Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-2/గేయనాటికలు/సౌగంధిక

వికీసోర్స్ నుండి

సౌగంధిక

ఒక గంధర్వుడు


ఓహోహో యక్షులార!
ఓ గంధర్వులార
కనినారా.. కనినారా
కనవేలోజ్వల కాంతుల్ ఓహోహో..


రెండవ గంధర్వుడు


అరుణ కిరణ రథవీధులు
భ్రాజిత నవ శరణ కాంతి,
గాఢరాగ చలిత హృదయ
కమలాలయ మెది నవ్వెనొ ఓహోహో.


ఒక కిన్నరుడు


ఉదయ సంధ్యా ప్రణయ నృత్యో
న్మత్త మండన వేళగంధ
ర్వాంగనల లాక్షాసుఖాజన
మొలికి పోయినదా ఒలికిపోయినదా!


మరొక కిన్నరుడు


నందనావని మందారముల
నిందిందిర శ్రీ చాలనలచే
గగనమును స్వర్గము రక్తా
శోక శబలితమా!


గంధర్వుడు


శాపద్రష్ట త్రిదశాంగన
జనియించెనె మానవియై
జలదప్రియ కోపనయై
సరసిని సుమ మైనదొకో
ఈ నభంబు సర్వ
మ్మేమిటి? ఏమిటి?
జరరామణ సంధ్యా
ద్యుతి ద్యోతితమె.


మరొక గంధర్వుడు


కుబేర కాసా
రమ్మున నవిగో
కులికెడి కనక
ప్రసూనములూ - కులికెడి కనక
ప్రసూనములూ


వసంతుడు


జగమంతా ఒక మదనోద్యానం
జన్మంబున ఘన మధు సమయం
అక్షత, మన్మధ శస్త్ర ప్రాణం
అరగ నీభువ నమ్ముల కానం

మన్మథుడు


ప్రకృతి నేతవు నీవు ఓహో వసంతా!
ప్రణయ దూతవు నీవు ఓహో వసంతా!
కని కనక మున్నె ఈ
కాననము వాదంత
కానంద డోలికల
నోల లాడించెదవు ప్రకృతి నేతవు


వసంతుడు


జయ జయ మధు మయ మదనా
జయ జయ నవయువ మదనా!
ఓ జైవాతృక
శుచిసాంయీత్రిక
సుషమా సుందర
మానస మందిర
జయ జయ మధు మయ మదనా!
జయ జయ నవ యువ మదనా!


గంధర్వుడు


అదిగో అదిగో
చిలుకల తేరు
చెలికానితొ వలరాజా


మన్మథుడు


మరల మరల ఓహో ఈ
మధు వసంత మరుదెంచె
యౌవ్వన సుఖమనుభవింప
కేలబేల లయ్యెదవో - మరల మరల
పూలతావి తరిగినదా
పూల బ్రతుకె తొలగినదా
నాకమైన అనునిముషము
నరకముగా మరునొకో - మరల మరల


గంధర్వుడు


కనవాజ్జంబుల
కాంతుల లొకో
గగనాంగమున
క్రమ్మిన వీ -
ఈ నవ శోభల
నెన్నడెరుగము
ఎందుల కేగతి-
విరిసినవీ -


షట్పదము


నటనమ్ముల పటు రయమున్
ఎటకేగెదె భ్రమరీ
జుం... జుం
చటులా మోదమ్మపుడే
కటువయ్యెనె భ్రమరీ
జుం... జుం
గంధర్వుల సౌగంధిక
కాసారము భ్రమరీ
జుం... జుం
రక్తాంబుజ శాబకముల
ప్రసవించెనె భ్రమరీ
జుం... జుం
మధు కోశమ్మొకటే
హృదయాన నబును
మనసారగ మధుసేవను


మత్తిలుదము భ్రమరీ
జుం... జుం


భ్రమరి


మనసు కలిపి అరుగుదమా?
మధు సేవకు తరలుదమా?


షట్పదము


అనుమానమ్మేలా
ఆలస్యమ్మేలా ఇక?
భ్రమరి
సౌగంధిక హాసములో
తరగలమై వరలుదమా!
సరసిజ గర్జమ్ములతో
సఖ్యగీతి పాడుదమా!


షట్పదము


పదవే ప్రియ పదవే
పదవే ప్రియ పదవే
ఆగుదునే ఆడుదుమా
తడబడెదవు బడలెదవే... పదవే పద పదవే


స్వరమేళ


కలుష కానన వాదమున క్లే
శాత జీవన భరముతో పవ
మాన సూనుడు నవసిపోవగ
మారుత ప్రభువూ -
కౌంతీద్వితీయుని భీమసేనుని
గంధమాధన కాననాంతర
సీమలకు కొని వచ్చి చేర్చెను
స్వాగతమ్మొసగీ -


మన్మథుడు


నిదుర మేల్కొమ్మో అశోకమా!
అదుగో ఆ దంపతుల కనుమా!
అంత తెరచాటైన మూకత
పలుక నేర రవంత!
కుసుమ దన్వీ ప్రసవమానీ
అసమశక్తికి సమయ మియ్యంది:
ఎటుల మెలగెదవోసుమా - ఓ
ప్రసవరాజమ్మా!


భీముడు^


ప్రసవ చషకములయిన
కుసుమాసవము ప్రియుమే
అందించు షట్పదమా
హ్లాదమే హ్లాదమ్ము - ప్రియురాలా


ద్రౌపది


ఆకరేణువు కోర్కె
నామ్రితరుమూలనము
హస్తాగ్రము సాబు
అతని బ్రతుకే బ్రతుకు -ప్రియుడా!


భీముడు


విరహ బాధా భయమె
విపిన తరులతిక లవె
గాఢ విశేషాన
కామదేవుని యాన -ప్రియురాలా

ద్రౌపది


ఆహరిణ దంపతుల
అనురాగ వాహినన
కనులకింపై పోలు
కర్ణికారపు జాలు - ప్రియుడా


స్వరమేళ


శైలరమ్య సానువులన్
శైనితీ పులిసార ములన్
నవని కుంజ వాటికలన్
పృధుల పుష్ప వేదికలన్
విహరించెను పవనసుతుడు
విసుగక వేసారకయే
తరుగని తను కాంతులతో
తీరని తమి కోరికలతో-


గంధర్వులు


రండో రండో కిన్నెములారా!
రండో రండో దేవతలారా!
పూజాసూనము లియ్యవియే
పొలచెను నూతన కాంతులతో
                                        రండో, రండో
ఈ సుమజాతిని ఎవ్వతె వలచిన
ఏలుటయే యగు నిర్ణయమా,
ఈ సుమజాతిని ఎవ్వని కొలచిన
ఈప్సితసిద్దులు నిశ్చయమా
                                        రెండో, రండో


స్వరమేళ


పవన వశ పరిచలిత
తాలనవహింత్రాల ఈ
రంబోరు పరివాజ్య
కాసార నీరములందు
కందళిత హృదయార
విందుడై, ఆనంద
వీచికా డోలికల
లోలుడై కేళియై
భీముడు
ఆషాఢాంబుద మతియై
అదెతమాల తరుకాంతికి,
హ్రీంకారవ గీతుల శఖీ
క్రీడించెడి శైలూషిక!


ద్రౌపది


పరవశయై పోవ ప్రకృతి
పరమానండలనల్లన
వేణుగళమ్ముల పాడెడి
విమల ప్రణయ గీతావళి


గంధర్వుడు


తావుల వెల్లువ
లేమి ఇవీ?
కొలనున పుట్టిన
పూవులవీ?


మలయ మారుతము


ఓ సరోజ నిలయమ్మా
ఓపరాని భారమ్మిది!


మూపున నిడ కేతావిని
మోయలేను, మోయలేను


స్వరమేళ


నవ వికచ కుసుమ సుమ
మార కోరక నికర
భరిత వకుళా శితోక
సహకార పున్నాగ
శీత సికతాతలిన్
పున్నాగ నాగుడై
బహు భావనా మధుర
భారావ కలిత ది
వ్యామోహ పవమాను
చలిత కలకంఠకుల
కంఠయుత కాకలీ
స్వన మధుర గీతికా
కవితుడై, లలితుడై


భీముడు


ఎచటికో ఎచటికో
ఈ వలపు శైవలిని
గమకాల గానాల
కన్నె లేబ్రాయాన ప్రియురాలా!


'ద్రౌపది:


కడలికేగిలి లోన
వెడ ఎడద విహరింప
జలధి హృదయమున కలచి
పయనించి శయనింప ప్రియుడా!


మలయమారుతము


అమరాంగనా తుంగ
సంగ నిమోన్నత వక్ష
ఘనసార కాశ్మీర
చర్యానిలమ్ములకు -సొలసీ
వెర్రినైనాను నేనూ
విశ్వచాలన ఇక చేయలేనూ.
ఖేచరీ ముఖసక
ర్పూర తాంబూలాది
వాసనా నిశ్వాస
పవన చాలనమ్ - బ్రమసీ
వెర్రినైనాను నేనూ
విశ్వచాలన ఇక చేయలేనూ
కేళీసరోవీధి
నాళీకవాటా
ధూళీ ఝురీరాజా తేలీ
తన్వీముపరబోగ
ఖాళీ జుత్‌జటూ
నాళీ సుగంధాళి గ్రోలీ
లోలీభవత్వష్వ ధూళచరద్బ్వంగ
పాళీల సన్నగ తాళి సోలీ!
వెర్రినైనాను నేనూ
విశ్వచాలన ఇక చేయలేనూ


గంధర్వుడు


ఓహోహో యక్షులార!
ఓహో గంధర్వులార!
ఓహో కిన్నెరులారా!
ఓహో దేవతలారా!


యక్షేశ్వరు ఆజ్ఞ ఆజ్ఞ
అర్థేశ్వరు ఆజ్ఞ ఆజ్ఞ
కలలోనెనా రాజరాజు!
కలతపడెను రాజరాజు!!
స్వప్నవీధి సౌగంధిక
సరసిని గంధద్విపమ్ము
పలు పోకల పరఖనదట!
కలచినదట! చెరచినదట!


భీముడు


నీవెవ్వర వో ప్రియా!
నేనెవ్వరనో ప్రియా!
ఈ వాలసింపకే
ఈ తనువు శాశ్వతమె
ఓ సఖీ ఓ సఖీ
ఓపలేనే సఖీ!


ద్రౌపది


నీవె నేనో నో ప్రియా!
నేనె నీవోయీ ప్రియా!
కడలి వాకల వొంచె
కలిసి పోదామోయీ
ఓ ప్రభూ ఓ ప్రభూ
ఓపలేనో ప్రభూ


భీముడు


ప్రాణమహో
వీణ వహాగీ
ర్వాణ మృణా
పాణి వహో!


ద్రౌపది


ఘసృణ కిసలయా
మస్వణ శోభా
కరభాగంబున
కరణంబవె నిను - ప్రియుడా!


భీముడు


శైవలినీ
చల దూర్మికవే - మ
త్తాళి మనో స్ఫురన్నవ
నీలకచా!


ద్రౌపది


జలద ప్రియవలె
ముఖ మండలమును
పెన్నెణఱి కరణిని
విహిత మొనర్పనె ప్రియుడా


స్వరమేళ


గీర్వాణ మిధున సేవ్యమాన
క్రీడోన్నత శైలములన్
క్రీడాభయ రహితులుగా మధు
లేపమాన నవ ప్రణయములన్
విహరింపగ విహరింపగ
అపహరించి డెందం బానందముతో
విహరింపగ పవన సుతుడు
ప్రణయినితో, నవమోహినితో-

ఉల్లిలన్మకరంద బిందు చ్యుతులతో
నవసౌరభ శ్రీ గయిలతో వా


తావ ధూతమ్మొక జలేజము
వచ్చి పడెనచటన్


భీముడు


ఏ అచ్చరవె నీవు పూవా?
ఏ విష్ణుమపి పూవా?
కిన్నెర ప్రణయినివొ
గంధర్వ గాయనివొ
కులకకే వలచెదవు
పాడకే పాడెదవు. - ఏ అచ్చరవె

కాలువలు కట్టనీ
కన్నీటి ధారలా?
హర్షాశ్రుధోరణులొ
అభ్రవేణీ దీని
దుఃఖాశ్రు ధోరణులొ - ఏ అచ్చరకై


ద్రౌపది


ఏ ఆచ్చరయు కాదు నాధా!
ఏ వియిచ్చర కాదు నాథా!!
తొలిజన్మ నానోమె
ఒలికినది ఈ పూవు
సిగపై సువాసింప
వొగిన వెలిగెద నింక - ఏ అచ్చరయు

వాడదిది పొడిమియు
వీడదేని వెన్నాడు
న్నాడు నీ పూతావి
నీడగా, తోడుగా -ఏ అచ్చరయు


భీముడు


ఈ అపూర్వాబ్జమ్ము ప్రియురాలా!
నీ పూర్వ పుణ్యమున నేలా?
ఏ నోము నోచెనో
అతివ నీ అలివేణి
అందాల నొలుక ఈ
అంభోజ సుమరాణి - ఈ అపుర్వాబ్జమ్ము

జగదేక సుందరీ
ఆనంద మందిరా
ఇందింది రశ్రీల
క్రొందళుల్ వాకయో - ఈ అపుర్వాబ్జమ్ము

అభ్రవేణీ దీని
అవతంసముగ నిల్పి
శృంగార జలధి సాం
మాంత్రికుడనౌదనే - ఈ అపుర్వాబ్జమ్ము


ద్రౌపది


కేకినై ఆడనా
ఓ ప్రణయ మోహనా!
మేఘ గంభీర గ
 ర్జాఘన స్వనకంఠ! -కేకినై

తడబడెడి నా యెడద
బడలెరుంగని దాన
ఉజ్జలోజ్వల మూర్తి
శమిత సకలార్తీ! -కేకినై

భీముడు

ఇంత దైన్యమ్మేల బాలా? ఇంత బేలై పోతి వేలా? నెలవంక సిగపైన నిలువ కొనిరానా? వలపు మెరుపులతీవ కలుపుకొని రానా? జలధి గర్జాంతరో జ్వల శుక్తి ముక్తాళి కలతార హార పం క్తుల కాన్కవెట్టనా ఎగురునా నీ తోడ ఏ పత్రిక న్వి ఈ విహాయస వీధి -ఇంత దైన్యమ్మేల ఈ పుష్పాస్తృత శయ్యను హేలానవ మదన కేళి లోలురమై ఏక మౌట ఈ ప్రియ ప్రియ కాంక్షితమా అవి ఏల నాకోయి ప్రియుడా! ఆలసింపకమోయి ప్రియుడా!! భీముడు దీన వైనా విందు కేనా? నిము సాన ఏనుకొని రావా! ఏడు యీ ఏడులోకాలలో ఎట నున్న నీ యాన ఏనుకొనిరానా లోకాధిపతు లడ్డమైనా ఏ కదనమది దొడ్డదైనా కొలతు కొల నెల్ల కొని వత్తూ గంధర్వనన కొలను -ఇంత దైన్యమ్మేల కొలనునీ కాన్కగా నిత్తూ ద్రౌపది తళుకుల ఈ కొందామర ఎలిపిన నెలవంక ఏల? మెరపుతీవ గమి కాదా ఒరసెడి నీ కనుచూపులు - అవి ఏల నాకోయి ప్రియుడా అలసింరుక మోయి ప్రియుడా! తారహార పంక్తులపై తరలడిగిపో నా హృదయము, గగనాంగణ సౌభాగ్యము కాంక్షింపగ మాతకినీ -అవి ఏల నాకోయి ప్రియుడా ఆలసింపకు మోయి ప్రియుడా!! సాగిపోనా దివ్యబాలా! ఏగిరానా నవ్యహేలా? నీ తలపునకు వెనుదీయలేదే నీ వలపు నా వలపు కాదా? సాగిపోనా దివ్యబాలా ద్రౌపది ఓహోహో ప్రియసాహస ఓహో మధురోల్లాస నా ప్రణయమే పాధేయము నవనవాధ్వముల ప్రియుడా ఓహోహో ప్రియసాహస! ఓహో మభురోల్లాసా! గేయ నాటికలు 645 మన్మథుడు జాణ నా బాణ మోయీ వసంతా! జాయమయ్యె నేడు నా కోయీ వసంతా! స్వామి కార్యార్థమై అరుదెంచినాను, సౌగంధికకు భాము నడిపించినాడు, పురోహతుని రూపమై భువి వెలింగడి యీ పురువంశ దీపకుడు ప్రౌఢవహియించు - జాణ నా బాణ - గంధర్వ కిన్నెరుల గర్వమడ గించు కనకాబ్జముల తెచ్చి ప్రేయసికి నిచ్చు రసికావతంసుడై రాణ వహియించు రమళి ముల్లోకాల రాజ్ఞి యనిపించు జాణ నా బాణ మోయీ వసంతా! జయము నయ్యె నేడు నా కోయీ వసంతా! వసంతుడు జయ జయ మధుమయ మదనా జయ జయ నవదూత మధనా! త్రిభువన పావన నవనవ జీవన ప్రణత సురాధిప ప్రణయ రసాధిప జయ జయ మధు మధు మదనా జయ నవయువ మదనా!: స్వరమేళ లోలీభవతృష్ణ ధరణీ చరద్భ్వంగ పాళీల 646

వావిలాల సోమయాజులు సాహిత్యం - 2


సన్నవ్య గీతాళీ
నడిపింపవన్ -

ఫల్గుణాగ్రజుడేనె ప్రియకై
ప్రణయోద్వహుడు భీమ బలుడూ
ప్లవమాన సుమపొంతములపై
పవమాన ఘన వీచికలపై

త్వరితగతి ననిల సుతు డంత గిరివీధిన్
దరుల పెను ఝరుల ఘన తుంగ తటకోటిన్
లతలద్రుమ తతుల పృధు చాలనల వీవన్
గడచిమ్మత సమజతుల విక్రమము తోడన్
గెలచి, అతి మధుర ఫలహారముల గ్రోవీ,
చనుచు పిక కృతుల కలకూజితము లాశన్
కుసుమ సురుచార మధుర గంధములు త్రోవన్
తెలుపచనె ప్రియ హృదయ కాంక్షనటు తీర్పన్

గంధర్వులు:

సాహసమిది సాహసమూ
సౌగంధిక కాపాడుడు,
చునుదెంచెను మానవుడొక
డనిముషులై కాపాడుడు


ఆకాశవాణి, విజయవాడ 26-4-1949

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.