Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-2/గేయనాటికలు/ఆశాజ్యోతులు

వికీసోర్స్ నుండి

ఆశాజ్యోతులు


స్త్రీలు:


పదవే, పద పదవే!
ప్రజాస్వామ్య నౌకా!!
భారత జనగణ గమ్యము
మణిహర్మ్యం చేరుదాక పదవే.


పురుషులు:


చేరునె ఈ చిరుత నౌక
చెదరక మన మేడదాక!!
ముమ్మరముగ చీకటులివె
మూగిక్రమ్ము చున్నవి గన!! చేరునె


స్త్రీ:


కల్లోలిత జలధులలో
కలత పడకు, కుతిలపడకు!
కనుల కింపునింపు సడల
కలహంసగ పయనింపుము


పురుషుడు:


విన్నారా ప్రతిపక్షపు
విలయ ఘనాఘన గర్జలు!
కన్నారా దుర్జనచటె
కాలభయద తాండావాలు. చేరునె


ఇరువు స్త్రీలు:


కడలు లెన్ని ఉప్పొంగిన
పిడుగులెన్ని పై బడినా
ప్రజానౌక పయనించును
ప్రగతి నికేతనము దాక... పదవే..


కథకుడు:


ధనిక వాదులు ఫాసిస్టు ధర్మరతులు
సంఘధూర్తులు ప్రతిపక్ష సభ్య సమితి
కోరి సృజియించు దేశ సంక్షోభములకు
బ్రతుకునె ప్రజా ప్రభుత్వ మన్బయముల్

పడని స్వాతంత్ర్య మఖిల ప్రపంచ మం
వరలు చును దొడ్డదౌ ప్రజాస్వామికమ
మన ప్రభుత్వంపు కీర్తి సామర్థ్య మనుట
ఎన్న జరుపుకున్నాము ఐదెన్ని కలను

అభిల పౌరజనులకు న్యాయమ్ము సర్వ
రంగముల నిచ్చి సమత, నార్జనము
టాశయమని పాలకుల కాదేశ మొస
లెరిగి రాజ్యాంగ నిర్మాత లెపుడో మున్నె
ఎల్లరును మెచ్చ, నిర్వదైదేండ్ల నుండి
భారతీయ ప్రభుత్వమ్ము బహు సమస్య
లెదురుకొనుచు గాఢముగ నహీనకృషిన్
చేయచుండె ప్రజాశయసిద్ధి కొరకు

పురుషుడు:


వస్తోంది, వస్తోంది
       సమతాయుగం
వస్తోంది. వస్తోంది
       నవతాయుగం
వస్తోంది, వస్తోంది
       జనతాయుగం
వస్తోంది వస్తోంది
       యువతాయుగం. వస్తోంది.


స్త్రీ:


వస్తోంది, వస్తోంది
సమతాయుగం
తన రాకమెచ్చంగ
పీడిత మహాజనము వస్తోంది.


పురుషుడు:


స్వార్థపరులకు బ్రతుకు
సన్నగిలిస్తంభింప
బలము సామర్థ్యమ్ము
ప్రజకు పంచీయగా వస్తోంది.


స్త్రీ:


ధనిక జన ఘన దౌష్ట్య
దర్పవల్లు త్రుంప
సామ్యవాదుల నిండు
కలలెల్ల పండింప. వస్తోంది


పురుషుడు:


కులతత్వ, మతతత్వ
హింసానురక్తులకు
మీ ఆట సాగదని
చాటి చెప్పుట కొరకు. వస్తోంది


స్త్రీ:


జాతి విద్రోహులను,
నీతి విద్వేషులను
కనువిప్ప కలిగించి
కలిపి నడిపింపగా వస్తోంది


పురుషుడు:


సర్వజన సహకార
సంక్షేమ మార్గాల
నవజీవనమ్మొసగు
జవము చేకూర్పగా వస్తోంది


కథకుడు:


ఇట్టి ప్రోత్సాహభరము పూరించి
సామ్యవాద సమాజమ్ము సత్వరము
కల్పనము చేసి ప్రజకు సౌఖ్యమ్మొసంగ
నిందిరాగాంధి వేవేగ నేగదలచె
వచ్చె చీలిక కాంగ్రెసు పక్షమందు
సంతసించిరి ప్రతిపక్ష సభ్యులపుడు
ఎన్నికలలోన నావె నోడింతు మనుచు
ఇందిరయె గెల్చె ప్రజలు హర్షించినా


స్త్రీ:


ఎన్నెన్నొ కలలు గన్నారు
ఇందిరా శత్రువులు
ఎన్నెన్నో కలలు గన్నారు
ఎన్నికల గెలువదని
ఎన్నెన్నో కలలు గన్నారు.

పురుషుడు:


ఎన్నికల ఫలితాలు
అన్నియును వమ్మయ్యె,
ఎన్నికలలో మన్ను
తిన్నారు శత్రువులు ఎన్నెన్నొ


స్త్రీ:


తరతరమ్ములనాటి
తమపెత్తనామె సాగు
ఏ ప్రభుత్వమ్మయిన
ఏలికల మౌదుమని ఎన్నెన్నొ


పురుషుడు:


గూండాలు, మరి లంచ
గొండ్లు, దేశపురిపులు
అండగా నిలుతురని
దండిరాజుల మనుచు ఎన్నెన్నో


స్త్రీ:


పేదతనమును మాపు
టే తన నినాదముగ,
జనుల కోరెను ఓయి,
జయము తథ్యముగదా ఎన్నెన్నొ


పురుషుడు:


ఎట్లో ఇందిరనాపు
టే ఆశయమ్ముగా
ప్రజల వ్యతిరేకింప
పడయరే అపజయము ఎన్నెన్నొ


కథకుడు:


క్షామములు, అనావృష్టి, బంగ్లా సమస్య
అతశరణార్థులును, యుద్ధ మాదిగా
ఎన్ని వచ్చిన ప్రభుత సాధించె ప్రగతి
రక్తి శాస్త్ర విద్యాకృషి రంగములను.

పెక్కు ప్రాంతాలలో అనావృష్టి వలన
దేశమందలి ఉత్పత్తి దెబ్బతినియె
ధరలు పెరిగెను ధాన్య సేకరణ సేయ
కడగి అడ్డిరి కొన్ని వర్గముల వారు.

వ్యయము పెరిగినదంచు విద్యార్థులందు
బయలుదేరె నసంతృప్తి - స్వర్థపరులు
కక్ష సాధింపగా ప్రతిపక్ష తతికి
కలిగె నాందోళనల కవకాశమపుడు


స్త్రీ:


ఆందోళనలు లేవదీశారు
బందులెన్నో నిర్వహించారు
గుజరాత్ రాష్ట్రాన
ప్రతిపక్ష వర్గాలు
బందులెన్నింటినో
ప్రౌఢమెయిం నడిపారు ఆందోళన


పురుషుడు:


అందులో విద్యార్థి
బృందాలు చేరినవి
కార్చిచ్చు వోలెనవి
కలయగా బ్రాకినవి ఆందోళన

స్త్రీ:


అభివృద్ధి లేదంటు
అపవాదు వేశారు
ముందు చూపేలేని
మందకొడి ప్రభుతయని ఆందోళన..

ఉత్పత్తి పెంచాలె,
ధరలు తగ్గించాలె
అసమర్థ పాలనము
అంతమొందాలె అని ఆందోళన


పురుషుడు:


వంచకులు, దుర్నీతి
పరులు, హింసావ్రతులు


ఆకాశవాణి, విజయవాడ 27-6-76

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.