వావిలాల సోమయాజులు సాహిత్యం-1/మధుప్రప/సమస్యాపూరణం
'సమస్యాపూరణం'
దత్తపది
(రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న - అన్న రామాయణ పరాలైన పదాలను భారతార్థ భావాన్ని గ్రహించి పూరించమని అడిగితే, దుర్యోధనుఁడు భానుమతితో, పద్మవ్యూహ సమయంలో అభిమన్యుఁడు, తమ కుమారుఁడైన లక్ష్మణకుమారుఁడిని అస్తమింపజేయటమనే భావాన్ని గ్రహించి ఇలా పూరించటం జరిగింది. )
శా. "మిత్రవ్రాత మనోభిరాముఁడయి సామీచీన్యయోధారిరా
డ్తోత్రాభుగ్న మహోగ్రలక్ష్మణుడనై, క్రోధావతారంబుతో
పుత్రుండుద్ధతయుద్ధ తంత్ర భరత ప్రోద్దూత సంరంభియై
శత్రుఘ్నుండయి చేరె లక్ష్మణుఁడు భాస్వత్స్వర్గమున్ తన్విరో!”
గమనిక: రామః పశువిశేష (పెద్ద దుప్పి) జామదగ్శ్యే హలాయుధే రాఘవే చ అసితశ్వేత మనోజ్ఞఘత వాచ్యపత్ లక్షణం లాంఛనే నామ్ని రామభ్రాతః లక్ష్మణః అమరము భరత, శత్రుఘ్నపదాల ధాత్వర్థాలు గ్రహింపబడ్డాయి)
స. ధీరత్వంబున దోమ తుమ్మెఁగదరా దిగ్ధంతు అల్లాడఁగన్.
పూ.శా. "తోరంబౌ ద్రగడం బొనర్చియని కుద్యోపింప మేల్కొల్పినన్
ఘోరాకారుఁడు కుంభకర్ణుఁడు మహాక్రోధంబునన్ లేచి, పొ
ల్పారన్ మద్యము గ్రోలు వేళ్ళు ముకుఁ గోళ్ళన్ జేరి నర్తింపగా
ధీరత్వంబున దోమ, తుమ్మెఁ గదరా దిగ్దంతు లల్లాడఁగన్.”
స. అందరు నందరే మఱియునందరు నందరె యంద రందరే.
పూ. ఉ. “అందరు సత్కళావిదులు నర్థివరించుట వ్యర్థ యత్నులై
నందిమిఁ జూచి, కాచి జననాయఁక త్వన్నగరీ విలాసినీ
మందిర వీధులందుఁ బలుమారుట పల్లవులాడ విందు" వీ
రందరు నంద, రే మరియు నందరు, నందరు, అందరందరే!”
స. పగలే సూర్యుడు ఘూకమై యడఁగె విశ్వం బద్భుతం బందఁగన్
పూ.మ. "పగయౌ మేరువుఁ గెల్వ వింధ్యనగ మప్పాటన్ విజృంభించి తా
ఖగతారా పదముల్ గమించి నిలువన్ కాలజ్ఞతా శూన్యమౌ
నిగణంబుల్ తను వేడ కుంభజుఁడు సందీపించి వాక్రుచ్చె
పగలే - సూర్యుఁడు ఘూకమై యడఁగె విశ్వం బద్భుతం బందఁగన్.
స. ఒక రూపంబు ధరించి కొల్చు హరియా బాలేందు చూడామణిన్.
పూ.మ. "సకలాదిత్యులు దేవతాన్నమును విశ్వాసంబునన్ ద్రావునం
తకు దైతేయుల మోహినీ నటన మధ్యాసించి నిల్పంగ వం
చకుఁడై లీలఁ జరించు వేళ సుతు నొందం జేరినన్ పంక జాం
బక రూపంబుధరించి కొల్చె హరియా బాలేందు చూడామణిన్.
స. ఒక రూపంబు ధరించి కొల్చె హరియా బాలేందు చూడామణిన్.
పూ.మ. ప్రకటక్రీడగ సూర్యచంద్రులను చక్రద్వంద్వముంజేసి, యు
త్సుకతన్ భూరథమెక్కి, యజ్ఞజుని నుద్యోగించి, సారథ్య పా
లకుగా, ఆ త్రిపురాసుర ప్రతతి గెల్వంబోవు నవ్వేళ నం
దొక రూపంబు ధరించి కొల్చె హరియా బాలేందు చూడామణిన్."
స. పక్కున నవ్వె గౌరి తలంబ్రాలను బోయుచు రాజమౌళిపై.
పూ.ఉ. “ఎక్కితినే శిరమ్ము, నటియింపగ నేర్తు - తపించి యేటికే
చక్కని చుక్క వచ్చి" తని జాహ్నవి మేలఁపు జూపు జూడ “ఓ
అక్కరో! నాదె ఈశు - హృదయంబని యక్కున నిల్పి వీక్షలన్
పక్కున - నవ్వె గౌరి తలంబ్రాలను బోయుచు రాజమౌళిపై
స. పక్కున నవ్వె గౌరి తలంబ్రాలను బోయుచు రాజమౌళిపై
పూ.ఉ. మిక్కిలి మక్కువన్ పతిని మించి శిరమ్మున నుంచు కోర్కెమై
నిక్కుచు పెక్కుమారులుగ నేర్పునఁ బోసి యొకింత వెన్కకున్
జిక్కగణంబు లాయలపుఁ జేతల గేలిగ నాడి చూపు చో
పక్కున నవ్వె గౌరి తలంబ్రాలను బోయుచు రాజమౌళిపై.
స. కారాగారమునన్ ధ్వనించే నవురా! గంధర్వ సంగీతముల్ .
పూ.శా. “మీరేకప్పములీయఁ దెచ్చితిరి స్వామిన్ దైత్యరాజేంద్రునిన్
జేర న్వచ్చినవారు తెల్పుఁడన విస్తీరమ్ముమై చూప వీ
ణారావమ్ముల వింత వింతలగు విన్నాణాలు దేవద్విష
త్కారాగారమునన్ ధ్వనించె, నవురా, గంధర్వ సంగీతముల్ .
స. కారాగారమునన్ ధ్వనించె, నవురా! గంధర్వ సంగీతముల్
పూ.శా. హేరంబంబున బంక్తి కంధరుడు లోకేశా! నినున్ గెల్వగా
ప్రారంభించిన శక్తితర్పణకునై రాజర్షి శీర్షాళిపెం
పారన్ వ్రేల్చెడు వేళ పాడుఁడని యాజ్ఞాపింప పౌలస్త్యు హ్రీం
కారాగారమునన్ ధ్వనించె నవురా! గంధర్వ సంగీతముల్.
స. ఆజికి నిట్లనున్ పరుని యాలికి నిట్లను నర్థి కిట్లనున్.
పూ.ఉ. ఈ జగమందు లేరు సరి యెవ్వరు భండన సవ్యసాచి, అం
భోజ విశాలలోచనల బుద్ధి కలంచు ననంగమూర్తి వి
భ్రాజిత దాన కల్పకము రాయనభాస్కర మంత్రి సత్తముం
డాజికి నిట్లనున్ పరునియాలికి నిట్లను నర్థికిట్లనున్.
స. రాతినిఁ గూడి పొందె నలరాయని ముద్దులపట్టి ప్రీతితోన్.
పూ.ఉ. “ఆతతశక్తి యుక్తుఁడగు కీన1 న్నతనున్ శిశుపాలు యఁగా
బ్రీతివహించుటల్ దెలిసి, పెండ్లికి రమ్మని వార్త రుక్మిణీ
కాతరనేత్ర పంప2 యదుకాంతుఁడు వచ్చి వధించి దానవా3
రాతినిఁ గూడి పొందె వలరాయని4 ముద్దులపట్టిఁ5 ప్రీతితోన్.
- 1. అన్న: రుక్మి
- 2. యదుకాంతుడు: శ్రీకృష్ణుడు
- 3. దానవారాతి: రాక్షసరూప శత్రువైన రుక్మి
- 4. వలరాయని: మన్మథుని
- 5. ముద్దులపట్టి ముద్దుబిడ్డ
స. యమునఁ బురారిఁ గెల్వగ భయానకలీల నెదిర్చి పోరఁడే!
పూ.చ. “1విమతులఁ గెల్వఁగా వలె 2త్రివిష్టపరాజతనూజ! భక్తి న
య్యమరులఁ గొల్చి తెమ్ము దివిజాస్త్రము లంచన నన్నయాజ్ఞను
త్తమతపమాచరింపఁగ 3పృథాసుత మధ్యము కైన నొంటిక
య్యమున 4పురారిఁ గెల్వగ భయానక లీల నెదిర్చి పోరఁడే!
స. భీష్ముని పెండ్లి కేగిరట పిన్నలు, పెద్దలు నెల్లవారలున్.
పూ.ఉ. 5“ఇష్మశరానువిద్ధు మనుజేశునిఁ దేర్పఁగ బ్రహ్మ చర్యతై
క్ష్ణొష్మము, భీష్మమౌ ప్రతిన బూని యొనర్చుచునుండె దీనిని
గ్రీష్మ వికర్తన ప్రకర ఖేలన శుష్ముఁడటంచు మెచ్చుచున్
భీష్ముని - పెండ్లి కేగిరట పిన్నలు పెద్దలు నెల్లవారలున్.
స. గజిబిజియయ్యె సంద్రము, ప్రకంపితమయ్యె హిమాచలేంద్రమున్.
పూ.చ. "భుజబల సంపదన్ తరువ భూరి హలాహల ముద్బవింపన
6య్యజుడును, 7నిర్జరుల్ 8దనుజు లార్తిని వేడుకొనంగఁ, బూని నీ9
రజనయనుండు మ్రింగుమన రాజశిరోజుఁడు మ్రింగనంతపై
గజిబిజి యయ్యె సంద్రము, ప్రకంపితమయ్యె హిమాచలేంద్రమున్.
స. జారులు పిల్తురమ్మ గిరిజాపతి వద్దనఁ డేగవే చెలీ!
పూ.ఉ. "ఊరటలేని చిన్నదెడనున్నది స్వామికి నొంటిఁ దెల్పుకో
గోరుచు ముందు పంపెనని గొప్పగ నీ మరులెల్లఁ దెల్పితిన్
వారలనుగ్రహించిరి కృపాపరతన్ భయమందనేల? పూ
జారులు పిల్తురమ్మ! గిరిజా పతికాదనఁ డేగవే చెలీ!"
- 1.విమతులు: శత్రువులు
- 2.త్రివిష్టపరాజతనూజ: స్వర్గాధిపతి పుత్రుడు (అర్జునుడు)
- 3. వృధాసుత మధ్యముడు (అర్జునుడు)
- 4.పురారి: రుద్రుడు
- 5. ఇష్ము: కాముడు, వసంతుడు
- 6.అజుడు: బ్రహ్మ
- 7. నిర్జరులు: దేవతలు
- 8.దనుజులు: రాక్షసులు
- 9. నీరజనయనుండు: విష్ణువు