Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-3/ఆంటోని-క్లియోపాత్రా

వికీసోర్స్ నుండి


“ఓహో! ఈమె తన సౌందర్య సమ్మోహన విద్యతో

మరో ఆంటోనీని. నిబద్ధుణ్ణి చేయటానికో అన్నట్లు నిద్రపోతున్నది" - సీజర్

అంకితము

'శ్రీ కూర్మా వేణుగోపాలస్వామి '

ఎం.ఏ. (ఆక్సఫర్డు), బారెట్లా,

ఆంధ్రవిశ్వవిద్యాలయము రిజిస్ట్రారు వారికి

గౌరవ పురస్సరముగా


శా. శ్రీ లావణ్యపయోబ్ధివీచికలకున్ చిత్తంబు రంజిల్లఁగా
    లీలామోదవిలాసహాసముల కేళీలోలుఁడై శ్రీప్రియా
    హేలారమ్యసరోజలోచనరుచిన్ ఈక్షించు నాస్వామి గో
    పాలస్వామి బుధాగ్రగణ్య! మిము సర్వశ్రీయుతున్ జేయుతన్.

శా. మర్మజ్ఞుండవు సర్వసత్కళల, ప్రేమజ్యోతి! దక్షుండవున్
    ధర్మజ్ఞుండవు పాలనంబునను, విద్యావేత్తవున్, వక్తవున్,
    నిర్మాణాత్మకశేముషీవిభవ! ఉన్నిద్రప్రభావుండవున్
    కూర్మావంశశశాంక! ఎన్నదగు మాకున్ మిమ్ము సర్వజ్ఞుగన్.

మ. కవినో కానొ యెఱుంగనట్టితరి నా కావ్యకృషిన్ జూచి "నీ
    వవుదోయీ కవి" వంచు మెచ్చి యెద కాహ్లాదంబు చేకూర్చి ప్రా
    భవమేపారఁగ “వీరగాథయగు నా పల్నాటిగాథన్ భవ
    త్కవితానైపుణి మీరఁ జెప్పు" మని యాజ్ఞాపింపఁగాఁ జెప్పితిన్.

శా. అనాఁడాదిగ సాహితీవ్రతుఁడనై యత్యంత శ్రద్ధారతి
    న్నే నానాగుణకావ్యమార్గముల వాణిన్ గొల్చుచున్నాఁడ - మీ
    రానాఁ డిచ్చిన దోహదంబు ఘనమార్యా! తల్లతాజన్య మే
    నీనాఁ డర్పణసేయ తెచ్చితి నిదే యీపుష్పమున్ బ్రీతితోన్.

ఉ. ఈసుమసౌరభంబులు మహిన్ మును ఖ్యాతి జెలంగినట్టి, వా
    శాశల నాంగ్లసత్కవిక నంతయశస్సు గడించినట్టి, వే
    నాస యొనర్చి కూర్చుకొని నట్టివి, యోరసికావతంస! మీ
    కోసమె యెన్ని తెచ్చినవి కోర్కెమెయిన్ గ్రహియింపఁగాఁ దగున్.

'భూమిక '

చారిత్రిక పూర్వరంగం

బ్రూటస్ నాయకత్వాన ఏర్పడ్డ ప్రజాపక్షం ఫిలిప్పీయుద్ధభూమిలో రూపుమాసింది. విజేతలైన ఆంటోనీ ఆక్టేవియస్ల హస్తాలలో హత్యాకాండకు గురికాకుండా ప్రాణాలతో బయటపడ్డవారు కొందరు నూతన ప్రభుత్వానికి తలొగ్గారు. కొందరు సిసిలీని జయించి పాలిస్తున్న సెక్స్టన్ పాంపేను చేరుకున్నారు. రోమక సామ్రాజ్యానికి 'త్రైకూటవీరులు' (ఆక్టేవియస్, ఆంటోనీ, లెపిడస్) ఏర్పడ్డారు. ఫిలిప్పీయుద్ధంలో విజయానికి మూల స్తంభమైన లెపిడస్ కు ఆఫ్రికాలోని రాజ్యభాగాలను ఇచ్చివేసి, మిగిలిన రోమక సామ్రాజ్యాన్నంతటినీ ఆంటోనీ, ఆక్టేవియస్ అర్ధార్ధంగా పంచుకొన్నారు. ఆంటోనీ ప్రాగ్దేశాలను జయించి సామ్రాజ్యాన్ని వృద్ధి పొందించడం, ఆక్టేవియస్ వృద్ధయోధులను సంతృప్తిపరచటంకోసం కొన్ని భూములను పంచియిచ్చి, వారి సహాయంతో సిసిలీని పాలిస్తున్న సెక్స్టస్ పాంపేమీద యుద్ధాలను కొనసాగించటం వారిరువురూ చేసుకొన్న ఏర్పాటు. అప్పుడు ఆంటోనీ ద్వితీయ యౌవనంలో ఉన్నాడు. ఆక్టేవియస్కు ఇంకా ఇరువది ఒకటో సంవత్సరం నిండలేదు. ఇట్టిస్థితిలో సీజర్ సంపాదించి ఇచ్చిన రోమన్ సామ్రాజ్యానికి సత్యమైనవారసుడు పిత్రీయుడైన ఆక్టేవియసా లేక ఆప్తశిష్యుడైన ఆంటోనియా అన్న అంశం తేలవలసి ఉంది.

ఆంటోనీ క్రీ.పూ. 41 గ్రీసులోను, ఆసియాలోనూ విలాసాలతో గడిపి వేశాడు. తరువాతనే అతడికి సిడ్నస్ నదిమీద క్లియోపాత్రాతో సమావేశం చేకూరింది. అతడు ఆమె ఆప్తగణంలో ఒకడైపోయి, క్రీ.పూ. 41-40 చలికాలాన్నంతటినీ చిలిపిగా గడిపివేస్తున్నాడు. ఆ సమయంలోనే అతని భార్య ఫుల్వియా, అతని సోదరుడు లూషియస్ తొలుత తమలో తాము కలహించి సంధి చేసుకొని, ఇరువురూ ఏకమై, తరువాత ఆక్టేవియస్ మీద తలపడ్డారు. అతని శక్తికి నిలువలేక ఓడిపోయి దేశబహిష్కృతులైనారు. అప్పుడే పార్థియన్లు లెబైనస్ నాయకత్వాన లిబియా, అయోనియాలవరకు దండెత్తివచ్చారు. క్లియోపాత్రా ఇచ్చిన స్వాగతాన్ని, ఆతిథ్యాన్ని అందుకొని అనంతవిలాసాలమధ్య సర్వం మరిచి కాలాన్ని వెళ్లబుచ్చుతున్న ఆంటోనీకి, పైవార్తలు ఒక్కమారుగా వచ్చిపడ్డాయి. ఇట్టి స్థితిలో 'ఆంటోనీ - క్లియోపాత్రా' ప్రారంభమైంది. తరువాత ఆంటోనీ క్రీ.పూ. 40 వసంతంలో క్లియోపాత్రా బాహుబంధాలలో నుంచీ ఎలాగో బయటపడి, అలెగ్జాండ్రియానుంచి ఆసియాకు, అక్కడినుంచి గ్రీసుకు పయనమైనాడు. అక్కడ ఆక్టేవియస్ పెరూసియాను జయించిన వార్తను తన భార్య ఫుల్వియావల్ల విని, అతడు ఇటలీకి వెళ్లుతుండగా త్రోవలో యుద్ధమంతటికీ మూలకారణం తన భార్య పుల్వియాయే అనీ, ఆమె తన్ను ఈజిప్టునుంచి రప్పించటానికి ఇంత చేస్తున్నదనీ తెలుసుకొన్నాడు. ఆంటోనీ - 'అదృష్టంవల్ల' క్రీ.పూ. 40లోనే అతని భార్య ఫుల్వియా మరణించింది. ఆ సంవత్సరమే ఆంటోనీ - ఆక్టేవియన్ల మధ్య బ్రుండూషియం సంధి జరుగుతుంది. రోమక సామ్రాజ్యాన్ని ఇరువురూ తిరిగి పంచుకొంటారు. ప్రాచ్యరాజ్యం ఆంటోనికి వచ్చింది. పార్థియన్ల దగ్గరినుంచీ అతడు ఆసియా మైనరును జయించవలసి ఉంది. పశ్చిమరాజ్యానికి అధినేత అయిన ఆక్టేవియస్ మీద సెక్స్టస్ పాంపేను రూపమాపవలసిన భారం పడ్డది. ఆక్టేవియస్ చెల్లెలైన ఆక్టేవియాతో ఆంటోనీకి వివాహం జరగటంవల్ల, ఆక్టేవియస్ - ఆంటోనీల మధ్య చక్కనిబాంధవ్యం కూడా ఏర్పడ్డది. క్రీ.పూ. 39లో ఆంటోనీ మైసినందగ్గిర పాంపేతో సంధి చేసుకొని, కొన్ని షరతులమీద సిసిలీ, సార్టీనియాలను అతనికి ఇచ్చి వేశాడు, తరిగానివేళ పార్థియన్ల మీద దండయాత్రను తలపెట్టి విఫలుడైనాడు. ఈ అపజయవార్తలు రోముకు చేరుకున్నాయి. రోమన్ ప్రజల్లో ఒక అలజడి బయలుదేరింది. క్లియోపాత్రాతో అతడు గడుపుతున్న కామైక జీవితం, అతని విలాసోన్మత్తత, భోగలాలసత రోములో పొక్కిపోయాయి. అంతటితో ఆంటోనీ రోములోని ఎందరో ఆప్తమిత్రులను పోగొట్టుకొన్నాడు. క్రీ.పూ. 32లో అంటోనీ - ఆక్టేవియాల వివాహం విచ్ఛిన్నమైంది. క్లియోపాత్రామీద ఆక్టేవియస్ యుద్ధాన్ని ప్రకటించాడు. రోమన్ మతానికీ, కుటుంబవ్యవస్థకూ ఆమెవల్ల అనంతనష్టం కలుగుతున్నదన్న ఉద్దేశంతోనూ, ఆతురతతోనూ రోమన్ ప్రజానీకం ఆక్టేవియస్ పక్షం వహించి, అండగా నిలిచారు. ఆంటోనీ - ఆక్టేవియస్ ఇరువురికీ క్రీ.పూ. 31 సెప్టెంబరు మాసంలో ఆస్ట్రియంవద్ద ఘోరయుద్ధం జరిగింది. ఆక్టేవియన్కు విజయం చేకూరింది. అపజయంవల్ల అలెగ్జాండ్రియాకు పారిపోయిన తరువాతకూడా ఆంటోనీ క్లియోపాత్రా వారి కామోన్మత్తవిలాసకేళీలోలతను కొనసాగిస్తూ వచ్చారు. విజయోత్సాహ దోహదంతో ఆక్టేవియస్ మరుసటి సంవత్సరం ఈజిప్టు మీదకే దండెత్తి అలెగ్జాండ్రియాను ముట్టడించడంతో, ఎదుర్కొని పరాజితుడైన ఆంటోనీ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆత్మప్రాణహననంలో క్లియోపాత్రా 'పతియైన అతణ్ణి అనుసరించింది. వివాహం జరిగినప్పుడు రోములో ఉన్న సమయంలోనే పార్టియన్లను శిక్షించటంకోసం తనక్రింద ఉన్న వెంటిడియస్ అనే ఒక సేనాపతిని పంపించాడు. ఒక జ్యోతిష్కుడు చేసిన సూచన మూలంగా అతడు ఆక్టేవియాతో కలిసి గ్రీసుకు వెళ్ళి కొంతకాలం గడుపుతాడు. వెంటిడియస్ విజయంతో తిరిగివస్తాడు. క్రీ.పూ. 38లో ఆంటోనీ మళ్లీ ఇటలీకి వస్తాడు. అక్కడ అతడికి ఆక్టేవియా వల్ల ఒక పుత్రుడు జన్మిస్తాడు. తన భార్యను, బిడ్డను ఆక్టేవియస్ దగ్గిర ఉంచి ఆంటోనీ తన దృష్టిని ఆసియావైపునకు మరలించి ప్రయాణమౌతాడు. ఈ ప్రయాణంలో అతడికి క్లియోపాత్రాతో ప్రథమపరిచయం కలిగి, ప్రణయ మారంభమౌతుంది. అతడు ఆమెను మళ్ళీ క్రీ.పూ. 37లో కలుసుకొన్నాడు. అప్పటినుంచీ అతడు ఆ జగదేకసుందరి సౌందర్యవాగురలో చిక్కి, తన వీరగుణసంపదనంతటినీ క్రమక్రమంగా కోల్పోయినాడు. అలెగ్జాండ్రియాలో వసించిన ఈ కాలంలో అతడు ఒక ప్రార్దేశ నిరంకుశ పాలకుడుగా కాలం గడిపాడు. ప్రాచ్యసామ్రాజ్యాన్నంతటినీ నానారాజన్యులకు ఏలుకోమని పంచియివ్వటం, క్లియోపాత్రాకు, ఆమె సంతానానికీ ప్రత్యేక రాజ్యాలను కల్పించి పంచి, ప్రదానం చెయ్యటం, జరిపాడు.

కథావస్తువు - ఆధారాలు

నాటకరచనకు పూనుకొన్నప్పుడు, తా నెన్నుకొన్న కథావస్తువుకు సంబంధించి తన కాలానికి లభ్యమానాలయ్యే సమస్తాధారాలను గ్రహించి వాటిని అనుసంధించి, ఒక అస్థిపంజరాన్ని చేకూర్చుకొనటం, తరువాత తన శిల్పనైపుణ్యంతో స్వీకరించిన కథ నొక సజీవమూర్తిగా చిత్రించటం మహాకవి షేక్స్పియర్కు ఆచారం. ఆంటోనీ -క్లియోపాత్రా సృష్టికి ఆయనకు లభించిన ప్రధానాధారం ప్లూటార్క్ రచనలు. చరిత్రకారుడు ప్లూటార్క్ రచించిన 'జీవితాలు' అన్న చరిత్రగ్రంథాన్ని, నార్త్ అనువాదంమూలంగా, షేక్స్పియర్ ఎంతో శ్రద్ధతో పరిశీలించాడు. క్రీ.శ. 16వ శతాబ్దంలో ఐరోపీయ నాటకకర్తలకు 'ఆంటోనీ - క్లియోపాత్రా' కథమీద విశేషాభిమానం ఉన్నట్లు ఫ్రాన్ లొని జోడెల్నీ, గార్నియాల రచనలవల్లనూ, ఇంగ్లండులోని పెంబ్రోక్, డానియల్ రచనలవల్లనూ తెలుస్తున్నది. షేక్స్పియర్ 'ఆంటోనీ - క్లియోపాత్రా' రచనకు ముందుగా పైవాటిలో అధమం పెంబ్రోక్, డానియల్ల రచనలైనా చూచి ఉంటాడు. ఈ కథావస్తువుతోనే పుట్టిన సెనికా విషాదాంత నాటకాలనుంచీ, ప్లినీచరిత్రకారుని రచనలకు హోలార్డ్ చేసిన అనువాదాలనుంచీ, పాంపేకు సంబంధించిన అంశాలను 1578 నాటి ఆప్పియన్ రచనలనుంచీ షేక్స్పియర్ ఎన్నో విషయాలను గ్రహించి ఉండవచ్చు. క్రీ.శ. 1583లో కినియో అనే ఇటలీరచయిత వ్రాసిన 'క్లియో పాత్రా'కు, షేక్స్ పియర్ నాటకానికీ కొన్ని సాదృశ్యాలు కనిపిస్తున్నవి. కానీ ఈ సాదృశ్యాలు ఇరువురూ ప్లూటార్క్ చరిత్రకారుని అనుసరించటం వల్ల కలిగి ఉండవచ్చు. క్రీ.శ. 1595లో ఫ్రెంచి రచయిత మాంట్రియల్ తన 'క్లియోపాత్రా'ను ప్రచురించాడు. కాని దానికీ షేక్స్ పియర్ రచనకూ సంబంధం ఉన్నట్లు కన్పించదు. ఒక 'నీలవర్ణ'ను గురించి షేక్స్పియర్ కొన్ని మనోహరగేయాలు చెప్పాడు. ఆ గేయరచనకూ, 'ఆంటోనీ-క్లియోపాత్రా'కు కొంత సంబంధముందని విమర్శకాభిప్రాయం. ఆమె ప్రియుని దృష్టిలో సుందరి కావచ్చు. కానీ క్లియోపాత్రా లోకవిఖ్యాతిగన్న జగదేకసుందరి. ఫ్లూటార్క్ రచనల్లోని క్లియోపాత్రాయే షేక్స్ పియర్ ద్రుష్టి నాకర్షించి ఉండవచ్చు. ప్లూటార్క్ క్లియోపాత్రాను అధర్మ ప్రణయానురక్తయైన అపురూప సౌందర్యరాశిగా చిత్రిస్తే షేక్స్ పియర్ ఆమెకు రాచరికమైన హృదయాన్ని కూడా ప్రసాదించి తీర్చిదిద్ది చిత్రించాడు. షేక్స్ పియర్ మహాకవి కృతాలైన మహోత్తమ రూపకాలలో 'ఆంటోనీ-క్లియోపాత్రా'కొక విశిష్టస్థానముంది. దీనిని మించిన కేవల చారిత్రికరూపకం మరొకటి లేదనటంలో ఎటువంటి భిన్నాభిప్రాయమూ ఉండబోదు. ఇట్టి విశిష్టస్థానాన్ని దానికి కల్పించిన ప్రముఖకారణం ప్రముఖాధారమైన ప్లూటార్క్ లో లభించిన చారిత్రకాంశాలను ఆధారంగా గ్రహించి, షేక్స్ పియర్ కథలోని వ్యక్తుల శీలస్వరూప నిరూపణంలో చూపించిన వైలక్షణ్యం అనవలసివస్తుంది.

షేక్స్ పియర్ - ఫ్లూటార్క్

స్వోపజ్ఞవల్ల రూపకానికి సంక్రమింపజేసిన విశేషాలకు వెలియైన సమస్తాన్నీ ఫ్లూటార్క్ రచన షేక్స్ పియర్ కు అందించింది. ఫ్లూటార్క్ రచనల్లోని చారిత్రికాంశాలను షేక్స్ పియర్ ఆంగ్లచరిత్ర లాధారంగా గ్రహించి రచించిన నాటకాలలో ఆంగ్లేయ చరిత్రల్లోను విషయాలను పాటించే దాని కంటే విశేషశ్రద్ధతో పాటించాడు. ప్లూటార్క్ వల్ల షేక్స్ పియర్ కు పరిపూర్ణమైన కథే కాకుండా, పాత్రలకు సంబంధించిన విశేషాలు, వర్ణనలు కూడా లభ్యమైనాయి. ఆంటోనీ గ్రీసులోనూ, ఆసియాలోనూ గడిపిన విలాసమయ జీవితాన్ని గురించీ, సిడ్నస్ నదిమీద క్లియోపాత్రాను కలుసుకొని సమ్మోహితుడై అలెగ్జాండ్రియాలో గడపిన అర్థరహితమైన కాముకజీవితాన్ని గురించీ, ప్లూటార్క్ షేక్స్ పియర్ కు ఎన్నో విశేషాలు ప్రసాదించాడు. క్లియోపాత్రాతోగూడి ఆంటోనీ అర్థరహితంగా నగరసంచారం చెయ్యాలనీ ఊహించటమూ, ఆంటోనీ సోదరుడైన లూషియస్, ఆంటోనీ భార్య ఫుల్వియా తొలుత తమలో తాము కలహించి తరువాత ఇరువురూ కలిసి, ఆక్టేవియస్ సీజర్ మీద పోరాడి ఓడిపోయి ఇటలీ నుంచి బహిష్కృతులైనట్లు వార్త రావటమూ, లిడియా - అయోనియాలవరకూ పార్థియన్లు వచ్చినట్లు తెలియటమూ అన్న ప్రథమాంకంలోని అంశాలన్నీ షేక్స్ పియరు కు ప్లూటార్క్ వల్లనే లభించాయి. ఫుల్వియా చేసిన విప్లవానికి ఆక్టేవియస్ కల్పించిన కారణమూ, విధురుడుగా ఆంటోనీ పరిస్థితి, పాంపే ఆంటోనీ తల్లి యెడల చూపిన గౌరవాదరాలూ, సంధి కోరి పాంపేకు ఇచ్చిన షరతులు, క్లియోపాత్రాను గురించి ఆంటోనీ మానసికంగా తట్టాడటమూ, ఓడలమీద విందు మొదలైన ద్వితీయాంకంలోని అంశాలకు సంబంధించిన విశేషాలెన్నో షేక్స్పియర్కు ప్లూటార్కువల్ల లభ్యమైనాయి. విజయోపేతమైన వెంటిడియస్ జైత్రయాత్రల కాటంకం కలగటమూ, అందుకుగల కారణాలు, భర్తకు, సోదరుడికి తన అనురాగాన్ని సమానంగా పంచి యివ్వటానికి ఆక్టేవియా పడ్డ అవస్థ, పాంపే పతనం, లెపిడస్ విరూఢనం, క్లియోపాత్రాకు, ఆమె సంతానానికీ ఆంటోనీ రాజ్యప్రదానం చెయ్యటం, యుద్ధభూమిలో క్లియోపాత్రా ఉండకూడదని అభ్యంతర పెట్టి ఎనోబార్బస్, ఆమె కొజ్జాలే యుద్ధాన్ని నడుపుతున్నట్లు లోకం భావిస్తున్నదని తెలియజేయటం, ఆంటోనీ ఆక్టేవియస్ నన్ను యుద్ధరంగంలో ఎదుర్కోవలసిందని సవాలు చేయటం, సైనికులు భూమిమీదనే పోరాడవలసిందని ఆంటోనీకి నివేదించటమూ, ఆక్టియం యుద్ధానికి సంబంధించిన అనేక విశేషాంశాలూ, ఆంటోనీ మిత్రులకు తన సంపత్తినిచ్చి వీడ్కోలు చెప్పటమూ, జన్మదినోత్సవాలూ అనే తృతీయాంకంలోని అంశాలెన్నిటికో సంబంధించిన విశేషాలను, ప్లూటార్క్ షేక్స్ పియర్ కు అందజేశాడు. ఆంటోనీ చేసిన సవాలుకు ఆక్టేవియస్ తెలిపిన సమాధానం, విందువేళ ఆంటోనీ ప్రసంగం, విజయంతో తిరిగివచ్చి కవచబంధాన్ని విప్పనైనా విప్పకముందే ఆంటోనీ క్లియోపాత్రాను కౌగిలించుకోవటము, ఎనోబార్బస్ మృతి, క్లియోపాత్రా మీద ఆంటోనీ క్రోధాన్ని వెళ్ళగ్రక్కటం, తన సమాధినిర్మాణం దగ్గరికి క్లియోపాత్రా పారిపోవటం, అన్న చతుర్థాంకంలోని అంశాలు, ఆంటోనీ మృతి, ఈ మరణవార్త ఆక్టేవియన్ కు తెలియటం, క్లియోపాత్రాను గురించి అతని పన్నాగం, క్లియోపాత్రా ఆత్మహత్యాప్రయత్నం, గ్రామీణుడు క్లియోపాత్రాకు అత్తిపళ్ళను తెచ్చిపెట్టటం, మహారాజ్ఞిగా క్లియోపాత్రా తన్ను అలంకరించుకోవటం, ఆక్టేవియస్ సైనికులు రాకముందే క్లియోపాత్రా, ఐరాస్ మరణించటం, తుదిసారిగా ఛార్మియన్ క్లియోపాత్రాను సేవించటం, ఛార్మియన్ మృతి, ఆక్టేవియస్ వచ్చి క్లియోపాత్రా సాహసాన్ని ప్రశంసించి, ఆంటోనీ ప్రక్కనే ఆమెకు అంత్యసంస్కారాన్ని ప్రసాదించటం అన్న పంచమాంకంలోని విషయాలు కూడా షేక్స్ పియర్ కు ప్లూటార్క్ వల్ల లభించాయి. సమగ్రదృష్టితో పై అంశాలన్నిటినీ పరిశీలించినప్పుడు, 'ఆంటోనీ - క్లియోపాత్రా' రచనవిషయంలో షేక్స్పియర్ ఉత్తరార్ధంలో విశేషంగా ప్లూటార్క్క ఋణపడ్డట్లు గోచరిస్తుంది. ఆక్టేవియా విజ్ఞానసౌందర్య వినయాదికాలను, లెపిడిస్ మాంద్యగుణాన్నీ, అలసట లేని ఆంటోనీ కాముకత్వాన్నీ, అనుక్షణం మార్పునొందే రోమక ప్రజాస్వభావాన్నీ, ఆక్టేవియన్ ప్రదర్శించే కృత్రిమ గౌరవాభిమానాలను, జిత్తులమారితనాన్నీ, క్లియోపాత్రా ఘనతనూ, మొదలైన పాత్రలకు సంబంధించిన గుణవిశేషాల నెన్నింటినో షేక్స్ పియర్ ప్లూటార్క్ వల్ల పొందగలిగాడు. - కానీ షేక్స్ పియర్ గొప్పదనం కథాకల్పనకు సంబంధించింది కాదు. అతడు లభించిన వస్తువిశేషాన్ని ప్రదర్శించటంలోనే తన శిల్పప్రావీణ్యాన్నంతటినీ ప్రదర్శిస్తుంటాడు. పాత్రపోషణ, రూపకోచిత సంభాషణరచన, కవితాపాటవం, ఇత్యాది రూపకగుణవిశేషాలన్నీ షేక్స్పియర్ స్వకీయాలు. ఈ గుణవిశేషాలవల్లనే కేవలకథగా చరిత్రలో లభ్యమయ్యే "ఆంటోనీ క్లియోపాత్రా" ఒక మహాశిల్పి తీర్చిదిద్దిన శిల్పఖండంలా పరిపక్వమైన కళాకౌశలాన్ని ప్రదర్శించి, రసికలోకాన్ని ముగ్ధం చెయ్యగలుగుతున్నది. ఈ పరిశుద్ధవిషాదాంతంతో పోటీకి నిలువదగ్గ రూపకం ఈతని ప్రథమగణ్యరచనలైన లియర్, హామ్లెట్, ఒథెల్లోలలో ఒకటితప్ప అఖిలాంగ్ల సాహిత్య ప్రపంచంలో మరొకటి కన్పించదు.

మూలాతిక్రమణలు

- షేక్స్ పియర్ ప్లూటార్క్ వల్ల లభించిన కొన్ని అంశాలను మార్చాడు కొన్నిటిని వదిలివేశాడు. అతడు రాజకీయ ప్రాముఖ్యమున్న నూతనాంశాలనొక్క దాన్నయినా చేర్చలేదు. రూపకప్రక్రియకు ముఖ్యలక్షణం కనుక కొన్నిటిమీద తన దృష్టిని కేంద్రీకరించాడు. రూపకాంతంవరకూ క్లియోపాత్రాను గుప్తజాతివనితనుగానే ప్రదర్శించాడు. ఆమె యవనజన్యతను స్మరించలేదు. “నీలవర్ణ" మీద చెప్పిన గీతాలలో అతడు ప్రదర్శించిన దుఃఖం, ఈ ఆంటోనీ క్లియోపాత్రా రచనాకాలంలో మహోల్బణాలతో అతణ్ణి కళవళ పెట్టినట్లు కనిపిస్తుంది. 'స్వీయ ప్రణయవిధురతనే షేక్స్పియర్ ఆంటోనీ పాత్రకు ప్రసాదించాడా' అనిపిస్తుంటుంది. లెపిడస్ మెకన్నాస్ఎ గ్రిప్పాల సెలవుతీసుకోటం (ద్వితీయాంకం చతుర్ధరంగం) ఫ్లూటార్క్ కన్పించదు. నాటకీయంగా పరిశీలించినా ఈ దృశ్యానికి విశేష ప్రాముఖ్యమేమీ ఉన్నట్లు తోచదు. కానీ ఈ ఐతిహాసిక రూపకంలోని ఈ దృశ్యంవల్ల, త్రైకూటవీరుల్లో ఒకడైన లెపిడస్ అసమర్థత నిరూపితమౌతున్నది. కథలో ఎంతో చక్కగా ఇది ఒదిగిపోవటంవల్ల అనవసరమని అనలేము. ఆంటోనీకి శకునజ్ఞుడు చేసిన హెచ్చరికలను, సిడ్నస్ నదిమీద నిల్చి ఆంటోనీని సమ్మోహితుని చేసిన క్లియోపాత్రా వర్ణనను నడిపే సందర్భంలో, షేక్స్ పియర్ మూలాన్ని కొంత మార్చాడు. పూర్వం ఆంటోనీలో కన్పట్టిన శౌర్యసాహసాదులను గురించి ఆక్టేవియా చేసిన ప్రసంగం ప్లూటార్క్ రచనలో ఎంతో ఘనంగా కనిపిస్తుంటే షేక్స్ పియర్ దానిని తరువాతి కాలంలో అంటోనీ అనుభవించిన దుఃస్థితికి అనుగుణంగా మార్చి చిత్రించాడు. ఆంటోనీ పాంపేను కలుసుకొన్న తరువాత శకునజ్ఞుడు అతన్ని హెచ్చరించినట్లు మూలంలో ఉంటే, నాటకకర్త ముందే అతడు హెచ్చరించినట్లు మార్పుచేశాడు. ఈ మార్పువల్ల ఆంటోనీ తొందరపాటును సూచించటమే షేక్స్ పియర్ సాధించిన ప్రయోజనం.

షేక్స్ పియర్ ఈజిప్టుకు సంబంధించిన వర్ణనలన్నింటినీ హాలండ్ అనువదించిన ప్లినీచరిత్రకారుని రచనలవల్ల గ్రహించాడు. పాంపేకు సంబంధించిన విశేషాలెన్నో షేక్స్ పియర్ కు ఏప్పియన్ రచనలవల్ల లభించాయి. ఫుల్వియా మరణం, పాంపే దండయాత్ర అన్న రెండంశాలూ ఫుల్వియా, లూషియస్ ల విప్లవ యుద్ధవార్తతోనూ, పార్థియన్లు దండెత్తి రావటంతోనూ కలిసి తెలియటమనే అంశం, ఫ్లూటార్క్ రచనకు భిన్నం. ఆంటోనీ ద్వితీయవివాహం, ఆక్టేవియస్ తొ సంపూర్ణంగా శత్రుత్వం ఏర్పడే మధ్యకాలంలో ఆంటోనీ చేసిన ఇటలీ ప్రయాణాన్ని పరిత్యజించటం, సోదరుడికీ, భర్తకు సామరస్యాన్ని కుదర్చటానికి ఆక్టేవియా చేసిన రెండు యత్నాలను ఒకే యత్నంగా నిరూపించటం, ఫ్లూటార్క్ రచనకు భిన్నాలు. ఇటువంటి స్వల్పమైన మార్పులు కొన్ని గోచరించినా, షేక్స్ పియర్ ప్లూటార్లో కన్పట్టే ప్రధానాంశాలను మార్చలేదు. కథను రూపకోచితంగా చేసేటందుకు తదనుగుణాలైన కొలదిమార్పులను మాత్రమే చేశాడు. ఇట్టి మార్పులతో ఒక అస్థిపంజరాన్ని నిర్మించుకొని తన శిల్పకళానైపుణ్యాన్ని ప్రదర్శించి, షేక్స్ పియర్ ఆంటోనీ - క్లియోపాత్రాను ఒక జీవమయచిత్రంగా శిల్పించి, రసికలోకానికి కాన్క పెట్టాడు.

పాత్రోన్మీలన - మూలాతిక్రమణలు

ఆంటోనీని పరిపూర్ణయోధుడుగా చిత్రించదలచిన షేక్స్ పియర్ పార్థియనుల చేతుల్లో అతడు పొందిన ఓటమిమాట ఎత్తుకోకుండా వదలివేశాడు. ప్లూటార్క్ చిత్రించిన ఆంటోనీ క్రీడాలోలుడు, విలాసి. ఆంటోనీలో గోచరించే సాహసౌదార్యాదిసద్గుణాలు ఫ్లూటార్క్ రచనలోనూ లేకపోలేదు. కాని అందులో దోషపుంజాలమధ్య మరుగుపడి ఉన్న ఆ గుణాలకు షేక్స్ పియర్ ప్రాధాన్యమిచ్చి చిత్రించాడు. సర్వనాశనం చేసిన అతని కామలోలతను సహితం షేక్స్ పియర్ మనోహరుతూలికా విన్యాసాలతో మహోదాత్తంగా ప్రదర్శించి చూపాడు. సీజర్ మరణానంతరం చరిత్రగతినే మార్చగల సాహసౌదార్యాదిసద్గుణాలు గల వీరవ్యక్తిగానే అతడు షేక్స్ పియర్ రూపకంలో గోచరిస్తున్నాడు. పతనావస్థలోనూ అతడు పరమోజ్జ్వలుడుగా ప్రవర్తించాడు. తంత్రజ్ఞుడైనా మేధావి. నిత్యోత్సాహి దోషాన్వితుడైనా ప్రజ్ఞావిశేషుడైన ఈ ఆంటోనీ విధివిలసనానికి చిక్కి పోతున్నప్పుడు, పాఠకలోకం జాలి పొందితీరుతుంది. ప్లూటార్క్చి త్రించిన ఆంటోనీలో ప్రసిద్ధమైన ఆంటోనీ ప్రణయోన్మాదప్రసక్తి లేదు. షేక్స్ పియర్ రూపించిన ఆంటోనీ ప్రపంచ ప్రణయచరిత్రలో విశిష్టరూపరేఖలతో నిలిచి కన్పట్టే నిస్తులప్రియుడు.

షేక్స్ పియర్ చిత్రించిన క్లియోపాత్రా గుణాదికాల విషయంలో సర్వవిధాలా చరిత్రలోని క్లియోపాత్రానే పోలి ఉంది. సామాన్య జీవితానికి ఎంతో వ్యతిరిక్తమైంది. కావటం వల్ల నైతికదృష్టితో పరిశీలిస్తే, ఆమె జీవితంమీద మనకసహ్యం కలిగితీరుతుంది. ప్లూటార్క్ క్లియోపాత్రా మనలో కలిగించే సంచలనమిదే. షేక్స్ పియర్ ఆమె నైతికపతనానికి చుట్టూ ఒక రమణీయ వాతావరణాన్ని సృజించి ఆమెనొక నిరుపమాన శిల్పమూర్తిగా నిల్పాడు. షేక్స్ పియర్ క్లియోపాత్రా జీవితం రూపొందిన కవితావిలాసం. అది కర్తవ్యాన్నిగాని, బాధ్యతలనుగాని ఎరుగదు. అపురూప సౌందర్యం, ఆశ్చర్యకరహావభావాది శృంగార విలాసాలు ఆమె ప్రశస్తికి కారణాలు. విజ్ఞానం, సంస్కృతిదానికి దోహదాలు. ఏ ఆదర్శాన్నీ అంటిపెట్టుకోని ఆమె అనంత భావోల్బణాలు ముగ్ధమనోహరాలు. ఆమె కన్నులు పరమవీరులనైనా పతితులను చేయగల సమ్మోహనవిద్యా రహస్యాలకు విరామ మెరుగని నిలయాలు. తన సమ్మోహన గుణానికామె యెటువంటి అవకుంఠనాన్నీ కల్పించకపోయినా ప్రార్దేశరాజ్ఞిగా ప్రణుతి కెక్కింది. నిలువెల్లా కన్పట్టే ఆమెలోని 'రాజఠీవి' మనల నాకట్టుకొని సర్వదోషాలనూ విస్మరించేటట్లు చేస్తుంది. ఆమె అనంత వైవిధ్యం నిరంతరప్రదర్శనలవల్ల ప్రాతవడేది కాదు. ఆమె వయస్సువల్ల వాడేది కాదు.

ప్రాచీన చరిత్రకారులు ఆక్టేవియస్ సీజర్ను వీరుడుగా పరిగణించారు. కాని మహాకవి షేక్స్ పియర్ ఆక్టేవియస్ పాత్రను సృజించటంలో చరిత్రాత్మకంగా అతనికున్న కీర్తిప్రతిష్ఠలను చూసి విస్తుపోలేదు. నిరంతర విజయాలవల్ల అతనికి లభ్యమౌతూ వచ్చిన గౌరవాదులను చొచ్చిచూచి అతణ్ణి ఒక అల్పమానిసి’నిగా చిత్రించాడు. హృదయ రాహిత్యం, ప్రతీకారేచ్ఛ, గర్వం, సంకుచిత దృష్టి మొదలైన అతని అల్పగుణాలను వెలికితీసి ప్రదర్శించి, అతని ప్రతియోగం మూలంగా తన కథానాయకుడైన ఆంటోనీకి షేక్స్ పియర్ ఔత్కృష్ట్యాన్ని కల్పించాడు. ఈ దృష్టితో ఆక్టేవియస్ ను చిత్రించదలచిన షేక్స్ పియర్, అందుకు అవసరమైన చరిత్రలో కన్పించే అతని గుణాలను కూడా కొన్నిటిని గ్రహించలేక పోలేదు. షేక్స్పియర్ చిత్రించిన ఆక్టేవియస్ ను చూస్తే చరిత్రలోని ఆక్టేవియస్ లాగా గౌరవార్హుడు, ప్రీతిపాత్రుడు అన్న అభిప్రాయం మనకు కలుగదు.

చరిత్రలో కన్పించే ఆక్టేవియాను షేక్స్ పియర్ ఎంతో మరుగుపరచి చిత్రించాడు. ఆమె అచంచల పతిభక్తిని, సౌందర్య గుణాలను విశేషంగా స్వీకరించలేదు. కార్యనిశ్చయ పరిజ్ఞానం, సాధనాసామర్థ్యం, ఉత్తమ లక్ష్య లగ్నబుద్ధి, మొదలైన ఆమె గుణవిశేషాలను స్వీకరించలేదు. ఆంటోనీ వల్ల ఆమెకు కలిగిన సంతానప్రసక్తి నాటకంలో లేదు. ఆంటోనీపుత్రుడైన ఆంటిల్లస్, క్లియోపాత్రా కుమారుడైన సిజేరియన్ పొందిన దారుణమృతిని చరిత్రలు ఎంతో విపులంగా వర్ణించాయి. షేక్స్ పియర్ వాటిని ఒక సందర్భంలో ఉటంకించటంతో ఊరుకొన్నాడు. చరిత్రలో వారి మరణానికి క్లియోపాత్రా ఎంతగానో విలపించటం కనిపిస్తుంటే, షేక్స్ పియర్ ఆ ప్రశంసైనా చెయ్యకపోవటం ప్రేమికులైన ఆంటోనీ క్లియోపాత్రాల పరస్పరానురాగ పటిష్ఠతను ప్రదర్శించటంకోసమే అని భావించవలసి వుంటుంది.

ప్లూటార్క్ లొ ఎనోబార్బస్కు సంబంధించి ఒకటి రెండు వాక్యాల కంటే లేవు నాటి ఆధారంతో షేక్స్ పియర్, దుర్దశావిద్ధుడైన అంటోనీని సర్వపరివారం పరిత్యజిస్తున్న సమయంలో అచంచల స్వామిభక్తిని ప్రదర్శించి విశిష్టతను గడించుకొన్న ఒక నూతనవ్యక్తిగా తీర్చిదిద్దాడు. ప్లూటార్క్ ఉన్న స్కారస్కు ఒక ప్రత్యేకత అంటూ ఏమీ లేకపోగా, అతడు తన ప్రభువైన అంటోనీని వదిలిపెట్టి ఆక్టేవియస్ వంకకు వెళ్లిపోతాడు. 'ఆంటోనీ - క్లియోపాత్రా'లోని స్కారస్ తుదిక్షణందాకా ఆంటోనీని అంటిపెట్టుకొని ఉండి, అతని కడపటి ఆజ్ఞను భక్తితో అనుసరిస్తాడు. క్లియోపాత్రాయెడ ఆంటోనీ ప్రదర్శించిన వ్యామోహాన్ని చూచి సహించలేక ఎంతగా ఖిన్నుడైనా, ఇతడు తుదిదాకా అనుసరించాడే గాని, పరిత్యజించటమనే స్వామిద్రోహానికి పాల్పడలేదు.

ఆంటోనీ - క్లియోపాత్రా : షేక్స్పియర్ ఆత్మీయత

షేక్స్ పియర్ మహాకవి జీవితంలోని యౌవనదశలో ఒక ప్రణయకథ నడిచి భగ్నమైందనీ, ఆ కథకు నాయిక అయిన వ్యక్తినే ఆ కవీంద్రుడు తన గీతాలల్లో (సానెట్లు) 'నీలవర్ణ' అనే పేరుతో వ్యవహరించాడనీ, అతని ప్రణయజీవితకథకూ ఆంటోనీ - క్లియోపాత్రాలోని ప్రణయకథకూ కొంత సంబంధమున్నదనీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ సంబంధానికి విశేష గౌరవం ఇచ్చే అవకాశం లేదు. షేక్స్ పియర్ యౌవనదశలో నడిచిన ప్రణయమూ, ఆంటోనీ ప్రణయమూ రెండూ ధర్మేతరాలు. గీతాలలోని నీలవర్ణ, నాటకంలోని క్లియోపాత్రాకు మూలమని అనటానికి అవకాశం లేదు. ఆమె ప్లూటార్క్ లభించిన క్లియోపాత్రాయే. అయినా గీతాలలోని నీలవర్ణకు సంబంధించిన స్మృతులు షేక్స్ పియర్ కు జీవితాలలోని క్లియోపాత్రా పాత్రలోని కవితను వ్యక్తం చేసి ఉండవచ్చు. గీతాలలోని నీలవర్ణలాగానే షేక్స్ పియర్ క్లియోపాత్రా నీలవర్ణం అయి ఉండటం గీతాలకూ, నాటకానికీ ఉన్న సామ్యం. ప్రాచ్యమైన జ్యోతిష్మతీత్వంతోను, అపురూప సౌందర్యంతోను, అనన్యసాధారణచంచల విలాసాలతోనూ, భోగపరతంత్రతతోనూ మభ్యపెట్టి, తన దోషాలమీదికి ఆంటోనీ మనస్సును మరలనీయకుండా చేసి, అతణ్ణి పాలించిన 'ప్రాక్తార' క్లియోపాత్రా చరిత్రలోని వ్యక్తే గాని, షేక్స్ పియర్ చిత్తాన్ని క్షుభితం చేసిన నీలవర్ణ కాజాలదు. ఆంటోనీ క్లియోపాత్రా ప్రణయపరిణామాన్ని చిత్రించటంలో షేక్స్పియరు కొంతగా తన ప్రణయకథ తోడ్పడి ఉండవచ్చు. దీనినిబట్టి నాటకంలో ప్రతిబింబితమైన నాటకకర్త ఆత్మీయత ఇంతమాత్రమే అనవచ్చు.

ప్లూటార్క్ ననుసరించి అంటోనీ వయస్సు ఏబదిమూడు సంవత్సరాలు. కథారంభం నాటికి అతనికి నలుబది ఆరు సంవత్సరాలు ఉండి ఉండవచ్చు. ఈ నాటక రచనాకాలానికి షేక్స్ పియర్ వయస్సు దరిదాపుగా అంతే ఉంది. అతడు యుద్ధరంగాలలో, ఇతడు సాహిత్యరంగాలల్లో సమానంగానే విజయాలు చేకొన్నారు. భవిష్యత్తును గురించి ఇరువురి దృష్టీ ఒకవిధంగా నడవటానికి అవకాశంముంది. అయినా షేక్స్ పియర్ తనయవ్వన కాల ప్రణయాన్ని స్మృతికి తెచ్చుకొని, నవ్యత నాపాదించి, దాన్ని కొంతగా 'ఆంటోనీ - క్లియోపాత్రా' రచనమూలంగా ప్రదర్శించి ఉండవచ్చు.

కథావస్తు పరిశీలనం

భుజబుద్ధి సంపన్నత చేత శత్రుసంహారం చేసి రోమక మహాపురుషుల్లో ఒకడని విఖ్యాతిగన్న మార్క్ ఆంటోనీ మహాశయుణ్ణి, ఈజిప్టు రాజ్ఞి క్లియోపాత్రా తన అపురూప సౌందర్యంతో ఆకర్షించి, విలాసప్రియత్వాన్ని నేర్పి, అలెగ్జాండ్రియాలో ఒక కామారాధకుణ్ణి చేసి కట్టిపడేస్తుంది. తన సర్వస్వం ఆ ఈజిప్టు సామ్రాజ్ఞియే అయినా, అతని కప్పుడప్పుడూ సహజ దేశాభిమానంవల్ల రోమకభావాలు కలిగి, కలతపెడుతూ ఉండేవి. పరిపూర్ణంగా క్లియోపాత్రాను పరిత్యజించటం అతనికి ఇష్టం కాలేదు. అతని భార్య ముల్వియా మృతివల్ల, అతడు తాత్కాలికంగానైనా క్లియోపాత్రా బాహుబంధాలనుంచి బయటపడి రోముకు వెళ్లుతాడు. రాజకీయంగా తన అధికారాన్ని బలవత్తరం చేసుకొందామనే ఉద్దేశం ఏమీ లేకుండానే ఆంటోనీ రోముకు వెళ్ళటంతో, త్రికూట వీరుల్లో ఒకడైన ఆక్టేవియస్ సీజర్, అతడితో మైత్రి నేర్పరుచుకొని బలం చేకూర్చుకోవటం జరిగింది. వీరిరువురి మధ్య అక్టేవియా వివాహం వల్ల, ఏర్పడ్డ మైత్రి మనఃపూర్వకమైంది కాకపోవటం వల్ల, అది తరువాత తొలుత అంతఃకలహానికీ, తుదిని ఆంటోనీ వినాశానికీ దారితీసింది. తన హృదయాన్ని కాజేసిన క్లియోపాత్రాను పరిత్యజించకుండానే ఆంటోనీ ఆక్టేవియస్ సోదరి ఆక్టేవియాను వివాహమాడటం కేవలం అర్థరహితమైన పని. చిక్కిన అవకాశాన్ని ఉపయోగించుకొందామని ఆంటోనీ చేసుకున్న ఈ వివాహంవల్ల, పాంపే మూలంగా ఆక్టేవియను కలుగనున్న శ్రమను సర్వాన్నీ తీర్చే భారం అతడిమీద పడ్డది. రోమకరాజ్యంలో ఆక్టేవియస్మీద ప్రజలకు గాఢమైన అసంతృప్తి ప్రబలమై ఉన్న దినాలలో, అతడిమీద పడి నాశనం చేయవలసి ఉండగా, ఆంటోనీ అందుకు భిన్నంగా అతని సోదరిని ఆక్టేవియాను వివాహమాడటం వల్ల ఆక్టేవియన్కు బలం కలిగి, నిలువత్రొక్కుకోగలిగాడు. వివాహానంతరం ఆంటోనీ - ఆక్టేవియన్ల మధ్య విరతి యెరుగని మనస్పర్ధ లేర్పడ్డాయి. ఆంటోనీ ఆక్టేవియాను పరిత్యజించి తిరిగి ఈజిప్టుకు వెళ్ళిపోయి, తన ప్రియురాలైన క్లియోపాత్రాను చేరుకొన్నాడు. అటు తరవాత కూడా ఆంటోనీకి ఆక్టేవియస్మీద విజయాన్ని సాధించటానికి విధి ఎంతో అనుకూలంగా ఉన్నా, అతడేమీ చేయటానికి పూనుకోలేదు. ఆంటోనీ ఆక్టియం యుద్ధంలో ఒకదాని తరవాత ఒకటిగా - ఎన్నో తప్పిదాలు చేశాడు. అప్తుడైన ఎనోబార్బస్ ఎంత చెప్పినా వినక, యుద్ధభూమిలో క్లియోపాత్రా ఉండిపోవటానికి అంగీకరించటం, ఆమెను సంతృప్తి పరచటానికి ఎనోబార్బస్, కాసెడియస్ చెప్పిన ఉపపత్తులనన్నిటినీ త్రోసిపుచ్చటం, నౌకలతిభారోపేతాలైనవైనా సైనికులు సముద్రయుద్ధ ప్రావీణ్యం లేనివారైనా, ఆక్టేవియస్ కోరగానే అతడితో సముద్రంమీద యుద్ధం చెయ్యటానికి ఒప్పుకోవటం మొదలైనవి అంటోనీ తప్పిదాలు. కానీ అతని అసామాన్యనాయకత్వం అతని సైనికులకు మహోత్సాహాన్ని కల్పించి పోరాడించింది. అయితే ఏం ప్రయోజనం? క్లియోపాత్రా పిరికివడి యుద్ధభూమినుంచీ తన అరువదినౌకలతో వలియబారి పారిపోవడంతో అర్థరహితంగా ఆమెను అనుసరించిన ఆంటోనీకి ఆక్టియంలో అపజయం కలిగింది. అంతటితోటే అతని అదృష్టం ఆంటోని - క్లియోపాత్రా 149 వ్యతిరేకించిందని అనలేం. తరువాత అనతికాలంలోనే అతనిపక్షం నుంచి సైనికులు కొందరు వెళ్ళిపోయి శత్రుపక్షంలో చేరినప్పటికీ, ఇంకా అతనికి ఈజిప్టునుంచి ఆక్టేవియను ఎదుర్కొనే అంగబలం ఉండనే ఉంది. అనాలోచితంగా అతడు సంధియత్నం ఆరంభించాడు. విజేతఅయిన ఆక్టేవియస్ ఆంటోనీని విడిచిపెట్టమని క్లియోపాత్రాను కోరటం, ఆమె నిరాకరించటం, ఆక్టేవియస్ అలెగ్జాండ్రియా మీదికి ఎత్తిరావటం సంభవించాయి. అలెగ్జాండ్రియా యుద్ధంలో తొలినాడు ఆంటోనీకి స్వల్ప విజయం సంప్రాప్తించినా, మరునాడు అతని నౌకలు మోసగించటంవల్ల ఆంటోనీ పూర్తిగా ఓడిపోవటమూ, ఆక్టేవియస్కు పరిపూర్ణవిజయం లభించటం జరుగుతుంది. క్లియోపాత్రా అసత్యమరణవార్తను విని ఆంటోనీ ఆత్మహత్యకు పూనుకోవటం, ఖడ్గం సరియైన ఘాతను కల్పించకపోవటం చేత కేవలం బలమైన గాయం తగలటమేగాని, ప్రాణాలు కొంతసేపటిదాకా పోకపోవటం, అతణ్ణి క్లియోపాత్రా ఉన్న సమాధి నిర్మాణం దగ్గరికి చేర్చటం, అతడు క్లియోపాత్రా మరణం అసత్యమని గమనించటం, అక్కడ అతడు క్లియోపాత్రా బాహువుల్లోనే మరణించటం జరుగుతాయి. ఆక్టేవియస్ సీజర్కు విజయచిహ్నంగా జీవించదలచుకోక క్లియోపాత్రా ఆంటోనీని అనుసరించటానికి నిశ్చయించి 'కీటకం' చేత కరిపించుకొని ప్రాణపరిత్యాగం చెయ్యటంతో ఆమె జీవితం పరిసమాప్తమవుతుంది. కరుణారసభూయిష్ఠమైన ఆ ప్రదేశానికి వచ్చిన ఆక్టేవియస్, సైనికగౌరవాలతో ఆంటోనీ, క్లియోపాత్రాలకు అంత్యక్రియలను జరిపించటంతో “ఆంటోనీ - క్లియోపాత్రా" రూపకం పరిసమాప్తమవుతుంది. నాటక నిర్మాణం - అత్యుత్తమ శ్రేణికి చెందిన షేక్స్పియర్ మహాకవి రచనల్లో 'ఆంటోనీ క్లియోపాత్రా' ఒక విశిష్టస్థానాన్ని గడించుకొన్నది. ఇంత అప్రయత్నంగా రచయిత అంతరంగంనుంచి వెలువడ్డదిగాని, ఇంతగా చరిత్రాత్మకమైంది గాని షేక్స్పియర్ రచనల్లో మరొకటి లేదని అనిపించుకొన్నది. ఆ రూపకంలోని పాత్రలనే పునః ప్రదర్శించటం చేతనూ, కథాగమన విషయంలో దానికీ దీనికీ అత్యంతసామ్యం, సాన్నిహిత్యం ఉండటంచేతను 'జూలియస్ సీజర్'తో 'ఆంటోనీ - క్లియోపాత్రా'కు కొంత సంబంధం ఉన్నట్లు వ్యక్తమౌతుంది. కానీ దానికీ దీనికీ, స్వభావంలో ఎంతో విభేదముంది. జూలియస్ సీజర్లో కర్తవ్య పాలనమనే ఆదర్శం ప్రముఖ స్థానాన్ని వహించింది. ఆంటోనీ - క్లియోపాత్రాలో ఐంద్రియకాముకత్వానికీ, అతిశయమైన స్వార్థపరత్వానికీ జరిగిన సంఘర్షణ ప్రదర్శితమైంది. జూలియస్ సీజర్లోని బ్రూటస్ ను 150 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 నడిపించిన ధర్మసూత్రం వంటి సూత్రమొకటి, ఈ నాటకంలోని నాయకుడైన ఆంటోనీకి మార్గదర్శకమై నడిపించినట్లు కన్పించదు. తొలుత ఈతణ్ణి కాముకత్వం, తరువాత స్వార్థపరత్వం ఆవహించి, అనుచరుణ్ణి చేసుకొన్నట్లు ద్యోతకమౌతుంది. అందులోని పోర్షియాకు, ఇందులోని క్లియోపాత్రాకు పోలికేలేదు. ఇరువురూ భిన్నప్రకృతులు. ఇరువురూ పొందిన సంస్కారాలు భిన్నాలు. నిర్మాణ విషయంలో జూలియస్ సీజర్ అతిసామాన్యమైంది బహువిధసన్నివేశ వైవిధ్యంతో ఆంటోనీ క్లియోపాత్ర అతిక్లిష్టమైంది. - - రోమక చరిత్రలో క్రీ.పూ. 40 మొదలు 30 వరకు పది సంవత్సరాల మధ్యకాలంలో జరిగిన ప్రధానాలైన సమస్తచారిత్రిక సన్నివేశాలను షేక్స్పియర్ 'ఆంటోనీ - క్లియోపాత్రా'ను నిర్మించటంలో అత్యాశ్చర్యజనకంగా అనుసరించాడు. రూపక శిల్పానుగుణంగా స్వల్పాంశాలను పునర్వర్గీకరించి, వాటికొక నూతనప్రాముఖ్యాన్ని కల్పించి ఉపయోగించుకొన్నాడు. ఇట్టి రచనా ప్రణాళికను అనుసరించటంవల్లనే ఆ మహాకవికి ఆంటోనీ - క్లియోపాత్రాలోని వివిధపాత్రలను విశిష్టగుణభూయిష్ఠాలుగా చిత్రించే అవకాశం లభ్యమైంది. కథావస్తువు ఈజిప్టునుంచి రోముకు, రోమునుంచి మైసినంకు, మైసినంనుంచి ఈజిప్టుకు, ఈజిప్టునుంచి ఆక్టియంకు, అక్కడినుంచి అలెగ్జాండ్రియాకు నిర్విరామంగా పరువులెత్తింది. రోమక రాజ్యాన్ని 'త్రైకూటవీరులు' పంచుకోటం మొదలుగా, వారిలో ఒకడైన ఆక్టేవియస్ మిగిలిన ఇరువురిమీద విజయాన్ని సాధించి రోమక ప్రపంచానికి ఏకైకపాలకుడయ్యేటంతవరకూ నడచిన కార్యవిశేషాలన్నీ, ఈ ఆంటోనీ క్లియోపాత్రాలో ప్రదర్శితాలైనాయి. వివిధ కథావిశేషాలతో కార్యగమనానికి ఒక వినియోగం ఉన్నట్లు బాహ్యదృష్టికి గోచరించినా, దానికి ఒక కేంద్రం లేకపోలేదు. ఆంటోనీ క్లియోపాత్రాలనే వ్యక్తిద్వయమే ఆ కేంద్రం. ఈ దంపతుల ప్రణయకథమీద పాఠకలోకానికి సానుభూతిని కల్పిద్దామనే ఉద్దేశంతోనే రచయిత చరిత్రలోని పార్థియన్ యుద్ధవిశేషాలను ఎత్తివేశాడు. ఆ యుద్ధంలో ఆంటోనీ పరిత్యక్త కామావ కుంఠనమైన వీరాన్ని ప్రదర్శించాడు. అట్టి రససన్నివేశాన్ని ప్రదర్శించటంవల్ల ఆంటోనీ కాముకత్వం కొంత మరుగుపడటమే ఇందుకు కారణం. ప్లూటార్క్ రచనలలో ఆంటోనీలోని గుణదోషాలు రెండూ యథాతథంగా గోచరిస్తున్నవి. ఆ చరిత్రకారుడు రెంటినీ సమన్వయించి అంటోనీ జీవితలక్ష్యాన్ని నిర్ణయించి చూపటానికి ఎట్టి యత్నమూ చేయలేదు. 'జీవితా'లలోని ఆంటోనీ రూపకంలోని ఆంటోనీలా ఒక గంభీరవ్యక్తి కాడు. చరిత్రలో కన్పించే ఆంటోనీలోని ఆంటోని - క్లియోపాత్రా 151 ఉదాత్తగుణాలన్నిటినీ షేక్స్పియర్ రాశీభూతంచేసి రూపకంలో ప్రదర్శించాడు. పరమోదాత్తమైన అతని వ్యక్తిత్వం పతనావస్థలో సహితం మనలను ఆకర్షిస్తున్నది. ఆంటోనీయెడ ఆక్టేవియా చూపిన భక్తివిశ్వాసాలు మూలంలో విశేషంగా ప్రదర్శితాలైనాయి. వాటిని యథాతథంగా నిరూపిస్తే అంటోనీ క్లియోపాత్రా ప్రేమబంధానికి విరతి కలుగుతుంది కనుక షేక్స్పియర్ వాటన్నిటినీ విడిచిపెట్టి, నాయికానాయకుల ప్రణయైకజీవితానికి ప్రాచుర్యాన్ని కల్గించే అంశాలకే ప్రాముఖ్యాన్నిచ్చాడు. ఈ కారణంవల్లనే ఆంటోనీ సర్వప్రపంచ సాహిత్యాలల్లోని ప్రేమికులందరిలో అతివిశిష్టుడన్న విఖ్యాతి గడించుకోగలిగాడు. "షేక్స్పియర్ రచించిన చరిత్రాత్మక నాటకాలన్నిటిలో “ఆంటోనీ - క్లియోపాత్రా” అద్భుతావహమైంది” అన్నాడు కోల్రిడ్జి పండితుడు. ఆయన అన్నట్లు ఇది ఒక చరిత్రాత్మక రూపకం. ఇందులో నాటకకర్త అతి సూక్ష్మాంశాలను గూడా ఎంతో సన్నిహితంగా అనుసరించాడు. ఇది కేవలం చరిత్రే కాదు ఒక ప్రణయకావ్యం కూడాను. నాయికానాయకుల ప్రణయ ప్రవర్తనలోని నీత్యవినీతులమీదికి మనదృష్టిని అణుమాత్రమైనా ప్రసరించకుండా, ఇంద్రజాలికమైన తన ప్రతిభతో షేక్స్పియర్ ఒక రమణీయమైన యవనికను సృజించి మభ్యపెట్టాడు. ఇందులోని ఆంటోనీ క్లియోపాత్రాలు ఒకరికొకరు దేవతలు. తప్పనిసరియై తానే మృత్యువు నాహ్వానించి లొంగిపోయిన క్లియోపాత్రా కూడా, తుదకు ఏదో విజయాన్ని సాధించిందన్న భ్రాంతి మనకు కలిగించి తీరుతుంది. ధర్మేతరప్రణయాన్ని ఆరాధించిన నాయికానాయకుల మీద మనకు గౌరవాభిమానాలు కలిగేటట్టు చేసిన షేక్స్పియర్ అవినీతిప్రవర్తకుడని అనుకోటానికి అవకాశం లేదు. ఆయన అత్యుత్తమ నీతిప్రతిపాదకుడు. బలసౌందర్యాల కైనా కొంత అవధి, కాలం మాత్రం ఉంటాయనీ, చెడువల్ల మంచి ఎప్పుడూ సంప్రాప్తించదనీ, కాంతాసమ్మితతయా ఉపదేశించి ఈ రూపకమూలంగా ఆయన ఒక ఉత్తమనీతినే ప్రబోధించాడు. అయితే ఆయన ఆంటోనీ - క్లియోపాత్రాల కామతౌల్య విలాసవ్యాపారాలకు ఎటువంటి లోటునూ కల్పించలేదు. అది శిల్పదృష్ట్యా ఒక లోపం కూడాను. ఆంటోనీ - క్లియోపాత్రా - నేత రోమక నాటకాలలో చరిత్రికాంశాలను మలచటంలోనూ, తత్కాలీనమైన వాతావరణాన్ని కల్పించటంలోనూ మహాకవి షేక్స్పియర్ విశేషశ్రద్ధ వహించాడు. అయినప్పటికీ కథాకాలంనాటి రోమకవ్యక్తుల మానవత్వాన్ని దర్శించి ప్రదర్శించటమే 152 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఆయన నాటకరచన ముఖ్యోద్దేశం. ఈ కారణంవల్లనే “షేక్స్పియర్ రోమక నాటకాలలోని నాయకులు తొలుత మానవులు తరువాత రోమనులు" అన్న సూక్తి బయలుదేరింది. 'ఆయన రోమక నాటకాలన్నిటికీ నేత రోమే' అన్న మరొక విమర్శకవాక్యం కూడా లోకంలో విశేషప్రాచుర్యం వహించింది. రోమక నాటకాలకు కొంత రాజకీయ ప్రాముఖ్యం ఉన్నమాట సత్యమే. కానీ ఈ కథావస్తువులలో షేక్స్పియర్ మహాకవిని ఆకర్షించినవి ఆ చరిత్రల్లోని వ్యక్తుల ఆత్మలు. ఆంటోనీ క్లియోపాత్రా కేవలం విషాదాంతం కాదు అది చరిత్రాత్మక విషాదాంతం లేదా విషాదాంత చరిత్ర. ఈ కథకున్న చారిత్రికసంబంధం కేవలం బాహ్యం అందుచేత ఈ నాటకం పూటార్కునుంచి గ్రహించిన చారిత్రికాంశాలను అనుసరించి నిర్మితమైనప్పటికీ ఇది చరిత్ర కాదు, విషాదాంతం. ఇందులో ప్రాధాన్యం నీతిది. రోమక సచ్చీలానికి, సాహసానికీ స్వస్తి చెప్పి సర్వకాల సర్వావస్థల్లోనూ కామవిలాసవిలోలుడై వ్యవహరించటమనే నైతికదోషమే ఆంటోనీలోని గొప్పలోపం. అందువల్లనే అతడికి, అతని ఆదర్శాలకూ భంగపాటు కలిగింది. విషాదాంతాలలో పతనావస్థను పొందిన వ్యక్తులు విజయాన్ని చేకొన్నవారికంటే గౌరవవిషయంలో లోపం కలవాళ్లుగా ఉండనవసరం లేదు. ప్రథమగణ్యతను పొందుతున్న ప్రముఖవ్యక్తుల పతనాన్ని గాని, అభ్యున్నతినిగాని చిత్రించి చూపటమే వాటి ప్రధానకర్తవ్యం. భౌతికాభ్యున్నతిగాని లేదా పతనానికి గాని ఈ విషాదాంత నాటకాలలో ప్రాథమికస్థానం ఉండదు. ప్రాపంచికమైన జీవితంలో ఆక్టేవియస్ పరమైన అభ్యున్నతిని పొందాడు. ఇట్టి స్థితిని పొందటం మనకు బ్రూటస్, ఆంటోనీలపట్ల కన్పించదు. అయినా ఈ వ్యక్తులిద్దరూ రసికలోక గౌరవాభిమానాలను చూరగొంటూనే ఉన్నారు. - మహాకవి షేక్స్పియర్ 'జూలియస్ సీజర్'కు బ్రూటస్ ను, 'ఆంటోనీ క్లియోపాత్రా'కు ఆంటోనీని విధిగా పతనావస్థ ననుభవించవలసిన నాయకులనుగా రూపొందించాడు. క్రమశిక్షణం, ఆదర్శప్రియత్వం బ్రూటల్లో పరాకాష్ఠ నందుకొన్నది. ఆంటోనీలో అణుమాత్రమైనా సంయమం లేని కాముకత్వం పరాకాష్ఠకు చేరుకుంది. నైతిక సమ్మోహనత్వానికి పోర్షియా, ఐంద్రియా కర్షణకు క్లియోపాత్రా ఆదర్శభూతలైనారు. బ్రూటస్ - పోర్షియాల పరస్పర ప్రణయంలో కనుపించే నైతికోదాత్తత లుప్తమైనా ఆంటోనీ - క్లియోపాత్రాల అధార్మిక ప్రణయం కూడా రసికలోకదాక్షిణ్యానికి పాత్రమౌతున్నది. పోర్షియా నైతికోన్నతి బ్రూటస్ ను ఆకర్షించినట్లు, బ్రూటస్ ఆదర్శప్రియత్వం పోర్షియాను ఆకర్షించింది. అలాగే ఆంటోని - క్లియోపాత్రా 153 క్లియోపాత్రా సమ్మోహన సౌందర్యాది విశేషాలు అంటోనీని ఆకర్షించినట్లు, ఆంటోనీ సాహసౌదార్యాది వీరగుణవిశేషాలు క్లియోపాత్రాలు ఆకర్షించాయి. క్లియోపాత్రాలోని సమస్తదోషాలూ, ఆమె 'తన పతి'ని అనుగమించటానికి మృత్యువును స్వయంగా ఆహ్వానించటంతో క్షాళితాలైపోయినాయి. 'ఆంటోనీ - క్లియోపాత్రా' లోని ఆశయం స్థూలదృష్టికి కామతౌల్యంగా కన్పించినా దాని తీక్షత మనలను వివశులను చేస్తుందనటంలో ఎట్టి విప్రతిపత్తి ఉండదు. - 'రోమియో జూలియట్' లాగానే 'ఆంటోనీ' - క్లియోపాత్రా' కూడా ఒక 'ప్రణయ విషాదాంతం' ఈ జాతివిషాదాంతాలలో నాయకుడికంటే నాయికే కేంద్రమై ఉండటం, నాటకారంభంలోనే నాయకుని పతనానికి కారణమైన అతని కామతౌల్యం ప్రదర్శితమైంది. విషాదాంత నాయకుడైన ఆంటోనీ ఈ దోషంవల్లనే కథాంతంలో పతనమై తీరుతాడన్న భావం తొలుతనే ప్రేక్షకుడికి కలిగి తీరుతుంది. విషాదాంత నాటకాలన్నిటా ఒక 'విషాదాంత సంఘర్షణ' గోచరించటం లక్షణం. ఆంటోనీ - క్లియోపాత్రా కథలో ఇట్టి సంఘర్షణ నాటకంలోని రెండు వర్గాలకు చెందిన పాత్రమూలంగా నిరూపితమైంది. దీనికి ఆంటోనీలోని బాహ్యాంతరికశక్తుల మధ్య జరిగే సంఘర్షణ తోడ్పడుతున్నది. - షేక్స్పియర్ విషాదాంతనాటక లక్షణాలనుబట్టి పరిశీలిస్తే, ఆంటోనీ క్లియోపాత్రా నాటకానికి నాయకుడు ఆంటోనీ. విలాసోన్మత్తత, నిత్యభోగానుభూతి ఈతని విషాదాంత దోషాలు. ఆక్టేవియస్లో కన్పట్టే 'హృదయరాహిత్యం, సంకుచితదృష్టి' ఇత్యాది లక్షణాలతో పోల్చి చూస్తే, ఆంటోనీలోని పై లక్షణాలు గుణావిశేషాలుగానే కన్పిస్తున్నవి. అయితే పూర్వచరిత్రకారులు ఆక్టేవియన్ను ఘనుడుగా, చిత్రిస్తే, షేక్స్పియర్ చరిత్రల్లో కన్పట్టే ఆ ఘనుడి, కీర్తిప్రతిష్ఠలకు ముగ్ధుడై చిక్కిపోక చొచ్చిచూచి గర్వాతిశయం, ప్రతీకారేచ్ఛ, హృదయనైచ్యం ఇత్యాది దుర్గుణాలను పసికట్టి, అతణ్ణి ఒక 'అల్పమానిసి'గా చిత్రించాడు. ఆంటోనీ - క్లియోపాత్రాల నాటకానికి నాయకుడు ఆంటోనీ నాయిక క్లియోపాత్రా. 154 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 పాత్రలు ఆంటోనీ జూలియస్ సీజర్ నాటకంలో యువకుడైన ఆంటోనీ శీలం కొంతగా చిత్రితమైంది. అర్థరహితంగా పోకిరీ జీవితాన్ని గడుపుతూ కాలహరణం చేసేవాడని ఇతణ్ణి గురించి సామాన్య జనాభిప్రాయం. సీజర్ ను హతమార్చ తలపెట్టిన విద్రోహులైనా ఇతని శక్తిసామర్థ్యాలను గురించి చాలినంతగా పసికట్టినట్లు కన్పించదు. ఇతడు సీజర్కు కేవల మొక అంగమనీ, అతణ్ణి అంతమొందిస్తే శక్తిహీనుడై ఎందుకూ సమర్థుడు కాజాలడనీ, ఇతణ్ణి గురించి విద్రోహ పక్షనాయకుడైన బ్రూటస్ భావించాడు. కాని దూరదృష్టి వ్యావహారికవిజ్ఞానం గల కాషియస్ మాత్రం నిగూఢమైన ఇతడి నిశితబుద్ధిబలాన్ని ఊహించి, ఇతడెంతకైనా సమర్థుడనీ, ఎన్ని కష్టాలనైనా కల్పించగలడనీ, కనుక ఇతణ్ణి కూడా సీజర్ తోబాటు తుదముట్టించవలసిందేననీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. విద్రోహుల్లో మిగిలినవారందరూ ఈ విషయంలో బ్రూటస్ భావంతోనే ఏకీభవించటంవల్ల ఇతడు సీజర్ హత్యానంతరం జరిగిన హింసాకాండ నుంచి తప్పించుకొన్నాడు. సీజర్ కొక సాధనం, విలాసపరవశుడు అని వారికి భ్రాంతిని కల్గించిన ఈ ఆంటోనీ, సీజర్ వధానంతరం తన సమస్తశక్తులతో విజృంభించాడు. దారుణమరణానికి పాలైన తన యజమాని, మిత్రుడు అయిన సీజర్ యెడ తన కృతజ్ఞతను ప్రదర్శించటాని కీతడు పూనుకొని, హంతకులను అనంతకష్టపరంపరలలో ముంచెత్తి తుదకు హతమార్చిగాని నిద్రపోలేదు. సామాన్యజనానీకాన్ని ఒక వాయులీనంగా చేసుకొని ఇచ్ఛానుసారంగా అపుడు హంతకులయెడ పరమక్రోధాన్ని వెలిగ్రక్కించిన ఈతడు, ఆ సమయంలో ప్రదర్శించిన వక్తృత్వ ప్రావీణ్యం విశ్వవిఖ్యాతి నొందింది. హంతకులకు నగరంలో తావులేకుండా చేసి, బహిష్కృతులు, కాందిశీకులు అయినవారికి ఎన్నెన్నో కష్టాలను కల్పించిన తరువాత, రాజనీతి చతురుడై ఇతడు లెపిడస్, ఆక్టేవియన్లతో మైత్రి చేసుకొని 'ద్వితీయత్రైకూటమి' ని కల్పించి అందులో ప్రధానసభ్యుడైనాడు. హంతక బహిష్కారానంతరం జరిపించిన శత్రుజనహత్యాక్రీడలో ఈతడు నిర్దయుడు, ఆంటోని - క్లియోపాత్రా 155 చండశాసనుడు అని అనిపించుకొన్నాడు. పిమ్మట ఫిలిప్పీకడ కాషియస్, బ్రూటస్లతో చేసిన యుద్ధసందర్భంలో సాటిలేని సమరవిజ్ఞాని, కదనయోధుడు అన్న ఖ్యాతి గడించాడు. ఫిలిప్పీలో పొందిన విజయంతో ఆక్టేవియస్ చేత రోముకు ప్రతిప్రయాణం చేయించితాను గ్రీసుకు వెళ్ళాడు. అక్కడ విద్వదోష్ఠులతో, రూపక ప్రదర్శనలను దర్శించటంతో, సామాన్య జనానీకానికి న్యాయప్రదానం చెయ్యటంతో కాలం గడుపుతూ, గ్రీకు ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడై, వారు యవనప్రియ అని సంబోధిస్తుంటే సంతోషభరితుడైనాడు. ఏథెన్సునుంచి ఆసియాసీమకు వచ్చినపు డీ ఆంటోనీకి ప్రాచ్యవిలాసాలతో పరిచయమేర్పడ్డది. తిరిగి ఇతడు తనలో తాత్కాలికంగా నిద్రిస్తున్న విలాసప్రియత్వానికి గురైనాడు. పానగోష్ఠులు మొదలైన తన పరమోల్లాసాల వ్యయంకోసం ప్రజలమీద పన్నుల భారాన్ని అధికం చేశాడు. పార్థియన్ల మీద యుద్ధాన్ని ప్రకటించబోయే ముందు, ఫిలిప్పీయుద్ధకాలంలో తమకు వ్యతిరేకంగా బ్రూటస్ కాషియన్లకు సహాయం చేశావన్న నేరాన్ని ఆరోపించి, తగ్గ సమాధానం చెప్పుకోవలసిందని ఈజిప్టు రాజ్ఞి క్లియోపాత్రాను సిసిలీకి పిలిపించాడు. ఆ జగదేకసుందరితో ఈ ఆంటోనీకి సిడ్నస్ నదిమీద ప్రథమసమావేశం సంప్రాప్తించింది. మేధావి, సాహసికుడు, యోధాగ్రేసరుడు అయిన ఈ ఆంటోనీకి ఆ కాలంనుంచీ సర్వస్వం క్లియోపాత్రాయే అయింది. జగద్విజేత అయిన ఈ ఆంటోనీని ఆ ఈజిప్టురాజ్ఞి జయించుకొన్నది. ఒకనాడు రోమక ప్రజానీకాన్ని వాయులీనం చేసుకొని ఇచ్ఛానుసారంగా పలికించి మించిన ఆంటోనీని, ఆ ఈజిప్టు గాయని తన సౌందర్య సౌకుమార్యబుద్ధిబలవిశేషాలతో ముగ్ధుణ్ణి చేసి, ఇతనిచేత తన శ్రుతుల కనుగుణంగా జీవితపర్యంతం పలికించుకొన్నది. ప్రాక్తార అయిన క్లియోపాత్రా ప్రణయనాగురలో పడిపోయిన ఈ ఆంటోనీ, రోమన్ రాజకీయాల విషయంలో తూష్టీంభావం వహించటమే కాకుండా వీరోచితాలైన తన సాహసచర్యలన్నింటికీ స్వస్తి చెప్పాడు. భోగలాలసుడై పూర్వ గౌరవానురాగాలను ఇతడు కోల్పోవటం ప్రారంభమైన నాటినుంచీ, షేక్స్పియర్ ఆంటోనీ - క్లియోపాత్రా నాటకాన్ని ఆరంభించాడు. ఇతడి భార్య ఫుల్వియా మరణవార్త, ఆమె కల్పించిన రాజకీయ క్లిష్టపరిస్థితులకు సంబంధించిన వార్తలు విన్నప్పుడు ఒక భావోద్వేగం ఇతణ్ణి క్రమ్మివేసింది. రోమకభావం ఒక్కుమ్మడిగా ఈ ఆంటోనీని ఆవేశించింది. "సమ్మోహిని అయిన ఈ ఈజిప్టురాజ్ఞి పన్నిన బంధనాలను తెగతెంచుకొని నేను బయటపడితీరాలి” 156 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 అని నిశ్చయించాడు. తాత్కాలికంగా నైతేనేం ఇతడిని పూర్వశక్తి సామర్థ్యాలు చేరుకొన్నాయి. ఇతణ్ణి తిరిగి రోముకు వెళ్లనీయకుండా తెలివితేటలతో ఆపివేయాలని నెరజాణ క్లియోపాత్రా తన నేర్పు నెంతగా ప్రదర్శించినా, ఆవేశోన్ముద్రితుడైన ఈ ఆంటోనీయెడ అవన్నీ వ్యర్థయత్నాలైనాయి. రోముకు వచ్చి ఆక్టేవియన్ను కలుసుకొన్న సందర్భంలో అతడు మోపిన సత్యమైన నేరాలన్నిటినీ అంగీకరించటం, అసత్యమైనవాటిని వ్యతిరేకించి పట్టుదలతో గౌరవాన్ని కాపాడుకోటం కనుపట్టింది. మర్మరహితంగా, లోటులేని హుందాతనంతో ఆ సందర్భంలో ఈతడు చేసిన ప్రసంగాలు కొంతకాలంనుంచీ కోల్పోయిన గౌరవప్రతిష్ఠలను కొంతగా సంపాదించి ఇచ్చాయనవచ్చు. ఆక్టేవియాను వివాహమాడి ఆమె అన్నతో ఉన్న వైరాన్ని మాన్చుకోటంలో ఆంటోనీ చూపించిన సంసిద్ధత వల్ల, రాజకీయంగా ఇతడు కొంత విరామాన్ని, విశ్రాంతిని పొందటానికి పడుతున్న ఆరాటం అభివ్యక్తమౌతున్నది. ఇందువల్లనే ఇతని స్వభావాన్ని బాగా ఎరిగిన ఇతని అనుచరుడు ఎనోబార్బస్ 'వారిరువురినీ మిత్రులుగా కూర్చిన ఈ (వివాహ) బంధమే వారి స్నేహానికి ఉరి త్రాడౌతుంది' అని అనతికాలానికే అభిప్రాయపడ్డాడు. ఈ ఆంటోనీ, ఆక్టేవియస్ అతిశీతల స్వభావం కలవాడు. దీర్ఘాలోచనాపరుడు, దూరదృష్టి కలవాడు అన్న అంశాన్ని గమనించకపోలేదు. అందువల్లనే అతడితో మైత్రి అట్టేకాలం నిల్చేదికాదని ఎన్నడో ఇతడు తేల్చుకొన్నాడు. అందుకు సంతోషపూర్వకంగా సంసిద్ధుడైనాడు. కానీ కాలం కలిసిరావాలి కదా! రాజకీయమైన కారణాలు కలిసి వచ్చి, ఆక్టేవియాతోనే ఇతడు ఏథెన్సుకు పయనమైనాడు. ఆక్టేవియాను వివాహమాడటంవల్ల ఇతడు క్లియోపాత్రాతో స్వేచ్ఛగా విహరించే అవకాశానికి కలిగిన ఆటంకం ఒకవంక ఇతణ్ణి కట్టివేసి కలవరపెడుతున్నది. ఆక్టేవియస్ ఇతణ్ణి గురించి తిరస్కారభావాన్ని ప్రదర్శిస్తూ చేసిన ప్రచారంవల్ల కలిగిన క్రోధానికి తోడ్పాటిచ్చింది. ఆక్టేవియస్ తెగబడటానికి సంసిద్ధుడౌతూ, తన క్రోధాన్ని ఒక్కమాటు భార్యముందు వెళ్ళగ్రక్కాడు. సాధు స్వభావి ఆక్టేవియా కలవరపడి అన్నకూ, భర్తకూ సంధి చేయటానికని దౌత్యభారాన్ని తనపై కెత్తుకొన్నది. స్వేచ్ఛగా తాను ఈజిప్టురాజ్ఞి దగ్గరకు వెళ్ళవచ్చును గనుక ఆమె అభ్యర్థనను వెంటనే ఆంటోనీ అంగీకరించాడు. ఇతడు ఈజిప్టుకు వెళ్ళినప్పుడు ఈ ఈజిప్టుయక్షిణి జాణతనంతో ఇతణ్ణి వివశుణ్ణి చేసింది. ఆమె ప్రణయపాశాలకు కట్టుబడి విజ్ఞాన గౌరవాలను, రాజనీతిజ్ఞతను కోల్పోయి ఆక్టేవియను ఎదిరించటం, దానితో రోమక ప్రపంచ సర్వాధికారిని నిర్ణయించవలసిన యుద్ధమారంభం కావటం జరిగాయి. ఆక్టేవియస్లో సముద్రంమీద ఆంటోని - క్లియోపాత్రా - 157 పోరాడాలని క్లియోపాత్రాకొక విలాసేచ్ఛ కలిగింది. తన రణ సాహిత్యానికి గానీ, ఆప్తసైనికుల సలహాకుగాని అణుమాత్రమైనా విలువనీయకుండానే, ఈతడు ఆమె కోరికకు కట్టుబడి, ఆక్టేవియస్ తో సముద్రం మీదనే పోరాడటానికి నిశ్చయించాడు. యుద్ధమధ్యంలో భయోత్పాతం వల్ల ఆమె పారిపోతుంటే, ఈ కామలోలుడు విజయావకాశాన్ని కూడా వదులుకొని, ఆమె వెంట వెళ్లిపోయాడు. తరువాత ఆమెవల్లనే తన అదృష్టం తారుమారైందనీ, భీరువన్న అపఖ్యాతి కలిగిందనీ అంతరాత్మ ప్రబోధించినప్పుడు, తాత్కాలిక క్రోధంతో మిన్నుమన్నేకంగా మెదిపేటంతటి భీమరూపాన్ని ధరించాడు. కాని ప్రయోజనమేముంది? అమృతభ్రాంతిని కల్పించగల అశ్రుబిందువులు రెండు ఆమె నేత్రాలవెంట వెలువడి, ఆ క్రోధోద్రేకాన్ని మటుమాయం చేసి తిరిగి ఆమె కీతణ్ణి దాసుడిగా తీర్చిదిద్దగలిగాయి. ఆక్టేవియస్తో సంధియత్నం చేశాడు. తగ్గ షరతులను పొందలేకపోవటం వల్ల కోల్పోయిన సంపదను సంపాదించటానికి ఇంకోమారు యత్నించాడు. క్లియోపాత్రా పిరికితనంవల్లనే అందులోనూ ఇతని అదృష్టం కలిసిరాలేదు. పరమశత్రువైన ఆక్టేవియస్ దాక్షిణ్యానికి పాల్పడవలసిన స్థితి పట్టినప్పుడు, ఆత్మహత్య తప్ప అన్యమార్గం లేదని అందుకితడు సిద్ధపడ్డాడు. సాహసం, రణపాండిత్యం, దయాదాక్షిణ్యం, మర్మరాహిత్యం, ఉదాత్తత, పరహృదయానురంజనం, సంభాషణ ప్రావీణ్యం ఆంటోనీ గుణాలు. చిత్తచాంచల్యం, ఆశయరాహిత్యం, అసత్య ప్రవర్తన, భోగలాలసత, అతిశయకాముకత్వం ఇత్యాదులు ఇతని దోషాలు. గుణదోషాలు రెండూ విచిత్రరీతిని సమ్మేళనం పొందిన వ్యక్తియైన ఆంటోనీలోని దోషాలు ప్రకోపించి వ్యవహరించటం వల్లనే, అతనికి పతనం సంప్రాప్తమైంది. కానీ సంకుచితదృష్టి, స్వార్థపరత్వం పాలించే ఆక్టేవియర్తో ఆంటోనీని పోల్చి చూసినప్పుడు, ఆంటోనీలోని దోషాలు కూడా గుణాలలాగానే ద్యోతకమౌతుంటాయి. ఆక్టేవియస్ ఆక్టేవియస్ పాత్రను చిత్రించటంలో మహాకవి షేక్స్పియర్ చరిత్రను అనుసరించకుండా తానే కల్పించటానికి పూనుకొన్నట్లయితే, ఆంటోనీకి ప్రతియోగమైన ఇట్టిపాత్రను రూపొందించగలిగి ఉండేవాడు కాడు. ఆంటోనీ మహోద్వేగి ఆక్టేవియస్ శీతలప్రకృతి. అతడు కామలోలుడు, భోగపరాయణుడు. ఇతడు వైభవప్రదర్శకుడే కాని, కీర్తి కాముకత్వాన్నయినా బహిరంగంగా వ్యక్తీకరించటాన్ని మహాపాపంగా పరిగణిస్తున్నట్లు నటించే వ్యక్తి. అతడు కల్మషరహితహృదయంతో మైత్రినాశించే 158 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 స్వభావంగల ఉదాత్తుడు, హృదయవాది, సహృదయుడు. కరడుకట్టిన స్వార్థపరత్వంతో కాలంకోసం కనిపెట్టుకొని కూర్చొనే కటికవాడితడు. లక్ష్యసాధన విషయంలో అతడు చపలచిత్తుడు. ఇత డచంచలదీక్షాదక్షుడు. అతని ప్రతిచేష్టలో మానవత్వం తొణికిసలాడుతుంటుంటే, ఇతని ప్రతిచర్యలో రాజకీయ తంత్రజ్ఞత తారాడుతుంటుంది. అతడు మన అనురాగాన్ని చూరగొంటాడు. ఇతడు మన గౌరవాన్ని సంగ్రహిస్తాడు. ఆక్టేవియస్ ప్రసంగాలలోనూ, ప్రవర్తనలోనూ అపూర్వమైన పూర్వాలోచన, క్రమశిక్షణ కనిపిస్తాయి. కాని ఒక అపూర్వవ్యక్తి అని మాత్రం ఇతడు అనిపించుకోలేడు. ఆంటోనీతో ఇతడు ప్రథమతః ప్రసంగించినపుడు నీతిపరుడిలా ద్యోతకమౌతాడు. నిజానికి అంతే. ఇతని శీలంలో ఎట్టి కళంకమూ లేదు. అత్యంతనీతిపరుడైన ఈతడు, అవినీతిపరుడని తానెంతో అతిశయంగా అసహ్యించుకోనే ఆంటోనీకి తన ప్రియసోదరి నిచ్చి వివాహం చెయ్యటానికి పూనుకొన్నాడేమని ప్రశ్న కలుగుతుంది. ఆమె సచ్ఛీలాన్ని గురించీ, ఆమెపై తనకు గల ప్రేమాభిమానాలను గురించీ ఎంత గొప్పగానో బహిరంగంగా ప్రసంగించాడే మరి? సూచనను అందుకొన్న మరుక్షణంలోనే ఆంటోనీకి అట్టిసోదరి నిచ్చివేయటానికి, కేవలం ఇతని స్వార్థపరత్వమే కారణమనవచ్చు. సాటి సహచరులలో ఉన్న లాలసత్వం ఇతనిలో లేదు. పాంపే నౌకలమీద జరిగిన విందు సందర్భంలో సహచరులు తనను అవజ్ఞ చేశాడని అనుకోపోతారని పాల్గొన్నాడు అంతే. త్రాగదలచి కాక తప్పనిసరియై త్రాగాడు. 'అధికంగా ఒకరోజు మధుసేవ చేయటంకంటే నాలుగుదినాలు త్రాగకుండా ఉండటమంటే నా కెంతో ఇష్టం' అన్న ఈతని వాక్యం, ఇతనివంటి వారి విషయంలో ఒక దోషంగానే పరిగణింపబడని మధుపానలోలతను గురించిన ఇతని భావాలను వెల్లడిస్తున్నది. 'తీవ్రతరమైన మన కార్యక్రమం ఈ విలాసప్రియత్వాన్ని విపరీతంగా కోపిస్తున్నది. త్రాగుడువల్ల కలిగిన విపరీతస్థితి మన అందరినీ పరిహాసకులను చేస్తున్నది' అన్న ఆ సందర్భంలోని ఈతని వాక్యాలు, అట్టి సన్నివేశంలోనుంచి ఎంత సాధ్యమైనంత త్వరలో బయటపడదామా అన్న ఇతని మనస్తత్త్వాన్ని వెల్లడిస్తున్నవి. ఆ విలాస ప్రియత్వంలో భాగస్వామి కావటంవల్ల, అపూర్వమైన తన గౌరవానికి ఎంత భంగం కలుగుతున్నదో అన్న శంక ఇతణ్ణి అనుక్షణం బాధిస్తూనే ఉంది. ఆంటోనీ వెంట ఆక్టేవియాను ఏథెన్సుకు పంపిస్తూ ఇరువురిమీద ఎంతో ప్రేమను ఒలకబోసినా, 'మహోదాత్తుడా ఆంటోనీ! ఈమెయెడ మన ఉభయులకూ ప్రేమ లేకపోతే ఈమె అనే సాధనం లేకుండా మనం ఎంతో అధికంగా అన్యోన్యమైత్రిని కలిగి ఆంటోని - క్లియోపాత్రా 159 ఉండేవాళ్ళం. కాబట్టి మన ఇరువురి స్నేహాన్నీ అనుబంధించి చిరకాలం నిలపటానికి ఉద్దేశిత అయిన ఈ పవిత్రమూర్తి ఆ మన స్నేహసౌధాన్ని భగ్నం చెయ్యటానికి కారణభూతురాలు కాకూడదు సుమా!' అన్న మాటల్లో తన దూరదృష్టిని ప్రదర్శించనే ప్రదర్శించాడు. ఇతడు ఆంటోనీని గురించి దుష్ప్రచారం ఆరంభించి తిరస్కరించటంతో మనస్పర్ధలేర్పడటం, తనంతట తానే దౌత్యభారాన్ని ఎత్తుకొన్న ఆక్టేవియాను అతిసామాన్యనుగా అన్న దగ్గిరికి పంపటం, తరువాత ఆంటోనీ మళ్ళీ ఈజిప్టు మాంసకుంభాల మధ్య పడి ఆమెకు అపచారం చెయ్యటంతో, కనిపెట్టుకొని కూర్చున్న ఆక్టేవియసు కాలం కలిసివచ్చింది. ఆక్టేవియాను ఒక సామాన్యవనితను పంపించినట్లు రోముకు పంపించినప్పుడు ఇతనికి కలిగిన కష్టానికి మూలకారణం సోదరిమీద ప్రేమ కాదు తన గౌరవానికి ఆంటోనీ భంగం కలిగించాడన్న భ్రాంతి. “నీవు సీజర్ సోదరిలా రాలేదు. ఆంటోనీ పత్నికి హర్కారా జనంగా ఒక సైనికదళమైనా ఉండితీరాలి. దర్శనమివ్వటానికి ముందుగానే హయహేషలు ఆమె ఆగమనాన్ని తెలియజెయ్యాలి” మొదలైన అతని సంభాషణ వైభవ ప్రదర్శనం మీద ఇతడి కెంతటి అభిమానముందో వ్యక్తం చేస్తున్నది. 'నీకొచ్చిన ఈ అవమానానికి తగ్గ న్యాయాన్ని కల్పించటం కోసం మహాధికులైన దేవతలు నన్నూ, నిన్ను ప్రేమించే ఇతరులనూ తమ ప్రతినిధులనుగా పరిగ్రహింతురు గాక!' అన్న వాక్యాలవల్ల ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆంటోనీని అణగద్రొక్కటానికి పూర్వమే వేసిన పథకాన్ని ఆచరణలో పెట్టటంకోసం ఎంత తహతహపడుతున్నాడో తెలుస్తున్నది. ఆక్టియంయుద్ధంలో ఇతనికి విజయం సంప్రాప్తించింది. అది కారణంగా అతనికి తన షరతులతో ఆంటోని క్లియోపాత్రాలను శాసించే అవకాశం లభించింది. ప్రజ్ఞాబలంచేత ఏ నాడైనా ప్రజానురాగాన్ని చూరగొని ప్రపంచపాలకుడు కాగల ఆంటోనీ సజీవుడై ఉండరాదు. అదే ఇతనికి కావలసింది. కనుకనే అతణ్ణి హతమార్చటం ఒక సంధిషరతుగా క్లియోపాత్రాకు చెప్పి పంపించాడు. ఆంటోనీ ఆత్మహత్య చేసుకొన్నప్పుడు ఇతడు చూపిన దుఃఖమంతా ఇతరులను, ముఖ్యంగా క్లియోపాత్రాను, మోసగించటంకోసమే. క్లియోపాత్రాకు ప్రాణదానం చేస్తానని, ఎప్పటిలాగా రాజ్ఞినిగా పరిగణిస్తాననీ దూతను పంపించటం, అతని ఉదాత్తతవల్లగాని, పరమదయాగుణంవల్ల కాని కాదు. జీవగ్రహంగా ఆమెను పట్టుకోవచ్చి రోము పురవీధుల్లో నడిపించి, ప్రజలకు చూపించి అవమానించి, అందువల్ల తన కీర్తిగౌరవాలను విస్తరింపజేసుకోవటమే అతని 160 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఎత్తుగడలోని రహస్యం. ఈ అభిప్రాయమే థైరీయస్తోతో అతడు చెప్పిన “అవసరమైతే అఖిలాన్ని ఇస్తామని మాట ఇచ్చిరా. లేకపోతే ఉదారహృదయ ఆమె ఏ ఆత్మహత్యో చేసుకొని, మన ఉద్దేశాన్నే భగ్నం చెయ్యవచ్చు. ఆమెను రోములో నివసించేటట్లు చేయగలిగితే మన విజయానికి నిత్యప్రతిష్ఠ" అన్న మాటలవల్ల వ్యక్తమౌతున్నది. జిత్తులమారియై ఇతడెంత చేసినా, చిత్తశుద్ధితో క్లియోపాత్రా తనపతిని అనుసరించటం కోసం ఆత్మహత్య చేసుకోవటం వల్ల ఇతని నీచమైన ఊహకు భంగం కలిగింది. ఆక్టేవియస్ గౌరవనీయుడే గాని మోసకారి, నీచస్వభావుడు, గర్వి, ప్రతీకారేచ్ఛాతత్పరుడు. ఆంటోనీ ఎంతటి లోపభూయిష్ఠుడైనా ఇతనికంటే అధికుడేనని అనిపిస్తాడు. ఎనోబార్బస్ చరిత్రలో ఛాయామంత్రంగా లభించిన ఈ పాత్రను షేక్స్పియర్ ఎంతో ఘనంగా చిత్రించటంవల్ల, ఇది 'నవ్యసృష్టే' అని అనవలసి వస్తుంది. మానవత్వ స్వభావపరిశీలన దృష్ట్యా ఎనోబార్బన్ ఎంతగానో చిత్తాకర్షకమైంది. అంతే కాదు. పాత్ర నీతి ప్రతిపాదకమైంది కూడాను. నాటకంలోని పాత్రలాగానే ప్లూటార్క్ ని ఎనోబార్బస్ యోధుడు, సాహసికుడు, సత్యప్రియుడు. ఆంటోనీ అపమార్గంలో ప్రవర్తిస్తున్నాడని ఆత్మ నిశ్చయించి చెప్పినంతవరకూ అతణ్ణి అతిభక్తితో అనుసరించాడు. తాత్కాలికోద్రేకం వల్ల మధ్యలో కొంతకాలం అతణ్ణి పరిత్యజించినా, మరణసమయంలోనూ ఆ ఆంటోనీ ఉదారస్వభావాన్నే స్మరిస్తూ శోకపరిక్లిన్న హృదయంతో ఇతడు ప్రాణాలు విడిచాడు. పై సద్గుణాలతో బాటుగా రూపకంలోని ఎనోబార్బస్లో వ్యావహారిక విజ్ఞానం, అదుపెరుగని సత్యవాక్రియత్వం, మనస్విత ఇత్యాది గుణాలు సుస్పష్టరూప రేఖలతో గోచరిస్తున్నాయి. సైనికుడు కావటం చేతనో ఏమో, ఇతడు చేసే సంభాషణలో ఇంతైనా చాటు అంటూ లేదు. ఉన్నదున్నట్లుగా పలికి ఇతడు కొన్ని సందర్భాలలో ఇతరులకు ఉద్రేకం తెప్పిస్తుంటాడు. యజమానియైన ఆంటోనీని చిక్కులో పెడుతుంటాడు. ఆంటోనీ మీద అభిమానం వల్ల ఇతనికి సీజరంటే ఒక నిర్లక్ష్యం ఏర్పడ్డది. సీజర్తో ప్రసంగించేటప్పుడు ప్రసన్నమధురంగా సంభాషించమని మీ సేనాధినేతను ప్రార్థించి చెప్పమని లెపిడస్ ఇతణ్ణి కోరిన సందర్భంలో, 'మీ యోగ్యతకు ఉచితమైన రీతిగా ప్రసంగించవలసిందని ఆయన్ను ప్రార్థిస్తాను. కోపగిస్తే సీజర్ను ఆయన తప్పక నిర్లక్ష్యంతో పరికించి తీరుతాడు. జూపిటర్ మీద ప్రమాణం చేసి పలుకుతున్నాను. నాకే ఈ సీజర్ వంటి శత్రువువుంటే ఆయన యెడ నాకు గల నిర్లక్ష్యాన్ని వెల్లడించేటందుకు దానికి క్షురకర్మను గూడా కల్పించ'నన్న వాక్యాలు ఇందుకు ఆంటోని - క్లియోపాత్రా - 161 నిదర్శనాలు. సైనికుడుగా ఈతడు చక్కని అదృష్టవంతుడు. సైనికులకు తగ్గ గౌరవమిచ్చి ఆదరించి అభిమానించే ఆంటోనీ సేవలో చేరగలిగాడు. అలెగ్జాండ్రియాలో అతనితో బాటుగా సైనికప్రియాలైన అనేకవిలాసాలను అనుభవించగలిగాడు. ఆంటోని క్లియోపాత్రాల ప్రణయజీవితాన్ని ఎనోబార్బస్ కొంతగా అర్థం చేసుకున్న వ్యక్తి. అయినా ఇతనికి స్త్రీల విషయంలో అతి పనికిరాదు. వారిని విలాసవస్తువులనుగా చూచి విడిచిపెట్టవలసిందేగాని అన్ని విషయాలలో, అందులో ముఖ్యంగా రాజ్యవిషయాలల్లో, వారికి స్థానమీయటమంటే ససేమిరా ఇతనికిష్టం లేదు. ఒక రాజకార్యం జరిగితే ప్రశాంతచిత్తంతో దాని భావిఫలితాన్ని ఊహింపగల ఉజ్జ్వలమైన బుద్ధికుశలత ఈతనికుంది. 'ఇప్పుడు పరస్పరానురాగాన్ని తాత్కాలికంగా మీరు ఎరువుపుచ్చు కుంటే, పాంపేనుగురించిన మాటలు వినబడటం మానేసిన తరువాత, మళ్ళీ మీ వైమనస్యాలను త్రవ్వుకోవచ్చు' అని ఎనోబార్బన్ త్రైకూటవీరులు తాత్కాలికంగా సంధి చేసుకొంటున్న సందర్భంలో అన్నమాట అందుకు నిదర్శనాలు. స్ఫురించిన సత్యాన్ని చెప్పలేకుండా ఉండటమంటే ఇతనికెంత కష్టమో కూడా ఈ సందర్భంవల్లనే వ్యక్తమౌతుంది. ఇతడన్న విషయం సత్యమేనని ఆక్టేవియస్ అంగీకరించాడు గాని, ప్రసంగపద్దతికి మాత్రం అభ్యంతరపెట్టాడు. నటనన్నా, మోసగించటమన్నా ఎనోబార్బస్కు ఏ నాడూ నచ్చదు. ఇందుకు, ఫుల్వియా మరణవార్త విని కించిత్తుగా అంటోనీ ఖిన్నుడైన సందర్భంలో ఇతడు చేసిన ప్రసంగం ఇందుకు ఉదాహరణం. ఇతడు కొంత మొరటువాడైనా మొగలిపూల తావులు తెలియనివాడు కాదు. సౌందర్యస్థానాలను కనిపెట్టి రసదృష్టితో దర్శించి, తగిన సమీక్ష చేయగలశక్తి ఇతనికి అనంతంగా ఉంది. సిడ్నస్ నదిమీద సర్వజన చిత్తాకర్షకమైన మహనీయమూర్తితో విహరించిన క్లియోపాత్రా సౌందర్య విలాస విశేషాలను ఇతనికంటె అధికరమణీయంగా ఎవరూ చిత్రించి చెప్పలేరనటంలో ఎట్టి అతిశయోక్తి లేదు. ఎంతటివాడినైనా మంత్రముగ్ధుణ్ణి చేయగల క్లియోపాత్రా సమ్మోహన గుణశక్తినీ, కమనీయ గుణవిశిష్టుడైన ఆంటోనీ కామారాధనాతత్పరతను ఇతడు అర్థం చేసుకున్నాడు. కానీ అన్ని విషయాలలో, ముఖ్యంగా యుద్ధతంత్ర విషయంలో, అతడు ఆమెకు లొంగిపోవటాన్ని మాత్రం సహించలేడు. క్లియోపాత్రా శక్తిసామర్థ్యాలపట్ల ఇతడికి గౌరవం లేకపోలేదు. ఆమె సౌందర్యం వయసువల్ల వాడేది కాదని ఇతడు గమనించాడు. ఆమె ఉజ్జ్వల రసపిపాసయెడ కొంత సానుభూతిని ప్రదర్శించాడు. వ్యవహార ప్రధానుడైనా ఎనోబార్బస్ 162 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 వైభవప్రియుడు, అందువల్లనే ఉదాత్తుడైన అంటోనీలోని యోధాగ్రేసరత్వంతోబాటు రాజసవిలాసప్రియత్వం కూడా ఇతనికి ఇష్టగుణాలైనవి. ఆంటోనీ ఆక్టేవియాను వివాహమాడటం సూటియైన చిత్తప్రవృత్తి గల ఇతనికి ఏ మాత్రం నచ్చలేదు. కన్యాప్రదానసమయంలో ఆంటోనీ చూపించిన క్షణికోద్రేకాన్ని, ఆక్టేవియస్ ప్రదర్శించిన కృత్రిమ సోదరీప్రణయాన్ని ఇతడు నిరసించాడు. ఆంటోనీ లభించిన సహజావకాశాల నన్నిటినీ ఐచ్ఛికంగానే పోగొట్టుకొంటూ, గుప్తవనితకు దాసానుదాసుడై వర్తించటం ఆరంభించింది మొదలుగా ఆంటోనీయెడ భక్తివిశ్వాసాలీతనికి సడలనారంభించాయి. అంత అధికంగా ఇతడు ఆంటోనీయెడ అభిమాన గౌరవాలను ప్రదర్శించటానికి ఇతడి సహజావబోధ ముఖ్యకారణం. అతని గుణవిశేషాలను బుద్ధితో కూడా కొంత వివేచించకపోలేదు. ఆక్టియం యుద్ధంలో అంటోనీకి లభించిన అపజయాని కతడు క్లియోపాత్రాను నిందించలేదు. బుద్ధింకాక కాంక్ష నడిపించేటట్లు నడిచే ఆంటోనీదే దోషం అని తేల్చాడు. ఓటమివల్ల ఒడలెరుగక ఆంటోనీ ఆక్టేవియన్ ను ద్వంద్వయుద్ధాని కాహ్వానిస్తున్నప్పుడు, ఇతడు "అందుకు ఆక్టేవియస్ లభించిన అవకాశాలను అవతలపెట్టి ప్రజలు దర్శించటంకోసం ద్వంద్వయుద్ధం చెయ్యటానికి అంగీకరించ”డని ముందే నిర్ణయించాడు. అంటోనీ మానసిక గుణవిశేషాలను గూడా అదృష్టం తనవెంట నడిపిస్తున్నదని, సీజర్ ఆంటోనీ నిర్ణాయక శక్తిమీద కూడా విజయం చేకొన్నాడనీ సందర్భంలో ఇతడు పల్కిన వాక్యాలు ఇతని విషయవివేచనాశక్తికి చక్కని నిదర్శనాలు. ఎనోబార్బస్ తన యజమానిని తుదిదాకా భక్తివిశ్వాసాలతో కొలిచాడన్న మాట సత్యం. అట్టి భక్తివిశ్వాసాలను ఈతనిలో పురికొల్పగలిగిన ఆంటోనీ ఔదార్యం. అతిశయస్వామిభక్తి పరాయణుడు కావటం వల్లనే, ఇతడు ఆంటోనీ ఆప్తానుచరులైన కానెడియస్ మొదలైనవారు అతణ్ణి విడిచిపెట్టి పరపక్షంలో చేరినతరువాత కూడా, కొంతకాలం అంటిపెట్టుకొని ఉన్నాడు. విధి వ్యతిరేకమని తోచిన సందర్భంలో కూడా వీరోచితంగా పోరాడాడు. పరాజయంవల్ల కలిగిన కళవళపాటు చేత ఆంటోనీ ప్రదర్శించిన క్రోధోన్మత్తప్రవర్తనను జూచినతరువాత, అతని హృదయాన్ని త్రోసిరాజని బుద్ధి విజృంభించి అర్థరహితుడైన తన స్వామిని పరిత్యజించి పరపక్షంలో చేరిపోవాలన్న ప్రబలవాంఛ నీతనికి కల్గింది. బయలుదేరి వెళ్ళాడు గాని స్వామిద్రోహి నన్న భావం అతని హృదయాన్ని వెన్నాడి, కలత పెట్టటంతో ఇతని ఉదాత్తప్రకృతే విజయం పొందింది. ఆంటోని - క్లియోపాత్రా 163 తానొనర్చిన దోషానికి నిష్కృతి ఆత్మహననమే అన్న ఊహ పొడకట్టిన మరుక్షణంలోనే ఇతడు తన జీవితాన్ని అంత మొందించుకున్నాడు. మరణ సమయంలో "ఆంటోనీ మహాశయా! నీ మీద నా తిరుగుబాటు ఎన్ని రెట్లుగా నీచాతినీచమైందో నీవు అంతకంటే ఎన్నో రెట్లుగా మహోదాత్తుడివి. కానీ యజమానిని విడిచిపోయినవాడనీ, పటాలాన్ని వదలి పారిపోయిన సిపాయి అనీ నన్ను లోకం గుర్తించుగాక!" ఈ మొదలుగా ఇతడు పలికిన వాక్యాలు ఇతని సత్స్వభావాన్ని, మనస్వితను వెల్లడిస్తూ, స్వార్థపరులతో సమగ్రమైన ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని తుదిదాకా అనుసరించిన అనుచరుడికి అపూర్వోదాహరణమైన వ్యక్తి ఎనోబార్బస్ అని నిరూపిస్తున్నవి. పాత్రలు - స్త్రీలు క్లియోపాత్రా ఐంద్రియమైన ఆకర్షణశక్తికీ, సర్వత్రైణగుణసముదాయానికీ ప్రపంచ విఖ్యాతిగన్న అతివ క్లియోపాత్రా. ఈమె ఆంటోనీ మహాశయుని 'పురానైల్ నాగిని'. యౌవనారంభదశలో తొలుత జూలియస్ సీజరుకూ, తరువాత క్నయ్యస్ పాంపేకు ఈమె ప్రియురాలు. ఉన్నతవర్గంలోని వ్యక్తియై ఉండటంవల్ల, ఆశించిన సమస్తాన్నీ ఈమె కాముకప్రకృతి అనుభవించగలిగింది. ఆంటోనీతో ప్రథమపరిచయం కలిగేనాటికి ఈ ఇంతి వయసు ఇరువది ఎనిమిదేండ్లు. ఆంటోనీని కనుగొన్ననాటికి ఈమె సౌందర్యంలో ఇసుమంత వాడ్పు కన్పించినా సంపాదించిన బహువిధకామానుభవ విజ్ఞానం దాన్ని చక్కదిద్దింది. బాలేయమైన సౌకుమార్యానికి కలగిపోవని ఆంటోనీ ఆశించే సరసతకు ఈమె స్థానభూతమైంది. అహరహం ఆనందప్రదానం చేసే అనుక్షణపరిణతమైన చిత్తచాంచల్యం, లక్షణ విశేషాలలోని పరస్పర వైరుద్ధ్యం, వీటికి జోడైన బుద్ధికుశలత, బహుశః ఈమె రూపసౌందర్యం కంటే ఆంటోనిని అత్యధికంగా ఆకర్షించి ఉంటాయి. ఆశయోపేతమైన గార్హస్యంలోని ధార్మిక ప్రణయజీవితంవల్ల కలిగే అరతి, నిత్యమైన స్వభావమాధుర్యం వల్ల కలిగే నీరసత్వం ఆక్టేవియాను వివాహమాడిన నాటినుంచీ అతడు అనంతంగా అనుభవించాడు. అట్టివాని ఆత్మను నిత్యమూ శృంఖలాబద్దను చేయటానికి అఖిలలోకం అంగీకరించే సద్గుణాలూ నిష్ప్రయోజనాలని ఈ క్లియోపాత్రా గమనించింది. సహజావబోధశక్తివల్లనే ఈ సరసురాలు ఆంటోనీ కాంక్షించేదేమిటో కనిపెట్టగలిగింది. ఆంటోనీ క్లియోపాత్రాల ప్రణయజీవితాన్ని వివేచనతో పరిశీలిస్తే విధి వీరిని ఒకరికోసం మరొకరిని సృష్టించినట్లు 164 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 స్ఫురిస్తుంది. ఇంతటి ఆనుకూల్యంతో అధార్మికమైన ప్రణయజీవితాన్ని సాగించి, అన్యోన్యపతనానికి హేతుభూతులైన ప్రియాప్రియులు ఎంత వెదికినా గోచరించరు. వయసువల్ల వాడని సౌందర్యంతో, నిరంతర శృంగారలీలావిలాస వైవిధ్యంతో జీవితాంతం వరకూ ఆంటోనీని ఏలుకొన్న ఈ క్లియోపాత్రా షేక్స్పియర్ సృష్టి కాదు. అపురూపసౌందర్యం, భావనాబలం, బుద్ధినైశిత్యం, నిరాతంక సమ్మోహనశక్తి, నిత్యలీలానురక్తి, చలచిత్తత, విలాసమత్తత, స్తోత్రపాఠప్రియత్వం, క్షాత్రగర్వం, కాఠిన్యం, హృదయ కోమలత్వం, భీరుత్వం, సత్యప్రియత్వం - ఇత్యాది పరస్పర విరుద్ధ ప్రకృతులన్నీ చరిత్రలో క్లియోపాత్రాలోనే కన్పిస్తున్నాయి. రసికజనచిత్తానురంజనంకోసం గుణదోషాల రెంటినీ కోటికెక్కించి షేక్స్పియర్ ఈ ప్రాచ్యరాజ్ఞిని ఒక ఉజ్జ్వల రసాభినేత్రిగా రూపొందించి పునసృష్టించాడు. ఆంటోనీ, క్లియోపాత్రా కెంతగా లొంగిపోయిందీ కథారంభకాలంలోనే మనకు వ్యక్తమౌతున్నది. రోము నుంచి వచ్చిన వార్తలు తనకు ప్రీతికరాలు కావని ఊహించటంవల్లనే అతడు వార్తాహరులతో అతిగా ప్రసంగించ తలపెట్టలేదు. అశక్తుడవని దెప్పుతూ అతణ్ణి పరిహసించి ఆనందిద్దామన్న ఉద్దేశంతోనూ, ఆ రోములోని వార్తావిశేషాలను అవగతం చేసుకొందామన్న ఊహతోనూ, క్లియోపాత్రా వార్తాహరుల రాక అనే అవకాశాన్ని అమోఘంగా ఉపయోగించుకోదలచింది, బహుశః ఆంటోనీ భార్యకు అతనిమీద కోపం వచ్చి ఉండవచ్చుననీ, యువకుడైన ఆక్టేవియస్ ఏదైనా రాజకార్యాన్ని నిర్వహించవలసిందని ఆదేశించి ఉండవచ్చుననీ కొంటెగా సూచించి, వార్తలను పూర్తిగా వినితీరవలసిందేనని పట్టుపట్టింది. అణుమాత్రంగానైనా అతనిలో రోమకభావం కలిగిందేమోనన్న ఊహ స్ఫురించగానే, 'నా మాయాబంధంలో నుంచి తప్పించుకొని ఆంటోనీ ఆంటోనీ కాబోతున్నాడని చిలిపిగానే అనేసింది. అప్పటి ఈమె ప్రణయలీలావిలాసాన్ని అర్థంచేసుకొన్న ఆంటోనీ, "కలహశీలా రాజీ! నిందించటానికీ, పరిహసించటానికీ, రోదించటానికీ నీకు ఉపయోగించనివంటూ లేవు. నీ భావోల్బణాలలో ప్రతి ఒక్కటీ మనోహరియై నాకు మాననీయమౌతుంటుంది” అన్న సంభాషణలో భంగ్యతరంగా మెచ్చుకొన్నాడు. ఆంటోనీ ఈమెకు లొంగిపోవటమే కాదు ఈమె కూడా అతనికి లొంగిపోయింది. వార్తాహరులు వెళ్ళిపోయిన తరువాత అనతికాలానికే అతని 'స్వల్పకాల వియోగాన్ని' సహించలేక ఈమె చూపిన ప్రవర్తనే ఇందుకు సాక్ష్యం. ఆంటోని - క్లియోపాత్రా 165 ఆ సందర్భంలో అంటోనీని పిలుచుకొరమ్మని ఛార్మియన్ను తరిమి పంపిస్తూ "తీవ్రాలోచనా నిమగ్నుడై ఉన్నట్లు కన్పిస్తే నేను నృత్యం చేస్తున్నాననీ, వినోదిస్తుంటే హఠాత్తుగా నాకు సుస్తి చేసిందనీ" చెప్పమన్నది. ఇట్టి ప్రవర్తనతో ఈ రాజ్ఞి ఆంటోనీని సంపూర్ణంగా పోగొట్టుకొంటుందని భయపడ్డ ఛార్మియన్, "ఆయన నిన్ను మనసారా ప్రేమించేటట్లు చేసుకొనే మార్గాన్ని నీవు అనుసరించటం లేదు. సర్వవిషయాలలోనూ ఆయనకు లొంగిపో. ఎందుకూ అభ్యంతరం చెప్పకు” అని సలహా చెప్పింది. ఉదాత్తమానవ హృదయభావ పరిశీలనంలో ప్రౌఢ అయిన ఈ క్లియోపాత్రా, హీనబుద్ధియైన ఛార్మియన్ సూచించిన దాస్యప్రణయాన్ని గురించి "ఆయన్ను కోల్పోవటానికి నీ మార్గం మహా మంచిది” అన్నది. తరువాత ఒకవంక ఆంటోనీ వస్తుంటే చూడనట్లు నటించి వెళ్ళిపోయింది. అనతికాలానికే కలుసుకొన్నప్పుడు జబ్బువల్ల కసరుబోతైనట్లు నటించ నిశ్చయించింది. ఆంటోనీ ప్రథమ వాక్యమే అతడు ఈజిప్టును విడిచి వెళ్ళిపోవటాన్ని సూచించటంవల్ల క్లియోపాత్రా తొలుత మూర్ఛను, తర్వాత తెప్పరిల్లటాన్ని అభినయించి అపస్మారకంగానూ వ్యంగ్యంగానూ దూషణమారంభించింది. 'నావలె ఇంతటి మహత్తరమైన మోసానికి పాలైన మహారాజ్ఞి మరొకతె లేనేలే దని తన్ను గూర్చి పలికింది. 'మిథ్యాప్రణయజీవి'వని సంబోధించి ఫుల్వియా మరణవార్తను అతిప్రశాంతంగా భరిస్తున్న కృతఘ్నతకు అతణ్ణి నిందింప నారంభించి, 'ఫుల్వియా మరణవార్తను నీవు గ్రహించే రీతినిబట్టి తెలిసింది. ఇప్పుడు తెలిసింది. నా మరణవార్తను గూడా నీవు ఎలా స్వీకరిస్తావో ఇపుడు తెలిసింది' అన్నది. ఫుల్వియామృతికి అభినయపూర్వకంగానైనా దుఃఖించటం ధర్మమని ప్రార్థించి, అతడినొక మహానటుడవనీ, ప్రణయ పారిశుద్ధ్యం లేని వ్యక్తివనీ ఏమేమో పలికి కోపం తెప్పించింది. అతని కోపం ఆమెకో ఉల్లాసమైంది. చివరకు ఆంటోనీ తప్పక రోముకు వెళ్ళి తీరవలసిన పరిస్థితి ఉందని గమనించటంచేత, మనఃస్థితిని మరుక్షణంలోనే మార్చివేసి సమస్త సౌహార్దాన్నీ ప్రకటించి, ప్రియాలైన వీడ్కోలు వాక్యాలు పలికింది. ఆంటోనీ రోముకు వెళ్ళినతరువాత అతడు లేని ఏకాంతత క్లియోపాత్రా హృదయాన్ని కలవరపెడుతుంటే, అతని చేష్టాదికాన్ని మధురాతిమధురంగా భావిస్తూ పూర్వప్రణయస్మృతులతో కాలం వెళ్లబుచ్చుతున్న సమయంలో అతని దగ్గిరనుంచి వార్త వచ్చింది. అతడు ఆక్టేవియాను వివాహమాడిన విషయాన్ని విన్నవించేటంత వరకూ మహోల్లాసంతో వింటున్న ఈమె, హఠాత్తుగా కళవళపాటును పొందింది. అట్టి 166 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 దుర్వార్తను తెచ్చిన వార్తాహరిని ఒడలు మరిచి తిట్టింది, కొట్టింది. ఇంకా వినవలసింది ఎంతో ఉన్నా ఎదుటినుంచి తరిమివేసింది. క్షుభితమైన చిత్తాన్ని చిక్కబట్టుకొని మరుక్షణంలోనే ఆక్టేవియా సౌందర్యాధికాలను గురించి తెలిసికో రమ్మని పరిచారికను పంపించింది. మళ్ళీ స్వయంగా వార్తాహరివల్ల తానే తెలుసుకోవాలన్న ఊహ కలిగి పిలిచింది. ఎన్నెన్నో ప్రశ్నలు వేసి ఆమెతో ఆంటోనీ బహుకాలం కాపురం చెయ్యడని నిశ్చయించి, దెబ్బతిన్న తన హృదయానికి ఊరట చెప్పుకొన్నది. తిరిగి వచ్చిన ఆంటోనీ క్లియోపాత్రాను కలుసుకొని ధార్మికమే అయినా ఆక్టేవియా చూపిన శీతలప్రణయానికి భిన్నమూ, అనంతవైవిధ్య గుణోపేతమూ అయిన ప్రేమను ఈమెవల్ల అనుభవించి వెనుకటికంటె అధికంగా ఈమెకు దాసుడైనాడు. ఆక్టియం యుద్ధభూమిలో ఈమె ఉండడంవల్ల ఆంటోనీ బుద్ధికి వ్యగ్రత కలుగుతుందన్న భావంతో అతని ఆప్తానుచరుడైన ఎనోబార్బస్ వ్యతిరేకించినప్పుడు, ఈమె అతణ్ణి లక్ష్యపెట్టలేదు. ఆ సందర్భంలో ఆంటోనీ ఈమె ఇచ్ఛానుసారంగా సాగనీయటమే కాకుండా, ఈమె విలాసేచ్ఛననుసరించి ఆక్టోవియస్తో సముద్రంమీదనే యుద్ధం చేయడానికి అంగీకరించడం, ఎనోబార్బస్, కానెడియస్ ఎంత వేడుకొన్నా వినిపించుకోకపోవటం, అట్టి క్లిష్టస్థితిలో కూడా ఈ ఈజిప్టుకాముకి అతనిమీద ఎంతటి పరమాధికారాన్ని నెరపుతున్నదో ఊహించటానికి ఉదాహరణలు. ఈ సందర్భంలోనే కానెడియస్ “మన సేనాధినేత నామె అలా నడుపుతున్నది. మనమంతా స్త్రీలకు సేవకులమైనాము” అన్నాడు. యుద్ధంలో ఈమె భీరుత్వం వల్ల ఓటమి సంప్రాప్తించినపుడు క్షణకాలం ఆంటోనీ క్రోధోన్ముద్రితుడైనాడు. అట్టి అతణ్ణి మళ్ళీ ఎలా వశం చేసుకోవాలో ఈమె ఎరగంది కనుకనా! స్త్రైణమైన దుఃఖాస్త్రాన్ని ప్రయోగించింది. అతడు దాసుడై అన్నాడు : 'నీ విషాదాశ్రుబిందువు నొకదానినైనా చిందనీయకు. అది నేను జయించి కోల్పోయిన సర్వస్వంతో సమానమైన మూల్యం కలది. ఏదీ ఒక ముద్దు. ఇదైనా చాలు. నే కోల్పోయిన సర్వస్వాన్నీ తిరిగి చెల్లిస్తుంది.' ఆక్టేవియస్తో జరిగిన సంధిసంప్రదింపుల సమయంలో తిరిగి ఆంటోనీ పూర్వౌన్నత్వాన్ని సంపాదించలేడన్న నిశ్చయంవల్లనో, కాదని పట్టుబడి వెనువెంటనే కష్టాలపాలు కావలసి వస్తుందన్న భయంవల్లనో లొంగినట్లు అభినయించి మోసగిద్దామన్న ఆలోచనలవల్లనో ఈజిప్టురాజ్ఞి అతడు చెప్పి పంపిన సంధిషరతులకు అణుమాత్రమైనా అడ్డుచెప్పక అంగీకరించింది. బాలుడైన సీజర్ దగ్గరికి ఆంటోనీ నెరసిన తలను గూడా పంపించటానికి ఒప్పుకొన్నది. ఇంతటి కృతఘ్నురాలా మరి? దూతగా వచ్చిన ఆంటోని - క్లియోపాత్రా 167 థైరీయసు ముద్దిడుకోటానికని తన మృదుహస్తాన్ని అందించింది. మోసగించనేనా? అది ఆంటోనీ ప్రణయపూర్వకంగా ముద్దిడుకొనే హస్తం. థైరీయస్ క్లియోపాత్రా హస్తాన్ని ముద్దిడుకోటమన్న దృశ్యాన్ని చూచి సహించలేక ఆంటోనీ అతణ్ణి కొరడా దెబ్బలు కొట్టించినప్పుడు, తెలివితక్కువతనం వల్ల తానట్టిపని చేసినట్లు నటించి తన ప్రణయ మచంచలమైందని ప్రకటించి, మానసిక వ్యథ ననుభవిస్తున్న అతడికి తాత్కాలికచిత్తశాంతిని చేకూర్చింది. తరువాత యుద్ధానికి బయలుదేరేటప్పుడు స్వయంగా కవచధారణ చేయించి పంపించింది. మరుసటియుద్ధంలో కూడా క్లియోపాత్రా పారిపోయిరావటం పిరికితనం వల్లనేగాని, మోసగించను కాదు. ఆంటోనీ తరువాత ఏమి చేస్తాడో అన్న భయంవల్లనే తన సమాధినిర్మాణాన్ని చేరుకొని అందులో దాగుకోటం, మరణించినట్లు అతనికి వార్త పంపించటం జరిపించింది. ఆంటోనీ మరణసమయాన తన ప్రేమసర్వస్వాన్ని ఒక్కుమ్మడిగా కుమ్మరించి పరమానందంతో ప్రాణాలను వీడే అవకాశాన్ని అతడికి కల్పించింది. ప్రాణాలతో పట్టుకోబోయి పరాజిత అయిన తనను ఆక్టేవియస్ రోము పురవీధుల్లో ప్రదర్శించి అవమానిస్తాడని బుద్ధికుశలతవల్ల ఎన్నడో ఈమె కనిపెట్టింది. ఆత్మహత్యా మార్గాన్నే ఈమె అనుసరించి, తన 'ప్రియభర్త'ను చేరుకోటానికి ఈమె చిత్తాన్ని సంసిద్ధం చేసుకొన్నది. పురుగుచే కరిపించుకొని ప్రాణపరిత్యాగం చేసే సమయంలో, ఆమె వెల్లడించిన ఉల్లాసోజ్జ్వలాలైన మధురోహలు రసికలోకానికి ఏ నాటికీ మరుపురానివైనవి. ఈ సమయంలో క్లియోపాత్రా ప్రదర్శించిన ప్రణయప్రవర్తనరీతులు సమస్తదోషాలనూ క్షాళితంచేసి ఆమెచేత రూపొందిన కవితలా వర్తింపజేశాయి. మరణానంతరమైనా తన సమ్మోహనశక్తిని కోల్పోని ఈ ఈజిప్టురాజ్ఞిని తిలకించి 'తన సౌందర్యమనే సమ్మోహనవిద్యతో మరో ఆంటోనీని నిబద్ధుణ్ణి చేయటానికో అన్నట్లు ఈమె నిద్రపోతున్నది' అన్న ఆక్టేవియస్ అభిప్రాయం, మరణం వల్ల కూడా ఒక మనోహరవిజయాన్ని సాధించిన క్లియోపాత్రాకు కీర్తిగీతికలా ఒప్పుతున్నది. ఆక్టేవియా చరిత్రలోని ఆక్టేవియా అపురూపసుందరి. మనోహరమూర్తి. వివేకవతి. నిత్యసత్యప్రియ. పతిభక్తి తత్పర. తనను పరిత్యజించి ఆంటోనీ అలెగ్జాండ్రియాకు వెళ్లిన తరువాత, ఈమె అన్న ఆజ్ఞకు భిన్నంగా ఆంటోనీ ఇంటిలోనే ఒంటిగా ఉంటూ 168 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 అతడివల్ల తనకు కలిగిన సంతానాన్నీ, అతడికి ఫుల్వియావల్ల కలిగిన సంతానాన్నీ సమానప్రేమతో పోషించి, పాలించిన మహోదార. ఆంటోనీ క్లియోపాత్రాల మరణానంతరం వారి సంతానాన్ని కూడా ఈమే ప్రేమతో సాకిందట! కానీ షేక్స్పియర్ చరిత్రలోని ఇట్టి ఆక్టేవియాను సహజరూపగుణాలతో చిత్రించలేదు. క్రీడారతుడనీ, విలాసలోలుడనీ, కామప్రవృత్తుడనీ, చలచిత్తుడనీ ఖ్యాతిగన్న ఆంటోనీకి, ఒకానొక రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి అన్న తన్నిచ్చి వివాహం చెయ్యటానికి నిర్ణయిస్తే అవును కాదనకుండా అంగీకరించిన గుణవతినిగా నాటకంలో షేక్స్పియర్ ప్రథమతః ఈమెను ప్రవేశపెట్టాడు. ఆంటోనీ ఆక్టేవియస్ల మధ్య మహాఘనాలుగా కన్పించే అల్పవైమనస్యాలు, ప్రమాద పరిస్థితులను వెంటబెట్టుకొని ఉన్నట్లు తోచే గాఢభయాలు, ఈమె వివాహంతో అంతరించి అంతర్ధానమౌతాయని ఇరువురికీ ఆప్తులైన కొందరు ఊహించారు. కానీ వివేచనశీలియైన ఎనో బార్బస్ ఊహించినట్లే ఈ వైవాహిక బంధమే అల్పకాలంలో వారిరువురి మైత్రికీ ఉరిత్రాడైంది. రాజకీయ కారణాల వల్ల ఏథెన్సుకు వెళ్ళుతున్న ఆంటోనీని అనుసరించే సమయంలో ఈమె కంటతడి పెట్టింది. హృదయభావాలను పలుకటానికీమె నాలుక తిరస్కరించింది. భర్తననుసరించటం, అన్నతోనే ఉండటం అన్న పరస్పర విరుద్ధాలైన ఈమెలోని హృదయోద్వేగాలు ఉన్నతాలైన ఆటుపోటులమీద నిశ్చలంగా వంచి నిలిపిన హంసపక్షాలలాగా చలనరహితతను వహించాయి. తుదకీమె 'భర్తృగృహాన్ని భద్రంగా చూస్తుండవలసిందని' అన్నతో చెప్పి అతని శుభాకాంక్షలతో భర్తను అనుసరించింది. ఆంటోనీ ఆక్టేవియస్ పరస్పర యుద్ధసన్నద్ధులైనారన్న విషయాన్ని విన్న తరువాత, చెదిరిన వారి స్నేహాన్ని చక్కదిద్దటంకోసం దౌత్యభారాన్ని తలపై కెత్తుకొని రోముకు వచ్చినప్పుడు సాధుస్వభావి అయిన ఆక్టేవియా మళ్ళీ మనకు కన్పిస్తుంది. ఈ దౌత్యానికి పూనుకోబోయే ముందూ, వెనుకా ఈమె ఇరువురిమధ్య వైమనస్యా లేర్పడ్డందుకు ఎంతో తత్తరపాటును ప్రదర్శించింది. అన్నను గురించి విన్న వార్తల నన్నింటినీ నమ్మవద్దనీ, నమ్మవలసి వచ్చినా మనస్సుకు పట్టించుకోవద్దనీ వారిరువురి మధ్య యుద్ధాలు ప్రపంచాన్ని ద్విధాకరిస్తే ఆ రెండుఖండాలమధ్య ఏర్పడే పగుళ్ళను పూడ్చటానికి ఆ యుద్ధాలలో మృతులయ్యే మానవులను ఉపయోగించవలసి ఉంటుంది. భర్తతో సమయజ్ఞతను, నీతిని ప్రదర్శిస్తూ ఎంతగానో చెప్పింది. తన ఉన్నతికి అనుగుణంగా ప్రణయపూర్వకమైన స్వాగతాన్ని పలికే అవకాశమీయకుండా ఆంటోనీ తరిమివేస్తే, అతిసామాన్య వనితలా వచ్చావని కోపించిన అన్నతో, తనను అలా వెళ్ళమని ఆంటోని - క్లియోపాత్రా 169 ఎవరూ నిర్బంధించలేదనీ, ఆంటోనీని అభ్యర్థించి తానే వచ్చాననీ చెప్పి, భర్తమీద అతడు ఆరోపించిన దోషాన్ని తొలుతగా తొలగించివేసింది. తరువాత ఆమె అన్నతో చేసిన ప్రసంగంలో ఈ ఆక్టేవియా తన ఉత్తమ స్త్రీజనసహజమైన ప్రతిభను, ప్రేమను ప్రదర్శించింది. అవకాశం చిక్కింది గదా అని ఆంటోనీని హతమార్చటానికి అన్న నిర్ణయించినప్పుడు 'పరస్పరవిద్రోహాన్ని తలపెట్టుకొన్న ఇరువురు స్నేహితులయెడ సమంగా హృదయప్రేమను పంచియిచ్చిన నేనెంతటి అదృష్టహీన’నని వాపోయింది. సౌందర్యం, సాధుస్వభావం, వివేకం, పావిత్ర్యం ఈ ఆక్టేవియాలో పుంజీభవించి ఉండటంవల్లనే, ఈమెను ఆంటోనీ వివాహమాడాడని విన్న మరుక్షణంలో ఈర్ష్యాళువై క్లియోపాత్రా ఆందోళనపడ్డది. అతిశీతలస్వభావ నిత్యవర్తనలో అతిస్తబ్ధ అని క్రమక్రమంగా తెలిసికొని 'అయితే ఆంటోనీ ఈమెతో బహుకాలం కాపురం చెయ్యడు' అని నిశ్చయించుకొన్నదాకా శాంతి వహించలేదు. 'ఇట్టి స్త్రీ భార్యగా ఉండటాన్ని కోరుకోనివాడంటూ ఎవడైనా ఉంటాడా?". 'ఉండకేం? ఆ స్వభావాలు లేనివాడు అట్టి వనితను భార్యగా కోరుకోడు. మార్క్ ఆంటోనీ అటువంటివాడు. అతడు తిరిగీ తన ఈజిప్టు వంటకం దగ్గిరికే చేరుకొంటాడు' ఒకప్పుడు మెనాస్ ఎనోబార్బన్ల మధ్య ఆక్టేవియాను గురించిన ప్రసంగం ఇలా నడిచింది. తాత్కాలిక శాంతికోసం ఆంటోనీ ఆక్టేవియాను వివాహమాడాడు. తరువాత పరిత్యజించాడు. నాటకంలో తగిన స్థానమిచ్చి షేక్స్పియర్ ఆక్టేవియా పాత్రను పోషించలేదని కొందరు విమర్శకుల అభిప్రాయం. ఈ నాటకంలో ఆ మహాకవి ప్రధానంగా చూపదలచుకొన్నది ప్రధానపాత్రలైన ఆంటోనీ క్లియోపాత్రల అధర్మ ప్రణయం, దానివల్ల కలిగిన దుష్ఫలితాలు. ప్రేమ లేని వివాహం వైరానికే కారణమౌతుందని ప్రాసంగికమైన ఆక్టేవియా వివాహకథ వల్ల తెలియజేయ తలపెట్టిన షేక్స్పియర్కు, ఆక్టేవియాను మరొకరీతిగా చిత్రించే అవకాశంలేదు. అందువల్లనే ఆమె భర్తయైన ఆంటోనీ గార్హస్థ్యజీవితంలోకి చొచ్చుకొనిపోలేకపోయింది. కనుకనే ఆక్టేవియా నాటకంలో అచంచల పతిభక్తి గల అతివగా కాక స్వార్థపరురాలైన సోదరిలా మిగిలిపోయింది. 170 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 పురుషులు మార్క్ ఆంటోనీ ఆక్టేవియస్ సీజర్ పాత్రలు

త్రికూటమిసభ్యుడు ఎయి మిలియస్ లెపిడస్ : 77 ఎనోబార్బస్, వెంటిడియస్, స్కారస్, డెమిట్రియస్, ఐరోస్, డెర్సిటాస్, ఫిలో ఆంటోనీమిత్రులు, ఆప్తానుచరులు. మెకన్నాస్, ఆగ్రిప్పా, డోలబెల్లా, ప్రొక్యులెయ్యస్, థైరియస్ గాలస్ - సీజర్ మిత్రులు, ఆప్తానుచరులు మోనాస్, మెనక్రేటిస్, వర్రియస్ - పాంపేమిత్రులు, ఆప్తానుచరులు, టారస్ కానెడియస్ సిలియన్ యూఫ్రోనియస్ సీజర్ సేనాపతి

ఆంటోనీ సేనాపతి

వెండియన్ సైన్యంలో ఒక అధికారి

సీజర్ దగ్గరికి ఆంటోనీ పంపించిన దూత ఎలెగ్జాస్, మాడ్రియన్ (కొజ్జా), సెల్యూకస్, డయొమిడిస్ లు క్లియోపాత్రా అనుచరులు. ఒక శకునజ్ఞుడు, ఒక విదూషకుడు స్త్రీలు క్లియోపాత్రా

ఈజిప్టురాజ్ఞి ఆక్టేవియా

సీజర్ సోదరి, ఆంటోనీ భార్య

ఛార్మియన్, ఐరాస్ క్లియోపాత్రా పార్శ్వవర్తినులు ఉద్యోగులు, సైనికులు, వార్తాహరులు, ఇతర పరిచారకగణం. ఆంటోని - క్లియోపాత్రా 171 ప్రథమాంకం ఒకటో దృశ్యం అలెగ్జాండ్రియా, క్లియోపాత్రాప్రాసాదంలో ఒక కక్ష్య. డెమెట్రియస్, ఫిలో ప్రవేశిస్తారు. ఫిలో : మన సేనాధినేత, కామలౌల్యం విజ్ఞానహీనమై మేరలు మీరిపోయింది. మోహరించి నిలిపిన సైనికనికాయాల మీద పూతమెఱుంగు కవచాన్ని ధరించి కాంతిపుంజాలను పుక్కిలించే అతని నేత్రాలు, నేడు ఆ కపిలవర్ణ' ముఖాన్ని కడుభక్తితో సేవిస్తున్నవి. సమరభూముల్లో శత్రువులయెడ తలపడి తారసిల్లేటప్పుడు వక్షఃస్థలంమీది కవచబంధాలను బ్రద్దలుకొడుతూ ఉచ్ఛాసనిశ్వాసాలు చేసే అతని అగ్రేసరహృదయం ఇప్పుడు అదుపుతప్పి ఒక జిప్సీ' కామాగ్నిని చల్లార్చే పాణింధమమూ, ప్రకీర్ణకమూ ఔతున్నది. 2 (తుత్తారధ్వనులు. ఆంటోనీ, క్లియోపాత్రా, ఆమె స్త్రైణమూ, పరివారమూ, కొజ్జాలు ఆమెకు వృంతాలను విసురుతూ ప్రవేశిస్తారు.) వాళ్ళెక్కడికి వస్తున్నారో గమనించు. ఏ సూక్ష్మాంశమూ నీ దృష్టిని తప్పించుకోరాదు. రోమక సామ్రాజ్యానికి తృతీయస్తంభమైన ఒక మహావ్యక్తి ఎలా ఒక బంధకి పరివారగణంలో ఒకడుగా లీనమైపోతూ పరివర్తన పొందుతున్నాడో, అతడిలో నీకు గోచరిస్తుంది. అతిశ్రద్ధతో పరిశీలించు. క్లియోపాత్రా : నాయెడ మీకున్నట్లుగా ప్రకటిస్తున్నదంతా ప్రేమే అయితే దాని విస్తృతి ఎంతో వెల్లడించు. ఆంటోనీ : పరిమితిని పరిగణించటానికి లొంగే ప్రణయం పరమదరిద్ర మైంది. క్లియోపాత్రా : నీ ప్రేమకు నేనో అవధిని కల్పించాలి గదా! ఆంటోనీ : అయితే నీవొక నవ్యస్వర్గాన్ని సంపాదించాలి నూతనభూతలాన్ని సృజించాలి. ఒక పరిచారకుడు ప్రవేశిస్తాడు. ఆంటోని - క్లియోపాత్రా 173 పరిచారకుడు : ఉదాత్తప్రభూ! రోమునుంచి వార్తలు వచ్చాయి. ఆంటోనీ : అతిగా చెప్పి విసిగించకు. సంగ్రహంగా కానీ. క్లియోపాత్రా : ఆంటోనీ! అలా కాదు. వాటిని పూర్తిగా వినితీరాలి. బహుశః నీమీద ఫుల్వియాకు కోపం వచ్చి ఉండవచ్చు. "ఈ రాజకార్యాన్ని నిర్వహించు, ఆ రాజ్యస్వాతంత్ర్యాన్ని హరించు. ఈ రాజ్యానికి స్వేచ్ఛాప్రదానం చెయ్యి. ఆ కృత్యాన్ని నెరవేర్చకపోతే నిన్ను హతమారుస్తాను" అని అంకురించే శ్మశ్రువుగల యువకుడైన సీజర్ నిన్ను ఆజ్ఞాపించి ఉండవచ్చు. ఆంటోనీ : ప్రియా! ఏమంటున్నావు? క్లియోపాత్రా : అంతే కాదు. బహుశః, ఏమిటి? జరగవచ్చు కూడాను. బహుకాలం ఇక ఇక్కడ నీవు ఉండటానికి అతడి అంగీకారం ఉండకపోవచ్చు. సీజర్ నిన్ను పదవీచ్యుతుణ్ణి చేసి వుండవచ్చు. కాబట్టి, ఆంటోనీ! అదేమిటో విను. ఏవీ ఫుల్వియా ఆదేశాలు కాదు, సీజర్ ఆదేశాలు. పొరబాటు ఇరువురి ఆదేశాలు. వార్తాహరులను ప్రవేశపెట్టు. నీవు ఎఱ్ఱబారిపోతున్నావు ఈజిప్టుకు నేను రాజ్ఞాని అయి ఉండటం ఎంత సత్యమో ఇది అంత సత్యం. రక్తం నీ కపోలసీమల్లోకి చిమ్ముకుంటూ వచ్చి సీజర్కు సామంతాన్ని నెరపుతూ ఉన్నది. లేదా ఆ కీచుగొంతుక గల ఫుల్వియా తిడుతుందేమోనని భయంతో కప్పం చెల్లిస్తున్నది. వార్తాహరులేరీ? ఆంటోనీ : రోము మహానగరాన్ని టైబర్' నదిలో కలిసిపోనీ! ఘనవినిర్మితమైన రోమకమహాసామ్రాజ్య ధనురాకారాన్ని ఒరిగి సురిగిపోనీ!! నా నివాసభూమి మాత్రమిదే. మహారాజ్యాలు మృణ్మయాలు. జంతువులనూ, మానవులనూ సమానంగా సాకే భూమి భావింపదగ్గదే కాదు, సమస్తజీవితంలో మహోదారమైంది ధనసంపాదన కాదు. అధికారార్జన అంతకంటే కాదు అది పరస్పర ప్రణయప్రదానం. లోకంలో అన్యోన్యానురాగం ఉన్న దంపతులంటూ ఎవరైనా ఉంటే, వ్యతిరేకించి అట్టివారు మీరు కాదనటంవల్ల కలిగే శిక్షను కూడా ధిక్కరించి, ఈ విషయంలో మాకు సాటైనవారు లేరని సర్వప్రపంచానికి చాటుతాను. క్లియోపాత్రా : మహామనోజ్ఞమైన అసత్యం! అయితే ఫుల్వియాను ఎందుకు వివాహమాడావు? ఎందుకు ప్రేమించలేదు? వెళ్లిదాన్ని కాని నేను నీ మాటలు నమ్మితే వెట్టిదాన్నౌతాను. ఫుల్వియా మోహపాశాలలోనుంచి తప్పించుకొన్నట్లే, అనతికాలంలో నా మాయాబంధంలో నుంచి కూడా తప్పించుకొని ఆంటోనీ ఆంటోనీ కాబోతున్నాడు. 174 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఆంటోనీ : నీ మాట నిజం! అయితే ఆంటోనీ క్లియోపాత్రా ఉద్బోధక మైనప్పుడే ఆ ఆంటోనీ కాగలడు. ప్రణయాధిదేవత ప్రశస్తకాలాన్ని మన మీ మల్లగుల్లాలతో వ్యర్థం చెయ్యవద్దు. ఏదో విలాసం లేకుండా గడిపివేయటానికి యోగ్యమైన క్షణం మనకు ఒక్కటైనా లేదు. ఈ రాత్రికి మరి మన విలాసం ఏమిటి? క్లియోపాత్రా : ఆ వార్తలు విందాం. ఆంటోనీ : సిగ్గు, సిగ్గు! కలహశీలా రాఖీ! నిందించటానికీ, పరిహసించటానికీ, రోదించటానికీ, నీకు ఉపయోగించనివంటూ లేవు. నీ భావోద్వేగాలలో ప్రతి ఒక్కటీ మనోహరమై నాకు మాననీయ మౌతుంటుంది. నీ వార్తాహరులు తెచ్చేవితప్ప నేను మరి యే యితరులవల్లా ఎట్టి వార్తలనూ వినదలచలేదు. ఈ నాటి రాత్రి మనమిద్దరం ఏకాంతంగా నగరవీథుల్లో సంచారంచేసి ప్రజల గుణవిశేషాలను పరిశీలిద్దాం. లే. రాఖీ! జ్ఞప్తికుందా, గడిచిన రాత్రి నీవు నన్నిదే కోరిక కోరావు. - ఇక మీరు మాతో సంభాషించవద్దు. (ఆంటోనీ, క్లియోపాత్రా వారి పరివారాలతో నిష్క్రమిస్తారు) డెమిట్రియన్ : ఏమిటి? ఆంటోనీ సీజర్ను ఇంత చులకనగా భావించాడా? ఫిలో : ఆర్యా! ఆంటోనీ అంటోనీగా లేని కొన్ని సందర్భాలలో సహజసిద్ధమైన అతడి మహోదారప్రవర్తన లోపిస్తుంటుంది. డెమిట్రియస్ : అతణ్ణిగురించి అసత్యవాది అని రోములో అబద్ధాలు చెప్పేవారి మాటలు ఆంటోనీ సత్యాలనిపిస్తున్నందుకు నాకెంతో విచారం కలుగుతున్నది. అతడు రేపటికైనా కొంతగా సత్ప్రవర్తనను ప్రదర్శిస్తాడని ఆశిస్తున్నాను. శుభమగుగాక! (నిష్క్రమిస్తారు.) రెండో దృశ్యం మరొక కక్ష్య, ఛార్మియన్, ఐరాస్, ఎలెగ్జాస్, ఒక జోస్యుడు ప్రవేశిస్తారు. ఛార్మియన్ : ఎలెగ్జాస్, మధురమూర్తీ! సర్పరూప, ఎలెగ్జాస్!! సర్వ పరిపూర్ణుడా ఎలెగ్జాస్!! మహారాజ్ఞి ముందు అంతఘనంగా పొగిడానే ఆ జోస్యుడెక్కడున్నాడు? ఎలెగ్జాస్ : జోస్యుడా? ఆంటోని - క్లియోపాత్రా 175 జోస్యుడు : మీకేం కావాలి? ఛార్మియన్ : అతడితడేనా? భవిష్యజ్ఞానంకలవారు మీరేనా? జోస్యుడు : ప్రకృతిగుప్తతంత్రంతో నాకు కొంత పరిచయముంది. ఎలెగ్జాస్: ఆయనకు నీ చేయి చూపించు. ఎనోబార్బస్ ప్రవేశిస్తాడు. ఎనోబార్బస్: ఆలస్యం చేయక విందును తీసుకో రా. క్లియోపాత్రా ఆరోగ్యం కోసం త్రాగటానికి మనకు మరింత ద్రాక్షారసం ఉండాలి సుమా! ఛార్మియన్: అయ్యా! మీరు నాకు మంచి అదృష్టాన్ని దయ చేయించాలి. జోస్యుడు : దాన్ని నేను సృష్టించలేను. ఉన్నదాన్ని కొంత ముందుగా చూడగలను. అంతే. ఛార్మియన్ : అయితే దయ ఉంచి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడండి. జోస్యుడు : ఇప్పుడున్న దానికంటే ముందెంతో సుందరంగా ఉంటావు. ఛార్మియన్ ఇంతకంటే మంచిరూపం కలుగుతుందని ఆయన అభిప్రాయ మనుకొంటాను. ఐరాస్ : కాదు కాదు. వృద్ధాప్యంలో పొడిని పులుముకొంటావని. ఛార్మియన్ : అటువంటి పూత అవసరమయ్యేటట్లు ముడతలు పడకుండుగాక! ఎలెగ్జాస్: ఇలా అనుమానించి ఆయన భవిష్యజ్ఞానాన్ని అలయించకు, శ్రద్ధగా విను. ఛార్మియన్ : ఇక చాలించండి. జోస్యుడు : ప్రేమింపబడేదానికంటే నీవే ఎంతో ఎక్కువగా ప్రేమిస్తావు. ఛార్మియన్ : ప్రేమింపబడటమనే బాధను భరించటానికి తప్పత్రాగి నా కార్టానికి వెచ్చదనాన్ని చేకూరుస్తాను. ఎలెగ్జాస్ : ఇలా ఆయన చెప్పేదాన్ని చెదరగొట్టకు. విను. ఛార్మియన్ : ఏమిటి, ఏదైనా మంచి అదృష్టం గోచరించిందా? ప్రజ్ఞావిశేషాన్ని ప్రదర్శించి అద్భుతంగా అభిజిద్వేళల్లో ముగ్గురు రాజులను పెళ్లాడి ముగ్గురికీ విధవనుగా 176 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మిగిలిపోతానా? ఏబదిఏళ్ల వయసులో జూరీ హీరాడ్ ను లొంగదీసే కొడుకును కనేట్టు చెయ్యండి. ఆక్టేవియస్ సీజర్ను పరిణయమాడి నా యజమానురాలితో సమానమైన సాంఘికగౌరవం పొందేటట్లుగా చెయ్యండి. జోస్యుడు : ఏ ప్రభ్విని ఈ నాడు సేవిస్తున్నావో ఆమె మరణానంతరంకూడా నీవు సజీవవుగానే ఉంటావు. ఛార్మియన్ : మనోజ్ఞమైన విషయం. దీర్ఘకాలజీవితమంటే నాకు అత్తిపళ్ల మీద కంటే అమితాసక్తి. జోస్యుడు : అనుభవించనున్న అదృష్టంకంటే అనుభవించిందే మిక్కిలి మనోహరమైందిగా నాకు తోస్తున్నది. ఛార్మియన్ : అంటే, బహుశః నాకు కలిగే సంతానం తండ్రులెవరో తెలియక పేర్లు లేకుండా ఉంటారన్నమాట! అయ్యా, సెలవీయండి వారిలో మొగవెధవ లెందరు? ఆడముండలెందరు? జోస్యుడు: నీవు కోరిన కోరికల్లా గర్భాన్ని ధరించి ఫలిస్తే పదిలక్షలమంది. ఛార్మీయన్ : మూర్ఖుడా! ఇక నడు! ఇంతకంటే నీవు బాగా భవిష్యత్తును చూచి చెప్పలేవు కనుక మాంత్రికురాలిని చేసినట్లు నిన్ను మంటలపాలు చేస్తానని భయపడకు. ఇక చాలు. ఐరాస్ భవిష్యత్తు ఎలా ఉందో చెప్పు చూతాం. ఎలెగ్జాస్ : మా భవిష్యత్తులు ఎలా ఉంటాయో మాకు తెలియనే తెలుసు. ఎనోబార్బస్ : నా అదృష్టంలో, నా బోటి ఇతరుల అదృష్టంలో ఏముంటుంది, తప్ప త్రాగి నిద్రపోవటం తప్ప? ఐరాస్ : ఇతరాలను వేటిని తెలియజేసినా లేకపోయినా, నా హస్తపావిత్ర్యాన్ని వెల్లడించి తీరుతుంది. ఛార్మియన్ : నిండి ప్రవహించే నైల్ క్షామాన్ని సూచిస్తే నీ హస్తం పునీతతను ప్రదర్శిస్తుంది. ఐరాస్ : ఛీ! ఉన్మత్తురాలా! వెళ్లిపో! జోస్యం నీవేం చెప్పగలవు? ఛార్మియన్ : నీ హస్తంవంటి తడిచేయి ఫలకారి అయిందని జోస్యం చెప్పలేకపోతే ఏ స్వల్పవిషయాన్నీ నేను చెయ్యలేనన్నమాట! అయ్యా! మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దయ ఉంచి దీనికో సర్వసాధారణమైన ఫలితాన్ని సెలవీయండి. ఆంటోని - క్లియోపాత్రా 177 జోస్యుడు : మీ ఇరువురి అదృష్టాలూ తుల్యంగానే ఉన్నాయి. ఐరాస్ : అది ఎలా సంభవం? వివరాలు సెలవీయండి. జోస్యుడు : చెప్పాను గదా! ఐరాస్ : దాని అదృష్టం కంటే నాది అణుమాత్రమైనా అధికంగా లేదా? ఛార్మియన్ : దురూహలనుంచీ భగవంతుడు మనలను దూరం చేయుడుగాక! ఎలెగ్జాస్! రావేం. అయ్యా! ఈతని అదృష్టం ఎలా ఉందో. ఓ ఇసిస్ దేవతా! ఇతడు లేచిపోని పెళ్ళాన్ని వివాహమాడుగాక! క్రమంగా ఇతడికి ఒకరికంటే ఒకరు కురూపలైన భార్యలు కలుగుదురుగాక! అందరిలోనూ చివరి పెళ్ళాం ఇతణ్ణి చూసి నవ్వుతూ ఇతని శ్మశానం దగ్గిరికి చేరేదాకా ఈ భార్యాపరంపర సాగిపోవుగాక! ఇంతకంటే అతిశయమైన మరో నా అభ్యర్థనాన్ని ప్రసాదించకపోతే పోనీ ఓ ఇసిస్ " దేవతా! దీన్నిమాత్రం త్రోసిపుచ్చకు. ఐరాస్ : అట్లే అగుగాక! ప్రియదేవీ!! ఈ ప్రజావాంఛను విందువుగాక! ఛార్మియన్ : దేవీ విందువు గాక! ఎనోబార్బస్ : ఇక చాలించండి. ఆంటోనీ మహాశయుడు వస్తున్నాడు. ఛార్మియన్ : వచ్చేది ఆయన కాదు మహారాజ్ఞి! క్లియోపాత్రా ప్రవేశిస్తుంది. క్లియోపాత్రా : మీరు నా ప్రభువును చూచారా? ఎనోబార్బస్ : లేదు రాజ్జీ! క్లియోపాత్రా : వారు ఇక్కడ లేరా? ఛార్మియన్ : లేరు మహారాజ్జీ! క్లియోపాత్రా : ఆయనెప్పుడూ విలాసోన్మత్తుడై ఉంటాడు. అయితే రోమక రాజకీయ వ్యవహారాలు హఠాత్తుగా ఆయన మనస్సును మార్చివేశాయి. ఎనోబార్బస్! ఎనోబార్బస్ : రాజ్జీ! క్లియోపాత్రా : ఎక్కడ ఉన్నాడో చూచి ఆయనను ఇక్కడికి తీసుకోరా. ఎలెగ్జాస్ ఎక్కడ? ఎలెగ్జాస్ : తమ సేవార్థినై నేను ఇక్కడనే వేచి ఉన్నాను. అరుగో, ప్రభువు వస్తున్నారు. 178 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 క్లియోపాత్రా : ఆయనను నేను చూడనట్లు నటిస్తాను. నా వెంట మీరందరూ వచ్చేయండి. (నిష్క్రమిస్తుంది) ఒకవార్తాహరి, పరిచారకులూ వెంటరాగా ఆంటోనీ ప్రవేశిస్తాడు. వార్తాహరి : తమ భార్య ఫుల్వియా" తొలుతగా యుద్ధరంగంలో ప్రవేశించింది. ఆంటోనీ : నా సోదరుడు లూషియన్కు ప్రతర్ధినిగానా? వార్తాహరి : అవును. అయితే అనతికాలంలోనే వారి ఇద్దరిమధ్యా జరిగిన ఘోరమైన పోరు పరిసమాప్తమైంది. దేశంలోని విషమపరిస్థితులవల్ల ఇరువురికీ సఖ్యం కుదిరింది. ఉభయుల సేనలూ ఏకమై సీజర్ మీదికి ఎదురునడిచాయి. తొలి తుములంలోనే ఆయనకు లభించిన విజయం వారిని ఇటలీ నుంచి తరిమి వేసింది. ఆంటోనీ : చెప్పవలసిన దుర్వార్తలు ఇంతకంటే ఇంకేమైనా ఉన్నాయా? వార్తాహరి : వినిపించటానికి దుర్వార్తలను తెచ్చినవాడు వాటివల్ల కలిగే అసంతృప్తిలో పాలుపంచుకోవలసి ఉంటుంది. ఆంటోనీ : ఆ వార్తలు ఒక బుద్ధిహీనుడికి లేదా పిరికిపందకూ సంబంధించినవైతే నీవు చెప్పేది సత్యమే. నీవు చెప్పవలసిందంతా వినిపించు. ఆపకు. జరిగిపోయిన విశేషాలేవీ నాలో సంచలనాన్ని కలిగించలేవు. నీవు చెప్పవలసిందంతా చెప్పేయి. ఒక వార్తాహరి చెప్పేది సత్యమైతే, అది మృత్యువు, భీకరమైన వార్తే అయినా నేను స్తోత్రపాఠాన్ని వినిపిస్తున్నప్పటి లాగానే వినగలను. వార్తాహరి : అయితే వినండి. లెబినియస్, ఈ వార్త మహాపరుషమైంది. యూఫ్రెటిస్12 మొదలు ఆసియానంతటినీ తన పార్థియన్ సైన్యాలతో ఆక్రమించాడు. సిరియా మొదలు లిడియావరకూ, తరువాత అయోనియావరకూ అతని విజయధ్వజం విర్రవీగుతూ విహరించింది. అయితే అప్పుడు ప్ర.... ప్ర..... ఆంటోనీ : ఆంటోనీ అని వ్యవహరించు. వార్తాహరి : ఓ ప్రభూ! ఆంటోనీ : సూటిగా ప్రసంగించు. వ్యవహారాలను క్లిష్టం చెయ్యకు. రోములో ఆమెను గురించి ఎలా వ్యవహరిస్తారో అలాగే క్లియోపాత్రా అని వ్యవహరించు. ఫుల్వియా ఆంటోని - క్లియోపాత్రా 179 నన్ను నిందిస్తూ ఏ పదబంధాలను ప్రయోగించిందో వాటినే వాడు. నా దోషాలను సత్యదృష్టికి గోచరించినట్లుగానూ, ఈర్ష్య భావించినట్లుగానూ ప్రదర్శించి స్వేచ్ఛగా అవహేళన చెయ్యి. అహల్యలుగా ఉన్నప్పుడు నిశితమైన మనస్సులు కలుపు మొక్కలను కంటాయి. మన దోషాలను మనకు తెలియజేయటమంటే కలుపు మొక్కలను కలియదున్ని పారేయటమన్నమాట - ప్రస్తుతానికి నీవు విశ్రాంతి తీసుకో. వార్తాహరి : అలాగే. మీ ఇచ్ఛానుసారంగానే. ఆంటోనీ : సిక్సన్ వార్తలేమిటి? (నిష్క్రమిస్తాడు) ప్రథమపార్శ్వచరుడు : ఎవరైనా అక్కడ సిక్సన్ నుంచి వచ్చినవారున్నారా? ద్వితీయపార్శ్వచరుడు : అతడిందాకటినుంచీ మీ అనుజ్ఞ కోసమే వేచిఉన్నాడు. ఆంటోనీ : అతణ్ణి ప్రవేశపెట్టు. బలవత్తరాలైన ఈ ఈజిప్టు రాష్ట్రీ బహుళ బంధాలను నేను తెగదెంచివేసుకోవాలి లేకపోతే ఈ అజ్ఞాన విమోహంతో నన్ను నేను నాశనం చేసుకొంటాను! ఆంటోనీ : విశేష మేమిటి? మరొక వార్తాహరి ప్రవేశిస్తాడు. ద్వితీయవార్తాహరి : ప్రభూ! తమ పత్ని ఫుల్వియా మరణించింది. ఆంటోనీ : ఎక్కడ? ద్వితీయ వార్తాహరి : సిక్సన్లో - ఆమె ఎంతకాలం వ్యాధిబాధిత అయిందో, ఇంకా మీరు తెలుసుకోవలసిన విషయాలేమిటో ఇందువల్ల మీకు తెలుస్తాయి. (ఒక ఉత్తరాన్ని అందిస్తాడు) ఆంటోనీ : నన్ను ఒంటరిగా ఉండనీ. (ద్వితీయవార్తాహరి నిష్క్రమిస్తాడు) ఒక మహోదార మరణించింది. అసహ్యంతో అలక్ష్యం చేసి అవతల పారేసినదాన్నే మరొకప్పుడు తిరిగి అది మనది కావాలని కోరుకుంటుంటాము. ఒకనాటి సంతోషం కాలపరివర్తనవల్ల దుఃఖంగా పరిణమిస్తుంటుంది. ఆమె ఇప్పుడు మరణించి నాకు 180 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మంచిదైంది. ఆమె మృతికోసం అప్పుడు వేగపడ్డ నా హస్తం ఇప్పుడు ఆమెకు ప్రాణం పోయగలుగుతుందా? నేడు మన కానందంగా తోచింది కాలపరివర్తనవల్ల రేపు దాని మూల్యాన్ని కోల్పోయి దుఃఖంగా పరివర్తన పొందుతుంది. సమ్మోహిని అయిన ఈ ఈజిప్టురాజ్ఞి పన్నిన బంధనాలను తెగదెంచుకొని నేను బయటపడి తీరాలి. తెలుసుకొన్న వాటికంటే తెలుసుకోని పదివేల ప్రళయాలను నా మాంద్యం నా కోసంగా పొదిగి పెట్టింది... ఎనోబార్బస్! ఎక్కడున్నావు? ఎనోబార్బస్ తిరిగి ప్రవేశిస్తాడు. ఎనోబార్బస్ : ఏ విలాసాన్ని ఆజ్ఞాపించదలచారు ప్రభూ! ఆంటోనీ : ఇక్కడినుంచి నేను వెంటనే వెళ్ళిపోవాలి. ఎనోబార్బస్ : అయితే ఈ మనస్త్రైణాన్ని మరణాలపాలు చేయదలిచారా? పురుషుల నిర్దయ వారికి ఏ పాటి ప్రళయమో మనమెఱిగిందే కదా? వారు మననిష్క్రమణను అనుభవించటమంటే 'మృత్యువు' పలువురినోట పరిభాషౌతుందన్నమాట! ఆంటోని : కానీ నేను వెళ్ళితీరాలి! ఎనోబార్బస్ : మీ అవసరం అంత బలవత్తరమైనదైతే ఇక మన స్త్రైణానికి మరణం తప్పదు. కేవలమొక స్వల్పం కోసం వారిని త్రోసిపుచ్చటం సత్యానికి శోచనీయమైంది. కానీ బలవత్తరకారణంవల్ల వారిమరణం అవసరమైతే, అప్పుడు వారికో విలువ ఇవ్వవలసిన పనిలేదు. ఈ వార్త ఇంచుకంత పొక్కి క్లియోపాత్రా చెవిసోకితే ఆమె మరుక్షణంలోనే మరణిస్తుంది. ఆమె ఇంతకంటే స్వల్పమైన కారణాలకే ఇరవైమార్లు మరణించటం కళ్ళారా చూచాను. మరణించటానికి ఆమె అంతటి సంసిద్ధతను చూపుతున్నదంటే మృత్యువు విజయవంతంగా ఆమెను ప్రణయప్రభావితం చేసినట్లు గోచరిస్తున్నది. ఆంటోనీ : ఆమె మానవుని ఊహకందనంతటి జిత్తులమారి! ఎనోబార్బస్ : ఆఁ! మీరు పొరబడుతున్నారు ప్రభూ! ఆమెలోని సమస్తమనోద్వేగాలూ స్వచ్ఛప్రేమసంజనితాలు. ఇతర స్త్రీల నిట్టూర్పులీమెలో ప్రభంజనాలు. వారి బాష్పాలు కుంభవృష్ఠులు. వీటిని మన కాలసూచికలు సూచించలేవు. ఇట్టి ప్రణయోద్రేకాలెన్నటికీ సత్యేతరాలు కాజాలవు. ఆమె నిజంగా కృత్రిమకుంభవృష్టులను కురిపించగలిగితే జ్యౌతోతుల్యురాలన్నమాట! ఆంటోని - క్లియోపాత్రా 181 ఆంటోనీ : ఆమెను నేను చూడకుండా ఉన్నట్లయితే ఎంతో బాగుండేది. ఎనోబార్బస్ : ఎంతమాటన్నారు ప్రభూ? ఆమెను మీరు చూచి ఉండకపోతే సృష్టిలోని ఒక అమూల్యకళాఖండాన్ని చూచి ఉండకపొయ్యేవారు. బహుదేశపర్యటనకు ప్రఖ్యాతిగన్న మీకు అది అపకీర్తికారణమై ఉండేది. ఆంటోనీ : ఫుల్వియా మరణించింది. ఎనోబార్బస్ : ప్రభూ, ఏమంటున్నారు? ఆంటోనీ : ఫుల్వియా మరణించింది. ఎనోబార్బస్ : ఏమిటి? ఫుల్వియా మరణించిందా? ఫుల్వియా? ఆంటోనీ : అవును. మరణించింది. ఎనోబార్బస్ : ఐతే కృతజ్ఞతాప్రదర్శకంగా దేవతలకు ఒక యాగాన్ని చేయించండి. ఎప్పుడు దేవతలు ఒక పురుషుడి భార్య ప్రాణాలను అపహరించటానికి ఇష్టపడతారో, అప్పుడు వారు భూలోకంలోని దర్జీలను పోలుతున్నారన్నమాట. పాత దుస్తులు జీర్ణమైతే కొత్తదుస్తులను కల్పించుకోటానికి అవసరమైన వస్తువులున్నాయనే ఊహను వారు కల్పిస్తున్నారు. ఫుల్వియా తప్ప ఇతరస్త్రీలు లేకపోతే ఇది మీకు గొప్పదెబ్బ గానీ, దారుణంగా దుఃఖింపదగినంతటి దుఃఖంగానీ అయి ఉండేది. ఇందువల్ల జీర్ణప్రాయమైన మీ కంచుకం తొలగిపోయి క్రొత్తది లభిస్తున్నది. ఈ దుఃఖంలో కొంత సౌఖ్యం సమాయత్తమై ఉందికూడాను. అందువల్ల మీరు అధికంగా దుఃఖించవలసిన అగత్యం అంతగా లేదు. అయితే ఒకవేళ మీరు దుఃఖించవలసిన అవసరముంటే కంటికి నీరు రావటానికని ఒక ఉల్లిగడ్డను వాసన చూడండి. ఆంటోనీ : ఇటలీలో ఆమె ఆరంభించిన వ్యవహారాలు నేను ఇక అక్కడ లేకపోవటాన్ని సహించవు. ఎనోబార్బస్ : ఇక్కడ మీరు ఆరంభించిన వ్యవహారాలను మీరు లేకపోతే అంతకంటే కొనసాగవు. అందులోనూ ముఖ్యంగా, మీరు ఇక్కడ నివసించటంమీదనే ఆధారపడ్డ క్లియోపాత్రా వ్యవహారం అణుమాత్రం ఆగలేదు. ఆంటోనీ : ఎనోబార్బస్! తేలికగా ప్రసంగించటాన్ని ఇక చాలించు. నిర్వర్తించవలసిందని నేను అభిలషించే అంశాలను మా ఉద్యోగులకు తెలియజెయ్. ఇంత త్వరితంగా 182 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఈజిప్టును వదలి వెళ్ళటానికి గల కారణాన్ని నేను రాత్రికి నివేదించి, వెంటనే ప్రయాణం చేయటంకోసం ఆమె అనుమతిని పొందుతాను. రోముకు నన్ను రమ్మని పిలిచేది. కేవలం ఫుల్వియా మరణమే కాదు మా వ్యక్తిగతవ్యవహారాలు కూడా ఉన్నాయి. మన సంక్షేమాన్ని అభిలషించి అతిరహస్యంగా అక్కడ వ్యవహరిస్తున్న మిత్రుల ఉత్తరాలు కూడా ఇంటికి తిరిగి రమ్మని నన్ను త్వరపెడుతున్నవి. సీజర్ను త్రోసిరాజని సెక్స్టస్ పాంపే " సముద్రాలమీద సర్వాధికారి అయికూర్చున్నాడు. ఇక మన ప్రజలో? బలహీనులు చపలచిత్తులు. ప్రాభవాన్నంతటినీ కోల్పోయిన తరువాతగాని యోగ్యుడి మీద వారిప్రేమ స్థిరపడదు. ఘనుడైన పాంపే పుత్రుడి ఎడ వారు, అతనికి తండ్రికున్న సద్గుణాలన్నీ ఉన్నవని హఠాత్తుగా గుర్తించి, సమస్త గౌరవాలనూ ప్రదర్శిస్తున్నారు. అందువల్లనే కీర్తిలోను, అధికారంలోను, అంతశ్శక్తి సామర్థ్యాలలోనూ సెక్స్టస్ పాంపే అత్యధికుడై యోధాగ్రేసరుల్లో ప్రథమగణ్యుడైనాడు. ఆ వ్యక్తి విశేషం ఈ రీతిగా సర్వప్రపంచాన్నీ ఆవరించటం లోకానికి మహోపద్రవం. సహజంగా అది విషపూరితం కావటంవల్ల ప్రస్తుతకాలం కల్పిస్తున్న ప్రళయాన్ని సకాలంలో ఎదుర్కోకపోతే అశ్వజాతి కేశాలలాగా " అతిప్రమాదకారి అయి తీరుతుంది. నా క్రింది ఉద్యోగులందరికీ మనం అతివేగంగా ఈ దేశాన్ని విడిచివెళ్ళటం నా అభిలాషైనట్లు తెలియజెయ్. మూడో దృశ్యం అదే ప్రదేశం. మరో కక్ష్య. క్లియోపాత్రా, ఛార్మియన్, ఐరాస్, ఎలెగ్జాస్ ప్రవేశిస్తారు. క్లియోపాత్రా : ఆయనెక్కడున్నాడు? ఛార్మియన్ : అప్పటినుంచీ నేను ఆయన్ను తిరిగి చూడలేదు. క్లియోపాత్రా : ఎక్కడున్నాడో, వెంట ఎవరున్నారో, ఏం చేస్తున్నాడో చూడు. నిన్ను నేను పంపించానని ఆయనకు తెలియనీయకు. తీవ్రాలోచనానిమగ్నుడై ఉన్నట్లు కన్పిస్తే నేను నృత్యం చేస్తున్నానని చెప్పు. వినోదిస్తుంటే హఠాత్తుగా నాకు సుస్తీ చేసిందని చెప్పు. వెళ్లు. త్వరగా వెళ్లు. తక్షణం తిరిగి రా! (ఎలెగ్జాస్ నిష్క్రమిస్తాడు) ఆంటోని - క్లియోపాత్రా 183 ఛార్మియన్ : రాజ్జీ! నీవు ఆయన్ను మనసారా ప్రేమిస్తే", ప్రేమిస్తున్నావని నేననుకోను, ఆయనలో కూడా అటువంటి ప్రేమను జనింపజేయటానికి యోగ్యమైన మార్గాన్ని నీవు అనుసరించటం లేదు. క్లియోపాత్రా : అయితే నేను చేయవలసిందేమిటి? చేయకూడనిదేమిటి? ఛార్మియన్: సర్వవిషయాల్లోనూ ఆయనకు లొంగిపో. ఎందుకూ అభ్యంతరం చెప్పకు. క్లియోపాత్రా : నీవు నాకు హీనబుద్ధివై బోధిస్తున్నావు. ఆయన్ను కోల్పోవటానికి నీ మార్గం మహా మంచిది. ఛార్మీయన్ : అంత అధికంగా ఆయన్ను వ్యతిరేకించవద్దు. ఉద్రేకాన్ని కల్పించే విషయంలో నీవు కొంత సహనం చూపించాలి. అడుగో, ఆంటోనీ ఇక్కడికే వస్తున్నారు. ఆంటోనీ ప్రవేశిస్తాడు. క్లియోపాత్రా : నేను జబ్బుపడి కసరుబోతునైనట్టు నటించదలిచాను. ఆంటోనీ : క్షమించాలి. నా ఉద్దేశాలను మీకు తెలియజేయవలసి ఉంది. క్లియోపాత్రా : ఛార్మియన్, ఎక్కడున్నావు? శయ్య దగ్గరికి నన్ను తీసుకో పో. ఈ దీర్ఘవేదనను బహుకాలం తట్టుకోటం నాకు సాధ్యం కాని పని. నా శరీరం ఈ స్థితిని ఎంతకాలమని భరిస్తుంది? నేను తూలిపడేట్లున్నాను. ఆంటోనీ : ప్రియరాజ్జీ! క్లియోపాత్రా : నాకు దూరంగా నిలవండి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఆంటోనీ : ఎందువల్ల? విషయమేమిటి? క్లియోపాత్రా : మీకో శుభవార్త వచ్చిందని ఆయా చూపులవల్లనే తెలిసిపోతున్నది. మిమ్మల్ని పెళ్లాడిన ఆమె ఏమంటున్నది? ఆమె దగ్గరికి మీరు వెళ్లవచ్చు. ఆమె మీరిక్కడికి రావటానికే అంగీకరించకుండా ఉండిఉన్నట్లయితే ఎంతో బాగుండేది. నేనిక్కడ మిమ్మల్ని నిలిపివేస్తున్నానని ఆమె నన్ను గురించి ఏమీ అనకూడదు సుమా! మీ మీద నాకేమధికారముంది? మీరు ఆమెవారు. కేవలం ఆమెవారే! ఆంటోనీ : దేవతలకిది బాగా తెలుసు. 184 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 క్లియోపాత్రా : అయ్యో! నా వలె ఇంతటి మహత్తరమైన మోసానికి పాలైన మహారాజ్ఞి మరొకతె లేనే లేదు. అయినా నా మీద పన్నబడ్డ పన్నాగం నాకు మొదటినుంచీ తెలుసు. ఆంటోనీ : క్లియోపాత్రా క్లియోపాత్రా : ఫుల్వియాను మోసగించటాన్ని కళ్లారా చూచిన సింహా నస్థులైన దేవతలనే నీ ప్రణామాలతో చిత్తక్షోభం కల్పించగలిగిన నీవు నా వాడవనీ, నా యెడ సత్యసంధుడిపై వర్తిస్తావని నేను ఎందుకు భావించాలి? పలికేటప్పుడే పాటించటానికి ఉద్దేశింపబడని శూన్యప్రమాణాలనే వాగురులలో చిక్కుకోపోవటం కేవలం ఒక ఉన్మాదకృత్యం. ఆంటోనీ : మధురతమా! రాజ్జీ!! క్లియోపాత్రా : వద్దు. వద్దు. నిన్ను ప్రార్థిస్తున్నాను. వెళ్లిపోవటానికి సాకు వెదకవద్దు. వీడ్కోలు వాక్యాలు పల్కి వెళ్లిపో, ఇక్కడ ఉంటానికి నీవు నన్ను ప్రార్థించినప్పుడు అది మధుర ప్రసంగాలకు మనోజ్ఞమైన కాలం. వెళ్ళటమనే ప్రశ్నే అప్పుడు లేదు. మన అధరాలు, నేత్రాలు అప్పుడు నిత్యప్రణయైక జీవితానికి నిలయాలైనవి. ధనురాకృతులైన మన కనుబొమలు కమనీయా నందమందిరాలైనవి. స్వర్గ సౌరభ్యసంవాసితం కాకుండా మన ఏ క్షుద్రావయవం కూడా ఆ నాడు నిలువ లేకపోయింది. అయితే అవి ఈ నాడూ అలాగే ఉన్నాయి. కానీ నీవు, ప్రపంచ ప్రథమయోధుడవైన నీవు, లోకోత్తరుడవైన సత్యవాదివిగా పరవర్తన పొందావు. ఆంటోనీ : ప్రియరాజ్జీ! ఏమిటిది? క్లియోపాత్రా : నీ ఆకృతిప్రమాణాలు నాకుండి ఉండవలసింది అప్పుడు ఈజిప్టులో ధైర్యసాహసాలుగల ఒక హృదయం ఉందని నీకు తెలిసి ఉండేది. ఆంటోని: ప్రియరాజ్జీ! నా పలుకు విను. వర్తమానకాలంలోని అత్యావశ్యకాలైన వ్యవహారాలు నా సేవలను అపేక్షించి ఆజ్ఞాపిస్తున్నాయి. కానీ ప్రణయపూరితమైన నా హృదయం నిరంతరం నిన్నే నమ్మి నీ సన్నిధానంలోనే ఉంటుంది. మా ఇటలీ అంతర్యుద్ధ శస్త్రకాంతులతో ఆచ్ఛాదితమైంది. సెక్స్టస్ పాంపే రోముద్వాఃకవాటాలను చేరుకొంటున్నాడు. దేశీయాలే అయిన రెండు బలాల సమప్రాధాన్యం పరస్పర శంకాసంకులితాలైన కూటాలను సృష్టిస్తున్నది. ఒకనాడు అసహ్యించుకోబడ్డ పక్షం బలాన్ని కూర్చుకోవటం వల్ల క్రొత్తగా ప్రీతిపాత్రమౌతున్నది. ఒకనాడు పరిహృతుడైన 16 పాంపే పితృగౌరవసంపన్నుడై వర్తమానకాలంలో వైభవవిఖ్యాతులెవ్వరూ పొందజాలని ఆంటోని - క్లియోపాత్రా 185 ప్రజాహృదయాలలో పైపైకి ప్రాకిపోతున్నాడు. అతని సంఖ్య అత్యధికం కావటంవల్ల అత్యంత ప్రమాదస్థితి ఏర్పడింది. విశ్రాంతి వ్యాధిగ్రస్త అయిన స్తబ్ధత ఎట్టి ప్రమాదకరమైన మార్పువల్లనైనా సరే, నవజీవనాన్ని పొందాలని ఆశిస్తున్నది. నేను వెళ్లటానికి ఈ సార్వజనీన వ్యవహారాలతో బాటుగా, వ్యక్తిగతమైనదీ, నీ బుద్ధిలో నే వెళ్లటం క్షేమమనిపించుకన్నదీ ఫుల్వియా మరణం. క్లియోపాత్రా : వయస్సు లాలసత్వాన్ని తెగదెంచుకొని బయటపడే స్వేచ్ఛను నాకు ప్రసాదించక పోయినా శైశవస్థితి నుంచి బయటపడే శక్తి నిచ్చింది. ఫుల్వియా మరణించగలదా? ఆంటోనీ : ప్రియరాజ్జీ! ఆమె మరణించింది. ఇదిగో చూడు! నీ శ్రీమద్విలాసాల మద్య కొంత విశ్రాంతి లభిస్తే దీన్ని చదువు. ఆమె ఎటువంటి విప్లవాలను ప్రేరేపించిందో గమనించు. ఆమె ఎప్పుడు ఎక్కడ మరణించిందో దీని అంత్యభాగంలో లిఖితమై ఉంది. నీకు ప్రియకరాలైన ఆ అంశాలను కూడా తిలకించు. క్లియోపాత్రా: అయ్యో! మిథ్యాప్రణయజీవి! నీ దుఃఖాశ్రువులను నింపటానికి పవిత్రాలైన కాచపాత్రిక" లెక్కడ దొరుకుతాయి? ఫుల్వియా మరణవార్తను నీవు గ్రహించేరీతిని బట్టి, తెలిసింది, ఇప్పుడు తెలిసింది. నా మరణవార్తను కూడా నీవు ఎలా స్వీకరిస్తావో ఇప్పుడు తెలిసింది. ఆంటోనీ : నిందారోపణ లిక మానేయ్! నీకు నేను నిందించటానికి వచ్చిన పనులేవో తెలుసుకొనేందుకు సంసిద్దురాలివి కా. నీవిచ్చే సలహాలను బట్టి వాటిని జరిగించటమా, జరిగించకపోవటమా అన్నది ఉన్నదే కదా! నైలునది " సస్యక్షేత్రాలకు ప్రసాదించిన ఒండుమట్టిమీద కిరణప్రసారం చేసి సారవంతాలుగా చక్కదిద్దే ఆ అంశుమంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇక్కడినుంచీ నేను నీ సేవకుణ్ణిగా నిష్క్రమిస్తున్నాను. నీ ఇష్టానుసారంగానే సంధో, సమరమో సాగిస్తాను. క్లియోపాత్రా : ఛార్మియన్! ఇలా రా. ఉచ్ఛ్వాసనిశ్వాసాలకు ఆటంకం కలిగిస్తున్నవి, నా ఈ బంధన పట్టికలను భేదించు. వద్దులే. అంటోనీ నన్ను ప్రేమిస్తున్నప్పుడు నాకు బాధంటూ లేనే లేదు. ఆంటోనీ : ఓ అనర్హమణీ! రాజ్జీ!! నిందాభియోగాలిక నిలిపివెయ్యి. నా ప్రేమ ఎట్టి గౌరవార్హమైన పరీక్షకైనా సంసిద్ధమై ఉంది. పరీక్షించి దాని పారిశుద్ధ్యాన్ని ప్రశంసిస్తూ ఒక యోగ్యతాపత్రాన్ని ప్రసాదించు. 186 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 క్లియోపాత్రా : అవునౌను. ఫుల్వియా జీవితచరిత్రే నీ ప్రణయపారిశుద్ధ్యాని కొక చక్కని నిదర్శనం. నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ప్రక్కకు తిరిగి ఆమెకోసం ఇంచుక దుఃఖించు. ఆ కన్నీటిని నాకు చూపించి “ఇవి ఈజిప్టు రాజ్ఞి" వను. ఏదీ నీ అత్యద్భుతమాయా నాటకంలో ఒక దృశ్యాన్ని ప్రదర్శించి చూపు. మహానటుడివి నీవు. నీవు నిర్వహించనున్న ప్రణయపాత్ర పరిపూర్ణ ప్రేమైకజీవిదనిపించాలి సుమా! ఆంటోనీ : రాజ్జీ! నీవు నా రక్తాన్నుడుకెత్తిస్తున్నావు. ఇక కట్టిపెట్టు ! క్లియోపాత్రా : ఆహా, ఇప్పుడు కోపాన్ని అద్భుతంగా ప్రదర్శించావు నీవు ఇంతకంటే ఎంతో అద్భుతంగా అభినయించగలవు. ఆంటోనీ : ఈ నా కరవాలమే సాక్షిగా - క్లియోపాత్రా : కానీ నీవు నా లక్ష్యం సాక్షిగా అని కూడా చేర్చవలసిఉంది. ఇంకా ఆయన తన కళాకౌశలాన్ని ప్రదర్శిస్తున్నాడు కదూ! అంతే కాదు ఆయన ఇంకా ఎంతో ఘనప్రావీణ్యం కలవాడు. గమనించు ఛార్మియన్! తన వంశకర్త హెర్క్యూల్సును పోలిన ఈ రోమన్ పౌరుడు కోపరసపాత్రను ఎంతటి పరిపూర్ణ కళాభినివేశంతో ప్రదర్శిస్తున్నాడో గమనించు. ఆంటోని : రాజ్జీ! నిన్ను విడిచి రోముకు వెళ్ళిపోతున్నాను! క్లియోపాత్రా : కృతజ్ఞుడా! ప్రభూ!! ఒక్కమాట. నీవూ, నేనూ విడివడిపోవలసి వచ్చింది. అయితే నేను చెప్పదలచింది ఇది కాదు. మనమిరువురం అన్యోన్యం ప్రేమించుకొన్నాము. కానీ నా మనోభావం ఇందులో ఇమిడిలేదు. అదేమిటో నీకు సువ్యక్తమే. దీనికి కొంత విశేషప్రాముఖ్యం ముంది. అయ్యో! మతిమరుపా! అంటోనీ! నా మతిమరుపు నీ మతిమరుపు వంటిదే. మతిమరుపువే అయిన నీవు నన్ను మరిచిపోవటంవల్ల నేను నిన్ను పూర్తిగా మరిచిపోయాను. ఆంటోని : సర్వానికీ పాలకురాలవైన నీవు రాజ్ఞివై కాలహరణాన్ని పాలితను చేసుకొన్నావనుకొన్నాను. కానీ అర్థరహితమైన సంభాషణవల్ల నీవే మాంద్యానివని గ్రహించగలిగాను. క్లియోపాత్రా : నన్ను గురించి నీ ఇష్టం వచ్చినట్లు అపహాస్యమాడు. నా దోషంగా చెప్పి దేన్ని నీవు మాంద్యమని వ్యవహరిస్తున్నావో దాన్ని భరించటం నాకు భారమనిపిస్తున్నది. హృదయసన్నిహితమై ఆ భావం మహాదుఃఖాన్ని కల్పించి నన్ను ఆంటోని - క్లియోపాత్రా 187 పీడిస్తున్నది. కానీ, ప్రభూ, నన్ను క్షమించు. నీ నేత్రాలకు నచ్చకపోవటం వల్ల ఈ నాడు నా గుణవిశేషాలే నన్ను చంపేస్తున్నవి. నీ గౌరవసముద్ధరణం నిన్ను ఇంటికాహ్వానిస్తున్నది. అందువల్ల కనికరాన్ని పొందని నా దోషాన్ని గురించి పెడచెవిపెట్టు. సర్వదేవతలూ నీకు తోడ్పడెదరు గాక! మాలికాలంకృతయైన విజయదేవత నీ ఖడ్గాసనాన్ని అధిష్ఠించుగాక! విజయం సుగమమై నీ విమలపాదప్రదేశాన వెదజల్లబడుగాక!! ఆంటోనీ : అయితే మనమిక నిష్క్రమిద్దాం. పద. ఒకవంక వియోగాన్ని మనం పొందుతున్నా ఒకరికొకరం సన్నిహితులంగానే ఉంటుంటాం విడిపోతుంటాం. నీ ఉనికి ఇక్కడైనా నీవు నాతో అక్కడికి వస్తున్నావు నేను అక్కడికి వెళ్ళిపోతున్నా నీతోనే ఇక్కడ ఉంటున్నాను - ఇక మనం వినోదాలకోసం ఇక్కడినుంచి నిష్క్రమిద్దాం! (నిష్క్రమిస్తారు) నాలుగో దృశ్యం రోమునగరం, సీజర్ గృహం. ఆక్టేవియస్ సీజర్, ఉత్తరాన్ని చదువుతున్న లెపిడస్, వారి పరివారాలు ప్రవేశిస్తారు. సీజర్ : మనతో భాగస్వామి అయిన ఆంటోనీని సీజర్ తన సహజదౌర్బల్యం వల్ల నిందించడం లేదని, లెపిడస్, ఈ ఉత్తరాన్ని తిలకిస్తే నీకర్థమౌతుంది. ఇదిగో అలెగ్జాండ్రియా నుంచి వచ్చిన లేఖ. అతడు చేపలు పడుతున్నాడు". తప్పత్రాగు తున్నాడు". నిద్రలేకుండా నిండురాత్రులను విలాసాలతో గడిపేస్తున్నాడు. అతడు ఆ క్లియోపాత్రాను మించిన పురుషత్వాన్నిగానీ, ఆ టోలమీరాజ్ఞి అతణ్ణిమించిన స్త్రీత్వాన్నిగానీ ప్రదర్శించటం లేదు. దర్శనమివ్వటం కూడా కష్టంగా ఉంది. రాష్ట్రపాలనలో భాగస్వాములున్నారన్న అంశం అసలే అతడికి మనసులో ఉన్నట్లు తోచదు. అతడు సమస్త మానవదోష సంగ్రహమైనాడు. లెపిడస్ : అతితీవ్రమైనవైనా ఈ దోషాలు అతని మంచినంతటినీ మటుమాయం చేయగలిగినంతటివి కాజాలవని నా అభిప్రాయం. ఇవి రాత్రివేళల్లో గాఢకాలిమవల్ల అతికాంతిమంతాలుగా కనిపించే నక్షత్రాలవంటివి. ఇవన్నీ అతడు సంపాదించినవి కావు పితరులనుంచి పొందినవి. అతడు వాటికోసమే పుట్టాడు అందువల్ల మార్చుకోలేడు. అయితే ఇవి అతడు కావాలని సంపాదించినవి మాత్రం కావు. 188 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 సీజర్ : అతని దోషాలను అన్నింటినీ నీవు అత్యుదారదృష్టితో పరికిస్తున్నావు. టోలమీ శయ్య మీద తొట్రుపాట్లు పడటం దోషం కాదందాము. తనకు ఆనందప్రదానం చేసిన ఆ అతివకు రాజ్యదానం" చెయ్యటమూ దోషం కాదందాము. ఒక బానిసతో అర్ధార్ధంగా అసవసేవనం చేయటం, మధ్యాహ్నవేళల్లో రాజవీధుల మైమరచి మద్యంకోసం ఎడ్డెమడ్డి జనాలతో బుజాలు రాచుకుంటూ తిరగటం అతని అంతటివాడికి తగినదేమో చెప్పు? ఇటువంటి అవసతిని కల్పించని అసామాన్య గుణవిశేషాలవల్ల ఏర్పడ్డ అపూర్వవ్యక్తి అతడు. అయినా ఆంటోనీ తనదోషాలను చూచి ఊరుకోరాదు. ఆత్మవిలాస ప్రియత్వం వల్ల మనమీద మహాభారం పడుతున్నది. అటువంటి విలాసవ్యాపారాలతో ఏవో విశ్రాంతివేళలను అతడు గడుపుతున్నట్లయితే వాటి సహజఫలితాలే తగిన శిక్ష వేస్తాయి లెమ్మని నేను సరిపుచ్చుకొనేవాణ్ణి. ఇటువంటి విషమ పరిస్థితుల్లో కూడా అతడు చేస్తున్న కాలహరణం అతని స్థితినీ, మనఃస్థితినీ నిరంతరం జ్ఞప్తికి తెస్తూ, విలాసోన్మత్తతను మార్చుకోమని చేసే హెచ్చరికలను లెక్కించకపోవటం వల్ల, వయసునుబట్టి వివేకాన్ని సంపాదించినా తాత్కాలికా నందాలకోసం దాన్ని తరిమికొట్టి తన తార్కికప్రతిభ మీద తిరుగుబాటు చేసే బాలకుడిలాగా ఆంటోనీ నిందాయోగ్యుడౌతున్నాడు. ఒక వార్తాహరి ప్రవేశిస్తాడు. లెపిడస్ : ఇంకా కొన్ని వార్తలు వచ్చినట్లున్నాయి. వార్తాహరి : తమ ఆజ్ఞలను నిర్వర్తించాము. సీజర్ మహోదారా! ఇక ప్రతిఘడియనా దూరాన ఏమి జరుగుతున్నదీ మీకు తెలుస్తుంది. సముద్రం మీద పాంపే బలవత్తరుడైనాడు. ప్రేమతో కాక భయంవల్ల ఇంతవరకూ సీజర్ను బలపరుస్తున్న వారందరూ పాంపేను ప్రేమిస్తున్నారు. అతణ్ణి చేరుకోటంకోసం మీ యెడ ప్రేమలేనివారందరూ నౌకాశ్రయాలకు చేరిపోతున్నారు. పాంపేను గురించి వారిలో వారు ప్రసంగించేటప్పుడు ఆయన చాలా అవమానాలపాలైనాడని చెప్పుకొంటున్నారు. సీజర్ : ఇదంతా జరుగుతుందని నేను ఎప్పుడో గమనించి ఉండవలసింది. అధికారం వహించే వ్యక్తి దాన్ని ఆర్జించేటంతవరకూ ప్రజాప్రేమకు పాత్రుడై దాన్ని పొంది ఉంటాడనీ, పతనోన్ముఖుడైన వ్యక్తి అతని ప్రేమపాత్రతకంటే బలాన్ని సర్వం కోల్పోయిందాకా ప్రేమింపబడకుండా, అదృశ్యుడైన తరువాత అతిగా ప్రీతిపాత్రుడౌతాడనీ ఎంతో పూర్వంనుంచీ మనం నేర్చుకొంటున్నదే. ప్రవాహమధ్యంలో ఆంటోని - క్లియోపాత్రా 189 తారట్లాడే తుంగదుబ్బులా ప్రజానీకం ఆటుపోటుల్లో నిరంతరగమనాగమనాలలో కష్టిస్తూ కుమిలి క్రుళ్ళి పోతుంటుంది. వార్తాహరి : సీజర్ మహాశయా! మరోవార్త. మెనక్రేట్స్2, మెనాస్ అనే సుప్రసిద్ధులైన ఓడదొంగలిద్దరూ సముద్రాలమీద సంపూర్ణాధికారాన్ని వహించి, సమస్తనౌకలనూ చుట్టి ప్రోగేస్తున్నారు. వారు మహాక్రోధంతో ఇటలీ భూభాగం మీదికి దండయాత్రలు సాగిస్తున్నారు. వాటి విషయం తలపులకు వస్తేనే తీరవాసులైన ప్రజలు భయోత్పాతపరికంపితులై పారిపోతున్నారు. వీరోత్సాహంతో యువకులందరూ విప్లవం చేసి వారి కొలువులో నిలవటానికి వెళ్ళిపోతున్నారు. ఎటువంటి నౌకకైనా సముద్రాలలో తొంగిచూచే సాహసం లేదు. అది వారికంట బడ్డదో పట్టుబడిందన్నమాటే! కొంతగానైనా యుద్ధరంగంలో ఎదుర్కొని ఆపటానికి అవకాశమున్న అతని సైన్యాలకంటే కూడా, అత్యధికంగా ఆ పాంపేనామధేయం జనాన్ని భయకంపితులను కావిస్తున్నది. 24 సీజర్ : ఆంటోనీ! నీ కామవిలాసోన్మత్తతను ఇక కట్టిపెట్టు! హిర్టియస్, పన్యాలను ఎక్కడ నీవు హతమార్చావో, ఆమోదెనా నుంచి నిన్ను తరిమివేసినప్పుడు నిన్ను వెన్నాడుతూ క్షామం నీ అడుగుజాడల్లో నడిచింది. బహుళభోగివిగా పెరిగినా, సహనంలో ఆటవికులను అతిశయించి, దాన్ని నీవు భరించి జయించావు. అశ్వాలకిచ్చే మద్యాన్ని ఆస్వాదించగలిగావు. వన్యజంతువులు కూడా వాసన చూచి సకిలించి విడిచిపెట్టే పాచిపట్టిన పడియనీరు త్రాగగలిగావు. మొరటుకంచెల మీది కందగడ్డలు తినటానికి నీ నాలుక నిత్యానురాగం వహించింది. మైదానాలు మూడమంచుతో ముంచుకోపోయినప్పటి దుప్పిలా చెట్ల బెరళ్ళు తిని బ్రతకటాన్ని నీవభిలషించావు. ఆల్ప్స్ మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు, చూచిన మాత్రాన్నే నీ కదనవీరుల్లో కొందరిని మరణించేటట్లు చేసిన జంతువుల విచిత్రామిషాన్ని ఆరగించి బ్రతికావన్నవార్తలు వినిపించాయి. అణుమాత్రమైనా ముఖవికాసపరిపూర్తి సన్నగిల్లని రీతిలో దీన్నంతటినీ నీవు వీరాధివీరుడవై భరించావు. నీ ప్రస్తుతస్థితిని పూర్వస్థితితో పోల్చి నేను చేసే ప్రసంగంవల్ల నిరుపమానమైన నీ ప్రతిష్ఠకెంతో దెబ్బ తగులుతున్నది. లెపిడస్ : ఆంటోనీ దయనీయుడు. సీజర్ : అతణ్ణిక లజ్జాభావ మావేశించి ఈజిప్టునుంచి రోముకు త్వరితంగా తరిమివేయుగాక! మనమిర్వురం యుద్ధభూమిలో దర్శనమివ్వవలసిన సమయం వచ్చింది. ఆలస్యం చేయకుండా అందుకోసమని సభ తీరుద్దాం. లేకపోతే మన అలసత్వంవల్ల పాంపే పరంపరాభివృద్ధిని పొందుతాడు. 190 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 లెపిడస్ : సీజర్ మహాశయా! ఏ సాధనసంపత్తితో ప్రస్తుత పరిస్థితిని వసుమతీవనధుల రెంటిమీదా ఎదుర్కోగలనో, రేపు నేను మీకు సుస్పష్టంగా తెలియచేస్తాను. సీజర్ : సభ జరిగేలోపల నా సాధనసంపత్తి ఎంత ఉందో ఎంచుకోటమే నాకు కర్తవ్యం. సెలవు. లెపిడస్ : సెలవు ప్రభూ! ఈ మధ్యకాలంలో మీకు తెలియవచ్చిన దేశాంతరాలలోని సంచలనాలను గురించిన విశేషాలు నా చెవిని కూడా వేయవలసిందని ప్రార్ధన. సీజర్ : ఆ విషయంలో నీకు సందేహమవసరం లేదు. అది నా కర్తవ్యమని నేనెరుగుదును. (నిష్క్రమిస్తాడు) అయిదో దృశ్యం క్లియోపాత్రా ప్రాసాదం. క్లియోపాత్రా, ఛార్మియన్, ఐరాస్, మార్డియన్ ప్రవేశిస్తారు. క్లియోపాత్రా : ఛార్మియన్! ఛార్మియన్ : రాజ్జీ! 25. క్లియోపాత్రా : నాకు మాండ్రగోరా "ను ఛార్మియన్: ఎందుకమ్మా! క్లియోపాత్రా : నా ఆంటోనీకి నన్ను దూరం చేసిన కాలవిలంబాన్ని నిద్రతో గడిపివేయటానికి. ఛార్మియన్ : నీవు ఆయన్నుగురించి అధికంగా ఆలోచిస్తున్నావు. క్లియోపాత్రా : ఆయన్ను గురించి ఆలోచించకపోవటం ద్రోహమని నా అభిప్రాయం. ఛార్మియన్ : రాజ్జీ! నా అభిప్రాయం అది కాదు. క్లియోపాత్రా : కొజ్జా! మార్డియన్!! మార్డియన్ అమ్మా! తమ మనస్సు ఏ విలాసాన్ని అభిలషిస్తున్నది? ఆంటోని - క్లియోపాత్రా 191 ఓ క్లియోపాత్రా : నీవు గానం చేస్తే వినాలనిపిస్తుందన్నది. ఇప్పుడు కాదులే. ఛార్మియన్! ఇప్పుడు నా ఆంటోనీ ఎక్కడున్నాడంటావు? నిలిచి ఉంటాడా? కూర్చొని ఉంటాడా? నడుస్తుంటాడా? లేక అశ్వాన్ని అధిరోహించి స్వారీ చేస్తుంటాడా? ఓ అశ్వరాజమా! అతని భారాన్ని భరించే అవకాశాన్ని పొందగలిగిన నీవు ఎంతో అదృష్టవంతురాలివి. ఓ అశ్వశ్రేష్ఠమా! వీరాశ్వమా!! నా ఆంటోనీని వహించటంలో నీ పరిపూర్ణప్రావీణ్యాన్ని ప్రదర్శించు. నీవు పయనించేటప్పుడు వీపుమీద ఎవరుంటుంటారో నీవు గుర్తించావా? అతడు ఆంటోనీ. అర్ధఅట్లాస్ ను తన బాహువుల మీద భరించే బలశాలి. మానవజాతి బాహుద్వయం - శిరస్త్రాణం. 26. అతడిప్పుడు నాతో ప్రసంగిస్తుంటాడనుకొంటాను. లేదా 'నా పురానైల్ నాగిని ఎక్కడుంది?' అని తనలో తాను సంభాషిస్తుంటాడనుకొంటాను. అలా నన్ను సంబోధించటం అతడికి అలవాటు. ఇప్పుడు స్వాదువైన విషంతో నన్ను నేను పోషించుకొంటున్నాను. ఆ ఫొయిబస్ ప్రణయక్షతాలవల్ల ధూమ్రవర్ణను కాలకల్పిత 26 లలాటగాఢ రేఖాకలితను అయిన నన్ను గురించి అతడాలోచిస్తుంటాడా? విశాల ఫాలంగల ఓ సీజర్ మహాశయా! అవనీతలం మీద నీవు ఉన్న కాలంలో, నేను ఒక మహారాజభోజనకబళాన్ని మాత్రమే. ఘనుడైన పాంపే" నా ఎదుట ఉన్నప్పుడు, నేత్రద్వయాన్ని నా లలాటసీమమీద లగ్నం చేసినట్లుగా ఘటించి, తన జీవితాన్ని అయిన నన్నే చూస్తూ మరణించాడు. ఎలెగ్జాస్ ప్రవేశిస్తాడు. ఎలెగ్జాస్: ఈజిప్టు మహారాజీ! జయము, జయము! క్లియోపాత్రా : మార్క్ ఆంటోనీకంటే నీవు ఎంతో భిన్నమైనవాడివి. అయినా, పరుసవేది 28 అయిన ఆతని దగ్గిరనుంచి రావటం వల్ల ఎలెగ్జాస్, అతడు నిన్ను మలామా చేసి బంగారంలా మార్చి పంపించాడు. మహాసాహసి మా ఆంటోనీ ఎలా ఉన్నాడు? ఎలెగ్జాస్ : ప్రియరాజ్జీ! ఆయన చేసిన తుదికృత్యం ఈ ప్రాగ్దేశమౌక్తికాన్ని ముద్దెట్టుకోటం. - పరంపరగా అతడు పెట్టుకొన్న ముద్దుల్లో ఇది తుదిది. ఆయన సంభాషణ నా హృదయంలో అతిగాఢంగా హత్తుకోపోయింది. క్లియోపాత్రా : అయితే నా చెవి దాన్ని అక్కడినుంచీ ఆకర్షించాలన్నమాట! 192 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఎలెగ్జాస్ : ఆంటోనీ అన్నాడు: "ప్రియమైన నెచ్చెలీ! ఆమెయెడ భక్తుడీ రోమకవ్యక్తి శుక్తిద్రవిణమైన ఈ మౌక్తికాన్ని కాన్కగా పంపుతున్నాడనీ, దీన్ని స్వీకరణయోగ్యంగా చెయ్యటంకోసం ఆమె సింహాసనానికి మరికొన్ని రాజ్యాలను చేర్చి అధికతర సంపద్యుక్తం చేస్తాననీ ఈజిప్టు రాజ్ఞి క్లియోపాత్రాతో చెప్పు. ఆమెను సర్వసామ్రాజ్యానికీ సామ్రాజ్ఞిని చేస్తానని చెప్పు" తరువాత ఆయన తలపంకించి ఏదో తీక్షభావాన్ని ధరించాడు తరువాత దాని హేషార్భటిలో నేనేమి పలికినా వినిపించనిరీతిగా సకిలించిన గంభీరాశ్వాన్ని అధిరోహించాడు. క్లియోపాత్రా : అప్పుడు ఆయన ఆనందంతో ఉన్నాడో, విషాదంతో ఉన్నాడో చెప్పు. ఎలెగ్జాస్ : ఎక్కువ ఎండలు, మిక్కిలిగా చలిగాని లేని సంవత్సరంలోని అప్పటి కాలంలాగా ఆంటోనీ అత్యానందాన్ని గాని, దుఃఖాన్ని గాని ప్రదర్శించలేదు. క్లియోపాత్రా : మనోజ్ఞమైన సమభావాన్ని ప్రకటించాడా? ఛార్మియన్, గమనించు! ఆయన అటువంటి వ్యక్తి, గుర్తించు!! తన్ను తిలకించి తమ ప్రవర్తనలను తీర్చిదిద్దుకొనేవారికోసం అతడెప్పుడూ ముఖాన తేజాన్ని భాసింపచేస్తూ దుఃఖాన్ని బయటపడనీయడు. తన ఆనందానికి నిలయాన్నైన నాతోబాటుగా అతనిమనస్సు ఈజిప్టులో ఉందని ఆప్తవర్గం అర్థం చేసుకోటంకోసం అతడు ఆనందాన్ని ప్రదర్శించడు. ఆంటోనీ! నీలో సుఖదుఃఖాలు రెండూ సమఫాయాలో ఎంత దివ్యంగా సమేళనాన్ని పొందాయి! నీవు సుఖివై ఉంటేనేం, దుఃఖివై ఉంటేనేం! ఈ రెంటివిజృంభణలూ నీలో విశిష్టంగా సాటిలేని రీతితో వర్తించినట్లు మరేవ్యక్తిలోనూ గోచరించవు. వార్తాహరులను నీవు కలుసుకొన్నావా? ఎలెగ్జాస్ కలుసుకొన్నాను. ఇరవైమందిని కలుసుకొన్నాను. వెంట వెంటనే అంతమందిని పంపించావేమిటి? క్లియోపాత్రా : ఏ దినం నా ఆంటోనీకి నేను శుభాకాంక్షలను పంపించటం మరిచిపోతానో ఆ దినం మహాపాపం చేసుకొన్నదన్నమాట! ఆ దినంనాడు జన్మించినవాడు భిక్షుకుడై మరణించి తీరవలసిందే అని నా నిశ్చయం. ఛార్మియన్! వెంటనే సిరా, కాగితం తీసుకోరా. ఆయనకు తక్షణమే నేను శుభాకాంక్షను పంపించాలి. ఎలెగ్జాస్, నీకు స్వాగతం. ఛార్మియన్! నేను ఆంటోనీని ప్రేమించినంత తీవ్రంగా సీజర్ను 29 ప్రేమించానా? ఛార్మియన్ : మహోదారుడైన సీజర్నేనా? ఆంటోని - క్లియోపాత్రా 193 క్లియోపాత్రా : ఆ విశేషాన్ని మరోమారు ఆయన పేరుకు చేర్చి పలికావో, మళ్ళీ నీ ఊపిరి తిరక్కపోవచ్చు. ఆంటోనీని మాత్రమే మహోదారుడని వ్యవహరించు. ఛార్మియన్ : పరాక్రమోపేతుడైన సీజర్నా? క్లియోపాత్రా : ఇదిగో! ఇసిస్ దేవతమీద ప్రమాణం చేస్తున్నాను. పురుషపురుషుడైన నా ఆంటోనీని మరొకమారు సీజర్తో పోల్చి అతడికి ఆధిక్యం కలిగేట్లు పలికావో, నీ పళ్ళూడగొడతాను. ఛార్మియన్ : ఉదారబుద్ధితో నన్ను మీరు క్షమిస్తే - సీజర్ను గురించి నేననేవి మీరన్నమాటే. క్లియోపాత్రా : అది నాయౌవనారంభదశలో అనుభవం లేనప్పుడు నేనన్నమాటల్లో ఒకటి. నా నిర్ణయపరిజ్ఞానం అప్పటికి ఇంకా పరిపక్వం కాలేదు. అప్పుడెప్పుడో నేనన్న మాటలు ఇప్పుడు నీవంటున్నావంటే నీ నెత్తురు కరడుకట్టిందన్నమాట! ఛార్మియన్! పోనీ, వచ్చేయ్! నాకు కాగితం, సిరా తెచ్చిపెట్టు. ప్రతినిత్యం ప్రత్యేకంగా నేను ఆంటోనీ కొక నూతన శుభాకాంక్షను పంపిస్తుంటాను. లేదా వార్తాహరులను పంపిస్తూ నా ఈజిప్టురాజ్యాన్ని ప్రజాశూన్యను చేస్తాను. (నిష్క్రమిస్తారు) 194 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ద్వితీయాంకం ఒకటో దృశ్యం మెస్సినా. పాంపే గృహం. మెనెక్రేటిస్, మెనాస్ యుద్ధోచితవేషంతో ప్రవేశిస్తారు. పాంపే : దేవతలు సత్యప్రియులే ఐతే జీవితమార్గాలలో సత్యరతులైనవారు పూనుకొన్న సత్కార్యాలకు తోడ్పడి తీరాలి. మెనెక్రేటిస్ : యోగ్యుడా, పాంపే! వారు సాయపడటంలో ఇంచుక కాలవిలంబం చేస్తారేగాని తోడ్పాటును తిరస్కరించరని తెలుసుకో. పాంపే : ఒకదానికోసం మనం నిరంతరం అభ్యర్థింపవలసివస్తే అది దాన్ని మూల్యాన్ని కోల్పోతుంది. మెనెక్రేటిస్ : బహుసందర్భాలలో ఏది మనకు మేలును చేకూరుస్తుందో తెలుసుకోలేక కీడును కల్గించే దానికోసం మనం దేవతలను ఆర్థిస్తుంటాము. ఈ కారణాన వారిని అర్థించేవాటిని పొందకపోవటంవల్లనే మనకెంతో లాభం చేకూరుతుంది. పాంపే : పరంపరాభివృద్ధిని నేను పొందితీరుతాను. తప్పదు. ప్రజలు నన్ను ప్రేమిస్తున్నారు సముద్రాధిపత్యం నాది. నా అధికారం నేడు సక్రమంగా సర్వకళలనూ సంపాదిస్తున్నది. అనతికాలంలోనే అది కళాపరిపూర్ణబింబం కాగలదని నా ఆశ జోస్యం చెబుతున్నది. ఆంటోనీ ఈజిప్టులో మాంసకుంభాల మధ్య తిష్ఠన్మూర్తియై తిరుగులేకుండా ఉన్నాడు. ఆ దేశద్వారాలను దాటివచ్చి అతడు యుద్ధం చెయ్యడు. ధనసంపదలను కుప్పలు పోసుకొంటున్నాడే కాని, సీజర్ ప్రజాహృదయాలను పోగొట్టుకొంటున్నాడు. ఇరువురికీ తన స్తోత్రాలు వినిపిస్తూ ఇరువురి స్తుతులనూ తానువింటున్నాడు లెపిడస్. అయితే అతడికి ఇరువురిమీదా అనురాగం లేదు. అంతేకాదు. ఆ ఇరువురూ అతణ్ణి పరిగణించరు కూడాను. మెనెక్రేటిస్ : సీజర్, లెపిడస్ ఇరువురూ సిద్ధపడి యుద్ధభూమిలో నీకు ఎదురునిల్చారు. వారివెనుక బలవత్తరమైన సైన్యం నిలిచిఉంది. పాంపే : నీ కీవార్త ఎలా వచ్చింది? ఇది అబద్ధం! ఆంటోని - క్లియోపాత్రా 195 మెనెక్రేటిస్ : ప్రభూ! నేను దీన్ని సిల్వియస్ వల్ల విన్నాను. పాంపే : అతడు కలలు గంటున్నాడు. అంతే. వాళ్ళిద్దరూ రోములో అంటోనీకోసం ఎదురు చూస్తున్నారు. నాకు తెలుసు. ఓ బంధకీ, క్లియోపాత్రా! తొలినాటి కోమలత్వాన్ని కోల్పోయిన నీ అధరానికి సర్వసమ్మోహనవిద్యలూ నవరాగరేఖలు ప్రసాదించుగాక! నీ మాంత్రిక కర్మకౌశలం సౌందర్యంతో నిత్యసాంగత్యాన్ని పొందుగాక! నీవా శృంగారలోలుపుణ్ణి కామకదన భూమిలో కట్టిపడెయ్. మద్యపానీయాలతో అతని మతికి మత్తెక్కించు. ఎపిక్యురస్ 30 మతానుయాయులైన బానిసీండ్రు తృప్తి అందని రుచులను కల్పించి అతని క్షుధాగ్నిని నిరంతరం రగుల్కొల్పెదరుగాక! తన గౌరవాన్ని పునరుద్ధరించుకోలేని రీతిగా దీర్ఘనిద్ర, అతిభోజనం అతనికి విస్మృతివంటి మాంద్యాన్ని కలిగించుగాక! వర్రియస్! విశేషాలేమిటి? వర్రియస్ ప్రవేశిస్తాడు వర్రియస్ : నన్నెందుకు నియోగించారో ఆ వార్తలు చెప్పక తప్పదు. మార్క్ ఆంటోనీ ఏ మడియనైనా రావచ్చునని రోములో నిరీక్షిస్తున్నారు. ఆయన ఈజిప్టులో బయలుదేరినప్పటినుంచీ, అక్కడినుంచి రోముకు రావటానికి పట్టే కాలంకంటే ఎంతో అదనంగా గడిచిపోయింది. పాంపే : ఇంతకంటే అల్పప్రాముఖ్యమున్న మరో అంశాన్ని దేన్నయినా ఎక్కువ శ్రద్ధతో వినేవాణ్ణి. ఈ స్వల్పయుద్ధంకోసం ఆ శృంగారలోలుడు కవచధారణం చేస్తాడని కలలోనైనా నేననుకోను. అయితే అతని యుద్ధపాండిత్యం వీరిరువురి విజ్ఞానం కంటే రెండింతలు విశేషమైంది. నా విప్లవం కల్పించిన కల్లోలం అంటోనీని ఆ ఈజిప్టు విగతభర్తృక ఉత్సంగంనుంచి ఊడబెరికి బయటపడవేసినందుకు, నన్ను గురించిన నెంతగానో గౌరవభావాన్ని వహించటం సమంజసం. 31 మెనాస్ : సీజర్, ఆంటోనీ సక్రమంగా ఒకరికొకరు శుభాకాంక్షలను తెలుపుకొంటారని నేనూహించను. మరణించిన ఆ ఆంటోనీ భార్య సీజర్మీద ఎదురుతిరిగింది. అతనిచేత ప్రేరేపితుడైనవాడు కాడని నాకు తెలుసును కానీ ఆంటోనీ సోదరుడు సీజర్ మీద యుద్ధం చేశాడు. 196 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 పాంపే : అయినా మెనాస్! వారందరికీ సమష్టిగా ప్రబలశత్రువైన నేను నిల్చిన ఈ సమయంలో, ఇటువంటి అల్పవైరాలు అడ్డువస్తాయో, మరి రావో నేను చెప్పలేను. వారిమీద నేను ఆయుధాలెత్తి ఉండకపోతే పరస్పరం కత్తులు దూయటానికి కారణాలున్నాయి కాబట్టి ఒకరితో ఒకరు కలహించి ఉండేవారు. మనవల్ల వారికి కలుగుతున్న భయం, ఎంతవరకూ వారి అల్పవైమనస్యాలను అవతల పెట్టించి ఉభయసైన్యాలనూ ఏకముఖం చేస్తుందో, ఇపుడింకా నేను నిర్ణయించి చెప్పలేను. అయితే దేవతలు ఎలా ఉద్దేశిస్తే అలా జరుగుతుంది. పరమప్రయోజనాలు చేకూరేటట్లు మనకున్న ప్రబలబలాలను ప్రయోగించటం మీదనే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. మెనాస్! ఇక నిష్క్రమిద్దాం. పద! (నిష్క్రమిస్తారు) రెండోదృశ్యం రోములోని లెపిడస్ గృహంలో ఎనోబార్బస్, లెపిడస్ ప్రవేశిస్తారు. లెపిడస్ : ఉదాత్తుడా ఎనోబార్బస్! సీజర్ ప్రసంగించేటప్పుడు ప్రసన్నమధురంగా సంభాషించమని మీ సేనాధినేతను ప్రార్థించి చెప్పు. అప్పుడు నీవు నీ గుణానుగుణమైన కృత్యాన్ని నిర్వర్తించినవాడవౌతావు. ఎనోబార్బస్ : కాదు, కాదు. 'మీ యోగ్యతకు ఉచితమైన రీతిగా ప్రసంగించవలసిందని ఆయన్ను ప్రార్థిస్తాను. కోపగిస్తే సీజర్ను ఆయన తప్పక నిర్లక్ష్యంతో పరికించి తీరుతాడు. యుద్ధదేవత 'మార్పు'లా మహాగంభీరంగా ఉపన్యసిస్తాడు. ఇందులో నాకు అపనమ్మకం అణుమాత్రమైనా లేదు. జూపిటర్ 32 మీద ప్రమాణం చేసి పలుకుతున్నాను. నాకే ఈ సీజర్ వంటి శ్మశ్రువుంటే ఆయనయెడ నాకు గల నిర్లక్ష్యాన్ని వెల్లడించేటందుకు దానికి క్షురకర్మను కూడా కల్పించను. లెపిడస్ : వ్యక్తిగతాలైన గర్వాతిశయాలను ప్రకటించుకోటానికి కిది సమయంకాదు. ఎనోబార్బస్ : ఏ కాలమైనా అందులో పుట్టిన అన్ని విషయాలకూ అది యోగ్యమైనదే. లెపిడస్ : కానీ అధికవిషయాలకోసం అల్పాలు దారి తప్పుకోటం ధర్మం. ఎనో బార్బస్ కానీ అల్పవిషయాల ఆగమనం ముందుగా జరిగితే అలా ఆచరించవలసిన అవసరంలేదు. ఆంటోని - క్లియోపాత్రా 197 నీ లెపిడస్ : నీ ప్రసంగం కేవలం క్రోధోన్ముద్రితమైంది. పూర్వవైరాలను స్మృతికి తేవద్దని నిన్ను ప్రార్థిస్తున్నాను. అడుగో, ఉదాత్తుడు ఆంటోనీ వస్తున్నాడు. ఆంటోనీ, వెంటిడియస్ ప్రవేశిస్తారు. ఎనోబార్బస్ : అడుగో, దూరంగా, సీజర్ కూడా వస్తున్నాడు. సీజర్, మెకన్నాస్, అగ్రిప్పా ప్రవేశిస్తారు. ఆంటోనీ : ఫలవంతమైన సంధి ఒక్కటి ఇక్కడ కుదిరితే, మనం పార్థియామీదికి నడుద్దాం. వింటున్నావా వెంటిడియస్? సీజర్ : ఇది నాకు తెలియదు మెకన్నాస్! అగ్రిప్పా!! లెపిడస్ : ఉదాత్తమిత్రులారా! ఇప్పుడు నిర్వహించవలసిన మహాఘనకృత్యాలు మనసు ఏకముఖం చేస్తున్నవి. అల్పవిషయాలిక మనమధ్య అనైకమత్యాన్ని కల్పించకూడదు. పరస్పరాలైన అభియోగాలను మనం ప్రశాంతంగా విందాము. క్షుద్రవైమనస్యాలను గురించి క్షుభితక్రోధులమై చర్చిస్తే, అల్పక్షతాలను మాన్చుకోటానికి పూనుకొని హత్యలు చేసినవాళ్ళమౌతాము. అందువల్ల ఉదాత్తులైన సామ్రాజ్యసమభాగులారా! మీలోని దుఃస్వభావాలను చెలరేగనీయకండి. విషమ విషయాలను ప్రస్తావించేటప్పుడు మధురమైన భాషను ప్రయోగించవలసిందని మిమ్మల్ని మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఆంటోనీ : ఎంతో సరసంగా పలికావు. సైన్యాలను ముందడుకొని మనం కదనరంగంలో కార్యాచరణకు పూనుకొంటున్నాం. నేను అలాగే ప్రవర్తిస్తాను. సీజర్ : ఆంటోనీ! నీకిదే రోమునగర స్వాగతం! ఆంటోనీ : ఇందుకివే నీకు నా ప్రణామాలు! సీజర్ : అదిగో ఆ ఆసనాన్ని స్వీకరించు. ఆంటోనీ : మహాశయా! ముందు నీవే స్వీకరించు. సీజర్ : అయితే నీవు కోరినట్లే జరిగిస్తాను. ఆంటోనీ : సంబంధంలేని కొన్ని విషయాలను నీవు అపార్థం చేసుకొని అసహ్యించు కొంటున్నట్లు విన్నాను. 198 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 సీజర్ : అకారణంగా గాని, అల్పవిషయాలకు గాని ప్రపంచంలో, ఎవరిమీదనైనా, అందులో ప్రధానంగా నీ మీద, నేను కోపం తెచ్చుకొన్నట్లయితే నన్ను పరిహసించ వలసిందే. నాకు సంబంధం లేకుండా నీ నామాన్ని ఒక్కమారైనా మానహాని కలిగేరీతిగా ఉచ్చరించి ఉన్నట్లయితే నేను మరింతగా పరిహసింపబడేటందుకు పాత్రతను సంపాదించుకొన్నట్లు. ఆంటోనీ : అయితే ఈజిప్టులోని నా ఉనికితో నీకేం సంబంధం? సీజర్ : నేను రోములో ఉండటంతో నీకెంత సంబంధమో, నీవు ఈజిప్టులో ఉండటంతో నాకు అంతకంటే అధికమైన సంబంధం ఏమీ లేదు. అయినా అక్కడ వుండి నీవు నా రాజ్యంయెడ విద్రోహాన్ని తలపెడితే, నీవు ఆ ఈజిప్టులో ఉన్నప్పటికీ నాకు సంబంధం ఉండకపోదు. ఆంటోనీ : విద్రోహమనటంలో నీ అభిప్రాయం? సీజర్ : ఇక్కడ నాకేమి సంప్రాప్తమైందో దాన్నిబట్టి నా అభిప్రాయాన్ని నీవు గ్రహించవచ్చు. నీ భార్య, నీ సోదరుడు నా మీద యుద్ధాలు నడిపించారు. వారి వైరానికి వస్తువువు నీవే. నీవే ఆ యుద్ధానికి సంజ్ఞాపద మైనావు. ఆంటోనీ : ఈ వ్యవహారంలో నీవు పొరబడ్డావు. నా సోదరుడు తానొనర్చిన పనికి నన్ను వస్తువుగా ప్రదర్శించలేదు. నేను విచారణ చేశాను. నమ్మదగ్గ చారులమూలంగా కత్తి దూసి ఎవరు నీ మీదికి తలపడ్డారో తెలుసుకొన్నాను. నీతో అభిన్నమైన లక్ష్యంగల నా అపేక్షకు వ్యతిరేకంగా యుద్ధం చేసి నీ అధికారానికెలాగో అలాగే, నా అధికారానికి కూడా ఆ వ్యక్తి అప్రతిష్ఠను తీసుకోరాలేదా? దీన్నిగురించి నా ఈ లేఖలే నీకు తృప్తినిస్తాయి. నాతో నీవు తగాదా తెచ్చుకోటానికి నిశ్చయిస్తే, అందుకు అవసరంగా ఇంతకంటే మరేదైనా ప్రబలకారణాన్ని వెదకవలసి ఉంటుంది. సీజర్ : నా నిర్ణయాలు దోషభూయిష్టాలని ఆరోపించి, నిన్ను నీవు ప్రశంసించు కొంటున్నావు. కానీ నీవు చెప్పే ఈ సాకుల్లో సమగ్రస్ఫూర్తి కన్పించటం లేదు. ఆంటోనీ : పొరబడకు. ఒక లక్ష్యసాధనలో నీతో సమభాగవర్తినైన నేను, నా ప్రశాంతికి భంగం కలిగించిన ఆ యుద్ధాన్ని అంగీకరించటం ఎంతటి కష్టకార్యమో, నీవు గ్రహించవలసిన పరిపూర్ణావశ్యకత ఎంతైనా ఉంది. ఆంటోని - క్లియోపాత్రా 199 ఇక నా భార్యను గురించి, ఆమెకున్న శక్తి, ఆమెతో తుల్య అయిన మరొక వనిత ఉండి ఉండవలసిందని నేను భావిస్తున్నాను. రోమకమహాసామ్రాజ్యంలోని తృతీయభాగానికి నీవు అధికారివి. ప్రశాంతంగా ఉండవలసిందని ఆ రాజ్యాన్నంతటినీ అల్పసూచనలతో శాసింపగలవేమోగాని, ఇటువంటి భార్యకు ఎట్టిమార్గాననైనా గుణపాఠం చెప్పలేవు! ఎనోబార్బస్ : మనందరికీ ఇటువంటి భార్యలుండి సొగసైన యుద్ధాలు జరుగుతుంటే ఎంతో బాగుంటుంది. ఆంటోనీ : సీజర్ మహాశయా! క్షాంతిరహితమై, శిక్షాతీతమైన ఆమె స్వభావం కల్పించిన కల్లోలాల్లోనూ, అనుసరించిన విధానాలలోనూ చాకచక్యం లేకపోయినా, అవి నీ ప్రశాంతికి భంగాన్ని కల్పించాయని నేనెంతో బాధపడుతూ అంగీకరిస్తాను. అయితే ఆ విషయంలో నేను నిస్సహాయుడనని నీవు అంగీకరించక తప్పదని నే నంటాను. సీజర్ : అలెగ్జాండ్రియాలో నీవు విలాసాల్లో మునిగి తేలుతున్నప్పుడు, నీకెన్నెన్నో లేఖలు పంపించాను. వాటినన్నింటినీ నీవు చదవనైనా చదవక అలక్ష్యం చేశావు. అంతే కాదు, నా వార్తాహరిని పరిహసించి సమ్ముఖంనుంచి తరిమికొట్టావు. ఆంటోనీ : మహాశయా! ప్రవేశానికి అనుమతిని పొందకుండానే అతడు సముఖాన నిల్చాడు. అప్పుడే నేను ముగ్గురు రాజులకు విందు చేశాను. ఉదయవేళ నేనుండేటంతటి సమచిత్తంలో లేను. కానీ మరొకనాడు దర్శన మిచ్చినప్పుడు క్రితంనాటి నా స్థితిని క్షమాపణ వేడుకొన్నంతగా వివరించాను. ఈ వార్తాహరిచరిత్ర ఇక నీ నా మధ్య ఆటంకంగా నిలువకుండుగాక! కలహింపవలసిఉంటే ఈ అల్పమానిసి కథ మనకు కారణం కాకుండుగాక! సీజర్ : నీవు చేసిన ప్రయాణంలోని అంశాన్ని భగ్నం చేశావు. నా యెడ అట్టిదోషం ఉందని నీవనలేవు. లెపిడస్ : సీజర్ మహాశయా! మృదువుగా సంభాషించు. ఆంటోనీ : ఆపవద్దు. సీజర్! కానివ్వు. ఆపవద్దు. లెపిడస్, ఆయన్ను స్వేచ్ఛగా మాట్లాడనివ్వు. ఇది పునీతమైన నా గౌరవానికి సంబంధించిన విషయం. అది నాలో లోపించిందని ఆయన భావిస్తున్నాడు. సీజర్! నేను భగ్నంచేశానని నీవు తలపోసిన ఆ ప్రమాణాంశమేదో సెలవియ్యి! 200 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 సీజర్ : అవసరమైనపుడు నాకు శస్త్రాలనూ, సహాయాన్నీ ఇవ్వటమనే ఆ రెంటినీ నీవు తిరస్కరించావు. ఆంటోనీ : ఇవ్వలేకపోయాననటం సమంజసం. విలాసప్రియత్వం నా జ్ఞాపకశక్తిని దోచుకొని, నా ఔదార్యాన్ని తనకు బానిసను చేసుకొన్నది. ఆ కాలంలో నేను మీకు తోడ్పకలేకపోయినాను కనుక ఇవ్వలేకపోయినాననటం సమంజసం. ఈ వ్యతిక్రమానికి, నాకు గౌరవలోపం కలగనంతటిమేరకు నేను నీ క్షమాపణను అర్థిస్తున్నాను. అయితే ఈ అభ్యర్థనవల్ల నా సత్యరతికి, అధికారానికీ దారిద్ర్యావమానాలను కల్పించడం నేను అంగీకరించను. అవి లేనిది నేను వ్యవహరించలేను. ఇందులోని సత్యం ఇది . ఫుల్వియా నన్ను ఈజిప్టు నుంచి రప్పించటానికి ఇక్కడ యుద్ధాలు చేసింది. అజ్ఞాతంగానే నేను వాటికి కారణమైనాను. నా గౌరవానికి భంగం కలగనిరీతిగా ఇందుకు నేను మీకు క్షమాపణ చెప్పుకొంటున్నాను. లెపిడస్ : మహోదాత్తంగా పలికావు. 33 - మెకన్నాస్ : మీలో ఒకరివల్ల ఒకరికి పూర్వం కలిగిన కష్టనష్టాలను గురించి పట్టుపట్టవద్దని నేను సూచించవచ్చుననుకొంటాను. వాటిని మరిచిపోగలిగితే, మీరు ఇరువురూ ప్రస్తుతావసరాలు మీ ఇద్దరి సఖ్యాన్ని ఎంత ఘనంగా కోరుతున్నవో గమనించినవారౌతారు. లెపిడస్ : నీవు అవసరానికి ఎంతో అనుయోగ్యంగా ప్రసంగించావు మెకన్నాస్!

ఎనోబార్బస్ : లేదా ఇప్పుడు పరస్పరానురాగాన్ని తాత్కాలికంగా మీరు అరువు పుచ్చుకొంటే, పాంపేను గురించిన మాటలు వినపడటం మానేసిన తరువాత, మళ్లీ మీ వైమనస్యాలను త్రవ్వుకోవచ్చు. మీకప్పుడు మరోపని ఉండదు గనుక, కలహించుకోటానికి కావలసినంతగా కాలం ఉంటుంది కూడాను. ఆంటోనీ : నీవు కేవలం ఒక సైనికుడివి. ఇక విస్తరించి సంభాషించకు. ఎనోబార్బస్ : సత్యం కూడా మూకత వహించవలసిన సమయాలు ఉంటాయని నేను పూర్తిగా మరిచిపోయాను. ఆంటోనీ : ఈ సమావేశానికి నీవు పూర్తిగా అపచారం చేస్తున్నవాడి వౌతున్నావు. కనుక ఇక నీవు నోట మాట రానీయకు! ఆంటోని - క్లియోపాత్రా 201 ఎనోబార్బస్ : అయితే మీ ఇష్టంవచ్చినట్లు జరిగించండి. ఆలోచించినా పైకి ఏమీ అనక శిలనై ఉంటాను. సీజర్ : అతడు చెప్పిన విషయాలను గురించి నాకెట్టి అసంతృప్తి కలగలేదు. అయితే అతనిరీతిలో కొంత స్వేచ్ఛ మాత్రం కనిపించింది. మన ఇరువురి స్వభావాలూ అన్యోన్యవ్యతిరిక్తాలై వ్యవహరిస్తున్నవి. కానీ ఏ బంధం వల్ల మన ఇరువురి స్నేహం సుస్థిరంగా నిరంతరం నిలువగలుగుతుందో దానికోసం ప్రపంచంలోని నలుమూలలా నేను అన్వేషిస్తాను. అగ్రిప్పా : సీజర్ మహాశయా! ఇంచుక నాకు అవకాశమీయండి. సీజర్ : అగ్రిప్పా! నీవు ప్రసంగించవచ్చు. 34 అగ్రిప్పా : మీకు తల్లివంక చెల్లెలు న్నది. ఆమె ప్రశస్తిగన్నది. ఆంటోనీ ఇప్పుడు విధురుడు. సీజర్ : అలా అనకు అగ్రిప్పా! నీ మాటలు క్లియోపాత్రా వింటే నీ తొందరపాటుకు ఆమె నిన్ను తిట్టిఉండేది. ఆ తిట్లకు నీవు యోగ్యుడవౌతావు కూడాను. ఆంటోనీ : సీజర్! ప్రస్తుతం నేను అవివాహితుడనే. అగ్రిప్పాను ఇంకా విశదంగా మాట్లాడనివ్వండి. అగ్రిప్పా : నిరంతరసఖ్యంతో మీ ఇరువురినీ నిలపటానికి, భ్రాతలనుగా ఇరువురినీ బంధించటానికీ, జారిపోని ముడివేసి మీ ఇరువురి హృదయాలనూ కలిపి కట్టివేయటానికీ ఆంటోనీ మహాశయా! నీవు ఆ ఆక్టేవియాను భార్యగా స్వీకరించు. ఆమె పురుషశ్రేష్ఠుణ్ణి భర్తగా పడయదగినంతటి పరమసుందరి. ఆమె శీలసౌభాగ్యం 35, సౌందర్యవిశేషం ఆమెను గురించి మిగిలినవాటి కంటే విశేషంగా చెప్ప సమర్థాలైనవి. ఈ నాడు మహాఘనాలుగా కన్పించే అల్పవైమనస్యాలు, ప్రమాదపరిస్థితులను వెంటబెట్టుకొని ఉన్నట్లు కన్పించే గాఢభయాలు ఈ వివాహంవల్ల మటుమాయ మౌతాయి. కల్పితకథలు ఈ నాడు సత్యాలౌతున్నాయి. అతిసత్యాలే ఈ వివాహం జరిగిననాడు కథలౌతాయి. ఆమె మీది మీ ప్రేమ మీ ఇరువురిని పరస్పరం ఆకర్షిస్తుంది. ఇరువురినీ ఆమెయెడ అనురాగపూరితులను చేస్తుంది. నేను విన్నవించేదానిలో ఏమైనా దోషముంటే క్షమించండి. ఇది ఏదో హఠాత్తుగా తోచిన ఊహ కాదు యోచనచేసి పొందిన అభిప్రాయం. ఇది నా కర్తవ్యానుపాలనంగా తోచి మనస్సులో బహుకాలం మెలిగిన అభిప్రాయం. 202 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఆంటోనీ : సీజర్! ఇందుకు నీ అభిప్రాయమేమిటో వెల్లడిస్తావా? సీజర్ : జరిగిన ప్రసంగాన్ని గురించి ఆంటోనీ ఎట్టి అనుభవాన్ని పొందాడో విన్నదాకా ఏమీ అనలేను. ఆంటోనీ : ‘అయితే అగ్రిప్పా, నీ వన్నట్లే అగుగాక!' అని నేనన్నప్పుడు, తన సూచనకు కార్యరూపాన్ని కల్పించటానికి అగ్రిప్పా కేమి అధికారముంది? సీజర్ : సీజర్కు ఉన్న అధికారమూ, అంతే కాదు, అతడికి ఆక్టేవియా మీద ఉన్న అధికారమూ అగ్రిప్పాకున్నాయి. ఆంటోనీ : ఫలప్రదాయకంగా కనిపించే ఇటువంటి పరమశ్రేష్ఠకృత్యానికి కలలో కూడా నేను ఆటంకాన్ని కాకుందునుగాక! ఏదీ సీజర్, నీ హస్తాన్ని ఇలా అందించు! ఈ మహోదాత్తకృత్యానికి" పరిపూర్తిని కల్పించు!! ఈ క్షణం నుంచీ భ్రాతృప్రేమ మన హృదయాలను పాలిస్తూ ఉన్నత లక్ష్యాల వంకకు మనలను ఏకముఖం చేసి నడిపించుగాక!! సీజర్ : ఇదిగో నా హస్తం. అందుకో! ఏ సోదరుడూ నావలె ఘనంగా ప్రేమించనట్టి సోదరిని నీకిస్తున్నాను. మన రాజ్యాలూ, హృదయాలూ స్నేహానుబంధాలతో చిరకాలం వర్ధిల్లటంకోసం ఆమె చిరంజీవిని ఔగాక! ఎన్నడూ మన అన్యోన్యానురాగం సన్నగిల్లకుండుగాక!! లెపిడస్ : అలాగే అగుగాక! ఇది పరమానందకరమైన పరిణామం! ఆంటోనీ : కొంతకాలంనుంచీ పాంపే నా యెడ అతిశయమూ, అపూర్వమూ అయిన గౌరవాన్ని ప్రకటిస్తున్నాడు ". అందువల్ల నేను అతడిమీద కత్తిని దూయదలచలేదు. లేకపోతే నా జ్ఞాపకశక్తిని గురించి దుర్వార్తలు చెలరేగుతాయి. కనుక అతడు నాకు చేసిన మేళ్లకు తొలుతగా కృతజ్ఞతను తెలుపుకొని తరువాత అతణ్ణి ఏకైకంగా ఎదిరిస్తాను. లెపిడస్ : పాంపేను ఎదుర్కోవలసిన సమయం మనను ప్రేరేపిస్తున్నది. అందుకు మనం సిద్ధపడకపోతే, అతడే వెతుక్కుంటూ వచ్చి మనపైన బడతాడు. ఆంటోనీ : అతడు ప్రస్తుతం ఎక్కడున్నాడు? 39 సీజర్ : మైసెనమ్ " ప్రాంతంలో. ఆంటోనీ : అతని పదాతిబలం ఎంత ఉంటుంది? ఆంటోని - క్లియోపాత్రా 203 సీజర్ : అది అతివిస్తృతమైంది. ఇంకా పెరుగుతున్నది కూడాను. అయితే అతడు సముద్రంమీద సర్వాధిపత్యం వహిస్తున్నాడు. ఆంటోనీ : అవును. వదంతి అలాగే ఉంది. ఇంతకు పూర్వమే మనం యుద్ధంలో ఎదురునిల్చి ఉన్నట్లయితే, అతడు అలా ఉండగలిగేవాడు కాదు. సన్నాహాల విషయంలో ఇక మిక్కిలి త్వరపడదాం. శస్త్రధారణం చేసేలోపలనే ఇప్పుడనుకొన్న వ్యవహారాన్ని సమాప్తి చేయిద్దాం. సీజర్ : మహానందంతో. నిన్ను నా వెంట తీసుకోవెళ్ళుతాను నా సోదరిని చూచివద్దువుగాని. ఆంటోనీ : లెపిడస్! నీవు వెంట మాకు తోడుగా ఉండాలి. లెపిడస్ : వ్యాధి వచ్చినా మీ వెంట వచ్చి తీరుతాను. తుత్తారధ్వని, సీజర్, ఆంటోనీ, లెపిడిస్లు నిష్క్రమిస్తారు. మెకెన్నాస్ : ఈజిప్టునుంచి విచ్చేసిన నీకివే నా శుభాకాంక్షలు. ఎనోబార్బస్ : సీజర్కు అర్థహృదయానివి. పూజ్యుడవు. యోగ్యుడా మెకెయ్నాస్! నీకివే నా శుభాకాంక్షలు! అగ్రిప్పా! నీకు కూడా. అగ్రిప్పా : ఉదాత్తుడా, ఎనోబార్బస్! నీకు నా శుభాకాంక్షలు. మెకెయ్నిస్ : వ్యవహారాలన్నీ ఇంత సుగమంగా పరిష్కృతాలైనాయి. మనమానందించ టానికి ఇది ఎంతైన కారణంగా కనిపిస్తున్నది. ఈజిప్టులో విలాసాలతో బహు బాగా కాలం గడిపావనుకొంటాను. ఎనోబార్బస్ : పగలంతా నిద్రించి దానికి సిగ్గును కల్పించాము. మా మధుపానగోష్ఠులతో రాత్రికి రమణీయతను నాపాదించి తేలికతనాన్ని తెచ్చిపెట్టాము. మెకెయ్నాస్ : ఉదయభోజనానికే ఎనిమిది వనవరాహాలను వ్రేల్చేవారట! విందులో పన్నెండుమందికి మించి ఆరగించేవారుండేవారు కారటగా! ఎనోబార్బస్ : ఈగిల్తో పోలిస్తే ఇది ఈగతో సమానం. విందులో ఇంతకంటే ఇంకా మాకు ఎంతో దయ్యపుతిండి ఉండేది. అదంతా చెప్పదగ్గది కాదులెండి! 204 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 40 మెకెయ్నిస్ : అందినవార్తలు నిజమైతే ఆమె అసాధారణమైన వైభవం ఉన్న అతివట! ఎనోబార్బస్ : తొలుతగా ఆమె ఆంటోనీని సిడ్నసినది " మీద కలుసుకొన్నప్పుడు అతని హృదయాన్ని దోచి దాచేసింది. అగ్రిప్పా : అక్కడే ఆమె మహావైభవాన్ని ప్రదర్శించిందని విన్నాను. ఇది అసత్యమైతే నా వార్తాహరి కల్పనాప్రావీణ్యంలో ఘనుడన్నమాట! 41 ఎనోబార్బస్ : ఆ విశేషాలన్నీ మీకు నివేదిస్తాను. ఆమె అధివసించిన ఆసనం ఆ నదీజలాలల్లో బంగారుమలామా చేసిన మహాసనంలా మెరిసింది. దాని పశ్చార్ధనావం విశాలస్వర్ణ పత్రసంశోభితం. నౌకాపటాలు నీలవర్ణ నిలయాలు. పవనాలకు వాటిమీద ప్రణయం జనించిందా అన్నట్లు అవి పరిమళాలను వెదజల్లాయి. ఆ యానపాత్ర క్షేపణాలు అతిస్నిగ్ధరౌప్య వినిర్మితాలు. అవి సుషిరస్వనాలతో లయకల్పి తాము తట్టే నీరానికి శృంగారభావాన్ని కల్పించి చలింపజేశాయా అనిపించాయి. ఇక ఆమెరూపం వర్ణనాతీతం. తపనీయతంతువులతో అల్లిన అమూల్యమంటపంలో, ప్రకృతిని అధఃకరించే భావనాబలంతో స్థపతి శిల్పించి నిల్పిన వీనస్ విగ్రహాన్ని ఎన్నో రెట్లుగా మించి ఆమె శయనమూర్తి భాసించింది. ఆమె కిరుపార్శ్వాలా అందమైన గండకూపకాలతో ఇరువురు బాలకులు చిరునవ్వులు చిలుకరిస్తూ మన్మథమూర్తుల్లా నిలిచి, శబలవర్ణ ప్రకీర్ణకాలతో చల్లబడజేసే కోమలకపోలసీమలను కాంతిమంతం చేస్తున్నారు. ఇలా వారు ఉక్కను పోగొట్టుకోటానికి పూనుకొని ఉష్టిమను కల్పించారు. అగ్రిప్పా : ఆహా! ఆంటోనీ అక్షిద్వయానికి ఎంత అపూర్వమైన దృశ్యం. ఇక ఆమెస్త్రైణం సాగరకన్యలైన నైరైడ్స్"లా సర్వావయవాలంకరణశోభితలు. ఎల్లవేళలా ఆమె కనులమీదనే దృష్టి నిలుపుతూ, ఆమె మనోభావాలకు అనుగుణంగా అవయవచాలనం చేస్తూ, వారు ఆమెను కొలుస్తున్నారు. మెర్మైడ్గా కనిపిస్తూ ఒక నారీమణి చుక్కానిపట్టి నౌకను నడిపింది. సుమకోమలి అయిన ఆమె హస్తస్పర్శవల్ల కలిగిన గర్వంతో ఉప్పొంగి, ఆ మెత్తని ఉపకరణం అతిలాఘవంతో తన కర్తవ్యాన్ని పాలించింది. ఆ విహారనౌకనుంచి విచిత్రమూ, అదృశ్యమూ అయిన వాసనాద్రవ్యం తీరుభూములను తన సుగంధంతో ముంచెత్తింది. తనదర్శనం చేసుకొనేటందుకని ఆమె ఆ మహానగరంలోని సర్వప్రజనూ అక్కడికి నడిపించింది. గాలిలో ఈలలు వేసుకొంటూ ఆంటోనీమాత్రం విపణిప్రదేశంలో ఏకాంతంగా తన ఆసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు. శూన్యం అయిపోతుందని అనుకోకపోతే 42 ఆంటోని - క్లియోపాత్రా 205 43 అతడు కూడా క్లియోపాత్రాను చూడటానికి వెళ్ళి ప్రకృతికి శూన్యతను కల్పించి ఉండేవాడే. అగ్రిప్పా : ఆహా, ఈ ఈజిప్టువనిత ఎంతటి విశిష్ట! ఎనోబార్బస్ : ఆమె భూమిమీదికి అవతరించింది. ఆంటోనీ వార్త పంపించాడు. రాత్రివిందుకు ఆమెను ఆహ్వానించాడు. తాను ప్రార్థిస్తున్నప్పుడు అతడే తనకు అతిథికావటం సమంజసమని సమాధానం పంపించింది. ఎన్నడూ ఏ స్త్రీ కూడా 'లేదు కా'దన్నమాట తనవల్ల అనిపించుకోని స్వభావంగల అంటోనీ, ఆమె అభ్యర్థన నంగీకరించి విందునకెళ్లాడు. అతని నేత్రాలు మాత్రమే కుడిచిన విందుకు మూల్యంగా అతడు హృదయాన్ని ఇచ్చుకొని వచ్చాడు. అగ్రిప్పా : ఆహా! క్లియోపాత్రా ఎంతటి రాజసం గల రమణి! ఎనోబార్బస్ : రాజమార్గాన ఆమె నలుబది అడుగులు నడవటం ఒకమారు చూచాను. దానికి తరువాత ఆమె ఉపన్యసించలేకపోయింది. ప్రసంగం పూర్తిఅయిన పిమ్మట సోలిపోకుండా ఉండలేకపోయింది. అట్టి లోపం ఆమెకో పరిపూర్ణతను కల్పించింది. నిశ్వాసోచ్ఛ్వసనం స్తంభనంతో ఆమె తన సమ్మోహనశక్తిని ప్రదర్శించింది. మెకెయ్నీస్ : అయితే ఇక ఆంటోనీ ఆమెను పరిపూర్ణంగా పరిత్యజించవలసిందే! ఎనోబార్బస్ : ఎన్నడూ ఆయన పరిత్యజించడు. పరిత్యజింపలేడు కూడాను! ఆమె వయస్సువల్ల వాడిపోయేది కాదు. ఆమె అనంతవైవిధ్యం అతిపరిచయం వల్ల పాతబడేది కాదు. ఇతరస్త్రీలు తమను అనుభోగించిన వారికి మొగం మొత్తేటట్లు చేస్తారు. ఆమె తనకడ తృప్తికరంగా భుజించినవాళ్లకే అమితబుభుక్షను కల్పించే అద్భుతసామర్థ్యం కలది. ఆమెకడ ఉన్న ఏ అల్పచేష్ట అయినా మనోమనోజ్ఞ విలాసమౌతుంది. అందువల్లనే ఆమె అవినీతితో వర్తించినా, పునీతులైన పురోహితులు గూడా ఆమెను ఆశీర్వదిస్తుంటారు. మెకెయ్నాస్ : సౌందర్యం, సాధుస్వభావం, వివేకం అంటోనీని నిశ్చలంగా నిలుపగలిగితే, ఆక్టేవియా అతనికి పందెంలో లభ్యమైన బహుమంచి ఉపహారం. అగ్రిప్పా : ఇక నిష్క్రమిద్దాము. ఉదాత్తుడా, ఎనోబార్బస్! ఇక్కడ ఉన్నంతకాలం నీవు నా అతిథివి సుమా! 206 (నిష్క్రమిస్తారు) వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మూడో దృశ్యం రోము నగరం. సీజర్ గృహం. ఆంటోనీ, సీజర్, మధ్య ఆక్టేవియా, పరివారమూ ప్రవేశిస్తారు. ఆంటోనీ : రోమక సామ్రాజ్యవ్యవహారాలు, నా ప్రముఖకర్తవ్యాలు కొంతకాలం నీకు నన్ను దూరుణ్ణి చేస్తున్నవి. ఆక్టేవియా : అంత కాలం నేను దేవతలముందు మోకరిల్లి నీ శుభాన్నే అర్థిస్తూ ప్రార్థనలు చేస్తుంటాను. ఆంటోనీ : మహాశయా! సునక్తం. ఆక్టేవియా, ప్రియా! లోకం చెప్పుకొనే వార్తలు విని నన్ను దోషభూయిష్ఠుణ్ణిగా భావించకు. నేను ఎన్నడూ ఆదర్శాన్ని అంటిపెట్టుకొని ఉన్నవాణ్ణి కాను. నిజమే. కానీ భవిష్యత్తులో నా సమస్తజీవితపథాన్నీ నియమానుసారంగా సాగింపదలచాను. ప్రియదేవీ! సునక్తం!! మహాశయా, సీజర్! సునక్తం!! (సీజర్, ఆక్టేవియా నిష్క్రమిస్తారు) 44 జోస్యుడు " ప్రవేశిస్తాడు. ఆంటోనీ : ఏమయ్యా! నీవు ఈజిప్టుకు వెళ్ళిపోదామనుకుంటున్నావట, నిజమేనా? జోస్యుడు : అక్కడినుంచి ముందు నేను ఇక్కడికి రాకుండా ఉంటేనే ఎంతో బాగుండేదని భావిస్తున్నాను. ఆంటోనీ : ఇందుకు కారణమేదైనా ఉందా? ఉంటే చెప్పవచ్చునా? జోస్యుడు : అదేమిటో మాటల్లో నేను చెప్పలేను. కానీ నా అంతరాత్మలో వసిస్తున్నది. త్వరలో తిరిగి ఈజిప్టుకు వెళ్ళిపొమ్మని నీకు నా హెచ్చరిక. - ఆంటోని : ఎవరి అదృష్టం ఆరోహణ క్రమంలో ఉందో చెప్పు - సీజర్ , నాదా? జోస్యుడు : సీజర్. అందువల్ల నీవు అతని ప్రక్క నిలువకు. నిన్ను పాలించే ప్రభావశక్తి - నీ ఉనికికి కారణభూతుడైన దేవదూత ఒంటిగా ఉంటే ఉదాత్తుడు! సాహసోపేతుడు!! మహోన్నతుడు!! నిరుపమానుడు!! సీజర్ శక్తి అంతటివాడు కాడు. కానీ నీవాతని ప్రక్క ఉన్నప్పుడు నీ శక్తి అతని అధికశక్తికి లొంగిపోయేటంతగా ఆంటోని - క్లియోపాత్రా 207 భయభ్రాంతుడౌతున్నాడు. అందువల్ల మీ ఇరువురి మధ్యా ఎంతదూరం ఉండటానికి అవకాశం ఉంటే, అంతటిదూరం ఉండేటట్లు చూడు. ఆంటోనీ : ఇక దీన్నిగురించి విస్తరించి చెప్పకు. జోస్యుడు : నీకు తప్ప మరెవ్వరికీ చెప్పను. దీన్ని నీకై నీవు చెప్పుకుండేటప్పుడు తప్ప మరెప్పుడూ చెప్పను. అతనితో నీవే క్రీడకు పూనుకొన్నా నీకు అపజయం తప్పదు. సహజంగా అదృష్టం అతనిపక్షాన ఉండటంవల్ల గుణవ్యత్యాసాల ఆధిక్యం అమితమై, నీ పజ్జనే ఉన్నా అతడే నిన్ను గెల్చి తీరుతుంటాడు. నీ తేజం మందగిస్తుంటుంది. నీ ప్రక్కన నిల్చినప్పుడల్లా అతడు విరాజమానుడౌతుంటాడు. తిరిగీ హెచ్చరిస్తున్నాను. నీ సంరక్షకశక్తి అతని వెంట వున్న నిన్ను పాలించటానికి భయపడుతున్నాడు. మీ ఇరువురిమధ్యా దూరం ఉన్నప్పుడు అతడు మళ్ళీ మహోదాత్తంగా వర్తిస్తాడు. ఆంటోనీ : ఇక నీవు వెళ్ళిపోవచ్చు. నేను అతడితో మాట్లాడదలిచానని వెంటిడియన్కు తెలియజెయ్. (జోస్యుడు నిష్క్రమిస్తాడు) అతడు పార్థియాకు వెళ్ళాలి. ఇతడు భావికాలపరిజ్ఞానం వల్ల తెలుసుకొని పలికాడో, లేకపోతే వాక్శుద్ధికలవాడు కావటం వల్ల నోట అనేసింది అయి తీరుతుందో! అయితే ఇతను అన్నది మాత్రం సత్యం. ఆటలో వేసిన నా పాచికల్లా అతడికి అనుకూలంగా తిరిగి తీరుతున్నది. ఎంతటి నా ఎత్తయినా సర్వక్రీడల్లో అతని అదృష్టానికి లొంగిపోతున్నది. పందాలలో అదృష్టం కూడా అతనిదే. సర్వవిధాలా ఆధిక్యం నాదే అయి గోచరించే సమయాలలోనూ, కుక్కుట ద్యూతాలలో అతని పుంజులే తుది విజయాన్ని సాధిస్తున్నవి. వ్యత్యాసాల ఆధిక్యం తమకెంత అనుకూలంగా ఉన్నా, రెంటినీ సమానంగానే కట్లతో బిగించినా, అతని లావుకాలే నా పిట్టలను గెలుస్తున్నాయి. నేను ఈజిప్టుకు వెళ్ళితీరాలి! సీజర్తో సంధికని నేను ఆ ఆక్టేవియాను వివాహమాడాను. అయితే నా ఆనందసర్వస్వం ఆ ఈజిప్టులోనే ఉంది. 45 వెండిడియస్ ప్రవేశిస్తాడు. స్వాగతం వెంటిడియస్! నీవు పార్థియాకు బయలుదేరాలి. అక్కడ వ్యవహారాల నన్నింటినీ చక్కబెట్టటానికి నీకు అధికారాన్నిచ్చే అవసరమైన పత్రాలను అన్నింటినీ సిద్ధం చేయించాను. నావెంటవచ్చి వాటిని పుచ్చుకో. (నిష్క్రమిస్తారు) 208 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 నాలుగో దృశ్యం రోములో ఒక వీథి. లెపిడస్, మెకయ్నిస్, అగ్రిప్పా ప్రవేశిస్తారు. లెపిడస్ : ఇక దాన్ని గురించి మీరేమీ కలతపడవద్దు. మీ సేనానాయకులను త్వరపెట్టండి. అగ్రిప్పా : మార్క్ ఆంటోనీ ఆక్టేవియాకు వీడ్కోలు ముద్దు ఇచ్చి రావటానికి వెళ్లాడు. మేము ఆయనను అనుసరించి వస్తాము. లెపిడస్ : మిమ్మల్ని తిరిగీ మా సైనికవేషాలలో చూచేటంతవరకూ వీడ్కోలు. మెకెయ్నిస్ : ప్రయాణానికి పట్టే కాలపరిగణనాన్ని బట్టి మీ కంటే ముందు మేమే మైసీనం చేరుకుంటాము. లెపిడస్ : అవును. మీ మార్గం హ్రస్వమైంది. నాకున్న పనులవల్ల చుట్టుదారి తీసుకోవలసి వచ్చింది. నా కంటే రెండుదినాలు ముందుగానే మీరు అక్కడికి చేరుతారు. మెకెయ్నాస్, అగ్రిప్పా : ఘనవిజయం కల్గుగాక! లెపిడస్ : శుభమగుగాక!! (నిష్క్రమిస్తారు) ఐదో దృశ్యం అలెగ్జాండ్రియా, క్లియోపాత్రాప్రాసాదం. క్లియోపాత్రా, ఛార్మియన్, ఐరాస్, ఎలెగ్జాస్ ప్రవేశిస్తారు. క్లియోపాత్రా : నాకు కొంత సంగీతాన్ని ప్రసాదించండి. ప్రణయ వ్యాపారంలో నిమగ్నులైనవారి చిత్తానికి అది చక్కని ఆహారం. పార్శ్వచరులు : సంగీతం! సంగీతం!! రండి! వినిపించండి!! కొజ్జా మార్డియన్ ప్రవేశిస్తాడు. క్లియోపాత్రా : సంగీతాన్ని వినను. ఛార్మియన్, బిలియర్డ్స్ అడుకొందాం రా. ఛార్మియన్ : నా చేతికి గాయం తగిలింది. మార్డియన్తో ఆడు. ఒక స్త్రీ మరొక స్త్రీతో ఆడినట్లే కొజ్జాతో కూడా ఆడవచ్చు. రా మార్డియన్! నాతో బిలియర్డ్స్" ఆడుతావా? ఆంటోని - క్లియోపాత్రా 209 మార్డియన్: రాజీ! చేతనైనరీతిగా ఆడుతాను. క్లియోపాత్రా : ఒక వ్యక్తి సదుద్దేశంతో కార్యాచరణకు పూనుకొంటే అది ఫలవంతం కాకపోయినా, అతడు క్షమార్థి కావచ్చు. వద్దు. నేనా ఆట ఆడను, నా 'మీనదండాన్ని' తెచ్చిపెట్టండి. నది దగ్గిరికి వెళ్లుదాం. వెళ్లి అక్కడ గానం చేస్తూ బూడిదరంగు పొలుసులతో పొలుపారే మత్స్యాలను మోసగిస్తాను. వక్రమైన నా కొంకిని వాటి మెత్తని దవడల్లో గుచ్చుకొనేటట్లు చేసి ఒక్కొక్క దాన్నే బయటకు లాగేస్తాను. ప్రతి మత్స్యాన్నీ ఆంటోనీగా భావించి 'అహ!' 'అహ!' అంటోనీ! నీవు పట్టుబడ్డావు' అని పరిహాసవాక్యాలు పలుకుతాను. ఛార్మియన్ : ఆయన పట్టిన చేపలకంటే ఎక్కువగా పడతానని వెనక నీవు పందెం వేసినప్పుడు మాకు మహానందంగా ఉన్నది. మీ ఈతగాడు ఒకమారో ఉప్పుచేపను ఆయన గాలానికి తగిలిస్తే, అది తెలియక ఆతురతతో ఆయన గాలాన్ని బయటికి లాగాడు జ్ఞప్తికుందా? క్లియోపాత్రా : ఆ సమయంలో, ఒక ఆ సమయ మేమిటి, అప్పుడు అనేకసమయాలల్లో, ఉదయవేళల ఎకసక్కాలతో చిత్తశాంతిని చెరిచి, రాత్రివేళల చక్కని సరసాలలో పడేశాను. మరుసటిదినం ఉదయవేళ తొమ్మిదిగంటలు ద్రాక్షాసవంలో ముంచి మంచినిద్రలో మునిగిపోయేటట్లు చేశాను. తరువాత నా శిరోవేష్టనాన్నీ, దుస్తులనూ అతడు ధరించేటట్లు చేసి నేనాతని ఫిలిప్షన్ ను చేతబుచ్చుకున్నాను. ఒక వార్తాహరి ప్రవేశిస్తాడు. ఇటలీ నుంచి వచ్చావా? సద్వార్తలు విని బహుకాలమైంది. త్వరగా నా చెవులకు ప్రయోజనకరాలైన వార్తలను వినిపించు. వార్తాహరి : రాఖీ! మహారాజ్జీ!! 47 క్లియోపాత్రా : ఆంటోనీ మరణించాడా? ఓరి తులువా! ఆ వార్తను వినిపించావంటే మీ మహారాజ్ఞిని చంపుకొంటున్నావని తెలుసుకో! ఆయన క్షేమంగానూ, స్వచ్ఛందవృత్తితోనూ ఉన్నాడని తెలియజేయగలిగితే బంగారం నీకు బహూకృతిగా లభిస్తుంది. అంతే కాదు, అందమైన నీలధమనులకు నిలయమై తమరదనచ్ఛదాలను సోకించి ముద్దెట్టుకొన్నప్పుడు రారాజులే కంపించిన నా కరపల్లవం నీకు ముద్దెట్టుకోటానికి కానుకగా లభిస్తుంది. 210 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 వార్తాహరి : రాజ్జీ! ఆయన క్షేమంగానే ఉన్నారు. క్లియోపాత్రా : ఇదిగో, నీకు కొంత స్వర్ణాన్ని బహూకరిస్తున్నాను. కానీ విను. సర్వబంధాలూ తొలగిపోవటంవల్ల, మనం మరణించిన వ్యక్తిని గురించి కూడా క్షేమంగానే ఉన్నట్లు చెప్పుకొంటుంటాము. ఈ వార్తను నీవు పై అర్థంతో పలికావో ఇచ్చిన బంగారాన్ని కరిగించి నీకిస్తాను. అంతే కాదు, ఈ దుర్వార్త వినిపించినందుకు నీ గొంతుకలో దాన్ని పోస్తాను. వార్తాహరి : ప్రియమైన రాజీ! నేచెప్పేది వినవలసిందని ప్రార్థన. క్లియోపాత్రా : మంచిది. వింటాను. మొదలుపెట్టు. కానీ నీ చూపు అరిష్టసూచకంగా ఉంది. ఆంటోనీ నిజంగా సుఖియై స్వతంత్రుడుగానే ఉండి ఉన్నట్లయితే, అంతటి మంచివార్తను చెప్పబోయేటప్పుడు నీ కన్నుల్లో ఆ కషాయవీక్షణం ఉండవలసిన అవసరం లేదు. ఆయన సుక్షేమంగా ఉండకపోతే నీవు సక్రమమైన మానవాకృతితో వచ్చేవాడివా? సర్పకిరీట ఐన ఆఫ్యూరీలా వచ్చి ఉండేవాడివి. 48 వార్తాహరి : దయ ఉంచి నేను చెప్పవచ్చింది వింటారా? క్లియోపాత్రా : మాట్లాడబోయేముందుగానే నిన్ను దండించాలె ననిపిస్తున్నది. అయినా 'ఆంటోనీ సజీవుడుగానే ఉన్నాడు. క్షేమంగానే ఉన్నాడు, సీజర్తో మిత్రుడుగానే ఉన్నాడు. అతడికి బానిస కాలేదు' అని చెప్పావో నీమీద బంగారాన్ని వర్షిస్తాను మంచి ముత్యాలల్లో ముంచెత్తుతాను. వార్తాహరి : రాజీ! ఆయన క్షేమంగానే ఉన్నాడు. క్లియోపాత్రా : ఇది శుభవార్త! వార్తాహరి : సీజర్తో మిత్రుడుగానే ఉన్నాడు. క్లియోపాత్రా : అయితే నీవు సత్యవాదివి. వార్తాహరి : ఆయనా సీజర్ వెనుకటికంటే కూడా అత్యధికమైత్రితో మెలగుతున్నారు. క్లియోపాత్రా : నీకెంత సంపద కావాలో కోరుకో. వార్తాహరి : కానీ - క్లియోపాత్రా : నీ కానీలు నాకు నచ్చవు. తుంటరి కానీ - ఒక కారాగారాధికారి వెంట దోషిని తెచ్చినట్లుగా - ఈ కానీ దుర్వార్తకు ముందు నడుస్తుంటుంది. నిన్ను ఆంటోని - క్లియోపాత్రా - 211 ప్రార్థిస్తున్నాను. మంచిచెడ్డలు కలగలుపుతో, మిత్రుడా! నీవు తెచ్చిన వార్తలన్నిటితో, ఒకేమారు నా చెవులను నింపేయి! ఆయన సీజర్తో మిత్రుడుగా ఉన్నాడన్నావు, ఆరోగ్యవంతుడుగా ఉన్నాడన్నావు, స్వతంత్రుడుగా ఉన్నాడన్నావు కదూ? వార్తాహరి : స్వతంత్రుడని నేనన్నానా? లేదు రాజీ! ఆయన ఆక్టేవియాతో అనుబంధితుడైనాడు. క్లియోపాత్రా : ఛార్మియన్! ఈ వార్తతో నేనెంతగా పాలిపోయానో గమనించావా? వార్తాహరి : రాజీ! ఆయన ఆక్టేవియాను పరిణయమాడాడు. క్లియోపాత్రా : అంటువ్యాధులన్నింటిలోనూ అమితశక్తి గలది నిన్ను ఆవరించుగాక! వార్తాహరి : రాజ్జీ! శాంతి వహించండి. క్లియోపాత్రా : ఏమంటున్నావు? ఇక్కడినుంచి వెళ్ళిపో! (తిరిగి కొడుతుంది) ఓరి మహాద్రోహీ! వెళ్ళిపో! లేకపోతే నీ కనుగ్రుడ్లను కాలిముందున్న బంతుల్లా తన్నేస్తాను. తలమీది వెంట్రుకలన్నిటినీ ఊడబెరికిస్తాను. (కురులు పట్టుకొని క్రిందికి పైకీ లేవనెత్తి కూలబడుస్తుంది) తీగతో నిన్ను కొట్టించి, ఉప్పునీటిలో పడేయించి తన్నుకొనేటట్లు చేయిస్తాను. వార్తాహరి : ఔదార్యగుణోపేతా! రాజీ!! నేను కేవలం వార్తను తెచ్చినవాణ్ణిగాని, ఆ పెళ్ళి చేయించినవాణ్ణి గాను. క్లియోపాత్రా : అలా కాదు. ఆ వివాహం జరగలేదని చెప్పు నీకో రాజ్యమిస్తాను. ఘనమైన సంపదలిస్తాను. నీవు నాకు కోపం తెప్పించటమనే దోషాన్ని చేశావు. అందుకు నా వల్ల తిన్న దెబ్బలనే శిక్ష సరిపోతుంది. దీనికి తోడుగా ఇంకా నీవు ఏమి కోరుకొంటే అదల్లా ఇస్తాను. ఆ పరిణయం జరగలేదని చెప్పు! వార్తాహరి : రాజ్జీ! ఆయన వివాహమాడాడు. క్లియోపాత్రా : ఓరి ద్రోహీ! నీవు ఇప్పటికే బహుకాలం బ్రతికావు! (కత్తి దూస్తుంది) వార్తాహరి : అయితే నేను పారిపోతాను. నేనే తప్పిదమూ చెయ్యలేదు. ఛార్మియన్: రాజీ! నీ మేర మీరవద్దు. అతడు నిర్దోషి. 212 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 క్లియోపాత్రా : కొందరు నిర్దోషులైనా పిడుగుపాటును తప్పించుకోలేరు. ఈ ఈజిప్టు సమస్తం నైలుగా కరిగిపోవుగాక! పరమసత్వస్వభావం గల జంతుకోటి అంతా సర్పజాతిగా రూపపరివర్తన పొందుగాక! ఆ సేవకుణ్ణి మళ్ళీ పిలు. నేను ఉన్నతస్థితిని వహించి ఉన్నా అతణ్ణి కరవనులే పిలు. (ఛార్మియన్ నిష్క్రమిస్తుంది) దీనికంతటికీ కారణాన్ని నేనే. - ఆంటోనీని గాఢంగా ప్రేమించాను. అయ్యో! ఒక అల్పుణ్ణి గట్టిగా కొట్టాను. ఈ నా హస్తాలు ఔదార్యమెరుగవు! ఛార్మీయన్, వార్తాహరి తిరిగి ప్రవేశిస్తారు. ఆయన వివాహం చేసుకొన్నాడా? వార్తాహరి : నేను గౌరవనీయులైన మీ క్షమాపణను ఆర్థిస్తున్నాను. క్లియోపాత్రా : ఆయన వివాహమాడాడా? వార్తాహరి : మీకు నేను కోపం తెప్పించదలచుకోలేదు. నేను చెప్పేదానిలో ఇప్పుడు క్రొత్తదోషం ఏమీలేదు. కనక దీన్ని అలా భావించవద్దు. ఈ తప్పిదాన్నయినా మీరే నన్ను బలవంతపెట్టి చేయిస్తున్నారు. అందుకు నన్ను శిక్షించటం అన్యాయం. ఆయన ఆక్టేవియాను వివాహమాడాడు. క్లియోపాత్రా : నీవు సహజంగా దోషివి కావయ్యా! ఆయన దోషం నిన్ను దోషిని చేస్తున్నది. ఏమిటి? ఆయన వివాహమాడాడా? నిశ్చయంగా నీకు తెలుసునా? ఇక్కడినుంచి వెళ్ళిపో! రోమునుంచి నీవు తెచ్చిన వస్తుసంభారాలు నాకు విలుచుకోతగ్గవి కావు. అవి నీకే మహాభారాలౌగాక! ఆ ఘనభారాలతో నీవు క్రుంగిపోవుదువుగాక!! (వార్తాహరి నిష్క్రమిస్తాడు) ఛార్మియన్: మహారాజ్జీ! చిత్తశాంతి వహించు. క్లియోపాత్రా : ఆంటోనీని ప్రశంసించి నేను సీజర్ను అగౌరవించాను. రావయ్యా! ఇలారా!! సత్యమే అయినా దుర్వార్తను తీసుకురావటం క్షేమం కాదు. ప్రియమైన వార్తను పదివేల నాలుకలతో పలుకు. దుర్వార్తలను అనుభవించటం వల్ల తెలియబడనీ! వార్తాహరి : రాజీ! నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చాను అంతే. ఆంటోని - క్లియోపాత్రా 213 క్లియోపాత్రా : ఆయన వివాహమాడాడా? నీవు 'అవు' నని చెప్పినందువల్ల నిన్ను పూర్వం అసహ్యించుకొన్న దానికంటే అధికంగా అసహ్యించుకొనేది ఇంకేమీ ఉండదు. వార్తాహరి: అవును. ఆయన వివాహమాడాడు. క్లియోపాత్రా : దేవతలు నిన్ను నిర్మూలించెదరుగాక! ఇంకా నీవు అవుననే అంటున్నావా? వార్తాహరి : అయితే, రాజీ, అబద్ధమాడమన్నారా మరి? క్లియోపాత్రా : ఈ నా ఈజిప్టులో అర్ధభాగం జలమయమై, పొలుసు పాములకు నిలయమైన కుండికగా మారిపోయినా, ఈ విషయంలో అసత్యమాడమనే నిన్ను అభివాంఛిస్తాను. వెళ్ళిపో! ఇక్కడినుంచి వెళ్ళిపో. నార్సిస్సుయస్" వంటి సుందరుడవైనా, నీవు నాకు కురూపివిగా కనిపిస్తుంటావు. ఛార్మియన్ : ఒకమారు కాదు బహుపర్యాయాలు. 50 క్లియోపాత్రా : అందుకు తగినట్లు అనుభవిస్తున్నాను. ఇక్కడనుంచి నన్ను తీసుకుపొండి. నాకు మూర్ఛ వస్తున్నట్లుంది. ఐరాస్! ఛార్మియన్!! పోనీయండి. పరవాలేదు. ఎలెగ్జాస్! వార్తాహారి దగ్గరికి వెళ్లు. ఆ ఆక్టేవియా రూపం, వయస్సు, స్థితిగతులూ తెలియజేయమని చెప్పు. ఆమె జుత్తురంగు ఎలాటిదో చెప్పటం మరిచిపోవద్దను. త్వరగా నాకు సమాధానం తీసుకు రా! (ఎలెగ్జాస్ నిష్క్రమిస్తాడు) ఛార్మియన్! అతణ్ణి నిత్యంగా నా దగ్గిరనుంచి వెళ్ళిపోనీ. కాదు. కాదు. వెళ్ళనివ్వకు. ఒకవంక అతడు గార్గన్" మహాభయంకరుడైనా మరొకవంక మార్పు లా మహోదాత్తుడు. (మార్డియన్ ) నీవు వెళ్లి ఆమె ప్రమాణం ఎంతో అది కూడా తెలుసుకోరమ్మని ఎలెగ్జాస్ ను ఆజ్ఞాపించానని చెప్పు. ఛార్మియన్! నన్ను కనికరించు. అయితే నన్ను పలకరించి మాటాడకు. నా కక్ష్యకు, నడిపించుకు పో. 52 (నిష్క్రమిస్తారు) ఆరో దృశ్యం 51 మెసినమ్ వద్ద, దుందుభి తుత్తారధ్వనులతో పాంపే, మెనాస్ ఒకవంక, సీజర్, ఆంటోనీ, లెపిడస్, ఎనోబార్బస్, మెకన్నాస్ ఒకవంక విన్యాసానుగుణంగా నడుస్తున్న సైనికులతో ప్రవేశిస్తారు. 214 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 పాంపే : మీ కుదువజనం నా దగ్గిరా నా కుదువజనం మీ దగ్గిరా ఉన్నారు. యుద్ధానికి దిగబొయ్యేముందు మనం కొంత సంభాషించుకోవలసి ఉంది. సీజర్ : తొలుతగా మనం ఇలా సంభాషణకు పూనుకోటం సముచితంగా ఉంది. అందుకోసమే వ్రాతమూలకంగా మా నిబంధనలను మా రాకకు ముందుగానే నీకు చేర్చాము. వాటిని పూర్వమే మీరు పరిశీలించి ఉంటారనుకొంటాము. మరి నీవు విప్లవఖడ్గానికి ఒరచూపించి వెంట తెచ్చిన బలశాలురైన వీరయువకులనందరినీ సిసిలీకి తిరిగి తీసుకోపోతావో, లేకపోతే ఇక్కడ బలి ఇస్తావో తెలియజేస్తావా? 55 పాంపే : ఈ రోమకసామ్రాజ్యానికి ఏకైకపాలకులు, సర్వదేవతా ప్రతినిధులూ అయిన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఫిలిప్పీ యుద్ధరంగంలో ఉదాత్తు డైన బ్రూటస్ నన్ను జూలియస్ సీజర్ భూతమై వెన్నాడినప్పుడు మీరు ఆయనకోసం ప్రతీకారాన్ని పొందారు. కుమారుణ్ణి, మిత్రులను కలిగిఉన్న నా జనకుడు " అట్టి ప్రతీకారాన్నే ఎందుకు పొందకూడదు? వివర్ణవీక్షలు గల కాషియస్ సీజర్మీద ద్రోహాన్ని ఎందుకు తలపెట్టవలసివచ్చింది? సర్వజన ప్రీతిపాత్రుడు, సత్యసంధుడు అయిన బ్రూటస్ శస్త్రధారియై స్వేచ్ఛాపిపాసువులు సహాయంతో సభాభవనాన్ని రక్తపంకిలం చేయటానికి పురికొల్పిందేది? అదే ఈ నాడు దాని భారంవల్ల సముద్రాన్ని క్రోధంతో నురగలు కక్కేటట్లు చేసే నౌకాదళాన్ని నిర్మించటానికి ప్రోత్సహించింది. ఈ నౌకాదళంతో, ఉదాత్తుడైన నా తండ్రి యెడ నిర్లక్ష్యం చేసి ప్రకటించిన కృతఘ్నతకు తగ్గ ప్రతీకారాన్ని నేను చేయదలిచాను. సీజర్ : పాంపే! నీవు స్వేచ్ఛగా సంభాషించవచ్చు. 56 ఆంటోనీ : నీ నౌకాదళాన్ని చూపెట్టి, పాంపే, నీవు మమ్మల్ని భయపెట్టలేవు. ఇక నేలమీద నీ కంటే మేమెంత అధికులమో అది నీకు తెలియంది కాదు. 57 పాంపే : నిజం ఆంటోనీ! మా జనకుల సౌధాన్ని సంగ్రహించావు. కనుక నేలమీద మీరు నా కంటే అధికులే. నీ వలెనే నిజంగా కోకిల తనకోసమని ఒక గూడు కట్టుకోదు. మరో శకుంతసదనాన్ని ఆక్రమిస్తుంది. అందులో స్థిరనివాసం చేయటానికి ఇక చేతనైతే యత్నించు. లెపిడస్ : ఈ ప్రసంగానికి వర్తమానంతో ఎట్టి ప్రసక్తి లేదు. మేము పంపించిన కాన్కలను నీవు ఎలా స్వీకరించావో తెలియజేస్తావా? సీజర్: అవును. వ్యవహారాన్ని ఇక మనం సాగనివ్వాలి. ఆంటోని - క్లియోపాత్రా 215 ఆంటోనీ : మా ప్రార్థనలకు లొంగిమాత్రం వాటిని స్వీకరించవద్దు. పరిగ్రహించటంవల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఆలోచించే గ్రహించు. 58 సీజర్ : ఇంతకంటే అధికసంపదను సంపాదించాలని ఆశించి యత్నిస్తే ఫలిత మేమౌతుందోకూడా ఆలోచించు. పాంపే : మీరు సిసిలీ", సార్టీనియాలను నాకిస్తామంటున్నారు. ఇందుకు గాను నేను సముద్రాలమీది ఓడదొంగలనందరినీ తరిమివెయ్యాలనీ, కొంత గోధుమను రోముకు సరఫరా చెయ్యాలనీ నిబంధనలను నిర్ణయించారు. ఇందుకు నే నంగీకరిస్తే ఖడ్గపు కణకణలు వినిపించకుండానే, ఒరలు సొట్టలు పడకుండానే తిరిగిపోవచ్చు నన్నారు. సీజర్ : అవును, ఇవే మేము నివేదించే నిబంధనలు. పాంపే అయితే, వినండి, నేను ఇక్కడికి మీ నిబంధనలను అంగీకరించే అభిప్రాయంగల వ్యక్తిగానే వచ్చాను. కానీ ఆంటోనీ నన్ను ఉద్రిక్తుణ్ణి చేశాడు. ఈ చెప్పేదాన్ని వినిపించటం వల్ల నేను విలువను ఎంతగా కోల్పోయినా, ఆంటోనీ, దీన్ని నీకు నేను చెప్పితీరాలి. సీజర్, నీ సోదరుడూ పోరాడుకొన్నప్పుడు నీ తల్లి సిసిలీకి వచ్చింది ఆమెకు నా తల్లి స్నేహసౌహార్దకమైన అతిథ్యాన్ని ఇచ్చింది. ఆంటోనీ : పాంపే! ఈ విషయాన్ని నేను విన్నాను. ఇందుమూలంగా నీకు ఋణపడ్డ నేను కృతజ్ఞతాప్రణామాలను అర్పించటానికి సంసిద్ధుణ్ణిగానే ఉన్నాను. పాంపే : అయితే నీ హస్తమేదీ? ఆంటోనీ, నేను నిన్ను ఇక్కడ కలుసుకొంటానని అనుకోలేదు. ఆంటోనీ : ప్రాద్దేశంలోని శయ్యలు పరమసుకుమారాలు. పని ఉన్న దానికంటే ముందుగా నన్ను మీరిక్కడికి రప్పించారు. ఇందువల్ల ఎంతో ఘనమైన ప్రయోజనాన్ని పొందాను. నీకివే నా ప్రణామాలు. సీజర్ : వెనక నేను నిన్ను చూచినప్పటికంటే నీలో ఎంతో మార్పు కనిపిస్తున్నది. పాంపే : అదృష్టం నా ముఖాన ఏ నూతనరేఖలను లిఖించిందో నాకు తెలియదు. కానీ ఆమె నా హృదయంలో ప్రవేశించి నన్ను మాత్రం బానిసను చేసుకోలేదు. లెపిడస్ : మనమంతా ఇక్కడ కలుసుకోగలిగాము ఎంతో తృప్తిగా ఉంది. 216 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 పాంపే : లెపిడస్! నేనూ అలాగే భావిస్తున్నాను. మనం కొన్ని నిబంధనలను అనుమతించాము. వాటిని లేఖోక్తాలు చేసి హస్తాక్షరాలతో మనదగ్గిర భద్రపరచు కొందాము. సీజర్ : ఇక జరిగించవలసింది ఇంతే. పాంపే : మనం తిరిగి వెళ్ళబోయేముందు ఒకరికొకరం విందులు చేసుకొందాం. వీటిని ఎవరు ఆరంభించాలో చీట్లు వేద్దాం. ఆంటోనీ : పాంపే! నేను ముందుగా నీకు విందు చేస్తాను. పాంపే : అలా కాదు ఆంటోనీ! చీట్లు వేద్దాం. ముందైతేనేం, వెనకనైతేనేం? విందులకు సంబంధించిన కీర్తిమాత్రం అద్భుతప్రజ్ఞ గల నీ ఈజిప్టు బానిసీండ్రదేలే. అక్కడి విందులను అనుభవించే ఆ జూలియస్ సీజర్ చియ్యబట్టాడని విన్నాను. ఆంటోనీ : చాలా విశేషాలు విన్నావే? పాంపే : ఇందులో నేనేమీ అపార్థాన్ని ఉద్దేశించలేదు. ఆంటోనీ : అయితే తగ్గ పదాలను కూడా ప్రయోగించి ఉండవలసింది. పాంపే : నేను ఇంతపాటిగానే విన్నాను. నేను విన్నది ఎప్పొలొడోరస్ మోసుకోవచ్చి - ఎనోబార్బస్ : ఇక ఆ విషయాన్ని గురించి ఆపివేద్దాం. అవును, అతడలా చేశాడు. పాంపే : ఏం చేశాడు? దయ ఉంచి సెలవీయాలి. 61 ఎనోబార్బస్ : మెత్తని మెత్తలో ఒక రాజ్ఞిని సీజర్ దగ్గిరికి వీపుమీద మోసుకోవచ్చాడు. పాంపే : నీవెవరవో నాకిప్పుడు జ్ఞప్తికి వచ్చావయ్యా! ఏమయ్యా సైనికుడా! ఎలా ఉంటున్నావు? ఎనోబార్బస్ : సుఖంగా ఉంటున్నాను. ఇంకా సుఖంగా ఉండగోరుతున్నాను నాకంటిముందు రాబొయ్యే నాలుగు విందులు కనిపిస్తున్నాయి. - పాంపే : ఏదీ నీ కరచాలనం! నిన్ను నేనెన్నడూ అసహ్యించుకోలేదు. నీ యుద్ధ ప్రావీణ్యాన్ని ఈర్ష్యవహిస్తూ తిలకించాను. ఆంటోని - క్లియోపాత్రా 217 ఎనోబార్బస్ : ప్రభూ! నేను మిమ్మల్ని పూర్వం ఎన్నడూ ప్రేమించలేదు. కానీ ఎన్నోమారులు ప్రస్తుతించాను. స్తుతించినప్పుడల్లా నాకు మీరు పదింతలుగా ప్రస్తుతికి యోగ్యులని అనిపించారు.

పాంపే కాపట్యం లేని నీ కమనీయసంభాషణకు నాకు మహానందం కలుగుతున్నది. ఇది నీకు లోపం కాదు. నా నౌక మీదికి విందారగించను రమ్మని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దారి చూపించండి. సీజర్, ఆంటోనీ, లెపిడస్ : మీరే దారి చూపించండి. పాంపే : అయితే అనుసరించండి. (మెనస్, ఎనోబార్బస్ తప్ప అందరూ నిష్క్రమిస్తారు) మెనాస్ : (అపవారితంగా) మీ జనకులు పాంపే అయితే ఇటువంటి సంధి చేసేవారు కారు - నీవూ, నేనూ పూర్వం కలుసుకొన్నామనుకొంటాను. ఎనోబార్బస్ : సముద్రంమీద కలుసుకొన్నాం. మెనాస్ : అవును. ఎనోబార్బన్ : నీటిమీద నీవు మంచి ప్రావీణ్యాన్ని ప్రదర్శించావు. మెనాస్ : నీవు నేలమీద మంచి ప్రజ్ఞను ప్రకటించావు. ఎనోబార్బస్: నేలమీద ప్రదర్శించిన ప్రజ్ఞకు నేను స్తుతియోగ్యుడను కానని తిరస్కరించను గాని, నన్ను స్తుతించి ఏ వ్యక్తినైనా నేను తిరిగి స్తుతించటానికి సంసిద్ధుణ్ణి. మెనాస్ : సముద్రం మీద ప్రకటించిన ప్రావీణ్యానికి నేనూ స్తుతియోగ్యుడను కాదని అనను. ఎనోబార్బస్ : భద్రతకోసం ఏదో ఒకటి ఒదులుకోవాలి కనుక - నీవు సముద్రాలమీద గొప్ప బందిపోటువు. మెనాస్ : నీవు నేలమీద గొప్పదొంగవు. ఎనోబార్బస్ : ఈ విషయంలో నాకు నేలమీద ప్రావీణ్యం ఉందని నేను అంగీకరించను. కానీ, మెనాస్, నీ హస్తమేదీ? మన కన్నులే పాలనాధికారం గలవైతే, ఇరువురు 218 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 దొంగలు మిత్రులౌతూ పరస్పరం ముద్దిడుకొనేటప్పుడు వారిని బందీలనుగా ఇప్పుడే పట్టుకోగలవు. మెనాస్ : చేతులెటువంటివైనా వ్యక్తుల ముఖాలు వారి శీలాన్ని వ్యక్తీకరిస్తుంటాయి. ఎనోబార్బస్ : మోసగించని ముఖంగల స్త్రీ ఒక్కతైనా ఉండదు. మెనాస్ : నీవన్నది అభాండం కానే కాదు. అతివలు హృదయాలను అపహరిస్తారు. ఎనోబార్బస్ : మేము నీతో పోరాడటానికని వచ్చాము. మెనాస్ : కానీ, నా అభిప్రాయం చెప్పనా, అది తిని త్రాగటం క్రిందికి దిగింది. పాంపే ఈ నాడు తన అదృష్టంతో పరాచకాలాడుతున్నాడు. 162 ఎనోబార్బస్ : అలా చేసి ఉన్నట్లయితే అతడెంతగా విలపించినా, తరువాత తప్పిపోయిన తన అదృష్టాన్ని తిరిగీ పొందలేడు. మెనాస్ : మీరు సత్యం చెప్పారు. మార్క్ అంటోనీ ఇక్కడికి వస్తాడని మేము ఊహించలేదు. క్షమించండి. ఆయన క్లియోపాత్రాను వివాహమాడాడా? ఎనోబార్బస్ : ఆయన పెళ్లాడింది క్లియోపాత్రాను కాదు. సీజర్ సోదరిని, ఆక్టేవియాను. మెనాస్ : అది నిజం. ఆమె కెయస్ మార్సెల్లస్కు వెనుక భార్య కదూ? ఎనోబార్బస్ : అయితే ఇప్పుడామె మార్కస్ ఆంటోనీయస్కు భార్య అయింది. మెనాస్ : క్షమించాలి! నీవు చెప్పేది - ఎనోబార్బస్ : సత్యం! మెనాస్ : అయితే, ఆంటోనీ, సీజర్ స్థిరానుబంధం ఏర్పరచుకొన్నారన్న మాట! ఎనోబార్బస్ : ఈ అనుబంధాన్ని గురించి జోస్యం చెప్పమని నన్నడిగితే ఇది స్థిరమైందని నేననను. మెనాస్ : వివాహితులు అనురాగం కంటే ఈ పరిణయ విషయంలో రాజకీయ కారణాలు విశేషపాత్ర వహించాయని అనుకొంటాను. ఎనోబార్బస్ : నేనూ అలాగే భావిస్తున్నాను. వారిరువురినీ మిత్రులనుగా కూర్చిన ఈ బంధమే వారి స్నేహానికి ఉరిత్రాడు" కావటం ఆనతికాలంలోనే నీవు చూడగలుగుతావు. ఆక్టేవియా పవిత్రురాలు. అతిశీతలస్వభావ, నిత్యవర్తనలో అతిస్తబ్ధ. ఆంటోని - క్లియోపాత్రా 219 మెనాస్ : అట్టి స్త్రీ భార్యగా ఉండటాన్ని కోరుకోనివాడంటూ ఎవడైనా ఉంటాడా? ఎనోబార్బన్ : ఉండకేం? ఆ స్వభావాలు లేనివాడు అట్టి వనితను భార్యగా కోరుకోడు. మార్క్ ఆంటోనీ అటువంటి వ్యక్తి. అతడు తిరిగి తన ఈజిప్టు వంటకం దగ్గరికే చేరుకొని తీరతాడు. అప్పుడు ఆక్టేవియా వేడినిట్టూర్పులు సీజర్ శరీరంలోని రక్తోష్టమను సంధుక్షణం చేస్తాయి. ఇందాక నేనన్నట్లు నేటివారి స్నేహబలమే తరువాత ప్రబలవైరానికి కారణమౌతుంది. ఆంటోనీ తన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే సుఖిస్తాడు. ఒక రాజకీయ కారణంవల్ల ఇక్కడ వివాహమాడాడు. అంతే! మెనాస్ : అవును. అలాగే జరగవచ్చు. రా. నౌక మీదికి రావా? నీ ఆరోగ్యానికి నేనో పానీయాన్ని నిర్దేశిస్తాను. ఎనోబార్బస్ : నీవు నిర్దేశించిన పానీయాన్ని నేను తప్పక సేవిస్తాను. ఈజిప్టులోని మధుసేవల్లో మా గొంతుకలకు మహాఘనంగా పని కల్పించాము. మెనాస్ : రా. వెళ్లుదాము. (నిష్క్రమిస్తారు) ఏడో దృశ్యం సంగీతం వినిపిస్తుంటుంది. ఒక వంటకంతో ఇద్దరో, ముగ్గురో సేవకులు ప్రవేశిస్తారు. ప్రథమ సేవకుడు : ఒరేయ్, వాళ్లిక్కడే ఉంటారు. వారిలో కొందరి అడుగులు అప్పుడే తడబడుతున్నాయి. చిన్న చిరుగాలి వీస్తే చాలు, చిత్తుగా పడిపోతారు. ద్వితీయ సైనికుడు : తాను త్రాగిన ద్రాక్షవల్ల లెపిడస్ ఎఱ్ఱనారిపోయినాడు. 64 ప్రథమ సేవకుడు : అసవశేషాన్ని కూడా అతని చేతనే త్రాగించారు. ద్వితీయ సైనికుడు : విలాసోత్సాహంలో వారు ఒకరిభాగాలను మరొకరికి పోస్తూ నిర్బంధ పెడుతున్నప్పుడు, అతడు 'ఇక చాలు. వద్దు!' అని కేకలు పెట్టాడు. అయితే వారి ప్రార్థనలను ఒకవంక తిరస్కరిస్తున్నా మరోవంక సహవ్రతు లిరువురి మధ్య శాంతిని సంధించటం కోసం అతడు తప్పతాగాడు. 220 వావిలాల సోమయాజులు సాహిత్యం-3

ప్రథమ సైనికుడు : కానీ ఇది అతనికీ, అతని నిర్ణయానికీ మధ్య పెద్దయుద్ధాన్ని తెచ్చి పెట్టింది. ద్వితీయ సైనికుడు : గొప్పవారిలో ఒకడని పేరుపొందటానికి పాటుపడుతుంటే కలిగే ఫలితాలలో ఇదొకటి. ప్రయోగించను పనికిరాని నేజా మీద ఆధారపడటం కంటే నేను ఒక గడ్డిపోచమీద ఆధారపడతాను. ప్రథమసేవకుడు : నక్షత్రమండలంలో ఒక గ్రహంగా ఉండికూడా సంచారం లేకపోవటం, కపోలాల సౌందర్యాన్ని చెరుస్తూ ఉండే గ్రుడ్డు లేని లొత్తలను పోలి ఉంటుంది. తుత్తారధ్వని వినిపిస్తుంది. సీజర్, ఆంటోనీ, లెపిడస్, అగ్రిప్పా, మెకన్నాస్, ఎనోబార్బస్, మెనాస్, ఇతర సేనాపతులతో ప్రవేశిస్తారు. ఆంటోనీ : (సీజర్ ) వారు అలాగే చేస్తుంటారు. నైలునదిని కొలవటానికి వారు పిరమిడ్లమీద కొలతలు పెట్టారు. ఆ నదీవృద్ధి అల్పమో, మధ్యస్థమో వాటిమూలంగా తెలుసుకొని దేశానికి దుర్భిక్షమో, సుభిక్షమో నిర్ణయిస్తుంటారు. నైలు అధికంగా వస్తే అది సస్యసమృద్ధిని తెలియచేస్తుంది. పోటు తగ్గంగానే కర్షకుడు నది విడిచిపోయిన ఒండు మట్టిమీద విత్తుతాడు. తరువాత అతడికి అధికశ్రమ లేకుండానే పంట పండుతుంది. లెపిడస్ : అక్కడ మీకు విచిత్రమైన సర్పాలు లభ్యమైనాయట! ఆంటోనీ : అవును లెపిడస్! లెపిడస్ : మీ ఈజిప్టు సర్పం మీ సూర్యతేజంవల్ల ఒండుమట్టిలో పుట్టిందట! మీ మొసలికూడా అలాంటిదే అని విన్నాను. ఆంటోనీ : అవును. అవి రెండూ అలాటివే. పాంపే : ఆసనాలను స్వీకరిద్దాము. కొంత పానీయాన్ని సేవిద్దాము. లెపిడస్ ఆరోగ్యం కోసం! లెపిడస్ : నేను ఉండవలసినంత బాగాలేను. కానీ మధుసేవలో లొంగిపోను. ఎనోబార్బస్ : నిద్రపట్టేదాకా అంతవరకూ మధుగోష్ఠిలో పాల్గొంటారు. ఆంటోని - క్లియోపాత్రా 221 66 లెపిడస్ : టోలమీలు నిర్మించిన పిరమిడ్లు మహాద్భుతమైనవని విన్నాను. వాటి విషయంలో ఏ వంక నుంచీ విభిన్నాభిప్రాయం వినిపించలేదు. మెనాస్ : (పాంపేతో - అపవారితంగా) పాంపే మహాశయా! ఒకమాట! పాంపే : (అపవారితంగా - మెనాస్తో) నింపాదిగా చెవిలో చెప్పు. ఏమిటిది? మెనాస్ : (పాంపేతో - అపవారితంగా) మీ ఆసనాన్ని విడిచి ఒక్కమారు లేచిరండి, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఒక్క మాట విని పొండి. పాంపే : (అపవారితంగా -మెనాస్తో) వస్తున్నాను. ఒక్క క్షణకాలం క్షమించు. ఈ ద్రాక్షాసవం లెపిడస్ ఆరోగ్యం కోసం! లెపిడస్ : మీ మొసలి ఎటువంటిది? ఆంటోనీ : దాని ఆకారం దాని ఆకారంలాగానే ఉంటుంది. అది ఎంత వెడల్పో దాని వెడల్పు అంత. అది ఎంత ఎత్తో దాని ఎత్తు అంత. అది దాని అవయవాలతోనే సంచరిస్తుంది. దానికి ఏది బలవర్ధకమైన ఆహారమో దానిమీదనే అది జీవిస్తుంది. కానీ దాని ప్రధానద్రవ్యాల్లో అణుమాత్రం మార్పు వచ్చినా అది మరోజంతువుగా 67 మారిపోతుంది. లెపిడస్ : దాని రంగు ఎలా వుంటుంది? ఆంటోనీ : దాని రంగు లాగానే. లెపిడస్ : అయితే అది చాలా విచిత్రమైన జంతువు! ఆంటోనీ : అవును. నీవన్నట్లే. కానీ దాని కన్నీళ్లలో తేమ ఉంది. సీజర్ : అతడికి నీ ఈ వర్ణనవల్ల ఏమైనా తృప్తి కలిగిందా? ఆంటోనీ : అది తృప్తిని కలిగించకపోతే అతని ఆరోగ్యం కోసం పాంపే ఇస్తున్న ఈ ఆసవం తృప్తిని కలిగిస్తుంది. లేకపోతే ఇక అతడికి తృప్తిని కల్గించటం అసాధ్యం. పాంపే : (మెనాస్తో అపవారితంగా) నాశనం కానివ్వు! ఎల్లా పోతే అలా పోనీ! అది నాకెందుకు చెపుతావు? నేను నిన్ను ఆజ్ఞాపించినట్లు చెయ్. లెపిడస్ కోసం నేనాజ్ఞాపించిన చషకమేది? 222 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మెనాస్ : (పాంపేతో అపవారితంగా) మీ యెడ నాకు గల ప్రభుభక్తిని పురస్కరించుకొని నేను చెప్పేది వినండి. పాంపే : (మెనాస్ అపరివారితంగా) నీవు ఉన్మత్తుడవౌతున్నా వనుకొంటాను. విషయ మేమిటి? (లేచి ప్రక్కకు వెళ్ళుతాడు.) మెనాస్ : నేను మిమ్మల్ని నిరంతరం భక్తితో అనుసరించిన అనుచరుణ్ణి. పాంపే అవును. నీవు నన్ను మహాభక్తితో సేవించావు. చెప్పదలచిన విషయం ఇంకా ఏమైనా ఉందా? (ప్రభువర్గాన్ని ఉద్దేశించి) క్షమించండి. క్షణకాలం మీకు దూరుణ్ణి అవుతున్నాను. ఈ విలాసాన్ని మీరు కొనసాగిస్తుండండి. ఆంటోనీ : లెపిడస్! క్షణక్షణం మారే ఈ నిలకడ లేని పులినాలల్లో నుంచీ నీ ఆత్మనౌకను రక్షించుకో! మెనాస్ : మీరు సర్వప్రపంచాధినేతలు కాదలిచారా? పాంపే : అంటే నీ అభిప్రాయం? మెనాస్ : మీరు సర్వప్రపంచ పాలకులు కాదలిచారా? అంటే అప్పటి రాజ్యం ఇప్పటిదానికి ఇంకా రెండింతలు. పాంపే : అలా జరగటానికి అవకాశం ఎలా కలుగుతుంది? మెనాస్ : మీకు అటువంటి భావం కలిగితే చాలు. మిగిలినదంతా నాకు వదిలెయ్యండి. నన్ను గురించి 'వీడు అల్పుడన్న భావం మీకుంటే ఉండవచ్చు కానీ నేను సర్వప్రపంచాన్నీ మీకివ్వగల సమర్థుణ్ణి. పాంపే : చెడత్రాగినట్లున్నావు నీవు. మెనాస్ : లేదు. పాంపే మహాశయా! లేదు. లేదు. చషకానికి చాలా దూరంగా ఉండిపోయాను. సాహసిస్తే మీరు భూమండలాని కంతటికీ జౌదేవత లౌతారు. మీరు కోరుకొంటే సముద్రవేష్టితమైన సర్వం, లేదా ఆకాశం ఆచ్ఛాదించిన అఖిలం మీదౌతుంది. పాంపే : ఎలాగో తెలియజెయ్! మెనాస్ : ప్రపంచ సర్వస్వానికీ భాగస్వాములైన ఈ మువ్వురూ మీ నౌకలో ఉన్నారు. ఓడ త్రాళ్ళను తెగగోస్తాను. సముద్రంమీద అది పయనిస్తూ ఉండగా పైబడి అందరి ఆంటోని - క్లియోపాత్రా 223 కుత్తుకలనూ ఉత్తరిద్దాం. విలాసోపభోగాలల్లో ఇక్కడ మునిగి తేలుతున్న వీరందరూ ఇప్పుడు నీ ఆధీనంలో ఉన్నారు. పాంపే : ఓహో! చెప్పకుండానే దీన్ని నీవు చేసి ఉండాల్సింది. నీవే చేసి ఉన్నట్లయితే ఘనమైన ప్రభుసేవ అయ్యేది. నేను నిర్వర్తించే సర్వకృత్యాలూ నా గౌరవాన్ని అనుసరించి నడుస్తుంటాయి. లాభాన్ని అవి లెక్కింపవు. నీవు ఉద్దేశించిన పనిని నిర్వర్తించనీయ కుండా అడ్డుపడి, నీ నోరు ఎప్పుడూ ముందుగా బయటపడుతున్నది. అందుకు పరితపించు. తెలియజేయకుండానే నీ వొకపనిని చేయటం, తరువాత నేను మంచిపని చేశావని గమనించటం మంచిదై ఉండేది. చేయకుండానే ఒక కార్యాన్ని ముందుగా నాకు తెలియచేశావు. కనుక నేను దాన్ని ఖండించక తప్పదు. ఇక ఈ అభిప్రాయాన్ని వదలి పాపగోష్ఠిలో పడిపో! మెనాస్ : (స్వగతం) ఇలా చేసినందుకు అవరోహణక్రమాన్ని అనుసరిస్తున్న అదృష్టంగల నీకు ఇంక నేను అనుచరుణ్ణిగా నిలువలేను. ఇచ్చినప్పుడు పుచ్చుకోలేనివాడికి తరువాత ఏదీ ఎంత వెదికినా దొరకదు. పాంపే : ఈ చషకాన్ని లెపిడస్ సంక్షేమంకోసం సేవిస్తాను. మెనాస్ : ఎనోబార్బస్! ఇదే నా స్వాగతం! పాంపే : అంచులు నిండేటంతవరకూ ఈ చషకాన్ని నింపు. ఎనోబార్బస్: (లెపిడనన్ను మోసుకుపోతున్న సేవకుణ్ణి చూపిస్తూ) వాడు మహాబలశాలిలా ఉన్నాడు. మెనాస్ : ఎందువల్ల అలా అన్నావు? ఎనోబార్బన్ చూడటం లేదా? వాడు ప్రపంచంలోని తృతీయభాగాన్ని మోసుకుపోతున్నాడు. మెనాస్ : అంటే ప్రపంచంలో తృతీయభాగం తప్పత్రాగిందన్నమాట. సర్వం ఇలానే త్రాగితే అది చక్కగా సాగిపోతుంది. ఎనోబార్బస్ : అయితే నీవు కూడా కానివ్వు. ప్రపంచభ్రమణాన్ని వృద్ధి చెయ్! మెనాస్ వద్దు. వెళ్ళిపోదాము. 69 పాంపే : ఇంకా ఇది అలెగ్జాండ్రియా విందని అనిపించుకోదు. 224 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఆంటోనీ అనతికాలంలో అలాగే పరిణమించబోతున్నది. ఎవరక్కడ? ఈ

ద్రాక్షారసపాత్రల మూతలు విప్పండి. ఇది సీజర్ సంక్షేమం కోసం. సీజర్ : అవసరం లేనప్పుడు నేను అనవసేవనం చెయ్యకుండా ఉండగలను. నా మేధను మధువుతో కడిగితే అది మరింత మాలిన్యాన్ని పొందుతుంది. ఆంటోనీ : కాలానికి పసిబిడ్డలా కట్టుబడిపో! సీజర్ : 'దాన్ని కట్టుబాటులో పెట్టి అధికారివి కా' అని నేనంటాను. ఇంత అధికంగా ఒకరోజు మధుసేవ చేయటం కంటే నాలుగు దినాలు త్రాగకుండా ఉపవసించటం నాకిష్టం. ఎనోబార్బస్ : ఓహో వీరసమ్రాట్! (ఆంటోనీతో) మనం ఈజిప్టు" బాకస్ విలాసాలను ఆరంభించి మన ఈ పానగోష్ఠికి మహోత్సవస్థితిని కల్పిద్దామా? పాంపే : వీరోత్తమా! అలాగే! ఒకరి హస్తాలను మరొకరం అందు కొందాము. మనం సేవించే పానీయంమీద విజయం చేకొని సుతిమెత్తగా మనం సాంసారికబాధ్యతలను మరిచిపోయేటట్లు నేలను తట్టుదాం. ఎనోబార్బస్ : మనమందరం చేతులు కలుపుదాం. నేను మిమ్మలినందరినీ ఒక క్రమంలో నిలిపేటంతవరకూ వాద్యసంగీతం వినిపిస్తుంది. తరువాత కుఱ్ఱవాడు పాట ప్రారంభిస్తాడు. ప్రతి ఒక్కరూ కంఠమెత్తి తారస్థాయిలో అనాలి. వాద్యసంగీతం వినిపిస్తుంటుంది. ఎనోబార్బస్ ఒకరిచేతితో ఇంకొకరి చేతిని పట్టిస్తాడు. రా రా రా ద్రాక్షారాజ!! రావయ్యా బాకస్ ప్రభు! అరమూసిన కన్నుల"తో తరలిరమ్ము స్థూలకాయ నీ ద్రాక్షాద్రోణులపై నిలుచుగాక మీ చింతలు గేయం రారారా! మాకురులకు నీ ద్రాక్షల మహిత వేష్టనము లొనర్ప రారారా! ఆంటోని - క్లియోపాత్రా 225 చషకముపై చషక మిమ్ము జగము తిరుగునందాకా జగ మొరిగెడు నందాకా చషకముపై చషక మిమ్ము సీజర్ : ఈ నాటికి చాలిద్దామా? పాంపే! సునక్తం. ప్రియసోదరా! నిన్ను కూడా రమ్మని ప్రార్థించవచ్చునా? తీవ్రతరమైన మన కార్యక్రమం ఈ విలాసప్రియత్వాన్ని విపరీతంగా కోపిస్తున్నది. ఉదాత్తప్రభువులారా! ఇక మనం నిష్క్రమిద్దాం. ద్రాక్షాసవంతో మన పుక్కిళ్ళు పొర్లి ఎర్రవారాయి. ఎనోబార్బస్! మహాసత్త్వుడైనా అతడు ద్రాక్షాసవానికి తల ఒగ్గాడు. నా నాలుక తడ బడుతున్నది. త్రాగుడు వల్ల కలిగిన విపరీతస్థితి మన అందరినీ పరిహాసకులను చేస్తున్నది. ఇంకా చెప్పటమెందుకు? సునక్తం. ఆంటోనీ మహాశయా! ఏదీ నీ హస్తం? పాంపే : ఆసవవిషయంలో నీ ఉపవాస మేమిటో దాన్ని తీరభూమిమీద పరీక్షిస్తాను. ఆంటోనీ : తప్పక అలాగే పరీక్షించవచ్చు. నీ హస్తమేదీ? పాంపే : ఆంటోనీ, నీవు మా జనకుల గృహాన్ని ఆక్రమించావు. అయితేనేం లే, మనం మిత్రులం. నౌకలోకి రా. ఎనోబార్బస్ : పడిపోతారేమో జాగ్రత్త! (ఎనోబార్బస్, మెనాస్ తప్ప అందరూ నిష్క్రమిస్తారు) మెనాస్! నేను తీరంమీదికి వెళ్ళను. మెనాస్ : వద్దు. వెళ్ళవద్దు. నా కక్ష్యలోకి వెడదాం. ఇంతటి గొప్పవారు నిష్క్రమిస్తుంటే ఈ దుందుభులు, తుత్తారలు, సుషిరాలు అన్నీ ఇంత నిశ్శబ్దంగా ఉన్నవేం? ఈ ఘనులైనవారికి నెప్ట్యూన్కు" వినపడేటట్లు మనం వీడ్కోలు వినిపిద్దాం. దుందుభులు, తుత్తారలు, సుషిరాలు మ్రోయించండి. సంగీతాన్ని వినిపించటానికి ఇంత ఆలస్యం చేసినందుకు మీరు మహాదోషులు. కానివ్వండి. (తుత్తార ధ్వనులు, దుందుభిస్వనాలు వినిపిస్తాయి.) ఎనోబార్బస్ : హో! అతడెంత బాగా ప్రతిధ్వనిస్తున్నాడు. ప్రభూ! ఇదుగో నా కుళాయి. మెనాస్ : ఉదాత్తసేనానీ! వచ్చేయ్! 226 (నిష్క్రమిస్తారు) వావిలాల సోమయాజులు సాహిత్యం-3 తృతీయాంకం ఒకటో దృశ్యం సిరియాలో ఒక మైదానం. వెంటిడియస్, జయోపేతునివలె సిలియస్, ఇతర రోమను ఉద్యోగులు, సైనికులతో ప్రవేశిస్తారు. పాకోరస్ "కళేబరం తీసుకోరాబడుతుంది. వెంటిడియస్: పార్థియా! ఎల్లప్పుడూ నీ బల్లాలు ఇతరులను పొడిచేవి. ఇప్పుడు నిన్నే పొడుస్తున్నవి". మార్కస్ క్రాసస్ మరణంకోసం అదృష్టదేవత ఇప్పుడు నన్ను సాధనంగా ఉపయోగించి, ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి ఇచ్చయిస్తున్నది. ఆ రాజకుమారుడి కళేబరాన్ని మన సైన్యాంతికానికి తీసుకోరండి. ఓర్డిస్! మా మార్కస్ క్రాసస్ మరణానికి నీ కుమారుడు ఈ రీతిగా బదులు చెల్లించుకొన్నాడు. సిలియస్ : ఉదారా, వెంటిడియస్! నీ కౌక్షేయంమీది పార్థియస్ రక్తపుతడి ఇంకా ఆరకముందే కాందిశీకులై పారివచ్చిన పార్థియన్లకు ఆశ్రయమిచ్చే ఆ మిడియా, మెసపొటేమియాల మీదకు కూడా సైన్యాన్ని నడిపించు. మన సేనాధినేత ఆంటోనీ నిన్ను రథారోహుణ్ణి చేసి ఉత్సవాలు జరిపించి శిరోమాలాలంకృతుణ్ణి చేస్తాడు. వెంటిడియస్ సిలియస్! ఇప్పటికే మించి వ్యవహరించాను. ఒక విషయం గమనించు. తక్కువస్థాయిలో ఉన్నవారికి గొప్ప పనులు చేయటానికి అవకాశాలెన్నయినా ఉన్నవి. మనం సేవించే యజమాని దగ్గిర లేనప్పుడు, సిలియస్, తెలుసుకో, నిర్వర్తించే కృత్యాలవల్ల కలిగే ఘనకీర్తిని పొందటం కంటే, ఆ పనులవంకకు పోకుండా ఉండటం శ్రేయస్కరం. సీజర్, ఆంటోనీ ఇరువురూ స్వయంగా కాక వారి ఉద్యోగుల మూలంగా విశేషకీర్తి నార్జించారు. ఆంటోనీ ప్రతినిధుల్లో సొర్సియస్ ఒకడు. సిరియాలో ప్రతిక్షణం వీరకృత్యాలెన్నెన్నో చేసి అతివేగంగా అతిశయమైన ప్రశస్తి నార్జించాడు. కాని అతడు ఆంటోని అనురాగాన్ని కోల్పోయాడు. ఎవడైతే రణరంగాలలో తన సైన్యాధినేతను అతిశయిస్తాడో, అతడు తన సైన్యాధినేతకు నేత కాగలడు. ఉన్నదానికంటే ఉన్నతస్థితిని ఆశించటం సైనికుడికో ఉత్తమగుణమైనా, తన కీర్తిని ఆచ్ఛాదితం చేసేదాన్ని చేయటం కంటే నష్టానికే ఇష్టపడతాడు. ఆంటోనీకి మేలును చేకూర్చేదాన్ని ఎంతైనా చేయగలను. అయితే అందువల్ల అతనికి కోపం వస్తుంది. కనుక అతడికి కోపం తెప్పించే నా ఘనకృత్యాలను జనం గమనించకపోవటమే నాకు క్షేమం. ఆంటోని - క్లియోపాత్రా 227 సిలియస్: వెంటిడియస్! నీకెంతటి పరిజ్ఞానముంది! ఇది లేకపోతే సైనికుడికీ, అతని ఖడ్గానికీ గల తారతమ్యం వ్యక్తం కానే కాదు. నీవు ఆంటోనీకి లేఖ వ్రాస్తున్నావా? వెంటిడియస్ : యుద్దవేళల్లో ఇంద్రజాలంలా పనిచేసిన ఆయన నామసహాయం వల్ల నేను కలిగింపగలిగిన భయోత్పాత విషయాన్ని సవినయంగా నీకు నివేదిస్తున్నాను. ఆయన ధ్వజాలతో ప్రవేశించి, సంతృప్తికరాలైన భృత్యాలిచ్చి ఆయన పోషించిన సైన్యాలను మేము నడిపించి ఉండకపోతే, ఎన్నడూ దెబ్బతినటమంటే ఏమో ఎరగని ఆ పార్థియా అశ్వికదళాన్ని రణభూమి నుంచీ పనికిమాలిన గుర్రపుతట్టులా తరిమివేయగలిగి ఉండేవాళ్లం కాదని నీకు నివేదిస్తున్నాను. సిలియస్ : అయితే అతడిప్పుడెక్కడున్నాడు? 75 వెంటిడియస్: ఏథెన్సుకు వెళ్లుదామని ఉద్దేశపడుతున్నాడు. మన వెంటున్న సంభారందృష్ట్యా ఎంతటి పాలును వేగంగా వెంట తీసుకోవెళ్లే అవకాశముందో యోచించి, దానితో మనం ఆయనముందు నిలిచి కనిపిద్దాం. తరలించు. బయలుదేరుదాం పద. (నిష్క్రమిస్తారు) రెండో దృశ్యం రోము మహానగరం. సిజర్ సౌధంలో ఒక ముందరిగది. అగ్రిప్పా ఒక ద్వారాన, ఎనోబార్బస్ మరొక ద్వారాన ప్రవేశిస్తారు. అగ్రిప్పా : ఏమిటి? సోదరులిద్దరూ వెళ్ళిపోయినారా? ఎనోబార్బస్ : పాంపేతో వ్యవహారాన్ని ముగించుకొన్నారు వారు వెళ్ళిపోయారు. మిగిలిన ముగ్గురూ" సంధిపత్రాలను ముద్రాంకితం చేస్తున్నారు. రోమును విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆక్టేవియా కన్నీరు కార్చింది. సోదరి ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నందుకు సీజర్ చింతాక్రాంతుడైనాడు. పాంపే ఇచ్చిన విందునాటినుంచీ లెపిడస్ పాండిమమనే వ్యాధితో బాధపడుతున్నట్లు మెనాస్ తెలియజేశాడు. అగ్రిప్పా : (ఎత్తిపొడుపుగా) లెపిడన్ మహోదాత్తుడు! ఎనోబార్బస్ : చాలామంచివాడు. పాపం! అతడు సీజర్ను ఎంత దొడ్డగా ప్రేమిస్తున్నాడు! 228 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 అగ్రిప్పా : అంతే కాదు. అతడు ఆంటోనీని ఇంకా ఎంతో దొడ్డగా ప్రేమిస్తున్నాడు! ఎనోబార్బస్ : ఇక సీజరా! మానవజాతిలో 77 జూపిటర్. అగ్రిప్పా : మరి ఆంటోనీ జూపిటర్కు కూడా దేవత. ఎనోబార్బస్ : సీజర్ గురించి మాటాడవలసివస్తే ఆయన నిరుపమానుడు. అగ్రిప్పా : సీజర్ నిరుపమానుడైతే అంటోనీ అరేబియా విహంగము. 78 ఎనోబార్బస్ : సీజర్ ను నీవు ప్రశంసింపదలిస్తే సీజర్ అని మాత్రమే చెప్పు. ఇంకేమీ చెప్పకు. అగ్రిప్పా : లెపిడస్ వీరిద్దరినీ తుల్యంగా స్తుతిస్తాడు. ఎనోబార్బస్: కానీ అతడు సీజర్ను అధికంగా ప్రేమిస్తాడు. అయినప్పటికీ ఆంటోనీని కూడా ప్రేమిస్తుంటాడు. లెపిడస్ ఆంటోనీని ఎంత గాఢంగా ప్రేమిస్తుంటాడో హృదయాలు భావించలేవు. నాలుకలు పలుకలేవు. వ్రాయసగాండ్రు వ్రాయలేరు. గాయనులు గానం చెయ్యలేరు. కవులు ఛందోబద్ధం చెయ్యలేరు. ఆహా! అతడికి ఆంటోనీమీది ప్రేమ! కానీ సీజర్మీద అతనికున్న ప్రేమకు కుంచితులై జనం విస్తుపోతారు. ఆ ప్రేమగాఢతకు మీరూ ఆశ్చర్యపడి పోతుంటారు. అగ్రిప్పా : అతడు ఇద్దర్నీ ప్రేమిస్తుంటాడు. ఎనోబార్బస్ : వారు అతనికి రెక్కలు. అతడో బృహత్కీటకం. (లోపల తుత్తారధ్వనులు వినిపిస్తవి) అవిగో! నన్ను అశ్వాన్నధిరోహించమని అవి సూచనలు. ఉదాత్తుడా! అగ్రిప్పా! మరి సెలవు. అగ్రిప్పా : యోగ్య సైనికుడా! శుభమగుగాక! ఇదే నా వీడ్కోలు. సీజర్, ఆంటోనీ, లెపిడస్, ఆక్టేవియా ప్రవేశిస్తారు. ఆంటోనీ : ఒక నీవు శ్రమపడకు. ఆగిపో. సీజర్ : నా సోదరిని నీవు వెంట తీసుకొని వెళ్ళుతుండటంతో నీవు నాలోని అధికాంశాన్ని పట్టుకోపోతున్నావు. నా మీద నీకుగల గౌరవాధిక్యాన్ని ఆమెయెడ చూపే ప్రేమాధిక్యంగా ప్రకటించు. సోదరీ! నీవు ఎట్టి భార్యవుగా వర్తించాలెనని నేను భావించానో నీవు ఆంటోనీకి అట్టి భార్యవై వర్తించు. 'నీవు అట్టిభార్యవే' నని తప్పక నిరూపిస్తావని నేను ఆంటోని - క్లియోపాత్రా 229 ప్రతిజ్ఞ చేయగలను. మహోదాత్తుడా ఆంటోనీ! అమెయెడ మన ఉభయులకూ ప్రేమలేకపోతే, ఈమె అనే సాధనం లేకుండా మనం ఎంతో అధికంగా అన్యోన్యమైత్రిని కలిగి ఉండేవాళ్ళం. కాబట్టి మన ఇరువురి స్నేహాన్నీ అనుబంధించి చిరకాలం నిల్పటానికి ఉద్దేశితైన ఈ పవిత్రమూర్తి, ఆ మన స్నేహసౌధాన్ని భగ్నం చేయటానికి కారణభూతురాలు కాకూడదు సుమా! 79 ఆంటోనీ : అనుమానించి నాకు నీవన్యాయం చేస్తున్నావు. సీజర్ : నేను చెప్పవలసిందేదో చెప్పాను. ఆంటోనీ : నీవే విషయాన్ని గురించి ఇంతటి భయభావాన్ని వహిస్తున్నావో అందుకు నీవు చెప్పింది ఎన్నడూ కారణం కాబోదు. దేవతలు నీకు సర్వత్రా సాయపడుదురుగాక! నీ ఆశయ పరిపూర్తికి రోమనులు తోడ్పాటునిచ్చేటట్లు వారు దోహదమొనర్చెదరు గాక! సరే ఇక మనం విడిపోదాం! సీజర్ : ప్రియసోదరీ! నీకిదే నా వీడ్కోలు. శుభమగుగాక! మీ యానవేళ జలాదిభూతకోటి మీకు కృపతో సహకరించుగాక! అవి మీకు మహోల్లాసాన్ని కల్పించుగాక! సోదరీ నీకిదే నా వీడ్కోలు!! ఆక్టేవియా : ఉదాత్తసోదరా! ఆంటోనీ : ఏప్రిల్ మాసంలోని తుషారంలాగా ఆమె కన్నులనిండా నీరు క్రమ్మింది. ఇది సోదరీప్రేమను వెల్లడించే వసంతం. ఏప్రిల్ తుషారాలే కదా వసంతాన్ని తెచ్చేది! ఆక్టేవియా! చింతను తొలగించెయ్యి. ఆక్టేవియా : నా భర్తృగృహాన్ని భద్రంగా చూస్తుండండి, ఇంకా సీజర్ : ఆక్టేవియా! ఏమంటున్నావు? ఇంకా - ఆక్టేవియా : నీ చెవిలో చెబుతాను. ఆంటోనీ : ఆమె హృదయభావాలను పలకటానికి నాలుక తిరస్కరిస్తున్నది. ఆమె హృదయం నాలుకకే చెప్పలేని స్థితిలో ఉంది. వీడ్కోలు పుచ్చుకొనే ఈ సమయాన ఆమెలోని పరస్పర విరుద్ధాలైన హృదయోద్వేగాలు ఉన్నతాలైన ఆటుపోటులమీద నిశ్చలంగా వంచి నిలిపిన హంసపక్షాలలాగా చలనరహితత వహిస్తున్నవి. 230 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఎనోబార్బస్ : (అగ్రిప్పాతో అపవారితంగా) సీజర్! ఆపుకోలేక రోదించేటట్లున్నాడు. అగ్రిప్పా : (ఎనోబార్బస్తో అపవారితంగా) మేఘం వర్షాగమనాన్ని సూచించేటట్లుగా ఆయన దుఃఖదృష్టి బాష్పవృష్టిని సూచిస్తున్నది. 80 ఎనోబార్బస్ : (అగ్రిప్పాతో అపవారితంగా) మొఖాన నల్ల మచ్చ ఉంటే అశ్వమైనా కాకుండా మనుష్యుడు కావటం మరింత దోషం. అగ్రిప్పా : (ఎనోబార్బస్తో అపవారితంగా) ఇంతెందుకు? ఎనో బార్బస్! మృతుడైన సీజర్ను చూచినప్పుడు ఆంటోనీ మచ్చను కలిగిఉండటమే కాదు గర్జించినట్లు రోదించాడు. ఫిలిప్పీ యుద్ధభూమిలో బ్రూటస్ హతుడైనప్పుడు ఆయన కోసం అతడు అందరికంటే అధికంగా దుఃఖించాడు. ఎనోబార్బస్ : ఆ సంవత్సరం నిజంగా అతడు రూమ్ వ్యాధితో బాధపడుతుండేవాడు. మనసుపడి తాను నాశనం చేసిన బ్రూటస్ సందర్భంలో కూడా అతడు నాకు దుఃఖం పొంగిపొరలేదాకా రోదించాడు. సీజర్ : వద్దు. ప్రియసోదరీ, ఆక్టేవియా! నీవు దుఃఖించకూడదు. నేను నిన్ను మరిచిపోతానని భయపడకు. నిరంతరం నేను నీ క్షేమవార్తలను యోజించటంలో కాలాన్ని గడవనీయను. ఆంటోనీ : మన ప్రణయాలలో ఎవరిది బలవత్తరమైందో పరీక్షించుకొందాం. ఇలా రా. 'నిన్ను గాఢాలింగనం చేసుకొన్నాను. దేవతలు నీయెడ దయార్ద్రహృదయులగుదురు గాక!' అని శుభాకాంక్షలు పలికి నిన్ను నా బాహుబంధంలో నుంచీ ఒదిలి పెడుతున్నాను. సీజర్ : సెలవు. సౌఖ్యపరంపరలు చేకూరుగాక! లెపిడస్ : సమస్తనక్షత్రరాశులూ సంఫుల్లకాంతులతో మీ మార్గాన్ని తేజోవంతం చేసి సుగమం కావించుగాక! సీజర్ : సోదరీ! ఇదే నా వీడ్కోలు! (ఆక్టేవియాను ముద్దు పెట్టుకొంటాడు) ఆంటోనీ : ఇదే నా వీడ్కోలు!! (తుత్తారధ్వని వినిపిస్తుంది. నిష్క్రమిస్తారు.) ఆంటోని - క్లియోపాత్రా 231 మూడో దృశ్యం అలెగ్జాండ్రియాలో క్లియోపాత్రాసౌధం. క్లియోపాత్రా, ఛార్మియన్, ఐరాస్, ఎలెగ్జాస్ ప్రవేశిస్తారు. క్లియోపాత్రా : వాడు ఏడీ? ఎలెగ్జాస్ రావటానికి సగం భయపడుతున్నాడు. క్లియోపాత్రా : ఛీ! వాడు భయపడటానికి తగ్గకారణం ఏమీ లేదు. ఇక్కడికి రావయ్యా! వార్తాహరి పూర్వంలాగానే ప్రవేశిస్తాడు ఎలెగ్జాస్: మహారాజ్జీ! ఉల్లాసంగా ఉన్నప్పుడు తప్ప ఆ హీరాడ్ జూరీ కూడా నీ ముఖంవంక తలెత్తి చూడలేడు. హిరాడ్ వంటి చిత్తోల్బణాలు నాకూ ఉండి ఉన్నట్లయితే ఎంతో బాగుండేది. ఆంటోనీ వెళ్లిపోయినతరువాత వాటిని ఎవరి మూలాన చలాయించేది? దగ్గరికి రావయ్యా! వార్తాహరి : ఘనత వహించిన మహారాజ్జీ! క్లియోపాత్రా : నీవు ఆక్టేవియాను చూచావా? వార్తాహరి : అవును మహారాజ్జీ! క్లియోపాత్రా : నీవు ఆమెను ఎక్కడ చూచావు? వార్తాహరి : రోములో చూచాను, మహారాజ్ఞి! సీజర్, ఆంటోనీ ఆమెను తమమధ్య నిల్పుకొని నడిపించుకుంటూ పోతుంటే చూచాను. చాలా సన్నిహితంగా ముఖాన్ని పరికించి చూచాను. క్లియోపాత్రా : ఆమె నా అంత పొడగరేనా? వార్తాహరి : లేదు మహారాజ్జీ! క్లియోపాత్రా : ఆమె మాట్లాడుతుండగా విన్నావా? ఆమెది కీచుగొంతా? లేక పలుచని గొంతా? వార్తాహరి : మహారాజ్జీ! విన్నాను. ఆమె కంఠం సన్ననిది. 232 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 క్లియోపాత్రా : అదేమంత మంచి విశేషం కాదులే"". ఆయన ఆమెను బహుకాలం ప్రేమించలేడు. ఛార్మియన్ : ప్రేమించటమా? ఇసిసీ మీద ప్రమాణం చేస్తున్నాను. అది అసంభవం! క్లియోపాత్రా : నేనూ అలాగే భావిస్తున్నాను. ముద్ద గొంతుక. మరుగుజ్జు వేషం. ఆమె నడకలో హుందాతనం ఉందా? హుందాతనాన్ని గురించి నీకేమైనా పూర్వపరిచయం ఉంటే దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని పోల్చి చెప్పు. వార్తాహరి : ఆమె నడక ప్రాకుతున్నట్లుంటుంది. నడిచినా నిలిచినా ఒకేతీరుగా ఉంటుంది. ఆమెకు శరీరం మాత్రమే ఉన్నట్లుంటుంది. చైతన్యం ఉన్నట్లు తోచదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలున్న ఒక ప్రాణిలా కాకుండా ఒక ప్రతిమలా గోచరిస్తుంటుంది. క్లియోపాత్రా : ఇది సత్యమేనా? వార్తాహరి : కాకపోతే నాకు పరిశీలనపరిజ్ఞానం లేదన్నమాట! ఛార్మియన్ : ఈ సమస్తమైన ఈజిప్టులోనూ పరిశీలనపరిజ్ఞానం ఉన్నవారు ముగ్గురు కూడా ఉండరు. క్లియోపాత్రా : ఇతడు మంచి వివేకం కలవాడు. ఇప్పుడు నాకు బాగా అవగతమైంది ఆమెను గురించి నేను విశేషంగా భయపడవలసిన అగత్యం నాకేమీ లేదు. ఇతడికి మంచి వివేచనశక్తి ఉంది. ఛార్మియన్ : అవును. వీడు అద్భుతమైన వివేచనశక్తి కలవాడు. క్లియోపాత్రా : ఆమె వయస్సు ఏ పాటి ఉంటుందో ఊహించి చెప్పు. వార్తాహరి : మహారాజ్జీ! ఆమె భర్తృహీన. క్లియోపాత్రా : విధవా? ఛార్మియన్, గుర్తించావా? గుర్తించు! వార్తాహరి : ఇప్పుడామెకు ముప్పది సంవత్సరాల వయస్సు ఉంటుందను కొంటాను. క్లియోపాత్రా : ఆమె ముఖం ఎలాంటిదో నీ మనస్సుకు జ్ఞప్తి ఉందా? గుండ్రంగానే ఉందా? వార్తాహరి : దోషంగా పరిగణిత మయ్యేటంతటి వర్తులంగా ఉంది. క్లియోపాత్రా : అటువంటి ముఖం గలవారు సర్వసామాన్యంగా మందబుద్ధులు "గా ఉంటుంటారు. మరి ఆమె జుత్తు రంగో? ఆంటోని - క్లియోపాత్రా - 233 వార్తాహరి : గోధుమవన్నె. ఆమె నొసలు ఎంత లోతుగా ఉండటానికి వీలుంటుందో అంత లోతైంది. క్లియోపాత్రా : ఇదిగో, ఈ సువర్ణం నీకు బహూకృతి. పూర్వం నీ యెడ నే ప్రదర్శించిన క్రూరతను నీ మనసులో పెట్టుకోకూడదు సుమా! నీతో నాకు తిరిగి పని ఉంది. నీవు అద్భుతమైన వ్యవహారదక్షుడివిగా కనిపిస్తున్నావు. వెళ్లి మళ్లీ ప్రయాణం చెయ్యటానికి సిద్ధపడు. ఇంతలో లేఖలు సిద్ధం చేయిస్తాను. (వార్తాహరి నిష్క్రమిస్తాడు) ఛార్మియన్ : వీడు చాలా మంచివాడులా కనిపిస్తున్నాడు. క్లియోపాత్రా : అవును. నిజంగా మంచివాడు. ఇతడియెడ నేను మొదట చాలా మొరటుగా ప్రవర్తించినందుకిపుడు పశ్చాత్తాపచిత్త నౌతున్నాను. ఇతడు చెప్పినదాన్ని బట్టి నేను ఈర్ష్యపడవలసినంతగా ఆ జంతువులో ఏమీ ఉన్నట్లు కనిపించటంలేదు. ఛార్మియన్ : ఏమీలేదు, మహారాజ్జీ! క్లియోపాత్రా : ఈ వార్తాహరి హుందాతనాన్ని తప్పక ఒక వ్యక్తిలోనైనా చూచి ఉంటాడు. కాబట్టి అది ఇతడెరుగనిది కాదు. ఛార్మియన్ : హుందాతనాన్ని ఈతడు చూచాడా, లేడా అన్న ప్రశ్నకు అవకాశమే లేదు. ఇసిస్ దేవతే ఇందుకు సాక్ష్యం. ఇతడు బహుకాలం మీ కొలువు చేసినవాడు కదా! క్లియోపాత్రా : ఛార్మియన్! ఇతణ్ణి నేను మరొక విషయం ప్రశ్నించవలసి ఉంది. అయితే అది అంత ప్రధానమైంది కాదులే. నీవు ఈ వార్తాహరిని నేను లేఖలు వ్రాసుకొనేచోటికి తీసుకొని రా. సర్వం సుఖప్రదమౌగాక! ఛార్మియన్ : సర్వం సుఖప్రదమౌతుందనే నేను మీకు దృఢంగా చెప్పగలను. నాలుగో దృశ్యం ఆంటోనీ గృహంలో ఒక కక్ష్య. ప్రవేశం ఆంటోనీ, ఆక్టేవియా. ఆంటోనీ : కాదు. కాదు. ఆక్టేవియా, ఇంతే కాదు. ఇంకా ఇటువంటివి ఎన్ని వేలైనా క్షమార్హాలే. అయితే అతడు పాంపేమీద నూతనయుద్ధాలు చేశాడు. తన ఇచ్ఛాపత్రాన్ని 234 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 వ్రాసి ప్రజలకు చదివి వినిపించాడు. నన్ను గురించి నసుగుతూ వారితో మాటాడాడు. గౌరవ ప్రతిపత్తులను ప్రకటిస్తూ నన్ను గురించి ప్రసంగించమని పరిస్థితులు బలవంతపెట్టిన సందర్భాలలో కూడా అతడు అతిశీతలరుజాగ్రస్త పదజాలంతో పలికాడు. నన్ను కీర్తించటానికి అత్యుత్తమ సమయం సంసిద్ధమైనప్పుడు, దాన్ని ఉపయోగించటానికి తిరస్కరించి నాలుక చివరనుంచి నన్ను గురించి ఏమేమో అనేశాడు. అంతే. ఆక్టేవియా : ప్రియ ప్రభూ! ఇదంతా నమ్మకండి. నమ్మవలసివచ్చినా అన్నింటినీ మనస్సుకు పట్టించుకోకండి. ఒక వేళ మీ ఇరువురి మధ్యా ఇటువంటివి భేదమే సంభవిస్తే, మీ ఉభయుల క్షేమాన్ని అభ్యర్థిస్తూ ప్రార్థనలు చేసే నాబోటి అదృష్టహీన మధ్యవర్తినిగా ఉంటుంది. 'నా భర్తను అనుగ్రహించండి. నా సోదరుణ్ణి అనుగ్రహించండి' అని నేను దేవతలను ప్రార్థిస్తే నన్ను పరిహసిస్తారు. అవహేళనగా “నా సోదరుణ్ణి అనుగ్రహించండి" అని పెద్దగా తిరిగి ఉచ్చరించి నా ప్రార్థనను భంగపరుస్తారు. తొలుతగా 'నా భర్తకు విజయమగుగాక!' అని ప్రార్థించి, తిరిగీ 'నా సోదరుడికి విజయమగు గాక!' అని ప్రార్థిస్తే, ఒక ప్రార్థనతో రెండోదానిని భగ్నం చేసినట్లైతుంది. ఈ రెంటికీ మధ్యస్థమైన మార్గం మరొకటి లేనే లేదు. ఆంటోనీ : సాధుస్వభావా! ఆక్టేవియా!! ఏ పక్షాన్ని నీ అత్యుత్తమ ప్రణయం పోషించదలచిందో దాన్ని ఆ పక్షానికే ఆయత్తపడనీ! నా గౌరవాన్ని కోల్పోవట మంటే నన్ను నేను కోల్పోయానన్నమాట! నీ వాడనై పొందదగ్గ సర్వాన్నీ కోల్పోవటం కంటే నీ వాడిని కాకుండా ఉండటమే మేలు. అయితే నీవు నన్ను ప్రార్థించిన రీతిగానే వెళ్ళి మా ఇరువురి మధ్యా మధ్యవర్తిత్వాన్ని నెరపుదువుగాని. ఈ మధ్యకాలంలో నేను నీ సోదరుడికి అస్తంగతత్వాన్ని కల్గించే యుద్ధం కోసం సన్నాహపడతాను. ప్రయాణానికి త్వరపడు. మా మధ్య మధ్యవర్తిత్వాన్ని నెరపడమనే నీ కోరిక ఈ రీతిగా సిద్ధించినదౌతుంది. 83 ఆక్టేవియా : ప్రభూ! మీకు నేనెంతో కృతజ్ఞురాలిని. సర్వశక్తిమంతుడు జౌ మీ ఇరువురికీ సంధానకర్రినైన నన్ను బలహీనను, అత్యబలను గావించుగాక! మీ ఇరువురిమధ్య యుద్ధాలు ప్రపంచాన్ని రెండు పక్షాలుగా ద్విధాకరిస్తాయి. ఈ రెండు ఖండాలమధ్య ఏర్పడే పగులును పూడ్చటానికి ఆ యుద్ధాలలో మృతులయ్యే మానవులను ఉపయోగించవలసి ఉంటుంది. ఆంటోని - క్లియోపాత్రా 235 ఆంటోనీ : ఈ వైరం ఎక్కడ ఆరంభమైందో నీకు గోచరించగానే ప్రేమించటం మాని, ఆ పక్షాన్ని పరిత్యజించు. ఎందువల్లనంటే, మా ఇరువురి దోషాలూ తుల్యప్రణయాన్ని ప్రకటిస్తూ నీవు ఇరువురితో అనువర్తనగా మెలగేటంతటి సమానగుణాలను ఎన్నడూ వహించవు గనుక. ఇక నీవు నీ ప్రయాణానికి ఆయత్తపడు. కోరుకొన్న పరిచారకబృందాన్ని వెంటబెట్టుకొని వెళ్లు, వ్యయాలకని నీవు ఎంత కోరుకొంటావో అంతకు ఆజ్ఞాపించు. (నిష్క్రమిస్తారు) ఐదో దృశ్యం ఆంటోనీ గృహంలో మరొక కక్ష్య ఎనోబార్బస్ : మిత్రుడా ఇరోస్! వార్తలేమిటి? ఐరాస్ : ఆంటోనీకి అతి విచిత్రమైన వార్తలందాయి. ఎనోబార్బస్ : ఏమిటవి? ఐరాస్ : సీజర్, లెపిడిస్ ఇరువురూ పాంపేమీద యుద్ధాలు చేశారట! ఎనోబార్బస్ : ఇది పాతవార్తే. ఫలితమేమైందో తెలిసిందా? ఐరాస్ : పాంపేమీద చేసిన యుద్ధాలలో అతణ్ణి ఉపయోగించుకొని, తరువాత ఆనతికాలానికే ఆ కార్యాలను నిర్వహించటం వల్ల కలిగిన కీర్తిని పంచుకోనీయలేదట! అంతటితో ఆగక అతడు పూర్వం పాంపేకు లేఖలు వ్రాశాడని నిందించాడట! ఏవో దోషారోపణలు చేసి అతణ్ణి బందీగా పరిగ్రహించాడట! అందువల్ల అదృష్టహీనుడైన ఆ మూడో త్రైకూటవీరుడు " బందీ అయినాడు. ఇక అతడికి విమోచన మృత్యువు వల్లనే. ఎనోబార్బస్ : ఓ ప్రపంచమా! ఇక నీకు రక్షకులు ఇరువురే. ఇంతకు మించి లేరు. నీకున్న ఆహారాన్నంతటినీ ఈ ఇరువురు తిరగలిదిమ్మల మధ్య పడేయ్! ఒకదాన్ని ఒకటి ఒరుసుకొనేటట్లు తిరిగి అరగదీసుకొంటాయి. ఆంటోనీ ఎక్కడున్నాడు? ఐరాస్ : ఉద్యానవనంలో, ఇలా తిరుగుతున్నాడు. తన ముందు కనిపించే చెత్తనంతటినీ తన్నిపారేస్తూ తిరుగుతున్నాడు. 'మందబుద్ధీ! లెపిడస్!' అని మధ్యమధ్య పెద్దపెట్టున 236 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 S4A బొబ్బలు పెడుతున్నాడు. పాంపేను హత్యచేసిన లెపిడస్ ఉద్యోగి 44 కుత్తుకను ఉత్తరిస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఎనోబార్బస్ : ఘనమైన మన నౌకాసైన్యం సముద్రం మీదికి వెళ్లటానికి సిద్ధపడ్డది. ఐరాస్ : మనం సీజర్ కోసం ఇటలీకి వెళ్ళాలి. డొమిటియస్! నేను చెప్పవలసింది ఇంకా ఉంది. ప్రభువు అంటోనీ నిన్ను వెంటనే వచ్చి దర్శనం చేసుకోమన్నాడు. నేను నీకు చెప్పిన వార్తలను అన్నింటికీ తరువాత చెప్పి ఉండవలసింది. ఎనోబార్బస్ : ఇంకా చెప్పవలసినవి అంత ప్రముఖమైనవి కాదనుకొంటాను. సరే కానీ, నన్ను ఆంటోనీ దగ్గరికి తీసుకోవెళ్లు. ఐరాస్ : పద. (నిష్క్రమిస్తారు) ఆరో దృశ్యం రోములో సీజరు గృహం, సీజర్, ఎగ్రిప్పా, మెకన్నాస్ ప్రవేశిస్తారు. సీజర్ : రోమును అలక్ష్యం చేసి అలెగ్జాండ్రియాలో అంటోనీ ఇంతే కాదు, ఇంకా ఎంతో చేశాడు. విపణి ప్రదేశంలో వెండి మలామా చేసిన వేదికమీద ప్రజలందరి ఎదుటా అతడూ క్లియోపాత్రా బంగారపు ఆసందులను అధిష్ఠించారట! వారి పాదదేశాన, వారు నా తండ్రికి కలిగిన " కొమారుడని చెప్పే సీజరియన్, వారి ధర్మేతరసంతానం ఉపవిష్ణులైనారట! అతడు ఆమెకు ఈజిప్టు రాజ్యాన్ని ఇచ్చివేశాడట! దక్షిణసిరియా, సిప్రస్, లిడియాలకు ఆమెను సర్వాధికారిణి అయిన రాజ్ఞినిగా అతడు ప్రకటించాడట! అతడి ప్రవర్తనరీతి అంతా ఈ ధోరణిలోనే ఉంది. మెకన్నాస్ : అతడు ఇదంతా చేసింది ప్రజల కన్నుల ఎదుటనేనా? సీజర్ : అవును. వారికి వ్యాయామరంగభూమిగా ఉన్న ప్రజాప్రదేశంలోనే. అక్కడ తన కుమారులను రాజాధిరాజులని ప్రకటించాడు. అలెగ్జాండరుకు బృహన్మీడియా, పార్థియా, ఆర్మీనియాలను ప్రదానం చేశాడు. టోలమీకి సిరియా, సిలీసియా, ఫొనీషియాలను ప్రత్యేకించాడు. చంద్రదైవతమైన ఇసిస్ దుస్తులను ధరించి ఆ నాడామె ప్రజలకు దర్శనమిచ్చింది. ఇలా నూతనచంద్రదేవతలాగా ఆమె ఇంతకు పూర్వమే ఎన్నోమార్లు దర్శనమిచ్చిందట! ఆంటోని - క్లియోపాత్రా 237 మెకన్నాస్ : రోమన్ ప్రజల కిదంతా తెలియజేయండి. అగ్రిప్పా: వారు ఆతని గర్వాహంకరణాన్ని గమనించి, అతనిపై తమకు గల సద్భావాన్ని మరల్చుకొంటారు. సీజర్ : ప్రజలింతకు పూర్వమే ఇదంతా తెలుసుకొన్నారు. ఆతడు చేసిన దోషారోపణలు కూడా వారికి ఇప్పుడే అందాయి. అగ్రిప్పా : ఆరోపణలు ఎవరిమీద? సీజర్ : సీజర్మీద. అందులోని ప్రధానాంశాలు : సిసిలీలో సెక్స్టస్ పాంపేను హతమార్చిన తరువాత అతడికి రావలసిన భాగాన్ని నేను లెక్కగట్టి పంచి ఇవ్వలేదట! ఆ యుద్ధానికి తాను కొంత నౌకాదళాన్ని అప్పిస్తే దాన్ని నేను ఇంకా తిరిగి పంపలేదట! చివరి ఆరోపణ మూడవ త్రైకూటవీరుడైన లెపిడన్ ను సామ్రాజ్యతృతీయ భాగాధికారంనుంచీ పదచ్యుతుణ్ణి చేసి, అతని ఆదాయాన్నంతటినీ నన్నే ఉంచుకోమని చిరచిరలాడటం. - అగ్రిప్పా : ప్రభూ! ఈ ఆరోపణలకు సమాధానం చెప్పితీరవలసిందే! సీజర్ : ఆ పని ఎప్పుడో జరిగింది. సమాధానాలతో వార్తాహరి వెళ్లాడుకూడాను. లెపిడస్ నిరంకుశుడు, క్రూరుడుగా పరిణమించాడనీ, అధికారాన్ని దుర్వినియోగం చెయ్యటంవల్ల జీవితవిపర్యాసానికి యోగ్యతను గడించాడనీ తెలియజేశాను. నేను జయించిన రాజ్యంలో భాగం ఇవ్వటానికి అంగీకరించాను. అదేరీతిగా అతని ఆర్మీనియాలోనూ, అతడు జయించిన ఇతరరాజ్యాలలోనూ భాగస్వామ్యమిస్తావా అని పృచ్ఛించాను. మెకన్నాస్ : అతడు ఇందుకు ఎన్నడూ లొంగడు! సీజర్ : అయితే ఆ పక్షంలో అతడికి నేను కూడా లొంగను! అక్టేవియా పరివారంతో ప్రవేశిస్తుంది ఆక్టేవియా : సీజర్ మహాశయా! జయము. జయము! సీజర్ : 'పతిపరిత్యక్తా!' అని నిన్ను సంబోధించవలసి వచ్చిందేమోనని నేనెంతో బాధపడుతున్నాను. ఆక్టేవియా : : అలా సంబోధించలేదు కదా! సంబోధించవలసిన అవసరం లేదు కూడాను. 238 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 సీజర్ : అయితే, మరి నీవు, ఇలా ఎందుకు ఎరుకపరచకుండా ఇక్కడికి వచ్చేశావు? నీవు సీజర్ సోదరివిలా రాలేదు. ఆంటోనీ పత్నికి హర్కారా జనంగా ఒక సైనికదళమైనా ఉండి తీరాలి. దర్శనమివ్వబోవటానికి ఎంతో ముందుగానే హయహేషలు ఆమె ఆగమనాన్ని తెలియజేయాలి. మార్గాన రెండువైపులా చెట్లు క్రిక్కిరియగా, తనపై ఎక్కిన జనభారాన్ని వహించి ఉండాలి. ఆశతో చూస్తూ నీ ఆగమనాన్ని గురించి పొందే ఉత్కంఠతో నిలిచి నిలిచి ఎంతకూ నీ దర్శనం కాకపోవటం వల్ల జనం మూర్ఛితులై పోవలసి ఉంది. నీ వెంటవచ్చే అసంఖ్యాక సైనికదళితమైన కెంధూళి ఆకాశకోటిని అధిరోహించవలసి ఉంది. కానీ నీవు రోముకు విపణికి వెళ్లే పల్లె యువతిలా వచ్చావు. మా ప్రణయాభిమానాన్ని ప్రకటించుకోటానికి ప్రతిబంధకాన్ని కల్పించావు. ప్రదర్శనావకాశాన్ని ఇవ్వకపోతే ఆ ప్రణయభావానికి అనుభూతే కలగదు. ప్రతి అంతస్తునా అధికాధికంగా ప్రణయస్వాగతాలను పలుకుతూ కడలిమీదా, నేలమీదా నీకు మేము ఎదురునడిచివచ్చి ఉండేవాళ్లం. ఆక్టేవియా : ప్రియసోదరా! ఇక్కడికి ఇలా వెళ్ళమని నన్ను ఎవరూ నిర్బంధించలేదు. నేనే స్వయంగా బయలుదేరి వచ్చాను. మీరు యుద్ధసన్నాహాలు చేస్తున్నారన్న వార్త విన్న వెంటనే, మార్క్ అంటోనీ దానిని నా చెవిన వేశారు. నేను ఎంతో బాధపడ్డాను. ఆయనను అభ్యర్థించి మీ కడకు తిరిగివచ్చాను. సీజర్ : అవును, అవును. అతని కామలౌల్యానికీ, అతనికీ మధ్యన నీవు అంతరాయంగా వున్నావు గనుక నీ అభ్యర్థనను అతడు తక్షణమే అంగీకరించి ఉంటాడు. ఆక్టేవియా : ప్రభూ! అలా అనకండి. సీజర్ : నేనాతనిమీద దృష్టిని నిల్పేఉన్నాను. అతడున్నచోటినుంచీ వచ్చే ప్రతినౌకవల్లా అతని వ్యవహారాలు నాకు తెలుస్తూనే ఉన్నవి. అతడిప్పుడెక్క డున్నాడు? ఆక్టేవియా : ప్రభూ! ఏథెన్సులో ఉన్నాడు. సీజర్ : కాదు. ఆపచరితసోదరీ! అతడు ఏథెన్సులో లేడు. కేవలశిరశ్చాలనం చేత క్లియోపాత్రా అతణ్ణి తన దగ్గిరికి వచ్చి వెయ్యమని ఆజ్ఞాపించింది. రాజ్యంలోని రాజులనందరినీ వారిద్దరూ ఇప్పుడు యుద్ధానికి సన్నద్ధులను చేస్తున్నారు. లిబియా రాజైన బోకన్ను, కపడోషియా రాజైన ఆర్కెలాస్ను, పాప్లగోనియా రాజైన అడల్లాస్ ను, అరేబియా రాజైన మాల్కసు, పాంపే రాజును, జూరీ హీరాడ ను, కొమెజీన్ రాజైన మిత్రడేటస్ ను మీడీ, లైకోనియాల రాజులైన పొలెమన్, ఎమిన్స్లను ఎందరెందరో రాజులను సమావేశపరిచారు. ఆంటోని - క్లియోపాత్రా ఇంకా 239 ఆక్టేవియా : అయ్యో! పరస్పరం విద్రోహాన్ని తలపెట్టుకొన్న ఇరువురు స్నేహితులయెడ సమంగా హృదయప్రేమను పంచి ఇచ్చిన నేనెంతటి అదృష్టహీనను! సీజర్ : ప్రియసోదరీ! నీకిదే నా స్వాగతం! నీయెడ ఇట్టి తప్పిదాన్ని కనులారా చూచేటంతవరకూ, అలసత్వంవల్ల ఇటువంటి ప్రమాదస్థితిలో నేను పడేటంతవరకూ, అతనితో యుద్ధానికి తెగబడకుండా నిలిపినవి నీ లేఖలే. కాలం ఇటువంటి బలవత్తరసాధనాలను ప్రయోగించవలసిన స్థితిని తెచ్చి పెట్టింది. వీటితో నీ మనస్సును కలత పెట్టుకోకు. ఉత్సాహాన్ని కల్పించుకో. ఇక దుఃఖించక విధి నిర్ణయించిన కృత్యాలను నీవు వెంటవెంటనే సాగిపోనీ. రోము నీకు స్వాగతమిస్తున్నది. నాకు నీ కంటే ప్రియమైంది మరేదీ లేదు. భావనకు కూడా అందుబాటులో లేనంతటి అపచారం నీకు జరిగింది. నీచేసిన ఈ అవమానానికి తగ్గ న్యాయాన్ని కల్పించుకోటంకోసం మహాధికులైన దేవతలు నన్నూ, నిన్ను ప్రేమించే ఇతరులనూ తమ ప్రతినిధులుగా పరిగ్రహింతురుగాక! ఎల్లవేళలా నీవు నాకు సౌఖ్యప్రదాయినివి. నిత్యమూ నీకు నా స్వాగతం! అగ్రిప్పా : ప్రభ్వీ! నీకిదే నా స్వాగతం! మెకన్నాస్ : ప్రియప్రభ్విణీ! ఇదే నీకు మా అందరి స్వాగతం! శక్తిమంతాలైన తన అధికార గౌరవాలను రెంటినీ ఒక బంధకిపరం చేసి, నేడు మనమీద ఒక కలకలాన్ని ప్రేరేపిస్తూ మేరలుమీరిన కామవ్యాపారవిద్రోహాలతో నిన్ను గెంటివేసిన అ వ్యభిచారి ఆంటోనీతప్ప, ఈ రోము మహానగరంలో నిన్ను ప్రేమించి నీ యెడ కనికరం వహించని హృదయం ఒక్కటైనా లేదు! ఆక్టేవియా : ఇది సత్యమేనా? సీజర్ : సుసత్యం! సోదరీ! నీకు స్వాగతం ప్రియసోదరీ! శాంతచిత్తవని చిరకీర్తి సంపాదించుకో. (నిష్క్రమిస్తాడు) ఏడో దృశ్యం ఆక్టియంవద్ద, ఆంటోనీ శిబిరం. క్లియోపాత్రా, ఎనోబార్బస్ ప్రవేశిస్తారు. క్లియోపాత్రా : అనుమానించకు. నేను నీతోనైనా బయటపడి తీరుతాను. ఎనోబార్బన్: ఎందుకు మహారాజ్జీ? 240 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 క్లియోపాత్రా : ఈ యుద్ధరంగాలలో నేను ఉండరాదనీ, అది ఉచితం కాదనీ నీవు నాకు వ్యతిరేకంగా ప్రసంగించావు. ఎనోబార్బస్ : అయితే, మరి ఉండటం ఉచితమా? క్లియోపాత్రా : అతడీయుద్దాలను నా మీదనే ప్రకటించినప్పుడు నేను ఇక్కడ ఎందుకుండగూడదు. ఎనోబార్బస్ : (అపవారితంగా) ఇందుకు నేను సమాధానం చెప్పలేక కాదు. క్లియోపాత్రా : ఏమిటంటున్నావు? ఎనోబార్బస్ : ఇక్కడి ఉనికి ఆంటోనీ మహాశయుణ్ణి ఊరికే కలత పెడుతుంటుంది. వీటిలో దేనినీ ఆయన ఇప్పుడు నీ పరంగా వినియోగించటానికి వీలు లేదు. ఆయన హృదయ దౌర్బల్యం కలవాడని ఇప్పటికే అపనింద చెలరేగింది. ఈ యుద్ధాన్నంతటినీ ఫోటానస్ అనే నీ కొజ్జా, నీ అవివాహితస్త్రీలు నడుపుతున్నట్లు రోములో ఇప్పటికే చెప్పుకొంటున్నారు. క్లియోపాత్రా : ఆ రోము సర్వనాశనమగుగాక! మాయెడ వ్యతిరేకంగా నిందాప్రచారం చేసేవాళ్ల నాలుకలు క్రుళ్లిపోవుగాక! యుద్ధవ్యయంలో కొంతభాగాన్ని నేను భరిస్తున్నాను. పురుషుడనైతే నేనెలా యుద్ధభూమిలో ఉండి తీరుతానో, అలాగే నా రాజ్యానికి రాజ్ఞినైన నేను ఇప్పుడీ యుద్ధరంగంలో ఉండితీరుతాను. ఇందుకు వ్యతిరేకంగా చెప్పకు. నేను యుద్ధభూమికి దూరంగా ఎక్కడో ఉండేదాన్ని కాను. ఎనోబార్బస్ : వీలు లేదు. ఇంతకుమించి నేనేమీ అనను. అడుగో! చక్రవర్తి. 87 ఆంటోనీ, కానెడియస్ ప్రవేశిస్తారు. 86 ఆంటోనీ : కానెడియస్! టారెస్టమ్, బ్రుండూషియం ల గుండా అయోనియా సముద్రాన్ని దాటి టారైనును " అతడు పట్టుకోటం అతివిచిత్రమైన విషయం కదూ! ప్రియా! నీవీ విషయాన్ని విన్నావా? క్లియోపాత్రా : జవశక్తిని ఉపేక్షాపరులకంటే ఘనంగా ఎవరూ స్తుతించరు. ఆంటోనీ : ఇది చాలా చక్కని నింద! అశ్రద్దను నిందించేటప్పుడు ఉత్తమోత్తములు ప్రయోగించటానికి యోగ్యమైన నింద. కానెడియస్! మనం అతడితో సముద్రంమీద పోరాడుదాం. ఆంటోని - క్లియోపాత్రా 241 క్లియోపాత్రా : సముద్రంమీదా? కాక మరి? కానెడియస్ : ప్రభువులెందుకలా చేయదలిచారు? ఆంటోనీ : అతడు మనను ఆ సముద్రంమీద ఎదుర్కోమని యుద్ధానికి పిలవటం వల్ల. ఎనోబార్బస్ : అలాగా. ప్రభూ? మీరు అతణ్ని నేలమీద యుద్ధం చెయ్యమని పిలిచారు. కానెడియస్ : అదైనా సీజర్ పాంపేతో పోరాడిన ఫారసేలియాలో చెయ్యమని. ఆయనకిది అనుకూలం కాకపోవటంవల్ల ఈ పిలుపును త్రోసిపుచ్చాడు. అలాగే మీరు కూడా ఆయన చేసిన యుద్ధస్థలనిర్దేశాన్ని త్రోసిపుచ్చవలసి ఉంది. ఎనోబార్బస్: మీ నౌకాదళంలో తగిన ఉద్యోగులు లేరు. మీ కర్ణధారులందరూ గాడిదలను తోలుకొనేవారు గడ్డికోసేవారును. యోగ్యతాయోగ్యతలను గమనించ కుండానే అతివేగంగా సేవకు చేర్చుకోబడ్డవారు. మరి సీజర్ నౌకాదళంలోని వారో, బహుపర్యాయాలు సీజర్ వెంట పోరాడిన ప్రముఖులు. వారి నౌకలు మిక్కిలి తేలికైనవి. మీవి చాలా బరువైనవి. మనం భూమిమీద పోరాడటానికి సర్వసన్నద్ధులమై ఉన్నాము. కనుక సముద్రంమీద ఎదుర్కోటానికి ఇష్టపడక తిరస్కరించటంవల్ల కలిగే అపకీర్తి, ఏమీ ఉండదు. ఆంటోనీ : నేను సముద్రంమీదనే, సముద్రంమీదనే పోరాడతాను! ఎనోబార్బస్ : గౌరవనీయులైన ప్రభూ! ఇందువల్ల భూమిమీది పోరాటంలో మీకున్న సైనికాతిశయాన్ని అవజ్ఞ చేస్తున్నారన్నమాట! పడవల్లోకి వారిని పంచటంతో మీరు సైన్యాన్ని బలహీనం చేస్తున్నారు. ఇందులో అధికాంశం కదనరంగంలో కాకలు దీరిన కాల్బలం. విఖ్యాతిగన్న మీ భూతలయుద్ధపాండిత్యం అనుపయుక్తమౌతుంది. నిశ్చితవిజయాన్ని చేకూర్చే మార్గాన్ని మీరు పరిపూర్ణంగా వదులుకొంటున్నారు. భద్రతను పరిత్యజించి అనిశ్చయావకాశాలకు, అపాయపరిస్థితులకూ మిమ్మల్ని మీరే ఒప్పచెప్పుకొంటున్నారు. ఆంటోనీ : నేను సముద్రంమీదనే పోరాడతాను! క్లియోపాత్రా : నాకు అరవై నౌకలున్నవి. నాకంటే సీజర్కు ఒక నౌకైనా అదనంగా లేదు. 242 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఆంటోనీ : అధికంగా ఉన్న నౌకలన్నింటినీ దగ్ధం చేసి, మిగిలినివాటిని సైన్యాలతో నింపి వాటి సహాయంతో ఆక్టియమ్ అగ్రం వద్దనుంచీ వస్తున్న సీజర్ను ఎదుర్కొంటాను. ఒకవేళ మనమే ఓడిపోతే, అప్పుడు మనం అవనీతలయుద్ధం చేద్దాం. వార్తాహరి ఒకడు ప్రవేశిస్తాడు. నిన్నిక్కడికి రప్పించిన ఆ వ్యవహారమేమిటి? వార్తాహరి : ప్రభూ! సీజర్ రాకను మనచారులు గుర్తిస్తున్నారన్న వార్త సత్యం. అంతే కాదు. ఆయన టొరైనీని పట్టుకొన్నాడన్న వార్త కూడా సత్యం. ఆంటోనీ : అతడు స్వయంగా అక్కడుంటాడా? అవకాశం లేదు. అతడి సైన్యాలు అక్కడున్నాయంటే చాలా చిత్రమైన విషయం. కానెడియస్, మన పందొమ్మిదిపదాతి దళాలకూ, పన్నెండు ఆశ్వికదళాలకూ అధిపతివి నీవు... మనం మన నౌకమీదికి వెళ్లుదాం. - పద ఓ నాథెటిస్ "! పద. ఒక సైనికుడు ప్రవేశిస్తాడు. యోగ్యసైనికుడా! సంగతేమిటి? సైనికుడు : మహోదాత్తసమ్రాట్! సముద్రంమీద పోరాడకండి. మన నలిగిపోయిన నావలను నమ్మకండి. ఈ ఖడ్గంమీదా, ఈ నా రణకిరణాంకాలమీద మీకు అపనమ్మకం కలిగిందా? ఈజిప్షియన్లనూ, ఫొనీషియన్లనూ బాతుల్లా పడి ఈదనీయండి! మనం నేలమీద నిలిచి అడుగడుగునా పోరాడటానికి అలవాటు పడ్డవాళ్లం. ఆంటోనీ : మంచిది. నీవు వెళ్ళిపో! (ఆంటోనీ, ఎనోబార్బస్, క్లియోపాత్రా నిష్క్రమిస్తారు) సైనికుడు : హెర్క్యూల్స్ సాక్షిగా నేను నిజం చెబుతున్నాననుకొంటాను. కానెడియస్ : సైనికుడా! నీవు చెప్పేది సత్యమే. యుద్ధవిషయంలో ఆయన సర్వకర్తవ్యాలూ ఆయనకున్న బలాన్ని బట్టి నిర్ణీతాలు కావటంలేదు. మన సేనాధినేతను ఆమె అలా నడుపుతున్నది. ఈ నాడు మనమందరం స్త్రీలకు సేవకులమైనాము. సైనికుడు : అవనీతలంమీది దళాలకూ, ఆశ్విక బలాలకూ అధిపతివి నీవే కదూ! కానెడియస్: మార్కస్ ఆక్టేవియస్! మార్సియస్ జస్టియస్, పబ్లికోలా కైలియస్ సముద్రదళాలకు అధిపతులు. భూతలంమీది అఖిలబలాలకూ అధిపతిని నేనొక్కణ్ణి. సీజర్ అంతటి శరవేగంతో వస్తున్నాడన్నవార్త నమ్మికకు అందటం లేదు. ఆంటోని - క్లియోపాత్రా - 243 సైనికుడు : అతడు ఇంకా రోములో ఉండగానే, అతని బలాలు బహురూపాలను ధరించి చారులను మోసగించేరీతిగా వివిధదేశాలకు విచ్చేస్తున్నాయి. కానెడియస్ : ఆయనకు ప్రధానప్రతినిధి ఎవరో నీవు విన్నావా? సైనికుడు : అతడెవరో టారస్" అని వారు చెప్పుకొంటున్నారు. కానెడియస్: అతడు నేనెరిగినవాడే. వార్తాహరి ప్రవేశిస్తాడు. వార్తాహరి : కానెడియస్ ను చక్రవర్తి పిలుస్తున్నారు. కానెడియస్ : విచిత్రమైన వార్తలతో కాలం మహాఘనమైందిగా ఉంది. ప్రతిక్షణం ఏదో క్రొత్తవార్త పుడుతూనే ఉంది. సీజర్ : టారస్! ఎనిమిదో దృశ్యం ఆక్టియం దగ్గర ఒకమైదానం. సీజర్, టారస్ పయనిస్తూ ఉన్న సైన్యంతో ప్రవేశిస్తారు. టారస్ : ప్రభూ! సీజర్ : భూతలంమీద ఎదుర్కోకు. సైన్యాలనన్నిటినీ ఒకచోట సమీకరించు. మేము సముద్రంమీద ఆరంభించే దాక వారిని నేలమీద యుద్ధానికి పురికొల్పకు. ఈ లేఖావలయంలోని ఉత్తరువులను ఎన్నడూ అతిక్రమించకు. మన అదృష్టమంతా ఈ అవకాశం మీదనే ఆధారపడి ఉంది (నిష్క్రమిస్తాడు) తొమ్మిదో దృశ్యం మైదానంలో మరొక ప్రాంతం. ఆంటోనీ, ఎనోబార్బస్ ప్రవేశిస్తారు. ఆంటోనీ : మన ఆశ్విక సైన్యంలోని ప్రధానదళాలను కొండకు అవతలవైపు యుద్ధసన్నద్ధాలైన సీజర్ సైన్యాలకు ముఖాముఖిగా మోహరించు. వచ్చే నౌకాదళసంఖ్యను అక్కడినుంచీ గమనించి, తగ్గట్టుగా కార్యనిశ్చయం చేద్దాము. 244 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 పదో దృశ్యం మైదానంలో మరొక పార్శ్వం. రణభూమిమీద కానెడియన్ తన అవనీదళాలతో పయనిస్తాడు. సీజర్ ప్రతినిధి అయిన టారస్ పైరీతిగా ఎదురుమళ్లి ప్రయాణం చేస్తుంటాడు. వారు లోపలికి వెళ్ళినతర్వాత సముద్రయుద్ధకలకలం వినిపిస్తుంది. హెచ్చరిక, ఎనోబార్బస్ ప్రవేశిస్తాడు. ఎనోబార్బస్ : నాశనమైంది! సర్వనాశనమైంది! ఈ స్థితిని నేను బహుకాలం సహించలేను. 'ఆంటోనియడ్" అనే ఈజిప్టుపతాక నౌక తన అరువది నౌకలనూ వెంటబెట్టుకొని యుద్ధానికి బయలుదేరటం కోసం, తెరచాపలెత్తి చుక్కాని త్రిప్పుతున్నది. ఆ దృశ్యాన్ని తిలకిస్తున్న నా కన్నులు కవలిపోతున్నవి. స్కారస్ ప్రవేశిస్తాడు. స్కారస్ : సిగ్గు! సిగ్గు!! సమస్తదేవతలూ, దేవతామతల్లులూ, పరివారదేవతలూ అందరూ యానపాత్ర లెక్కి బయలుదేరారు. ఎనోబార్బస్ : నిన్నంతగా కలవరపెడుతున్న ఆ భావమేమిటయ్యా? స్కారస్ : కేవలం అజ్ఞానంవల్ల ప్రపంచంలో అధికభాగాన్ని కోల్పోవటం జరిగింది. లంపటత్వంవల్ల రాజ్యాలనూ, రాష్ట్రాలనూ మనం పోగొట్టుకొన్నాము. ఎనోబార్బస్: యుద్ధం ఎలా సాగుతున్నది? మనపక్షాన యుద్ధం ప్లేగువ్యాధి బాధితుల ఒడలిమీద ఎర్రని మచ్చల్లాగా - అవి శీఘ్రమరణానికి దేవతాచిహ్నాలు - సాగిపోతున్నది దానికి కుష్ఠువ్యాధిపీడ తప్పదని నా నమ్మకం. ఉభయపక్షాలకు అవకాశం తుల్యమై కవలల్లా కనిపించినప్పుడు లేదా ఇంచుకంత మొగ్గు మనవైపే ఉన్నప్పుడు, యుద్ధమధ్యంలో ఆ ఈజిప్టు పోకిరి జూన్ నెలలోనే అబెయ్యలా, జోరీగ కుట్టినట్లు తెరలెత్తించి పారిపోతూ వచ్చింది. ఎనోబార్బస్ : అది నేను చూచాను. ఇటువంటి దృశ్యాలు ఇంకా ఎన్ని జరుగుతాయో అని భయపడుతూ నా కళ్లు దాన్ని చూచి ఓర్చుకోలేకపోయాయి. స్కారస్: పారిపోవటానికి ఆమె తన నౌకను గాలివాటంగా మరల్చినప్పుడు ఆమె ఐంద్రజాలికవిద్యవల్ల వినాశనమైన ఆంటోనీ, తానూ అతివేగంగా పరుగెత్తిపోవటానికి తెరలెత్తించాడు. కాముకత్వానికి కట్టుబడ్డ అడవిబాతులా, పరాకోటి నందుకొన్న బవరాన్ని ఆంటోని - క్లియోపాత్రా 245 వదలి, ఆమెవెంట పరుగెత్తుతున్నాడు. ఇంతటి లజ్జాకరమైన కృత్యాన్ని నేనెన్నడూ చూడలేదు. అనుభవం, పౌరుషం, గౌరవం, ఇంతకుపూర్వం ఎన్నడూ తమ్ము తామే ఇలా భగ్నం చేసుకోలేదు. ఎనోబార్బస్ : అయ్యో! అయ్యో!! కానెడియస్ ప్రవేశిస్తాడు. కానెడియస్ : సముద్రంమీద మన అదృష్టం సర్వశోషిల్లిపోయింది. అతిశోచనీయంగా అస్తమిస్తున్నది. తన శక్తిసామర్థ్యాలను గురించి తానెరిగినంత మట్టుగా మన సేనాధినేత ప్రవర్తించి ఉన్నట్లయితే, అది సక్రమంగానే ఉండగలిగేది. అయ్యో! అతినీచంగా పరువెత్తిపోయి అతడు మనందరికీ పలాయనానికి నిదర్శనమైనాడు. ఎనోబార్బస్ : ఏమిటి? నీ ఊహలు ఇలా నడుస్తున్నవేం? సీజర్కు లొంగిపోవటమే నీ ఆలోచనైతే ఇక నిఖిలం మనం కోల్పోయినట్లే! కానెడియస్ వారు పెలొపొనేసస్ వైపు పారిపొయ్యారు. ఎనోబార్బస్ : అయితే, మనం అక్కడికి వెళ్ళి కలుసుకోటం సముచితం. ఇంకా ఏ ఏ పరిణామాలు రానున్నవో అక్కడ వేచి ఉంటాను. కానెడియస్ : నా పదాతిదళాలనూ, అశ్వబలాలనూ సీజర్ పరం చేస్తాను. ఇప్పటికే ఆరుగురు రాజులు ఇలా లొంగిపోవటంలో నాకు దారి చూపించారు. ఎనోబార్బస్ : నేను చేసే నిర్ణయానికి నా బుద్ధి వ్యతిరేకిస్తున్నది. ఇప్పటికీ నేను భగ్నమైపోతున్న ఆ ఆంటోనీ అదృష్టాన్నే అనుసరిస్తాను. (నిష్క్రమిస్తారు) పదకొండో దృశ్యం అలెగ్జాండ్రియా, క్లియోపాత్రా సౌధం, ఆంటోనీ పరిచారకులతో ప్రవేశిస్తాడు. ఆంటోనీ : విను! ఆంటోనీ! నీవింక నా మీద అడుగు పెట్టకని అవనీతలం ఆజ్ఞాపిస్తున్నది. నన్ను భరించటానికి పృథ్వి సిగ్గుపడుతున్నది. మిత్రులారా! ఇక్కడికి రండి. అఖిల ప్రపంచంలో నేనే అంధకారావృతుడనైనాను. నిత్యంగా నన్ను నేను కోల్పోయేటంతటి అధికంగా అంధకారావృతుడనైనాను. నాకు కాంచనసంభరితమైన 246 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 నావ ఒకటి దక్కింది. దాన్ని పుచ్చుకోండి! పంచుకోండి!! పారిపొండి!! సీజర్తో సంధి చేసుకోండి. అందరూ : పారిపోవడమా? మిమ్మల్ని వదిలిపెట్టి ఆ పని చేయలేం. ఆంటోని : నేనే పారిపోయివచ్చాను. వెన్నిచ్చి పారిపొమ్మని భీరువులకు నేనే పాఠం నేర్పాను. మిత్రులారా! మీకిదే నా వీడ్కోలు. ఆ నా సంపద నౌకాశ్రయంలో ఉంది. పుచ్చుకోండి. అయ్యో! సిగ్గు! సిగ్గు!! నే నెవతెముఖాన్ని చూడటానికి లజ్జిస్తున్నానో ఆమెను నేనింతవరకూ అనుసరించాను. ఇప్పుడు నా రోమరోమం విప్లవం చేస్తున్నది. కపిలకుంతలాల తొందరపాటును చూచి పలితకేశాలు దూషిస్తే అవి తిరిగీ వీటి భీరుత్వవ్యామోహాలను నిందిస్తున్నాయి. మిత్రులారా! ఇదే వీడ్కోలు. మీ మార్గాన్ని సుగమం చేయటానికి నేను కొందరు మిత్రులకు లేఖలు వ్రాస్తాను. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. చింతాక్రాంతులు కాకండి. నన్ను వీడిపోవటానికి ఇష్టపడక వ్యతిరేకమైన సమాధానాలు చెప్పకండి. నా నిరాశ ప్రకటిస్తున్న సూచనలను అందుకోండి. తన్ను తానే పరిత్యజించుకొన్న దాన్ని ఎన్నడూ పట్టుకొని ప్రాకులాడకండి. సముద్రతీరాన వెంటనే సూటిగా పయనించండి. ఆ నౌకనూ, ఆ సంపత్తినీ నేను మీ పరం చేస్తాను. నాకు కొంత ఏకాంతాన్ని కల్పించండి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించట మెందుకంటారా? నేనిపుడు మీ సేనాధినేతను కాను గనుక. ఇప్పుడే నేను మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుసుకొంటాను (ఆసనస్థుడౌతాడు. ఛార్మియన్, ఇరోస్ త్రోవ చూపిస్తుంటే క్లియోపాత్రా ప్రవేశిస్తుంది. ఐరాస్ అనుసరిస్తాడు). ఇరోస్ : రాజ్జీ! వెనక్కు తగ్గవద్దు. ఆయన దగ్గరకు వెళ్లు. సౌఖ్యాన్ని చేకూర్చు. ఐరాస్ : ప్రియరాజ్జీ! ఆరంభించు. ఛార్మియన్: పూనుకో. ఏమిటిది? ఇంకేమన్నా జరిగిందా? క్లియోపాత్రా : ఓ జూనో! నన్ను? ప్రక్కన కూర్చోనీ. ఆంటోనీ : ఓ! వద్దు, వద్దు, వద్దు! ఇరోస్ : ప్రభూ! మీ ప్రక్కన ఉంది ఎవరో చూచారా? ఆంటోనీ : ఆఁ - చీ, చీ, ఛీ!!! ఛార్మియన్ : ప్రియరాజ్జీ! ఆంటోని - క్లియోపాత్రా 247 ఐరాస్ : రాజ్జీ! సమ్రాజ్జీ!! ఇరోస్ : ప్రభూ! ప్రభూ!! 93 ఆంటోనీ : అవును, నా ప్రభూ, అవును! ఫిలిప్పీయుద్ధరంగం లో అతడు కౌక్షేయాన్ని దూయవలసిన అవసరమే లేకపోయింది. ఖడ్గాన్ని అలంకారమాత్రంగా గ్రహించి నటకుడిలాగా అపుడు అతడు దాన్ని ధరించాడు. అంతే. ఆ బక్కపలచని ఆకలికళ్ల కాషియస్ను ఎదుర్కొన్నది నేను. ఆ ఉదాత్తోన్మత్తుణ్ణి బ్రూటస్ ను అంతమొందించింది నేను. ఆహవవ్యూహాలమధ్య వ్యవహరిం చటంలో అభ్యాసం లేనివాడు కావటంవల్ల, అతడప్పుడు అనుచరగణంచేత యుద్దం చేయించాడు. అయితే ఇప్పుడో ఏదో గడిచిపోయింది. క్లియోపాత్రా : అయ్యో! నాకు సాయం రండి! ఇరోస్ : మహారాజ్ఞి, ప్రభూ! మహారాజ్ఞి! ఐరాస్ : రాజ్జీ! ఆయనదగ్గరికి వెళ్లు. మాట్లాడు. లజ్జవల్ల ఆయన తన వీరగుణవిశేష సర్వస్వాన్నీ కోల్పోతున్నాడు. క్లియోపాత్రా : అయితే! నాకు తోడ్పడండి! అయ్యో! ఆధారంగా నిలవండి. ఇరోస్ : ఉదాత్తసమ్రాట్! ఉతితులు కండి. మహారాజ్ఞి మీ దగ్గిరికి వస్తున్నది. ఆమె శిరస్సు వాలిపోతున్నది. మీరిచ్చే సౌఖ్యం రక్షణార్థం రాకపోతే మృత్యువామెను కబళించి తీరుతుంది. ఆంటోనీ : నా ప్రతిష్ఠయెడ నేను ద్రోహినైనాను. ఇది అత్యనుదాత్తమైన వ్యతిక్రమం. ఇరోస్ : ప్రభూ! మహారాజ్ఞి!! ఆంటోనీ : నీవు నన్నెక్కడికి నడిపించావు? చూడు? గౌరవచ్యుతుడనైన నేను ఆర్జించి పేర్చిన అఖిలాన్నీ వెనుదిరిగి చూస్తూ నా లజ్జను నీ దృష్టిపథం నుంచీ ఎలా దాచుకొంటున్నానో చూడు!! క్లియోపాత్రా : ప్రభూ! పిరికివడి నేను నావమీద వలియబారి వచ్చినందుకు నన్ను క్షమించండి. నన్నుమీరు అనుసరించి వస్తారని ఆ సమయంలో అణుమాత్రమైనా భావించలేకపోయాను. 248 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఆంటోనీ : ఈజిప్టురాజ్జీ! నా హృదయం ప్రణయసూత్రాలతో నీవనే చుక్కానికి బంధితమై ఉందనీ, నీవు నన్ను వెంట లాక్కోపోతావనీ, నీకు ఎంతో బాగా తెలుసును. నా అంతరాత్మ మీద నీకెంతటి సర్వాధికారం ఉన్నదీ నీవు ఎంతో బాగా ఎరుగుదువు. దేవతల అనుశాసనాన్నైనా తిరస్కరించి వచ్చేటట్లు నీ అత్యల్పమైన సంజ్ఞ కూడా నన్ను ఆజ్ఞాపించి రప్పిస్తుందని నీకు తెలుసు. క్లియోపాత్రా : ఓ నా ప్రభూ! నన్ను క్షమించండి!! ఆంటోనీ : ఒకనాడు నా ఇచ్ఛానుసారంగా ప్రపంచార్ధంలోని ప్రజల అదృష్టాలకు ఉదయాస్తమయాలను కల్పించిన నాకు ఈ నాడతినీచతమాదృష్టుడనై, అణకువతో ఆ యువకుణ్ణి సంధికోసం అభ్యర్థించటానికి ఎంతో తంటాలు పడవలసిన స్థితి పట్టింది. నన్నెంతగా నీవు జయించావో ఎరుగుదువు. ప్రణయంవల్ల నా ఖడ్గం ప్రాభవహీనమై సర్వకాల సర్వావస్థల్లోనూ దాని ఆజ్ఞలను అనుసరిస్తుందని నీవెరుగుదువు. క్లియోపాత్రా : క్షమించండి! నన్ను క్షమించండి!! ఆంటోనీ : నీ విషాదాశ్రుబిందువు నొకదానినైనా చిందనీయకు. అది నేను జయించి కోల్పోయిన సర్వంతో సమానమైన మూల్యం కలది. ఏదీ ఒక ముద్దు. ఇదైనా చాలు, నే కోల్పోయిన సర్వాన్నీ తిరిగి చెల్లిస్తుంది. మన ఉపాధ్యాయుణ్ణి పంపించాను. ఆయన తిరిగివచ్చాడా? ప్రియా! దుఃఖం నన్ను పూర్ణంగా ఆవరించింది. కొంత ద్రాక్షాసనాన్నీ, ఉపహారాలను తెచ్చియివ్వండి. గట్టిదెబ్బలు తీస్తున్నప్పుడే మనం దాన్ని గాఢంగా అసహ్యించుకొంటామని అదృష్టానికి తెలుసు. పన్నెండో దృశ్యం ఈజిప్టు, సీజర్ శిబిరం, సీజర్ దోలబెల్లా, థైరీయస్ ఇతరులతో ప్రవేశిస్తారు. సీజర్ : ఆంటోనీ దగ్గరనుంచి వచ్చిన వ్యక్తిని దర్శనం చేసుకోమనండి - నీవు అతణ్ణి ఎరుగుదువా? 94 దోలబెల్లా : సీజర్ మహాశయా! అతడు నాకు తెలుసును. క్లియోపాత్రావల్ల ఆంటోనీకి కలిగిన బిడ్డలకు అతడు ఉపాధ్యాయుడు . కొలదిమాసాలకు పూర్వం వార్తాహరులనుగా ఎందరెందరో రాజులను ఉద్యోగించగలిగిన ఆంటోనీ, ఇట్టి ప్రయోజనం కోసం ఇతణ్ణి పంపించటమే అతడు సమస్తకీర్తినీ కోల్పోయినాడనటానికి ప్రబల నిదర్శనం. ఆంటోనీ పంపిన రాయబారి యూఫ్రోనియస్ ప్రవేశిస్తాడు. ఆంటోని - క్లియోపాత్రా 249 సీజర్ : ఇలా దగ్గరకు రావయ్యా! మాటాడు. యూఫ్రోనియస్ : మహార్ణవంతో పోలిస్తే గొంజిఆకుమీద మంచుబొట్టు ఎంతో ఉపాధ్యాయుడనైన నేను అంతగా కొలది కాలంనుంచీ ఆయన ప్రయోజనాలకు తోడ్పడుతున్నాను. సీజర్ : కావచ్చు, నీవు వచ్చిన ప్రయోజనమేమిటో వెల్లడించు. యూఫ్రోనియస్ : తన అదృష్టానికి అధిపతులైన మీకు నమస్కరించి, అతడు ఈజిప్టులో నివసించటానికి అనుమతించవలసిందని అర్దిస్తున్నాడు. ఇందుకు మీరు అంగీకరించని పక్షంలో తన కోర్కెను తగ్గించుకొని ఏథెన్సులో ఒక ప్రత్యేకవ్యక్తిగా భూమ్యాకాశాల మధ్య జీవించటానికి అనుమతించవలసిందని ప్రార్థిస్తున్నాడు. ఆయన్నుగురించి మీకు నివేదించవలసింది ఇంతే. తరువాత క్లియోపాత్రా మీ ఆధిక్యాన్ని అంగీకరించి మీకు లొంగిపోయింది. అపాయస్థితికి పాలైన టోలమీల కిరీటాన్ని తన వారసులకు దక్కించవలసిందని ఆమె మిమ్మల్ని అభ్యర్థిస్తున్నది. సీజర్ : ఆంటోనీ విషయంలో - అతడి అభ్యర్థనను నేను చెవిని బెట్టను. ఈజిప్టు రాజ్ఞిని గురించి - ఆమెకు సమ్ముఖాన్ని కల్పించటంగాని, ఆమె కోర్కెలు తీర్చటంగాని నేను కాదనను. కానీ, ఇందుకు ఆమె సర్వవిధాలా గౌరవచ్యుతుడైన తన ప్రియుణ్ణి ఈజిప్టు దేశంనుంచి బహిష్కృతుణ్ణి చేయటం గాని, ప్రాణహరణం చేయటంగాని చేయవలసి ఉంటుంది. ఇందులో ఏది జరిగించినా ఆమె ప్రార్థనలను విని అనుకూలంగా వ్యవహరించటం జరుగుతుంది. ఇదే వారిద్దరికీ నా సమాధానం. యూఫ్రోనియస్ : అదృష్టదేవత మిమ్మదరించుగాక! సీజర్ : ఇతణ్ణి సైన్యాలగుండా నడిపించుకోపొండి. (యూఫ్రోనియస్ నిష్క్రమిస్తాడు) (థైరియస్తో) క్లియోపాత్రా యెడ నీ వకృత్వప్రావీణ్యాన్ని ప్రదర్శించి పరీక్షించుకోవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. వెంటనే బయలుదేరు. క్లియోపాత్రాను ఆంటోనీ నుంచి వేరుచేయటంలో విజయం సాధించు. ఆమె కోరినవెల్లా ఇచ్చేయ్ - నా పేరు చెప్పి వాగ్దానం చెయ్యి. ఆమె కోరుకొన్నవే కాదు, ఇంకా నీ ఊహకు తోచినవాటిని కూడా చేర్చి ఇచ్చేయ్. తమ అదృష్టాలు, పరాకాష్ఠలను అందుకొన్నప్పుడు అబలలెన్నడూ మానసికంగా సబలలై నిలువలేరు. పురుషస్పర్శ అంటే ఏమో ఎరుగని వెష్ఠాదేవి 95 250 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 కన్యలచేత నైనా ఆ స్థితి చేసిన శపథాలను వ్యతిక్రమించేటట్లు చేయగలుగుతుంది. థైరియస్! నీ శక్తిని పరీక్షించుకో! ఇందులో నీవు విజయం చేకొన్నావో ఓ పారితోషికాన్ని నీవే నిర్ణయించుకోవచ్చు దాన్ని శాసనంలో భావించి చెల్లిస్తాను. 96 థైరియస్ : సీజర్ మహాశయా! నేను వెళ్ళివస్తాను. సీజర్ : తన అదృష్టం సర్వం అస్తమించిన పరిస్థితులకు అంటోనీ ఎలా అలవడిపోతుంటాడో పరిశీలించు. శారీరక మానసికచర్యల మూలంగా అతడు ఏమో వెల్లడిస్తున్నాడని, నీవు భావించే ప్రత్యంశాన్నీ పరిశీలించు. థైరియస్ : సీజర్ మహాశయా! తప్పక పరిశీలిస్తాను. (నిష్క్రమిస్తారు) పదమూడో దృశ్యం క్లియోపాత్రా ప్రాసాదం, క్లియోపాత్రా, ఎనోబార్బస్, ఛార్మీయస్, ఐరోస్ ప్రవేశిస్తారు. క్లియోపాత్రా : ఎనోబార్బస్! ఇప్పుడు మనమేం చేద్దాం? ఎనోబార్బస్ : చింతిద్దాం! మరణిద్దాం!! క్లియోపాత్రా : ఇంతకూ దోషం మనదా? ఆంటోనీదా? ఎనోబార్బస్ : బుద్ధి కాక కాంక్ష నడిపించినట్లు నడిచే ఆ ఆంటోనీదే. పరస్పర భయోత్పాతాలను కల్పిస్తూ, ఒకదాని కొకటి ఎదురుమళ్ళగా యుద్ధరంగంలో నిలిచి ఉన్న నౌకా పరంపరల ఎదుటనుంచి నీవు పారిపోతే మటుకేం? ఆయన నిన్ను అనుసరించటమెందుకు? ప్రణయకండూతి ఆ సమయంలో అతని ఆధిపత్యాన్ని కాటు వేయకుండా వుండవలసింది. అట్టి క్లిష్టసమయంలో తన నౌకాదళాలన్నీ మహాద్భుతభీత చిత్రాలతో తిలకించేటట్లుగా నీ వలియబారే నౌకలను అనుసరించటం వల్ల కలిగిన నష్టం కంటే ఏ మాత్రం తీసిపోదు! ಲಜ್ಜ క్లియోపాత్రా : ఇంతతో చాలించు ఇదే నిన్ను ప్రార్థిస్తున్నాను. దూత యూఫ్రోనియస్తో ఆంటోనీ తిరిగి ప్రవేశిస్తాడు. ఆంటోని - క్లియోపాత్రా 251 ఆంటోనీ : అతని సమాధానం అదేనా? యూఫ్రోనియస్ : అవును ప్రభూ! ఆంటోనీ : ఆమె నన్ను మోసగిస్తేనే అతనివల్ల క్రమమైన మర్యాదను పొందుతుందన్నమాట! యూఫ్రోనియస్ : అని వారంటున్నారు.

ఆంటోనీ : అయితే ఈ విషయాన్ని రాజ్ఞికి తెలియజెయ్! రాజ్యాలయెడా, రాష్ట్రాలయెడా ఉన్న పరిపూర్ణాభిలాష తీరాలంటే బాలుడైన 7 ఆ సీజర్ దగ్గిరికి నా ఈ నెరిసిన తలను పంపించాలని తెలియజెయ్ !! క్లియోపాత్రా : ఆ తలనా, ప్రభూ? ఆంటోనీ : మళ్లీ సీజర్ దగ్గరికి వెళ్ళి చెప్పు! పరికీర్తిత యౌవనాలంకారశోభితుడవు. నీవేదైనా విశిష్టకార్యదూర్వహుడవై నిర్వర్తించి చూపాలె నని లోకం కోరుతున్నది. నీ సంపత్తి, సైనికబలాలు, నౌకాదళాలు ఏ పిరికిపందకైనా ఉండవచ్చు. సీజర్కు ఉండాలా? ఒక పసిబిడ్డ కున్నా అవి విజయాన్ని సాధించటం తథ్యం. అందువల్ల అతడికి సహజంగా లభ్యమైన సంపదను దూరంగా ఉంచి అస్తమించిన అధికారయౌవనాలుగల నన్ను ఒంటిగా ఎదుర్కోవలసిందని ఆహ్వానిస్తున్నానని చెప్పు. నేనీ వీరాలాపాన్ని లిఖితపూర్వకంగా పంపుతాను. నా వెంట రా! (ఆంటోనీ, యూఫ్రోనియస్ నిష్క్రమిస్తారు) ఎనోబార్బస్ : (స్వగతం) అవును. మహాసైన్యసంపత్తికి అగ్రేసరుడైన సీజర్ ఈ ద్వంద్వయుద్ధాహ్వానాన్ని అంగీకరించటం సంభవమేనా? ఉపలభ్యమానాలై ఉన్న సహజావకాశాల నన్నింటినీ అవతలపెట్టి, ఆ సీజర్ ప్రజలు దర్శించటం కోసం ఒక సామాన్యఖడ్గ విన్యాసప్రదర్శకుడితో తా జగడమాడటంకోసం రంగస్థలంమీద నిలుస్తాడా? అసంభవం! ఇది ఎంత విచిత్రమైన ఊహ? మానవుల నిర్ణయాలు కూడా వారి అదృష్టాన్నే అనుసరిస్తుంటాయి. రెండూ తుల్యంగా వినాశనాన్ని పొందాలి గనుక మానసికగుణవిశేషాలను కూడా అదృష్టం తన వెంట నడిపిస్తుంటుంది. వివిధవ్యక్తులు శక్తిసామర్థ్యాలను పరిగణించటంలో ప్రముఖవిజ్ఞాని అయిన తాను, సర్వైశ్వర్య పరిపూర్ణుడైన సీజర్, అధఃపతితుడైన తనతో సమఫాయాలో సమరరంగాన సమాధానం 252 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 చెబుతాడని కలగనటం ఎంత వింత! సీజర్ మహాశయా! ఈతని నిర్ణాయకశక్తి మీద కూడా నీవు విజయం చేకొన్నావు! సేవకుడొకడు ప్రవేశిస్తాడు సేవకుడు : సీజర్ వద్దనుంచీ ఒక వార్తాహరి వచ్చాడు. క్లియోపాత్రా : ఏమిటి? నా యెడ చూపవలసిన సమయాచారాలు ఇంతటితో చెల్లిపోయాయా! ఓ నా కన్యకలారా! గమనించండి. ముకుళంలా ఉన్నప్పుడు తావి నాఘ్రాణించటానికి తలొగ్గి నిలిచే మానవులు, వికసించిన గులాబి దగ్గరికి నడిచివెళ్లే నాసికను అరికడతారు. అతణ్ణి ప్రవేశపెట్టు. సేవకుడు నిష్క్రమిస్తాడు. ఎనోబార్బస్ : (స్వగతం) నా గౌరవప్రతిపత్తి నాతో భిన్నిస్తున్నది. కలహమారంభించింది. రాజభక్తి పరాయణత్వం బుద్ధిబలాన్ని కోల్పోయినవారిని అంటిపట్టుకొని ఉండటం దానిదోషమే. అయితే ఏ సేవకుడు తత్పరతతో పడిపోయిన యజమానిని అనుసరింపగలుగుతాడో అతడు ఆ యజమాని కంటే ఆధిక్యాన్ని సంపాదించి మరో యజమానికి లొంగినవాని కంటే అధికుడనిపించుకోటమే కాకుండా చరిత్రలో ఒక గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించుకొంటాడు. థైరియస్ ప్రవేశిస్తాడు. క్లియోపాత్రా : సీజర్ నిర్ణయాలేమిటి? థైరియస్ : మీరు ఏకాంతంగా వినవలసి ఉంది. క్లియోపాత్రా : ఇక్కడ ఉన్నవారందరూ ఆప్తులే. ధైర్యంతో చెప్పు. థైరియస్ : సందర్భవశాన వీరందరూ ఆంటోనీకి కూడా ఆప్తులే కదా! ఎనోబార్బస్ : సీజర్కు ఎందరు ఆప్తులు అవసరమో ఆయనకూ అందరు అవసరం. కానీ యుద్ధం అయిపోతుంది కనుక మాతో పనిలేకుండా పోవచ్చుకూడాను. సీజర్ ఇచ్ఛయిస్తే మా యజమాని మిత్రుడై వర్తించటానికి ఎంతో రయోద్వేగాన్ని ప్రకటిస్తాడు. మేమో, ఆయన ఎవరివాడో మేమూ వారివాళ్ళమే అంటే సీజర్ ప్రజలమౌతా మన్నమాట! ఆంటోని - క్లియోపాత్రా 253 థైరియస్ : మంచిది. ఓ విఖ్యాతిగన్న వనితా, రాజీ! ఇప్పుడు మీ ఉన్నతస్థితినిబట్టి ఆయన మహోదారుడైన సీజర్ అన్నభావంతో తప్ప అన్యంగా గాని భిన్నంగా గాని వ్యవహరింపవలసిన అగత్యం లేదని ఆయనే విన్నవిస్తున్నాడు. క్లియోపాత్రా : ఇది మహోదారంగా ఉంది కానీ థైరియస్ : మీరు ఆంటోనీయెడ స్నేహాన్ని ప్రకటించటం భయభావంవల్లనే గాని ప్రణయాతిశయంవల్ల కాదని ఆయనకు తెలియకపోదు. క్లియోపాత్రా : అలాగా? థైరియస్ : అందువల్లనే మీ గౌరవవిషయంలో గల మచ్చలు బలప్రయోగానికి లొంగిపోవటంవల్ల కలిగినవే గాని, ఐచ్ఛికంగా ఇచ్చివేసుకోవటంవల్ల అబ్బినవి కావని భావించి ఆయన అందుకు మీ యెడ ఎంతో కరుణారసభావాన్ని ప్రదర్శిస్తున్నాడు. క్లియోపాత్రా : ఆయన దేవత. సత్యమేమో ఆయనకు తెలుసు. నాకై నేను నా గౌరవాన్ని ఐచ్ఛికంగా అర్పించుకోలేదు. అది కేవలం విజిత. ఎనోబార్బస్ : ఇందులోని సత్యాన్ని తెలుసుకోటానికి నేను ఆంటోనీని అడిగివేస్తాను. నీకు అత్యంతప్రియురాలైన ఈమే నిన్ను వీడిపోతున్నది. మేమూ నిన్ను విడిచిపోతాము. మునిగిపో! ప్రభూ! నీవీనాడు రంధ్రంపడ్డ నావవైనావు. మునిగిపో!! (నిష్క్రమిస్తాడు) థైరియస్ : మీరు సీజర్ను ఏమి కోరుతున్నారో తెలియజేస్తారా మరి? ఒకరీతిగా ఆయన మీరు కోరినవన్నీ ఇచ్చుకొంటానని మిమ్మల్ని ప్రార్థించి తెలియజేస్తున్నాడు. ఆయన సంపత్తిని మీరు అలంబనంగా కల్పించుకోటానికి అతురతవహిస్తే ఆయన మహానందపడతాడు. అయితే మీరు ఆంటోనీని విడచిపెట్టారని, సర్వప్రపంచాధినేత అయిన ఆయన రక్షణక్రిందికి వచ్చారని నా వల్ల వింటే, ఆయన ఆత్మ ఆనందోత్తేజితమౌతుంది. క్లియోపాత్రా : నీ నామధేయం? థైరియస్ : థైరియస్. క్లియోపాత్రా : వరకరుణాగుణాన్వితా! వార్తాహరీ!! ఘనుడైన సీజర్తో నిన్ను ఆయనకు ప్రతినిధిగా భావించి, ఇలా ఆయన విజేతృహస్తాన్ని ముద్దాడానని విన్నవించు. ఆయన 254 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 పాదదేశాన నా కిరీటాన్ని నిల్పి నతులర్పించటానికి సంసిద్ధురాలనని విన్నవించు. సర్వజన పాలితమైన ఆయన కంఠనిశ్వాసం ఈజిప్టును గురించి ఏమని శాసిస్తే అందుకు లోబడి నడుచుకోటానికి సర్వసంసిద్ధురాలనని విన్నవించు. థైరియస్ : ప్రస్తుతస్థితిలో ఇదే మీకు పరమోదాత్తమైన మార్గం. వివేకం, అవకాశం రెండూ పరస్పరవ్యతిరేకాలై కలహిస్తున్నప్పుడు, వివేకం తన సర్వశక్తినీ వినియోగించి ధైర్యోపేతంగా నిలువగలిగితే, అవకాశం దాన్ని అణుమాత్రమైనా కదలించలేదు. తమ హస్తంమీద నా సమ్మాన చిహ్నమైన చుంబనముద్రను నిలపటానికి అనుగ్రహించండి. క్లియోపాత్రా : నూతన రాజ్య సంపాదనబుద్ధితో విచ్చేసి మీ సీజర్ తండ్రి అయోగ్యమైన యీ హస్తప్రదేశాన తన రదనచ్ఛదాలతో చుంబనవృష్టి కురిపించాడు. ఆంటోనీ, ఎనోబార్బస్ తిరిగి ప్రవేశిస్తారు. ఆంటోనీ : పర్జన్యాధిపుడైన జౌసాక్షిగా వాణ్ణి అనుగ్రహిస్తున్నదే - ఎవరోయ్ నీవు? థైరియస్ : సర్వసంపత్పరిపూర్ణుడూ, నిఖిలజనపాలిత నిజశాసనుడూ అయిన మహావ్యక్తి ఆజ్ఞలను నిర్వర్తించే ఒక అల్పుణ్ణి. ఎనోబార్బస్ : (స్వగతం) ఓరీ! నీ కిందుకు కశాఘాతలు తప్పవు. ఆంటోనీ : మీరందరూ అక్కడికి చేరండి. ఓహో! ఓసి గ్రద్దా!! దేవతలారా!! భూతరాశు లారా!! అధికారం నా హస్తాలలోనుంచీ కరిగిపోతున్నది. నిన్న మొన్నటివరకూ నేను కేకపెడితే చిరుపండ్లకోసం చరచరప్రాకుతూ వచ్చే పసిపిల్లల్లా ఎందరెందరో రాజులు 'ఏమాజ్ఞ?' అని అడుగుతూ వచ్చారు. మీకేం చెవులు లేవా? వినిపించటంలేదా? ఇంకా నేను ఆంటోనీనే! సేవకులు ప్రవేశిస్తారు. ఈ తిమ్మణ్ణి ఇక్కడినుంచి తీసుకుపోయి కొరడా దెబ్బలు కొట్టండి. ఎనోబార్బస్ : (స్వగతం) మరణాసన్నమైన వృద్ధసింహంతో ఆడటం కంటే సింహకిశోరంతో క్రీడించటం ఉత్తమం. - ఆంటోనీ : చంద్రదైవతమా! నక్షత్రరాశీ!! ఈ గాడిదను కట్టికొట్టండి. సీజర్ సర్వాధికారాన్ని అంగీకరించే మహాసామంతులు ఇరవైమంది ఇక్కడికి వచ్చినా, అంతటి తులువతనంతో ఆమె హస్తాన్ని ముద్దిడుకోటాన్ని చూచి నేను సహించను. ఆమె ఆంటోని - క్లియోపాత్రా 255 నామధేయం క్లియోపాత్రా! కానీ క్లియోపాత్రాగా మనటం మానివేసిన తరువాత మరి ఆమె పేరేమో? ఒక పసిపిల్లవాడులా ముఖాన్ని ముడుచుకొంటూ కరుణించవలసిందని పెద్దపెట్టున పలవరించేదాకా, కొరడా దెబ్బలతో నొప్పించండి. ఉ. ఇక్కడినుంచి తీసుకోవెళ్ళండి. థైరియస్ : మార్క్ ఆంటోనీ! ఆంటోనీ : పడలాక్కోపొండి. కట్టివేసి బాగా కొట్టి తిరిగి ఇక్కడికి తీసుకోరండి. ఈ తుంటరి తిమ్మన్న మనదగ్గరనుంచీ సీజర్కు ఒకవార్త చేరవేయాలి. (థైరియస్తో సేవకులు నిష్క్రమిస్తారు) నాకు నీతో పరిచయం కలగకపూర్వమే నీ ప్రతిష్ఠలో అర్ధాంశం ధ్వంసమైంది. నేను రోములోని నా పర్యంకంమీద తలగడను నలగనీయందీ, సత్సంతానప్రాప్తి నరికట్టిందీ అయ్యో! అధమాధమ సేవకులమీద హార్దదృష్టిని ప్రసారించటానికి అలవాటుపడ్డ ఒక చెడిపెచేత, 'స్త్రీజాత్యాభరణం' చేత, నిందితుణ్ణి కావటానికేనా! క్లియోపాత్రా : ప్రభూ! మహోదారా!! ఆంటోనీ : ఛీ! నిరంతం నీవు చపలచిత్తవు. దుష్టవర్తనలతో మన మనస్సు కరడుగట్టినప్పుడు - అయ్యో అది ఎంతటి పతనావస్థ - విజ్ఞానోపేతులైన దేవతలు కన్నులు కుట్టి పాపాచరణం చేయించి, మన పరిశుద్ధనిర్ణయ పరిజ్ఞానాన్ని భంగపరిచారు. మన చేత మన దోషాలను ఆరాధింపజేశారు. ఆనందగర్వ విభ్రాంతితో మనం అణగారిపోతుంటే, మనలనుజూచి నవ్వుకొన్నారు. క్లియోపాత్రా : అయ్యో! నీవీ స్థితికి వచ్చావా? ఆంటోనీ : మరణించిన సీజర్ మహాశయుని భోజనభాజనంలో వేడెక్కని తడితునకనుగా తొలుత నేను నిన్ను చూచాను. కాదు, కాదు. నీవు కయ్యస్ పాంపే మహాశయుని కరండంలోని ఉపాహారకళ ఖండానివని జనసామాన్యంలో వార్తకెక్కలేదు గాని, ఇంతకుమించిన విలాసఘటికల నెన్నింటినో నీవు అసంఖ్యాకంగా అతడితో కాముకివై గడిపివేశావు. ఇది నా గాఢవిశ్వాసం. ఇంద్రియదమనమంటే ఏమో నీవు కొంతగా ఊహింపగలిగినప్పటికీ, అది నీ అనుభూతిలో అణుమాత్రమైనా లేదు. క్లియోపాత్రా : ఇదంతా ఎందుకు? నీ అభిప్రాయమేమిటి? 256 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 98 ఆంటోనీ : ఇచ్చిన క్షుద్రపారితోషికాలకే "ఈశ్వరుడు తమకు మహాభాగ్యా లిచ్చుగాక” అని పలికే అల్పుడికి, నేను క్రీడించే నీ హస్తాన్ని, రాజులు గౌరవార్థంగా ముద్దిడుకొనే నీ హస్తాన్ని, మహనీయహృదయులైన సమ్రాట్టుల ప్రణయచిహ్నాంకనార్హమైన నీ హస్తాన్ని అందీయటమా? అయ్యో! ఉన్మత్తుడనై నేను బాసన్ పర్వతంమీద " నిల్చి మహోక్షగోగణాలను మించి రంకె వేయాల్సి వచ్చింది. ఎందువల్లనో నాకు అటువంటి దారుణమైన కారణం కలిగింది. దాన్ని గురించి ఏ మాత్రం మర్యాదతో చెప్పవలసివచ్చినా, అది కుత్తుకకు ఉరితాడు తగిలించినవాణ్ణి దాన్ని కొంత ఒదులుగా అమర్చినందుకు, నిహతావస్థలో ఉన్నవాడు అభినందించినట్లుతుంది. థైరియన్తో సేవకులు తిరిగి ప్రవేశిస్తారు. ఏం వీణ్ణి గట్టిగా కొట్టారా? ప్రథమసేవకుడు : చాలా గట్టిగా కొట్టాము ప్రభూ! ఆంటోనీ : ఏడ్చి క్షమించమని అర్థించాడా? ప్రథమ సేవకుడు : అనుగ్రహించవలసిందని ప్రాధేయపడ్డాడు. ఆంటోనీ : సజీవుడై ఉంటే మీ తండ్రి నీ వంటి కుమారుడు కలగటం కంటే కుమార్తె జన్మించడం మేలై ఉండేదని పశ్చాత్తాపపడుగాక! అతణ్ణి సేవించటంవల్ల నీకీ దెబ్బలు తగిలాయి కనుక, జయోదీయమానుడైన సీజర్ను అనుసరించి చరిస్తున్నందుకు చింతపడు. ఒక వనిత శ్వేతహస్తాన్ని తిలకించేటప్పుడు ఇకనుంచీ నీవు ఈ రీతిగానే కంపించి బాధపొందుతావు. సీజర్ దగ్గిరికి తిరిగి వెళ్లు. ఇక్కడ నీకు మేము ఎటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చామో నివేదించు. తానెరిగిన ఒకనాటి నా మహోన్నతిని గుర్తించకుండా, నిరంతరం పదేపదే నేటినా ఉనికినే పలుకుతూ కన్పించటంవల్ల అతడు నాకు తనమీద కోపాన్ని తెప్పిస్తున్నాడని తెలియజెయ్! అవును. అతడు నాకు కోపం తెప్పిస్తున్నాడు. అది సులభం కూడాను. పూర్వం నాకు మార్గదర్శకాలై వర్తించిన నా శుభనక్షత్రాలు తమ మండలాలను విడిచి, శూన్యసీమలను కావించి, నరకంలోని అగాధాలకు తమ తేజఃపుంజాలను ప్రసరింపజేస్తున్నాయి కనుక ఈ పని చేయటం చాలా సుకరం. ఈ నా సంభాషణకూ, నీకు చేసినదానికీ, అతడికి కోపం వస్తే నా యెడ ప్రతిచర్య చేయటానికే నేను స్వాతంత్య్రప్రదానం చేసిన నా బానిస హిప్పార్కస్ అక్కడ ఉన్నాడు. అతణ్ణి ఆనందంతో కొట్టించమను, ఉరితీయమను. లేదా ఇష్టమైతే చిత్రవధ చేయించమను. ఇటువంటి ప్రతిచర్య ఏదైనా చెయ్యమని సీజర్ను ప్రేరేపించు. ఈ వాతలతో ఇక నీవు ఇక్కడనుంచి నిష్క్రమించు. (థైరియస్ విష్క్రమిస్తాడు) ఆంటోని - క్లియోపాత్రా 257 క్లియోపాత్రా : నీవు చేయవలసింది అంతా పూర్తి అయిందా? ఆంటోనీ : అయ్యో! మన భౌమచంద్రదైవతం ఉపరాగాన్ని పొందింది. ఈ చంద్రోపరాగం కేవలం ఆంటోనీ పతనాన్నే సూచిస్తున్నది. క్లియోపాత్రా : అతడి ఉద్వేగం చల్లారేటంతవరకూ నేనేమి చెప్పినా ప్రయోజనం లేదు. ఆంటోనీ : సీజర్ను స్తుతించటంకోసం నీవు ఒక క్షుద్రసేవకుడితో కనులు కలుపుతావా? క్లియోపాత్రా : ఇంకా నీవు నన్ను తెలుసుకోలేదా? ఆంటోనీ : నా వంక శీతలహృదయాన్ని వహించావని నీవు తెలుసుకోలేదా అని అడుగుతున్నావా? క్లియోపాత్రా : నేనే అట్టిస్థితిని వహించినదానినైతే ఈశ్వరుడు ఆ నా శీతలహృదయంలో వడగళ్ళను సృజించి జన్మస్థానంలోనే వాటిని విషపూరితాలను గావించుగాక! అందులోని మొదటి వడగళ్ళు నా మెడలో పడుగాక!! అవి కరుగుతూ తనతోబాటుగా నా జీవితాన్ని కూడా కరిగించుగాక!! తరువాతి వడగళ్ళు గేజరియన్ ను పడమొత్తుగాక! నా గర్భానికి చిహ్నాలైన సమస్తసంతానాన్నీ, నా వీరవరులైన ఈజిప్షియన్లనూ, సమాధిరహితులను కావించి వారి నాహారంగా గ్రహించే నైలునదీమశకమక్షికల కుక్షుల్లో వారిని ఖననం చేసుకొనేటంతవరకూ కరకావృష్టి కురిసి కరుగుగాక! ఆంటోనీ : ఇది నిశ్చయం! సీజర్ అలెగ్జాండ్రియాలో శిబిరాలు వేయిస్తాడు. సర్వవిధాలా నేను అక్కడ అతని అదృష్టాన్ని అవరోధిస్తాను. నా భూతల సైన్యమంతా మంచి కట్టుబాటుతోనే ఉంది. ఆహవంవల్ల చెల్లాచెదరైనా నాకు నౌకాబలం అనంతంగా ఉంది. సముద్రంమీద యోగ్యరీతిలోనే నేను శత్రువులతో తలపడగలను. ఓ ధైర్యమాతా! నన్ను విడిచి నీవు ఎక్కడికెళ్ళావు? క్లియోపాత్రా! విన్నావా? నీ పెదవులను ముద్దిడుకోటం కోసం కదనభూమినుంచే తిరిగివస్తే నేను శత్రురక్తప్లావితమైన శరీరంతోనే వస్తాను. నాకూ, నా ఖడ్గానికీ చరిత్రలో ఒక స్థానం లభిస్తుంది. అట్టి అవకాశం ఇంకా నాకు కలగనున్నదనే నా ఆశ. క్లియోపాత్రా : ఓ నా ప్రణయమూర్తీ! ఎంత వీరోచితంగా సెలవిచ్చావు? ఆంటోనీ : మహాకార్పణ్యంతో ఉదయం మొదలు అస్తమయం వరకూ పోరాడటానికి నా హృదయం, నిశ్వాసం, జీవాయువులు ముప్పిరిగొంటాయి. అదృష్టవంతుడినై నేను 258 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 సుగమమైన జీవితాన్ని గడిపే దినాలలో అశ్రద్ధ వహించాను. అట్టివేళల్లోనే మానవులు నాకు కేవల పరిహాసాలకే ప్రాణపరిహారాలను చెల్లించారు. అతితీవ్రనిశ్చయంతో ఇప్పుడు నా కరాళ దంష్ట్రలను విప్పి మార్గానికి అడ్డునిలిచి, అందరినీ అంధకారంలోకి తరిమివేస్తాను. రా. ఒకే ఒక ఉల్లాసనిశీథాన్ని గడుపుదాం. చింతాక్రాంతులై ఉన్న నా సేనాపతులందరితో పానగోష్ఠి సాగించి ఆ రాత్రిని అతిశయానందంతో గడిపివేద్దాం. చింతాక్రాంతులైన నా సేనాపతులందరినీ పిలుద్దాం. సాణికలను సంపూర్ణంగా స్వాదువులైన మధువులతో నింపి సేవిద్దాం. కాలగమనాన్ని గుర్తించకుండా అశ్రద్ధ చేస్తూ మన గోష్ఠులను అట్టె కొనసాగిద్దాం. క్లియోపాత్రా : ఈ నాడు నా జన్మదినం. ఏ భోగాలూ లేకుండానే దీనంగా దీన్ని గడిపివేద్దామనుకొన్నాను. కానీ తిరిగి నా ప్రభువు అంటోనీ నిజవైభవాన్ని చేకూర్చుకొన్నాడు గనుక నేను ఇక ఎప్పటి క్లియోపాత్రానే ఔతాను. ఆంటోనీ : ఇంకా నేనెంతో సాధించగలను. క్లియోపాత్రా : పూర్వం నా ప్రభువుకు సేనాపతులైనవారినందరినీ నా దగ్గిరికి పిలవండి. ఆంటోనీ : పిలిపించు. మనం వారితో ప్రసంగిద్దాము. ఈ నాటి రాత్రి వారి గాత్రక్షతాలు కక్కిపోసేటంతవరకూ ద్రాక్షాసవాన్ని త్రాగిస్తాను. రా! ఓ నా రాజీ!! ఇంకా ఇందులో ఆశాసారముంది. ఈ మారు నేను పోరాడేటప్పుడు హత్యాకాండతో క్షామాన్ని కల్పించటంలో ఆరితేరిన మరణాధిదేవతాలవిత్రంతో పందెంవేసి, ఊచకోతలో ఎవరం ఘటికులమో తేల్చమని కోరి, అతని మహత్తరానురాగాన్ని చూరగొనేటట్లు రణభూమిలో క్రీడిస్తాను. (ఎనోబార్బస్ తప్ప అందరూ నిష్క్రమిస్తారు) ఎనోబార్బస్ : ఈ ఉన్మాదవైపరీత్యంలో ఈతడెంత దూరమైనా పోగలడు. కోపోద్రిక్తతకు లొంగిపోవటమంటే, భయం ఇంక తన్ను భయపెట్టలేనంతగా భయపడిపోవటమన్న మాటే! ఇటువంటి మానసికస్థితి ఉన్నప్పుడు కపోతం శ్వేనాన్నే పొడుచుకొని తినగలుగుతుంది. ఇంతే కాదు మా సేనాధినేత బుద్ధిబలం క్రమంగా మందిగిస్తున్నకొద్దీ, అతని హృదయం పుంజుకొంటున్నది. ఆలోచనాశక్తిని పరాక్రమం హతమార్చినప్పుడు, అది తన కదనసాధనమైన ఖడ్గాన్నే కబళిస్తుంది - ఏదో సాకు చెప్పి నేనిక అతణ్ణి పరిత్యజిస్తాను. ఆంటోని - క్లియోపాత్రా (నిష్క్రమిస్తాడు) 259 చతుర్థాంకం ఒకటో దృశ్యం సీజర్ శిబిరం, సీజర్, అగ్రిప్పా, తన సైన్యంతో మెకన్నాస్ ప్రవేశిస్తారు. లేఖను చదువుతూ సీజర్ : అతడు నన్ను బాలుడని సంబోధిస్తున్నాడు. నన్నీ ఈజిప్టులోనుంచీ తరిమివేయగల శక్తి తనకున్నట్లు ఏమేమో అరోచకాలు పలుకుతున్నాడు. నా దూతను బెత్తాలతో కొట్టించి నన్ను ద్వంద్వయుద్ధాని కాహ్వానిస్తున్నాడు. మోరకుడైన ఆ ఆంటోనీతో సీజర్ ఒంటిగా పోరాడాలట! మరణించటానికి ఇంతకంటే అనేకమార్గాలున్నాయని ఆ వృద్ధ ఘాతుకుడు గమనించుగాక! అంతవరకూ అతడు చేసిన ఆ సవాలును త్రోసిపుచ్చటమే కర్తవ్యం. మెకెయ్నాస్ : సీజర్ మహాశయులు ప్రశాంతంగా ఆలోచించవలసి ఉంటుంది. అంతటివాడు క్రోధానికి లొంగిపోవటమంటే అతడు పతనపరిపూర్తికి సన్నిహితుడౌతున్నా డన్నమాట! ఊపిరి సలుపుకోటానికి కూడా అతడికి అవకాశ మీయకండి. అతడి ఉన్మత్తక్రోధావస్థవల్ల కలిగే అవకాశాన్ని వినియోగించుకోండి. క్రోధోన్మత్తులెన్నడూ తమ రక్షణ విషయంలో తగ్గ శ్రద్ధ వహించరు. సీజర్ : యుద్ధపరంపరలో తుది కదనాన్ని రేపే మనం సాగిస్తామని మన శ్రేష్ఠసేనాపతులు గుర్తింతురుగాక! మన సైనికశ్రేణుల్లో నిన్న మొన్నటిదాకా అతణ్ణి సేవించినవారెందరో ఉన్నారు. వారే అతణ్ణి బందీని చేస్తారు. ఈ కార్యాన్ని నిర్వహించు. సైనికవీరులందరికీ విందు చేయించడానికి అవసరాలైన సకలసంభారాలూ మన కోశాగారాలల్లో ఉన్నాయి. ఈ విలాసవ్యయానికి వారెంతగానో అర్హత గడించుకొన్నవాళ్లు. దీనజనుడా, ఆంటోనీ! (నిష్క్రమిస్తాడు) 260 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 రెండో దృశ్యం అలెగ్జాండ్రియాలో క్లియోపాత్రాప్రాసాదం. ఆంటోనీ, క్లియోపాత్రా, ఎనోబార్బస్, ఐరాస్, ఎలెగ్జాస్, ఇతరపరివారంతో ప్రవేశిస్తారు. ఆంటోనీ : డొమిటియస్! నాతో ద్వంద్వయుద్ధం చేయటానికి అతడు నిరాకరించాడు. ఎనోబార్బస్ : అవును. నిరాకరిస్తాడు. ఆంటోనీ : ఎందుకు నిరాకరిస్తాడు? ఎనోబార్బస్ : అదృష్టం విషయంలో మీ కంటే ఎన్నోరెట్లు అధికుడనని భావించే అతడు మీతో పోరాడటం అవమానకరకృత్యమని తలపోస్తాడు. 99 ఆంటోనీ : వీరయోధుడా! రేపు నేను అంబుధిమీదా, అవనీతలంమీదా - రెంటిమీదా అతడితో తలపడతాను. లేదా వారిని రక్తస్నానమాడించి మరణాసన్నమైన నా ప్రతిష్ఠను పునరుజ్జీవింప చేసుకొంటాను. మరి నీవు ఘనంగా పోరాడతావా? ఎనోబార్బస్ : పైనబడి 'విజయమో, వీరమరణమో అంతే' నని కేక పెడతాను. ఆంటోనీ : మంచిది. పద. నా గృహసేవకులను పిలిపించు. ఈ రాత్రికి మనం ఉదాత్తమైన విందారగిద్దాము. ముగ్గురో, నలుగురో దాసజనం ప్రవేశిస్తారు. ఏవీ, మీ హస్తాలను ఇలా అందించండి. నీవు కల్మషరహితమైన ప్రభుభక్తిని ప్రకటించావు. అలాగే నీవు, నీవును, నీవు కూడా అలాగే, మీరందరూ నన్ను మహాఘనంగా సేవించారు. మీతోబాటుగా ఎందరో రాజులు కూడా సేవాకృత్యాలలో పాలుపంచుకొన్నారు. క్లియోపాత్రా : (అపవారితంగా ఎనోబార్బస్తో) ఇదంతా ఏమిటి? ఎనోబార్బస్ : (క్లియోపాత్రాతో అపవారితంగా) మానసికవేదనవల్ల ఉద్బవిల్లే ఊహావిశేషాలలో ఇది ఒకటి. ఆంటోనీ : నీవూ నా యెడ సత్యసంధుడివై వర్తించావు. నాయందేకమై మీరందరూ నన్ను భక్తిప్రపత్తులతో సేవించారు. కనుక బహురూపాలను ధరించి మీరు నాకెంతటి ఉత్తమసేవ చేశారో, అట్టిసేవను నేనూ చేయాలని అభివాంఛిస్తున్నాను. ఆంటోని - క్లియోపాత్రా 261 అందరు : మీరు మమ్మల్ని సేవించే దుఃస్థితి నివారింపబడుగాక! ఆంటోనీ : ఉత్తమ సైనికులారా! ఈ నాటిరాత్రి నా పార్శ్వవర్తులై మెలగండి. చషకాలు పొర్లిపోయేటట్లు ద్రాక్షాసవాన్ని పోసుకొని స్వేచ్ఛగా ఆస్వాదించండి. సామ్రాజ్యాధినేతనైన కాలంలో నా నాయకత్వాన్ని అంగీకరించి సేవకులై మీరెలా వర్తించి గౌరవించారో, అలాగే ఈ నాడూ ప్రవర్తించండి. క్లియోపాత్రా : (ఎనోబార్బస్ అపనారితంగా) దీని భావమేమిటి? ఎనోబార్బస్ : (క్లియోపాత్రాతో అపవారితంగా) ఇదంతా ఆయన తన అనుచరులను ఏడ్పించటం. ఆంటోనీ : ఈ నాటిరాత్రి నా ప్రక్కనే ఉండి నన్ను సేవించండి. మీ సేవావృత్తి అంతటితో అంతం కావచ్చు. బహుశః ఇక మీరు నన్ను చూడనే చూడకపోవచ్చు. లేక ఒకవేళ మీరు నన్ను చూస్తే అది కేవలం నా బాహ్యరూపం. నా ఛాయ. రేపు మీరు మరొక యజమానికి సేవకులైపోవచ్చు. అందుకని ఇప్పుడు నేను మిమ్మల్ని నా వీడ్కోలును పరిగ్రహించేవారినిగా పరిగణిస్తున్నాను. సన్మిత్రులారా! నేనేమీ మిమ్మల్ని తరిమివేయటం లేదు. ఒక పతిని పత్ని 100 మరణపర్యంతం విడిచి చరించనిరీతిగా మీరు నన్ననుసరించి సేవించండి. కానీ ఈ నాటిరాత్రి మాత్రం రెండు గంటలకాలం నా వెనువెంటనే ఉండి నన్ను సేవించండి. నేను మిమ్మల్ని ఇంతకంటే ఏమీ కోరబోను. చేసిన ఈ మీ సేవకు దేవతలు మిమ్మల్ని బహూకరించెదరుగాక! ఎనోబార్బస్ : ప్రభూ! మీ అభిప్రాయమేమిటి? వారినెందుకు తామిలా దీనావస్థకు పాల్పడచేస్తున్నారో అర్థం కావటం లేదు. గమనించారా, వారెలా దుఃఖిస్తున్నారో! చివరకు ఒక గార్దభాన్నయిన నేను కూడా ఉల్లిలా ఉన్న నీరంతా కారుస్తున్నాను. సిగ్గుచేటు ప్రభూ! మమ్మల్ని ఇలా మహిళలనుగా మార్చివేయకండి. ఆంటోనీ : హఁ హఁ హఁ! 101 వీడ్కోలుకు సన్నిహితమైన సంభాషణగా నేను దీన్ని ఉద్దేశించి ఉన్నట్లయితే ఒక పెనుభూతం నన్ను ఆవరించుగాక! ఆ కన్నీరు రాలిన ప్రదేశం రామణీయకతకు జన్మభూమై నిత్యవివృద్ధినొందుగాక!! హృదయమిత్రులారా! నా ప్రసంగాన్ని మీరు అతితీక్షంగా భావించండి. ఇలా ప్రసంగించానంటే ఇది కేవలం నేను మీకు సౌఖ్యాన్ని సంతరించటం కోసమే. మీరు ఈ రాత్రినంతటినీ ఉల్లాసాలతో గడపవలసిందనే నేను ఉద్దేశిస్తున్నాను. హృదయతుల్యులైన మిత్రులారా! రేపటిని గురించి నేనెంతో ఆశపెట్టుకున్నాను. మిమ్మల్ని మరణం, ప్రతిష్ఠలున్న చోటికంటే 262 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఎక్కడ విజయోపేతమైన జీవితం లభ్యమౌతుందని భావిస్తానో, అక్కడికి నాయకుడినై నడిపిస్తాను. మనమందరం రాత్రి విందుకు పోదాం. సిద్దపడండి. ఇక తీవ్రాలోచనలకు స్వస్తి చెప్పండి. రండి. (నిష్క్రమిస్తారు) మూడో దృశ్యం అలెగ్జాండ్రియా ప్రాసాదం ముందు, ఇరువురు సైనికులు కాపలా వృత్తిలో ఉంటారు. ప్రథమ సైనికుడు : సోదరా! సునక్తం!! రేపే మన రోజు!! ద్వితీయ సైనికుడు : అది తప్పక ఏదో మార్గాన్ని తేల్చి వేస్తుంది. శుభమగుగాక! వీథుల్లోని వింతవిశేషాలేమన్నా విన్నావా? ప్రథమ సైనికుడు : లేదు. విశేషాలేమిటి? ద్వితీయ సైనికుడు : అది కేవలం ఓ 'వదంతి' కావచ్చు. సునిశీథిని! ప్రథమ సైనికుడు : శుభమయ్యా! మరి ఇరువురు సైనికులు ప్రవేశిస్తారు. ద్వితీయ సైనికుడు : సైనికులారా! రక్షణవిషయంలో ప్రమత్తులై మెలగండి. తృతీయ సైనికుడు : నీవు కూడా జాగ్రత్తగా ఉండు. సునక్తం! రంగస్థలంలో అన్నిమూలలా నిలుస్తారు. చతుర్ధ సైనికుడు : ఈ ప్రదేశాన్ని మేము రక్షించుకుంటాము. రేపు మన నౌకాదళం విజృంభిస్తే పదాతిబలం కూడా దృఢంగా నిలువగలదని నా గాఢవిశ్వాసం. తృతీయ సైనికుడు : అది మిక్కిలి ధైర్యసాహసాలు గల వీరసైన్యం. నిశ్చలనిర్ణయం కలది. రంగస్థలంలో అన్నిమూలలా దారుయంత్రాల సంగీతం వినిపిస్తుంది. చతుర్థ సైనికుడు : నిశ్శబ్దం! ఏమిటీ నిస్వనం? ప్రథమ సైనికుడు : విను. విను. ఆంటోని - క్లియోపాత్రా 263 ద్వితీయ సైనికుడు : శ్రద్ధతో విను. ప్రథమ సైనికుడు : ఇది అంతరిక్షం నుంచి కదూ? ద్వితీయ సైనికుడు కాదు. భూమ్యంతరాళంనుంచి. చతుర్ధ సైనికుడు : ఇది ఏమో సూచిస్తున్నది కదూ? తృతీయసైనికుడు : లేదు. ప్రథమ సైనికుడు : నిశ్శబ్దం! దీని అభిప్రాయం ఏమై ఉంటుంది? ద్వితీయ సైనికుడు : ఆంటోనీని అమితంగా ప్రేమించే దైవతం హెర్కూల్స్ 102 ఇప్పుడు అతణ్ణి విడిచిపోతున్నాడు. ప్రథమ సైనికుడు : నడవండి. ఇతరరక్షకులకు కూడా ఇది వినిపిస్తున్నదేమో తెలుసుకొందాం. మరొకస్థానం దగ్గిరికి వారు చేరుతారు ద్వితీయ సైనికుడు : ఏమిటయ్యా! ఇది? అందరూ : (కలిసి) వింతగా ఉంది! ఏమిటిది? మీకూ వినిపిస్తున్నదా? ప్రథమ సైనికుడు : అవును. ఇది వింతగా లేదూ? తృతీయ సైనికుడు : మీకూ వినిపిస్తున్నదా? మీకూ వినిపిస్తున్నదా? ప్రథమసైనికుడు : మన రక్షణ ప్రదేశపు మేరలదాకా వెళ్ళి ఈ ధ్వని ఏమిటో పరిశీలిద్దాం. ఇది ఎలా లీనమైపోతున్నదో గుర్తిద్దాం. అందరు : బాగుంది. కానీ ఇది చాలా విచిత్రంగా ఉంది. (నిష్క్రమిస్తారు) నాలుగో దృశ్యం అదే ప్రదేశం. ప్రాసాదంలో ఒక కక్ష్య. ఆంటోనీ, క్లియోపాత్రా, ఛార్మియన్, ఇతర పరిచరగణంతో ప్రవేశిస్తారు. ఆంటోనీ : ఇరోస్! ఏదీ నాలోహకవచం? 264 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 క్లియోపాత్రా : మరికొంతసేపు నిద్రించండి. ఆంటోనీ : ఓసి పెట్టా! వీలు లేదు. ఇరోస్ రా, నా కవచాన్ని తీసుకో రా. ఇరోస్! కవచంతో ఇరోస్ ప్రవేశం రా! మంచి సేవకుడవోయ్! ఈ లోహకవచాన్ని నా శరీరానికి అమర్చు. అదృష్టం ఇవాళ మనకు అనుకూలించకపోతే అది క్లియోపాత్రాను తిరస్కరించి పోతున్నందువల్ల కలిగిందనుకోవలసి ఉంటుంది. నా వెంట రా! క్లియోపాత్రా : అలా అనకండి. నేను కూడా మీకు తోడ్పాటు నిస్తాను. ఇది ఎందుకు? ఆంటోనీ : దాని ప్రమేయం నీకెందుకు? నీవు తొడగవలసింది ధైర్యకవచాన్ని. తప్పు, తప్పు అంతా తప్పు. క్లియోపాత్రా : నేను మీకు కవచధారణలో సాయపడి తీరవలసిందే. ఇలా ఉండాలి ఇప్పుడు తెలిసింది. ఆంటోనీ : మంచిది. ఇప్పుడు విజయం మనదే. చూచావుటోయ్, ఎలా కవచంతో శరీర రక్షణ చేసుకొన్నానో! ఇక వెళ్ళు. నీ రక్షకదళాలను తమ తమ స్థానాలలో నిలుపు. ఇరోస్ : తమ ఆజ్ఞను తక్షణమే నిర్వహిస్తాను. క్లియోపాత్రా : కవచాన్ని సక్రమంగా అమర్చాను కదూ! ఆంటోనీ : దానికి అమరిక ఇంత బాగా ఎన్నడో గాని కుదరలేదు. విశ్రాంతికి అవసరమని నేను కోరినప్పుడు తప్ప, ఎవరు దీన్ని విప్పుతారో వారికి ప్రళయం తప్పదు. ఇరోస్! నీవు దాన్ని పట్టుకోటానికి ఇలా తికమక పడిపోతున్నావేమిటి? నీ కంటే ఇందులో నా రాజే ప్రవీణగా గోచరిస్తున్నది. త్వరపడండి. ఈ నాటి నా రణకర్మకౌశలాన్ని దర్శించి క్షాత్రవృత్తి అంటే ఏమిటో తెలుసుకోగలవు. ఈ నాటి నా యుద్ధక్రియలో ఒక కళాప్రవీణుడెలా కదనరంగంలో విశృంఖల వీరవిహారం చేస్తాడో నీకు గోచరిస్తుంది. కవచధారియైన ఒక సేవకుడు ప్రవేశిస్తాడు సుప్రభాతం! ఇదే నా స్వాగతం! పరుల పైబడటంలో నీవు ప్రవీణుడివిలా కన్పిస్తున్నావు. అతిప్రియమైన కృత్యాన్ని నిర్వహించటానికి మనం సకాలంలో మేల్కొన్నాము. అందుకోసం మహానందంతో మనమందరం బయలుదేరుదాం. ఆంటోని - క్లియోపాత్రా 265 సైనికుడు : ప్రభూ! ఒక సహస్రసైనికులు ఇంత పెందలకడనే పరిపూర్ణంగా యుద్ధోచిత వేషాన్ని ధరించి మీ రాకకోసం ద్వారదేశాన చూస్తున్నారు. (కోలాహలం, దుందుభిధ్వానాలు) సేనాపతులు, సైనికులు ప్రవేశిస్తారు. సేనాపతి : ఈ ఉదయం ఎంతో రమణీయంగా ఉంది సైన్యనేతా! సుప్రభాతం! అందరు : సైన్యనేతా! సుప్రభాతం!! ఆంటోనీ : కాళరాత్రి కమనీయప్రభాతంగా వికసించింది. యువకుని యౌవనశక్తిలా సకాలంలో ఈ నాటి ఉదయం ఉదితమైంది. ఇది రమణీయమైన ఉదయవేళ. రండి. దాన్ని నాకందించండి. ఎంతో బాగా జరిగించారు. ప్రియా! ఇదే నా వీడ్కోలు. శుభమగుగాక! ఇక నాకేమి జరిగినా సరే. ఇదిగో, ఇది సైనికుడిచ్చే ముద్దు. (క్లియోపాత్రాను ముద్దిడుకొంటాడు) సిగ్గుచేత ఇంతకు తక్కువగా సెలవుపుచ్చుకోటం నిందాపాత్రమైంది. లోహవ్యక్తిలాగా ఇప్పుడు నిన్ను నేను విడిచిపోతున్నాను. యోధులారా! మీరు నన్ను వెన్నంటి రండి! మిమ్మల్ని నేను యుద్ధమధ్యంలోకి తీసుకు వెళ్లుతాను. క్లియోపాత్రా! - సెలవు! (ఆంటోనీ, ఇరాస్, సేనాపతులు, సైనికులు నిష్క్రమిస్తారు) ఛార్మియన్ : రాజ్జీ! ఇష్టమైతే నీ కక్ష్యకు వెళ్ళిపోదాం. క్లియోపాత్రా : నా కక్ష్యకు నన్ను తీసుకోవెళ్ళు. వీరాధివీరుడివలె ఆయన సమరభూమికి సాగిపోతున్నాడు. ఒక ద్వంద్వయుద్ధంతో ఆయనా, సీజర్ ఈ మహాయుద్ధాని కొక సమాప్తిని సంఘటిస్తే అప్పుడు ఆంటోనీకి విజయం తథ్యం. - అయితే ఇప్పుడో? మంచిది. ఆంటోనీ! సాగిపో! (నిష్క్రమిస్తారు) అయిదో దృశ్యం అలెగ్జాండ్రియా, ఆంటోనీ శిబిరం. దుందుభిధ్వనులు వినిపిస్తుంటవి. అంటోనీ, ఇరోస్ ప్రవేశిస్తారు. సైనికుడొకడు వచ్చి వారిని కలుసుకొంటాడు. సైనికుడు : ఆంటోనీ మహాశయుడి కీ నాటిని దేవతలొక ఆనందసమయంగా రూపొందించెదరు గాక! 266 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఆంటోనీ : క్షతగాత్రంతో వచ్చి ఒకప్పుడు నన్ను భూతలయుద్ధం చేయవద్దని బలవంతం పెట్టింది నీవే కదూ? సైనికులు : మీరు అలా చేసి ఉన్నట్లయితే మీ మీద విప్లవం చేసి 103 వెళ్ళిపోయిన రాజులు వ్యతిరేకులు అయ్యేవారే కారు. ఈ ఉదయమే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన సైనికశ్రేష్ఠుడు మీతోనే ఉండి మీ అడుగు జాడలను అనుసరించి ఉండి ఉండేవాడు. ఆంటోనీ ఈ ఉదయం వెళ్లిపోయింది ఎవరు? సైనికుడు ఎవరా? నిరంతరం మీ వెనువెంట ఉండేవాడు. ఎనోబార్బస్ ను పిలిపించండి. అతడు ఇక మీ ఆజ్ఞలను పాలించడు. సీజర్ శిబిరం నుంచీ 'ఇక నేను మీ వాడిని కాను' అని కేక పెడతాడు. ఆంటోనీ : నీవేమంటున్నావో నాకర్థం కావటం లేదు. సైనికుడు : ప్రభూ! అతడిప్పుడు సీజర్ను చేరుకున్నాడు. ఇరోస్ : ప్రభూ! ఆయన పేటికలు, కోశం అతని వెంట లేవు. ఆంటోనీ : అతడు వెళ్ళిపోయినాడా? సైనికుడు : నిశ్చయంగా! ఆంటోనీ : వెళ్లు, ఇరోస్! అతని కోశాన్నంతటిని అతడి వెంట పంపించు. వెంటనే పంపించాలి. అందులో అణుమాత్రాన్నయినా ఆపివేయకు. ఒక లేఖ వ్రాయి. దానిమీద నేను సంతకం చేస్తాను. అందులోని విషయాలు మృదువుగా వీడ్కోలును, శు భాకాంక్షలను తెలియజేయటం మాత్రమే. 'అతని కిక యజమానిని మార్చవలసిన అవసరం కలుగకుండుగాక!' అని నేను కోరుతున్నట్లుగా వ్రాయి. అయ్యో! నా సంపత్తి సత్యసంధులను మలినం చేసింది. వెంటనే అతని సంభారాలను పంపించి వెయ్యి. ఎనోబార్బస్! (నిష్క్రమిస్తాడు) ఆరో దృశ్యం సీజర్ శిబిరం. కోలాహలం, సీజర్, అగ్రిప్పా, ఎనోబార్బస్ మరి ఇతరులతో ప్రవేశిస్తాడు. సీజర్ : అగ్రిప్పా! ఇక బయలుదేరు. యుద్ధాన్ని ఆరంభించు. ఆంటోనీని సజీవుడుగా పట్టుకోటమే నా అభిలాష. ఈ విషయాన్ని అందరికీ ప్రకటించు. ఆంటోని - క్లియోపాత్రా - 267 అగ్రిప్పా : అలాగే సీజర్ మహాశయా! (నిష్క్రమిస్తాడు) సీజర్ : ఇది మనకు అనుకూలమైన అదృష్టం గల దినమైతే, విశ్వశాంతికి 103 A అనుకూలమైన కాలం ఆసన్నమైనదన్నమాట! దిశాత్రయ పరివ్యాప్తమైన రోమక సామ్రాజ్యం తిరుగులేకుండా స్వేచ్ఛగా శాంతి ననుభవిస్తుందన్నమాట!! ఒక వార్తాహరి ప్రవేశిస్తాడు. వార్తాహరి : ఆంటోనీ యుద్ధభూమిలో ప్రవేశించాడు. సీజర్ : వెంటనే వెళ్ళి, అగ్రిప్పా, అతనిమీద పడు. అతనిమీద విప్లవం చేసి వచ్చి మనతో చేరుకొన్న వాళ్ళను ముందుపెట్టు. ఆంటోనీ అప్పుడు తన క్రోధాన్నంతటినీ నిజానికి తనవాళ్ళమీద వ్యయిస్తాడు. 103B (ఎనోబార్బస్ తప్ప అందరూ నిష్క్రమిస్తారు) ఎనోబార్బస్ : జూడియారాజు తనమీద తిరుగబడకుండా వ్యవహారం చేసిరమ్మని ఆంటోనీ పంపించిన ఎలెగ్జాస్, తానే తిరుగబడ్డాడు. అంతే కాదు. అతడు అక్కడికి వెళ్ళి యజమాని అయిన ఆంటోనీని విడిచి, హీరాడ్ రాజును సీజర్ పక్షాన చేరిపొమ్మని బలవంతపెట్టాడు. తనకోసం అతడు ఇంత శ్రమ తీసుకుంటే సీజర్ అతణ్ణి ఉరి తీయించాడు. ఆంటోనీని విడిచి వచ్చిన కానెడియస్ మొదలైనవాళ్ళు సీజర్ కొలువును పొందగలిగారే కాని ఆయన గాఢవిశ్వాసాన్ని సంపాదించలేకపోయారు. నేను మహాతప్పిదం చేశాను. ఇందుకు అతిదారుణంగా నన్ను నేనే నిందించుకొంటున్నాను. ఇక ఎన్నడూ జీవితంలో నాకు ఆనందమంటూ ఉండదు! సీజర్ సైనికుడొకడు ప్రవేశిస్తాడు. సైనికుడు : ఎనోబార్బస్! అంటోనీ నీ సమస్తకోశాన్నీ నీ వెంట పంపించాడు. దానితో మరికొన్ని కాన్కలను కూడా కలిపి పంపించాడు. ఆ దూత నేను కాపలా కాసే ప్రదేశానికి వచ్చాడు. ఇప్పుడు అతను నీ శిబిరం దగ్గర గార్దభాలమీద నుంచీ సంభారాలను దింపిస్తున్నాడు. ఎనోబార్బస్ : వాటినన్నిటినీ నేను నీకిచ్చివేస్తున్నాను. 268 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 సైనికుడు : ఎనోబార్బస్! నన్ను ఎగతాళి చేయకు. నేను చెప్పేది సత్యం సుమా! సైన్యమధ్యంనుంచీ అతణ్ణి భద్రంగా ఎక్కడికైనా చేర్చటం ఉత్తమం. నేను నా ఉద్యోగనిర్వహణలో ఉండిపోవలసి వచ్చింది. లేకపోతే ఆ పని నేనే చేసేవాణ్ణి. మీ చక్రవర్తి ఇంకా జౌన్లా వైభవోపేతుడుగానే వర్తిస్తున్నాడు. ఎనోబార్బస్ : పృథ్విమీద పుట్టిన పరమద్రోహిని నేను. అందుకు నేనెంతో చింతిస్తున్నాను. ఆంటోనీ మహాశయా! నీవు కరుణాఖనివి, నీచబుద్ధినై నిన్ను విడనాడి వచ్చిన నాకు నీవీ సువర్ణాదులను ప్రతిఫలంగా ఎలా పంపగలిగావయ్యా ప్రభూ? ఈ నీ ఔదార్యం నా గుండెలను బ్రద్దలుకొడుతున్నది. దుఃఖోల్బణాలు దాన్ని శతచ్ఛిద్రం చెయ్యలేకపోతే నేను అందుకు అంతకంటే బలవత్తరమైన నా ధనాన్ని దేనినైనా ప్రయోగిస్తాను. అయితే అందుకు దుఃఖం సమర్థమైనదే అని అనుకొంటాను. ఏమిటి? నేను నీకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నానా? లేదు. నీకు ఎదురునిల్చి యుద్ధం చెయ్యను. మరణించటానికి ఏదైనా ఒక మంచి గర్తాన్ని వెదుకుకొంటాను. ఈ ఆరోచకకృత్యం నా జీవితంలోని అంత్యభాగానికి అతియోగ్యమైంది. (నిష్క్రమిస్తారు.) ఏడో దృశ్యం శిబిరాలమధ్య యుద్ధభూమి. హెచ్చరిక, దుందుభులు, తుత్తారలు ధ్వనిస్తుంటాయి. అగ్రిప్పా, ఇతరులూ ప్రవేశిస్తారు. అగ్రిప్పా : వెనుదిరిగి విశ్రాంతి తీసుకొందాము. చాలావరకు మనం సాహసించాము. సీజర్కే తన స్థానాన్ని నిలుపుకోటానికి శ్రమౌతున్నది. శత్రువు ప్రయోగించిన బలం ఊహించినదానికంటే ఎంతో ఎక్కువౌతున్నది. (నిష్క్రమిస్తాడు) హెచ్చరికలు, క్షత్రగాత్రులైన ఆంటోనీ, స్కారస్ ప్రవేశిస్తారు. స్కారస్ : సాహసాంకా, సమ్రాట్! సమరం అంటే ఇదే. తొలుతనే మనం ఇలా వర్తించి ఉంటే, తలకు కట్టుకొన్న కట్లతో వారు పారిపోయేటట్లు చేయగలిగే ఉండేవాళ్లం. ఆంటోనీ : నీ నెత్తురు విపరీతంగా పోతున్నది. ఆంటోని - క్లియోపాత్రా 269 స్కారస్ : మొదట నా గాయం 'టి' అనే అక్షరం కారణంగా ఉండి ఇప్పుడు 'హెచ్' ఐంది. ఆంటోనీ : వారు వెనక్కు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇరోస్ ప్రవేశిస్తాడు ఇరోస్ : ప్రభూ! వారిని విజితులను చేశాం. మనకు ఘనవిజయాన్ని కూర్చటానికి ఈ అవకాశం ఎంతో అధికంగా ఉపకరిస్తుంది. స్కారస్ : వారిని వెన్నాడుదాం. జాగిలాలు కుందేళ్ల వెంటబడి తరిమి పట్టుకొన్నట్లుగా వారిని పట్టుకొందాం. పారిపొయ్యేవారిని వెన్నంటి పట్టుకోటం ఎంతో విచిత్రమైన క్రీడ. ఆంటోనీ : నీవు నాకిస్తున్న వీరోచిత ప్రోత్సాహానికి ఒక రెట్టుగానూ, నీ సాహసానికి పదిరెట్లుగానూ నిన్ను బహూకరిస్తాను. పద. స్కారస్ : నేను మీ వెంట కుంటుతూ వస్తాను. (నిష్క్రమిస్తారు) ఎనిమిదో దృశ్యం అలెగ్జాండ్రియా కుడ్యాల ముందు. హెచ్చరిక. ఆంటోనీ సైనికవిన్యాసంతో ప్రవేశిస్తాడు. స్కారస్ ఇతరులతో ప్రవేశిస్తాడు. ఆంటోనీ : అతణ్ణి శిబిరం వరకూ తరిమి కొట్టాము. మీలో ఒకరు ముందుగా రాజ్ఞి దగ్గరికి పరుగెత్తుకోవెళ్ళి, ఆమెకు మనం సాధించిన ఘనకార్యాలను తెలియజేయండి. సూర్యుడు ఉదయించి తిరిగి మనను చూచేలోగా ఈ నాడు తప్పించుకోపోయినవారి నెత్తుటేళ్లను ప్రవహింపజేద్దాం. మీ కివే నా కృతజ్ఞతాపూర్వకమైన అభినందనలు. మీరందరూ మహాబలశాలురైన వీరపుంగవుల్లా ప్రవర్తించారు. భృతికోసం పోరు సల్పినవారిలా కాకుండా కదన కారణం నాదే కాక మీలో ప్రతి ఒక్కరిదీ అయినట్లు పోరాడారు. హెక్టర్ 104 వంటి మహావీరులమని మీరందరూ ప్రదర్శించుకొన్నారు. నగరంలో ప్రవేశించండి! మీ మీ పత్నులనూ, మిత్రులనూ గాఢాశ్లేషసౌఖ్యంలో ముంచెత్తండి!! బవరంలో తగిలిన పవిత్రమైన మీ గాయాలమీద ఆనందబాష్పాల 270 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 వర్షించి ముద్దెట్టుకొని వాటికి పూర్ణతను చేకూర్చేటట్టు మీ మీ వీరకృత్యాలను వినిపించండి. (స్కారస్తో) ఏదీ, నీ హస్తాన్ని నాకిలా అందించు! క్లియోపాత్రా పరివారంతో ప్రవేశిస్తుంది. మీరొనర్చిన మహావీరకృత్యాలనన్నింటినీ చేయించిన సమ్మోహిని ఈమే. (క్లియోపాత్రాతో) ఓ సకల ప్రపంచప్రశస్తా! కవచధారణం చేసిన నా కంఠాన్ని గాఢాలింగనంతో బంధించు. ఉన్న దుస్తులతోనే సర్వస్వంగా నిదర్శనకవచంతో హృదయంమీదికి దుముకు. విజయ స్రంభంతో విర్రవీగుతూ ఉన్న దానిమీద స్వారీ చెయ్యి! క్లియోపాత్రా : ప్రభూనాం ప్రభూ! పరమవిక్రమా! మృత్యుమాయతో ప్రపంచాన్ని ముగ్ధం చేసే యుద్ధంనుంచీ పట్టుబడకుండా చిరునవ్వులు చిలుకరిస్తూ విచ్చేశావా? ఆంటోనీ : ఓ నా నైటింగేల్. 106 శయ్యలను చేరుకుండేదాకా వారిని తరిమికొట్టాము. అయితేనేం, పిల్లదానా, నా జుత్తు కొంత నెరిస్తేనేం? నా స్వేదతంతువులు కొంతగా కపిలవర్ణకేశాలతో కలిస్తే మటుకేం, యువకుల దగ్గరనుంచీ విజయానికి విజయాన్ని సాధించగలుగుతాయి. ఈ వీరుణ్ణి తిలకించు. అనుగ్రహసూచకమైన నీ హస్తాన్ని అతడి పెదవులకు అందించు, ముద్దాడుతాడు. వీరయోధుడా! ముద్దిడుకో! మానవజాతి మీద రోతగొన్న దేవతో అన్నట్లు దివ్యాకృతిని ధరించి ఈతడీనాడు శత్రుసంహారం చేశాడు. క్లియోపాత్రా : మిత్రుడా! నీకు నేనొక కాంచనకవచాన్ని బహూకరిస్తాను. అది మహావీరోచితమైంది. ఆంటోనీ : ఫోయిబస్ రథంలో 106 గా అది సూర్యకాంతమాణిక్యాలు పొదిగినదైనా ప్రతిగ్రహించటానికి ఇతడు యోగ్యతను పొందాడు. బహూకృతిగా, ఏదీ, నాకు నీ హస్తాన్ని అందించు. ఉత్సవం చేసుకొంటూ మన వీరగుణచిహ్నాలైన దెబ్బలు తిన్న డాళ్లను ప్రదర్శిస్తూ మనం అలెగ్జాండ్రియా వీథుల్లో తిరుగుదాము. సైన్యానికంతటికీ మన విశాలప్రాసాదంలో రాత్రివిందును ఏర్పాటు చేయించి కలసి భుజిద్దాం. పానపాత్రలను పొర్లిపొయ్యేటట్లు నింపి ఘనప్రమోదాన్ని సూచించే మరునాటి అదృష్టంకోసం అసవసేవనం చేద్దాము. తుత్తారవాద్య బృందమా! మీరు నగరశ్రవస్సులు బ్రద్దలయ్యేటట్లు ధ్వనించండి. మీ ఘనస్వరాలు మొరసే మన చిరుదుందుభిధ్వనులతో ఆంటోని - క్లియోపాత్రా 271 కలిసిపోవాలి. అప్పుడు అవి భూమండలంనుంచి ఆకాశానా, ఆకాశంనుంచి భూతలానా ప్రతిధ్వనించి, జైత్రయాత్రాపరులమైన మనను అభినందించాలి. తొమ్మిదో దృశ్యం సీజర్ శిబిరం, తమ తమ స్థానాలలో నిలిచిన కాపలావారు ప్రవేశిస్తారు. ప్రథమ సైనికుడు : ఎవరైనా ఒక గంటలోగా వచ్చి మనకు విశ్రాంతి ఇవ్వకపోతే మనం రక్షకజనస్థానానికి తిరిగి వెళ్ళాల్సి ఉంది. గగనం నక్షత్రకాంతులతో కడుశోభాయమానంగా ప్రకాశిస్తున్నది. ఉచితవేషాన్ని ధరించి ఉదయం రెండోగంటనే మనం యుద్ధానికి సన్నద్ధులం కావాలని వారంటున్నారు. ద్వితీయ సైనికుడు : గడిచిన దినం మనకు చాలా చెడ్డది. ఎనోబార్బస్ ప్రవేశిస్తాడు. ఎనోబార్బస్ : ఓ నిశీధినీ! నీవు నాకు సాక్ష్యంగా నిలు. తృతీయ సైనికుడు : ఇదెవరు? ద్వితీయ సైనికుడు : చాటున దాగి విను. ఎనోబార్బస్ : ఓ పవిత్రమైన చంద్రదైవతమా! నీవు నాకు సాక్షివి కా! ప్రజాద్రోహులను నిందిస్తూ జనానీకం జ్ఞప్తిచేసుకొనేటప్పుడు ఎనోబార్బస్ ప్రథమశ్రేణికి చెందిన ప్రభుద్రోహి అయినా, నీ ముందు పశ్చాత్తాపపడినట్లు చెప్పుకొనేటందుకు నీవు నాకు సాక్షివి కా! ప్రథమ సైనికుడు : ఎనో బార్బస్! తృతీయ సైనికుడు : నిశ్శబ్దం! ఇంకా ఏమేం పలుకుతాడో విను. ఎనోబార్బస్ : ఉన్మాదాది వ్యసనాలను 107 సామ్రాజ్ఞివైన ఓ దేవతా! ఇక ప్రభువుకు ఎదురు తిరిగిన ప్రాణం నన్ను బహుకాలం పట్టుకొని వ్రేలాడకుండా నా మీద నిశీథినీవిషశైత్యాన్ని పిండెయ్! దుఃఖించి దుఃఖించి ఇదివరకే ఎండిపోయిన నా గుండె బ్రద్దలై పొడి ఆరి ఇక నీచమైన ఊహలను చేయకుండా ఉంటుంది. నా దోషమనే చెకుముకి రాతిమీదికి విసిరి పారెయ్! అంటోనీ మహాశయా! నీవు మహోదాత్తుడవు. నీ మీద నా తిరుగుబాటు ఎన్నిరెట్లుగా నీచాతినీచమైందో నీవు అంతకంటే ఎన్నోరెట్లుగా మహోదాత్తుడవు. నన్ను నీవు క్షమించు. కానీ యజమానిని విడిచిపోయినవాడనీ, 272 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 పటాలాన్ని వదలిపారిపోయిన సిపాయీ అనీ నన్ను లోకం గుర్తించుగాక! ఆంటోనీ మహాశయా! మహాశయా, ఆంటోనీ!! (మరణిస్తాడు) ద్వితీయ సైనికుడు : వెళ్ళి అతడితో మాట్లాడుదాం. ప్రథమ సైనికుడు : అతడు ఇంకా ఏమైనా అంటాడేమో విందాం. అందువల్ల సీజర్కు ప్రయోజనం ఉండవచ్చు. తృతీయ సైనికుడు : అలాగే చేద్దాము. కానీ అతడు నిద్రపోతున్నాడు. ప్రథమ సైనికుడు : నిద్రగా లేదు. మూర్ఛపోయినట్లున్నాడు. ఎందువల్లనంటే అతడు చేసిన అంత చెడ్డ ప్రార్థన నిద్రకోసంగా కనిపించటం లేదు. ద్వితీయ సైనికుడు : మనం అతనిదగ్గిరికి వెళ్లుదాం. తృతీయ సైనికుడు : లేవయ్యా, లే, మాటాడు. ద్వితీయ సైనికుడు : ఏం, వినబడుతున్నదా? ప్రథమ సైనికుడు : మృత్యుహస్తం అతణ్ణి చేరుకొన్నది. (దూరంగా దుందుభులు వినిపిస్తుంటవి) అవిగో! దుందుభులు నిద్రితులను ప్రశాంతంగా మేల్కొల్పుతున్నాయి. ఇతణ్ణి మనం భటాగారానికి మోసుకోపోదాం. ఇతడెవరో ఉన్నతవర్గంలో వాడు. మన రక్షణకాలం పూర్తిగా అయిపోయింది. తృతీయ సైనికుడు : అయితే రండి. ఇతడు ఇంకా తేరుకోవచ్చు. (ఎనోబార్బస్ కళేబరంతో నిష్క్రమిస్తారు) పదో దృశ్యం రెండు శిబిరాల మధ్య, తమ సైన్యాలతో ఆంటోనీ, సార్కస్ ఇరువురూ ప్రవేశిస్తారు. ఆంటోనీ : వారీనాడు మనను సముద్రంమీద ఎదుర్కోటానికి సిద్దపడ్డారు. భూతలం మీద కలుసుకొంటే వారికి సంతృప్తి కలగదు. స్కారస్ : ప్రభూ! మనం వారిని రెంటిమీదా కలుసుకొందాం. ఆంటోని - క్లియోపాత్రా 273 ఆంటోనీ : వారు వహ్నిమీద పోరాడినా, వాయువుమీద పోరాడినా అందుకు నేను సంసిద్ధమే. అయితే మన ఏర్పాటు ఇది. పదాతిదళం నగరాన్ని ఆనుకొని ఉన్న కొండలమీద మనతో బాటుగా ఉంటుంది. సముద్రంమీద శత్రువులతో తలపడ వలసిందని ఇదివరకే ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడే వారు రేవు పట్టణాన్ని వదిలిపెట్టి పయోధిమీద పయనమారంభించారు. మనం ముందుకుసాగి కొండలమీదికి చేరుకొందాం. వారి వస్తుసంభారాల విస్తృతి ఎంతో మనం అక్కడినుంచీ కనిపెట్టవచ్చు సముద్రంమీద వారి యుద్దకృషి ఎంత తీవ్రంగా ఉందో తిలకించనూవచ్చు. (నిష్క్రమిస్తారు) పదకొండో దృశ్యం అక్కడనే మరోవంక, సీజర్ సైన్యంతో ప్రవేశిస్తాడు. సీజర్ : వారు మనపైన పడితే తప్ప ఉర్వీతలంమీద మనం ఉన్న స్థానాలలోనే స్థిరంగా ఉండిపోదాం. ఉన్న పరిస్థితులను బట్టి పృథ్విమీద మనకు పనికలగదనే నా అభిప్రాయం. అతని సైనికుల్లో ఉత్తములందరూ వాటిని జనసమ్మర్ధం చేయటానికి నౌకలదగ్గరికి వెళ్లారు. ముందుకు సాగి ఆ లోయలోకి వెళ్లి, మనం అనుకూల్యాన్ని చూచుకొని అక్కడ నిలుద్దాం. (నిష్క్రమిస్తాడు) పన్నెండో దృశ్యం అదే ప్రదేశంలో మరొక భాగం. ఆంటోనీ, స్కారస్ ప్రవేశిస్తారు. ఆంటోనీ : వారింకా తారసిల్లలేదు. అదుగో దూరంగా ఆ సాలవృక్షం దగ్గిరినుంచీ అంతా కనిపెట్టుతాను. ఎలా కొనసాగబోతున్నదో వెంటనే నీకు వార్త తీసుకోవస్తాను. (నిష్క్రమిస్తాడు) 108 స్కారస్ : క్లియోపాత్రా తెరచాపల్లో టిట్టిభాలు 10 ఇళ్లు కట్టుకొన్నాయి. శకునజ్ఞులు అదేమో తమకేమీ తెలియటం లేదంటున్నారు. దాని అర్థాన్ని ఏమీ చెప్పలేమంటున్నారు. వ్యాకుల నేత్రాలతో తిలకిస్తున్నారు. తెలుసుకొన్నదాన్ని సాహసించి చెప్పలేకుండా ఉన్నారు. పరాక్రమోపేతుడై ఉన్నా ఆంటోనీలో నిస్పృహ ద్యోతకమౌతున్నది. 274 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 శీఘ్రయాతాయాతశీలంగల ఆయన అదృష్టం ఆయనకున్నదాన్ని గురించీ, లేనిదాని గురించీ ఆశాభయభావాల రెంటినీ కల్పిస్తున్నది. సముద్రయుద్ధంలో వలె దూరంగా హెచ్చరిక వినిపిస్తుంది. ఆంటోనీ తిరిగి ప్రవేశిస్తాడు. ఆంటోనీ : సర్వం వినాశనమైంది, నీచురాలు ఈజిప్టు రాజ్ఞి నన్ను మోసగించింది. నౌకాదళం, శత్రువులకు లొంగిపోయింది. అరుగో, దూరంగా, నా సైనికులు బహుకాలానికి కలుసుకొన్న మిత్రుల్లాగా ఆనందతన్మయత్వంతో తమ కుళాయీలను ఎగరవేస్తూ కలిసి త్రాగుతున్నారు. మువ్వురి మార్చిన 109 ఓ బంధకీ! అనుభవంలేని యువకుడికి నన్ను అమ్మివేశావు. నా హృదయం ఇప్పుడు నీ మీదనే కదనం చేస్తున్నది. - వారందరినీ పారిపొమ్మని ఆజ్ఞాపించు. ఇక నాకు మిగిలింది ఒకటే. నన్ను సమ్మోహితుణ్ణి చేసి విడిచిన స్త్రీమీద ప్రతీకారం తీసుకోవటం. దీన్ని జరిగిస్తే నేను సమస్తాన్నీ నిర్వహించినట్లే. - అందర్నీ పారిపొమ్మని ఆజ్ఞాపించు. స్కారస్! సెలవు! (స్కారస్ నిష్క్రమిస్తాడు.) ఓ రవీ! ఇంకోమారు నీవు ఉదయించటాన్ని నేను దర్శించను. ఇక్కడే, ఇక, నిరంతరంగా ఆంటోనీ, అతని అదృష్టమూ విడివడిపోతున్నారు, ఇక్కడ కూడా మేము ఒకరికొకరం వీడ్కోలు చెప్పుకొంటున్నాము. సర్వం ఇంతకు వచ్చిందా? ఎవరు కోరిన కోర్కెలన్నింటినీ నేను మరుక్షణంలో తీర్చానో, ఆ వీరహృదయాలు ఈ నాడు నన్ను విడనాడి వికసిస్తున్న సీజర్ను పరిఫుల్లం చేయటానికి అతనిని చేరిపోతున్నారు. నేను సర్వవృక్షాలను మించి పెరిగిపోయిన దేవదారువును. ఇప్పుడు నాపై చర్మాన్నంతటినీ కోల్పోయాను. మోసానికి పాలైనాను. ఓ ఈజిప్టు రాజీ! కృత్రిమహృదయీ! ఎవతె కనుచూపు నన్ను కదనభూమికి పంపటానికీ, తిరిగి రమ్మనటానికీ సమర్థమైందో, ఎవతె ప్రేమను నా కిరీటంగానూ, చరమ లక్ష్యంగానూ పరిగణించానో ఆ భీషణసమ్మోహనాంగి, గాఢవినాశం పొందేటంత వరకూ నన్ను ఏదో మాయ చేసి మోసగించింది. ఏమిటది ఇరోస్! ఇరోస్!! క్లియోపాత్రా ప్రవేశిస్తుంది. క్లియోపాత్రా : ప్రభువెందుకో తమ ప్రియురాలైన ఈ క్లియోపాత్రా మీద కినుక వహించారు? ఆంటోనీ : ఇక్కడినుంచి అదృశ్యమై పో! లేదా నీకు తగ్గ శాస్త్రి చేయవలసి వస్తుంది. అందువల్ల సీజర్ విజయానికి అప్రతిష్ఠ ఘటిల్లుతుంది. అతడు బందీగా పట్టుకోవెళ్లి ఆంటోని - క్లియోపాత్రా 275 110. కరతాళధ్వనులతో చెలరేగే ప్లీబన్ల‘LOకు చక్షుఃప్రీతి కలిగేటట్లు నిన్ను ఎగురవేయుగాక! నీ స్త్రీజాతికంతటికీ కలిగిన తురీయకళంకంలాగా అతడు నిన్ను రథానికి కట్టి తీసుకుపోయేటప్పుడు, నీవు దాన్ని అనుసరింతువుగాక! బహుకాలంనుంచీ శాంతి వహించి బాధపడుతున్న ఆక్టేవియా సిద్ధం చేసుకొన్న కొనగోళ్ళతో నీ ముఖాన్ని చారలుపడ గీరుగాక! (క్లియోపాత్రా నిష్క్రమిస్తుంది) నీవు వెళ్ళిపోవటం ఎంతో మంచిదైంది. లేకపోతే నేను నిన్ను చంపివేసేవాణ్ణి. అయితే నా క్రోధం వల్ల నీవు మరణించటం కూడా ఒకరీతిగా మేలై ఉండేది. నీ ఒక్కతె చావు అనేకవ్యక్తుల మరణాలను ఆపివేసేది. ఓ ఇరోస్! నెస్సెన్" విషప్రావృతకం నన్ను కప్పేస్తున్నది. ఓ నా వంశకర్తా అల్సన్! 12 నీ క్రోధోద్వేగాన్ని నాకు నేర్పు. నాలిఛాస్ను చంద్రదేవతా శృంగాలమీదికి విసిరి ఆ హస్తాలతోటే ప్రబలమైన గదను గ్రహించి నీకు యోగ్యవారసుడనైన నన్ను నేనే అంతమొందించుకోగల ఆత్మశక్తిని నాకు ప్రసాదించు. ఆ మాంత్రికురాలు మరణించుగాక! ఆమె నన్ను యువకుడైన ఆ రోమన్బాలుడికి అమ్మివేసింది. నేను వారి కుతంత్రాలకు బలై పోతున్నాను. ఇందుకామెకు నే విధించే శిక్ష మరణమే. ఇరోస్! ఇరోస్!! (నిష్క్రమిస్తాడు) పదమూడో దృశ్యం అలెగ్జాండ్రియాలోని క్లియోపాత్రా ప్రాసాదంలో క్లియోపాత్రా, ఛార్మియన్, ఐరాస్, మార్డియన్ ప్రవేశిస్తారు. క్లియోపాత్రా : నాకు సాయపడండి. ఓ నా పార్శ్వ పరిచారికలారా! ఎకిలిస్తెలుకోసం ఉద్రిక్తుడైన టెలమన్ 113 కంటే ఆయన అత్యధికంగా ఉన్మత్తుడైనాడు. థెస్సలీ వరాహమైనా 4 కలిగిన నిస్త్రాణవల్ల ఇంతమిక్కిలిగా నురగలు కక్కలేదు. ఛార్మియన్ : నీ పిరమిడ్ దగ్గిరికి వేగంగా సాగిపో. ఆ లోపల ఉండి మూసివేయించుకో. మరణించావని అతనికి వార్త పంపించు. బహుకాలం అనుభవించిన ఘనత పోవటం కంటే శరీరం, ఆత్మ అనే రెండూ విడివడిపోవడం దొడ్డవిషయం కాదు. క్లియోపాత్రా : నేను నా సమాధినిర్మాణం దగ్గిరికి చరచరా వెళ్ళిపోతున్నాను. మార్డియన్, నీవు వేగంతో వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకొన్నానని ఆయనతో చెప్పు. నేను తుదిమాటగా 276 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 'ఆంటోనీ' అని అన్నానని చెప్పు. నిన్ను ప్రార్థిస్తున్నాను. నా మరణాన్ని గురించి నీవు చెప్పగలిగినంత దీనంగా చెప్పు. మార్డియన్! అలసించకు. నా మరణాన్ని గురించి విన్న తరువాత ఆయన ఎలా వ్యవహరించారో, వెంటనే వచ్చి నాకు తెలియజెయ్! నేను నా సమాధినిర్మాణం దగ్గరికి వెళ్ళిపోతున్నాను. (నిష్క్రమిస్తుంది) పదునాల్లో దృశ్యం అదే ప్రదేశం, మరో కక్ష్య, ఆంటోనీ, ఇరోస్ ప్రవేశిస్తారు. ఆంటోనీ : ఇరోస్! నన్ను వెనకటిలాగానే నీవు చూడగలుగుతున్నావా? ఇరోస్ : ఉదాత్తప్రభూ! అలాగే చూడగలుగుతున్నాను. ఆంటోనీ : అప్పుడప్పుడూ మేఘాలు మనకు ఘటసర్పాలులాగానూ, ఆవిరులు భల్లూకసింహాకారాలతోనూ గోచరిస్తుంటాయి. అవి శిఖరాలుగల ప్రాసాదాలల్లాగానూ, వ్రేలాడే కొండల్లాగానూ, పంగల పర్వతాలలాగానూ, నాలికలా సముద్రంలోకి చొచ్చుకోపోయి పైన చెట్లగల నీలపునేల తునుకల్లాగానూ, ప్రపంచానికి శిరాలు వంచిన వాతావరణంవల్ల కన్పించి, మన కళ్ళను మోసగిస్తుంటాయి. నీవిటువంటి విభ్రామ్యాలను చూచే ఉంటావు. ఇవన్నీ సాయం కాలతిమిరాలు మనకు చూపించే దృశ్యాలు. ఇరోస్: అవును ప్రభూ! నేనూ అటువంటి వాటిని చూచాను. ఆంటోనీ : భావాతివేగంతో నెడుతూ గుర్రంలా కనిపించే దానిని పై ఉష్ణవాయువు ఇప్పుడు నీటితో కలిసి పోయినట్లుగా చెరిపివేసింది. ఇరోస్ : ప్రభూ! మీరన్నట్లే జరిగింది. ఆంటోనీ : ఇరోస్! నీవు నా ప్రియసేవకుడివి. నీ సేనాధినేతనైన నేను కూడా పై వానిని పోలిన ఒక దృశ్యాన్నే. ఇక్కడిప్పుడు నేను ఆంటోనీగా ఉన్నాను. ఇరోస్! అయినా ఇప్పుడు నే ధరించిఉన్న ఈ రూపాన్ని ఇక నేను నిలువబెట్టుకోలేను. ఈ యుద్ధాలనన్నిటినీ నేను క్లియోపాత్ర కోసం చేశాను. నా హృదయం ఆమెది కనుక ఆమె హృదయం నాదనుకొన్నాను. కానీ అది నాదై ఉన్నప్పుడే కోటిహృదయాలను ఆకర్షించింది. ఇప్పుడు నేను దాన్ని కోల్పోయాను. ఆమె ఇప్పుడు సీజర్తో రహస్యంగా సంధి చేసుకొని శాత్రవులకు విజయాన్ని చేకూర్చి, నన్నూ, నా కీర్తినీ మోసగించింది. ఆంటోని - క్లియోపాత్రా - 277 వద్దు. ఇరోస్! కోమలహృదయుడా! దుఃఖించవద్దు. మనను అంతమొందించు కొనే అధికారం ఇంకా మనదగ్గరనే ఉంది. మార్డియన్ ప్రవేశిస్తాడు ఆంటోనీ : ఓరీ దుష్టుడా! ఆమె నా ఖడ్గప్రాభవాన్ని కాజేసింది. మార్డియన్ : లేదు, ఆంటోనీ మహాశయా! మా యజమానురాలు నిన్ను ప్రేమించింది. తన అదృష్టాన్ని ఆమె పూర్ణంగా మీతోనే పెనవేసింది. ఆంటోనీ : వెళ్ళిపో! ఓరీ తుంటరి కొజ్జా! ఆమె నా యెడ అనురాగంతో వర్తించిందనటానికి నీకెంతటి ధైర్యం! ఎంతటి స్థైర్యం!! ఆమె నన్ను మోసగించింది. ఇందుకుగానామె ద్రోహిలా మరణించి తీరవలసిందే! మార్టియన్ : మరణమనే ఋణాన్ని ఎవరైనా ఒక్కమారే చెల్లించగలరు. ఆమె దానిని ఇంతకు పూర్వమే చెల్లించింది. మీరేమి చెయ్యాలని కోరుతున్నారో అది, ఇదివరకే, మీకోరికకు అనుగుణంగానే జరిగిపోయింది. ఆమె తుదిక్షణంలో పలికిన పలుకు “ఆంటోనీ! అత్యుదారుడా!” అన్నదే. గుండెను చీల్చుకొనివచ్చే ఒక మూల్గు మధ్యలో ఆంటోనీ మహాశయా! ఆమె నీ నామోచ్చారణాన్ని ఆపివేసింది. అది ఆమె మోవికీ, హృదయానికీ మధ్య రెండై నిలిచిపోయింది. ఇలా ఆమె తిరిగీ తన ప్రాణాన్ని ఇచ్చివేసింది ఇలా నీ నామం ఆమె హృదయంలో సమాధి కట్టుకొన్నది. ఆంటోనీ : ఆమె మరణించిందా?

మార్డియన్ : మరణించింది. ఆంటోనీ : ఇరోస్! ఇక నీ రణవేషాన్ని విప్పివెయ్! దీర్ఘదినకృత్యం నిర్వర్తితమైంది. మనం ఇక నిరంతరవిశ్రాంతి కోసం దీర్ఘనిద్ర పోదాం. (మార్డియన్ ) ఇటువంటి దారుణ వార్తను కొనివచ్చి కూడా ప్రాణంతో వెళ్ళిపోతున్నావు కనుక, నీకు ప్రతిఫలం ఎంతో ఘనంగా ముట్టినట్లు. వెళ్లు! (మార్డియన్ నిష్క్రమిస్తాడు) ఇరోస్, నా శస్త్రవేషాన్ని విప్పివెయ్! ఏడుపొరలు గల ఎజాక్సుఖేటం నాకున్నా ఈ మహాదారుణమైన ఆపద చేసిన ముట్టడినుంచి నన్ను రక్షించలేదు. అయ్యో! నా హృదయపక్షాలను బ్రద్దలుకొట్టు. దానిని పొంది దానికంటే ఎన్నో రెట్లు బలవత్తరమైన నా హృదయం స్వీయపేటికను బ్రద్దలు కొట్టుకొని బయటపడుగాక! ఇరోస్! త్వరగా పోదాం పద! త్వరపడు. ఓ నా శస్త్రశకలాల్లారా! ఇక నేను యుద్ధవీరుణ్ణి కాను. మిమ్మల్ని ఇంతవరకూ మహోదాత్తంగా 278 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 భరించాను. మీకిదే నా వీడ్కోలు. ఇరోస్! క్షణకాలం నాకు ఏకాంతాన్ని కల్పించు (ఇరోస్ నిష్క్రమిస్తాడు). క్లియోపాత్రా ఈ యాత్రలో నిన్ను నేనధిగమిస్తాను. నన్ను క్షమించమని నీకడ కన్నీరు కార్చి వాపోతాను. అవును. నాకింతకంటే మార్గం మరేమీ లేదు. ఇక జీవిస్తే చిత్రవధే! నన్ను నడిపించిన జీవితజ్యోతి వీడిపోయిన తరువాత శయనించటం మంచిది. ఇక చీకట్లో తట్టాడకు. శ్రమసర్వం వ్యర్థమైంది. విజయాలకు హేతువైన నా మూల బలమే అపజయాన్ని నిశ్చయిస్తున్నది. దీన్ని ముద్రాంకితం చెయ్ ! సర్వం పరిసమాప్తమైంది. ఇరోస్! - క్లియోపాత్రా! నేనూ వస్తున్నాను. ఇరోస్! నా కోసం ఆగు, మృతులైనవారి ఆత్మలు ఎక్కడ పుష్పశయ్యలమీద శయనిస్తాయో, అక్కడ ప్రాణులు ఆశ్చర్యగౌరవాలను ప్రదర్శిస్తూ తిలకించేటట్లు మనం చేయి, చేయి కలిపి సంభ్రమంగా పచారులు చేద్దాము. అక్కడి సర్వభూత ప్రపంచం మన ఇరువురి చుట్టూ చేరడంవల్ల ఇక డిడోకు, 115 ఆమె ప్రియుడైన ఏయ్ నియాస్కు పార్శ్వచరులు కరువైపోతారు. ఇరోస్! ఇరోస్!! ఇరోస్ : ఏమి సెలవు ప్రభూ? ఇరోస్ తిరిగి ప్రవేశిస్తాడు ఆంటోనీ : క్లియోపాత్రా మరణించినప్పటినుంచీ దేవతలు నా నీచత్వాన్ని అసహ్యించుకొనేటంతటి అప్రతిష్టాకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. విశ్వాన్నంతటినీ ఖడ్గచాలనలతో నా ఇచ్ఛానుసారంగా విభజించిన నేను, ఒక్కొక్కటే ఒక నగరాన్ని నింపుకోగల నౌకలతో నెప్ట్యూన్ LS హరితార్ణవం మీద అఖండవైభవంతో వెలిగిన నేను, ఒక స్త్రీకంటే అధిక సాహసికుణ్ణిగానీ, ఉదాత్తుణ్ణిగానీ కానని తీర్పు చెప్పుకొన్నాను. మరణంతో ఆమె మన సీజర్కు 'నా విజేత్రిని నేనే!' అని తెలియజెప్పింది. ఇరోస్! విషమపరిస్థితి ఏర్పడితే - నిశ్చయంగా అది ఇప్పుడేర్పడ్డది - అపకీర్తి భీతి వెన్నాడటాన్ని గమనించి, నేనెప్పుడా జ్ఞాపిస్తే అప్పుడు నీవు నా ప్రాణాలను తీస్తావని శపథం చేశావు. ఆ కాలం వచ్చింది. వెనుదీయకు. సత్యానికి నీవు నన్ను చంపటం లేదు సీజర్కు ఆశాభంగం కలిగిస్తున్నావు. జంకకు. ధైర్యాన్ని చిక్కబట్టుకో. G117 ఇరోస్ : ఈ కృత్యనిర్వహణాన్ని దేవతలు మాన్పించెదరుగాక! పరమశత్రువులైన పార్డియన్లే మహాయత్నాలు చేసి విఫలులైన ఈ కార్యాన్ని నేను నిర్వహించవలసి వచ్చిందా? ఆంటోని - క్లియోపాత్రా 279 ఆంటోనీ : ఇలా చేతులు కట్టుకొని నీ యజమాని సహజౌద్ధత్యంగల కంఠాన్ని కుంచించి ఆత్మలోకి చొచ్చుకోపోయిన సిగ్గువల్ల ముఖం వంచి, సీజర్ విజయరథ పార్టి భాగాన అపకీర్తి ముద్రితుడై నడుస్తుంటే, ఇరోస్! నీకేమైనా రోము మహానగరంలోని ఒక ఉన్నత వాతాయనంలో నిల్చి చూడాలని కోరికుందా? ఇరోస్ : ఆ దృశ్యాన్ని నేను చూడను! ఆంటోనీ : అయితే రా. ఒక్కపోటుతో నా జీవితమనే వ్యాధిని అంతమొందించు. నీ దేశ సంక్షేమార్థంగా ధరించిన విశ్వాసపాత్రమైన నీ కృపాణాన్ని ఒరనుంచి దుయ్! ఇరోస్ : ప్రభూ! నన్ను క్షమించండి! ఆంటోనీ : మరి నీకు నేను స్వాతంత్రం ప్రదానం చేయలేదా? నేను ఆజ్ఞాపించినప్పుడీ పని చేస్తానని నీవు శపథం చెయ్యలేదూ? తక్షణం చేసెయ్! లేకపోతే పూర్వం నీవు చేసిన సేవలన్నీ యాదృచ్ఛికకృత్యాలేగాని భక్తితో చేసినవి కావని భావించవలసి ఉంటుంది. కత్తిదూసి పూనుకో. ఇరోస్ : అయితే సర్వప్రపంచం భక్తితాత్పర్యాలతో పూజించే ఆ మీ ముఖాన్ని నా వంకనుంచి ప్రక్కకు త్రిప్పండి. ఆంటోనీ : అలాగే కానీ! (అతనివంక నుంచి ప్రక్కకు తిరుగుతాడు) ఇరోస్ : ఇదిగో నా కత్తిని దూశాను. ఆ ఆంటోనీ : ఎందుకోసం దాన్ని దూశావో ఆ పనిని నీ ఖడ్గం చేత వెంటనే చేయించు. ఇరోస్ : ప్రియమైన ఓ నా స్వామీ! నా సైన్యాధినేతా!! నా సమ్రాట్!! ఈ దారుణమైన ఘాతకు పూనుకొనేముందుగా నన్ను మీకు వీడ్కోలు చెప్పుకోనీయండి. ఆంటోనీ : ఆ వీడ్కోలును నీవు చెప్పటం అయిపోయింది. ఇదే నా వీడ్కోలు! ఇరోస్ : మహాగ్రేసరా! ఇదే వీడ్కోలు. ఘాతకు సిద్ధమేనా? ఆంటోనీ : కానీ ఇరోస్ ! ఇరోస్ : ఇక నేనెందుకు? ఈ పని చేసి ఆంటోనీ మహాశయుని మరణంవల్ల కలిగే దుఃఖంనుంచి తప్పించుకొంటాను. (తన్ను చంపుకొంటాడు) 280 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఆంటోనీ : వీడు నా కంటే మూడురెట్లు ఉదాత్తుడు. సాహసికా, ఇరోస్! నేను చెయ్యదగ్గదేదో, నీవు చెయ్యలేకపోయిందేదో ఇందుమూలంగా నీవు నాకు పాఠం నేర్పావు. నా రాజ్ఞి, ఇరోస్ ఇరువురూ నాకు సాహసచర్యను గురించి పాఠాన్ని నేర్పి, వీరకృత్యచరిత్రలో నా కంటే ఉత్తమస్థానాన్ని సంపాదించుకొన్నారు. అయితే ఉత్సాహంతో వధువు దగ్గరికి వెళ్లే వరునిలా నేను మృత్యువు దగ్గిరికి వెళ్లుతాను. ప్రియుడు వైవాహికశయ్యను చేరేటట్లు నేను ఆమెతో లీనమౌతాను. ఇక నిర్వర్తిస్తాను. ఇరోస్! నీ యజమాని నీకు శిష్యుడై మరణిస్తున్నాడు. (కత్తిమీద పడిపోతూ) ఇలా చేయటం నేను నీ దగ్గరనే నేర్చుకొన్నాను. ఏమిటి? ఇంకా నేను మరణించలేదా? ఇంకా మరణించలేదా? ఓ రక్షకభటులారా! నన్ను పంపించి వేయండి. ఓ.... డెర్సిటాస్, మరొక రక్షకభటుడు ప్రవేశిస్తారు. ప్రథమ సేవకుడు : ఈ శబ్దమేమిటి? ఆంటోనీ : మిత్రులారా! నేను పనిని సక్రమంగా పూర్తిచేయలేదు. నేనారంభించింది పూర్తిచేయండి. ద్వితీయ భటుడు : మహానక్షత్రం రాలిపోయింది. ప్రథమ భటుడు : ఇంతటితో కాలమే పరిసమాప్తమైంది. అందరూ : అయ్యో, మనకెంతటి ఆపద వచ్చింది! ఆంటోనీ : ఎవడు నన్ను ప్రేమిస్తే అతడు నన్ను అంతమొందించుగాక! ప్రథమ భటుడు : నేను ప్రేమించటం లేదు. ద్వితీయ భటుడు : నేనూ ప్రేమించటం లేదు. తృతీయ భటుడు : ప్రేమించేవారు ఇక్కడ ఎవరూ లేరు. (భటులు నిష్క్రమిస్తారు) డెర్సిటాస్ : నీ మృత్యువు, భగ్నమైన నీ అదృష్టం అనుచరులను పారిపోయేటట్లు చేస్తున్నవి. ఈ ఖడ్గాన్ని చూపించి జరిగినవార్త వినిపిస్తే సీజర్ నిన్ను తన ఆప్తసేవకుణ్ణిగా స్వీకరిస్తాడు. డయొమిడిస్ ప్రవేశిస్తాడు ఆంటోని - క్లియోపాత్రా 281 డయొమిడిస్ : ఆంటోనీ మహాశయుడెక్కడ? ఆంటోనీ : డయొమెడ్! ఇక్కడ, ఇక్కడ! డయొమిడిస్ : ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడా? సజీవుడేనా? సమాధానం చెప్పవేమయ్యా? (డెర్సిటాస్ నిష్క్రమిస్తాడు). ఆంటోనీ : డయోమెడ్! నీవు అక్కడున్నావా? నీ కత్తిని దూసి మరణపర్యంతంగా ఒక వ్రేటు వెయ్యి! డయొమిడిస్ : ఓ నిరంకుశప్రభూ! నా యజమానురాలు క్లియోపాత్రా నన్ను మీదగ్గరికి పంపించింది. ఆంటోనీ : ఆమె నిన్నెప్పుడు పంపించింది? డయొమిడిస్ : ఇప్పుడే ప్రభూ! ఆంటోనీ : ఆమె ఎక్కడుంది? డయొమిడిస్ : తన సమాధి నిర్మాణంలో తాళం వేసుకొని ఉండిపోయింది. జరిగిపోయిన దానిని సూచించే భయమామెకు ముందుగానే కలిగింది ఆమె సీజర్తో సంధి చేసుకొన్నదని మీరు అనుమానించినప్పుడు - ఇది కేవలం ఆధారరహితమైన అనుమానం - మీ కోపం శమింపలేదని గమనించి ఆమె మీకు మరణించానని వార్త పంపించింది. ఆ వార్త మీ యెడ ఎలా వర్తిస్తుందో అన్న భయంతో సత్యాన్ని తెలియజేయటం కోసం నన్ను పంపించింది. నేను వచ్చాను. చాలా ఆలస్యమైపోయింది. ఆంటోనీ : అవును. చాలా ఆలస్యమైంది. కనికరించి నా రక్షకభటుణ్ణి కేకపెట్టు! డయొమిడిస్ : ఎవరక్కడ? చక్రవర్తి రక్షకభటుల్లో ఎవరక్కడ? రండి మీ చక్రవర్తి పిలుస్తున్నాడు. ఆంటోనీ రక్షకభటులు నలుగురైదుగురు ప్రవేశిస్తారు. ఆంటోనీ : ప్రియమిత్రులారా! క్లియోపాత్రా ఉన్నచోటికి నన్ను మోసుకు పోండి. మీకు నేనిచ్చే తుది ఇదే! ప్రథమ భటుడు : ప్రభూ! ఇది మీకెంతటి కీడు! మీ అనుచరులను అందరినీ మించి మీరు జీవించరా! 282 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 అందరు ఎంతటి దుర్దినం! ఆంటోనీ ప్రియులారా! విలువగల మీ చింతలను చెల్లించి క్రూరవిధిని సంతృప్తిపరచటానికి యత్నించవద్దు. మనసు శిక్షించటానికి ఏది వస్తే దానికి స్వాగతమయండి. అది ఇచ్చే శిక్షను అవలీలగా భరిస్తే అప్పుడు దాన్ని మనమే శిక్షించినట్లుతుంది. నన్ను పైకి తీసుకోపొండి. మీకు నాయకుడినై అనేక పర్యాయాలు మిమ్మల్ని నడిపించాను. ఇప్పుడు నన్ను మీరు నడిపించండి. మోసుకోపొండి. నాకు చేసిన సేవలన్నిటికీ నా ప్రణామాలను అందుకోండి. (ఆంటోనీని మోసుకుపోతూ నిష్క్రమిస్తారు) పదిహేనో దృశ్యం అలెగ్జాండ్రియా. ఒక సమాధి నిర్మాణం. క్లియోపాత్రా, ఆమె కన్యలు, పరిచరగణం, ఛార్మీయన్, ఐరాస్తో పైన ప్రవేశిస్తుంది. క్లియోపాత్రా : చార్మియన్! నేను ఇక్కడినుంచి వెళ్ళనే వెళ్ళను! ఛార్మియన్ : అమ్మా! నీవు సౌఖ్యాన్ని చేకూర్చుకో. క్లియోపాత్రా : లేదు, సౌఖ్యం నాకవసరం లేదు. సమస్త విచిత్ర సన్నివేశాలకూ, దారుణ సంఘటనలకూ మనం సిద్ధపడుతుంటాం. కానీ మనం ఉపలభ్యమానాలైన సంతోషాలను ఉపభోగించం. నా కారణానికి తుల్యమైందై, దాన్ని కల్గించడానికి కారణమైన ఆపద ఎంతటి గొప్పదో నా దుఃఖం అంత గొప్పది కాక తప్పదు. క్రింద డయొమెడిస్ ప్రవేశిస్తాడు ఆంటోనీ ఎలా ఉన్నాడు? మరణించాడా? డయొమిడిస్ : మృత్యువాయన్ను సమీపించింది. కానీ మరణించలేదు. మీ కట్టడానికి ఆవలిదిక్కున చూడండి. ఆయన రక్షకభటుడొకడు ఆయన్ను మోసుకోవచ్చాడు. క్రింద రక్షకభటుడు కొనివచ్చిన ఆంటోనీ ప్రవేశిస్తాడు క్లియోపాత్రా : ఓ రవీ! నీవు తిరుగుతున్న ఆ మండలాన్ని దగ్ధం చెయ్! సర్వప్రపంచాన్నీ దాని తీరాలతో బాటుగా తిమిరాలపాలు చెయ్! అయ్యో! అంటోనీ! ఆంటోనీ!! ఆంటోనీ!! ఆంటోని - క్లియోపాత్రా 283 ఛార్మియన్! సాయపడు. ఐరాస్! సాయపడు. క్రింద ఉన్న మిత్రులారా! సాయపడండి. మనం ఆయన్ను ఇక్కడికి చేరుద్దాం. ఆంటోనీ : శాంతి వహించండి. అంటోనీని పడగొట్టింది సీజర్ పరాక్రమం కాదు. అతని పరాక్రమమే అతని మీద విజయం చేకొన్నది. క్లియోపాత్రా : అలాగే జరిగి ఉండాలి. లేకపోతే ఆంటోనీని గెలవగలిగేవారు ఆంటోనీతప్ప మరెవ్వరుంటారు. అయినా అలా జరగటం ఎంత దురదృష్టం! ఆంటోనీ : నేను మరణిస్తున్నాను. ఈజిప్టు రాజీ! నేను మరణిస్తున్నాను. నీ పెదవులమీద నేనుంచిన వేయి ముద్దుల్లో తుదిదైన ఈ నిరుపేదముద్దును నిలుపటం కోసం మృత్యువును ఇంచుక వేచి ఉండమని ప్రార్థిస్తున్నాను. క్లియోపాత్రా : దాన్ని స్వీకరించటానికి సాహసించి నేను దిగిరాలేను. ప్రియప్రభూ! క్షమించండి. నేను సాహసించలేను. దిగివస్తే నన్ను బందీగా పట్టి తీసుకోపోతారని నా భయం. సంపత్పరిపూర్ణుడైన సీజర్ విజయప్రవేశదృశ్యం నా వల్ల అలంకరింపబడదు. కత్తికి అంచు, మూలికలకు శక్తి, పాములకు కాటూ అంటూ ఉంటే నా భద్రతకు భంగం ఏమీ ఉండదు. నీ భార్య ఆక్టేవియా లజ్జావిశాలనేత్రాలతో, నిలుకడగల నిశ్చయంతో అలక్ష్యంగా నన్ను పరికించి చూసే గౌరవాన్ని పొందదు. రా. రా.. ఓ నా ఆంటోనీ! - ఓ నా వనితాగణమా! నాకు సాయపడండి. ఆయనను మనం పైకి తీసుకురావాలి. ఉత్తమమిత్రులారా! సాయపడండి!! 118 ఆంటోనీ : అయ్యో! తొందరపడండి! లేకపోతే నేను అయిపోతున్నాను. క్లియోపాత్రా : నిజమైన విలాసమంటే ఇదే! నా ప్రభువెంత బరువుగా వున్నాడు! మనబలమంతా భారాన్ని కల్పించే బండతనంగా మారిపోతున్నది. నాకే జూనోకున్న. అధికారముంటే బలవత్సక్షాలు గల దూత మెర్క్యురీ 119 నిన్ను పైకితెచ్చి జౌన్ ప్రక్కన కూర్చుండబెట్టేవాడు. ఇంకా కొంచెం పైకిరా. కేవలం కోర్కెలు - మరి ఆ, రా. రా. రా. (వారు అంటోనీని క్లియోపాత్రావరకు చేర్చుతారు) స్వాగతం! ప్రభూ, సుస్వాగతం!! ఎక్కడ నీ జీవితాన్ని అంతటినీ అనుభవించావో నీవు ఆ కౌగిలిలో మరణించు, ముద్దుపెట్టుకొని పునరుజ్జీవించు. నేడు నా పెదవులకు పూర్వమున్న శక్తి ఉంటే నేను దాన్నంతటినీ ఇలా పిండి ఇస్తాను. అందరు : ఇది ఒక మహాదీన దృశ్యం! 284 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఆంటోనీ నేను మరణిస్తున్నాను. ఈజిప్టురాజ్జీ! నేను మరణిస్తున్నాను. కొంత ద్రాక్షాసవాన్నివ్వు మరికొంతసేపు మాటాడగలుగుతాను. క్లియోపాత్రా : కాదు ప్రభూ! నన్ను మాటాడనివ్వు. ఆమె మీద విసరబోతున్న నిందకు కోపం తెచ్చుకొని, తనచక్రాన్ని బ్రద్దలుకొట్టే రీతిలో అనతికాలంలో నన్ను వీడబోతున్న ద్రోహచిత్త ఆ అదృష్టదైవతాన్ని విరుచుకోపడి తిట్టనీ! ఆంటోనీ : మధురప్రియా! ఒక్కమాట. సీజర్ వల్ల నీ గౌరవభద్రతలకు రెంటికీ ఎట్టి అపాయం కలగదు. సంధి చేసుకో. ఓ రాజీ! నా కోరికను చెల్లించు. క్లియోపాత్రా: నా గౌరవభద్రతలు రెండూ కలసి మెలగలేనివి. ఆంటోనీ : సాధుశీలా! నా మాట విను. సీజర్కు సంబంధించిన విషయాల్లో ప్రొక్యులైయన్ను తప్ప అన్యులను ఎవరినీ నమ్మకు. క్లియోపాత్రా : నా నిర్ణయాన్నీ, నా హస్తాలనూ మాత్రమే నమ్ముతాను. సీజర్ను గురించిన విషయాల్లో ఇతరులను ఎవరినీ నమ్మను! ఆంటోనీ : నాకు అంత్యకాలం సన్నిహితమైంది. కనుక నా అదృష్ట విషయంలో ఏర్పడ్డ విషమపరిణామానికి నీవు దుఃఖించకు. సమస్తప్రపంచానికీ రాజాధిరాజునై మహోదాత్తుణ్ణిగా మెలిగిన పూర్వవైభవస్మృతులను జ్ఞప్తికి తెచ్చుకొని, నీ ఊహలకు తృప్తిని కలిగించు. నేను నీచమరణాన్ని పొందు తున్నానని తలపోయకు. పిరికిపందనై నా దేశీయుడికొకడికి శిరస్త్రాణాన్ని అర్పించానని అనుకోకు. నేను ఒక రోమను దేశీయుడివల్ల పరాక్రమోపేతంగా జితుడనైన రోమను దేశీయుడను. నా ఆత్మ ఇక నన్ను వీడిపోతున్నది. నా శక్తి తుదముట్టింది. క్లియోపాత్రా : మానవజాతిలోకెల్ల మహోదాత్తుడా! నీవు మరణిస్తున్నావా? నా సంరక్షణతో నీకు పని లేదా? నీవు లేనిది కేవలం వరాహాలకు వాసయోగ్యమైన ఈ స్తబ్ధప్రపంచంలో నన్నుండిపొమ్మంటున్నావా? అయ్యో! చూడండి. ఓ నా నారీగణమా! రత్నగర్భకిరీటం కరిగిపోయింది. ఓ ప్రభూ! అయ్యో!! కదనకుసుమదామం బాలురు, వాడిపోయింది. ఓ సైనికధ్వజం చెదిరిపోయింది. సర్వమానవులూ బాలికలు, అందరూ ఇప్పుడు ఒకే వర్గానికి చెందినవారైనారు. కీర్త్యాదార్యాల కీళ్లు సడలిపోయాయి. నిత్యయాత్రకు విచ్చేసే చంద్రదైవతానికి ఇక అవనీతలం మీద చూడనర్హమైన వస్తువంటూ ఏమీ మిగలలేదు! (మూర్ఛపోతుంది) - ఆంటోని - క్లియోపాత్రా 285 ఛార్మియన్ : అయ్యో! ఉద్రిక్తవు కాకమ్మా! ఐరాస్ : మన సామ్రాజ్ఞి మరణించింది కూడాను! ఛార్మియన్ : రాజ్జీ! రాఖీ!! ఇరోస్ : ప్రభ్వీ! ప్రభ్వీ!! ఛార్మియన్ : రాష్ట్రీ! మహారాజ్జీ!! ఇరోస్ : ఈజిప్టురాజ్జీ! సామ్రాజ్జీ!! ఛార్మియన్ : నిశ్శబ్దం! నిశ్శబ్దం!! ఐరాస్! క్లియోపాత్రా : 'రమణీ' అన్న మాటలతో తప్ప 'రాజీ సామ్రాజ్జీ' అన్న పదాలతో ఇక పని లేదు. పాలు పితుకుతూ, పనిపాటలతో బ్రతికే నా స్త్రీ జాతిలోని క్షుద్రవనితలతో నేను తుల్యత వహిస్తున్నాను. అనర్హరత్నమైన నా ఆంటోనీని కాజేసేటంతవరకూ తమ రాజ్యంతో సర్వవిధాలా సామ్యం వహించిన ప్రపంచం మీద మీరు స్పర్ధ వహించారని ఆ దుష్టదేవతలతో చెప్పి నా రాజదండాన్ని విసిరిపారేయటం నాకు యుక్తమైన పని. మానవజన్మల్లో మహితమైనదంటూ కన్పించదు. మందబుద్ధులకు అనుద్వేగం అభిమానగుణం. ఉద్వేగం, ఉన్మత్త కుర్కురికి గుణం. అయితే అది మనదగ్గరికి చేరటానికైనా సాహసించేముందే మృత్యురహస్యనికేతన ప్రవేశం కోసం పరువెత్తటం పాపకృత్యమా? ఓ నా నారీగణమా! మీ బాధేమిటి? నిరాశపడకండి! ఉల్లాసాన్ని కల్పించుకోండి. ఛార్మియన్! అదేమిటి? అలా విషణ్ణచిత్తవై కనిపిస్తున్నావేమిటి ఓ నా ఉదాత్తకన్యకలారా! అయ్యో! వనితాగణమా! గమనించండి. నా జీవితజ్యోతి చల్లారబోతున్నది చల్లారనే చల్లారింది. ఉత్తమ వనితలారా! సుస్థిరలు కండి. మనము ఆయనకు ఖననకర్మ చేయిద్దాం. తరువాత ఉత్తమ రోమకాచారాన్ని అనుసరించి ఏది సాహసకార్యమో, ఏది ఉత్తమకృత్యమో దాన్ని నిర్వర్తిద్దాము. మృత్యువుకు మనసు పొందగలిగిన గర్వాన్ని కల్పిద్దాం. రండి! అనుసరించండి!! ఆ మహాత్ముని శరీరం ఇప్పుడు అతిశీతలమై పోయింది. అయ్యో వనితాగణమా! రండి! మనకు నిర్ణయం తప్ప మిత్రుడంటూ లేడు. అతివేగంగా మరణించటం తప్ప మనం ఆచరింపదగ్గ కార్యమూ లేదు. (ఆంటోనీ శరీరాన్ని మోసుకొంటూ పైవారందరూ నిష్క్రమిస్తారు) 286 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 పంచమాంకం ఒకటో దృశ్యం అలెగ్జాండ్రియాలో సీజర్ శిబిరం, సీజర్, అగ్రిప్పా, దోలబెల్లా, గాల్లస్, ప్రొక్యూలియస్, తదితరులూ, సీజర్ యుద్ధసమయమంత్రివర్గం ప్రవేశిస్తారు. సీజర్ : దోలబెల్లా! అతని దగ్గరికి వెళ్లు. లొంగిపొమ్మని ఆజ్ఞాపించు. అలా ఓడిపోయినవాడు ఇంకా ఆలస్యాలను కల్పించటం హాస్యాస్పదంగా ఉందను. దోలబెల్లా : సీజర్ మహాశయా! అలాగే నిర్వర్తిస్తాను. డెర్సిటాస్ ఆంటోనీ ఖడ్గంతో ప్రవేశిస్తాడు. సీజర్ : ఇది 12° ఎక్కడినుంచి రక్తపంకిలమైన ఖడ్గంతో మా ముందు కన్పించటానికి సాహసించావు. నీవెవరు? డెర్సీటాస్ : నా పేరు డెర్సిటాస్! నేను మార్క్ ఆంటోనీ సేవకుణ్ణి. పరుల సేవలను అందుకోటానికి ఆయన పరమయోగ్యత కలవాడు. సజీవుడుగా ఉన్నప్పుడు ఆయన నా యజమాని. అప్పుడు ఆయన్ను నిందించినవారిని అంతమొందించటానికి నా జీవితాన్ని అంకితం జేశాను. ఆయనయెడ నేను ఎలా వర్తించానో అలాగే మీరు నన్ను పరిగ్రహింపదలిస్తే, సీజర్, మిమ్మల్ని గూడా అలాగే కొలుస్తాను. ఇందుకు మీరు అంగీకరించకపోతే మీ సమక్షంలోనే జీవితాన్ని చాలిస్తాను.. సీజర్ : నీవనేది ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు. డెర్సిటాస్ : ఇట్టి దారుణవార్త వచ్చినపుడు ఘనగర్జనలు వినిపించి ఉండవలసింది. జగత్తు సింహసంహతులను విశృంఖలంగా రాజమార్గాలలో విహరించటానికని విసిరివేసి, అవి పరిత్యజించిన గుహల్లోకి నాగరకులను తరిమి పంపించి ఉండవలసింది. మార్క్ ఆంటోనీ మరణమంటే అది ఒక వ్యక్తికి కలిగే ఉపప్లవం కాదు. అతని నామంలో ప్రపంచార్ధభాగం ఇమిడి ఉంది. సీజర్ మహాశయా! ఆయన మరణించాడు. ఒక ప్రజాన్యాయ నిర్వాహకుడివల్ల కాదు అద్దెకు వచ్చిన హంతకుడి ఖడ్గధారవల్ల అంతకంటే కాదు. ఆయన నిర్వహించిన ఆంటోని - క్లియోపాత్రా 287 సర్వకృత్యాలలో ఒక గౌరవస్థానాన్ని ఏ హస్తం కల్పిందో ఆ హస్తం, హృదయమిచ్చిన ధైర్యంతో, దాన్నే చీల్చివేసింది. ఇదిగో, ఇది ఆయన ఖడ్గం. ఆయన గాయం నుంచీ దీన్ని కాజేసుకోవచ్చాను. పరిశీలించండి! ఆ మహోదాత్తుని రక్తంతో పరిషిక్తమైన దీన్ని పరికించండి! సీజర్ : మిత్రులారా! మీరందరూ విషణ్ణచిత్తులౌతున్నారా? అయితే ఇది రాజనేత్రాలు కూడా కన్నీటిని రాల్చి తీరక తప్పనివార్త! అగ్రిప్పా : ప్రకృతి మిక్కిలి పట్టుదలతో కొనసాగించి చేయించిన కృత్యాలకు మనచేత తిరిగి చింతించేటట్లు చేయటం ఎంతో వింతైన విషయం. మెకన్నాస్ : ఆయన ఉదాత్తగుణాలు, ఉన్నతదోషాలు రెండూ తుల్యంగా ఒకదానిమీద ఒకటి పందెమొడ్డాయి. అగ్రిప్పా : ఆయనవలె ఒక విశిష్టాత్మ నడిపించిన వ్యక్తి సామాన్యంగా కన్పింపడు. అందుకని ఓ దేవతలారా! మీరు మమ్మల్ని మానవులనుగా నిల్పటానికి కొన్ని లోపాలను మాకు ప్రసాదించండి. సీజర్ ఎంతగా చలించి పోతున్నాడో పరికించు! మెకన్నాస్ : అంతటి విశాలమైన అద్దాన్ని అతనిముందు నిలిపినపుడు సీజర్ తన రూపాన్ని తాను తప్పక చూచుకొని తీరాలి. సీజర్ : ఓ ఆంటోనీ! ఇది జరిగేదాకా నిన్ను వెన్నాడాను. శారీరకవ్యాధికి కొంత ప్రయోగం ప్రయోజనకారి అయినట్లుగా నా రాజకీయ సంక్షేమానికి నీ మరణం సహాయకారి అయింది. నీ అస్తమయాన్ని నేనో, నా అస్తమయాన్ని నీవో చూడటం అత్యావశ్యకమని విధి నిర్ణయం. ప్రపంచమనే మందూరాలో మనమిర్వురం కలిసి వసించలేమని విశదమైంది. అయితే నా హృదయరక్తంవలె అమూల్యమైన కన్నీటిని విడుస్తూ, ఆంటోనీ, నీ మరణానికి నేను దుఃఖించకుండా ఉండలేను. నీవు నాకు ఆప్తుడవు. సమస్త మహత్తర లక్ష్యాలలోనూ సహవ్రతుడవు. సామ్రాజ్యంలో సహభాగస్వామివి. మిత్రుడవు. సమరాంగణంలో నాకు సమర్థుడవు. నా శరీర బాహువువు. నిఖిలభావోద్వేగాలకు జన్మభూమియైన నా హృదయానికి హృదయానివి. సర్వ విషయాల్లో నీవు నాతో సమానుడవు. లక్ష్యాల విషయంలో మనకు పొత్తు కుదరదని నిర్ణయించుకొన్న మన అదృష్టం నా చేతనే ఇలా మనలో ఒకరు వినాశాన్ని పొందటమనే క్షుద్రస్థితిని అంగీకరించి వ్యవహరించకుండా చేయవలసి ఉంది. - ప్రియమిత్రులారా! 288 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 వినండి. ఇప్పుడు కాదులే... మరో సమయంలో ఇంకా మీకు ఎంతో చెప్పవలసి ఉంది. ఈజిప్టు దేశీయుడొకడు ప్రవేశిస్తాడు. ఈతడు వచ్చిన పనిని చూపులే చెప్పక చెపుతున్నవి. అయినా, అతడు చెప్పవలసిందేమో నేను వింటాను. ఎక్కడి నుంచి వచ్చావు? ఈజిప్టు దేశీయుడు : నేనొక దీనుడైన ఈజిప్టు దేశీయుణ్ణి. మా రాజ్ఞి తనకు సర్వస్వంగా మిగిలిన సమాధి నిర్మాణానికే పరిమిత అయిపోయి తన్ను తానే నిర్బంధించుకొన్నది. ఆమెను గూర్చిన మీ ఉద్దేశాలేమిటో తెలియజేస్తే వాటికి తగ్గట్టుగా క్రమశిక్షనొంది దిద్దుకోటానికి వేచి ఉంది. సీజర్ : చిత్తోల్లాసాన్ని చెరుచుకోవద్దని మాకుగా ఆజ్ఞాపించు. అనతికాలంలోనే మా దూతవల్ల ఎంతో గౌరవోపేతంగానూ, కరుణాన్వితంగానూ మేము ఆమె యెడ వర్తింపదలచామో ఆమె వినగలుగుతుంది. జీవిత పర్యంతం సీజర్ ఎన్నడూ అనుదాత్తుడుగా ఉండజాలడు. ఈజిప్టు దేశీయుడు : అయితే, దేవతలు మీకు చిరకాలజీవితాన్ని ప్రసాదింతురుగాక! (నిష్క్రమిస్తాడు) సీజర్ : ప్రొక్యులియస్, ఇలారా! అక్కడికి వెళ్ళు. ఏ అవమానాన్నీ ఆమెకు కల్పించటానికి మేము ఉద్దేశించటం లేదని చెప్పు. ఆమె దుఃఖాన్ని శమింపజేయటం కోసం అవసరమైన అఖిలాన్నీ జరిగిస్తామని మాట ఇచ్చిరా. లేకపోతే ఉదారహృదయ ఆమె ఏ ఆత్మహత్యో చేసుకొని మన ఉద్దేశాన్నే భగ్నం చెయ్యవచ్చు. ఆమెను రోములో నివసించేటట్లు చేస్తే మన విజయానికి నిత్యప్రతిష్ఠ. వెళ్లు. నీ చేతనైనంత వేగంగా, తిరిగివచ్చి ఆమె ఏమన్నదీ, ఎట్టిస్థితిలో ఉన్నదీ తెలియజెయ్! ప్రొక్యులియస్ సీజర్ మహాశయా! తామాజ్ఞాపించినట్లే.

(నిష్క్రమిస్తాడు) సీజర్ : గాల్లస్! నీవు అతనివెంట వెళ్లు. (గాల్లస్ నిష్క్రమిస్తాడు) దోలబెల్లా ఎక్కడ? అందరూ దోలబెల్లా! సీజర్ : వద్దు, అతణ్ణి వదిలేయండి. అతడికి నిర్దేశించిన పని ఏమిటో జ్ఞప్తికి వచ్చింది. సమయానికాతడు కార్యనిర్వహణకోసం సంసిద్ధుడయ్యే ఉంటాడు. నా వెంట శిబిరానికి ఆంటోని - క్లియోపాత్రా - 289 రండి! అక్కడ నేను మీకు యుద్ధానికి ఎంతటి అయిష్టంతో దిగవలసివచ్చిందో చూపిస్తాను. అతడికి వ్రాసేటప్పుడు నేను ఎంత ఉదాత్తంగానూ, సమంజసంగానూ వ్యవహరించానో కూడా మీకు చూపిస్తాను. నాతో రండి. మా ఇరువురి మధ్య నడచిన ఉత్తరప్రత్యుత్తరాలను చూద్దురుగాని రండి. (నిష్క్రమిస్తారు) రెండవ దృశ్యం అలెగ్జాండ్రియా సమాధి నిర్మాణంలో ఒక కక్ష్య. క్లియోపాత్రా, ఛార్మియస్, ఐరాస్ ప్రవేశిస్తారు. క్లియోపాత్రా : ఈ నా దైన్యస్థితి నవజీవితానికి నాందిగా పరిణమిస్తున్నది. కనుక చింతపడను. 'సీజర్ పదవి'ని పొంది సమ్రాట్టు కావటం సర్వసామాన్య విషయం. అదృష్టానికి సీజర్ దైవతం కాదు. ఆమెకు సేవకుడు. ఆమెకు ఆజ్ఞానువర్తి, సంఘటనల నరికట్టేదీ, పరివర్తనను స్తంభింపజేసేదీ, నిరంతర నిద్రాముద్రితమైందీ, జీవితదాయిని అయిన ఆహారాన్ని రుచి చూడనిదీ, సీజర్ కెలాగో, అలాగే ఒక భిక్షుకుడికి కూడా దాది అయినదీ, సమస్తకృత్యాలనూ అంతమొందించే ఆకార్యాన్ని ఆచరించటం ఎంతో ఘనమైన విషయం. ప్రొక్యూలియస్, గాల్లస్, సైనికులు సమాధినిర్మాణ ద్వారసీమ దగ్గరికి ప్రవేశిస్తారు. ప్రొక్యూలియస్: ఈజిప్టు రాజ్ఞికి సీజర్ శుభాకాంక్షలు. తానివ్వటానికి మీ కెటువంటి సంధినియమాలు కావాలో పరిశీలించుకోవలసిందని ఆయన సెలవిచ్చారు. క్లియోపాత్రా : నీ నామధేయం? ప్రొక్యూలియస్ : ప్రొక్యూలియస్. క్లియోపాత్రా : నిన్ను గురించి ఆంటోనీ నాకు చెప్పాడు. నిన్ను నమ్మవలసిందని ఆజ్ఞాపించాడు. నమ్మినందువల్ల నాకు కలిగే లాభం ఏమీ లేదు కనుక మోసగించినా నేను లక్ష్యం చెయ్యను. ఒక రాజ్ఞి తనను యాచించాలని మీ యజమాని కోరుకొంటే, ఆమె తన ఔచిత్యాన్ని నిల్పుకోటంకోసం రాజ్యానికి ఏ అణుమాత్రంగానైనా తక్కువైనదాన్ని దేన్నీ యాచించదని నీవు నిష్కర్షగా చెప్పు. తాను జయించిన ఈజిప్టు 290 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 రాజ్యాన్ని ఆయన నా కుమారుడికి ఇవ్వదలచుకొంటే నాకు యాజమాన్యం ఉన్న దాన్ని నాకివ్వటమే ఔతుంది. మోకాళ్లపై నిల్చి నమ్రనై ఆయనకు నమస్కరిస్తాను. ప్రొక్యూలియస్ : ఉత్సాహాన్ని చిక్కపట్టుకోండి. ఒక మహాసమ్రాట్టు మీకు రక్షకులైనారు. ఇక మీరు ఎందుకు జంకవలసిని అగత్యం లేదు. అవసరాలు గలవారెందరున్నా అనుగ్రహించటానికి అనవరతకరుణాన్వితుడైన మా ప్రభువుకు స్వేచ్ఛగా మీ విజ్ఞాపనాన్ని తెలియజేయండి. మనఃపూర్వకంగానూ, పరిపూర్ణంగానూ మీరు వారిమీద ఆధారపడుతున్నానని వారికి నివేదించుకోటానికి అంగీకరించండి. ఇలా జరిగిస్తే, వారి దయాగుణాన్ని అభిలషించి వినమ్రులైతే, అందుకు సహాయాన్ని తానే అర్థించే ఒక విజేతను ఆయనలో మీరు దర్శింపగలుగుతారు. క్లియోపాత్రా : ఐశ్వర్యవంతుడైన ఆయనకు నేను సామంతను కావటాని కిష్టపడతాననీ, అలా చేయటం వల్ల ఆయన ఆర్జించుకొన్న ఘనతను అంగీకరించటమే ఔతున్నదని తలపోస్తున్నాననీ, ఆయనకు తెలియజేయవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను. సమయం నా వల్ల అభిలషించే వినమ్రతను గూర్చిన పాఠాన్ని నేర్చుకొంటాను. ఆయనను ముఖాముఖిగా అమితానందంతో దర్శింపగలుగుతాను. ప్రొక్యులియస్ : ప్రియ ప్రభ్వీ! ఇదంతా ఆయనకు నివేదిస్తాను. మీకీ దైన్యస్థితిని కల్పించిన ఆయనే మీ దుఃస్థితిని గుర్తించి కరుణ వహిస్తున్నాడు. కనుక ఉల్లాసాన్ని వహించండి. గాల్లస్ : ఆమెను ఎంత త్వరగా బందీని చేయటానికి వీలుంటుందో గమనించండి. ఒక వాతాయనంమీద వాల్చిన నిశ్రేణిక మీదుగా ప్రొక్యూలియస్, ఇరువురు రక్షకభటులు సమాధినిర్మాణాన్ని ఆరోహించి లోపలికి దిగి క్లియోపాత్రా వెనుకకు వస్తారు. కొందరు రక్షకభటులు కవాటాలను వివృతం చేస్తారు. ప్రొక్యూలియస్ : (రక్షకభటులతో) సీజర్ మహాశయుడు విచ్చేసేదాకా ఆమెను భద్రంగా కాపాడండి! ఇరోస్ : మహారాజ్జీ! ఛార్మియన్ క్లియోపాత్రా! రాజీ! నిన్ను వారు బందీని చేశారు. క్లియోపాత్రా : (ఛురికను దూస్తూ) ఓ నా హస్తాల్లారా! త్వరపడండి. త్వరపడండి! ఆంటోని - క్లియోపాత్రా 291 ప్రొక్యూలియస్ : ఆగు! మహారాజ్జీ! ఆగు. (అందుకొని కత్తిని తీసివేస్తారు) ఇంతటి దోషాచరణం చేసుకోవటం తగని పని. ఇందువల్ల మిమ్మల్ని రక్షిస్తున్నాము గాని మోసగించటం లేదు. క్లియోపాత్రా : ఏమిటి? మహావేదన నుంచీ కుర్కురాలను కూడా బయటపడవేసే మృత్యువునుంచి కూడానా? ప్రొక్యూలియస్ : రాజ్జీ, క్లియోపాత్రా! మిమ్మల్ని మీరే నాశనం చేసుకోటంతో మా యజమాని తన కరుణారసాన్ని ప్రదర్శించుకోటానికి కలిగిన అవకాశాన్ని దుర్వినియోగం చెయ్యవద్దు. ఆయన ఔదార్యం మీ మరణంవల్ల రంగస్థలం మీదికి వచ్చే అవకాశాన్ని కోల్పోతుంది. అది అద్భుతశక్తితో నటియిస్తే తిలకించే అవకాశాన్ని అఖిలప్రపంచానికీ కల్పించండి. క్లియోపాత్రా : మృత్యువా, నీవెక్కడున్నావు? రా నాకు. దర్శనమివ్వు. వచ్చి బిడ్డలకూ, భిక్షువులకూ తుల్య అయిపోయిన ఈ రాణిని తీసుకుపో! ప్రొక్యూలియస్ : రాజ్జీ! ప్రశాంతచిత్తలు కండి. క్లియోపాత్రా : ఇక నే నా ఆహారాన్ని స్వీకరించను. పానీయాన్ని సేవించను. వేగంగా మరణించడానికి ఉన్మత్తప్రలాపాలు అవసరమైతే నేను నిద్రకూడా పోను. నిలపటానికి సీజర్ ఎట్టి యత్నాలు చేసినా నా ఈ భౌతికశరీరాన్ని నేను వినాశనం చేస్తాను. మీ యజమాని తీర్చే సభలో బద్ధహస్తనై నిలుచోనని తెలుసుకో. మందబుద్ధి ఆ ఆక్టేవియా అలక్ష్యపుచూపులనే శిక్షలను అందుకోను. కరతాళధ్వనులతో గందరగోళం చేస్తూ నన్ను అధిక్షేపించటానికి ఆ రోమకజానపదుల కోసం పైకెత్తి నన్ను ప్రదర్శింపదలచారా? ఇంతకంటే ఈజిప్టులోని ఓ చిన్నగరమైనా నాకు కమనీయమైన సమాధి ఔతుంది. ఇంతకంటే నా నగ్నమృతశరీరాన్ని నైలునదీ పంకప్రదేశం మీద పారేస్తే, అక్కడి నీరమక్షికతతి నిలువెల్లా వికృతరూపం కలిగేటంతవరకూ కుట్టిపెట్టినా నేను ఇష్టపడతాను. ఇంతకంటే నా దేశంలోని మహోన్నత నిర్మాణాలైన పిరమిడ్లనే నా వధ్యభూమిగా చేసి నన్ను శృంఖలాబద్దను కావించినా నేను తృప్తి పడతాను. ప్రొక్యూలియస్ : ఇంతటికే కారణం కనిపించనిదే సీజర్ యెడ మీరీ ఘోరభయభావాన్ని వహించి ఊరికే ఏవేవో ఊహిస్తున్నారు! దోలబెల్లా ప్రవేశిస్తాడు. 292 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 దోలబెల్లా : ప్రొక్యూలియస్! నీవు నిర్వర్తించిన స్వరం నీ యజమానికి చేరింది. ఆ నీ కోసం వార్త పంపించాడు. ఇక ఈ రాజ్ఞి రక్షణభారాన్ని నేను వహిస్తాను. ప్రొక్యూలియస్ : దోలబెల్లా! నాకు చాలా తృప్తిగా ఉంది. అమెయెడ ఎంతో ఉదాత్తంగా వర్తించు. (క్లియోపాత్రాతో) ఏమన్నా చెప్పవలసింది అని మీరు నన్ను నియోగిస్తే నేను దాన్ని సీజర్ మహాశయునికి తెలియజేస్తాను. క్లియోపాత్రా : అయితే నేను మరణిస్తానని చెప్పు. (ప్రొక్యూలియస్, సైనికులు నిష్క్రమిస్తారు) దోలబెల్లా : అత్యుదాత్త సామ్రాజ్ఞి! నన్ను గురించి మీరు విన్నారా? క్లియోపాత్రా : నేను చెప్పలేను. దోలబెల్లా : నిశ్చయంగా మీరు నన్నెరుగుదురు. క్లియోపాత్రా : నేను ఏమి విన్నా లేదా తెలుసుకున్నా పరవాలేదు. పసిపాపలు గాని, పడతులు గాని తమ కలలను గురించి చెపితే నీవు నవ్వుతావు కదూ? దోలబెల్లా : మీరనేది నాకేమీ అర్థం కావటం లేదు. క్లియోపాత్రా : ఆంటోనీ అనే ఒక సమ్రాట్టు ఉన్నట్లు నేను కలగన్నాను. ఓహో! అతడు పోయిన నిద్రవంటి నిద్రను అనుభవిస్తున్న అటువంటి మరోవ్యక్తిని నేను చూడగలిగితే? దోలబెల్లా : అభిలషిస్తే అటువంటి ఇంకో వ్యక్తిని మీరు చూడవచ్చు. క్లియోపాత్రా : అతని ముఖం ఆకాశాన్ని పోలి ఉంటుంది. అందులో సూర్యచంద్రు లిరువురూ సంచారం చేస్తూ క్షుద్రమండలమైన భూమిని భాసింపజేస్తుంటారు. దోలబెల్లా : ఆంటోనీ రాచరికం మూర్తీభవించిన వ్యక్తి. క్లియోపాత్రా : మహాసముద్రపుటొడ్లమీద రెండు పాదాలను నిలిపి అతడు కోలాసస్ 12 గా నిలిచాడు. ఆయన ఉద్యద్భాహువులు ప్రపంచ గోళాకారాన్ని వహిస్తున్నవి. ఆయన కంఠం గోళాల సంగీతం 122 వంటి సంగీతంతో సుసజ్జితమైంది. ఆయన తన కంఠమాధుర్యాన్ని మిత్రులయెడనే ప్రయోగించేవాడు. ప్రపంచాన్ని భయంతో కంపింపజేయ దలచుకొన్నప్పుడు మేఘగంభీరంగా గర్జించేవాడు. ఆయన కరుణాగుణానికి శీతకాలమంటూ లేదు. అందులో చల్లదనంగాని, గడ్డకట్టటంగాని ఆంటోని - క్లియోపాత్రా - 293 పొడకట్టదు. అది ఎల్లవేళలా కోస్తున్నకొద్దీ పంట పండేది. ఆయన విలాసాలన్నీ శఫరజాతి మత్స్యవిలాసాలు! అవి నివసించే నీరంనుంచీ బయటికి దుమికి వెల్లకిలపడి, బోరలు చూపుతూ మళ్ళీ నీటిని వదలనట్లుగానే ఆయన విలాసాలను అనుభవిస్తాడే గాని పరిత్యజించడు. ఎందరో రాజులాయనకు అనుజీవులు. రాజ్యాలు ఆయన జేబులనుంచి రాలే రౌప్యఖండాలుగా ఉండేవి. దోలబెల్లా : రాజ్జీ, క్లియోపాత్రా! క్లియోపాత్రా : నేను కలలో చూచిన ఇటువంటి వ్యక్తి సజీవుడై ఒకప్పుడుండేవాడని గాని, ముందు ఉండవచ్చునని గాని నీవు భావిస్తున్నావా? దోలబెల్లా : మహారాజ్జీ! లేదు. క్లియోపాత్రా : నీవు గొప్ప అబద్ధమాడుతున్నావు. దేవతల శ్రవస్సులను కూడా చేరదగనంతటి అబద్ధమాడుతున్నావు. ఒకవేళ అక్టివ్యక్తి ఉండి ఉన్నా, లేకపోయినా ఆయన ఊహ కూడా సృజింపలేనంతటి అతీతుడు. ఊహ నిర్మింపగల విచిత్రసృష్టులతో పంతమాడగల వస్తుసంపత్తి ప్రకృతికి లేదు. కానీ ఒక ఆంటోనీని భావించి మహత్తర మూర్తినిగా ప్రకృతి రూపొందించటం, ఊహావినిర్మితాలు కేవలం మూల్యరహితాలైన ఛాయామూర్తులని పోల్చి అధిక్షేపించటమే! దోలబెల్లా : రాజ్జీ! వినండి. మీరెంతటి ఘనులో మీకు కలిగిన నష్టం అంతఘనమైంది. ఆ నష్టభారాన్ని మీరు దాని ఆధిక్యానికి అనుగుణమైన రీతిగా భరించటమే మీరు చేయదగ్గ కృత్యం. తిరిగివచ్చి తగిలి మీ దుఃఖం నా హృదయమూలాన్ని చలింపజేసే దుఃఖాన్ని కల్పిస్తున్నది. ఇది అసత్యమైతే ప్రియమార కాంక్షించి కష్టించిన ఘనవిషయంలో నేను విజయం పొందకుందునుగాక! క్లియోపాత్రా : కృతజ్ఞురాలను. సీజర్ నన్నేమి చెయ్యాలని ఉద్దేశించాడో నీకు తెలుసునా? దోలబెల్లా : దాన్ని మీరే తెలుసుకోగోరుతారు. నేనై తెలియజేయటం నాకిష్టంలేదు. క్లియోపాత్రా : నిన్ను ప్రార్థిస్తున్నాను. దయుంచి తెలియజేయ్! దోలబెల్లా : సీజర్ గౌరవనీయుడే ఐనప్పటికీ క్లియోపాత్రా : అయితే, ఆయన తన విజయోత్సవం వెంట నన్ను నడిపిస్తాడన్నమాట! నడిపిస్తాడా? 294 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 దోలబెల్లా : రాజీ! నేనెరుగుదును, తప్పక నడిపిస్తాడు. లోపల సంగీతం, కలకలం. "నిశ్శబ్దం, ఘనుడు సీజర్ వేంచేస్తున్నాడు” అన్న హెచ్చరికలు వినిపిస్తాయి. సీజర్, గాల్లస్, ప్రొక్యూలియస్, మెకన్నాస్, సెల్యూకస్, సీజర్ పరివారంలోని ఇతరులూ ప్రవేశిస్తారు. సీజర్ : ఎవరా ఈజిప్టురాజ్ఞి ? దోలబెల్లా : రాజ్జీ! వీరే చక్రవర్తులు. (క్లియోపాత్రా మోకాళ్ళపై నిల్చి ప్రణమిల్లుతుంది) సీజర్ : లే! నీవు ప్రణామం చేయనవసరం లేదు. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. లే. ఈజిప్టు రాజీ లే! క్లియోపాత్రా : మీ ముందిలా ప్రణమిల్లవలసిందని దేవతలు నన్ను కోరుతున్నారు. నాకు యజమానులు, ప్రభువులూ అయిన మీ యెడ నేను నమ్రభావాన్ని ప్రకటించి తీరవలసిందే. సీజర్ : నీకు మేమేదో ఆపదను కల్పిస్తామని భావించవద్దు. నీవు మాకు కల్పించిన గాయాలు శరీరవిలిఖితాలై కన్పిస్తున్నా, వాటిని మేము సమయం చేసిన చేష్టలని సరిపెట్టుకొంటాము. క్లియోపాత్రా : వసుధైకాధిపతీ! నేను కల్పించిన కారణం నిందకు పరిపూర్ణంగా దూరమైనదని నేను నిరూపించలేను. నా స్త్రీ జాతికెట్టి దోషాలు కళంకాన్ని ఆపాదించగలవో, అట్టి లోపాలు పూర్వం నాలో ఉన్నవని నేనంగీకరించి తీరుతాను. సీజర్ : క్లియోపాత్రా! నేను వాటి విషయంలో పట్టుపట్టను. మరచిపోతానని వాగ్దానం చేస్తున్నాను. నిన్ను గురించిన నా ఉద్దేశానికి నీవు అనుగుణంగా వర్తిస్తే, అవి నీ యెడ మహోదారాలై ఉంటాయి. ఇటువంటి పరివర్తన వల్ల మున్ముందెంతగానో నీకు సంక్షేమలాభం ఉందని నీవు గమనింపగలుగుతావు. ఆత్మహత్యతో ఆంటోనీ చూపిన మార్గాన్ని నీవు అనుసరించి నా యెడ క్రూరంగా ప్రవర్తిస్తే, నేను నీకు జరిగించాలని ఊహిస్తున్న మేళ్లనన్నింటినీ కోల్పోవటమూ, నా ఉద్దేశాలను అనుసరించటంవల్ల కలిగే రక్షణను పోగొట్టుకోవటమే కాకుండా, నీ సంతానాన్నంతటినీ నాచేత సర్వనాశనం చేయించినదానివౌతావు. నేను నిష్క్రమిస్తున్నాను. ఆంటోని - క్లియోపాత్రా 295 క్లియోపాత్రా : ఈ సర్వప్రపంచం మీద మీరు స్వేచ్ఛగా ఎక్కడికైనా పోవచ్చు. మేము మీ భేటాలము విజయచిహ్నాలము. ఎక్కడ నిలువమని మీరు ఆదేశిస్తే అక్కడ ఉండవలసినవాళ్లం. అంతే ప్రభూ! సీజర్ : క్లియోపాత్రాకు సంబంధించిన సర్వవిషయాలల్లో నేను నీ సలహానే పొందుతాను. క్లియోపాత్రా : కొన్ని క్షుద్రవస్తువుల మూల్యాలు ఏమి చేరలేదో గాని - ఇదిగో, ఇది నా ధనం, గృహోపకరణాలు, ఆభరణాలు విలువకట్టిన పట్టిక. సెల్యూకస్ ఎక్కడున్నాడు? సెల్యూకస్ : రాజ్జీ! ఇక్కడున్నాను. క్లియోపాత్రా : ఇతడే నా కోశాధికారి ప్రభూ! ఇతడు నా బదులుగా సర్వాన్నీ మీకు నివేదిస్తాడు. సత్యం చెప్పడో, ఇతడు తన ప్రాణాలను కోల్పోవటం తథ్యం. నేను నా కోసం ఏమీ మిగుల్చుకోలేదు. సెల్యూకస్! సత్యాన్ని నివేదించు. సెల్యూకస్: రాజీ! అసత్యాన్ని నివేదించి శిక్షను చెప్పించుకోటంకంటే నేను పెదవులను కుట్టివేసుకుంటాను. క్లియోపాత్రా : పట్టికలో చేర్చకుండా నేనేమైనా మానివేశానా? సెల్యూకస్ : మీకు తెలియజేసినంత సంపత్తిని విలుచుకోటానికి తగినంతగా దాచారు. సీజర్ : క్లియోపాత్రా! నీవేమీ కళవళపడకు. నీవు మంచి వివేకం గల పనిచేశావు. అందుకు నేను అంగీకరిస్తాను. క్లియోపాత్రా : గమనించు! సీజర్ మహాశయా! వైభవానికి అనుచరులు ఎలా లభిస్తారో గమనించు!! అప్పటి నా వారందరూ ఇప్పుడు నీ వారైనారు. ఈ సెల్యూకస్ కృతఘ్నతాభావం నన్ను ఉన్మత్తను చేస్తున్నది. ఓరి బానిసా! అద్దెకుగొన్న ప్రేమ ప్రేమే కాదు. ఏమిటి? నీవా పక్షాన్ని చేరిపోతున్నావా? అవును. పరపక్షానికి వెళ్లిపోతావు. ఇది నిశ్చయం. నీ గ్రుడ్లకు రెక్కలున్నా నేను వాటిని పెరికిస్తాను. ఓరి పారశవా! అంతరాత్మ లేని ద్రోహీ! అతినీచుడా! ఓరి కుక్కురమా! సీజర్ : ఉదారా, రాజ్జీ! ఈతణ్ణి క్షమించవలసిందని నేను నిన్నర్థిస్తున్నాను. క్లియోపాత్రా : సీజర్ మహాశయా! ఇది నాకెంతో గాయాన్ని కల్పించే అవమానం! నేనున్న ఇంతటి దైన్యావస్థలో, దర్శనభాగ్యాన్ని అనుగ్రహించటం కోసం అంతటివాడవైన నీవు నాకడకు దిగివచ్చిన ఈ సమయంలో, ఈ నా సేవకుడు, వీడు, ఈర్ద్యాపరుడై 296 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 మరొక అవమానాన్ని కల్పించటమా? సీజర్ మహాశయా! నేను ఏవో సామాన్యంగా స్నేహితురాండ్రకు ఇచ్చుకొనే విలువలేని బొమ్మల వంటివి కొన్ని, నన్ను గురించిన విషయాలలో మధ్యవర్తిత్వాన్ని వహించటంకోసం లివియా ఆక్టేవియాలకు కాన్కలుగా ఇవ్వదలచుకొన్న కొన్ని, ఆడవాళ్ల వస్తువులను దాచుకొన్నాననుకోండి. నేను పోషించిన వీడు ఇలా వాటిని బయటపెడుతాడా? దేవతలారా! ఇతరాలైన నా దురదృష్టాలకంటే ఇది నన్నెంతో అధికంగా బాధపెడుతున్నది! (సెల్యూకస్తో) వెళ్ళిపో! నిన్ను ప్రార్థిస్తున్నాను. లేకపోతే ఇప్పుడు నేను దీనావస్థలో ఉన్నా నా పూర్వ రాజరికాన్ని కల్పించుకొని నీ యెడ వ్యవహరిస్తాను. నీవు నిజంగా పురుషుడివే అయితే నా మీద నీ కనికరం వహించి ఉండేవాడివి. సీజర్ : సెల్యూకస్! నీవు వెళ్ళిపో! (సెల్యూకస్ నిష్క్రమిస్తాడు) క్లియోపాత్రా : అవనిమీద వసించే అందరికంటే అధికులమైన మనను ఇతరులు చేసే ఇటువంటి పనులవల్ల అపార్థం చేసుకొంటుంటారని ఎంతగానో మనం గ్రహించవలసి ఉంది. పతనాన్ని పొందే వేళల్లో ఇతరులు చేసే కృత్యాలకు మనం బాధ్యత వహించవలసి ఉంటుంది. అందువల్ల మనం దయనీయుల మౌతుంటాము. సీజర్ : క్లియోపాత్రా! విజయప్రాప్తసత్వం 123 వల్ల రావలసిన వస్తుసంభారపట్టికలో నీవు దాచుకొన్నవాటినిగాని, లేదా ఒప్పుకొని చేర్చినవాటినిగాని మేము లెక్కించలేదు. అందువల్ల అవన్నీ నీవే. వాటిని నీ స్వేచ్ఛానుసారంగా ఇచ్చి వేసుకోవచ్చు. నిన్నే బహుమానంగా గెల్చుకొన్న తరువాత, సీజర్ వ్యాపారస్థులమ్ముకొనే వస్తువులను పట్టించుకోడని నమ్ము. అందువల్ల ఉల్లాసాన్ని వహించు. నీ ఊహలనే కారాగారాలను కల్పించుకోకు. ప్రియరాజ్జీ! నీ విషయంలో నేను నీ సలహానే అనుసరించదలిచాను. కనుక నీ అంతటిదాని కిలా చేయటం తగదు. మృష్టాహారాన్ని స్వీకరించు సుఖంగా నిద్రించు. నీకు నిరంతర మిత్రుణ్ణిగా నిలిచిపోవాలని కోరుతున్న నేను నీ యెడ కరుణాశ్రద్ధలను ఎంతగా వహిస్తున్నానో గుర్తించు. ఇక సెలవు తీసుకొంటాను. క్లియోపాత్రా : యజమానీ! ప్రభూ!! సీజర్ : నన్ను అలా సంబోధించవద్దు. నేను నీకు మిత్రుణ్ణి. సెలవు! (సంగీతం. సీజర్ పరివారంతో నిష్క్రమిస్తాడు) ఆంటోని - క్లియోపాత్రా 297 క్లియోపాత్రా : నా యెడ నేను ఉదాత్తంగా వర్తించటాన్ని అడ్డుపెడుతూ ఎన్నో ప్రియవచనాలు చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఛార్మియన్! మాట విని పో - (చెవిలో ఏమో చెబుతుంది) ఇరోస్ : ఉత్తమ ప్రభ్వీ! నీ జీవితాన్ని అంతమొందించుకో. కాంతిగల కాలం వెళ్ళిపోయింది. ఇక మనకు రాబోయేవి కాళరాత్రులే! క్లియోపాత్రా : మళ్ళీ అతిత్వరితంగా వెళ్లు. ఇదివరకే ఆజ్ఞాపించాను. త్వరగా సిద్ధం చేసుకొని తీసుకోరావాలి. ఛార్మియన్ : ప్రభ్వీ! తప్పక తెస్తాను. దోలబెల్లా : రాజ్ఞి ఎక్కడ? దోలబెల్లా తిరిగి ప్రవేశిస్తాడు. ఛార్మియన్ : అదుగో! చూడవచ్చు. క్లియోపాత్రా : దోలబెల్లా! (నిష్క్రమిస్తుంది) దోలబెల్లా : మీ ఆజ్ఞలను పాలిస్తానని ప్రతిన చేసిన రీతిని బట్టి, ప్రభ్వీ! మీ మీద నాకు గల ప్రేమ మతవిశ్వాసమై దాన్ని అనుసరించి జేయటాన్ని బట్టీ ఈ విషయాన్ని మీకు నివేదిస్తున్నాను. సీజర్ మహాశయుడు మూడు దినాల్లో సిరియాగుండా ప్రయాణం చేయ నిశ్చయించాడు. మిమ్మల్నీ, మీ సంతానాన్నీ ముందుగానే రోముకు పంపించదలిచాడు. ఈ వార్తను మీరు ఘనప్రయోజనాన్ని కల్గించేదానినిగా చేసుకోండి. నేను మీకు ఉల్లాసాన్ని కల్పించేదాన్ని, ప్రతిన చేసినదాన్నీ చేసినవాడినౌతున్నాను. క్లియోపాత్రా : దోలబెల్లా! నేను నీకు ఋణపడుతున్నాను. దోలబెల్లా : రాజ్జీ! నేను నిరంతరం మీ సేవకుడిగానే ఉండిపోతున్నాను. రాజ్జీ! నేను సీజర్కు పారిపార్శ్వకుడినై వర్తించాలి. (దోలబెల్లా నిష్క్రమిస్తాడు) క్లియోపాత్రా : శుభమగుగాక! ఇవే ప్రణామాలు! ఐరాస్! నీ అభిప్రాయ మేమిటి? నాలాగే నిన్ను కూడా ఈజిప్టునుంచి పట్టుకువచ్చిన ఒక పుత్తలికనుగా ప్రదర్శిస్తారని 298 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 భావిస్తున్నాను. చమురు చొక్కాలు తొడిగి, చేత మానదండాలు, సుత్తెలు పుచ్చుకొని నిల్చే కర్మకారులు మనను ప్రజలకు కన్పించేటందుకుగా పైకెత్తి చూపిస్తారు. వారి దుర్గంధనిశ్వాసాలలోనూ, నీచాహారదుర్వాసనలోనూ మనం మునిగి మాసిపోయి, వారి నీచుగాలిని పీల్చవలసిందే! ఐరాస్ : దేవతలు మనకిట్టి దుఃస్థితిని తప్పింతురుగాక! 124 క్లియోపాత్రా : అవును ఐరాస్. ఇది సుసత్యం. రోమన్ న్యాయాధిపతుల పరివారం' మనను ఈటిముండలను పట్టుకొన్నట్లు పట్టుకొంటారు. మనమీద వెగటుపాటలు వ్రాసి, కుకవులు వింతగా చదువుతారు. చురుకైన పరిహాసకులు మన కథలను అభినయిస్తారు. అలెగ్జాండ్రియాలోని మన విలాసాలనన్నింటినీ ప్రదర్శిస్తారు. ఆంటోనీ పాత్రను అభినయించేవాడిచేత తప్ప త్రాగించి ప్రవేశపెడతారు. వైభవోన్నతమైన నా పాత్రను కీచుగొంతుకతో 125 ఒక కుర్రవాడు అభినయిస్తుంటే, బాధపడుతూ చూడవలసిన దుఃస్థితి నాకు కలుగుతుంది. ఐరాస్ : అయ్యో! దేవతలారా! ఇదంతా జరిగి తీరవలసిందేనా? క్లియోపాత్రా : తప్పదు. ఇది జరిగి తీరవలసిందే! ఐరాస్ : దీన్ని నేను చూడను! ఇది నిశ్చయం! నా నయనాలకంటే నఖాలు ఎంతో గట్టివి. క్లియోపాత్రా : వారి సన్నాహాలను అపహాస్యం చెయ్యటానికీ, ఉద్దేశాలను తారుమారు చేయటానికీ ఇది తగ్గ మార్గం. ఛార్మియన్ తిరిగి ప్రవేశిస్తుంది. క్లియోపాత్రా : నా నారీలోకమా! నన్ను మహారాజ్ఞినిగా అలంకరించండి. వెళ్లండి. నా దుస్తుల్లో అత్యుత్తమమైన వాటిని వెదికి పట్టుకోరండి. మార్క్ ఆంటోనీని కలుసుకోటానికి నేను మళ్లీ నావమీద పయనింపబోతున్నానన్న భావం నాకు కలుగుతున్నది. ఓసి ఐరాస్! వెళ్లు, ఉదాత్త, ఛార్మియన్! ఇక త్వరలో మనం వ్యవహారాన్ని ముగిద్దాం. ఈ కొద్దిపనిని ముగించానో, నీకు 'డూమ్సు డే' వరకూ సెలవిస్తాను. నా కిరీటాన్నీ, మిగిలిన అన్ని అధికార చిహ్నాలనూ తీసుకో రా! ఈ ధ్వని ఎక్కడినుంచి? (ఐరాస్ నిష్క్రమిస్తుంది. లోపల ధ్వని వినిపిస్తుంది) ఆంటోని - క్లియోపాత్రా రక్షకభటుడు తిరిగి ప్రవేశిస్తాడు 299 రక్షకభటుడు : మహనీయులైన మీ దర్శనంకోసం ఒక గ్రామీణుడు వచ్చాడు. మీకు అత్తిపళ్లను కానుకగా తెచ్చాడు. క్లియోపాత్రా : అతణ్ణి ప్రవేశపెట్టు. (రక్షకభటుడు నిష్క్రమిస్తాడు) ఎంతటి క్షుద్రమైన సాధనం ఒక మహత్తరకృత్యాన్ని నిర్వహింపగలుగుతున్నది! అతడు నాకు స్వాతంత్ర్యాన్ని కొనివచ్చాడు. నేను స్థిరనిర్ణయం చేసుకొన్నాను. ఇక నాలో స్త్రీత్వమనేది అణుమాత్రమైనా లేదు. ఆపాదమస్తకం నేను శిలనైనాను. చలనశీలంగల చంద్రదైవతాన్ని ఇక నా అదృష్టానికి సంరక్షకురాలినిగా నేను అంగీకరింపలేను. రక్షకభటుడు, బుట్టను తెచ్చే ఒక గ్రామీణుడితో తిరిగి ప్రవేశిస్తాడు. రక్షకభటుడు : అతడు ఇడుగో. క్లియోపాత్రా : నీవు వెళ్ళిపో. అతణ్ణి ఇక్కడ ఉండనీ. (రక్షకభటుడు నిష్క్రమిస్తాడు) బాధపెట్టకుండా చంపే ఆ నైలునదీకీటకం నీ దగ్గిరుందా? గ్రామీణుడు : నిజంగా నా దగ్గిర ఉంది. దాని కాటు తీవ్రమైంది. కనుక దాన్ని మీరు ముట్టుకోటానికి నేనిష్టపడను. దాని కాటువల్ల దెబ్బతిన్నవారు తిరిగీ అరుదుగ బ్రతకనూ వచ్చు. బ్రతకకపోనూ పోవచ్చు. క్లియోపాత్రా : దాని కాటువల్ల చనిపోయినవారు నీకెవరైనా గుర్తున్నారా? స్త్రీ గ్రామీణుడు : లేకేం. ఆడా, మొగా చాలామంది జ్ఞప్తికున్నారు. నిన్నననే ఒకళ్లను గురించి విన్నాను. ఆమె సత్యసంధురాలు. కొద్దిగా అబద్ధమాడింది. సత్యం కోరినప్పుడు తప్ప అలా అబద్ధమాడకూడదుగా మరి! దాని కాటువల్ల ఆమె ఎలా మరణించిందీ, ఆమె ఎంత బాధను అనుభవించిందీ, - అంతా నాకు జ్ఞప్తికుంది. అంతే కాదు. ఆమె ఆ పురుగుకు మంచి యోగ్యతాపత్ర మిచ్చింది కూడాను. వారు చెప్పేది అంతా నమ్మేవాణ్ణి. అది చేసేదానిలో సగం చేసినా బ్రతికించటం కష్టం. కానీ ఈ పురుగు చాలా నిశ్చయమైనదనీ, నిర్మలమైనదనీ - పవిత్రమైన పురుగు అనీ.... క్లియోపాత్రా : ఇక వెళ్ళిపో! నీకు శుభమగుగాక! గ్రామీణుడు : (బుట్టను క్రింద పెడుతూ) దీనివల్ల మీకు చాలా ఉల్లాసం కలుగుతుందనుకొంటాను. 300 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 క్లియోపాత్రా : శుభమగుగాక! వెళ్లు! గ్రామీణుడు : చూడండి. ఈ పురుగు తన స్వభావానికి అనుగుణంగానే వర్తిస్తుంది. క్లియోపాత్రా : నిజం. నీకు శుభం! గ్రామీణుడు : చూడండి. చాలా ప్రాజ్ఞులైనవారి పాలనలో ఉంటే తప్ప ఈ పురుగును నమ్మటానికి వీల్లేదు. ఎందువల్లనంటారా, దీనిలో సహజమైన మంచితనం లేదు. క్లియోపాత్రా : నీవేమి ఆదుర్దాపడకు. అగత్యం లేదు. కడు శ్రద్ధ వహిస్తాను. గ్రామీణుడు : మంచిది. దయుంచి దానికేమీ పెట్టవద్దు. అది అలా తిండి పెట్టదగ్గది కాదు. క్లియోపాత్రా : అయితే అది మరి నన్ను తింటుందా? గ్రామీణుడు : నన్నొక వెర్రివాడినని అనుకోకండి. స్త్రీని భూతమే తిననప్పుడు, పురుగెందుకు తింటుంది? భూతం ఆమెను అలంకరించకపోతే స్త్రీ దేవతలకు భోగ్యం కాదగ్గది. కానీ ఈ భూతాలు దేవతలకు స్త్రీలను కల్పించటంలో వారికెంతో కీడు కల్గిస్తున్నారు. వారు సృజించే ప్రతి పదిమందిలోనూ అయిదుగురిని చెడకొడుతారు. క్లియోపాత్రా : మంచిది. వెళ్ళిపో. నీకు శుభమగుగాక! గ్రామీణుడు : మీరు కోరుకున్న పురుగు చిక్కిందనుకొంటాను. దీనివల్ల మీకు ఆనందం కలుగుగాక! (నిష్క్రమిస్తాడు) దుస్తులు, కిరీటం తీసుకుని ఐరాస్ ప్రవేశిస్తుంది. క్లియోపాత్రా : నా దుస్తులతో నన్ను అలంకరించు. కిరీటాన్ని అమర్చు. దివ్యత్వాకాంక్షలు నాలో విజృంభిస్తున్నాయి. ఇక క్షణకాలమైనా ఈజిప్టు ద్రాక్షాసావంతో నా మోవిని శీతలం చెయ్యను. ఉదాత్త! ఐరాస్!! త్వరపడు. సిద్ధపడు. ఆంటోనీ నన్ను పిలుస్తున్నట్లు తోస్తున్నది. ఈ నా ఉదాత్తకృత్యాన్ని స్తుతించటం కోసం ఆయన తిరిగి లేచి వస్తున్నట్లు కన్పిస్తున్నాడు. దేవతలు తరువాత తాము ప్రకటించే క్రోధాన్ని కప్పిపుచ్చుకొనేటందుకు ప్రసాదించిన సీజర్ మహైశ్వర్యాన్ని, ఆయన పరిహసిస్తున్నట్లు నాకు విన్పిస్తున్నది. ప్రణయవతీ! నేను వస్తున్నాను. నీ పత్నినని పిలవబడటానికి తగ్గ యోగ్యత నాకున్నదని నా ధైర్యం నిరూపించుగాక! నాలోని ఇతరభూతాలను నేను అల్పప్రాణులకు ఇచ్చివేశాను. ఆంటోని - క్లియోపాత్రా 301 కనుక నేను కేవలం ఆకాశాన్ని, తేజాన్ని అందువల్ల నేను పరలోకంలో దివ్యత్వాన్ని అనుభవింపబోతున్నాను. ఛార్మియన్! నా అలంకరణ పూర్తి అయిందా? రా. నా పెదవులిచ్చే తుది వెచ్చనిముద్దు పుచ్చుకో. ఇదే నా వీడ్కోలు! కరుణాగుణా! అతిదీర్ఘమైన వీడ్కోలు. (వారిని ముద్దెట్టుకొంటుంది. ఐరాస్ క్రిందపడి మరణిస్తుంది.) ఆ కీటవిషం నా పెదవుల్లో ఉందా? నీకు మరణాన్ని కల్పించిందా? నీవు మానవజీవితం నుంచి ఇంత ప్రశాంతంగా విడివడిపోగలిగితే 'ప్రియుని వ్యథ' లాగా బాధపెడుతున్నా కాంక్షింపతగ్గది. నీవు ఇంత ప్రశాంతంగా శయనింపగలిగానా? ఈ రీతిగా నీవు అదృశ్యవు కాగలిగితే, మరణాన్ని గురించి అంతటి గొడవ అనవసరమని ప్రపంచానికి ప్రకటించవచ్చు.! ఛార్మియన్ : మా మరణాలకు దేవతలు కూడా దుఃఖిస్తున్నారని చెప్పటం కోసం ఓ సజలమేఘమా! కుంభవృష్టిగా నీవు కరిగిపో! క్లియోపాత్రా : ఇది నా నీచత్వాన్ని నిరూపిస్తున్నది. అలంకరించుకొని సంసిద్ధంగా ఉన్న ఆంటోనీని ఇది ముందుగా కలుసుకొంటే, ఆయన నన్ను గురించి ప్రశ్నించి నేను స్వర్గానికి వెళ్లగానే నాకు దక్కించవలసిన ముద్దు దీనికిచ్చేస్తాడు. ఓ భయంకరకీటమా! రా! నన్ను అంతమొందించు. (వక్షాన్ని అర్పిస్తూ కీటకంతో) నీ నిశితదంష్ట్రలతో ఈ నా జీవితక్లిష్టబంధాన్ని కొరికివెయ్! ఓసి విషపుతుట్టా! కోపం తెచ్చుకో! నా జీవితానికి పరిసమాప్తిని కలిగించే నీవు మాట్లాడిగలిగి ఉన్నట్లయితే ఎంత బాగుండేది! ఓహో! 'నీకు ప్రాజ్ఞతగాని నీతిగాని లేదని సీజరును నీవు నిందిస్తుంటే వీనులార వినగలిగేదాన్ని. ఛార్మియన్ : అయ్యో! ఓ ప్రాక్తారా! క్లియోపాత్రా : ఇస్! నిశ్శబ్దం. కనిపించటం లేదూ? చనుబాలు త్రాగుతూ నాబిడ్డ తాను నిద్రించటానికి ప్రతిగా దాదినైన నన్నే నిద్రపుచ్చుతున్నది. ఛార్మియన్ : ఓ నా హృదయమా! ఇంకా నీవు బ్రద్దలు కావేం? క్లియోపాత్రా : అంజనంలా అమృతప్రాయమై, మారుతంలా మెత్తనై, మృదు - ఆంటోనీ! త్వరలో నిన్ను కలుసుకొంటాను. నీకు కూడా నా స్తన్యమిస్తాను. (మరొక కీటాన్ని చేతికి కరిపించుకొంటూ) ఏమిటి?.... నేను... ఉండాలా? (శయ్యమీద వ్రాలి మరణిస్తుంది) 302 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఛార్మియన్ : ఈ క్షుద్రప్రపంచంలో... ఉండాలా? లేదు. నీకు శుభమగుగాక! సాటిలేని కన్య ఇప్పుడు నీదైంది. ఓ మృత్యువా! ఇక గర్వించి నీ ఘనతను చెప్పుకోవచ్చు. పక్షులు ఒంటిమీది మెత్తని రెక్కల్లా మృదువైన కనురెప్పల్లారా! ఇక నిరంతరం మీరు మూసుకోపొండి. ఈమెకంటే రాచరికం గల కన్నులేవీ ఫొయిబస్ స్వర్ణకిరణకాంతులను ముందు చూడబోవు. నీ కిరీటం చెదరింది. సరిదిద్ది తరువాత క్రీడిస్తాను. వేగంతో చొచ్చుకొని వస్తూ భటులు ప్రవేశిస్తారు ప్రథమ భటుడు : రాజ్జి ఎక్కడ? ఛార్మియన్ : నింపాదిగా మాట్లాడు ఆమె మేల్కొంటుంది. ప్రథమ భటుడు : మమ్మల్ని సీజర్ పంపించారు. ఛార్మియన్ : నింపాదిగా ఒక భటుణ్ణి (ఒక సర్పాన్ని కరిపించుకొంటుంది) ఓహో! త్వరగా రా! నన్ను కూడా పంపించు! కొంతగా నీ కాటు చవి నాకు తెలుస్తున్నది. ప్రథమ భటుడు : హేయ్ ! క్లియోపాత్రా కడకు చేరండి! ఇదేమీ సవ్యంగా లేదు. మీరు సీజర్ను మోసగించారు. ద్వితీయభటుడు : సీజర్ పంపించిన దోలబెల్లా అక్కడ ఉన్నాడు అతణ్ణి పిలవండి. ప్రథమ భటుడు : ఏం పని చేశారు? ఛార్మియన్! నీవు చేసిన పని మంచిదేనా? ఛార్మియన్ : మంచిపనే చేశాను. ఉత్తమరాజవంశంలో జన్మించిన రాకుమారికి యోగ్యమైన పని చేశాను. అవును సైనికుడా! మంచిపని చేశాను. దోలబెల్లా తిరిగి ప్రవేశిస్తాడు. దోలబెల్లా : ఇక్కడ ఏమి జరుగుతున్నదేమిటి? ద్వితీయభటుడు : అందరూ మరణించారు. దోలబెల్లా : సీజర్ మహాశయా! ఈ మృతశరీరదృశ్యాలు మీ పూర్వోహలన్నీ సత్యాలని నిరూపించాయి. నిష్ఠతో నివారించటానికి యత్నించిన కృత్యాలు నిర్వర్తితాలై పోవటాన్ని తిలకించటానికి తామే స్వయంగా విచ్చేస్తున్నారు. లోపల 'మార్గం', 'సీజర్ మహాశయునికి మార్గం' అన్న కేకలు వినిపిస్తుంటాయి. సైనిక విన్యాసంతో వెంటవస్తున్న పరివారంతో సీజర్ తిరిగి ప్రవేశిస్తాడు. ఆంటోని - క్లియోపాత్రా 303 దోలబెల్లా : ప్రభూ! మీరు సత్యంగా ప్రవక్తలు. ఇది జరుగుతుంది అని శంకించి, జంకి, సెలవిచ్చింది సర్వం జరిగిపోయింది. సీజర్ : నిరంతర సాహసిక! ఈమె తన జీవితాంత్యంలో మహాసాహసాన్ని ప్రదర్శించింది. మన ఉద్దేశాలను ఊహించింది. రాచపుట్టువు కనుక ప్రతివిషయంలోనూ ఇచ్ఛానుసారంగా వర్తించే హక్కు ఆమెకు ఉన్నందువల్ల, ఆమె తనకు తోచిన మార్గాన్ని అనుసరించింది. వారు ఎలా మరణింపగలిగారు? ఎక్కడా రక్తస్రావం కనిపించటం లేదే! దోలబెల్లా : వీరి దగ్గరికి వచ్చిన చివరివాడెవడు? ప్రథమభటుడు : ఒక సామాన్యగ్రామీణుడు. ఆమెకు అత్తిపళ్లు తెచ్చాడు. ఇది అతని బుట్ట. సీజర్ : అయితే వాడు వీరికి విషం పెట్టాడన్నమాట! ప్రథమభటుడు : ఈ ఛార్మియన్ ఇంతదాకా బ్రతికే ఉంది. నిలువబడే మాటాడింది కూడాను. మరణించిన ఆమె యజమానురాలి శిరస్సుమీద చెదిరిన కిరీటాన్ని చక్కదిద్దింది. నిలువబడ్డప్పుడు గజగజలాడింది. హఠాత్తుగా పడి ఒరిగిపోయింది. సీజర్ : ఓహో! ఇది ఎంత ఉదాత్తమైన దౌర్బల్యం! విషం తిన్నట్లయితే అది పొంగుగా శరీరంమీద కన్పించేది. ఓహో! ఈమె తన సౌందర్య సమ్మోహనవిద్యతో మరో ఆంటోనీని నిబద్ధుణ్ణి చేయటానికో అన్నట్లు నిద్రపోతున్నది. దోలబెల్లా : ఇదిగో. ఆమె వక్షంమీద ఒక రక్తపు జాలు కన్పిస్తున్నది. కొంత ఉబ్బు కూడా గోచరిస్తున్నది. అటువంటి పొంగే ఆమె హస్తంమీదనూ ఉంది. ప్రథమ భటుడు : ఇది పురుగు చేష్ట, నైలనదీభూగర్భకుల్యల్లోని 126 సర్పాలమీద ఉన్నట్లుగా ఈ అత్తిఆకుల మీద పంకకళంకాలు కన్పిస్తున్నవి. సీజర్ : బహుశః ఆమె పురుగు కాటు వల్లనే మరణించి ఉండవచ్చు. ఆమె అగదంకారులచేత సులభమరణాన్ని అన్వేషించటానికి అనేకపరిశోధనలు చేయించిందని విన్నవించారు. ఆమె శయ్యను ఎత్తుకోండి. ఆమె నారీగణాన్ని ఈ నిర్మాణం నుంచీ మోసుకోరండి. ఆమె ఆంటోనీతోనే ఆమెను సమాధి చేయిస్తాను. ఇట్టి జంటను 304 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 పొందిన సమాధి ఏదీ ఇలమీద ఉండబోదు. ఇటువంటి బలవత్కృత్యాలు, వాటికి కారకులైన వారికి వ్యతను కలిగింపకపోవు. ఇట్టి బాధాకథను కల్పించటం కారకులకు గౌరవాన్ని కలిగించటంకంటే అధికంగా ఇతరులను దుఃఖితులను చేసి, బాధితులయెడ బహుళతరమైన కరుణను కట్టబెడుతుంది. వీరి అంత్యక్రియల్లో మన సైన్యం శాంతప్రదర్శనలను జరుపుతూ పాల్గొంటుంది. తరువాత రోముకు మనం పయనిస్తాం. రా! డోలబెల్లా! ఈ అంత్యక్రియలు అత్యుత్తమ శోభావిభవపరంపరలతో సాగిపొయ్యేటట్లు చూడు. (నిష్క్రమిస్తాడు) ఆంటోని - క్లియోపాత్రా 305 1. ส 3. 5. 6. అనుబంధం ప్రథమాంకం కపిలవర్ణ : క్లియోపాత్రా, ఈమె 'దివిజ - చక్రవర్తి' అయిన అలెగ్జాండరు వంశంలో జన్మించింది. అందువల్ల ఈజిప్షియన్ కాదు గ్రీకు వనిత. ఈమె పారంపర్యంగా వస్తున్న క్లియోపాత్రానామాన్ని ధరించిన 7వ టొలమీ రాజ్ఞి. కానీ చరిత్రలో క్లియోపాత్రా అన్న నామధేయం ఈమెకే రూఢమైంది. మార్క్ ఆంటోనీ ఈమెనే 'పురానైల్ నాగిని' అని వ్యవహరించాడు. జన్మతః గ్రీకుజాతి వనిత అయిన ఈమెను, షేక్స్పియర్ ఈజిప్టు వనితగా వర్ణించాడు. తరువాతి కవులు, చిత్రకారులు ఈమెను ఆఫ్రికావనితగానే వ్యవహరించారు. టెనిసస్ కవిమాత్రం ఈ రాజ్ఞిని కపిలగండభాగనుగాను, నీలనేత్రనుగాను పేర్కొన్నాడు. జిప్సీ : ఇది ఈజిప్షియన్ శబ్దానికి భ్రష్టరూపం. జిప్సీలు తొలుతగా భారతదేశంనుంచి పాశ్చాత్యలోకంలో ప్రవేశించారుట. అంకురించే శ్మశ్రువులు గల యువకుడు - కథాకాలంనాటికి (క్రీ.పూ.41) ఆక్టేవియస్ సీజర్ వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు. అతని జన్మవత్సరం క్రీ.పూ.63. టైబర్ నది : ఇటలీలోని ఈ నదీతీరాననే రోము మహానగరం నిర్మితమైంది. ఏబది ఏండ్ల వయసులో - ఏబది సంవత్సరాలు గడచినతరువాత సంతానం కలుగుతుందని చెప్పటంకంటే, స్త్రీని గురించిన మహా గొప్ప స్తోత్రపాఠం ఉద జూరీ హీరాడ్ : ఇతడు ప్రాచీనాలైన ఆంగ్లేయుల అద్భుతరూపకాలలో అతిభయంకరుడూ, డాంబికుడూ అయిన నిరంకుశపరిపాలకుడుగా నిరూపితుడైనాడు. ఇతడు ప్రత్యేకంగా బాలబాలికలను చిత్రవధ చేయటంలో పేరు మ్రోగించాడు. 306 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 7. 8. 9. 10. 11. 10. 13. 14. తండ్రులెవరో తెలియక - అధర్మసంతానం కావటం వల్ల. - నిండి ప్రవహించే నైల్ దరులు నిండి ప్రవహించే నైలు ఒండుమట్టి పెట్టటంవల్ల సస్యానికి లోపం ఉండదు. అంటే విరాన్ పవిత్రగా ఉండజాలదని. తడిచేయి : ఐరాస్ చేయి తడిదనీ, ఫలవంతమైనదనీ ఛార్మియన్ చెప్పటంలో, 'ఆమె కామచపల' అన్న అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నది. ఇసిస్ : ఈజిప్టియనుల దేవతాగణంలో ఒక ముఖ్యురాలు. చంద్రదైవతం. తొలుత ఈమె వారి భూ సస్య సంతానాధి దైవతం. తమ భార్య ఫుల్వియా : ఆంటోనీ క్రీ.పూ. 48-46 మధ్య కాలంలో ప్రఖ్యాతుడైన క్లోడియస్ విధవ అయిన ఫుల్వియాను వివాహమాడాడు. ఈమె రాజకీయ వ్యవహారాలలో పాల్గొనటం ప్రారంభించిన ప్రథమ రోమకవనిత. భర్త ప్రాచ్యదేశాలలో ఉన్నప్పుడు అతని హక్కులను అన్నింటినీ రోములో ఉండి అతిశ్రద్ధతోనూ, సాహసంతోనూ కాపాడింది. క్రీ.పూ. 42, 41లలో ఆంటోనీ సోదరుడైన లూషియన్తో తో కదనభూమిలో నిల్చి పోరాడింది. తరువాత లూషియస్, ఫుల్వియా ఇరువురూ ఆక్టేవియస్ సీజర్ మీద తిరుగుబాటు చేసి రోమును వశపరచుకొన్నారు. కాని క్రీ.పూ. 40లో ఆక్టేవియన్కు సేనావతి అయిన అగ్రిప్పాకు ఓడి, ముల్వియా బ్రండీషియంద్వారా బిడ్డలతో తూర్పునకు పారిపోవలసి వచ్చింది. లూషియస్ లొంగిపోయాడు. భర్తృతృణీకారభావం వల్లా, రాజకీయాలలో ఆమె పాల్గొనటాన్ని అతడు నిందించటంవల్లా జబ్బుపడి సిక్సన్లో ఫుల్వియా మరణించింది. షేక్స్పియర్ మహాకవినాటకం క్రీ.పూ. 40 మధ్యకాలంలో ఆరంభమౌతున్నది. యూఫ్రెటీస్ - ఆసియాలో ఒక నది. స్టెక్సస్ పాంపే : క్రీ.పూ. 106 - 48లలో సుప్రసిద్ధ రోమకసేనానాయకుడై అనేక మహావిజయాలను చేకొన్న పాంపేఘనుడనే మహావీరుని కుమారుడు. అశ్వజాతి కేశాలలాగా - పూర్వం కంబర్ లాండ్ మొదలైన ప్రాంతాలలో అశ్వక్టేశాన్ని నీళ్ళల్లో పడవేస్తే, అది సర్పంగా మారిపోతుందని ఒక నమ్మకం ఉండేది. ఆంటోని - క్లియోపాత్రా 307 15. 16. 17. 18. మనసార ప్రేమిస్తే - క్లియోపాత్రా ఆంటోనీని మనసార ప్రేమించటం లేదనీ, ప్రేమిస్తుంటే అనుసరింపవలసిన మార్గం ఇది కాదనీ, ఈ మార్గం ఆకర్షించటానికంటే వ్యతిరేకం చేసుకోటానికి పనికివస్తుందనీ ఛార్మియన్ భావం. పరిహృతుడైన పాంపే రోమునించి వచ్చిన కాందిశీకులను దయార్ద్ర హృదయంతో చూడటంవల్ల, సెక్స్టస్ పాంపే అధిక ప్రజానురాగపాత్రు డౌతున్నట్లు ఎప్పియస్ చరిత్రకారుడు. కాచపాత్రిక - ప్రాచీన రోమనులు మిత్రుని శవమృణ్మయపాత్రల్లో వారి మరణవేళ తాము కార్చిన కన్నీటిబుడ్లను ఉంచేవారు. నైల్ : ఈజిప్టును సారవంతం చేసే మహానది. 19. చేపలు పడుతున్నాడు. 20. 21. 22. 23. 3 - ఒకమారు క్లియోపాత్రాతో చేపలు పట్టటానికి వెళ్లి, ఒక్క చేపా పడకపోతే ఆంటోనీ కోపం తెచ్చుకొని, తన ఈతగాళ్లను నీళ్ల లోపలికి వెళ్ళి మునిగిఉండి తన గాలానికి చేపలను తగిలించమని ఆజ్ఞాపించినట్లు - ప్లూటారు. త్రాగుతున్నాడు - క్లియోపాత్రా సౌధం నట, నర్తక, ద్యూతక్రీడారతులతోనూ, గారడీవారితోను, త్రాగుబోతులతోనూ నిండి ఉండేదనీ, ఆమె నిరంతరమూ విలాసోపభోగాలతో తేలి ఆడుతుండేదనీ ప్లూటారు. టోలమీ శయ్య : టోలమీ క్లియోపాత్రా సోదరుడు. ఈజిప్టు రాజవంశంవాళు తమ సోదరులనే వివాహమాడటం ఆచారం. అందువల్ల క్లియోపాత్రాను ఆమె సోదరుడైన టోలమీ కిచ్చి సాంకేతికంగా వివాహం చేశారు. క్లియోపాత్రా శయ్య అందువల్ల ధర్మతః టోలమీ శయ్య ఔతుంది. ఆ అతివకు రాజ్యదానం : ఆంటోనీ రోమనుల అభిప్రాయానికి వ్యతిరేకంగా క్లియోపాత్రాను ఈజిప్టు, సిప్రస్, లిడియా, లోయర్, సిరియాలకు రాష్ట్రాని చేశాడు. అప్పుడు క్లియోపాత్రా చంద్రదేవత అయిన ఇసిస్ దుస్తులు ధరించి, నూతన ఇసిస్ లా ప్రజలను దర్శనమిస్తూ ఉండేదిట - (ప్లూటార్కు). మెనక్రేట్స్, మెనాస్ : ప్రజానురాగాన్ని కోల్పోతున్న ఆక్టేవియస్ సీజర్ కాలంలో, ఈ ఓడదొంగలు ఇటలీ భూభాగంమీదికి ఎన్నో దండయాత్రలు చేసినట్లు చరిత్ర చెపుతున్నది. 308 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 24. 25. మహాభోగివిగా పెరిగినా - ఉత్తమసైనికుని కావశ్యకాలైన సద్గుణాలు సర్వం ఉన్న ఆంటోనీ, నేడు ఎలా కావాలోలుడైనదీ సీజర్ నిరూపిస్తున్నాడు. మాన్ద్రగోరా : ఈ మొక్క కషాయం తాగితే నిద్రపడుతుందిట. దీనిని త్రాగి క్లియోపాత్రా నిద్రించి, ఆంటోనీ వియోగం వల్ల కలిగే బాధనుంచి బయటపడ తలచుకుంటున్నది. 26. అర్ధఅట్లాస్ : అట్లాస్ టిటన్లలో ఒకడు. మారిటేనియాకు రారాజు. ఇతడు పెర్స్యూస్కు ఆతిథ్యమివ్వకపోతే మెడూసా కళ్ళను చూపించి పర్వతంగా మార్చివేశాడు. ఈ పర్వతం ఉత్తరాఫ్రికాలో తూర్పుపడమరల వ్యాపించి ఉందనీ, దానిమీదనే ఆకాశం నిలిచి ఉందనీ, ప్రాచీన పాశ్చాత్యుల భావన. అట్లాస్ తన బాహువులమీద ప్రపంచాన్ని భరిస్తున్నాడని వారి అభిప్రాయం. క్లియోపాత్రా ఆంటోనీని 'అర్ధ - అట్లాస్' అనటంలో అతడూ, సీజరు ప్రపంచాన్ని చెరిసగం పంచుకొన్నారని. ఇట త్రైకూటవీరుల్లో మూడోవాడైన లెపిడసక్కు వ్యక్తిత్వం లేకపోవటంవల్ల, క్లియోపాత్రా అతణ్ణి పూర్తిగా విస్మరించింది. 26A. ఫొయిబస్ ప్రణయ....: ఫొయిబస్ సూర్యదేవత. సూర్యదేవుని క్లియోపాత్రా తన ప్రియుడుగా భావించటం మహామనోజ్ఞమైన ఊహ. కాలకల్పిత గాఢరేఖా.... క్లియోపాత్రాకు ఆంటోనీతో సంబంధం ఏర్పడేటప్పటికి ఆమె వయస్సు ఇరవై మూడు సంవత్సరాలైనట్లు, అప్పుడు ఆమె పూర్ణయౌవనవికాసాన్ని పొందినట్లు ప్లూటార్క్ చరిత్రకారుని పలుకు. కానీ షేక్స్పియర్ మహాకవి ఆ సమయానికి క్లియోపాత్రా వయస్సు చాలా ఎక్కువగా ఉన్నట్లు ఇక్కడ సూచిస్తున్నాడు. - 27. ఘనుడైన పాంపే ఇతడు చరిత్ర ప్రసిద్ధి నొందిన ఘనుడైన పాంపే కాదు అతని కుమారుడు క్నెయస్ పాంపే. తన సౌందర్యాతిశయంతో జూలియస్ సీజర్, పాంపేలను జయింపగలిగిన తాను ఆంటోనీని అవలీలగా కైవసం చేసుకోగలనని ఆశిస్తున్నది. 28. పరుసవేది : క్షుద్రలోహాలను స్వర్ణంగా మార్చగలదని ప్రఖ్యాతి పొందిన, 'తాత్త్విక - శిల' (Philosopher - stone) 29. సీజర్ను - జూలియస్ సీజర్ను . ఆంటోని - క్లియోపాత్రా 309 30. 31. 32. 33. 34. 35. ద్వితీయాంకం ఎపిక్యురస్ - క్రీ.పూ. 342 - 270 ఒక గ్రీకు తత్త్వవేత్త. 'ఎపిక్యురస్' మతానుయాయులు మహోన్నతానందం మంచివల్ల కలుగుతుందని ఎపిక్యురస్ సిద్ధాంతం. కానీ తరువాతి కాలంవారు ఇతడు 'ఇంద్రియలోలత'నే మహానందంగా నిరూపించినట్లు అపార్థం కల్పించి, ప్రచారం చేశారు. అందువల్ల అతడి అనుయాయులంటే ఇంద్రియలోలురనే అర్థం వచ్చింది. ఈజిప్టువిగతభర్తృక : సోదరుణ్ణి వివాహమాడి అతడి మరణం వల్ల విధవ అయిన క్లియోపాత్రాను గురించి ఏహ్యభావాన్ని ప్రకటిస్తూ, పాంపే ఈ పదప్రయోగం చేశాడు. జూపిటర్: రోమన్ దేవతాగణంలో ప్రముఖుడు. గ్రీకుల జూయెస్ వంటివాడు. సం. ద్యౌః పితరుడు. ఈజిప్టు నుంచి రప్పించటానికి - ఫుల్వియా కుటిలబుద్ధి కలది. చిక్కులను కల్పించే స్వభావం గల ఆమె, ఆంటోనీని ఈజిప్టునుంచి రప్పించటానికి ఇటలీలో సీజర్మీద కావాలని తిరుగుబాటు చేసింది. తల్లి వంక చెల్లెలు: ఆక్టేవియా సీజర్కు ఆంకేరియా అనే మరొక తల్లి వల్ల జన్మించిన సోదరి. అతని తల్లి అక్కియా అని ప్లూటార్కు వల్ల తెలుస్తున్నది. దీనినే షేక్స్పియర్ అనుసరించాడు. ఇది చారిత్రికసత్యం కాదు. సీజర్ తండ్రి అయిన ఆక్టేవియస్ రెండవ భార్య అతియా వల్ల సీజర్, ఆక్టేవియా ఇరువురు జన్మించారు. శీలసౌభాగ్యాదులే... చెప్పగలవు: షేక్స్పియర్ మహాకవి ఉత్తమురాలు, ధర్మజ్ఞ అయిన ఆక్టేవియాను పరిహాసపాత్రురాలుగా చిత్రించాడని కొందరి భావం. అది పొరబాటు. గృహ్యజీవితానికి యోగ్యమైన వ్యక్తి అని అగ్రిప్పా, మెకన్నాస్ ఆమెను పొగిడారే గాని, ఇందులో ఆమెను పరిహసించటం ఎక్కడా కన్పించదు. ఆమెయెడ ఈర్ష్య వహించిన క్లియోపాత్రా మాత్రం ఆక్టేవియాను గురించి 'మరుగుజ్జనీ', 'ముద్దమాటలు మాటాడుతుం'దనీ వర్ణించింది. ఆమెచేత ఇలా అనిపించటంలో షేక్స్పియర్ ఔచిత్యాన్నే పాటించాడు. 310 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 36. 37. 38. 39. 40. 41. 42. ఆక్టేవియా మీద ఉన్న అధికారం - ప్రేమగల సోదరుడికి సోదరిపై గల అధికారమన్నమాట. - ఈ మహోదారకృత్యానికి పరిపూర్తిని తాత్కాలికోద్వేగంతో అంటోనీ ఆక్టేవియాను వివాహమాడటం ఉత్తమఫలోపేతమని భావించాడు. ఉద్వేగం తగ్గిన తరువాత ఇది చెరుపు కలిగించేటట్లు అతనికి తోచింది. ఆక్టేవియాను వివాహమాడటం ఆంటోనీ చేసిన గొప్ప పొరపాటు పని. మహాలాభం చేకూరుతుందన్న భ్రాంతిపడి, ఆంటోనీ ఆక్టేవియాను వివాహమాడి సీజర్ చేతుల్లో పడిపోయాడు. గౌరవాన్ని ప్రకటిస్తూ వచ్చాడు - ఫుల్వియా సీజర్మీద తిరగబడి ఇటలీ నుంచి పారిపోయి వచ్చినప్పుడు, సెక్టస్ పాంపే, ఆంటోనీ తల్లికి అతిగౌరవంతో ఆతిథ్యమిచ్చాడు. అందువల్ల లోకం వారిద్దరూ సంధి చేసుకొన్నారని కూడా భావించింది. మైసనం - కాంపేనియా వద్ద నాలికలా సముద్రంలోకి చొచ్చుకొనిపోయి పై నామంతో వ్యవహరింపబడే భూభాగం. సిడ్నస్ నదిమీద సిడ్నస్ నది మౌంట్ టార్సస్ లో పుట్టి, టార్సస్ నగరంమీదుగా ప్రవహిస్తున్నది. ఆంటోనీ క్లియోపాత్రాను సిడ్నస్ నదిమీద కలుసుకోలేదు. ఆమె సమ్మోహనరూపంతో సిడ్నస్ నదిమీద తన నౌకలో ఉండగా, ఆంటోనీ విపణిలో ఉన్నతాసనాన్ని అధిష్ఠించి ఒంటిగా కూర్చొన్నాడు. ఆమె దిగివచ్చి అతణ్ణి రాత్రివిందుకు ఆహ్వానించింది. అందువల్ల ఇక్కడ 'నది మీద' అంటే నదీతీర ప్రాంతం అని అన్వయించుకోవలసి ఉంది. స్థపతి శిల్పించి నిల్పిన వీనస మూర్తి - ఈ చిత్రం సుప్రసిద్ధ గ్రీకుచిత్రకారుడైన ప్రొటొజెనస్ గీచిన వీనస్ అని కొందరు విమర్శకులు, అపెల్లస్ గీచిన 'సాగరోద్భవ అయిన వీనస్' అని కొందరు విమర్శకులు భావిస్తున్నారు. నెరైడ్స్ : జలకన్యలు (అప్సరసలు) మత్స్యకన్యలు - వీరు మెర్మైడ్లు. వీరికీ నెరైడ్స్కు రూపంలో విభేదముంది. నెరైడ్స్ పరిపూర్ణమానవరూపంలో ఉంటారు. మెర్మెయిడ్లు కటిప్రదేశం వరకూ మానవాకారాన్నీ, క్రింద మత్స్యాకారాన్నీ వహిస్తారు. ఆంటోని - క్లియోపాత్రా 311 43. 44. 45. 46. 47. 48. 49. 50. శూన్యతను కల్పించి ఉండవలసింది : ప్రకృతి శూన్యతను గర్హిస్తుందని, రెండు వేలకు పూర్వం గ్రీకులలో సంచారం చేస్తూ తమ తత్త్వాన్ని వ్యాప్తి నొందించిన పెరిపాటటిక్ మతస్థులైన తాత్త్వికుల అభిప్రాయం. జోస్యుడు : ఇతడు ఈజిప్టు నుంచి ఆంటోనీ వెంట రోముకు వచ్చాడు. లావుకాలు : ప్రాచీన సమారిట్లను, చైనీయులు లావుకపిట్టలకు పోటీలు పెట్టి వినోదించేవారని తెలుస్తున్నది. బిల్లియర్డుస్ - ఈ క్రీడ ఆధునికం. దీనిని రోమనుల కాలంలో ఉన్నట్లు చెప్పటం ఔచిత్యం. ఆంటోనీ మరణించాడా? వార్తాహరి తెచ్చిన వార్తను వినటానికి భయపడుతున్న క్లియోపాత్రా అత్యాతురతతో అతణ్ణి చెప్పనీయకపోవటం మానసికవేత్త అయిన షేక్స్పియర్ చేసిన మనోజ్ఞకల్పన. ప్యూరీలా - గ్రీకు పురాణగాథల్లోని క్రోధదేవతలు. వీరు దోషులకు విధించిన శిక్షలను కార్యరూపంలో పెడుతుంటారు. వీరి శరీరాలు కారునలుపుగాను, శిరోజాలు సర్పాన్వితాలుగానూ ఉంటాయి. కన్నుల నుంచి రక్తబిందువులు స్రవిస్తుంటాయి. బంగారాన్ని వర్షిస్తాయి - ప్రాచ్యదేశాల రాజుల పట్టాభిషేక సమయాలలో వారిమీద బంగారు రజనును, పులిముత్యాలను వెదచల్లటం ఆచారం. నార్సిస్సస్ - నదీదైవతమైన సెఫీస్సస్కు, అప్సరస లిరియోప్కు జన్మించిన పుత్రుడు. అందగాడు. ఒక కొలనులో తన ప్రతిబింబాన్ని చూచి ముగ్ధుడై, అది ఆ ప్రదేశంలోని అప్సరస అని భావించి పొందలేక నిరాశపడి, మరణించాడు. దేవతలు అతణ్ణి ఒక పుష్పంగా రూపొందించారు. ఇతని ప్రేమకోసం 'ఇకో' వనదేవత అలమటించి, చివరకు స్వరంతప్ప ఏమీ మిగలకుండా అయిపోయింది. ఈ నిర్దయకు శిక్షగా ఇతడు తన ప్రతిబింబాన్ని తానే ప్రేమించి, వసివాడి, మరణించవలసి వచ్చింది. నిత్యంగా వెళ్ళిపోనీ - ఈ వాక్యాలను క్లియోపాత్రా ఆంటోనీని ఉద్దేశించి పలుకుతున్నది. 312 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 51. 52. 53. 54. 55. 56. 57. 58. 59. గర్గన్ - గార్గన్లు ముగ్గురు అక్కచెల్లెండ్రు. ఫార్సిస్ కేటోల కుమార్తెలు. వీరిలో సుప్రసిద్ద మెడూసా. ఈమె శిరస్సు మహాభయంకరమైంది. దాన్ని చూచిన ప్రతివారూ శిలలుగా మారిపోతారు. మార్స్ : గ్రీకుల యుద్ధదేవత.

ఫిలిప్పీయుద్ధరంగం : మార్క్ ఆంటోనీ ఈ యుద్ధరంగంలోనే బ్రూటస్, కాషియస్లను ఓడించి, సీజర్ హత్యకు ప్రతీకారాన్ని పొందటం జరిగింది. నా జనకుడు : పాంపే తండ్రి ఘనుడైన పాంపే. మొదటి పాలక త్రయకూటమి క్రీ.పూ. 60లో ఏర్పడ్డది. అందులో సభ్యులు జూలియస్ సీజర్, పాంపే, క్రాసస్. క్రీ.పూ. 48లో జూలియస్ సీజర్ పాంపేను థాసల్లీలోని ఫార్సేలియాలో ఓడించి చంపాడు. తరువాత కొలది కాలానికే క్రాసస్ ను అలెగ్జాండ్రియాలో హత్య చేశాడు. బ్రూటస్ : జూలియస్ సీజర్కు మిత్రుడు. రోమక ప్రజాస్వామ్యానికి సీజర్ హత్య అవసరమని భావించి హంతకవర్గనాయకుడై, ఆత్మమిత్రుని హతమార్చిన ఉదాత్తరోమకవ్యక్తి. సభాభవనాన్ని రక్తపంకిలం చేయటం - సీజర్ హత్య నిజానికి రోములోని సభాభవనంలో (కాపిటోల్) జరగలేదు క్యూరియా పాంపేయ్నీలో అతడు నిహతుడైనాడు. జనకుల సౌధాన్ని - ఆంటోనీ ప్రతిఫలమివ్వకుండానే ఘనుడైన పాంపేగృహాన్ని పుచ్చి వేసుకొన్నాడు. అందువల్ల నీవు మోసకారివని ఆంటోనీని, పాంపే కుమారుడైన సెక్స్టస్ పాంపే నిందిస్తున్నాడు. - ఇంతకంటే అధికసంపదను సీజర్ రాజనీతిజ్ఞుడు. ఇట పాంపే హృదయంలో జంకును కల్పించి తమ సంధిషరతులకు అంగీకరించేటట్లు చేయటానికి వేసిన ఎత్తు అతని చతురతను వెల్లడిస్తున్నది. మీరు సిసిలీ: పాంపే విచిత్రమైన వ్యక్తి. ఎక్కువకు ఆశపడి ఎంతో కోల్పోతాడు. ఈ మైసినం సంధిమూలంగా ఇతడు తన సదవకాశాలను కోల్పోయినాడు. రోమకసామ్రాజ్యాన్ని పంచుకోటంలో అతని వంతుకు వచ్చినవి సిసిలీ సార్టీనీయాలు. అవి ఇంతకుముందే అతనివి. ఇందుకు ఆంటోని - క్లియోపాత్రా 313 60. 61. 62. 63. 64. ప్రతిఫలంగా అతడు తన సైన్యంలో క్రొత్తగా చేరిన మెనాస్ మొనక్రేట్స్ వంటి ఉత్తములను శత్రువుల పరంచేసి కీర్తిని కోల్పోటం, రోముకు గోధుమపంట ఇవ్వటం వల్ల క్షామపీడితులౌతున్న శత్రువులకు ఆహారాన్నిచ్చి పోషించటం జరిగింది. అయితే వినండి : లెపిడస్ అనుభవిస్తున్న స్థానానికంటే అధికమైంది కాకపోయినా, దానితో సాటి అయినదాన్నైనా పాంపే పొందగలిగిన సమయం వచ్చింది. కానీ మెసినమ్ సంధికి ఒప్పుకోటం వల్ల అది పోయింది. ఇలా అంగీకరించి నందువల్ల రక్షణ, అధికారం లభిస్తాయని పాంపే ఆశ పడ్డాడు. కానీ రాజనీతిజ్ఞుడైన సీజర్, అవకాశం చిక్కించుకొని అణగద్రొక్కాడు. దూరదృష్టి లేకుండా ఇతరుల దృష్టిలో నీతిమంతుడు, ఉదాత్తుడు, అనిపించుకోవాలన్న ఆశతో, పూర్ణహృదయంతో వ్యవహరింపని పాంపే జీవితం నిరర్థకంగా అంతం పొందక మరేమౌతుంది? సీజర్ దగ్గిరికి వీపుమీద మోసుకొని తెచ్చాడు : 'ఒక మెత్తలో క్లియోపాత్రాను నిలిపి ఎప్పొలొడోరస్ సీజర్ దగ్గరికి తీసుకోవచ్చాడు' అని నార్త్ అనువదించిన (1579) ఫ్లూటార్క్ చరిత్రలోని మార్జిన్లో ఉంది. అదృష్టంతో పరాచకాలాడుతున్నాడు. సంధిమూలంగా త్రైకూటవీరుల్లో ఒకడైన లెపిడన్ వంటి స్థానాన్ని పొందగలిగే అవకాశాన్ని పోగొట్టుకొంటున్నాడని మెనాస్ భావం. మెనాస్ దృష్టిలో ఫలమే ప్రధానం మార్గం ఏదైనా సరే. వారి స్నేహానికి ఉరిత్రాడు - ఆంటోనీ ఆక్టేవియాను హృదయపూర్వకంగా ప్రేమించటంవల్ల పరిణయమాడలేదు. రాజకీయ ప్రయోజనం కోసం చేసుకొన్న ఈ వివాహం ఎప్పుడైనా విఫలం కాక తప్పదనీ, అందువల్ల అతడికి మరింత క్లేశం కలిగి తీరుతుందనీ ఎనో బార్బస్ అభిప్రాయం. ఆసవశేషం - త్రాగెడివారి పాత్రలో చివరకు మిగిలిన ఆసవభాగం. దీనిని భిక్షుకజనానికి ఇచ్చివేస్తారని ఒక అభిప్రాయం. త్రాగేవారిపనిని సుగమం చేయటానికి, ఇతరమిత్రులు మిగిలిన ఆ పానీయాంశాన్ని పుచ్చుకొంటారని మరొక అభిప్రాయం. 314 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 65. 66. 67. 68. 69. 70. 71. 72. 73. 74. నేజా : కొండ పగుళ్ళను దాటటానికి ఉపయోగపడే ఒక సాధనం. పిరమిడ్ అంటే షేక్స్పియర్ ఒక ఎత్తయిన స్తంభం అని భావించి ఉంటాడా? పంట సమృద్ధిగా పండటం - ఈ నైలోమీటర్ను గురించిన విశేషాలు, షేక్స్పియర్ ప్లినీ ప్రకృతిచరిత్రకు హాలినైడ్ చేసిన అనువాదం (1601) వల్ల తెలుసుకొని ఉంటాడని ఒక ఊహ. టోలమీలు : ఈజిప్టు దేశపాలకులకు 'టోలమీ' అన్నది సర్వసమానం. మరోజంతువుగా మారిపోతుంది ఇది పైథాగోరన్ చేసిన ఆత్మయానసిద్ధాంతాన్ని వెల్లడిస్తున్నది. జౌదేవత వౌతావు - అంతరిక్షానికి జౌ ఎటువంటి సర్వాధికారో అలాగే నీవు భూమికి సర్వాధికారి వౌతావు. అలెగ్జాండ్రియా విందు - క్లియోపాత్రా అధ్యక్షతన జరిగే పానగోష్ఠులను పోలవు అని. ఈజిప్టు బాకస్ విలాసోత్సవాలు - బాకస్ ద్రాక్షాసవదేవత. ఇతణ్ణి ఉద్దేశించి చేసే ఉత్సవాలే బాకస్ విలాసోత్సవాలు. వీటిలో మధుసేవ, కామవిలాసాలు విశేషంగా సాగుతాయి. - చిరుకన్నుల చూపులతో - స్థూలకాయ మద్యపానం చేసినవారు చూచేరీతిగా చూచే చూపు, స్థూలకాయం పానలోలత వల్ల కలిగాయి. నెప్ట్యూన్ : జలాధిదేవత. మనం మిత్రులం - పాంపే తన యెడ అంటోనీ చేసిన ద్రోహాన్ని ఒక మద్యపాని లీలగా పరిగణించి, తొలగద్రోసుకొన్నట్లు త్రోసివేశాడు. ఇటువంటి జడత్వం కలవాడు కావటం వల్లనే ఆక్టేవియస్ ఇతణ్ణి చులకనగా మట్టుపెట్టగలిగాడు. తృతీయాంకం పాకోరస్ : పార్థియారాజైన బరోడెన్ పుత్రుడు. ఇప్పుడు నిన్నే పొడుస్తున్నవి - పార్థియన్ ఆశ్వికదళానికి శత్రువులను చుట్టుముట్టి ఈటెలు విసరటమూ, వెనుతిరిగి వెళ్ళిపోయేటప్పుడు, ఆంటోని - క్లియోపాత్రా 315 75. 76. 77. 78. 79. 80. 81. 316 శత్రువులకు సన్నిహితంగా చేరి పోరాడే అవకాశాన్ని ఇవ్వకుండా జీనులు వెనుకకు త్రిప్పివేసి, ఈటెలు విసురుతూ వెళ్ళటమూ ఆచారం. మార్కస్ క్రాసస్ మరణానికి క్రీ.పూ. 53లో పార్థియారాజైన బరోడెస్ సేనాధిపతి సురేనాస్ మార్కస్ క్రాససన్ను మెసపోటేమియా మైదానాలల్లో ఘనంగా ఓడించి విజయం చేకొన్నాడు. తరువాత అతణ్ణి, పార్థియన్ సేనానాయకులు తమతో ముచ్చటించటానికి వచ్చిన సందర్భంలో హత్య చేశారు. నేటి వెంటిడియస్ విజయం క్రాసస్ హత్యకు ప్రతీకారంగా భావింపబడుతున్నది. ఏథెన్సు - గ్రీకుదేశంలో ఒక మహానగరం. మిగిలిన మువ్వురూ - సీజర్, ఆంటోనీ, లెపిడస్. మానవజాతిలో జూపిటర్ - ఇట అగ్రిప్పా, ఎనోబార్బస్, సీజర్ ఆంటోనీలను లెపిడస్ ఎంత హృదయరహితంగా స్తుతి చేస్తున్నాడో నిరూపిస్తూ, హాస్యరసస్ఫూర్తితో ప్రసంగించటం గమనించదగ్గది. అరేబియావిహంగం : ఫోనిక్స్ అనే పేరు గల పెద్ద పక్షి. ఇది అయిదు వందల సంవత్సరాల కాలం జీవిస్తుందనీ, మరణించిన తరువాత దాని శిథిలశరీరంనుంచే పునర్జన్మను పొందుతుందనీ ప్రతీతి. - కారణభూతురాలు కాకూడదు రోమనులలో ప్రతిఒక్కరూ సౌందర్యం, సత్యసంధత, విజ్ఞానం గల ఆక్టేవియాను ఆంటోనీ వివాహమాడటంవల్ల అతడికీ, సీజర్ూ దృఢమైన సఖ్యానుబంధం ఏర్పడుతుందని ఆశించారు - ఫ్లూటార్క్ ముఖాన నల్లమచ్చ ఉండే అశ్వం : ముఖాన నల్లని మచ్చ ఉన్న అశ్వానికి విరసగుణం ఉంటుందనీ, అది లోపమనీ భావిస్తారు. అదేమంత మంచి విశేషం కాదులే సన్నని కంఠాన్ని కలిగి ఉండటం స్త్రీలకు ఒక సుగుణం. ఇది క్లియోపాత్రాకు వేదనను కల్పించే విషయం. కానీ ఆమె తన శత్రువైన ఆక్టేవియాది బొంగురు గొంతుకని తనకు తానే సమాధానం చెప్పుకోటానికి విశ్వప్రయత్నం చేస్తున్నది. ఇది ఆమెలోని వావిలాల సోమయాజులు సాహిత్యం-3 82. 83. 84. 84A. 85. 86. 87. 88. 89. 90. అసంబద్ధత. ఈ అసంబద్ధత సౌందర్యవిభవాలతో బాటుగా ఆమె కొక అలంకారం. మందబుద్ధులు : పరిపూర్ణంగా వర్తులమైన ముఖంగలవారు మందబుద్ధులన్న అభిప్రాయం. ప్రాచీన శరీరనిర్మాణశాస్త్రజ్ఞుల రచనల్లో కనిపిస్తుంది. జౌ - గ్రీకుల పరమేశ్వరుడు. మూడో త్రైకూటవీరుడు బంధితుడైనాడు - సీజర్ లెపిడన్ మీద నిందారోపణలు చేసి, అతడికి అవి సత్యాలౌనో కాదో నిరూపించుకొనే అవకాశాన్ని ఇవ్వకుండా, బందీని చేశాడు. కుత్తుకను ఉత్తరిస్తానంటూ బెదిరిస్తున్నాడు- పాంపేను ఎవరు హత్య చేశారన్న విషయం చరిత్రలో అనుమానాస్పదంగా ఉంది. ఆంటోనీ ఆజ్ఞాపించగా టిటియస్ అనే అతని భృత్యుడు పాంపేను వధించినట్లు ఒక కథనమున్నది. ఎప్పియన్ ఈ విషయాన్ని గురించి తన 'అంతర్యుద్ధ చరిత్ర' (హిస్టరీ ఆఫ్ సివిల్ వార్స్) లో చెప్పి, కొందరు పాంపేను హతమార్చినవాడు ప్లానస్ అని కూడా పేర్కొంటున్నట్లు తెలియజేశాడు. - నా తండ్రికి కలిగిన కుమారుడు జూలియస్ సీజర్ వల్ల క్లియోపాత్రాకు కలిగిన కుమారుడికి, ఆమె సీజరియన్ అని పేరు పెట్టింది. సీజరుకు ఆక్టేవియస్ సోదరీపౌత్రుడు. కానీ అతడు ఆక్టేవియన్ను పెంపుడు కొడుకుగా గ్రహించాడు. అందువల్ల అతణ్ణి తండ్రిగా చెప్పటం జరిగింది. సీజరియన్ తన తండ్రికి కలిగాడని ఆక్టేవియస్ పూర్తిగా అంగీకరించటం లేదు. టారెంటం, బ్రుండూసియమ్ - ఇటలీలో దక్షిణ ప్రాగ్దిశలో ఉన్న నేటి టరంటో బ్రిందిసీలున్న ప్రాంతం. అయోనియా సముద్రం - గ్రీసుదేశపుపశ్చిమతీరాన్ని తాకి ఉన్న సముద్రం. టొరైన్ : ఆస్ట్రియంకు ఉత్తర - పశ్చిమంగా 20 మైళ్ళదూరాన ఉన్న ఒక నగరం. థెటిస్ - సాగరకన్యలైన ఏబదిమంది నెరైడ్సులో ఒకతె. టారస్ - ఆక్టేవియస్ సీజర్ పక్షాన ఉన్న పదాతిదళానికి సేనానాయకుడు. ఆంటోని - క్లియోపాత్రా 317 91. ఆంటోనియడ్ ఆంటోనిమీద ప్రేమానురాగం వల్ల క్లియోపాత్రా తన ప్రధాననౌకకు 'ఆంటోనియడ్' అనే పేరుపెట్టుకొన్నది. 91A. 92. దివ్యచిహ్నాలు: ప్లేగువ్యాధివల్ల బాధితులయ్యేవారి శరీరాలమీద ఒక రకమైన బొబ్బలు పొడచూపితే వారిమరణం తథ్యం. వీటికే 'దేవచిహ్నా'అని పేరు. ఇవి అతివేగమరణానికి నిదర్శనాలు కావటమే ఇటువంటి నామం కలగటానికి కారణం. నా పదాతిదళాన్నీ...: సీజర్ పరం చేస్తాను. కానెడియస్ ఆక్టియం యుద్ధమైపోయిన తరువాత కూడా ఆంటోనీయెడ భక్తిని ప్రకటించి, అలెగ్జాండ్రియాలోనే ఉండిపోయాడు 93. ఫిలిప్పీ యుద్ధరంగం - 94. 95. 96. 97. 98. 318 ఫ్లూటార్క్ ఈ యుద్ధంలోనే జూలియస్ సీజర్ హత్యకు కారకులైన బ్రూటస్, కాషియస్ మీద ఆంటోనీ విజయం చేకొన్నాడు. మన ఉపాధ్యాయుణ్ణి - ఇతని నామధేయం యూఫ్రోనియస్. క్లియోపాత్రాకు, ఆంటోనీకి కలిగిన సంతానాని కీతడు గురువు. వెష్ఠాదేవికన్యలు - వీరు పావిత్రదేవత అయిన విష్ణాదేవి దగ్గర ఆమెను కొలుస్తూ, జీవితాంతం పురుషప్రసక్తి లేకుండా అవివాహితలుగా ఉండిపోతామని శపథం చేసినవారు. శాసనంగా భావించి : ప్రాచీనరోములో న్యాయాధికారులు నూతనంగా ఉద్యోగాన్ని స్వీకరించగానే కొన్ని శాసనాలను చేస్తుంటారు. వాటిని పాలకులు అంగీకరించటం, తరువాత వచ్చిన న్యాయాధికారులు పూర్వశాసనాలవలెనే వీటిని పాటించటం జరుగుతుండేవి. బాలుడైన సీజర్ : ఈ సమయానికి ఆంటోనీ వయస్సు ఏబదిమూడు సంవత్సరాలు. సీజర్ వయస్సు ముప్పది ఒక్క సంవత్సరం. ఇంకా బాగా గడ్డం, మీసాలు రాలేదు. అందువల్ల అంటోనీ అతణ్ణి బాలుడని వ్యవహరిస్తున్నాడు. బాసన్ పర్వతంమీద : బాసన్ పర్వతంమీది గోగణాలు చుట్టటం బైబిల్లో సామ్సులో ఉన్న ప్రసిద్ధవిషయం. ఆంటోనీ మహోదాత్తదుఃఖం వల్ల వివశు డైనాడు. బాసన్ పర్వతం మీద గోగణాలు చుట్టుముట్టగా వాటిని మించి వావిలాల సోమయాజులు సాహిత్యం-3 99. 100. 101. 102. 103. రంకెలు వేసేటట్టి అవకాశం తనకు క్లియోపాత్రా నైచ్యాన్ని ప్రకటించేందుకు లభిస్తే బాగుండునని అతడు భావిస్తున్నాడు. చతుర్థాంకం రక్తస్నాన మాడించి : కుష్ఠు మొదలైన వ్యాధులు కొన్ని రక్తస్నానాలవల్ల నయమౌతాయట! పతిని పత్ని మరణపర్యంతం విడిచి చరించినట్లు : “నిన్ను విడిచి నేను చరించను” అన్న వైవాహికశపథాన్ని ఇది స్మృతికి తెస్తున్నది. హ!, హ! హ! : ఆంటోనీ తన దయనీయమైన స్థితిని తానే పరిహసించు కొంటున్నాడు. ఇవి క్లియోపాత్రా అంకం v దృశ్యం V లో మాండ్రగోరారసాన్ని ఇవ్వమన్నప్పుడు, తన్ను గురించి తానే ఉన్మత్తాపహాస్యం చేసుకొన్నట్లు ఆంటోనీ తన్ను గురించి తానే అట్టహాసం చేస్తూ పలికిన పదాలని బాస్వెల్ అభిప్రాయం. ప్రేమించే దైవతము హెర్క్యూల్స్ అంటోనీని పరిత్యజించిన దైవతం బాకస్ అని ప్లూటార్క్. అతడికి దూరదృష్టి, నిర్ణయశక్తి రెండూ లోపించినవని చూపించటంకోసం షేక్స్పియర్ హెర్క్యూల్స్ అతణ్ణి ముందే వదలిపెట్టినట్లుగా వర్ణించాడు. మీ మీద విప్లవం చేసి వెళ్ళిన రాజులు : ఎమిన్హాస్, డైయొటారస్ మొదలైన రాజులు కొందరు ఆక్టియమ్ యుద్ధానికి పూర్వమే ఆంటోనీని విడిచిపెట్టి సీజర్ను చేరుకొన్నారు. 103A. విశ్వశాంతికి కాలమాసన్నమైంది : ఆక్టేవియస్ సీజర్ ఈజిప్టుమీద విజయం చేకొన్నది క్రీ.పూ. 29లో. ఈ వాక్యాన్ని పలికేటప్పుడు షేక్స్పియర్ మనస్సులో జీసస్ జన్మ జ్ఞప్తికి ఉండి ఉండవచ్చునని కొందరి ఊహ. 108B. వారిమీదనే వ్యయిస్తాడు - సీజర్ దారుణయుద్ధనీతికి ఇది చక్కని నిదర్శనం. 104. హెక్టర్ : ఒక ట్రోజన్ వీరుడు. 105. నైటింగేల్ - కమ్మగా పాడే ఒక పక్షి. ఆంటోని - క్లియోపాత్రా 319 106. 107. 108. 109. 110. 111. ఫొయిబస్ రథంలా : పొయిబస్ సూర్యదేవత. ఇతని రథచక్రాలు సూర్యకాంత మణులతో పొదగబడి మనోజ్ఞలై ఉన్నట్లు ఓవిడ్ తన 'మెట మార్పొసిస్' లో వర్ణించాడు. ఉన్మాదాది వ్యసనాలకు : ఉన్మాదం చంద్రదైవతం వల్ల కలుగుతుందని. టిట్టిభాలు (స్వాలోలు) : ఆక్టియం యుద్ధానికి పూర్వం అపశకునాలు ఎన్నో కన్పించినట్లు ఫ్లూటార్క్, క్లియోపాత్రా నౌకాపదనంమీద స్వాలోలు చేరాయి. ముందు వచ్చినవాటిని తరువాత వచ్చి చేరినవి తరిమివేశాయి. ఇదొక మువ్వురిని మార్చిన బంధకీ - క్లియోపాత్రాకు తొలుతటి స్వామి జూలియస్ సీజర్. రెండవవాడు క్నెయస్ పాంపే తరువాతివాడు ఆంటోనీ. ఆంటోనీ ఇప్పుడు ఆమె తన్నుగూడా విడిచి ఆక్టేవియస్ సీజర్ను చేరుతున్నదని అనుమానిస్తున్నాడు. ప్లీబన్లు : రోమను సామాన్యప్రజలు. నెస్సస్ : ఒక విషబాణాన్ని ప్రయోగించి తన్ను బాగా గాయపెట్టిన హెర్క్యూల్స్ మీద ప్రతీకారాన్ని చేసిన 'నరాశ్వం' నెస్సన్. ఇతనికి కల్గిన ప్రతీకారభావోద్వేగం తన్నావహిస్తున్నదని అంటోనీ అభిప్రాయం. హెర్క్యూల్స్ ప్రయోగించిన విషబాణంవల్ల తన శరీరంనుంచి స్రవించే రక్తాన్ని కొంత ప్రేమచిహ్నంగా దాచుకోవలసిందని నెస్సస్ తన భార్య డెజనిరాతో చెప్పి మరణించాడు. తరువాత ఆమె హెర్యూల్సు వస్త్రకంబళాన్ని నెస్సస్ రక్తంలో ముంచి, లిఛాస్ అనే వాడిచేత అతడికి పంపించింది. దాన్ని ధరించటంవల్ల విషం హెర్క్యూల్స్ను ఎంతో బాధపెట్టింది. కోపం వచ్చి హెర్మ్యూల్స్ ఒకమారు లిఛాసన్ను పట్టుకొని సముద్రంలోకి విసిరిపారేశాడు. 112. అల్సీడిస్: అంటే హెర్క్యూల్స్. అల్యూయస్ కుమారుడు. 113. 320 టెలమస్ ఎజాక్సుఖేటం కోసం : ట్రోజన్ వీరుడైన ఎక్కిలిస్ డాలును అతనితల్లి థెటిస్ గ్రీకుల్లో అతిసాహసి ఐన వాడికిస్తానని ప్రకటించింది. యుద్ధంలో మిగిలినవారందరిలో యులిసిస్ వీరుడు. కాబట్టి అతడి కివ్వమని అతని వావిలాల సోమయాజులు సాహిత్యం-3 114. 115. 116. 117. 118. 119. 120. 121. దేశీయులు నిర్ణయించారు. నిరాశాపూరితుడైన ఎజాక్స్ టెలమస్ ఉన్మత్తుడై, ఎజాకాలు తనకు లభ్యం కాలేదని తన్ను తానే పొడిచి చంపుకొన్నాడు. థెస్సలీ వరాహమైనా : కాలిడన్ రాజైన ఓనియస్ తనయెడ చేసిన అపరాధానికి ప్రతిచర్యగా డయానా ఒక వరాహాన్ని పంపించింది. అదే థెస్సలీ వరాహం. అనేకులైన సాహసికులు దాన్ని వేటాడటానికి బయలుదేరారు. తుదకు దాన్ని ఓనియస్ కుమారుడు మెలియేజర్ చంపాడు. డిడోకు : ఆమె ప్రియుడైన ఏమ్నియాస్కు ట్రాయ్ మహానగరం పడిపోయిన తరువాత ఏయే నియస్ కార్తేజికి వస్తే, కార్తేజి రాజ్ఞి డిడో అతణ్ణి గాఢంగా ప్రేమించింది. అతడు ఆమెను విడిచివెళ్ళిపోయినప్పుడు డిడో ఆత్మహత్య చేసుకొన్నది. - నెప్టూన్రీతార్ణవం - జలదేవత నెప్ట్యూన్ యొక్క పచ్చని సముద్రం. పరమశత్రువులైన పార్థియన్లే : ఇతరశత్రువులకంటే పార్థియన్లు ఆంటోనీకి ఎక్కువ శ్రమ కల్గించారు. క్లియోపాత్రా దారుణప్రభావం వల్లనే ఆంటోనీ తలపెట్టిన పార్థియన్ దండయాత్ర విచ్ఛిన్నమైంది. జూనో నీవు తిరుగుతున్న ఆ మండలాన్ని దగ్ధం చెయ్ : ప్రాచీన టోలమీ సిద్ధాంతాన్ని అనుసరించి సూర్యుడు ఒక గ్రహం. ఇది ఒక వర్తులాకృతి గల గోళంలో నిబద్ధఅయి ఉంటుందనీ, భూమిచుట్టూ తిరుగుతుందని భావింపబడేది. మెర్క్యురీ : జ్యూపిటర్కు ఇతడు రెక్కల దూత. పంచమాంకం ఇది : డెర్సిటాస్ పట్టుకోవచ్చిన ఖడ్గం. కొలాసస్లోగా : ర్హోడ్స్ అనే ప్రదేశంలో, సముద్రతీరాలు రెంటిమీదా రెండు కాళ్ళను నిల్పిఉన్న మినర్వా విగ్రహంవలె, ఈ విగ్రహం క్రిందుగా యుద్ధనౌకలతో ప్రయాణం చెయ్యవచ్చు. ఈ కొలాసస్ లాగానే ఆంటోనీ మహోన్నత వ్యక్తిత్వం గలవాడనీ, అతనిముందు సామాన్యులు నిలువలేరనీ క్లియోపాత్రా అభిప్రాయం. ఆంటోని - క్లియోపాత్రా 321 122. 123. 124. 125. 126. గోళాల సంగీతం - గోళాలు సంచరిస్తున్నప్పుడు ఒక రీతి సంగీతం వినిపిస్తుందనీ, దాన్ని అప్సరసలు మాత్రమే వినగలుగుతారనీ, మానవులు శ్రవస్సుల కవి వినిపించవనీ గ్రీకుతత్త్వవేత్త పైథాగోరస్ సిద్దాంతం. విజయప్రాప్తసత్త్వం : జయించటం వల్ల కలిగిన హక్కు లిక్టర్లు : రోమక న్యాయాధిపతులు దోషులకిచ్చే శిక్షలకు కార్యరూపాన్ని కల్గించేవారు. కీచుగొంతుక గల కుఱ్ఱవాడు: ఇంగ్లండులో క్రీ.శ. 1660వరకు కూడా పాత్రలను 'బాలురే' అభినయించేవారు. నైలుల్యలు : భూగర్భంలోని ఈ కాలువల ద్వారానే అలెగ్జాండ్రియాకు నైల్ నీరం వస్తుంది. 322 వావిలాల సోమయాజులు సాహిత్యం-3