రారమ్మ రారమ్మ రారమ్మ రారమ్మ
ఓ తెనుగు పూలార! ఓ యనుగు పూలార!!
దివిజలోకమునుండి దిగిరాడె దిగిరాడె
ఏటి కరుదెంచెనో ఈ పురూరవమూర్తి
అతని పాదాలకడ నాత్మార్పణము చేయ
మీ లేత భావాల మీ చిరుత గీతాల
మధుమాస దీధితుల మధుహాస వాసనల
రారమ్మ రారమ్మ రారమ్మ రారమ్మ
ఓ తెనుగు పూలార! ఓ యనుగు పూలార!!
2.
ఊర్వశీప్రియు డీతడున్మత్త పథికుండు
కృష్ణపక్షపు వేళ గ్రీడించు భావుకుడు
మధుర ప్రవాసమున మరగి సోలినవాడు
మహతీ మహాశ్రుతుల మాకరందము గ్రోలి
మనకీయగా నేడు మనవాడకిదె వచ్చె
రారమ్మ రారమ్మ రారమ్మ రారమ్మ
ఓ తెనుగు పూలార! ఓ యనగు పూలార!!
ఇతరులతొ సొదలతో ఈ హాస మృదువాస
నలతోడ కొసరు తేనెలతోడ రొదతోడ
ఇతని ప్రణయపు గాథ ఎనలేని పూ బాధ
కన్నీరు కాల్వగా కరిగించె నీ జగతి
మన చిన్ని హృదయాల మన కన్నెభావాలు
పల్లవింపగ జేయ పలవింపగా జేయ
రారమ్మ రారమ్మ రారమ్మ రారమ్మ
ఓ తెనుగు పూలార! ఓ యనుగు పూలార!!
6.
ఆమె యాషాఢ జలధరాయతన సీమ
నొడలు పులకింప నటియించి యొరగి సోలి
మేల్కొనుచు మెరపుటన్నుల మిన్న గాని
దీనుఁ డగు నన్ను నేలెడి తెరవ గాదు
నేకోరుకొనునతడు భర్త కొనెడి పతి ఎదనిచ్చుకొనునతడు
చిరునవ్వు నవ్వితే కరిగిపోయే అతడు
కన్నెర్రజేసితే కాగిపోయే అతడు
ఆడదెవతైనాను అలాటి పతికొరకె
అతిగాఢవైఖరిని అభిలాష పడుతుంది
ఒంటరిగ గదిలోన ఉంటె నను కలుసుకొని
నిలుచున్న నాగౌనులో తలవంచి దూర్చాడు
మోకాళ్ళపై తొడలమధ్య తలనొత్తుకుని
పతిగగ్రహియింపుమని ప్రార్థించె శోకిస్తు
ఇట్టి అతడిని నేను ఎటుల ప్రేమిస్తాను
జాలిపడుదువరింప జాలుదునే నాథుగా
ఓ పిచ్చిదేవుడా ఒక్కతెను వీరిలో
ప్రేమించి చూడరా బ్రతుకు బయటపడుతుంది
వట్టివే వెర్రికేకలతో భయపెట్టి దే
వుళ్ళ భంగము పరచు పాటకర్థమ్మేమి?
కోటానుకోటి ప్రజ కొలిచేటి దైవాల
చిలిపి కారణములను చెప్పి తిట్టించేటి
ఓ భ్రష్టమానవా! గాయకా! ఓ దుష్ట రచయితా
ఇది ఎంతొ దారుణము! ఇది జాతి మారణము!!
నీబాలలో
నీబాలలో పరమోత్తమ నిధులు సృజింపుము తల్లీ
సంచలనము, ఉత్తేజము చక్కగ కలిగించు మంచి
వాతావరణము గూర్పుము నీయుము వాంఛితాల నీబాలకు...నీ బాలలో
నీ బాలకు గల సృజనా నిర్మల సామర్థ్యముతో
రంగవల్లులను రసనలలో రమ్యలేఖనల స్వరముల...నీ బాలలో
ఇంటినుంచి దూరముగా ఎక్కడికిని పోనీయకు
ఇంటిలోన కంటిముందు ఏదో పని చేయింపుము...నీ బాలలో
ప్రదీప్
ఓరీ ప్రదీప్ నీవొక్క వీరుడివేను
నీవు దండెత్తితే నిలువగలమా మేము!
నీ నాన్న కంటేను నీవు బలవంతుడవు,
వృద్ధుడను, తండ్రి నీ వద్ద తట్టుకోలేను!
ఎట వనితలు గౌరవింప బడియెదరో
ఎట వనితలు గౌరవింప బడియెదరో ఆ తావుల
సకల దేవతాజాతులు తగుతృప్తిని పొందుతారు.
మహిళాజను లెల్లవేళ మన సంస్కృతి రక్షింతురు (రక్షకులు)
పరమ కృతజ్ఞతతో, ఘన భక్తి, మాన్యతా, కారుణ్యముల నొసగి గణియింపుడు.
వనితాతతికెవ్వరైన కష్టములను కల్పించుట
దోషమ్ముల నొనరించుట బహుళపాపకృత్యములగు.
సోదరి పరిణయ వేళను ఆదరానురాగముతో
రథచోదకుడై యుండగ కంసుం డాయమయష్టమ
సుతుచే మృతినొందెదనుచు గగనవాణి తెలియజేయ
కంసుడు విని కృద్ధుండై సోదరి దేవకి చంపగ ఖడ్గముతో, పైకి వచ్చె
దేవకి పతి వసుదేవుడు యువరాజు కంసునితో
నారీవధఘోరపాప కరణమ్మని కాననాయె ఖండింపగ
వలదనుచును వాదించె మహామృదువుగ
తప్పని సరియైనను మృతి బహుదారణ భీషణమ్ము
దానిని ఒకడెవ్వడైన తప్పించుకొనంగా లేడు
అతితీక్షణమైన భీతి ఆక్రమితుండైన వ్యక్తి
ఎట్లు పరమపాపముగావింపగ తా బూనుకొనునో ఈ అంశము సూచించును.
అతడు బిడ్డలందరి నట పుట్టిన క్షణమే కంసున
కర్పించు ప్రతిజ్ఞతో వసుదేవుడతని నారీ హత్యాదోషము మాన్పించెను.
హృదయ శూన్యుడే కంసుని చేత ఖండనము నొందుట
కై బిడ్డల నిచ్చుటలో చేసిన ఘనమో ప్రతిజ్ఞ
సర్వము సాగించుటలో పూర్ణముగా సత్యసంధు డై ఒప్పెను వసుదేవుడు.
ఇందులెచట సాటిలేదు స్త్రీ జాతిని పరిగణించు
చేష్టను గన నీ జగమున తుల్యుడు లేడతని కెవడు
భావములు
నిద్రారహిత నిశీధము శిరమును తినివేసే నా
వెన్నెన్నో విషయమ్ములు
నేత్రమ్ములు అపుడపుడు నిండి పొర్లిపోతుంటవి
అది పొంగిన సమయమ్మున లతలవోలె భావమ్ములు
హృదయమ్మును చుట్టిప్రాకు.
దీపాలను వెల్గింపగ విఫలీకృత చేతనతో (తేజము)
లేఖిని పత్రముల నొంద కలుగు హఠాత్ప్రోత్సాహము
పత్రముపై భావమ్ముల నాటటమ్ము కోసమ్మే
లేఖిని చలియిస్తున్నది తిరిగి శాంతి, ఘననిద్రను
ఎప్పటివలె వచ్చురేపు తెస్తున్నది ఇదే వెనుకను.
సునంద కె. మీనన్ కవితకు తెలుగు అనువాదం
(సండే క్రానికల్ జూన్ 1, 1986)
వృత్తి వనిత
మొన్న ఒకదినాన నేను వీధుల్లో ఒక మిత్రురాలి
కడు ఘనముగ మారిపోయి నట్టిదాని కలుసుకొంటి.
ఆమె వీధిలో క్రిందకు చారుగతిని గడచివచ్చె నడ
స్థూల అయిన ఒక బాలిక ఆమె ప్రేమ చిహ్నములతో నికటమ్మున చేరి ఉంది.
ఎత్తుకున్నదామె ఇంకో బొద్దు, ముద్దు పసిబిడ్డను
ఇద్దరము హఠాత్సంగమమునకెంతో నిర్ఘాంతులమై పోతిమి నిశ్చలముగ.
సత్యమ్ములు రాగోపేతమ్ములు నగు భూషణములు
పరివర్తన పొందిన తరి చిరునవ్వులు, వెనుమళ్ళుట
లంత కాలమానములను వీక్షచేసుకొనుటలయ్యె
వృత్తివనిత నైన నేను
ఆలస్యమ్మయిపోతిని
మనుజపత్ని శాంతముగా శీతలముగ నప్పుడుండ
క్షణము నేను తలపోసితి నిశ్చయముగ నేనదృష్ట
శాలిని నాకున్నవి గద వృత్తి గృహము సమయధనము
తదుపరి భావము నాలో పరివర్తన చూపినది
నాలో ప్రేమాపేక్ష నప్పుడనుభవింప జేసినది.
ఒక స్త్రీ పొందగ దగినది సకలమామె పొందగలదు
అయితే మరినేనా? నే నేదుఃఖింపగ దగదు.
ఎందువల్ల నంటే నే స్త్రీ స్వేచ్ఛా చిహ్నాన్ని
అవును నిజమ్మది వనితా స్వీయ సృష్టులందొక్కటి.
అది మూలంగా బాలది అయినవారి ఓహోహో వృతిస్త్రీ ఇటనున్నది.
ఇదియే నీ దౌర్బల్యము నేత్రమ్ములు మూసుకొమ్ము నీ హేతువు నొప్పుకొమ్ము
జీవితమ్మున నాడే నీక్రీడయె గాన నీవు శోభాయుత పక్షమ్మును పార్శ్వమ్మును
వీక్షచేసి అద్దానిని సృష్టింపుము, సుందరముగ.
అనువాదము సుసన్ అబ్రహం (సండే క్రానికల్ జూన్ 1, 1986)
యోజనలు
అంతా అయిపోయినదిట అస్తమించినావిచ్చట.
శూన్యం నా అంతరాన చుట్టూ ఘన సుస్వనము
కాలము నా స్తబ్ధాంగుళి జాలము ద్వారా జారెను
నా శీతల చిబుకమ్ముల చల్లని చుట్టునున్న నిస్తబ్ధత
ప్రణయ కృతజ్ఞతలెన్నో గుసగుసలాడుతు సృజించె
లోకఛిన్నాభిన్నత చెవుడు పడెను శ్రవణమ్ములు
నా చుట్టును నున్న కాలశూన్య ధూళి ధ్వంసాలతో
జగమంతా దాని ఐక్య సంపద కోల్పోయినది
ఈ విధ్వంసాలల్లో తారాతేజము వీడిన
వడలిన కన్నులు కలిగిన ముఖములెన్నో చూచాను
చిరునవ్వుల పెదవులు
తము కలుపమనే కాంక్షలతో అర్థించుట చూచినాను
వారందరు నా వలెనే వారి జీవితాలును సం
ఘటనలు నా ప్రస్తుతంతో భయపెట్టగ నా భావిని
వర్తిస్తున్నవి దృఢముగ ప్రతిబింబిస్తున్న నన్ను వానిలోన చూస్తున్నా
వాని పతన సౌమ్యమ్ములు నామశూన్య భీషణతతో
వ్యధనెట్టుచు నింపివేయు
నేను వారి ఉత్విస్తృత కరతలాలనుంచి ఎట్లో
అనుపాతన పొందినాను.
ఎగతాళిని చేస్తువారు - వాడినవీ, దుఃఖోపే
తాలు వాని నిరీక్షణలు నిందిస్తవి ఘనముగ నను
అయితే నాదౌ సౌమ్యము క్షయమున వసియించే వానిలోన లోపింపదు.
ఆ అలసని కన్నులలో ప్రశ్నలకే కనుగొంటూ
నా చుట్టూ కట్టుకొంటి నాణ్యమైన కుడ్యమ్మును. యొకటి
దూరంగా, దూరంగా త్రోసివైచి నా రక్షల
వాత్యావళి చండంగా అతిశక్తితో వచ్చినది. అరుదెంచెను
అయితే నే ప్రస్తుతమ్ము ఆ స్థితి నెటో అధిగమింప
శక్తినొందినాననుచును (నంటూ) స్థిరతరముగ భావింతును
ఛిన్నాభిన్నత నొందక నా మది తగినంత దృఢము
గాగస్థిరత నార్జించెను నా ఇంద్రియములు నీసా
మీప్యపు తావులకిపుడును రంధ్రాలైపోతున్నా
నా జీవితమును నెంతగ (దుష్ట) వికృతమ్మొనరించినావొ
అవగతయ్యెనె నీకు?
నిన్ను మరల కలిసెడి అనుభూతిని నే పొందననుచు
శాంత్యాచ్ఛాదన నాత్మను కప్పుకొన్న దృఢమౌ నా ఏకాంతత వేడుకొనును
అనువాదము: వనితా కిరణ పనాల్కర్ (సండే క్రానికల్, జూన్ 1, 86)
త్యాగము
దైవానురాగ శూన్యాలే సంప్రదాయములు కేవల
భౌతికములు, మానసికములైన అనుష్ఠానములు (క్రియాచరణములే)
శాస్త్రవిధుల వ్రతములలో దైవపూజనములందున
దాంభిక కర్మాచరణము ఎంతగ భారమ్మయినను
అవి ఎపుడు తమంత తాము ఆధ్యాత్మిక నిష్ఠితమ్ములై ఒప్పవు వీక్షింపగ
అతడి భక్తి సూత్రాలలో భక్తిని నారద మహర్షి
పరమ ప్రేమ రూపమ్మని నిర్వచించినాడుమున్నె.
ప్రణయము పరిపూర్ణంగా ప్రభుసంగమ మొందుటతో
పరాకాష్ఠ నొందుతుంది భక్తుని ప్రణయము పెరుగగ పెరిగిన
పరమ ప్రేమాన్వితుడును పరమ రమ్యమూర్తియునే
ప్రభుని పొందుటకు నిరతము నాతని యభిలాష పెరుగు.
అతడు సర్వేశ్వరునకు సన్నిహితుడు సారూప్యుడు
నౌచు ప్రవర్తింపగలడు సకల ప్రాపంచిక బం
ధాలతో, ఆకర్షణలతో జీవన మశ్రద్ధ నొందు
ఈశునితో సంయోగము నొందుటయే అతని ఏ
కైకమ్మగు విషయమౌను
ఏమైనా ఆసక్తుడు, ఎంతటి ఉత్కంఠనున్న
జగమును, కర్తవ్యములను త్రోసిపుచ్చబూనుకొనడు
ప్రాపంచికములును, పుణ్యములునునైన కర్తవ్యము
లన్నిటి నిస్వార్థముతో పరమేశుని పాదద్వయ కర్పించుట కొనరించును
ఈశ్వర సంసిద్ధికి నవకాశయొక్క త్యాగముననె
త్యాగ మన్న సంఘకుటుంబాల విడిచిపెట్టుటన్న
అర్థము కాదది ఈశ్వర సంతృప్తికి స్వార్థరహిత
క్రియాచరణ మటులొనర్చ ప్రతికర్మ పునీతమౌను
అది వ్యక్తిని బంధింపదు సాంఘిక సేవకు బూన్కొను
ముందు నెడద దైవభక్తితో పరిపూరితము సేయు
డని అనుచరులకు చెప్పగ లేదే శ్రీరామకృష్ణ
లేకున్నను మానవుండు స్వార్థపరుండగుటకెంతో అవకాశమ్ముండును గద!
దైవ ప్రణయమ్ము తీక్షమయ్యెడు కొలదిని భక్తుడు
భగవానునితో పరిపూర్ణముగా సంయోగమందు
ఆ దైవము ప్రతితావున అధివసించుటను కన్గొను
అప్పుడతడు నైజముగా సకల మనుజజాతిపైన యెదను
అనురాగము నొందుటగా కన్యమేదియును నెరుగడు
మతోపన్యాస గేయము ఈనాడు (జూన్ 13, 86)
హిప్పీ
మధుపాత్రలనింపి మనం సుఖయాత్రలు సాగిద్దాం
సమయానికి వీలుపడ్డ నరనారీ సహచరులతో
సాగిద్దాం జీవితాల మన బ్రతుకుల నీతి ఇదే
అని విశృంఖలముగ భావించుట కలవాటు పడ్డ
హిప్పీలచే ఏదో పని చేయిద్దామనుచు బ్రిటన్
పథకాలను వేస్తున్నది, స్వేచ్ఛగా తమనీతులతో
జీవించే హిప్పీలను అటు వీరంగముల నుంచి
అధికారులు తరుముతుంటే న్యాయస్థానాలకేగి హిప్పీ సంస్కారులు
తమ స్వేచ్ఛకు కడుగాఢముగా పోరాడుతున్నారు.
ఓ దేవదేవ
ఓ దేవదేవ నే నుత్సహించెడు రీతి
పుణ్య సేవికనుగా పుట్టింపు మో స్వామి!
వాత్సల్యమున నన్ను వైతాళికను జేయ
ప్రాభాత గీతికల ప్రౌఢి మేల్కొలిపెదను ..... ఓ దేవదేవ
దేవదాసినో నేను దేవాలయమునందు
ఉభయ సంధ్యలనాట్య మొనరించి రంజింతు ..... ఓ దేవదేవ
దేవారులను జేర్చి భావజక్రీడలతో
హర్షింప జేయుతరి అర్చింతు ప్రీతితో ..... ఓ దేవదేవ