతడు మాల్కొం హృదయాన్ని ఆకర్షించి, అతణ్ణి అనుమాన రహితుణ్ణి చేయడం ఉద్వేగపూరితమైన సంభాషణవిరచనానికి ఉత్తమమైన ఉదాహరణలలో ఒకటి. మాల్కొం దేశోద్ధరణకు పూనుకుంటానని మాట ఇచ్చినపుడు పట్టరాని సంతోషం కలిగి ఇతడు మూకత వహించాడు. కారణమేమని ప్రశ్నిస్తే "ప్రియాలు అప్రియాలు అయిన అంశాలు ఏకకాలంలో ఇలా వచ్చినపుడు, ఎలా సమన్వయించుకోవాలో నాకు తెలియటంలేదని సంతోషపరవశత్వంతో పలికాడు. ఈ సంతోషం బహుకాలం నిలువకుండానే, ఇతడు రాసవల్ల తన భార్యాపుత్రుల వధను గురించి వినవలసి వచ్చింది. తన లోపం వల్ల 352 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 వారు దారుణహత్యాకాండకు పాల్పడ్డందుకు ఇతడు ఎంతగానో దుఃఖించాడు. 'పరమేశ్వరుడు వారికి శాంతిని ప్రసాదించుగాక!' అని ప్రార్థించాడు. ఇది మాక్డఫ్ ప్రభువు ప్రేమహృదయాన్ని వ్యక్తం చేస్తున్నది. 'స్కాట్లండు దేశానికి పిశాచమై పట్టుకున్న ద్రోహి ఐన మేక్బెత్ను యుద్ధభూమిలో తనకు ముఖాముఖిగా నిలిచేటట్లు చెయ్య' మని భగవంతుణ్ణి ప్రార్తించాడు. “తప్పించుకొంటే అతణ్ణి నేను క్షమిస్తా" నని ఔదార్యంతో పలికాడు. ఇతఁడు యుద్ధభూమిలో మేకెత్తో 'నేను కార్యప్రధానుడను గాని వాక్య ప్రధానుడనుకా' నన్నాడు. అల్పవాక్యాలను పలికినా అతిశక్తిమంతంగా పలుకగలవాఁడు. సామాన్యంగా కొలదిగా మాటాడినా ఉద్వేగం వచ్చినపుడు పొంగులువారి ప్రసంగించగలడు. మాల్కొం తిరస్కరించినపుడు, రాసవల్ల భార్యాపుత్రుల వధనుగూర్చి విన్నపుడు ఇతడు ఇటువంటి సంభాషణలు చేశాడు. ఒక ఉద్బోధకముంటే గాని ఇతడు తీవ్రకార్యాచరణకు పూనుకొనే స్వభావం కలవాడు కాదు గనుక, మహాకవి షేక్స్పియర్ ఇతని కుటుంబవధతో దాన్ని కల్పించాడు. ఇతడు బాంకో వలె సమయానికి తగ్గట్లు కట్టుబడిపోయేవాడు కాదు. కాలాన్ని ఎదుర్కొని కాపట్యం లేని చిత్తంతో మంచిత్రోవను పెట్టటానికి, ఎట్టి కష్టాన్నైనా భరించి పోరాడగల వీరోదారుడు. మేక్బెత్ వలె కార్యప్రధానుడు. కానీ మరిన్ని మాటలు పలకడు. మంచిమార్గం తప్పడు. మేక్బెత్ ప్రభ్వి మేక్బెత్ ప్రభ్వి షేక్స్పియర్ మహాకవి సృష్టించిన స్త్రీ ప్రపంచమంతటితో తన అత్యాశాపరత్వం, కాపట్యం, క్రౌర్యం ఇత్యాదిగుణవిశేషాలతో ఒక విశిష్టస్థానాన్ని గడించుకొన్న వ్యక్తి. అయితే ఈమె స్త్రీప్రకృతులు పరిపూర్ణంగా లోపించిన వ్యక్తి కాదు. కాని వాటినీమె తన కాంక్షాబలంతో కట్టిపడవేసింది. తన దృష్ట్యా ఈమె పత్నిగా అత్యుత్తమురాలు. పరిపూర్ణురాలు. భర్త నతిగాఢంగా ప్రేమించింది. అతణ్ణి గౌరవించింది. స్వార్థరాహిత్యంతో అతనికోసం జీవించింది. ఆమె ఆశాపరత్వం సర్వం అతనికోసమే. అతని మూలంగానే తన ఉన్నతిని ఆశించింది. వస్తుతః మేక్బెత్ ప్రభ్వి భర్తకంటే అతిశయమైన ఇచ్ఛాబలం కలది. భర్త అయిన మేక్బెత్ అనుమానాలకు లోనై, తన శక్తిసామర్థ్యాలమీద గాఢవిశ్వాసం లేని స్థితిలో, ఈమె చిత్తస్తిమితతను ప్రదర్శించింది. మంత్రగత్తెలతో సమావేశమైన తరువాత భర్త తిరిగివచ్చి తన్ను కలుసుకొని ప్రసంగించటానికి పూర్వమే, లేఖను చదివిన వెంటనే ఈమె డంకన్ హత్యోద్యోగాన్ని ఊహించి సంసిద్ధురాలై ఉంది. ఈ అంశాన్ని మేక్బెత్ లీలగానైనా పసిగట్టలేకపోయినాఁడు. 353 భర్త పంపించిన లేఖను చదివిన వెంటనే "మీరు ఇప్పటికే గ్లామిస్కు ధేనులైనారు! కౌడర్కు థేనులైనారు. మంత్రగత్తెలు జోస్యం చెప్పినట్లు మున్ముందు మహారాజులు కూడా ఐతీరుతారు” అన్న వాక్యాలు తన ఈమె మనోనిశ్చయదృఢిమ ఎంతటి గాఢమైందో వ్యక్తం చేస్తున్నవి. మేక్బెత్ ప్రభ్వికి శక్తి యెంతో తెలుసును. ఆ శక్తిమీద ఆమెకు అధికవిశ్వాసముంది. భర్త దుర్బలచిత్తం మీద తన కెంతటి ప్రభావం ఉందో కూడా ఆమెకు తెలుసు. "మీ శ్రవణేంద్రియాలను నిరంతరం ఉత్సాహంతో నింపివేస్తూ, వీరోచిత వాక్రసంగాలతో దైవానుగ్రహం, అదృష్టశక్తులూ నిర్ణయించి యిచ్చిన స్వర్ణకిరీటానికీ, మీకూ మధ్య ఆటంకంగా నిలుస్తున్న మీ ప్రకృతిలోని వెనకాడటమనే గుణాన్ని వెంటబడి తరిమి వేస్తాను!" అన్న వాక్యాలిందుకు నిదర్శనాలు. “మానవులమనోభావాలను వెన్నంటి ఉండే ఓ అదృష్టశక్తుల్లారా! రండి! నాలోని స్త్రీత్వాన్ని తొలగించండి!" అన్న వాక్యాలు మేక్బెత్ను తొలిసారిగా ఆహ్వానిస్తూ పలికిన "ఘనుడా! గ్లామిస్ యోగ్యుడా కౌడర్!! అనతికాలంలో మీకబ్బనున్న బిరుదంతో మిమ్మల్ని ఆహ్వానించటానికి అంగీకరించండి” అన్న వాక్యాలు, ఈమె మేక్బెత్ రాకకు పూర్వమే డంకన్ హత్యాపథకాన్ని ఊహించి చిత్తంలో స్థిరం చేసుకొన్నట్లు ద్యోతకం చేస్తున్నవి. తాను సూచించిన మార్గాన్ని గురించి అనుమానిస్తూ తట్టాడుతున్నప్పుడు, రెండో పర్యాయం మేక్బెత్తో ప్రసంగించిన సందర్భంలో "మనకపజయమా? స్థిరనిశ్చయం కలగటానికి మీరు ధైర్యాన్ని చిక్కబడితే చాలు” అని అన్నమాట, యీ మేక్బెత్ ప్రభ్వి అమోఘ స్థిరసంకల్పానికి తార్కాణం. భర్తమీద ఈమె ప్రభావం ఎంత విస్తారమో "భీతచిత్తవుగాని నీ గర్భం మగబిడ్డలను తప్ప మోయలేదు. నీవు పురుషసంతానం మాత్రమే పుట్టదగ్గ తల్లివి” అని మేక్బెత్ అన్న మాటలవల్ల తెలుస్తున్నది. "మిగిలిన వ్యవహారపర్వం నాకు విడిచిపెట్టండి" అని అనటంలో, ఏ భారాన్ని వహిస్తానని భర్తకు మాట యిస్తున్నదో ఈమెకు బాగా తెలుసు. వంచనాశక్తితో డంకన్ హత్య అనే తానాల్లిన పథకాన్ని, తాను తమమీద అనుమానం కలగకుండా నిర్వర్తింపగలనని ఆమెకు గట్టి నమ్మకం. ఒకవంక హత్యోద్యోగానికి సంసిద్ధురాలై, మరోవంక మనోహరకంఠంతో డంకన్ ను అతిథిగా ఆహ్వానించే సందర్భంలో పలికిన స్వాగతవాక్యాలు ఈమె వంచనాశక్తికి ప్రబలనిదర్శనాలు. 354 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఈమె మనఃస్తిమితత నిరుపమానమైంది. హత్యానంతరం భీతచిత్తుడైన భర్త తన దగ్గిరికి వచ్చినపుడు ఆమె అణుమాత్రమైనా చలించకపోవడమే కాకుండా, అతని భయకంపాన్ని సమయోచిత సంభాషణతో త్రోసిపుచ్చటం ఇందుకు చక్కని తార్కాణం. పరిచారకుల ముఖాలను రక్తంతో పులయటం మరిచిపోయి హత్యానంతరం ఛురికలతో తిరిగివచ్చిన భర్తను మళ్ళీ వెళ్ళి ఆ క్రియాభాగాన్ని పూర్తిచేసిరమ్మని ఆజ్ఞాపించినపుడు, అతడు నిరాకరిస్తే, ధైర్యశాంతి నిలయమై "మీ రెంతటి దుర్బలచిత్తులు! ఆ ఛురికలనిలా ఇవ్వండి. నిద్రితులు, మృతులు కేవలం చిత్రరూపాలు. వారిని గురించి ఇంతటి భయమేమిటి?" అని భర్త శక్తిహీనతకు ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతూ, తాను వెళ్ళి ఆ పని నిర్వర్తించి వచ్చింది. తిరిగి వచ్చినపుడు స్వశక్తిని గురించి గాఢవిశ్వాసంతో ప్రసంగించింది. అవతల ద్వారం దగ్గిర శబ్దం వినిపిస్తున్నప్పుడు అణుమాత్రమైనా చిత్తచాంచల్యాన్నిగాని, భయకంపాన్ని గాని ప్రదర్శించక, శయ్యాగృహానికి వెళ్ళమని సలహా చెప్పింది. భర్త దుర్బలత్వాన్ని తెలుసుకొన్నది కనుక, అతనికోసం తేజోవంతురాలైన ఈ మేక్బెత్ ప్రభ్వి పురుషపాత్రను నిర్వహించటానికి పూనుకొన్నది. స్వయంగా ఈమే హత్యాపథకాన్ని నిర్మించింది. పరిచారకులకు మత్తు పెట్టింది. ఛురికలను సిద్ధం చేసింది. హత్యాకృత్యాన్ని కూడా తానే నిర్వహించి ఉండేదిగాని, ఆ డంకన్ రాజు మరణించిన తన తండ్రిలా కనిపించాడు. అందువల్ల తాత్కాలికంగా కొంతసేపు ఆగవలసివచ్చింది. ఇది ఈమెకు తండ్రియెడగల అను రాగానికి నిదర్శనం. భార్యగా ఆమె మేక్బెత్ క్షేమాన్ని, శ్రేయాన్ని శ్రద్ధతో సేవించింది. ఈమె అత్యాశ అంతా అతనికోసమే. “దేనిని పరిపూర్తిచేయటంవల్ల మన కీ దేశం మీద తదనంతరజీవిత కాలమంతా యాజమాన్య సార్వభౌమాధికారాలు దక్కుతాయో ఆ అతిప్రధానమైన వ్యవహారాన్ని నా అధీనం చెయ్యండి” (అం I. దృ5) అన్న వాక్యంలో లీలగా కన్పించే కించిత్తు స్వార్థం తప్ప ఆమె సర్వయత్నమూ భర్త అయిన మేక్బెత్ కోసమే. మేక్బెత్ ప్రభ్వికి సంతానం కలిగారు. కాని ఎవరూ నేడు జీవించిలేదు. అయితే ఈమె "ఈ కార్యనిర్వహణవిషయంలో నేను మీవలె ప్రతిజ్ఞ చేసి వున్నట్లయితే, ఇది తల్లినై స్తన్యపానం చేస్తున్న పసిపాపను ప్రేమించటమంటే ఏమిటో తెలుసుకొన్న తరువాత...” అన్న వాక్యంవల్ల ఈమె మాతృహృదయం ఎటువంటిదో వ్యక్తమౌతున్నది. డంకన్ హత్య జరిగిపోయిన తొలిదశలో ఈమె ప్రశాంతతతో నిశ్చలంగా వర్తించింది. తొలుత దుర్బలుడైన మేక్బెత్ క్రమంగా ధైర్యాన్ని చిక్కబట్టుకొని, 355 మంచిచెడ్డలతో పెట్టుకోకుండా ముందుకు సాగిపోవటం ప్రారంభించాడు. అనుకొన్న ప్రయోజనాలు సిద్ధించకపోవటం అట్లుండగా, భర్తకు కష్టాలు వచ్చిపడి దేశం వినాశనం పాలు గావటంతో, మేక్బెత్ ప్రభ్వి చిత్తస్తిమితత సడలిపోనారంభించింది. ఈమెకు భర్తను అనుసరిస్తూ మానసికోద్రేకాలకు తట్టుకొని నిల్వటానికి శక్తి చాలకపోయింది. అనుకోకుండా వచ్చిపడ్డ బాధలకు ఈమె ఉక్కుగుండె కరిగిపోనారంభించింది. అయినా బాధను అనుభవించే స్థితిలో కూడా, ఈమె కార్యాచరణవేళ ఎట్టి మనోద్రఢిమను ప్రదర్శించిందో దాన్ని వ్యక్తం చేస్తూనే వచ్చింది. నిరంతరం మానసికోద్రేకాలకు నిలయమైపోవడం వల్ల తుదకీ మేక్బెత్ ప్రభ్వి తట్టుకోలేక, భీతచిత్తంలోని రహస్యాలను తెలియకుండానే బయటపెట్టడం ప్రారంభించింది. అసహజమైన ఆమె వంచనాశక్తి నిద్రాగమనవేళ ఆమెను మోసిగించి డంకన్ హత్యారహస్యాలను మాటిమాటికీ వెలిబుచ్చుతూ వచ్చింది. ఒకప్పుడు కొద్దినీటితో తన హత్యాదోషానికి చిహ్నమైన రక్తాన్ని కడిగివేసుకోవచ్చు ననుకొన్న ఈమె, కాలక్రమాన ఆ మచ్చను కడిగివేసుకోలేననీ, దాని వాసన వీడిపోదనీ నిర్ణయించుకున్నది. ఆత్మహత్యతో జీవితాన్ని అంతమొందించుకొని అనంతంగాను అతిశయంగాను, బాధపెట్టే మనోవేదనను అంత మొందించుకొన్నది. “నాలోని స్త్రీత్వాన్ని తొలగించండి. నఖశిఖపర్యంతం నన్ను నిర్భరక్రౌర్యంతో నింపివేయండి" అని అదృష్టశక్తులకు ప్రార్థించి, భర్తను హత్యోద్యోగానికి ఉద్బోధించి ప్రేరకురాలై వర్తించిన ఈ మేక్బెత్ ప్రభ్వి, మొదటినుంచీ స్త్రీగానే ఉండిపోయింది. మానవత్వం ఈమెను వీడలేదు. తన స్త్రీత్వాన్ని తొలగించమని అదృష్టశక్తులను ఆర్థించడమే ఈమె స్త్రీసహజమైన దౌర్బల్యం లేనిది కాదని స్పష్టంగా వ్యక్తం చేస్తున్నది. విందువేళ నుంచీ మనకు ఈమె తాను హత్యాప్రేరకురాలనన్న భావాన్ని దూరం చేస్తూ, ఉదాత్తప్రకృతితో దయనీయురాలనన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నది. కథాంతంలో మాల్కొం ఈమెను గురించి "భూతం వంటి రాజ్ఞి” అన్నాడు. కానీ ఈ మాట అన్నప్పుడు అతడు ఈమె మానసికస్థితిని ఎరగడు. మేక్బెత్ ప్రభ్వి స్త్రీ. చెడ్డ స్త్రీ. కాని భూతం వంటి స్త్రీ మాత్రం కాదు. ఆమె తన్ను గురించి స్త్రీని కానని చెప్పుకొన్నా మరణం వరకు స్త్రీయే! 356 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 పాత్రలు పురుషులు డంకన్ స్కాట్లండు దేశపురాజు మాల్కొం డంకన్ రాజు పుత్రుడు డొనాల్బెయిన్ : 22 మేక్బెత్ బాంకో మాక్డఫ్ లెన్నాక్స్ రాస్ మెంటియథ్ ఆంగస్ కెయిథినెస్ ఫ్లియాన్స్
డంకన్ రాజు సేనాపతి 22 స్కాట్లండులోని ప్రభువులు 22 27 22 22 53 సివర్డు యువ సివర్డు : సైటన్ బాలుడు పుత్రుడు నార్తంబర్లాండు ప్రభువు. ఆంగ్లసేనలకు అధిపతి సివర్డు ప్రభువు కుమారుడు మేక్సెత్కు పార్శ్వచరుడైన ఉద్యోగి మాక్డఫ్ పుత్రుడు ఒక ఆంగ్లవైద్యుడు, ఒక స్కాచ్ వైద్యుడు 357 స్త్రీలు ఒక సార్జెంట్, ఒక ద్వారపాలుడు, ఒక వృద్ధుడు, ప్రభువులు, ఉద్యోగులు, సైనికులు, హంతకులు, పార్శ్వచరులు, వార్తాహరులు, ఛాయామూర్తులు, మేక్బెత్ ప్రభ్వి : రాజ్యాపహర్త అయిన మేక్బెత్ భార్య 358 మాక్డఫ్ ప్రభ్వి ఫైఫుర్గాధిపతికి పత్ని దాసి మేక్బెత్ ప్రభ్వికి అనుచరురాలు హెకేట్ మాంత్రికురాండ్ర దేవతామూర్తి మువ్వురు మాంత్రికురాండ్రు వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ప్రథమాంకం ఒకటో దృశ్యం 1 ఒక మరుభూమి. ఉరుములు, మెరుపులు. మాంత్రికురాండ్రు మువ్వురు ప్రవేశిస్తారు. ప్రథమ మాంత్రికురాలు : మరి మళ్ళీ మనమువ్వురికీ సమావేశమెప్పుడు? ఉరుములు వినిపించేటప్పుడు, మెరుపులు మెరిసేటప్పుడూనా? లేక కుంభవృష్టి కురిసేటప్పుడా? ద్వితీయ మాంత్రికురాలు : ఈ రణకల్లోలం' అణగిన తరువాత. యుద్ధంలో అపజయమో, జయమో నిర్ణీతమైన తరువాత. తృతీయ మాంత్రికురాలు : అది సూర్యాస్తమయవేళకు పూర్వమే తేలిపోతుంది. ప్రథమ మాంత్రికురాలు : అయితే అప్పుడు మన సమావేశానికి స్థలమెక్కడ? ద్వితీయ మాంత్రికురాలు : అక్కడే. ఆ క్షేత్రసీమలో. తృతీయ మాంత్రికురాలు : మేక్బెత్ను కలుసుకోటానికి అక్కడే సమావేశ మౌదాము. ప్రథమ మాంత్రికురాలు : గ్రేమాల్కిన్ '! వస్తున్నా. ద్వితీయ మాంత్రికురాలు : పాడ్డాక్' నన్ను పిలుస్తున్నది. తృతీయ మాంత్రికురాలు : నేనూ వెంటనే వస్తున్నాను. మువ్వురు మాంత్రికురాండ్రు : ఎయ్యది పరులకు మంచో అయ్యది మనకగు చెడుగు ఎయ్యది ఏహ్యమొ యితరులకు అయ్యది ప్రియమగు మనకు 359 నీచు కంపులతో మూడమంచుతో నిండిన నింగిని పయనిద్దాం పద. (నిష్క్రమిస్తారు) రెండో దృశ్యం ఫోర్రెస్ దగ్గిర ఒక శిబిరం. డంకన్, మాల్కొం, డొనాల్బెయిన్, లెన్నాక్స్ పరిచారక వర్గంతో ప్రవేశించి రక్తస్రావంతో వస్తున్న ఒక సార్జెంటు'ను కలుసుకొంటారు. డంకన్ : రక్తస్రావంతో వస్తున్న ఆ వ్యక్తి ఎవరో! అతని దీనిస్థితినిబట్టి అతడు ఇప్పుడే యుద్ధభూమినుంచి వస్తున్నట్లు తోస్తున్నది. విప్లవానికి సంబంధించిన క్రొత్తవార్తలు ఇతడు వినిపించగలడు. మాల్కొం : శత్రువులు నన్ను బందీగా పట్టుకోబోతున్నప్పుడు, పరమ సాహసాన్ని ప్రదర్శించి అత్యుత్తమయోధుడిలా పోరాడింది యీ సార్జెంటే. వీరమూర్తీ, మిత్రమా! నీకిదే స్వాగతం! నీవు విడిచివచ్చినప్పటి రణరంగంలోని విశేషాలేమో రాజుగారికి విన్నవించు. సార్జెంటు : యుద్ధఫలితం కొంతకాలం సంశయాస్పదంగా ఉండిపోయింది. ఎంతో సన్నిహితులుగా ఒకరికొకరు చేరుకొన్నా, వారికళను ప్రయోజనరహితంగా చేసేటంతటి అలసటను పొందిన ఇరువురు ఈతగాండ్రలాగా, ఉభయసైన్యాలు అత్యంత సన్నిహితంగా తారసిల్లాయి. కరుణారహితుడైన మాక్డోన్ వాల్డ్ విప్లవకారుడు కావటానికి ఎంతో యోగ్యత కలవాడు. అందుకు అవసరాలైన అన్ని గుణాలను ప్రకృతి అతడికి ప్రసాదించింది. అవి అతడిలో స్థిరనివాస మేర్పరచుకొని గ్రుడ్లు పోసి కొల్లలౌతున్నవి. అతడికి పశ్చిమ' ద్వీపాలనుంచి లఘ్వాయుధాలైన పదాతిదళాలు, సాయుధాలైన ఆశ్వికదళాలు లభించాయి. ఒక విప్లవకారునికి ఉంపుడుకత్తెలా అయిపోయిన అదృష్టం, అతడు సాగిస్తున్న నీచకలహానికి అనుకూలిస్తూ నవ్వుతున్నది. అయినా అంతా నీరసంగానే ఉంది. సాహసానికి సార్థకనాముడైన మేక్బెత్ అదృష్టాన్ని ధిక్కరించి పరాక్రమానికి ప్రియపుత్రుడో అన్నట్లు, నిహతుల రక్తధారలతో పంకిలమైన నిస్త్రింశిక సహాయాన త్రోవ చేసుకొంటూ ఆ బానిసను ముఖాముఖిగా ఎదుర్కొనేటంతవరకూ చొచ్చుకోపోయినాడు. కరచాలనం చేయటానికిగాని, వీడ్కోలు వాక్యాలు వినిపించటానికి 360 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 గాని కాలహరణం చెయ్యకుండా, అతణ్ణి బొడ్డు దగ్గర నుంచి చెంపదాకా చీల్చి, శిరస్సును మన కోటకొమ్ముకు బిగించాడు. డంకన్ : ఓహో! మాతృస్వశ్రేయా ! వీరసోదరా!! యోగ్యమూర్తీ!! సార్జెంటు : రవి ఏ ప్రాగ్దిశనుంచి ఉదయిస్తున్నాడో ఆ దిక్కే నౌకాభంగాలను కల్పించే తుపానులకు, భీకరాలైన అగ్నిప్రపాతాలకూ పుట్టినిల్లయినట్లు తొలుత ఆనందాస్పదమై తోచిన మేక్డొన్వాల్డు మృతి, పొంగులువారే అసంతృప్తికి ఆలవాలమైంది. గమనించండి! స్కాట్లండు మహాప్రభో! గమనించండి! తమ పక్షాన్ని వహించిన న్యాయం, మేక్బెత్ పరాక్రమమనే కవచాన్ని ధరించి ఆపేరెములు వారే శాత్రవపదాతి దళాన్ని సమరభూమినుంచి తరిమివేసిన మరుక్షణంలోనే, ఆ నార్వేప్రభువుకు స్వలాభం ఏదో గోచరించినట్లుంది. రక్తపంకిలాలు కాక భాసించే శస్త్రాలతోనూ, నూతనంగా వచ్చి చేరిన సైన్యాలతోను మనమీద క్రొత్తముట్టడి ప్రారంభించాడు. డంకన్ : ఈ సంఘటన మన సేనాపతులను భయపెట్టలేదా? సార్జెంటు లేకేం? భయపెట్టింది. తీతువులు డేగలను, కుందేళ్ళు సింహాలను భయపెట్టినట్లు భయపెట్టింది. సత్యం చెప్పవలసివస్తే వారు రెండుమార్లుగా దట్టించి విడిచిన ఫిరంగుల్లా" ప్రవర్తించారు. శత్రువులపైబడి రెండింతలుగా దెబ్బతీయటానికి వారి క్షత్రజధారల్లో స్నానమాడాలని కోరుకోటమో, లేక మరొక గొల్గొతగా 11 జ్ఞాపకముంచుకొనేటట్లు చేయాలని కాంక్షించటమో తప్ప, నాకు మరొక కారణం కన్పించటంలేదు - కానీ నాకు విస్తారమైన అలసట కలుగుతున్నది. వెంటనే చికిత్స జరిగించమని నా గాయాలు మొరపెడుతున్నవి. డంకన్ : నీ గాయాలలాగానే నీ వాక్యాలు కూడా నీ వీరప్రవృత్తికి ఎంతో అనుగుణంగా ఉన్నాయి. అవి రెండూ ఉదాత్తతను సూస్తున్నాయి వెళ్ళండి, ఇతణ్ణి వైద్యులకు ఒప్పచెప్పండి. ఆ వచ్చేదెవరు? (పరిచారకులు వెంటరాగా సార్జెంటు నిష్క్రమిస్తాడు) మాల్కొం : యోగ్యుడైన థేన్, రాస్! లెన్నాక్స్: అబ్బా! అతడి కన్నుల్లో ఎంతటి ఆవేశం ద్యోతకమౌతున్నది! ఏవో విచిత్రవార్తలు కొనివచ్చిన వ్యక్తిలా చూస్తున్నాడు. రాస్ ప్రవేశిస్తాడు. 361 రాస్ : రాజేంద్రుని పరమేశుడు రక్షించుగాక! డంకన్ : ఉదాత్తుడా, థేన్ మహాశయా! నీ రాక ఎక్కడి నుంచి? 13 రాస్ : మహాప్రభూ! ఫైఫ్నుంచి వస్తున్నాను. మన ఆకాశంలో విశృంఖలంగా విహరిస్తూ, నార్వే దేశీయుల పతాకలు మన ప్రజాహృదయాలను శీతలం చేస్తున్న ఫైఫ్నుంచి వస్తున్నాను. రాజద్రోహి ఆ కౌడర్న్ ఇచ్చిన అసంఖ్యాక సైనికసహాయంతో నార్వే ప్రభువు భీకర కదనమారంభించాడు. కానీ అతని ఆ ప్రబలయత్నమంతా వ్యర్థమైపోయింది. సర్వతను త్రాణంతో బెల్లోనావరుడైన 14 మేక్బెత్ తుదకు ముఖాముఖిగా ఎదుర్కొని, బాహాబాహిగా తలపడి పోరాడి, అతడి మదోద్రేకాన్ని అణగద్రొక్కాడు. సంక్షేపంగా చెప్పవలసివస్తే సమరంలో విజయం మనకే సంప్రాప్తించింది. డంకన్ : మహాసంతోషం! రాస్ : ఇప్పుడా నార్వేరాజు స్వెనో సంధికి ప్రాకులాడుతున్నాడు. అందుకు మనం అంగీకరించటం ఇష్టంలేకపోతే, సెంట్" కోల్మిద్వీపందగ్గర మన సైన్యోపయోగం కోసం అతడు పదివేల డాలర్ల ను అర్పించేదాకా అతడి సైన్యాలను పాతిపెడుతూ వుండటానికి మనం అంగీకరించవలసివుంటుంది. - 16 డంకన్ : ఆ కౌడర్ థేన్ మా అనురాగాన్ని అనుభవిస్తూ మాకు ప్రీతిపాత్రాలైన ప్రయోజనాల విషయంలో ద్రోహాన్ని తలపెట్టగలిగే అవకాశం ఇకలేదు. వెళ్ళి, వెంటనే అతనికి మరణశిక్ష విధించానని చెప్పు. అతని పూర్వబిరుదు ప్రశస్తితో మేక్బెత్ను సన్మానించు! రాస్ : తాము సెలవిచ్చినట్లే జరిగిస్తాను. డంకన్ : అతడు కోల్పోయినవాటినన్నిటినీ మేక్బెత్ గెలుచుకొన్నాడు. (నిష్క్రమిస్తారు) మూడో దృశ్యం ఫోర్రెస్ సమీపంలో ఒక క్షేత్రసీమ. ఉరుములు వినిపిస్తుంటాయి. మాంత్రికురాండ్రు మువ్వురు ప్రవేశిస్తారు. ప్రథమ మాంత్రికురాలు: సోదరీ, ఎక్కడకి వెళ్లావు? ద్వితీయ మాంత్రికురాలు : అప్పటినుంచీ వరాహాలను" హతమారుస్తున్నాను. 362 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 తృతీయ మాంత్రికురాలు : సోదరీ, నీవెక్కడికి వెళ్ళావు? ,18 ప్రథమ మాంత్రికురాలు : ఒక నావికుడి పెళ్ళాన్ని కలుసుకొన్నాను. ఆమె ఒళ్ళో అడవి బాదాములు కుప్పబోసుకున్నది. పళ్ళు లేకపోవటం వల్ల ఆమె వాటిని చివుళ్ళతో నములుతున్నది. 'కొన్ని నాకివ్వ'మని అడిగాను. కశ్మలం తినే ఆ గజ్జిముండ 'పో, పోవే మంత్రగత్తే!' అని నన్ను తిట్టి కసిరింది. దాని మొగుడు 'టైగ’" రనే నౌకకు అధిపతిగా ఎలెప్పోకు వెళ్ళాడు. ఇక్కడినుంచే బయలుదేరి నేను సముద్రంమీద ఒక చేటలో ప్రయాణం చేసి తోకలేని ఎలుకలా ఆ నౌకలో ప్రవేశిస్తాను. తప్పక వెళ్ళి తీరుతాను. నా పగ తీర్చుకొంటాను. ద్వితీయ మాంత్రికురాలు : అందుకు నీకు అనుకూలమైన ఒక గాలిని నేనిస్తాను. ప్రథమ మాంత్రికురాలు : సోదరీ! నీవెంతటి దయగలదానివి! తృతీయ మాంత్రికురాలు : నేను నీకు మరొక గాలినిస్తాను. 19 ప్రథమ మాంత్రికురాలు : ఇక మిగిలిన గాలులన్నీ నా అధీనంలోనే ఉన్నాయి. గాలులమీద నాకిటువంటి అధికారం కలిగింది గనుకే వారు చేరే రేవు పట్టణాలన్నిటి మీదా, నావికుని దిక్సూచిఫలకం చూపించే అన్ని దిక్కులమీదా, నాకు అధికారం ఉన్నట్లే. రక్తాన్నంతటినీ ఓడ్చేసి వాణ్ణి ఎండుగడ్డిలా వాడ్చి వేస్తాను. వాడికి రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా చేస్తాను. వాలిపోయే రెప్పలిక వాడి కళ్ళమీద మూతలు పడవు. వాడు బహిష్కృతుడిలా బ్రతకవలసిందే. క్రమంగా వాడు ఎనభై ఒక్కవారాలు కృశించి వాడి వత్తయిపోవలసిందే. వాడి నౌకను సర్వనాశనం చేయటానికి అవకాశం లేదు. అయినా దాన్ని పెనుతుపానుల్లో ఉర్రూతలూగిస్తాను. ఇదిగో, నా దగ్గిర ఉన్నదేమిటో చూడండి! ద్వితీయ మాంత్రికురాలు : ఏదీ, నన్ను చూడనీ. నన్ను చూడనీ! ప్రథమ మాంత్రికురాలు: ఇది ప్రవాసంనుంచి ఇంటికి తిరిగివస్తుండగా పడవ మునిగిపోయిన ఒక కర్ణధారి బొటన వ్రేలు. (లోపలినుంచి దుందుభిధ్వని వినిపిస్తుంది) తృతీయ మాంత్రికురాలు : దుందుభి! దుందుభి!! - అంటే మేక్బెత్ వచ్చేశాడన్నమాట! మాంత్రికురాండ్రు మువ్వురు : విధికి మనం కూతుళ్ళం! 20 వేరు లేని మువ్వురం! 363 అక్కాచెల్లెళ్లం - మన మక్కాచెల్లెళ్ళం!! ఇలా కలిపి చేయి చేయి ఇలమీదను కడలిమీద వేగంగా నటియిస్తూ ఆగక పయనిస్తుంటాం తిరుగుము ముమ్మారు నీవు విధికి మనం... విధికి మనం... తిరిగెద నే మూడుమార్లు సోదరి ముమ్మారు తిరుగ నొదవు పూర్తి తొమ్మిదికి విధికి మనం... ఇక చాలు. ఆపండి. మన మంత్రకవచం పరిపూర్తి పొందింది. మేక్బెత్, బాంకో ప్రవేశిస్తారు. మేక్బెత్ : ఒక సమయంలో ఇంత మంచిగానూ, ఇంకో సమయంలో ఇంత చెడ్డగాను ఉన్న మరోదినాన్ని నేనెన్నడూ చూడలేదు. బాంకో : ఫోర్రెస్ ఇంకా ఇక్కడికి ఎంతదూరం ఉందో. బాగా బక్కచిక్కిన రూపాలతో, వెగటైన వేషాలతో కన్పిస్తున్న ఈ ప్రాణులెవరై ఉంటారు? ఇప్పుడు భూమిమీదనే ఉన్నప్పటికీ వీరు భౌములైన ప్రాణుల్లా తోచటంలేదు. మీరు సజీవులేనా? మానవుడు ప్రశ్నించి సమాధానాలు పొందదగ్గ ప్రాణులేనా మీరు? ఎండి బీటలువారిన పెదవుల మీద వ్రేళ్ళు పెట్టుకొని వింటున్నారు, నా భాష మీకు అర్థమౌతున్నట్లుంది. మీరు స్త్రీలని ఊహిస్తున్నాను. కానీ మీ ఆ గడ్డాలవల్ల కారేమోననిపిస్తున్నది. మేక్బెత్ మాట్లాడగలిగితే పలకండి. మీరు ఏ జాతివారు? ప్రథమ మాంత్రికురాలు: జయం మేక్బెత్ జయం! గ్లామిస్ థేన్, నీకు జయం! ద్వితీయ మాంత్రికురాలు : స్వాగతం మేక్బెత్! కౌడర్ థేన్ స్వాగతం!! తృతీయ మాంత్రికురాలు : మేక్బెత్ స్వాగతం! భవిష్యన్మహారాజా! స్వాగతం!! బాంకో: ఆర్యా! అంతగా ఆశ్చర్యపడుతున్నారేమిటి? ఇంతటి ప్రియమైన వార్త విన్నప్పుడు ఇలా చలించి బెదురుతున్నారేమిటి? - సత్యంమీద ఒట్టుపెట్టి ప్రశ్నిస్తున్నాను, 364 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మీ రూపాలు ఊహాజన్యాలా లేక ప్రత్యక్షంగా గోచరిస్తున్నట్లు సత్యాలేనా? మీరు నా యీ ఉదాత్తసహచరుణ్ణి అతని ప్రస్తుత బిరుద గౌరవాలతో పేర్కొని ఆహ్వానించారు. మునుముందు మహారాజయ్యే గౌరవం దక్కనున్నదనీ ఆశ కల్పిస్తూ జోస్యం చెప్పారు. అతడు ఆ ఊహల్లో మునిగిపోయినట్లు కన్పిస్తున్నాడు. కానీ మీరు నాతో మాట్లాడటం లేదు. కాలంలో నిద్రించే బీజశక్తిని దర్శించగల ప్రతిభ మీకుంటే ఇందులో ఉద్భిజ్జమయ్యేదేది? కానిదేది? నాకు తెలియజేయండి! నేను మీ ఆదరాన్ని అర్థించేవాణ్ణి కాను మీరు అసహ్యించుకొంటే జంకేవాణ్ణి అంతకంటే కాను. ప్రథమ మాంత్రికురాలు : నీవు మేక్బెత్ అంతటివాడివి కావు కానీ గొప్పవాడివి. ద్వితీయ మాంత్రికురాలు : అతనికి కలిగే ఆనందం నీకుండదు. కానీ అంతకంటే అధికానందం నీకు లభిస్తుంది. తృతీయ మాంత్రికురాలు : నీవు మహారాజువు కాలేవు మహారాజులకు వంశకర్తవౌతావు. కనుక నీకు జయం! జయం!! మేక్బెత్ బాంకోల కిరువురికీ జయం! జయం!! ప్రథమ మాంత్రికురాలు : బాంకో మేక్బెత్లకు ఇరువురికీ జయం!! మేక్బెత్ : ఆగండి! ఓ అస్పష్టభాషిణులారా! ఆగండి. మరింత విశదంగా తెలియజేయండి. సైనల్" మృతివల్ల గ్లామిస్కు థేన్ను అయినానని నాకు తెలుసు. కానీ కౌడరుకు నేనెలా ప్రభువును కాగలను? ఇంకా కౌడర్ ప్రభువు సజీవుడు. అంతే కాదు, అతడు అదృష్టవంతుడు కూడాను. నేను కౌడరుకు థేన్ ను ఔతాననటం నమ్మటానికి వీలులేకుండా ఉంది. ఈ విషయం మీకెలా తెలిసింది? ఇటువంటి జోస్యంతో ఆహ్వానించి స్వాగతం చెప్పి ఈ క్షేత్రసీమలో మా మార్గానికి అడ్డువచ్చి, మీరెందుకు మమ్మల్ని ఆపవలసివచ్చింది? మాటాడండి. నేను మిమ్మల్ని శాసిస్తున్నాను. (మాంత్రికురాండ్రు అదృశ్యమౌతారు) బాంకో : నీటికున్నట్లే భూమికి కూడా బుడగలున్నాయన్నమాట! ఈ రూపాలు అనే. - అవి ఏ దెసకు అదృశ్యమైనాయో గమనించారా? మేక్బెత్ : వాయుపథంలోకి ఎగిరిపోయాయి. శరీరధారణం చేసి కన్పట్టిన ఆ రూపాలు నిట్టూర్పుగాడ్పుల్లా గాలిలో కలిసిపోయాయి. అవి కొంతకాలం నిలిచివున్నట్లయితే బాగుండేది! 365 బాంకో : మనం వేటిని గురించి మాటాడుకొంటున్నామో ఆ రూపాలు మనకంటిముందు నిజంగా కనిపించాయా? లేక ఓ జాతి ఉన్మాదాన్ని కలిగించి ఆలోచనను బందీ వెట్టగల పిచ్చి దుంపలను వేటినైనా మనం తిన్నామా? మేక్బెత్ : నీ సంతతి మహారాజులౌతారట! బాంకో : మీరు మహారాజులౌతారట! మేక్బెత్ : అంతే కాదు. నేను కౌడర్కు థేనును కూడా ఔతానట! ఆ జోస్యం ఇలాగే నడిచింది కదూ? బాంకో : అవును. ఆ జోస్యానికి తాత్పర్యార్థమదే. అంతే కాదు. వారు పలికిన పదాలు కూడా అవే. - ఎవరది? రాస్, ఆంగస్ ప్రవేశిస్తారు. రాస్ : మేక్బెత్ మహాశయా! మహారాజు మీ విజయవార్తను మహానందంతో విన్నారు. విప్లవవీరులతో జరిగించిన పోరాటంలో వ్యక్తిగతంగా మీరొనర్చిన సాహసచర్యలు వారికి ఆశ్చర్యాన్ని కల్గించాయి. కర్తకు మెప్పును చేకూర్చాయి. ఆయన ఏమీ పలకలేకపోయినారు. తాను పొందిన అనుభూతిని వెల్లడించటానికి పొగడ్త చాలదని ఒక వంక, పొగడకపోవటం కృతఘ్నత అని మరొకవంక ఆయనకు తోచింది. పొందిన ఆశ్చర్యం, చిక్కు పెట్టటం వల్ల చివరకు ఆయన ఏమీ పలకలేక స్తబ్దత వహించారు. ఇట్టి భావసంధిలో ఇదమిత్థమని ఏమీ నిర్ణయించలేక నిరాశను పొంది, తరువాత క్రమంగా ఇంకా నిలిచిపోయిన ఆ నాటి యుద్ధవార్తలను విన్నారు. వాటిలో నిబిడంగా బారులు తీర్చి నిలిపిన నార్వే సైనిక శ్రేణుల్లోకి ప్రతికళేబరం మృత్యుమూర్తిలా కనిపించేటట్లు స్వయంగా కల్పించిన భీకరదృశ్యాలను భీతి చెందకుండా మీరు చొచ్చుకొనిపోవటాన్ని ప్రత్యేకంగా ఆయన గమనించారు. యుద్ధభూమి నుంచి వడగండ్లలా వార్తాహరులు ఒకరి తరువాత ఒకరు వస్తుండేవారు. వారిలో ప్రతిఒక్కడూ రాజ్యరక్షకోసం మీరు జరిపిన సాహసచర్యలకు సంబంధించిన పొగడ్తలను కోకొల్లలుగా కొనివచ్చి ఆయన ముందు క్రుమ్మరించారు. ఆంగస్ : వారి అభివాదనలను మీకు అందజేయవలసిందని మహారాజు మమ్మల్ని నిర్దేశించారు. మిమ్మల్ని వారి సముఖానికి కొనిరమ్మని వారి ఆదేశం. మేము మిమ్మల్ని బహూకరించటానికి రాలేదు. 366 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 రాస్ : మున్ముందు వారు మీకు జరపనెంచిన ఘనతరసన్మానానికి సంచకరువులా 'కౌడర్ థేన్' అన్న బిరుదాన్ని మీకు అందజేయవలసిందిగా వారు నన్నాదేశించారు. ఆ బిరుదుమిప్పుడు మీదైంది. దానితో ఒక్కమారు మిమ్మల్ని జయనెట్టనివ్వండి. బాంకో : (స్వగతం) ఏమిటి? మంత్రగత్తె సత్యము చెప్పగలిగిందన్న మాటేనా? మేక్బెత్ : కౌడర్ థేన్ ఇంకా సజీవుడు కదా? ఎరువు తెచ్చిన దుస్తులతో నన్నెందుకు అంలంకరిస్తారు? ఆంగస్ : ఆ థేన్ ఇంకా సజీవుడై వున్నమాట నిజమే. కానీ అతనికా జీవితం శిక్షాభరం వల్ల భారోపేతమైంది. దానిని కోల్పోవలసిన స్థితినాతడు తెచ్చిపెట్టుకొన్నాడు. అతడు నార్వేరాజ సైన్యంతో కలిసిపోయినాడో లేక మన సైన్యాలను అధిగమించటంకోసం ఆ విప్లవసాహసికి గుప్తసహాయం చేశాడో, కాక ఈ రెండు మార్గాల్లోనూ తీవ్రకృషి చెయ్యటంవల్ల తనదేశానికి తీరని వినాశాన్ని తెచ్చిపెట్టుకొన్నాడో నాకు తెలియదు. కానీ నిరూపితమై అతడే అంగీకరించిన రాజద్రోహదోషం అతనికి వినాశాన్ని తెచ్చిపెట్టింది. 22 మేక్బెత్ : (స్వగతం) గ్లామిస్! కౌడర్ థేన్!! అన్నిటినీ మించిన జోస్యఫలం ఇంకా అనుభవానికి రావలసిఉంది. (రాస్, ఆంగస్లతో) మీరు తీసుకొన్న శ్రమకివే నా నమస్సులు. (బాంకోతో) నీవు 'కౌడర్ థేన్ ఔతా' వని నాకు జోస్యం చెప్పిన ఆ మంత్రగత్తెలే నీ సంతతికీ జోస్యం చెప్పారు గదా! వారు మహారాజులౌతారని నీవు ఇంకా ఆశించటం ఆరంభించలేదా? బాంకో : ఆ జోస్యాన్ని మీరు పూర్తిగా విశ్వసిస్తే కౌడరుకు థేనులు కావటంతో తృప్తిని పొందనీయకుండా, అది కిరీటసంపాదనకు కూడా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. ఏమైనా వారి జోస్యం కొంతగానైనా నిజం కావటం ఆశ్చర్యంగానే ఉంది. ప్రబలమైన ఆపదను కల్పింపబోయే ముందు, ప్రధానాంశాల్లో మనను మోసగించటంకోసం, కొంత విశ్వాసం కుదరటానికని సైతానుకు ప్రతినిధులైన ఈ మంత్రగత్తెలు, స్వల్పవిషయాలలో సత్యం చెప్పటం తరచుగా జరుగుతుంటుంది. సోదరులారా! క్షమించండి. ఒకమాట. మేక్బెత్ : (స్వగతం) భవిష్యత్తులో జరుగునున్న మహానాటకానికి, సార్వభౌమత్వం కథావస్తువుగా గల మహానాటకానికి, పరమాహ్లాదకరాలైన ప్రస్తావనలుగా సత్యాలను రెంటిని ముందుగా ఆ మంత్రకత్తెలు పలకటం జరిగింది. (ప్రకాశంగా) ఉదాత్తులారా! 367 మీకివే నా నమస్సులు. (స్వగతం) మానవేతరాలైన ప్రేరేపణలెప్పుడూ దోషోపేతాలై వుండవు. అలాగే అవి శుభయుతాలై కూడా ఉండవు. ఒకవేళ వారు చెప్పింది దోషోపేతమైతే ఒక జోస్యంలో తొలిభాగాన్ని సత్యం చేసి నాకు ముందు రానున్న విజయానికి సంచకరువును కల్పించటమెందుకు? కౌడర్కు నేను థేనును కావటం క్రియారూపంలో కన్పిస్తునే ఉన్నది. ఇక శుభోపేతమైతే - ప్రకృతికి విరుద్ధంగా ఏ భావ భీకరరూప దర్శనంవల్ల నా కురులు నిక్కబొడుచుకొని నిలవటం, సుస్థిరమైన నా హృదయం డొక్క ఎముకలకు తగిలి తడుతూ ఉండటం జరుగుతున్నదో, ఆ భావానికి నే లొంగటమెందుకు? భవిష్యత్తులో రానున్నవని భావించే క్రూరభయానకాలను సహించటం కంటే వర్తమానంలో ఎదుర్కొనేవాటిని భరించటం బహుసుకరం. ఇంకా కేవలమొక ఊహామాత్రంగానే ఉండిపోయి, ఎట్టిరూపాన్నీ పొందకుండానే ఉన్న హత్యను గూర్చిన ఆలోచన నా మనోరాజ్య వ్యాపారాలను స్తంభింపజేస్తున్నది. ఊహామాత్రమైన అది ఒక సత్యంలా గోచరిస్తున్నది. బాంకో చూడండి. మన సహచరుడు ఎలా ఆలోచనలో మగ్నుడై పోయినాడో! మేకెత్ : (స్వగతం) అదృష్టం నన్ను మహారాజును చేయదలచుకుంటే నా ఎట్టి ప్రమేయం లేకుండానే అదే కిరీటమిచ్చితీరుతుంది. కృషితో బాంకో : నూతనంగా అబ్బిన పదవీగౌరవాలు ఇంకా ఇతనికి బాగా ఒదగలేదు. అవి క్రొత్తదుస్తుల్లా కొన్నాళ్లు ఉపయోగిస్తేగాని ఒదగవు. మేక్బెత్ : (స్వగతం) ఏది రానున్నదో దాన్ని రానీ! అందలి కాలానికి ఎంతటి కఠిన ప్రవృత్తి ఉన్నా దినమనేది గడిచి తీరుతుంది. బాంకో : మీకు వీలు కలిగేటంతవరకూ వేచి ఉంటాము. మేక్బెత్ : ఇంతకాలం మిమ్మల్ని వేచివుండేటట్లు చేశాను. క్షమించండి. మందమైన నా బుద్ధి మరిచిపోయిన కొన్ని విషయాలను జ్ఞప్తిచేసుకోవటంలో నిమగ్నమైపోయింది. నన్ను గురించి మీరు చేసిన శ్రమను నా చిత్తపత్రంమీద లిఖించుకొన్నాను. పఠించటం కోసం ప్రతినిత్యం ఆ పత్రాన్ని తిరుగవేస్తాను. మనం ఇక మహారాజదర్శనానికి బయలుదేరుదాము. (బాంకోతో) ఈ నాటి మన అనుభవాలను గురించి ఆలోచించు. వాటిని గురించి మధ్యకాలంలో సూక్ష్మపరిశీలన చేసి, మనం మరొకప్పుడు పరస్పరం హృదయాలిచ్చుకొని ప్రసంగిద్దాం. 368 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 బాంకో : అలాగే పరమానందంతో ప్రసంగిద్దాము. మేక్బెత్ అందాకా ఆ విషయాలను ప్రస్తావించవద్దు బయలుదేరుదాము. (నిష్క్రమిస్తారు) నాల్గో దృశ్యం - మిత్రులారా! ఇక ఫోర్రెస్ రాజసౌధం, తుత్తారధ్వని వినిపిస్తుంది. పరివారంతో డంకన్, మాల్కొం, డొనాల్బెయిన్, లెన్నాక్స్ ప్రవేశిస్తారు. డంకన్ : కౌడర్ వధ జరిగిపోయిందా? ఆ కార్యనిర్వహణం కోసం నియ మితులైనవారు ఇంకా తిరిగిరాలేదా? మాల్కొం : మహాప్రభూ! రాలేదు. ఆ మరణశిక్షను పొంది అతడు మృతి నొందటాన్ని చూసిన ఒక వ్యక్తితో నేను మాటాడాను. ఆ వ్యక్తి నివేదించినదాన్ని బట్టి ఆ కౌడర్ ప్రభువు తన రాజద్రోహాన్ని విస్పష్టంగా అంగీకరించాడనీ, గాఢపశ్చాత్తాపాన్ని ప్రదర్శించాడనీ, క్షమించవలసిందని మహారాజును అర్థించాడనీ తెలుస్తున్నది. అతడు తన జీవితంలో చేసిన ఏ కృత్యం కూడా అతడు తన జీవితాన్ని విడిచిపుచ్చినరీతిలా అతనికి వన్నె తెచ్చిపెట్టలేదు. ఇతఃపూర్వమే మరణవిషయంలో ఎన్నోమార్లు శిక్షణను పొందినట్లుగా అతడు మరణించాడు. తనకున్న వస్తువులన్నిటిలో అతిప్రియమైన జీవితాన్ని అతడు ఒక క్షుద్రపదార్థంలో 24 పరిత్యజించటానికి అతడు పరమసాధన చేసినట్లు మరణించాడు. డంకన్ : ముఖకవళికలను బట్టి మనోవృత్తిని గమనించగలగటాన్ని నేర్పే కళంటూ ఒకటున్నట్లు కనిపించదు. అతడు ఉదాత్తుడని తలపోసి నేను అతడిమీద పరిపూర్ణ విశ్వాసముంచాను. మేక్బెత్, బాంకో, రాస్, ఆంగస్లు ప్రవేశిస్తారు. సర్వశ్రేష్ఠసోదరా! నీవొనర్చిన సేవకు తగినరీతిగా బహూకరింపని కృతఘ్న పాపభారాన్ని వహించినందుకు నన్ను నేనింతవరకు నిందించుకొంటున్నాను. పారితోషికాలు ఎంత శ్రమపడి పర్వులెత్తి చేరుకోటానికి యత్నించినా, అందులో లేనంతగా నీ యోగ్యతలు అతివేగాలైన రెక్కలు కట్టుకొని ఎంతో ఎత్తున ఎగిరిపోతున్నాయి. అభివాదనలు 369 చెప్పుకొని అనుగుణంగా బహూకరింపగలిగే శక్తి నాకు దక్కేటట్లుగా నీ యోగ్యతలు కొంత తక్కువ అయి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ప్రస్తుతానికి నేను చెప్పగలిగింది ఒక్కటే. నా సర్వాధికారంలో ఉన్న సమస్తం కంటేను, అంతకంటే అధికంగాను నేను నీకు ఋణపడ్డాను. మేక్బెత్ : స్వామిభక్తి సేవలనే ఋణాలను చెల్లించవలసిన బాధ్యత నాకుంది. ఏ కృత్యం వల్లనైనా అట్టిసేవ చేయటమంటే నే పడ్డ ఋణాన్ని చెల్లించటమే ఔతుంది. సేవకధర్మాలైన అట్టి కర్తవ్యాలను స్వీకరించటం మీ వంతు. మా కర్తవ్యాలు తమకూ, తమ రాజ్యానికీ తల్లిదండ్రులకు పిల్లలెలాంటివారో అలాటివి. యజమానులకు సేవకులవంటివి. నిర్వర్తించవలసిన కర్తవ్యాలను మేము సక్రమంగా నిర్వర్తిస్తే తమమీది ప్రేమ గౌరవాలవల్ల నిర్వర్తించవలసినవాటిని నిర్వర్తించటమే ఔతుంది. డంకన్ : నీవనే లతను నేనిప్పుడే నాటాను. అది పరిపూర్ణరూపంలో వృద్ది పొందటానికి అవసరమైన సమస్తకృషిని చేస్తాను. బాంకో మహాశయా! నీవూ మేక్బెత్తో తుల్యమైన యోగ్యతను సంపాదించుకొన్నావు. అంతటి యోగ్యత నీకుందని ఎరుకపడటానికిగా దానిని ఉచితరీతిని ప్రకటించుకోవచ్చు. ఏదీ నిన్నొక మారు కౌగిలించుకొని నా హృదయానికి హత్తుకోనీ. బాంకో : నేను వృద్ధిపొందితే కలిగే ఫలసాయమంతా తమదే. డంకన్ : ఆపుకోలేని నా ఆనందం అశ్రుజలంతో పరిపూర్తిని పొందదలచింది. పుత్రులారా! సోదరులారా!! నా సింహాసనానికి సన్నిహితులైన ఇతర వ్యక్తులారా!! గ్రహించండి. ఇప్పుడే రాజ్య వారసత్వాన్ని నా జ్యేష్ఠపుత్రుడైన మాల్కొంకు దత్తత చేస్తున్నాను. ఇకనుంచి 'కంబర్ లాండు యువరాజు' అని అతనికి నామకరణం చేస్తున్నాను. ఇట్టి గౌరవాన్ని అతడొక్కడే కాక మరికొందరు కూడా పొందవలసివుంది. ఈ ఉత్తమలాంఛనాలు నక్షత్రాల్లా యోగ్యత కలవాళ్ళను మరింత తేజోవంతులనుగా భాసింపజేస్తాయి. ఇక్కడ నుంచి మనం ఇన్వర్నెన్కు వెళ్ళవలసి వుంది. అక్కడ నీవు మాకు గేస్తువై వర్తించి, ఇంతకంటే ఎంతో అధికంగా మమ్మల్ని ఋణగ్రస్తులను చేసుకోవచ్చు. మేక్బెత్ : తమ సేవకు వినియోగించకుండా పొందే విశ్రాంతి కాలాన్ని తీవ్రమైన శ్రమకంటే మాకు భరించటం ఎంతో కష్టం. నేనే తమ రాకను గురించిన హెగ్గడికాడనై 370 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ముందుగావెళ్ళి నా భార్యకీ వార్త చెప్పి, ఆమెను సంతోషభరితాంతఃకరణను చేస్తాను. సెలవు దయచేయించండి. డంకన్ : కౌడర్ మహాశయా! అలాగే. నీవు వెళ్ళవచ్చు. మేక్బెత్ : (స్వగతం) 'కంబర్లాండు యువరాజు! నా మార్గమధ్యాన ఒక మెట్టు ఏర్పడింది. నేను దీన్ని తట్టుకొని పడవచ్చు లేదా దుమికి బయటపడవచ్చు. ఓ తారకల్లారా! మీ మీ తేజాలను తిరోహితాలు చెయ్యండి! కలుషాలైన నా రహస్యాకాంక్షలను బయటపెట్టకండి!! నా హస్తం ఏమి చేస్తుందో దాన్ని నా నేత్రం చూడకుండా చేయండి. నిర్వర్తితమైన తరువాత ఆ కార్యాన్ని చూసి అది భయాన్ని పొందుగాక! (నిష్క్రమిస్తాడు) డంకన్ : యోగ్యుడా, బాంకో! నీవన్నది సత్యం. నీవు వర్ణించినట్లు ఇతడు వీరగుణపరిపూర్ణుడే. ఇతణ్ణి గురించిన నీ వర్ణనలు నాకు విందులా విశేషతృప్తిని కల్గించాయి. స్వాగతం చెప్పే విషయంలో సర్వసౌఖ్యాలను చేకూరుద్దామన్న శ్రద్ధతో ఇతడు ముందుగా వెళ్ళాడు. ఇతడు సత్యంగా సాటిలేని బంధువు. (తుత్తారధ్వని. నిష్క్రమిస్తారు) ఐదో దృశ్యం ఇన్వర్నిస్లో మేక్బెత్ సౌధం. లేఖ చదువుతూ మేక్బెత్ ప్రభ్వి ప్రవేశిస్తుంది. మేక్బెత్ ప్రభ్వి : “నేను విజయం చేకొన్ననాడు వారు నన్ను కలుసుకొన్నారు. లోపరహితమైన వారి కథనాన్ని బట్టి, వారికి మానవాతీతమైన విజ్ఞానం ఉన్నదని నేను గ్రహించాను. ఉత్సాహోద్రిక్తతతో మరికొన్ని ప్రశ్నలడగాలన్న కోర్కె నాకు కలగంగానే గాలిలో లీనమై అలా చిత్రంగా వారు అదృశ్యమైపోయినప్పుడు, నేనద్భుతావిష్ణుడనై చేష్టలు దక్కి నిలుచున్నాను. ఇంతలో మహారాజు దగ్గిరనుంచి వార్తావహులు వచ్చి పూర్వం విధిసోదరీమణులు జయవెట్టినట్లుగానే "కౌడర్ థేన్! జయ" మని నాకు జయపెట్టారు. పూర్వ మా సోదరీమణులు "భవిషన్మహారాజా! జయ!" మని పల్కి ముందు నేను మహారాజును అయ్యే కాలం వస్తున్నదని సూచించారు కూడాను. నా ఘనతలో భాగస్వామినివైన నీకు భవిష్యత్తులో ఎట్టి ఆధిక్యం అబ్బనున్నదో తెలియకపోవటం వల్ల, నాతో తుల్యమైన ఆనందాన్ని పొందే అవకాశం పోగొట్టకుండా 371 ఉండేటందుకు నీకీ వార్తను అందజేయటం ఉచితమని ఊహించాను. ఈ విషయాలను హృదయంలోనే ఉంచుకొని తీవ్రంగా ఆలోచించు. సెలవు." మీరు ఇప్పటికే గ్లామిస్కు థేనులైనారు! కౌడర్కు థేనులైనారు!! మంత్రగత్తెలు జోస్యం చెప్పినట్లు మున్ముందు మహారాజులు కూడా ఔతారు!! కానీ మీ ప్రకృతితో పరిచయం గలదాన్ని కాబట్టి, నాకేదో భయం వేస్తున్నది. దాక్షిణ్యక్షీరరసంలో అది పరిపూరితమైంది. అందుచేత అది సన్నిహితమైన మార్గాన్ని అందుకొని చరించదు. ఘనతను సంపాదించవలెనన్న ఆకాంక్ష మీకుంది. ఘనమైన కోర్కె లేని వ్యక్తులు కారు మీరు. కానీ దురదృష్టవశాన, ఏది లేకపోతే ఒక ఉన్నతమైన ఆశయాన్ని సాధించే అవకాశం లేదో ఆ అన్యాయభయరాహిత్యం మీకు లేదు. మీరు ఎన్నడైనా ఒక ఉన్నతప్రయోజనాన్ని సాధించటానికి గౌరవనీయమైన మార్గాన్నే కోరుతుంటారు. అనుచితమార్గాలతో దాన్ని పొందటం వంకకు ఆశపడరు. అయితే అట్టి మార్గాల వల్లనే తప్ప పొందటానికి అవకాశం లేని దానివల్ల వచ్చే ఫలాన్ని అనుభవించాలని ఆశపడుతుంటారు. "నీకది కావాలంటే ఇది చేసితీరాలి" అని కంఠోక్తిగా చెప్పేదాన్ని పొందటమంటే మీకిష్టమే. కానీ ఆ పనిని మీరు స్వయంగా చేయటానికి జంకుతారు. అయినప్పటికీ అట్టిపని జరిగిపోయిన తరువాత దాన్ని త్రిప్పాలెనని మాత్రం మీరు కోరరు. మీ శ్రవణేంద్రియాలను నిరంతరం ఉత్సాహంతో నింపివేస్తూ, వీరోచితవాక్రసంగాలతో దైవానుగ్రహం, అదృష్టశక్తులు నిర్ణయించి యిచ్చిన స్వర్ణకిరీటానికీ, మీకూ మధ్య ఆటంకంగా నిలుస్తున్న మీ ప్రకృతిలోని వెనకాడటమనే గుణాన్ని వెంటబడి తరిమివేస్తాను! వార్తలేమిటి? ఒక వార్తాహరి ప్రవేశిస్తాడు వార్తాహరి : మహారాజులు రాత్రికి ఇక్కడికి విచ్చేస్తున్నారు. మేక్బెత్ ప్రభ్వి : ఇటువంటి వార్త చెబుతున్నావు. నీకేమైనా మతిపోయిందా? మీ యజమాని మహారాజు వెంట లేరా? నిజంగా మహారాజు లిక్కడికి వస్తున్నట్లయితే తగిన ఏర్పాట్లు చేయటంకోసం మీ యజమానులు నాకు ముందుగా వార్త పంపించివుండేవారు. వార్తాహరి : నివేదించేటందుకు తాము నన్ననుగ్రహిస్తే నే తెచ్చిన వార్త సత్యమైందే. మన ప్రభువు ముందుగా వస్తున్నారు కూడాను. నా సహచరుల్లో ఒకడు వారికంటే 372 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ముందుగా వార్తనందించటంకోసం ఊపిరి సలుపుకోలేక మరణించేటంతటి వేగంతో, మరణిస్తే వార్త అందదేమోనన్న భయంతో వచ్చాడు. మేక్బెత్ ప్రభ్వి : వాడికి క్రమమైన పరిచర్య చేయించండి. అతడు తెచ్చిన వార్త ఎంతో ఘనమైంది. (వార్తాహరి నిష్క్రమిస్తాడు) ఇలాంటి అరిష్టసూచకమైన వార్త చెప్పేటప్పుడు బొంత కాకి గొంతుక కూడా వెలుగురాయటం సహజం. అట్టి స్థితిలో డంకన్ మా సౌధంలో ప్రవేశిస్తున్నాడన్న వార్త తెచ్చిన వార్తాహరికి నోటమాట పెగిలిరాకపోవటంలో వింతేముంది? మానవుల మనోభావాలను వెన్నంటి వుండే ఓ అదృష్టశక్తుల్లారా! రండి!! నాలోని స్త్రీత్వాన్ని తొలగించండి. నఖశిఖపర్యంతం నన్ను నిర్భరక్రౌర్యంతో నింపి వేయండి. నా శరీరంలోని రక్తాన్ని కరడుగట్టించండి. కరుణకెట్టి ప్రవేశాన్నీ కల్పించకండి. దారులనన్నింటినీ మూసివేయండి. లేకపోతే ప్రయోజనాన్ని సాధించనీయకుండా ప్రకృతిసహజాలైన అనుమానాలు నన్ను క్రుంగదీయవచ్చు లేదా నా ఉద్దేశానికీ, తదాచరణకూ మధ్య ఆటంకాలుగా అవి నిలిచిపోవచ్చు. ఓ హత్యాసచివులారా! మానవులు క్రూరకృత్యాలను ఆచరించే వేళల్లో అదృశ్యరూపులై వెంట ఉండి సాయపడే మీరు, నా స్తనద్వయం మీదికి విచ్చేసి అందలి క్షీరరసాన్నంతటినీ విషంగా మార్చేసి, నన్ను పరమక్రౌర్యమూర్తినిగా రూపొందించండి. నా నిశితకరవాలం కల్పించే గాయం దానికంటికి కనుపించకుండా ఉండేటందుకు, ఆ వినీలకంబళంలో నుంచి తొంగిచూచి వియత్తు 'ఆప' మని కేకపెట్టకుండా ఉండేటందుకు, ఓ కరాళకాళరాత్రీ! నారకధూమాన్ని కప్పుకొని నా కోసం రా! 26 మేక్బెత్ ప్రవేశిస్తాడు ఘనుడా గ్లామిస్!2 యోగ్యుడా కౌడర్!! అనతికాలంలో మీకబ్బనున్న మహనీయ బిరుదంతో మిమ్మల్ని ఆహ్వానించటానికి అంగీకరించండి. మీ లేఖలు ముందేమి జరుగునున్నదో ఎరుకపడని వర్తమానకాలపు టెల్లల కెంతో అవలకు నన్ను నడిపించుకోపోయినవి. ఇప్పటికీ నేను ఆ భవిష్యత్తులోనే ఇంకా జీవిస్తున్నట్లు అనుభూతిని పొందుతున్నాను. మేక్బెత్ : పరమప్రియా! ఈ రాత్రికి డంకన్ ఇక్కడికి వస్తున్నాడు. 373 మేక్బెత్ ప్రభ్వి : ఇక్కడనుంచి తిరిగి అతడు వెళ్ళట మెప్పుడు? మేక్బెత్ : ప్రస్తుతోద్దేశప్రకారం రేపు. మేక్బెత్ ప్రభ్వి : అట్టి రేపు సూర్యునిముఖం చూడబోదు. నా థేన్ మహాశయా! మీ మోము ఎన్నో అతీతవిషయాలను గ్రహింపదగ్గ గ్రంథంలా కన్పిస్తున్నది. లోకం కన్నులు కప్పటం కోసం సమయోచితాచారాల విషయంలో శ్రద్ధ వహించటానికి అలవాటు పడండి. మీ కన్నుల్లో, చేతల్లో, మాటల్లో స్వాగతం చెప్పటమే కనిపించాలి సుమా! ఏమీ ఎరగని సుకుమార కుసుమంలా కనిపించండి. కానీ అందులో సర్పంలా ఉండిపోవటం మరిచిపోవద్దు. వస్తున్న వ్యక్తి విషయంలో అతిశయమైన శ్రద్ధ వహించండి. ఆ విషయంలో మీరేమీ ఆందోళనపడవద్దు. దేనిని పరిపూర్తి చేయటం వల్ల మీ కీ దేశం మీద తదనంతర జీవితకాలమంతా యాజమాన్య సార్వభౌమాధికారాలు దక్కుతాయో, ఆ అతిప్రధానమైన వ్యవహారాన్ని నా అధీనం చెయ్యండి. మేక్బెత్ : మనం తరువాత మరోమారు ఈ విషయాన్ని గురించి ప్రసంగిద్దాము. మేక్బెత్ ప్రభ్వి : ముఖకాంతి వివర్ణమౌటమంటే భయాన్ని వ్యక్తం చెయ్యటమన్నమాట! ఉత్సాహంతో కనిపించటం తప్ప మీరు చేయవలసింది మరేమీ లేదు. మిగిలిన వ్యవహారం సర్వం నాకు విడిచిపెట్టండి. (నిష్క్రమిస్తారు) ఆరోదృశ్యం మేక్బెత్ సౌధం ముందు. సన్నాయి ధ్వనికారుల సంగీతం వినిపిస్తుంది. కాగడాలతో మేక్బెత్ సేవకవర్గం నిలుచుంటారు డంకన్, మాల్కొం, డొనాల్బెయిస్, బాంకో, లెన్నాక్స్, మాక్డఫ్, రాస్, ఆంగస్, సేవకవర్గం ప్రవేశిస్తారు. డంకన్ : ఈ హర్మ్యం మహామనోహరమైన ప్రదేశంలో నిర్మితమైంది. సువాసనా శోభితమైన యిక్కడి మనోహరపవనం మన యింద్రియాలకు ప్రశాంతిని చేకూరుస్తున్నది. బాంకో : అతిథులుగా వేసవిలో మన దేశానికి వచ్చి ఆలయాల్లో గూళ్ళు కట్టే ఏట్రింతలు" నివాసం చేస్తుండటం వల్లనే ఇచ్చటి వాయువు నిజమాధుర్యం చేత మనలను ఆకర్షిస్తున్నదన్న అంశం స్థిరపడుతున్నది. 374 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఈ సౌధంలోని వలభుల్లోగాని, ఫలకపంక్తుల్లోగాని, అండకుడ్యాలలోగాని, అవి గూళ్ళు కట్టి తమ పిల్లలను పెట్టని ప్రదేశమంటూ లేదు. నేను ఎన్నోమార్లు పరిశీలించాను అవి ఎక్కడ సంతానంతో సంతోషంగా తిరుగుతుంటవో అక్కడ వాయువు అతికోమలంగా ఉంటుంది. మేక్బెత్ ప్రభ్వి ప్రవేశిస్తుంది డంకన్ : అదిగో గమనించండి! గౌరవనీయురాలైన మన అతిథేయి విచ్చేస్తున్నది. మిత్రబృందంతో సమావేశాన్ని కాంక్షించి త్వరపెట్టే మన ప్రేమ కొన్ని సందర్భాలలో వారికీ శ్రమను కల్పిస్తుంటుంది. అయినా మనం వారి ప్రేమను స్వీకరించి కృతజ్ఞతలర్పిస్తుంటాము. మా రాకవల్ల మీకు మేము కల్పించిన శ్రమకు తగ్గ బహూకృతిని ప్రసాదించవలసిందని భగవంతుని ప్రార్థించే రీతిని, కల్పించిన శ్రమకుగాను మాకు కృతజ్ఞతను తెల్పవలసిన రీతిని ఈ ఆగమనం వల్ల మీకు మేము నేర్పుతున్నాము. మేక్బెత్ ప్రభ్వి : మేము చేయగలిగిన సర్వసేవలను రెండుమార్లుగా చేసి, వాటినన్నిటినీ తిరిగి రెండురెట్లుగా చేసినా, ఇలా గౌరవవిశేషంతో మా గృహాన్ని ముంచెత్తిన తమకు మేము చేసే గౌరవం మిక్కిలి పేదది, అయోగ్యమైనది మాత్రమే ఔతుంది. పూర్వం తామొనర్చిన గౌరవాలకు, నూతనంగా ప్రసాదించిన గౌరవాలకు, మేము తమ సంక్షేమాన్ని కోరుతూ నిత్యం జపం చేసే మాలాధారుల" మైన మౌనులం కాక తప్పదు. డంకన్ : కౌడర్ థేన్ ఎక్కడున్నాడు? ఇంకా తిరిగిరాలేదా? అతడికంటే ముందు చేరుకోవాలని మేము అతడు బయలుదేరిన వెంటనే అనుసరిస్తూ వచ్చాము. అలా జరగటానికి వీలులేదు. అతడు గొప్ప అశ్వికుడు. మీ మీది ప్రేమ కూడా అతణ్ణి మాకంటే ముందుగా ఇంటికి చేర్చటానికి తోడ్పడివుంటుంది. ఉచితజ్ఞవూ, ఉదాత్తవూ అయిన ఆతిథేయీ! ఈనాటి రాత్రి మేము మీకు అతిథులము. మేక్బెత్ ప్రభ్వి : తమ సేవకులు - మేము అందులోవారమే - తమను, తమ అధీనంలో ఉంచిన సమస్తాన్నీ, మహారాజులైన తాము కోరినప్పుడు తమపరం చెయ్యటానికి ఎన్నడూ సంసిద్దులే కదా! సత్యానికి ఈ సమస్తం తమదే కదా!! డంకన్ : ఏదీ మీ హస్తం? మమ్మల్ని మా ఆతిథేయుని దగ్గరకు తీసుకువెళ్ళండి. అతడంటే మాకు అమితగౌరవం ఇంకా మేము అతడిమీద మా గౌరవాభిమానాలను క్రుమ్మరింపదలచాము. గేహినీ! మరి అనుజ్ఞనిస్తారా? (నిష్క్రమిస్తారు) 375 ఏడో దృశ్యం మేక్బెత్ సౌధం, సన్నాయి ధ్వనికారుల సంగీతం వినిపిస్తుంటుంది. కాగడాలు వెలుగునిస్తుంటాయి. విందుకు సంబంధించిన నానాపదార్థాలతో అనేకసేవకులు పర్యవేక్షకుడు” రంగస్థలం మీద నుంచి వెళ్ళిపోయిన తరువాత మేక్బెత్ ప్రవేశిస్తాడు. మేక్బెత్ : ఈ హత్యను జరిగించటంవల్ల సర్వం పరిపూర్తి అయ్యేటట్లయితే, దాన్ని వేగంగా జరిగించటం మంచిది. ఈ హత్య, దానివల్ల కలుగనున్న దుష్ఫలితాలను ఆపగలిగితే, అతణ్ణి తుదముట్టించటంవల్ల నాకు విజయం చేకూరితే, బాహిరంగా మరేమీ లేకుండా ఈ హత్యలోనే దాని ఆద్యంతాలు గర్భితాలై ఉంటే, నిత్యమైన కాలమహాసముద్రానికి ఒక తీరమో లేక అందులో ఒక తిన్నో అయిన ఈ జీవితంలో ముందేది వచ్చినా నేను తట్టుకోగలను. భవిష్యజ్జన్మలో ఏమీ జరుగనున్నా నేను పట్టించుకోకుండా సాహసించవలసివుంది. కానీ ఇట్టి సందర్భాలలో శిక్షను ఈ జీవితంలోనే అనుభవించవలసివుంటుంది. ఇటువంటి చర్యల విషయంలో మనం ఇతరులకు హత్యాపారాలను నేర్పుతుంటాము. అలా నేర్పటంవల్ల ఆ పాఠాలను కనిపెట్టినవారి ప్రాణాలకే ముప్పు వస్తుంటుంది. సమచిత్తంతో వర్తించే న్యాయం, ఇతరులచేత త్రాగించటం కోసమని నింపిన విషచషకాన్ని మన పెదవులకే అందించి, దాన్ని మన చేతనే త్రాగించటమనే దారుణశిక్ష చెపుతుంటుంది. రెండురీతుల అతణ్ణి రక్షించవలసిన ధర్మం నా యెడ ఉంది. నేను అతడికి తొలుత జ్ఞాతిని పిమ్మట సేవకుణ్ని. ఈ ద్వివిధసంబంధాలు నే తలపెట్టిన చర్యకు వ్యతిరేకాలు. అదీకాక ప్రస్తుతం నేను అతడికి అతిథేయుడను. హత్య చేయటం కోసం అతడిమీదికి హంతకుడెవడైనా వస్తుంటే అన్ని కవాటాలనూ బంధించి అతణ్ణి రక్షించవలసినవాణ్ణి. హత్యాఖడ్గాన్ని అత్యంతం హస్తాన ధరింపతగనివాణ్ణి. ఇంతే కాదు, ఈ డంకన్ ధర్మప్రధానంగా రాచరికాన్ని నెఱపుతున్నవాడు. ఉన్నతోద్యోగ నిర్వహణలో ఎట్టి కళంకం లేకుండా ఉన్నవాడు. దుందుభిస్వనాలైన 30 కంఠాలతో దేవదూతల్లా అతడి సద్గుణాలు, నరకబాధలను భవింపదగ్గ ఈ హత్యాచరణ విషయంలో అతణ్ణి హతమార్చిన హంతకునికి వ్యతిరేకంగా వాదిస్తాయి. తమ దుర్విధినిగురించి కోమలాలైన కుత్తుకలతో చేసే రోదనధ్వనులు పవనవీథుల్లో లీనమైపోయేటట్లు విలపించే నగ్నరూపులు, నవజన్ములు అయిన మృతశిశు 376 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 వుల్లా, లోకంలో జరిగే పాపకృత్యాలకు తగ్గ ప్రతీకారం జరిగితీరాలని వాయుపథంలో హర్కారాగణాలై, గమనవేగం వల్ల కనిపింపని గాలిగుంపులను అధిరోహించి, ఆ ఘోషించే దివ్యగంధర్వబాలకుల్లా31, దయా హృదయాలు కరగటం వల్ల కార్చిన కన్నీటిభారం చేత ఒక పెనుతుపాను చెలరేగేటట్లు ఈ దారుణకృత్యాన్ని సర్వప్రపంచం లోని నేత్రాలముందు కన్పించేరీతిగా ప్రదర్శించితీరుతుంది! జీను మీదికి చేరటానికని ఎత్తుగా ఎగరటం వల్ల ఆవలిదిక్కుకు పడవేసే గంతులమారి ఆశ తప్ప అతణ్ణి హతమార్చడానికి నా ఉద్దేశమనే అశ్వాన్ని డొక్కల్లో తన్ని అదుపున పెట్టుకోటానికి, మడమకు కట్టుకొనే మరొక అయస్సూచి నాకేమీ లేదు. విశేషాలేమిటి? మేక్బెత్ ప్రభ్వి ప్రవేశిస్తుంది మేక్బెత్ ప్రభ్వి : ఆయన భోజనం పూర్తికావస్తున్నది. మీరు భోజనకక్ష్యను విడిచి వచ్చారేమిటి? కారణం? మేక్బెత్ : ఆయన నన్ను గురించి ఏమైనా ప్రశ్నించాడా? మేక్బెత్ ప్రభ్వి : ప్రశ్నించాడని మీకింకా తెలియదా? మేక్బెత్ : మన వ్యవహారాన్ని ఇంతటితో కట్టిపెడదాం. మొన్నమొన్ననే ఆయన నన్ను గౌరవించాడు. ప్రజల్లో అన్నివర్గాలవల్లా దివ్యమైన అభిప్రాయాలను పొందాను. దాని క్రొత్తదనం మాసిపోకముందే సార్వజనీనమైన ఆమోదాన్ని కొంతకాలం ఆనందంతో అనుభవిస్తాను. అనుభవించటానికి యోగ్యమైంది కాదని దీన్ని అవతల పారవేయటానికి వీల్లేదు. మేక్బెత్ ప్రభ్వి : గర్వోన్మత్తులై ఏ ఆశతో మీరు మిమ్మల్ని అలంకరించుకొన్నారో ఆ ఆశ ఒక మధుపానమత్తుని ఆశకంటే అతిశయమైంది కాదా? అది ఇంతవరకూ నిద్రాముద్రితమైందా? ధైర్యంతో ఏర్పాటుచేసుకొన్న సన్నాహాన్ని చూచి పచ్చబడి వివర్ణమైపోవటానికి ఇప్పుడు మేల్కొన్నదా? నా మీది మీ ప్రేమ కూడా ఇలాగే నిలకడ లేనిదని ఈ క్షణంనుంచీ భావించవలసిందేనా? కాంక్షించటంలో మీరెలాటివారో చర్యలోనూ, సాహసంలోనూ అటువంటి వారుగానే వర్తించటానికి మీరు జంకుతున్నారా? జీవితానికి పరమాలంకారంగా దేన్ని భావిస్తున్నారో దాన్ని పొందవలెనని ఒకవంక కోరుతూ కూడా మరొకవంక “ధైర్యం చాలటం లేదు, ఆగు, 377 తింటాను" అన్న సామెతలోని పిల్లిలా పలుకుతూ, మీ దృష్టిలోనే మీరొక భీరువుగా నిలిచిపోదలిచారా? మేక్బెత్ : నిన్నర్దిస్తున్నాను. శాంతించు. 'వీడు పురుషుడు' అని అనిపించు కోటానికి ప్రమాణమెంతో అంతా చేసితీరుతాను! ఇంతకుమించి చేస్తే అప్పుడు వీడు పురుషుడు కావటం జరగదు గదా! మేక్బెత్ ప్రభ్వి : అయితే తొలుత ఈ సాహసచర్యను గురించి ప్రస్తావించినప్పుడు మిమ్మల్ని ఏ పశువావేశించి పల్కించింది? సాహసించి ఆ చర్యను సూచించినప్పుడు మీరు పురుషుడిలాగానే ప్రవర్తించారు. ఈ స్థితికంటే అధికమైన స్థితిని పొంది వర్తిస్తే ఆ పురుషుడన్న పేరుకు మీరు మరింతగా యోగ్యులౌతారు. 'అప్పుడు సమయంగాని, స్థలంగాని మీకు అనుకూలంగా లేదు', అని అంటూ మీరు ఆ రెంటినీ అనుకూలం చేసుకోటానికి నిశ్చయించారు. అయితే ఇప్పుడా రెండూ వాటిననే కల్పించుకొని అనుకూలించాయి గాని, మిమ్మల్ని ఆ చర్యకు అయోగ్యుణ్ణి చేస్తున్నవి. ఈ కార్యనిర్వహణ విషయంలో నేను మీ వలె ప్రతిజ్ఞ చేసివున్నట్లయితే, ఇది తల్లినై, స్తన్యపానం చేస్తున్న పసిపాపను ప్రేమించటమంటే ఏమిటో తెలుసుకొన్న తరువాత, అది నవ్వుతూ నా ముఖాన్ని చూస్తున్నప్పుడు దాని చిరుచివుళ్ళనుంచి నా చూచుకాన్ని లాగేసి హఠాత్తుగా దాని శిరస్సును చితకగొట్టట మన్నమాట! మేక్బెత్ : ఇందులో మనకపజయం కలిగితేనో? మేక్బెత్ ప్రభ్వి : మనకపజయమా? పరిహాసాస్పదమైన మాట! స్థిరనిశ్చయం కలగటానికి మీరు ధైర్యాన్ని చిక్కబట్టితే చాలు మనం అపజయాన్ని పొందం. ప్రయాణాయాసం వల్ల తప్పక పట్టితీరుతుంది గనక డంకన్ నిద్రాపరవశుడైనప్పుడు ఆయన సౌఖశాయనిక సేవకుల నిరువురినీ మధుపానంలో ముంచెత్తి విలాసోన్మత్తులను చేయిస్తాను. మానసికరహస్యాలను రక్షించుకోగల వారి ధీశక్తి ఆవిరిగా మారిపోవటంవల్ల వారి మనస్సు ఒక బట్టీగా మారిపోతుంది. అలా తప్పత్రాగి వారి ప్రకృతి మరణవేళలో వలె తడిసి చల్లబడిపోయినప్పుడు, రక్షణ లేని డంకన్ శరీరంమీద మీరూ, నేను ఏమైనా చెయ్యగలం గదా! మనం చేసిన ఘనహత్యాభారాన్ని మధుపానం చేత కరడుగట్టిన ఆ ఉద్యోగులమీదకు నెట్టి వారిచేత మ్రోయించవచ్చు. మేక్బెత్ : భీతచిత్తవుకాని నీ గర్భం మగబిడ్డలను తప్ప మ్రోయలేదు. నీవు పురుష సంతానం మాత్రమే పుట్టదగ్గ తల్లివి. నిదురించే ఆ ఇరువురు సౌఖశాయనిక సేవకుల 378 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఛురికలనే ప్రయోగించి వారి శరీరాలను రక్తచిహ్నితాలను చేస్తే హంతకులు వారేనని నమ్మించటానికి వీలుంటుందా? మేక్బెత్ ప్రభ్వి : ఆయన మృతికి మనం ఘనంగా రోదనధ్వనులు చేస్తుంటే ప్రత్యక్షంగా చూచినవారు తప్ప అన్యథా భావించేటంతటి సాహసం చెయ్యగలవారెవ్వరుంటారు? మేక్బెత్ : నా మనసిప్పుడు కుదుటబడ్డది. నేనిక నా సర్వావయవాలను ఈ దారుణచర్య కనుకూలంగా దిద్దుకుంటాను. ఇక వెళ్ళి ఆనందాభినయంతో కాలాన్ని హసించి మోసగిద్దాం. క్రూరహృదయం భావించే ఘోరచర్యలను మోసకారియైన ముఖం మరుగుపరచవలసివుంది. (నిష్క్రమిస్తారు) 379 ద్వితీయాంకం ఒకటో దృశ్యం ఇన్వర్నిస్లో మేక్బెత్ సౌధంలోని ఒక ప్రాంగణం. కాగడాను ముందుకు చూపుతున్న ఫ్లియాన్సుతో బాంకో ప్రవేశిస్తాడు. బాంకో: ఇప్పుడు సమయమెంతై వుంటుంది? ఫ్లియాన్సు : చంద్రాస్తమయమైంది. ఎన్ని గంటలు కొట్టారో వినలేదు. బాంకో : అది పన్నెండుగంటలకే జరిగిపోతుంది. ఫ్లియాన్సు : సరి, ఈ ఖడ్గాన్ని పుచ్చుకో. ఆకాశం తన దీపికలను ఆర్పివేసి సౌఖ్యాన్ని ప్రకటించింది. (ఛురిక నందిస్తూ) దీన్ని కూడా పుచ్చుకో. సీసంలా బరువైన నిద్ర నన్నాహ్వానిస్తున్నది. కానీ నాకు నిద్రపోవాలని లేదు. నిద్రావేళ కలల్లో కూడా దయాన్వితాలైన దివ్యశక్తులు పాపపుటూహలనుంచి నన్ను దూరంచేయుగాక! ఏదీ, నా ఖడ్గాన్ని ఇలాతే. ఎవరక్కడ? మేక్బెత్, కరదీపికతో ఒక సేవకుడు ప్రవేశిస్తారు. మేక్బెత్ : ఒక మిత్రుడు. బాంకో: ఏమిటి? ఇంకా మీరు విశ్రాంతి తీసుకోలేదా? ఆయన అసామాన్యమైన ఆనందాన్ని అనుభవించి పారితోషికాలుగా బహుళమైన కాన్కలను మీ సేవకాలయాలకు పంపించాడు. “మహాదయాన్వితయైన, అతిథేయి" అన్న బిరుదంతో ఈ అనర్హమణిని మీ పత్నికి బహుమతిగా ఇచ్చి ఎంతో అభినందించాడు. ఆయన శయనించి ఎంతో సేపైంది.
మేక్బెత్ : కాలమతిస్వల్పం కావటంవల్ల తగిన ప్రయత్నాలు చేయలేకపోవటం జరిగి, వారి ఆగమనానికి తగ్గ ఆతిథ్యాన్ని ఇవ్వాలన్న మా అభిలాష లోపరహితంగా తీరింది కాదు. బాంకో : సర్వం సక్రమంగానే సాగిపోయింది. రాత్రి నేనా మువ్వురు మాంత్రికురాండ్రను గురించి కలగన్నాను. మీ విషయంలో వారు చెప్పింది కొంత సత్యమైంది. 380 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మేక్బెత్ : : ఆ మంత్రగత్తెలను గురించి ఆలోచించటం నేను పూర్తిగా మానివేశాను. అయినా మన కో గంట విశ్రాంతి లభించినప్పుడు, ఆ కాలాన్ని నీవు నాకు వినియోగింప గలిగితే, ఆ విషయాలను గురించి తరువాత కొంతసేపు నీతో ప్రసంగిస్తాను. బాంకో : మీకెప్పుడు విశ్రాంతి కలిగితే అప్పుడు అందుకు నేను సంసిద్ధమే. మేక్బెత్ : నేను రూపొందించుకొన్న పథకానికి కార్యరూపాన్ని కల్పించటంలో నీవు సాయపడితే ఆ చర్య నీ గౌరవాన్ని తెచ్చిపెట్టేటట్లు నే చూస్తాను. బాంకో : అయితే నేను దోషరహితమైన చిత్తం కలవాణ్ణి. నా రాజభక్తి అమలినమైంది. అధికగౌరవాన్ని అన్వేషించటంలో ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా ఉండేటట్లయితే, నేను మీకు తప్పక తోడ్పడుతాను. మేక్బెత్: సరే. నీవు సమయం వచ్చేదాకా మంచి విశ్రాంతి తీసుకో. బాంకో : మంచిది. ఆర్యా! మరి మీరూ అట్టి విశ్రాంతినే అనుభవింతురు గాక! (బాంకో, ఫ్లియాన్సు నిష్క్రమిస్తారు) మేక్సెత్ : వెళ్ళి మీ యజమానురాలితో పానీయం సిద్ధమైన తరువాత ఘంటికను మ్రోగించమని చెప్పు. తర్వాత నీవు వెళ్ళిపోయి నిద్ర పో. (సేవకుడు వెళ్ళిపోతాడు) నా హస్తం వంకకు అభిముఖమైన పిడితో కంటిముందు కన్పించే యిది ఛురికయేనా? రా, వచ్చి నా హస్తాన అమరిపో. ఏమిటిది? నీవు నా చేతికి చిక్కటం లేదు? కానీ ఇంకా నా కంటిముందు కనిపిస్తూనేవున్నావు. నేత్రాలముందు గోచరించటమే గాని నీవు స్పర్శకందని అరిష్టసూచకమైన కేవలమొక దృశ్యానివి మాత్రమేనా? లేక నీవు నా మనస్సులో మాత్రమే ఉనికిని గొన్న ఛురికవా? భావోద్రేకాన్ని పొందిన నా బుద్దిలోనే పుట్టి వెలికి వెడలివచ్చిన ఒక అసత్యసృష్టివా? అయితే ఒరనుంచి నేనిప్పుడు లాగుతున్న యీ ఛురికలాగానే నీవు ఎంతో విస్పష్టమైన రూపంతో నాకు కనిపిస్తున్నావు. నే పయనిస్తున్న మార్గానికి హర్కారాతనాన్ని నెరపుతూ నాకు నీవు ప్రయోగింప వలసిన సాధనంగా గోచరిస్తున్నావు. ఇతరాలైన నా ఇంద్రియాలు వాటిని చూచి పరిహసించేటట్లు నీవు నా నేత్రాలను మోసగించనైనా మోసగిస్తుండాలె లేదా నీవు సత్యమైన రూపం కలదానివే అయితే, నీ అస్తిత్వాన్ని గుర్తించలేని నా ఇతర సర్వేంద్రియాలతో కేవలమొక్క నా నేత్రద్వయమే తుల్యమూల్యమైనదైనా అయివుండాలె. నీవింకా నా కంటిముందు సుసత్యంగానే కన్పిస్తున్నావు. నీ వాదరమీద, పిడిమీద తొలుతగా నీవు కన్పించినప్పుడు లేని నెత్తురు చుక్కలు కన్పిస్తున్నాయి. 381 32 ఇదంతా నా హత్యావ్యవసాయం నేత్రాలముందు గోచరించటం కోసం కల్పితమైందే తప్ప సత్యమైంది కాదు. ఇటువంటిది నిజానికి లేనే లేదు. ఇదంతా నా భ్రాంతి! ఒక ప్రపంచార్ధ గోళంలో ఇప్పుడు సమస్తప్రకృతీ మృతినొందినట్లు తోస్తున్నది. ప్రశాంతమైన నిద్రాస్థితిని దారుణస్వప్నాలు కళవళపెడుతున్నట్లు కన్పిస్తున్నది. ఇష్టనివేదనలతో కరాళమూర్తి యైన హెకేటు" తంత్రక్రియలు సాగించటానికని మంత్రగత్తెలు సమావేశమైనారు. కావలికాడై కాలాన్ని తెలియజేసి క్రియాచరణకు మేల్కొల్పే తోడేలు కూత విని, బక్కచిక్కిన హంతకుడు లుక్రీషియాను చెరచటానికని ఆమె పర్యంకం దగ్గిరకు వెళ్ళుతున్న టార్క్విన్ వేసిన అడుగుల్లా సద్దులేని పెద్ద అడుగులతో భూతమో అన్నట్లు హతమార్చదలచిన వ్యక్తి దగ్గరకు కదలిపోతున్నాడు. ఘనరూపవుగా నా పాదాల క్రింద గాఢఖచితవైన ఓ పృథ్వీ! నా పాదవిన్యాసధ్వనులను వినిపించుకోకు. అవి ఏ దిక్కుకు నడుస్తున్నాయో గమనించకు. అలా చేశావో నీలోని శిలలే గగ్గోలు పెట్టి నా నిర్ణీత ప్రదేశాన్ని బయట పెట్టేస్తాయి. నేనిప్పుడు నిర్వహింపబోతున్న భీకర కృత్యానికెంతో అనువుగా ఉన్న ఇప్పటి నిశ్శబ్దానికి భంగపాటు కల్పించి కాలంలోని దారుణత్వాన్ని తరిమివేస్తాయి. 33 నేనిలా వాచాలతను చూపుతున్నంతసేపు అతడు సజీవుడై ఉంటూనే వుంటాడు. కేవలం వట్టిమాటలు కృత్య నిర్వహణోత్సాహాన్ని చల్లార్చివేస్తాయి. (ఘంటిక వినిపిస్తుంది) ఇక నేను వెళ్ళటమంటే ఆ చర్య జరిగిపోయిందన్న మాటే! అదిగో! ఘంటిక. కార్యనిర్వహణార్థం నన్నాహ్వానిస్తున్నది!! డంకన్! నీవా ఘంటికను వినకు! అది నిన్ను స్వర్గానికో లేక నరకానికో ఆహ్వానించే మృత్యుఘంటిక. కనుక నీవు దాన్ని వినకు!! (నిష్క్రమిస్తాడు) మేక్బెత్ ప్రభ్వి మళ్లీ ప్రవేశిస్తుంది. 34 మేక్బెత్ ప్రభ్వి : వాళ్ళనేది ఉన్మత్తులను చేసిందో అది నా ధైర్యాన్ని మేల్కొల్పింది. ఏది వాళ్ళను చల్లబడజేసిందో అది నాలోని అగ్నిని రగుల్కొల్పింది. ఇష్! ఎక్కడి దా ధ్వని? ఓహో! ప్రాణహరణవేళ జీవులకు ఏదో తెలియజేయటానికని విధి నియమించిన ఘంటికాకారుడిలా అదిగో... ఉలూకం కేక పెట్టింది. ఆయన ఆ కృత్యాన్ని నిర్వర్తించటానికని వెళ్ళారు. ఆ ద్వారాలన్నీ తెరిచివున్నాయి. తప్పత్రాగిన రక్షకులు నిద్రలో గురకలు పెడుతూ రాజరక్షణమనే పరిహాస నాటికను అభినయిస్తున్నారు. 382 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 వారికిచ్చిన పానీయాలలో నేను కొన్ని ఓషధులను కలపటం వల్ల వారిలో జీవమరణాలమధ్య సంకులసమరం సాగుతున్నది. తత్ఫలితంగా వారు జీవించనూ వచ్చు లేదా మరణించనూవచ్చు. మేక్బెత్ : (లోపల) ఎవరక్కడ? అయ్యో! ఏమిటది?
మేక్బెత్ ప్రభ్వి : అయ్యో! పరిచారకులు మేల్కొనివుంటారా? ఆ పని జరిగివుండదు. కార్యరూపాన్ని ధరించని యత్నం నన్ను కలవరపెడుతున్నది. ఏమాధ్వని? వారికోసం నేను ఛురికను సిద్దపరిచేవచ్చాను. కృత్యనిర్వహణంలో నా భర్త విఫలుడు కాకూడదే! నిద్రిస్తూన్న మహారాజు నా తండ్రిని పోలి నాకు కన్పించి ఉండకపోయినట్లయితే నేనే ఈ కృత్యాన్ని నిర్వర్తించి వుండేదాన్ని. ప్రియసతీ! మేక్బెత్ ప్రవేశిస్తాడు. మేక్బెత్ : నేనాకృత్యాన్ని పరిపూర్తిని కల్పించాను. నీకు శబ్దమేమీ వినిపించలేదూ? మేక్బెత్ ప్రభ్వి : ఒక గ్రుడ్లగూబ కేక, కీచురాళ్ళ ఏడ్పు వినిపించింది. మీరేమీ మాట్లాడుకోలేదా? మేక్బెత్ : ఎప్పుడు? మేక్బెత్ ప్రభ్వి : ఇప్పుడే. మేక్బెత్ : నేను పైనుంచి దిగివస్తున్నప్పుడా? మేక్బెత్ ప్రభ్వి : అవును. మేక్బెత్ : విను. ఆ ధ్వనేమిటో? డంకన్ కక్ష్యకు ప్రక్కగదిలో నిద్రించే దెవరు? మేక్బెత్ ప్రభ్వి : డోనాల్బెయిన్. మేక్బెత్ : (తన హస్తాలను చూస్తుంటాడు) మేక్బెత్ ప్రభ్వి : దీన్ని దీనదృశ్యం అని అనటం కేవలం అజ్ఞానవిలసితమైన అభిప్రాయం. మేక్బెత్ : ఒకడు నిద్రలో నవ్వుతున్నాడు. రెండోవాడు 'హత్య!' అని కేకపెట్టాడు. ఒకరినొకరు మేల్కొల్పుకొన్నారు. వారు మాట్లాడుకొంటుంటే నేను నిలిచి విన్నాను. వాళ్ళు ప్రార్థనలు చెప్పుకొని తిరిగి నిద్రకు సంసిద్ధులైనారు. 383 మేక్బెత్ ప్రభ్వి : ప్రక్క కక్ష్యలో ఇరువురు నిద్రిస్తున్నారు. మీరు చెప్పినదంతా అక్కడే జరగటానికి అవకాశముంది. మేక్బెత్ : అందులో ఒకడు 'భగవంతుడు రక్షించుగాక!' అని అన్నాడు. రెండోవాడు 'అగుగాక!' అన్నాడు. ఈ హంతకహస్తాలతో ఉన్న నన్ను చూసి వారు భయపడి నట్లున్నారు. 'భగవంతుడు రక్షించుగాక!' అని వారన్నప్పుడు నేను 'అగుగాక!' అని అనలేకపోయినాను. మేక్బెత్ ప్రభ్వి : మీరు ఆ విషయాన్ని గురించి అంతగా ఆలోచించవద్దు. మేక్బెత్ : అయితే నేనప్పుడు 'అగుగాక!' అని ఎందుకు అనలేకపోయినాను? ఆ సమయంలో పరమేశ్వరానుగ్రహం నాకెంతైనా కావలసివుంది. కానీ నా గొంతుకలో 'అగుగాక!' అన్నమాటలు తట్టాడి కొట్టుకులాడాయి కూడాను. మేక్బెత్ ప్రభ్వి : ఈ విషయాలనుగురించి ఈ రీతి ఇంత తీవ్రంగా ఆలోచించరాదు. ఆలోచిస్తే అవి మనలను వెర్రివాళ్ళను చేసివేస్తాయి. మేక్బెత్ : 'నిద్రించకు. మేక్బెత్ నిద్రను హత్య చేశాడు!' అని ఏదో ఒక గొంతుక కేక పెట్టినట్లు నాకు వినిపించింది. నిద్ర! అమాయకపు నిద్ర!! శ్రద్ధ అనే చిక్కుముళ్ళు పడ్డ చీనిపింజలను సవరించి వస్త్రరూపాన బంధించే నిద్ర!! అనుదిన మృత్యువైన నిద్ర!! అది అలసిన శ్రమకు స్నానం! గాయపడిన మనస్సుకు కమనీయమైన అంజనం!! ఉదాత్తమైన ప్రకృతి చేసే విందులో ద్వితీయ వ్యంజన ప్రసారం!!" జీవితపు విందులో ప్రబలమైన బలవర్ధకం!! మేక్బెత్ ప్రభ్వి : ఈ ధోరణేమిటి? మేక్బెత్ : 'ఇక నిద్రపోవద్దు. గ్లామిస్ నిద్రనే హత్య చేశాడు. కౌడర్ ఇక నిద్రపోడు!' అని ఆ గొంతుక గృహమంతా ప్రతిధ్వనించేటట్లు కేకలు పెట్టి పలికింది. మేక్బెత్ ప్రభ్వి : ఇలా కేకలు పెట్టింది ఎవరు? ఉదాత్త థేన్ మహాశయా! వృథాగా ఈ విషయాలను గురించి మతికేదో మహావ్యాధి సంక్రమించినట్లు తలపోస్తూ, మీ సర్వశక్తినీ దిగజార్చుకొంటున్నారు. వెళ్ళండి. నీరు తెచ్చుకొని చేసిన హత్యకు నీచసాక్ష్యంగా కన్పించే ఈ నీలరక్తపంకాన్ని మీ చేతులమీద నుంచి కడిగివేయండి. ఆ ఛురికల నిక్కడి కెందుకు తెచ్చారు? అవి అక్కడనే ఉండాలి. తీసుకువెళ్ళండి. నిద్రిస్తున్న ఆ సేవకుల శరీరాలను రక్తంతో పులిమిపెట్టండి. 384 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మేక్బెత్ : మళ్ళా ఇక నేనక్కడికి వెళ్ళను. చేసినదాన్ని గురించి ఊహించటానికే భయకంపితుడనౌతున్నాను. తిరిగి దాన్ని చూడటానికి సాహసించలేను. మేక్బెత్ ప్రభ్వి : అయ్యో! మీరెంతటి దుర్బలచిత్తులు! ఆ ఛురికలనిలా ఇవ్వండి. నిద్రితులు, మృతులు కేవలం చిత్రరూపాలు. వారిని గురించి ఇంతటి భయమేమిటి? చిత్రాలలోని భూతాలను చూసి చిన్నపిల్లల కళ్ళు భయపడతాయి. దోషం వారిదిలా కనిపించాలి కనుక ఆయాసపడే వారి శరీరాల నుంచి ఇంకా రక్తం స్రవిస్తుంటే దానితో వాళ్ళ ముఖాలను పులిమి పెడతాను. (నిష్క్రమిస్తుంది. లోపల చప్పుడు వినిపిస్తుంది) మేక్బెత్ : ఈ శబ్ద మెక్కడినుంచి? వినిపించే ప్రతిశబ్దం నన్నింత వింతగా తికమక పెడుతున్నదేమిటి? అయ్యో! నా హస్తాలెలా రక్తపంకిలా లైనాయి? నేత్రచషకాలనుంచీ నా కన్నులు చీల్చుకొని విడివడిపోతున్నాయి! నా హస్తాలనుంచీ ఈ రక్తమాలిన్యాన్ని కడిగివేయటానికి ఘనుడైన నెప్ట్యూన్ " పాలించే మహాసముద్రంలోని నీరసర్వస్వమైనా చాలుతుందా? చాలదు. ఆ సముద్రంలోని అనంతవీచికలను నా హస్తాలు కెంపుచేసి వాటి హరితవర్ణాన్నంతటినీ ఒకేరీతి రక్తవర్ణంగా పరిణమించేటట్లు చేస్తాయి. మేక్బెత్ ప్రభ్వి తిరిగి ప్రవేశిస్తుంది. మేక్బెత్ ప్రభ్వి : మీ హస్తాలలాగానే, ఇవిగో, నా హస్తాలు కూడా ఎర్రబడ్డాయి. అయితే మీ వలె శ్వేత హృదయాన్ని వహించటానికి నేనెంతో సిగ్గుపడతాను (లోపల శబ్దం వినిపిస్తుంది) ఏదో శబ్దం దక్షిణద్వారం దగ్గరనుంచి వినిపిస్తున్నది. ఇక మన కక్ష్యకు వెళ్ళిపోదాం. కొంచెం నీరు చాలు మనకూ, ఈ కృత్యానికీ ఉన్న సమస్తబంధాన్నీ కడిగివేస్తుంది. ఎంతో సుగమంగా పని జరిగేపోయింది. అయితే మీ స్థిరనిశ్చయం మిమ్మల్ని మధ్యలో విడిచిపుచ్చింది. (లోపలనుంచి మళ్ళీ శబ్దం వినిపిస్తుంది) వింటున్నారా, శబ్దమింకా ఎక్కువౌతున్నది. మీ రాత్రి దుస్తులను ధరించండి. లేకపోతే కనిపించటంవల్ల బయటికి రావాలసివస్తుంది. అప్పుడు రాత్రంతా మనం మేల్కొన్నామని బయటపడవచ్చు. మీరింత దీనమైన ఆలోచనలల్లో మునిగిపోకూడదు సుమా! మేక్బెత్ : నన్ను గురించి నా స్మృతి నాకున్నంతకాలం నేను చేసిన చర్య నాకు స్మరణకు వచ్చి తీరుతుంది. కనుక నేను నన్నే మరిచిపోవటం ఉత్తమం! (లోపల మళ్ళీ శబ్దం 385 వినిపిస్తుంది) డంకన్! నీవు ఇలాగే ధ్వనిచేస్తూ మేల్కో! నీకేగనక శక్తుంటే ఓ డంకన్! ఇలాగే ధ్వనిచేస్తూ నీవు మేల్కొనాలని నా అభిలాష! (నిష్క్రమిస్తాడు. లోపలనుంచి శబ్దం వినిపిస్తుంది. ద్వారపాలకు డొకడు ప్రవేశిస్తాడు.) ద్వారపాలకుడు : అబ్బా! ఎంత గొప్ప ధ్వని! ఈ ద్వారాన్ని తెరవటమంటే నరక ద్వారపాలకుడు చేయదగ్గ పనిలా ఉంది. (లోపలనుంచి మరింతగా ధ్వని వినిపిస్తుంటుంది) 38 ధ్వని చేయండి! ఇష్టం వచ్చినంత గట్టిగా ధ్వని చేయండి!! బీల్జిబబో పేరు చెప్పి ప్రశ్నిస్తున్నాను. లోపలున్నవారెవరు? ఇందున్నదెవరో కాని నరకంలో ప్రవేశపెట్టదగ్గవాడు. ఇతడు సస్యం సమృద్ధిగా పండటంచేత ధరలు పడిపోతాయేమో నన్న భయంతో ఆత్మహత్య చేసుకొన్నవాడిలా ఉన్నాడు. ఓ కృషీవలుడా! నీవు సరిగా సమయానికి వచ్చావు. ఇక్కడ ఎంతో విశేషంగా చెమట పోస్తున్నది. చాలినన్ని హస్తవసనాలను తెచ్చుకో, (లోపల మళ్ళీ శబ్దం వినిపిస్తుంది) తట్టండి! గట్టిగా తట్టండి!! మరో భూతంలా ఇంకా ఎవరో ఉన్నారు. అదెవరు? ఓహో! ఒక విషయంలో ఒకమారు ఔనని, మరోమారు కాదని పల్కి భగవత్సంబంధమైన దోషాన్ని ఆచరించటంవల్ల స్వర్గాన్ని పొందలేకపోయిన జెసూటువా! నీవు! సరే, ఓ జెసూట్! 39 రా! (లోపలనుంచి మళ్ళీ ధ్వని వినిపిస్తుంది) 40 నీవెవరు? ఓహో. ఇతడు ఆంగ్లసీవనకారుడై ఉంటాడు. నీవిక్కడ ఇస్త్రీ చేసుకొంటుండవచ్చు. (మళ్ళీ ధ్వని వినిపిస్తుంది) మళ్ళీ ధ్వనా? ఇది శాంతించేటట్లు లేదు. ఇదెవరు? ఈ స్థలం నరకంలాకాక అతిశీతలంగా ఉంది. ఉష్ణంతో ఉండే నరకంలోని ద్వారపాలకుడు నిర్వహించవలసిన పాత్రను ఇక్కడ ఉండి నేను నిర్వహించలేను. నానావృత్తులకు సంబంధించినవాళ్ళ నందరినీ ఇందులోకి ప్రవేశపెడతాను. ఇక్కడ కొంతకాలం విలాసాలతో గడిపి వాళ్ళు తరువాత నిత్యముండే నరకంలో పడతారు. 386 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 (మళ్ళీ ధ్వని వినిపిస్తుంది) వస్తున్నాను! త్వరపడకండి. ఈ ద్వారపాలకుణ్ణి" మరిచిపోకండి!! (ద్వారాన్ని తెరుస్తాడు) మాక్డఫ్, లెన్నాక్స్ ప్రవేశిస్తారు. మాక్డఫ్ : ఏమోయ్ మిత్రుడా! తలుపు తీయడానికి ఇంత ఆలస్యమైందేం? రాత్రి నిద్రపోయేటప్పటికి ఆలస్యమైందా ఏమిటి? ద్వారపాలకుడు : ఆర్యా! మేము రెండో మారు కోడి కూసేదాకా త్రాగుతూనే ఉన్నాము. మాక్డఫ్ : మీ యజమాని మేల్కొనివున్నారేమో నీకు తెలుసా? అదుగో, ఆయన ఇక్కడికే వస్తున్నారు. బహుశః మేము చేసిన ధ్వనులు ఆయనను మేల్కొల్పి ఉంటాయి. మేక్బెత్ తిరిగి ప్రవేశిస్తాడు. లెన్నాక్స్ : మహోదయా, సుప్రభాతం! మేక్బెత్ : మీ ఇరువురికీ సుప్రభాతం!! మాక్డఫ్ : థేన్ మహాశయా! మహారాజులు నిద్ర మేల్కొన్నారా? మేక్బెత్ : ఇంకా లేదు. మాక్డర్ : ఉదయమే పెందలకడ మేల్కోవలసిందని నన్నాఙ్ఞాపించారు. ఇప్పటికే ఆలస్యమైనదనుకొంటుంటారు. మేక్బెత్ : అయితే నేను మిమ్మల్ని వారి దగ్గరకు తీసుకుపోతాను. మాక్డఫ్ : ఇటువంటి శ్రమ తీసుకోవటం మీకు సంతోషప్రదమైన కృత్యమని నాకు తెలుసు. నేనే ఒంటరిగా వెళ్ళి వారి దర్శనం చేసివస్తాను. మేక్బెత్ : ఏ శ్రమంటే మనకు సంతోషదాయకమో దానివల్ల కలిగే శారీరకబాధకు తగ్గ బహూకృతి దానిలోనే ఉంటుంది. మాక్డఫ్ : ఆ కర్తవ్యాన్ని మహారాజులు నాకు నిర్దేశించారు. కనుక వెళ్ళి మేల్కొల్పటానికి నేనే ధైర్యం చేస్తాను. (నిష్క్రమిస్తాడు) 387 లెన్నాక్స్ : మహారాజులు తిరిగి ఈ నాడే వెళ్ళిపోతారా? మేక్బెత్ : అవును. వెళ్ళిపోతారు. వారు చేసుకొన్న ఏర్పాటు ఇదే! లెన్నాక్స్ : క్రితం రాత్రి తుపానుతో, గందరగోళంతో గడిచిపోయింది. మేము విడిసినచోట దీపికలు ఆరిపోయాయి. ఎన్నో రీతులైన రోదనధ్వనులు వినిపించాయని చెప్పుకొన్నారు. చావు కేకలు విన్పించాయట! ఆ ఆక్రోశాలలో కొన్ని ఆ రీతిగా భయంకరమైన కాలప్రవృత్తికి అనుగుణంగా మున్ముందు అన్ని రంగాలలోను మహోత్పాతాలు సంభవింపనున్నాయని ఘోషిస్తూ జోస్యం చెప్పాయట!! సంజ్వరం కలిగినట్లు పృథివి చలించిపోయిందని కొందరు చెప్పుకొన్నారు. మేక్బెత్ : గడచిన రాత్రి మహాభీకరమైందే? లెన్నాక్స్ : నా యువజీవితంతో దీనితో తుల్యమైన మరొక తుపాను కలిగినట్లు జ్ఞప్తిలో లేదు. మాక్డఫ్ తిరిగి ప్రవేశిస్తాడు. మాక్డఫ్ : దురంతం! దురంతం!! నాలుక పలుకలేని దురంతం! మనసు ఊహించలేని దురంతం!! మేక్బెత్, లెన్నాక్స్: సంగతేమిటి? ఏం జరిగింది? మాక్డఫ్ : వినాశకశక్తి పరిపూర్ణమైన విజయాన్ని పొందింది. దైవద్రోహమైన హత్య పవిత్రీకృతమైన మన ఆలయాన్ని, మహారాజశరీరాన్ని, బ్రద్దలుకొట్టి ప్రాణహరణం చేసింది. మేక్బెత్ : మీరు అనేదేమిటో నాకు బోధపడటం లేదు. ప్రాణహరణమా? లెన్నాక్స్ : మీరు అనేది మహారాజు గురించేనా? 44 మాక్డఫ్ : అవును. ఆయన కక్ష్యలో ప్రవేశించి క్రొంగొత్త గార్గిన్ లో చేసిన చర్యలా కన్పించే ఆ బీభత్సదృశ్యాన్ని చూసి మీ కన్నులకు కళవళపాటును కల్పించుకోండి. ఇక నన్నేమీ ప్రశ్నించకండి. వెళ్ళి చూసి స్వయంగా తెలుసుకోండి (మేక్బెత్, లెన్నాక్స్ నిష్క్రమిస్తారు) మేల్కోండి! సౌధనివాసులారా, మేల్కోండి!! హెచ్చరిక చేసే ఘంటికను మ్రోయించండి! రాజద్రోహం! బాంకో, డొనాల్బెయిన్, మాల్కోం మేల్కొండి!! మృత్యువుకు 388 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఛాయారూపంగా గోచరించే మీ మృదులమైన నిద్రను విదలించి వెయ్యండి. కేవలం మృత్యువునే దర్శించండి!! లెండి, లెండి! దర్శించండి!! ప్రళయకాలప్రతిరూపమైన దృశ్యాన్ని దర్శించండి!! మాల్కొం, బాంకో! సమాధులనుంచో అన్నట్లుగా మీరు లేవండి! ఈ భయంకర దృశ్యానికి తగినట్లు ప్రేతరూపాల్లో బయలుదేరి రండి!! ఘంటికను మ్రోగించండి!! (హెచ్చరిక చేసే గంట మ్రోగుతుంది) మేక్బెత్ ప్రభ్వి ప్రవేశిస్తుంది. మేక్బెత్ ప్రభ్వి : ఇలా ఘోరంగా ఘంటికలను మ్రోగించి నిద్రిస్తున్న సౌధనివాసులు నందరినీ సమావేశం కావలసిందని పిలువవలసిన పని ఏమి వచ్చిపడ్డది? పలకరేం? మాక్డఫ్ : మహోదయా! మేము విన్నవించేదాన్ని మీరు వినటం ఉచితం కాదు. అది చెవుల బడితే స్త్రీని హత్యచేసినంతౌతుంది. (బాంకో ప్రవేశిస్తాడు.) బాంకో, బాంకో! మన యజమానిని, మహారాజును హత్య చేశారు! మేక్బెత్ ప్రభ్వి : అయ్యో! ఏమది? మా సౌధంలోనే? బాంకో : ఎక్కడ జరిగినా అది దారుణమైన క్రూరకృత్యం. ప్రియమైన డఫ్, నిన్ను ప్రార్థిస్తున్నాను. నీవు చెప్పినదాన్ని కాదని అనను. నేను చెప్పింది అసత్యమని అను! మేక్బెత్, లెన్నాక్స్ తిరిగి ప్రవేశిస్తారు. మేక్బెత్ : ఈ ఉపద్రవానికి ఒక గంట ముందుగా నేను మరణించి ఉన్నట్లయితే జీవితమంతా ఎంతో సంతోషంతో బ్రతికినవాడినయ్యేవాణ్ణి. ఈ క్షణంనుంచీ ఈ మానవ ప్రపంచంలో 'నీవు నాకోసం జీవించ' మని నన్ను కోరే ఉదాత్తుడింకెవరున్నారు? ఇక నాకు మిగిలినవారందరూ ఆటబొమ్మలు. అనుగ్రహం, విఖ్యాతి, రెండూ అంతరించాయి. జీవిత ద్రాక్షాసవం ఒలికి పోయింది. గర్వించి చెప్పుకోటానికి మరి పృథివికిక మడ్డితప్ప ఏమీ మిగలలేదు! మాల్కొం, డొనాల్బెయిన్ ప్రవేశిస్తారు. డొనాల్బెయిన్ లోపమేమి జరిగింది?
389 మేక్బెత్ : అయ్యో! లోపం జరిగింది! మీకు తెలియకుండానే మీకు లోపం జరిగింది. జీవితమనే చెలమకు మూలమైన నీటిబుగ్గను నిలిపివేశారు. మీ జీవితాన్ని ఆపివేశారు. మాక్డఫ్ : మీ తండ్రిని, మహారాజును, హత్య చేశారు? మాల్కొం : అయ్యో! ఆ పని చేసిందెవరు? లెన్నాక్స్ : మా బుద్ధికి తోచినంతలో ఆయన శయ్యాగృహరక్షకులు, వారి హస్తాలు, ముఖాలు రక్తపంకిలాలై ఉన్నాయి. ఇంకా వాటిని తుడవనైనా లేదు. అవి మాకు వారి తలగడలమీద కన్పించాయి. ఒక్కమారు వారు గ్రుడ్లు విప్పి మమ్మల్ని చూచారు. మేము భయభ్రాంతులమైనాము. ఎంతటివారైనా ప్రాణాపాయం లేదని నమ్మి వారి ప్రాంతానికి వెళ్ళటం క్షేమం కాదు. మేక్బెత్ : ఆ సేవకులే స్పష్టంగా దోషులని ప్రత్యక్షంగా తెలిసిపోయినప్పటికీ, కోపతన్మయత్వంలో వారిని హతమార్చినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. మాక్డఫ్: మీరెందుకలా చేయవలసి వచ్చింది? మేక్బెత్ : అట్టిస్థితిలో మనస్సంక్షోభాన్ని పొందుతూ వివేకంతోను, కోపోద్రేకాన్ని వహించి సమచిత్తంతోను, రాజభక్తిని భరిస్తూ ఉపేక్షాభావంతోను ఎవరుండగలరు? మానవుడెవడూ ఉండలేడు! మహారాజునెడ నాకు గల ప్రేమతీవ్రత, నిలుకడను కల్పించే నా వివేచనశక్తిని త్రోసిరాజన్నది. రక్తపుచారికలతో ఒక వంక బంగారు తీగలను కూర్చి అల్లిన రజతవస్త్రంలాగాను, వినాశశక్తి బలవంతంగా ప్రవేశించి తన దుష్కృత్యాన్ని నిర్వర్తించటానికని ప్రకృతి శరీరంలో పడ్డ గండ్లలా తోచే సందులువడ్డ గాయాలతోను ఒక వంక మహారాజు శరీరమూ, మరొకవంక హంతకులు వారి వృత్తికి చిహ్నమైన రక్తవర్ణంతోను ఘోరంగా పేరుకొన్న నెత్తుటిజాళ్ళతోను కనిపిస్తుంటే, ప్రేమించనేర్చినదీ, ఆ ప్రేమను ప్రదర్శించటానికి యోగ్యమైన సాహసం కలదీ అయిన హృదయం కలవాడెవడు నావలె వ్యవహరించకుండా ఊరుకొంటాడు? మేక్బెత్ ప్రభ్వి : అయ్యో! సాయపడండి! మాక్డఫ్ : ఆమె విషయంలో అతిశ్రద్ధ తీసుకోండి! 390 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మాల్కొం : (డొనాల్బెయిన్ ) దుఃఖంలో మునిగిపోదగినంతటి కారణం ఉండికూడా మనం ఊరుకోటం ఎందుకు? డొనాల్బెయిన్ : (మాల్కొంతో అనుమానించటానికి అవకాశంలేని రహస్యమైన ఏమూలనో దాగి అదృష్టం కూడా అమాంతంగా మీదపడి మనను హతమార్చేటట్లున్న ఈ ప్రదేశంలో, ఎంత దుఃఖమున్నా వ్యక్తం చెయ్యటం ఎలా? ఇక్కడినుంచి వేగంగా వెళ్ళిపోదాం. కార్చటానికింకా మనకన్నీరు సిద్ధం కాలేదు. మాల్కొం : (డొనాల్బెయిన్ తో) ఘనమైనదైనప్పటికీ మన దుఃఖం తన్ను తాను ప్రదర్శించుకొనే రూపాన్ని పొందలేదు. బాంకో : ఆమె విషయం శ్రద్ధ తీసుకోండి. (సేవకులు మేక్బెత్ ప్రభ్విని తీసుకోపోతారు) దరిదాపు నగ్నంగా ఉన్న శరీరాలకు చలిదెబ్బ తగలకుండా వస్త్రధారణ చేసివచ్చి తిరిగి సమావేశమై ఈ దారుణచర్యను గురించి విశేషమైన విచారణ సాగిద్దాం. ఇప్పుడు భయాలు, అనుమానాలు మనను కలతపెడుతున్నాయి. నన్ను సర్వేశ్వరుని పరంచేసుకొని ఆయన ప్రసాదించే రక్షతో కార్పణ్యాన్ని వహించి, రాజద్రోహం చేసిన ద్రోహుల రహస్యోద్దేశాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మాక్డఫ్ : అందుకు నేనూ సిద్ధంగా ఉన్నాను. అందరు : మేమూ అంతే. మేక్బెత్ : వేగంగా మనమందరం యుద్ధోచితవేషాలను ధరించి అంతశ్శాలలో సమావేశమౌదాము. అందరు : ఇది ఎంతో తృప్తికరంగా ఉంది. ఎంతో బాగుంది. (మాల్కొం, డొనాల్బెయిన్ తప్ప అందరూ నిష్క్రమిస్తారు) మాల్కొం : మరి మనమేమి చేద్దాం? వీరితో సాహచర్యం మనకు వద్దు. అనుభవించని దుఃఖాన్ని ప్రకటించటం అసత్యశీలురకు అతిసుగమమైన కృత్యం. నేను ఇంగ్లండుకు వెళ్ళిపోతాను. డొనాల్బెయిన్ : నేను ఐర్లండుకు చేరిపోతాను. ఇరువురి గమ్యస్థానాలు వేరువేరుగా ఉండటంవల్ల ఇరువురికీ భద్రత ఉంటుంది. ప్రస్తుతం మనం ఉంటున్న ఇక్కడి వ్యక్తుల చిరునవ్వుల్లో చిరుకత్తులు కనిపిస్తున్నాయి. సన్నిహితులైన రక్తబంధువులైన కొద్దీ వారిలో రుధిరదాహం విశేషంగా కనిపిస్తున్నది. 391 మాల్కొం : హంతకుని ధనువునుంచి విడువబడ్డ దారుణబాణ మింకా దాని చరమలక్ష్యాన్ని చేరుకోలేదు. ఆ లక్ష్యపథాన్ని విడిచిపెడుతూ తప్పుకొని చరించటమే మనకు క్షేమకరమైన మార్గం. అందువల్ల మనం అశ్వాలను అధిరోహిద్దాం. సెలవు తీసుకోవాలన్న ప్రత్యేకశ్రద్ధ ఏమీ పెట్టుకోవద్దు. వేగంగా వెళ్ళిపోదాం. చోరుల్లా కేవలం మన శరీరాలతోనే జారుకొందాము. తమ భద్రత అన్నదే వారికి ఏకైకకాంక్ష అయినప్పుడు, చోరులు తమ శరీరాలను తామే కాజేసుకోపోవటం ధర్మం కదా! (నిష్క్రమిస్తారు) రెండో దృశ్యం రాస్, ఒక వృద్ధుడు ప్రవేశిస్తారు. వృద్ధుడు : గడచిన నా డెబ్బది సంవత్సరాల జీవితం జ్ఞప్తికుంది. విపులమైన ఈ కాలంలో భయంకరాలు, విచిత్రాలు అయిన సంఘటనలు జరిగిన ఎన్నో సమయాలను నేనెరుగుదును. కానీ ఈ భీకరమైన కాళరాత్రి నా పూర్వానుభవాల నన్నిటినీ అతిశయించింది. రాస్ : ప్రపంచఘాతుకరంగస్థలంమీద మానవుడు అభినయిస్తున్న పాత్రను చూచి కోపాన్ని వహించి అకసం దాన్ని నాశనం చేస్తానని భయపెట్టటం నీవు చూచావు కదా! గడియారం వల్ల ఇది పగలని తెలుస్తున్నది. కానీ పయనించే దీపమైన సూర్యుణ్ణి కారుమొయిళ్ళు కప్పివేయటం వల్ల కాళరాత్రిలా కన్పిస్తున్నది. జీవితప్రదానం చేసే సూర్యరశ్మిని చుంబించవలసిన ఈ సమయంలో పృథ్వీముఖాన్ని గాఢాంధకారం క్రమ్మివేసింది. వృద్ధుడు : జరిగిపోయిన కృత్యంలా ఇదీ ఎంతో అసహజమైంది. గడచిన బుధవారంనాడు అది ఎంత ఎత్తున ఎగురకలదో అంత ఎత్తూ ఎగిరి విహరిస్తున్న ఒక శ్యేనాన్ని, సామాన్యంగా మూషికాలను తిని బ్రతికే ఒక ఉలూకం వెంటబడి తరిమికొట్టింది. రాస్ : మరో విచిత్రమైన విషయం జరిగింది. మనోజ్ఞలు, త్వరితగమనాలు అయిన డంకన్ అశ్వరాజాలు, తమ జాతిలో కల్లా అత్యుత్తమాలు, హఠాత్తుగా స్వభావం మారటం చేత మందురానుంచి తప్పించుకొని విడివడి పాలకులను లక్ష్యపెట్టకుండా మానవజాతిమీద యుద్ధాన్ని ప్రకటించగోరుతున్నట్లు ప్రవర్తించాయి. 392 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 వృద్ధుడు : అవి ఒకదాని నొకటి తినివేశాయని చెప్పుకొన్నారు. రాస్ : ఆ వార్త సత్యమే అది నా కళ్ళముందే జరిగింది. నేనెంతో ఆశ్చర్య పడ్డాను. అడుగో! మాక్డఫ్ మహాశయుడు వస్తున్నాడు. ఆర్యా, విశేషాలేమిటి? మాక్డఫ్ ప్రవేశిస్తాడు మాక్డఫ్ : మీరూ గమనించటం లేదా? రాస్ : సామాన్యమైన హత్యకంటే అత్యధికమైన ఆ ఘోరకృత్యాన్ని చేసినదెవరో బయటపడ్డదా? మాక్డఫ్ : మేక్బెత్ హతమార్చిన ఆ సేవకులే చేసివుంటారు. రాస్ : అయ్యో! అలా చేయటంవల్ల వాళ్ళు ఆశించిన ప్రయోజనం ఏమై ఉంటుంది? మాక్డఫ్: సరే, వాళ్ళనెవరో రహస్యంగా ప్రేరేపించి ఉంటారు. మహారాజపుత్రులు మాల్కొం, డొనాల్బెయిన్ ఇరువురూ ఎవరికీ తెలియకుండా ఎక్కడికో తప్పించుకో పోయారు. ఈ పరిస్థితివల్ల ఆ చర్య చేసింది వాళ్ళేనన్న అనుమానానికి తావు కలిగింది. రాస్ : స్వభావానికి విరుద్ధంగా జరుగుతున్న కృత్యాలకు ఇది మరో ఉదాహరణం. ఇది జీవితం మూలాన్నే నాశనం చేసుకొన్న ప్రతిఫలరహితమైన దురాశ. అయితే ఇక రాజ్యాధికారం మేక్సెత్కు సంక్రమిస్తుందన్నమాట! మాక్డఫ్ : అతణ్ణి రాజుగా ఎన్నుకోటం ఎప్పుడో జరిగిపోయింది. కిరీటధారణకోసం అతను స్కోనుకు వెళ్ళాడు కూడాను. 45 రాస్ : మరణించిన డంకన్ మహారాజు శరీరం ఎక్కడుంది? మాక్డఫ్ : అతని పూర్వుల అస్థికలను భద్రపరచిన పవిత్రాగారమైన కోల్మోకిలోకు తీసుకోవెళ్ళారు. రాస్ : మీరు కూడా స్కోన్కు వెళుతున్నారా? మాక్డఫ్: లేదు. సోదరా నేను ఫైఫ్కు వెళ్ళుతున్నాను. రాస్ : మంచిది. నేను స్కోనక్కు వెళ్ళుతున్నాను. మాక్డఫ్: సరే. అక్కడ మీకు సర్వం క్షేమకరంగా గడచిపోవుగాక! ఈ క్రొత్త వాతావరణంలో మనకు పూర్వంలా భద్రత ఉండకపోవచ్చు. అందుచేత మళ్ళీ మనం కలుసుకోలేకపోవచ్చు. సెలవు. 393 రాస్ : తండ్రీ! మరి శుభం! వృద్ధుడు : చెడును మంచిగాను, శత్రువులను మిత్రులనుగాను మార్చటానికి యత్నించే మీకూ, మీ వలెనే శ్రమించే ఇతరులకూ పరమేశ్వరుడు సర్వశుభాలను చేకూర్చుగాక! (నిష్క్రమిస్తారు) 394 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 తృతీయాంకం ఒకటో దృశ్యం ఫోర్రెస్ రాజసౌధం. బాంకో ప్రవేశిస్తాడు. బాంకో : నీవు మహారాజువైనావు కౌడర్ థేన్వైనావు గ్లామిస్ థేనువైనావు అంతే కాదు, ఆ మాంత్రికురాండ్రు వాగ్దానం చేసినవన్నీయైనావు. కానీ నీవు వారి జోస్యాలకు పరిపూర్తిని కల్పించటంకోసం రాజద్రోహానికి పాల్పడ్డావని నేను భావిస్తున్నాను. అయితే ఆ కిరీటం నీ వంశంలో నిలువదనీ, నేను అనేక రాజులకు మూలపురుషుడనౌతాననీ వారు జోస్యం చెప్పారు. నీ విషయంలో వారి జోస్యాలు చిత్రరీతిని నిరూపితాలైనాయి. ఇలాగే, నీ విషయంలో వారి వచనాలు నిరూపితసత్యాలై భాసించినట్లు, మేక్బెత్, నా విషయంలో కూడా ఎందుకు సత్యాలు కాకూడదు? అవి నాకెందుకాశలు కల్పించకూడదు? ఇక ఆపివేస్తాను. ప్రస్తుతానికి ఇంతే. తుత్తారధ్వని, రాజవేషంలో మేక్బెత్, రాజీవేషంలో మేక్బెత్ ప్రభ్వి, లెన్నాక్స్, రాస్, ప్రభువులు, ప్రభ్విణులు పరివారాలతో ప్రవేశిస్తారు. మేక్బెత్ : నేటిరాత్రి విందులోని మన ప్రధానాతిథి ఇక్కడనే ఉన్నాడు. మేక్బెత్ ప్రభ్వి : వీరిని మరిచిపోయివుంటే మన గొప్ప విందులో కొరత ఏర్పడి, అంతా ఏదో లోపంగా ఉండేది. మేక్బెత్ : ఉత్సవప్రాయంగా జరగనున్న ఈ నాటి రాత్రి విందులో నీవు తప్పక ఉండితీరాలని మా ప్రార్థన. బాంకో : గౌరవనీయులైన తాము నన్ను ప్రార్ధించటమేమిటి? ఆజ్ఞాపించండి. విప్పరాని రాజభక్తి సూత్రాలతో బంధితుడను. కర్తవ్యపాలన శీలంగల మీ సేవకుడను అయిన నేను, ఆ మీ ఆజ్ఞను పాటించి తీరుతాను. మేక్బెత్ : నీవు మధ్యాహ్నం అశ్వవాహ్యాళికి వెళ్ళుతున్నావా? బాంకో: అవును. మహాప్రభూ! 395 మేక్బెత్ : లేకపోతే ఈ నాటి సభలో నీ సరసమైన సలహాను అర్థిద్దామనుకొన్నాను. అది ఎప్పుడూ ఉదాత్తంగానూ, సరసంగానూ ఉంటుంది. సరే. కానీ అందుకు రేపటిదినాన్ని వినియోగిద్దాం. వాహ్యాళికి చాలాదూరం వెళ్ళుతున్నావా? బాంకో : రాత్రి భోజనవేళ లోపల ఎంత దూరం వెళ్ళటానికి వీలుంటే అంత దూరం వెళ్ళుతాను. అంతకంటే వేగంగా నా అశ్వం పయనింపలేకపోతే, చీకటిపడ్డ తరువాత గంటకో, రెండు గంటలకో తిరిగివస్తాను. మేక్బెత్ : విందుకు ఉండితీరాలి సుమా! బాంకో : మహారాజా! వచ్చితీరుతాను. మేక్బెత్ : రక్తవిద్రోహులైన నా సోదరపుత్రుల్లో 47 ఒకరు ఇంగ్లండులోను, ఇంకొకరు ఐర్లండులోను స్థిరపడిపోయినట్లు వింటున్నాను. పితృహత్యాదోషాన్ని అంగీకరింపక పోవటమే కాకుండా, వారు నాకు దుష్కీర్తిని తెచ్చిపెట్టిన వింతకథలను కూడా కల్పించి వెళ్ళిపోయినారు. ఇతరరాజ్యవ్యవహారాలతో బాటుగా ఆ విషయాన్ని గురించి రేపు ప్రసంగిద్దాము. సరే, ఇక నీవు అశ్వాన్ని అధిరోహించటానికి వెళ్ళు. నీవు రాత్రికి తిరిగివచ్చేదాకా మరి సెలవు. ఫియాన్సు నీ వెంట వస్తున్నాడా? బాంకో : అవును, మహారాజా! ఇక మేము బయలుదేరటానికి వేళైంది. మేక్బెత్ : మీ అశ్వాలు జనోపేతాలు, వినిశ్చితపదాలు అగుగాక! ఈ శుభాకాంక్షలతో మిమ్మల్ని అశ్వాలను అధిరోహించమని వాంఛిస్తున్నాను, సెలవు. (బాంకో నిష్క్రమిస్తాడు) రాత్రి ఏడు గంటలవరకూ ఎవరి పనులను వారిని స్వేచ్ఛగా నిర్వర్తించుకోనిస్తాను. మిత్రబృందంతో కలిసి సమావేశాన్ని మనోహరంగా అనుభవించేటందుకుగాను రాత్రి భోజనవేళవరకూ ఏకాంతంగా గడుపుతాను. అంతవరకు సెలవు. (మేక్బెత్, ఒక సేవకుడు తప్ప అందరూ నిష్క్రమిస్తారు) ఒరేయ్! వారు మా ఆజ్ఞలను స్వీకరించటానికి సంసిద్ధులుగా ఉన్నారా? సేవకుడు : చిత్తం మహారాజా! వాళ్ళు ద్వారదేశానికి అవతల వేచివున్నారు. మేక్బెత్ : వారిని ఇక్కడికి తీసుకో రా. (సేవకుడు నిష్క్రమిస్తాడు) ఇలా మహారాజును కావటంతో సరిపోదు. ఈ పదవిలో భద్రంగా స్థిరపడిపోవాలి. బాంకో విషయంలో 396 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 నా భయం అతితీవ్రంగా ఉంది. అతని ప్రకృతిలోని రాజసం అతడంటే నేనెప్పుడూ భయపడేటట్లు చేస్తూనే ఉంది. అతడు అసామాన్యమైన సాహసం కలవాడు. మనోధైర్యానికి తోడుగా సర్వవ్యవహారాలను భద్రతతో నడిపించగల వివేకం కూడా అతనికుంది. ఒకరి ఉనికిని చూచి నేను భయపడతగ్గ వాడంటూ ఒకడుంటే ఆతడు తప్ప మరెవ్వరూ లేరు. సీజర్ ఎదుట మార్క్ ఆంటోనీ సంరక్షకశక్తి నిస్తేజమయ్యేదని చెప్పుకొంటున్నట్లుగా, అతడి ఎదుట నా సంరక్షకశక్తి భయకంపితమౌతున్నది. 48 'నీవు రాజువౌతా' వని మంత్రగత్తెలు నాతో చెపుతున్నపుడు అతడు వారిని మందలించాడు. తనతో ప్రసంగించవలసిందని శాసించాడు. అపుడు వారు 'నీవొక రాజపరంపరకు మూలపురుషుడవౌతా' వని జోస్యం చెప్పి అతడికి జయనెట్టారు. వారు నిరర్థకమైన కిరీటాన్ని నా శిరసుమీద నిలిపారు. నా వంశంతో ఎట్టి సంబంధమూ లేని మరొకని హస్తం బలవంతంగా లాగుకొనేటందుకు రాజదండాన్ని నా హస్తాని కందించారు. నాకు పిమ్మట నన్ననుసరించి నా పుత్రుల్లో ఎవరూ రాజ్యపాలన చెయ్యరట! అది అలాగే జరిగేటట్లయితే బాంకో సంతతికోసం నేను నా మనస్సును మలినం చేసుకొన్నానన్నమాట! మహోదారుడైన డంకన్ ను వారికోసం మహాఘోరమైన హత్య చేశానన్నమాట!! వారికోసం మధురమైన నా శాంతి చషకంలో కటుకాలైన ఓషధులను కలుపుకొన్నాన్నమాట!! బాంకో వంశజులను రాజులను చెయ్యటం కోసం మానవజాతికి సామాన్యశత్రువైన సైతానుకు అనర్హమణియైన నా ఆత్మను అమ్ముకొన్నానన్నమాట!! అలా జరగనీయను. అంతకంటే రానీ. విధి వ్యతిరేకపక్షంలో చేరిపోరాడనీ, మరణపర్యంతం ఎదుర్కొంటాను - ఎవరక్కడ? ఇరువురు హంతకులతో ఒక సేవకుడు ప్రవేశిస్తాడు. ద్వారం దగ్గరికి వెళ్ళి మేము తిరిగి పిలిచేదాకా అక్కడనే ఉండు. (సేవకుడు నిష్క్రమిస్తాడు) మనమిరువురం కలిసి మాటాడింది నిన్ననే కదా! మొదటి హంతకుడు : అవును మహారాజా! నిన్ననే. మేక్బెత్ : మంచిది. మేము మాటాడినదాన్ని గురించి బాగా ఆలోచించావా? మీ అదృష్టాన్ని పూర్వం అరికట్టింది అతడే. ఏమీ ఎరగని మేము ఆ పని చేశామని మీరనుకున్నారు. లేనిపోని ఆశలు కల్పించి మిమ్మల్ని ఎలా వంచించిందీ, ఎలా మీకు అడ్డంకిగా నిలిచిందీ, ఎటువంటి సాధనాలను అతడు ఉపయోగించిందీ, వాటితో 397 ఎవరిచేత ఏమేమి చేయించిందీ బాంకోయే నని, అర్ధబుద్ధికైనా లేక వెర్రివాడికైనా స్పష్టంగా అర్థమయ్యేటట్లు గడచిన మన సమావేశంలో మేము మీకు విశదం చేశాము. మొదటి హంతకుడు : అవును ప్రభూ! తాము తెలియజెప్పారు. మేక్బెత్ : అలా చేయటమే కాదు. ఇంకా మరికొంత దూరం కూడా వెళ్ళాము. ఇది మన రెండో సమావేశం. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఇలా గడిచిపోనిచ్చే సహనం ఇంకా మీలో బలవత్తరంగా ఉందనుకొంటాను. మిమ్మల్ని సమాధికి సన్నిహితులనుగా రూపొందించి, మీ ఆలుబిడ్డలను భిక్షుకులునుగా మార్చిన ఆ సజ్జనుడి క్షేమంకోసమూ, అతని సంతానసంక్షేమం కోసమూ నిత్యం పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుండేటంతగా 'సువార్తల' మీద విశ్వాసం గలవాళ్ళ ఏమిటి మీరు? మొదటి హంతకుడు : లేదు మహారాజా! మేమూ సామాన్యమానవులమే. మేక్బెత్ : వేటకుక్కలు, రేచులు, మాలకుక్కలు, నక్క, కుక్కలు, కుచ్చి కుక్కలు, ఊరకుక్కలు, బొచ్చుకుక్కలు, నీటికుక్కలు - అన్నీ లెక్కకు కుక్కల్లో చేరినట్లే, మీరూ మనుష్యుల లెక్కల్లో చేరుతున్నారు. వేగకాళ్లు, మందకోళ్లు, వివేకులు, కాపుకాళ్లు, వేటకాళ్ళు అన్న వర్గీకణం కుక్కలకు వాటి వాటి గుణవిశేషాలను బట్టి కలుగుతుంటుంది. మనుష్యుల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది. ఇలాటి మానవజాతి వర్గీకరణంలో మీకొక నియమిత స్థానమంటూ ఒకటుంటే అది మానవజాతిలో నీచతమమైంది కాకుంటే, మీ మీద ఒక కార్యభారాన్ని నిలుపుతాను. దాన్ని నిర్వహించటంవల్ల మీ శత్రువు తొలిగిపోతాడు. మీరు మా హృదయానికి సన్నిహితులై మీ ప్రేమకు పాత్రులౌతారు. అతడు జీవించి వున్నంతకాలం మాకు రుగ్మత, అనారోగ్యం తప్పదు. అతడి మృతితో మా ఆరోగ్యం ఎంతైనా చక్కబడుతుంది. రెండో హంతకుడు : మాత్సర్యం వహించిన నేను, గట్టిదెబ్బలు కొట్టి లోకంమీద పగ తీర్చుకోటానికి ఎట్టి సాహసచర్యకైనా వెనుదీయనివాడినిగా విధి దెబ్బలు తీసి తీర్చిదిద్దిన వ్యక్తిని నేను! మొదటి హంతకుడు : కష్టాలను కల్పించి వెంటబడి తరుముతున్న విధితో మల్లయుద్ధానికి తలపడి, మంచినైనా, చెడ్డనైనా చేయటానికి జీవితాన్ని పణం పెట్టేటందుకు సిద్ధపడ్డ మరొకణ్ణి నేను. 398 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మేక్బెత్ : బాంకో శత్రువని మీకు పూర్తిగా అర్థమైనదనుకుంటాను. హంతకులిద్దరు : మహారాజా! పరిపూర్ణంగా అర్థమైంది. మేక్బెత్ : మీకెలాగో అలాగే మాకూ అతడు శత్రువు. అతడు ప్రతిక్షణం అతితీవ్రమైన సాన్నిహిత్యంతో కడుపులో గుచ్చుకొన్న కత్తిలా మెలగుతున్నాడు. తలచుకుంటే మేమే మాకున్న రాజ్యాధికారంతో అతణ్ణి తుడిచిపెట్టగలం. కానీ మేము స్వప్నంలోనైనా ఆ పని చెయ్యకూడదు. మా ఉభయులకూ కావలసిన మిత్రులు కొందరున్నారు. వారి ప్రేమానుబంధాలను కోల్పోవటం మాకిష్టం లేదు. మేమే హతమార్చినప్పటికీ, అతడు లేకపోవటమనే శోకానికి అనుగుణంగా అంగలార్చవలసివుంది. కనుక ఈ విషయంలో మా పాత్ర ప్రజల నేత్రాలలో పడకుండా కప్పి పుచ్చటానికని మీ సహాయాన్ని కోరవలసి వచ్చింది. రెండో హంతకుడు : మహారాజా! తామాజ్ఞాపించినట్లు చేసి తీరుతాము. మొదటి హంతకుడు : మా ప్రాణాలు పోయినా సరే, చేసి తీరుతాము! మేక్బెత్ : ఇప్పటి మీ ఉత్సాహం కన్నుల్లో భాసించి కనిపిస్తూనేవుంది. అతడికోసం మీరు ఎక్కడ కాపువేయాలో ఒక గంటసేపట్లో మీకు తెలియజేస్తాము. అంతకు మించనివ్వము. సర్వమెరిగిన గూఢచారిచేత ఏ సమయంలో పని జరిగిపోవాలో కూడా తెలియజేస్తాము. ఆ పని ఈ నాటి రాత్రే జరిగిపోవాలి. అది మా రాజసౌధానికి కొంతదూరంలో జరిగిపోవాలి. మాకూ, దానికీ ఎట్టి సంబంధం లేదన్న సంగతి మీరు మరిచిపోరాదు సుమా! నిర్వహించిన పనిలో అతుకులుగాని గతుకులుగాని, లేకుండా ఉండాలంటే, ఆ కాళరాత్రిలోనే అతనివెంట వస్తున్న అతని కుమారుడైన ఫ్లియాన్సుకు కూడా అదే అదృష్టాన్ని పట్టించాలి. అతని తండ్రికంటే కూడా అతడు లేకపోవటమే మాకెంతో అవసరం. ఈ విషయాన్ని గురించి విడిగా ఆలోచించి నిర్ణయించుకోండి. మళ్ళీ మిమ్మల్ని వెంటనే వచ్చి కలుసుకొంటాము. హంతకులిద్దరూ : మహారాజా! మేము పూర్వమే నిర్ణయించుకొన్నాము. మేక్బెత్ : అయితే మీరు సౌధప్రాంగణంలో ఉండండి. మిమ్మల్ని వెంటనే పిలిపిస్తాము. (హంతకులు నిష్క్రమిస్తారు) ఈ పని జరిగిపోయినట్లే. బాంకో! నీ ఆత్మ స్వర్గంలో ప్రవేశించవలసి వుంటే అది ఈ రాత్రికే జరుగుతుంది. (నిష్క్రమిస్తాడు) 399 రెండో దృశ్యం రాజసౌధం, మేక్బెత్ ప్రభ్వి, ఒక సేవకుడు ప్రవేశిస్తాడు. మేక్బెత్ ప్రభ్వి : సౌధంనుంచి బాంకో వెళ్ళిపోయినాడా? సేవకుడు : అవును! మహారాజ్జీ! మళ్లీ రాత్రికి తిరిగి వస్తారు. మేక్బెత్ ప్రభ్వి : వారికి అవకాశమున్నప్పుడు నేను వారితో కొన్ని మాటలు మాటాడాలె నని చెప్పు. సేవకుడు : చిత్తం మహారాజ్జీ! (నిష్క్రమిస్తాడు) మేక్బెత్ ప్రభ్వి : సంపాదించింది ఏమీ కన్పించదు. పైగా సర్వం కోల్పోవటం జరిగింది. కాంక్షించిన ప్రయోజనాన్ని పొందినా మాకు మనశ్శాంతి తప్పింది. అనిశ్చితమైన సంతోషంతో చరించటంకంటే, మేము వినాశనం చేసిన వ్యక్తి ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానాన్ని పొందటం భద్రమైన పని. మేక్బెత్ ప్రవేశిస్తాడు ప్రభూ! మీ విషయం ఎంతో వింతగా ఉంది. దీనమైన దృశ్యాలను సహచరులనుగా చేసుకొని మరణించిన వ్యక్తితోబాటుగా మీ మనస్సులో మాసిపోవలసిన భావాలను మాటిమాటికీ త్రవ్వి తెచ్చిపెట్టుకొంటూ, మీరు ఎప్పుడూ ఏకాంతంగా ఉండి పోతున్నారేమిటి? ప్రతిక్రియల కవకాశంలేని విషయాలను గురించి ప్రబలమైన శ్రద్ధ పనికిరాదు. జరిగిపోయిందేమో జరిగిపోయింది. మేక్బెత్ కాలసర్పానికి చిన్నగాయాన్ని కల్పించగలిగామే, కాని మనం చంపలేక పోయినాము. దాని గాయం నయమైపోతుంది. ఆ విషసర్పం యథాకారతను పొందుతుంది. శక్తిహీనమైన మన ఈర్ష్యకు దాని ఘోరదంష్ట్రలవల్ల అతిశయమైన ప్రమాదం సంభవించి తీరుతుంది. నిత్యభయంతో భుజింపవలసిన నిర్బంధస్థితి మనకు కలుగకపూర్వమే నిశీథివేళల్లో నిరంతరం ప్రజల భీకరస్వప్నాల్లో కలవరపెడుతుంటే నిద్రింపవలసిన దుఃస్థితి మనకు రాక పూర్వమే, ఈ ప్రపంచనిర్మాణం భగ్నమగుగాక! స్వర్గమర్థ్యాలు రెండూ సర్వనాశనాన్ని పొందుగాక!! నిద్రారహితమైన పరవశతతో మానసికయాతనలను అనుభవించటంకంటే ప్రశాంతి నార్జింపగలమన్న మిథ్యాకాంక్షతో 400 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఏ వ్యక్తికి సమాధిశాంతిని కల్పించామో, అతనితోబాటు వసించటమే మనకు అతిశయమైన సంక్షేమాన్ని చేకూరుస్తుంది. డంకన్ ఈ నాడు తన సమాధిలో ఉన్నాడు. జీవిత సంజ్వరానంతరం అతడు ఆ సమాధిలో చిత్తశాంతితో నిద్రిస్తున్నాడు. రాజద్రోహం అతనియెడ చేయగలిగినంత కీడు చేసింది. అయితే హంతకుని దారుణఖడ్గం గానీ, కాలకూటంగానీ, దేశీయశత్రువులుగానీ, విదేశీయసైన్యంగానీ, అతణ్ణి ఇప్పుడు ఏ మాత్రం స్పృశింపలేవు. మేక్బెత్ ప్రభ్వి : ఇక రండి! ప్రభూ, మీరు పరమశాంతస్వభావులు. గండ్రవారిన మీ ముఖాన్ని కోమలతతో కప్పిపుచ్చండి. ఈ రాత్రి అతిథులమధ్య కళకళలాడుతూ ఉల్లాసంతో కనిపించండి. మేక్బెత్ : ప్రియారాజ్జీ! అలాగే కనిపిస్తాను. నిన్ను కూడా అలాగే కనిపించవలసిందని అర్థిస్తున్నాను. నీ దృష్టినంతటినీ శ్రద్ధతో బాంకోమీదనే లగ్నం చెయ్యి. చూపులతో, మాటలతో అతణ్ణి అధికంగా గౌరవిస్తున్నట్లు కన్పించు. నూతనంగా మనం ఆర్జించుకొన్న గౌరవాలను తేజోవంతాలుగా నిలుపుకోటంకోసం వాటిని స్తోత్రపాఠసారణులలో స్వచ్ఛంగా సమ్మార్జనం చేయవలసినంతవరకూ, అవి సత్యమైన స్వరూపాలతో బయటపడిపోతాయేమోనని మన హృదయాలకు ముఖాలను జీరాలుగా చేసుకొని కప్పిపుచ్చుకోవలసి ఉన్నంతవరకూ, అయ్యో! మనస్థితికి భద్రత అన్నది లేదు. మేక్బెత్ ప్రభ్వి : ఇలా వేధించే ఈ ఊహలను మీరిక విడిచిపెట్టాలి. మేక్బెత్ : వృశ్చికప్రాయాలైన ఊహలతో నా మనస్సు ఎలా నిండి ఉందో నీకు తెలియదు. బాంకో, షియాన్సు ఇంకా సజీవులేనన్న అంశాన్ని తెలుసుకో. మేక్బెత్ ప్రభ్వి : అయితే ప్రకృతి వారికి ప్రసాదించిన జీవిత ప్రమాణపత్రం నిత్యమైంది కాదు గదా! మేక్బెత్ : అవును. వారి జీవితాలు పైనబడటానికి అవకాశమున్నవి కావటంవల్లనే మనకు కొంతలో కొంత ఊరట దొరుకుతున్నది. అందువల్ల నీవు ఉల్లాసంతో కన్పించు. ఈ రాత్రే మన ప్రాసాదంలోని గుప్తప్రార్థనాగారాల చుట్టూ విహరించడం కోసమని గబ్బిలాలు రాకముందే, కాళరాత్రి కధిదేవతయైన హెకేట్ పిలుపు విని పొలుసు రెక్కలమీద వ్రాలి బొద్దింకలు తమనిద్రా ముద్రితమైన ఝిల్లీ నినాదాలతో రాత్రిదేవత అట్టహాసాన్ని ఎరుకపరచకముందే, ఆ భయానక చర్య జరిగి తీరవలసి ఉంది. మేక్బెత్ ప్రభ్వి : ఏ భయానక చర్య? 401 మేక్బెత్ : ప్రియా! నిర్వర్తితమైన తరువాత పరికించి శ్లాఘించేటంతవరకూ ముందుగానే దానిని గూర్చిన, విశేషాలను నీవు తెలుసుకోకుండా ఉండటం ఎంతో మంచిది. డేగలను పెంచి వేటాడేవాడు వాటికన్నులను కుట్టేటట్టుగా జాలిగొల్పేటట్లు పగటికన్నులను కుట్టివేసే కాళరాత్రీ! రా! దారుణమైన నీ గుప్తహస్తంతో నిరంతరం నన్ను భయంవల్ల పాలిపొయ్యేటట్లు ఆ బిరుదాన్ని తుడిచిపెట్టి ఖండఖండాలుగా తుంచి వెయ్యి! చీకటి దట్టమౌతున్నది. అదిగో, కాకం! స్వకులనీడనిబిడమైన కాననానికి వెళ్ళిపోతున్నది. దినకాంతిలో తిరిగే సరసమైన ప్రాణిలోకం అలసి నిద్రకోసం ఆతురత వహిస్తున్నది. రాత్రికి ప్రతినిధులైన క్రూరసత్వాలు తమ ఎరలను వేటాడటం కోసం మేల్కొంటున్నవి. నా మాటలకు నీవు ఆశ్చర్యపడు తున్నట్లున్నావు? కొంతసేపు ఓపికపట్టు, దౌష్ట్యంతో ఆరంభించిన పనులకు క్రౌర్యంతోనే భద్రత చేకూరవలసివుంది. నన్ననుసరించు! (నిష్క్రమిస్తారు) మూడో దృశ్యం దుర్గప్రదేశానికి దగ్గరలో ఉన్న ఒక ఉద్యానవనం. ముగ్గురు హంతకులు ప్రవేశిస్తారు. మొదటి హంతకుడు : మమ్మల్ని కలుసుకోమని నిన్నెవ్వరాజ్ఞాపించారు? మూడో హంతకుడు : మేక్బెత్. రెండో హంతకుడు : 'మీరు చేయవలసిన పను' అని ఇతడు చెప్పే పనులన్నీ మొదట మనం స్వయంగా పొందిన సూచనలకు సరిపోతున్నవి. కనుక ఇతణ్ణి మనం అనుమానించవలసిన అవసరం లేదు. మొదటి హంతకుడు : అయితే ఇక మాతోపాటు ఉండిపో. పడమటిదిక్కున పగటి వెలుగులింకా మసకమసకగా కన్పిస్తూనేవున్నవి. ప్రయాణంలో ఆలస్యమైన బాటసారి దగ్గరిలో ఉన్న పాంథశాలను చేరుకోటానికని అశ్వాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. మనం ఎవరికోసం కాచుకొంటున్నామో ఆ వ్యక్తి కూడా సమీపిస్తుంటాడు. 402 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మూడో హంతకుడు : నిశ్శబ్దం. ఏదో గుర్రపుడెక్కల చప్పుడు వినిపిస్తున్నది. బాంకో: ఎవరక్కడ? వెలుగు చూపించండి. రెండో హంతకుడు : ఇతడు అతడే అయి వుండాలి. విందుకు విచ్చేస్తారని ఉద్దేశించిన అతిథులందరూ ఇంతకుపూర్వమే ఆ స్థానానికి చేరివుంటారు. మొదటి హంతకుడు : (వినటాన్ని అభినయిస్తూ) ఇతని గుర్రాలు చుట్టుబాటన నడుస్తున్నాయి. మూడో హంతకుడు : ఆ బాట ఒక మైలు చుట్టుంటుంది. కానీ అతడు సామాన్యంగా అందరిలాగానే ఇంతవరకూ వచ్చి ఇక్కడినుంచీ దుర్గద్వారందాకా నడిచి వెళ్ళుతుంటాడు. రెండో హంతకుడు : ఇదుగో కాగడా! ఇదుగో కాగడా!! మూడో హంతకుడు: ఇతడు అతడే! మొదటి హంతకుడు : అక్కడ స్థిరంగా నిలు. బాంకో, ఫ్లియాన్సు ఒక కాగడాతో ప్రవేశిస్తారు. బాంకో: ఈ రాత్రి వర్షం పడుతున్నది. మొదటి హంతకుడు : పడనీ! (హంతకులు బాంకోమీద పడతారు) బాంకో : ద్రోహం! ద్రోహం!! ఫ్లియాన్స్, పారిపో! పారిపో!! ప్రతీకారచర్య కోసం పారిపో!... ఓరి ద్రోహీ! మూడో హంతకుడు : కాగడాను ఆరిపోనిచ్చింది ఎవరు? మొదటి హంతకుడు: అలా జరగనీయకూడదా? 49 మూడో హంతకుడు : ఒకడే హతుడైనాడు. కుమారుడు పారిపోయినాడు. రెండో హంతకుడు : మనకృత్యంలో ఉత్తమభాగం చెడిపోయింది. మొదటి హంతకుడు : సరే. మరి మనం వెళ్ళి ఎంతవరకు చేయగలిగామో ఆ విషయాన్ని నివేదిద్దాం. (నిష్క్రమిస్తారు) 403 నాల్గో దృశ్యం అదే ప్రదేశం. సౌధంలో ఒక విశాలమైన కక్ష్య. విందు సిద్ధమై ఉంటుంది. మేక్బెత్, మేక్బెత్ ప్రభ్వి, రాస్, లెన్నాక్స్, ప్రభువులు కొందరు, సేవకులతో ప్రవేశిస్తారు. మేక్బెత్ : మీ మీ స్థానాలేవో మీకు తెలుసు. స్థానక్రమాన వాటిని స్వీకరించి అధివసింపగోరుతాను. ఇదే మీకు మా మనఃపూర్వకమైన స్వాగతం. ప్రభువులు : మహారాజా! మీకివే మా అభివాదనలు. మేక్బెత్ : మీతో కలిసిమెలిసే నేను వినతితో అతిథేయకృత్యాలను నిర్వహిస్తాము. మీ ఆతిథేయి అర్ధాసనం మీద అధివసించి ఉంటుంది. మీకు స్వాగతి నెఱపేసమయం వచ్చినప్పుడు ఆమెను నేను పిలుస్తాను. మేక్బెత్ ప్రభ్వి : నా పక్షాన కూడా మీరే మీ మిత్రులందరికీ స్వాగత వచనాలు పలకండి. వారందరినీ నేను మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మేక్బెత్ : మనఃపూర్వకమైన అభినందనలతో నా స్వాగతవచనానికి ఎలా ప్రత్యుత్తర మిస్తున్నారో! ఉభయ పార్శ్వాలలో సంఖ్య సమంగా ఉంది. మధ్యలో నేను ఉపవసిస్తాను. మొదటి హంతకుడు : ద్వారదేశం దగ్గరకు ప్రవేశిస్తాడు. స్వేచ్ఛతో వినోదించండి. ఇదిగో! నేను మీ అందరి ఆరోగ్యాలకోసం ఈ ఆసవాన్ని సేవిస్తాను (ద్వారదేశం దగ్గరకు వచ్చి) నీ ముఖంమీద రక్తం కనిపిస్తున్నది. హంతకుడు : అయితే అది బాంకోదన్న మాట, మహారాజా! మేక్బెత్ : అతడు ఈ లోపల ఉండటం కంటే ఆతని రక్తం నీ ముఖంమీద ఉండటమే ఎంతో ఉచితమైన విషయం. అతణ్ణి పూర్తిచేశారన్నమాటేనా? హంతకుడు : అవును ప్రభూ! అతడి పీక కోసేశాము. ఆ పని చేసింది నేనే! మేక్బెత్ : అయితే హంతకజాతిలో నీవు అగ్రణ్యుడవన్నమాట! కానీ ప్లియాన్స్ విషయంలో ఇట్టిపని జరిగించినవాడు కూడా ఇంతటి ప్రజ్ఞావంతుడే అని అనవలసి ఉంటుంది. అది కూడా నీవే చేసిఉన్నట్లయితే నీకు ఎవరూ సాటిలేరన్నమాట! హంతకుడు : మహారాజా! ఫ్లియాన్స్ తప్పించుకొని పారిపోయినాడు. 404 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మేక్బెత్ : అయితే భీతి మళ్లీ మిమ్మల్ని ఆవరిస్తుందన్న మాట! లేకపోతే మేము భద్రంగా ఒక పాలరాయిలా ఉండేవాళ్ళం. మా రాచరికమనే హర్మ్యం గండశిలల పునాదిమీద కట్టినట్లు అతిదృఢంగా నిలిచి ఉండేది. మనచుట్టూ వీచేగాలిలా ఎట్టి ఆటంకమూ లేకుండా అనంత స్వేచ్ఛను అనుభవింపగలిగేది. అలయించే అనుమానాలతో మేమిప్పుడు ముకుళించుకొని, మా కక్ష్యలోనే బంధించుకొని ఉండిపోవలసివచ్చింది - పోనీ ఇంకా బాంకో కూడా భద్రుడై లేడు కదా! హంతకుడు : భద్రుడే మహాప్రభూ! అన్నిటిలో అల్పమైనదే ప్రాణం తీయటానికి సమర్థమైన ఇరవై గాయాలతో, కందకంలో అతిభద్రంగా ఉన్నాడు. మేక్బెత్ : అందుకు మీకివే మా అభినందనలు. ఆ పెరిగితే పెనుజాతి పాము అక్కడ ఉండిపోయింది. సమయం వచ్చినప్పుడు విషాన్ని కక్కే స్వభావం కలదే అయినా పారిపోయిన ఆ పురుగుకు ఇంకా కోరలు రాలేదు. నీవు వెళ్ళిపో. రేపు మళ్ళీ ప్రసంగిద్దాము. (హంతకుడు నిష్క్రమిస్తాడు) మేక్బెత్ ప్రభ్వి : మీరు అతిథులకు అనుగుణాలైన స్వాగతవాక్యాలు పలికారు కారు. సౌజన్యంతో సక్రమంగా ఆతిథేయకృత్యాలను నిర్వర్తించినప్పుడు అది విందనిపించు కొంటుంది కాని, లేకపోతే కొన్ని రుచ్యపదార్థాలను అమ్ముతున్నట్లుగా అతిథులు భావిస్తారు. తినటం, త్రాగటమనేవి వాళ్ళ ఇళ్ళదగ్గిర ఇంతకంటే ఎంతో బాగా జరుగుతుంటాయి. కానీ ఒకరు విందును అనుభవిస్తున్నప్పుడు ఆచారపూర్వకమైన సౌజన్యంతో వ్యంజనాలను పూట పెట్టటం వల్ల రుచిని కల్పించటం కన్పించాలి. ఇది లేకపోతే గోష్ఠీ సమావేశాలు చప్పగా ఉంటాయి. మేక్బెత్ : ప్రియా! సమయానికి నా కర్తవ్యాలను జ్ఞప్తిచేసినందుకు కృతజ్ఞుణ్ణి. పదార్థాలను భుజించటానికి అవసరమైన జఠర ముందు, తరువాత జీర్ణశక్తి, పిమ్మట ఆ రెంటినీ అనుసరించి మంచి ఆరోగ్యం మీకు కలుగుగాక! లెన్నాక్స్ : తాము తమ ఆసనాన్ని అధివసించవలసిందని వేడుకొంటున్నాను. (బాంకో ప్రేతరూపం ప్రవేశించి మేకెత్ స్థానంలో కూర్చొని వుంటుంది.) మేక్బెత్ : బాంకో మహాశయుడుకూడా విచ్చేసి ఉన్నట్లయితే, మన దేశానికి గౌరవాన్ని సంపాదించియిచ్చినవాళ్ళందరూ ఈ గృహాంతరాళంలో సమావేశమైనట్లుండేది. అతడు 405 రానందుకు సరైన కారణం తెలుసుకొన్నప్పుడు, ఏదో అవాంతరం వల్ల రాలేకపోయినందుకు అతణ్ణి కనికరించవలసిన స్థితి కలగటం కంటే రాకుండా నిర్ధాక్షిణ్యాన్ని ప్రకటించినందుకు మందలించే స్థితి మాకు కలుగుగాక! రాస్ : అతడు రాకపోవటం ఎందువల్లనైనా కావచ్చు. కానీ అది అతడు చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించటమే ఔతున్నది. ఘనత వహించిన తాము తమ స్థానాన్ని అధిష్ఠించి మాకు గౌరవాన్ని కల్పించండి. మేక్బెత్ : స్థానాలన్నీ నిండివున్నాయి కదా? లెన్నాక్స్ : ఇదిగో, ఇక్కడ మీకో స్థానం ప్రత్యేకించబడింది. మేక్బెత్ : ఏదీ ఎక్కడ? 50 లెన్నాక్స్ : మహాప్రభూ! ఇక్కడ. ఇలా కళవళపాటు పడుతున్నారేమిటి? మేక్బెత్ : మీలో ఈ పని చేసింది ఎవరు? ఒక ప్రభువు : ఏ పని మహారాజా! మేక్బెత్ : ఈ పనిని నీవు చేశావని మేమనలేదు. రక్తసిక్తాలైన కురులతో కూడిన నీ శిరస్సును నా వంకకు అలా త్రిప్పకు. రాస్ : మహాశయులారా! మనం వెళ్ళిపోదాం పదండి. మహారాజు లేదో బాధపడుతున్నట్లున్నారు. మేక్బెత్ ప్రభ్వి : ఉదాత్తమిత్రులారా! మీరు లేచివెళ్ళవద్దు. నా ప్రభువు తరచుగా ఇలాగే ప్రవర్తిస్తుంటారు. యౌవనారంభవేళనుంచీ అప్పుడప్పుడు ఇలా ఉండటం వారికి అలవాటు. మీరు లేవవద్దు. మీ మీ స్థానాలలో అధివసించవలసిందనీ నా ప్రార్థన. ఈ మరపు వారికి తాత్కాలికం. వారు మళ్ళీ స్వల్పకాలంలోనే యథాస్థితికి వస్తారు. మీరు వారిని గురించి అటే శ్రద్ధ వహించవద్దు. అందువల్ల వారి స్థితి ఉద్రిక్తమై అతిశయిస్తుంది. మీరు విందారగించండి. వారి సంగతి పట్టించుకోకండి - మీరు పురుషులేనా? మేక్బెత్ : అవును. కేవలం పురుషుణ్ణి మాత్రమే కాదు. భూతాలనైనా భయపెట్టగలటం ఆ దృశ్యాన్ని సహితం దర్శించగల ధైర్యశాలిని కూడాను. 406 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మేక్బెత్ ప్రభ్వి : ఇదంతా అసంబద్ధమైన విషయం! మీ భయభావం వల్ల పుట్టిన విచిత్ర దృశ్యం! ఇది వెనుక మీరు నాతో చెప్పారు చూడండి. మిమ్మల్ని డంకన్ కక్ష్యకు నడిపించుకోపోయిన ఆ భ్రామికమైన ఛురికవంటి దృశ్యం!! అయ్యో? హఠాత్తుగా మీకు కలిగే ఈ ఉద్రేకోల్బణాలు, మైమరపులు వింతగా ఉంటున్నాయి. ఇవన్నీ భయంవల్ల కలుగుతున్నమాట సత్యం. ఇవన్నీ దీర్ఘాలైన శీతకాల సాయంతనవేళల్లో అగ్నికుండం ప్రక్కన కూర్చొని అమ్మమ్మ చెప్పిన దయ్యాల కథలను తిరిగి చెప్పే ఆడదానికి యోగ్యమైన విషయాలు. ఇదంతా సిగ్గు చేటుగా ఉంది. ముఖాన్ని వికారంగా ఎందుకలా త్రిప్పుతున్నారు? మీ కళ్ళముందు శూన్యమైన ఆసనంతప్ప మరేమీ కన్పించటం లేదే? మేక్బెత్ : అదుగో అటు చూడు! అక్కడ! ఇప్పుడేమంటావు? అయితే నాకేమిటి? తలాడిస్తున్నావు నీవు మాటాడనుకూడా కలవన్నమాట! శ్మశానంలోని భూగర్భగృహాలు, సమాధులు, మృతి నొందినవారిని బయటికి పంపించి పృథ్విమీద విహరింపజేస్తున్నవి. అయితే మున్ముందు మృతినొందిన వారిని గృధ్రాల గర్భకుహారాలలోనే సమాధి చేయించవలసి వుంటుంది. (ప్రేతరూపం నిష్క్రమిస్తుంది) మేక్బెత్ ప్రభ్వి : అర్థరహితమైన ఊహలతో మీరు ధైర్యాన్ని ఇలా కోల్పోతున్నారేమిటి? మేక్బెత్ : ఇక్కడ నేను నిలుచోటం ఎంత సత్యమో, అంత సత్యంగా నేను అతణ్ణి చూస్తున్నాను. మేక్బెత్ ప్రభ్వి : అబ్బా! మీ ప్రవర్తన సిగ్గుచేటుగా ఉంది! మేక్బెత్ : న్యాయశాస్త్రాలు మానవసమాజాన్ని పవిత్రం చెయ్యని ప్రాచీనకాలంలో ఎంతగానో రక్తపాతం జరిగింది. ఆ తరువాత కూడా వినటానికే అతిఘోరాలైన మార్గాలలో హత్యలు జరుగుతూనే వచ్చాయి, మెదడును లాగిపారేస్తే వెనుకటి కాలంలో మానవుడు పూర్తిగా మరణించేవాడు. ఇప్పుడో తలమీద ఇరువై గాయాలు తగిలి మరణించినా, నిధనాన్ని పొందినవారు నిలువునా లేచివచ్చి ఆసీనులమైవున్న మనను ఆసనాలలో నుంచి నెట్టివేస్తున్నారు. ఇది నిశ్చయంగా హత్య కంటే వింతైన విషయం! మేక్బెత్ ప్రభ్వి : ఉదాత్తప్రభూ! మీ ఉత్తమమిత్రులమధ్య మీరు ఉండకపోవటం జరుగుతున్నది. 407 మేక్బెత్ : అవును. నేనే నా అతిథేయకృత్యాలను మరిచిపోయాను. యోగ్యమిత్రులారా! నా ప్రవర్తనను గురించి ఆశ్చర్యపడకండి. నాకో వింత వ్యాధి ఉంది. నాతో మంచిపరిచయం ఉన్నవాళ్ళెవరూ దాన్ని పట్టించుకోరు. ఇక మనం విందారగిద్దాము. మీకివే నా ప్రణయాకాంక్షలు. మీకు సర్వశ్రేయాలు కల్గుగాక! ఇక నేను నా ఆసవాన్ని స్వీకరిస్తాను. ద్రాక్షాసవాన్ని కొంత నాకందీయండి. చషకాన్ని నిండుగా నింపండి. ఇచ్చటికి వచ్చేసిన సభ్యులందరి ఆరోగ్యం కోసం, రాకపోవటంవల్ల నాకు చింతను కల్పించిన బాంకో ఆరోగ్యం కోసం నే నీ ఆసవాన్ని సేవిస్తున్నాను. ఆ బాంకో ఇక్కడ ఉన్నట్లే భావిస్తున్నాను. ఇవే మీ అందరికీ నా శుభాకాంక్షలు! అతడికి నా శుభాకాంక్షలు!! ప్రభువులు : కర్తవ్యానుపాలనం చేస్తూ ప్రభుభక్తితో వర్తిస్తామని మేమందరం ఈ విందువేళ ప్రమాణం చేస్తున్నాము. బాంకో ప్రేతరూపం తిరిగి ప్రవేశిస్తుంది. మేక్బెత్ : వెళ్ళి పో! నా కంటిముందు నుంచి వెళ్ళి పో! పృథ్వి తిరిగీ నిన్ను తన గర్భంలోకి చేర్చుకొనుగాక! నీ శల్యాలు మజ్జావిరహితాలు. నీ రక్తమతిశీతలం. నీ నేత్రాలకు నిలుకడైన చూపే గాని జ్ఞానశక్తి లేదు. మేక్బెత్ ప్రభ్వి : ఉదాత్తప్రభువులారా! ఇదంతా వారికి సామాన్యలక్షణంగానే భావించండి. అంతకు మించి ఏమీ లేదు. అయితే ఇది ఈ సమయంలోని సంతోషాన్నంతటినీ భగ్నం చేస్తున్నది. 51 మేక్బెత్ : మానవుడికెంత సాహసముండటానికి వీలుందో అంత సాహసం నాకుంది. ఆ విషయంలో నేను ఎవరికీ లొంగేవాణ్ణికాను. ఇప్పటి నీ రూపంలో తప్ప బిరుసువారిన కేశాలు గల రష్యను భల్లూకంలా " గానీ, శృంగరక్షగల ఖడ్గమృగంలా కానీ, హైరానియన్ వ్యాఘ్రంలాగానీ, మరే రూపంలోనైనా గాని నీవు రా! బిర్రబిగిసిన నా నరాలు ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నన్ను భయకంపితుణ్ణి చెయ్యవు. లేదా నీవు తిరిగి జీవించి ఖడ్గపాణివై వచ్చి ద్వంద్వయుద్ధంలో నన్ను ఏకాంతప్రదేశంలోనైనా సరే, ఎదుర్కో అప్పుడు నేను వణికినట్లు కనిపిస్తే 'వీడు క్రీడించే ఒక బాలిక చేతిలోని బొమ్మ' అని లోకానికి ప్రకటించు. పారి పో! ఓ భీకర ప్రేతమూర్తీ! పారి పో! సత్యమైన రూపం లేకుండా సజీవవ్యక్తి కొక పరిహాసరూపానిపై కన్పట్టే ఓ వ్యక్తీ! తొలగి పో. 408 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఏమిటి? నేను కోరినట్లే ఆ ఛాయామూర్తి తొలగిపోయింది. నా ఆజ్ఞను పాటించింది. మళ్ళీ నేను మనిషినైనాను. ఉదాత్తులారా! మీరంతా కూర్చోండి. మేక్బెత్ ప్రభ్వి : మీరీ సమయంలోని సంతోషాన్నంతటినీ భగ్నం చేశారు. వింతైన మీ వైకల్యం వల్ల ఈ సమావేశం విచ్ఛిన్నమైంది. మేక్బెత్ : ఇట్టి విచిత్రవిషయాలు సంభవించినప్పుడు, అందులోను గ్రీష్మకాల మేఘంలా హఠాత్తుగా విచ్చేసినప్పుడు, అద్భుతావిష్ణులు కాకుండా ఉండటానికి అవకాశముందా? చెక్కిళ్ళను పాలిపోయేటట్లు చేసే దృశ్యాలు కనిపిస్తుండమనే స్థితి నాకు సహజమై పోయింది. అట్టి స్థితిలో ఉన్న నన్ను చూచినా నీవు చెక్కిళ్ళమీద ఎర్రనికాంతిని కోల్పోవన్న భావంతో ఉన్న నాకు దానిని కోల్పోయి కన్పిస్తూ నా స్థితిని గురించి నేనే ఆశ్చర్యపడేటట్లు చేస్తున్నావు. రాస్ : దృశ్యాలేమిటి మహారాజా? మేక్బెత్ ప్రభ్వి : దయ ఉంచి వారిని పలకరించకండి. ఈ అపస్మారం ఇంకా విషమిస్తుంది. ప్రశ్నిస్తే వారు మరింత కళవళపడతారు. మీకు వీడ్కోలు చెపుతున్నాను. వెళ్ళిపోయే క్రమాన్ని గురించి మీరు విశేషశ్రమ వహించవద్దు. దయ ఉంచి వెంటనే వెళ్ళిపొండి. లెన్నాక్స్: సునక్తం! మహారాజులు అనతికాలంలో స్వస్థచిత్తులగుదురుగాక! మేక్బెత్ : మీ అందరి కదే నా హృదయపూర్వకమైన సునక్తం. (మేక్బెత్, మేక్బెత్ ప్రభ్వి తప్ప మిగిలినవారు నిష్క్రమిస్తారు) 54 53 మేక్బెత్ : అది రక్తాన్ని పుచ్చుకొని తీరుతుంది. రక్తం రక్తాన్ని పుచ్చుకొంటుందని పెద్దలంటారు. హత్యలకు సంబంధించిన రహస్యాలను వెల్లడించటానికి శిలలు నడిచి నెళ్లుతాయట! వృక్షాలు ప్రసంగించగలుగుతాయట! శకునాలకు భవిష్యత్తులో జరుగబోయే అంశాలకు గల సంబంధాన్ని అవగతం చేసుకోగల శకునజ్ఞుల శక్తి, గోకరాళ్ళ కూతలు, కాకఘూకాల రొదలు హంతకుని ఎంతటి నిగూఢరహస్యాన్నైనా బయటపెడతాయట! ఇప్పుడు రాత్రి ఎంతై ఉంటుంది? మేక్బెత్ ప్రభ్వి : ఇంకా రాత్రో లేక ఉదయమో చెప్పలేము. మేక్బెత్ : మన ఆజ్ఞను పాటించటం కోసం మాక్డఫ్ విందుకు రావలసి వుండికూడా రాకపోవటాన్ని గురించి నీ అభిప్రాయమేమిటి? 409 మేక్బెత్ ప్రభ్వి : అతణ్ణి ఆహ్వానించటంకోసం ఎవరినైనా పంపించారా? మేక్బెత్ : లేదు. కానీ అతడు విందుకు రావటానికి నిరాకరించాడని విన్నాను. ఎవరినైనా అతడికోసం పంపించి నిజమేమిటో తేలుస్తాను. ప్రతి ప్రభువు సౌధంలోనూ నేనే జీతమిచ్చి పోషించే సేవకుడు ఒకడుండనే ఉన్నాడు. మంచి వేళ చూసుకొని నేను రేపే మాంత్రికురాండ్ర దగ్గిరకి వెళ్ళుతాను. దాని స్వభావం ఎటువంటిదైనా, వాళ్ళవల్ల తెలుసుకోవలసిన చెడుగు ఇంకా ఏముందో తెలుసుకోడానికి నిశ్చయించాను. సిద్ధికోసం చెడ్డసాధనాలను ఎన్నింటిని ఉపయోగింపవలసివచ్చినా సరే, శ్రేయాన్ని చేకూర్చుకొనే విషయంలో నేను ఎందుకూ నెరవను! అందుకుగాను అన్నింటినీ త్రోసిరాజంటాను. రక్తంలో ఇంత వరకూ నడిచాను. ఇప్పుడు అవతలి ఒడ్డుకు చేరటం ఎంత కష్టమో, వెనక్కి వెళ్ళటం కూడా అంత కష్టం. నా మనస్సులో కొన్ని విచిత్రోద్దేశాలున్నాయి. జాగరూకతతో నిశితపరిశీలన చేయకపూర్వమే వాటికి కార్యరూపాన్ని కల్పించ వలసివుంది. మేక్బెత్ ప్రభ్వి : సర్వప్రాణులకూ ఆరోగ్యాన్ని ప్రసాదించే నిద్ర మీకు బాగా కరవై కన్పిస్తున్నది. మేక్బెత్ : పద, వెళ్లి నిద్రిద్దాం. దోషాచరణవిషయంలో నేనింకా ప్రాథమికుణ్ణి. నా యీ విభ్రాంతి నిరంతరం బహుళంగా దోషాలను ఆచరించటంవల్లగాని బండబారని భయభావం తప్ప మరేమీ కాదు. ఇట్టి కృత్యాల విషయంలో మనమింకా యువకులమే! ఐదో దృశ్యం ఒక క్షేత్రసీమ. ఉరుములు వినిపిస్తుంటాయి. మాంత్రికురాండ్రు మువ్వురూ హెకేట్ను కలుసుకుంటారు. ప్రథమ మాంత్రికురాలు : ఏమమ్మా! కోపదృక్కులను ప్రసరిస్తున్నావు, కారణమేమిటి? హెకేట్ : గండ్రాగుండి తులువలైన మీబోటి ముసలి ముండలతో వ్యవహరించవలసిన నాకు, కోపానికి కారణం లేదంటారా? మీ మంత్రవిద్య కంతటికే అధిదేవతను. అన్ని అశుభాలనూ అల్లిక చేసేదానిని, మన విద్యాప్రావీణ్యాన్ని ప్రదర్శించేదానిని అయిన నన్ను, నా పాత్రను నిర్వహించటం కోసం ఆహ్వానించకుండానే మృత్యుసంబంధి వ్యవహారాల్లోను, మోసపు జోస్యాల్లోను స్వతంత్రించి మేక్బెత్తో వ్యవహరించటానికి మీకెంతటి సాహసం చేకూరింది! ఇతరులలాగానే మనమీది అనురాగం వల్ల కాక, 410 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 స్వప్రయోజనాలకోసం, మన నాదరిస్తూ, మనమీద మాత్సర్యం వహించి భయపెట్టే ఒక ముష్కరుడి కోసం ఇంత చేయటం మరీ చెడ్డపని. వెనుక చేసిందేదో చేశారు. ఇకముందు మీరు దాన్ని సరిదిద్దాలి. ఇవాల్టికి వెళ్ళి రేపు నన్ను ఎకిరాన్ గర్తం దగ్గిర కలుసుకోండి. తన అదృష్టం ఎలా ఉందో తెలుసుకోటానికని అతడు అక్కడికి వస్తాడు. మీరు మీ కొప్పెరలతో, మంత్రోచ్చారణలతో, ఇంకా కావలసిన సర్వసన్నాహాలతో అక్కడ సిద్దపడివుండండి. ఇప్పుడు నేను వాయుపథంలో విహరించాలి. భీకరమూ, విధివిలాసమూ అయిన ఒక ప్రళయాన్ని సృష్టించటంలో నేనీ రాత్రినంతటినీ గడపవలసివుంది. రేపటి మధ్యాహ్నంలోపల ఒక ఘనమైన వ్యవహారాన్ని నిర్వర్తించవలసి వుంది. చంద్రశృంగం మీద నిబిడమైన బిందువొకటుంది. అది భూమిమీద పడకముందే దాన్ని పట్టుకోవాలి. మంత్రోచ్చారణలతో ఆ నీహారబిందువును ధృతి చేస్తే ఆతణ్ణి వినాశనం వంకకు నడిపించే వంచనాశక్తి గల కృత్రిమభూతరూపాలు అందులోనుంచి ఉద్భవిస్తాయి. అతడు విధిని తిరస్కరిస్తాడు. మృత్యువును లెక్కించక అహంకరిస్తాడు. వివేకాన్ని, సారళ్యాన్ని, భయాన్ని త్రోసిపుచ్చి అతిసాహసోపేతుడైన ఆశాపరుడౌతాడు. అతిశయమైన ఆత్మవిశ్వాసం మానవులకు అగ్రగణ్యమైన శత్రువని మీకు తెలిసిందేకదా? (లోపల సంగీతం 'రారా హెకేట్ రావమ్మా' రా రా హెకేట్ రా!' అన్న పాట వినిపిస్తుంది.) వినండి. అదుగో, నన్ను పిలుస్తున్నది. అటు చూడండి. మంచుతో నిండిన మబ్బుమీద కూర్చోని అదే నా ముద్దుల శక్తి నన్ను పిలుస్తున్నది. (నిష్క్రమిస్తుంది) ప్రథమ మాంత్రికురాలు : రండి. పోదాం త్వరపడండి. మళ్ళీ ఈమె త్వరలోనే వచ్చేస్తుంది. (నిష్క్రమిస్తారు) ఆరో దృశ్యం ఫోర్రెస్, రాజసౌధం, లెన్నాక్స్, మరొక ప్రభువు ప్రవేశిస్తారు. లెన్నాక్స్ : నా పూర్వసంభాషణలు మీ ఊహలకు సరిపోయాయన్నమాట! ఇక నేను చెప్పకుండా విడిచిపుచ్చినదాన్ని మీరే వ్యాఖ్యానించుకోండి. అయితే నేను ఇంతమాత్రం 411 57 చెపుతాను. అన్ని విషయాలూ విచిత్రంగా జరిగిపోయాయి. ఉదాత్తుడైన డంకన్ గురించి మేక్బెత్ కరుణరస మొలికించాడు. మేరీసాక్షిగా అతడు మరణించాడు. పరాక్రమవంతుడైన బాంకో ప్రొద్దు గ్రుంకిన తరువాత రాత్రి ప్రయాణం చేశాడు. ఫ్లియాన్సు పారిపోయాడు. కనుక ఆ ఫ్లియాన్సే అతణ్ణి హత్యచేశాడని మీరు అనవచ్చు. ఈ దినాల్లో ప్రొద్దు గ్రుంకిన తరువాత రాత్రులో మనుష్యులు ప్రయాణం చెయ్యకూడదు. చేస్తే - సత్యం చెప్పవలసివస్తే ఉదారుడైన తండ్రిని చంపిన మాల్కొం, డొనాల్బెయిన్ ఎంతటి ఘాతుకచర్య చేశారన్న భావం ఎవరికి కలగకుండా ఉంటుంది! అయ్యో! అది ఎంతటి నీచకృత్యం! అది మేక్సెత్ను ఎంత గాఢంగా దుఃఖపెట్టింది! పునీత క్రోధంవల్ల అతడు ఉద్రేకించి పానపిశాచికి బానిసలు, నిద్రాసతికి దాసులు అయిన దోషులనిద్దరినీ చీల్చిపారేయలేదా? అది మహోదాత్తకృత్యం కాదనగలమా? ఆ ఆ స్థితిలో వాళ్ళు దోషులము కామని చెప్పుకొంటుంటే, మానవహృదయం కలవాళ్ళకెవరికైనా అంతటి కోపం వచ్చి తీరుతుంది. కనుక అప్పుడతడు వివేకంతో కూడా వర్తించాడనే అనవలసివస్తుంది. అందువల్ల అతడు సర్వవ్యవహారాలనూ సక్రమంగా సర్దుకోవచ్చాడని మళ్లీ ఒకమాటు చెపుతున్నాను. డంకన్ మహాశయుని పుత్రులే అతడి స్వాధీనంలో ఉండి ఉన్నట్లయితే - అట్టిపని తిరిగి ఎన్నడూ జరుగకుండుగాక అని నేను పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను - తప్పకుండా వారు తండ్రిని చంపటమంటే ఏమిటో తెలుసుకొనివుండేవారు. పారిపోకుంటే ఫ్లియాన్సు పనికూడా అంతే ఐ ఉండేది. కానీ, ఇష్, నిష్కాపట్యంతో పలుకుతాడనీ, ఈ నిరంకుశు డు చేసిన విందుకు రాక తప్పించాడనీ, మాక్డఫ్ అవమానితుడౌతున్నట్లు వింటున్నాను. మహాశయా! ఇప్పుడతడెక్క డుంటున్నాడో మీకేమైనా తెలుసునా? ప్రభువు : ఎవని జన్మ స్వత్వమైన బ్రతుకు నీ నియంత నిలిపివేశాడో, ఆ డంకన్ మహాశయునికి పుత్రుడైన అతడిప్పుడు ఆంగ్లసంస్థానంలో వసిస్తున్నాడట! పరమపవిత్రుడైన ఎడ్వర్డు రాజు, విధివహించిన విద్వేషంవల్ల జన్మచే లభించిన గౌరవానికి అణుమాత్రమైనా లోపం రానిరీతిగా అతణ్ణి ఆహ్వానించాడని విన్నాను. నార్తంబర్లాండు, సివర్డు ప్రభువులను సైన్యసహాయం చెయ్యటంకోసం పురికొల్పి, వారి సహాయంతోను ధర్మోపేతమైన కృత్యాలకు లభ్యమయ్యే భగవదనుగ్రహంతోనూ మనం సుఖంగా తిని భద్రంగా నిద్రించటానికి, హత్యా ఖడ్గప్రదర్శనలు లేకుండా విందు విలాసాలకు పొందటానికి సత్యమైన రాజునెడ భక్తిని ప్రకటించి, ఆయనవల్ల సత్కార్యాచరణకు దోహదమిచ్చే యోగ్యగౌరవాలను పొందటానికి తగ్గ అవకాశాన్ని 412 59 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 కల్పించేటందుకు, ఆయన పక్షాన మాక్డవ్ కూడా పవిత్రుడైన ఆ రాజును ప్రార్ధించడానికని వెళ్ళాడు. ఇటువంటి మహాహ్లాదసమయం ఎప్పుడు వస్తుందా అని అలమటించిపోతున్నాము. ఈ వార్తలు మేక్సెత్ను ఎంతగానో సంకట పెట్టాయి. అతడు యుద్ధాభిలాషతో సన్నాహాలు సాగిస్తున్నాడు కూడాను. లెన్నాక్స్ : అతడు మాక్డఫ్ కోసం 60 వార్త పంపించలేదా? ప్రభువు : పంపించాడు. అతడు 'అయ్యా! నేను తిరిగిరాను' అని విస్పష్టంగా సమాధానం చెప్పి పంపించాడు. వెళ్ళిన వార్తాహరి 'ఇట్టి సమాధాన నిర్వహణభారాన్ని నా మీద పడవేసిన సమయాన్ని గురించి మునుముందు మీరెంతో చింతపడతా' రన్నట్లుగా ఏమేమో గొణిగినట్లు తోచి గిరుక్కున వెనక్కి తిరిగాడట! లెన్నాక్స్ : దీన్నిబట్టి అతడు అత్యంత జాగరూకతతో మెలగవలసివుందనీ, సాధ్యమైనంత దూరాన ఉండవలసివుందనీ అతని చేష్ట చెపుతున్నదన్నమాట! ఒక నిరంకుశుని క్రూరపాలనకు లోనై బాధపడుతున్న మన దేశానికి శాంతిసౌఖ్యాలను చేకూర్చటంకోసం, మాక్డర్ కంటే ముందుగానే ఒకదూత ఆంగ్లస్థానానికి వెళ్ళి అతని సందేశాన్ని తెలియజేయవలసి వుంది. ప్రభువు : భగవంతుణ్ణి గురించి నేను సత్రార్థనలు చేసి అవి ఆ దూతను అనుసరించేటట్లు చేస్తాను. (నిష్క్రమిస్తారు) 413 చతుర్థాంకం ఒకటో దృశ్యం ఒక గుహ, మధ్యలో తెకతెక కాగుతున్న ఒక కొప్పెర. ఉరుములు. మాంత్రికురాండ్రు మువ్వురూ ప్రవేశిస్తారు. 61 ప్రథమ మాంత్రికురాలు : చారలపిల్లి ముమ్మూరు మ్యావ్ మ్యావన్నది. ద్వితీయ మాంత్రికురాలు : ముళ్ళపంది మూడున్నొక్కమారు 62 ముక్కుతో గుర్రు పెట్టింది. తృతీయ మాంత్రికురాలు : కొప్పెర చుట్టూ గుండ్రంగా తిరుగుదాం. విషమిచ్చి చంపిన జంతువుల ఆంత్రాదులను అందులో పడవేయండి. చర్మం మీదుగా విషాన్ని వెలిజిమ్ముతూ ముప్పది ఒక్క రాత్రింబవళ్ళ కాలం నిద్రించిన గోదురుకప్పను పట్టుకొన్నాం. దాన్ని ముందుగా ఆ మంత్రకటాహంలో ఉడకబెడదాం. రెక్కొని గొప్పగ రెండింతలుగా సంకటపడదాం, శ్రమచేద్దాం అగ్నీ, ఘనముగ వెలుగు! హండీ, మెండుగ ఉడుకు!! ద్వితీయ మాంత్రికురాలు : తేమనేలనుంచీ పట్టి తెచ్చిన పాము ముక్కలను కొప్పెరలో ఉడకపెట్టి మరిగిద్దాం. నీరుడం కంటిని, కప్ప బొటనవ్రేలిని, గబ్బిలం వెంట్రుకలను, కుక్కనాలను, కట్లపాము రెండు పాయలనాలుకను, మొండికట్టె తోకను, బల్లికాలును, గుడ్లగూబ లెక్కను - వీటన్నింటినీ కలిపి ఉడికించి వేయిద్దాం. అందరు : రెక్కొని గొప్పగ రెండింతలుగా సంకటపడదాం, శ్రమ చేద్దాం. అగ్నీ, ఘనముగ వెలుగు! హండీ, మెండుగ ఉడుకు!! తృతీయ మాంత్రికురాలు : ఘటసర్పపు పొలుసు చర్మాన్ని, తోడేలు పన్నును, మమ్మీ పొట్టను, ఉప్పునీటి సముద్రంలో ఆకలితో అలమటించే షార్కుచేప గొంతుకను, రాత్రివేళ 414 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 63 త్రవ్వి తీసిన హెమ్లాక్ విషౌషధి వ్రేళ్ళను, ఈశ్వరుడిమీద నమ్మకం లేని జ్యూజాతివాని కార్ణాన్ని, మేకపిత్తాన్ని, చంద్రగ్రహణవేళ చెక్కిన యూజాతి వృక్షపు నలిని, తురుష్కుని ముక్కును, తార్తారుని పెదవులను, నీచజాతి స్త్రీ పుట్టగానే గొంతు పిసికి చంపి గోతిలో పారేసిన పసిబిడ్డ వ్రేలును - వీటన్నిటినీ వేసి ఆ చరువుని చిక్కగా చేతికంటుకొనేటట్లు జిగురు చేద్దాం. కొప్పెరలోని దినునులన్నిటితో చివరకు పులి పేగులను చేరుద్దాం. అందరు : రెక్కొని గొప్పగ రెండింతలుగా సంకటపడదాం, శ్రమ చేద్దాం అగ్నీ, ఘనముగ వెలుగు! హండీ, మెండుగ ఉడుకు!! ద్వితీయ మాంత్రికురాలు : అప్పుడు దానితో బాబూను కోతినెత్తురు కలిపి చల్లారబెట్టామంటే అంతటితో ఈ 'మంత్ర కవచం' పరిపూర్తిని పొంది శక్తి గలదౌతుంది. హెకేట్ ప్రవేశిస్తుంది. హెకేట్ : చాలా బాగా నడిపిస్తున్నారు. మీరు పడుతున్న శ్రమకు మిమ్మలినందరినీ అభినందిస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరికీ ప్రతిఫలం దొరుకుతుంది. దివ్యవనితల్లా, గంధర్వగాయనుల్లా చేయి చేయి పట్టుకొని, పాటలు పాడుతూ, ఇప్పుడు కొప్పెర చుట్టూ తిరిగి మీ ఉచ్చాటనతంత్రం వల్ల అందులో వేసిన సర్వసంభారాలకూ శక్తిని కల్పించండి. లోపలినుంచి సంగీతం, 'నీలి నీలి భూతాల్లారా' అన్నపాట వినిపిస్తుంది. (హెకేట్ నిష్క్రమిస్తుంది.) ద్వితీయ మాంత్రికురాలు : బొటనవ్రేలికేదో కుట్టినట్లు బాధ పెడుతున్నది. ఏదో క్రూరరూపం అందువల్ల ఇటు వచ్చేటట్లు తోస్తున్నది. తాళాల్లారా విడిపొండి. తట్టేదెవరో రా రండి! మేక్బెత్ : ఓ వృద్దవనితల్లారా! ఈ కరాళరాత్రిలో ఇంత రహస్యంగా ఏమిటిది? ఏమిటి చేస్తున్నారు. అందరు : పేరు లేని ఒక పని. 415 మేక్బెత్ : మీ విద్యమీద ఒట్టు పెట్టి మీకు తెలుసుననే విశ్వాసంతో అడుగుతున్నాను. నే వేసే ప్రశ్నలన్నింటికీ మీరు సమాధానాలు చెప్పి తీరాలి. బంధనాలను విప్పి పెనుగాలులను చెలరేగించి దేవమందిరాలమీదికి పంపించినా సరే, నురుగు ముద్దలతో నిండి మిడిసిపడే అలలచేత నౌకాభంగాలను జరిపించి ఆ యానపాత్రలను మ్రింగివేసేటట్లు చేసినాసరే, మీరే కల్పించే తుపానుతో అంచులు కట్టిన ధాన్యపుమొక్కలను నేలవ్రాలించి, వృక్షాలను కూలద్రోయించి, సౌధాలు కదలిపోయి రక్షకుల నెత్తిమీద కుప్పకూలేటట్లు చేసినాసరే, పిరమిడ్లలా సుస్థిరాలైన రాజహర్మ్యశిఖరాలు, ఇతరనిర్మాణాలు శిరసులు పునాదుల్లోకి వంగి పూడిపోయినా సరే, వినాశమే తన కృత్యానికి విసగట పొందేటంతవరకూ ప్రాకృతికమూల్య సంపదైన ప్రాణిబీజాలు సర్వం ఒక పెంటకుప్పగా పోగుపడ్డా సరే, మీరు నా ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పితీరాలి సుమా! ప్రథమ మాంత్రికురాలు : అడగవచ్చు. ద్వితీయ మాంత్రికురాలు : ఆజ్ఞాపించు! తృతీయ మాంత్రికురాలు : సమాధానాలు చెప్పగలం. ప్రథమ మాంత్రికురాలు: సమాధానాలను నీవు మా నోట వింటావా? లేక మాకు యజమానురాండ్రయిన శక్తులవల్ల వింటావా? మొదట చెప్పు. మేక్బెత్ : ఆ శక్తులనే పిలవండి. వారిని నన్ను చూడనివ్వండి. ప్రథమ మాంత్రికురాలు : అయితే తాను పెట్టిన తొమ్మిది పిల్లలను తిన్న ఈ ఆడుపంది నెత్తురును ఇందులో వ్రేల్చు. ఆ తలారి ఉరికంబంమీద పేరుకొన్న జిడ్డును ఈ మంటలో పడవెయ్యి. అందరు : ఓ అదృశ్యపిశాచాల్లారా! రండి! కొద్ది గొప్ప అనే తారతమ్యాలు లేకుండా మీరందరూ వేగంగా విచ్చేసి. మీ మీ విద్యాప్రావీణ్యాలను ప్రదర్శించండి. ఉరుములు వినిపిస్తాయి. మొదటి పిశాచం - శిరస్త్రాణంతో ఉన్న ఒక తల మేక్బెత్ : ఓ విచిత్రపిశాచమా! చెప్పు. నా మన..... ప్రథమ మాంత్రికురాలు : నీ మనస్సులోని భావాలేమిటో ఆయనకు తెలుసు. చెప్పేది విను. నీవేమీ ఆయనతో మాటాడకు. 416 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మొదటి పిశాచం : మేక్బెత్! మేక్బెత్!! మేక్బెత్!! మాక్డఫ్ను గురించి జాగ్రత్త! ఈ ఫైఫైనును గురించి జాగ్రత్త! ఈ చెప్పింది చాలు. నన్ను పంపించి వెయ్యి. (దిగిపోతుంది) మేక్బెత్ : నీవు ఎటువంటి దుష్టపిశాచానివైనా కావచ్చు. కానీ నీవు నాకిచ్చిన సలహాకు నీకివే నా ధన్యవాదాలు. నీవు నా భయతంతువును గమనించి చక్కగా మీటావు. కానీ మరోమాట. ప్రథమ మాంత్రికురాలు ఆయన నీ శాసనాలను పాలించే వాడు కాడు. ఇడుగో, అతనికంటే శక్తిమంతుడు మరి ఇంకో పిశాచం వస్తున్నాడు. (ఉరుములు వినిపిస్తాయి. రెండో పిశాచం - ఒంటినిండా రక్తంతో ఒక బిడ్డ, గోచరిస్తాడు.) రెండో పిశాచం : మేక్బెత్ ! మేక్బెత్!! మేక్బెత్ !! మేక్బెత్ : నాకు మూడు చెవులున్నా, వాటినన్నిటినీ నీవు చెప్పే విషయాన్ని వినటంకోసమే ఉపయోగిస్తాను. రెండో పిశాచం : మనస్సును హత్యామయం చెయ్యి. ధైర్యం వహించు. స్థిరనిశ్చయుడవుకా. స్త్రీ గర్భాన జన్మించిన వ్యక్తి ఎవ్వరూ, మేక్బెత్, నిన్ను ఏమీ చెయ్యలేరు. కనుక మానవశక్తిని అలక్ష్యం చెయ్యి! దాన్ని పరిహసించు. (దిగిపోతుంది) మేక్బెత్ : అయితే మాక్డఫ్! నీవు సజీవుడవుగానే ఉండిపో. నీ మూలంగా నేను భయపడవలసిన అగత్యం లేదు. అయినా నా భద్రతను రెండింతలు గట్టి చేసుకొంటాను. విధివల్ల నా క్షేమాన్ని గురించి ఒక ఒడంబడిక పుచ్చుకొంటాను. మాక్డఫ్! నీవు జీవించరాదు. పిరికిగుండెవల్ల పాలిపొయ్యే భయంతో “నీవు అబద్ధమాడుతున్నా”వని చెప్పవలసివస్తుంది కనుకను, ఉరుముల్లో కూడా నిశ్చలంగా నిద్రించే అవకాశం కలుగుతుంది గనుకనూ, నీవు జీవించరాదు. (ఉరుములు, మూడో పిశాచం - కిరీటాన్ని ధరించిన ఒక బాలుడు చేతిలో ఒక చిన్న చెట్టును పట్టుకొని గోచరిస్తాడు.) చిన్ని తలమీద కిరీటాన్ని ధరించి రాజకుమారుడిలా పైకివస్తున్న అతడెవరు? 417 అందరు అతడు చెప్పేది విను. అతనితో మాట్లాడకు.
మూడోపిశాచం : సింహగాంభీర్యంతో మహాదర్పాన్ని వహించు. ఎవరు సంకటపడ్డా ఎవరు ఉద్రేకపడ్డా ఎవరు ద్రోహాన్ని తలపెడుతున్నట్లు కనపడ్డా పట్టించుకోకు. తనకు వ్యతిరేకంగా తిరిగి బిర్నామ్ మహారణ్యం నడుస్తూ ఉన్నతమైన డన్స్నేన్ పర్వతందాకా పయనించి వచ్చేటంత వరకూ మేక్బెత్కు ఓటమి అనేది లేదు. 64 మేక్బెత్ అది ఎన్నటికీ జరుగదు! మహారణ్యాన్ని తమ సేవ చేయటంకోసం లొంగదీసుకొని, భూమిలో పాతుకోపోయిన వ్రేళ్ళను విడదీసుకొని వచ్చివెయ్యమని వృక్షాలను ఆజ్ఞాపింప గలవాడెవరు? ఓహో, ఎంతటి మధురమైన జోస్యాలు! ఇవి ఎంత దొడ్డగా ఉన్నాయి. బిర్నాం మహారణ్యం లో 4 ఎత్తివచ్చేదాకా విప్లవం తలయెత్తకుండుగాక! మేక్బెత్ పూర్ణాయుషజీవిగా బ్రతికి ప్రకృతి లక్షణాన్ని అనుసరించి కాలం తీరినప్పుడే మర్త్యధర్మాన్ని అనుసరించి తన ప్రాణాలను విడిచిపెట్టుగాక! అయినా ఒక విషయాన్ని తెలుసుకోటం కోసం నా చిత్తం తత్తరపాటు వహిస్తున్నది. నీ విద్య కా శక్తి ఉంటే చెప్పు, బాంకో సంతానం ఎప్పుడైనా ఈ రాజ్యాన్ని పొందుతుందా? అందరు : చెప్పినదాన్ని మించి తెలుసుకోటానికి యత్నించకు. మేక్బెత్ : దీనితో నేను తృప్తి వహించటానికి, నిశ్చయించాను. ఈ అంశాన్ని చెప్పటానికి నీవు తిరస్కరిస్తే నీకు నిత్యమైన శాపం తగులుగాక!... ఎందుకు ఆ కొప్పెర అలా క్రుంగిపోతున్నదీ? ఈ శబ్దమేమిటి? (తుత్తారధ్వని, పన్నాయి వినిపిస్తాయి) ప్రథమ మాంత్రికురాలు : కనిపించండి వెలికివచ్చి కనిపించండి. ద్వితీయ మాంత్రికురాలు : కనిపించండి తృతీయ మాంత్రికురాలు : కనిపించండి. అందరు : కంటిముందు కన్పించి అతని హృదయాన్ని దుఃఖరసపూరితం చెయ్యండి. ఛాయారూపాలతో వచ్చి మీరంతా అదే రూపంతో తిరిగిపొండి. ఎనిమిదిమంది రాజులు", చివరి రాజు చేతుల్లో ఒక అద్దమూ, కాచగోళము, వెనుక బాంకో ప్రేతరూపం వున్న ఒక ఛాయాదృశ్యం గోచరిస్తుంది. 418 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 66 మేక్బెత్ : నీవు విశేషంగా బాంకో ప్రేతరూపంలో కనిపిస్తున్నావు. వెళ్ళిపో! నీ శిరస్సుమీది కిరీటం నా కనుగ్రుడ్లను మండిస్తున్నది. స్వర్ణకిరీటాన్ని ధరించిన ఓ ద్వితీయమూర్తీ! నీ జుట్టు మొదటివాని జుత్తులాగానే ఉంది. మూడోరూపం సర్వవిధాలా మొదటి రెండు రూపాలనే పోలివుంది. నాల్గోరూపం కూడా ఉందా ఏమిటి? ఓ నేత్రాల్లారా! మీరు నిలిచిన స్థానం నుంచి తప్పించుకొని వెళ్ళిపోండి. ఏమిటి ఈ రాజవంశపరంపర ఇలా మహాప్రళయకాలంవరకూ అనంతంగా కొనసాగిపోతుందా ఏమిటి? మళ్ళీ ఇంకో రూపమా సప్తమరూపమా! ఇక ససేమిరా నేను చూడను. ఇంకా ఎన్నెన్నో మూర్తులను ప్రదర్శించే కాచముకురాన్ని ధరించి ఎనిమిదోరూపం కనిపిస్తున్నదే! ఇందులో కొన్ని రూపాలు ఒకచేతిలో రెండు బంతులను, మరో చేతిలో మూడు రాజదండాలను ధరించి కనిపిస్తున్నవే. అయ్యో! ఎంత ఘోరమైన దృశ్యం! 'వీరంతా నా వంశజులే' అని ఛాయామూర్తులను చూపిస్తూ నన్ను చూసి నవ్వుతూ, రక్తంతో తడిసి బిరుసెక్కి జడలు కట్టిన జుత్తులో బాంకో వీరందరి వెనుకా కనిపించటంవల్ల నా భయాలన్నీ సత్యమైనవే అని నాకిప్పుడర్థమౌతున్నది. ఏమిటి? ఇలా ముందు ముందు అంతా జరిగి తీరుతుందా? ప్రథమ మాంత్రికురాలు : అవునయ్యా! జరిగితీరుతుంది. అయితే మేక్బెత్ ఇంతగా అచ్చెరువుపడి ఆగిపోయాడేమిటి? రండి! సోదరీమణులారా! మనం ఇతనికి ఉత్సాహాన్ని కల్పిద్దాము. అతడు మనకిచ్చిన స్వాగతానికి తగ్గరీతిగా శ్రద్ధతో మనం మన కర్తవ్యాలను నిర్వహించామని ఈ దొడ్డరాజు పలికేటట్టుగా, అతనికోసం మనకు తెలిసినవాటిలో మంచి వినోదాన్నొకదానిని కల్పిద్దాము. సంగీతాన్ని వినిపించేటట్లు నేను వాయువుమీద ఒక మంత్రప్రయోగం చేస్తాను. నీవు విచిత్రమైన మండలనృత్యం చెయ్యి. (సంగీతం వినిపిస్తుంది. మాంత్రికురాండ్రు నృత్యం చేసి హెకేట్తోబాటు అదృశ్యమౌతారు.) మేక్బెత్ : వీళ్ళేరి? అదృశ్యమైపోయినారా? ఈ దుష్టమైన ఘడియ నిందాపాత్రమౌతూ కాలపట్టికలో నిలిచిపోవుగాక! అక్కడ వేచిఉన్నదెవరో లోపలికి రండి! లెన్నాక్స్: మహారాజా! ఏమాజ్ఞ! లెన్నాక్స్ ప్రవేశిస్తాడు. మేక్బెత్ : నీవు మాంత్రికురాండ్రను చూశావా? 419 లెన్నాక్స్ లేదు మహారాజా! మేక్బెత్ : వాళ్ళు వెళ్ళేటప్పుడు మీ ప్రక్కగా వెళ్ళలేదా? లెన్నాక్స్: లేదు మహారాజా! నిశ్చయంగా వెళ్ళలేదు. మేక్బెత్ : అయితే వారు పయనించే వాయువు విషపూరితమౌగాక! వారిని నమ్మినవారు వినాశమొందుదురుగాక!! ఎక్కడివో గుర్రపుడెక్కల చప్పుళ్ళు నాకు వినిపించాయి. ఎవరు వచ్చారు? లెన్నాక్స్: మహారాజా! మాక్డఫ్ ఇంగ్లండుకు పారిపోయాడన్న వార్తను నివేదించటానికి ఇద్దరో, ముగ్గురో వార్తాహరులు వచ్చారు. మేక్బెత్ : మాక్డఫ్ ఇంగ్లండుకు పారిపోయాడా? లెన్నాక్స్: అవును మహారాజా! మేక్బెత్ : నేను తలపెట్టిన భీకరకృత్యాలను అడ్డుకోటం కోసమో అన్నట్లు కాలమా! నీవు అతివేగంగా పరుగెత్తుతున్నావు. చేసిన వెంటనే కార్యరూపంతో పరిపూర్తిని కల్పింపకపోతే వట్టి తీర్మానాలు వ్యర్థాలు. 67 68 ఈ క్షణం నుంచీ నా హృదయంలో కలిగే ప్రతి ప్రథమోద్దేశం నా హస్తాలకు నిర్వర్తించిన ఆదిమ కర్తవ్యమౌగాక! ఇప్పుడు కూడా ఏ ఉద్దేశ కార్యరూపాల రెంటికీ సాహచర్యాన్ని కలిగిస్తాను. హఠాత్తుగా ఇప్పుడు మాక్డఫ్ దుర్గం మీద పడతాను. ఫైఫ్ ని అతని ఆస్తినంతటినీ స్వాధీనం చేసుకొంటాను. అతని భార్యను, బిడ్డలను, అతని వంశజులు కావటంవల్ల వారసులు కాదగిన అదృష్టహీనులనందరినీ నా ఖడ్గాంచలానికి బలి ఇస్తాను. బుద్ధిహీనుడు పలికే గర్వోక్తులు కావివి. నా ఉద్రేకం చల్లారకమునుపే ఈ పని చేసి తీరుతాను. ఇదివరకటిలాగా ఇక నాకు కేవల దృశ్యాలను చూడటంతో పనిలేదు. ఆ వార్తాహరులేరీ? పదండి. నన్ను వారి దగ్గరికి తీసుకుపోండి. (నిష్క్రమిస్తారు) రెండో దృశ్యం (ఫైఫ్, మాక్డఫ్ దుర్గంలోని సౌధం. మాక్డఫ్ ప్రభ్వి, ఆమె కుమారుడు, రాస్ ప్రవేశిస్తారు.) మాక్డఫ్ ప్రభ్వి : దేశంనుంచి పారిపోవలసినంతటి తప్పిదం వారేమి చేశారు? 420 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 రాస్ : ప్రభ్వీ! తాము ప్రశాంతితో వ్యవహరించాలి. మాక్డఫ్ ప్రభ్వి : వారు ప్రశాంతితో వ్యవహరించారా మరి? వారు పారిపోవటం కేవలం ఉన్మాదకృత్యం. ఒకప్పుడు మన చేష్టలవల్ల కాకపోయినా భయాలు మనకు రాజద్రోహులను చేస్తుంటాయి. రాస్ : తల్లీ! వారు చేసిన కృత్యం వివేకంతో చేసిందో, భయంవల్ల చేసిందో మీకు తెలియదు. మాక్డఫ్ ప్రభ్వి : వివేకంతో చేసిందనా? భార్యను, బిడ్డలను, సౌధాలను, ఇతరాలైన ఆస్తిపాస్తులను ఎక్కడనుంచి తాము పారిపోతున్నారో ఆ ప్రదేశంలోనే విడిచిపుచ్చటం వివేకంతో చేసిన పనా? వారికి మేమంటే ప్రేమ లేదు. సహజమైన ప్రణయభావం వారిలో లోపించింది. జీనువాయివంటి చిన్న పిట్టకూడా గూటిలోని తన చిన్నబిడ్డలను రక్షించుకోటం కోసం గ్రుడ్లగూబతో పోరాడుతుంది. ఇదంతా వారికోసమైన భయమేగాని, ఇతరులకోసమైన ప్రేమమాత్రం కాదు. ఏ రీతిగా చూసినా ఈ పారిపోవటానికి అర్థం కనిపించటం లేదు కనక ఇందులో వివేకం అణుమాత్రం లేదు. రాస్ : ప్రియసోదరీ! ఈ తొందరపాటును కొంతకట్టిపెట్టమని మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. మీ భర్త ఉదాత్తుడు, వివేకి, ధర్మసమ్మితుడు కాలంలోని వైపరీత్యాలను మహాఘనంగా గమనింపగలవాడు. సత్యానికి ఏమీ ఎరగకపోయినా, మనం రాజద్రోహులముగా పరిగణింబడుతున్నామంటే మనయెడ పుట్టిన ప్రతివదంతినీ మన భయానికి అనుగుణంగా అన్వయించుకొంటూ, అవగతం చేసుకొంటూ, ఎందుకు మనం భయపడవలసివచ్చిందో కూడా తెలియకుండానే భయదవాతోత్తుంగ పారావారంలో ఆటుపోటులమధ్య అరిగిపోతున్నప్పుడు, కాలం మనయెడ నిర్దాక్షిణ్యంగా వర్తిస్తున్నదని మాత్రమే చెప్పగలను. ఇప్పుడు మీ సెలవు తీసుకొంటున్నాను. తిరిగి ఇక్కడికి రావటానికి ఎంతో ఆలస్యం చెయ్యను. విషయాలు విషమపరిస్థితిలో పరాకాష్ఠను చేరుకోటంవల్ల అంతరించనన్నా అంతరిస్తవి. లేదా పూర్వం తామున్న ప్రశాంతసుస్థితినైనా పొందుతవి. ప్రియసోదరీ! పరమేశ్వరుడు మీకు పరమశ్రేయాలను చేకూర్చుగాక! మాక్డఫ్ ప్రభ్వి : ఇతడు తండ్రి కలవాడే. అయినా ఇప్పుడు లేనివాడైనాడు. 421 రాన్ : ఇంకా నేను ఇక్కడ ఉండిపోయేటట్లయితే నన్ను నేనే బుద్ధిహీనుణ్ని చేసుకొన్నవాడనౌతాను. అందుమూలంగా నన్ను నేనే అవమానించుకొన్నవాడి నౌతాను. మీకు అధిక దుఃఖాన్ని కలిగిస్తాను. అందువల్ల వేగంగా మీ సెలవు తీసుకొంటున్నాను. (నిష్క్రమిస్తాడు) మాక్డఫ్ ప్రభ్వి : చిట్టితండ్రీ! మీ నాన్న చనిపోయినారు. నీవిప్పుడేం చేస్తావు? ఎలా జీవిస్తావు? కుమారుడు : అమ్మా! పక్షులు ఎలా జీవిస్తాయో అలాగే జీవిస్తాను. మాక్డఫ్ ప్రభ్వి : అవి పురుగులను, ఈగలను తిని బ్రతుకుతాయి మరి. కుమారుడు : అమ్మా! వాటినివలెనే ఏది దొరికితే దాన్ని తిని బ్రతుకుతాననే నా అభిప్రాయం! మాక్డఫ్ ప్రభ్వి : వెర్రికూనా! తెలియకపోవటంవల్ల వలలన్నా, మచ్చులన్నా, కండెలన్నా, బోనులన్నా నీవు భయపడటం ఎరగవు. కుమారుడు : వాటిని చూసి నేనెందుకు భయపడాలమ్మా? వాటిని నాబోటి పేదపక్షులకోసం ఎవరు పన్నుతారమ్మా! ఎంతైనా చెప్పు, మా నాన్నగారు మరణించలేదమ్మా! మాక్షఫ్ ప్రభ్వి : కాదు తండ్రీ! వారు మరణించారు. మరి నీకు నాన్న కావాలి గదా, నీవేం చేస్తావు? కుమారుడు : అమ్మా! మరి నీకు భర్త కావాలిగదా, నీవేం చేస్తావు? మాక్డఫ్ ప్రభ్వి : ఏ విపణిలోనైనా అటువంటి భర్తలను ఇరవైమందిని నా కోసం కొనుక్కొంటాను. కుమారుడు : తిరిగి అమ్మివేయటానికని ఇంతమందిని కొంటావా? మాక్డఫ్ ప్రభ్వి : ఎంత తెలివిగా మాటాడావురా తండ్రీ! నీ వయసుకు తగ్గ తెలివి ఉందనిపిస్తున్నావు. కుమారుడు : అమ్మా! అయితే మా నాన్నగారు రాజద్రోహం చేశారా? 69 మాక్డర్ ప్రభ్వి : అవును నాయనా! రాజభక్తి ప్రమాణాన్ని భగ్నం చేశారు. 422 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 కుమారుడు : అయితే రాజద్రోహులందరూ ఇలాగే చేస్తుంటారా? మాక్డఫ్ ప్రభ్వి : ఇలా చేసినవాళ్ళందరూ రాజద్రోహులు ఉరితీయటమే వారికి శిక్ష. కుమారుడు : ప్రమాణం చేసి భగ్నం చేసినవారందరినీ ఉరి తీయవలసిందేనా? మాక్డర్ ప్రభ్వి అవును. అలాటి ప్రతివారినీ ఉరితీయవలసిందే. కుమారుడు : అయితే వారిని ఎవరు ఉరితీయాలి? మాక్డఫ్ ప్రభ్వి : సత్యసంధులు. కుమారుడు : అలా అయితే సంఖ్యలో వీరు అధికులు గనకను, ఆ సత్యసంధులచే ఉరితీయబడటం కంటే వారినే ఉరి తీయగలరు కనుకనూ, ఈ ప్రమాణం చేసేవాళ్ళు, వారిని శిక్షించేవారు అంతా మూర్ఖులన్నమాట! మాక్డఫ్ ప్రభ్వి : ఓరి పిచ్చికోతే! దేవుడు నిన్నెలా కనిపెడతాడో! అయితే ఇంతకు మీ తండ్రిగారు లేకపోతే నీవేం చేస్తావు మరి? కుమారుడు : వారు చనిపోయినట్లయితే నీవు ఏడ్చేదానివి. నీవు ఏడ్వటం లేదంటే అది మంచి లక్షణమే నాకు త్వరలో క్రొత్త నాన్న వస్తాడన్నమాట! మాక్డఫ్ ప్రభ్వి : ఓరి వదరుబోతా! ఎంత తెలివిగా వాగుతున్నావు? ఒక వార్తాహరి ప్రవేశిస్తాడు. వార్తాహరి : మహోదాత్తా! మీకు పరమేశ్వరుడు క్షేమాన్ని చేకూర్చుగాక! తల్లీ! మీ ఉన్నతస్థితిని నేను బాగా ఎరుగుదును. కానీ మీరు నన్నెరగరు. ప్రమాద మేదో మిమ్మల్ని సమీపిస్తున్నదని నేను అనుమానిస్తున్నాను. నావంటి కాపట్యరహితుని సలహాను మీరు పాటించదలచుకొంటే మీరు ఇక్కడ ఉండవద్దు. మీ పిల్లలతో ఎక్కడికైనా పారిపోండి. ఇలా మిమ్మల్ని భయపెట్టడంతో నేను మీయెడ ఒక ఆటవికుడిలా ప్రవర్తిస్తున్నానేమోనని భావిస్తున్నాను. అయితే మిమ్మల్ని జాగ్రత్తపడవలసిందని చెప్పకుండా ఉండటం, అనతికాలంలో మీ మీద జరుగనున్న అత్యాచారం కంటే దారుణమైన పని. పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక! ఇక ఎక్కువకాలం ఇక్కడ ఉండటానికి నేను సాహసించలేను. మాక్డఫ్ ప్రభ్వి : అయ్యో, నేనెక్కడికి పారిపోను? నేనెవరికీ ఎట్టికీడునూ చేసినదాన్ని కాను. కానీ ఇప్పుడు నేను ఇతరులకు ఆపదలను కలిగించగలగటమే శ్లాఘనీయంగాను, 423 కొన్ని పరిస్థితుల్లో ఇతరులకు మంచి చేయటం అతిప్రమాదకరమైన దోషంగాను పరిగణింపబడే ప్రపంచంలో ఉన్నానని నాకిప్పుడు స్మృతికి వస్తున్నది. ఇట్టి స్థితిలో 'నేనెవరికీ ఏ కీడూ చేయలే' దని సామాన్యంగా స్త్రీలు చెప్పుకొనే రక్షణవాక్యాన్ని నేనెందుకు పలకాలి? హంతకులు ప్రవేశిస్తారు. అయ్యో! ఎంతటి భయంకరరూపాలు! ప్రథమ హంతకుడు : నీ భర్త ఎక్కడ? మాక్డఫ్ ప్రభ్వి : వారు నీవంటి ద్రోహులు ప్రవేశించి పట్టుకోటానికి అవకాశమున్న ఏ అపవిత్రదేశంలోను లేరని నా విశ్వాసం. ప్రథమ హంతకుడు : ఆయన రాజద్రోహి! కుమారుడు : ఓరి జుంజురుజుత్తు వెధవా, ద్రోహి, నీ మాట అసత్యం! ప్రథమ హంతకుడు : ఓరిగ్రుడ్డా! ఏమన్నావు? (కత్తితో పొడుస్తాడు) ఓరి వేపుడు ముక్కా! కుమారుడు : అమ్మా. వీడు నన్ను పొడిచి చంపాడు. పారిపో. ప్రార్థిస్తున్నానమ్మా. పారిపో, (మరణిస్తాడు) (హత్య అని కేకలు పెడుతూ హంతకులు వెన్నాడగా మాక్డఫ్ ప్రభ్వి నిష్క్రమిస్తుంది.) మూడో దృశ్యం రాజసౌధానికి ముందు మాల్కొం, మాక్డఫ్ ప్రవేశిస్తారు. మాల్కొం : నీడ ఉన్న ఏకాంతప్రదేశాన్ని చూసుకొని అక్కడ దుఃఖరసపూరితాలైన హృదయాలను శోకించి శూన్యం చేసుకొందాము. మాక్డఫ్: ఇంతకంటే స్థిరనిశ్చయంతో భీకరఖడ్గధారణం చేసి వీరపురుషుల్లా నిలిచి పతితమైన పవిత్రజన్మభూమిని రక్షిద్దాము. విగతభర్తృకల ఆక్రందనాలు, అనాథబాలల రోదనాలు, ఆకసాన్ని అలముకోటంవల్ల స్కాట్లండు దుఃస్థితికి అది తిరిగి 424 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 అనుగుణపరితాపాన్ని వహిస్తున్నదో అన్నట్లు దాని ప్రతిధ్వనుల రూపాన వినిపించే నూతన దుఃఖధ్వనులు ప్రతిదినం తెల్లవారిందంటే క్రొత్తక్రొత్తవిగా వినిపిస్తుంటాయి. మాల్కొం : నాకు సంబంధించినంతవరకూ నేను విశ్వసించినవాటికోసమే దుఃఖిస్తాను. సత్యాలని రూఢిగా ఎరిగినవాటినే విశ్వసిస్తాను. కాలం అనుకూలించి సాయపడ్డప్పుడు అట్టి కృత్యాలకు తగ్గ ప్రతీకారచర్యలు చేస్తాను. నీవు చెప్పేవి సత్యాలే కావచ్చు. ఎవరి నామోచ్చారణం ఇప్పుడు మన నాల్కను రగుల్కొల్పుతున్నదో ఆ నిరంకుశుణ్ణి అందరూ పూర్వం ఉదాత్తుడని భావించారు. అతణ్ణి నీవూ పూర్వం గాఢంగా ప్రేమించావు. ఇంతవరకూ అతడు నిన్ను ముట్టుకోలేదు. అతడివల్ల మంచి పారితోషికాలను పొందటానికి నీకు మంచి వీలుంది. క్రోధాన్ని వహించిన దేవతను తృప్తిపరచటానికి శక్తిహీనం, దరిద్రం, నిరపరాధం అయిన అజశాబకాన్ని బలిగా అర్పించటం అతివివేకమైన విధానం కదా! మాక్డఫ్ : నేను స్వామిద్రోహిని కాను! మాల్కొం : నీవు కాకపోవచ్చు. కానీ మేక్బెత్ విశ్వాసఘాతుకుడు. రాజాజ్ఞను నిర్వహించే విషయంలో ఉదాత్తమూ, సద్గుణాన్వితమూ అయిన ప్రకృతికూడా లొంగిపోవచ్చు. ఇలా నిన్ను అనుమానించినందుకు క్షమాపణ నర్థిస్తున్నాను. అయితే నీ సహజప్రకృతి నా అభిప్రాయాలను మార్చలేదు గదా! అతితేజోవంతులైనవారు పడిపోయిన వేళల్లో కూడా తేజోవంతులుగానే ప్రకాశిస్తుంటారు. నీచగుణాలకు సద్గుణవేషాన్ని కల్పించి కన్పించినా సద్గుణం సర్వవేళలా స్వస్వరూపంతోనే కన్పించితీరాలి. మాక్డఫ్ : నా ఆశలన్నీ భగ్నమైనాయి. మాల్కొం : ఇలా జరగటం బహుశః నేను అనుమానించటం వల్లనే అని అనుకొంటాను. ఆలోచనారహితమైన తొందరలో అమూల్య హేతువులు, ప్రగాఢప్రణయబంధాలు అయిన దారాపుత్రులను రక్షణరహితులనుగా చేసి, వీడ్కోలైనా చెప్పకుండా నీవెందుకు విచ్చేశావు? నిన్ను అనుమానించటం అగౌరవించటం కాదనీ, నా భద్రత కోసం తీసుకొంటున్న చర్య అనీ భావించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నేనెల్లా భావించినా దానికి భిన్నంగా నీవు సత్యతత్పరుడవే ఐ ఉండవచ్చు. మాక్డర్: అయ్యో! ఓ నా అభాగ్యజన్మభూమీ! నీ శరీరంనుంచి ఇలాగే అవిరళంగా రక్తం స్రవించుగాక! ఓ స్వామిద్రోహమా! మంచితనం నిన్ను అడ్డుకోలేకపోతున్నది 425 స్వేచ్ఛగా నీవు నీ స్థానాన్ని సుప్రతిష్ఠితం చేసుకో! నీ దుశ్చర్యల వల్ల ఏ ఫలాన్ని పొందుతున్నావో దాన్ని బహిరంగంగానే అనుభవించు. నీ సత్త్వం స్థిరపడింది ప్రభూ! నాకు సెలవిప్పించండి. సమృద్ధశీల అయిన ప్రాచ్యదేశంతో జతచేసి ఆ రాజద్రోహి చేపట్టిన సర్వరాజ్యాన్నీ నాకిచ్చినా, నేను మీరు భావించినట్లుగా స్వామిద్రోహిని, విశ్వాసఘాతుకుణ్ణి కాలేను. మాల్కొం : కోపం తెచ్చుకోకు. నేను కేవలం నిన్ను గురించి కలిగిన భయంవల్ల నే అలా అనలేదు. రాజద్రోహమనే కాడిబరువును మ్రోయలేక మన మాతృభూమి క్రుంగిపోతున్నదని నేనెరుగుదును. ఆమె ఆక్రోశిస్తున్నది. నెత్తురులు విరజిమ్ముతున్నది. ఆమె శరీరానికి తగిలిన గాయాలకు క్రొత్తరోజు వచ్చినప్పుడల్లా విచ్చి, నెత్తురును విరజిమ్మే మరొక గాయం చేరుతున్నది. నా సత్వసంరక్షణార్థం శస్త్రధారణ చెయ్యటానికి సంసిద్ధులైనవారున్నారని కూడా నాకు తెలుసు. మహోదారమైన ఇంగ్లండు కూడా నా పక్షాన పోరాడటానికి వేలకొలది సైన్యాన్ని సహాయమిచ్చింది. అయినా నేనా రాజద్రోహిమీదికి ఎత్తివచ్చి, అతని తలదన్నినా, లేక నా ఖడ్గాంచలాన విజయచిహ్నాన్ని చేర్చినా, అభాగ్యమైన నా మాతృభూమి అతనితరువాత పరిపాలన చేసేవాడివల్ల అంతకు పూర్వం కంటే ఎంతో విశేషమైన వ్యసనాలకు, నానారీతులైన నూతనకష్టాలకు గురౌతుంది. మాక్డఫ్ : : ఆ పాలకుడు ఎటువంటివాడై వుంటాడు? మాల్కొం : అదేమిటి? అతణ్ణి నేనే. సర్వరీతివ్యసనాలూ పాదుకొని పరిపూర్ణంగా వృద్ధిపొందితే పరమనీచుడుగా కన్పట్టే మేక్బెత్తో పోల్చినప్పుడు అతడే హిమఖండమువలె అతిస్వచ్ఛంగా తోచేటట్లు కనిపింపజేసే ఆ వ్యక్తిని నేనే. నేను రాజునైతే కల్పించే అనంతహింసలను చూచి, నన్ను అతడితో పోల్చి నా దేశీయులు అతణ్ణి గొట్టెవంటి సాధువుగా భావిస్తారు. మాక్డఫ్ : నరకంలోని అసంఖ్యాక సైనికదళాలలో కూడా క్రూరచేష్టాచరణ విషయంలో మేక్బెత్ను పోలిన పెనుభూతాలు కన్పించవు. మాల్కొం : అతడు క్రూరుడనీ, భోగలాలసుడనీ, అసత్యప్రియుడనీ, మోసకారి అనీ, అతికోపి అనీ, అసూయాపరుడనీ, ఇంకా పేరంటూ పొందిన సమస్తపాప చిహ్నాలూ 426 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 కలవాడనీ అంగీకరిస్తాను. కానీ నా భోగాసక్తికి అంతంటూ లేదు. నా కోర్కె ఎదిరించిన ఎట్టి ప్రబలమైన ఆటంకాలనయినా తల్లక్రిందులు చేసివేస్తుంది. అందువల్ల నావంటివారు పాలించేదానికంటే మన దేశాన్ని మేక్బెత్ పాలించటమే ఉచితం! ఉత్తమం!! మాక్డఫ్ : మర్యాద నెరుగని ఆత్మలోలుపత్వం ప్రకృతితః నిరంకుశత్వమే. అంతే కాదు, ఈ గుణమే పలుమార్లు సింహాసనాన్ని శూన్యం చేయిస్తూ మన రాజవంశంలో పుట్టిన అనేకులకు అకాలమరణాన్ని కల్పించింది. అంత మాత్రంచేత రాజులైన మీరు మీ స్వత్వాన్ని విడిచిపుచ్చేటంతగా పిరికిపడవద్దు. మీ కాముకతను తీర్చుకోటానికి కావలసినంత మంది లభ్యమౌతారు. దానిని రహస్యంగా తీర్చుకొంటూనే పునీతులవలె కనిపించి కాలాన్ని మోసగించవచ్చు. తమంతట తామే మహారాజులకు తమ్మర్పించుకొనే స్త్రీలు ఎందరో ఉంటారు. మహారాజు అందుకు అనుకూలుడైనట్లు కన్పించినట్లయితే ఆత్మార్పణం చేసే అబలాగణా న్నంతటినీ తృప్తి కలిగేటట్లు మ్రింగగలిగే రాబందు మీలో ఉండటానికి అవకాశం లేదు. మాల్కొం : దీనితో బాటుగా నేనే రాజునైతే నీచగుణాలు గల నా ప్రకృతిలో తృప్తి నెరుగని లోభం పుట్టి ప్రభువర్గంవారి భూములను కత్తిరించటమో, కాజేయటమో చేయవచ్చు. నేను ఒకరి ఆభరణాలు, మరొకరి గృహాన్ని కోరవచ్చు. ఎక్కువ లభించటమనేది ఒక వ్యంజనగా పనిచేసి నాకు మరింత ఆకలిని కల్పించవచ్చు. అందువల్ల ఉత్తములు, భక్తిప్రపత్తులు గల ప్రజలమీద నేను లేనిపోని దోషాలను ఆరోపణ చేసి, సంపదలకోసం వారిని నాశనం చెయ్యవచ్చు. మాక్డఫ్ : గ్రీష్మకాలంలో తాత్కాలికమైన కాముకత్వం కంటే యీ లోభం నేలలో లోతుకు పాతుకొనిపోయి విషపువ్రేళ్ళ సహాయంతో పెరుగుతున్న దన్నమాట వాస్తవమే. ప్రజావిప్లవాలకు గురియై మన పూర్వరాజన్యులపాలిటి కిది నిశాతఖడ్గమైన మాట వాస్తవమే. అయినా మీరు భయపడనవసరం లేదు. మీ కాంక్షను తీర్చటానికి స్కాట్లండులో ఘనసంపదలు అనంతంగా ఉన్నవి. అవి నిజానికి మీవి కూడాను. మీ సద్గుణాలతో తులతూస్తే ఇవి సహనయోగ్యాలు మాత్రమే. మాల్కొం : అయితే నీవు చెప్పే ఆ సద్గుణాలు నాలో ఏమీ లేవు. మహారాజులకు యోగ్యమైన సద్గుణాలు ధర్మతత్పరత, సత్యసంధత, స్థిరత, వితరణ, దృఢాధ్యవసాయం, కారుణ్యం, వినయం, భక్తి, సహనం, సహిష్ణుతలు, ఈ గుణవిశేషాలయెడ నాకాసక్తి లేదు. అదీకాక దోషాలల్లో ఎన్ని జాతులున్నాయో, వాటిలో ప్రతిజాతిదోషాన్నీ నానారీతుల ఆచరించివుండటమనే లక్ష్యంతో కట్టుబడ్డవాణ్ణి నేను. ఇంతేకాదు. అధికారం 427 హస్తగతమైతే శాంతిక్షీరాన్ని నరకాలపాలు చేసి జగచ్ఛాంతిని ఛిద్రం చేస్తాను. భూమిమీద ఐకమత్యమన్నది లేకుండా పూర్తిగా వినాశనం చేస్తాను. మాక్డఫ్: అయ్యో! నా స్కాట్ దేశమా! స్కాట్ దేశమా!! మాల్కొం: నేనెటువంటివాడినో నీకు తెలియజేశాను. చెప్పు, ఇట్టివాడు పాలించటానికి యోగ్యుడైతే చెప్పు! మాక్డఫ్: ఇట్టివాడు పాలించటానికి యోగ్యుడా అని అడుగుతున్నారా? కాదు. జీవించటానికి కూడా యోగ్యుడు కాడు. రక్తంలో మునిగితేలుతున్న రాజదండంతో, సింహాసనాన్ని కాజేసిన ఒక క్రూరనిరంకుశ రాజ్యాపహర్త పరిపాలనకు లోనైన ఓ నా దేశమా! నీవెంతటి దీనావస్థననుభవిస్తున్నావు! సత్యమైన నీ రాజవంశంలోని వారసుడు తనయెడ తానే దోషారోపణం చేసుకొని తనను, తన రాజవంశాన్నీ నిందిస్తున్నాడు. కనుక ఓ నా మాతృభూమీ! మహావైభవాన్ని అనుభవించిన ఆపూర్వదినాలను నీవు తిరిగి ఏ నాటికి చూడగలవో తెలియటంలేదు. ప్రభూ! మీ తండ్రి పుణ్యపురుషుడైన మహారాజు. నిన్ను కన్నతల్లి మహారాజ్ఞి నిత్యవ్రతాచరణంతో శరీర కార్శ్వాన్ని వహించి మోకరిల్లి ఎల్లవేళలా మరణావస్థలో ఉన్నట్లు మనిన మహనీయ. మీకు శుభమగుగాక! తమకున్నట్లుగా ఏకరువు పెట్టిన మీ దోషాలే నన్ను స్కాట్లండు నుంచి బహిష్కృతుణ్ణి చేస్తున్నవి. అయ్యో! హృదయమా! ఇంతటితో నీ ఆశలడుగంటాయి. మాల్కొం: మాక్డఫ్! సత్యసంధతవల్ల జనించిన ఈ నీ మహోదారశోకవివశత్వం నా హృదయం నుంచి నీచానుమానాల నన్నింటినీ తుడిచిపెట్టింది. నీ నిష్కాపట్య నైతికోన్నతులమీద నాకు నమ్మకం కల్గించింది. దుష్టుడైన మేక్బెత్ నన్ను మోసగించి లోగొనటానికి ఇటువంటి పన్నాగాలెన్నో ప్రయోగించాడు. అందువల్ల అణకువగల నా వివేకం, నన్ను అతిసులభంగా నమ్మే తొందరపాటు నుంచి దూరంగా నిలుపుతున్నది. ఇక నీ నా మధ్య సంబంధాన్ని పరమేశ్వరుడే నిర్ణయించుగాక! ఈ క్షణంనుంచీ నేను నీకిష్టాలైన సూచనలను అనుసరిస్తాను. నాకు వ్యతిరేకంగా ఏమేం చెప్పానో అవి సత్యాలు కాదని అంటాను. ఏ దుర్గుణాలు, దోషాలు నాలో ఉన్నవని ఆరోపించుకొని నేను నీతో పలికానో అవి నా ప్రకృతికి అపరిచితాలని నీ ముందు ప్రమాణం చేసి చెపుతున్నాను. నేను ఇంకా స్త్రీజాతిప్రణయమంటే ఏమిటో ఎరగనివాణ్ణి. అసత్యవచనదోషం అంటనివాణ్ణి. సంపదలకు, అవి నావే అయిన సందర్భాల్లో కూడా లౌభ్యాన్ని 428 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ప్రదర్శింపనివాణ్ణి. ఎన్నడూ ఇతరులుంచిన విశ్వాసానికి విచ్ఛిత్తిని కల్పించనివాణ్ణి. దుష్టుడినైనా బయటపెట్టి వాడిని తోటిదుష్టుడికి ఒప్పచెప్పనివాడిని. స్వప్రాణవిషయంలో ఎంతటి ఆసక్తి వహిస్తానో, సత్యవిషయంలో కూడా అంతకు అణుమాత్రమైన తరుగని ఆస్థను వహించినవాణ్ణి. ఈ రీతి నాకు వ్యతిరేకంగా దోషారోపణం చేసుకోటమే తొలిసారిగా నేనాడిన అసత్యం. నా సత్యమైన ప్రకృతిని నేనిప్పుడు నీకు ఎరుకపరిచాను. నా సమస్తసేవలనూ నీకూ, నా అభాగ్యమాతృభూమికీ అర్పణ చేస్తున్నాను. నీవు ఇక్కడికి వచ్చిన కొద్దికాలానికి ముందే వృద్ధుడైన సివర్డు ఈ ప్రయోజనం కోసమే మార్చుకొన్న యోధాగ్రగణ్యులున్న పదివేలమంది సైన్యంతో స్కాట్లండుకు బయలుదేరటానికి సంసిద్ధుడైనాడు. ఇప్పుడు నీవు కూడా వచ్చావు కనుక మనమంతా కలిసి దండెత్తిపోదాము. ధర్మోపేతమైన కారణంలాగానే మనకు విజయావకాశం తథ్యమగుగాక! సరేనా? నీవు మూకత వహిస్తున్నావేమిటి? మాక్డఫ్ : ప్రియాలు, అప్రియాలు అయిన అంశాలు ఏకకాలంలో ఇలా వచ్చిపడ్డప్పుడు ఎలా సమన్వయించుకోవాలో నాకు తెలియటం లేదు. ఒక వైద్యుడు ప్రవేశిస్తాడు. మాల్కొం : సరే. ఈ విషయాలను గురించి తరువాత విపులంగా మాట్లాడుదాము. అయ్యా! రాజుగారు ఇప్పుడు బయటికి విచ్చేస్తున్నారేమో అడగవచ్చునా? వైద్యుడు : అవునయ్యా! వస్తారు. వారివల్ల వ్యాధినివారణ చేసుకోటంకోసం ఓ పెద్ద నిర్భాగ్యపుగుంపు వేచివుంది. ఈ జనాలవ్యాధి వైద్యవిద్యను తారుమారు చేస్తున్నది. అయితే పరమేశ్వరుడు ఆయన హస్తానికి అటువంటి పవిత్రతను ప్రసాదించాడు. ఆయన కరస్పర్శవల్ల ఆ వ్యాధి అమాంతంగా కట్టుబడిపోతున్నది. మాల్కొం : వైద్యమహాశయా! మీకు నమస్కారాలు! (వైద్యుడు నిష్క్రమిస్తాడు) మాక్డఫ్: ఇతడు చెప్పే వ్యాధేమిటి? 70 మాల్కొం : 'గండమాల'! ఈ దేశపురాజు విషయంలో ఇది ఒక అద్భుత చర్య. ఈ ఇంగ్లండులో ఉంటున్నప్పటినుంచీ ఈ వ్యాధిని ఆయన నివారించటం నేను చూస్తున్నాను. మరి ప్రార్థనలతో పరమేశ్వరుణ్ణి కదలించి ఎలా వశం చేసుకొంటాడో అది ఆయనకే తెలియాలి. శస్త్రవైద్యవిద్యకు నిరాశను కల్పిస్తూ, చూసేవారి హృదయాల్లో 429 దైన్యాన్ని ఎక్కొల్పుతూ, వాచి కురుపులు తేలిన వింతవ్యాధితో బాధపడే జనాలను ఆయన నయం చేసి పంపటం మాత్రం నిజం. తగిన ప్రార్థనలు చేసి ఒక బంగారు నాణాన్ని వారి మెళ్ళోకట్టి ఆయన ఆ వ్యాధిని నివారిస్తాడు. రాజవంశంలోని ఆయన వారసులకు ఈ వ్యాధి నివారణోపాయాన్ని ఆయన శాసనపూర్వకంగా బహూకరింపదలచినట్లు చెప్పుకొంటున్నారు. అద్భుతమైన నివారణసామర్థ్యంతో పాటు భవిష్యత్తును చెప్పగల దివ్యశక్తి కూడా ఆయనకుంది. అంతే కాదు. పరమేశ్వరకరుణాసంపత్తి కలవాడని వెల్లడించే ఇతర మహత్తరశక్తులింకా ఆయనకెన్నో ఉన్నాయి. మాక్డఫ్ : అటు చూడండి. ఆ వచ్చేదెవరు? మాల్కొం : నా దేశీయుడే అయినా ఎవరో నాకింకా తెలియటం లేదు. రాస్ ప్రవేశిస్తాడు. మాక్డఫ్: ప్రియసోదరా! నీకిదే స్వాగతం! మాల్కొం : ఇప్పుడు నేనితణ్ణి గుర్తుపట్టగలిగాను. మన దేశీయులను ఒకరినొకరి కపరిచితులనుగా చేస్తున్న కారణాలను తొలగించమని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాక్డఫ్ : స్కాట్లండులో పరిస్థితులు వెనక ఉన్నట్టే ఉన్నాయా? రాస్ : అయ్యో! అభాగ్యమైన మన దేశం తన్ను గురించి తెలుసుకోటానికి తానే భయపడుతున్నది. అది మన మాతృభూమి కాదు మన సమాధిభూమి. వ్యవహారాలు ఎలా సాగిపోతున్నాయో ఎరుగనివాళ్ళు తప్ప ఏ ఒక్కరూ ఒక్కమారైనా చిరునవ్వుతో కనిపించని అవనిగా అది మారిపోయింది. నిట్టూర్పులతో, కేకలతో, మూల్గులతో ఆకాశం నిరంతరం నిండిపోతుండటం సర్వసామాన్యమైపోవటంవల్ల, వాటిని ఎవరూ గమనించని స్థితి దానికి పట్టింది. అంతే కాదు. దారుణదుఃఖం, ఒక సాధారణభావంగా అక్కడ తలపబడుతున్నది. వినిపించే మరణఘంటికలు ఏ మనిషిని గూర్చి అన్న ప్రశ్న ఉదయించటం మానివేసింది. ఆరోగ్యవంతుల జీవితాలు వారి కుళాయిలలోని కుసుమాలు వాడకముందే రాలిపోతున్నవి. లేదా అవి రుజాగ్రస్తాలు కాకముందే రూపుమాసిపోతున్నవి. మాక్డఫ్ : నీవు చేసిన ఈ వర్ణన విపులంగాను, సత్యయుతంగాను ఉంది. మాల్కొం : నీవు తెలుసుకొన్న తుదిఘాతుకచర్య ఏమైనా వినిపించగలవా? 430 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 రాస్ : ఒక గంటకు ముందు జరిగింది ప్రాతబడటం వల్ల కథకుడి చేత 'హుస్' అనిపిస్తుంటే తుదిగా ఇది జరిగిందని చెప్పటం ఎంతో కష్టం. ప్రతిక్షణం క్రొత్తదంటూ ఏదో ఒకటి జరుగుతూనే వుంది. మాక్డఫ్ : నా భార్య ఎలా ఉంది? రాస్ : ఏం? క్షేమంగానే ఉన్నారు. మాక్డఫ్ నా బిడ్డలో? రాస్ : ఏం? వారు కూడా క్షేమంగానే ఉన్నారు. మాక్డఫ్ : మరి ఆ క్రూరనిరంకుశుడు వారి ప్రశాంతికి భంగం కలిగించలేదా? రాస్ : లేదు. నేను వారిని విడిచిపుచ్చి వచ్చినప్పుడు వారు ప్రశాంతంగానే ఉన్నారు. మాక్డఫ్ : లౌభ్యంతో నీ సంభాషణను కప్పిపుచ్చవద్దు. వారెలా ఉన్నారో చెప్పు. రాస్ : నా హృదయంలో మహాభారంగా భరించి తెచ్చిన వార్తను మీకు వినిపించటానికని బయలుదేరేటప్పుడు, ఆ క్రూరనిరంకుశుడి మీద కొందరు విప్లవం చేసి రణభూమిలో నిలిచినట్లు వదంతి చెలరేగింది. ఆ నిరంకుశుని సైన్యం యుద్ధభూమికి బయలుదేరటం స్వయంగా చూసివచ్చాను. గనుక అది సత్యమని స్థిరపడింది. ఇది మీరు మాకు సాయపడదగిన సమయం. మీరు స్కాట్లండులో ఉంటే చాలు. సైనికులను అదే సృష్టిస్తుంది. తీవ్రతరదుఃఖాలలో నుంచి బయటపడటానికి స్త్రీల చేత యుద్ధం చేయిస్తుంది. మాల్కొం : నేను అక్కడికి వస్తున్నాను కనుక ఈ వార్తతో వాళ్ళకు సంతోషం కలుగుగాక! మహోదారుడైన ఇంగ్లండు రాజు మాకు ఉత్తముడైన సీవర్డు ప్రభువును, పదివేల సైనికులను సాయమిచ్చాడు. ఆ సివర్డు ప్రభువుకంటే వృద్ధవీరుడు, ఉత్తమయోధుడు అయినవాణ్ణి సమస్త క్రైస్తవప్రపంచం మరొకణ్ణి ప్రసాదించలేదు. రాస్ : వినటంవల్ల మహానందాన్ని కల్పించిన ఈ వార్త వంటి వార్తను నేను వినిపించగలిగి వుంటే ఎంత బాగుంటేది! కానీ నేను ఎవ్వరి చెవులకు సోకరాక, మరుభూమిలో మాత్రమే ఆక్రోశించి వినిపించదగ్గ వార్త తెచ్చాను. మాక్డఫ్ ఆ దారుణదుఃఖవార్త దేనికి సంబంధించినది? ప్రజానీకానికంతటికీ సంబంధించిందేనా? లేక ఒక హృదయానికి మాత్రమే సంబంధించిందా? 431 రాస్ : అయినా ఉదారహృదయమేదీ ఈ దుఃఖంలో కొంత పాలు పంచుకోకుండా ఉండలేదు. అయితే ఇందులో ప్రధానాంశమంతా మీకు సంబంధించిందే. మాక్డర్ : అది నాకు సంబంధించిందే అయితే చెప్పటంలో అలసించకు. వేగంగా తెలియజెయ్యి! రాస్ : మీరు పూర్వమెన్నడూ విననంతటి కఠోరవాక్యాలను వినిపిస్తున్నాను కనుక మీ శ్రవస్సులు నా నాల్కను నిరంతరం నిందించకుండుగాక! మాక్డఫ్: అయ్యో! ఈ వార్త ఏమై ఉంటుందో నేను ఊహించలేకుండా ఉన్నాను. రాస్ : మీ దుర్గంమీద హఠాత్తుగా దాడి జరిగింది. మీ భార్యాపుత్రులను ఆటవికంగా హత్య చేశారు. అది ఎలా జరిగిందో నేను వివరిస్తే, మీకు మరణాన్ని కల్పించి మిమ్మల్ని కూడా హతమార్చి ఆ జింకలగుంపులో చేర్చటం జరుగుతుంది. మాల్కొం : దయానిధీ, పరమేశ్వరా! ఏమిటి? నీవు వీరపురుషుడవు. కార్చే కన్నీళ్ళను కనిపించకుండా చేయడానికని అలా టోపీని కనుబొమలమీదికి లాగకు. నీ దుఃఖాన్ని మాటల మూలంగా వ్యక్తంకానీ. లేకపోతే పలుకని దుఃఖం నిర్భరమైన గుండెతో గుసగుసలాడి బ్రద్దలైపొమ్మని ఆజ్ఞాపిస్తుంది. మాక్డఫ్ : ఏమిటి! నా పుత్రులను కూడా హత్య చేశారా? రాస్ : మీ భార్యను, పుత్రులను, సేవకులను - ఇంకా ఇంట్లో కనిపించిన వారినందరినీ హత్య చేశారు. మాక్డఫ్ : ఇదంతా జరిగేటప్పుడు అయ్యో! నేను దూరంగా ఉండిపోవలసి వచ్చిందే! నా భార్యను గూడా హత్య చేశారా? రాస్ : ఈ విషయం ఇదివరకే తెలియజేశాను. మాల్కొం : సౌఖ్యాన్ని తెచ్చిపెట్టుకొనే ముందుగా మనం ఈ దారుణదుఃఖానికి తగ్గ ప్రతీకారాన్ని చేద్దాము. మాక్డఫ్ : ఆయనకు బిడ్డలు లేరు. నా ముద్దుల బిడ్డలనందరినీ హత్య చేశారా? అందరినీ హత్యచేసినట్లు నీవు చెప్పావా? అయ్యో! వాడెంతటి నారకశ్యేనం! అందరినీనా? ఏమిటి? వాడు ఒక్కమాటే నా ముద్దుల కుక్కుట శాబకాలమీద, వారితల్లి మీద పడ్డాడా? 432 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మాల్కొం : నీ దుఃఖాన్ని పురుషుడిలా ఎదుర్కో! మాక్డఫ్ : అలాగే చేస్తాను. అయితే ముందు దాన్ని పురుషుడిలా అనుభవించాలిగదా! క్షణకాలానికి పూర్వం వరకూ నాకు అమూల్యమైన అట్టి భార్యాపుత్రులున్నారన్న మాట మరిచిపోలేను. భగవంతుడిదంతా చూచాడా? వారి పక్షం వహించి అడ్డుపడలేదా? పాపీ! మాక్డఫ్! నీ కోసమే వాళ్ళను హత్య చేయటం జరిగింది. అయ్యో! నేనెంతటి వ్యర్థుణ్ణి! వారి లోపాలవల్ల కాదు, వాళ్ళు నా లోపాలవల్ల దారుణహత్యావ్యవసాయానికి గురైనారు. పరమేశ్వరుడు వారికి శాంతిని చేకూర్చుగాక! మాల్కొం: ఈ చర్యను నీ ఖడ్గానికి శాణోపలంగా చేసుకో! నీ దుఃఖాన్నంతటినీ క్రోధంగా పరివర్తన పొందనీ! శోకంతో హృదయాన్ని బండబారిపోనీయకు. కోపాగ్నితో దాన్ని రగుల్కొల్పు! మాక్డఫ్: అయ్యో! స్త్రీలా నయనాలతో విలపిస్తూ నేను నాలుకలో గర్జింపగలిగి ఉన్నట్లయితే. కానీ, కరుణాన్వితుడవైన పరమేశ్వరా! నా కాంక్షకూ, కార్యనిర్వహణకూ మధ్య కాలవిలంబాన్ని కత్తిరించివెయ్యి. స్కాట్లండు దేశానికి పిశాచమై పట్టుకొన్న ఆ నీచుణ్ణి ముఖాముఖిగా నిలిచేటట్లు నా దగ్గిరికి చేర్చు. అతణ్ణి నా ఖడ్గపరిధిలో కట్టిపడవెయ్యి! తప్పించుకొన్నాడా, అతణ్ణి నేను క్షమిస్తాను భగవంతుడు కూడా క్షమించవచ్చు. మాల్కొం : ఓహో! ఈ ధోరణి ఎంత పురుషోచితంగా ఉంది. రండి. మనం రాజుదగ్గిరికి వెళ్లుదాము. మన సైన్యం సిద్ధంగా ఉంది. ఇక మనకు ఆయన సెలవు తీసుకోటమే మిగిలింది. మేక్బెత్ పతనం కావటానికి పండబారాడు. దివ్యశక్తులు తమ సాధనాలైన మనను ఉద్బోధిస్తున్నాయి. చేతనైనంతగా ఊరటను చేకూర్చుకో! ఎంతటి దీర్ఘనిశీథమైనా తుదకు ఉదయకాంతికి దారిచ్చి తీరుతుందని మరిచిపోకు!! (నిష్క్రమిస్తారు) 433 పంచమాంకం ఒకటో దృశ్యం" 72 డన్స్నేన్ రాజసౌధంలో ఒక కక్ష్య. ఒక వైద్యుడు, ఒక దాసి ప్రవేశిస్తారు. వైద్యుడు : నీతోబాటుగా రెండు రాత్రులు పరిశీలించాను. కానీ నీవు నివేదించింది సత్యమని నిరూపణ కాలేదు. ఆమె కడసారిగా నిద్రలో ఎప్పుడు నడిచింది? దాసి : మహారాజులు యుద్ధభూమికి వెళ్ళింది మొదలుగా ఆమె శయ్యమీది నుంచి లేచి, రాత్రి దుస్తులు ధరించి, అల్మారా తెరిచి అందులో నుంచి ఒక కాగితాన్ని తీసి, మడిచి, ఏదో వ్రాసి, చదువుకొని, దానిమీద శిఖావేసి, తిరిగి శయ్యమీదికి చేరుకోటం నేను చూశాను. ఆమె ఇదంతా గాఢనిద్రలోనే చేసేది. వైద్యుడు : ఒక వంక నిద్రవల్ల కలిగే ప్రయోజనాలను పొందుతూ, మరొకవంక మేల్కొనేటప్పుడు చేసే పనులనన్నిటినీ చేయటం - అంటే శరీరవిధానంలోనే ఏదో గొప్ప వైపరీత్యం కలిగిందన్నమాట! నిద్రావస్థలో నడవటం, ఇతరకృత్యాలను నిర్వహించటం కాక ఏమిటి? ఎప్పుడైనా ఆమె ఏమన్నా అనటం విన్నావా? దాసి : విన్నాను. కానీ ఆమె అన్నది ఇది అని చెప్పటానికి సాహసించలేనిది కొంత విన్నాను. వైద్యుడు : నీవు నాతో చెప్పవచ్చు. నాతో చెప్పటం చాలా సముచితం కూడాను. దాసి : చెపితే సమర్థించుకోటానికి తగ్గ సాక్ష్యం లేకపోవటంవల్ల నేను మీకు గాని, ఇతరులకు గాని దాన్ని చెప్పరాదు. అటు చూడండి! ఆమె ఇక్కడికే వస్తున్నది. ఆమె ఎప్పుడూ అనుసరించే రీతి ఇదే. నా జీవితం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను ఇప్పుడు ఆమె గాఢనిద్రలో ఉంది. ఆమెను గమనించండి. దాగి వుండి గమనించండి. వైద్యుడు : ఆమె కా దీపం ఎలా దొరికింది? దాసి : అది ఆమె శయ్యప్రక్కన ఉన్నదే. ఆమె దగ్గర ఎప్పుడూ దీపం ఉంటుంది. అది ఆమె ఆజ్ఞ. 434 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 వైద్యుడు: చూడు, ఆమె కన్నులు తెరిచే వుంది. దాసి : అయితే వాటికి చూచే శక్తి లేదు. వైద్యుడు : ఆమె ఇప్పుడు చేసేదేమిటి? చూడు. ఆమె తన చేతులను ఎలా రుద్దుతున్నదో. దాసి : అలా చేతులు కడుక్కొంటున్నట్లు కనిపించటం ఆమెకు అలవాటైన పని. ఇలాగే ఆమె గంటనుంచీ చేస్తుండటం నేను చూస్తూనేవున్నాను. మేక్బెత్ ప్రభ్వి : ఇదిగో మచ్చ! వైద్యుడు : విను. ఆమె ఏదో మాట్లాడుతున్నది. నా జ్ఞాపకశక్తి సరైందో కాదో, తరువాత సరిచూసుకోటానికి ఆమె నోటినుంచి వచ్చేదంతా వ్రాస్తాను. మేక్బెత్ ప్రభ్వి : ఓ చెడ్డమచ్చా!" పో! నేను శాసిస్తున్నాను పో! చెరిగిపో! ఒకటి, రెండు. అయితే ఆ పనిని తీర్చటానికి సమయమైంది. నరకం! అంధకారమయం!! సిగ్గు, నా ప్రభూ, సిగ్గు!! మీరు యోధులే అయినా భయపడుతున్నారు. ఎవరెవరికి తెలిస్తేమటుకు భయమెందుకు? పాలకులమైన మనను పలకరింపగలిగేవారెవరు? అతనివంటి ముదుసలి శరీరంలో అంత రక్తం ఉంటుందని ఎవరు భావించగలరు? వైద్యుడు : నీవు అది గమనిస్తున్నావా? 74 మేక్బెత్ ప్రభ్వి : ఫైఖేనుకు " ఒక భార్య ఉండేది. ఆమె ఇప్పుడెక్కడుంది? ఏమిటి? ఈ చేతులెప్పటికీ పరిశుభ్రపడవా? ఇవి పనికిరావు. నా ప్రభూ! ఇవి ఇక పనికిరావు. ఈ మీ ఉన్మాదచేష్టలతో మీరు అంతా చెడగొడుతున్నారు. వైద్యుడు : వెళ్ళిపో, వెళ్ళిపో. నీవు తెలుసుకోకూడని సంగతులు తెలుసుకొన్నావు. దాసి: ఆమె మాట్లాడకూడంది మాట్లాడింది. ఇది నిజం. ఆమెకు తెలిసిన విషయమేమిటో భగవంతుడికే తెలుసు. మేక్బెత్ ప్రభ్వి : ఆ రక్తపువాసన ఇంకా ఇక్కడ ఉంది. అరేబియాలో ఉన్న ఎన్ని పరిమళాలైనా ఈ నా చిన్ని హస్తానికి తీయందనాన్ని ఇప్పించలేవు. అయ్యో! అయ్యో!! అయ్యో!!! వైద్యుడు: అబ్బా! ఎంత పెద్ద నిట్టూర్పు! ఆమె హృదయం ఏదో మహాభారాన్ని వహిస్తున్నది. 435 దాసి : ఆమె రాజీత్వాన్ని ప్రతిగా ఇచ్చినా వక్షభాగంలో అటువంటి హృదయాన్ని కలిగి వుండడానికి నేను ఒప్పుకోను. వైద్యుడు : సరి. సరి - దాసి : మహాశయా! పరమేశ్వరుడు సమస్తాన్నీ శుభంగా పరివర్తన పొందించుగాక! నా వైద్యుడు : ఈ వ్యాధి నా వైద్యవిద్యానైపుణ్యాన్ని" మించిపోయింది. ఇలా నిద్రావస్థలో నడచినా, పవిత్రమైన జీవితాన్ని గడిపి ప్రశాంతితో తమ శయ్యల మీదనే చరమస్థితిని పొందినవాళ్ళను నేనెందరినో ఎరుగుదును. మేక్బెత్ ప్రభ్వి: చేతులు కడుక్కోండి, రాత్రి దుస్తులను ధరించండి. అంతగా పాలిపోయి కనిపించకండి. అయినా మరోమారు చెబుతున్నాను. బాంకోను సమాధి చేశారు. సమాధి నుంచి అతడు లేచి రాలేడు. వైద్యుడు : వ్యవహారాలు ఇంత చెడ్డగా నడిచాయా? మేక్బెత్ ప్రభ్వి : శయ్యను చేరుకొందాం ఎవరో ద్వారసీమ దగ్గిర తలుపు తడుతున్నారు. జరిగించినదానికి తిరుగు జరగనిస్థితిని కల్పించాము. వైద్యుడు : ఆమె ఇప్పుడు తిరిగి శయ్య దగ్గిరికి వెళ్ళుతుందా? దాసి: సూటిగా వెళ్ళిపోతుంది. వైద్యుడు : నీచమైన వదంతులు వినిపిస్తున్నాయి. అసహజమైన చర్యలవల్ల వ్యాధులు జనిస్తాయి. దోషచిత్తులు తమ రహస్యాలను వినలేని తమ తలగడలకు వినిపిస్తుంటారు. ఈమెకు వైద్యులకంటే మతవిద్వాంసులవల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఓ పరమేశ్వరా! మమ్ముల నందరినీ క్షమించు. ఆమె విషయంలో శ్రద్ధ తీసుకో! శరీరానికి గాయాలను కల్పించుకోగల సాధనాలన్నింటినీ ఈమెకు అందుబాటులో లేకుండా చెయ్యి! అయినా ఈమెనెంతో భద్రంగా కనిపెట్టి ఉండు. సరి, మరి సునక్తం. ఈమె నా మనస్సును తారుమారుచేసింది. దృష్టిని ఆశ్చర్యమగ్నం గావించింది. ఎంతో ఆలోచనను ప్రేరేపించింది గాని మనస్సులో తోచినదాన్ని పలకటానికి సాహసించలేక పోతున్నాను. దాసి : వైద్యమహాశయా! సునక్తం!! 436 (నిష్క్రమిస్తారు) వావిలాల సోమయాజులు సాహిత్యం-3 రెండో దృశ్యం డన్స్నేన్ సమీపంలో గ్రామసీమ, దుందుభిధ్వనులతో జెండాలతో, మెంటియర్, కెయిథీనెస్, ఆంగస్, లెన్నాక్స్, ఇతర సైనికులు ప్రవేశిస్తారు. 76 మెంటియథ్: మాల్కొం, ఆయన పినతండ్రి సివర్డు, ప్రవీణుడైన మాక్డర్ ల నాయకత్వాన వస్తున్న ఇంగ్లీషు సైన్యం చేరువకు వచ్చింది. ప్రతీకారేచ్ఛ వారిని ప్రజ్వలింపజేస్తున్నది. సమస్తోద్రేకాలూ చచ్చిపోయిన సన్యాసులను గూడా జ్వలింపజేసి, రక్తపాతయుతమైన దారుణరణరంగానికి ఆహ్వానించే వ్యక్తిగతాలైన ప్రబల కారణాలున్న వాళ్ళు వాళ్ళు. ఆంగస్ : మనం వారిని బిర్నాం అరణ్యందగ్గర కలుసుకొందాం. వారూ ఆ మార్గాన్నే వస్తున్నారు. కెయిథీనెస్: సోదరునివెంట డొనాల్బెయిన్ కూడా వస్తుండవచ్చు. లెన్నాక్స్ : అతడు రావటం లేదు. ఇది నిశ్చయం. ఆంగ్లేయ సైన్యాలవెంట వస్తున్న ప్రభువర్గం వారిపట్టిక నా దగ్గిర ఉంది. ఆ సైన్యం వెంట స్టీవర్డు కుమారుడున్నాడు. ఇంకా పురుషత్వ విషయంలో ప్రాథమికావస్థను ప్రదర్శిస్తూ, శ్మశ్రువైనా మొలకెత్తని యువకులెందరో ఉన్నారు. మెంటియథ్ : మన క్రూరనిరంశకుడు మేక్బెత్ ఏం చేస్తున్నాడు? కెయిథీనెస్ : డన్స్నేన్ మహాదుర్గాన్ని పటిష్ఠం చేయిస్తున్నాడు. కొందరతడు ఉన్మాదియైపోయినాడంటున్నారు. అతణ్ణి అంతగా అసహ్యించుకోని కొందరు అది ఉన్మాదం కాదు, వీరోన్మాదమంటున్నారు. అయితే వ్యవస్థ తప్పిన తన పక్షాన్ని ఇక అతడు క్రమశిక్షణ సూత్రంతో బంధించలేడన్న అంశం మాత్రం నిజం. ఆంగస్ : చేసిన రహస్యహత్యలు తనకు చేతి సంకెళ్ళయి కట్టిపడేస్తున్నట్లు అతడిప్పుడు భావిస్తున్నాడు. నమ్మిన స్వామియెడ అతడు చేసిన ద్రోహాన్ని నిందించడంకోసం ప్రతిక్షణం విప్లవాలు చెలరేగుతున్నవి. అతని అనుచరులైనా నిర్భరభయభావం వల్లనేగాని, ప్రేమతో అతణ్ణి అనుసరించటం లేదు. అతడి రాచరికం కూడా మరుగుజ్జు దొంగ ఒంటిమీది ఉన్నత శరీరుని దుస్తుల్లాగా బరువుగా వ్రేలాడుతున్నట్లు అతనికి తోస్తున్నది. అతడిలో ఉన్న సమస్తం అతణ్ణి పొంది ఉండవలసివచ్చినందుకు తన్ను 437 తానే నిందించుకొంటున్న స్థితిలో, నిరంతరం భారక్లేశాన్ని వహిస్తున్న అతని ఇంద్రియాలు వ్యతిరేకించి ఒక ఉన్మాదిని చేస్తే, అతణ్ణి ఎవరు నిందించగలరు? కెయిథీనెస్: సరే. మనం న్యాయసమ్మతుడైన రాజును చేరుకొని మన భక్తిభావాన్ని ప్రకటించటం కోసం బయలుదేరుదాము. వ్యాధిగ్రస్తమైన రాజ్యానికి వైద్యుడైన ఆయన్ను మనం కలుసుకొందాం. మన జన్మభూమిని పవిత్రం చెయ్యటం కోసం ఆయనతో కలిసి మనలోని ప్రతిరక్తబిందువు నొలికిద్దాము. లెన్నాక్స్: మన రాజపుష్పాన్ని తుషారబిందుసంయుతం చెయ్యటానికి ఎన్ని రక్తబిందువులు అవసరమో అన్నిటినీ ఒలికిద్దాము. ఇక మనం బిర్నాం వైపునకు పయనమారంభిద్దాం. (సైనికవిన్యాసంతో నిష్క్రమిస్తారు) మూడో దృశ్యం డన్స్నేన్ రాజసౌధంలో ఒక కక్ష్య. వైద్యుడు, పరిచారకులు ప్రవేశిస్తారు మేక్బెత్ : ఇటువంటి వార్తలేవీ ఇక నా దగ్గిరికి తీసుకోరావద్దు. వాళ్ళందరినీ పారిపోనీ బిర్నాం మహారణ్యం కదలి డన్స్నేన్ దుర్గం వరకూ నడిచివచ్చేదాకా భయభావంతో నేను కళంకితుణ్ణి కాలేను. బాలుడైన మాల్కొంకు నేనెందుకు భయపడాలి? అతడేం స్త్రీకి జన్మించనివాడా? మానవులకు సంభవింపనున్న సమస్తాన్నీ ఎరిగిన దివ్యశక్తులు నాతో "భయపడకు మేక్బెత్! స్త్రీ గర్భాన జన్మించిన ఏ వ్యక్తీ నీ మీద విజయాన్ని సాధించలేడు!" అని వెల్లడి చేశాయి. అందువల్ల సత్యసంధులు కాని, థేనులారా! మీరందరూ పారిపొండి. శత్రుపక్షాన చేరిపొండి. భోగలాలసులైన ఆ ఆంగ్లేయ ఎపిక్యూరియనులతో" కలిసిపొండి. నన్ను నడిపించే నా మనస్సు, నేను వహించే నా హృదయం మాత్రం నావైతే చాలు. అవి అనుమానాలతో క్రుంగేవి కావు భయభావం వల్ల బెదిరేవి అంతకంటే కావు! ఒక సేవకుడు ప్రవేశిస్తాడు. పాలిపోయిన మొగంతో పరుగెత్తుకోవచ్చిన బుద్దిహీనుడా! ఏ భూతమో నిన్ను నల్లబడవేయుగాక! అలా పాలిపోయి పిరికివడ్డ ముఖాన్ని ఎక్కడ సంపాదించావురా? సేవకుడు : అక్కడ పదివేలు = 438 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మేక్బెత్ : ఓరి తులువా! పదివేల బాతులున్నాయటరా! సేవకుడు : లేదు, మహారాజా, పదివేల సైనికులున్నారు. మేక్బెత్ : ఓరి పిరికిపందా! వెళ్ళి నీ ముఖాన్ని చీరుకొని నీ భయాన్ని మరింత ఎర్రవారజేసుకో. సైనికులెవరురా మూర్ఖుడా? ఆత్మ చచ్చిన అధమస్థుడా! తెల్లగా రవసెల్లా వంటి నీ చెక్కిళ్ళు చూసేవారికి భయాన్ని అంటిస్తున్నవిరా! ఓరి పాలిన మొఖం! వారు ఎవరి సైనికులురా? సేవకుడు : ఆంగ్లేయసైన్యం ప్రభూ! మేక్బెత్ : ఛీ! నీ ముఖం చూపించకు. వెళ్ళిపో. (సేవకుడు నిష్క్రమిస్తాడు) సైటన్! ఇలా పారిపోవటం చూస్తుంటే నా గుండె దిగజారిపోతున్నది. సైటన్! వినపడలేదా? ఈ ఎత్తిరావటం నాకు నిరంతరానందాన్నయినా కల్పిస్తుంది లేదా ఇప్పుడే పడద్రోయనైనా పడద్రోస్తుంది. బహుకాలం జీవించను, నా బ్రతుకు పండబారింది. ఆకులపాటుతో దానికి గ్రీష్మకాలం చేకూరింది. వృద్ధుడనైనప్పటికీ ముదిమివేళ మాంద్యాన్ని చేకూర్చే గౌరవం, ప్రేమ, భక్తసమూహం, మిత్రబృందం మొదలైనవాటిని వాంఛించే అవకాశం నాకు లేదు. వాటిస్థానంలో నాకు లభ్యమౌతున్నవి - గట్టిగా వినపడకపోయినా గాటమైన తిట్లు, పెదవులు దాటని భక్తి, బహిరంగంగా సాహసించలేకపోయినప్పటికీ హృదయాంతరాలలో మానివేయటమంటే మహానందాన్ని పొందే ఓటి పొగడ్తలు -సైటన్! సైటన్ : మహాప్రభూ! ఏమాజ్ఞ? సైటన్ ప్రవేశిస్తాడు. మేక్బెత్ : నా కోసం ఏమైనా క్రొత్తవార్త తెచ్చావా? సైటన్ : ఈ క్రొత్తవి పూర్వవార్తలను స్థిరపరుస్తున్నవి మాత్రమే. మేక్బెత్ : నా అస్థిమాంసాలను చిందరవందర చేసేదాకా పోరాడతాను. నా కవచాన్ని తెచ్చిపెట్టు. సైటన్ : మహారాజా! అటువంటి స్థితి ఇంకా రాలేదు. మేక్బెత్ : అయితే నేం. కవచధారణ చేస్తాను. అధికసంఖ్యలో అశ్వికులను పంపించాను. దేశమంతా తిరిగి పరిశుద్ధం చెయ్యమని వారితో చెప్పు. భయాన్ని గురించి మాటాడే 439 ప్రతివాడినీ పట్టి ఉరితీయించు. ఇక ఆలసించక నా కవచాన్ని తెచ్చిపెట్టు. వైద్యమహాశయా! మీ రోగి ఎలా ఉంది? వైద్యుడు : ఏవో మనోభావాలు వెంటవెంటనే వచ్చి ఆమెను బాధపెడుతున్నాయి. కాని మహారాజా! శారీరకంగా ఆమెకేమంత జబ్బు లేదు. మేక్బెత్ : అయితే మీరు ఆమెకు ఆ వ్యాధినే నయం చెయ్యండి! మీరు జబ్బుపడ్డ మనసులకు మందీయలేరా? గాఢంగా నాటుకొన్న దుఃఖాన్ని ఆమె జ్ఞాపకవీథి నుంచి విడబెరికి వెయ్యలేరా? గంభీరంగా నాటుకొన్న దుష్టబాధలను తుడిచివేయలేరా? భారవంతం చేస్తూ ప్రమాదకారియై ఆమె హృదయాన్ని అంటిపెట్టుకొన్న ఆ కశ్మలాన్నంతా అతిగాఢనిద్రను కల్పించే ఒక తీయనైన అరుతో కడిగివేయలేరా? వైద్యుడు : ఇది రోగి స్వయంగా చేసుకోవలసిన పని. మేక్బెత్ : అయితే, మీ వైద్యవిద్యనంతటినీ కుర్కురాలపాలేయండి. దానితో నాకేం పని లేదు. సైటన్! రా! శరీరానికి కవచాన్ని సంధించు. నా రాజదండాన్ని తెచ్చిపెట్టు. దేశంలోని మూలమూలలకు పరిశుద్ధి చేయటానికిగాను ఆశ్వికులను పంపించు. వైద్యమహాశయా! నా థేనులందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. రావయ్యా! త్వరపడు! చేతనైతే ఓ వైద్యమహా శయా! నే పాలించే భూమికి పట్టిన వ్యాధి ఏమిటో కనిపెట్టు. తిరిగి దానికి పటిష్టమూ, స్వచ్ఛమూ అయిన ఆరోగ్యాన్ని చేకూర్చగలిగావో, దేశమంతటా మార్మోగేటట్లు ఎంతో ఘనంగా నిన్ను కీర్తిస్తాను. - ఈ కవచాన్ని విప్పివెయ్యి! రేవల చిన్ని, నేలతంగేడుల వంటి ఏ రేచనకారులైన ఓషధులతో ఈ ఆంగ్లేయులను కడిగివేయవచ్చునో చెప్పగలవా? వారిని గురించి విన్నావా? వైద్యుడు : మహాప్రభూ! తాము చేసిన ఘనసన్నాహాలు వారిని గురించి కొంతగా తెలుసుకొనేటట్లు చేశాయి. మేక్బెత్ : ఈ కవచాన్ని నా వెంట తీసుకో రా. బిర్నాం మహారణ్యం డన్స్నేన్ వరకు కదలివచ్చేదాకా నేను మృత్యువును గురించిగాని, వినాశాన్ని గురించి గాని భయపడను! (వైద్యుడు తప్ప అందరూ నిష్క్రమిస్తారు) వైద్యుడు : ఈ డన్స్నేన్ నుంచి ఒకమారు బయటికి వెళ్ళగలిగినా, కట్నమెంతిచ్చినా, అది మళ్ళీ ఇక్కడికి వచ్చే విషయంలో మమ్మల్ని లోభపెట్టలేదు. 440 (నిష్క్రమిస్తాడు) వావిలాల సోమయాజులు సాహిత్యం-3 నాలుగో దృశ్యం డన్స్నస్కు సమీపభూమి. దూరంగా అరణ్యం కనిపిస్తుంటుంది. దుందుభిధ్వనులతో, పతాకాలతో, మాల్కొం, వృద్ధ సివర్డు, యువ సివర్డు, మాక్డఫ్, మెంటియర్, కెయిథినెస్, అంగస్, లెన్నాక్స్, రాస్, సైనికులు సైనిక విన్యాసాలతో ప్రవేశిస్తారు. 78 మాల్కొం : సోదరులారా! భయరహితులమై శయ్యా గృహాలలో శాంతియుతంగా జీవించే దినాలు బాగా దగ్గరకు వచ్చాయనిపిస్తున్నవి. మెంటియథ్ ఈ విషయంలో మాకూ అనుమానమేమీ లేదు. సివర్డు : మన ముందున్న ఆ అరణ్యం పేరేమిటి? మెంటియథ్ : అది బిర్నాం మహారణ్యం. మాల్కొం: మన సైనికులలో ప్రతి ఒక్కరు తలా ఒక కొమ్మను విరిచి ముందు పెట్టుకొని నడవండి. అలా అయితే మన సంఖ్య ఎంతో శత్రువులకు తెలియదు. వారి చారులు తప్పుడు వార్తలతో తిరిగి వెళ్ళుతారు. సైనికుడు : తమ ఆజ్ఞలను అలాగే అనుసరిస్తాను. సివర్డు : ఆ క్రూరవిద్రోహి ఇంకా డన్స్నేన్ దుర్గంలోనే గాఢవిశ్వాసంతో ఉన్నాడనీ, మన ముట్టడికి కూడా సిద్ధపడి ఉన్నాడనీ మాత్రమే తెలుస్తున్నది. మాల్కొం : ఇక అదే అతని ప్రధానమైన ఆశ. అవకాశం చిక్కినప్పుడల్లా ఉత్తములు, క్షుద్రులు అన్న విభేదం లేకుండా అంతా అతన్ని విడిచిపెట్టేశారు. ఇప్పుడా తణ్ణి సేవిస్తున్న వారైనా బలవంతాన ఆ పని చేస్తున్నారేగాని హృదయమిచ్చి కాదు. మాక్డఫ్: మన ఊహలెంతవరకు సత్యాలో కార్యరంగంలో కలిగే ఫలితాలను నిర్ణయించనీయండి. అందాకా మనం అతిశ్రద్ధతోనే సైనికవ్యవహారాలను నడిపిద్దాము. సీవర్డు : 'ఇది మాకు లాభించింది. ఇది మేము నష్టపడ్డాము' అని చెప్పగలిగేటట్లు స్పష్టంగా తెలిసిపోయే సమయం ఆసన్నమైంది. కార్యాచరణకు పూర్వం చేసే ఊహలన్నీ మన అనిశ్చయాలైన ఆశలను మాత్రమే వెల్లడిస్తుంటాయి. కానీ సత్యమైన పరిణామాన్ని సమరతలంలో తగిలే దెబ్బలు తేల్చవలసిందే. ఆ యుద్ధంకోసం ఇక మన సైన్యాదులను తరలిద్దాం. (నిష్క్రమిస్తారు. సైనికవిన్యాసం) 441 ఐదో దృశ్యం డన్స్నేన్ దుర్గంలో దుందుభి ధ్వనులతో, పతాకలతో మేక్బెత్, సైటన్, సైనికులు ప్రవేశిస్తారు. మేక్బెత్ : మన పతాకాలను బహిః ప్రాకారాలమీద ఎగురవేయండి. 'వారు వస్తున్నారు వారు వస్తున్నా రని ఎప్పుడూ ఒకటే కేకలు! రానీయండి! శత్రువుల" ముట్టడిని పరిహసించగల శక్తి మనదుర్గానికుంది. క్షామం, సంజ్వరం కబళించేటంతవరకూ వారిక్కడ పడి ఉండవలసిందే! మనపక్షంలో ఉండవలసినవాళ్ళు వచ్చి వారిలో చేరి బలాన్ని చేకూర్చినట్లయితే, మనం వాళ్ళను ధైర్యంతో ఎదుర్కొని ముఖాముఖిగా పోరాడి, తిరిగి ఇంటికి వెళ్ళేదాకా తరిమికొట్టవచ్చు. (లోపల నుంచి ఒక స్త్రీ దుఃఖధ్వని వినిపిస్తుంది) ఆ ధ్వని ఎక్కడనుంచి? సైటన్ : అది స్త్రీ రోదనధ్వని మహారాజా! మేక్బెత్ : భయాలంటే నాకు రసన చచ్చిపోయింది. ఒకప్పుడు రాత్రివేళలో మూల్గు వినిపిస్తే నా సర్వేంద్రియాలూ చల్లబడిపోయేవి. ఒక విషాదగాథ విన్నపుడు నా కురులు నిక్కబొడుచుకొని నిల్చి చైతన్యవంతాలేమో అని అనిపించేవి. భీకరదృశ్యాలను కన్నులార ఆరగించాను. హత్యాసంబంధమైన భావాలతో నిండిన నా మనస్సుకు భీకరత్వం సుపరిచితమై పోయింది కనుక అది నన్ను కలత పెట్టలేదు. ఆ రోదనధ్వని ఎక్కడినుంచి? సైటన్ తిరిగి ప్రవేశిస్తాడు. సైటన్: మహారాజా! మహారాజ్ఞి మరణించింది. మేక్బెత్: నేడో రేపో ఆమె ఎప్పుడో ఒకప్పుడు మరణించవలసిందే. అట్టి మాట వినవలసిన కాలమంటూ ఒకటి ఉండనే ఉన్నది. జీవితగ్రంథం పరిసమాప్తి అయ్యేదాకా రేపు, రేపు - ఇలా ఒకరోజు తరువాత మరొకరోజు పరంపరగా సాగిపోవలసిందే. గడిచిపోయిన 'నిన్న'లన్నీ అదృష్టహీనులైన మర్త్యులను మృణ్మయమైన మృత్యుమార్గానికి దారి చూపించి పంపించాయి. ఆరిపో! ఓ క్షుద్రదీపమా! ఆరిపో! జీవితమంటే చరించే - 442 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 స్వభావంగల ఒక ఛాయ! జగదంగంమీద గడియో అరగడియో నిక్కుతూ, నురగలు క్రక్కుతూ ఆ కాస్త కాలం గడచిందో, మళ్ళీ మాటైనా వినబడకుండా తిరిగి నిష్క్రమించే ఒక క్షుద్రనటుడు. ఇంతకు మించి మరేమీ లేదు. జీవితమంటే శబ్దాడంబరంతో, క్రోధముద్రతో ఉన్మత్తుడొకడు చెప్పిన అర్థశూన్యమైన ఒక కథ. ఒక వార్తాహరి ప్రవేశిస్తాడు. వార్తాహరి : కరుణాశీలీ! మహాప్రభూ! కళ్ళతో చూచినదాన్ని చెప్పటం నా ధర్మం. కనుక ఒక వార్త తెచ్చాను. కానీ దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. మేక్బెత్: సరే, కానీయవయ్యా! వార్తాహరి : డన్స్నేన్ కొండమీద కాపలా తిరుగుతున్నప్పుడు నేను బిర్నాం మహారణ్యం వంకకు చూచాను. తక్షణమే ఆ మహారణ్యం కదలినట్లు నాకు తోచింది. మేక్బెత్ : నీచుడా! అసత్యవాదీ!! వార్తాహరి : చెప్పినట్లు జరగకపోతే మీరు ఏ శిక్ష చెప్పినా సహిస్తాను. ఔను ప్రభూ! అది జంగమమహారణ్యం. దుర్గం వరకు మూడు మైళ్ళూ అది నడిచి వచ్చింది. మేక్బెత్ : నీవు చెప్పింది అసత్యమైతే, ఆకలితో అలమటించి చచ్చేదాకా ఈ దగ్గర చెట్టుకే వ్రేలాడదీయిస్తాను. సత్యమైతే నీవు నన్ను అలా చేయించినా లెక్కించను. ఇప్పుడు నా విశ్వాసం సడలనారంభించింది. 'బిర్నాం మహారణ్యం డన్స్నేన్ వరకు కదలివచ్చేదాకా భయపడకు' అన్న ఆ మాంత్రికురాండ్ర ద్వంద్వార్థపు మాటలను ఇప్పుడు అనుమానించటం ఆరంభించాను. ఇప్పుడు ఒక అరణ్యం డన్స్నేన్ దాకా వస్తున్నది. శస్త్రాలను ధరించండి! శత్రువును ఎదుర్కోటానికి బయలుదేరండి. వీడు నిశ్చయం చేస్తున్నది కనిపించికపోతే ఇక్కడనుంచి పారిపోవటం గాని లేదా ఇక్కడనే ఉండిపోవట గాని రెండూ జరగవు. జీవితమంటే నాకు విసగట జనించింది. ప్రపంచంలో సుస్థాపితమైన క్రమాన్ని తారుమారు చేయతలపెట్టాను. జాగ్రద్దంటికను మొరయించండి. మహావాయూ! నీ ప్రబలశక్తిని ప్రదర్శించు. తారుమా రా! తరలి రా! కల్లోలమా! కదలి రా!! మరణించవలసివస్తే వీపున కవచంతోనే కదనభూమిలోనే నేను మరణింతునుగాక! (నిష్క్రమిస్తారు) 443 ఆరో దృశ్యం డన్స్నేన్ దుర్గం ముందు. దుందుభిధ్వనులతో పతాకాలతో మాల్కొం, వృద్ధసివర్డు, మాక్డఫ్ ప్రభృతులు కొమ్మలను ముందిడుకొని వారి సైన్యాలతో ప్రవేశిస్తారు. మాల్కొం : తగినంతగా దగ్గరకు వచ్చేశాం. ఇక మీ పత్రయవనికలను క్రిందపారవేసి స్వస్వరూపాలతో కనిపించండి. సుయోగ్యుడా! మీకు మహోదాత్తపుత్రుడైన ఈ సోదరుడి సాయంతో మన ప్రథమ సైనికశ్రేణిని మీరు నడిపిస్తారా? యోగ్యుడైన మాక్డపూ, మేము మన యుద్ధపథకక్రమాన్ని అనుసరించి మిగిలిన కృత్యాన్ని నిర్వహిస్తాము. సివర్డు : మీకు శుభమగుగాక! మేక్బెత్ సైన్యాన్నంతటినీ ఈ రాత్రే మనం బయటికి రప్పించాలి సుమా! పోరాడి దాన్ని నిర్మూలించకపోతే మనం దెబ్బతినటానికి తగ్గవాళ్ళమే నన్నమాట! మాక్డఫ్ : మన దుందుభులనన్నిటినీ పలికించండి! రక్తపాతానికీ, మృత్యువిహారానికీ సందడి చేసే కట్యగాళ్ళయిన వాటిలో ప్రతి ఒక్కదానికీ ప్రాణం పోసి పలికించండి!! (నిష్క్రమిస్తారు) ఏడో దృశ్యం యుద్ధరంగంలో మరొక భాగం. దుందుభిధ్వనులు. మేక్బెత్ ప్రవేశిస్తాడు. 80 మేక్బెత్ : కదలవీలులేకుండా వారు నన్ను ఒక కట్టుకొయ్యకు బంధించి పడేశారు. ఎగిరిపోలేను. పైబడ్డప్పుడు ఎలుగుబంటులా ఎదుర్కోవలసిందే. స్త్రీ గర్భాన జన్మించని అతడెవరో? నేనొక మానవుడికి భయపడుతున్నానంటే అతడు అటువంటివాడైనా అయి ఉండాలి! లేదా మానవుడే కాకుండానైనా ఉండి ఉండాలి! యువ సివర్డు : నీ పేరేమిటి? యువ సివర్డు ప్రవేశిస్తాడు మేక్బెత్ : అది వింటే నీవు భయపడతావు. యువ సివర్డు : లేదు. నరకంలో ఉన్న పేర్లనన్నింటినీ మించిన పేరు నీకున్నా నేను భయపడను. 444 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మేక్బెత్ : అయితే నా పేరు మేక్బెత్. యువ సివర్డు : నరకంలోని పెనుభూతమైనా, సైతానైనా ఇంతకంటే అసహ్యించుకోదగ్గ పేరును వినిపించలేదు. మేక్బెత్ : అంతే కాదు, అంతకంటే నిరంకుశమూ, భీకరమూ అయిన పేరును కూడా వినిపించలేదు. యువ సివర్డు : ఓరీ సహింపరాని దారుణవిద్రోహీ! ఇది అసత్యం. ఈ నా ఖడ్గంతోనే నీవన్నది అసత్యమని నిరూపిస్తాను. (ఇరువురూ పోరాడతారు యువ సివర్డు మరణిస్తాడు) మేక్బెత్ : నీవు స్త్రీగర్భాన జన్మించినవాడివే. స్త్రీకి జన్మించినవాడు చేపట్టినంతవరకూ నేను సర్వఖడ్గాలనూ, సమస్తశస్త్రాలనూ చూసి చిరునవ్వుతో తిరస్కరిస్తాను! (నిష్క్రమిస్తాడు) దుందుభి ధ్వనులు, మాక్డఫ్ ప్రవేశిస్తాడు. మాక్డఫ్ : అదుగో! శబ్దం ఆ వంకనుంచి వినిపిస్తున్నది. నీచనిరంకుశద్రోహీ! బయటపడి ముఖాముఖిగా నిలు! నా శస్త్రఘాతవల్ల కాక ఇతరులవల్ల నీవు చంపబడ్డానో, నా భార్యాపుత్రుల ప్రేతమూర్తులు నిరంతరం నన్ను వెన్నాడుతాయి. శూలాలభారాన్ని మోయటానికని అద్దెకిచ్చిన హస్తాలు గల నీచసైనికులమీద నేనెన్నడూ దెబ్బతీయను. ఓ మేక్బెత్! నీవు నా మీదికి రానన్నా రావాలి. లేదా ఎట్టి హత్యాచరణచేతనైనా బండబారని నా చంద్రాయుధాన్ని నేను ఒరలో నిలుపనైనా నిలుపాలి. నీవు అక్కడనే ఉండు. ఆ వినిపించే మహాయుధ నిర్వాణాలవల్ల అక్కడ ఎవరో ఉన్నత వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒకడున్నట్లు వ్యక్తమౌతున్నది. అదృష్టమా! నాకతడు కన్పించే అవకాశాన్ని కల్పించు. పరమమైన దీనికంటే మరొకటి ప్రసాదించమని నిన్ను ఎన్నడూ ప్రార్థించను (నిష్క్రమిస్తాడు. దుందుభి ధ్వనులు వినిపిస్తాయి) మాల్కొం, వృద్ధ సివర్డు ప్రవేశిస్తారు సివర్డు : మహారాజా! ఇటు విచ్చేయండి. దుర్గమతిసులభంగా లొంగిపోయింది. ఆ నిరంకుశద్రోహి ప్రజలు చీలి ఉభయపక్షాలలో పోరాడుతున్నారు. మన పక్షాన ఉన్న 445 ఉదాత్తులయిన థేనులు సమరభూమిలో సాహసికులై వర్తిస్తున్నారు. దరిదాపుగా ఈ నాడు మీదైనట్లు తానే చెప్పివేస్తున్నది. ఇక తీర్చవలసిన కృత్యం అల్పమాత్రమే! మాల్కొం : మనపక్షాన పోరాడుతున్న శత్రువులను కొందరిని మేము కలుసుకొన్నాం. సివర్డు: ప్రభూ! ఇక దుర్గంలో ప్రవేశించండి. (నిష్క్రమిస్తాడు. దుందుభిధ్వనులు వినిపిస్తవి). ఎనిమిదో దృశ్యం యుద్ధభూమిలో మరొక ప్రాంతం. మేక్బెత్ ప్రవేశిస్తాడు. 81 మేక్బెత్ : రోమకదేశీయుల్లా కత్తిమీది కురికి ఆత్మహత్య చేసుకొని నేనెందుకు విదూషక పాత్రనభినయించాలి? శత్రువులు సజీవులై కన్పించినంతకాలం వారికి గాయాలను కల్పించటమే మంచిది. మాక్డఫ్ ప్రవేశిస్తాడు. మాక్డఫ్ : ఓరీ నారకకుర్కురమా! ఇటు తిరుగు! నా వైపు తిరుగు! మేక్బెత్ : అందరికంటే అధికంగా నిన్ను తప్పించుకొని తిరిగాను. వెనక్కు తగ్గు. నీకు సంబంధించిన విశేషరక్తంతో నా హృదయం ఇప్పటికే నిర్భరమై పోయింది. మాక్డఫ్ : మాటలతో నేను కాలహరణం చెయ్యలేను. ఇక నా కంఠం పలకవలసిన దానిని ఖడ్గమే పలుకుతుంది. నీవు పదాలు వర్ణించలేనంతటి పరమ క్రూరవిద్రోహివి! (ఇరువురూ పోరాడతారు) మేక్బెత్ : ఎందుకు వృథాగా శ్రమపడతావు? వాడి ఐన నీ కత్తితో అభేద్యమైన వాయువుకు ఒక గాటును కల్పించటం ఎంత తేలికో, రక్తాన్ని చిందించటం అంత తేలికనుకో. ఛేదించటానికి వీలున్న శిరాలమీదనే నీ ఖడ్గాన్ని ప్రయోగించు. మంత్రపరిరక్షితమైన మహిమగల జీవితం నాది. అది స్త్రీ గర్భాన జన్మించిన వ్యక్తికి లొంగేది కాదు. మాక్డఫ్ : నీవు చెప్పే మంత్రశక్తిమీద ఆధారపడకు. ఇంతవరకూ నీవు కొలుస్తున్న శక్తి నీతో 'మాక్డవ్ స్త్రీగర్భాన జన్మించినవాడే కాని నెలలు నిండకముందే బయటపడ్డవా'డని నీకు తెలియు జేయుగాక! 446 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మేక్బెత్ : నా పౌరుషత్వంలో ప్రధానాంశాన్ని లోగొన్న నీ జిహ్వకు వినాశం కలుగుగాక! ద్వంద్వార్థాలతో మోసపుచ్చే గారడీమంత్రకత్తెలను ఇక ఎవ్వరూ నమ్మకుందురుగాక! వాళ్ళు మాటలతో చెవులకు సర్వం చేకూర్చేటట్లు మాట ఇస్తారు. ఆశ పెట్టిన వస్తువులను చేకూర్చటంలో భంగపాటును కల్పిస్తారు. నీతో నేను పోరాడదలచలేదు. మాక్డఫ్ : అయితే, ఓరి పిరికిపందా! లొంగిపో! ఈ కాలంలో జన్మించినవారందరికీ నీవు ప్రదర్శించి పరిశీలించదగ్గ వస్తువుగా బతుకు. "ఇదుగో! చూడండి. క్రూరనిరంకుశుడు" అని వస్త్రంమీద వ్రాసి ఒక స్తంభానికి వ్రేలాడగట్టి, లభ్యమైన ఒక అసాధారణవికృతజంతువును ప్రదర్శించినట్లు నిన్ను చూపిస్తాము. మేక్బెత్ : యువకుడైన మాల్కొం పాదప్రదేశాన్ని ముద్దాడటం కోసంగాని, నీచజననిందావాక్యాలకు ఎరగావటానికి గాని నేను లొంగిపోదలచలేదు. బిర్నాం మహారణ్యం డన్స్నేను వచ్చినా, స్త్రీగర్భాన జనింపనివాడివై నీవు నన్ను ఎదుర్కొన్నా, నేను తుదిదాకా నా యుద్ధయత్నాన్ని మానుకోను. ఇదిగో! కదనయోగ్యమైన డాలును శరీరానికి ముందిడుకొంటున్నాను. మాక్డఫ్! ఏదీ, ఎదుర్కో! 'చాలు! ఆప' మని మొదట ఎవరు కేక పెడితే వాడు అధోగతిపాలౌతాడు. (పోరాడుతూ నిష్క్రమిస్తారు. దుందుభిధ్వని వినిపిస్తుంటుంది.) (తిరోగమనం తుత్తారధ్వనులు, దుందుభి మ్రోతలతో, పతాకాలతో మాల్కొం, సివర్డు, రాస్, లెన్నాక్స్, ఆంగస్, కెయిథీనెస్, మెంటియథ్, సైనికులు ప్రవేశిస్తారు.) మాల్కొం : ఇక్కడ మాకు కనిపించని మిత్రులందరూ సజీవులుగా తిరిగివచ్చి మమ్మల్ని చేరుకొందురుగాక! సివర్డు : కొందరు మరణించటం తప్పదు. ఇందర్ని ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ నాటి ఘనవిజయాన్ని మనం ఎంతో అల్పవ్యయంతో విలుచుకొన్నా మనిపిస్తున్నది. మాల్కొం : ఇక్కడ మాక్డఫ్ కనిపించటం లేదు. మీ ఉదాత్తపుత్రుడు సివర్డు కనిపించటం లేదు. రాస్ : సివర్డు ప్రభూ! తమ పుత్రుడు వీరమరణాన్ని పొందాడు. అతడు పురుషత్వాన్ని పొందుతున్న తొలిదశవరకే జీవించినా ఆ ఆరంభదశలోనే తన పరాక్రమసాహసాలను 447 నిరూపించుకొన్నాడు. సైనికోద్యోగ నిర్వహణంలో స్థిరుడై నిల్చి పోరాడి, పురుషోచితమరణాన్ని పొంది తన వీరతను సుస్థాపితం చేశాడు. సివర్డు : అయితే అతడు మరణించాడన్నమాట! రాస్ : అతని కళేబరాన్ని యుద్ధరంగంనుంచి తెచ్చారు కూడాను. అతని విలువకు అనుగుణంగా మీరు దుఃఖించటానికి పూనుకొంటే దానికి అంతమంటూ ఉండదు. సివర్డు : : అతని శరీరానికి ముందుభాగంలో ఏమైనా గాయాలు కనిపిస్తున్నావా? రాస్ : అవును. కన్పించే గాయాలన్నీ ముందు భాగానికి తగిలినవే! సీవర్డు : అయితే అతడు పరమేశ్వర సేవలో ప్రాణాలు కోల్పోయినాడు. అతణ్ణి గురించి నాకు దుఃఖించవలసిన అగత్యం లేదు. నాకు తలపై కురులంతమంది తనూజులున్నా, వారికి ఇంతకంటే ఉచితమైన మరణం మరొకటి కావాలని నేను కోరను. అయితే అతనికోసం మృత్యుఘంటికలను మొరయించటం జరిగిపోయిందన్నమాట! మాల్కొం : ప్రభూ! అతడు ఇంకా అధికంగా దుఃఖించటానికి అర్హుడు. తగిన అవకాశాన్ని చూచుకొని అందుకు వినియోగిస్తాను. సీవర్డు : అనవసరం. అతడికోసం ఇంతకంటే అధికంగా మనం దుఃఖించవలసిన పనిలేదు. అతడు ఉదాత్తంగా మృతి పొందాడనీ, వీరసైనికుడిగా తన ఋణం తీర్చుకొన్నాడనీ వారు చెప్పారు గదా! పరమేశ్వరుడు అతణ్ణి అనుగ్రహించు గాక! - ఇక మంచివార్త వస్తుందని ఊహిస్తున్నాను. (మేక్బెత్ శిరసుతో మాక్డఫ్ ప్రవేశిస్తాడు.) మాక్డఫ్ : మహారాజా! జయము! జయము!! ఇప్పుడు తాము మాకు మహారాజులైనారు. ఈ రాజద్రోహి దుష్టశరీరాన్ని ఎక్కడ నిలపాలెనో దర్శించండి. ఇక కాలానికి స్వేచ్ఛ సంప్రాప్తించింది. నేను వ్యక్తీకరించే హృదయభావాలనే వహించిన తమ రాజ్యంలోని ఆణిముత్యాలచేత ఇప్పుడు తాము పరివేష్టింపబడ్డారు. అందరి కంఠాలనూ నా కంఠంతో కలిపి 'స్కాట్లండు మహారాజా! జయము! జయము!!' అని జయపెట్టకోరుతున్నాను. అందరు : స్కాట్లండు మహారాజా! జయము! జయము!! (తుత్తార ధ్వనులు వినిపిస్తవి) 448 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మాల్కొం : మీలో ప్రతిఒక్కరూ నాకై ప్రకటించిన ప్రణయగుణోపేతమైన సేవలను ప్రశంసించటంలో విశేషకాలవిలంబాన్ని ఇక నేను సహించలేను. నా ఋణాన్ని వెంటనే తీర్చుకొంటున్నాను. ఇప్పుడు ధేనులుగా ఉంటున్న నా బంధువుల నందరినీ ఎరల్లనుగా నియమిస్తున్నాను. ఇట్టి విజయవేళల్లో ఏ స్కాట్లండు ప్రభువూ, పూర్వమెన్నడూ నియమించి ఎరుగని ఎరల్లలు వీరు. చారులను నియమించి నిరంతరం పరిశీలించటంవల్ల భయపడి, ఈ నిరంకుశుని పాలనతో కాందిశీకులై వెళ్ళినవారిని తిరిగి పిలిపించటం నిహతుడై ఈ హంతకుని క్రూరానుయాయులకు, నిజహస్తాలతోనే ప్రాణం తీసుకొన్నదని వింటున్న భూతంవంటి ఇతని రాజ్ఞికి శిక్ష చెప్పటం మొదలైన పనులేమేమి మేము చేయవలసి ఉంటే, వాటినన్నిటినీ వెంటనే జరిగిస్తాము. 82 ఇంతే కాదు. ఇంకా ఏ యే స్థలాలల్లో ఏ యే కృత్యాలను చేయవలసిన అవసరం పడితే వాటినన్నిటినీ పరమేశ్వరానుగ్రహ సహాయంతో నిర్వర్తించటానికి మేము స్థిరసంకల్పుల మైనాము. అందువల్ల తిరిగి మీ అందరికీ సమష్టిగాను, వ్యష్టిగాను నమస్కృతుల సర్పిస్తున్నాను. స్కోన్లో జరుగనున్న మా కిరీటధారణోత్సవానికి విచ్చేయవలసిందని మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నాను. (తుత్తార ధ్వనులు వినిపించినవి, నిష్క్రమిస్తారు) 449 1. అనుబంధం ప్రథమాంకం మరుభూమి - దుష్టశక్తుల సమావేశానికి యోగ్యమైన ప్రదేశం. సమయం. ఈ మాంత్రికురాండ్రకు సామాన్యమైన మంత్రగత్తెలకున్న శక్తులేకాక, విధి దేవతలైన ఫ్యూరీలకుండే శక్తులు కూడా కొన్ని ఉండటాన్ని గమనించవలసి వుంది. 2. రణకల్లోలం : నార్వే రాజైన స్పెనోతో జరుగుతున్న యుద్ధకల్లోలం. 3. గ్రేమాల్కిన్ : ప్రథమమాంత్రికురాలి బిడాలనామం. 4. ఫార్డాక్ : ద్వితీయ మాంత్రికురాలి గోదురుకప్ప (హరంజాదా). మంత్రగత్తెలు గోదురు కప్పలు, పిల్లుల రూపంలో భూతపిశాచాలను తమ దగ్గర ఉండేటట్లు చేసుకోగలరని, 1584లో ప్రచురితమైన 'డిస్కవరీ ఆఫ్ విచ్ క్రాఫ్ట్' అనే గ్రంథంవల్ల తెలుస్తున్నది. 5. ఎయ్యది పరులకు మంచో: ఇందులో భవిష్యత్సూచన ఉన్నదని విమర్శకుల అభిప్రాయం. 6. ఫోర్రెస్: స్కాట్లండులోని ఎల్జిన్ అనే కౌంటీలోని ఒక పట్టణం. ప్రస్తుత యుద్ధం ఇంచ్కిలి అన్న ప్రదేశంలో జరుగుతున్నది. 7. సార్జెంట్: షేక్స్పియర్ కాలంలో ఇతడు సామాన్యోద్యోగి మాత్రమే కాదు. రాజుకు పార్శ్వచరులైన ప్రధానోద్యోగుల్లో ఒకడు. 8. పశ్చిమద్వీపాలు : స్కాట్లండుకు పశ్చిమంగా ఉన్న 'అవుటర్ హెబ్రిడిస్' ద్వీపాలు. 9. మాతృస్వశ్రేయా : డంకన్, మేక్బెత్ అక్కచెల్లెండ్ర కుమారులు. డంకనక్కు పూర్వం స్కాట్లండును పాలించిన మాల్కొంరాజుకు మనుమలు. 10. ఫిరంగుల్లా : ఫిరంగి ఆడ్రియనోపిల్ ముట్టడి వేళ మహమ్మద్ ॥ 1453లో తొలుతగా ప్రయోగించాడు. 1543లో మొదటిసారిగా ఇంగ్లండులో ఫిరంగి ప్రయోగింపబడ్డది. అందువల్ల ఇది కాలసంబంధిదోషము. 450 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 11. గొల్గోతగా : జెరూసలెం నగరాన బాహ్యప్రదేశంలో తలపుర్రెలతో నిండిఉన్న ఒక శ్మశాన ప్రదేశం. క్రీస్తు మహాశయుని ప్రాణహరణం ఇక్కడనే జరిగింది. 12. థేన్ : ఈ శబ్దం ఆంగ్లో సాక్సనుల కాలంలో ఎరల్, ఎల్డర్ మన్లకు మధ్యస్థితి వహించిన ఒక జాతి ప్రభువును తెలియజేస్తుంది. వీరు మొదట రాజుకు పార్శ్వచరులు. తరువాత ప్రాంతీయపాలకులైనారు. 13. ఫైఫ్ : ఫిర్త్ ఆఫ్ ఫోర్తుకు ఉత్తరంగా ఉన్న ఒక కౌంటీ. 14. బెల్లోనా వరుడు : బెల్లోనా రోమనుల యుద్ధాధిదేవత. 15. సెయింట్ కొల్మిద్వీపం : పిక్టులకు తొలుతగా క్రైస్తవమతాన్ని ప్రచారం చేసిన సెయింట్ కొలుంబా వసించిన ద్వీపం. 16. డాలర్లు : ఇవి 1518లో తొలుత బొహిమియాలోని సెయింట్ జొయాఖిం లోయలోని వెండిగనుల్లో జన్మించాయి. అందువల్ల జొయాఖిం థేలర్లని వీటికి మొదటిపేరు. థేలర్ అనే జర్మను శబ్దం ఆంగ్లభాషలో డాలర్ అయింది. 17. వరాహాలను హతమార్చు - దుష్టదృష్టిని ప్రసరించి వాటిని చంపు. మంత్రగత్తెలు వాటి యజమానులమీద కోపం తీర్చుకోటానికి దుష్టదృష్టితో గృహజంతువులను చంపటం, పిశాచశక్తులను వాటిమీద ప్రయోగించి బాధపెట్టటం చేస్తుంటారు. 18. టైగర్ : ఒక నౌక. 1583లో టైగరనే పేరుతో ఒక నౌక ఎల్లెప్పొకు సమీపంలో ఉన్న ట్రిపోలీలో (సిరియా) దిగిందట. ఎలెప్పో శబ్దాన్ని ప్రాచ్యదేశ మంత్రవిద్యకు సంబంధించిన పదంగా షేక్స్పియర్, స్కాట్ ప్రయోగించారు. 19. దిక్సూచి ఫలకం : షేక్స్పియర్ కాలంలో దిక్కులను సూచించే ఒక ఫలకాన్ని నావికులు ఉపయోగిస్తుండేవారు. 20. విధికి మనం కూతుళ్ళం : మేక్బెక్లో మంత్రగత్తెలు జనశ్రుతిలోని సామాన్య మాంత్రికురాండ్రు కారు. వీరికి సముద్రం మీద ప్రయాణం చెయ్యటం, గాలిలోకి ఎగిరిపోవటం మొదలైన అతీతశక్తులున్నాయి. వీరు విధి, అదృష్టాలమీద అధికారం గలవాళ్ళు. 21. సైనల్ : మేక్బెత్ తండ్రి. కానీ ఇతని నిజమైన పేరు ఫిన్లే. సైనల్ అనతికాలానికి పూర్వమే మరణించటంవల్ల మేక్బెత్కు ఇంకా ఆచారపూర్వకంగా గ్లామిస్ధాన్ పదవి రాలేదు. 451 22. అతడికి వినాశాన్ని తెచ్చిపెట్టింది : కౌడర్ థేన్ నార్వే ప్రభువైన స్వైనోకు సైన్యసహాయం చేసి రాజద్రోహాన్ని తలపెట్టటం వల్ల, డంకన్ అతణ్ణి గురించి పూర్వవిచారణచేసి శిక్ష చెప్పటం నిలిపి ఉంచాడు. రాస్ వల్ల సత్యం తెలుసుకొన్న తరువాత మరణశిక్ష చెప్పి, అతని 'కౌడర్ థేన్' బిరుదాన్ని, పదవిని మేక్బెత్కు అందజేశాడు. 23. భవిష్యత్తులో జరుగనున్న మహానాటకానికి - ఈ స్వగతంలోని ప్రతివాక్యమూ మేక్బెత్ బుద్ధిలో ద్రోహాచరణకాంక్ష ఎంతో పూర్వమే పుట్టి ఉండటాన్ని వ్యక్తం చేస్తున్నదని, కోల్రిడ్జ్ మహాశయుడు. మంత్రగత్తెలవల్ల రాజ్యం బాంకో వంశస్థులకు పోతుందని విన్న అతడు, ఆలోచనలో పడ్డాడు. తృతీయాంక ప్రథమదృశ్యంలోని మేక్బెత్ స్వగతానికి బీజాలు ఇందులో కనిపించటం గమనింపదగ్గ విషయం. 24. క్షుద్రపదార్థంలా పరిత్యజించటానికి - కౌడర్ థేన్ మృతిని షేక్స్పియర్ మనోహరమైన భాషలో విపులంగా వర్ణించటానికి ఆయనకు అధిక గౌరవం గల ఎస్సెక్స్ ప్రభువు వధ్యవేళ ప్రదర్శించిన ప్రవర్తన కారణమైవుంటుందని ఒక ఊహ. ఎస్సెక్స్ ప్రభువు కొంతకాలం ఎలిజబెత్ రాణికి ప్రీతిపాత్రుడై వర్తించి, ద్రోహాన్ని తలపెట్టి తెలిసినతరువాత క్షమాపణ వేడుకొన్నా ప్రయోజనం లేకపోవటం వల్ల, మరణశిక్షకు (1601) గురైనాడు. 25. కంబర్లాండు యువరాజు : రాజు కంబర్లాండుకు తన జీవితకాలంలో ఎవరిని పేర్కొంటే వారు రాజమరణానంతరం స్కాట్లండుకు ప్రభువు కావటం పరిపాటి. క్రీ. శ. 975 నుంచి స్కాట్లండు రాజులు కంబర్లాండును ఆంగ్లరాజు లిచ్చిన మొఖాసాగా అనుభవిస్తున్నారు. ఈ సందర్భంలోని మేక్బెత్ స్వగతం 'డంకన్ హత్యాపథకం' మేక్బెత్ బుద్ధిలో పుట్టిందేకాని మేక్బెత్ ప్రభ్వి చిత్తంలో జనించింది కాదని వ్యక్తం చేస్తున్నది. 26. ఘనుడా గ్లామిస్! ఇట మేక్బెత్ ప్రభ్వి ప్రియపత్నివలె కాక, భర్త మనస్సును, తన మనసును ఆకర్షించిన డంకన్ హత్యోద్యోగానికనుగుణంగా స్వాగతాన్ని చెప్పటం గమనింపదగ్గది. యుద్ధభూమి నుంచి వచ్చిన భర్త బాహుబంధంలో ఒదిగిపోవటానికి పర్వెత్తకుండా 'గృధ్రరాజైన' భర్తకు తగ్గ సహచరిగా ఆమె ప్రవర్తించింది. 27. ఏట్రింత - మార్టిన్ అన్న ఈ పక్షి వేసవి ఆరంభంలో ఇంగ్లండుకు అతిథిగా వచ్చి, చలికాలం ఆరంభం కాగానే వెళ్ళిపోతుంది. 452 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 28. మాలాధారులు జపమాలలు ధరించి ఎల్లప్పుడూ రాజుల జీవితం కోసం జపం చేస్తుండేవారిని బ్లూ గౌనులంటారు. తమ కో ఏడాది పెరిగినప్పుడల్లా ఇట్టి జప్యులను పెంచుతుండటం స్కాట్లండు రాజులకు ఆచారమట! 29. పర్యవేక్షకుడు : రాజుకు, ఆయన పరివారానికి భోజనసదుపాయాలను కల్పించటానికి పంపబడే ఉద్యోగి. 30. దుందుభిస్వనాలైన కంఠాలతో తీర్పు నాడు (డే ఆఫ్ జడ్జిమెంటు) దేవదూతలు దుందుభులు మ్రోగిస్తారట! 31. దివ్యగంధర్వ బాలకుల్లా : తుది తీర్పు నాడు ఎగిరిపోతున్న మేఘాల నెక్కి వీళ్ళు లోకంలోని పాపాలకన్నిటికీ ప్రతీకారం జరిగితీరవలసిందేనని కేక పెడుతుంటారట! ద్వితీయాంకం 32. హెకేట్ : మాంత్రికవిద్యకు అధిదేవత. ఈమెను డయానాతో అభేదనుగా చెబుతుంటారు. అందువల్లనే హెకేట్ చంద్రాధిదైవతంగా భావింపడుతుంది. 33. టార్క్విన్ : ఇతడు యువ టార్క్విన్. రోము రాజైన టార్క్విన్ ది ప్రౌడ్ (క్రీ.పూ. 510 ప్రాంతం) కుమారుడు. ఇతడు లుక్రీషియాను బలవంతంగా చెరచినాడు. 34. వాళ్ళనేది ఉన్మత్తులను చేసిందో మేక్బెత్ ప్రభ్వి మధుపానం చేసి వచ్చిందన్నమాట. - 35. ద్వితీయవ్యంజనప్రసారం : భోజనవేళ రెండవమారు వడ్డనలో అతిరుచికరాలైన వ్యంజనాలుంటాయి. ప్రకృతి ఇచ్చే విందులో మొదటి ప్రసారం ఆహారమనీ, రెండవ ప్రసారం నిద్ర అని భావం. 36. నెప్ట్యూన్ : సముద్రాలకు అధిదేవత. ఇతణ్ణి ప్రాచీనరచయితలందరూ ఘనుడని వ్యవహరిస్తారు. 'సాటరన్ 'ను సింహాసనం నుంచి దించి, అతని రాజ్యాన్ని విప్లవం చేసిన అతని మువ్వురు పుత్రులు 'పంచుకొన్నప్పుడు జూపిటర్కు స్వర్గం, భూమి, ప్లూటోకు అధోలోకం, నెప్ట్యూన్కు సముద్రం వచ్చాయని గ్రీకు పురాణగాథ. 37. బిలిబబ్ : పాలస్టయిన్లో పూజింపబడే భూతాలకు పాలకుడైన దేవతామూర్తి. 38. సస్యం సమృద్ధిగా పండటంచేత : పంట విపరీతంగా పండటంచేత 1606లో ఆంగ్లదేశాన ధరలు విపరీతంగా పడిపోయి, కొందరు కృషీవలులు ఆత్మహత్య చేసుకొన్నారట! 453 39. జెసూట్వా!: జేమ్సు రాజువల్ల తమకు వ్యతిరేకాలైన కొన్ని చట్టాలను మార్పించుకోటానికి యత్నించి జెసూట్లు విఫలులై, 1605లో పార్లమెంటు జరుగుతుండగా భవనాలను బ్రద్దలుకొట్టడానికి మందు పెట్టి, కుట్ర బయటపడటంవల్ల ఉరి తీయబడతారు. ఈ కుట్ర కాథలిక్ మతస్థుడైన రాజును సింహాసనమెక్కించటానికి ఉద్దేశింపబడింది కనుక భగవత్సంబంధ మైనది. 40. ఆంగ్లసీవనకారుడు : షేక్స్పియర్ కాలంలో సీవనకారులు దుస్తులు కుట్టటానికని ఇచ్చిన గుడ్డలో కొంత కాజేసేవారట! ఫ్రెంచి ఫాషన్లను వికృతంగా అనుకరించేవారట! అందువల్ల షేక్స్పియర్ వారిని పరిహసిస్తున్నాడు. 41. ద్వారపాలకుణ్ణి మరిచిపోకండి : లంచం ఇవ్వటం విషయంలో. 42. రెండోమారు కోడి కూసేదాకా అంటే రాత్రి 3 గంటల వరకు.
43. పవిత్రీకృతమైన మన ఆలయాన్ని కిరీటధారణవేళ రాజు శరీరాన్ని పరమేశ్వరాలయంగా అభిషేకించి పవిత్రీకృతం చేయటం క్రైస్తవాచారం. 44. గార్డెన్ చేసిన చర్యలు : ఇది మెడూసా అన్న సర్పకేళి. సర్పాలను కేశాలుగా కలిగిన ఈ మెడూసా, తన్ను చూచినవాళ్ళను రాళ్లుగా మార్చివేస్తుందని గ్రీకు పురాణగాథ. 45. స్కోనక్కు : నేటి పెర్త్క దగ్గిరిగా ఉన్న ఒక మఠాలయం. ఇందులో జాకబ్ తలగడైన ఒక రాయి ఉందనీ, ప్రాచీన స్కాట్లండు రాజులనందరినీ ఆ రాతిమీద కూర్చోపెట్టి కిరీటధారణం చేయించేవారనీ తెలుస్తున్నది. ఎడ్వర్టు ఆ శిలను వెస్టుమినిస్టరుకు తెప్పించిన నాటినుంచీ, ఆంగ్లచక్రవర్తులందరినీ దానిమీదనే కూర్చోపెట్టి కిరీటధారణం చేయించటం జరుగుతున్నది. G 46. కోల్మి - కిల్ - పూర్వపు స్కాట్లండు రాజులకు అది ఖననసంస్కారభూమి. ఇప్పుడు దాన్ని ఐయోనా అంటారు. ఇది పశ్చిమద్వీపాలలో ఒకటి. క్రైస్తవమతాన్ని ప్రచారం చెయ్యటానికి క్రీ.శ. 6వ శతాబ్దంలో వచ్చిన సెయింట్ కొలుంబా యిక్కడ నివసించటంవల్ల, దీనికి కొలుంబా సెల్, కోల్మికిల్ అన్న పేర్లు వచ్చాయి. తృతీయాంకం 47. నా సోదరపుత్రులు : మాల్కొం, డొనాల్బెయిన్. 48. సీజర్ ఎదుట మార్క్ ఆంటోనీ సంరక్షకశక్తి : ఈ సీజర్ ఆక్టేవియిస్ సీజర్. క్రీ.పూ. 63-14 మధ్యకాలంలో రోమక సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తి. 454 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 తొలుత ఇతడు ఆంటోనీ, లెపిడన్లతో కలిసి త్రైకూటమి సమితి (ట్రయంవిరేట్) ఏర్పాటు చేసి తుదకు ఆక్టియం యుద్ధంలో అంటోనీని ఓడించి, రోమక ప్రపంచానికి ఏకైకపాలకుడైనాడు. మార్క్ ఆంటోనీ ఆక్టేవియస్ తోపాటు త్రైకూటసమితిలో సభ్యుడై, అతని సోదరి ఐన ఆక్టేవియాను వివాహమాడి, తరువాత ఈజిప్టుకు వెళ్ళినప్పుడు క్లియోపాత్రా మోహంలో చిక్కుకొని, ఆక్టియం యుద్ధంలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకొన్న రోమక వీరాగ్రేసరుడు. ఇక్కడ మార్క్ ఆంటోనీ అయిన మేక్బెత్కు బాంకో ఆక్టేవియస్ అన్నమాట! 49. కుమారుడు పారిపోయినాడు : ఫ్లియాన్సు వేల్సుకు పారిపోయి రాకుమార్తెను వివాహమాడి, తరువాత కాలంలో స్కాట్లండుకు హైస్చ్యూవర్డు అయిన వాల్టరన్న పుత్రుని కన్నాడు. జేమ్సు రాజు ఇతని వంశంలో జన్మించినాడట! అందువల్ల బాంకో స్టువర్టు రాజవంశానికి మూలపురుషుడైనాడన్నమాట!! 50. మీకో స్థానం ప్రత్యేకించబడి ఉంది : లెన్నాక్కు బాంకో ప్రేతరూపం కనిపించకపోవటాన్ని బట్టి ఇలా మాట్లాడుతున్నాడు. 51. రష్యన్ భల్లూకంలా : రష్యాలో భల్లూకాలు విశేషం. కొన్ని సందర్భాలలో రష్యాను 'ఘనభల్లూకం' అని వ్యవహరించటం కద్దు. 52. హైరానియస్ వ్యాఘ్రంలా : ప్రాచీన పర్షియాదేశంలో హైరానియా ఒక రాష్ట్రం. ఇందులో వ్యాఘ్రాలు విశేషంగా ఉన్నట్లు ప్లినీ, వర్జిల్ పొగడినారు. 53. రక్తం రక్తాన్ని పుచ్చుకొంటుంది: నిహతుని రక్తం హంతకుని రక్తాన్ని పుచ్చుకోకపోతే ప్రాయశ్చిత్తం లేదని షేక్స్పియర్ నాటి విశ్వాసం. 54. శిలలు నడిచివెళ్ళుతాయిట: డ్రూయిడ్లనే పురోహితులు పూర్వం కొన్ని శిలల మూలంగా హత్యాదోషాలను బయట పెట్టగలిగేవారట. ఆ శిలలను హంతకుడు కదల్పలేడట. నిర్దోషి సులభంగా కదల్చగలడట. కొన్ని శిలలకు హత్యగావింపబడిన వ్యక్తులను బయట పెట్టగల శక్తి ఉన్నట్లు కొన్ని కథలు కనిపిస్తున్నవట. పాలిడోరస్ అన్న రాజకుమారుని హత్య చేస్తే, అతని సమాధి మీద ఒక చెట్టు మొలిచి రక్తాన్ని ఒలికించి ఆ హత్యను బయట పెట్టినట్లు వర్జిల్ మహాశయుని 'ఈనిడ్' లో ఒక కథ కనిపిస్తున్నది. 455 55. గోకరాళ్ళ కూతలు : రోమనులు పక్షుల కలకలాలను బట్టి, విహరించే రీతులను బట్టి ఎన్నో విషయాలను తెలుసుకొంటూండేవారు. ఈ అంశాలవల్ల తన హత్యాదోషం బయటపడ్డదన్న భావం మేక్బెత్కు కలిగినట్లు స్పష్టమౌతున్నది. 56. చంద్రశృంగంమీది నిబిడమైన బిందువు: ప్రాచీనకాలంలో చంద్రగోళం నుంచి కొన్ని రసబిందువులు ఔషధులమీద పడి వాటికి విచిత్రమైన మాంత్రికశక్తి నిచ్చేవనే విశ్వాసముండేది. 57. ఉదాత్తుడైన డంకన్ ను గురించి డంకన క్కు ఉదాత్తుడన్న విశేషణం సర్వసాధారణంగా ప్రయోజితమైంది. చరిత్రాత్మకంగా డంకన్ అటువంటివాడు కాకపోయినా, షేక్స్పియర్ అతణ్ణి అటువంటివాడినిగా చిత్రించటం, రాజ్యాపహర్త, హంతకుడు ఐన మేక్బెత్ పతనాన్ని తీవ్రతరం చేయటంకోసమేనని గమనించవలసి ఉంది. 58. పవిత్రుడైన ఎడ్వర్టు రాజు : ఈ ఎడ్వర్టు రాజుకు పోపు అలెగ్జాండర్ III 'కన్ఫెసర్' అన్న బిరుదునిచ్చి, 1161లో గౌరవించాడు. వెస్ట్ మినిస్టర్ అబీని (మఠాలయాన్ని) నిర్మించినదీ మహారాజే. 59. హత్యాఖడ్గ ప్రదర్శనలు లేకుండా : ఇది అనుమానించదగ్గ నానారీతులైన వారితో కలిసి విందులను సేవించేటప్పుడు బల్లలమీద ఛురికా ఖడ్గాలను గ్రుచ్చటమనే పూర్వపు స్కాట్లండు దేశాచారాన్ని జ్ఞప్తి చేస్తున్నది. 60. మాక్డఫ్ కోసం వార్త పంపించలేదా? - మాక్డఫ్ ఫైఫ్ దుర్గాధిపతి. ఫైఫ్ మేక్బెత్ ప్రస్తుతమున్న ఫొర్రెస్ సౌధానికి రోజు ప్రయాణం కంటే ఎక్కువ దూరంగా ఉంది. కానీ షేక్స్పియర్ ఒక రోజులోనే వార్తాహరి వెళ్లి తిరిగి రాదగినంత దూరంలో ఉన్నట్లు ఊహించాడు. చతుర్థాంకం 61. చారలపిల్లి : ప్రథమ మాంత్రికురాలి పిల్లి - గ్రేమాల్కిన్. 62. మూడున్నొక్కమారు: మంత్రగత్తెలకు మూడు, ఒకటి ముఖ్యంగా శక్తియుతమైన సంఖ్యలు. 63. జ్యూజాతివాని : షేక్స్పియర్ జ్యూ, టర్క్, తాత్తారులనందరినీ ఒకేలెక్కలో 456 పరిగణించటం, వారిని జంతువులతో సమానంగా చూడటం, అతని కాలంవారికి వారిమీద ఎట్టి అభిప్రాయమున్నదీ వ్యక్తం చేస్తున్నది. చంగినాఖాన్ వావిలాల సోమయాజులు సాహిత్యం-3 దండయాత్రలవల్ల, మధ్యాసియా నివాసులైన తార్తారులతో పాశ్చాత్యులకు పరిచయం కలిగింది. 64. బిర్నాం మహారణ్యం : డస్కెల్ట్ వద్ద డన్స్నేన్ పెర్త్ కు మధ్య వున్న కొండతో కూడిన మహారణ్యం. 65. ఎనిమిదిమంది రాజులు : వీరు రిచ్చర్డు II, రిచ్చర్డు III, ఆర్గురు జేమ్సులు అన్న స్కాట్లండు రాజులు. ఇందులో ఐదవ జేమ్సు రాజు కుమార్తె అయిన మేరీ రాణి విడిచిపెట్టబడ్డది. మంత్రగత్తెల జోస్యంలో రాజులను మాత్రమే చెప్పటం ఇందుకు కారణం. 66. నీవు బాంకో ప్రేతరూపంలా : ఇలా కన్పించేది బాంకో వారసుడైన రిచ్చర్డు II 67. మాక్డఫ్ దుర్గం : ఫైఫ్ షైర్ సముద్రతీరాన నేటి డైసార్టుకు మూడు మైళ్ళలో ఈ మాక్డర్ దుర్గం ఉండి ఉన్నట్లు భావించబడుతున్నది. 68. ఫైఫ్ ని అతని ఆస్తి : మాక్డఫ్, ఫైఫ్ దుర్గాధిపతి. కనుక అతని ఆస్తిని స్వాధీనం చేసుకొంటానని మేక్బెత్ అభిప్రాయం. 69. రాజభక్తి ప్రమాణాన్ని భగ్నం చేశారు : నేడు మేక్బెత్ రాజై ఉండగా, మాల్కొంను రాజును చేయటానికి యత్నించటం వల్ల. 70. గండమాల : సోపులా, ఎడ్వర్డురాజు ఈ వ్యాధిని తన అద్భుతశక్తితో నయం చేయటంవల్ల దీనికి 'రాజవ్యాధి' అన్న పేరు వచ్చింది. ఈ చికిత్సాశక్తి వారసత్వంగా అనీరాణి వరకు ఈ రాజవంశంలో వచ్చినట్లు ప్రతీతి. 71. వారు కూడా క్షేమంగానే ఉన్నారు: మాక్డఫ్ దారాపుత్రులను మేక్బెత్ హత్య చేయటాన్ని రాస్ అతిజాగరూకతతో నింపాదిగా బయటపెట్టటం గమనింపదగ్గ విషయం. పంచమాంకం 72. ఒకటో దృశ్యం - 'నిద్రా - గమనాన్ని' ఇంత రమణీయంగా నిరూపించి చూపిన దృశ్యం ఆంగ్లసాహిత్యంలో మరెక్కడా లేదు. ఇట్టి జాతికి చెందిన దృశ్యాలలో ఇదే మొదటిదీ, తుదిదీ కూడాను. 73. ఓ చెడ్డమచ్చా! : మేక్బెత్ ప్రభ్వి కూడా నిద్రను హత్య చేసింది. ఆమె ఊహించే మచ్చ ఊహాజనితం, హత్యాసంబంధియైనది. 457 74. ఫైఫ్ థేనుకు ఒక భార్య: మాక్డఫ్ ప్రభ్వి. 75. నా వైద్యవిద్యానైపుణ్యాన్ని మించిపోయింది - షేక్స్పియర్ కాలంలో ఉన్మాదవ్యాధిని నయం చేయటానికి చాలా తక్కువ ప్రయత్నం జరిగింది. 76. పినతండ్రి సివర్డు - హాలిన్ షెడ్లో వృద్ధ సివర్డు మాల్కొంకు మాతామహుడు. ఇతని కుమార్తెనే డంకన్ వివాహమాడాడు. 77. ఎపిక్యూరియన్లతో - ఎపిక్యురస్ అనే గ్రీకు తత్త్వవేత్త (క్రీ.పూ. 4వ శతాబ్ది) సిద్ధాంతాలను అనుసరించేవారు ఎపిక్యూరియనులు. కానీ ఏ కారణంచేతనో తిని, తాగి, తందనాలాడామని కొన్ని సిద్ధాంతాలలోను ఎపిక్యురస్ ప్రచారం చేసినట్లు లోకంలో అపప్రథ పడ్డది. ఇటువంటి స్థితే ఉమర్ ఖయ్యాముకు కూడా పట్టింది. 78. శయ్యాగృహాలలో - ఈ వాక్యాలు పలికేటప్పుడు మాల్కొం, తన తండ్రి డంకన్ హత్యను గురించి ఊహిస్తూ ఉండిఉంటాడు. 79. శత్రువుల ముట్టడిని పరిహసించగల శక్తి - మేక్బెత్ చేత ఈ వాక్యాలను పలికించేటప్పుడు షేక్స్పియర్ బాబిలోనియా తుదిరాజైన బాల్షజారు కైరస్ దండెత్తివచ్చినపుడు పరిహసించటాన్ని జ్ఞప్తిలో ఉంచుకొని ఉంటాడు. 80. కట్టుకొయ్యకు బంధించేశారు - ఎలిజబెత్ కాలంలో కట్టుకొయ్యలకు ఎలుగుబంట్లను కట్టి, వేటకుక్కల చేత వాటిని కరిపించి కష్టపెట్టటం అన్ని వర్గాలవారికీ ఒక విలాసం. బహుశః షేక్స్పియర్ దీన్నిబట్టి మేక్బెత్ చేత ఇలా పలికించివుంటాడు. 81. రోమకదేశీయుల్లా - కాటో, కాషియన్, బ్రూటన్, ఆంటోనీవంటి రోమకసేనానులును శత్రువులకు చిక్కిపోవటం కంటే ఆత్మహత్య చేసుకోవటమే ఘనంగా భావించారు. మేక్బెత్ దృష్టిలో ఈ వీరకృత్యం 'విదూషకపాత్రాభినయం' అని అనిపించుకోటం అతని శీలంలోని నైచ్యతను వెల్లడిస్తున్నది. 82. భూతంవంటి ఇతని రాజ్జిని - మాల్కొం తన తండ్రి హత్య విషయంలో మేక్బెత్ ప్రభ్వి పవిత్రతను గురించి వినటం వల్ల ఇలా పలికాడు. కాని నిద్రాగమన దృశ్యంలో ఆమె వ్యవహారాన్ని చూసిన తరువాత, ఆమెను గురించిన ఇటువంటి వర్ణనను సహించలేము. ఆమెపడ్డ పశ్చాత్తాపాన్ని గురించి వింటే మాల్కొం కూడా తప్పకుండా ఈ అభిప్రాయాన్ని మార్చుకొని తీరుతాడు. 458 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
వ్యక్తి సుస్వభావ దుస్వభావ ద్వంద్వ ప్రకృతి అతడి దుస్వభావానికి వ్యక్తిత్వంతో
వ్యవహరించే అవకాశం లభిస్తే సుస్వభావాన్ని ఎలా పరిపూర్ణంగా
రూపుమాపగలుగుతుంతో నిరూపిస్తుంది 'డాక్టర్ జెకిల్-మిస్టర్ హైడ్'