Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-1/శివాలోకనము/ఉజ్జీవము

వికీసోర్స్ నుండి

ఉజ్జీవము

(మహేంద్ర రాజ్యరక్షాగర్వి మదనుడు తపోభంగ కార్యార్థమై మహేశ్వరాశ్రమానికి విచ్చేసి తన అశక్తతను అవగతం చేసుకున్న తరువాత)

మ. అవిగో, శాత్రవ కాలమేఘములు, ప్రోవై క్రమ్మగా వచ్చె
    దివి నల్టిక్కుల, దిక్కు మాకిక భవద్దివ్యాస్త్ర జాలంబె నీ
    పువువిల్ బూనుము, లెమ్ము, కావగదవే పుష్పాస్త్ర! శీతాద్రి సం
    భవపై నీశు మనమ్ము నిల్పుము తపోభంగంబునన్ నెచ్చెలీ!

మ. అనుచున్ దేవసభాంతరాళమున నాకాధీశుడే బేలయై
    నను ప్రార్థించిన పొంగి నాపొగరు మిన్నందెన్ భళీ! క్రొవ్వి ఆ
    డిన మాటల్ తలకెత్తె నీ బరువు, పాటింపంగ లే రెవ్వ రే
    మనినన్ నామొర నేడు, గర్వ మిటు మాయావాగురన్ చేర్చెనే?

చ. వలదని ఎంత చెప్పితినా రతి, నే విన నైతి సాధ్వి, నీ
    తలపులె సత్యమయ్యె, జడదారులపై విజయంబు గొన్నటుల్
    వలనగు నంచు వచ్చితిని భర్గు మహోగ్రతపంబు మాన్చ, నీ
    పలుకెడ సేయ నింక కొనప్రాణముతోడ తిరోగమించినన్!

చ. అడుగుల కడ్డువచ్చి తడియారని కన్నులతో కపోలముల్
    వెడవెడ వెల్లనై సొగసు వీడగ వీడుట కొప్పుకోని నీ
    యెడదను దిద్ద, ఉన్నయటులే చనుదెండు యుగమ్ముకాదె మీ
    కడ నిలువంగలేని క్షణకాలము నాకని యార్తవైతివే!

చ. ఎడ నెడ దుర్నిమిత్తముల నేడ్తెర కుంగి కృశించి ఓ చెలీ!
    తడబడు గుండెతో నెదురు దారులు చూచుచు నిల్లు వీవు! నా
    ఒడికముతప్పె - ఇంక తడవో కలకాలము - మానవే సఖీ!
    ఎడదను నాపయిన్ మమత ఏగతి నున్నదొ ఈశ్వరేచ్ఛయున్?


శా.

శా. ఆలోచింపకమున్నె నల్దెసల ప్రౌఢానంత వాసంత లీ
లాలాలిత్యము క్రుమ్మరించితివి, ఉల్లాసంబుతో కాననం
బీలీలన్ భవదీయ దివ్యవిభవోద్వృత్తిన్ ప్రసాదించెనో
యీ! లోపమ్ము వసంత రాజ! కన లేనేలేదు పో నీయెడన్.

6


చ.

చ. నను గని నవ్వుచున్నది వనం బొక యుప్పెననవ్వు నేడు నా
మనమున ధైర్యమొక్క యణుమాత్రము నిల్వదు, జారిపోయె నీ
ననవిలు నిల్వ నోపకను నా కరకంజము నుండి, యెట్లుగా
ననితర సాధ్యు నీశు పరమాత్ముని తాపస వృత్తి మాన్పుదున్?


మ.

మ. సుమబాణావళితో జగత్రయము నే సుత్రాముకై గెల్చి ఆ
య్యమరేంద్రాసనరక్ష సేయుదు గదా, అస్మద్బల ప్రౌఢికిన్
సమ మే లోకములోన నున్నదని యిచ్చన్ గర్వినైపోదు నా
ప్రమదం బీయెడ భగ్నమయ్యె, సురకార్యం బెట్టు లీడెరునో?


ఉ.

జీవన పుష్ప సౌరభము చిత్రగతిన్ మటు మాయమయ్యె నే
మో? విధి యీ యెడన్ నను విమోహదరిద్రునిగా నొనర్చి బా
ధావిపినాంధకారమున దారులు మూసి, దవాగ్ని వెట్టె దే
వా! వగతీరి నాకు నిరుపాధి మరెన్నటికో మహేశ్వరా!


ఉ.

“అచ్చరపిండు వెంటగొని, ఆమనియున్ మలయానిలుండు నీ
నచ్చిన నెచ్చెలుల్ ప్రియముమై సహవీరత వెంటరాగ, నా
పచ్చని చిల్కతేరు పరవళ్లను ద్రొక్కగ, పుష్పధన్వినై
మెచ్చ మదిన్ శచీప్రియుడు, మించుచు వచ్చితి భర్గుగెల్వగన్.


ఉ.

ఓ మలయానిలా! సఖ!! మహోదయ!! నీదగు నృత్యకేళి నా
రామమునన్ తరుల్ సుమవిరాజిత ముగ్ధలతానుషంగముల్
కామకళారసజ్ఞతల గాఢవినిద్రిత చిత్తవృత్తులై
నామది కింపుగూర్చెడి యనంతవిలాస శకుంతసంతతుల్.


చ.

చ. ప్రసవశరాసనోజ్జ్వల విలాసములన్ గనలేదు లోప మో
అసమశరా! త్వదీయధనురంచిత బంభరమంజు శింజినీ
రసభరఝాంకృతిధ్వనికి రా దిసుమంతయు భంగపాటు, నీ
పసతరుగంగ దీనతకు పాల్పడె దేటికి? ఉద్యమింపుమీ?”

12

చ.

అని నను ప్రోత్సహించెడు నయాచిత శక్తి యొకండు ఎన్నడున్
గన నిటు దీనతాగుణము నాపయినన్ విజయమ్ముగొంట నే
ననుకొని తీర్పనట్టిది మహత్తరకృత్య మొకఁడు లేదు నా
మన మురియాడ నేల? ననుమానములన్ కలగుండు నొందుచున్.


ఉ.

"తుంటరి వింటితో కదనదోహలియైన పినాకపాణి పై
కొంటిగ నేగుచుంటివి సముత్సుకతన్, గళమెత్తి నందినీ
బంటుదనమ్ము చూడ నొకపాటిగ రంకె యొనర్ప డిల్లవో
కుంట పొసంగునే? అళులనో మదనా! మది నమ్మ జెల్లునే?"


చ.

అని మొరవెట్టి పల్కునెడ నో రతి! దీనత దుఃఖరేఖ నా
మనమున హత్తుకొంటివి - సమాయతవై పలుమారు తోచె దే
ననుకొన స్వప్నమందయిన నబ్బెడు నీ దురవస్థయంచు - ఓ
వనజముఖీ! త్వదీయముఖవారిజశోభ లెసంగుగావుతన్.


చ.

పొలయలుకన్, నిరాదరణపూర్వక చేష్టల, మందహాసరే
ఖల నెటుగా ప్రయత్నవిముఖత్వము గూర్పగ పాటుబడ్డ నే
చలనము నొందకుంట, పటుసాహసవైఖరి నుత్సహించుటన్
కలగుచు నన్ను నంపునెడ గాఢభయాన్విత వైతి వో సతీ!


చ.

కనకపుకంబ మొండు స్ఫటికంపు సురమ్యవిశాలహర్మ్యమం
దున లగియించి నట్టులుగ తోచెడి శర్వుడు యోగశక్తిచే
ననుచగ నాత్మతేజము మహోన్నతదేహమునందు మున్ను నే
ననుకొన నీశు డర్యమ సహస్ర కళాకలితుం డటం చెదన్.


ఉ.

ఎంత మహోగ్ర మీ తపమ రెట్టి మహార్ధము నొంద గోరియో!
అంత మదెన్నడో యెరుగ మాత్మభవా! శివ! అష్టసిద్ధు ల
త్యంతము నిన్నె చేరెను గదా? యిది ఏటికయా మహేశ! ర
వ్వంత విలాసమా, నిజనిరామయధారణకున్ పరీక్షయా?

18


ఉ.

కమ్మని తావి గాలిబుడతల్ తలకెత్తుచు మోయలేని భా
రమ్మున మందమంద మధురమ్ముగ సాగుచు వచ్చి వచ్చి నీ
డమ్ముల నిద్రనోవ ప్రకటస్ఫుట పంచమగీతి సృష్టి మ
ర్మమ్ముల వ్యాఖ్యసేయ నమరన్ పిలచున్ పిక జంపతీతతిన్.

ఉ.

ఏ యెడ నుండియో యివె నవేందుసుధామయరోచు లీవనిన్
ప్రాయపు వెన్నెలన్ గలయబ్రామెడు - ఎవ్వతె యీ మనోజ్ఞ? ఓ
హో! యిదె వచ్చుచున్నది మహోన్నత భక్తిరస ప్రపూత హ
ర్షాయత లోచనాంబురుహ, అద్రితనూజ మనోహరాకృతిన్.


ఉ.

ఈ మహనీయ గాత్రి మధురేక్షణ పంక్తులలో, నటించు ది
వ్యామల పాదపద్మ మృదుచాలనలో, హసియించు చాలులో
కాముని ప్రాణముల్ దివిజకాంతలకోమలకుంతల ప్రభా
స్తోమము గూడు కట్టినవి - శుష్కజగంబిక పల్లవించెడిన్.


ఉ.

మానితహస్తయుగ్మ మధుమాస మహోదయ పత్రపుష్ప మా
లానవ వాసనాలహరి లాస్యము చేయ మహేశు కంఠసీ
మానల మందు, భంగిమ నుమాసతి నిల్చి శుచిస్మితాంబుజ
శ్రీనవకమ్ములన్ గనగ జిత్తజ కేతన కాంతి గ్రాలదే?

22


(ప్రతిభ 1945 అక్టోబరు)