వావిలాల సోమయాజులు సాహిత్యం-1/కన్నీరు
కన్నీరు
అంకితం
హిందీ సాహిత్య రంగంలో యుగకర్తవంటి మహాకవి శ్రీ జయశంకర ప్రసాద్ కావ్యాలు రెండు. 'ఆంసూ', 'కామాయని' మా నాన్నగారు శ్రీ వావిలాల సోమయాజులు గారు తెలుగులోనికి అనువదించారు. హిందీ సాహిత్యచరిత్రలో మన భావకవిత్వ రీతివంటిది అయిన 'ఛాయావాద' రీతిలో ప్రముఖుడైన శ్రీ జయంశంకర్ ప్రసాద్ 'ఆంసూ' కావ్యం ఆరోజుల్లో ఎందరినో ఆకర్షించి ప్రభావితులను చేసింది. చిరవిరహం, ప్రణయభంగం వాటినుండి జనించిన నిర్వేదం, ఆ నిర్వేదం అంచున నల్లమబ్బుకు వెండి అంచులాటి ఆశాద్యుతి వీటన్నిటి సమ్మేళనంలోనించి ఉద్బుద్ధమైన ప్రణయమాధుర్యం ఇవన్నీ మానాన్నగారిని ఆకర్షించి వుండాలి. ఆ కావ్యాన్ని తెలుగువారికి పరిచయం చేయటం ఒక్కటే ఆయన లక్ష్యం అనుకోవ డానికి వీలులేదు. ఆయన జీవన సంస్కారంలోని ప్రణయరేఖామార్దవం వల్లనే అనువాదం ప్రారంభమైందనటం సత్యం.
ఆ ప్రణయరేఖాచాలనం వల్లనే ఆయన ఈ కావ్యాన్ని తన జీవన సహచరి ధర్మపత్ని అయిన మా అమ్మగారికే అంకితం చేయాలని భావించారు. జీవితంలోని ఆటుపోట్లు అన్నిటిలోనూ, అద్వైతం సుఖదుఃఖయోః అన్నట్లు నిలిచిన ఆమెకు కవిగా తన ప్రేమపూర్ణ కృతజ్ఞతను ఈ విధంగా చెల్లించాలని మా నాన్నగారు భావించారు. అది ఆయన జీవించి వుండగా సఫలం కాకపోవటం ఒక దురదృష్టం కాగా ఆయన భావనను సఫలీకృతం చేసి పితృఋణం చెల్లించుకొనే అవకాశం ఆయన సంతానమైన మాకు కలగటం మా అదృష్ట విశేషంగా భావిస్తున్నాము.
మా నాన్నగారు శ్రీవావిలాల సోమయాజులుగారి హృదయ సంవాదంగా ఈ కావ్యాన్ని మా అమ్మగారు శ్రీమతి కైకమ్మగారికి సమర్పిస్తున్నాము.
10-1-2001వావిలాల బృహస్పతి
కన్నీటి కైవల్యం
"కవి కౌస్తుభ” డా॥ ఆచార్య తిరుమల 301, నందిని కాంప్లెక్స్ మోజంజాహి మార్కెట్, హైదరాబాదు-95
అనువాద ప్రక్రియ ద్వారా ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, పరిధిని విస్తృతం చేసిన మహనీయుల్లో ప్రాతఃస్మరణీయులు బ్రహ్మశ్రీ వావిలాల సోమయాజులు. గారు. సంస్కృతాంగ్ల హిందీ భాషల్లోని ఉత్తమోత్తమ రచనల్ని తెలుగువారి కందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. సంస్కృతం నుండి నీలకంఠ దీక్షితులవారి కలి విడంబన శతకం, భరత రస ప్రకరణం, సర్వేపల్లి వారి గీత, ఆంగ్లం నుండి షేక్స్పియర్ మేక్బత్, ఆంటోని అండ్ క్లియోపాత్ర, జూలియస్ సీజర్ - నాటకాలు, రాబర్ట్ స్టీవెన్ సన్ నవల డాక్టర్ జెకిల్ అండ్ మిష్టర్ హైడ్, ట్రయల్ బై జ్యూరీ - న్యాయనిర్ణేత, ఠాగూర్ మహాకవుల మతం-హిందీ నుండి జయ శంకర ప్రసాద్ 'కామాయని', 'ఆంసూ' - వంటివి వావిలాల వారి అనువాద రచనల్లో రత్న సదృశాలు. అంతే కాకుండా కేథలిక్ క్రైస్తవ మతసాహిత్యాన్ని కూడా ఆంగ్లం నుండి తెనిగించి విద్వత్కవికి కావల్సిన మతాతీత మానవతా ధర్మాన్ని కూడా ఆయన ప్రదర్శించారు. ఈ విషయంలో విశ్వనాథ, దేవులపల్లి వంటి వారిలో లేని ఒకానొక విశిష్టగుణం వావిలాల వారిలో మనకు కనిపిస్తుంది. కాగా -
అనువాదం - 'యథామాతృకం', 'యథేచ్ఛ' అని రెండు విధాలు. వావిలాల వారు రెండిటా సిద్దహస్తులు. వీరి షేక్స్పియర్ నాటకాలు యథామాతృకాలు కాగా మిగిలిన అనువాదాలు యథేచ్ఛగానే కనిస్తాయి. అసలు, ఏ అనువాదం చదివితే మూలం చదవాలని బుద్ధిపుట్టదో ఆ అనువాదం ఉత్తమం. అటువంటి ఉత్తమోత్తమ అనువాదాలు వావిలాల వారివి. వాటిలో ఈ 'కన్నీరు' - (ఆంసూ) ప్రస్తుత పరిశీలనా పరిధి! హిందీలోని విశిష్ట ఖండకావ్యాల్లో ఆంసూ (అంసూ) ఒకటి. 'ఆంసూ' అంటే కన్నీరు. తెలుగులో కవిత్రయంలా ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రసాద్ పంత్-నిరాలా లు భావకవిత్రయంగా, 'ఛాయావాద కవిత్రయం'గా పేరుపొందారు. వీరిలో ప్రసాద్ అంటే జయశంకరప్రసాద్. ఈయన 1925లో రాసిన కావ్యమే ఆంసూ. ఇది బహుధాప్రశంస లందుకోవటానికి కారణం దీనిలోని వస్తువు, భాష. అంతే కాదు, వేదనకి అక్షరరూపమిస్తే అది ఆదికావ్యంలా అజరామరమే కదా! 'కన్నీరు' ఒక మహోత్కృష్ట సృష్టి!
మహాకవి జయశంకర ప్రసాద్ 19వ శతాబ్ది తొలి దశకంలో బెనారస్ (వారణాసి) లో కాన్యకుబ్జ వంశీయులైన ఒక వైశ్యకుటుంబంలో జన్మించాడు. బాల్యమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో గడిచింది. 12 ఏళ్లకే తండ్రిపోవటం, ఇంటి దగ్గరే చదువుల వల్ల ఆయనలో కొన్ని ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. కాలక్రమంగా ప్రసాద్ ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, ఫార సీ, సంస్కృతం, ప్రజ భాషలు క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. పురాతత్త్వ (పరిశోధనా) విషయాలు, వేదోపనిషత్పురాణేతిహాసాలు, బౌద్ధాది మత సాహిత్యాలన్నీ ఆసాంతం ఆకళింపు చేసుకున్నాడు.
బాల్యం నుండి ఎదురైన కష్టాలు ప్రసాద్ని భావుకుణ్ని, కవిని చేశాయి. 1911లో తొలిగా ఆయన 'కానన్ కుసుమ్' కవితాసంపుటి వెలువడింది. 'ప్రేమ పథిక్' రెండో రచన. 1925లో 'అంసూ' వెలుగు చూసింది. అయితే 'కామాయని' ఆయనికి కీర్తి కిరీటమయ్యింది. దాని ఆవిష్కరణతో ప్రసాద్ మహాకవిగా స్థిరపడిపోయాడు.
కవితలే కాకుండా, నాటకాలు, చారిత్రక నాటకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, ఎన్నెన్నో రాశాడాయన. హిందీలో ఆయన పేరు మీద ఒక 'యుగమే ఆరంభమయ్యింది. ఆ మహా ప్రతిభావంతుడు 1936లో కన్నుమూశాడు. లోకానికి 'అంసూ' మిగిలింది. జీవన సమరాన్ని ప్రేమశక్తి జయిస్తుందని 'ఆంసూ' ఆంతర్యం ఆయన నమ్మకం. దాన్నెవరు కాదనగలరు?
'ఆంసూ' కంటే ముందు ప్రసాద్ లౌకిక ప్రేమ, యౌవన విలాసాలు, విశృంఖల స్వప్నాలు, స్వేచ్ఛాభావాలు ప్రతిపాదించాడు కానీ 'ఆంసూ' వచ్చేసరికి ఆయనలో జీవిత యథార్థ సంఘటనలు, వాస్తవిక అనుభవాలు చోటుచేసుకున్నాయి. ఈ'కన్నీరు' కళ్లనే కాదు హృదయాన్ని కూడా ప్రక్షాళనం చేసి పవిత్రీకరిస్తుంది. మానసిక ఉద్వేగం అణగారిపోయిన తర్వాత చిందిన కన్నీరిది. ఈ కావ్యంలో బాధల మధ్య నిలద్రొక్కుకోవటంలోనే జీవితానికి అర్థం, పరమార్ధము వుంటుందని, అప్పుడే సత్యదర్శనం సులభమవుతుందని కవి ధ్వనిగర్భితంగా బోధిస్తాడు. ఈ కావ్యం చదివిన పాఠకుడికి విరహం, భయం, నిరాశా దైన్యాల మధ్య సామంజస్యం ఏర్పరుచుకుని ధైర్యంతో 'ఆశ' తోడుగా ముందుకు నడవాలనే సందేశం లభిస్తుంది.
దేవులపల్లి శ్రీశ్రీ ల్లా కాకుండా ఈ కవి తన కన్నీటిని, బాధకి చైతన్య స్ఫూర్తిని కలిగించి ముందుకు నడిపిస్తాడు. చూడండి.
సబ్‌కా నిచోడ్ లేకర్ తుం
సుఖ్‌సే సూఖే జీవన్ మేఁ
బర్సో ప్రభాత్ హిమకణ్ సా
ఆంసూ ఇస్ విశ్వ సదన్ మే
దీనికి వావిలాలవారి అనువాద పద్యం చూడండి :-
తే.
ఈ సకలముల రసము గ్రహించినీవు
స్నిగ్ద సుఖముచే మిగుల శుష్కించి యున్న
జీవితమున విశ్వసదన సీమ నుషసి
హిమ కణమటు నశ్రువులు వర్షింపు మువిద !!
ఏ అశ్లీలత లేని యీ వియోగ విరహగీతి కావ్యంలో గడిచిన ప్రేమ సంఘటనల్ని నెమరు వేయటం. ప్రేయసి వర్ణన, వియోగ బాధలున్నా జీవితాన్ని అర్థాంతరంగా ముగించని అత్మస్థైర్యంతో బాటు ఆధ్యాత్మిక రహస్యవాదం కూడా కనిపిస్తుంది.
మాదక్ థీమోహమయీ ధీఁ
మన్ బహలానే కీ క్రీడా
అబ్ హృదయ్ హి లాదేతీ హై
వహ మధుర్ ప్రేమ్ కీ పీడా||
అంటూ గుండెను చీల్చుకు వచ్చే ఆవేదనను శబ్ద మాధుర్యంతో వ్యక్తం చేస్తాడు. దీనికి వావిలాల వారి అనువాదం చూడండి:-
తే. మనసు నెదొ సంతస పరచుకొనెడు క్రీడ మాదకమ్మయ్యెను - విమోహమయము నయ్యె అట్టి మధుర ప్రణయ వేదనానిలమ్మె యెడద నిప్పుడీ గతిఁ గదిలించివేయు !! ఇతి వృత్తం చిన్నదే అయినా యిందులో గీతి కావ్యలక్షణాలన్నీ వున్నాయి. తన ప్రేమ ఫలించనందుకు వేదన, ఆశ్చర్యం, వర్తమానంతో గతాన్ని పోల్చుకోవటం పరియురాలి సౌందర్య వర్ణన ఆమె నిర్లక్ష్యాన్ని నిందిస్తూ జీవితంతో రాజీపడటం అంతా వ్యథాగత తాత్త్విక దృక్పథ సందేశం - సారాంశం.
ఆంసూ వర్షాసే సించ్ కర్ దోనోం హీ కూల్ హరాహో జస్ శరద్ ప్రసన్న్ నదీమే జీవన్ ద్రవ్ అమల్ భరాహో !!
ఈ అద్భుత భావ చిత్రణకి వావిలాల వారి అనువాదం చూడండి
తే. తడిసి కన్నీటి జడివాన తటములప్పు డుభయములు, హరితమ్ములై యలరుగాక ! ఆశరత్ప్రసన్న తటిని అమల జీవ న ద్రవము నిండి యుండుత నవనవముగ !!
అలాగే ఆంసూలోని
హైఁ పడీ యీ ముఁహ్ ఢక్కర్ మన్కీ జిత్నీ పీడాయేఁ వే హంస్నే లగీ, సుమన్ సీ కర్ కోమల్ క్రీడాయే !!
అనే పద్యాంశానికి
మానసవ్యథలెన్ని యీ మహిని గలవొ అన్నియును గప్పికొని మోము నున్నవి పడి, ప్రసవములు పోల్కి నయ్యవి లలిత ఖేల నము లొనర్చుచు చిలిపిగ నవ్వుగాక !!
అనే వావిలాలవారి అనువాద పద్యమెంత మెరుగులు దిద్దిందో 'లలిత ఖేలనం' చూస్తే తెలుస్తుంది. 'కామం' ప్రేమగా, 'నిరాశ' ఆశగా మారటంలోనే పరమార్ధముందనే సత్యాన్నే సందేశంగా ఈ కావ్యంలో కవి అందించాడు. 'కన్నీరు'లో వ్యథ ప్రధానమైనా అంతం విషాదం కాదు, శాంతి నైరాశ్య విజయమే ఈ కృతి విశేషం. వియోగంలో కుమిలే ప్రేమికుని కన్నీటి సంకలనం ఈ కావ్యం. ఒక రకంగా ఇదొక స్మృతి కావ్యం. సుఖదుఃఖాల్ని సమానంగా భావించి, నిస్సంగత్వంతో, నిర్మోహత్వంతో ఉండాలని, ఇలా 'ఆంసూ' లో ఉంటాడు కవి:-
లిపట్ సోతే థే మన్మే సుఖ్ దుఃఖ్ దోనోం హీ ఐసే చంద్రికా అంధేరీ మిల్ తీ మాలతీ కుంజ్ మే C జైసే!! దీనికి వావిలాలవారి అనువాదం చూడండి:-
తే. మంజులోజ్జ్వల మాలతీ కుంజమందు కౌముదియు నంధకారమ్ముఁ గలసినటుల! గడగి మనసున సౌఖ్య దుఃఖద్వయమ్ము లీలగాఁ జుట్టుకొని వినిద్రించుచుండె!!
తన జీవితంలో వ్యాపించిన వేదన నుండి లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ, ప్రపంచ బాధల్ని గమనిస్తూ, వాటికి స్పందిస్తూ కన్నీరు కార్చాలనీ, ఆ కన్నీరు లోకంలో ఆశని, ఉల్లాసాన్ని నింపాలని కవి వాంఛిస్తున్నాడీ కావ్యంలో. విషాన్ని గ్రోలి లోక కళ్యాణాన్ని సాధించిన శివునిలా కన్నీటితో వేదనలు దిగమ్రింగి నిర్మలమైన జీవితామృతాన్ని సాధించాలని కావ్య తాత్పర్యం.
హిందీ నుండి వావిలాల సోమయాజులుగారు తెనిగించిన 'కామాయని' 'కన్నీరు' రెండు కావ్యాలకూ తొలి పలుకులు నావే కావటం కేవలం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారికి కన్నీటితో కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను. కన్నీరు విద్వజ్జన విధేయుడు ఆచార్య తిరుమల. ఆంధ్ర ‘ఆంసూ' కావ్య భూమిక డాక్టర్ మల్లాది గోపాలకృష్ణ శర్మ, ఎమ్.ఏ(త్రయ), పిహెచ్.డి. (హిందీ), డి.లిట్ (సంస్కృత) విమర్శకాగ్రేసర, వైదిక, లౌకిక ఉభయసాహిత్యాలంకార, సాహిత్యరత్న, సాహిత్య సుధాకర, రాష్ట్ర భాషా ప్రవీణ, కృష్ణనగర్ కాలనీ, మౌలాలి, హైదరాబాద్-40.
స్వ.శ్రీ జయశంకర్ ప్రసాద్ రససిద్ధుడైన మహాకవి. కావ్యప్రపఞ్చమున, మహాకవిగ
పదికాలములబాటు నిలబడుటకు అపేక్షితములగు ప్రతిభా వైదుష్యములు, ఆయనలో
పుష్కలముగ ప్రాక్తన జన్మ సంస్కార ఫలముగ చిన్నతనముననే నెలకొనియున్నవి.
అందువలన తన పదునాల్గవ యేటనే, కవితలు వ్రాయుటకారంభించి, క్రమముగ
మహాకవిగ రూపొంది, హిందీ కవితా సామ్రాజ్యముపై తన ఏకచ్ఛత్రాధిపత్యమును
ప్రతిష్ఠించినాడు. ఆయన ముక్త కగీతాలు వ్రాసినా, నాటకములు వ్రాసినా,
మహాకావ్యములు వ్రాసినా, నవలలు వ్రాసినా, సాహిత్యసమాలోచనలు చేసినా, అవి
ఆయన కల్పనా చాతురిని, సృజన ప్రతిభను, ఆయన సౌందర్యానుశీలన సౌక్ష్మ్యమును,
ఆయన భావనాపటిమ, ఉదాత్తములగు ఆయన భావములను, అన్నిటిని మించి ఆయన
ప్రగాఢ ప్రేమను ప్రకటించుచు, తమ వైశిష్ట్యమును చాటుచునే యుండెను. ఆయన
తనకు పూర్వమందున్న కవితల్లజులవలె స్థూల సౌందర్యోపాసకుడుగాక,
సూక్ష్మసౌందర్యోపాసకుడు. ఆయనగూడ మొట్టమొదట ఇతి వృత్తాత్మక శైలిలో
కవితలనల్లినను, సంస్కృత మహాకవులనుసరించిన ధ్వన్యాత్మక కావ్యశైలి ఆయన
భావుక హృదయము నాకట్టుకొనగ, హిందీభాషలోగూడ, నూతనమును,
విశిష్టమునునగు ధ్వన్యాత్మకశైలిని ప్రవర్తిల్లచేయుటకై చాలా కృషిచేయ మొదలిడెను.
మొట్టమొదటగా తొమ్మిదియేండ్ల చిరుతప్రాయముననే ప్రజభాషలో ఒక 'సవైయా'
(ఛందస్సులో) పద్యమును వ్రాసి తన గురువగు 'రసమయ సిద్ధు' నకు చూపి ఆయన
మెప్పు నొందెను. 'చిత్రధార్' అను కవితా సంగ్రహములో ఆయన మఱికొన్ని ఆరంభిక
కవితలు సంగ్రహించబడినవి. శైశవ దశనుండియే ఆయనను మిక్కిలి ప్రభావిత
మొనర్చిన శైవమత ప్రభావాన్ని ఆయన ఆరంభ కవితలలోనే ('చిత్రధార్'లో సంగృహీతమైన) చూడవచ్చును. పై కవితా సంగ్రహముతో బాటు ఆయన మఱి
ఎనిమిది, అనగా మొత్తము తొమ్మిది కావ్య రత్నములమాలతో హిందీ భాషామతల్లి
కంఠసీమనలంకరించి, హిందీ కావ్యక్షేత్రమును నవదీధితులతో నింపెను. ఆయన
కవితాకృతులు, చిత్రధార్, కాననకుసుమ, మహారాణా కామహత్త్వ, ప్రేమపథిక,
కరుణాలయ, ఝర్నా, అంసూ, లహర్, మఱియు కామాయని. ఆయన కవిమాత్రమే
గాక, కథానికా రచయిత, నాటకకర్త, నవలానిర్మాత, సాహిత్య సమాలోచకుడుగూడ.
ఆయన వివిధ సాహిత్య ప్రక్రియలలో ఆయనలోని కవి, మఱియు దార్శనికుడే
కొట్టవచ్చినట్లు కన్పించును.
స్వ. ప్రసాద్ను హిందీ కావ్యక్షేత్రమున ధ్వని ప్రధానమైన ఛాయావాదశైలి ప్రవర్తకుడని చెప్పవచ్చును.
ఆయన కవిత్వంలోని ముఖ్యవిషయము ప్రేమ, మఱియు వియోగ వేదన, ఆయన దృష్టిలో మానవ జీవితము, అనగా సుఖ-దుఃఖములచే ఓత ప్రోతము. సంయోగ వియోగములకు 'మిలనభూమి'యని ఆయన ఆ విషయమును స్పష్టంగా వివరిస్తూ ఇలా అంటాడు:-
మానవజీవన్కీ వేదీపర్ పరిణయ హై విరహ మిలన్కా| సుఖ-దుఃఖ, దోనోం నాచేంగే హైఖేల్ ఆంక్కా మన్కా॥
ఐతే ఆయన కవితకు ముఖ్యవిషయమైన ప్రేమ, పూర్తిగ భౌతికంకాదు, అట్లాగని పూర్తిగ ఆధ్యాత్మికం కూడకాదు. ఆయన స్వచ్ఛమైన భౌతిక ప్రేమ జీవితంలో అవసరమని భావించే వ్యక్తి. ఆయన ప్రేమ కేవలము 'మన్కాఖేల్' అనగా మానసిక - భావుకత మాత్రమే గాక 'ఆంఖాకాఖేల్' గూడ అనగా నేత్ర పర్వమును కల్గించు భౌతిక సౌందర్యరూపముగూడ, మానసిక ప్రగాఢ భావుకతతోబాటు, కన్నుల యాకర్షణము గూడ అవసరమని (ప్రేమలో) ఆయన భావించటమే గాదు సర్వత్ర తన కవితలలో వర్ణిస్తాడుగూడ.
'భిచల్రాహీహై చాందనీ, ఛవిమతవాలీరాత్, కహతీ కంపిత అధరసే, బహకానే కీబాత్, కౌన్ మధుమదిరా ఘోలహా! ఆయన కవితాసంగ్రహములలో 'ఝర్నా' ఒకటి. అందులో 1913 నుండి 1927 వఱకు ఆయన వ్రాసిన కవితలు సంగ్రహించబడినాయి. ఈ కవితలలో ప్రసాద్ యొక్క నిశ్చల ప్రేమాభి వ్యక్తి, దృగ్గోచరముగాని, అజ్ఞాతసత్తనూ గూర్చిన ప్రేమలాలస మఱియు ఆత్మ సమర్పణ రూపమైన ముఖ్యమైన ఛాయా వాదలక్షణాలు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి.
'లహర్' అనే తరువాతి సంగ్రహములోని కొన్ని కవితలు కవియొక్క కైశోర హృదయంలో ఉదితమైన తీవ్రభావనోద్వేలనము శాంతపడిన పిదప కవిలో కల్గిన ప్రగాఢచింతనను, ప్రతి ఫలిస్తాయి. 'ఆంసూ' మఱియు, 'ఝర్నా' లోని కవితలో కవి యొక్క ప్రేమభావన, తన ఉచ్ఛృంఖలతను త్యజించి, సాత్వికము, నిర్మలము, మఱియు శుద్ధమగు ప్రేమగ రూపొందడం మనకు స్పష్టంగా కన్పిస్తుంది.
కవి 'ఈ కవితలలో 'ప్రేమ'కు సంబంధించిన తాత్త్విక రహస్యాన్ని ఈ విధంగా ప్రకటిస్తాడు.
"ముఝ్క న మిలారే కభీప్యారా”
అని తన ప్రేమవ్యథను వెళ్లపోసికొని, తిరిగి ఇట్లా అంటాడు. ప్రేమలో ప్రదానమేగాని, ప్రతిగ్రహముండదని:
పాగల్, వహ్ మిలతా హైకబ్ | ఉస్కోతో దేతేహీ హైఁసబ్ ||
ఝరా” తరువాత ప్రసాద్యొక్క ముక్తగీతికలు 'లహర్' అనే కవితా సంగ్రహంలో సంగ్ర హించబడ్డాయి. ఈ కవితా సంగ్రహంలోని కొన్ని కవితలలో కవి యొక్క కొన్ని అతీతస్మృతులు దర్శనమిస్తాయి. దీనిలో కవి, తన 'వ్యష్టి' పరిధిలోనుండి 'సమష్టి'లో ప్రవేశిస్తూ కనిపిస్తాడు.
'ఆంసూ' అనే కావ్యాన్ని నిర్మించే కాలానికి, ఆయనలోని ధ్వన్యాత్మక కావ్యశైలిని హిందీ కవితాక్షేత్రంలో గూడ ప్రవర్తిల్లచేయాలనే తీవ్ర ఆకాంక్ష పూర్ణముగ పరిణతనొంది ఛాయావాదశైలిలో 'ఆంసూ' 'కామాయని' వంటి మహాకావ్యములను నిర్మించడానికి పూర్తిగ దోహదం చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే 'ఆంసూ' అనే విరహకావ్యమే ఆయనను ఛాయా వాదకవితకు అగ్రదూతగ నిలబెట్టింది. కవితాక్షేత్రంలో 'అంసూ', 'కామాయని’ అనే రెండూ కావ్యాలే హిందీ సాహిత్య ప్రపంచంలో, ఛాయావాదశైలిలోని గరిమను, మహిమను చాటడంతో బాటుగ, ఆ శైలిలో నవీనకవితలను సృజించడానికి ఒక నూతనోత్సాహాన్ని, ప్రేరణను, కవిలోకానికి, ఇచ్చి నవ్యకావ్యరచనకు ప్రేరేపించినాయి, అని, నిస్సంశయంగా చెప్పవచ్చు. 'ఆంసూ” అనే వియోగ కావ్యంలోని అసాధారణములగు కొన్ని విశేషములు:- 1. ఈ కావ్యశైలి ఇతివృత్త శైలి గాక సూక్ష్మసౌందర్య, భావాభి వ్యంజనైక ప్రధానమైన ఛాయావాద శైలి.
2. ఈ కావ్యము నాయికా నాయకులు శారీరేంద్రియ మనోవాసనా పరితోషప్రధానమైన నాయికా నాయకుల విరహోద్గారాభివ్యంజన ప్రధానము గాక, సూక్ష్మాతి 1 సూక్ష్మము, మనో వాగింద్రియా గోచరము. కేవలము, బుద్ధిమాత్రగమ్యమైన అదృశ్య సత్తాప్రాప్తినభిలషించు, అవ్యక్త ప్రేమికుని వియోగవ్యథావర్ణన పరమైనది.
3. ఇందలి సౌందర్యముగూడ భౌతికోపాదానాశ్రితముగాక, భౌతికో పాదానముల ద్వారా సర్వత్రావ్యాప్తమైన ఒక విశేషమైన సూక్ష్మ సౌందర్య రూపము.
4. ఈ కావ్యమందు వర్ణింపబడిన ప్రేమ, కామవాసనా పరితోష ప్రధానము గాక, ఆత్మ పరితోషప్రధానము.
5. ఇందలి విరహవ్యథితుడగు ప్రేమికుని వియోగవ్యథ, కించిత్కాల వ్యాప్తము గాక, ఆజీవన పరివ్యాప్తము, అనంతము. ఈయవ్యక్తప్రేమ వియోగవేదన, మేఘసందేశములోని నాయకుని విరహవ్యథవలె వ్యక్తి నిష్ఠముగాక, సకలలోక వ్యాప్తము. కనుకనే, ఛాయావాద కావ్యములలోని అవ్యక్తమును గూర్చిన వియోగవ్యథ సార్వభౌమమౌనదియు అనంతమునునగు వియోగవ్యథ, సర్వలోక ప్రసృతమై, సహృదయులగు సకల భావుకుల కాహార్యమై, నిరంతర మనన పాత్రమై, సర్వుల కాదరణీయమై, సర్వోపాస్యమై, సకల వియోగిజనుల అవ్యక్త ప్రేమమయ జీవితముల కాలంబమై తనరారుచున్నది.
అందువలన ఏతత్కావ్యగత విశేషముల నరయవలెననిన 'ఆంసూ” అను మహావియోగ కావ్యమును సృజించిన, శ్రీ జయశంకరప్రసాద్, నియతి మూలమున జీవితములో నెదుర్కొనిన కొన్ని విషమస్థితులను గూడ తెలిసికొనవలసిన అవసరమున్నది.
శ్రీ జయశంకరప్రసాద్ తన పదియవయేటనే తన తండ్రిని కోల్పోయెను. కానీ నియతియంతటితో తృప్తిపడక పితృతుల్యుడు, కుటుంబ నిర్వాహకుడును నగు 'శంభురత్నజీ'ని గూడ శాశ్వతముగ శ్రీ జయంశంకర ప్రసాద్ నుండి కనుమఱుగు చేసెను. అన్నగారి మృత్యువునకు రెండు సంవత్సరముల పూర్వమే మమతామూర్తియగు మాతృమూర్తి గతించెను. దీనివలన కైశోరావస్థను దాటీ - దాటకుండగనే, అతనిపై బృహత్తరమగు సంసారభారము పడెను. ఈ విషమస్థితిలో ఆయన దార్శనిక చింతనము ఆయనను పూర్తిగా క్రుంగిపోకుండగ కాపాడెను. ఇట్లుండగ ఆయన తన వదినెగారి ప్రేరణతో ఇష్టము లేకున్నా వివాహము చేసికొనెను. ఆమె అకాల మృత్యువువాత పడగ, తిరిగి ద్వితీయ వివాహము చేసికొనెను. ఆమెగూడ కాలగతి చెందగా, తృతీయ వివాహమునుగూడ చేసికొనవలసి వచ్చెను. ఈ విధముగ ఆయనకు జీవిత ప్రథమదశలోనే సంభవించిన ఆకస్మిక బంధుమరణములు ఆయనను 'నియతివాది' లేక 'భాగ్యవాది'గా మార్చివేసెను.
ఇక కుటుంబముపైబడిన ఋణభారమును (పైతృకఋణమును) తొలగించు కొనుటకై శ్రీ ప్రసాద్ రెండు - మూడు దశకముల పాటు తమవ్యాపారమును చాల దీక్షతో కొనసాగించవలసి వచ్చెను. ఐనను ధృతిని వీడక తమ వ్యాపారమును పట్టుదలతో కొనసాగించుటతోబాటుగ, తన కవితా వ్యవసాయమును గూడ అకుంఠితదీక్షతో సాగించి కృతకృత్యుడాయెను.
ఇక మఱియొక, నిగూఢమైన జీవితరహస్యము. ఆయన తన యౌవనారంభ దశలో ఒక యువతిని ప్రేమించెను. ఆ యువతిని గూర్చిన ఆ నిగూఢ ప్రేమగూడ నియతి ప్రాతికూల్యమున భగ్నమాయెను. ఈ 'భగ్నప్రేమ' ఆయనను అనంత విరహవేదనకు గుఱిచేసెను. ఆ విరహవేదన, ఆంసూలోని ప్రతిఛందస్సులోను కొట్టవచ్చినట్లు గాన వచ్చును. కాని ఆయనలోని దార్శనికుడు, ఆయనలోని భావుకుడు, ఆ భగ్నప్రేమను వైయక్తికమగు సంకీర్ణ పరిధినుండి ఈవలకు లాగి, సార్వభౌమముగను, భౌతిక వియోగవ్యథను ఆధ్యాత్మికముగను రూపొందించుటచే, అది అనంత వియోగవ్యథితులగు ఆధ్యాత్మిక వియోగులగు జనులకు నిరంతర సేవ్యమై, వియోగపీడితులకు జీవితసంబలమై తనరారునల్లొనరించినాడు. ఈ కావ్యములోని విశేషమేమియన, అనంత వియోగ వ్యథితుడగు కవి, తన ప్రేమకు పాత్రము ఐన వ్యక్తి, ఒక 'ప్రేయసి' యనుభావమును మఱగు పఱచి సర్వత్రా పుంలిఙ్గమునే ఆ ప్రేయసిని గూర్చి ప్రయోగించినాడు. అనగా 'ప్రియా' అని స్త్రీలింగముగ తన విరహాలంబన మును ప్రకటించక 'ప్రియ' అని పుంలిఙ్గములో నుపయోగించినాడు. ఈ క్రింద ఇచ్చిన పంక్తులను చూడుడు: (క) 'ఛిల్ ఛిల్ కర్ ఛాలే ఫోడే, మల్ మల్కర్ మృదుల చరణసే। ధుల ధుల్ కర్ వహారహ జాతే, ఆంసూ కరుణాకే కణ సే॥
(ఖ) 'బిజలీ మాలా పహనే ఫిర్, ముసక్యాతా-సా ఆంగన్ మేఁ హాఁ, కౌన్ బరస్ జాతాథా, రసబూఁదేఁ హమారే మన్మేఁ||
(K) మానాకి రూప - సీమాహై - సుందర! తవ చిరయౌవనమేఁ, పర్ సమాగమేథే, మేరే మనకే నిస్సీమ గగనమేఁ||
మొదలైనవి.
నేను మచ్చునకిచ్చిన ఈమూడు పద్యములయందేగాక, మొత్తము కావ్యములో సర్వత్ర, ఈ కావ్యమును, ఆధ్యాత్మిక వియోగపీడా - ఉద్గార రూపమగు వియోగ కావ్యముగ నిరూపించుటకై ప్రసాద్ తన వియోగ శృఙ్గరాలంబనమును పుంలిఙ్గములోనే యభివర్ణించినాడు. తాను ఏ ప్రేయసి యొక్క వియోగ వ్యథతో చిరకాలము అమిత వేదనకు లోనయ్యెనొ, ఆ ప్రేయసిని నిగూఢముగనే ఉంచుటకు ప్రయత్నించినాడు. కాని ఆమెను పూర్తిగ నిగూఢముగనే నుంచలేకపోయినాడు.
ఈ క్రింది పద్యములను మనము సూక్ష్మముగ నవలోకించిన ఆరహస్య మవగతము కాగలదు:- కన్నీరు
"శశిముఖ పర్ ఘూంఘట్ డాలే, ఆంచల్ మేం దీప ఛిపాయే, జీవన కీ గోధూలీమేఁ కౌతూహల సే తుమ్ ఆయే”
శ్రీ సోమయాజులుగారి ఆంధ్రానువాదము:-
అబ్జముఖమున సమ్మోహనావకుంఠ నము దర్శించి, కొంగునను దీపమునుదాచి విమల జీవిత, గోధూళివేళవచ్చి తపుడు పూర్ణ, కుతూహలమ్మనగ నీవు |
మూలమెంత మధురశైలిలో సాగినదో, అనువాదము గూడ అంతటి మధుర శైలిలో, ఎక్కడను కుంటువడక ధారాళముగ సాగినది. బాగుగనే యున్నది. మూలకవి తన మృదు, మధుర, కోమల భావములను, తదనుగుణమగు మృదు, మధుర, లలిత పద గుంఫితమైన శైలిలో చిత్రించగల సామర్థ్యము గలవాడో, అనువాదకులుగూడ, తేట తెలుగులో నట్టి తేనె లొలుకు మృదు, మధుర, లలిత పద సంఘటనశైలిలో ననువదించగల సామర్థ్యసంపన్నులు. కాని యనువాదమెంత సమర్థులు చేసినను, మూలమును యథాతథముగ భాషాంతరములోనికి తెచ్చుట కొన్ని చోటుల సాధ్యపడదు. ఉదాహరణమునకు ఈయుదహరించిన పద్యములనే తీసికొనుడు:-
మూలములో, ప్రేమికుడు, తన జీవితములో గోధూళివేళ (అనగా పూర్ణముగ వికసించని యౌవనదశలో) తన హృదయములో ప్రవేశించిన తాను ప్రేమించిన వ్యక్తిని 'తుమ్ ఆయే' అని పుంలిఙ్గములో వర్ణించినాడు. కాని ఆంధ్రభాషలో అట్లు సాధ్యపడదు. ఏలయన భూతకాల మ ధ్యమ పురుషలోని కర్త స్త్రీయైనను, పురుషుడైనను, తెలుగులో ఒకే విధముగ నుండును, ఉదా:-
- ఈ తూ ఆయా, తుమ్ ఆయే, ఆప్ అయే = ఈ వాక్యములోని కర్తలగు తూ, తుమ్, ఆవ్ అను సర్వనామములు, మూడు తెలుగులోని మధ్యమ పురుష కర్మవాచకములగు, నీవు, మీరు, అను సర్వనామములకువలె లింగ భేదరహితములు. అనగా స్త్రీ-పురుషులిర్వురుని గూర్చి సమముగ చెప్పునవి. కాని హిందీలోని సామాన్య భూతకాలములోని అకర్మకక్రియ, మధ్యమ పురుషలో కర్తలుగ, ప్రయోగించబడిన సర్వనామముల లింగ-వచనములను తెల్పును, కనుక మధ్యమపురుషకు కర్తలగు, తూ, తుమ్, ఆప్, అను సర్వనామములు, స్త్రీ లింగబోధకములుగ అభిమతములైనచో సామాన్య భూతకాల క్రియలు స్త్రీలింగములలోనే ప్రయోగించబడును.
ఉదా : (స్త్రీలిం) తూ ఆయీ, తుమ్ ఆయీఁ, ఆవ్ ఆయీఁ అని పుంలిఙ్గములైనచో: తూ ఆయా, తుమ్ ఆయే, ఆప్ ఆయే యని ప్రయోగించబడును.
కాని తెలుగులో నీవు, మీరు అను మధ్యమపురుష సర్వనామకర్తృకములగు క్రియలు, స్త్రీ - పుం లింగములు రెంటిలోను సమముగనే ప్రయోగించబడును. ఉదా: నీవు (స్త్రీ లేక పురుషుడు) వచ్చితివి (మ.పు. ఏక, వచ) మీరు (స్త్రీ లేక పురుషుడు) వచ్చితిరి (మ.పు. బహువచనము). తేలిన సారాంశమేమియన మూలములో విరహవ్యథకు ఆశ్రయభూతమైన వ్యక్తికి ఆలంబనము పురుషుడు, ఎందువలన? క్రియ 'ఆయే' అనునది పుంలింగము (బ.వ) కనుక. కాని తెలుగు అనువాదములో అట్టి యవకాశము లేదు. అందువలన 'వచ్చితపుడు' అని అనువాదము చేయబడినది. ఇందులో క్రియాపదముగ 'వచ్చితి' (వచ్చితివి) అనునది కర్త పుంలింగమైనను, స్త్రీ లింగమైనా, కర్తను బట్టి మార్పు చెందదు గద.
ఇదంతా ఎందుకు వ్రాయవలసివచ్చినదంటే ఒక భాష నుండి మఱియొక భాషకు అనువాదము చేయుటలో అనువాదకు డెదుర్కొను క్లేశములను తెలియజేయటానికి.
ఇక మూలములో 'శశిముఖ పర్ ఘూంఘట్లే' అని ప్రేమాస్పద వ్యక్తి యొక్క సౌందర్యము వర్ణించబడినది. ఆ ప్రేమాస్పద వ్యక్తియొక్క ముఖము, చంద్రబింబము వలె దర్శకునకు ఆహ్లాదజనకము, అని భావము.
అనువాదకులు 'శశి' అను పదమునకు (అబ్జ) యను పదమును ప్రయోగించినారు. ఇందులో ఇబ్బందియేమన 'అబ్జ' శబ్దము, చంద్రవాచకముగ నిఘంటువులో' ప్రసిద్ధము.
కాని లోకములో 'అబ్జ' శబ్దము 'పద్మ' వాచకముగ ప్రసిద్ధము. అట్టి ప్రసిద్ధార్థమైన 'పద్మము'ను తీసికొనినను, 'ముఖము -పద్మమువలెనున్నది' అని సరిపెట్టుకొనవచ్చును. కాని ఇక్కడ 'పద్మము' అను అర్ధము ప్రకృత సందర్భములో సంగతము కాదు. ఏలయన పద్యమున కవగుంఠన (ముసుగు) కల్పన, చంద్రునియందు సంగతమైనంత సంగతము కాదు.
అస్తు, ఈ పద్యమును (మూలములోని నేనుదహరించిన సందర్భము, మూల - అను వాదముల తారతమ్య పరిశీలనము కొఱకుగాదు. మఱియేమన, కవికి తన ప్రేయసిని తాను మొదటిసారిగ తన ముగ్గయౌవనమున చూచినపుడు అతని మనస్సులో రేకెత్తిన యుత్కంఠను తెలియజేయుటకు. అది వయోధర్మము. కాని పరాయి యువతిని యుత్కంఠతతో దర్శించుట శిష్టాచార విరుద్ధమగుటవలన, ఆప్రేమ పాత్రమగు వ్యక్తి 'యువతి' గాక 'యువకుడు' లేక పురుషుడు అను భ్రమను కల్గించుటకై యిట కవి, పుంలింగమును ప్రయోగించినాడు. కాని అంత మాత్రముచే అదియలౌకిక ప్రేమస్థాయికి చేరలేదు, కాగా అతినిగూఢ ప్రేమయొక్క 'నిగరణము' లేక 'అవగుంఠనము' మాత్రము పూర్తిగ జరుగలేదు.
ఏలయన, అతనిలో తొలిసారిగ ప్రేమాసక్తిని రగుల్కొల్పిన ఆ వ్యక్తి 'పురుషుడే' యైన నెత్తిమీద బురఖా (మేలిముసుగు) ఎందుకు వేసికొనును? తన చీరకొంగుతో, చేతనున్న, వెల్గించిన దీపము ఆరిపోకుండగ, కప్పుకొని నడచుచు ఎందుకు దర్శనమిచ్చును? ఇక్కడ మేధావులెంతటి రహస్యమైన ఆధ్యాత్మికార్ధమును కల్పించినను నాయకునికి యువతీ దర్శనము వలన కల్గిన మనోవికారము దాచశక్యముకాని జీవితసత్యము. ఒక శశిముఖిని, శిరస్సుపై మేలిముసుగు ధరించి ప్రక్కయింటికి సంజవేళ దీపము వెల్గించుటకైపోయి, తన యింటికి మఱలివచ్చుచు, ఆదీపము నారిపోకుండగ తన చీర చెఱగుతో కప్పుకొని పోవుచుండగ కవిచూచినాడు -
ఆమెను మొదటగ చూచినపుడు తనకు గల్గిన ఆనందమును, మధురమగు అనుభూతిని తరువాతి పద్యములలో వర్ణించినాడు.
మధురా కా ముసక్యాత్ థీ, పహలే దేఖా జబుక్కో పరిచిత - సే జానే కబ్క, తుమ్క ఉసీ క్షణ, హమ్కో
ఆమెను చూచినపుడు కవియొక్క నీరసము, నిరుత్సాహముతో నిండిన హృదయములో నొక్కసారిగ వసంతపూర్ణిమ తన శీతలములు, అమృతమయములునైన చంద్రికలను బరపినట్లన్పించెను. అది మొదటి దర్శనము. తన ప్రేయసి యొక్క ప్రథమదర్శనములోనే, ఆమెతో తనకుగల ప్రేమ సంబంధ మిప్పటిదిగాక, దీర్ఘమైన అజ్ఞాతకాలము (జన్మ జన్మాంతరముల) నకు సంబంధించినదిగా అన్పించెను ('భావస్థిరాణి జననాంతర సౌహృదాని')
ఆమెను చూడక పూర్వము అతని హృదయమున శిశిరఋతువు (ఆకురాలు కాలము) వ్యాప్తమై యుండెను. అతని మనమునగల పూదోట, ఫల పత్ర-పుష్పవిహీనమై మోడువారి ఎండిపోయియుండెను. అందుగల లతలు, గుబురగు పొదలు, అన్నియు మోడువారి జాలిగొల్పుచుండెను. కాని తన ప్రేయసి హఠాత్తుగా తనకు దర్శనమీయగనే తన జీవితములో నవ వసంతము ప్రవేశించినట్లు అన్పించెను. మోడువారిన తన జీవితో ద్యానములోని, లతా- గుల్మవృక్షాదులు పునఃపల్లవితములై, పుష్పితములై నయనానందమును గూర్చుచున్నట్ల నిపించెను.
ఇంకను తన ప్రేయసి యొక్క సౌందర్య సంబంధమైన ప్రగాఢ ప్రభావమును వర్ణించుచు కవి ఈ ఛందములను వ్రాసినాడు :-
“ప్రతిమామేఁసజీవతా - సీ, బస్ గ ఈ సుభవి ఆంఖోంమేఁ", ఢీ ఏక్ లకీద్ హృదయమేఁ జో అలగ్ ంహీ లాఖోం మేఁ ॥
“మానా, కి, రూపసీమాహై, సుందర తవ, చిర యౌవనమేఁ, పర్ సమాగేథే, మేరే మనకే నిస్సీమగగనమేఁ I॥
భావార్థము: ఒక బంగరు ప్రతిమలో ప్రాణములను పోసినయపుడు, అది ఎంత రూపవంతముగ వెల్గొందునో, యట్లే తన ప్రేయసి యొక్క ఉద్దిప్తమైన తనుకాంతి తన కన్నులలో వ్యాపించెను. ఆమె తన కనుమొఱగినను, ఆమె సౌందర్యరేఖ తన హృదయపటలమున చాల ప్రగాఢ పటముగ చిత్రించబడెను. తన హృదయములో అనంతవస్తు సముదాయపు అస్పష్టరేఖలు నెలకొనియున్నను. ఆ లక్షలాది అస్పష్టరేఖాచిత్రములలో, తన ప్రేయసి చిత్రము తన విలక్షణమగు దీప్తితో వానికంటె వేఱుగ భాసించుచునే యున్నది.
తన ప్రేయసి సౌందర్యమునకు సీమ, తన యౌవన వసంతములో ఆమె కడు రమ్యముగ భాసించుచున్నది. కాని ఆ ప్రియురాలి సౌందర్యము ఆయన యనంతహృదయ గగనములో నిండియే యున్నది. కనుక, నా తాత్పర్యమేమియన, శ్రీజయశంకరప్రసాద్ తన హృదయములో శల్యమై బాధించు తీవ్ర విరహ వేదనోద్గారములను, తన భావుకతా బలముతో నభివ్యంజించు నుద్దేశ్యముతో 'అంనూ' అను ఈ విరహ కావ్యమును నిర్మించదొరకొనినను, అతనిలోని దార్శనికుడు, అతని వైయక్తిక విరహవేదనను, అజ్ఞేయము, శాశ్వతము, సర్వాంతర్యామియునగు ఆత్మ విషయమైనదిగా రూపొందించి, విశ్వజనీన మొనరించినాడు. ఇదియే యీ కావ్యములోని ప్రముఖవిశేషము. మహాకవి సుమిత్రానందన్ పంత్ విరహవిధురుల మూకవేదనను గూర్చి పల్కిన యీ పల్కులు శ్రీ జయశంకర్ ప్రసాద్ కవితా విషయములో నూటికి నూరుపాళ్లు అన్వయించును:-
“వియోగీ హెూగా పహలాకవి, ఆహేసే ఉపజాహోగా, గాన్ | ఉమడ్ కర్ ఆంఖోంమేఁ చువ్చాప్, బహీహోగీ కవితా అనజాన్ ॥
'ఆంసూ' అను విరహకావ్యము మహాకవి జయశంకర ప్రసాద్ ఛాయావాదశైలిలో రచించినట్టిది ఇది రాశిలో అల్పమైనను, అనగా సుమారు నూటతొంబది గీతములు కలదియేయైనను, అమూర్తమైన విరహవ్యథాభి వ్యంజక కావ్యములలో అసాధారణమైన గీతకావ్యము. ఇందలి విశేషమేమియన యౌవనోదయ కాలములో మనస్సులో రూపదర్శన 'జనితయైన ఆహ్లాదజనకమైన ప్రేమ కాలగతి వలన (దుర్దినములు వచ్చినపుడు) తీవ్ర వియోగవ్యథగ మాఱి, తన మూర్త స్థితి నుండి అమూర్త స్థితిని పొందుటతో బాటుగ, సంకీర్ణమైన వ్యక్తిపరిధి నతిక్రమించి భూ-నభోన్తరాళములందు వ్యాపించి విశ్వజనీనయై, చిరవిరహవిధురమగు యావజ్జీవ చేతనను, తన పావన వియోగప్రేమ గంగలో తానమాడించి, పునీతమొనర్చుట. కనుకనే 'ఆంసూ'లోని అమూర్త వియోగ గీతికలు, యువహృదయ లోకమునకు, నిరంతర మననయోగ్యములై సమాదృతములౌచున్నవి. ఇందలి ప్రేమలోని విశేషమేమియన, ఈ ప్రేమ కాలంబన భూతములుగ, స్థూల (భౌతిక) సూక్ష్మ (అమూర్త) పక్షములు రెండూ గ్రహించబడినవి.
ఈగీతి కావ్యము విరహవ్యథయొక్క సూక్ష్మత్వమును, తీవ్రతను మాత్రమే అభివ్యంజించక, జీవన మీమాంసదెసకు భావుక హృదయమునాకర్షించు చున్నవి. కేవలము స్థూల ప్రేమ - విరహములు మాత్రమే గ్రహించగల్గిన భావుకుల హృదయములను, సూక్ష్మము, సర్వవ్యాప్తమునైన మహాచేతన దెసకాకర్షించి, స్థూలప్రవణమైన బుద్ధిని, సూక్ష్మానుభూతి యోగ్యమొనరించి, స్థూలాసక్తిని తగ్గించుటకు ఇందలి కావ్యవస్తువగు అమూర్తప్రేమ తోడ్పడుచున్నవి. ఈ వియోగ గీతికావ్యము ఈ క్రింది ఛందస్సుతో నారంభమగు చున్నది: -
"ఇస్ కరుణా కలిత హృదయమేఁ అబ్ వికల రాగినీ బజతీ | క్యోం హాహాకార స్వరోంమేఁ వేదనా అసీమ గరజతీఁ ॥ శ్రీ వావిలాల వారి ఆంధ్రానువాదము:
తే. "ఏల కరుణరస కలిత హృదయవీథి, నిటుల వికలరాగిణి ధ్వనియించునేడు, ఏల హాహారవాల గర్జించునిటుల, స్నిగ్ధ వేదన చెలగి నిస్సీమ మగును?
ఈ పంక్తులలో కవి తన హృదయమును వికల మొనర్చుచు తన యంత రాళము నుండి వెడలుచుండుటను గమనించినాడు. ఈ రాగిణులు తమంతట తాము మ్రోగవుగద! ఇంత వఱకు నీరవముగ నున్న తన హృదయవీణను బహుశః ఏదియోయొక అసీమ వ్యథామూల మగు హాహాకారములు మీటినవేమో! సారాంశము: వికలరాగములను ధ్వనించు తన హృదయవీణ, తన హృదయములో అంతులేకుండ పేరుకొని పోయిన తీవ్ర వేదనను 'హాహాకార రూపమున ప్రసరింపచేయు చున్నది.
మూలమెంత కోమలపదమనోజ్ఞమో, అనువాదము గూడ తేటతెనుగులో నంతమధుర పదయుక్తముగనున్నది. ఈ పద్యములో 'విశేషణ వ్యత్యయ' రూపమగు ఛాయవాద ప్రచలితమగు లాక్షణిక ప్రయోగము చేయబడినది. ఎట్లన 'రాగిణి', యను పదము 'కల' అను విశేషణముతో విశేషించబడినది. న్యాయముగ, రాగిణి (రాగభేదము) వికలముగా నెట్లుండును. ఆరాగిణిని వినుట వలన, శ్రోతల మనస్సు వికలమగును. కనుక ఈ 'వికల' అను విశేషణము 'హృదయము' అను విశేష్యమును విశేషించుటకై ప్రయోగించ వలసియుండగ, అట్టి వ్యాకుల హృదయమును మీటుటవలన వెల్వడు 'రాగిణి' లను విశేషించుటకై ప్రయోగించుట. ఇది యొక నవ్యమైన లాక్షణిక ప్రయోగము. దీనిని 'విశేషణ వ్యత్యయ'మని యందురు. మూలములో 'వేదన' మాత్రమే గర్జించుచున్నదని యుండగ, అనువాదకులు, ఆవేదనకు 'స్నిగ్ధ' యను మూలమునందు ప్రయోగించబడని విశేషణమును ప్రయోగించినారు. ఎందుకన, వేదనకు హేతువులు పలు విధములుగ నుండవచ్చును. కాని ఈ కావ్యములోని వర్ణ్య వస్తువగు వేదన, స్నేహ (ప్రేమ) మూలకమైనది అని పాఠకులను ఎచ్చరించుటకై ప్రయోగించినారు.
అస్తు. ఈ మొదటి పద్యములో తన నీరద హృదయవీణను అసీమ వేదనా జన్యమై హాహాకారము మ్రోగించగ ఏల, పీడావ్యంజకలములగు స్వరములలో నీవీణ గర్జించుచున్నదను ప్రశ్నద్వారా కావ్యము నారంభించు, ఆయసీమ వేదన యొక్క ఉ త్తరోత్తర తీవ్రతను నిరూపించుటకు దొరకొనినట్లు కన్పించును.
ఇక్కడ మనము గమనించవలసిన ముఖ్యవిషయ మేమియన, శ్రీప్రసాద్ ప్రేమ యొక్క యాధ్యాత్మిక పక్షమునకు మూలముగ ఐహిక పక్షమును మున్ముందు ముప్పదినాల్గవ పద్యములో వర్ణించినాడు, కనుక న్యాయముగ ఆ పద్యముతోనే ఈ విరహకావ్యము నారంభించవలసి యుండగ, “ఇస్ కరుణాకలిత హృదయమేఁ' అను పద్యముతో నారంభించుటకు కారణము ఆయన వ్యక్తిగత జీవితరహస్యమేయని మేము ముందుగనే నివేదించియుంటిమి.
కనుక తన జీవితగోధూళి వేళలో తానుగాంచిన నిండు యౌవనమున పొంగారు నొక శశిముఖియగు యువతిని చూచిన పిదప తన మనస్సులో కల్గిన రూపాసక్తిని, ఆనందమును కవి వర్ణించకుండనుండ లేకపోయినాడు. ఈ క్రింది పద్యములను చూడుడు:-
మూలములోని 1) 'మధురాకాముసక్యాతీథీ, (29 పద్యము)2) 'ప్రతిమామే (సజీవతాసీ)' (ప-36), మానాకి రూపసీమా-హై (ప.37) పద్యములను ముందే నాయకునిపై ప్రియారూప దర్శన జనితమైన ప్రగాఢ ప్రభావమును నిరూపించుటకై యుదహరించియుంటిమి. ఆ పద్యములకు శ్రీసోమయాజులు గారి ఆంధ్రానువాదమును గూడ తిలకింపుడు.
తే. 'తొలుత నినుగని నతు డైన సంతుషిత్త, నవ్యరాకానిశి స్మితమొనర్పసాగె, పరగినట్లు దీర్ఘకాల పరిచయమ్ము నాకుపొడగట్టితివి యాక్షణాన నీవు.
'ప్రతిమామేఁ సజీవతాఁ సీ (అను) తే.
ప్రతిమయందున ఘన సజీవతనుబోలి, నేత్రపాళిని శుభకాంతి నెలవుకొనియె, కాని మన్మనోనిస్సీమ గగనమందు, బొలుపుమెరయ, గడునిమిడిపోయినావు.
ఇక మూడవ పద్యము : 'మానాకి రూపసీ మాహై' అను తే. 'అప్పుడొప్పితి నో సుందరాంగ, నీదు చిరతరుణిమను, సౌందర్యసీమ కలదు, కాని మన్మనో నిస్సీమ గగనమందు, బొలుపు మెరయ గడు నిమిడి పోయినావు
ఇంకను తమ తమ ప్రేమాస్పదమైన వ్యక్తులయొక్క తత్తదౌృతికములగు కర చరణ-ముఖా ద్యవయముల సౌందర్యమును పునః పునఃస్మరించుటయే నిజమైన ప్రేమయని భావించి, వర్ణించిన, ప్రాచీనకవుల స్థూల ప్రేమ మార్గమున నడువక ప్రసాద్, ఛాయావాదమునకు ప్రధానలక్షణమైన సూక్ష్మ సౌందర్యమును, అంకనముచేయు, ప్రేమపద్ధతి ననుసరించి చేసిన ఈ రూప వర్ణనమును తిలకింపుడు:-
మూలము : "చఞ్చలా స్నాన కర్ ఆవే, చన్రికా పర్వమేఁ జైసీ ఉస్ పావనతన్నీ శోభా, ఆలోక మధుర థీ ఐసీ”.
అనువాదము : తే. “చంద్రికా పర్వసుషమల జలకమాడి, చఞ్చలా తన్వి వచ్చిన సరళినుండె, రమ్యమాపావన వపుర్విలాసశోభ, అమరెనాలోక మధురయై అక్కజముగ|| (పద్య. సం. 48)
ఈ పై పద్యములో కవి తన ప్రేమపాత్ర యొక్క సంపూర్ణ శారీర సౌందర్యములోని కన్నులను మిఱుమిట్లుగొల్పుకాంతిని వర్ణించుటతో బాటు దాని దర్శనీయత్వమును గూడ అభివర్ణించినాడు:-
భావార్థము : తన ప్రేయసి యొక్క తనుయష్టి విద్యుల్లత వలె మెఱసి పోవుచున్నది. కాని విద్యుల్లతలో క్షణికత్వము (అనగా చంచలత్వము)తో బాటుగ కన్నులకు బాధ కల్గించుట ద్వారా భేదమును కల్గించు లక్షణమున్నది. కనుక ఆదోషపరిహారమునకై ఆ చంచలను పూర్ణిమయొక్క అమృతమయమైన నిండారభూమియందంతటను పండువెన్నెలలో తానమాడించుట ద్వారా, దాని చంచలతయను దోష పరిహారము చేసి, చంద్రికలలోని శీతలత్వమును, దర్శనీయత్వమును, పావనత్వమును, ఆహ్లాదజనకత్వమును. విద్యుత్ప్రకాశమునకు కల్గించి, తన ప్రేయసియొక్క కన్నులను జిగేలు మన్పించు తనుకాంతిని సంవేదన శీలమొనరించుటతో బాటుగ దానిలోని పవిత్రతను వెల్లడించుట ద్వారా తన నిర్దోషత్వమును చాలనిపుణముగ నిరూపించినాడు. కనుక దీనిని బట్టి మనకు ఛాయావాదము యొక్క స్థూల సౌందర్య వర్ణన వైముఖ్యముతో బాటుగ, సూక్ష్మ సౌందర్యాఙ్కనపటీయస్త్వము స్పష్టముగ నవగతమగుచున్నది.
అట్లే తన ప్రేమకు ఆలంబనమైన ప్రేయసి యొక్క శరీరచ్చవిని మాత్రమే గాక, ఆమె యొక్క చంద్రబింబము వంటి ముఖమును, నల్లగనున్న దీర్ఘములను, దట్టములుగ నున్నవియునగు కేశములను, ఆమె పాపటలో అలదుకొనిన సిందూరమును ఈ క్రింది పద్యములో స్పష్టముగ వర్ణించినాడు.
“బాంధా థా విధుకో కిన్నే ఇన్ కాలీ జంజీరోంనే, మణి వాలే ఫణియోంకాముఖ క్యోం భరాహుఆహీరోంనే ॥
(తెలుగు) : తే. 'ఎవ్వరీ విధు నీ రీతియీ వినీల, బంధనమ్ముల నిటుకట్టుబడగఁజేసి రేల నిండియున్నయది వజ్రాలు నిటులు మణుల వెల్గుల వెలిజిమ్ము ఫణులమోము. (ప.సం. 39)
అభివ్యంజనాశైలిలోని విశేషములు :
ఈ పై పద్యములో వర్జ్యమగు ముఖమును చెప్పకుండగ, 'విధు' (చంద్రుడు) శబ్ద ప్రయోగము ద్వారా తన ప్రేయసి ముఖము చంద్రబింబమును బోలియుండునని, అవగతమొనర్చినాడు. 'కాలీ జంజీరేం అను పదప్రయోగము ద్వారా నల్లని, సుదీర్ఘములైన దట్టముగనున్న కేశములను అవబోధమొనర్చినాడు. 'మణివాలే ఫణియోంకా' అను మూడవ పాదము, మఱియు క్యోంభరాహుఆ! అను నాల్గవ పాదముల ద్వారా నల్ల సర్పములను బోలిన కేశపాశము ముఖభాగమున అనగా పాపటమొదట్లో తన ప్రేయసి వజ్రపుటాభరణమును పెట్టుకొని యున్నదని అవగతమొనరించినాడు. ఇందలి వర్ణనములో క్రొత్తదనమంతగలేకున్న, శైలిలోని నవ్యత్వము పాఠకుల నలరించుచున్నది.
అట్లే ఆమె దట్టమైన కనుబొమ్మలను (ప.సం.42) మందస్మిత సుందర కపోలపాళిని (ప. సం.43) వర్ణించినపిదప ఆమె ఎఱ్ఱని ఓష్ఠ సంపుటములో ముత్తెములవలె స్వచ్ఛముగ ప్రకాశించు దంత పంక్తిని, శుకమును బోలిన సుందరమైన నాసికను వర్ణించి భావుకుల నలరించు ఒక చమత్కారమును నిక్షేపించినాడు:-
ఈ క్రింది పద్యమును చూడుడు:-
మూలము :
"విద్రుమ సీ పీ సంపుట మేఁ మోతీకే దానేకై సే? హై హంస నశుకయహ్ ఫిర్ క్యోం చుగనేకో ముక్తా కైసే?
(తెలుగు) : తే. "ఇంపు బొలయ విద్రుమశుక్తి సంపుటమున నిటుల ముత్తియ పుంగింజ లేల తోఁచు? హఘ మీది కాదు శుకమె యౌ, అరుగుదెంచె నేలనో యీ ముత్యముల భక్షించుకొఱకు. (ప.సం. 44)
అభివ్యంజన విశేషముల వివరణము :
విద్రుమసంపుట' పదముచే పగడమువలె ఎఱ్ఱగానున్న పెదవులు, ఆ సంపుటములోని ముత్తియపుగింజలు అను వాక్యముద్వారా ముత్తియముల వలె స్వచ్ఛంగా ప్రకాశించు ప్రియురాలి యొక్క దంత పంక్తియులక్షితములగుచున్నవి. ముత్యములను హంసలు భక్షించునని కవి సమయము కనుక, తన ప్రేయసి యొక్క నాసిక, ఆ ముత్యములను భక్షించుటకు వచ్చిన హంస యనుటకు వీలులేదు. ఏలయన 'నాసిక'ను హంసతో బోల్చుట కవిసమయ విరుద్ధము. అందుకని, నాసికను, 'శు కముతో పోల్చవలెను. కాని ముత్యములను భక్షించు అలవాటు లేని శుకము (నాసిక) ఈ విద్రుమసంపుటములోని ముత్తియపు గింజల నేల భక్షించుట కిటకు వచ్చినదో అనూహ్యమని పల్కి కవి చమత్కరించినాడు.
కనుక పైన యిచ్చిన ప్రేయసి యొక్క తనులతతో బాటుగ, సుందరములును, కోమలములునైన, అంగకముల సౌందర్యవర్ణనమును దర్శించిన పిదప, ఇది యలౌకిక ప్రేమ వర్ణనము అని ఎవ్వరును అనజాలరు. శ్రీజయశంకర్ ప్రసాద్ తన ప్రేయసి యొక్క నిరుపమ లావణ్యమునే స్పష్టముగ నిట వర్ణించినాడు. అంతేగాదు. అట్టి సందర్యదర్శన జనితమైన ప్రగాఢ ప్రభావమును గూడ ఇక్కడ ఉదహరించబడబోవు పద్యములో స్పష్టముగ వర్ణించినాడు. "కాలీ ఆంఖోంమే కిత నే, యౌవనకే మదకీలాలీ, మానిక - మదిరాసే భర్తీ, కిన్నే నీలమ్ కీ ప్యాలే ||
(తెలుగు): తే. 'ఆవినీలా వదాత నేత్రాళి నెంత యౌవన ఘన ఘూర్ణ మధుమదారుణిమము! పరమ మాఘవాసిత వజ్రపాత్ర నెవ్వ రొదవ నింపిరి మాణిక్యమదిరతోడ ! (ప.సం. 40)
కవి, కజ్జల వినీలములగు తన ప్రేయసి నేత్రములలో తనకు అనురాగపు లాలిమను, ఎఱ్ఱని మధువు నింపిన నీలమణి చషకములతో బోల్చినాడు.
ఈ వర్ణనముద్వారా తన ప్రియురాలి అనురాగమును వెదజల్లు దృష్టి పాతముల వలన, తనలో మధుపానము చేసినపుడు కల్గు మాదకత యలము కొనెనని ధ్వనింప చేసినాడు.
కవి వెనుక ఉదహరించిన పద్యములన్నిటిలోనను తన ప్రేయసియొక్క భౌతికమైన శారీర సౌందర్యమును వర్ణించినాడు. కాని దానిపై పూర్తిగ నిలబడక, తిరిగి తన ప్రేమలో ఆధ్యాత్మికతను గూడ రంగరించి కొన్ని ఛందస్సులు వ్రాసినాడు. ఈ క్రింది పద్యములను చూడుడు:-
మూలము
"బిజలీ మాలా పహనే ఫిర్, ముసక్యాతా.. - సా ఆంగన్ మేఁ, ముస్కురాతా - హాఁ కౌన్ బరస్ జాతాథా, రస-బూంద్ హమారే మన మేఁ" "తుమ్ సత్యరహే చిరసున్దర్, మేరే ఇస్ మిథ్యాజగమే, థే కేవల జీవన సజ్జీ కల్యాణ - కలిత ఇస్ మగకే” “గౌరవథా, నీచే ఆయే ప్రియతమ మిలనేకో మేరే, మైఁ ఇఠలా ఉఠా అకించన దేఖేజ్యోం స్వప్న సబేరే” “పరిచయ రాకాజలనిధికా జైసే హెూతా హిమకరసే ఊపర్సే కిరణేఁ ఆతీఁ మిలతీహైఁ గలేలహర్సే”
ఈ పద్యములలో ఆయన ప్రేమకాలంబనము, భౌతికవ్యక్తిగాక, ఒక సర్వ వ్యాప్తము, చిరసుందరము ఐన, ఆత్మయను అర్థము, ధ్వనించుచున్నది.
భావార్థము : తాను తన ప్రియదర్శనోత్కంఠతో కలగుడు పడువేళ తన ప్రియుడు, విద్యున్మాలను ధరించి చిఱునవ్వుతో నాపంచలో (హృదయంలో) నే నాకు దర్శనమిచ్చినాడు. అతడు మామీద దివ్యప్రేమ రస బిందువులను కురిపించినాడు.
ఆయానందములో కవి మనస్సులో ఇట్లు తలపోస్తాడు. ఈ జగత్తంతా మిథ్యయే. కాని ఈ మిథ్యా జగత్తులో తన ప్రియతముడొక్కడే సత్యము. జాగతిక సౌందర్యము అశాశ్వతము. కాని తన ప్రియుడు చిరసుందరుడు, కళ్యాణ కలితమైన ఈ ప్రేమ మార్గంలో అతని జీవిత సహచరుడు తన ప్రియతముడు మాత్రమే.
తన ప్రియతముడు ఈ లోకమున కావల చాల ఉన్నత లోకములో నున్నను తనను గూర్చి క్రిందకు దిగివచ్చుట తనకెంత గౌరవము! అతని రాకకు, అకించనుడనైన నేను గర్వంతో పొంగిపోయాను. నిజంగా నా ప్రియతమునితో నా యొక్క మిలనము ప్రాతఃకాల స్వప్నం (సత్యము).
తన ప్రియమిలనప్రసఙ్గమును కవి యిట్లు వర్ణించినాడు. నిండు పున్నమి నాడు చంద్రుడు ఉదయించి, తన స్వచ్ఛములైన సుధామయ కిరణములతో తన రాకచేనుప్పొంగు సముద్ర తరంగములను ఆలింగనము చేసికొనునట్లు
(తెలుగు) :
తే. "మహిత విద్యుల్లతా మంజుమాలికల ధ రించి, స్మిత మొనర్చెడిరీతి, నాదు స్వాంతమున ఘనరసబిందు సముదయమ్ము నెవ్వరాగక మరల వర్షించినారు. తే. "అస్మదీయ మిథ్యా జగమందునున్న నిత్య సుందర మోహన సత్యమీవు, మధుర కళ్యాణకవిత మీమార్గమందు నాకు జీవనసంగియై యొప్పినావు
తే. "గౌరవము కల్గినది ననుఁగలియు కొఱకు వచ్చితివి 'మత్రియా' దిగివచ్చినావు, కడునకించనతగల యేగర్వపడితి అల్గి, ఉదయవేళ కలల నరసినాడ !
తే. 'శీతకరునకు బూర్ణిమా సింధువునకు బరిచయ విభవ మబ్బిన పగిదితోచి, పచ్చిపైబడియుత్తుంగ భంగములను స్నిగ్ధ కిరణాళి సేయు నాశ్లేషణముల ॥
ఈ యనువాదము చాల రసవత్తరముగ సాగినది.
మొదటి పద్యములో మూలములో కవియొక్క ప్రియతముడు కేవలము 'బిజలీ మాలా పహనే' యని యుండగ, శ్రీ సోమయాజులుగారు, ఆ విద్యున్మాలను, 'మంజు', మహితములగు విశేషణముల ద్వారా విశేషించి మంజులతను, మహితత్వమును గూర్చినారు. అట్లే మూడవ పాదమునఁ రసబూంద్ బరస్ జాతాథా, అని యుండగ, ఆరసబిందువులకు శ్రీవావిలాల వారు బహుఘనతను గూడ కూర్చినారు.
ఈ విధంగా వ్యాఖ్యానం చేసికొంటూపోతే ఇదియే ఒక పెద్ద గ్రంథం ఔతుంది. కాన సహృదయులగు పాఠకులే స్వయముగ ఆయా విశేషము లనరయ వేడికోలు.
నిజంగా కవిది ఆధ్యాత్మిక ప్రేమయే యైన, తన ప్రియతమునితో అతనికి సంభవించిన ఈయాధ్యాత్మికలనము గర్వపడతగినదే, మిడిసి పడవలసినదే. కాని అది నిలబడినట్లు కవి వర్ణించలేదు.
అతడు తన ప్రియతముని ప్రేమ సత్యముగాక ఛలము అనగా వట్టి దగా అంటాడు. కాని ఛలమైన తనకు మాత్రం తన ప్రియతముని యందు గట్టి విశ్వాసం ఉందంటాడు. తన ప్రేమలో మాత్రం ఎట్టి ఛలమూలేదు. అది సత్యమే అంటూ, అతని ప్రియతముడు రూపముచే సుందరుడే గాని, అతనికి హృదయం లేదంటూ ఈ క్రింది పద్యాలూ చెప్తాడు. మూలము : “చలనాథీ, తబ్ భీ మేరా, ఉస్మేఁ విశ్వాసఘనాథా | ఉస్ మాయాకీ ఛాయమేఁ కుఛ్ సచ్చు స్వయంబనాథా ॥ “వహ్ రూప రూప థా కేవల్, యాహృదయరహాబీ ఉమ్మేఁ, జడతాకీ సత్ మాయాధీ, చైతన్య సమఝకర్ ముఖమేఁ ॥
(తెలుగు) : తే. 'అయిన మోసకత్తియ దానియందెనాకు, గాఢ-విశ్వాసమెదలోనగలదు, అట్టి చారుమహిత మాయాఘనచ్చాయయందు, స్వయము గ నేదొ యున్నది సత్యమగుచు
తే. 'మంజు సౌందర్యమది రూపమాత్రమగునె? కాక అందు హృదయమును గలదె, నిండి, తానె చైతన్యమను భ్రాంతిమాని నాలో, పరగుచున్నది యొక జడత్వంపుమాయ.
ఈ విధంగా తన ప్రేయసి వట్టి జడమనియు, ప్రతిస్పందములేని సుందర ప్రతిమయనియు, తాను ఆమె చేతనపుత్తళిక యని భ్రమపడినానని కవి వాపోయినాడు.
తాను తన ప్రియతముని యందలి ప్రేమవలన, మోసపోయినను, ఆమె యందలి తనకు గల మోహము మూలముగ కల్గిన వియోగవ్యథను వర్ణించుచు కవి యీ విధంగా తన వియోగవ్యథను ఇలా వెళ్లపోసికొంటాడు:
మూలము : "హీరే సా హృదయ హమారా, కుచలా శిరీష కోమలనే, హిమశీతల ప్రలయ అనలబన్ అబ్ లగా విరహ్ సే జలనే “జల్ ఉఠా స్నేహదీపక సా నవనీత హృదయథా మేరా, అబ్ శేష ధూమమరేఖాసే, చిత్రిత కర్ కహా అంధేరా॥ “నీరవ మురలే, కలరవచుప్, ఆలికులథే బంద్ నలినమే కాలిన్దే బహీ ప్రణయకీ, ఇస్ తమమయ హృదయపులినమే|| ఈ మొదటి పద్యములో తన ప్రియతముడు శిరీషపేశల హృదయుడేయైనా, ఎట్టి కష్టములకు సాధారణముగా తలవంచని తన యొక్క వజ్ర సమమైన హృదయాన్ని సైతం నులిమివేసి తన హిమశీతల హృదయంలో ప్రళయానలమువలె భీకరమైన విరహాగ్నిని రగుల్కొల్పినాడు. అతడు పెట్టిన ఈ ఘోరమైన చిచ్చుతో తానే నిత్యము దహించబడుచున్నానని తన విరహ వ్యథాజనితమైన తీవ్ర సంతాపమును వెళ్లబోసి కొనినాడు. ఇక రెండవ పద్యములో తనలోని ప్రియవిషయకమైన స్నేహము (ప్రేమ, తైలము, క్లిష్టపదము) వియోగాగ్నిని ప్రజ్వలింపచేయుచున్నదనియు, తన నవనీతహృదయ మందులో కాలి కాలి చివఱకు ఒక ధూమారేఖా మాత్రముగ మిగిలిపోయి అంధకారమును సృజించుచున్నదని వాపోయినాడు. ఇక ఇపుడు తన జీవితములో నలముకొనిన ఘనవిషాదచ్చాయల నభివర్ణించుచు కవియిట్లు పల్కినాడు. భావార్ధము : తన జీవితములోని పూర్వపు కలరవమంతయు ఇపుడు మాయమై పోయినది. తన హృదయవీణ ఇప్పుడు మూగపోయినది. తమ మధురఝంకారములతో లోకమును మురిపించు అలికులము. పద్యములో మణగియుండుటచే (రాత్రి సమయమగుటచే) ఎట్టి ఝంకారములను చేయక సద్దుమణగియున్నది. తన హృదయసీమలో, ఇపుడు ప్రేమోల్లాసములు మటుమాయమైనవి. ఇపుడాహృదయము యొక్క శుష్కపులినములలో నిరాశా, నిర్వేదముల దట్టమైన చీకటియే అలముకొని యున్నది. ఇపుడు నా హృదయపులినములలో ప్రేమయొక్క యమున (నల్లని రంగు గలది యగుటచే, దుఃఖము, నిరాశ వానికి ప్రతీకము) అప్రతిహత గతితో ప్రవహించుచున్నది. 710 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 నిజముగ తన దుఃఖములోని తీవ్రతను, తన హృదయములో అలముకొనిన నిరాశను, తనకు విరహవ్యథ వలనకల్గిన అసహ్యవేదనను ప్రకటించుటకై ప్రయోగించిన లాక్షణిక ప్రయోగము, అద్భుతము. (తెలుగు) తే. "మృదు శిరీషము, వజ్రమై మెలగు నాదు నెదను నలిపివేసిన యదియుదయవృత్తి హిమసుశీతలప్రేమ జ్వలించుచున్న దనలమై యిపుడనయ మాయుల్లసమున తే. "ప్రణయ ముజ్జ్వల దీపమ్ముపగిది వెలిగె నెగడె మన్మానసము నవనీతమగుచు, లీలగా మిగిలిన ధూమరేఖతోడ నిపుడు చీకటినెపుడు చిత్రించుచుండె తే. "నీరవము వంశి కలరుతి నిశ్చలమ్ము, నళినమున నళికులము బంధనమునొందె ఈ ప్రగాఢతమోమయ హృదయసైక తమున ప్రణయ కాళింది కదలినదించె ॥ తెలుగు ఛాయలోని విశేషములు : మొదటి పద్యములోని శైలి శిరీషపేశలము. పేశలమగు శిరీషమువంటి తన ప్రియతముడీ వియోగపుదుష్కాలములో వజ్రమై మెలగు కవి యొక్క హృదయమును జాలిమాలి (అదయవృత్తి) మూలములోలేని) నలిపివేయు చున్నాడని పూరించి మూలమునకు శోభనుగూర్చబడినది. రెండవ పద్యము మూలాను సారమగు రమ్యమగు అనువాదము. ఇక మూడవ పద్యము శైలిచాల మనోజ్ఞము. మొదటి రెండు పాదములలో సమాన విధురమైన, మధురశబ్ద ప్రయోగము నిజముగ ముచ్చట నొప్పుచున్నది. నీరవము, వంశి, కలరుతి (రవము) - నిశ్చలము నళినమున - నళికులము ఇత్యాది పదములు, ధ్వని సౌందర్యమునకు నిదర్శనములు. కవియొక్క యీ తీవ్ర విరహవేదనకు మఱియొక కారణము, ఆమె తన ప్రగాఢ ప్రేమను గూర్చి తెలిసినా, ఏమియు ఎఱుగని దానివలె తనయుల్లసములో తాను కన్నీరు 711 మున్గియుండుటే. ఈ ప్రియతమోపేక్షా జనితమైన వ్యథను కవికావ్యారంభంలోనే ఇట్లా వెళ్లపోసికొంటాడు. మూలము "రో- రోకర్, సిసక్ - సిసక్ కర్
- "రో-రోకర్,
కహతామైఁ కరుణకహానీ, తుమ్ సుమన నోచతే సునతే కరీ జానే అనజానీ ॥ తే. "ఏడ్చి యేడ్చి నేనంతట నెకువెట్టి కరుణ కథ నీకు విన్పింపగడగినాను సుమనములు గిల్లుచును వినుచుంటి వీవు ఎఱిగియును ఎఱుగనియట్లు వర్తింతు వేల (తన ప్రియురాలు పూలు కోసికొనుటకు వచ్చినపుడు తన కరుణకథను విన్పించినను, ఆమె ఏమియును పట్టించుకొనక, తన పూలు తాను కోసికొని వెళ్లిపోయెడిది. ఇంక తన జీవితములో తన ప్రియతముని ప్రవేశనిర్గమనముల వలన తనలో కల్గిన ప్రతిక్రియను వర్ణించుచు కవి యీ క్రింది ఛందస్సును కూర్చినాడు. మూలము : మాదకతానే ఆయే తుమ్, సంజ్ఞా - సే చలేగయే తుమ్, హమ్ వ్యాకులపడే బిలఖతే థే, ఉతరే హు ఏ నశేసే ॥ (కవి హృదయంలో అతని ప్రియతముడు ప్రవేశించినపుడు అతనిలో నొక విధమైన మాదకత (నిషా) వ్యాపించింది. కాని ఆనిషా తగ్గేలోపల ఆమె నిష్క్రమించింది. దాని వలన నతడు చాల వ్యాకులతతో బిట్టు విలపించినాడు. కాని ప్రయోజనం? (అను) తే. "వచ్చితివి మాదకత్వము పగిదినీవు, చనెడివేళ వెడలితివి సంజ్ఞవోలె! వదలిపోయిన మత్తులో వ్యాకులతను విలపనము సేసినాడ నవ్వేళనేను 712 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 ఇంక ప్రియతమ నిష్క్రమణముతో అతని ముందు నిరాశతో నిండిన ఆకాశములే వ్యాపించినట్లన్పించెను. కాని అకించనుడుగు తాను ఒడ్డులులేని ఈయపారవియోగ దుఃఖపారా వారమునెట్లు ఈది దాటగలదు? ఇంక గతిలేక శూన్యత వ్యాపించిన ఈ జలములన్నియు, ఇంకి పులినమయమై నిల్చిన ఇసుక సాగరంలో, తన ప్రేమనౌకను త్రోసికొని వెళ్ళుటకై తన అశ్రుధారలను వర్షించి, ఆ జలములతో గుణరహితమైన (బేగున్ - క్లిష్టపదము, గుణము మఱియు రజ్జువు) తన ప్రేమ నౌకను, త్రోసికొనుపోవు చున్నాడు! ఈ క్రింది పద్యమును చూడుడు:- (అను) భావము స్పష్టము. సూనే సికతా సాగరమేఁ యహ్ నైయా మేరే మనకీ, ఆంసూ కీ ధార్ బహాకర్, ఖేచలా ప్రేమ బేగునకా” తే. 'శుద్ధ ఘన సికతామయాసోక్తజలధి, నాడు మానస మనెడి యీ నావనిప్పు డశ్రుధారల నదియించు నట్లొనర్చి ప్రేమగుణహీనముగ నడిపించుచుండె. ఇంక తనకు తన ప్రియతమునికి గల మధుర సంబంధమిపుడు శలభ అగ్నులకు గల ప్రేమ సంబంధంగా తయారైనది. కన్నీరు మూలము: “బలనేకా సంబల లేకర్ దేపక్ పతంగసే మిలేతా, తెలుగు జలనే కీ దేన దశామేఁ వహ్ పూల్సదృశ హెూఖిలు ॥ తే. "పొంది జ్వలనమే పాధేయముగను జ్యోతి శలభమును జేరుటకు తాను జనుచునువుండె, తివిరి జ్వలియించు నట్టి దీనదశను, పుష్పసదృశముగ నది సంఫుల్లమౌను. 713 ఈ పై పద్యములతో, కవి తనను, మిడుతగను, తన ప్రియతముని అగ్నిగను వర్ణించినాడు. కాని చిత్రమేమిటంటే అగ్ని, శలభాన్ని ప్రేమిస్తే ఏమౌతుంది? ఆయగ్ని జ్వాలలో పడి తానే భస్మమై పోతుంది. అట్లే తన ప్రియతమ గూడ తనలో ప్రవేశించింది. కాని అబోధమగు శలభము (మిడత) అగ్నియొక్క రూపమును చూచి భ్రమపడి, దానిలో దూకింది. కాని మిడుతలోని ప్రేమ ఎంత బలవత్తరమంటే తాను ఆయగ్నిలో పడి భస్మమై పోతున్నా తన ప్రియునితో కలసిపోతున్నాననే ఆనందంతో అది, సంతోషంతో ఆత్మార్పణము ప్రియునకు చేస్తూ, ప్రియునితో తాదాత్మ్యము పొందుతుంది. ఈ పద్యములలో కవి ప్రేమ యొక్క యథార్థ స్వరూపమును వెల్లడించినాడు. ప్రేమయన ఆత్మ సమర్పణమే కాని, సుఖభోగము కాదు. లోకంలో సాధారణంగా ఒక ప్రథ ఉన్నది. అది ఏమంటే మనకేదైనా బాధకల్గితే అణచడాన్కి ప్రయత్నం చేయడం కంటె, ఒక్కసారి మనం గట్టిగా విలపిస్తే ఆ బాధ తగ్గుతుందని. దీనికి ఉదాహరణంగా తన తండ్రిమరణ వార్త తెలిసిన పిదప రాముడు విలపించిన, శ్రీమద్రామాయణం లోని ఘటనను తీసికొనవచ్చును. మఱియొక విషయమేమిటంటే మన ఒంటికి గాని, వస్త్రమునకు గాని ఏవైనా రంగు అంటుకొంటే అది కడిగితే పోతుంది అని. కాని ఈయనురాగము రంగు మనస్సుకు అంటుకొంటే అది ఎంత దుఃఖించినా తగ్గదు. ఎంతటి అశ్రుప్రవాహములు ఐనా దానిని కడిగివేయలేవు. అది తగ్గకపోగా అశ్రుబిందువులు రాల్చినకొలదీ అనగా దుఃఖించిన కొలదీ ఆ రంగు ఇంకా పక్కాగా తయారౌతుంది. నిజముగ ఇది అనురాగపు రంగు యొక్క వైలక్షణ్యం ఈ విషయాన్ని స్మరిస్తూ శ్రీ ప్రసాద్ ఇట్లా అంటాడు. శ్రీ 714 (తెలుగు) "ఆజ్ ఛుటతానహీఁ ఛుడాయే రంగగయా హృదయమేఁ ఐసా | ఆంసూసే ధులా నిఖరతా, యహ్ రంగ్ అనోఖాకైసే? తే. "ఎడదపై వేయగా బడెనిట్టి వర్ణ మింత వదలదెంతగ వదలించుకొన్న కెరలి మెరయునశ్రుల గడగిన కొలంది బహువిలక్షణమై యేలపరగునిద్ది? వావిలాల సోమయాజులు సాహిత్యం-1 ఇక కవి ఈలోకంలో అన్నీ కష్టాలే అని చెప్తూ ఇలా అంటాడు : పైన శూన్యమైన ఆకాశంలో నియతిసర్వసుఖాల్ని నింపింది. అందుకు చిహ్నంగా నింగిలో నక్షత్రములు, మిలమిలలాడుతు అనంతముగ వ్యాపించి ఉన్నాయి. ఇక క్రింద భూమి ఉన్నది. ఆ భూదేవి అన్ని కష్టాలను భరిస్తూ తన క్షారములగు అశ్రు వులతో సముద్రాన్ని నింపుతున్నది. ఇక్కడకవి తాత్పర్యము : తన ప్రియురాలు చీకు చింతలేని హృదయ సీమలో సుఖంగా ఉంది. కాని తానుమాత్రం ఈ భౌతిక జగముననే రమిస్తూ అష్టకష్టాలూ పడ్తూ ఉన్నాడు (ఆంసూ, ప. 108, 109) ఇంక ప్రసాద్, తన వేదన, మేఘమాలయై అనంతగగనంలో, సుఖ దుఃఖాల స్పర్శ గూడ తగలకుండగ హాయిగ స్వచ్ఛందంగా చరించాలని ఆకాంక్షిస్తాడు. ఇది నిరంతర సాహచర్యము వల్ల దానితో అతనికి విడదీయరాని మమత ఏర్పడింది. అతని జీవితము వేదనామయమే ఐపోయింది. ఈ క్రింది పంక్తులను చూడుడు : మూలము : తెలుగు “ఛడ్ జాయ్ అనంత గగనపర్, వేదనా జలద కీ మూలా | రవితీవ్ర తాప, న జలాయే, హిమకర కాహెూ, న ఉజాలా॥ తే. "అపరిమేయ నభముపై వ్యథాభ్రమాల, యధి వసించుత - తాపాగ్ని నర్యముండు కోరి జ్వలియింప కుండుతఁగుముద బంధు వృజ్జ్వల ద్యుతి విన్నవోకుండుగాత।। (ఇక్కడ రవి - హిమకరులు, సంతాపమునకు - శీతలతకును అనగా దుఃఖ సుఖములకు ప్రతీకములు. కవి తన జీవిత వేదనను పదునాల్గు భువనాలలోనికి పంపినా, ఎక్కడా శాంతంగా నిల్చిపోవడానికి తావులభించక తిరిగి కవి జీవిత ప్రాంగణానికే వచ్చి స్థిరమైన ఆవాసం ఏర్పాటు చేసికొని స్థిరపడ్తుంది. తన జీవితం వేదనామయం అని తెల్పటానికి కవి చమత్కృతి జనకమగు ఈ వ్యంగ్యశైలినిట ప్రయోగించినాడు :- కన్నీరు 715 మూలము తెలుగు "వేదనా వికల ఫిర్ ఆయీ, మేరీ, చౌదాహెూం భువనమేఁ, సుఖ కహీఁన దియా దిఖాఈ విశ్రామ, కహాఁజీవనమేఁ? తే. "నాదు వికలవేదన పదునాల్గు భువన ములలొ తిరిగితావచ్చె - ఆ ఇలలో నెచట వెదకినను సుఖమది కనిపించలేదు చెలగునిచ్చట విశ్రాంతి జీవితమున ॥ (భావానుగణమైన సుందర అనువాదము) ఈ వర్ణనములో సూరదాసు వర్ణన ప్రభావమించుక గోచరించుచున్నది :- "మేరో మన అనత కహాఁసుఖపావై | జైసే ఉడి జహాజ్కో పంచీ ఫిర్ జహాజీ పై ఆవై | (సూరసాగరం) (నా మనస్సు కమలనయనుడగు, శ్రీకృష్ణుని పాదారవిందములందు దక్క, అన్యత్ర ఆశ్రయం కోసం పోతే దానికక్కడ శాంతి యెట్లులభిస్తుంది? ఎట్లు సముద్రములో పయనించు ఓడమీదనున్న పక్షి, దానిని విడచి ఎంతదూరము ఎగిరినను, నిల్చుటకు, తగిన స్థానము లభించక తిరిగి ఆ ఓడ మీదనే వచ్చి వ్రాలినట్లు, నా మనస్సు శ్రీకృష్ణపదారవిందముల సన్నిధానమునకు తిరిగివచ్చి, అక్కడనే స్థిరనివాసం ఏర్పాటు చేసికొని విశ్రాంతినొందగలదు అని. కవి తన వేదనను సంబోధించి యిట్లా అంటాడు. ఓ నా వేదన జ్వాలా, నీవు నిత్య సౌభాగ్యవతివి. నీవు ఈ సంఘర్షపీడితమైన జగత్తులో దాపరించిన ఆకురాలు కాలమునకు హోలీపండుగవు, అనగా దానిని దహించి వేయుదువు. అంతటితో ఊరుకొనక మానవ లోకంలో తిర్గి వసంతమును ప్రవర్తిల్లచేయుదువుగాన నీవు మానవత తలపాటలోనున్న సింధూర రేఖవు (శుభసూచకము). కవి యీ ఛందస్సులో తన వేదనా జ్వాల, తనకు సంతాప దాయకమయ్యును లోకమునకు శుభదాయకమని తెల్పుటకు లోక ప్రసిద్ధమైన అరుణ రోలీ పదములను ఈ పద్యములో ప్రయోగించినాడు. “ఇస్ వ్యధిత విశ్వ పతఝడ్ కీ, మూలము తుమ్ ఖలతీ హో మృదు హెరాలీ! 716 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 మఱియును హే అరుణే! సదా సుహాగిని, మానవతా సిర్ కీ రోలీ ॥ "జీవన సాగరమేఁ పావన బడబానలకే జ్వాలాసీ యహ్ సారా కలుషజలాకర్, తుమ్ జలో అనల బాలాసీ।। తెలుగు తే. "ఉంటివి వ్యథితవిశ్వమహోజ్జ్వల మృదు, హోళికోత్సవ మట్లుగా నొప్పి నీవు, అరుణరో! సదాయైదువయైన మాన వత్వ సీమంత సిందూర భాగ్యమీవు. ఈ విధంగా తనలోని వేదన (వియోగ) తనను నిరంతరము జ్వలింప జేయుచున్నను మానవ జీవితంలో నవవసంతములు నింపుగాక యని యాశాసించి, ఇక వియోగ దుఃఖమూలములకు తన విరహాశ్రువుల స్రవంతి సుఖ-దుఃఖములను రెండు ఒడ్డులను ఒరసి కొనుచు, సంతప్తులును, దుఃఖవ్యథితులును నగు జనుల జీవితములలో కరుణ నింపుగావుతమని ఆశ్వాసిస్తాడు. ఈ క్రింది పంక్తులను చూడుడు:- “ఆంసూ వర్షాసేం నించ్కర్, మూలము దోనోం హీ కూల్ హరాహెూ | ఉస్ శరద్ ప్రసన్ననదీమేఁ జీవన -ద్రవఅమలభరాహెూ ॥ ఇక్కడకవి తాత్పర్యము : మానవుని మలినమైన జీవితధార సుఖ దుఃఖములను ఒడ్డుల మధ్యమున ప్రవహించుటవలననే నిర్మలమౌతుంది. అపుడే నిర్మల జీవన - ద్రవముతో (కరుణారూపమైన) నిర్మలరసముతో అది ముందుకు ప్రవహించి ధన్యమౌతుంది. కన్నీరు తెలుగు తే. "తడిసి కన్నీటి జడివానఁ దటములప్పు డుభయములు హరితమ్ములైయలరుగాక ఈశరత్ప్రసన్న తటిని, నమల జీవ న ద్రవమునిండియుండుత నవనవముగ. 717 ఇక తనలోని శుభ్రవేదనను (నిశ్చల ప్రేమ - జనితమగు) తన జీవిత చిరసహచారిణిగ నంగీకరించి అట్టి చిరసహచరి సహవాసము వలన ఆమెయశ్రు వులతో బాటుగ ఆమె ప్రేమను గూడ తనకు ప్రాప్తించినదని పల్కుచు, తనలోని వేదనను మఱియు అశ్రువులకునుగల విడదీయరాని సంబంధమును వెల్లడించుచు బాబూజయశంకరప్రసాద్ ఇట్లు వ్రాసినాడు. మూలము : "తుమ్! ఆ రే వహీహాఁ తుమ్ హెరా మేరీ చిరజీవనసంగిని దుఃఖవాలేదగ్ధ హృదయకీ వేదనే ! అశ్రుమయిరంగిని తే. "ఔను నీవు దానివె - మామకాత్త దుఃఖ పూరిత విదగ్ధ హృదయాన పుట్టియెపుడు నెగడు చిరజీవిత సుసంగినివె యగుదువు శుభ్రవేదనా ! ఓసి అశ్రుమయవర్ణ ॥ ఇక చివఱగ, తన కన్నులను నిచ్చలుక్రమ్మియుండు అశ్రువుల, తన వలె దుఃఖసంతప్తమైన జనుల హృదయములను, ప్రాతఃకాలీన తుషార బిందువులు, శు ష్కమైన ధరతిపై వర్షించి, అర్ధమొనరించిన చందమున స్నేహార్ధములను కరుణ సంభృతములను గావించుచు, మానవత, మోముపై ఆనందముచే తరళమైన మందస్మితము గోచరించుదనుక, కన్నులనుండి సతతము వర్షించుచునే యుండుగాక, యని కవి యాశ్వాసించుచు ఈ కావ్యమును ముగించినాడు. కవితాత్పర్యమేమియన లోకమునందు సుఖ-దుఃఖములు సామరస్యమును నెలకొల్పుటకై కరుణ వేదనలు, రెండూ అనివార్యములు. ఇదియే స్వ- జయశంకరప్రసాదు జీవిత దర్శనము. 'ఆంసూ' అనే కావ్యంలోనే గాక 'కామాయని'లో గూడ, తన యీ మతమునే నిర్ద్వంద్వముగ ప్రకటించియున్నాడు. ఈ విషయమునే వర్ణించుచు బాబూ జయశంకర ప్రసాద్, తన సందేశాన్ని ఇలా ఇస్తాడు :- మూలం 'సబ్కా, నిచోడ్, లేకర్ సుఖసే సూఖే జీవనమేఁ బరసో ప్రభాతహిమ - కనసా ఆంసూ ఇస్ విశ్వ సదనమేఁ ॥ 718 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 శ్రీ వావిలాల వారి యాంధ్రానువాదము : తే. "ఈ సకలముల రసము గ్రహించి నీవు, స్నిగ్ధసుఖముచే, మివుల శుష్కించియున్న జీవితమున విశ్వసదన సీమ నుషల హిమకణమటు నశ్రువుల వర్షింపు, మువిద! ఈ సందేశంతో ప్రసాద్ తన కావ్యాన్ని ముగిస్తాడు. సందేశ సారాంశము : తనలోని తీవ్రమగు విరహ వేదన (ఇదియే శ్రీ సోమయాజులు గారు సంబోధించిన, యువిద) లోకములోనున్న కరుణారసము నంతను గ్రహించి స్నేహమునకు నోచుకొనని, జనముల జీవిత క్షేత్రములను, ఉషస్సు, తన ప్రాభాతిక హిమ కణ వర్షము ద్వారా ఈ గ్రీష్మ సంతప్తమైన మేదినిని చల్లబరచినయట్లు, తన యశ్రుధారలతో కరుణార్ధములు గావించుగావుతమని, శ్రీ జయశంకర్ ప్రసాద్ ఆశాసిస్తాడు. కవి 'ఆంసూ' అను తన కావ్యానికి విషయంగా గ్రహించిన 'అశ్రు - వేదనల' పర్యవసాన మీ సుఖ-దుఃఖముల సామరస్యమే యని కవి ధ్వనింపచేసినాడు. 'ఆంసూ అనే ఛాయావాద కావ్యాన్ని, 'కన్నీరు' అనేపేరుతో తెలుగు ఛందస్సులోని కనువ దించిన శ్రీ స్వ. వావిలాల సోమయాజులు గారు, తెలుగు మాగాణమును సుమారు మూడు దశకములు, తన మంజుల, మధుమయ కవితల ద్వారా రస స్రవంతిలో ముంచియెత్తిన కవిశేఖరులు. ఆయన స్నేహశీలి. కరుణార్ద్రహృదయుడు. సంస్కృతాంధ్రాంగ్లములను పుడిసిలించిన అగస్త్యుడు. సహృదయుడు, భావుకుడు, సంఘసేవకుడు. రససిద్ధిని సాధించిన కవీశ్వరుడు. ఆంధ్రసాహిత్య ప్రక్రియలలో ఆ మహాకవి స్పృశించని ప్రక్రియ లేదు. తనది యగు ముద్రవేయని ప్రక్రియగూడలేదు. 'కుమారధూర్జటి' యను బిరుదముతో సత్కరించబడిన సరసకవితా నిర్మాణ ధురీణుడు. అట్టి కవి తల్లజుడు 'ఆంసూ' అనే ప్రసాదు కావ్యమును తెనిగించు అవసరమేల కల్గెను. అను ప్రశ్న తప్పక పాఠకలోకమునుదయించును. వారు అనువదించిన ఈ 'ఆంసూ' అనే హిందీ కావ్యము, కేవలము స్థూల లేక మూర్త పదార్థ వర్ణనా పరమైన ప్రాచీన కావ్యశైలిలోగాక, సూక్ష్మము లేక అమూర్తముఐన భావ ప్రపంచము దెసకు భావుకలోక దృష్టిని మఱల్చుటకై స్వర్గీయ శ్రీ జయ శంకర ప్రసాద్, తన భావతీవ్రత కనుగుణముగ రూపొందించిన, లాక్షణిక పద సంగఠనా రూపమైన 'ఛాయావాద' శైలిలో రచించబడిన మధుర, మంజులకృతి. ఇట్టి నవ్య శైలిని తెలుగు కన్నీరు 719 - సాహిత్యలోకమునకు పరిచిత మొనర్చుటకై శ్రీ వావిలాల సోమయాజులుగారు 'కన్నీరు' అనేపేరుతో ఈ కావ్యమును తెలుగులోకనమునకందించినారు. అట్లే ప్రసాద్ నిర్మించిన 'కామాయని' యను పేరుతో సరస మంజులమైన ఆంధ్రభాషలోని కనువదించి ఆంధ్రభాషా ప్రపంచమునకు చాలయుపకారమొన రించినారు. శ్రీ స్వ ప్రసాద్ రచించిన ప్రత్యేకముగ ఛాయావాదశైలిలో రచించిన కవితలు, హిందీ సాహిత్యమును తఱచి తఱచి చూచిన విద్వత్తల్లజులకే, 'విద్యావతాం భాగవతే పరీక్షా' అనినట్లు పరీక్షా స్థానము. అట్టి కవితలను ఆకళింపు చేసికొనుటయే కష్టము. కాని వానిని ఆకళింపు చేసికొనినను, వానిని భాషాంతరము లోని కనువదించు యత్నము చాల సాహసమే యని చెప్పవచ్చును. కాని శేముషీధురీణులును, మధుమయకవితా నిర్మాణ దక్షులును నగు శ్రీ వావిలాల సోమయాజులగారు, తన లక్షణ లేక ధ్వని ప్రధానమైన తెలుఁగు శైలిలో తన యనువాదములను గూడ సమర్థముగ నిర్వహించి, తాము చేపట్టిన కార్యములో సంపూర్ణ సాఫల్యమును, తమ ప్రతిభా - వ్యుత్పత్తుల బలముతో సాధించుటతోబాటుగ ఆంధ్ర కవితా క్షేత్రములో గూడ నవీన కావ్య నిర్మాణమునకొక అభినవ మార్గమున, సుగమ మొనరించినారు. ఇట్టి యద్భుత కవితా రీతిని ఆంధ్రలోకమున కందించిన స్వ. శ్రీ వావిలాల సోమయాజులు గారికి, వారి కవితలకు జయకారములను (జేజేలను) పల్కుచు - భవదీయుడు భూమికా రచయిత 720 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 కన్నీరు (ఆంసూ) తే. ఏల కరుణరసకలిత హృదయ వీథి నిటుల వికల రాగిణి ధ్వనియించు నేఁడు ఏల హాహారవాల గర్జించు నీటుల స్నిగ్ధవేదన చెలఁగి నిస్సీమ మగును? తే. తే. తత మదీయ మానస రహస్తటము నందుఁ గలిత లోలలహరి కాఘాత పంక్తి? ఏల కలరవమ్ముల వినిపించుఁ గొలఁది బహుళ విస్తృత గత పూర్వ వచనములను? నా ప్రతిరుతి ప్రత్యావర్త నమ్ము నేల సలుపు నిటు శూన్యమౌ క్షితిజమ్ము నుండి? ఎదురు దెబ్బ తిన్నటు, విలపించు దాని వోలె నున్మత్తయటు రాకపోక లేల? తే. అర్థిఁ జింతించుచును నుభయాంచలముల వ్యథిత గగన కూలంకష పగిది నేఁడు మామకీన సుచేతనా మహిత తటి ని మృదుతరంగ పాళికల సృజించు నేల? తే. నీల నభమున తారకానిచయ మెనసి వ్యాప్తిఁ గైకొని వర్తిలు పగిది మదిని వెలయ నిర్మింపఁబడియె సువిస్తృతముగ బహుళ సంకీర్ణమౌ జనపద మొకండు. తే. ఇట్టి జ్వాలామయాగ్నియం దెగసి పడెడి కన్నీరు యఖిల మీది నాడు విస్ఫులింగాళి, అరయ నిద్దిశీర్ణమై కనఁ గేల శేషమగుచు చెలఁగు నా మహామేలన చిహ్న వితతి. 1 2 3 4 10 5 6 721 తే. ఇదియె శీతలజ్వాల జ్వలించు, నేత్ర జలమె యింధన మయ్యెను సాగు వ్యర్థ మైన నిట్టూర్పు రేగి యత్యంతముగను ననిలుఁ డొనరించు కృత్యమ్ము నాచరించు. తే. ప్రణయ జలధి తలాన నిద్రించుచుండె బాడబజ్వాల, దప్పిక వడసి నట్టి మత్స్య నేత్ర యుగళి సదమదము నొందె వికలమైనట్టి జలముల వెతలగూరి. తే. సింధు జలబుద్భుదములు విశీర్ణమయ్యె, తే. తే. స్నిగ్ధ నక్షత్రమాల సంభిన్నమయ్యె. అసితనభముక్త కుంతల యైన ధరణి దోచుకొనఁబడినట్లుగాఁ దోచుచుండె. కమల మృదుపద నిత్య సంకషణములను జెలఁగి బొబ్బలు చిటిలి విశ్లేషమొందె అవ్వి యీయెడఁ దిలకింప నశ్రులనెడి కరుణ కణములచేఁ గడుగఁబడియుండె. ఈ వికల వేదనను నొంది యెది సుఖమ్ము తోడఁ బందెము వేయఁగా దొరయు నద్ది నాదు ముగ్ధమును నకించనమ్ము నయిన స్మృతి విహీన చైతన్యమై మెలఁగుచుండె. తే. ప్రబల కాంక్షానిచయ పరివర్తనమును నిత్యసుప్త వ్యథాఘనోన్నిద్రతయును!! స్వాదు సుఖము సమస్తమ్ము స్వప్నమగుట! సార్ధనయన పక్ష్మమ్ములు సంవృతములు. Gilb తే. 722 ఆత్మ వారిజ మలకమ్ము లనెడి యళుల చిన్ని యురులలొఁ దవిలి తాఁజిక్కువడియె, నశ్రు సుమరసము నదించి యనయ మిటులఁ గడఁగి నిశ్వాసపవనాలఁ గలియుచుండె. Im 7 8 00 9 10 11 12 13 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. మనసు నెదొ సంతసపరచుకొనెడి క్రీడ మాదకమ్మయ్యెను-విమోహమయము నయ్యె, అట్టి మధుర ప్రణయ వేదనా విలమ్మె యెడఁద నిప్పు డీగతిఁగదలించి వేయు. తే. సుఖముచే నాహతమ్మయి సుప్తమైన తే. యాశ! ఉచ్ఛ్వాసమౌ వృథాయాస హృదయ మైన యది సమాధి, కరుణ యవలఁజేరి యొక్క మూలన రోదించుచున్న దిటుల. చకితగతి నిస్వనము సేయు చాతకమ్ము రమ్య రసమయ కలకోకిలారవమ్ము అర్ధమగును నా కరుణ కథాంశ మిపుడు తడిసి యున్నది కన్నీటిధార లందు. తే. రమ్య నిజసౌఖ్యముల స్పృహారహితులుర్వి Gall నెవరో, సుప్తముగ నువుండు నెవరి వ్యథలు వార లవకాశ మేకడఁ బడయఁగలరు? కడఁగి వినుటకు కమనీయ కరుణకథలు. తే. ఇటుల జటవలెఁ దోచుచు నెట్టు లెంత పెరిగియున్నది జటిలజీవిత సమస్య హృదయ వీధుల భూరజ మెగురుచుండె నరయ నిట్టి విభూతి యెవ్వరికిఁ గలదు? తే. మసలి స్మృతివోలె మామక వ్యాప్తినొంది ఘనీభూతమైన పీడ తోచి, కలఁగి, కార్కొన్న యీ దుర్దినమున నశ్రువులు వోలె వర్షింప నరుగుదెంచె. తే. కడఁగి వినుట కీవిటులు నాక్రందమున నేమి మొరయుచు నున్నది యెదొ విపంచి ధారలై వచ్చు కన్నీటి దారములతొ కోరి కరుణపటము నేసికొనెద వీవు. కన్నీరు 14 15 16 17 18 19 20 723 తే. ఏడ్చి యేడ్చి నే నంతట నేకువెట్టి కరుణకథ నీకు వినిపింపఁ గడఁగినాను సుమనముల గిల్లుచును వినుచుంటి వీవు ఎఱిగి యెఱుఁగని యట్లు వర్తింతువేల? తే.. మించెడి విమోహమునను విస్మృతిని జెంది పడుచు లేచుచు సాగుచు వెడలుచుంటి చి త్తవీథి వీణాశ్రుతుల్ సేయఁబడియె తివిరె నా యనురక్తి సుతీక్షణముగ. తే. పొలసె జంఝానిలోద్ధతా స్ఫోటనమ్ము మహితగర్జ శంపామేఘ మాలికాళి చూచి, పొంది సమస్త మీశూన్య హృదయ మునను వాసమ్ము కల్పించుకొనియె నపుడు. తే. ప్రళయ జలదాళి నా కుటీరమును ధరిసి పూర్ణగర్జలఁ బైఁబడి ముట్టడించె శుభ్ర గతి కురిసెను తమశ్చూర్ణ-మంత నంధ తమసమ్ము క్రమ్మె నత్యధిక మగుచు. తే. మహిత విద్యుల్లతా మంజు మాలికల ధ రించి, సుస్మిత మొనర్చెడి రీతి, నాదు స్వాంతమున ఘనరసబిందు సముదయమ్ము నెవ్వ రాగక మరల వర్షించినారు? తే. అస్మదీయ మిథ్యాజగమందు నున్న నిత్యసుందర మోహన సత్య మీవు మధుర కళ్యాణకలిత మీ మార్గమందు నాకు జీవన-సంగవై యొప్పినావు. తే. రజ్య దుజ్వల చిరరహోరాత్రు లెన్నో నమల మందాకినీ ప్రవాహమ్ము లోన దివ్యతారామనోహర దీపికాళి నిచ్చి యుపహారములుగ నర్చించినాను. 21 22 23 24 25 26 27 724 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. తే. గౌరవము కల్గినది ననుఁగలియు కొరకు వచ్చితివి మత్రియా! దిగివచ్చినావు కడు నకించనత గల యే గర్వపడితి అల్లి ఉదయ వేళ కలల నరసినాఁడ! తొలుత నినుఁగని నప్పుడే సంతుషిత్త నవ్యరాకానిశి స్మితమొనర్పసాగె, పరఁగి నటు దీర్ఘకాల పరిచయమట్లు నాకుఁ బొడకట్టితివి యాక్షణాన నీవు. తే. శీతకరునకుఁ బూర్ణిమా సింధువునకుఁ బరిచయవిభవ మబ్బిన పగిది తోఁచి వచ్చి పైఁబడి యుత్తుంగ భంగములను స్నిగ్ధ కిరణాళి సేయు నాశ్లేషణముల తే. రెప్పవాల్సకా సౌందర్యలీల నెల్ల నేను నివియె నేత్రముల దర్శించుచుంటి నింపుగఁ బ్రతిభ యనుపాత్ర నింపితెచ్చి సుకవి కది దానమొనరించుచుండె నపుడు. తే. మాధవీ మంజు లచ్చాయ మసలువేళ ఝరఝరలను నదించే నిరయిరమువోలె మాయలో చేతనత్వము మంత్రముగ్ధ మైనరీతిగ ప్రవహించి యరుగు చుండె. తే. ఆకురాలెడి కాల మట్లరుగుదెంచె పుష్పవని నిల్చె శుష్కించి భూరుహములు చివురుటాకుల క్రొంబూల సెజ్జ పరచి వచ్చితివి పొదరింటికి స్వలచి నీవు. 28 888 29 30 31 32 33 తే. అబ్జముఖమున సమ్మోహనావకుంఠ నము ధరించి, కొంగునను దీపమును దాచి కన్నీరు విమల జీవిత గోధూళివేళ వచ్చి తప్పుడు పూర్ణకౌతూహలమ్మనగ నీవు. 34 725 తే. జలధరమ్మున సుందరశంపవోలె శుభ్ర ప్రదినిని చపలశోభ పగిది అక్షియుగళిఁ గనీనిక యనఁగఁదోచి చక్షుతారల శ్యామల చ్ఛవినిబోలి. తే. ప్రతిమయందున ఘన సజీవతనుబోలి నేత్రపాళిని శుభకాంతి నెలవుకొనియె శతశతాగణితము మహాసంఖ్యయందు భిన్నమైన రేఖగతి హృద్వీధినుండె. తే. అప్పుడొప్పితి నో సుందరాంగ! నీదు చిర తరుణిమను సౌందర్యసీమ కలదు కాని మన్మనో నిస్సీమ గగన మందు బొలుపు మెరయఁ గడు నిమిడిపోయినావు. తే. సరగునను దేనికై యొక సర్షపముగ యేను లావణ్యశైల మర్పించినానొ అట్టి లావణ్య సత్కళాయతఁమనోజ్ఞ దివ్య ముగ్ధసౌందర్య మతి ప్రియమ్ము. తే. ఎవ్వ రీ విథు నీరీతి యీ వినీల బంధ నమ్ముల నిటు కట్టుబడఁగ జేసి రేల నిండియున్న యది వజ్రాలు నిటుల మణుల వెల్గుల వెలిజిమ్ము ఫణులమోము. 35 36 37 38 39 తే. ఆ వినీలావదాత నేత్రాళి నెంత యౌవన ఘన ఘూర్ణ మధు మదారుణిమము ! పరమ మాఘవాసిత వజ్రపాత్ర నెవ్వ రొదవ నింపిరి మాణిక్యమదిరతోడ ! తే. అమలిన విలక్షణమగు నీలమణి నావ తిరుగుచున్నది నేఁడీ యతృప్త జలధి లీల లొలయ కాలాంజనరేఖ యొండు వెలయుచున్నయది వినీల వేలవోలె. 726 40 41 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. నీదు పక్ష్మతూలిక మహోన్మేషమునను క్షితిజపటము నిటుల నంకితమ్మెనర్చి యెన్ని క్షతహృదయముల కహీనచతుర చిత్రకారిణి యౌచుఁదాఁ జెలఁగుచుండె. తే. కోమల కపోలములను నిగూఢ మంజు స్మితి సురేఖను, భ్రుకుటి వక్రతను నెవఁడు దర్శనము సేయునో గాఢ తత్పరతను నిలపయిని వాఁడె కౌటిల్య మెఱుఁగగలఁడు. తే. ఇంపు లొలయు విద్రుమ శుక్తి సంపుటమున నిటుల ముత్తియపుం గింజ లేల తోఁచు? హాఘ మీది కాదు శుకమె యౌ, అరుగుదెంచె నేల యీ ముత్యములను భక్షించుకొఱకు. తే. బహు వికసిత జలజ వన వైభవమ్ము మించెడి మధురోషస్సు నిజాంచలమునఁ గెరలు నాహాసమును దిలకించి క్షణము తనను నపహాస మొనరించుకొనును దానె. తే. ఆననాబ్జ సమీపమ్మునందు భవ్య పంకరుహ ముగ్ధ కిసలయ ద్వయము గలదు శ్రవణముల యందు జలబిందు సదృశముగను నెవరి దుఃఖము నిలచి తా నిటుల నుండె. తే. ఏ యనంగుని సమ్మోహ నేద్ద చాప శిథిలతా ద్విగుణీకృత శింజిని యది! అది యనంతతన్వీ సుభుజాబ్జ లతయె! రమ్య నవ తనుచ్చవి సరోలహరి యౌనె? తే. చంద్రికాపర్వ సుషమల జలకమాడి చంచలాతన్వి వచ్చిన సరణి నుండె రమ్య మా పావనవపు ర్విలాసశోభ అమరె నాలోక మధురయై అక్కజముగ. కన్నీరు 42 43 44 45 46 47 48 727 తే. తే. అయిన మోసకత్తియ దానియందె నాకు గాఢవిశ్వాస మెదలోనఁ గలదు, అట్టి చారు మహిత మాయా ఘనచ్చాయయందు స్వయముగా నెదొ యున్నది సత్యమగుచు. మంజు సౌందర్య మది రూపమాత్రమగునె? కాక అందు హృదయమును గలదె, నిండి తానె చైతన్యమను భ్రాంతి నూని నాలొ పరగుచున్నది యొక జడత్వంపుమాయ. తే. కమ్ర యాయమ మృదులాల కములు వోలెఁ జెదరినయవి నాదు బ్రతుకు - చిక్కులెల్ల ఎవ్వరు మధుమదిర నాస్వదించినారు? అస్మదీయపక్ష్మములు మూయంగఁ బడియె. తే. చిక్కు పెరిగిన కొలఁది హసించు చప్పుడు శాంతి యుపవిష్ట యైయుండె స్వాదుసుఖము పరగ బంధింపఁబడియె నా బంధనమున విమల కరుణ మెలిగొని యవ్వేళనుండె. తే. చలిత తరుదళ కిసలయశాఖ వలచి చేయుచున్నది మంజులాశ్లేషణమ్ము పుష్ప చుంబనము! మధుపముల విలక్ష ణంపు తాన మారంభమైనది యెసంగి. తే. స్నిగ్ధ మకరంద భారముచే నణంగి యమలిన మురళి ముఖరిత మగుచునుండె కమ్రముగ నవ్వనధరముల్ కళికలందు సర్వము విచ్చేసి నెలకొనె శ్రవణములను. తే. శుంభ దున్మద పరిరంభ కుంభ మదిర! బహుళ నిశ్వాస మలయజ భంగ పాళి!! స్వాదు ముఖచంద్ర చంద్రికా జలముతోడఁ గడిగికొని మోము లేవఁగా గడఁగుచుంటి. 728 49 50 51 52 53 54 55 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. సుఖ సురజని యలసిపోవుచుండె హృదయ మందు ముఖకైరవాధిపు డధివసించె, శ్రమ పృషత్కణ సదృశ నక్షత్రములతో నార్ధమైయుండె నప్పు డంబరపటమ్ము. తే. అస్మదీయ మేలన నికుం జావసధము నందు శిథిలత అలసిన యవనితలము నా మనోహర మసృణ స్వప్నములు వోలె నా తెరంగున నిద్దుర నంద దెపుడు? తే. అలలయందున దప్పిక కలదు నిండి అయినయది శూన్య మావర్త మనెడి పాత్ర మానసరసమంతయుఁ గ్రోలి మమత మెరయ నీవు పాత్రను దొర్లించినావు పిదప. తే. చాలగాఁ జెదరినవి కింజల్కతతులు అగుచునుండె నుద్ధూత మనార్ధ పుష్ప ధూళీ, మనసున శుష్కించి తోఁచెనపుడు స్నిగ్ద వికసిత స్నేహకుశే శయమ్ము. తే. అమల మలయజ మృదుతరంగములు సోకి యే కడను దాగియున్న వియ్యెడను గనఁగ ఇటకు విచ్చేసి తిరిగి తా మేల వెడలె నమృత మృదుకరుణా కటాక్షాంచలములు. తే. కలదు విస్మృతియను, మాద కతయుఁ గలదు మహితగతి మూర్ఛనము నిండి మానసమున కలదు కల్పన, స్వప్నమ్ముకలదు - కలదు నిర్జనమ్మున మురళి ధ్వనించు టచట. తే. మృదుశిరీషము వజ్రమై మెలఁగు నాదు నెదను నలిపివేసిన యది యదయవృత్తి హిమ సుశీతల ప్రేమ జ్వలించుచున్న దనలమై యిపుడనయ మా యుల్లకమున. కన్నీరు 56 57 58 59 60 60 61 62 729 తే. అళికులమ్ముల కనుచాటు నంది కంజ ములు ముకుళితము లైనచో మొనయు మసక కాంతి సంధ్యయు ప్రత్యాశ - కాన నిప్పు డేను నొకదాని గుర్చి రోదించుచుంది. తే. ప్రణయ ముజ్వల దీపమ్ముపగిది వెలిఁగె నెగడె మన్మానసము నవనీత మగుచు లీలగా మిగిలిన ధూమరేఖతోడ నిపుడు చీఁకటి నెపుడు చిత్రించుచుండె. తే. నీరవము వంశి కలరుతి నిశ్చలమ్ము తే. తే. నళినమున నళికులము బంధనము నొందె ఈ ప్రగాఢ తమోమయ హృదయ సైక తమున ప్రణయ కాళింది కదలి నదించె. అమితముగఁ ద్రియామాంతిమ యామవేళ నర్థి వికసించినది కుసుమాకరమ్ము ఆ మృదుల శిరీషకుసుమ మటుల నుదయ కాలమున నేను ధూళిలోఁ గలసిపోతి. ఆ మధుర గంధమున నొంది వ్యాకులతను దీర్ఘ విరహ తరంగిణీ తీరమందు మందమందమ్ముగా నదె మలయజమ్ము వెడలుచున్నది నిశ్వాస విసరములను తే. చెలువు మెయిఁదోచె చుంబున చిహ్నితమ్ము కాంత ప్రాచీసతీ హేమగండ యుగళి చూచుచుంటి మార్గమును నే శూన్యనేత్ర ముల నుదయకాలమున నిద్ర పోవుచుంటి. తే. అర్థిమెయి నవనీ శ్యామలాంచలముల మంజులాశ్రు పుష్కరబిందు మౌక్తికముల నినిచి ప్రేమప్రభాతాన నేను నింగి పయిన లఘు మేఘములవలె వచ్చినాను. 730 63 64 65 66 67 68 69 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. హరిత విషపాత్ర నయనములందుఁ జేర మదిరయై మనోజ్ఞారుణిమముల వెలిఁగె చక్షు సుందర ముగ్ద పక్ష్మములు నేఁడు జీవితమ్మున ప్రణయమై చెలఁగుచుండె. తే. కామనాసింధు వీచికాగతుల నొప్పి నిత్యసౌందర్య పూర్ణిమ నిండియుండె అస్మదీయ విధుచ్ఛాయ యమల ఫణితి మించి రత్నాకరమ్మయి మెరయుచుండె. తే. పరగి సౌందర్య యవనికా భ్యంతరమున నిచ్చ మోహన మురళి మ్రోయించుచుండె అపుడు ఛాయానటుండు వస్త్రాంచలమున సంధ్య, కుహన, కౌతుకమొంది సాగిపోయె. తే. వచ్చితివి మాదకత్వమ్ము పగిది నీవు చనెడివేళ వెడలితివి సంజ్ఞవోలె వదలి పోయిన మత్తులో వ్యాకులతను విలపనము సేసినాడ నవ్వేళ నేను. తే. అవధి నెఱుఁగనిదగు నంబరాంతరమున బహుళ చంచల చపలవైవచ్చి వెడలి మఘవ చాపోప మమ్మైన మహితకాంతి వదలితివి తన్వి! బహుళముగను. తే. ఆస్మృతి కుసుమ రస జలదాళి మాల పగిది కైపున వేవేగ వచ్చెనపుడు ఈ హృదయ విపిన కళిక యిటుల దాని రసముచే స్మిత మొగి నొనర్పంగ సాగె. తే. శిశిరకణపూరిత మ్మయి చెలఁగె నెడఁద నీదు సమ్మోహన కుముదినీ ప్రియుండు కడఁగి మధువర్షమటు మౌక్తికముల రాశి నిదె మనోమందిరముపై వర్షించుచుండె. కన్నీరు 70 71 22 72 73 H4 74 75 76 731 తే. పావనమ్మైన నీ స్పర్శ వడసి నంత మించి శీతసమీర మే తెంచుచుండె అశ్రుధారల వర్షించి యంతఁబులకి తాంతరంగోజ్జ్వలుండ నే నగుచు నుంటి. తే. అమలినోపధాన నుసహాయమ్ము నొంది యింపుగ మధుమాలతులు నిద్రించుచుండె ఏను వ్యర్థమ్ముగాఁ బ్రతీక్షించునపుడు మించు గగనతారకల లెక్కించుచుంటి. తే. ఏటి దాగుట నిష్ఠుర! యిది యెఱుంగ ఎవఁడొ యుండును నావాఁడు - ఎనసె బహుళ విరహ నిశిని బ్రత్యాశ సువిస్తృతముగ ఉండెదము మేము - దుఃఖము నుండె నిలచి. తే. శాంత మేలన సంధ్యచేఁ జారు హేమ వాగురను మనము ధరియింపంగఁజేయు నపుడు నీలావకుంఠన యవనిక వివృ తాత్త మగుట యేఁ గనఁ జాలనైతి నెఱిఁగి. తే. ఎడదపై వేయగాఁ బడె నిట్టివర్ణ మింత వదలదెంతగ వదలించుకొన్న కెరలి మెరయు నశ్రులఁ గడిగిన కొలంది బహు విలక్షణమై యేల పరగు నిద్ది? తే. వికసిత కళామనోహర విమలమూర్తి యగుచు నీదు కామన హృదయపటమందు నస్మదీయాభిలాషగ నక్కజంపు బహుళరీతులఁ జిత్రింపఁ బడుచునుండె. తే. పొలుపుగఁ గరాన మణిదీపమును గ్రహించి పథము చూపింపఁగా నీవు వచ్చినావు కిరణ కేశపాశ ఘన వికీర్ణత నది పావకోజ్జ్వలపుంజమై పరగుచుండె. 732 77 78 79 80 80 81 82 83 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. అలిగిన కరుణ వీణ యత్యతిశయముగఁ గడిఁగి మరియు నెంతయు నూర్వగామి యయ్యె దర్పమై యుపవిష్ట యై దైన్యమపుడు సాహసమునఁ గీడు పలుకసాగెనంత. తే. కోలి నా తీక్షణ హృదయకుహర మదిరం దృప్తి తీరఁగ - చూపుచు నిపుడు ప్రౌఢ కింశుకారుణ నేత్రరక్తిమము వలచి యెదియొ ప్రక్కకు మోము త్రిప్పెదవు నీవు. తే. నౌకనే యలల పయిన నడిపి కర్ణ ధారి! చేర్చితి వీశూన్యతటము కీవు ఇట్టి నీరవవేళయం దిప్పటివర కెవ్వ రేనియు వచ్చిరే యిటకుఁ గనఁగ. తే. ఆ ఘనాంధ్యపు మలినాంచలాంతరమున ఆదరి మరల నెటకు నే నరుగఁ గలను? అట్టి వేదనాఛద్మమయఛల నాన జీవిత ప్రలోభ మేదియుఁ జెలగఁబోదు. తే. తిరిగివచ్చెడి మార్గాన నరయఁ బాద చిహ్న మెయ్యది చూడ శేషింపలేదు చాలగ మునింగె నెద మరుస్థలము నందు పొరలి కన్నీటివాక యుప్పొంగుచుండె. తే. మించి గగనశూన్యమ్ము వ్యాపించియుండె లేదు శక్తి ఆధారమ్ము లేదు ఎటుల యే నకించనుఁడను దీని నీద గలను? ఒక్కకూల మెయ్యదియేని యున్నయదియె? తే. కన్నీరు ఇది నా తరణి యెపు డహీనముగను దిరుగుచున్నది ఘనతర తిమిరజలధి ఆన నాబ్జ కరాకృష్యమాణ యగుచు వచ్చుచున్న దుర్వీ సమీపమున కిపుడు. 84 85 86 87 88 89 90 733 తే. శుద్ధ ఘన సికతామయాస్తోక జలధి నాదు మానస మనెడి యీ నావ నిప్పు డశ్రుధారల నదియించు న ట్లొనర్చి ప్రేమగుణహీనముగ నడిపించుచుండె. తే. తరల మై ఫేని లమ్మయి తనరు నిట్టి కడలి గరళ తతుల వెలిగ్రక్కుచుండె తలమున జ్వలించు బాడబానలము మించి ఎట్టి తృష్ణచే దీని మథించినావు. తే. కలసి నిశ్వాసపవనము మలయజమును సోకి ఛాయాపథమ్మును దాకి వచ్చు అంత్యకిరణాళి వెదజల్లి యమృతకరుఁడు తాను నియ్యెడ నయ్యెదే దాగుకొనియె. తే. ఎక్కడేనియు నినుఁబొందు నెడల నేను మెరసెదను ధూళికణమునై మించి మంజు సౌరభముగ నెగిరిపోదు. - శక్తి మెరసి గ్రహపథమ్మును డీకొనఁ గడఁగు దేను. తే. చెలఁగు నీ యాంత్రి కోన్నత జీవితమున నట్టి ఘనశక్తి యెయ్యదియైనఁ గలదె? నీ సజీవ మమత్వమ్ము నిత్య తేజ మునను నిండిన యటుల మేల్కొనుచు నుండె. తే. విధువు హృదయాన నిపుడుపవిష్టుఁడయ్యె తరుణ సౌందర్యసుధ కడుధన్యమయ్యె ఆ సుశీతల కిరణ సహాయమునను నిప్పురవ్వలు మేయు వెన్నెల పులుంగు. తే. పొంది జ్వలనమె పాథేయముగను జ్యోతి శలభమును జేరుటకును తాఁ జనుచునుండె తివిరి జ్వలియించునట్టి యా దీనదశను పుష్ప సదృశముగ నది సంపుల్లమౌను. 734 91 92 93 94 95 96 97 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. గగనయూధికావని తారకాళి మెరసి విరిసె నొక జాతిగల కుంద విసర మటుల స్వచ్ఛ శతదళమును బోలు శశివి నీవు చేరి వాని నేలొకొ కలిసెదవు తమిని. తే. కళికల లఘు జీవితపు సాకల్య ఫల మ దెల్ల నిదియె యనుచును వచింపఁదగదు ఇటుల మకరంద భరితమై యెసఁగుచుంట! అన్యగత మానసులు త్రుంప నవనిఁబడుట!! తే. రెండు గడియలె జీవిత ముండు - మృదుల వృంతములలోనఁ గడచిన నేమి హాని కలదు నీ - కిటు జీవిత కాలముననె జారిపోవుట యౌనె నిశ్శబ్దముగను ! తే. ఏను వెదజల్లితిని కోరి హృదయ కాంక్ష లనెడి సుమనాంజలిని నీ పదాబ్జములను పురుగువలె దీనిని తొలచిపోయవలదు కలదు కొంత తేనియ వీని కణములందు. తే. నిండిన విమోహవేళా వినీలపటము పైనఁ గల దెదో వ్రాత యస్పష్టముగను దాన సుఖదుఃఖమయ జీవితంపు రేఖ యెంతగనొ వ్రాయబడియుండు వింతగతుల. తే. పడుచు లేచుచు సుఖదుఃఖభరము వలన నఖిల జగము తిరోహితమగుచునుండు హితము నహిత మెవ్వరికిఁ బ్రాపించెననుచు నెన్నఁ డేనియుఁ దిరిగి వీక్షింపఁబోదు. 98 99 100 101 102 103 తే. వెలయు మానవజీవిత వేదిపైన జరుగు విరహమేళనముల పరిణయమ్ము కడఁగి నటియించును సుఖదుఃఖద్వయమ్ము కెరలు నేత్రమానసముల ఖేలనమ్ము. 104 కన్నీరు 735 తే. క్షణములోన నింతయు సుఖమును గ్రహించి జీవితాంతస్థలము నుండి నీవు జారు కొంటి వెటకొ నెమ్మదిగ - నీ కొఱకు ప్రాణు లిప్పుడు వికలమ్ము లగుచు రోదించుచుండె. తే. ప్రవిమలోషస్వినీ మృదు పక్ష్మములను జెలఁగి నా దుఃఖ మిటు లేల చిందుచుండు జౌను సంధ్యామనోజ్ఞాలకాళి యందుఁ చిక్కు కొన్నది నా సౌఖ్య మెక్కటిగను. తే. మంజులోజ్వల మాలతీ కుంజ మందు కౌముదియు నంధకారమ్ముఁ గలసి నటులఁ గడఁగి మనసున సౌఖ్యదుఃఖద్వయమ్ము లీలగాఁ జుట్టుకొని వినిద్రించుచుండె. తే. సీమ లెఱుఁగని సౌఖ్యానఁ జెలఁగి గగన మంతయును దరంగా యిత మగుచునుండె. హసన మొనరించు పగిది ఛాయాపథాన స్నిగ్ధతారకాతతి ప్రదర్శించుచుండె. తే. ఎసఁగుచుండె దుఃఖభరమునెల్ల మ్రోయు చున్న యట్టుల గను విశాలోర్వి, క్రింద నవ్వసుధ నిజలవణ నేత్రాశ్రువులతొ సరవి నింపుచుండె కరుణ సాగరమును. తే. శోకభర మెద వాంఛించుచుండె ధరణి కెరలి నింగి సుఖమును లాగికొనుచుండె నన్నె యర్పించుకొని వాని యన్నిటికిని నరయుచున్నాడ నిప్పుడయ్యాననమును. తే. అంతరిక్షాన జలతల మందు నైన 736 నిముడగాలేనిదైనట్టి యింత సుఖము వాని పిడికిళ్ల నున్నది బంది యగుచుఁ బెంపుగఁ బడితి నాశ్వాస నంపుభ్రమను. 105 106 107 108 109 110 111 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. చేసి చుంబన నిద్రలో - నా సుఖమ్ముఁ గొల్లగొని పారిపోయెడు నల్లవారి కేమి దుఃఖమున్నది? పులకించెఁదనువు కొంచెముగ నపు డొదవె రోమాంచితమ్ము. తే. బ్రతుకునందున దుఃఖమై పరగుదాని తే. సుఖమనుచు నుపు భావించుచుంటి నేను వారిదమ్మున హ్రాదిని పగిది నుండు జీవితమున మృత్యు వది వసించి యెపుడు. ఇటుల దుఃఖ తరుపలాశ మింత చలన మొందుటనె వారి సౌఖ్య మట్లొనర నాణెం వారి శృంగార మిప్పు డవ్వారిగాగ మెరయుచుండె నా కరుణ సమ్మేళనమున. తే. రెంటియెడ నుదాసీనత నుంట యెఱిఁగి సౌఖ్యదుఃఖ మేళనమును సలుపవలయు హాని నొందియును మమత యలిగినట్టి వానియెడ సేయవలయు సాంత్వనమునోర్చి. తే. అపరిమేయ నభముపై వ్యథాబ్దమాల యధివసించుత-తాపాగ్ని నర్యముండు కోరి జ్వలియింప కుండుతఁ గుముద బంధు వ్యుజ్జ్వలద్యుతి విన్నవో కుండు గాత !! తే. ఆడు నటీవలె నియతి నృత్యమ్ము- సలుపు కందుక క్రీడ-కడఁగె నానందమునను నినిచికొన నిజాసంతృప్త మనము నిట్టి వ్యధిత విపుల విశ్వంభరా ప్రాంగణమున. తే. జాగృతిని గని విభ్రమ చతుర మదిర కన్నీరు నుండి తిమిరాంతరమ్మున నుండ రమ్ము శూన్యగేహాన వెదకినఁ జూడఁజాల వితరమెదియు - నేఁ గాక లభింప దెదియు. 112 113 114 115 116 117 118 737 తే. ఇట్టి శిథిలోచ్ఛ్వసనము కర్షింప నిన్ను వచ్చెదవు నీవు - తప్పదు - వత్తువీవు ఏడ్చి యేడ్చి తుదకు స్వీకరింతు విప్పు డిటుల సంవృద్ధిఁ గొన్న నా యెల్లవ్యథను. తే. ఇదియే సాంధ్య సంయోగ ప్రతీక్ష యెదియొ చెప్పిపోవుచున్నయది తోచినది - అంత యుషసి రక్తవర్ణ నిరాశ యొప్పిదముగ నంత మొనరించు చున్నది యఖిలకథను. తే. నాడు వికల వేదన పదునాల్గు భువన 119 120 ములలొ తిరిగి తా వచ్చె - ఆ ఇలలొ నెచట వెదకినను సుఖమది కనుపించలేదు చెలఁగు నెచ్చట విశ్రాంతి జీవితమున? తే. బహుళ నిశ్వాస నేత్రాశ్రు పాళిలోన నిదియె యలసి విశ్రాంతి నిద్రించుచుండె కోరి రోదించి నట్టి చక్షువులలోన నిద్రయై స్వప్న మియ్యెడ నెలవుకొనియె. తే. ఓ నిశీథిని! యెడలోన నున్న యిట్టి వ్యథలగు కృతజ్ఞములు నిద్ర నందనపుడు వీని యతిశయోన్మాదము నూని బుజ్జ గించు టౌను సుఖ కరమటంచుఁ దలఁతు. తే. తరుణిరో! నందన తమాల తలమునుండి స్పర్శరహితానుభూతివై సాగి నీవు పరమ తంద్రా సు విహ్వల పల్లవముల శ్యామలత గతి వ్యాపింపుమా జగాన. తే. స్వప్నములలోని మల్లికా ప్రసవ సమితి తారకాళి యై వ్యాప్తిని దనరుగాత నిండి స్నిగ్ధమసృణ సిత నీరజముల నీ త్రిదశలోక వాహిని నెగడుగాత! 738 121 122 123 124 125 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. నీ నభోంగణ మందు వినీల శయ్య యందు నుపవిష్టయై కరుణాబ్దమటుల విస్తృతిని వినీల నళిన విమల రసము తే. తే. కురియుమా తన్వి యెయ్యెడ కొసరి కొసరి. చిర విదగ్ధ దుఃఖితమైన స్థిరయిపుడును గోరుచున్నది యాలోకసార, మిప్పు డైన నున్మత్త యిది నిద్రనంద కణము 126 కణముగఁ గురియు మదియె చీఁకటిహిమమ్ము. 127 ఎనసి సంప్రీతిఁ గురియు విస్తృతి సమాధి పయినఁ గళ్యాణ మోహన వారిదమ్ము నెగడు నాసుఖ మలసి తా నిద్రవోవు అంత వదలిపోవును విపచ్చింత తివిరి. తే. చేతనాలహరి కనదు జృంభణమును జీవిత జలధి నిలచును స్థిరతవడసి పరగ సర్గప్రళయ సంధ్య ప్రభవమొందు నొదవు మరల వియోగ సంయోగములును. తే. రమ్య రజనీమతల్లి నేత్రములు జార్చుఁ బృథులముగ నిత్య మాలోక బిందువులను అంధతామిశ్ర కుహనాంగ నాళి వానిఁ ద్రావుచుండు నిశ్శబ్దతా తంద్రతలను. తే. నిన్ను సుఖ మవమానించుచున్న యట్లు వ్యంగ్యపూరిత హాసమ్ము నాచరింప నీవు మౌనముగ నెద రోదింప వలదు ఇదియు పృథుపరవశతయై యెసక మెసఁగు. తే. ఏల నీదు కన్నీటి దోయిలిని నేత్ర యుగళినె నినిచి యిటు త్రావుచుంటి వీవు? గగనతారకలు పతన కాలమందు వెలసి యుజ్ఞ్యల ఫణితి జీవించుచుండు. 128 129 130 131 132 కన్నీరు 739 తే. తే. తే. ఆ విమలహాసమును నిట్టి యశ్రువులను గనక సురుచిర గతులతోఁ గలియనిమ్ము అర్థి రానిమ్ము నవ్య వర్షాగమమును చెలఁగఁ గళికలన్నియు వికసింపనిమ్ము. అఖిల జగతీఘనోన్నిద్ర వ్యథలయందుఁ గణకణమునుండి యేరుకోఁ గడఁగుమీవు చారు సమ్మోహన జనరంజక కథాళిఁ జెప్పికొనుటకు మిగులుచుఁ జెలఁగనిమ్ము. అతి వినీల మంజుల త్రియామాంచలమున నలసి శీతకరుఁడు నిద్రనందు వేళఁ జరమగిరి లోయవంకకు నరిగి యంత దినకరుండును గనఁగ సదృశ్యుఁడయ్యె. తే. రమ్య జలద మనోజ్ఞ కారాగృహాన హ్రాదినీ లత తా బందియైన యపుడు స్వర్గ గంగా స్రవంతి నక్షత్రపాళి మునిఁగిపోవుచునుండె నపూర్వముగను. తే. అయ్యెడను దాల్చి మణిదీప మనెడి విశ్వ మందిరపు కిరణ మసృణమాల నాదు జ్వాల లౌ నీవు తన్విరో! పరగి యొంట రిగ జ్వలించుచు నున్నావు క్రీడ మెరసి. తే. లీల నుత్తాల జలనిధి వేల లందు నెత్తికొని శిరశ్శైల మునెసఁగి, అర్థి మెయిని నిస్తబ్ధ గగన భూమీతలాన బహుళ హృదయాగ్ని నొగిగ గుప్తమ్మొనర్చి. 133 134 135 136 137 138 తే. నియతి సంకేతమును బొంది నిండుతమము 740 లోన బ్రతుకును జిక్కుల నూనఁ జేసి చంచలోజ్జ్వల చికుర పాశమును విప్పి గహనగుహయందు నిద్రలో గడపువేళ. 139 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. రజ్య దుదయ మౌనట్టి జ్వాలాముఖమ్ము అట్టి జగతీవ్యథా మంజులాంగి - నాదు జ్వాల వగు నీవు - మరువక సతత మప్పు నొప్పి యొంటివై జ్వలియించుచుంటి వోసి! తే. ఉంటివి వ్యథిత విశ్వమహోజ్వల మృదు హోళికోత్సవ మట్లుగా నొప్పి నీవు అరుణరో! సదా యైదువయైన మాన వత్వ సీమంత సిందూర భాగ్య మీవు. తే. కలుష మీ సకలమును దగ్ధమ్మొనర్చి స్వాదు జీవిత మంజుల జలధియందు పావనోజ్జ్వల బాడబజ్వాల వోలె ననల తన్విగ జ్వలియింపు మవని నీవు. తే. విశద సౌరభమయి! ఓసి విజయమాల! అస్మదీయ మంజుజ్వాల!! అర్ధ కిరణ కేసరరజాన నింపుమా, కెరలి భవము బహుళ జగతీ ద్వయమహిత పరిణయమ్ము. అ తే. చెలియ! నీ వెల్గులోఁ దోచు చేతనత మేయ వేదనామయి యౌ సమిద్ధ జగము పొంది కరుణప్రకాశము పొల్పుమెరయ ననయమును నా సమీపము కరుగుదెంచు. తే. అందు నస్పష్టమైన ఛాయలు తమ పరి చయము నిచ్చుచునున్నవి స్వాదువులయి మొనసి చెల్లించి రోదన మూల్య మర్థి నిపుడు సర్వస్వమును గ్రహియించు చుండె !! తే. కన్నీరు ఇటుల జ్వలియించు మామక హృదయ శీత లోజ్జ్వల జ్వాల! ఈగతి నొలసి నిర్మ మత్వమున నున్న జగతికి మహిత! ఇంక వెలయు నీ శుభకాంతి లభించుగాక !! 140 141 142 143 144 145 146 741 తే. జీవితము దేని ముందట శింజనీ యు తమ్మొనర్చుచును పులకి తమ్మునొందు మృత్యు వు నటన మొగి నాచరించుచుండు నిర్జరత్వము నవ్వుచు నిలచియుండు. తే. అట్టి నా ప్రణయమ! మదీయ మధువనము నందు మేల్కొనుము విమల హసనములను చెలఁగి మరల ఈ నా శుష్క జీవితమునఁ గలుగుఁగాక మధురభావ కలవరమ్ము. తే. ఇంపుగఁ జిరు నవ్వులను నిద్రించుదాన! అధరముల నవ్వుచును నవ్వు చక్షియుగళి మించి యెవ్వేళఁగనఁగ దుఃఖించుదాన! కోరి నాదునూర్పులను మేల్కొనుము నీవు. తే. స్వప్నమయమైన యీ సృష్టి సత్య జీవి తమగు, నీవు మేల్కొన గదె సుమమనోజ్ఞ మంగళ కిరణ రంజిత! మామక మధు రోజ్జ్వల తమమ! జాగృతి నొందు మీవు! తే. అభిలషణ మానసమ్మున నబ్జనేత్ర తే. తే. ములను తెరువుమ! మధుపకులమ్ముల రుతి వలను దోఁచు మధురవమ! కలరవాల 147 148 149 150 మరల నొక కొంత పలుకఁగా మనుసుపడుము. 151 ఆ యభిలషణ శూన్య నేత్రాంచలమ్ము వ్యాప్తినొందుచునున్న దత్యంతముగను ఇట, మరల, క్రింద చాంపేయ సృష్టివోలె చంచల కరుణలోన వసించుగాక ! ఓ మధుర సంస్కృతీపుల కోర్గమమ్మ! మేల్కొనుము, నీదు యౌవనామృత మృదుసుమ కాననాంతర వీథులలోన మరల నమలిన మకరం దోద్గమ మగునుగాక !! 152 153 742 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. లలి జగము నభరిక్త పాత్రను గ్రహించి మరల నరుణిమ నొందఁగా మనసువడుచు నర్థినీకడ కేతెంచి అమృత! నిన్ను కొన్ని మధుబిందువుల్ తమిఁగోరుగాక ! తే. గాఢతమ తమః కాంతి సంఘర్షణముల నా నవజ్యోతి విజయిని యగును -ఎలమి నీ మనజగ మెల్లయెడ హసించు చెలిమి స్నిగ్ధ మౌక్తిక వితతి వర్షించునంత. తే. అమలి నోషస్వినిని రమ్య ప్రాకృతీ శు భారుణ ముకురాంతరమున నర్థి నాదు నయన తారకలైన నీ నవ్యముగ్ధ సుందర ప్రతిబింబమ్ముఁ జూచుకొందు. తే. ఆకృతిని లీనమై కొన్ని యమలరేఖ 154 155 156 లొదవుఁ గావుత! అయ్యెడ నొక్క దర్శ నమ్ము కలుగు! అద్ది విశద నవ్యతలతో నెంత మధుమయ రచనయై యింపు లొలయు? 157 తే. తమిని తన్వీ నిసర్గ సౌందర్య మెందు గర్వరేఖ లొలయఁ దిరుగాడుచుండు ఎందు శిశుహృదయ మనోజ్ఞ మందిరమున చెలఁగు నిర్మలతయె తోచి చిందులాడు. తే. అట్టి ముఖము నయననిధి యగునుగాక! తే. అగునుగా కవకుంఠన మసిత నభము నా శిథిల హృదయము గగనముగఁదానె విస్తరించు గావుత ఘన విభవమునను. నాదు మానసార్చన భావనా ప్రతీక యరయ నెవ్వేళ సవిచల మగును గాక! అతులి తామ్లాన తపనీయ శతదళమున 158 159 నెలమి యౌవన మధువు నందించుగాక !! 160 కన్నీరు 743 తే. జీవితసకల కల్పనా స్నిగ్ధతలను నేత్రతారా కిరణ రుచి నిచయములను, బహుతరాలోక మంజు ప్రవాహమునకు నెలమి ప్రతినిధిగ నభిషేకించుగాక! తే. అఖిల మీ వేదన మధుర మౌను గాక! నా దయారహితమగు తన్మయత నేఁడు గాటముగ నెదతోడఁ దాఁ గలయుగాక! నేనును సహృదయతను పొందెదను గాక!! 161 162 తే. నా అనామసంగిని!.. కలకఠోర కోమలత! ఇరువుర మెదఁగోరి జీవి తాధ్వమున పయనించు చనంతకాల హృదయ సఖులమై యుండిపోవుదము తెలియ! 163 తే. ఎన్ని యా తారకలరాత్రు - లెన్నిదినము లెన్ని గడియలు - మదినెపుడెన్నరాని యట్టి మోహరహిత సమయ వలయమ్ము లెన్ని విస్తృతిని గడచి యేగినవియె! తే. మానసోద్వేల్లిత తరల మహిత వీచి కాళి తాను తిరిగిరాదు - జౌను ఆయ | సంతకోణమును దరిసి స్నానమొనర నది నిజమ్ముగఁ జేయించి యరుగుదెంచు. తే. నేత్రముల కోణములు దేనిని దమిఁదాకి నింపుకొని తెచ్చు నిర్మల నీర చయము నట్టి చలువకై దప్పి గొన్నట్టి దీన భావ కరుణార్ధ రసపత్ర పాత్రలగును. 164 165 166 తే. పొలసి యెయ్యవి నిద్రించుఁ బులకి తమ్ము 744 లైన యట్టి సుఖచ్ఛాయలందు మసృణ ములయి ఆ హృదయోచ్ఛ్వాసములు కడంగి మరల మేల్కొను నామధు మాయ యందు. 167 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. తడిసి కన్నీటిజడి వానఁదటము లప్పు డభయములు, హరితమ్ములై యలరుగాక! ఆ శరత్ప్రసన్న తటిని నమల జీవ తే. నద్రవము నిండియుండుత నవనవముగ. ఆ సరిత్కూలతటమున నర్థి నెవ్వ రెచట నిల్చిన సముఖాన నిద్ద చంద్ర తరళ కాంతిచ్ఛటా మహిత పథమె కనఁ గలరు -అన్య మెయ్యదియును గానఁబడదు. తే. అటులనే యిట్టి జాగృతి యమరి తనదు నుజ్జ్వలతలఁ బ్రసాదించి యుచితరీతి నిట్టి లఘు బిందువులతోడ నెల్ల పంకి లమును హరియించి తానె నిర్మలత నొసఁగు. తే. శుభ్ర మీ లఘు మౌక్తిక శుక్తియందు కడలి క్రీడించు తెఱఁగునఁ గానఁబడును తోచు నీ కరుణార్ధ బిందువులలోన నమలినానంద మదె చిందులాడు నటుల. తే. వెలయుచెపుడు మదీయ జీవితపయోధి ఆంధ్యమునను తరంగిత మగునుగాక! అఖిలమున త్వదీయమెయైన యమృతకాంతి పరిగి మెరయుత నింగి దీపమ్ము పగిది. తే. మానస వ్యథలెన్ని యీ మహిని గలవొ అన్నియును గప్పికొని మోము నున్నవి పడి ప్రసవముల పోల్కి నయ్యవి లలిత ఖేల నములొనర్చుచు చిలిపిగ నవ్వుగాక ! తే. లీలలొలయు నీ కోమలాలింగనమ్ము అమరవల్లరి - అది వ్యాప్తినందుగాక! ప్రౌఢ మై వెలయు ధమని బంధనమున నుండ కుండుత జీవిత మొంటి యగుచు. కన్నీరు 168 169 170 171 172 173 174 745 తే. అఖిల సంస్కృతి దుఃఖమ్ములందు జన్మ జన్మలను జీవితము నాకు సహచరియగు అర్థి పావనప్రత్యూష మగునుగాక ! అలస సుఖమున మేల్కొల్పు లగుత నీకు !! తే. జగదపావన కలుషము సర్వ మింక నీదు వైదగ్ధ్యమును బొంది నెగడుగాత! ఇలను మరల నిర్మలత శోభిల్లుగాత !! ఇట్టి పాపము పుణ్యమై యెసఁగుఁగాత!! తే. స్వప్నముల సుఖచ్ఛాయలో సంస్కృతి కడు గాఢ తంద్రాలసమ్మయి కడఁగు వేళ నిటుల జాగృతవై వచ్చి తెవరు నీవు? మించి నామది నున్న విస్మృతివె నీవు? తే. ఔను నీవు దానివె-మామ కాత్త దుఃఖ " పూరిత విదగ్ధ హృదయాన పుట్టి యెపుడు నెగడు చిరజీవిత సుసంగినివె యగుదువు శుభ్రవేదనా! ఓసి అశ్రుమయ వర్ణ!! తే. స్వైర కుట్మల కిసలయచ్ఛలములోన నేను మరచిపోయినపుడు నిన్ను, నీవు విమల కుహుకుహూ నిస్వన వేదనముగ వచ్చితివి రంగభూమికి వనిత ! నీవు. తే. తెలియఁగాఁ జెప్పు మెదను సందేహపడకు శూన్య గగనాన నీవేమి చూచినావు ? నెలఁత! రజనీ మనోహర నిర్జనమున పథము నెంత నీవు నడచివచ్చినావు. తే. స్వప్నకల్పన చణఋక్ష సముదయముల 746 అభినయపు మాయ సాగెడు నపుడు సౌఖ్య హృదయకోణమందున తిమిరేద్ద నీల కాంతి పర్వి యంతట దానిఁ గప్పుచుండె. 175 176 177 178 179 180 181 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. తన్వి! మానసకుముద రోదనమును గని తే. యపుడు శశికరమ్ములు నవ్వు చతిశయమున మంజు మోహన మకరంద మౌక్తికముల సొగసులను గ్రుచ్చు టీ వాగి చూచినావు. నామ నమ్మైన జలనిధి వలచి శశిని తాకవలె నను నాశతోఁ దనరుచుంట నంత హాహారవమ్ముల నాచరించు చెగిరి యెగిరిపడుటను దర్శించినావు. తే.. అటుల నోటిని కుట్టేసి యాత్మశావ 182 183 తావ కీలల బహుయుగతతుల నుండి యెరిగి చిరమౌనమున సహియించుచున్న శుభ్రశైలమాలల నీవు చూచినావు. తే. శ్యామలమ్మైన యొక వనస్పతి యెదైన వేని పయి మొల్వ జాలదో, వేని కెప్పు డబ్బక జనపద స్పర్శ యమిత శప్త 184 ములనుచు జనులు చెప్పగ మెలగుఁచుండు. 185 తే. ఆ కపటకథను వినుచు నతిశయముగ నున్ముఖములైన కళికల నోపి చూచి నావు, ఇచ్చవచ్చినటు సంచరణసేసి యెగిరిపోవు తుమ్మెదల నీక్షించినావు. తే. మరల నేత్రజలము లెండి చిరము వంచి తమ్ములై, ఆకలిని గొని దారుణమగు నా నిరాశాభరిత నయనాళి గొన్న ఘనతర ప్రళయదశను గాంచినావు. తే. ఈవు చూచితివి కడు శుష్కించి యున్న యా నదీశయ్యను, వసుంధరార్ధ కరుణ కథను, కూలములను తాను ఘనతరముగ లీనమౌటను రాజ్ఞి! దర్శించినావు. కన్నీరు 186 187 188 747 తే. శూన్యమైన కుటీరంపు శుభ్రకోణ తే. మందు నిశియెల్ల వలచి స్నేహభరితముగ ను లఘుదీపిక జ్వలియించు టలఘుగతిని నెగసి మరల యారుటను వీక్షించినావు. ఈ సకలముల రసము గ్రహించి నీవు స్నిగ్ద సుఖముచే మివుల శుష్కించి యున్న జీవితమున విశ్వసదన సీమ నుషసి హిమకణమటు నశ్రువుల వర్షింపు మువిద. 189 190 748
వావిలాల సోమయాజులు సాహిత్యం-1