వావిలాల సోమయాజులు సాహిత్యం-1/ఆంధ్ర కామాయని
నివేదన
మా తండ్రిగారు శ్రీ వావిలాల సోమయాజులుగారు సాహిత్య రంగంలో ఎంతటి మహోన్నతులో స్వయంగా గ్రహించగలిగేంతటి సంస్కృతాంధ్ర సాహిత్య పరిచయం గానీ ప్రవేశంగానీ మాకు లేదు.
వారు బహుముఖీన ప్రజ్ఞాధురీణులని, ఆంధ్రసాహిత్యాకాశంలో వారొక ధ్రువతార అని నాన్నగారిని చూడటానికి మా యింటికి వస్తూపోతూ ఉండే కవి, పండితులనేకులు అంటూ ఉంటే వింటూండేవారము.
నాన్నగారు ఈ 'ఆంధ్ర కామాయనీ' కావ్యాన్ని తమ సాహిత్య కృషికి తలమానికంగా భావించేవారు. దీనిని యథామాతృకంగానే కాకుండా, మాతృకకు వన్నెపెట్టే విధంగా, హిందీ రాని తెలుగువారికిది స్వతంత్రమైన ప్రౌఢసుందర కావ్యమనిపించే విధంగా రచించారని మా తండ్రిగారు చెబుతుండేవారు.
ఈ ఆంధ్ర కామాయనీ కావ్యాన్ని నాన్నగారు సుమారు పాతిక సంవత్సరాలకు పూర్వమే రచించారు. అప్పట్లో ఇది 'స్రవంతి' అనే మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడింది. ఏ కారణంచేతనో మా తండ్రిగారు దీనిని పుస్తకరూపంలో వెలువరించకుండా చాలా కాలం ఊరుకున్నారు.
1992 జనవరిలో నాన్నగారు దివంగతులైనారు. అంతకు కొంత కాలం పూర్వం నుంచీ వారు అస్వస్థులుగా ఉన్నారు. అప్పుడు ఈ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించాలని వారు వేగిరపడ్డారు. కాని ముద్రణ పూర్తి అయ్యీ కాకుండానే వారు కీర్తిశేషులు కావటం మా దురదృష్టం.
వారు ఈ కావ్యాన్ని విద్యన్మూర్ధన్యులు, బహుభాషా కోవిదులు, మృదుమధురకవితా ప్రియంభావుకులు, రసజ్ఞ శేఖరులు, సహృదయ సమ్రాట్టులు, మన ప్రియతమ భారత ప్రధాని గౌరవనీయులైన శ్రీ పి.వి. నరసింహారావుగారికి అంకితం చెయ్యాలని కాంక్షించేవారు.
వారి అభిమతాన్ని మన్నించి ఈ గ్రంథాన్ని తమకు అంకితం చెయ్యటానికి అనుమతించిన గౌరవనీయులైన శ్రీ పి.వి. నరసింహారావు గారికి శతసహస్ర కృతజ్ఞతాంజలులు. నాన్నగారికి ఈ గ్రంథ రచనాకాలంలో చేదోడువాదోడుగా ఉన్న సుప్రసిద్ధ హిందీ విద్వాంసులు శ్రీ చావలి కోటీశ్వరరావుగారికి మా కృతజ్ఞతలు. వారి తోడ్పాటును నాన్నగారిలా ప్రశంసించారు.
తొలి నారాయణభట్టు నన్నయకు సద్యుక్తిన్ నిగూఢార్థముల్ చెలిమిన్ దెల్పిన రీతి దెల్పి, యట నాచే నాంధ్ర కామాయనీ కలహంసన్ సృజియింపఁజేసిన లసద్గణ్యుండు, పుణ్యుండు చా వలి కోటీశ్వరరాయ విజ్ఞుని మహాప్రౌఢిన్ ప్రశంసించెదన్.
ఈ కావ్యానికి సుప్రసిద్ధ కవివర్యులు డాక్టర్ శ్రీ ఆచార్య తిరుమల గారు 'ఆంతర్యం' అందించారు.
శ్రీ ఆచార్య భీమసేన్ 'నిర్మల్ గారు, (ఎమిరిటన్ ప్రొఫెసర్, హిందీ శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు) 'ప్రశంస' సంతరించారు. ఈ ఇరువురు పెద్దలకు మా నమస్కృతులు.
పాతిక సంవత్సరాల నుండి 'ఆంధ్రకామాయని' వ్రాతప్రతిని నాన్నగారితో పాటు పఠించి, అక్కడక్కడ కొన్ని మార్పులు, చేర్పులు సూచించి అక్షరసాలిత్యాలను సవరించి నాన్నగారికి మిక్కిలి తోడ్పడిన సుప్రసిద్ధ కవివర్యులు శ్రీ అన్నపర్తి సీతారామాంజనేయులు గారికి మా నమోవాకాలు.
సుప్రసిద్ధ చిత్రకారులు, నాన్నగారికి శిష్యులు శ్రీ మారేమండ శ్రీనివాసరావు గారు అడిగినదే తడవుగా ఈ గ్రంథాన్ని అందమైన ముఖచిత్రంతో అలంకరించారు. వారికి మా అభినందనలు.
ఈ గ్రంథాన్ని చక్కగా ముద్రించి ఇచ్చిన 'వెల్కమ్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు' వారికి మా సాధువాదములు.
నాన్నగారి ఈ కృషిలో ఇంకా ఎందరో విద్వద్వరేణ్యులు కవి తల్లజులు సహకరించి ఉండవచ్చును. వారందరినీ గూర్చి తెలియని మా అజ్ఞానాన్ని మన్నించ ప్రార్ధన. ఈ కృషిలో నాన్నగారికి సహకరించిన ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు.
ఇట్లు
వావిలాల బృహస్పతి
వావిలాల ఉమాపతి
వావిలాల గౌరీపతి
ఆంతర్యం
మహా విద్వత్కవీంద్రులైన బ్రహ్మశ్రీ వావిలాల సోమయాజులు గారు రచించిన ఈ “కామాయని” ఆంధ్రానువాద కావ్యం - ఒక వైదిక పారిజాతం, ఒక పౌరాణిక గాథారత్నం. ఒక ఐతిహాసిక భ్రమర విన్యాసం, ఒక కాల్పనిక ఊహా సౌందర్య శిల్పం!
మహాకవి జయశంకర్ ప్రసాద్ ప్రణీతమైన హిందీ “కామాయని” - గర్భిత మహాకావ్యం. ధర్మ సమ్మితమైన కామాన్ని రసవంతంగా వర్ణించే కావ్య కళా ఖండిక. అది తుల్య స్త్రీ, పురుషాధికార సంపన్నులైన శ్రద్ధా మనువుల ఇద్ద చరిత్ర. ఇందులోని దైవీయ, సౌర, భౌమ, శక్తుల అంతర్యామ సంగమం - ఒక మహాశ్చర్యకర విశేషం!
ఇటువంటి మహత్తర కావ్యానువాదానికి కేవలం శబ్దగత పరిజ్ఞానం చాలదు. భాషాగత విశేషపరిచయం చాలదు. అంతర్గత భావనా వైశిష్ట్య మర్మజ్ఞత కావాలి గాఢమైన శ్రద్ధ కావాలి, ప్రజ్ఞాపాటవం కావాలి, నాన్యతో దర్శనీయమైన సామర్థ్యం కావాలి తాత్వికమైన రహస్యాన్వేషణ కావాలి. ఇన్ని శక్తుల ఏకీకరణ రూపం శ్రీ సోమయాజులు గారు. సోమయాజులు గారివంటి వారు తప్ప ఇతరులిటువంటి అనువాదాలు చేయలేరు.
ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో భావకవిత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే నవ్యసాహిత్యం నడుస్తున్న రోజుల్లో భావకవిత్వం - విపులంగా గానీ, సుదీర్ఘంగా గానీ, కథా కథనాత్మకంగా గానీ, ప్రాబంధికంగా గానీ లేదు. ముక్తక ప్రాయంగా ఖండ కావ్య సదృశంగా ఉండేది. అది నిజంగా ఒక లోపం. ఆలోపం శ్రీ వావిలాలవారిని చాలా కలవరపెట్టింది, స్పందింపజేసింది. ఆ స్పందన వారి దృష్టిని జయశంకర్ ప్రసాద్ “కామాయని” మీదికి ప్రసరింపజేసింది. భావుకతా బహురస పరిశోభితం, నవ్యాతి నవ్యమైన ఆ కావ్యం వావిలాల వారి హృదయాన్ని ఆకర్షించింది. ఆయన మహా కవిత్వానువాద దీక్షావిధి ఒక తపస్వి అయ్యారు. ఆ తపఃఫలమే ఈ ఆంధ్ర “కామాయని”. నవ్యతా ప్రియులైన తెలుగువారి కిదొక అక్షర వరం! ఒక అవ్యయ స్వరం. ఈ ఆంధ్రకామాయని రచనకు వావిలాల వారికి సుమారు సంవత్సరన్నర పట్టింది. తర్వాత 1964-67 లలో ఇది "స్రవంతి" పత్రికలో ధారావాహికంగా ప్రచురింప బడింది. సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ యిలా యీ పుస్తక రూపంలో..! ఇది వావిలాల వారి ఆత్మాభిమానానికి, రాజసప్రవృత్తికి తార్కాణం!
ఈ కావ్యంలో చింత, ఆశ, శ్రద్ధ, కామము, వాసన, లజ్జ, కర్మ, ఈర్ష్య, ఇడ, స్వప్నము, సంఘర్షణము, నిర్వేదము, దర్శనము, రహస్యము, ఆనందము, అనే 15 శీర్షికలతో విభాగా లున్నాయి. 'ఇడ' అన్వేషణారూపంలో ఉంది. కాస్తంత లోతుగా ఆలోచిస్తే ఈ పేర్లన్నీ మానసిక చిత్త వృత్తులకు పెట్టినవే అని తెలియకపోదు. మనసు ఒక అవ్యక్త మధుర జీవన గానం! అందుకే ఈ కావ్యాన్ని వావిలాల వారు “తేటగీతి”లో నడిపారు. మధ్యలో 'శ్రద్ధ' ఆలపించిన “రగడ" కూడా మధుర గేయమే. - భారతీయ వైదిక వాఙ్మయంలో 1. స్వాయంభువుడు, 2. స్వారోచిషుడు 3. ఉత్తముడు, 4. తామసుడు 5. రైవతుడు 6. చాక్షుషుడు 7. వైవస్వతుడు 8. సూర్య సావర్ణి 9. దక్ష సావర్ణి 10. బ్రహ్మ సావర్ణి 11. ధర్మ సావర్ణి 12. రుద్ర సావర్ణి 13. దేవ సావర్ణి 14. ఇంద్ర సావర్ణి అని 14 మంది మనువులున్నారు.
మన స్థానీయమైన ఈ చతుర్దశ మనుచరిత్రల్ని ఆధి భౌతిక, ఆధి దైవిక ఆధ్యాత్మిక సంస్థాగతం గానూ, జీవేశ్వర వ్యూహాత్మకంగానూ తెలుసుకోవలసి ఉంది. ఆ “మను” వంశ “ప్రవర” ఒకానొక తాత్విక భావ “వరూధిని”!
అల్లసాని పెద్దన స్వారోచిష మనుసంభవ విశేషాన్ని ప్రబంధీకరించాడు. శ్రీ వావిలాల వారు ఈ కావ్యం ద్వారా "వైవస్వత" మను దర్శనం చేయించారు. ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరం కదా!
గీతాచార్యుడు జ్ఞానయోగంలో -
"ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయమ్” అని ఎవరిని కాలాత్మకంగా గుర్తుచేసుకున్నాడో-ఆ వివస్వతుని కుమారుడే ఈ కావ్య కథానాయకుడు వైవస్వతుడు. ఇతడు “శ్రద్ధా” న్వితుడు. ఇతనిని గూర్చి ప్రత్యేక 'శ్రద్ధ' తో అధ్యయనం చేస్తేనే గానీ తర్వాత వచ్చే సూర్య, దక్ష, బ్రహ్మ, ధర్మ, రుద్ర, దేవ, ఇంద్ర బలాలు అర్థం కావు. అవన్నీ అంతరంగ తరంగాలు! ఈ మనువుల అంతరాలే మన్వంతరాలు! ఈవిషయాల్ని పురాణాలు విభిన్న కోణాల నుండి నిరూపించాయి. ఆ అధ్యయనం ధర్మ కామన! ఇది కామాయనీ మహదక్షర ఖేలన! దీక్షతో వావిలాల వారు సాధించిన ఈ మహా కావ్యానువాదంతో తెలుగు సాహిత్యానికి కథాకథన విశిష్టతా వైచిత్రాల్లోనూ, భావనా భంగిమలోనూ, శైలీ వాల్లభ్య సంచయనాల్లోనూ, శబ్దఘటనా సామర్థ్యం లోనూ ఎన్నెన్నో నవ్యతలు లభ్యమయ్యాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అంతే కాదు భావకవితా వైశిష్ట్యం, భారతీయ రూపగుణ నిరూపణం ఇందులో చోటుచేసుకొని వుండటం ముదావహంగా భావిస్తున్నాను.
రమ్యపాపం, అశ్రుమయ హిమానీ హాలహలజలం, కరుణా మనోజ్ఞ మౌనం, చంద్రికా పరీరంభ నీలమేఘం, పుష్పక్రీడ, అంత్యకిరణం, దీపికాజ్వాల యుమి సెడు దీప్తులు, ప్రణయ శిల, విలాసధార, లోకాగ్ని - మొదలైన ప్రయోగాలు గిలిగింతలు పెడుతున్నాయి.
“కామము”, “వాసన” ఖండికల్లో భావకవిత్వం పరాకాష్ఠ నందుకొంది. మిగిలిన ఖండికల్లో వెన్నెల్లా పరచుకొని ఉంది. ప్రేమ సంప్రాప్తికి మనోభీష్టానికి ఘర్షణ నిరూపించబడింది.
తే. అచలము న నంత మగు వీచికాళి మీది
నాసనమువేసి కూర్చుంటి వయ్య స్వామి!
శ్రమ కణమ్ముల పోల్కి తారకల నిటుల
నిదె యొడలి నుండి జార్చె దీ వెవర వయ్య!!
మొదలైన పద్యాల్లో ఎంత ఆహ్లాదకరమైన కవిత్వం ఉందో
తే. లీలఁ బ్రళయమునను మిగిలితిమి మనము
పొందదెఁ బునస్సమాగ మానంద మిపుడు
శూన్య జగతీ ఘనోత్సంగ శుభ్ర తలిని
నొలయు కలయికకు మిగిలియుంటి మిచట !!
మొదలైన పద్యాల్లో అంత అగాధ భావ తీవ్రత ఉంది. ఈ కావ్యంలో లౌకిక పారలౌకిక కామ స్వరూప చిత్రణ, దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా జరిగింది. “రహస్య” మనే ఖండికలో మాయను గూర్చి అజ్ఞానాన్ని గూర్చి జ్ఞాన కర్మల్ని గూర్చి బుద్ధియోగాన్ని గూర్చి చేసిన ప్రస్తావన కావ్యాన్ని శిఖర స్థాయిని నిల్పుతున్నాయి. మనసుని గూర్చి ఎన్నెన్నో ధ్వనిగర్భిత మైన శబ్దాలు ఈ పద్యాల్లో ఉన్నాయి. కామాయని విశ్వమంగళ కామన-విమల మానస తట వీథి జ్యోతిష్మతి గతిగ సంఫుల్ల లతిక గతిగ నిలిచిన ఆమె, నిత్య సుందర, సతత సత్య భూరి చైతన్య శుభ మహాపుణ్య వపువు!
తే. భేద భావాళి సర్వమ్ము విస్మరించి
దృశ్యముగఁ జేసి సుఖ దుఃఖ హేల నెల్ల
"నేనె యిది" యను మీ వోయి మానవుండ!
విశ్వమే నీకు నీడ యై వెలయు నయ్య!!
అన్నది కామాయనీ కవితా హృదయ సందేశం! ఈ సందేశం వినినప్పుడు నేత్రాల్లో ప్రేమజ్యోతి ప్రతిఫలించకుండా ఎలా వుంటుంది ?
"దేవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
మామేవయే ప్రపద్యన్తో మాయామేతాం తరన్తితే”
దురత్యయమైన ఈ మాయను తరించి ఆనందాన్ని పొందటానికే మనసుని అధ్యయనం చేయటం, ఎందుకంటే, “మన యేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః" కదా!
“చంద్రమా మనసో జాత" చంద్రుని నుండి మనసు పుడుతూ వుంది. ఎలా? వైజ్ఞానికంగా చంద్రుడు ప్రజ్ఞానాత్మ. రేతః, యశః, శ్రద్ధా - అనే మూడు చంద్రునిలోని మనోజ్ఞతలు. అందుకే మనువు - శ్రద్ధల బంధంలో వైదిక రహస్యం ఉంది.
చాంద్రరసాన్ని 'శ్రద్ధ' అంటారు. ఇది దివ్యమైన ఆదిత్యాగ్నిలో హోమమై 'సోమం' గా మారుతుంది. ఈ సోమం, పర్జన్యాగ్నిలో హోమమై వర్ష రూపంలో పార్థివాగ్నిలో ఆహుతి కాగా ఓషధులు పుడుతున్నాయి. ఇవి ఆధ్యాత్మిక వైశ్వానరాగ్నిలో ఆహుతాలై రసాసృగాదిరూపాలు పొంది చివరికి “శుక్ర” రూపం పొందుతుంది. ఈ అన్న రూపశుక్రంలో చాంద్ర శ్రద్ధామయ సోమం, అంతరిక్ష వాయువు పార్థివ మృద్భాగం ఉంటాయి. విశకలన ప్రక్రియ చేత శుక్రంలో పార్థివ ధాతువు వెళ్లిపోగా, మిగిలిన వాటిని “ఓజస్సు” అంటారు. వాయు తత్త్వం పోగా మిగిలే సుసూక్ష్మ శ్రద్ధామయ సోమరసమే “మనస్సు”! "అన్నమయం హి సౌమ్య మనః" - విశ్లేషిస్తేనే గానీ మనుచరిత్రలు గానీ, కామాయని కావ్యాలు గానీ అర్థం కావు. తాత్త్వికాభి నివేశం లేని వారు మన పురాణ వాఙ్మయం మీదికి పోవటం అనవసరం. వేదోపబృంహణాలైన యివన్నీ ఆత్మవిద్యలు. ' ఆత్మ' అన్నదే తెలియక పోతే తదితరా లెలా తెలుస్తాయి?
ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః
మనసశ్చ పరాబుద్ధిః బుద్ధిరాత్మా మహాన్ పరః
మహతః పర మవ్యక్తం అవ్యక్తా త్పురుషః పరః
పురుషాన్నపరం కించిత్ సాకాష్ఠా సా పరాగతిః !!
వంటి కఠోక్తులెలా దృశ్యమాన మవుతాయి?
"అమల చిత్ర జీవిత వికాసాత్త మధుర
వర మహానంద శక్తి ప్రవాహ మిద్ది”
అన్న వావిలాల వారి ఆంతర్యం మాత్రం ఎలా పట్టుబడుతుంది ?
శ్రద్ధా సూత్రం తోనే జ్ఞాన నేత్రం విచ్చుకొనేది. “యదేవ శ్రద్ధయా కరోతి తదేవ వీర్య వత్తరం భవతి" మనోధర్మమే వీర్యం. ఈ మనోధర్మ సాధనే ఈ కామాయనీ కావ్య పరమార్థం!
ఈ కావ్యం - 'చింత' తో మొదలై 'ఆనందం' తో ముగియటంలోని అంతర్యం కూడా మానవతా ధర్మ నిరూపణమే!
అందుకే యిది మహాకావ్య మయ్యింది!
వావిలాల వారు 'సోమ' యాజులయ్యారు!
నమస్కారములతో,
విద్వజ్జన విధేయుడు,
ఆచార్య తిరుమల
'ప్రశంస '
హిందీ సాహిత్యచరిత్రలో భక్తికాలాన్ని (14 నుండి 16 శతాబ్దం) స్వర్ణయుగం అంటారు. అదే విధంగా ఆధునిక హిందీ సాహిత్యంలో ఛాయావాద కావ్యయుగం (1913 నుండి 1936 వరకు) స్వర్ణయుగం. ఛాయావాద మూల స్తంభాలయి, బృహత్రయి అని పేరొందిన ప్రసాద్, పంత్, నిరాలాలు, లఘుత్రయి లేక వర్మాత్రయి అని పిలువబడ్డ మహాదేవి వర్మ, రామకుమార్ వర్మ, భగవతీ ప్రసాద్ వర్మలు - ఈ ఆరుగురేగాక ఎంతో మంది ప్రఖ్యాత కవులు, ప్రేమచంద్ లాంటి విశ్వవిఖ్యాత కథా రచయితలు, ఆచార్య రామచంద్ర శుక్ల, శ్యామ సుందర దాసువంటి విమర్శకోత్తములు, తమ రచనా వైశిష్ట్యంతో హిందీ భారతిని సమ్యక్ రీతిలో సమర్పించిన ఛాయావాదయుగాన్ని స్వర్ణయుగం అనడంలో అతిశయోక్తి ఏ మాత్రం కాదు.
ఛాయావాద కావ్యాన్ని మన తెలుగు సాహిత్యంలోని భావ కవిత్వంతో పోల్చవచ్చు. కావ్య లక్షణాలూ, ప్రవృత్తులూ అనే. సౌందర్యోపాసన, ప్రకృతి మానవీకరణం, ప్రకృతి నిత్య సాహచర్యంపట్ల ఆసక్తి, వైయక్తిక అత్మాభివ్యక్తి మొదలయినవి ఛాయావాద కావ్యంలోను, భావ కవిత్వంలోను సమతూకంలో కనిపిస్తాయి. అందుచేతనే కొంతమంది పరిశోధకులు ఈ రెండు కవితాధోరణులను సరిపోలుస్తూ, పరిశోధనా వ్యాసాలు వ్రాసారు. ఇటువంటి ఛాయావాద కావ్యయుగంలో 'కామాయనీ' మహాకావ్యం ఉత్తుంగ హిమశృంగం లాంటిది. ఛాయావాద ప్రవృత్తులకు ఆలంబనమయిన మహాకావ్యం ‘కామాయనీ' అయితే 'ఆంసూ' ఛాయావాద కవితా ప్రవృత్తులకు అద్దం పట్టే ఖండకావ్యం. 'కామాయనీ' ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఒక విమర్శకుడు సమస్త హిందీ సాహిత్యం కాలగర్భంలో కలిసిపోయినా, 'కామాయనీ' లోని 'లజ్జా' సర్గంలోని ఒక్కపుట మిగిలి ఉంటే భావితరంవారు హిందీ సాహిత్యం సుసంపన్న మయినదేనని భావిస్తారని అన్నాడు. అట్టి మహత్కావ్యం 'కామాయనీ', ఖండకావ్యం 'ఆంసూ' రెండింటిని తెలుగు కావ్య రసజ్ఞులకు అందించడంలో బ్రహ్మశ్రీ నావిలాల సోమయాజులు గారు కృత కృత్యులయ్యారు. ఇంకో విశేషమేమిటంటే జయశంకర ప్రసాదు రచనల్లో 'అంసూ' ప్రారంభ దశకు చెందినది.'కామాయనీ' ప్రౌఢదశకు చెందినది. సోమయాజులుగారు కూడా తమ చిరుత ప్రాయంలోనే 'ఆంసూ'ను 'కన్నీరు' అనే పేరిట తెలుగులోనికి అనువదించి, ప్రౌఢవయః పరిపాకదశలో 'కామాయనీ' అనువాదం చేసారు. మూలంలోని కావ్యసౌందర్యాన్ని యథాతథంగా తెలుగు పాఠకులకందించిన శ్రీ సోమయాజులు గారు ధన్యజీవులు.
ఛాయావాద యుగంలో లాక్షణిక పదప్రయోగాలతో కూడి, విశిష్ట ప్రత్యభిజ్ఞానం, సమరసతావాదాన్ని ప్రపంచించే ఈ మహత్కావ్యాన్ని అనువదించడానికి చాలా మంది ప్రయత్నాలు చేసారు. దాదాపు 20-25 సంవత్సరాల క్రితమే పూజ్యులు శ్రీ సోమయాజులు గారు ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. కొన్ని పద్యాలను కీ॥శే॥ కవి సామ్రాట్టులయిన నోరి నరసింహశాస్త్రిగారి సన్నిధానంలో నేను వినడం తటస్థించింది. తరువాత ఆ పద్యాలు (మరి కొన్ని కూడా) 'స్రవంతి'లో రెండు మూడు సంచికల్లో ప్రచురితమయ్యాయి. కారణాంతరాలవల్ల ఈ సత్ప్రయత్నానికి విఘ్నాలు ఏర్పడడంతో ప్రచురణ కార్యక్రమం ఆగిపోయింది.
ఆరోజుల్లోనే మాన్యులు శ్రీ అయాచితుల హనుమచ్ఛాస్త్రిగారు (ఆ రోజుల్లో వారు అలీగడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో హిందీ ఉపన్యాసకులుగా ఉండేవారు) కూడా ఈ ప్రయత్నం చేసారు. వారు వర్ణవృత్తాలలో, ఛందోబద్ధంగా చేసిన అనువాదంలో కొంత భాగం 'స్రవంతి'లో ప్రచురింపబడింది. సమ్మాన్యులు డా॥ ఇలపావులూరి పాండురంగారావుగారు 1973లో ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత కీ॥శే॥ శ్రీ యం.ఎన్. రావు గారి ప్రోద్బలంతో ఈ కావ్యాన్ని మాత్రా ఛందస్సులో ఆంధ్రీకరించారు. అది 1974 జులై నెలలో అచ్చయింది.
ఈ నాటికి శ్రీ వావిలాల సోమయాజులుగారి కృషి ఫలించి 'కామాయనీ'కి వారు చేసిన ఛందోబద్ధమయిన అనువాదం పుస్తక రూపంలో అచ్చవడం ఎంతో ముదావహం.
శ్రీ సోమయాజులుగారు తెలుగులో గద్యపద్య రచన చేసి, విశిష్టమయిన గౌరవ ప్రతిపత్తులను సముపార్జించుకున్న వారు. మౌలికమయిన రచనలు వెలయించిన సోమయాజులు గారు అనువాదరంగంలో కూడా తమ రచనా పాటవంతో, ప్రతిభా వైదుష్యాలతో పాఠకుల హృదయాలను ఆకట్టుకున్నారు. సంస్కృత, ఆంగ్ల రచనల అనువాదాలు చేయడమేకాక జాతీయ భాష హిందీలో తలమానికాలవంటి రచనలయిన 'అంసూ', 'కామాయనీ' కావ్యాలకు వారు తెలుగు చేసారు. అనితరమయిన దీక్షతో వారు చేసిన ఈ అనువాదం సాహిత్య ప్రియుల మన్ననలందుకుంటుందని నా విశ్వాసం. అనువాదరంగంలో కావ్యానువాదం క్లిష్టతరమయినది. కావ్యంలో భావస్ఫూర్తితోపాటు, శబ్దప్రయోగ వైచిత్రికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. అనువాదకుడు భావ సౌందర్యంతోపాటు, శబ్ద రమణీయతను కూడా అభివ్యక్తీకరించాలి. జయశంకర ప్రసాదువంటి మహాకవి, లాక్షణిక పద ప్రయోగం పట్ల మక్కువగల వ్యక్తి, తన రచనల్లో శబ్ద ప్రయోగానికి ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చాడు. సోమయాజులుగారు మూలంలోని భావాన్నే గాక శబ్ద సౌందర్యాన్ని కూడా తమ తెలుగు అనువాదంలో తేవడానికి శ్లాఘనీయంగా ప్రయత్నించారు. ఉదాహరణకు 'చింత' సర్గలో మొదటి పద్యం.
హిమగిరి కే ఉత్తుంగ్ శిఖర్ పర్
బైఠ్ శిలాకీ శీతల్ ఛాఁహ్,
ఏక్ పురుష, భీగే నయనోఁ సే
దేఖ్ రహా థా ప్రలయ ప్రవాహ్
నీచే జల్ థా, ఊపర్ హిమ్ థా
ఏక్ తరల్ థా, ఏక్ సఘన్
ఏక్ తత్త్వకీ హీ ప్రధానతా
కహో ఉసే జడ్ యా చేతన్
దీనికి సోమయాజులుగారి తెలుగు అనువాదాన్ని పరిశీలించండి.
తే. 'తుహిన నగ శీర్షసీమ నుత్తుంగ శిఖరి
నొక శిలా శీతలచ్ఛాయ నొంటి బురుషు
డొక్క డుపవిష్టుడై కనుచున్నవాడు
ఆర్ద్ర నయనాల బ్రళయ జలార్ణవమ్ము
తే. క్రిందనీరము నుపరి బ్రాలేయ, మందు
నొకటి తరల రూపమ్ము, వే ఱొకటి ఘనము
ఏకతత్త్వ ప్రధానతే యిందురెంట
దాని జడమనుండు, మరి చేతన మనుండు'
మరో ఉదాహరణను తిలకించండి. 'లజ్జ' సర్గాంతంలోని పద్యాలు
'దేవోఁ కీ విజయ్, దానవోఁ, కీ
హారోఁ కా హోతా యుద్ధ రహా
సంఘర్ష్ సదా ఉర్ అంతర్ మేఁ.
జీవిత్ రహ్ నిత్య విరుద్ధ రహా.
ఆఁ. సూ సే భీగే ఆఁ. చల్ పర్
మన్కా సబ్ కుఛ్ రఖ్ నా హోగా
తుమ్ కో అప్నీ, స్మిత్ రేఖాసే
యహ్ సంధిపత్ర లిఖ నా హోగా,
ఈ పంక్తులకు అనువాదాన్ని చూడండి.
తే. 'సమర మత్యంత తీవ్రమై సాగు నమర
జన జయములకు, దను జాపజయములకును
అనయమును బ్రవర్తిల్లు మానసాంతరమున
గాఢ మౌచు వైరుధ్య సంఘర్షణమ్ము.
తే. అశ్రు కణసిక్తమైన వస్త్రాంచలమున
నుంచవలయు నెడందలో నున్నదెల్ల
మధుర దరహాస రేఖతో మగువ ! నీవె
ఈ సుసంధి పత్రమును లిఖింపవలయు
'కామాయనీ' చివరి సర్గ 'ఆనందం' లోని చివరి పంక్తులను పరిశీలించండి-
“సమరస్ థే జడ్ యా చేతన్
సుందర్ సాకార్ బనా థా
చేతనతా ఏక్ విలస్ తీ
ఆనంద్ అఖండ్ బనా థా'
ఈ పంక్తులకు అనువాదాన్ని గమనించండి-
తే. 'జడము చేతన మయ్యెడ సమరసములు
ఉండె సౌందర్య మచట రూపొందినట్లు
ఒక్క చైతన్య మొలసె మహోజ్వలముగ
నటనఖండ మహానంద మమరి యుండె'.
సమరసతావాదాన్ని, సత్ చిత్ ఆనంద స్వరూపంగా పరిలక్షించిన మహాద్రష్ట, మహాస్రష్ట అయిన జయశంకర ప్రసాద్ గుండెలోతు లెరిగి, సోమయాజులు గారు చేసిన ఈ అనువాదం కావ్యానువాద ప్రియులైన పాఠకులకు అమితానందం కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. 'కావ్యానువాదం అసంభవం' అనే వారికి కనువిప్పు కలిగించే ఈ అనువాద కార్యాన్ని అతి సమర్థంగా నిర్వహించిన శ్రీసోమయాజులు గారు ధన్యులు. వారి కృషికి నా సాధువాదాలు, గౌరవ పురస్సర నమస్కారాలు.
బుధజన విధేయుడు.
Dr. Bhimsen 'Nirmal'
Emeritus Professor,
Dept. of Hindi
Osmania University, Hyderabad-7
'ఆముఖం'
మానవులకు తొలిపురుషుడైన మనువు చరిత్ర, ఆర్యసాహిత్యంలో వేదములు మొదలు పురాణములు, ఇతిహాసములలో వ్యాపించి ఉన్నది. శ్రద్ధామనువుల సంయోగంతో మానవత్వపు వికాసకథను రూపకావరణంలో భావించే ప్రయత్నము అన్ని వైదిక ఇతిహాసములతో పాటు నిరుక్తముద్వారా కూడ ఏవిధముగా చేయబడినదో, గడచిన కాలంలో ఆవిధంగానే ప్రయత్నము జరిగియుండినప్పటికిని, మన్వంతరము యొక్క మానవత్వపు నవయుగ ప్రవర్తకుని రూపములో మనువుకథ ఆర్యుల అనుశ్రుతిలో దృఢముగా అంగీకరింపబడి యున్నది. అందుచేత 'వైవస్వత మనువు'ను చారిత్రక పురుషునిగానే భావించుట సముచితము. తరచుగ జనులు గాథకు ఇతిహాసమునకు మిథ్యా సత్యముల వ్యవధానమును భావింతురు. కాని సత్యము మిథ్యకంటే ఎక్కువ విచిత్రముగా నుండును. ఆదిమ యుగపు మనుష్యుల ప్రతియొక్క సమూహమును జ్ఞానో న్మేషపు అరుణోదయములో సంగృహీత మొనర్చిన భావపూర్ణ ఇతివృత్తములు నేడు 'గాథలు' లేక 'పౌరాణిక ఉపా ఖ్యానములు' అని వేరుచేయబడుచున్నవి. ఏలనన ఆ చరిత్రలతోపాటు మధ్యమధ్యలో భావనల సంబంధము కూడుకొని ఉన్నట్లు కన్పించును. ఘటనలు కొన్ని చోట్ల అతిరంజితముగ గన్పించును. తథ్య సంగ్రహకారిణియైన తర్కబుద్ధికి అట్టి ఘటనలయందు రూపకమును (ఐరిళీ రిజిలి) ఆరోపించుటకు సౌకర్యము కలుగుచున్నది. కాని వానిలో కూడ కొంత సత్యాంశము ఘటనతో సంబంధమైయున్నది అని అంగీకరింపవలసి యుండును. నేటి మనుష్యుల వద్ద వాని యొక్క ప్రస్తుత సంస్కృతియొక్క క్రమబద్ధమైన చరిత్రమాత్రమే యుండును. కాని వాని చరిత్రయొక్క హద్దు ఎక్కడ నుండి ప్రారంభమగునో సరిగా దానికి ముందు సామూహిక చైతన్యము యొక్క దృఢమైన, గహనమైన రంగులరేఖలతో గడచిన, ఇంకను పూర్వపు విషయముల ఉల్లేఖనము స్మృతిపటమున అంకితమై యుండును. కాని అది కొంచెము అతిరంజితముగా నుండును. ఆ ఘటనలు నేడు విచిత్రతాపూర్ణములై కాన్పించును. బహుశః ఇందువలననే మనము మన ప్రాచీన శ్రుతులకు నిరుక్తముద్వారా అర్థము చెప్పుకొనవలసి వచ్చెను. దాని వలన ఆ అర్థములు మన ప్రస్తుతాభి రుచితో సామంజస్యము నొందును.
శ్రద్దా మనువులు - అనగా మననముయొక్క సహకారముతో మానవత్వపు వికాసము రూపకమైనప్పటికిని, అది గొప్ప భావమయము శ్లాఘనీయమునై యున్నది. ఇది మనుష్యత్వము యొక్క మనోవైజ్ఞానిక చరిత్ర అగుటకు శక్తి కలిగియున్నది. నేడు మనము సత్యమునకు అర్ధము "ఘటన" అని చెప్పుకొనుచున్నాము. అయినప్పటికి దాని తిథిక్రమముతో మాత్రమే సంతుష్టినొందక మనోవైజ్ఞానిక అన్వేషణ ద్వారా చరిత్రయొక్క ఘటనలోనికి కొంత చూడగోరు చున్నాము. దాని మూలములో ఉన్న రహస్యమేది? ఆత్మానుభూతి, ఔను. ఆ భావము యొక్క రూపగ్రహణచేష్టయే సత్యము లేక ఘటనయై ప్రత్యక్షమగు చున్నది. ఆ సత్యములైన ఘటనలే స్థూల మరియు క్షణికములై మిథ్య మరియు అభావములుగా పరిణతిని పొందుచున్నవి. కాని సూక్ష్మానుభూతి లేక భావము చిరంతన సత్యము యొక్క రూపములో ప్రతిష్ఠితమై యుండును. దాని ద్వారా యుగయుగముల పురుషుల అభివ్యక్తి మరియు పురుషార్థముల అభివ్యక్తి జరుగుచున్నది.
జలప్లావనము భారతీయ ఇతిహాసములో దేవతలకంటే విలక్షణమైన, మానవుల యొక్క ఒక విభిన్న సంస్కృతిని ప్రతిష్ఠించుటకు మనువునకు అవకాశము గల్గించిన ప్రాచీన సంఘటన! ఇది చరిత్రయే. 'మనవే వైప్రాతః' ఇత్యాది వలన ఈ ఘటన యొక్క వర్ణన శతపథ బ్రాహ్మణానికి చెందిన 8వ అధ్యాయములో లభించుచున్నది. దేవగణముయొక్క ఉచ్ఛృంఖల స్వభావము, నిర్భాధాత్మ తుష్టియందు అంతిమ అధ్యాయము పొందెను. మానవభావము అనగా శ్రద్ధామనువుల సమన్వయము జరిగి ప్రాణులకు ఒక నూతన యుగపు సూచన లభించెను. ఈ మన్వంతరమునకు ప్రవర్తకుడు మనువు అయ్యెను. మనువు భారతీయేతిహాసమునకు ఆది పురుషుడు, రాముడు, కృష్ణుడు, మరియు బుద్ధుడు - ఈయన వంశీయులే! శతపథ బ్రాహ్మణములో ఆయన శ్రద్ధాదేవుడని చెప్పబడి యున్నది.
"శ్రద్దాదేవో వై మనుః" (కాం 1 ప్ర 1)
భాగవతములో ఈ వైవస్వత మనువు శ్రద్ధలతో మానవ సృష్టి యొక్క ఆరంభము భావింపబడినది.
"తతో మనుః శ్రద్ధాదేవః సంజ్ఞాయామాస భారత
(9-1-11)
ఛాందోగ్యోపనిషత్తునందు మనువు శ్రద్దల భావములక వ్యాఖ్యానము కూడ లభిం చుచున్నది.
"యథావై శ్రద్ధధాతి అధామనుతే నా - శ్రద్ధధన్ మనుతే” (7-19-1)
ఇది నిరుక్తపు వ్యాఖ్యవలెనున్నది.
ఋగ్వేదమున శ్రద్ధ, మనువు - ఈ ఇరువురు పేర్లు ఋషులవివలె కన్పించును. శ్రద్ధకు సంబంధించిన సూక్తము నందు సాయణుడు శ్రద్ధయొక్క పరిచయము నిచ్చుచు వ్రాసియున్నాడు.
"కామ గోత్రజా శ్రద్ధా నా మర్షికా”
శ్రద్ధ కామగోత్రము యొక్క బాలిక. అందుచేతనే శ్రద్ధ అనే పేరుతోబాటు ఆమె “కామాయని” అని కూడ పిలువబడుచున్నది. మనువు ప్రథమ పథ ప్రదర్శకుడు. మరియు అగ్నిహోత్రమును ప్రజ్వలితము చేయునట్టి మరియు నితరములైన అనేక వైదిక కథలకు నాయకుడు.
“మనుర్హవా అగ్రే యజ్ఞేనేజే యదనుకృతేమాః ప్రజ్ఞాయజస్తే" (5-1 శతపథ)
వీరిని గురించి వైదిక సాహిత్యమునందు చాల సంగతులు వెదజల్లబడి నట్లు లభించు చున్నవి. కాని వాటి క్రమము స్పష్టముగాలేదు. జలప్లావన వర్ణన శతపథ బ్రాహ్మణము యొక్క ప్రథమ ఖండమున (8వ అధ్యాయమున) ప్రారంభమగును. దానిలో వారి నావ ఉత్తరగిరియైన హిమవత్ప్రదేశమునందు చేరిన ప్రసంగము కలదు. అక్కడ ఓఘ జలావతరణము జరిగిన మీదట మనువు ఏ స్థలము నందు దిగెనో దానిని “మనోరవ సర్పణము" అందురు. - “అపీపరం వైత్వా వృక్షేనావం ప్రతి బధ్నీష్వ, తంతు త్వా మా గిరౌ సన్తముదక మన శ్చైత్సీద్ యావద్ యావదుదకం సమవాయాత్ తావత్ తావదన్వవసర్పాసి ఇతి సహతావత్ తావదేవా న్వవససరం. తదప్యేత దుత్తరస్య గిరే ర్మనోరవ సర్పణమితి. (8-1)
శ్రద్ధతో మనువు కలిసిన మీదట ఆ నిర్జన ప్రదేశమునందే నశించిన సృష్టిని మరల ఆరంభించుటకు ప్రయత్నము జరిగెను. కాని ఆసురపురోహితుడు లభించుటవలన (కలియుట వలన) ఆయన (మనువు) పశుబలిచేసెను. "కిలాతాకులీ ఇతిహాసుర బ్రహ్మవాసతు తౌ హోచతుః - శ్రద్ధా దేవో వైమనుః ఆవం ను వేదావేతి తౌ హాగత్యోచతుః। మనో యాజయాప త్వేతి”.
ఈ యజ్ఞము తరువాత మనువునందు జాగృతమైన పురాపరిచిత దేవ ప్రవృత్తి ఆయన ఇడ సంపర్కములోనికి వచ్చిన తరువాత ఆయనను శ్రద్ధయే కాక రెండవవైపునకు ప్రేరేపించెను. 'ఇడ' సంబంధమును గూర్చి శతపథమున ఇట్లున్నది. "ఆమె యొక్క ఉత్పత్తి లేక పుష్టి పాకయజ్ఞము వలన కలిగెను. ఆ పూర్ణయోషితను చూచి మనువు ఇట్లడిగెను, “నీ వెవరవు?" "నీ దుహిత" నని ఇడ ప్రత్యుత్తర మిచ్చెను. “నా దుహిత వెట్లయితివి?" అని మనువడిగెను. “నీ దధి, ఘృతాది హవిస్సులవలన నా పోషణ జరిగినది" అని ఆమె చెప్పెను”.
“తాం హ” మనురువాచ “కా ఆసి” ఇతి. "తవ దుహితా” ఇతి. "కథం భగవతి? మమ దుహితా" ఇతి. (శతపథ 6 ప్ర. 3 బ్రా)
మనువునకు ఇడపట్ల అత్యధికమైన ఆకర్షణ కలిగెను. మరియు శ్రద్ద నుండి కొంచెము దూరమయ్యెను. ఋగ్వేదమున ఇడ ఉల్లేఖనము చాల స్థలము లందు కన్పించును. ఈమె ప్రజాపతి మనువు యొక్క "ప్రథ ప్రదర్శిక” మనుష్యులను శాసించునది. అని చెప్పబడినది.
"ఇడా మకృణ్వన్మనుషస్య శాసనీమ్" (1-31-11 ఋగ్వేదము)
ఇడకు సంబంధించి ఋగ్వేదములో చాల మంత్రములు లభించును.
“సరస్వతీ సాధయన్తి ధియం న ఇడాదేవీ భారతీ విశ్వతూర్తి, తి స్రో దేవీః స్వధయావర్హి రేదమచ్చి ద్రంపాస్తు శరణం నిషద్య” (ఋగ్వేదము. 2-3-8)
“అనో యజ్ఞం భారతీ తూయ మేత్విడా మనుష్యదిహ చేతయన్తి, తిస్రో దేవీర్వర్హి రేదం స్యోనం సరస్వతీ స్వపనః సదస్తు" (ఋగ్వేదము 10-110-8) ఈ మంత్రముల యందు మధ్యమా, వైఖరీ, పశ్యంతీల ప్రతినిథియైన భారతీ సరస్వతీలతోపాటు ఇడ నామము వచ్చి యున్నది. లౌకిక సంస్కృతమున ఇడ శబ్దము పృథ్వీ అనగా బుద్ధి, వాణి మొదలైన వాటికి పర్యాయవాచకముగా నున్నది.
"గో, భూ, వాచస్విడా ఇలా" (అమరము) ఈ ఇడ లేక వాక్కుతో మనువు లేక మనస్సు యొక్క మరియొక వివాదము శతపథమున ఉల్లేఖింపబడి యున్నది. దానిలో ఇద్దరును తమతమ మహత్తు కొరకు పోట్లాడుకొందురు. “ఆఖాతో మనసశ్చ” ఇత్యాది (1 అధ్యాయము 5 బ్రాహ్మణము) ఋగ్వేదమున ఇడను బుద్ధిని సాధన చేయునట్టియు, మనుష్యునకు చేతనను ప్రదానము చేయునట్టియు 'ధీ' అని చెప్పియున్నది. పూర్వకాలమున బహుశః ఇడకు పృథ్వి మొదలైన వాటితో సంబంధమొనర్చ బడినది. కాని ఋగ్వేదము 5-5-8లో ఇడా సరస్వతులతో బాటు మహి యొక్క ఉల్లేఖనము స్పష్టముగా వేరుగా నున్నది. "ఇడా సరస్వతీ మహితిస్రో దేవీర్మయో భువః" వలన మహి నుండి ఇడ భిన్నమైనదని తెలియుచున్నది ఇడ “మేధస్ వాహినీ నాడీగా కూడ చెప్పబడినది.
బుద్ధివికాసము, రాజ్యస్థాపనము మొదలైనవి ఇడయొక్క ప్రభావముచేతనే మనువు చేసెనని ఊహింపవచ్చును. తరువాత ఇడమీద కూడ అధికారము చేయవలెనను ప్రయత్నము వలన మనువు దేవగణ కోపభాజనుడు కావలసివచ్చెను.
“తద్వై దేవానాం ఆగ ఆస” (7-4 శతపథము) ఈ అపరాధమునకై ఆయన శిక్ష ననుభవింపవలసి వచ్చెను.
“తం రుద్రో - భ్యావత్య వివ్యాధ” (7-4 శతపథ) ‘ఇడ' దేవతల యొక్క “స్వసా" బయుండెను. మనుష్యులకు చేతన ప్రధాన మొనర్చునట్టిది. అందుచేతనే యజ్ఞములలో 'ఇడాకర్మ' జరుగుచున్నది. ఇడయొక్క ఈ బుద్ధివాదము శ్రద్ధా మనువుల మధ్య వ్యవధానమును కలిగించుటలో సహాయక మయ్యెను. మరి బుద్ధివాదపు వికాసమున అధిక సుఖాన్వేషణము లో దుఃఖము లభించుట సహజము. ఈ ఆఖ్యానము ఇతిహాసములో రూపకపు అద్భుత మిశ్రణము జరుగునంత ప్రాచీన మైనది. అందుచేతనే మనువు, శ్రద్ధ, ఇడ-ఇత్యాదులు తమ ఐతిహాసి కాస్తిత్వమును ఉంచుకొనుచు సాంకేతికార్ధమును గూడ అభివ్యక్త మొనర్చినచో నాకే మియు నభ్యంతరములేదు. మనువు అనగా మనస్సు యొక్క రెండు పక్షములు హృదయము, మస్తిష్కము యొక్క సంబంధము క్రమముగ శ్రద్ధా ఇడలతో గూడ తేలికగా కలుగుచున్నది.
"శ్రద్ధాం హృదయ్య యా కూత్యా శ్రద్ధయా విన్దతే వసు" (ఋగ్వేదము 10-5-4)
వీటన్నిటి యొక్క ఆధారముననే “కామాయని” యొక్క కథాసృష్టి జరిగినది. ఔను “కామాయని” కథాశృంఖలమును కల్పుటకై అక్కడక్కడ కొంచెము కల్పనను గూడ ఉపయోగించు నధికారమును నేను విడువజాలక పోయితిని.
- జయ శంకర ప్రసాద్
1. చింత (ఆవేదన) 477 2. ఆశ (ఆసక్తి) 489 3. శ్రద్ద (ఆహ్లాదము) 502 4. కామము (అనురాగము) 512 5. వాసన (అనుబంధము) 522 6. లజ్జ (ఆమోదము) 538 7. కర్మ (ఆచరణ) 545 8. ఈర్ష్య (అసంతృప్తి) 564 9. ఇడ (అన్వేషణ) 575 10. స్వప్నము (ఆందోళన) 594 11. సంఘర్షణము (ఆదేశము) 610 12. నిర్వేదము (ఆప్యాయము) 629 13. దర్శనము(ఆలోకము) 644 14. 15. రహస్యము(ఆంతర్యము) ఆనందము (ఆనందం) 657 669
'కామాయని'
'చింత (ఆవేదన)'
తే. తుహిననగ శీర్షసీమ నుత్తుంగ శిఖరి
నొక శిలా శీతలచ్ఛాయ నొంటిఁ బురుషుఁ
డొక్కఁడుపవిష్టుఁడై కనుచున్నవాఁడు
అర్ధ నయనాలఁ బ్రళయ జలార్ణవమ్ము.
తే. క్రింద నీరము నుపరిఁ బ్రాలేయ, మందు
నొకటి తరలరూపమ్ము, వేఱోకటి ఘనము
ఏకతత్త్వ ప్రధానతే యిందు రెంట,
దాని జడ మనుండు, మరి చేతన మనుండు.
తే. స్తబ్ధమైన యాతని మానసమ్ము వోలెఁ
జెలఁగి హిమము సుదూరవిస్తృతినిఁ జెందె,
శాంత మటు తోఁచు ఘన శిలాచరణభూమి
ఘట్టన మొనర్చి తిరుగుఁ బ్రకంపనుండు.
తే. ప్రౌఢి గూర్చుండి తరుణతపస్వి రీతి
సాధన మొనర్చు నమరశ్మశాన మందు,
క్రింద విలయసాగర లహరీచయమ్ము
దీనదీనమ్ముగను నవసాన మొందె.
తే. ఆ తపోనిధి వోలె నత్యంత దీర్ఘ
ములును, బ్రాప్త హిమ ధవళములును నగుచు
గండశిల లట్లు సురతరుల్ గడ్డగట్టి
నిలిచె నొక రెండొ మూఁడొ యా నికటభూమి. 5
తే. సర్వ దేహాంగ మాంసపేశలత యొప్పు,
నమిత వీర్య మూర్జస్వితం బగుచునుండె
స్పీత ఘననాళములను వసించి శోణి
తమ్ము చరియించుచుండె స్వాస్థ్యమును బడసి.
తే. పౌరుషగుణ ప్రపూర్ణమౌ ప్రౌఢముఖము
చింతచే నైన భీరుతఁ జెదరియుండె
ఎడద యౌవన మధురవాహిని చెలంగి
యిపుడు ప్రవహింప, నతఁ డుపేక్షించుచుండె.
తే. మున్ను ఘన వట బద్దమై యున్న నౌక
నెలవు గొనియున్నయది పొడినేల మీఁద,
క్రమముగను తగ్గిపో జలప్లావనమ్ము
వెలువడఁగఁ జొచ్చె మున్గిన పృథ్వియపుడు.
తే. గాఢ కరుణా వినిస్సృత గాథ వోలె
వెలికిరా నతని ప్రగాఢవేదనమ్ము
నెఱిఁగియున్నట్టి దగుట హసించి నటుల
నొంటిఁ బ్రకృతిమాత్రమె వినుచుండె దాని
తే. "బహుళ చింతా సముజ్వల ప్రథమరేఖ!
ఓ మహాజగోపవన ఘనోరగమ్మ!!
పావకాద్రీంద్ర విస్ఫోట భయద మహిత
ప్రథమకంపనం బోలు నో ప్రబలమత్త!! 10
తే. “ఓ యభావ చపల మహామాయబాల!
లిఖిత లాలాటికా క్రూర లేఖనమ్మ!!
పచ్చపచ్చని సొగసుల పరుగులాట!
కపట మృగతృష్టికా తరంగమవు నీవు!!
తే. "ఈవు గ్రహకక్షఁ గల్లోల మెసఁగఁజేతు
తరళ గరళాన నొక చిన్ని తరఁగ వీవు
స్వర్గజన జీవితమునకు జరవు చింత!
చెవిటిదానవు విన వేమి చెప్పుకొన్న!
తే. "వ్యాధులకు సూత్రధారిణి వౌదు వోసి
యాధి! మధుమయశాపమ్మ వగుదు వీవు
ఓ హృదయగగన మహా భయోల్క! చింత!!
పరమసృష్టికి రమ్యపాపమ్మ వీవు.
తే. "చింత! న న్నెంత యోజింపఁజేసి తీవు
ఎంత లోఁతుపునాది రచించితేని
యట్టి చింతారహితజాతి నర్థి బ్రతుకు
నమరునకు నెన్నడే మృతియన్న దున్నె!
తే. "చేరి వ్యాపింతు మానస క్షేత్ర మందు
సస్యభూమి వర్షపలజలద మట్లు
అర్థి నెల్లర హృత్కుహ రాంతరముల
దాఁగియుందువు గుప్తనిధాన మటుల. 15
తే. "మతి మనీ షాశ బుద్ధియు మహిత చింత
యనున వెన్నియొ నామమ్ము లగును నీకు
లేదు స్థానమ్ము పాపినీ! లేదు సుంత
యేని నిలువక వెడలిపొ మ్మెచటికైన.
తే. "విస్మృతీ ! రమ్ము ! శిథిలతా !! విక్రమింపు
మోసి నీరవతా!! మౌన మొసఁగు మీవు
చేతనత్వమ !! వెడలి యే సీమకైన
శుభ్రజడతను నింపుమీ శూన్యహృదిని.
తే. "ఆ యతీతమ్ము, సౌఖ్యమ్ము నాత్మలోన
నెంత ఘనముగ నిపుడు యోజింతు నంత
గాటముగ నొందు దుఃఖరేఖాళి తివురు
నస్మదీయ నిస్సీమా హృదంతరమున.
తే. "అహహ! ఓ మహామహిత సర్గాగ్రదూత!
అసఫలుండ వైతివి, లీనమైతి వీవు
రక్షకుండ వౌదువొ లేక భక్షకుఁడవొ
నీవె నీ యెడ లీనమైనావు సుమ్ము.
తే. “వజ్ర సౌదామనీ వాత్యవర్ష పటలి!
లీల నర్తించినావు రాత్రింబవళ్ళు
అటుల భోగలాలసత మగ్నాత్ము లగుటె
యీవు పలుమారు లేతేర హేతు వయ్యె. 20
తే. "రత్నదీప ఘనాంధకారమ్ముఁ బోలు
నల నిరాశా సహిత భవిష్యమ్మ! ఓసి,
అమరజన ఘనాహంకార యజ్ఞవాటి
రమ్య సర్వస్వమును హవిర్భాగ మయ్యె!
తే. "తరళ మృత్యు రాహిత్య పుత్తలికలార!
ధన్య భవదీయ జయ నినాదములు ప్రబలి
శబలితస్వన దైన్య విషాద మొదవ
నిప్పటికిని బ్రతిధ్వనియించుచుండె.
తే. "అరయఁ బ్రకృతి యున్నది యజేయమ్మె యగుచు
జితుల మైతిమి, యవివేక చిహ్నితులము
మరచి మధుపానమత్తత న్మమ్ము మేమె
యీదుచుంటిమి తౌల్యంపు టేటినీట.
తే. "వారు మునిగిరి, మునిఁగెను వైభవమ్ము
ఆ సమస్తమ్ము రూపొందె నబ్ది పగిది
దేవతా సుఖవితతిపైఁ దెరలి యంత
దుఃఖజలధి నినాదమ్ము తుఱఁగలించె.
తే. "అట్టి మత్తవిలాస మే మయ్యె? అరయ
స్వప్నమో! కాక మృదుల విభ్రమమొ యద్ది
స్వర్గజనలోక సుఖవిభావరి చెలంగె
తరుణ మహనీయ తారకాతతుల తోడ. 25
తే. "అమరతరుణీ సుగంధ వస్త్రాంచలముల
సౌఖ్య జీవనపవన నిశ్వాస మొద వె-
వరలు సౌపర్య సౌఖ్యవిశ్వాస మపుడు
ముగ్ద కోలాహ లోజ్వల ముఖరితమ్ము.
తే. "అది సుఖము! కేవలము సుఖ మహహ! అద్ది
అమల మందాకినీ ప్రవాహమ్మునందు
పృథు తుషారములు ఘనీభవించినట్లు
త్రిదశజన సుఖమయ్యె కేంద్రీకృతమ్ము.
తే. "అమిత విశ్వబల విభవ హర్షములను,
నన్యసర్వస్వ మపుడు స్వాయత్తమయ్యె
ఆ సమృద్ధి సుసంచారవ్యాప్తి తోఁచె
లోల వీచీ మనోజ్ఞ కల్లోలరీతి.
తే. "అరుణకిరణాలు జలధికణాంతరముల
ద్రుమదళంబుల భాసించు నమలఫణితిఁ
గీర్తి దీప్తి శోభ లొనర్చె నర్తనముల
నాల్గు దిక్కుల నానందనవ్యతలను.
తే. "శక్తి యున్న-దౌను ప్రకృతి స్వర్గజనుల
పదతలమ్ముల వినయవిభ్రాంతి నుండె
తత్పదాక్రాంత మౌటచే ధరణితలము
అను దినమ్మును గంపించు నతిశయముగ. 30
తే. " అయిన సురలము స్వయము మే మందరమ్ము
నేల యీ సృష్టికాదు విశృంఖలమ్ము?
కనుకనే మాకు నిట్టు లాకస్మికముగ
వచ్చి వర్షించే భయద విపత్తు లపుడు.
తే. "నాశమయ్యె సర్వమును వినాశమయ్యె
నిర్జరీజన శృంగార నిరతిశయ ము
షస్సు బోలు యౌవనము, జ్యోత్స్నాస్మితము,
భ్రమర చింతావిహీన విలాసలీల.
తే. "వాసనా పూర్ణవాహినీవర మ దెంత
పరమ మధుఘన మత్త ప్రవాహ మయ్యె!
సంగమింప నది ప్రళయజలధి యందుఁ
బ్రిదిలి, కనువేళ నెడద కంపించి మూల్గె.
తే. “నిత్య యౌవన సుఖభోగ నిరతిశయత
సకలదిశల సుగంధాళిఁ జాదుకొల్పు
ననవరత మధుపూర్ణమౌ నా వసంత
మెచటి కేగెనో యేమొ యదృశ్యమయ్యె.
తే. "కుసుమిత నికుంజకేళుల కొమరు గొన్న
వారి పులకితాలింగనప్రౌఢి సడలె
ముగ్ద సంగీత తానముల్ మూగవోయె
కెరలి చెవుల సోకదు వల్లకీరుతమ్ము. 35
తే. “వాసనల నిండి నిశ్వాస పవనచయము
నిలువఁగా బోదు చెక్కిళ్ల నీడవోలె
సురత శైథిల్య వసనముల్ చుట్టుకొనవు
శ్రమ మనోజ్ఞము లగు వపుస్స్కంధములను.
తే. "ఓపి క్వణియించుఁ గంకణనూపురములు
చెలఁగి వక్షాన హారముల్ చిందుఁద్రొక్కుఁ
గలరవమ్ములఁ బ్రతిరుతిగతులు తోఁచు
స్వరలయమ్ములు గీతాళి సంగమించు.
తే. "సౌరభస్ఫూర్తి నమరు దిశాంతసమితి
చతుర కాంతిమెయి నభము చంచలమ్ము
అన్నిటను దోఁచుచున్నది యట్టివేళ
మలయపవన ముద్వృత్తి నున్మత్తకేళి.
తే. "ఆ యనంగ వ్యథానుభవాంగ భంగి
మలను నృత్యమ్ము సాగెను జెలఁగి చెలఁగి
షట్పదీ పుష్పరస మహోత్సవము వోలి
వరలె మదిరారసాసక్తి మరల మరల.
తే. "వర సురాగంధములఁ దోగు వదనములను
నరుణనేత్రాళి నలసత, హార్ద రాగ
మమరు సుందరములు కపోలములు వానిఁ
గనినఁ బీత కల్పక పరాగములు బెగడు. 40
తే. "ప్రతినిధులు తృప్తి నెఱుఁగని వ్యసనములకు
వాడి, దగ్ధమై, నిజ సృష్ట వహ్నికీల
భయద వాత్యా రయోద్ధత ప్రళయకాల
జలధి జలమున వారు నాశనముఁ గొనిరి.
తే. "ఓ యుపేక్షా సహిత సుర తోత్కలమ్మ!
ఓ యసంతృప్తి!! నిరవధి కోర్జిత సువి
లాసమా!! అనిమిష భయరహిత నయన
దర్శన క్షుధా ఘటిత విదాహ మహిత!!
తే. "వారి యుపగూహనమ్ములు దూరమయ్యె!
నుడిగిపోయె స్పర్శాపులకోద్గమములు
సురభి ళోజ్వల మధుమయ చుంబనచయ
కాతరతల ముఖాబ్జముల్ కష్టపడవు.
తే. "రమ్య మధు మదిరా సమీరములు తిరుగు
ధన్యతమ రత్నసౌధవాతాయనముల
మించి యీనాఁడు జలధి తిమింగలములు
క్రోధరస ముట్టిపడఁగ ఢీకొనఁగ వచ్చు.
తే. "త్రిదశకామినీ నేత్రముల్ లీలఁ జేయు
లలిత లావణ్య నీలోత్పలముల సృష్టి
అట్టి కన్నులఁ గనుపట్టు నక్కజముగఁ
బ్రళయకారిణి యౌ మహాభయదవృష్టి. 45
తే. "మ్లానరహిత సుగంధసుమాళి మణుల
రచితము లయిన మంజుహారాళి నాఁడు
శృంఖలము లయ్యె-నందు బంధింపఁబడిరి
నిర్జ రాప్సరస విలాసినీ గణమ్ము.
తే. "అమర యజనంపు పశుయజ్ఞ మందు నొదవు
నమిత పూర్ణాహుతిజ్వాల లబ్ధియందు
విలయ కల్లోల మహనీయ వీచికలుగ
నెంత భయదమ్ములై జ్వలియించుచుండె.
తే. "అంతరిక్షానఁ గూర్చుండి యరసి వారి,
ధీరతను వీడి యిటుల రోదింతు రెవరు?
అశ్రుమయ హిమానీ హాలహలజలమ్ము
లెల్ల వేళల నిటుల వర్షింపసాగె.
తే. "కలిగె హాహారవ భయదాక్రందనములు,
సురల వజ్రము లయ్యె సంచూర్ణితములు
అయ్యె బధిరమ్ము లఖిల దిశాంతములును
క్రూర భీమ శశ్వ న్మహాఘోష లెసగె.
తే. "క్షితిజతటమున జలదముల్ చెలఁగి మొరసె
పొగలు వ్యాపించె దిగ్దాహములను వీడి
ఘన గగనమున భీమ ప్రకంపనంపు
ఝంఝ యొదవించె గుదుపు లాశ్చర్యమొదవ. 50
తే. "అంధకారాన మలినమ్ములై వసించు
భాను నస్పష్టకాంతులు లీనమయ్యె
అపుడు వరుణుఁడు నిజకర్మ న్యస్తుఁడయ్యెఁ
జేరి పొరగట్టి తిమిరమ్ము చియ్యబట్టి.
తే. "మించెఁ బంచభూత భయద మిశ్రణమ్ము
అమల శంపాశకల నిపాతములు కలిగె
త్రిదశులు మహోల్క లనియెడి దివ్వటీల
వెదకిరి కనని తొలిసంజ-వెలుఁగుజాడ.
తే. "క్రుద్ధ భైరవ దీర్ఘనిర్దోషములకు
నవని కలఁగి కంపింపఁగా నాత్మఁ దలంచి
శాశ్వతాలింగనమునకై శ్యామగగన
మంత దిగివచ్చెనో యననపుడు తోఁచె.
తే. "కుటిలకాలుని క్లిష్టవాగురలఁ బోలు
జలధి కల్లోలమాలికల్ స్వనమొనర్చె
పడగలను విప్పి ఏ తెంచు వ్యాళగతుల
గదలివచ్చెను నురగలు గ్రక్కుకొనుచు.
తే. "క్రమముగాఁ బృథ్వి క్రుంగిపోఁ గడఁగె - నపుడు
పొలిచి యనలాద్రి ని శ్వాసములను బోలి
పావకజ్వాల లెల్లెడఁ బ్రజ్వలించె
కుంచితాంగియై వసుమతి గోచరించె. 55
తే. "క్రోధరస పూర్ణ జటిల నిర్దోష నిచయ
కంబుధి బలవ దూర్మికాఘాతములను
గదలె తిలకింప నొక మహాకచ్ఛపముగ
క్షోణి-వ్యాకులమ్మొందె, సంక్షోభ మొందె.
తే. "కామకేళీ విలాస వేగమ్ము వోలె
నపుడు భైరవజలరాశి యతిశయించె
అమిత నీల మహాఘనాంధ్యమును జేరి
కడఁగి విలయమహావాత్య కౌఁగలించె.
తే. "జలధి తటము చేరిక కనుక్షణముఁ జేరె
క్షీణమై, లీనమయ్యెను క్షితిజరేఖ,
హేలగాగ మర్యాదావిహీన మగుచు
వార్ధి జృంభించె నిఖిల విశ్వమును ముంచి.
తే. "కరక లతిభీకరధ్వనిఁ గురియఁదొడఁగె
ప్రకృతి సర్వము మర్దింపఁబడుచు నుండె
పంచభూతమ్ము లీలీల భయదరీతి
నెంతకాలము తమిఁ దాండవించినవియొ!
తే. "ఉన్న దయ్యెడ నవ్వేళ నొక్క నౌక
లేదు దానికిఁ జుక్కాని, లేవు తెడ్లు
విపుల తరళోర్మి, కలను నా వెళ్లి నౌక
పడుచు లేచుచు నున్నది యడలుఁగొనుచు-60
తే. "ప్రబల ఘాతలు తగిలె - నస్పష్టమైన
యొడ్డుజాడయొ కానరాకుండె - నంతఁ
బిఱికినైతి, నిరాశానిపీడితుడను
నైతి - విధినియతపథము నరయుచుంటి.
తే. "వీచికల్ రేగె నభము చుంబింప ననఁగ,
నగణిత క్షణప్రభలు నృత్యమొనర్చె
గరళ కాదంబినీ కర్ష గాఢపాత
సలిలబిందువుల్ సేసె స్వజాతిసృష్టి.
తే. "స్వయముగా జంచలల్ వెల్గె జలధిలోన
అవ్వి కనుపట్టె జలధిగర్భాంతరాళ
గాఢ బాడబజ్వాలలు ఖండ ఖండ
ములుగ నెగసి రోదింపఁగాఁ బోలు ననఁగ.
తే. "సాగరాంతర సంచర జ్జలచరములు
వికలతల లేచి మున్గుచు నెగడుపడియె
రుచిరమగు స్వగృహము విలోడి తమ్ముఁ
జెంద నే ప్రాణి యెపు డెటఁ జింతపడదు?
తే. "భూరి పవమాన మట ఘనీభూతమయ్యె
స్తంభితములయ్యె నయ్యెడ శ్వాసగతులు
తప్పి విలపించుచుండె చైతన్యమేని
క్షుభితమగుచుండె దృష్టి విస్ఫురణ దప్పి. 65
తే. "ఆ మహాలోడనమున గ్రహములు ఋక్ష
ములును దోఁచెను జలధిబుద్బదము లట్లు
ప్రళయకాల మహాఘోర వర్షమందు
మిణుగురులఁ బోలి యవి తోఁచె మినికి మినికి.
తే. "ఎన్ని జాములు గడచెనో యిట్టి గతుల
నిట్లు దివసమ్ము లెన్నెన్ని యేగినవియొ
వాని చరితమ్ముఁ జెప్పెడివారు లేరు,
ఎఱుఁగ సాధనచిహ్నములేని లేవు.
తే. "ఎంత కాలము సాగెనో మృత్యులీల
శాసన మ్మది రాదు నా స్మరణ కిపుడు -
ఒక మహామత్స్య దీర్ఘపుచ్ఛోగ్రఘాత
దీననావకు మృత్యువై తేజరిల్లె.
తే. "అమ్మహాఘాత యా నౌక నపుడు విసరి
చేర్చె నిమ్మిహికాగిరి శిఖరమునకు
పరమ సురసర్గ విలయ విధ్వంసనమ్ము
చెలఁగి యొక్కింత మరల శ్వాసింపసాగె.
తే. "అమరతా జర్జరిత దంభమటుల మిగిలి
యొంటినై యిట్లు జీవించియుంటి - నహహ!
ప్రాపితస్థితి నీ సృష్టి రూపకమునఁ
బరుగు చుంటిని విష్కంభపాత్ర వోలె. 70
తే. "ఓరి, జీవన మృగతృష్ణ ఓరి, ఓరి
భీరు తాలస దుఃఖ విహారభూమి!!
ఓ పురాతనామృతమ !! అయో !! అగతిమ
య ఘనమోహ జర్జర సుమహావసాద !!
తే. “మౌన నాశనధ్వంసతమములు, శూన్య
మును సభావమ్ము నీ వేళఁ బొలసియున్న
సత్యములు - నీకు నిలువఁగా స్థాన మెద్ది
యించుకేనియు నమరతా ! యిప్పు డిచట !
తే. "మృత్యువా! ఓసి చిరనిద్ర! మిహికవోలె
నతుల శీతలము భవదీయాంక పాళి
కాలజలధి కల్లోలరింఛోళిఁ బోలు
భంగముల సృజించెదవు విశ్వమ్మునందు.
తే. "కఠిన ఘననృత్య పాదసంఘట్టనమవు,
స్పందనముల కెల్లను గొలబద్ద వీవు
సృష్టి యభిశప్త మైనప్పు డెల్ల కాల
ములను బొలుపొందును భవద్విభూతి యగుచు.
తే. "అర్థి నుండెదవు ఘనాపహాస మటుల
ఇది పురాసత్యము - ప్రతిధ్వనించు నెపుడు,
సర్గకణకణమున గాది సంచరింతు,
వగు నిదియు రమ్య నిత్య రహస్య మగును. 75
తే. "అగు బ్రతుకె భవదీయ క్షుద్రాంశ-మద్ది
ప్రకటిత మ్మగు నీల జలధరమాల
నమరు సౌదామనీసంధి యటుల నెప్పు
డొప్పు శోభామనోజ్ఞమై యొక్క క్షణము.
తే. పానమొనరించు శబ్దాళిఁ బవన మిపుడు
నిర్జనత్వంపు నిట్టూర్పు నెఱిఁ జలించె
అద్ది డీకొని హిమవదహార్యపంక్తి
నూను బ్రతిశబ్దరూపాల దీనముగను.
తే. ధిమి ధిమిం ధిమి నిస్వానధీరతలను
దమిని సాగు ననస్తిత్వ తాండవమ్ము
కర్షణ విహీన చంచలా కణగణములు
భార వాహమ్ములై భృత్యభావ మొందె.
తే. దృష్టి శీతల మృత్యు సదృశ నిరాశ
నంగవించి యొనర్చు నాలింగనమ్ము
ధూమ హిమసంహతుల మహావ్యోమ వీథి
కడగి వర్షించు భౌతికకణము లట్లు.
తే. కాక నా భయద జలసంఘాత మప్పు
డటుల నావిరైపోవుచున్నది, యేమొ!
పరగె సౌరచక్రమున నావర్తనమ్ము-
గడచెఁ బ్రళయనిశి - ఉదయకాంతు లొదవె. 80
'ఆశ (ఆసక్తి)'
తే. సాగి జయలక్ష్మి పోల్కి నుషస్సు పొలిచి
స్వర్ణతీరాన్ని కాంతివర్షమున ముంచె
గాఢమగు నపజయమునఁ గాళరాత్రి
తతజలాల నంతర్నిహితమ్ము నొందె.
తే. ప్రకృతి భీవివర్ణ వదనపద్మ మంతఁ
దిరిగి హసియింపసాగె సందీప్తరుచుల
వర్షము గతించెను శరత్తు హర్షఫుల్ల-
నవ్యతల సృష్టియందు విన్యసన సేసె.
తే. స్నిగ్ధపింగపరాగ మునిషితముగ్ధ
సీతసరోజానఁ గ్రీడించు చెలువు మెరసి
రమ్యనవాలోకనము హిమరాసి నపుడు
రాగమున ముంచి వ్యాపించె లలితగతుల.
తే. సకలధరణిపైఁ గల హిమాచ్ఛాదనమ్ము
వీడసాగెను - మేల్కొని వృక్షసమితి
యలసతల శీతజలముల నాచరించెఁ
జతురిమలు దోపఁగా ముఖక్షాళనములు.
తే. నేత్రములఁ జేసె ప్రకృతి యున్మీలనమ్ము
సరవి నది ప్రబుద్ధమును గాసాగె నంత
వెర్రికడలి యలల యొళ్ళువిరుపు తరుగ
మాటిమాటికి వహియించె మందగతులు.
తే. ప్రళయ శార్వరీకల్లోల ప్రస్మృతులకు
నలసినటు, బిర్రుగ బిగిసినటులఁ దోఁచి
యపుడు సర్వంసహావధు నబ్ది- శయ్య
సంకుచితమూర్తిఁ గూర్చున్న సరణి మెరసె.
తే. బహుళ రంజిత విజన విశ్వమ్మునందు
మనువు చూచె విశ్వైకాంతమహిమ అదియుఁ
దుహిన శీతల జడతగాఁ దోఁచె - నచట
నిఖిలకోలాహల మలసి నిద్రవోయె.
తే. సోమరహి తేంద్రనీల సంశోభి చషక
మపుడు బోరగిలఁబడి వ్రేలాడుచుండె
ఆపద సమస్త మరిగెనో యనగఁ బవన
మర్థి మసృణసునిశ్వాస మాచరించె.
తే. ఆ విరాట్టు కొంగొత్తరంగద్దఁ దలఁచి
కలుపుచున్నాఁడు హేమ మకల్పముగను
ఉద్భవించెను మనువున కొక్కపరిగ
నెవ్వఁ డతఁ డను ప్రశ్న -జనించె కోర్కె.
తే. వేనియాజ్ఞకు బద్ధు లీ విశ్వదేవ
వాయు పవమాన పూషాది వరగణమ్ము?
ఎవని శాశ్వత పాలన నిట్లు నడతు
రా మరుత్తు, సోముఁడు వరు ణాదిసురలు? 10
తే. అతని భ్రూభంగ మగుఁ బ్రళయమ్ము తలఁప -
అట్టి ప్రళయాన వికలత నందినారు
ఆ ప్రకృతిశక్తికిఁ బ్రతీకలైన నేమి,
యెంత దుర్బలు లైరి వారిపుడు చూడ!
తే. సర్వభూత చేతన, పృథుశక్తి గణము -
వికలతను జెంది యపుడు కంపించిపోయె
వివశులు నుపాయశూన్యులు వీర - లపుడు
వీరి కెంత దుర్దశ సంభవించె నయొయొ!
తే. కాము దేవతలము మేము- కారు వీరు
భూరి పరివర్తనపు హస్తపుత్తలికల
మగుడు - మరయ నున్నాము మే మందరమును
గట్టఁబడి గర్వరథతురంగమ్ము లట్లు.
తే. కాంతిమయ తటిత్కణ తారకాతతులును
గ్రహసమితి వేడఁగా ననురాగభిక్ష
యెవ్వని వెదకుచున్నవి యీ వినీల
గగన మందు, మహాంతరిక్షమ్మునందు?
తే. ఏ మహాశక్తి కర్షింప నివ్వి నింగిఁ
గానఁబడును, అదృశ్యమ్ముఁ గనును - కడఁగి
చేయ నే శక్తి మధురస సేచనమ్ము
నవనవోన్మేష మొందు తృణమ్ము - లతలు. 15
తే. అర్థి శిరసొగ్గి యెవ్వని యమితశక్తి
నఖిలజీవు లే యెడను సమాదరింత్రొ
మౌనమున నెవని ప్రభుతఁ బూని స్తుతి
యించెదరొ యట్టి యస్తిత్వ మెచట నుండె?
తే. ఓ అనంతమనోహరా? ఉజ్వలుఁడవు!
ఎవ్వరవో నీవు తెలుప నా కెరుకపడదు
అమలరూప మ దేమి? ఏ మౌదు వీవు?
ఇట్టి భారయోజన యే భరింపఁజాల.
తే. "అయ్యెదవు నీవు ఎదియొ నీ వౌదు వయ్య"
అనుచు దోఁచెడి నో విరా డఖిల దేవ!!
అబ్ధి భవదీయఘనతనే యాలపించు
రమ్య గంభీర మంద ధీర స్వరాలి.
తే. "అధికవిహ్వల సదయ హృదబ్బ మందు
మించు తీయని కలవోలె మినుకు మనుచు
నేమి యిది - ఆశ అనిలమై యిటుల వచ్చి
వ్యాకులతరూపమున నేఁడు ప్రకటితమ్ము.
తే. మధుర జాగరణము వోలె మహితకాంతి
నెంత స్పృహణీయమై యిద్ది యెసఁగ మెసఁగు,
నుబికి జృంభించు నిద్ది స్మితోర్మికలుగ,
నధిక మధుతాన మటుల నృత్యమ్ము సేయు. 20
తే. జీవనము! జీవనపు కేక!! శీతలాగ్ని
సేయు నాట్యమ్ము మన్మనస్సీమ యందు
ఈ శుభప్రభాతోల్లాస మెంత యొప్పు
నెవరి చరణద్వయాన నర్పింతు దీని.
తే. శ్రవణముల భవ్యవరదాన సరణి తోచి
"ఉంటి నే” నను ప్రతిశబ్ద మొప్పి చేరె
“నిత్య సురవర్త్మ సంగీతనిచయ మందు
లీనమౌ నటుం" దనె, “ఉందు" నేను నంటి.
తే. సకలమును మధురవికాస సహిత మైన
యెట్టి శక్తి సంకేతమ్ముని ట్లొనర్చు
నేను జీవనలాలస యెందు కింత
తీక్షణ విలాసమయముగాఁ దేజరిల్లు?
తే. "ప్రభువ! అయిన నే నింకను బ్రతుకవలెనె?
బ్రత్రికి యే నేమి సేయఁగావలయు నయ్య?
ఈ యమరవేదనము తోడ నెంతకాల
మిట్లు బ్రతికి యెపుడు మరణింపవలయు?
తే. పవనచాలిత మగు మాయపటము వోలెం
దొలఁగినది యొక్క ప్రతిసీర - ప్రళయకాల
ముద్రిత సుమహావరణవిముక్త యగుచుఁ
బ్రకృతి నవవర్ణశోభలఁ బరిఢవిల్లు. 25
తే. అమల చాంపేయ శాలిధాన్యంపు రాసు
లివె సుదూరమ్ము వరకు వ్యాపించియుండె
అమృతశరదిందిరా మనోజ్ఞాలయమున
కమరఁ గూర్చిన బాటయో యనఁగ నొప్పి.
తే. విశ్వకల్పన పోలిక శశ్వ దున్న
తమ్ముగా నొప్పు శీతభూధరము అద్ది
పృథ్వి కాలంబనము - సుఖప్రీతిదమ్ము,
సకల మణిరత్న సముదయ జన్మభూమి.
తే. అచల హిమవదాహార్య శోభాత్త వల్ల
రీ కలిత శుచిసాను శరీర మొప్పు
నొక సుఖస్వప్నమున నిద్ర నున్నతరిని
నొలసి రోమాంచ కంపన మ్మొందినట్లు.
తే. శస్త హిమనగ పాదదేశమ్ము నందు
నీరవత్వామల విభూతి నిండి పొంగు
అచట నిరయిరిణీ ప్రవాహమ్ము లిప్పు
డర్థి వెదజల్లు నవజీవనానుభూతి.
తే. అమల నిస్సీమ నీలాంబరాంచలమున
నెవరి మృదుహాసమో చూచి హిమనగంపు
మందహాసము కలగాన మహిమ మెరయ
బయలు వెడలెనొ యన నవి వరలఁదొడంగె. 30
తే. అట శిలాసంధులను మహితానిలమ్ము
తాకి గుంజారవమ్ములఁ దమిని నింపె
పరమదుర్భేద్య మైన యా పర్వతంపు
ద్రడిమఁ గీర్తించు మాగధప్రవరు నట్లు.
తే. మహిత సంధ్యాసమయ మేఘమాల లనెడి
సుందరానేకవర్ణ సంశోభి వస్త్ర
ములను గప్పి, మంచుమకుటముల ధరించి
గగనచుంబి శైలశ్రేణి గానుపించు.
తే. ఆ విభవ పరిపూర్ణ మహాద్రిపంక్తు
లమర విశ్వమౌనంపు మహత్వగౌర
వములకును బ్రతినిధుల ట్లపార విశ్వ
సవిధమున మూకతను సభసల్పై ననఁగ.
తే. నిలిచి వ్యోమమహానంతనీలిమమ్ము
జడతవలె నుండె నపుడు ప్రశాంతముగను
దూర దూరాన నున్నతిఁ దోఁచి తన య
భావమునకు విభ్రాంతిని బడయు నభము.
తే. రమ్య శీతాద్రి ఘనశిఖరమ్ము లప్పు
డొప్పి విశ్వమనోజ్ఞ మహోర్మికలుగ
వ్యోమమునకు జగత్సుఖోల్లసనమను సు
హాసములఁ జూపుచున్నట్టు లంత దోఁచె. 35
తే. శశ్వదమల మగు గగనోత్సంగ మటుల
నచట నున్నట్టి యొక కందరాంతరమున
సుందరస్వచ్ఛ వరణీయ శుచిమహితము
ను నగు నెలవును గల్పించుకొనియె మనువు.
తే. సవిధమున మిన్కు తొలుతటి సంచితాగ్ని
కలుషిత జ్యోతి యగు రవికరము వోలె
చెలఁగి యది జాగరణశక్తిచిహ్న మటుల
లీల నవ్వేళ మరల జ్వలింపసాగె.
తే. ఆరడమున జ్వలించె నిరంతరమ్ము
నతని నవ్యాగ్ని యుదధితీరాత్త భూమి
చిత్తధీరతను మనువు జీవనమును
సర్వ మర్పించే ఘనతపశ్చర్యయందు.
తే. జాగృతమ్మయ్యె దేవతాసంస్కృతియును
స్వర్గజనయజ్ఞ వరమాయ సంతరించి
కర్మమయ మహాహీన ప్రగాఢతుహిన
శీతలచ్ఛాయ లతనిపైఁ జేర్చె మరల.
తే. క్షితిజ మధ్యోద యార్కరోచిస్సు వోలె
స్వస్థుఁడైన మనువు లేచి, శాంతమును మ
నోహర మ్మగు ప్రకృతివినూత్న లక్ష్మి
నింపయిన లుబ్దవీక్ష వీక్షింపసాగె. 40
తే. పాకయజ్ఞ మ్మొనర్చు సద్భావ మొంది
శాలిధాన్యమ్ము సమకూర్చసాగె నతఁడు
పావకజ్వాల నిజధూమపటము నపుడు
నేర్పు మెరయంగఁ బ్రీతిమై నేయసాగె.
తే. శుష్క తరుశాఖలను జేర్పఁ జొక్కి యెగసె
కృష్ణవర్మని యుత్థానకీల లపుడు
కడిఁది యాహుతి నవధూమగంధములకు
మించి నభముఁ గాననము సమృద్ధి నొందె.
తే. "మేము మిగిలిన యట్టులే మిగిలి యెవ్వ
లేని జీవనలీల రచించుచున్న
నిందు నాశ్చర్య మొక్కింతయేని కలదె?
ఇటు మనోవీథి మనువు యోజించి యంత.
తే. అగ్నిహో త్రావశిష్టాన్నమందుఁ గొంత
నిచ్చమెయి దూరమున నుంచి వచ్చుచుండె
అప్పు డపరిచితవ్యక్తి యట్టి క్రియను
దృష్తిఁగను నని తలంచి సుఖించుచుండె.
తే. అపుఁడు దుఃఖ గభీర పాఠాళిఁ జదివి
సానుభూతిని దెలిసికోసాగె నతడు
నీరవత్వంపులోతుల నిలిపి మనసు
నొంటి నాతఁడు మగ్నుఁ డౌ చుండె వలంచి. 45
తే. అచట నుపవిష్ణుఁడై జ్వలితాగ్ని యెదుట
మననమున మున్గియున్నాఁడు మనువు - అప్పు
డాకు రాలెడి కాలాన నాతఁ డొప్పె
తపమె యటు సజీవపుమూర్తిఁ దాల్చినటుల.
తే. అయినఁ జెలరేగుచునే యుండె నతని యెడదఁ
బాయకను నవ్యచింతయు స్పందనమ్ము
దీనముగ నస్థిరమ్ముగా దినదినమ్ముఁ
గడిదియై యాతని బ్రతుకు గడవసాగె.
తే. అంధకారంపు మాయ నిత్యమ్ము నతని
కెన్నియో ప్రశ్నలెదనుదయింపఁజేసె
ఆ విరాట్పురుషుని ఛాయయందు మారె
క్షణము క్షణము ప్రశ్నల వర్ణసముదయమ్ము.
తే. తోఁచె సాము తెలిసిన ప్రత్యుత్తరములు-
అఖిలప్రకృతి సకర్మక మ్మయ్యె నపుడు
జీవనము నిల్పుకొన నిజాస్తిత్వ మొగిని
కృషియొనర్చుట మగ్నమై కెరలె నంత.
తే. నిత్యము మనువు తపమున నిరతుఁడయ్యె
సలుప నిజనియమితకర్మ శ్రద్ధతోడఁ
గర్మజాలంపు సూత్రాళి ఘనతరముగ
విశ్వరంగ మెల్లెడల వ్యాపింపసాగె. 50
తే. దీర్ఘ కల్లోల వారాశి వీర భూమిఁ
దరఁగ లతిశాంతముగ వచ్చి తాకినటుల
నట్టి విధిశాసనమ్మునే యను సరించి
యల్లనల్లన వివశుఁడై యతఁడు నడిచె.
తే. విజన విష్టప తంద్రీ సువిలసనమున
శూన్యమౌస్వప్న మొండు విస్ఫూర్తిఁ బరగె
గ్రహపథాలోక వృత్తానఁ గాల మపుడు
విపుల మగు తన వాగుర న్విసరుచుండె.
తే. రాగరాహిత్య పూర్ణ తాలాయ సృష్టి
రహిత ఫల నవీన మగు నారంభ మటుల
నెట్టి సందేశమును లేక యేగుచుండె
జాములు, పవళ్ళు, రాత్రులు చక్రగతిని.
తే. స్వచ్ఛ మోహన చంద్రబింబమ్ము తోడ
సోత్సుకతఁ గూడె సుందర శుభ్ర రజని
శీతపవనము పులకిత స్నిగ్ధ మగుచుఁ
గెరలి పాడెను భావనోద్గీథ యపుడు.
తే. ఉర్విఁ గలుషితాధీర మహోర్మికలును
వ్యాప్తినొందె సుదూరమ్ము వరకు జలధి
విస్తరించిన దటులె గభీరముగను
జంద్రికారుచి యంతరిక్షమ్ము నందు. 55
తే. అట్టి రమణీయ దృశ్యము నందె యలస
చేతనత్వంపు నేత్రాళి చెందె విప్పు
ప్రౌఢమానస సుమమధు ప్లావితములు.
స్నిగ్ధదళములు తమి వికసించి యొప్పె.
తే. వ్యక్త గగనంపు చంచల భాస్వరతలు
సుఖకరమ్ముగ స్పృశియించు చుండె నపుడు
ఎరుకపడుచుండెఁ బ్రబల మతీంద్రియమ్ము
స్వప్నలోక మధుర రహస్యం బొకండు.
తే. పొలసి స్వాభావిక మధు బుభుక్షవోలె
నాది వ్యసనమ్ము జాగృతంబయ్యె - నపుడు
వలచి కోరె మనువు చిరపరిచితముగ
మధురమౌ ద్వంద్వసుఖ మనుమానమునను.
తే. దినము రాత్రియు నొప్పె నా రవివరుణుల
పుత్రి కాక్షయ శృంగార పూర్ణతలుగ
జీవిత తరంగి తోదధి జీవనముల
కవలిమేరనునవ్య సమాగమమ్ము.
తే. తృషితమును వ్యాకుల మయ్యె దీర్ఘతపసు
సంయమమున సంచిత మహాశక్తి యిప్పు
డపరిమేయంపు శూన్యరాజ్యానఁ జేసె
నస్థిరమ్మైన తమ మట్టహాస మెనసి. 60
తే. ప్రౌఢపవన సంస్పర్శచే శ్రాంతవపువు
పులకిత మ్మయి వికలతాకలిత మయ్యె
చిక్కువడిన ఆశాసతీ చికురపాళిఁ
జంచల సుగంధవీచి నర్తించసాగె.
తే. దీర్ఘ సంవేద నేచ్ఛతో దెబ్బతిన్న
మను మనోవీథి వికలత మల్లడిల్లె
చటుల సంవేదనము జీవజగము నెల్ల
విపుల బాధారతి నలిపివేయఁగలది.
తే. ఎంత మధురమ్ముగా నొహో! యెసఁగ మెసఁగు
నవ్య సుందర మీ కల్పనాజగమ్ము
ఛాయలో సుఖస్వప్న సంచయము పులక
రింత మేల్కొను, నిదురించు - లేక యలవు.
తే. ప్రేమసంప్రాప్తికిని మనోభీష్టమునకు
ఘర్షణమె లేక యున్నచోఁ గడఁగి, యేల
యెవ డభావాసఫలతల హేమగాథ
వ్యర్థగతులఁ బ్రలాపమ్ము లాచరించు.
తే. చెప్పు మొంటిగ నెన్నాళ్ళు జీవితంబ!
యిటుల గడువంగ వలయునో యేను - తెలుపు
మీ కథ యెవరి కే వినిపింపవలయు?
అనకు మీ విధిఁ దెల్పుట వ్యర్థమనకు. 65
తే. కాంతికిరణ రంజిత తారకామతల్లి!
చారు తిమిరసుందర రహస్యమ్మ! ఓసి!!
విమల శీతలత వ్యధిత విశ్వమునకు
నవ్యగుణబిందు వౌచు నున్నావు నీవు.
అమిత సంతప్త జీవన హర్షదాయి
శాంతి సహిత ఛాయాప్రదేశమ్మ! ఇప్పు
డగణిత మనోజ్ఞరూపాళి నమరి యెంత
స్వాదు మంజు సందేశ మొసంగె దీవు.
తే. రమ్యతమ మౌనము వహింప నెచటనీవు
నిట్టి చతురిమ మెలమి నార్జించినావు
ఓసి, యింద్రజాలజనని! ఉజ్వలనిశి
నింత మధురవు నీ వైతి వెందు కిటుల?
నీ
తే. తారకాదీపముల నబ్ధితటము కడకు
దీప్తి మలిసంజ యేతేర దివ్యరజని!
దాని చాంపేయవర్ణ వస్త్రమ్ము చించి
తివిరి నవ్వెదవేల ప్రతీపముగను?
తే. అంధకారాన నశ్రుకణాళిఁ గలిపి
చతురత ననంతకాల శాసనపు స్వైర
చరితమును వ్రాయువేళను శక్తి మెరయ
నిటుల నాకస్మికముగ హసించు వేల? 70
తే.
విమల రజనీమతల్లికా! విశ్వకమల
మృదుల మధుకరివి సొగయ నెచటనుండి
వచ్చి మంత్రమ్ము పఠియించి ప్రాణికోటిఁ
బ్రీతిఁ జుంబించి పోయెదవే లతాంగి!
తే. ఎక్కిళుల వలె నిట్టూర్పు లే దిగంత
రేఖకడ మెల్లగా సంతరించి యిటుల
గాలిరొద యను మిష సువేగాన రొప్పు
చెవరి జేరంగ నీ విపు డేగె దతివ!
బహుళహాసమ్ము వెదజల్లవలదు మరలఁ గ్రమ్ము హిమకణ ఫేన తరంగ పాళి నమల తిమిరము - లక్షణ మట్టి వ్యాప్తి. తే. ముగుద! ఎవ్వనిఁ గని మేలిముసుఁగు నెత్తి చిరుతనవ్వుల నాగుచు మరల నడతు విజనగగనాన మరచిన విధము తోప స్మృతిపథమ్మున కెవ్వనిఁ దెచ్చికొందు? తే. రజతపుష్ప నవీన పరాగమటుల చంద్రికాధూళికల వెదజల్ల వలదు ఓసి యున్మాదినీ! యిటు లుజ్వలింప మధుర కౌముది నీను నీవె మరువఁగలవు. తే. జారె నిదె, చూడు నీదు వస్త్రాంచలమ్ము దాని సవరించుకొనుము - చైతన్యహీన! రాలె నందుండి ఫణమణిరాజి దాని ప్రోవుసేయు మున్మాదినీభావ ముడిగి. తే. నవ్యయౌవన మధుమదోన్మత్త! రజని!! చినిగిఁపోయెనా యేమి నీ స్నిగ్ధనీల లులితవసనమో ముగ్ధ! నీ రుచినిఁ గని య కించన జగ మ్మిదిగో, సంతసించుచుండె!! తే. వరలు నా యతు లానంత వైభవాన - ప్రౌఢవైరాగ్య మేల యుత్పన్నమయ్యే? లేక మరచినదాన వై లీల వెదకె దబల! జీవిత వక్షః కిణాంకములను. 35 75 500
వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. ఏను నిపు డెది మరచినాను స్మృతికి €. రాదు, ప్రేమయో, వేదనా, భ్రాంతి యౌనె? ఎద్ది మరి? కాక సుఖముగా నెందు నిదుర మలఁగి నా మది యద్ధాని మరచినది! ఎచట నేని నీ కదియు యాదృచ్ఛికముగ గోచరించిన నదియుఁ బోఁగొట్టవలదు భాగ మద్దాన నీకు నేఁ బంచియిత్తు మరువకుము దాని నేనియు మగువ! నీవు. 80 ఆంధ్ర కామాయని 501 శ్రద్ధ (ఆహ్లాదము) తే. "ఎవ్వరవు నీవు సంసృత్య హీనజలధి తీరమున నూర్మి విసరిన దివ్యమణివి? మౌనఫణితి నీ విజన మనూనరమ్య క్రాంతి నభిషిక్త మొనరింతు కడఁగి నీవు? తే. మధుర విశ్రాంతి వేకాంతమవును, ఘన బ హిర్గత జగతీ సురహస్య మీవు నీవు నవ్య కరుణా మనోజ్ఞ మౌనమవు నీ వ య్యమల చంచల మధుర మనో లసతవు.
తే. సారస మ్మటు, కవితొలి ఛంద మటుల షట్పదీరుతిఁ బోలు నా స్వనము నపుడు పంచుకొనియున్న మోముతో మించి మనువు మహితగతి వినె సంతోష మంజులముగ తే. అప్పు డొక యూపు కలుగఁగా నతఁడు చూడ సాగె నాకర్షితుని వోలె నాగ కటులె “ఇట్టి రమణీయ సంగీత మెన రొనర్తు” రన్న కుతుకము మౌనమ్ము నందఁగలదె! తే. చారుతర మగు నయనేంద్రజాల మటుల నమరు నా మంజుదృశ్యమ్ము నతఁడు చూచె అద్ది సుమశోభిలతికను నమల చంద్రి కా పరీరంభ నీల మేఘమ్ము వోలె. 502 10 5 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. నవ్యసౌరభ మధుపవనమ్ము తోడఁ జెలఁగి క్రీడించు నొక సాలశిశువు వోలె దీర్ఘ మున్ముక్తమును మహోదీర్ణము నయి బాహ్యరూపమ్ము హృదయమ్ము వలెనె యుండె. తే. నీల రోమావళీ రుచి నిస్తులములు రమ్య గాంధార - మేష చర్మములతో డ గప్పె నా వ్యక్తి కమనీయ కాంత వపువు అవ్వి దాని కావరణములై చెలంగె. తే. రమ్య జలదవనాన గులాబిరంగు గలిగి విరిసిన హ్రాదినీకళిక వోలె నా వినీలంపుఁ బరిధానమందు లలిత గతిని సగమది విచ్చి యంగమ్ము తోఁచె. తే. అహహ! ఆ ముఖసౌందర్య మరియఁ దోఁచుఁ బశ్చిమ వ్యోమమధ్యాన బరమనీల మేఘములు గప్ప భేదించి మిత్రమండ లమ్ము ఛవిధామ మటులఁ జెలంగు ననఁగ. తే. కాక లఘ్వగ్నినగ నవగాఢనీల శృంగకము విచ్చి మాధవ స్నిగ్ధరజని గదల కెవ్వేళ నిల్చి ప్రకాశయుక్తి మెరయుచున్నదో యన నది మించి తోఁచు.
తే. అంసమున నల ల్దిరిగి వ్రేలాడుచున్న శుభ్రకేశాళి ముఖచంద్రుఁ జుట్టుకొనఁగ శ్యామ ఘనశాబకమ్ములు శశినిఁ జేరి యమృతమును గ్రోల వచ్చెనో యనఁగ నొప్పె. తే. ఆ మొగమునను జిరునగ వద్భుతమ్ము! మిత్రు నసుకిరణము విశ్రమించి యొక్క ఆంధ్ర కామాయని 10 503 రక్త కిసలయమున నభిరామముగను నలసతను బొందెనో యన వద్ది యొప్పె. తే. నిత్య యౌవనచ్ఛవిని నిర్ణద్రమగుచు విశ్వ కరుణా సుకామనా విమలమూర్తి భూరి సంస్పర్శ కర్షణాపూరితమ్ము జడమునను స్ఫూర్తిఁ గల్గింపఁ జాలు నద్ది. తే. ఉదయతారకారుచి యను నొడిని విడిచి వెట్టి సిగ్గున మత్తిల్లి వెడలినట్టి యుషసి తొలి సుకాంతకిరణ ముజ్జ్వల మధు రతను, నార్ధమోదానఁ బూర్జ మగు నద్ది. తే. అద్ది కుసుమ కావనఖండ మందు మంద పవన చాలిత సౌరభప్రవర మొలసి యరుణరాగయుతము మరందార్ధ మగుచు రూపుధరియించెనో యన నోపియుండె. తే. సురభిసమయరాకా నవజోత్స్న పడిన యట్టు లొప్పె నా మధు మందహాస మపుడు దాని మదవిహ్వల మ్మైన తరుణకాంతి పుష్పరస సార్ధ గంధోర్మి వోలెఁ దోఁచె. 44 తే. "వసుధగగనాల మధ్య జీవనము కనఁగ తే. నతిరహస్యము నిరుపాయ మయ్యె-తిరుగు చుంటి మండెడి యుల్కనై శూన్యమందుఁ తో డెరుంగక" యని మను వాడినాఁడు. “ఎటుల దీన నగము ప్రవహింఁపఁజేయ లేదొ సెలయేటి, నెటు చేరలేదొ-కరగ నట్టి హిమము నిర్ణయిరరూప మంది కడలి యొడిని, అటులె, పాషండుఁడ, నుంటి నేను”.
15 504 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. ఎసఁగు జిక్కుల బ్రతుకు ప్రహేళికగను దాని విడదీయ నెపుడ యత్నమ్ము సలుప నించుకయు - నర్థ మేమియు నెరుకపడదు విడిచి యూహలఁ గాలమ్ముఁ గడుపుచుంటి.
తే. "తమి నెసంగిన యా యతీతమును రేలుఁ బవలు మరచిపోవఁగ యత్నపడుచు నుంటి దీన జీవితసంగీత మైన యద్ది తిమిరగర్భాన నొదిగి దూరమగుచుండె. తే. ఏమి చెప్పను, నే లక్ష్యహీనుఁడను వి నీల గగనావకాశాన నేను దారి చెదరిన పవనోర్మి యటుల శిథిల విధుర శూన్య రాజ్యమ్ముగ వసించుచుంటి నిపుడు. తే. ఒక యచేతన స్తూపమ్ము నొక్క స్మృతికి ఒక్క సుషమకు మాసిన ద్యుతిని నేను రమ్యజడతకు జీవనరాసి నగుదు కడు సఫలతకు నే మోసకారి నిపుడు. తే. ఎవ్వరవు? ఘోరగ్రీష్మన ని వ్విధాన తోఁచెదవు మృదువాసంతదూత వోలె, నంధతమసాన హ్రాదిని యటుల తపన యందు శీత సురభిళ మందానిలముగ. తే. తారకాశాకిరణ తుల్యతను జెలంగి కవి మృదుల మానసమునకుఁ గాంతకల్ప నంపు దివ్య లఘు లహరి నాఁగ నాదు చిత్తవైక్లబ్యము శమింపఁజేతు నీవు.”
ఆంధ్ర కామాయని 20 505 తే. కోకిలా దేవి హర్షానఁ గుసుమమునకు వచ్చి మధుమయసం దేశ మిచ్చినటులఁ గడఁగి సవిశేషమగు సముత్కంఠ నడిపి పల్కసాగె నాగంతుకవ్యక్తి యంత.
తే. "తండ్రి కతిప్రియమైన సంతాన మేను ఇచట, గంధర్వభూమి, వసించి భవ్య లలితకళ లందు జ్ఞాన మార్జనమొనర్ప హృది నవోత్సాహ నిబిడమై యెసఁగుచుండె తే. ముక్త గగనాన జరియించు రక్తి బలిసి నిత్య మభ్యాస మౌటను నెఱిఁ జెలంగె వ్యస్తహృదయము బహుకుతూహలము మెరయ విమలరమ్య సత్సత్యము న్వెదకుచుండె. తే. అహహ! దృష్టి హిమగిరిపై కరిగినంత నధిక భీరుతఁ బ్రశ్నించు నాత్మ యిట్లు “వసుమతీలక్ష్మి కీ భీతివళి ఇ దేమి? పృథ్వి కిట సంభవించిన పీడ యేమి?" తే. తనరి మౌనాన నాత్మసౌందర్యమునకు దివ్యమగు మహాసుప్తసందేశ మొకటి సజగ మౌచు సంకేతమ్ము సలుపఁ గడఁగె- తా హఠమొనర్చె ముగ్ధచైతన్య మపుడు. మరులుగొని ముందునకు సాగె మానసమ్ము పాదములు దాని వెనువెంటఁ బరఁగె కంటి యాకలియె తీరె కామనగాళిఁ గనఁగ తే. వింత రమణీయసంభార మిద్ది, యహహ! తే. ఒక్క దినమున దరిలేని యుదధి రేగి క్షుబ్దమై డీకొనఁగ సాగె క్షోణిధరము 506 25 30 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 నొంటి నిరుపాయజీవితం బొలయ నిట్లు నేఁ దిరుగుచుంటి మౌనాన నేటివరకు. తే. కంటి నొక కొంత బల్యన్న కబళ మిచట- "ఎవ్వరిది భూతహితరక్తి నిడిరి - ఎవరొ యుజ్జగిలి తా సజీవుఁడై యుండె నేఁటి తే. కిచట" ననునూహ జనియించె నెడఁదయందు. "ఓ తపస్వి! ఇంతగ వాడియుంటి వేల? ఏమి, యీ వేదనావేగ మేల నీకు? అయ్యొ! ఎంత హతాశుఁడ వైతివయ్య! తెలియఁబల్కు మి దెట్టి యుద్వేగమౌనా!! తే. అయ్యొ! నిశ్శేషము నధీర మైన మధుర లాలసయె లేదె హృదయాంతరాన? ఏమి రమ్యవేషమును గొని వైరాగ్య మిటుల నిన్ను వంచించు నేర్పుల నెగడు నేమొ! తే. చటుల దుఃఖభయమ్ము నజ్ఞాత జటిల తల నెడంద నూహించి సంతతము నిటుల నపరిచితుఁడ వై నీ భవిష్యమ్ముఁ గూర్చి కర్మరంగాన విముఖతం గాంచ నేల? తే. జాగృతమ్మయి వ్యక్తమై సంతసించుఁ దనదు లీలకుఁ బరమచైతన్య మెపుడు కమ్ర విశ్వాభిరామవికాస మద్ది సర్వు లనురక్తులగుదు రా సర్గ మన్న. తే. సృష్టి కళ్యాణకర్మచే నెసఁగు - శ్రేయ మిచ్చు పరిణామ మగు నెపు డిచ్ఛ కద్ది భ్రమకు లోనయి కాదని వదలి దాని నిహము నసఫల మొనరింతు వేల, నీవు ?"
ఆంధ్ర కామాయని 35 507 తే. దుఃఖపూరిత గతరాత్రిఁ దోఁచె సౌఖ్య నూతనోదయము రుచిరానూనముగను జిలుగు నీలపటమ్ముగాఁ జెలఁగె నద్ది దాన సుఖశరీర మొగిని దాగియుండె. తే. ఎద్ది యభిశాప మంచు నూహింతు వీవు విశ్వ కష్టమూల మని భావింతు దేని నద్ది యీశు గుప్తవరమె యౌను దీని నీవు మరువఁబోకు మెడంద నెన్నఁడేని తే. వ్యాకులమయి విప్పడ వలన నిటుల స్పందనముఁ జెందు ని మ్మహాజగము - కడఁగు నిట్టి సుఖదుఃఖమే వికాసంపు సత్య మగు - మహేశు నమృతదాన మరయు నిద్ది. తే. నిత్యసుఖ మెపుడుఁ బ్రభుత నెరపుచున్నఁ గళవళము నొందు జలనిధి గతిగ నద్ది వ్యథవలన నీలవీచి కావళుల నడుమ కాంతి విరజిమ్ము సుఖమణిగణము చెదరు
తే. మనువు సవిషాదుఁడై యిటు లనఁగసాగె "మానసమున నీ యుచ్ఛ్వాస మంజులతలు రమ్య సువిలాసతలతో నిరంతరమ్ము నొదవఁజేయు నుత్సాహ మహోర్మికలను. తే. కాని నిరుపాయమైన దీ గడ్డు బ్రతుకు, ఇందు సందేహ మిసుమంత యేని లేదు పరిణతిగ నా నిరాశను బడయు నద్ది పరగు సఫలతా కల్పిత వపువు వోలె". తే. అప్పు డా వ్యక్తి మైత్రితో ననియె "ఎంత ధీరతను వీడినా వొ! వీరు లెందుఁ 508 40 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. జచ్చి యేనియుఁ జేకొండ్రొ జయము నట్టి బ్రతుకు పణమున నోటమి వడసినావు. తపము కాదు జీవనమే సత్యమ్ము కనఁగ క్షణిక దీనావసాదమ్ము కరము జాలి నొదవఁగాఁ జేయు నాశాప్రమదము తరళ కాంక్షతో నిండియున్నది గాఢనిద్ర. తే. ప్రకృతి వనితకు వాడిన ప్రసవములను చెలఁగి సింగార మెవ్వరుఁ జేయ రెపుడు వీడ సౌరభ, మందముల్ వాడిపోవ త్వరితగతి ధూళిఁ గలసిపోవలయు నవ్వి. తే. క్షణము సహియింప నోపఁగాఁ గలదె ప్రకృతి యీ పురాతన నిర్మోకమెన్నఁడేని వలచి పరివర్తనము, అందు నిలిచియున్న దనవరత నవతా మహాహ్లాదనమున. తే. యుగము లనియెడి పృథుల గండోపలముల నవ్య గంభీరముగ సృష్టి నడచిపోవు అమర గంధర్వ దై తేయ సముదయములు వ్యాకులతలతో వెనువెంట నరుగుచుంద్రు.
తే. ఒక్కఁడవు నీవు - సువిశాల ముర్వి నైజము నిఖిల వైభవసంపత్తి నిండియుండె కర్మభోగము, భోగంపు కర్మ-ఇదియె యమలిన జడతాచేతనాహ్లాదనమ్ము. తే. యజన మసహాయతను నొంటి నాచరింపఁ గలవె? ఆ యూహ నర్థమ్ము గలదె? ఎచట నాత్మ కర్షణరహితమౌ నచటఁ జేయఁ జాలుదే యెట్టిక్రియను విస్తారముగను ఆంధ్ర కామాయని 45 50 509 తే. అణఁగిపోయెను నీ భార మందు ఎచట నూఁత కన్వేషణము సేయ నొప్పిదముగ ఏను సహచరినై నీకుఁ బూని ఋణ వి ముక్త నౌదును పూర్ణసముత్సుకతను. తే. సేవకౌ నా సమర్పణ స్వీకరింపు మగును జుక్కాని యది నీ భవాబ్ధి యందు స్వార్థమును వీడి నీ పదసరసిజముల నేఁటినుండి జీవితము నంకితమొనర్తు. తే. మాయను, దయను, మమతను, మధురిమమును, గాఢవిశ్వాసమును నేఁడు గైకొను - మివె వివృతములు నా మనోరత్న విమల నిధులు నీ సమీపాన ననుభోగ్య నిచయములుగ . తే. సృష్టిమూల రహస్యమ్ము వీవు కమ్ము, వ్యాప్తి నొందు నా వల్లి నీ వలన నింక కుసుమ సౌరభ మీ విశ్వగోళ మందు నిండు రమ్య పుష్పక్రీడ నెగడు మయ్య !
తే. అబ్జయోని శుభ వరదా నార్ధ వచను శ్రవణముల సోకలేదె - నీరంధ్ర మద్ది "శక్తియుతుఁడవు కైకొమ్ము జయము నీవు" ఇట్టి జయగీతి మార్మోగు నీ జగాన. తే. "ఓ అమృతసంతతీ! భయ మొప్పరింపు మున్నయది వృద్ధి యెదుట శుభోజ్వలముగ కెరలు కర్షణ జీవనకేంద్ర మెలమి స్నిగ్ధ సర్వసమృద్ధి కర్షింపబడును. తే. స్వర్గజనుల యసఫలతా ధ్వంసనమ్ము కడఁగి ప్రోవిడి ప్రచురోపకరణములను 510 55 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 మానవశ్రీ గతినిఁ బడి మసలు చుండె మతి సుచైతన్యరాజ్యమ్ము మల్లడిలుత ! తే. అమల చేతనారుచి రేతిహాసరచన యఖిల మానవ భావసత్యమ్ము అద్ది విశ్వ మహనీయ మానసవీథు లందు సంకిత మ్మగు గాక దివ్యాక్షరములు. తే. అబ్ధులు జలాలఁ బూర్ణమ్ము లయ్యెనేని, గ్రహములకు విరుద్ధగతులు గల్గెనేని యనలనగములు చూర్ణితా లయ్యెనేని సఫలతను జెందుఁగావుత స్రష్టసృష్టి. తే. అగ్నికణముల వలె మానవాళియశము గర్వహర్షాల జ్వలియించు కాల మగుత! జల మహానిల వసుమతీ సముదయముల వాని నధిగమించుచు నద్ది వరలుగాత! తే. పొర్లి కడలి పల్మారు లుప్పొంగ నిమ్ము, ద్వీప కూర్మాల మునుఁగుఁచు దేలనిమ్ము వెదకుచు నుపాయసంహతి వృద్ధిఁగోరు మానవుని శక్తి దృఢరీతి మనెఁడు గాత! తే. పరిణ మించుత విశ్వదౌర్భల్య మమిత బలముగా-దాని సవిలాసఫణితి నపజ యంపు వ్యాపార మిఁక హసియింపఁజేయుఁ గాత! శక్తికి సుఖగతి కలుగుఁగాత!! తే. వ్యస్తము, వికలమును, నిరుపాయము నయి, చెదరినట్టి శక్తి చపలా శీర్ణ వికల కణములకు సమన్వయ మొగిఁ గలుగుఁగాత! మానవత నిత్యము విజయమహిత మగుత" !! 60 63 ఆంధ్ర కామాయని 511 కామము (అనురాగము) తే. "జీవనోద్యాన మధుమయ స్నిగ్ధసురభి ! అంతరిక్షపు టలలఁ బ్రయాణ మొనర సల్పి శార్వరిలో ఁదుదిజాము నందు వచ్చి తెవ్వేళ నిటకు సవ్వడియె లేక. తే. ఈవు వచ్చుటఁ జూచెనా యేమి పల్కుఁ క్రొత్తలుగ నిప్పు డున్మాది కోకిలమ్ము? నీరవత్వాన నలసతం గూరి ముగ్ధ ముకుళములు ప్రీతిఁ దమ నేత్రములను దెరిచె. తే. తమినిఁ గ్రీడగ ముకుళాన దాఁగు టీవు చేరి నేర్పెడి వేళలో శిథిలసురభి వలనఁ గల్గదె మసృణంపు బటల మవని? అగును గాదా? నిజ మ్మెదో యనుము నీవు. తే. పుష్పవసనాంచలమ్ములఁ బొలుపు మెరయ నీవు సరసహాసమును లిఖించు వేళం కొండయేరుల జలజల గొంతుకలతొ నీవు మధురకంఠమ్ము జోడించినపుడు. తే. ఎంత నిశ్చింత, యుల్లాస మెంత యున్న వహహ! పిక కాకలీస్వన మందు-బలిసి తే. 512 జీవన దిగంత గగనానఁజెలఁగి మారు మ్రోగుచున్నది నవనవామోద మపుడు. చెలఁగి చాంచల్యమున నాఁడు చిత్రకార శిశువు చిత్రించె నత్యాశ స్నిగ్ధరుచుల మంజు జీవన నేత్రాళి మసకకాంతి యుత మగు లిపి మనోజ్ఞమై యొదవఁజేసె OT 5 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. తాల్చి మేలిముసుంగు లతాలతాంగి తే. దృష్టులను దెలిపాల పూఁదేనెఁ గురియ మనుసుముంగిలి యా రసమునను నిండు- దానికడ విశ్వవిభవ మంతయును లొజ్జు. ఆ సుమమ్ములఁ జిరునవ్వు లమరియుండె వెడలె నిట్టూర్పులను దాని వెల్లువలుగ ఆ కలవరము, గానమ్ము నమిత మధుర కమ్ర కోలాహల మపు డేకాంత మయ్యె. తే. చిత్తమున నున్న మాటలఁ జెప్పు వేళ నాశ విడినట్టి నిశ్వాస మాచరించి యెదియె యోజించెను మనువు - ఏమి యైన నతని వాంఛాప్రగతి యపు డాగలేదు.
తే. "విశ్వనీలావరణమా! ప్రవృత్తిఁ గొన్న నీవె దుర్బోధమవు గావు కేవలమ్ము కాంతిఁ బూర్జమ్ము లగు వస్తుగణము లేని నయనయుగళికి నవకుంఠనమ్ము లగును. తే. వరుణ శోఖాత్త చలచక్రవర ! శశాంక ! చేతు వేల కలఁతఁ బ్రదక్షిణము నిట్లు? చల్లఁబడినవి తారాప్రసవము లిచట నతుల భవదసఫలతలో యన్నయట్లు. తే. మత్తుఁగొని యూగుచున్నవి మంజునీల కుంజములు - ఆగిపోలేదు కుసుమచరిత నభము క్రిక్కిరిసినది గంధమ్ముతోడ హిమకణాలె మరందమై యెసఁగుచుండె. తే. రమ్యతగను ఏ యిందీవరమ్ము నుండి సురభియుత మధుధార వాగురను బన్ను ఆంధ్ర కామాయని 10 513 తే. నద్ది మానసషట్పది కమర నయ్యెఁ బ్రణయ మోహినీ మధుర కారాగృహమ్ము. అణువులకు నెట శ్రాంతి లభ్యమగు! నివ్వి యెంత కర్మవేగాన గమించుచుండె !! ఉల్లసనము సజీవమై యొప్పు మెరయు ! నృత్యచాలన రుచిరమై నెగడుచుండు!! తే. నృత్య సంకీర్ణ నిశ్వాస నిచయమాయ యెంత మోహమయమ్ముగా నెసఁగ మెసఁగు దాన వెడలి సమీర మనూనమంద సూక్ష్మతలఁ బ్రాణులకు శాంతిఁ జొప్పరించు. తే. రమ్యకాంతి నాకాశరంధ్రములు నిండె ఇదియే సృష్టి గభీరమై యెసఁగుచుండె స్పృహను వీడి కాంతితతి నిద్రించుచుండె ఈ క్షణమ్మును నలసి రోదించుచుండె. తే. తే. ఈ మనోహర చంచలకృతులు నాట్య హసనముల నొప్పు నిండి రహస్యములను వానిపై వ్రాలు నా నేత్రపాళి, నవ్వి ముందునకు సాగి, పయనమ్ము నొందనీవు. ఏను గనుచున్నయది ఛాయయేన? అద్ది చిక్కుమాత్రమె యౌన? విశేషమైన యన్యధనమెద్దియేని నీ యందమైన యవని కాంతర మందున నమరియున్నె? తే. ఎవర వక్షయనిధి, ఓసి, యెవర వీవు నేను గుర్తింపఁ జాలనా నిన్నుఁ గడఁగి ప్రాణసూత్రాల చిక్కు విప్పంగ నాకు సహకరించెడి యొక మహాసాధనముగ. 514 15 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. మధుర మాధవ యామినీ మంజులాల సాలకుల దాగియున్న నక్షత్రమటుల శూన్య మరుభూమిఁ బ్రవహించుచున్న మధుత రాంత రోదకప్రోతమ ట్లమరె దీవు. తే. మౌనముగఁ గర్ణపాళి ననూన మంజు 20 మధురధారను నింపెడి మాడ్కి నుంటి నీవు - నీరవత్వఁపుఁ దెర కావలననె మరొక, టెదొతమిఁ బలికెడి పగిది నుండె. తే. ఆర్థి స్పృశియించినను మలయానిలమ్ము నాదు సంజ్ఞనింకను నిద్ర ననుపుచుండెఁ బులకరింతల నేత్రాళి మూసి-పిల్చు చున్నయది తంద్ర నిపుడు సముజ్జ్వలింప. తే. క్రీడ యెంత చంచల - లీల విభ్రమమునఁ దాల్చెఁదనదు ప్రావారకతతిని నొలసి కానఁబడకయె తన మృదు కరజలేజ ములను నా నేత్రముల నేల మూయు నిటుల? తే. బుద్ద మగు క్షితిజమునను బుట్టినట్టి శుక్రుఛాయను శ్యామసంశోభి జలద పంక్తి కిరణచయమను దుప్పటిని నుషసి యటుల నిద్రించు నొక రహస్యమ్ముతోడ. తే. వ్యాప్తినొందెను కిసలయావరణ మిదియె కిరణచయమున మధురమౌ స్వరరవమ్ము మొరయుచున్నట్లుగాఁ దోచు ముగ్ధమురళి రంధ్రముల నుండి కొంత దూరమ్ము నందు. తే. "జీవనపు ధనకాంతి దర్శింతుముతెరు తెరువు" మనుచు నున్నార లందరును నిచట దర్శనార్థమ్ముగా వచ్చితం డొకండు తానె యావరణముపోల్కి దడినిఁ గట్టె. ఆంధ్ర కామాయని 25 515 తే. అమిత కల్లోల భరితమైనట్టి తరఁగ లందు మత్తిల్లి చరియించు నా సుశక్తి కొలువగా మాని జ్యోత్స్నావకుంఠనమ్ముఁ దీసి కన్పట్టనెంత సంతృప్తి యెదవు. తే. ఫేనయుతమైన, పడగను విసిరికొట్ట స్నిగ్ధమణిగణమ్ముల రీతిఁ జెదరి తోఁచె మమతఁ బాడుచున్నట్టు లున్మత్తముగను నిద్రఁ గూరెడిపగిదిని నెగడి తోఁచె".
తే. "రమ్యజీవన మధురభారమ్ము నెప్పు డెద్దివచ్చినను తిరస్కరింపలేను - సంయమ క్లేశ దమనసంచయము రూపు నొంది చనుదెంచెనేని నే నుజ్జగింప. తే. కనఁగలరె మీరు నక్షత్రగణములార ! యుషసి అరుణిమ మది యెంత యుజ్జ్వలమ్మొ కడగి నింపుచున్నయది సంకల్ప మద్ది ఇందు సందేహ మిసుమంత యేని కలదె? తే. ఏమి కౌశలమది యెంత కోమలమ్ము? అమృతసుషమ దుర్భేద్యమా? అరసినంత నాదు నింద్రియములు చేతనత్వ మగునె కడకు నా యోటమికిఁ దొలి కారణమ్ము. తే. త్రావుచుంటిని, ఔను, నేఁ ద్రావుచుంటి స్పర్శరసరూప గంధసంభరిత మైన యట్టి దానిని మధురోర్మిఘట్టనమున నిస్వనము ప్రతిధ్వనులతో నిండినదియె? తే. పరఁగి యొక్క నక్షత్రరూపమున నాదు స్వాప్నికోన్మాదము చెదరిపడెన? ఏమి 516 30 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 నిండుగా నవసాదమున నే నింపి మదిని మలఁగుదున నిదుర నిపుడు మత్తుగొనుచు?" తే. అంధకారంపు టూర్మికలందుఁ జేత నత్వ మిదె జారిపోవుచున్నది క్రమాన మనువు రజనిని చివరి యామమ్మునందు ఘనమయిన యోజనలలోన మునిఁగినాఁడు. తే. సృష్టి యా దూరమం దున్న క్షితిజమందు స్మృతుల సంచితఛాయగా నతులరూప మొందినది - శ్రాంతి యేకడ నుండు హృదికి సంచలత నిజమాయ జరించు నిద్ది. తే. ఈ సుజాగృత జగతి విస్మృతినిఁ జెందె సాగుచుండె స్వప్న సుఖసంచార మిపుడు ఆ మనువు - నెడఁదను గుతూహలము పుట్టి యయ్యె నది మంజు లీలా గృహమ్ము పగిది. తే. అలసతను వ్యక్తి యోచించినపుడు చేత నత్వ మిబ్బడి మేల్కొన్న నయము నొందు నెదియొ దహననిస్వనమును నిపుడు మనువు వీనులను స్వచ్ఛముగ విప్పి వినుచునుండె. తే. "దప్పిగొనియె యున్నాఁడ నే నిప్పటికిని తృష్ణ తీరదు - లేదు సంతృప్తి నాకు వ్యసన బాహుళ్యమున వచ్చె, నద్ది పోయె తృష్ణ కల్పశాంతియును లభింపలేదు. తే. అనుదినము సేయు నస్మదీయానుశీల నమునఁ ద్రిదశులసృష్టి వినాశమొందె ” ఆగ లే దతిచార మావంత యైన నందరిని మహోన్మత్తత యాక్రమించె. 35 ఆంధ్ర కామాయని 517 తే. "నన్నె యెవ్వేళఁ గొలుచుచు నున్నవారు నే నొనర్చెడి సంజ్ఞయే నియమమయ్యె అస్మదర మైన ఘనమోహము సృజించె నమరజన విలాసపు వితానాళివలచి. తే. స్మరుఁడ నేనె వారికి సహచరుఁడనైతి నెనసి వారి వినోదసాధనము నైతి నవ్వుచును నుంటి నవ్వించుచుంటి నేను వారి కృత్రిమజీవమ్ము పగిది నుంటి”. తే. ఎవతె యాకర్షణమయి హసించు నింతు లందు నది రతి ఆద్యమౌ వ్యసన మద్ది ఉన్న దద్దాని యిచ్ఛ సముజ్జ్వలముగ యమరు నవ్యక్తముగ ప్రకృత్యంతరమున. తే. అమ్మహాప్రథ మావర్తనమ్ము నందు నుండె నస్తిత్వ మొక్క మా యుగళమునకె ఒదవె నీ సృష్టిరూప మందుండి - అందు నర్తనము సల్పు మూర్తు లనారతమ్ము. తే. పుష్పవతి ప్రకృతిలతా ప్రఫుల్ల యౌవ నమున మాధవు మధుహసనమ్ము విరిసె నద్ది సృష్టింపఁగా గల్గి నపుడు తొల్త మధుర రూపద్వయమ్ము సమాహితముగ. తే. జడతఁ బోఁద్రోలి యా మూలశక్తి యంత నిలిచినది లేచి - యద్దాని నియతరాగ వృత్తి గ్రహింయిచుచును బరుగెత్తుకొనుచు వచ్చి చేరిరి పరమాణుబాల లపుడు. తే. అంతరిక్ష మధూత్సవ మందు మెరసి 518 యుదిత విద్యుత్కణమ్ము లన్యోన్యముగను గూర్మిఁ జల్లిన కుంకుమక్షోద మటులఁ గౌఁగిలింతకుఁ ద్వరపడుకరణిఁ గలిసె. 40 45 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 50 5:0 తే. రమ్య మాధురీచ్ఛాయఁ బ్రారంభమయ్యె నొప్పు నాకర్షణమును, సంయోగ మపుడు చెప్పెదరు దాని నందరు సృష్టి యనుచు - మత్తురా లయ్యె నది నిజమాయ యందు. తే. నయమునను నపుడు ప్రతివినాశ మొదలి చెలఁగి విశ్లేషణమున సంక్లిష్ట మొందె సృష్టి రూపొందె మాదకవృష్టి కురిసె నొదవి ఋతుపతి-యింట సుమోత్సవముగ తే. శైల గళముల భుజల తాశ్లేషములను దమి నొనర్చి నదుల్ సనాథమ్ము లయ్యె అయ్యె వ్యజనమ్ము పుడమి కబ్ద్యంచలమ్ము ద్వయములకు నిట్లు కలయిక వరలె నపుడు. తే. మే ముభయులము నపుడు జన్మించినాము మొగ్గగా నంకుర మటు లానందపరవ శుల మయితిమి, నూతన సృష్టి సుమవనాన విరిసితిమి మందపవమాన వీచికలను. తే. ఆఁకలిని దప్పిఁ బోలి మే మపుడు మేలు కొన్నవార మిచ్ఛాతృప్తిఁ గొన్న యా స మన్వయమున - నైతిమి రతీమన్మథులము స్నిగ్ధచిరయౌవ నోజ్జ్వల సృష్టియందు. తే. తే. రతి సురాకాంతలకు సఖీరత్న మయ్యె తరుణ లయ యయ్యె వారి హృత్తంత్రులందు రాగభరితమై మధుమయరతియె వారి యెదలఁ గల చిక్కులను సవరించుచుండె. చెలఁగి తృష్ణను విరియఁగా జేయ నేను వారి కాయమ తృప్తి నొప్పారఁ జూపె మహిత మయ్యె నానంద సమన్వయమ్ము- వారి నడిపించితిమి మేము వలసినటుల. ఆంధ్ర కామాయని 519 తే. అమరులే లేరు వారల యా సుభోగ గుణవిలాసము లే, దనంగుఁడను చేత సత్వ మొక్కటే యున్న - దస్తిత్వమునకుఁ దిరుగుచుంటి - సంచితకథాసరణి యిద్ది. తే. నిత్యరమణీయ కృతులకు నీడ - మిద్ది కమ్ర విశ్వము - కర్మరంగస్థలమ్ము ఎవరి కెంత బలమ్మున్న నిచట నంత గను వసిం త్రిదియును క్రమ గతిని దోఁచు. తే. సాధనామాత్రులై యున్న జన మనంత సంఖ్య నున్నవా రవ్వారు చతురిమమున మొనసి యారంభ పరిణామములకు నేయు చుంద్రు రమణీయ సంబంధ సూత్రములను. తే. ఇంద్ర నీలాంబరాన వ్యాపించు నుషసి రమ్య కాశ్మీర ఘసృణవర్ణమ్మ దేమి? ఎన్నడేని దానినిఁ దిలకించినావె వర్ణములఁ బొల్చు జలదడంబరము నందు? తే. రేబవళ్ళను విభజించు లీల నిద్ది ఇద్ది కర్మసాధనను వ్యాపింపఁ జేయు నమల మాయా వినీలాంచలమున నిద్ది చెలఁగి యాలోకధార వర్షించు నెపుడు. తే. మలయు ప్రారంభ వాత్యోర్గమమ్ము వంటి వాఁడ నా వలననె సృష్టి ప్రగతి జరిగె మానవుని శీతలచ్చాయ మామకీన కృతిని మోహనముగ సంస్కరించుకొరకు. తే. వ్యసన సంయమోచిత జంతు వర్తనముల స్వచ్చవికసన యొదవె జీవనమునందు కామభావనము ప్రళయకాలమందు నాశమగుటకుఁ బూర్వ మున్నతి వహించె. 520 55 60 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. కమ్ర సృష్టి కెద్దాన వికాస మబ్బె తే. నద్ది ప్రణయము - వినిపింప నర్థి దాని మధురసం దేశ ముజ్జ్వల మహిత శక్తి యొకఁడు వచ్చెను బ్రకృతిలో నునికిఁ గొనఁగ. దంపతుల మైన మాకు సంతాన మదియె అది మనోజ్ఞము నత్యమాయకము నౌను రమ్యవర్ణాలి వలచి ఖేలనమొనర్చు సర్వ మోహన మధుపుష్ప శాఖ యద్ది. తే. పరుగు జడ చేతనములకు బంధ మదియె - అద్ది భ్రమపరిక్రమపాళి కగును రమ్య తమ పరిష్కార-మగును శీతలత శాంతి సహిత జీవితోష్ణ విచారసమితి కద్ది. తే. "పడయఁగా దాని నాకాంక్ష వరలెనేని యోగ్యతావాప్తి కింక నీ వుదియఁగొనుము" అనుచు నాకస్మికమ్ముగా నాస్వనమ్ము మూకతను జెందె నాయెడ మురళివోలె. తే. అంత మనువు కన్నుల విప్పి యడిగినాఁడు! “మమ్ము నచటికిఁ జేర్చెడి మార్గ మెద్ది? ఎవ్వరేని యా జోతిర్మయిని నెటువలెఁ జేరఁగాఁ గల్గెదరు దేవ! చెప్పుమయ్య!” తే. తే. ఎవరు లేరు సమాధాన మిచ్చువారు, భగ్నమయ్యె విలక్షణస్వప్న - మతఁడు పరపి నేత్రాళి సుందర ప్రాచ్యదిశను గనియె రసపూరి తారుణ గాఢసుషమ. జమిలి మెఱయ వల్లీ నికుంజములలోన రమ్యముగ నాడె హేమాభరశ్మి యపుడు నిల్చియున్నది మను కరనీరజముల దేవతా సోమరససుధా దివ్యలతిక. ఆంధ్ర కామాయని 65 67 521 వాసన (అనుబంధము) తే. భ్రాంతి వివశత నడచుమార్గమ్ము తప్పి, యంపు నెఱుఁగని పథికుల యటులఁ దోఁచు హృదయములు రెండు కలియఁగా నిచట దీర్ఘ పయన మారంభమొనరించె నియతి నెపుడో. తే. ఆ ద్వయమ్మున గృహమేధి యైన నొక్క రతుల విగతవికారంపు టతిథి యొకరు ఒకరు ప్రశ్న యైనను మరి యొక్క రౌదు రుజ్వ లోదార మైన ప్రత్యుత్తరమ్ము. తే. ఒకరు జీవనసింధు వై యొప్ప నొక్క రగుదు రమల మోహన విలో లాల్పలహరి పరగ నొక్కరు నవ్యప్రభాత ఫణితి నత్యనర్ఘ భర్మకిరణ మౌదు రొకరు. తే. గాఢ వర్షాజలోద్దామ గగన మైన నొకరు రెండవవా రౌదు రుదిత కిరణ రాగ రంజిత లక్ష్మీ విలాసగరిమ మేళనముఁ గొన్న మంజుల మేఘరవము. తే. ద్వీపవతి కట నవ్వలి తీరమందు క్షితిజసీమను మలి సంజ చెలఁగు జలద ముజ్జ్వలోజ్జ్వల మధురిమ యుత్సహించి యాడుచుండెను చపలాద్వయమ్ము తోడ. తే. చేతనాశక్తియుతము లై చిరము నచట పాశములు రెండు ఘర్షణపడుచు నుండె అం దొకటియు రెండవదాని నధిగమించి పట్టి నిలుపఁజాలదు తన వాగురులను. 522 10 5 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. గ్రహణసంబంధి సునిహిత లలితభావ మొండు కలదు సమర్పణ నొత్తగిల్లి ప్రగతి గన్పట్టుచున్నది బంధురముగ అయిన నట నెపు డాటంక మడ్డగించు. తే. మృదుమధుర జీవనక్రీడ మిలమిలలను బరుగుచున్న దయ్యేకాంత పథము నందు అపరిచితు లటు పయనించు నా ద్వయమ్ము కర్ణి నియతి సంయోగమ్ము నభిలషించె. తే. నిత్య పరిచయ మెంత యున్నిద్ర మైన నిదియు కాన్పించు నవశేష మించుకంత అతి నిగూఢ విశేష రహస్య మెదియొ యపుడు దాగియున్నది మానసాంతరమున. తే. అమిత సంకీర్ణ కానన ధ్వాంత కాంతి నయనగతి నడ్డుకొనుచు ననారతమ్ము దూరదూరమ్ము నోవుచుఁ దోఁచురీతి వార లన్యోన్యమున్నారు దూరముగనె. తే. పాసి సర్వతేజమును విభాకరుండు తొలఁగుచున్నాఁడు కల్లోలజలధి యందు జలదపటలాన కిరణసంచయము మెఱసి, పనిసి, వేవేగఁ గ్రమమున మునుఁగుచుండె. తే. మోసగింపఁగఁ బగటినిఁ బూనుకొనియె నలసి నిజకర్మలో సహస్రాంశుఁ డపుడు ఇంచు గీతమ్ముతో డఁ జాలించె నంత షట్పదము ప్రసూనరస సంచయనక్రియను. తే. ధూసరిత మౌట దీనతఁ దోఁచుచున్న గగనవాటికఁ గ్రమ్మెను కాళిమమ్ము అంతి మారుణకాంతి యత్యంత విభవ హీనముగ నా తిమిరమున లీనమయ్యె. ఆంధ్ర కామాయని 10 523 తే. అపుడు కరుణాప్రపూర్ణదృశ్యమ్ము నొక్క డీ దరిద్రమేళనము సృజించుచుండె శోకసంభరితార్తితో కోకయుగళి తే. తే. విడిచి నిజ నీడమును విడివడియె నంత. మహితగతి నిప్పుడును ధ్యానమగ్నుఁ డగుచు మనన మొనరించుచున్నాడు మనువు - అతని శ్రవణములు నిండియున్నవి ప్రసవశరుని దివ్య మహనీయ మంజు సందేశగరిమ. ఇట గృహమ్మునకు నధికారేద్ద మైన యుపకరణ వస్తుసముదయ మొప్పు మీరె అఖిలసస్యాళి, పశుతతు, లన్యవిభవ ములను సంపాదనము సేయు పొలుపు మెరసె. తే. అతిథి హృద్గత మంజులాద్యతనకాంక్ష మనువు నాకర్షణము సేసె మహితశక్తి న య్యతిథి సేయు సంకేత మమితరుచిని సరళ శాసనమై మించి సాగఁదొడఁగె. తే. మనువు కౌతూహ లాయత్త మతిని నిలచి యగ్ని శాలాంతరమ్మున నరయసాగె నచ్చెరువుతో స్వతంత్రమౌ నాత్మవిధి లీల క్రమమున సాగెడురీతి నెల్ల. తే. ఉజ్జ్వల మ్మొహోహో! ఇది యొక్కమాయ! అతిథి వెంబడి యొకపశు వరుగుదెంచె తే. కరుణతోడ విమోహమ్ము కడగి మెరసి నది యపుడు సజీవముగ సనాథముగను. చపల కోమలహస్త మా సత్వవపువు నిమిరె సర్వాంగకములు - సున్మిషత మైత్రి నెత్తి నిజ వాల మద్ది యాడించు చప్పు డామె వెనువెంట సుగ్రీవ మగుచు నమరె. 524 15 20 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. లలితముగఁ బులకిత రోమరాజి నొప్పు జలదరింపు శరీరాన నవదరించి తే. తే. యంతఁ బశువు ప్రదక్షిణం బాచరించి యతిథిచుట్టును వలపన్నె నక్కజముగ. అది యమాయక నేత్రాళి నతిథిమోముఁ గనుచుఁ గనువాని కనుల కగ్గలిక గలుగ సకల సంచిత స్నేహ ప్రసాద భరము దృష్టి మూలమ్ముగాఁ గ్రుమ్మరించె నపుడు. అతిథి యొనరించు లాలనయందుఁ దోఁచు స్నేహశబలి తోత్సాహ సుస్నిగ్ద గరిమ మంజు మమతా ప్రపూరిత మానసాబ్జ బహుళ సద్భావ చిహ్నమై పఱగుచుండె. తే. అటుల వీక్షించుచునే యుండ నతిథి, పశువు సన్నిహితులై సృజించిరి సరళ రుచిర మధుర ముగ్ద విలాససంపత్తి పొదలఁ బ్రణయ మాధుర్య ఘనరసపారణమ్ము తే. అట్టి రాగవిభూతి యీర్యానిలమున వ్యస్తమయ్యెను చిందరవంద రయ్యె మరియు నారిన యీర్యాగ్ని వరకణాళి జ్వలితమయ్యె స్ఫులింగచయమునోలె. తే. కాని యిది యేమి? ఈ రీతి గళము నొక్క విషపుగుటక ఈ యెక్కిళ్లు వెడలు టేమి? ఎవరు కల్గించుచున్నారు హృదయమందు నిద్ధ వేదనామయ మగు నిర్ష్యనిటుల. తే. అహహ! ఈ పశు! వింతటి యద్భుతంపుఁ బరమ రమణీయ మోహన ప్రణయ మిద్ది ఏ నొసంగు నన్నమునఁ బోషింపఁబడెడు నీ ద్వయమ్ము నిత్య మిట నీ యింటియందు. ఆంధ్ర కామాయని 25 525 తే. నేనొ, ఎక్కడున్నాడనో నే నెఱుంగ తృప్తి సర్వులు దమపాలు తీసికొనుచుఁ బ్రాప్యముగ నాకుఁ దుచ్ఛవిరాగ, మహహ, విసరివైచుచు నుందు రెవ్వేళఁ గనఁగ. తే. ఎన్ని హృదయాల నిటుల భంగింపఁ గోరె దోసి నీచకృతఘ్నతా! ఉండి యిటుల పిచ్ఛల కిలా సుసంలగ్న విపుల జటిల మలిన శైవాలపటలమ్ము మాడ్కి నీవు. తే. అపహరించి హృద్రాజస్వ మంత నాచ రించుచునే నాకు బహుళాపకృతులు వీరు చోరులై వ్యథ యెదవని సుఖము లెల్లఁ బడయఁగోరుచున్నారు నా వలన నెపుడు. తే. విశ్వ మంతట నెలకొన్న విబుధలోక వరమహైశ్వర్య విభవసర్వస్వ మిపుడు నాది - ప్రతిదాన మీవలె నాకు నిఖిల చయము, వాంఛింతు నిదె మనసార యేను. తే. నిత్యము నశాంతికలిత మై నెగడు నాదు జ్వలిత బాడబ పావక జ్వాల నెపుడు శీతలమ్ముగ ననురక్తిఁ జేయవలయు సర్వమును సింధులహరికాజాలు మటుల. తే. చపల శైశవోపమ సువిస్మరణ భార వహన యగుచుఁ గ్రీడాశీల వచ్చె నతిథి యా కడ కుదార మృదుపద న్యాస విభవ బంధురతతోడ -అంతటఁ బలికె నిటుల తే. "ఈవు ధ్యానమగ్నుండ వై యేల యిటుల నిప్పుడును గూరుచున్నాఁడ విచ్చమెయిని, కన్ను లెద్దాననో నిల్చి కనుచునుండె శ్రవణములు వినుచున్నవి రక్తి నెది. 526 30 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. చిత్త మే సీమయందో వసించుచుండె ఏమి జరిగిన, దీ రీతి యేమి నేఁడు!" శాంతి నొందెఁ దృప్తమగు నిర్ఘ్యాఫలమ్ము అతిశయమ్మగు నావేశ మణఁగిపోయె. తే. అమల కోమల కాంత హస్తాళి నతిథి శీతలస్పర్శఁ దనువు స్పృశింపసాగె అట్టి రూపమనోజ్ఞత నర్థిఁ జూచి యపుడు మనువును నొకకొంత యుపశమిల్లె. తే. మనువు పలుకంగ సాగె ని మ్మాడ్కి "అతిథి! ఎచట నజ్ఞాతముగ వసియించుచుంటి వీవు ఏ సహచరుఁడ నీ కిప్పు డెడఁద నెదియొ సులభభవిష్య మూహించుచుంటి. తే. అమృతగంభీరమును మహితార్ధ మైన చిరతర స్నేహసంప్రాప్తిఁ జెందియున్న నిప్పు డీ స్థితి యేలనో-ఎరుకపడదు! డీ ఏ నభీరుఁడ నగుచుంటి నేల యిటుల? తే. ఎవరనో నీవు న న్నిప్పు డిటుల నీదు వంక కాకర్షణము సేతు వనిత! ఏను స్వయముగను నిన్ను వాంఛించు సమయమందుఁ దొలఁగిపోవుచునున్నావు దూరమునకు. తే. ఓసి జ్యోత్స్నా స్రవంతికా! యుత్సహించి నేడు నా దృష్టి నీ యెడ నిలుపదేమి? అర్థి నిను గమనించినా నన్న నమ్మ కమ్ము నిపుడు కోల్పోయిన కరణి తోఁచు. తే. లతికలును, వీరుథమ్ములు రమ్యఫణితి దాన మొనరించుఁ గాంతి నెద్దాని కిప్పు డట్టి శోభాసులలిత రహస్య మెదియొ తరుణి! నీలోన నిబిడమై దాగియుండె. ఆంధ్ర కామాయని 35 40 527 తే. సకలమున పశువునను, బాషాణమందు నృత్య నవమంజు నిస్వన మిమిడియుండె అందరను దన్వి, ప్రీతి సానందముగను గడఁగి పిలుచుచున్నది యొక కౌఁగిలింత! తే. శాంత సంచితప్రణయ మశ్రాంత మిపుడు పృథులరాసులు గాగ వ్యాపించియుండె అట్టి వలపును గైకొని యప్పుగాగ దీనజగము సంతరించుచుండె. నిది తే. అమృతమోహన! అరుణమేఘాళి సజల చారుసచ్ఛాయల దినాంతసమయ మందు లలిత లతికా మనోహర లాస్య లీల ఏను వీక్షించుచున్నాఁడ నిచ్చమెయిని. తే. సహజ మోహన ఘన విలాసమ్ముతోడ, సరసధీర పదన్యాస చతురిమలతో, మంజుగతులను వచ్చె నా సంజయందు మధుర మాధవయామినీ మానినియును. తే. ఏలనో యెవ్వరు నిపు డియ్యెడను గనఁగ మహిత విధ్వస్త సురుచిర మందిరంపు దీనమును శూన్యమును నైన కోణమున వ సించి సమ్మర్ద మొనరించు టెరుకపడదు. తే. స్థిరనివాసమ్ముగా దానిఁ జేసికొనియె మాయ-ఏమి యీ సుఖనిద్ర? మాన్యగతుల చారు హిమధీర నవ్యహాసమ్ము మించి మెఱయుచున్నది గుణసమున్మేషమునను. తే. సరస భోగవిలాస సుచ్ఛాయ! స్వస్థ మధురశక్తి సువిశ్రామయా! మనోజ్ఞ మానసనివాస సౌందర్య మంజుప్రతిమ! ఎవరవు? ఛవిధామనువు, నీ వెరవవోసి! 528 45 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. కామనా మయూఖంపు టుర్గాఢ సుషమ యెవరికడ మించి రక్తి దీపించుచుండె, విభ్రమన్మానసము దేని వెదకుచుండె, నట్టి నీ వెవ్వరవొ? యోసి అతిథి మిన్న! తే. ఫుల్లకుంద సుహాసవిస్ఫూర్తి నీదు తే. స్మితము లావణ్యమును విరజిమ్ము దెసల పరఁగి మన్మనో రుద్దకవాట మటుల యేల తెఱువంగఁబడి రహియింప దిపుడు”
అంత నవ్వుచు నిట్టుల ననియె నతిథి "అతిథిని - మదీయ మైనట్టి యధికపరిచ యమ్ము వ్యర్థము దీనికై యార్తితోడ నింత యుద్విగ్నుఁడవె మును పెన్నడైన. తే. జలద లఘుఖండ వాహనాస్థాని యగుచు సరల హసన మనోజ్ఞుఁడై చంద్రుఁ, డడుగొ, వచ్చుచున్నాఁడు కను మదె, వలచి మనలఁ బిలచుటకె యిటు పదవోయి కలఁత వీడి. తే. సకల తిమిరము క్షీణింపసాగె నంత విమలతర రోచు లెల్లెడ విస్తరించే నిభృతమౌ నీ యనంతాన విలచి లోక మెల్ల సంతసమ్మున వసియింపసాగె. తే. శార్వరీ ముఖ విద్యోత శస్త్రమహితు శీతకరుని సుధామయ స్మితముఁ జూచి నిఖిలజనులు కల్పిత దుఃఖనిచయ మెదల మఱపుఁగొందు రియ్యెడ విసుమానమునను. తే. ఉన్నతమ్మైన శిఖరమ్ము వ్యోమరేఖఁ జుంబనము సేయ యత్నమ్ముఁ జూడుమయ్య! ఆంధ్ర కామాయని 50 529 అంత్యకిరణము వసుమతియందుఁ బొరలి యస్తమయ మగుచున్న, దయ్యదియె, కనుమ! తే. ప్రకృతి సుస్వాప్నిక ప్రౌఢపాలనమును, రమ్య సాధనా మోహన రాజ్యరమను, పద, అమేయ మధుర విభా భరితమైన కౌముదిని జూచివత్త ముద్దాఢరతిని. తే. సృష్టి హసియింపఁ గడఁగెఁ బ్రహృష్ట యగుచు వలపు వికసించె లోచనపాళికలను ఉదిత రాగరంజిత యౌచు నొప్పె జ్యోత్స్న ప్రసవములు వెదజల్లెఁ బరాగధూళి". తే. మనువు-హస్తమ్ముఁ జేపట్టి మమత యొదవ హసన విస్ఫూర్తిఁ జెలువొందె నతిథి - అంత నిరువురును స్నేహపాథేయ మిచ్చఁ గొనుచుఁ దరలి నడచిరి స్వప్నపథమ్ము వట్టి. తే. పారిభద్ర నికుంజ గహ్వరము లిప్పు డన్నియును సుధాస్నాతమ్ము లగుచునుండె సలుపుకొనుచుండె నవ్వేళ సకల మొలసి యుజ్జ్వలముగ జాగరణరా త్యుత్సవమ్ము. తే. పుష్పరస సిక్త మాధవీ పుణ్యగంధ వీచికావళి దిక్కుల విరియసాగె మధువు సేవించి మత్తెక్కి మారుతములు మిట్టిపడుచున్న వొకదాని మీఁద నొకటి. తే. ధీరయామినీ ఛాయాశరీర మిపుడు శిథిలమై యంత నలసతఁ జెంది, తివిరి యతుల మంజు తుషార శయ్యాంతరమున దీర్ఘవిశ్రాంతిఁ గొనుచు నిద్రించుచుండె. 55 60 530 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. ఛాయచే నెద్ది కల్పించుఁ జారు కుతుక మట్టి రమణీయ కుంజమ్ము నందుఁ దవిలి హృదయభావన యిప్పు డహీనగతిని భ్రాంత మగుచున్నయది యనురక్తిఁగొనుచు.
తే. అంతటను మను వీ రీతి ననియె "అతిథి! ఎన్నిమారులో చూచితి మున్ను నిన్నుఁ బరగి యపు డింత సౌందర్యబంధురతను నిండి కన్పట్టగా లేదు నీవు నాకు. తే. అప్పుడున్మత్త మేఘమాలాళి నాదు వర విలాస గీతులె ప్రతిస్వన మొనర్చె దీని స్పృహణీయ సుమధురాతీత మైన యట్టి నా పురాజన్మమం చనఁగ వలెనె! తే. ఎట్టి దృశ్యమ్ము మరచి నే నిట్టు లైతి, చేతనాహీనుఁడ నదియె చెలఁగి మరల సిగ్గుతో నవ్వు చివ్వేళఁ జేయుచుండెఁ గ్రీడగా రమణీయ సంకేత మొకటి. తే. "ఏను నీవాఁడ నై నాఁడ నిప్పు" డన్న దృఢతరం బైన భావమ్ము తీండ్రమగుచు భవ్య మామక చేతనా పరిధివోలెం జక్రగతిఁ బరిభ్రమియింపసాగె నతిథి! తే. చలిత సుకుమార చంద్రాంశు సముదయమ్ము మధువు వర్షించుచుండె నమందముగను అమరెఁ బవమాన మందరోమాంచితమ్ము ఇచ్చ మధుభార మెసఁగి చరించుచుండె. తే. మెలఁగుచున్నావు నీవు సమీపమందుఁ బ్రాణము లి టేల నే డధీరతను జెందు? 65 ఆంధ్ర కామాయని 531 ఎట్టి సౌరభమొంది ఘ్రాణేంద్రియమ్ము తృప్తినొందుచు నున్న దియ్యెడను మీవుల? తే. అలుకఁ గొన్నావు నీ వని యాత్మలోన వ్యర్థసందేహ మేలనో పరఁగుచుండె తీర్పఁగా నీదు నలుకను దివురుఁ గోర్కె అయిన నే నసమర్థుండ నగుచునుంటి. తే. నాడులందు బహుళ వేదనమ్ము వోలె నిండి క్షితిజప్రవాహమ్ము నెఱియఁ బారు ఎడఁద లఘుహారమును వహియించి కంప నమ్ము నొందుచుఁ దోచు స్పందనము కలదు. తే. చేతనత మోహన మ్మయి చెలఁగుచున్న బహువిలాస కీలాళికా పరిధియందు పరమసౌఖ్య మనోజ్ఞానుభవము నొంది హర్షమున మత్తరాగమ్ము నాలపించు. తే. ఒప్పి యగ్నికీటము వలె నుత్సుకతను కాలుచునె యది జీవించి కాఁనఁబడును ఒడలిపై బొబ్బ కనుపింప దొక్కటేని దానిలోఁ దోఁచ దియ్యెడ దాహగుణము. తే. విశ్వ కుహక మాయా ఘనవిభవ మిటుల మూర్తిఁగొన్నట్లు కన్పట్టు ముగుద! అర్థిఁ బ్రాణశక్తిరహస్యమ్ము పగిది మెఱసి యించు సుకుమారతను నొప్పె దెవర వీవు? తే. బడలికను జెంది యున్నట్టి పాంథు నటులు హారి భవదీయ సుచ్చాయ యందు నిలచి యలసటను దీర్చుకొనుచున్న దతివ! యెడఁద యెసఁగు నిట్టూర్పులను తన్వి! ఎవర వీవు? 532 70 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. శ్యామ నభమున మధుకిరణాళి మాడ్కి తే. తే. సింధు సుందర ధీర వీచికను బోలి సరస మలయజ మధువిలాసమ్ము పగిది మరల మృదుహాస మద్దియే పరిఢవిల్లు"!!
మంజు కుంజాంతరమ్ములఁ గుంజరించు నట్టి యరవిరి పగిది నయ్యదను నందు నతిథి పలుకఁగా సాగె అ య్యమృతభాష మనువు గాఢానురక్తితో వినుచునుండె.
“మహిత కల్లోల భరిత మున్మాద యుతము నగుఁచుఁ గన్పట్టు మానసమం దతృప్తి భయదభంగాళిఁ బోలు నుచ్చ్వాసకలిత భాషణము! సఖ! ఏమియుఁ బలుకవలదు. - నీ తే. ఎద్దియే నడుగంగ నీ విచ్చగింప వలదు కనుమ యా తారకావల్లభుండు మంజులత, స్తబ్ధముగ, గాఢమౌనమునను నొప్పి యుపవిష్టుఁడై యెట్టు లున్నవాఁడో! తే. బహుత రైశ్వర్య, యున్మత్త ప్రకృతి దాని స్నిగ్ధ నీలావరణ ముండె శిథిలముగను ప్రచురరీతుల వెదఁజల్లఁబడియె నందు శుభ్రలాజలు మంగళసూచకముగ. తే. రాసులెత్తిన చందానఁ బోసి పోసి శార్వరీ తామ్ర శుభవర్ణ చరణ సవిధ సీమ నమల తారాళితోఁ జెలఁగుచున్న యది నిరంతరమును గుసుమార్చనమ్ము.”
75 80 ఆంధ్ర కామాయని 533 తే. కమ్ర యామినీరూపము నడగి మనువు కనుచు నున్నకొలంది యగ్గలిక మెఱసి దాని యతిశయ మోహనోదార సుషమ విస్తరించుచు నవరూప విసరణమున... తే. స్వచ్ఛముగ ననంతముగ నశ్రాంతముగను గురిసె మదిరాకణమ్ములు కొసరి కొసరి రమ్యముగ, మధురముగఁ దారాడఁ దొడఁగె గిలుబుకొంచు 'సంయోగసంగీత' మపుడు. తే. తే. పరఁగి యుత్తేజనములు నుద్రాంతముగను నైన వహ్నికణమ్ము లత్యంతముగను వెల్వడఁగఁజొచ్చె మనువు - హృద్వీథి నుండి లీల మధురమౌ జ్వాల జ్వలించుచుండె. మనము వికల మశాంత మై మల్లడిల్లె కలిగె నావేశ మొక సుడిగాలి వోలె చెదరి వలఁగొను మను-మనస్సీమలోన లేశమాత్రము ధైర్యమ్ము లేకయుండె.
తే. కరము గ్రహియించి యున్మత్తుకరణిఁ బలుకఁ గడఁగె న య్యెడను మనువు “కనుచునుంటి నవ్యమధురిమ నెనయు సౌందర్య మిపుడు అదియెమోహన సౌందర్యమగును, చెలియ తే. కాని యీ విభ్రమ మ్మేమి? కలఁత వడుచు నొడ్డెఱుంగ కధీరత నొంది, అయయొ స్మృతి-మహానౌక వికలమై యిపుడు తిరుగు చున్నయది విస్మృతి యనెడి యుదధియందు. తే. కమ్ర సుమకోమలాంగి యౌ 'కామబాల' యొక్కతె 'జనన-సహచరి' యుండె నాకు 534 85 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 ఆమె నామమ్ము మధురమ్ము అద్ది శ్రద్ధ ప్రాణతతి యామె వలననే పడయు శ్రాంతి. తే. ముగ్ధ మకరంద సౌందర్యమూలము లగు పుల్ల నవమధు రామోద పుష్పములను నెల్ల వేళల నామె కేనిచ్చఁ గలసి యర్పణము సేయుచుంటి నర్ఘ్యమ్ము గాగ. తే. లీలఁ బ్రళయమునను మిగిలితిమి మనము పొందెదఁ బునస్సమాగమానంద మిపుడు శూన్య జగతీ ఘనోత్సంగ శుభ్రతలిని నొలయు కలయికకు మిగిలియుంటి మీచట. తే. నిబిడనీహారమును దాటి నిరతిశయత విమలకౌముది వలె బయల్వెడలి వచ్చె రమ్య తారకారత్న హారము గ్రహించి నింగిఁ బ్రణయ శశాంకుఁడు నిలచియుండె. తే. కుటిల కుంతల విసరానఁ గూర్తు వీవు తే. భయదకాల మాయాజాల పటల మీటుల నయన నీలిమ తోడ ననన్య శక్తి నల్లుచున్నావు తామిస్రహార మిపుడు. అమిత దుర్భేద్య తిమిరనిద్రాత్తభూతి నిదియె వెదజల్లుచుండె నీ దృష్టి నేఁడు వ్యాప్తమగుచున్న దిపుడు స్వప్నమ్ము వోలె నమల చంచల భవదీయ హాససృష్టి. తే. సాధనాస్ఫూర్తి నీయందుఁ జతురగతిని నిలచి కేంద్రీకృతమ్మయి వలపునించు, సౌకుమార్యమ్ము సర్వమ్ము సంహితించి మూసవోసిన కామినీమూర్తి వీవు. ఆంధ్ర కామాయని 90 90 535 తే. ఏను దినమంతయు బరిశ్రమించి యున్న పూషుఁ బోలుచు వర్తిలు పురుషవరుఁడ! శిశువు వలె నేటివఱకును జిక్కకుంటం దెరువు-విభ్రాంతి లోఁగొనఁ దిరుగుచుంటి. తే. ఈవు విశ్రాంతి నొసఁగు రాకేందుబింబ కాంత చంద్రికా విసరమ్ము కరణి నొప్పి విజయినివి వోలె, మాధుర్యవిచి వోలె సరస నౌచుఁ దోఁచెదవు ప్రశాంతముగను. తే. సస్యసంపత్తి వెల్గొందు శ్యామభూమిఁ బాదదళితమ్ము నాక్రాంత బంధురతను నమితమును నయి శాంతితో నంతమొందు వర మహాయాసమును గొన్న ప్రజ్య యటుల. తే. అహహ! ఏమియో!! యీ గతి నగుచునుండె మామకీన మనఃపరిణామ మిపుడు !! మానసజలేజ మర్పించి మమతఁ దవిలి యేను నా కామ్యమును గ్రహియించుచుంటి తే. విశ్వరాజ్ఞిరో సౌందర్యవిభవరాశి! గురుత రోజ్జ్వలరస జగద్గారవమ్ము చేతనోపేత మైనది, స్నిగ్ధమధుర మీ సమర్పణమును స్వీకరింపుమమ్మ” తే. చెలఁగు వలపున శిశిర నిశీథ మందు తత నవ తుహిన భారానతమ్ము గాన వ్యోమ తరువును మంజుల ధూమ లతిక సోలు చధిరోహణము సేయఁజాలకుండె. తే. పురుష నర్మోపచారముల్ పొంది యంత 536 సంకుచిత యౌచు నొప్పె నా శ్యామలతిక రమ్య సౌకుమా ర్యాత్త భారమును గొనఁగ వంగె నాయమ క్రీడా శుభాంగి యగుచు. 95 100 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. అట్టి స్త్రీత్వ మూల సుమధురానుభవము హసనమొనరించు వడువున నంతఁ దోఁచె ప్రీతి యొదువఁగ నెదలోనఁ బెంచుచుండె నధికతర మైన యభిలాష నపుడు కడఁగి. తే. మధుర మధుర లజ్జా సుశబలిత మహిత చింత నొలయు నుల్లసనమ్ముఁదా నొప్పఁ గొనుచు నర్థిఁ గావింపఁ దొరకొనె హర్షకూజ నమ్ము రుచిర మహానందనర్తనమును. తే. నయనపక్షము లపు డవనతము లయ్యె నాసికాగ్ర మొకింత వినమ్ర మయ్యె భ్రూలతిక నిరాతంక విస్ఫురణ మొప్పఁ బొందె వ్యాప్తి యాకర్ణాంతముగను అంత లలిత లజ్జ శ్రవణకపోలముల నొనర స్పృశన సేయఁగా సాగె సంప్రీతి తోడ ఫుల్ల కాదంబ కుసుమాళిఁ బోలి వలపు పులకరించెను గాద్గద్య మొలసె వాణి. తే. లలిత తే. అయిన అయిన - నాయమ మనువుతో ననియె నిట్లు “మహిత మీ నాఁటి దగు నీ సమర్పణమ్ము చెలఁగునా స్వామి! ఇఁక స్త్రైణచిత్తమునకుఁ బరమ శాశ్వత మై నిల్చు బంధనముగ. తే. అహహ! దుర్బలురాల నే నైతి-దేని ననుభవింపఁగ నాదు ప్రాణాళి, దేవ! వ్యాకులతఁ జెందుచున్నదో యట్టి నీదు దానమును స్వీకరింపగాఁ దరమె నాకు!" 105 106 ఆంధ్ర కామాయని 537 లజ్జ (అవరోధము) తే. "లలిత కోమల కిసలయాంచలము నందు తే. నొక్క చిఱుమొగ్గ యొగి దాగియున్న యట్లు ధూమలపటల ముగ్ద గోధూళివేళ దీపికాజ్వాల యుమిసెడి దీప్తు లట్లు - మించు మంజుల స్వప్న విస్మృతిని జెలఁగి చిత్తవిభ్రమ తీవ్రతఁ జెంది నట్లు- వాసనా వీచికా చ్ఛాయ పరిగి మెఱయు బుద్బుదఁపు సౌరు కడు వ్యాప్తిఁ బొందినట్లు - తే. అర్థి మాయావిసర్పణ మమరఁ జేయు నధరబింబాన నంగుళి యందగిల్ల నమల వాసంత కౌతూహ లార్ధజలము నేత్రయుగళినిఁ బొలుపార నిలిపి నెలఁత! తే. ప్రౌఢ పరిరంభ మంత్రమ్ము పలుకు పగిది చాచి కోమల కరపాళిఁ దోఁచె దీవు రవ విహీన నిశీథాన లతిక వోలె నిటుల నరుదెంచు చుంటి వీ వెవర వతివ! తే. పుష్పధూళీ మరంద విస్ఫూర్తి నెగడు నింద్రజాలసుమాళి రచించుచుంటి విటుల తలవంచి మాలిక నిపుడు నీవు అందు నుండి జాల్వారు మరందధార. తే. పులకిత కదంబమాలిక పొలసి మెఱయ నిదె మదీయ హృదిపయి ధరింపఁజేతు వాత్మఫలభార బహుళభయమ్ము వలన నా మనశ్శాఖి యిటు లవనతినిఁ జెందు. 538 OT 5 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. నీలికిరణాలు పొసఁగించి నేసికొన్న వసనమును నీవు పరచెదు వరము వోలె అహహ! అద్ది కనఁగ సౌరభాళి నెనసి యెట్టి వలిపమ్ముగాఁ గనుపించి యించు. తే. సిక కముతోడ నంగముల్ సేయఁబడెనె? కోమలతను శరీరమ్ము గొనఁబుఁ గొనియె అతిశయముగఁ గుంచితను నా యందె నేను విమల పరిహాస గీతి నే వినుచునుంటి. తే. తరళహాసమ్ము స్మితముగాఁ బరిణమించు నక్షియుగమున నొదవె నపాంగవీక్ష అన్నిటిని జూచుచుంటిఁ బ్రత్యక్షముగను కాని స్వప్నమ్మువలె నెల్ల కనుపించు. తే. Gilb తే. నా కలరవజగమ్ము స్వప్నమ్ము నుండి కనులు తెఱచి సమస్తమ్ముఁగ నెడివేళ మించి యనురాగ మంజు సమీర నిచయ దివ్యపంక్తుల గర్వాన తిరుగువేళ- ఆ సుఖమునకుఁ బలుక సుస్వాగతమ్ము అమలజీవన పృథు వైభవాళిఁ, బెద్ద కాలమునకు వచ్చినదాని గౌరవింప యౌవ నోజ్జ్వల, యభిలాష యరుగుదేర తే. దేని నాలంబనమ్ముగా నూని యేను రసతరంగిణి మున్గి యాహ్లాదశిఖరి కెక్కుచున్నానొ యద్దాని యా సుకిరణ రజ్జువును జుట్టఁజుట్టితి వుజ్జగించి. తే. ఎదియొ సంకోచమగుచు స్పృశింపఁ దలఁప పక్ష్మముల వీక్షణకు నడ్డుపడుచు నుండు అమల కలరవయుత పరిహాసవాణి యధరములఁ జేరి యంతట నాగిపోవు. ఆంధ్ర కామాయని 10 539 తే. ఒనర రోమాళి సంకేతమును నొనర్చు నన్ను నాటంకపరచు మౌనముగ నిలిచి భ్రూకుటీ కాళరేఖికా పూర్ణరుచులు తెలియఁబడియెడి భాషయై యొలసె నపుడు. తే. ఇటుల స్వాతంత్ర్యమును సంగ్రహింతు వీవు పడఁతి! ఎవర వస్మ న్మనఃపరవశతవ! జీవనోద్యానమున వికసించి తావి దొరయు స్వచ్ఛంద సుమపాళిఁ ద్రుంచె దీవు." తే. నవ్వుచును నవసంధ్యారుణమ్ము మాడ్కి దానినే దేహముగఁ గొన్న తత్త్వ మొదవ రమణియపుడు ఛాయామూర్తి లలితగతిని శ్రద్ధ కీగతి బ్రత్యుత్తరమ్ము నొసఁగె తే. "ఇంత చకితవు కాఁబోకు మింతి! నీదు మనసు కుపకార మొనరించుకొనుము సుంత ఆగు మొక్కింత తలపోయు మనుచుఁ దెలిపి యాపుదల సేయు నడ్డంకు నౌదు నేను తే. గగన చుంబి తుహిన శృంగకముల నుండి కలరవోదిత కల్లోల గతులతోడ నవనవోల్లాస మంజు లోన్మాదమునను జంచలా ప్రాణధార నదించుచుండె. తే. పొలయు నం దుష్యకాంతిని బోలి మెఱయు తే. స్నిగ్ధ మంగళ కుంకుమ శ్రీరజమ్ము కులుకు నడలను గనుకట్టి కొమరుమిగిలి భవ్య హరితము వోలు సౌభాగ్యగరిమ. మనోజ్ఞతఁ గనెడి నేత్రాళి కయ్యెఁ గమ్ర కల్యాణ మహనీయ కారణమ్ము హ్లాదకుసుమము వికసించె - - నద్దిఁ దోచె గుణిత వాసంత కాకలీ కోకిలముగ. 540 15 20 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. స్నాయువుల మధుస్వన మూర్ఛనమ్ము వోలె నట్టి మధురిమ ప్రతిరుతు లాచరించు అద్ది నేత్రమ్ములను మూసలందుఁ జొచ్చి ముగ్ధ మోహన బహురూపములు ధరించు. తే. నేత్రనీలిమ యను లోయ నిండి దాని రసజలడ మచట మనోహరముగ నుండె అంతరాళ శీతలతకు నద్ది శీత తే. లత నొసంగెడి చంచలాగతిని తోఁచె. అమరుఁ డగు ఋతురాజు నాహ్లాదగరిమ, మధుర గోధూళి వేళా మమత్వ, ముదయ కాల జాగృతి, మధ్యాహ్న గాఢతలును నిండియున్న వా యౌవన నిరుపమమున. తే. చకితయై తన ప్రాచీదిశా గృహమ్ము విడి హఠాత్తుగ వచ్చిన వెన్నెలటుల మానసోర్మికలను జేరి పారిపోవు నమల కౌముది వలెనుండు యౌవనమ్ము. తే. అట్టి తారుణ్యమున కీయ స్వాగతమ్ము ననఁగ వికసించె సుమనపత్రాళి యపుడు స్వాగతార్థపు కుంకుమ చందనములఁ గడఁగి మకరంద మయ్యది కలుపుచుండె. తే. పల్లవమ్ముల మర్మరధ్వనుల తోడఁ బెల్లు వినుపించు నద్దాని విజయఘోష ఆత్మసుఖదుఃఖతతి యపు డందొనర్చె నమృత గతుల నానందోత్సవములు వలచి. తే. చేతనోజ్జ్వల వర మది - చెప్పుకొంద్రు దాని నెల్లవారలును సౌందర్య మనుచు బహుళకాంక్షలు, సురుచిర స్వప్నములును నందు మేల్కొను, మించు ననంతములుగ. ఆంధ్ర కామాయని 25 541 తే. అగుదు దాదిని చపల యౌ యౌవనమున కేను-నేర్పెద గౌర వాహీన గరిమ తగుల నున్న యెదురు దెబ్బఁ దలఁచి యామె కేను మెలమెల్లగను నెరగించుచుందు. తే. ఏను రతిరాజ్ఞి నా దేవసృష్టి యందు విభుఁడు సుమబాణు వలన వివిక్తనైతి ఏ నిషేధంపు మూర్తినై యిప్పు డుంటి దీననై - సంచితాసంతృప్తి యెనయు నను... తే. అనుభవమ్మునను నతీతమైన దైన నా సఫలతను బోలి యున్నాను మిగిలి స్మరవిలాస దుఃఖిత, సలసటను గొన్న దాని, శ్రమదళితను బోలుదాన నిపుడు. తే. ఏను లజ్జనుఏఁ బ్రతికృతిని రతికి నేను శాలీనతాలీల నేర్పుచుందు మదము నొందిన సౌందర్యపదము నందు నూపురముగ నల్లుకొనుచు నాపుచుందు. తే. రాగరక్తిమనై కపోలముల యందు నక్షియుగళికి నయ్యెడ నంజనమ్ము గాఢ కుంచిత కుటిలాలకములఁ బోలి మానసమున నేను మెలినై మసలుచుందు. తే. తమిని జంచల శాబ్ద సౌందర్యమునకు నాచరించుచుందును రక్ష యనయ మేను శ్రవణముల కెఱఁదనము నొసంగఁజాలు చిఱుత మెలినినై యపుడు నేఁ జెలఁగుచుందు.”
తే. "ఔను, సరియె, కానిమ్ము నా యమలజీవ నంపు పథ మేమొ తెలుపఁగన్నా వె నీవు? 30 542 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. తే. సృష్టి నిబిడ నిశీథాన నెద్ది కాంతి మయ మనోజ్ఞ మోహన దివ్య మంజురేఖ. తెలిసికొనఁ గల్గినాను దుర్బలత వలచి కూడియున్నట్టి స్త్రీ నని నేఁడు నేను అందరికి నోడినాను నా యంగకముల నమరు సుందర కోమల తాత్త గరిమ. కాని తనయంతఁ దానె నా మానసమ్ము చెంది శిథిలత యిట్లున్న దెందువలన? నీలి మొయిలుల ముక్క లట్లేల నిండి యున్న దయ్యెడ నీరు నా కన్నులందు. తే. చారు విశ్వాస ఘన తరుచ్ఛాయ యందు నఖిల మర్పింపఁగా వలె ననుచు, నచట మౌనముగ నుండవలె నంచు మనసుపడుచు మమత జాగృత మగునేల మాయలోన? తే. క్షీరపథమునఁ దారకా క్షీణ కాంతి వోలె మిలమిల మను “మధులీల" యనఁగఁ జిత్తమునఁ గోమలము శ్రమాయత్త మగుచు నభినయించు టేలనొ యమాయకత యెపుడు! తే. ఏ నిరాధారముగఁ బర్యటించుచుంటి నీ మనో- గాధముల యందు నెపుడు నిటులె జాగరణమును గోర నీ స్వప్న సౌఖ్య మందు నెన్నఁడేనియును నే నాదరమున. తే. ఇదియె స్త్రీ-జీవనచరిత్ర? ఇదియె యౌనె? అస్పుట మగు రేఖాసీమ యందు నింతి ! నీవు వికలతావర్ణమ్ము నింపు చిపుడు తే. కళ కొసంగుచునుంటి నాకారగుణము. నిలువఁబడెదరు, ఆగెద వలచినటుల కాని యోజనఁ జేయఁగాఁ గడఁగఁజాల ఆంధ్ర కామాయని 35 40 543 తే. తే. వెట్టిదానివలెను నుపవిష్ట యగుచు నా యెద నెవతో ప్రలపిం చనారతమ్ము. ఏఁ దులనమొనరింప యత్నించినప్పు డెల్లఁ దూచఁగాఁబడుచుంటి నేనె-ఏను నరతరువునకు భుజలతఁ బిరిగఁ జుట్టి యాగు - టెండల నెవ్వేళ నూగుచుందు. ఈ సమర్పణ మందున నేమి కలదు? ఒక్క త్యాగమ్మె కనఁదోఁచుచుండు నెపుడు అఖిల మర్పింతు గ్రహియింప నణువునైన నిదియె సరళముగను దోఁచు మదికి నెప్పుడు. తే. "ఉవిద ! ఏ మని పల్కుచునుంటి నీవు ! చాలు - నీ సుసంకల్పాశ్రు బలము తోడ జీవితంపు స్వర్ణస్వప్న శేవధులను డొలుతనే దానమిచ్చితి కలికి! నీవు. తే. రమణిరో! కేవల మ్మీవు శ్రద్ధ - నీవు కడఁగి విశ్వాస రజతనగ పదజలము నందు జీవన సమత లాత్యంత భూమి నెనసి సురశై వలిని వై నదింపు మమ్మ! తే. సమర మత్యంత తీవ్రమై సాగు నమర జన జయములకు, దను జాపజయములకును అనయమును బ్రవర్తిల్లు మానసాంతరమున గాఢ మౌచు వైరుధ్య సంఘర్షణమ్ము. తే. అశ్రుకణసిక్తమైన వస్త్రాంచలమున నుంచవలయు నెడందలో నున్న దెల్ల మధుర దరహాసరేఖతో మగువ! నీవె ఈ సుసంధిపత్రమును లిఖింపవలయు” 544 45 47 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 కర్మ (ఆచరణ) తే. కర్మసూత్ర సంకేతమ్ముకరణి వరలి మనువునకుఁ దోఁచె మహితసోమలత అద్ది సజ్య చాపశింజిని యనఁ జాలియుండె మనువు కర్షించే జీవనధనువు మరల. తే. అతఁడు విడిచిన బాణమ్ము గతిగ-నదియె మార్గమున నగ్రసరుఁడయ్యె-మందరముగ నంత “యజ్ఞము, యజ్ఞము” అనెడి కటుకు కేక వినుట స్థిరత నుండలేకపోయె. తే. శ్రవణయుగళి నిండె బ్రసవశరుని పలుకు కలిగె నవ్యాభిలాష హృజ్జలజ వీథి మనువు యోజింప దొడఁగెను- మంజు రంజి తమగు నా పొంగులువారె తరిమి తమిని. తే. అంత సోమపాన ఘనదాహమ్ముఁ గొనిన రమ్యలాలస లోభవర్తనము నొందె, దీన జీవితవైభవోత్సేక మందు నుండియుండె నౌదాసీన్య మొలసి, బలిసి తే. పవన మది ప్రతికూల మై పరగి నపుడు తరణి లోతులకుఁ దిరిగి యరుగునటుల జీవితపు టవిరామ సుస్నిగ్ధ సాధ న మపు డుత్సాహమున నిల్చి కొమరుమిగిలె. తే. శ్రద్ధ పలికిన పోత్సాహరమ్య వచన ములు గుసుమశరప్రేరణ కలిసి భ్రాంతి నావగింజ గుమ్మడికాయ యైనయటులఁ గల్పనముఁ జేసి ముందుకుఁ గదలివచ్చె. ఆంధ్ర కామాయని 10 5 545 తే. ఒలసి సిద్ధాంత మద్ది రూపొందుఁ దొలుత నంత దాని కెలమిఁ బుష్టి యగుచునుండు బుద్ధి యెల్లర కడనుండి పొంది యట్టి ఋణము నెల్ల వేళలను బూరించుచుండు. తే. స్వమతముగ మన సెపుడు నిశ్చయముసేయు నొక్కదాని దానికి బుద్ధి యొలసి దైవ బలముచే నెపుడు ప్రమాణములను బడయఁ గడఁగి యెన్నెన్నొ స్వప్నాలఁ గనుచునుండు. తే. పవన మెప్పు డయ్యలలె కల్పనముసేయు జలమునం దెద తరలత్వ మొలయు నెపుడు వ్యాప్తినొందు నభోవీథి నంతరాత్మ సేయు నదియే ప్రతిధ్వని పాయ కెపుడు. తే. తర్కశాస్త్ర మెయ్యెడను దాఁ దరతరములు తివిరి యద్దానినే సమర్థించుచుండు “ఇదియె క్రమమైన సత్యము ఇదియె సౌఖ్య మునకు నున్నతికిని నైన మొదటి మెట్టు. తే. ఒక్క శబ్దమ్ము వైన నీ వోసి సత్య మా! అతిగహనరూపాన నమరినావు ప్రౌఢ శేముషి నిజ కేళి పంజరమున రమ్యముగఁ బెంచుకొన్న కీరమవు నీవు! తే. నిఖిల విషయాల నీదు నన్వేషణమ్మె యల్పమగు నొక పునరుక్తి యటుల నుండె కాని తర్కహస్తస్పర్శ కలఁగినంత, ఔను అగుచునున్నావు నీ “వత్తపత్తి !" తే. కష్టముల నెన్నొ భరియించి కడగి పూర్వ మా మహాజలప్లవమ్ము నందుఁ బ్రదికి రిరువు రసురపురోహితుల్ - తిరుగుచుండి రాకులియు కిలాతుండును ననెడివారు. 546 10 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. మనువుకడ నున్న పశువును గనుచు నపుడు నామిషమునేచ్ఛ గొన్న యా యసురరసన వ్యాకులతను జంచలతను బడసి యపుడు పలుకుచుండె నెదియొ నేత్రపాళి తోడ. తే. ఏమిరా, కిలాతుఁడ! తిని తృణము లిటుల నెంతకాలము నేను జీవింతు? నెంత కాల మీ సజీవ పశువుఁ గనుచు నుందు? త్రావు టెన్నాళు లిట్టి "రక్తంపు - గ్రుక్క”? తే. భక్షణము సేయు దీని నుపాయ మొక్క టెదియుఁ గన్పించుటయె లేద ఇంతవఱకు? బహుదినమ్ముల పిమ్మటఁ బరగ నొక్క సారియైన నే మొరయింతు సౌఖ్యవీణ. తే. అప్పు డాకులి యీరీతి వనియె "ఏమి దాని వెనువెంట నెవ్వేళఁ గానుపించి సరస మసృణమమత్వంపు ఛాయ యొండు నవ్వుచుఁ జెలంగు నీకుఁగానంగఁబడదె? తే. తరిమికొట్టుచు నున్న దాంధ్యమ్ము నెల్ల నది ఘనాలోకకిరణచయమ్ము పగిది అర్థి ఛేదించు లఘుమేఘ మటుల మించి యనయమును నాదు మాయ నయ్యది రహించి”. తే. "ఐన గానిమ్ము పద! ఎదొ యాచరించి గాని నేఁడు స్వస్థుఁడను గాలేను నేను ఎన్ని దుఃఖము లట వచ్చె నేని వాని నన్నిఁటిని సహించెద సునాయాసముగను.” తే. ఇటుల నాలోచనము చేసి యిరువు రపుడు మనసు లగియించి ధ్యాననిమగ్నుఁ డయిన మనువు కూర్చుండి యోజించు ఘన నికుంజ వాటికా ద్వారసీమకు వచ్చి రెలమి. ఆంధ్ర కామాయని 15 20 547 తే. "కర్మయజ్ఞమ్ము సేయఁగాఁ గల్గు రమ్య జీవితస్వప్న దేవతా స్నిగ్ధభూమి తే. ఇట్టి విపినమ్ముననె వికసించుచుండు మానస మనోజ్ఞ కాంక్షాసుమాళి యెపుడు”. “కాని యెవరు పౌరోహిత్య మూనువారు - నాకుఁ గల్గిన దిప్పు డీ నవసమస్య & ఏ క్రమమ్మునఁ గ్రతువుఁ గావింపవలయు? విపుల మీ మార్గ మిపు డెటు వెడలినదియె” తే. శ్రద్ధ! ఈమె పుణ్యప్రాప్య!! సర్వ మీమె నా యనంతాభిలాష! న న్బాయ దెపుడు మరి, మదీయాశ యెవని నీ మహిత నిర్జ నమున వెదుకఁ గలదు సవనమ్ముఁ దీర్ప? తే. ఆననమ్మున గాంభీర్య మతిశయింప నంత మనువుతోఁ బల్కి రి ట్లసురహితులు “ఎవరి కొఱకు యజ్ఞము జరిగింప నుంటి వారె పంపింప నిచటికి వచ్చినాము. ' 77 తే. యజన మొనరింపఁ దలఁచినావా? యెడంద నిట్టి యన్వేషణము మరి యెవరికొఱకు? ఏమి? అరెరె, నీ వొక పురోహితునిఁ గోరి యెన్ని కడగండ్ల నోర్మి సహించినావు! తే. తే. 548 "ఈ జగాన రాత్రింబవ ళ్ళింపుమీర నెవరి ప్రతినిధులై ప్రకాశించు చుండు నంధకారము నాలోక మమరి యెవరి ఛాయ లగు నట్టి వరుణభాస్కరులె నేఁడు... ఆ ఘనులె, మార్గదర్శకు లగుత నాకు పొలసి నా క్రతువిధులు సంపూర్తి యగుత ! కదలు ఒక నా యజనవేదికను బిసాళి తమిఁ జెలంగుత జ్వాలాప్రదక్షిణములు. 25 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. అవి పరంపరాగత సుకర్మాళి కైన యందపు నేలికొక్కెములై పొసంగు జీవనపు సాధనకు సుఖ స్నిగ్ధ ఘటిక లందుఁ గలసియున్నయని యత్యంతముగను. తే. పులకపూరితములును సంపూర్ణ సౌఖ్య దములు నౌ మాదకస్మృతితతులె యగుచు నందుఁ బ్రేరణామయివోలె ననయ మెన్నో కృత్యములు సంచితములైన రీతిఁ దోఁచు. తే. అధ్వరము సేయఁ బోఁద్రోల నౌను నిర్జ నత్వ భూరి యౌదాసీన్యతత్త్వమమరు వర్తనమున మధురతీవ్రత, యొకించు కగఁ జమత్కృతి, యుత్సవగాఢలీల. తే. శ్రద్ధ కిద్దానివలనఁ బ్రశస్తమైన యొక విశిష్ట సుకౌతుక మ్మొదవఁగలదు నవ్యతాప్రలోభి యగు మానసము చేయ సాగె నపుడు నృత్యమ్ము ప్రసన్నముగను.
తే. అధ్వర మది పరిసమాప్త మయ్యె-అయిన నెగసి పవనాగ్ని కీల జ్వలించుచుండె దారుణంపు దృశ్య మట నేత్రముల కొదవు క్షతజ బిందువులును! అస్థిఖండములును!! తే. వేదికను నిర్మమత్వము వెలయఁ దోఁచె సుప్రసన్నతయు, పశువు శ్రుతమొనర్చు కాతరమునైన వాణియుఁ గలసి తోఁచె నెదియొ కుత్సితప్రాణి వసించు తెఱఁగు. తే. సోమరసపాత్ర యుండె విస్ఫూర్తి నిండి, ఉంచఁబడియె పురోడాశ మొప్ప నెదుట ఆంధ్ర కామాయని 30 549 శ్రద్ధ యటలేదు మనుమహాశయుని సుప్త భావము లవెల్ల మేల్కొన్న పగిదిఁ దోఁచె. తే. దృష్తివాసన బలిసి గర్జింపసాగె తే.
“ఎవరి యుల్లాసము సముజ్జ్వలింపవలెనొ వేరుగా నామె యట నుపవిష్ట యయ్యె ఎందులకు నిది యెల్ల? మరెందు కిద్ది. చెలఁగి మజ్జీవితంపు సంచిత సుఖమ్ము రమ్యరూపమ్ము నొందె నీ రమణియందు నట్టి యామెతో నెట్టు లే ననఁగలాఁడ 'నీవు నా దాన' వంచు నా యెదను విప్పి.” తే. సఖియ ఆమె కాలేదు ప్రసన్నురాలు శుభ్ర మెదొ రహస్య మ్మిట సునిహితమ్ము ప్రాణములఁ బాసి యాయజ్ఞ పశువు సౌఖ్య మునకు నాటంకమగుచుఁ దా మనునో యేమొ! తే. - అలిగినది శ్రద్ధ - ఇప్పు డే నయిన నట్టి యలుక సవరించి తేర్చఁగా వలసియున్నె? మానమును వీడి యామెయే మార్గమునకు వచ్చునా? లేక ఏ నెట్లు మెలఁగవలయు? తే. అంత మనువు పురోడాశ మారగించి సొగియఁగా మానసము త్రావె సోమరసము ప్రాణసంచయ రిక్తాంశపాళి నెల్ల మాదకత్వమ్ముతోడ నింపఁగను సాగె. తే. స్నిగ్ధతా ముగ్ద మౌ గిరి శృంగ వీథి సంజవేళను ధూసర చ్ఛాయలోన గగన మలిన శశాంక రేఖను ధరించి యపుడు చెన్నొందియుండె దిశాంతమందు. 550 35 40 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. శ్రద్ధ చేరెను శోకభారాన మరల నపుడు నిజ శయన గుహాగృహమ్ములోన ఒక విరక్తిభారము మ్రోయుచున్న యట్లు మించి తనలోనఁ దా విలపించు చుండె. తే. సన్ననౌ శుష్కకాష్టంపు సంధియందు ననలశిఖ యొండు జ్వలియించు చా గృహానఁ దనదు విస్పష్టకాంతితోఁ దమము నెల్ల దూర మొనరించుచుండె సంతుష్టి మెరసి. తే. - కాని శీతల పవనోర్మికలకు నద్ది యొక్కపరి తగ్గిపోవుచునుండె నొక్క పరి జ్వలించుచునుండె నవ్వానివలన- అయిన నద్దాని నెవ రేటు లాపఁగలరు? తే. శ్రద్ధ తన మృదువైన చర్మమ్ము నపుడు పరచుకొని, దానిపైన మైమరచి యుండె ఆమె యున్నది శ్రమమృదులాలసత్వ మొంది విశ్రాంతిఁ గైకొనుచున్న యటుల. తే. Gilb మహిత విశ్వమ్ము నిజ ఋజుమార్గ మందు నడచుచుండెను మెలమెల్లఁ గడగి-తారు. కలకుఁ గ్రమమున నొదవె వికాసగరిమ కట్టఁబడె మృగములు శీతకరురథాన. తే. శార్వరీ సుందరీమణి జారవిడిచెం దనదు జ్యోత్స్నామనోజ్ఞ వస్త్రాంచలమును పొలసి యద్దాని నీడలోఁ బొందుచుండె పరమ వేదనామయ సృష్టి బహుళసుఖము. తే. హిమమహీధరోచ్చయ శృంగకముల యందు నవ్వుచుండెను బ్రకృతి చంచల లతాంగి తనదు ధవళహాసమ్మును దనరఁ జిమ్మి స్నిగ్ధ సుషమల వ్యాపింపఁ జేయుచుండె. ఆంధ్ర కామాయని 45 551 తే. చెలఁగు లజ్జాయుతమైన జీవితంపు మంజులోద్దామ లాలస, మరియు నొక్క తీవ్రతరమైన యున్మాద తీక్షణత్వ మాత్మ నెవ్వేళ మథియించునట్టి యార్తి. తే. స్వాదువౌ విరక్తి గొలువ వరలు నాకు లతను నిండెను హృదయతారాపథమ్ము అయిన నయ్యెడ స్నేహంపు టంతరాగ్ని యర్ధి జనియించుచునే యుండె నాత్మలోన. తే. తెరచికొనుచు మూసికొనుచు నరయ భీష ణతనుబొలిచె నా యసహాయ నయనయుగళి కుటిలకటుత నిల్చినది సంకటము గదుర సరస సుస్నేహపాత్ర స్పష్టముగ నేఁడు.
తే. "ఎంత దుఃఖ మెడంద నే నెవరి వలతు నతఁడు రూపొందినాఁడు నే డన్యరీతి లీల మన్మనశ్చిత్రిత లేఖనమ్ము లౌర! సుందరస్వప్నమ్ము లయ్యె నయ్యొ! తే. మధుర మగు నీ పృథు మనోజ్ఞ మధువనాన జాగృతమ్మయ్యె దారుణజ్వాల యిపుడు ఎటుల చల్లారునో యిది యెఱుకపరుప నేర్తు రెవ్వరీ నీరవ నిర్జనమున. తే. అపరిమితము ననంత మీ యాకసమ్ము ఏ ప్రవేదనా నీడమై యెలయు నద్ది అలసతా రక్తిమలనిండి యస్మదీయ నేత్రవిశద పక్షముల నున్నిద్రమయ్యె. తే. వ్యాప్తినొందిన నీరవత్వమ్ము కరణి ననిలుని పదాలు కంపిల్లు నటుల నుండె 552 50 50 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 నభమునందున దశదిశాంతరములందు మలినమగు నుదాసీనత మసలె నిండి. తే. అతిశయ విదాహ మది వికలతను గలసి తే. యచటఁ బెంపొందుచుండె హృదంతరమున యుగయుగాల యసాఫల్య మొలయు నద్ది వడసి యవలంబనగఁ బైకి ప్రాకుచుండె. నిజ విషమతాపగరిమ నీ నిఖిలవిశ్వ మర్ది నాతంకత్రస్తత నంత వీడె బహుళమైన యంతర్దాహభరము వలనఁ బెల్లుగా నీలిమమ్ము వ్యాపించుచుండె. తే. ఉజ్జ్వలోద్వేలితమ్మయి యుండె నుదధి వ్యాకులతను దొరలుచుండె నలలగములు చక్రవాళంపు సురుచి రాస్పష్టరేఖ కమలిపోవుచు నున్నట్లు కానుపించు. తే. క్రమ్ముకొన్న పెన్బోగల కుండమ్ములోన నెటుల నటియించుచున్న దీ యిధ్మ కీల? తిమిరమను ఫణి గాఢరక్తిని తదీయ తే. హారి మణిమాల ధరియించె ననఁగ నుండె. పరమదుఃఖ దమసమాన భావమునను నీ జగమ్మెల్ల నేఁడు రోదించుచుండె దారుణంబగు నిర్మమత్వమ్ము కపట పెడఁద నిలువు నిలువున భేదించుచుండె. తే. తమిని జీవిత నిష్ఠుర దంశనముల వ్యాకులత్వ గుణోపేతమైన పీడ కన్నుదోయికిఁ గ్రీడయై కడఁగ నేఁడు నాట్యమొనరించు పాపసంచయము పగిది CJT. 55 60 00 ఆంధ్ర కామాయని 553 తే. తే. పిలువఁబడుచుండె భ్రమ యనుపేర చేత నా సుకౌశల స్కలన మనారతంబు దాని యొక బిందువున విషాద నదచయము పొంగి ప్రవహించుచుండె విస్ఫూర్తి గదుర. అదియె యపరాధ! మహహ!! అయ్యదియె విశ్వ దుర్భలత్వపు మాయ! అతుల వసుంధ రా వివర్జిత మాంద్యమ్ము రాగసంచి తోజ్జ్వల ధ్వాంత సుచ్ఛాయ! ఒహొహొ, అదియె!! తే. నీల హాలాహలమ్ముతో నిండి యున్న చంద్రుఁ డను కపాలమీదె హస్తమున నుండె! ఈ నిమీలిత తారలందెంత శాంతిఁ ద్రావి యీగతి నున్నాఁడ వీవు, దేవ! తే. పాన మొనరించుచున్నావు బహుళ విశ్వ గరళమును నీవు - జీవింపఁ గలుగు సృష్టి - మరల - నిత్యశీతలత యీ మాడ్కి నీకు వచ్చుచున్న దింతగను నే వంక నుండి? తే. అచలము ననంతమగు వీచికాళి మీద నాసనమువేసి కూర్చుంటివయ్య స్వామి! శ్రమకణమ్ముల పోల్కి తారకల నిటుల నిదె యొడలినుండి జార్చె దీ వెవరవయ్య! తే. అలసి నడకల వచ్చినా రరుగొ, దేవ! పాలపుంతను నక్షత్ర పాంథవరులు: రమ్య భవదీయ చరణ నీరజములందుఁ గర్మకుసుమాంజలుల నుంచఁ గడఁగినారె? అయిన వారికి దుర్లభం బైన నీదు స్వీకృతి లభించెనా? లేదు వెడలుడంచు నిత్యమును వచ్చు భిక్షుకనిచయ మటుల ఫలవిహీనతఁ ద్రిప్పి పంపఁబడుచుండ్రి. తే. 554 65 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. ప్రఖర నాశన శీలమౌ వర్తనమున వరలుచున్నది విపుల విశ్వంపు మాయ అక్షయము దాని వపువు క్షణక్షణమ్ము నభినవంబయి ప్రకటిత మగుచునుండు. Gub తే. అందరును సదా పూర్ణత్వ మందఁగోరి చెంది భ్రమను దోషములు తాఁ జేయువారె? జీవితాన యౌవనము నార్జించుకొఱకు బ్రతికి బ్రతికి చచ్చుచు నున్నవారె వారు? తే. పరమ గతిశీలమైన వ్యాపార మిద్ది ఆగదా యేమి యెప్పు డెయ్యదను నందు? క్షణిక మౌ వినాశాల నిశ్శబ్దముగను మంజుగతి హసించునె స్నిగ్ధమంగళమ్ము. తే. మానసిక మీ విరాగసంబంధ మెట్టి మానవత్వము! ఉన్నదా మానవతయు!! ప్రాణియెడఁ బ్రాణికిని గేవలముగ నిర్మ మత్వమే మిగిలి నిలిచెడి మాడ్కిఁ దోఁచు.
తే. ఏల, జీవనసంతోష మిటుల చెలఁగి యన్యరోదనమై నవ్వులాడ నేల! ప్రతివిరామమును గటివస్త్రమ్ము రీతి నొప్పి ప్రగతిని బంధించుచున్న దేల!! తే. ఒకరి దుర్వర్తనము వ్యథ నొందఁజేయ నన్యుఁ డెట్టుల మరువఁగా నగును దాని ఉన్నదే యరయ నుపాయ మొక్క టైన? గరళ మమృతమ్ముగాఁ జేయఁగలుగు టెట్లు? తే. తరళ వ్యసనమ్ము మాదకత్వమును గూడి యపుడు మేల్కొన్న, దయ్యెడ నక్కజముగ అచ్చటికి వచ్చుచున్నవాఁడయ్యె మనువు అట్టి యతని నెవ్వం డెటు లాపగలఁడు? ఆంధ్ర కామాయని 70 555 తే. లలిత మసృణ నగ్నభుజమూలముల వలన నమలి నామంత్రణము ప్రాప్తమగుచు నుండె? ఉన్నత పయోధరద్వయి నూర్మికలుగఁ జెలఁగి నర్తించుచుండె నాశ్లేషసుఖము. తే.. మంద నిశ్వాస పవనోర్మిమాలిక లట నిమ్నములు నున్నతము లయి నెగడె శీతకిరణుని హసనాన జీవితమున నాటుపోటులు వచ్చి. యటుల నుండె. తే. అందమది మేల్కొనియె యున్న నప్పుడచట నింతి యా సుకుమారి నిద్రించుచుండె నేడు నిజరూప చంద్రికానిచయ మందు నతివ నిశివలె నుజ్జ్వలయై యెసంగె తే. ఆమనోజ్ఞ మాంసల పరమాణుచయము స్నిగ్ధ విద్యుత్తులను విరజిమ్ముచుండె శబలిత మనోజ్ఞ కేశపాశమ్ము నందు పడుచునుండెను చిక్కు జీవనకణాలు. తే. గత మనోజ్ఞ చింతాశ్రమ కణము లప్పు డమల ముక్తాఫలమ్ముల ట్లందగించే కన దనూన ముఖ కరుణ కల్పనమ్ము ననుచు నవ్వాని గ్రుచ్చు విన్నాణములను తే. మనువు స్పృశియింపఁ గడఁగెను మరియు లతిక కంటకిత యయి రమ్యతా కలితయయ్యె స్వస్తతను గన్న బాధాసుభంగపాళి యటులు నా యంగవల్లిక యతిశయిల్లె! తే. 556 మహిత మీ విశ్వమధురి మోన్మత్త సుఖము లీలగా విరాణ్మూర్తి ధరించె నేఁడు అంధతా మిశ్ర మిశ్రితమైన కాంతి ఆ యెడ నొక వితానమ్ము నల్లె వలచి. 75 80 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. తన్వి కామాయని విడ చైతన్యమెల్ల కొంచెముగ కొంచెముగను మేల్కొనుచునుండె వచ్చి తనయంత నెదొ మనోభావ మప్పు డెలమి యేర్పడి యంత నశించుచుండె. తే. ఎపుడు సన్నిహితం బౌను నెడద యెవని కడను వాఁడె దూరుఁడగుచుఁ గడఁగుచుండు ఎవనితోఁ గొంత సంబంధ మెనసి ప్రీతి యుండునో వానియెడఁ గ్రోధముప్పతిల్లు. తే. నెట్టివైచియుఁ బ్రియుని బంధించి యుంచు నెగడుచును మనోమాయ వినీతి మెరసి తానె దేని ప్రత్యావర్తిత మొనర్చు "ప్రణయశిల" దాని మరలఁ జేరంగఁ దెచ్చు. తే. అంత మనువు నెమ్మదిగ నత్యానురక్తి జలదవేళా సమీరణస్పర్శ వలనఁ గంపితమ్మగు కిసలయకాంతి నెసఁగు శ్రద్ధకరమును దనదు హస్తమునఁ జేర్చె. తే. నేత్రముల నుపాలంభము నిండుకొనఁగఁ బలికె నీ రీతి ననునయ వాక్యములను మనువు “ఇది యెట్టి మానినీమాయ మౌనా"? ఓసి ప్రియతమ! యోజింపు ముల్లమునను. తే. ఏ శ్రమించి స్వర్గమును నిర్మించినాను, విఫల మొనరింపకుము దాని వెర్రివగుచు ప్రేయసీ! అచ్చరా!! వినిపింపు మోసి, ఆ యతీత నూతనగాన మనయ మీవు. తే. ఇట్టి నిర్జన భూమి కహీన కౌము దీ పులకిత జైవాతృ కోద్దీప్త నభము క్రిందనుంటి మీవును నేను కేవలమ్ము నేత్రములు మూసికొన నేలనే లతాంగి! ఆంధ్ర కామాయని 85 557 తే. భోగ్యమును ఘనాకర్షణాపూర్ణ మైన యీ జగమ్మెల్ల మనకె ఓ యింతి! ఇంక జీవితంపు టుభయ తీరసీమ లొరసి లలితముగ నిచ్చుగాత విలాసధార. తే. శ్రమయుతంబు నభావసంశ్రయము నీ జ గమును, దాని వ్యాకులతను, కలఁచి భీతి గొలిపెడి మన చేతనతను వలచి యెప్పు డేక్షణమ్మున మది విస్మరింపఁ గలమొ! తే. అది సురవిపులానంతత్వ మౌచు చిఱుత నవ్వు లలవోకగా నెఱినవ్వుచుండు ప్రణయినీ! కను మదిగో, జీవనరసంబు తొణికిసలను జాల్వారు బిందుద్వయాన. తే. దేవతల కర్పితమ్మైన దివ్య సోమ రస మిదిగో, దీని నీ యధరమునఁ జేర్పు మింతి! మాదకత్వమను నుయేల యందు జంటయై యూగుదము చెలి! సాగిరమ్ము. " తే. శ్రద్ధ మేల్కొనుచుండె నా సమయ మందు నేనియును మాదకతయె వ్యాపించియున్న దామె మధుభావసముదయ మాస్వదించెం దనుపు నందున, మనమునఁ దమ రసమ్మె. తే. ఒక సహజముద్ర తోడ నా యువిధ యనియె “ఏమి పలుకుచున్నాఁడ విట్లిపుడు నీవు? తత్పరత నిఫు డెదొ భావధారలోనఁ గొట్టుకొని పోవుచున్నట్లు గోచరింతు. తే. తిరిగి పరివర్తన మ్మరుదెంచె నేని యెవరు మిగిలెదరో, ఇది యెవరి కెరుక! ఎవ్వఁడే సహచరుఁడు ప్రాపించినంత నాచరింతువు నూతన యజ్ఞమొకడు. 90 95 558 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. ఎదియొ దేవతకొరకు రచింపఁబడును మరల నెదియు, దేని బలియె మాయ మోస మిది" - "మనము దానిచే నొందునది సకలము మన సుఖము కల్గ దెది మించి మన సుఖమ్ము. తే. అచల మీ జగాన మిగిలి నట్టి ప్రాణు లవ్వి- అట్టివాని కిచట నరయలేనె యెట్టి యధికారములు అవి యెల్ల నయయొ, సత్వహీనమ్ములా యేమి జగము నందు? తే. భాసు రోదార భవదీయ బహు నవీన మానవత్వ మ్మిదేన? ఓ మనువరేణ్య! ఇందు సకలమ్ము కైకొనుటే నటయ్య! శవత మాత్రమె మిగులునా స్వామి! యిందు?”
తే. "ఎన్నఁడును కాదు తుచ్ఛమో ఇంతి శ్రద్ధ! మన సుఖమ్మేని- అద్దియుఁ గనఁగ నొకటి ఒకటొ రెండొ దినాలుగా నుండు నిట్టి బ్రతుకునం దది యంత్య సర్వస్వమగును. తే. అరయ నే కడ నా యింద్రియాభిలషణ వడయునో సతతమును నా ఫల్యగరిమ ఓ విలాసిని! ఏ యెడ నొనర హృదయ తృప్తి మధురమ్ముగా నాలపించి మించి... తే. ఎచట మృదుల హాసము వికసించి నంత నొదవు రోమహర్ష మది యా జ్యోత్స్నయందు - ఆశలకు నై యెచట నొందు శ్వాసపాళి చెలఁగి యర్పించుకొనుచు నాశ్లేషతృప్తి - తే. దేని సముఖాన ననయము తిరివి విశ్వ మధురిమము, మంజుముకురము మాడ్కి నుండు ఆంధ్ర కామాయని 100 559 తే. నట్టి మనదు సౌఖ్యమును “కా దమరభూమి” యనుచు నీవేల యీగతి ననియెదబల! ఈ తుహిననగాంచలమున నేను దేని వెదకుచున్నానో తిరుగుచు, నదె యభావ మిపుడు స్వర్గమై యొప్పి హసించుచుండె చెలఁగి చంచలమ్మైన యీ జీవనమున. తే. సతము వర్తమానమ్ము జీవితఁపు సుఖము తే. నొలసి యెచట రాగమున సంయోగమందు నెనసి కపటి యైనట్టి యదృష్ట మచటం బ్రకటితం బగునేల? యభావ మగుచు. మన సమస్త కృతులకును మనమె సీమ లము - మనదు నభిలాష తీరంగవలయు కాకయున్నను పడినట్టి కష్టమెల్ల వ్యర్థమై చనుగద యెట్టి ఫలము లేక? 105
- 4*4*4
తే. శ్రద్ధ విడని మాంద్యముననె సవినయముగ నిటులు వచియించె నంతట "ఈ వివేక మొలసి శేషించి యీరీతి నుంట నెఱిఁగి కన్నుదోయిని దెరువఁగాఁ గడఁగె సృష్టి. తే. పీన మమతా విచక్షణాజ్ఞాన మిద్ది యిటులు మిగులునం చెంచియో యేమొ ప్రళయ జలధి నిజ దారుణోర్మికా నిచయమునకుఁ బరగఁ బొందించియుండు నావర్తనమ్ము. తే. సర్వమునకుఁ దాఁ గేంద్రమై సవదరింప వ్యక్తి యెటుల వికాసమ్ము వడయఁగలఁడు? ఇట్టి యేకైక మౌ స్వార్థ మెంత భీష ణమ్ము- మనలనియ్యది వినాశమ్మొనర్చు. 560 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. తే. ఇతరులు సుఖింపఁ జూచి సుఖింపుమయ్య! మనుమహాశయ! సుఖముగ మనుము నీవు విస్తృత మొనర్చి నీ సౌఖ్యవిభవ, మెల్ల వారిని సుఖులఁ గావింపఁ గోరుమయ్య! అగు నిది రచనామూలక మ్మయిన సృష్టి యజ్ఞ - మా యజ్ఞ పురుషున కర్ణి మనము చేయవలసిన సంస్కృతిసేవ నెల్ల నెంతయును విస్తృతమ్మును గావింపవలయు. తే. సీమిత మొనర్చుకొని సౌఖ్యసిద్ధి నెల్ల నీ వఱకె కేవలము దుఃఖనిచయ మీవు విడిచెదవు - పరప్రజలదౌ పీడఁ జూచి పట్టనటు త్రిప్పుకొనెదవు వదనమీవు. తే. కూణిత విముగ్ద మోహన కుట్మలములు దళములను బందిసేసినఁ దావి నెల్ల వికసనము నొంది మకరందబిందువులను మంజు సరసతఁ గనకున్న మరణమొందు. తే. వత్తలగు, రాలిపోవును - పాదదళిత మైన పరిమళమే యపుడబ్బు నీకు! అయినఁ బొందెద వెటనుండి యపుడు స్నిగ్ధ మధుమయామోదమును నీవు మనసుపడుచు. తే. తోఁచుసుఖ మెల్ల మనదు సంతోషమునకె సంగ్రహింపఁదగినది కాఁజాలదెపుడు తమిని నన్యులె దర్శింపఁ దగినయట్టి యొక్క దర్శనగ్రథితమై యున్నదందు. తే. నిర్జనమ్మున నొంటిగ నీవు మనఁగ నే ప్రమోదము వలచి లభింపఁగలదు అన్యహృదయసుమ మ్మెదియైన దీని వలన వికసనావాప్తిని బడయఁబోదు. ఆంధ్ర కామాయని 110 115 561 తే. సుఖ సమీరమునను నీదు సుమ మొకండె తే. తే. పూర్ణముగఁ బొందవచ్చు ప్రఫుల్లతలను మానవత్వంపు ధారచే మహితమైన సృష్టిసీమలవఱ కది చేరఁగలదు.”
మాటలాడెడివేళ నమంద ఫణితి నంతరంగ ముత్తేజిత మగుచునుండె ఎడఁదఁ గలయగ్నికీల సహించు కడక నారిపోవుచునుండె శ్రద్ధాధరములు. తానె మనువు సోమరసపాత్రము గ్రహించి యపుడు సమయము కనిపెట్టి యనియె నిటులు "త్రావుమా దీని! బుద్దిబంధనము లెల్లఁ ద్రెంచివైచును శ్రద్ధాసఖీ! చిరంటి !! తే. చెప్పినది యెల్ల యేను చేసెదను తన్వి! ఒంటిగానుంట సుఖ మేమియుండు ఇంత యైనయది నివేదన ఎట్టు లాగఁగలదు వదన మీ పత్రపాత్రికాస్వాదనమున?” తే. కనియె నయనాలు ప్రియునేత్ర కంజములను రసమునను ముద్దె నరుణాధరమ్ము లెడఁద కాల్పనికవిజయమున సుఖమ్మునొందె స్నాయువులఁ దోఁచె చైతన్యనవ్యతలును. తే. పరగి ఘనముగ ఛలవాణివంచనమ్ము హృదయబాల్యమ్ము నెప్పు డాడించుచుండు మరగొనఁ జేయు నెపుడు నమలినమైన దాని నిర్మలోజ్జ్వల విభుతాగుణము. తే. జీవితోద్దేశ లక్ష్యమ్ము చెంతనుండి, ప్రగతి పయనించుచున్న యా పథము నుండి, 562 120 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 యొక్క మధురేంగితమ్ముతో నొలసి యద్ది క్షణములోఁ ద్రిప్పి వేయఁగాఁ గలదు మనల. తే. రక్తి నిచ్చె మనోజ్ఞావలంబనమ్ము తే. నదియె శక్తి మనువునకు అది తన యభి నయమువలన లగించి మనస్సు నపుడు సౌఖ్యమునఁ జిక్కుకొనఁ జేయసాగె కడఁగి. "ఈ భయదమూర్తియై యున్న సృష్టిరజని అమృతకర చంద్రశాలిని యగును శ్రద్ధ! చెలియరో! యింక నీవు నా జీవితమున పరమసుఖసీమ వగుము పెల్పారుకొఱకు తే. ప్రాణము నొగి శాలీనతావరణ మెపుడు కప్పివేయును ఘన తమఃకజ్జలమున అనయమద్దాని న త్యకించన మొనర్చు వెఱగుపడ నన్ను నీ నుండి వేరుసేయు. తే. నలిపివేసినది యది యానందసుమము నిదియె బాధ-దీనిని తొలఁగించు మువిద! కలుగ మన కనుకూలసౌఖ్యములు మరల కడఁగి యత్నింపుమా! నన్ను కలసిపొమ్ము. తే. క్షితిజ ముడుకెత్తుటకు, తన్వి, యతిశయముగ వ్యాకు లోదార మధుర చుంబనము నిమ్ము! తివిరి యీరీతి నిదె తృషాతృప్తి కొఱకు రగులుచున్నది శీతలప్రాణ మతివ!! తే. ఆ విశాల గుహా నివేశాంతరమున కాష్టములు రెండు కలసినకడను, మధ్య, నర్థి వెలుగుచు నున్న యా యనలకీల ఆరిపోయె జాగృతిని స్వప్నాళు లటుల. ఆంధ్ర కామాయని 125 563 ఈర్ష్య (అసంతృప్తి) తే. క్షణిక మగుచు నెగడిన యా చంచలత్వ మెడఁద యధికారము సమాహరించె నెపుడొ మాన్య శ్రద్ధాసతీ మంజు మధురరజని వ్యాప్తిఁగావించు నిష్ఫలాంధ్యమ్ము నేఁడు. తే. మృగయ దక్క వ్యాపార మేమియును లేదు మనువునకు నిఫ్టు-నోటికిఁ దనియ సోకెఁ బరమ సమ్మోహ నారుణ వర్ణమునను శుభ్ర హింసా సుఖాయత్త శోణితమ్ము. తే. హింసనే కాక మరియొక టెదియొ-చీల్చి చింత-నాత్మ ప్రభుత్వంపు సీమలెల్ల విస్తరించెడి శక్తితో వెలయుదాని- మనువు వెదకుచుండె నధీరమానసమున. తే. అతని కీనాఁడు లభ్యమైనట్టిదాని కడను నవ్యత యేమియుఁ గానఁబడదు స్వాదు శ్రద్ధాసతీ విలాసమ్ము నీర సముగఁ దోఁచి రుచింపఁగాఁ జాలకుండె తే. అంతరంగాన నెవ్వేళఁ గాంత మైన తే. 564 ప్రబల లాలస ఘనమయి ప్రభవమొందు మెలసి యింద్రచాపము వోలె మరల నద్ది శాంతగతిఁ దిరోహితము కాసాగెఁ దానె.
"మూసి నిజవికాసఁపు మార్గముఖము ప్రాణ మెంతవర కలసతను నిద్రించు నిట్లు? 10 5 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 జీవితఁపు చిరచంచల స్నిగ్ధ కేక యెంతదనుక రోదించు నెయ్యెడను త్రాణ? తే. ఔను, శ్రద్ధాసతీ ప్రణయమ్ము! అందుఁ బ్రాథమిక మైన సరళాభివ్యక్తి తోఁచు నాదు వ్యాకుల భుజబంధనమ్ము లేదు కెరలి వెలివడు కుశలసూక్తియును లేదు. తే. తే. ఓలసి చిరునవ్వురేకలో నౌదుఁగు నట్టి శుభ్రభావనా మధురవిస్ఫూర్తి లేదు నవనివేదన, లుల్లసనములు లేవు ప్రసవ వికసన హొయలు నవ్యతలు లేవు. నవన వోత్సాహ లసిత విన్యాసములను, నాట్యశీ లానుగుణ నవీనతల, నమిత గర్వ యౌవత పదకంజ కౌశలాత్త భవ్య లీలోర్మికల్ లేవు వాణియందు. తే. అచట నుపవిష్టయై లేక యలపు శాలి ధాన్య మేరు నాయమ నిత్యతత్పరతను ఎరుగ కెయ్యెడఁ గ్లాంతి నొక్కింతయైన పొలసి ధాన్యపుం గింజలు ప్రోవుసేయు. తే. విత్తనమ్ములఁ గూర్చుటో, క్రొత్త కదురు పట్టి వడకుటో - మరి యిట్టి పనులె వలచి యెపుడు కూర్చుండి యుండు నా యింతి - అయ్య తీతవేళ దైనది మదస్తిత్వ మెల్ల.”
తే. వెడలి, యలసి, తిరిగివచ్చె వేటనుండి- కనుల కట గుహాద్వారము కానుపించె కాని ముందున కడుగిడఁ గలుగలేదు చిత్తమం దభిలాష- యోజింపసాగె. ఆంధ్ర కామాయని 10 565 తే. తే. తే. మొదట మృగమును, పిదపఁ గార్ముకము నతఁడు క్రిందఁ బడవైచి శిథిల శరీరమునను గూరుచుండె-ఆయుధమును, కొమ్ము, నారి, బాణ ముండెను జిందరవందరగను. “రాగమయి సంధ్య పొందె నల్లందనమ్ము- ఇంటి కా వేటకాఁడు రాఁ డిప్పటికిని చపలజంతువు మోసమ్ముసలిపి యతనిఁ దీసికొని పోయెనా దూరదేశమునకు?" ఇటులఁ దనలోనఁ దానె యోజించుచుండె కదురు పాడుచున్నది హస్తకంజములను- అయ్యె నన్యమనస్క యా యతివ, శ్రద్ధ గుల్ఫములఁ గేశములు ముద్దుగొనుచునుండె. తే. పరగె: నవకేతకీగర్భ పాండుముఖము నేత్రపాళి నలసమైన స్నేహగుణము, నవ్య లజ్జాయుత కృశత ననుచు నట్టి కంపిత లతోపమ మ్మైన క్రమ వపువు. తే. పరమ మాతృత్వభరమున వంగియున్న- పీన వక్షోజయుగళి సంప్రీతి దనరఁ గట్టఁబడె నీలరోమ వల్కలము తోడ - - తే. తరుణి కది యొప్పె నొక యలంకరణ మటుల. కనక సికతను గాళింది గమనరుచుల నించు నిట్టూర్పులతోఁ బ్రవహించు పగిది, అమరవాహిని పైన నీలాబ్జపంక్తి యమరి హసియించు వడుపున నద్ది తోఁచె - తే. బరువులేని నల్లని నేతవసన మొకటి యట్టిదే కటిపయి నామె చుట్టుకొనియె గర్భ మధురవేదన యుండె దుర్భరమయి ఉవిద జననీ ప్రసన్నత నోర్చుచుండె. 15 566 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. భావి జననీ మనోజ్ఞ గర్వమ్ము చెలఁగి శ్రమపృషత్తతియై వెల్గు సరణి తోఁచె అవని వనసుమావళి చల్లినటుల నుండె పరమమౌ మహాపర్వమ్ము వచ్చెదరికి. తే. సహజ శైథిల్యయుత మైన శ్రద్ధరూపు మనువు తిలకించె-అతఁ డందుఁ గనియెఁ దనదు కోర్కెకు దృఢవిరోధమ్ము- అంద రయఁగ నయ్యనుపమ భావచయము లేదు. తే. అతఁ డొక్కింత యైన మాటాడలేదు. మౌనమున సాధికారానఁ దాను చూచు చుండె - శ్రద్ధ యాతని యెద చొప్పెరింగి నటుల నించుక చిరునవ్వు నపుడు చిలికె. తే. పలికె మధుర సుస్నేహసంభరిత శ్రద్ధ! తే. “దినము దినమెల్ల నెచ్చటఁ దిరుగుచుంటి వింత ప్రియమైనదా యేమి యిట్టి హింస? దేహగేహాల మరపుకుఁ దెచ్చె నీకు? కడగి మృగమును వెన్నాడి కాననమున శాంతిఁ గోల్పోయి పర్వెత్తు సమయముననె యిచట వినుచు పదధ్వను లెపుడు నిలిచి యుంటి - నీ మార్గమే చూచుచుంటి నయ్య!. తే. మేలి బంగరుపవ అస్తమించె తిరిగి తిరిగి రక్తారుణతను జెందితివి నీవు వలచి గూళ్ళలో విహగదంపతులు కనుమ, కొసరి తమ శిశువుల ముద్దుగొనుచునుండ్రి. తే. కెరలుఁ గోలాహలము వాని గేహములను, నా గృహద్వారసీమ శూన్యముగ నుండె, ఎట్టి దగ్గు లోపమును గని యీవు పరుల ద్వారముల కేగుచున్నావు, పలుకు మెదియొ?” ఆంధ్ర కామాయని 20 25 567 తే. "లో టెదియు లేదు శ్రద్ధ, నీలోన- ఇంతి! ఏ నొక యభావమును సువీక్షించుచుంటి మరపుఁ గొన్న యెదో యొక్క మధురవస్తు వున్నయది గాయమును జేయుచున్నయటుల. తే. భూరి వివశతఁ జిరము క్తపురుషుఁ డేల యిట్టి యవరుద్ధ మగు శ్వాస నెటుగ్రహించు? గతివిహీనపంగువు వలె నతిశిథిల చ యముల రాశియై యేగతి నధివసించు? తే. ముగ్ధ జడబంధనము వలె మోహ మొకటి ప్రాణసంచయ మృదుశరీరమ్ము నర్థి “నెపుడు బంధించు - అతిగ బిగించు నిచ్చ, పరగఁ ద్రెంచు నట్టి విమోహ బంధనమునె”. తే. మనువు నవ్వుచుఁ బలికె ఆ మాటలందు మధుర నిర్ణయిరిణీ రాగమహిమ తొణికె గానములఁ బ్రాణములు మంజుగతులఁ దూలి పోవు నుల్లాసములతోడఁ బొలిచి మెరసె. తే. "అఖిలమును మరపించు నా వ్యాకులత్వ మెచట నున్నది, ఇంతిరో ఇప్పుడు నీవు తోఁచి యాశా మనోజ్ఞ తంతు వటు, తన్వి, కదురు నాడించుపనిని మున్దెదవు వలచి. తే. సఖియ! ఇది యేల! ఇట మృగశాబకముల మృదుల చర్మముల్ నీకు లభింపలేదె? ఏల యిటు బీజముల్ సంగ్రహింతు? నాదు మృగయ శైథిల్యమును జెందెనే లతాంగి! తే. తరుణి! ఈ తంతువాయభేద మ్మ దేల? మరియు జృంభించె నీ పాండిమ మ్మ దేమి, 568 30 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 ఇంతి? పలుకుమీ యిది యెల్ల నెవరికొఱకు - ఇందుఁ గలదె రహస్య మ దెద్ది యైన?”
తే. "ఆత్మరక్షణఁ గోరి నీ యాయుధమ్ము నెచటికైన నరుగఁ బ్రయోగింతు వేని యర్ధ మొనరించుకొనఁ గలనయ్య దాని- శస్త్ర మొనరించు రక్ష హింసకుని వలన. తే. మనుచుఁ దా మమాయకముగఁ గడుగ నెవ్వి మనకు మేలొనరించు సామర్థ్యమొదవ నున్నవో యవి మనరాదె యుపకృతులను దీని యర్ధమ్మదేమొ నేఁ దెలియఁజాల! తే. వరలు చర్మాలు వాని కావరణములుగ ఉన్నితో నాకుఁ బని తీరుచున్న- దవ్వి మాంసలము లయిమనవలె మనము, క్షీర గృహములవి, అమృతముల గ్రహింతమయ్య! తే. హేతువుతో వాని మనము పోషింతు మాత్మఁ దలఁప నయ్యవి ద్రోహపాత్రములు గావు పశువులను మించు నుత్తమత్వమ్మె యున్న భావజలధిసేతువుల మై పరగఁవలయు.
తే. "చేరు సహజ సౌఖ్యచయము దూరమగుట, వీర జీవనఘర్షణ విఫలమగుట, పెంపుతరిగి మనము మోసగింపఁబడుట- ఇంతి! వీని నే నంగీకరించలేను. తే. తావకీన నీలనయన తారలోన చెలియ! చూచెద నా ధన్యచిత్ర మేను? ఆంధ్ర కామాయని 35 569 నాదు మానసముకుర మనన్యమైన నీ వలననే ప్రతిఫలించి నెగడవలయు. తే. కాదు శ్రద్ధ! నవ్యతర సంకల్పమిద్ది చెలి అమూల్యమౌ నీ లఘుజీవితమ్ము రావిచిగురాకు వలెఁ జంచలతయుఁ దోఁచు నాసుఖ మనుభవింతు ననారతమ్ము. తే. కనవె యెపుడీవు స్వర్గ సౌఖ్యముల మీదఁ బ్రళయము ఘననృత్యమ్మునుఁ బరిఢవింప? పిదప నాశము, చిరనిద్ర, వెలఁది! ఏల? ఇంత దృఢతర విశ్వాసమేల నీకు? తే. ఇంతగా మేలుకొనె నేల యీ చిర ప్ర శాంత మంగళాభిలషణ? ఏమి? ప్రేమ! ప్రేమసంచయ మేల కావింతురిట్టు లువిద! ఎవరిపై ననురాగ మున్నదవని? తే. ఎట్టి జీవనవరదాన! మెలమి రాజ్ఞి ఇమ్ము, నీప్రేమనెల్ల నా కిమ్ము నీవు అర్థిఁ గేవలమును నస్మదర మైన యూహలే నీ యెడందలో నుండవలయు. తే. తనరి నాకది విశ్రమస్థాన మగుచు నించు నొక స్వాదుజగము సృజించుఁగాక! ఒక్క టొకటిగ నం దల లొలసి యెగయు దివ్య మధుధార కెరలి నదించుఁగాక!! తే. "ఒక్కదానిని నిర్మించియుంటి నేను, రమ్ము, చూడుము, నా కుటీరమును నీవు" - శ్రద్ధ యిట్లని మనువు హస్తమును బట్టి యాతురత తోడఁ గొనిపోయె నతని నటకు. 570 40 45 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. ఆ దరీపరిసరముల నమిత శాంతి పుంజ మగుచునా రెల్లిల్లు పొలుపుమెరయు లలిత వల్లరీ శాఖికావళులు గలిసి బంధురమ్ముగ రమ్యతాప్రౌఢి నొసఁగ. తే. పర్ణములనుఁ బ్రాచీరమ్ము ప్రాప్తమయ్యె కోయఁబడినవి చిన్ని వాతాయనములు : వచ్చిపోవును నిముసమ్ము వరలి యవ్వి, ఆగుటలు మేఘపవనాల కచట లేవు. తే. పిన్నదగు నాకుటీరానఁ బ్రేపతీవ యల్లి కల నందగిల్లు నుయ్యాల యొకటి సుమచయ మసృణ సురభిళ చూర్ణ మవని రమ్యమోహనముగ వికీర్ణమయి చెలఁగు. తే. మధుర మధురాభిలాష లమందగతుల నెన్నియో మౌనముగను జరించు నందు నవ్య మంగళ మధురగానము లవెన్నో మూల మూలలఁ దారాడి పొలుపుమెరయు. తే. ఇంతి, గృహలక్ష్మి, కట్టిన యింటితీరు కనుచునుండెను జకితుఁడై మనువు- కాని అద్ది యతనికి బాగున్న యటుల లేదు- "ఎందు కిది! గోమున సుఖింతు రెవ్వరించు?” తే. మనువు వహియించె మౌనమ్ము- అనియె శ్రద్ధ: "నిర్మితమ్మయ్యెఁ జూడుమా నీడ మిద్ది! కాని యింకను నీ కుటిఁ గలరవానఁ జెలఁగి వెలుఁగొంద రాలేదు శిశుగణమ్ము. తే. నీవు కడుదూరముగ వెళ్ళిపోవు నప్పు డిచట నుపవిష్టనై యుండి యేను కదురు చేతఁగొని నిర్జనతఁ ద్రోయఁ జిత్తమొసఁగి యొడుకుచును దాని నెవ్వేళ నున్నదాన. ఆంధ్ర కామాయని 50 571 తే. 'నెమ్మదిగా నెమ్మది నడుప నీవు కదరు ప్రియుఁడు వేటాడు తమినిఁ దా వెడలినాఁడు,' అనుచు ప్రతివర్తనంపు స్వరాళియందు మునిఁగి కూర్చొని యేఁ బాడుకొనుచునుంటి.” తే. నీదు సుకుమారతను బోలు స్నిగ్దజీవి తంపు కోమలతంతులు తరలుగాత! వలఁ గొనుత యందుఁ జిరనగ్న ప్రాణ మెపుడు! అందపుం గౌరవమ్ము వెల్గొందుఁగాత!! తే. ఉజ్జ్వ లాంశులఁ బోలుచు నొప్ప నాదు జీవనప్రభాతము నేయఁ జెలఁగుమీవు వసనహీన యైన సరళ ప్రకృతి దానం గాంతితో మృదుల వపువుఁ గప్పుకొనుత!!
తే. వ్యసన పూరితమైన నేత్రాళి మీఁదఁ బరగ వేయుము వెల్గుటావరణ మీవు అందు లతికపై వికసించు నమల సుమము పగిది సౌందర్య ముజ్జ్వల మగునుగాత!! తే. అట్టి యాగంతుకుఁడు గుహాభ్యంతరమునఁ బశువువలె వస్త్రహీనుఁడై వరలకుండు గాత!! తన యభావజడతఁ గడఁగి యెపుడు నొంటిగ నిమగ్నుఁడై యుండకుండుఁ గాత!! తే. ఈవు లేనప్పుడిక నెన్నడేని నాదు లఘుజనము శూన్యమై యురలాడఁబోదు వానికై పుష్పరస ఫేనపటలి నిచట మృదుల మోహనముగ పరచెదను నేను. తే. ఉంచి డోలిక నవ్వాని నూపుచుందు ముద్దుఁగొని శరీరమును నే బుజ్జగింతు నే 572 55 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 కదియఁగా హత్తుకొనుచు వక్షమ్మునందుఁ ద్రిప్పెద వలపుమెయి నీ దరీజగాన. తే. చిరుత కురులను విప్పారఁ జేసికొనుచు నతఁడు వచ్చు కోమల మలయానిలముగ అతని యధరమ్ములందుండి వ్యాప్తి నొదవు స్వాదు మృదుహాస లతికా ప్రవాళరేఖ. తే. రమ్య నవమోహ నోజ్జ్వల రసన నతఁడు పలుకు నెంతయో తీయని పలుకులెలమి కలిపి చల్లు నా వ్యథపైనఁ బలుకులవ్వి కుసుమధూళీ మరందాలఁ గొసరి కొసరి. తే. నిర్వికారమ్ము తావాని నేత్రములను జూచి నా ముగ్ధచిత్ర మేఁ జొక్కునపుడు స్తబ్ద మామకీన నయనజల మదెల్ల నమల సురభిళ పీయూష మై రహించు.”
- 4*4*4
తే. "ఒప్పెదవు నీవు సౌఖ్యగంధార్మికలను కంపితము సేయు వనలత గతిగ నింక శుభ్ర ఘనసార మృగము నై సురభికొఱకు ననయ మేను దిరిగెదను వనవనమ్ము. తే. ఇట్టి జ్వాలను, దన్వి, సహింపలేను, నా మమత్వమె కావలె నాకు నెపుడు ఇట్టి పంచభూతాత్మకసృష్టి యందు నెలమి నొకతత్వ మగుచు రమింతు నేను. తే. ద్వైత మియ్యది, ఈ ద్వివిధమె ప్రణయము పంచుటకు నొక రీతియై పరగుచుండు ఏను భిక్షుకుఁడనె, కాదు, ఎన్నఁ డైన నేను నా కోర్కె తిరిగి పొందెదను గడఁగి. 60 00 65 ఆంధ్ర కామాయని 573 తే. వితరణము సేయవలదీవు విమల సజల వారిదముగ బిందువుల నుదారరీతి ఏ సకల కళాధర శరదిందువగుచు నీ సుఖనభమునను సంచరించుచుందు. తే. ఒకట నాకర్షణాయుక్తి యెదవ నవ్వి యాత్మ విస్మృతి నొందిన యట్లుచూతు వోసి మాయావినీ! వర మొసఁగుచుంటి వని తలంచి మోకరిలి యేఁ గొనను దాని. తే. అతివ! ఎదఁ దలఁపకుమా దయాభరమ్ము నిలువ నా మీఁదనే నీవు నేర్తు ననుచు ఉత్సహించి యొనర్పుకు మోసి శ్రద్ధ! అఖిల మీ ప్రయాసము సదా వ్యర్థమగును. తే. నీవు సౌఖ్యాన నుండుమీ నీ సుఖాన స్వేచ్ఛగా దుఃఖమును బొందనిమ్ము నన్ను మానసిక పారవశ్యము మహిత భేద మనెడి మంత్రము పఠియింతు నతివ! యేను. తే. సంచిత మహానుభవ మను సర్వభార మిచటనే యుంచి వెడలెద నింతి! నేను ధన్యుఁడను నాకుఁ గంటకతతి లభింపఁ గుసుమకుంజము నీకుఁ జేకూరుఁగాత!! తే. అరిగె జ్వలనశీల మగు హృదంతరమున మనువు - ప్రాంతమ్ము శూన్యమ్ము కనఁగ నపుడు “ఓయి నిర్మోహి! అగుము, ఉండు, వినుము” అనుచు శాంత్యధీరత శ్రద్ధ యనుచునుండె - 70 00 71 574 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 ఇడ (అన్వేషణ) తే. తరలి యెట్టి గహనగుహాంతరము నుండి బ్రతు కనెడి సంక్షుభిత మహాపవన మిద్ది యనల జలముల గగన భూ మ్యనిలములను వికల పరమాణు పుంజమ్ము వెంటఁ గొనుచు... తే. ఝంఝవలె వ్యాకులతతోడి సాగివచ్చె - బ్రతుకు భీతితో సర్వము న్యాలముగనుఁ జేసి లీనమై ఘనభయోపాసనమున, జగము దీన మౌనటు వంచసాగెఁ గటుత. తే. సర్వ నిర్మాణములలోన, సకల నాశ నములఁ దనశక్తిఁ జూపుచు నమితగతులఁ గడఁగె నిది తొలినుండి సంఘర్షణమున అన్నిట విరాగము, మమత్వ మమరి తోఁచు. తే. బ్రతుకనెడి విషమంపు నారాచ మెపుడు వెడలినది చిరంతన మను విల్లునుండి? ఎట్టి లక్ష్యము భేదింప నెంచి యిద్ది చెలఁగి వెడలెను శూన్యమున్ జీల్చికొనుచు? తే. తత హిమానీ మహిత రంజితమ్ము లగుచు నొదవి నిర్లక్ష్యభరముతో నున్నవాని నున్న తోన్నత శైలశృంగోజ్జ్వలముల నేను తిలకించినాఁడ రహించి, మించి. తే. ఆత్మ జడ గౌరవమున కే యవనియొప్పి యొక ప్రతీకగ నున్నదో యట్టి వసుధ గర్వగరిమ సర్వమును భంగమ్మొనర్చి నిజ సమాధిని సుఖముగా నిల్చెనవ్వి. ఆంధ్ర కామాయని 5 30 575 తే. పరఁగుచు నమాయకముగ నా పర్వతంపు స్వేద జలబిందువులు కొన్ని స్వీకరించి నదులవిగొ ప్రవహించుచున్నవి - స్థిమిత న యనము, విగతశోకక్రోధ మరయ నగము. తే. ఇట్టి ముక్తిని జడత వసించుచుండుఁ దమిని నేఁ గోర నీ జీవితప్రతిష్ఠ కంపన తరంగము అడుగునడుగునందు నగజగమ్ములఁ జుంబించు నట్టి పవన... తే. మటుల, జ్వలన శీలతనొప్పియు యతి గతిమ యుం డయిన యాదినకరుని యొప్పుమీరు మామక మనో నిరాతంక మహితవృత్తి నెల్ల వేళల నొదవ నే నిచ్చగింతు. తే. స్నిగ్ధ రమణీయ మౌ తొలి జీవితంపు గృహము నాత్మతేజమున వెల్గించి, విడిచి తమి గుహా కుంజ వన మరుదంచలముల వెదకుచుంటి నాదు వికాసపదముకొఱకు. తే. ఎవరి నైన నేను గనికరించినానె? వెట్టినై మమత్వమును భంగించినాను ఎవరి కుదారుండ నై సంతసించినాను? ఏ నెవరియెడ స్పర్ధ వహింపలేదు. తే. నాదుకేక యీ విజనాన రోదనమ్ము సేయు - ప్రత్యుత్తరము లేదు - చెలఁగి వాడి పోవునటు చేసి వడగాలి పోల్కి పర్వు లిడెద నా వల్ల నే సుమ మెపుడు విరిసె. తే. శిథిల కల్పనా జగతి వసించు చేను స్వప్న మెయ్యెడ దర్శించువాఁడ నైతి కుసుమ మధుహాస మెన్నఁడే కోర్కె మెరయ సురుచిరత నొప్ప నెయ్యెడఁ జూచినాఁడ! 576 10 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. తత మహా దుఃఖమయ జీవితప్రకాశ మాత్మ సౌఖ్యాన నిహతాశమై విశాల గగన నీలలతా శాఖికలను జేరి చిక్కుకొన్నది కదలికఁ జెందలేక. తే. వేని నే మొగ్గలనుచు భావించినానో వ్యాప్తిఁగనె ముళ్ళుగాఁ జుట్టుప్రక్కల నవి ఎంత విజనాన నేఁ బయనించినాఁడ! అలసి పడియుంటిఁ బూర్తిగా నయయొ, యెటనా! తే. నన్నుఁ గని ముక్తశిఖరాలి నవ్వుచుండె ఏను నిర్వాసితుఁడను రోదించుచుంటి శాంతి వీడి ఈ విధి నటీ చటుల నృత్య భీషణచ్ఛాయ యిదె తాండవించుచుండె. తే. కోటరము వోలు శూన్యతావాటి నిండి గంతులిడు నసాఫల్యత ఘనత మెరసి నాశనము చేసి జ్యోతిఃకణాళి, కడఁగి వర్షరాత్రుల మిణుగురుల్ పట్టుచుంటి. తే. జీవిత నిశా తమమ్మ! విచిత్ర నీల హిమజలధి వియై యెంత విస్తృతిని గొనుచు వ్యాప్తినొంది - తీ నిర్వికారాత్త చేత నత్వ కిరణము లెన్ని లీనమగుచుండె. తే. ఓసి మాదకతమమ! నీ యొడిని నొదిఁగి యిపుడు నిఖిల భువనము శయించియుండె మూర్తిఁ దాల్చి ప్రతిక్షణపు పరివర్త నమున దాగియుందువు రహస్యముగ నీవు. తే. అమృత సౌభాగ్యవతి తరంగాంకముల లలిత కాశ్మీర రమ్య చూర్ణమ్ము పగిది తరుల కాంతి మమత్వంపు టరుణరేఖ వికసనము నొంది కన్పట్టు విస్ఫుటముగ. ఆంధ్ర కామాయని 15 20 577 తే. ప్రాణ నిచయ నివాస విశ్రమమ! రమ్య చతుర సమ్మోహ జలధర చ్చాయ వీవు కాంతమాయా కృతాభిషిక్తా మనోజ్ఞ లలిత మోహన కేశకలాప మీవు. తే. జీవిత నిశీధినీ ఘన చిత్రతమమ! అపరిపూర్ణ లాలస, వ్యథ యగ్నికణము నటుల నెటు కేకవెట్టునో యట్టి కోర్కె రగులఁ క్రొత్తగా తోఁచెడి పొగను బోలి. తే. తిరుగుచున్నావు - యౌవన దివ్య మధు వ నంపు కాళింది యిటు దిగంతముల ముద్దుఁ గొనుచుఁ బ్రవహించుచున్నది కొమరు మీవుల- నవె మనశ్శిశువుల చిన్ని యాటపడవ... తే. లర్థిఁ బర్వెత్తుచున్న వనంతముగను చటుల మాయావినీ వినిశ్చల విశాల నయన విరచిత నీలాంజనమ్మ! రమ్య మైన యాకర్షణమ్ము నీ యందు నవ్వు. తే. మసకరేఖలఁ జైతన్యమయము చంచ లమ్ము నైన చిత్ర వినూత్న లలితసృష్టి! శ్యామల చిరప్రవాస పథాళిఁ బ్రాణ పికరుతులు నింగిని బ్రతిశబ్దించి విరియు. తే. దుఃఖసౌఖ్యంపు పరిభాష తోఁచు ధ్వస్త శిల్పమటుల శూన్య నగరసీమ నిదియె కడఁగి వికృతంపు వక్రరేఖలునుఁ బరఁగు ప్రాణుల యశాంత విధిగ నీ ధ్వస్తపురము. నీ తే. అఖిల సుఖమయ స్మృతు లిట నపరిపూర్ణ కాంక్ష లై చరియింతు నే కడను గనిన ఇట్టి రాసులు దుఃఖదురేచ్ఛ అణఁగి యున్నయవి జీర్ణపత్రాళి యున్నయటుల. 578 25 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. కల్గు సంకోచము ప్రణయగరిమ యందు విజన దిశలందు వ్యథనిండి వెల్లివిరియు ఇట్టి జీర్ణపాదపమున నిదె చిగుర్చు చుండెఁ జిద్వృత్తి 'సురలత' యుదియకొనుచు. తే. జీవితసమాధి సంబంధి శిథిలములను నతి నిశాంతముగా వెల్గునట్టి దివ్వె లివిగా, వలచి తమకుఁ దామె యిటుల నిపుడు శమిత మగుచున్నవి అతి ప్రశాంతముగను. తే. శ్రాంతుఁడై మను వటఁ బథిశ్రమము వలన నిటుల నేమేమొ మివుల యోజించుచుండె సకలసుఖ సాధనమ్ము ప్రశాంత యుతము నైన శ్రద్ధనివాసమ్ము నాతఁ డెపుడు... తే. విడిచి వచ్చెనో యటనుండి విపుల మార్గ ములను దిరుగుచు, నాగుచు నలసినంత వచ్చి, తుద కీ శిథిల పురప్రాంత మునకు - ఇట సరస్వతి పేర్మి నందించుచుండె. తే. శ్యామనిశి యపుడుండె నిస్తబ్దముగను దళిత వసుమతీ వికల దుర్దశ నవేళ ధీరగతి వెల్గుచు ననంత తారకాళి కడఁగి నిర్నిమేషమ్ముగాఁ గనుచునుండె. తే. వృత్రహుని జనాకీర్ణ పురీలలామ మిద్ది యెంతయు శూన్యమై యిట్టు లయ్యె ఇంద్ర జయకథా స్మృతులు కల్పించుచుండె, నిబిడ దుఃఖములను ద్విగుణీకృతముగ తే. దివ్య మిట్టి సారస్వతదేశ మిపుడు పొందుచు నహీన దుస్వప్నములను క్లాంత గతి వహించియున్నది- నలుగడల నలమి వ్యాప్తిఁగొన్నది ఘోరత రాంధ్య మిదియె. ఆంధ్ర కామాయని 30 579 తే. జీవితఁపు నవాలోచన చెలఁగ నొకట కలిగె సంఘర్షణ - అమరగణము నేని రాస్థత శరీరసంబంధ మైన పూజ నమ్ము కొఱకు విపుల ప్రచారమ్ము వలచె. తే. ఆత్మవిశ్వాస నిరతు లైనట్టి త్రిదశ గణ మిటుల పల్కి రున్ముక్తకంఠమునను: "సంతతారాధ్యుఁడను నే నిరంతరమ్ము నాత్మమంగళోపాసన మందు రతుఁడ. తే. ఉల్లసన శీలమున శక్తి కొదవు కేంద్ర మును, శరణుకోర కే నెవరిని వెదకుదు? అమల చిత్రజీవిత వికాసాత్త మధుర వర మహానంద శక్తి ప్రవాహమిద్ది. తే. విశ్వ మిది నిత్యహరిత మై వెలయఁ జేయుఁ క్రొత్త లెవియొ! అసురు లిటఁ గ్రుంకి ప్రాణ సౌఖ్యసాధనం జేసి సంస్కారములను గట్టుబడుదురు నియమ నిగళవ్రజాన. తే. అర్థిఁ బూజించుఁ దుచ్ఛ దేహము నొకండు ఒకఁ డపరిపూర్ణమౌహుతి నొంది మదిని దన నొక ప్రవీణుఁ డంచును దలఁచుచుండుఁ- బరఁగు నిరువురి హఠము తీవ్రముగ నొలసి. తే. ఇరువురును నిల విశ్వాసహీను లరయ, శస్త్రములఁ దర్కమును నిల్ప సాగినారు. సమర మేతెంచి యేటికి సాగకుండు? కలిగి జరిగె నశాంత సంఘర్షణమ్ము. తే. వరలు నీ వ్యతిరేకభావములె నేఁటి 580 వఱకు కలవు నాయం దొకవంక నిండి మమతతో నాత్మమోహమ్ము, మంజుల స్వ తంత్రమైన యుచ్ఛృంఖలతయును నొకట. 35 40 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. ప్రళయ భయభావమున దేహరక్ష కొఱకు భక్తిఁ బూజింపవలె నన్న వ్యాకులతయుఁ బరఁగు దీను గావించు నీ ద్వయము నన్ను నేను శ్రద్ధావిహీనుఁడ నిజముగానె.”
తే. మనువ! శ్రద్ధాసతిని నీవు మరచినావు: ఆత్మవిశ్వాసపరిపూర్ణ యామె ఎగురు గొట్టితివి దూదిపింజగా నట్టిసతిని తలఁచితివి విశ్వమది యసత్తనుచు నీవు. తే. తంతువున నూగు నిట జీవితమ్మటంచు సౌఖ్యసాధనలోఁ జెల్లు క్షణములవియె నెలయు సత్యమ్ములనుచు భావించినావు వ్యసనపరితృప్తియే నీకు స్వర్గమయ్యె. తే. ఇద్ది వ్యతిరేక బుద్ధి యార్జించుకొన్న వ్యర్థ మౌ జ్ఞానము పురుషత్వపు విమోహ మొదవ, స్త్రీకిఁ గొంతగ సత్త యున్న దనుచు మరచినావయ్య మదిలోన మనువరేణ్య! తే. ఇలను నీ యధికారాధికృతుల మధ్య వరులు బంధము సమరసత్వమ్ము గాదె” అనుచుఁ గంపింపఁగా ననంతాంబరమ్ము పరమ తీక్షణోజ్జ్వల వాణి పలుకునపుడు
తే. మదినొసంగి తాను వినెడి మనువు నెడఁద యందు శూలము గ్రుచ్చుకొన్నట్టు లయ్యె "అరె! ఎవరిది? మరల నా యనంగుఁ డేన? నన్ను భ్రమయందుఁ బడవైచి మున్నితండు... ఆంధ్ర కామాయని 45 581 తే. రమ్యజీవిత విశ్రాంతి లాగికొనియె కడఁగి యిటుల పలుకునఁ దా కాముఁడేన? ఏ క్షణాల నామమ్ము శేషించియున్న దా యతీత మియ్యెడను బ్రత్యక్షమయ్యె - తే. అట్టి గతకాలసుఖము నా యంతరంగ మెల్ల నివ్వేళ నిట పులకింపఁజేయు స్నిగ్ద దుఃఖ తాపజ్వాలచే మనమ్ము, నవయవమ్ములు జ్వలియించు నటులఁ దోఁచు. తే. మనువు పలికెను: "భ్రాంతసాధననె నేటి వఱకు మగ్నుండనా నేను? పలుకలేదె నీవు శ్రద్ధాసతిని బొందు మీ వటంచు? పొందినా నన్నయటు స్నేహపూర్వకముగ - తే. ఆమె నా కిచ్చె నిజ నిర్జరాన్నధామ
మై నెగడు హృది నా నాఁ డనన్యముగను అయిన మరి పూర్ణకాముఁడ నై చెలంగ కేల యిట్లున్న వాఁడనో యెరుకపడదు.” తే. "ప్రణయపరిపూర్ణ నిజ సరళాంతరంగ మొసఁగినది యామె అందున నుండె నిండి జీవితంపు ప్రమాణము - చేతనతయె అందు నెల్గొందు శాంతకాం త్యతిశయములు. తే. అయిన నీవు సదా పొంది తామె యందు రమ్య జడమైన యా శరీరమ్ము నొకటె సరస మోహన సౌందర్యజలధి నింపి తెచ్చినావు నీ గరళపాత్రిక నొకండె. తే. అర్ధ మొనరించుకొనఁజాల వైతివయ్య నీ యపూర్ణత్వమును, నీ వమాయకుఁడవు పరిణయమ్మునఁ బూర్ణమౌ వలను నుండి యాగిపోయినా వీవు స్వయమ్ముగానె. 582 50 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. తే. 'ఎదియె నాయది కావలె - ఇట్టి రాగ భావ మరయఁగఁ బూర్జతా భావమునకు సంకుచితగుణ, మజ్ఞానసరణి మహిత మానసపయోనిధిని క్షుద్రయాన మౌను. "ఈ విపు డిదె స్వతంత్రత నెనయఁ గోరి యాత్మ కలుషము లుంచుచు నన్యులపయి, నౌను ప్రత్యేకతంత్రము న్బూనినావు ఒదవు నిత్యమై మదిని ద్వంద్వర్గమమ్ము. తే. నిశ్చయమ్మయి యియ్యది నెగడునెపుడు శాఖికలఁ గంటకాళి, పుష్పములు లభ్య మగును వికసించి- నడచి నీ యభిరుచి కను వైన యటుల నీ గతి గాయపడితి వయ్య. తే. దేని కాంక్షించితో నీవు దాని నర్థిఁ గైకొనుచు నున్నవాఁడవు - కడఁగి వలచి యీవు మనువ! గ్రహింపలే దెపుడు ప్రాణ కలిత కీలా ప్రణయ సుప్రకాశనమును. తే. జ్వలితవాసనకుఁ బ్రథమస్థాన మొసఁగి నావు చిరజీవితభ్ర మాంధ్యమున నీవు నీ ప్రజాతంత్ర మే యెడ నియతిచక్ర యంత్రమున బోలి వికలమౌ నరసిచూడ. తే. ఎన యెఱుంగక శాపభూయిష్ఠ మగుచు నీ యభినవ మానవసృష్టి యెల్ల వేళ ద్వైతమున మగ్నమై పెంచు వర్ణములను తన వినాశము నొదవించుకొనుచుఁ దానె- తే. సాగి యజ్ఞానమున సమస్యల సృజించు అమిత కోలాహలము కలహమ్ముఁ గలుగు కలుగు భేదభావమ్ము లైక్యత నశించి అభిలషితవస్తు వది దూరమందె నిలుచు. ఆంధ్ర కామాయని 55 60 00 583 తే. అమితవేదనా దీర్ఘభేదము లభించు వక్షజడతయె యెడఁద కావరణ మగును ఇల జనులు పరస్పరము గుర్తింపలేరు విశ్వము పడుచు లేచుచుఁ వెడలుచుండ... తే. పరిగి యెదుట నఖిలము సంపన్నమయ్యు తొలఁగి సంతుష్టి నిరతము దూరమగును ఇట్టి లఘుదృష్టి దుఃఖమ్ము నిచ్చుచుండు ఎన్నియో కోర్కెలెపుడు జనించుచుండు. తే. కాంక్ష లనియెడి శైలశృంగమ్ము లశ్రు జలధరమ్ములఁ జుంబింపఁ దలఁచు నిండు జీవననది హాహారవ జీవనములఁ గలఁగి పెల్లు పీడాతరంగములు రేగు. తే. లాలసాయుత యౌవన రమ్య సమయ మాకురాలెడి కాలమై యరుగుచుండు బహుళ నవ్యసందేహముల్ ప్రభవమొందు అందుచే భీతసంతప్త మగుచు నెపుడు... తే. స్వజన వైరము తిమిరమై వరలి నిండి పృథుల నీల 'కుహు' వలె వ్యాపించుచుండు బహుళ సస్య సుశ్యామల ప్రకృతి లక్ష్మి తల్లడిల్లును దారిద్య్ర దళిత యౌచు. తే. అమిత తృష్ణార్తి కాకృష్ణుఁ డగుచు నరుఁడు పతఁగ మై యంత గాఢ దుఃఖాబ్ది యందు శక్రచాప మై మార్చు నజస్ర చతుర బహుళ నూతన రమణీయ వర్ణములను. తే. పరఁగదు పరిపూత గతినిఁ బ్రణయమెచట స్వార్థముల నావృతమ్మయి సంకుచితము భీతమును నగు - సృష్టి జీవితము విరహ భరితమైసాగు కరుణ సంస్ఫురిత గీతి. 584 65 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. సీమయౌ నిరాశా శోణ చిత్రవర్ణ క్షితిజ మతుల కాంక్షా ఘనసింధువునకు విభజనము సేసికొని నిన్ను వే విధాల నిచ్చ వలకు వందరను ద్వేషింతు వీవు తే. ఎనయు వైరము మస్తిష్క హృదయములకు ఎట్టి సద్భావ ముండఁబో దీద్వయాన బుద్ధి యెటకైన హృదయము న్బొమ్మటన్న నరుగు మరి యెటకొ వికలమగుచు నద్ది. తే. వర్తమాన క్షణమ్ములు పరమ దుఃఖ భారమున సాగు సుందరస్వప్న మగు నా యతీతము, నీవు జయాపజయము లనెడి యుయ్యల లూగెదవయ్య మనువ! అల నసీమ మమోఘమ్ము నైనశక్తి సంకుచితమగు బహుభేద సంభరితము భక్తి జీవితమును గడు భయద గాఢ కష్టపథమున నడిపించుఁ గడక నపుడు... తే. తే. లేక యసక లాహంకార లీల నొక్క కడ మహాసక్త యగును రాగమయి, అపుడు నియతిచేఁ బ్రేరితమ్మయి నిశ్చయముగ బంధితమ్మగు నిజసీమ వ్యాపకతయె. తే. పరమవిద్య యగుచును “సర్వజ్ఞ" మైన జ్ఞానలఘ్వంశ కొన్ని ఛందములు వలుకు లలిత సత్కళా కరణ కార్యము ల వెల్ల ఛాయవలె నౌచు జగతి నశ్వరము లగును. తే. నిత్యతకు దూరమగుచు నిర్నీతిఁ దరలుఁ గాల మిలలోన మనువరా! క్షణము క్షణము తెలియలేవు శుభేచ్ఛకుఁ గలదు చెడుగు కంటె ఘనశక్తి- తర్కానఁ గర్మచెడును. ఆంధ్ర కామాయని 70 75 585 తే. జీవితమ్మెల్ల సమరమై చెలఁగు-స్వచ్ఛ భావనిచయ మా రక్తాగ్ని వర్షమందుఁ బడి నదించునీ శంకల వ్యాకులతను జెంది నీకు నీవె యరివై చిత్రగతిని... తే. ఆవృతము వేసికొనుచు ని న్నపుడు నీవె కృత్రిమంపు నీ రూపుఁ జూపింతువయ్య! వసుధపై హంకార స్థూపములు పడుచు నుండును, మహోన్నతుల నొందు నుజ్జ్వలముగ. తే. సంస్కృతిరహస్య విలసన చతురయగుచు స్వచ్ఛవిశ్వాసభరిత యా శ్రద్ద నీకు నెల్ల నిజ నవనిధి సమర్పించి తానె యిటులు నీ చేతనే మోసగింపఁ బడియె. తే. వర్తమానమ్ముచే నీవు వంచితుండ తే. Gall వగుచు నాగిపోదువు భవిష్యమ్మునందు బహుళ విస్తృతి నెసఁగు ప్రపంచమెల్ల శుద్ధ విరహితమై తోఁచు శోభతరిగి. ఆ జరామరణము అన్న ననయ మీవు చిర మశాంతి వహింతువు - జీవితమున నెద్ది పరివర్తన మ్మని యింతవఱకు రహి దలంచితో యదె యమరత్వ మయ్య ! తే. భ్రమ వహించి, కైకొని నీవు వ్యాకులతను దానినే యంతమని పల్కఁ బూనినావు ఓయి దుఃఖనిబిడ చిరయోజనా ప్ర తీకమా! నీవు నిరత మస్థిరుఁడవోయి! తే. ఈవు శ్రద్ధను వంచించినావు మనువ! విధిని గ్రహరశ్మి గణ తంతు వితతి బిట్టు కట్టుకొని ప్రాంతపుంతలఁ బట్టి యటులె నడచెదరు మనుజులిల ననారతమ్ము. 586 800 80 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. "అఖిల మీ లోక మగును గళ్యాణభూమి” యనెడి శ్రద్ధారహస్యమ్ము నరయలేరు ప్రజలు దీని సత్యాచారి యాత్మలోన నెంచి మిథ్య యౌ ననుచు వంచింపఁబడును. తే. ఆశయం దతండు కడు నిరాశఁ జెందు బహుశ నిజబుద్ధి విభవాన భ్రాంతుఁ డగును ఎప్పు డాతఁ డలసి పయనించుచుండు పృథుల జగతీ మహాదీర్ఘ పథములందు. తే. మింటికడలి నొదిఁగి మహామీన మటుల లీనమయ్యె శాపఁపు ప్రతిధ్వాన మపుడు ఫేన సముదీన తారకా విసరమెల్ల మృదుల పవనతరంగాళి మెఱయసాగె. తే. నిఖిల లోకము స్తబ్ధతా నిలయ మగుచు మౌనముగ నుండె నుండె తంద్రా నయాల సతల విజన మౌనా ప్రాంతము తిమిరమ్ము పేరుకొన్న రజనివలె బిట్టు మనువు... తే. నిశ్వసించుచుండె నశాంతి నిగుడి మెఱయ చిత్తమున నాతఁ డపుడు యోజింపసాగె ఆతఁడే నా యదృష్ట మై యరుగుదెంచి నాఁడు మరల భవిష్యమ్ము నవ్యఫణితి... తే. వ్రాయఁగా ఆతఁడే మును పరఁగఁ దనదు స్నిగ్ధనీలిమ నలమె నా జీవితమున ఎపుడు సాగు యాతన యంత హీనముగను అరయ నీయెడ లే దుపాయాంతరమ్ము. తే. శ్యామలమ్మైన లోయలో నమృతనాద బంధురమ్ముగ నిర్లిప్త భావభరిత యల సరస్వతి కమనీయచలన యగుచు నిద్ధ గంభీరముగఁ బ్రవహించుచుండె. ఆంధ్ర కామాయని 85 587 తే. అమరి నిష్ఠుర జడవిషాదములు వోలె నుండెఁ బడి యచట నిపేక్షితోపలములు అద్ది కేవల మధురగానాళి తోడఁ దరలు మంజుల ప్రాసన్నతా స్రవంతి... తే. నిరత కర్మప్రతీకమ్ము తరలి యేగు 90 నద్ది జ్ఞానమెల్ల స్వవశ మైనయట్లు ఉండి యుండి హిమ సుశీతలోరి కాళి తటములను దాకుటలు, వానిఁ దమిని జ్ఞాన... తే. వినిమయ వరము అరుణకిరణములు నిజ కాంతి నలముటలును జిత్రగతులఁ దోఁచె స్నిగ్ధ సంవాద మెద్దియో చెప్పు చెప్పుడు నరుగుచున్న దయ్యాత్మ పథాధ్వనీన. తే. అమృతమధుకాంతి తూర్పున నలమె- నందు కమలమొక్కటి విరిసె బంగారుధూళి కలఁగి యద్దాని తావికిఁ గలరవముల నీలవర్ణ ఖగాళి యున్నిద్రమయ్యె. తే. మించి నాలోకరశ్మి నిర్మితిని గన్న యమలి నోషస్వినీ మృదులాంచలమున సలుపఁగా మధువితరణ సకలదిశల నుదయపవన మాందోళన మొందుచుండె. తే. వనితయొక్కతె యా రమ్యఫలకమందు నవ్యచిత్రమ్ము పోల్కి కానంగఁబడియె కమ్ర నయనోత్సవ ప్రతీకమ్ము-ఆమె మ్లాన రహిత నవనళినీ మాల నిజము. తే. రమ్య సుషమాసుఘన మండలమ్ము స్మితము సరణి సృష్టియందున వెదజల్లుచుండె సుమధుర సురాగ మర్థి- విస్ఫూర్తి నిదుర జీవన విరాగ తమము తాఁ జెందుచుండె. 588 95 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. లలిత కేశముల్ తర్కజాలమ్ము వోలెఁ జిందరగ వందరగఁ గడు చెదరియుండె విశ్వమకుటమ్ము పోలిక వెలసి మెఱయు నబ్జఖండమ్ము వలెనొప్పె నామెనొసలు. తే. పద్మపత్ర చషకములై వరలు కనులు లలిఁ గురిసె ననురాగ విరాగములను గుంజరిత మధుపయుత ముకుళము మాడ్కి నమరె గానభరితమ్మైన యాననమ్ము. తే. వక్షమునఁ బ్రపంచజ్ఞానభర మహమ్ము సర్వము సమీకరించి యుంచఁబడి యుండె తనరు నొక హస్తమున వసుధాతలంపు కమ్రజీవిత రససార కర్మపాత్ర. తే. అన్యమిచ్చును మధురాభయావలంబ Gh తే. నమ్ము యోజన ఘనత రానంతమునకు త్రివళి త్రిగుణ తరంగమై తివురు నామె రమ్యకాంతివసన మరాళముగఁ గట్టె. తాల సంయుత గతి పాదములను దనరి ప్రాణముల కేక యట నీరవముగఁ దోఁచె జడముగా నుండె జీవనసరసి భంగ హీనమై- మహాహిమము వ్యాపించియుండె. తే. చంచ లానిలమొలసి నిస్తబ్ధముగను దీర్ఘమౌ నలసతను నిద్రించుచుండె కడగి త్రావె మానస కంజ కళిక యాత్మ మధుర మధుబిందువులను దా మౌనముగనె. తే. అచట రుద్దములయ్యె దిగంతములను స్వనము లాకస్మికమ్ముగా ననియె మనువు “స్వాదు హసన సుచైతన్యసహిత యగుచు నరుగు దెంచెను, హేమాభ, యతివ ఎవతె?" ఆంధ్ర కామాయని 100 589 తే. తంద్ర స్వప్నములు తిరోహితమ్ము లయ్యె, విపుల కాంతివన్మాయ వ్యాపించియుండె ప్రణయపులకల నెసఁగు నా స్పర్శనమ్ము గడచిన యుగమ్మును బిలువఁ గడఁగె నపుడు. తే. అలలు పలుమారు నృత్యమ్ము లాచరించు నువిద ప్రతిభా ప్రసన్నత లొదవఁ బలికె "ఇడను నేను, నీ వెవ్వర, విచట నుంటి తే. వార్య! డోలాయమానుఁడ వగుచు నిటుల?" పలుచని ముకుపుట మదరిపడుచు నుండె అపుడు నిండితోఁచిన దమూల్య స్మితము, “విశ్వపథికుఁడ వినుము నా పేరు మనువు ఇంతి! నే క్లేశములను భరించుచుంటి”. తే. "స్వాగతము! కను నీ ప్రదేశ మిదియెల్ల శిథిల సారస్వతావని చెదరిపోయె! నాదు దేశమిది, ఇటు వినాశమొందె భౌతికంపు టస్తవ్యస్తఫణితి వలన.” తే. "కనుచు నిద్దాని దీనతాకలిత నగుచు ననయ మిట్టులె యుండఁబో దనుచు నమ్మి యాశతో శుభదిన మెదొ యరుగుదెంచు నంచు నిటఁ బడియుంటి నే నార్యవర్య!
తే. "వచ్చితిని దేవి! తెలియఁగా బలుకు మిపుడె యమలజీవన నైజ మూల్య మెది యగునొ దివ్య మహనీయ గుణ! నీవుతెఱువు మింక భవ భవిష్య ద్వారమును నాపై రహించి. తే. ఈ జగత్కుహరాన సృజించి యింద్ర జాలమును, గ్రహతారకా సముదయమును, 590 105 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 విమల విద్యుత్తతులను, వ్యాపింపఁజేసి నట్టి యా మహాకాళుఁ డత్యంత జలధి... తే. వీచి కాఖీల నటన గావించుచుండె ఈ వసుంధ రాల్పప్రాణు లెల్ల భీతిఁ బరగఁ గోరెనే యెడద నిష్ఠుర కఠోర సృష్టి నాశనవిజయ మై యెసఁగు టేన? తే. నాశయుత మైన దాని నీ నాటివఱకు నేల తలఁచిరి మూర్ఖులు సృష్టి యనుచు దాని యధిపతి యెవ్వఁడో తనరుచుండు నిం కొకండు నెచటనో వసించుచుండు. తే. అరుగ లేదు దుఃఖఁపు కేక యతనివఱకు సుఖ మనెడి నీడము మివులఁ జుట్టియున్న యది విషాదావరణ మిట్లనవరతమ్ము కోరి యెవరుంచి రీ యవకుంఠనమును. తే. నెగడుఁ గడుదూరమున శనినీల జగము దాని చాయవలెను గ్రిందఁ బైన నిటుల దుఃఖగగనము వ్యాపించి తోచుచుండు- దాని పరమున నెద్దియో తనరుచుండు - తే. ఘన మహా కాంతిపుంజ మొకం డటంచు చెప్పఁబడుచున్నయది - ఇచ్చి స్నిగ్ధకిరణ మొం డది నియతిజాలమ్ము నుండి ముక్తి వడసి స్వేచ్ఛనొందుటకుఁ దోడ్పడఁగఁ గలదె?"
తే. "ఎద్దియైనఁ గాని మ్మది యేల పలుకు? వెఱ్ఱనరుఁ డుండఁగా నమ్మ వీలుపడదు. అతఁ డెఱిఁగి నిజబల దుర్బలతల నుంచ వలయుఁ జరణము గంతవ్యపథము నందు. 110 115 ఆంధ్ర కామాయని 591 తే. కరములను జూచి యాచింపఁ గడఁగరాదు- నడుపవలయును నిజపాద నళినయుగళి ఏ నడువవలె ననుధ్యాస యెవని కున్న వాని నెవ రెపుడాపఁగాఁ బూనఁ గలరు? తే. అవును నిజమిది - నీ 'సహాయకుఁడు' నీవె తే. బుద్ధి యెదిచెప్పు దాని నొప్పుకొన కెద్ది శరణు - ఎన్ని యూహలును సంస్కారములును గలవొ వాని కన్యోపాయములును లేవు. పరమ రమణీయ మైశ్వర్య భరితమైన ప్రకృతి మర్మజ్ఞరహిత మై పరగుచుండు అర్థి నద్దాని ప్రతిసీర నవసరింపఁ గడఁగి నీ వింకఁ గర్మలీనుఁడవు గమ్ము. తే. నియమనము, పాలనమ్మును నీ వొనర్చి నీ క్షమత నిఁక వృద్ధినొందించుకొనుము ఎపుడు విషమత్వము సమత యెచటనుండ వలెనో నిర్ణయమొనరించువాఁడ వీవె. తే. బహుళ విజ్ఞాన సాధనోపాయమునను జడత నెల్ల చేతనతగ సలుపుమయ్య! అపుడు వ్యాపించు భవదీయ యశ మనంత విశ్వ కుహరాంతరాన సంప్రీతిదముగ.” తే. హసన మొనరించినది శూన్యమైన లోక మా గగనము అద్దాని గర్భాంతరమున జీవన మరణ శోకముల్ చేరి యెన్ని యో వసించి నశించెను యుగయుగాల. తే. మించి హృదయముల మధు సమ్మేళనములు విరహ కోకములై వలపించె నచట 592 ఈ విషయ ఘనభారమ్ము నెల్లనేఁడు తన శిరమ్మునందు మనువు తాల్చినాఁడు. 120 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. నరుఁడు వహియింపఁగా పాలనాభరమ్ము తెలిసె నుషనవ్వినది తూర్పుదిక్కునందు అట్టి కౌతుకమును గన నరుగు దేరెం బరమ చంచల మలయజ ప్రౌఢవనిత. తే. ప్రకృతి సుందరీ మృదుకపోలములఁ దోఁచు లాలిమను గని యనురాగ లాలసతను మత్తుఁగొన్నట్టి తారకా మహితదళము క్రిందఁ బడుచుండెఁ జిక్కని యందములను. తే. ఫుల్ల జలజాత కాననభూము లందు సాగె నళికుల నర్మభాషణము లపుడు వసుధ సకలము, సంతోషవర్తనమున మరచి శోకము, కన్పట్టె మంజులముగ తే. "జీవిత నిశీథ తిమిరము చెలియ! అదియె నిన్నుఁగని పర్వువెట్టుచు నున్న దార్తి నాననముఁ గప్పికొని క్షితిజాంచలమున నీవు నిల్చినయెడఁ దాను నిల్వలేక తే. ఉవిద! ఇడ! ఉదార వయి నీ వుషసివోలె వచ్చితివి నేఁ డిచటికి నా భాగ్యవశత సుప్త మన్మనోభావ నిస్తుల ఖగాళి కలరవమ్ముల తోడ మేల్కొనియె నిపుడు. తే. కిరణ వీచికానిచయ సంక్రీడఁ దనరి నవ్వుచుండెఁ బ్రసన్నత నవకములను: అన్య- యవలంబనల్ విడి యర్థి బుద్ధి వాదన స్థాన బుద్ది యేఁ బొందినాఁడ. తే. అఖిలములు వికల్పము లింక యరుగు గాత! యమల సంకల్పములు అర్థి నగునుగాత! జీవితము కర్మమయ!! మీలఁ జెలఁగు చెపుడు విమలసుఖసాధన ద్వారవివృతి యగుత!!" ఆంధ్ర కామాయని 125 130 593 స్వప్నము (ఆందోళన) తే. అరుణ జలజ కేసరతతి, నతివ, సంజ కొనుచు నెడఁదకుఁ దృప్తిఁ జేకూర్చుకొనియె, నింతదనుక- నా నీరజ మెపుడు వాడి వ్రాలెనో, దానినెట నామె వడయఁగలదు. తే. క్షితిజము ధరించిన నొసటి స్నిగ్ధకుంకు మము తొలంగె కరాళ కాళీమ కరాన వృథగ మొగ్గల మీఁదఁ జరించుచుండె లీలఁ బుంస్కోకిలా కాకలీ స్వనమ్ము. తే. వసుధపైన కామాయనీకుసుమ మిపుడు వ్రాలిపడియుండె- లేదా మరంద మధువు ఆమె యుండె రేఖాచిత్ర మటుల-అందు తమ్య మోహన మధురవర్ణములు లేవు. తే. అది ప్రభాతవేళా కళాయత విహీన చంద్రబింబము - జ్యోత్స్నా ప్రశస్తకిరణ చయములే దాయమ రవియు, శశియు, తార కలును లేని సంజగతిని గానుపించు. తే. సరసిజమ్ములు, నవదాత శతదళములు, మంజు లేందీవరమ్ములు మలఁగి తూండ్ల వ్రాలి వాడిన సరసి యా శ్రద్ద నేఁడు - రావు మృదురవమ్ముల బంభరమ్ము లటకు. తే. శ్యామలత్వ చంచలతల నామమెచట 594 మోము చూపదో యట్టి జీమూతమామె హిమతలమ్మునను ఘనీభవించి నట్టి శైశిర క్షణ కూలంకషమ్ము ఆమె! OT 5 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. విజన మౌనగభీర సంవేదనమ్ము- తే. ఝిల్లికా ఝంకృతు లచట చెలఁగ విపుడు అఖిల ప్రాపంచ కాస్పష్ట మౌ నుపేక్ష ఒక్క వేదనారూపమ్ము నొందియుండె హరిత కుంజ మంజుచ్ఛాయ యవని నిపుడు చేసికొనుచున్న దమలి నాశ్లేష మెసఁగి ఒడ్డు లెఱుఁగక పరువెత్తు నొక్క చిన్ని విరహ నిమ్నగ రూపాన వెలయు నామె. తే. లీల నుద్దీన విహగ బాలికలు వోలె నీల గగనానఁ గిరణాళి నెఱిఁ జెలంగె అలసి స్వప్నలోకమునకు నరిగె నవ్వి యర్థి శయనింప నిద్రాశయమ్ము పైన తే. కాని, అయ్యెడ బ్రతుకులో గడియయైన విరహిణికి శ్రాంతి కనఁగ లభింపదయ్యె స్మృతి మెరసినది క్రొంగొత్త మెఱపుపగిది క్రమ్మసాగెఁ జీకటుల మేఘమ్ము లపుడు. తే. సంజ యనియెడి నీలకంజమ్ము వీడి వెల్వడిన శ్యామల పరాగ విసర మపుడు పర్వత దరీ సవిధ ధరాభాగమెల్ల నెమ్మదిగ నెమ్మదిగ క్రమ్మి నిండుచుండె. తే. అంచిత తృణ గుల్మ ఘన రోమాంచితములు, నగము లా దుఃఖ కథను వినంగ సాగె స్వరములను శ్రద్ధా శూన్యవిశ్వాసములను గలపి యెల్లెడ నలమగాఁ గడఁగె నంత. తే. "బ్రతుకునందు మందాకినీ! పలుకు, దయను! సమధిక మ్మెద్ది సౌఖ్యదుఃఖములలోన? ఆంధ్ర కామాయని 10 595 గగనమందలి తారల! కడలి బుద్బు దముల యధికములు? గణింపఁ దలఁపుమమ్మ! తే. ఒందఁ బ్రతిబింబములను నీ యందుఁ దార లుదధిఁ గలియుటకై యేగుచుంటి వీవు? రెండు నివి ప్రతిమూర్తులై యుండెనేమొ! ఈ రహస్యమ్ము నీ వెఱింగింపుమమ్మ!! తే. బహువిధమ్ముల నాకాశపటము మీద నెన్ని చిత్రాలు పుట్టి నశించుచుండె పరఁగు నన్నిఁట నింద్రచాపమ్ములోని రంగులను బోలి మెరయు వర్ణమ్ము లొదిగి. తే. కాని, క్షణమున సకలాణు గణము లెల్లఁ గరఁగి, నీలశూన్యత వలె, గాఢ వేద నా భరిత ధూమలపు వసనమ్ము నొండు వాంఛతో నేయుచుండెఁ బ్రపంచమునకు. తే. తే. ఉదిత దుఃఖాన నాదు నిట్టూర్పుగాడ్పు వెడలకుండుత ఈ కుహూవేళ యందు స్నేహమును ప్రజ్వరిల్లగాఁ జేసి వెల్గు నిట్టి లఘు దీప మీయెడ నెచట నుండె? ఆరిపోకుండుఁ గాక సంధ్యాంశు వటులం బరఁగు చీ కుటి నున్న దీపశిఖ యెపుడు శలభ మెయ్యది లేకున్న సవిధమందు మంచి దిది యొంటి వెల్గుచు మించుఁ గాక! తే. ఏమి చెప్పినఁ గోకిల మ్మేను విందు మౌనముగ-ఐన నియ్యెడఁ గానఁబడదు మున్ను సమ్మోహనాకృతి నున్నయట్టి ప్రసవధూళీ మహోత్సవ ప్రాభవమ్ము. 15 596 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. ఆకురాలు కాలంపు శూన్యమగు శాఖ! తివిరి సంజ కూడినది ప్రతీక్షతోడ!! మదిని గట్టిచేసికొని నెమ్మదిగ సకల మీవు, కామాయనీ, సహియింపవలయు! - తే. చెదరు శాఖికల నికుంజసీమ లెల్ల - దుఃఖ నిశ్వాస యుతములై తొలఁకు అట్టి స్మృతిసమీరము వీచు నియ్యెడను - అయిన నెవరు మేళనకథ వినిపింతు రిపుడు. తే. ఎట్టి యపరాధమును లేక యీ జగ మిపు డలుగుచున్నది యభిమాన యటుల నేఁడు ఇటుల విడి రెప్పలను, బ్రవహించుచున్న బాష్పజలములు కడుగునే పదయుగమ్ము. తే. విడివడిన కొక్కియముల సంప్రీతిఁ దనర నెపుడు నిస్సహాయతతో లగింతు రపుడు కష్టభరితమ్ము లైనను గడచినట్టి " గడియలే తీయనగుచును గానుపించు. తే. ఆత్మ చిరతర సౌందర్య మందు నెద్ది సత్యమో య దెటనొ దాగె చాల - చిక్కు వడిన సుఖదుఃఖ ఘనత రావర్తములను నెట్లు విడువగాఁ గలవొ యూహింపఁ దరమె! తే. సారహీనము లైన యా సంగతు లిఁక విస్మృతము లగుఁగాక యివ్వేళ - అట్టి యా జ్వలితహృదయము, నిపు డట్టి శీత లప్రణయమును గానఁగా రావు వెదుక. తే. ఆ యతీతమున విలీనమయ్యె ఆశ మధుర వాంఛాప్రతతి నేఁడు మత్రియునకుఁ గలిగె దారుణ నిష్ఠుర ఘనజయమ్ము! కాని ఇది నాకు నోటమి కాదు కాదు. ఆంధ్ర కామాయని 20 25 597 తే. బంధనంబయ్యెను పరిరంభణ సుఖమ్ము వరలు నే కడ నట్టి శంపాస్మితమ్ము మధురవిశ్వాస మేలనో మసలసాగె ముగ్ద మానస మహిత విమోహ మిద్ది. తే. జీవితము సర్వము నిట వంచింపఁబడియె! అల్పురాలి సమర్పణ మౌ నిదెల్ల! ఎన్నడో యెయ్యదియొ నేనె యిచ్చివైచి నట్లుగా నాకు ననుమాన మగుచునుండె. తే. ఇట్టి ప్రాణాలవినిమయ మెంత భయద సంకులంబైన వ్యాపారసరణి గలది? ఇవ్వవలసిన సర్వము నిమ్ము- కాని గైకొనుట కెన్నఁడును నీవు కాంక్షవడకు. తే. పడయఁగాఁబోదు తాఁ బరివర్తనమున కైన తుచ్ఛప్రతీక్ష సమాప్తి నెపుడు సంధ్య ద్యుమణి నొసఁగి వెదజల్లఁబడిన యుడుగణమ్ములఁ బొందుచునుండె నిపుడు. తే. బహుళ మాయాబలమ్ముతో, స్వరసుకూజ నములఁ గుసుమసంవృద్ధి ననంత నవ్య కిరణ కళికా మనోహర క్రీడ మెరయు స్మేర మంజుల మాయ విస్మృతిని జెంది- తే. అంతరిక్షమ్మునం దరుణాద్రి నుండి హసనముల నేఁగు దెంచిన యా కొలంది దినము లదె మోసగించి తాఁ దిరిగివత్తు మని చిరప్రవాసమ్మున కరిగె నిపుడు. తే. నవ శిరీష మధురసుగంధమ్ము తోడ భరిత మాన వసంత శార్వరులు దీర్ఘ 598 ఖ జాగరణ నిహతి సహింపఁజాల కలిగి యంగె నరుణారుణము లైన యాననముల. 30 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. చెప్పునటు తీయ తీయగా స్నిగ్ధకథను దివస మిదె నింగి తమిని వ్యాప్తిగనుచుండె నాడు మేల్కొనుచున్న స్వప్నమ్ము లపుడు తారలై చిరునవ్వు దొంతలర నవ్వు- తే. స్వాదు వనలతాంగీ నికుంజమ్ము లెల్ల నమల వాంశిక మధురస్వరాళి నిండె ప్రీతిఁ దమయింటి పిలుపుల విన్న వెనుక వలసినట్టివా రెల్లరు వచ్చినారు. తే. కాని ఆ పరదేశి రాఁ గడఁగ లేదు గడచె యుగము ప్రతీక్షలో కణకణములు గను త్రియామార్ధ పక్ష్మములందు నుండి తుహిన బిందువుల్ వర్షింపఁదొడఁగె నపుడు. తే. మానసస్మృతి యనెడి పద్మమ్ము విరిసె ప్రౌఢ మకరందబిందువుల్ రాలుచుండె మసృణములు, పారదర్శిక మౌక్తికమ్ము లివ్వి- ఎన్ని చిత్రాలు బింబించె నిందు. తే. కంటిచూపులు లేని చీఁకటిని నశ్రు కణములు తరల చంచలా కణగణాలు ప్రాణయాత్రికుఁ డిట్టి సంబళము వడసి యిచ్చఁ గల్పనాజగము సృజింపసాగె. తే. నిండె రక్తాబ్జకోణముల్ నిత్యనవతు తే. షార బిందుపరంపరా సముదయముల ఎన్ని వ్యత్యస్త ప్రతిమూర్తు లేర్చి యిప్పు, డవిగొ, యాదర్శ చూర్ణమ్ము లగుచునుండె అట్టి యనురాగ ప్రేమ హాసాదు లెల్ల నరిగె నిదురింప నిచ్చమై యాంధ్య మందు స్మృతు లనెడి ఖద్యోతములును, చెలఁగ భీతి, వెల్గు వర్షా విరహ నిశావేళ యందు. 35 40 ఆంధ్ర కామాయని 599 తే. శూన్య గిరిపథమునఁ బ్రతిశ్రుతుల నీను శృంగనా దార్భటీ ధ్వను లేఁగుదెంచె కాంక్ష యనెడి లహరిక దుఃఖతటిని పులి నాంకమం దిపుడు విలీనమగుచు నుండె. తే. వెలింగె నాకాశదీపికా విసర- మెగిరి యంగె నభిలాషలను శలభాళి యటకు నేత్రముల నశ్రుజలములు నిండియుండె ఆరలేదు జ్వలించు న య్యగ్నికీల. తే. 'అమ్మ!' అపుడు దురాగత హర్ష రవళి మీరి ధ్వనియించె శూన్య కుటీరమందు తల్లి ద్విగుణీకృతంపు టుత్కంఠ మెరయు నెడఁద లేచి యటకుఁ బరుగెత్తె, అచట... తే. తే. పాంసు ధూసరిత మనోజ్ఞ బాహువులను విడివడిన ముంగురుల్ పెనవేసికొనియె అంత జ్వలియించె నారుచున్నట్టి రజని యను తపస్వినీ ఘన పవిత్రాగ్నిపాత్ర. "ఓరి తుంటరి! ఏ కడ నుంటి నీవు? నాదు విధియటు తిరుగుచున్నాఁడ వింత వరకు తండ్రి కౌ ప్రతినిధి! పరగ నిచ్చి నావు నీవును సుఖ దుఃఖ భావయుగళి. తే. గంతు లెట వనచపలమృగమ్ము రీతి వేయుచుంటివొ! ఎప్పుడు బెడసి యలుకఁ గొందువో యని నే భీతినొందుచుంటి అలుక నీ కైనఁ దీర్పఁగా నగునె నాకు!" తే. "నే నలుగుటయ నా యల్క నీవు తీర్చు టయ ఇ దేమి? మంచిగనె మాటాడినావు ఇదిగో! నే నిపు డేగి నిద్రింతు - మరల నంతియే కాదు, నేఁడు మాటాడనమ్మ! 600 45 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 50 50 తే. పండినఫలాల నా బొజ్జ నిండియుండె కలుగదు నిదుర కెట్టి భంగమ్ము నాకు” శ్రద్ధ ముద్దిడి కొంత ప్రసన్నత మరి కొంత దుఃఖము తోపఁగా గోచరించె. తే. అట్టి లఘుజీవనపుఁ టల్పమైన తీయ నగు క్షణమ్ములు జ్వలియించు చపుడు తోఁచె అతిశయపు టుదాసీన ముక్త్యంబరంపు హృదయమున బొబ్బలై ప్రకాశించుచుండె. తే. పవ లలపుఁగొన్న యాలోక భానుచయము నీల నిలయాన నెచటనో నిలచి దాఁగె అదియె కరుణాప్రపూరిత మ్మైన స్వరము సృష్టిని మరల కరిగి నదింపసాగె. తే. ప్రణయ కిరణంపు కోమల బంధనమ్ము ముక్తియై యిదె ప్రాబల్యమును వహించు కలదు దూరము! అది ప్రతిక్షణము నందు నాత్మ కెంత సమీపమై యరుగుదెంచు! తే. మూర్ఛితంబైన మనసున ముగ్ద మధుర చంద్రికను బోలు తంద్ర ప్రస్తరణఁ గొన్న యపు డభిన్నుఁడై చెలఁగు ప్రేమాస్పదుండు తనదు చిత్రమును లిఖించి తరలిపోవు. తే.. కడక కామాయనీదేవి కనుచు నుండెఁ దన సకల సౌఖ్యమును స్వప్నదర్శనమున యుగములుగ శీర్ణ వంచిత యగు నెలంత, లలిత రూపరి చిహ్నమాత్రముగ నుండె. తే. అపుడు కోమల ప్రసవపత్రాళి పోల్కి నమల పవనుపై నంకితమైన యట్టి దిపుడు నభమున రేఖ లిఖించుచుండె కొసరి యొక చాతకము సేయు కూఁత యగుచు. ఆంధ్ర కామాయని 601 తే. అనలకీల పోలిక, నిడ, యంతికమున తే. తే. తే. Cath మించి, ఉల్లాసభరిత, జ్వలించుచుండె మనుమహాశయు మార్గమ్ము మహిత కాంతి యుతముఁ జేయుచుండె విపదు డుపమయగుచు. నవన వోన్నతి కారోపణముగ నొప్పె అమర మహిమా కుధరశృంగ మటులఁ జెలఁగె శ్రమయెరుంగ- దుత్సాహభరమ్ము మెరయఁ బరమమౌ ప్రేరణాధార వలె నదించె. కాంత నవ సుషమా మయూఖ మ్మనంగ హృదయ భేదన దృష్టి వహించె - ఆమె యెచట చూచునో తమము బంధించి నట్టి యచటి మార్గాలు వివృతము లగు తమంత. మనువరు సతత సాఫల్యమహిమ కామె ఉదయ విజయినీ తారయై యొప్పు మెరసె ఆశ్రయమ్మును కాంక్షించు నట్టిప్రజలు అర్పణము సేసిరి శ్రమోపహారములను. తే. ఇంపుగ మనునగరము నిర్మిం పఁబడియె లీలగా నెల్లరు సహకరించినారు స్థిరములుగ దృఢమైన ప్రాచీరములను వరలె నతిబల- మందిర ద్వారచయము. తే. ఆతప శిశిర వర్షమ్ము లందు రక్ష తే. 602 వడయు సాధనసమితి సంపన్నమయ్యె శ్రమజలమ్ములఁ దడిసి కర్షకులు పొలము లను హలాల కర్షింత్రు హర్షమున నెపుడు. ఉండెఁ గరుగుచు లోహమ్ము లొక్క యెడను భూరి భూషణాస్త్రములు రూపొందుచుండె ఒకట సాహసుల్ నవ మృగయోపహార ములను గొనివచ్చుచున్నారు మోదమొదవ. 55 60 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. పుష్పలావికల్ వనసుమములను వలచి సాము విరిసిన మొగ్గల సంతరింత్రు రుచిర గంధ చూర్ణమగు నా లోధ్రరజము నవ ప్రసాధన లెల్ల విన్ననువు నొందె. తే. ఒకట సమ్మెటదెబ్బల కొదవు రోష భరిత తీవ్రచండధ్వనుల్ ప్రభవమొంద నొకట రమణీమనోజ్ఞ కంఠోదితములు హృదయగానము లొలసి స్రవింపసాగె. తే. ఎల్లరును నిజవర్గము లేర్పరించి నయమునను శ్రమోపాయ మొనర్చుచుండ్రి వారి సంయుక్త యత్న ప్రభావకలన పురమునను వివిధవిధాల భోగ మమరె. తే. లఘుతఁ గల్పించి దేశకాలముల కచటి ప్రాణులెల్లరు కర్మనిర్మాయు లైరి బహువి ధాత్మోపభోగ సంభారములకు సర్వసుఖ సాధనలఁ గూర్ప సాగినారు. తే. అచట విస్తృత పరమ బలాభిరక్ష జ్ఞానమును, పరిశ్రమలు వికాసమొందె వసుధ నిమిడి దాగినది సర్వమ్ము వెలికి వచ్చుచుండె మనుజయత్న పరిఢవమున. తే. సృష్టి బీజ మంకురితమై చెలఁగి హరిత వర్ణముల నొందుచుండె సాఫల్యగరిమ ప్రళయ రక్షితుఁ డా మనుప్రవరు వలన నద్ది యుల్లాసభరితమై వ్యాప్తినొందె. తే. ఆత్మచేతను లేప్రాణు లాత్మకుశల కల్పనల నేఁడు నిలువఁగా గల్గినారు స్వావలంబన మౌ దృఢవసుధపైన వార లిపు డెందును పిరికివడుట లేదు. ఆంధ్ర కామాయని 65 603 తే. అట్టి యద్భుత లోకమం దతిన శ్రద్ధ చేరె మలయపవను ముద్దు చెల్లి వోలె అరిగినది లోపలికి ప్రతీహారవరుల మోసగించి సింహద్వారమును గమించి. తే. అచటఁ జెన్నొందు రాజహర్మ్యమ్ము లతిశ యోజ్జ్వల స్తంభ వలఖీ సమున్నతములు కాంతిశిఖలతో వెల్గొందు గాఢధూప ధూమ సురభిళములు గృహసీమలచట తే. స్వర్ణకల శోజ్జ్వల న్మహా భవనచయము నంటియుండె పుష్పవనులు- అందు నొప్పు మధ్యమధ్య ఋజు ప్రశస్త మార్గములును దట్టముగ లతాగృహములు తనరునందు. తే. అచట దంపతులామోద హాసభరిత " చిత్తులై చరింత్రు ప్రణయాశ్లేషములను, సుమరు జార్ధములు మదిరా సురభిళములు భ్రమర రసికులు గుంజారవములు వినుచు. తే. దేవదారు తరులకు సుదీర్ఘబాహు లనఁగ నొప్పె శాఖలు వానియందుఁ జిక్కు వడును పవనతరంగాళి, బాలవిహగ ములు ముఖరిత భూషణములపోల్కి పలుకు. తే. వనము లందుండి యేతెంచు స్వరలహరుల కచటి వేణుకానన మిచ్చు నాశ్రయమును నాగకేసర పుష్పవనాన వెలసె బహుళవ ర్ణాన్యమంజుల ప్రసవతరులు. తే. అచట వైశ్వానరజ్వాల యటులు నామె 604 వేదిపయి నుపవిష్టయై విరియఁ జల్లు చుండె శీతల సౌమన స్యోన్నయముల ఎచట జడతాగుణమ్ము కన్పింపదచట. 70 75 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. అడిగె మను: "వింక నేమైన నాచరింప నిచట నున్నది మిగిలి" ఇడ పలికెను “తావకీన విశేష కర్మావధాన మందుఁ బడసినావె సఫల తాధికతను. తే. సాధనము లెల్ల నైన వా స్వవశములు?” "లేదు - నే నుంటి నింకను రిక్తముగనె దేశనిర్మాణ మొనరించితిని - అయిన సు దీర్ఘ శూన్యమౌచు హృదయదేశ ముండె. తే. సుందరము మోము, నయనమ్ము లందు నాశ- అయిన నివియెల్ల నెవ్వరి వయ్యె? నిండెం బ్రథమ తుహినాంశు మోహన వక్రతయును, కొలఁది రోషపూరిత భావకలిక లొలసి. తే. అలుక తీర్చుట కదియె నేత్రాళి యందుఁ గెరలి యనురోధ మెదియొ సంకేతమొసఁగు ఎవరిదానవో నీ, వివి యెవరివోను చెప్పవే, ఇపు డోసి నా చేతనమ్మ !” తే. "ప్రజలు నీవారు ప్రజలకెల్లరకుఁ బతిగ నిన్ను మదిలోన భావించుచున్న దాన ఏల సందేహగర్భిత మిట్టి నూత్న ప్రశ్నమును నేడు నే వినవలసి వచ్చె.” తే. ప్రజవ! కాదు నీ వోసి నా రాజ్ఞి! నన్ను భ్రమకు లోఁజేయఁ దలపెట్టవలదు నీవు మధుమరాళివి! నే ప్రేమమౌక్తికముల నర్థి నేర్చుచున్నాఁడ నంచనుము తన్వి! తే. కందుఁ గొనియున్న నా భాగ్యగగనసీమ యందుఁ బ్రాచీపట మ్మటులమరినావు కలికి! ఆకస్మిక వికాసకలిత నైతి శస్త్ర సౌందర్య కాంతి సంభరితవైతి. ఆంధ్ర కామాయని 80 605 తే. కోర్కెతీరని కాంతిభిక్షుకుఁడ నేను - ఓ ప్రకాశతన్వి! చెపుమ, ఒలయు మనదు దాహ మంతయును మధురాధరరసాన నెపుడు తీరునో తెల్పుమా, ఇంతి! ఇపుడు. తే. ఇట్టి సుఖసాధన చయ, మహీన రమ్య శార్వరీ శీతల చ్ఛాయ, స్వరవితాన కకుభముల్- ఎద యున్మాదకలితమయ్యె- కాయమునకు శైథిల్యతా గరిమగలిగె. తే. వలదు నీవును బ్రజవు కావలదు రాజ్ఞి! ఇట్టి సమయాన హుంకార మెసఁగఁజేసె నరపశు- నట వ్యాపించె మందిరమునందు నాంధ్య ఘనమాయ జీమూతమటుల నపుడు. తే. గాఢ మాలింగనము, భయాక్రందనమ్ము పిదప తోఁచెను వసుధ కంపించినటుల, ఆతఁ డత్యాచరణశీలి - అబల నారి వెరచి రక్షణమార్గమ్ము వెదకుచుండె. తే. గగనవీథుల రుద్రహుంకార మొదవె తోడఁ జెలఁగె భయంక రాందోళనమ్ము అరరె! 'ఆత్మజు' లగు 'ప్రజ'!! ఆరం!! ఇద్ది పాపపరిభాష యై కల్గె శాప - మంత... తే. చదల నయ్యెడ క్రోధ సంచలిత దేవ శక్తితతి యెల్ల క్షుభితప్రశాంతి నొందె 85 తే. 606 హరునయనము హఠాత్తుగఁ దెరచుకొనియె వ్యాకులతనొంది కంపించె నపుడు పురము. పరఁగె నతిచారియై ప్రజాపతియె యిచట- ఓర్చి దేవతల్ శివులయి యుండఁగలరె? లే దజగవంపు మౌర్వి కీలింపఁబడియె నుచిత మౌ ప్రతిచర్య తా నొందఁగోరి. వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. ప్రకృతి త్రస్తయైనది - భూతపతి తదీయ నృత్య విచలిత పాదమ్ము నెత్తెనటకు భూతసృష్టి యెల్లఁగల గాఁబోవనుండె ఆశ్రయార్థము వ్యాకులమయ్యె నెల్ల. తే. అపుడు కలుషవిషయమున నార్తి మనుపు స్థిరతచెడి స్వయముగనె సందిగ్ధుఁ డయ్యె తే. జగము మరల నట నెదియొ జరుగుననుచు గలఁత గడగడ వణకఁగాఁ గడఁగెనపుడు. శంకఁ గైకొన్న యా సర్వజంతుతతియు విలయపుం గ్రీడవలనఁ గంపించుచుండె ఆత్మరక్షణచింతలో నఖిల ముండె స్నిగ్ద సుస్నేహతంతువు ఛిన్నమయ్యె . తే. మున్ను రక్షణభారమ్ము గొన్నయట్టి యమల ఘనపాలన మిపు డేమయ్యె - కాని నడవ బయటి కయ్యిడ నిశాంతమ్ము వెడలెం గ్రోధ లజ్జా ప్రపూర్ణ హృత్కుహర యగుచు. తే. ఆమెఁ జూచెను ప్రజయెల్ల వ్యాకులతను అడ్డి నిల్చి రాజద్వారమందుఁ గలరు ద్వార పాలకుల్ ముందుకు వచ్చినారు వారిభావాలఁ బరిశుద్ధఫణితి లేదు. 90 తే. అతికఠిన పాలనకు లొంగి యణఁగి యుండు నెది యది విరుగు కాదని యెత్తుశిరము ప్రజలు నేటిదాక ననుకూలముగ నున్న వారట నెదొ యోజించుచున్నారు లిపుడు. తే. చుట్టుఁ గోలాహలమ్ము కూర్చుండె మనువు దాగి యాలోచనల నిండి తత్పరతను, ద్వార మదె మూసియుంటచేఁ బ్రజలు చూచి త్రస్తులైనారు నిలచునే తాల్మి యెదను. ఆంధ్ర కామాయని 95 607 తే. తొలఁకు శక్తి తరగల యాందోళనమ్ము ప్రళయరుద్రుని క్రోధమ న్యావమచట నున్న- దన్నివైపుల నుండి యొలసి క్రమ్మె నళికనేత్రుని హేతినృత్యమ్మె యటకు. తే. పక్షములు చాచి యునఫణితిఁ బరఁగు నట్టి విజ్ఞానమయ మైన యమృత కాంక్షి ఎన్నఁడును గ్రిందికి న్వాల నెడఁదగొనని, సీమ లెఱుగని యాశలు, చెలఁగి సాగి... తే. వరలు నధికారముల సృష్టి- వాని మోహ మయ తిమిర మాయమును, వర్గ మహిత గర్త మగుచు వ్యాపించె - ఎన్నండు నద్ది కనఁగఁ బూడుకొనునది కా దెన్ని పుష్కరముల. తే. కోర్కెతీరని మనువు సంక్షుభితుఁడయ్యె కొంత - నాకస్మికమ్ముగా నంతరాయ మేమి కల్గె! ఏ మయ్యె! ఇట్లేల ప్రజలు గుంపుగాఁ జేరినారో గ్రహింపలేదు. తే. రక్షఁ గోరి సలిపిన ప్రార్థనము త్రిదశ క్రోధమున నొక్క పరమవిద్రోహ మైన వికలతను జెందె మను- వట విశద మట్టి ఘటన కుట్ర ఇడయు నున్న కారణమున. తే. "ద్వారము నిదె బంధింపుఁడు, వారి నిటకుఁ జేరనీకుఁ డియ్యెడ నిదె చేయు ప్రకృతి లీలఁ గల్లోలము - నను నిద్రింప నిండు" - ప్రకటమౌ క్రోధమున నిట్లు పలికె మనువు. తే. అయిన మనసున భీతిల్లినట్టు లుండె 608 దానము, ప్రతిగ్రహము జీవితమున నెటులు చెలఁగి సాగుచున్నవియె యోజించుకొనుచు మానసమున శయనకక్ష్యలోని కరిగె. 100 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. వణకసాగె శ్రద్ధాదేవి స్వప్నమందు కనులు విడివడె నప్పు డాకస్మికముగ "ఏమి చూచితి నే నిపు డిద్ది యేమి? ఇంత మోసకారిగ నతం డెట్టులయ్యె!” తే. స్వజనమైత్రియం దెన్నియో భయముగొల్పు గట్టి సందేహముల్ మదిఁ బుట్టుచుండు ఇప్పు డేమగు నన్న యహీనయోజ నలను రాత్రెల్ల గడిచె వ్యాకులతతోడ. 105 ఆంధ్ర కామాయని 609 సంఘర్షణము (ఆదేశము) తే. స్వప్న మది శ్రద్ధ కొదవిన సత్యమయ్యె సంకుచితదేహయై ఇడ స్తబ్ధయయ్యె ద్వారదేశాల నిల్చిన ప్రజలలోన ఘనతర క్షోభ నర్తింపఁగడఁగె నపుడు. తే. భౌతికమ్మైన విప్లవప్రౌఢీ నరసి వికలతనుజెంది వా రతి భీతు లయిరి రాజశరణమ్ము గొని భయత్రాణ వడయ వార లచటికి పెనునాస వచ్చినారు. తే. కల్గె వారల కట నవమానగరిమ వర్తనము దుష్టమగుచుఁ గన్పట్టె నపుడు నిఖిల జనమానసమ్ముల నిండియుండె హృదయచింతా జనిత రోష హేతి ప్రబలి. తే. ప్రజలు క్షుబ్ధులై ఆ ఇడా పాండు వదన మచట వీక్షించుచుండి రత్యావిలతను ప్రకృతి చెలఁరేగి సాగించు ప్రబలమైన యమిత తాండవలీలయు నాగలేదు. తే. ప్రజలగుంపులు వర్ధిల్లె ప్రాంగణమున కోర్కె మెయి వచ్చి యట గుమిగూడినారు ద్వారములు మూసి యల ప్రతీహారవరులు యోజన మగ్నులై నిల్చియున్నవారు. తే. కపట మగురాత్రి ఘననీల పటమునందు నణఁగి లోలోన దాగినయట్టు లుండె ఉండి యుండి ప్రకటయగుచుండె మిగుల వంగి మేఘగత యగు శంపాలతాంగి. 610 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 5 OT తే. చింతితునివలె మనువు సౌధాంతరమున శయ్యపై ఁబడి యోజన సలుపసాగె శంక, క్రోధమ్ము లనియెడి శ్వాపదములు కడఁగి యాతని లోఁగొని కరువఁదొడఁగె. తే. "ఈ ప్రజావళి నెల్లర నేర్పరించి తే.
యమిత సంతుష్టి గలవాఁడ నైతి - కాని చెలఁగి యే వీరియెడను గోపించి తంచు నెవ్వ రనఁగలవారు న న్నెన్నఁడేని? ఎంత జవమున దొరకొని యేను ప్రీతి వీరి పాలనమ్మును నడిపించినాను! భిన్నులై వీర లయ్యెడ నున్నవారు కనఁగ వీరల చాయ యొక్కటిగ నయ్యె. తే. ఏలుటకు వీరి నేఁ బ్రయత్నించి బుద్ధి తే. విభవమున నొక్క జనతఁ గావించినాను నియమముల సృజియించి నిర్నిద్రశక్తి నడపుచున్నాఁడ పేర్మి ననన్యరీతి. కాని- ఏమి? నే నేని యవ్వాని నెల్లఁ దొలఁగ కనుసరించి నడువవలెనె? నేను నడకలో సుంతయును స్వతంత్రుడఁను గానె? స్వర్ణమటుల నే కఁరగిపోవలెనె యెపుడు? తే. ఎద్ది నా సృష్టియో దాని కెప్పు డేను భీతినొందుచు నుందునే? ప్రీతిఁగొన్న యేనె యవినీతి వర్తింపఁ గాను లేదె కథిత శాసన భిన్నాధికార మెదియు! తే. శ్రద్ధ కధికార మగు సమర్పణము - కాని యద్ది కావింపఁగాఁ జాలనైతి నేను ఆంధ్ర కామాయని 10 611 ఏ ప్రతిక్షణమున ముందు కేఁగుచుంటి అరయ నే నెప్పు డెయ్యెడ నాగినాను తే. ఇడ నను నియమపరతంత్రుఁగాఁ గడంగి చేయ నాశించుచున్నది చిత్తమందు తన్వి యామెయె నా నిరాతంకమై ప రంగు నధికారపదవి తిరస్కరించె.
తే. వివిధ గతులను తోఁచ నీ విశ్వమొక్క బంధన విహీన ఘనపరివర్తనమ్ము దీని గతియందుఁ గన్పట్టు తిగ్మరశ్మి, కుముదబాంధవ తారకా సముదయములు. తే. తే. తే. తనరు చిచట రూపపరివర్తనము జరుగు జలధి యగుచు నున్నయది రసాతలమ్ము అంబునిధి యొక మరుభూమి యగుచునుండె జ్వాల జనియించి జ్వలియించు సాగరమున. నిఖిల వస్తు గర్భములందు నిండియున్న దొక్క తర ళాగ్నివాహిని యుజ్జ్వలముగ తుహిననగములు నవసరిత్తులను లీల లను రచించియు ప్రవహించు నెనయఁ దరిగి. ఈ స్ఫులింగ మహానృత్య మెపుడో యొక్క క్షణము విచ్చేసి నిలువక గడచిపోవు ఎప్పు డెవ్వరి కాగుట కిచటఁ దొరికె గాఢ సౌఖ్యావహమ్ము సౌకర్య మరియ! తే. తత మహాంతరిక్ష వివరాంతమ్ము లందు శతశతమ్ముల తారకా సముదయములు లాస్య రాస మనోజ్ఞ విలాసములును నొప్పి యెయ్యెడ తూగాడుచుండెఁ జదల? 612 15 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. తుంగగతుల విజృంభించు తోఁచు చిపుడు కలఁగి రేగు వాతూలభంగమ్ము లెన్నో! అగణితము లివె శీత్కృతుల్ అహరహమ్ము వరలి చెరలాడు నీ పరవశత యేమొ! తే. మొనయు నీ విశాల జగ దున్ముక నర్త సంపు దృతతాళ సంస్పందనమ్ము ఘనత నాత్మలయమయి గతిమయ మగుచునరుగు మార్గమును విడ కెచట సమాదరమున. తే. అయ్యదె పునరావర్తనం బరయుచుందు మపు డపుడు మనము - నదియె యౌను నియమ మంచు భావించెదము - దాని యనువు వలన నడచుచున్నది జీవితానమ్ము కడఁగి. తే. అయినఁ బ్రవహించు మహనీయ హాసరేఖ రెప్పలపయిని రోదనలీల నిపుడు వ్యగ్రులగుచు శతాధిక ప్రాణులిచట పొలసి వెదకుచునున్నారు ముక్తి కొరకు తే. జీవితమ్మున శాపమ్ము చెలఁగు చుండు ఉండు శాపాన తాపము నిండి యెపుడు ఈ వినాశమందునను దా నెసఁగఁగోరి కొసరి సృష్టినికుంజమ్ము క్రొత్త లెనయు. తే. "వెలసి కన్పట్టు నీ సర్వవిశ్వ మెపుడు తే. తిరుగు నొక నియమమున బంధింపఁబడియె” ఇద్ది యొక కేక - వీరల యెడఁదలందు బహుళమగు ప్రచారముఁ గొని వ్యాప్తినొందు. మించు నియమములను పరీక్షించి వీరు పిదప సుఖసాధనము లని మది నెఱింగి నారు- నే నిష్టపడలేను వీరె నేఁడు శాస్త్రలయి ప్రవర్తింపఁగా జాలి నిలువ. ఆంధ్ర కామాయని 20 25 613 తే. ఏను చిరబంధన మ్మెది లేనివాఁడ! నవత మృత్యుసీ మోల్లంఘన మ్మొనర్చు చెపుడు చిత్తానుసారినై చెలఁగి నడతు - ఇదియె యెవ్వేళ నౌను నా దృఢప్రతిజ్ఞ. తే. నశ్వరం బైన సృష్టిలో నాది యెదియొ, అదియె, అక్షణమె కనఁగనౌను మహిత పృథుల చైతన్యమునకు సంప్రీతిదముగ- కాక మిగిలినట్టిది స్వప్నకథయె యౌను.
తే. యోజనాశీల మైన నా యుల్లమెల్ల పొర్లి క్షణకాల మపు డాగిపోయె - మనువు సర్వమర్పించి యచట నచంచలముగఁ గడఁగి నిలిచిన ఇడను దాఁ గనులఁగనియె. తే. చెలియ యేమేమొ యింకను జెప్పుచుండె “శాస్త్ర నియమమ్ము పాటింపఁ జాలఁడేని యఖిలమును వినాశమ్మొందినట్లు కాన నిదియె నిశ్చయ మనియెద నెఱుఁగు మయ్య!" తే. "అటులనా? నీవు మఱల నెట్లరుగుదెంచి తివిట కో తన్వి! ఇంకను నేమియైన నున్నవా యేమి విషయమ్ము లొదిగి యిమిడి తావక హృదబ్జమున నుపద్రవకరాలు. తే. ఇద్ది యంతయు నీ దిన మింతజరిగె అయినఁ గల్గదె తృప్తి హృదంతరమున ఏ ఓ యింతి! అందున నెంతమిగిలె? ఏ మొనర్పగఁ బూనితినే లతాంగి!" 614
30 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. "నీదు శాసన సత్త్వంబు నిఖిల జనులు నిరతమును బాలనముసేయ నీకుఁ దృప్తి మనుమహాశయ! కోరఁగా జనదె యితర జనులు తమ కెట్టి చైతన్య సక్షణములు? తే. ఓహొహొ! ప్రజాపతి! ఇది యొప్ప దెపుడు జరుగలే దెన్నఁడును- నింక జరుగఁబోదు ఎవ్వరీ యిల ధిక్కార మెఱుఁగ నట్టి యాధికృతిని తా మొందినారయ్య! చెపుమ? తే. మహిత చైతన్య వికసన మాన్యరూపుఁ డీ మనుజుఁడు విమలమై రహించు దాని పరమరమణీయ మోహ నావరణ లందు నిరుపమ మ్మొక విశ్వమ్ము నిర్మితమ్ము. తే. అట్టిచైతన్య కేంద్రాలయందు నెద్ది తే. గాఢమౌ సుసంఘర్షణ కడఁగి, నడచు దానివలన మనసున సదా జనించి ద్వైతభావము నెలకొను పరిగి, నిండి. ఒలసి విస్మృతిఁగొన్న యొక్కొక్క దాని వారు గుర్తించుచుందు రాప్యాయముగను వచ్చి చేరువకును పరస్పరము వార లేక మొనరింతు రెపుడు ననేకజనుల. తే. ఎవ్వ రుత్తములై నిల్తురట్టి స్పర్ధ నట్టివా రీల నుండెద రనవరతము సకలసృష్టికి క్షేమమ్ము సలుపుచుంద్రు ప్రీతి శుభమార్గమును జూపెదరు వారు. తే. వ్యక్తిచేతన పరతంత్రమై యెసంగు నిందు మూలమ్ముననె- కాని యెప్పుడ రాగపరిపూర్ణ తలను జెలంగు ద్వేష పంక మాలిన్యమును బొంది, పరగఁగలదె? ఆంధ్ర కామాయని 35 615 తే. €. అదినియత మార్గమున నడుగడ్డునందు నెదురు దెబ్బలఁ దినుచుండు నెల్లవేళ సాగి పయనించుచుండు ప్రశాంతవృత్తి మించి యెపుడు శరణ్య సమీపమునకు. ఎందు శ్రేయ మున్నదియొ యదే మనోజ్ఞ సౌఖ్యసాధన మై ప్రయోజనము నెరపు, జీవితపు టుపయోగము, స్నిగ్ధబుద్ధి సాధనము నిదె యగుచుఁ బ్రశస్తిఁగనును. తే. అట్టి సుచ్ఛాయ సమ్మోహ నాశ్రయమ్ము వడసి లోకము సుఖ యౌచుఁ బరఁగెనేని నీవు ప్రాణమ్మువలె రమియింపు మయ్య లలితగతుల రాష్ట్రపు శరీరమ్ము నొంది. తే. కాలపరిధియం దెవ్వేళఁ గాంచు లయము క్రమసుసమ్మోహన స్థానకల్పనమ్ము తే. Gall కాల మెయ్యెడ నాత్మ సంక్షయము నొందుఁ గడకు నా మహాచైతన్య గహ్వరమున. ఆ యనంత చైతన్య మత్యంత ముగ్ధ లీల నున్మత్తగతుల నర్తించుచుండు పడసి విస్మృతి నీ ద్వైతభావము నెడ నీవు నొనరింపు మార్య! తన్నృత్యకేళి. తే. క్షితిజపటమును బైకెత్తి కెరలుఁ బ్రగతి వెడలుమా నీవు బ్రహ్మాండవివర మందు! అరయు చిట నీ జగత్కుహరాంతరమున మారుమ్రోగు ఘనధ్వనిమలపు వినుమ! తే. లయకు భంగమ్ము రానట్టి రమ్యగతులఁ దాళము ననుసరించుచుఁ దరలిపొమ్ము జ్ఞానహీనుండవై నీవు లోనఁ బలుకఁ దనరకుమ యే వివాదాస్పద స్వరమ్ము.” 616 40 45 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. "శుభము - దీని నీయెడ నిట్లు సుందరాంగి! చాలఁగాఁ దెల్ప నే యవసరము లేదు” ఎంత ప్రేరణామయవొ నీ, వింతి!, యెఱిఁగి తంతయును నేఁడు మ న్మానసాంతరమున. తే. కాని- నేఁడె యిపుడె, యిటు కడఁగివచ్చి తివి తిరిగి మనోజ్ఞమగు త్వదీయ హృదయ కుహరమున నెట్టు లిమిడె నిగూఢరీతి నధిక గంభీర భయద సాహసము నెలఁత! తే. అహహ! ఇట ప్రజాపతి యైన ననుభవించు నట్టి యధికార మిదియేన? అబల! చెపుమ!! అస్మదీయాభిలాష యిట్లనయ ముండు నా యపరిపూర్ణముగనె ధన్యత తొలంగి. తే. ఏను వితరణ మొనరించు చెల్ల వేళ లందు మెలఁగగవలయునే- అర్థి నెదియొ పడయవలెనను నీ శ్రమ పాపమగునె? దీని సహియింపవలయునే తెరవ! యెపుడు? తే. ఈవు నెదియైనఁ బ్రతిదాన మిచ్చినావె? పడఁతి! యల్పమ్మె యైన జెప్పంగఁగలవె? నాకు జ్ఞాన మొక్కటె యిచ్చి నాతి! నీవు బ్రతుకఁగలవె యియ్యిలను విలాసగరిమ. తే. వలచి దేనిని నే, తన్వి! వాంఛసేయు వాఁడనో యదే లభియింప నోడినప్పు డిపుడె నీ వన్నమాటలు నెల్లఁ దిరిగి గైకొనుము తడయక మంజు కంజనయన! 米米粉 తే. ఏను దేని కాంక్షించుచున్నానో యద్ది నాకుఁ గావలె నో యిడ! నాకు నెపుడుఁ ఆంధ్ర కామాయని 50 617 గావలయు నీపయిన నధికారమతివ! అద్ది లేక ప్రజాపతి యగుట వృథయె. తే. తరుఁణి! నినుఁ గనినంత బంధనము లెల్ల నిపుడు తెగిపోవుచున్న వహీనముగను శాసనమ్ముల నధికార సముదయముల నేను కాంక్షసేయుట యేల నించుకైన? తే. పరమ దుర్ధర్షమైన యీ ప్రకృతి కంప నమును గను మొకమారు నీ నయనములను నాతిరో! క్షుద్ర మా స్పందనమ్ము నరయ నతి విపులమైన నా హృదయమ్ము నెదుట. తే. అతికఠోరత నవ్వుచు నాడె నిదియె ప్రౌఢరీతుల సకల మా ప్రళయఖేల కాని యిపు డొంటరి యగుచుఁ గడఁగి యీతం డెంత సుకుమారుఁడై నిల్చు నిటుల నిచట! తే. విశ్వ మొక లయ యని యాత్మ వివర మందు నమ్మి పల్కుచునున్నావు, నాతి!, నీవు లీన మౌదునా యే దానిలోన- ఉవిద! కాని, సుఖ మేమి యున్న దద్దాని యందు తే. ఏను సృజియించుకొందుఁ బ్రత్యేకఫణితిఁ గ్రంద నాయత ఘనత రాకాశ మొండు అందుఁ దోఁచు రోదనలోనఁ బొంది నిన్ను నట్టహాస మొనర్తు నత్యంతముగను. తే. అంబునిధి మరల నిజ మర్యాద వీడి యిచ్చమెయి గంతులిడి నదియించుఁగాక! వచ్చిపోయెడఁగాక తా వజ్రగతుల నతులభయ దోరు తీవ్ర ఝంఝానిలమ్ము. 618 55 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. తే. తే. మఱల నల్లటతల్లట మలఁగుఁగాక! నౌక ఊర్మికల్ ప్రవహించుఁగాక పయిన!! సావధానమ్ముఁ గొనుఁగాక చదల సూర్య చంద్ర నక్షత్రతతులు సంచకిత గతుల!! కాని - చెలియ! నిలువుము నా కడనె నీవు నీవు నాదాన వెప్పుడో నెలఁత! నిజము ఆడుకొనుటకు నీకు నే నబల! యొక్క క్రీడరీతిగ నుండెడివాఁడఁ గాను. ”
“నా వచనముల నర్థ మ్మొనర్చుకొనఁగఁ దలఁపవైనను యత్నమ్ము సలుపవలయు! ఏల యుత్తేజితుండ వై యిటుల నీదు ప్రాప్యమును బొందనెంచవు ప్రభువరేణ్య! తే. ప్రజలు క్షుబ్ధులై శరణమ్ము వడయ నచట నిల్చియున్నారు- ప్రకృతి యున్నిద్ర నిత్య ఘనత రాతంక పరిపూర్ణ కంపమాన యగుచును క్షణక్షణము ప్రత్యక్షమౌను! తే. ఏ శుభాకాంక్షిణిని నౌట నింక నేమి చెప్పఁగలదాన - జాగ్రత్త! చెప్పినాను చెప్పఁదగినదియును నేను జెప్పవలసి నదియు - ఇంక నిట నుంట యర్ఘమ్మె నాకు.”
తే. "ఆడి యొక కొన్నిమాటల, నతివ! చిన్ని బాల లాటల 'జిల్లాయి' పలికినటుల నిదియె, మాయావినీ! యెట కేగుచుంటి విటుల సెలవు గైకొనుచు నన్నిచట నిలిపి. ఆంధ్ర కామాయని 60 65 619 తే. రూపుఁ గొన్నట్టి యొక మహాశాప మటుల నాదు నెదుటకు నేతెంచినావు నీవు ఈవె తొలుతగా నాకుఁ జూపించినావు, పొలఁతి! సంఘర్ష ణారంభభూమిక నట! తే. విపుల రుధిరభరిత ఘన వేదికాళి! అందు జ్వలియించు భీకరమ్మైన జ్వాల!! నీ వలననే కుశలినయి నేర్చినాను పడఁతి! ఏను నియంత్రణోపాయ మెల్ల. తే. వర్ణములు నాల్గు రక్తి నేర్పడిన వపుడు పరఁగ విభజనఁగొనె నెల్లవారి శ్రమయుఁ గలలనై నను నెవ్వాని గనఁగ లేదొ యట్టి శస్త్రాళి, యంత్రమ్ము లందె సృష్టి. తే. లబ్దశక్తిని నరుఁడు ఖేలనమొనర్పఁ దమి వహించుచునుండె సత్యాతురతను కల్గుచున్నయది ఘన సంఘర్షణమ్ము ప్రకృతితో నిత్య - మతనికి భయములేదు. తే. తన్వి! నియమము లనెడి యాతంకములను నేఁడు నీ విట దరికి రానీయవలదు తరుణి! యీ హతాశా జీవితమున కీవు కలుగఁజేయుమ యొక్క సుఖక్షణమ్ము.”
తే. " అయిన నీ నేను చేసిన యట్టిదెల్ల మరచిపోకుమ యిటు పల్కి మనువరేణ్య! లభ్యమైనట్టి దానితో రక్తినొంది గర్వపడకుమ యీ రీతిగను మహీశ! తే. ప్రకృతితోఁ గల్మష విహీన భావమునను నీకు సంఘర్షణమ్ము నే నేర్పినాను 70 00 620 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. నిన్నుఁ గేంద్రముగా నిల్పి యెన్న డేని నెట్టి యహితము నేను గావింపలేదు. ఎందు నీ వ్యాప్తి నిండె నహీన గతుల నట్టి విపుల వైభవమున కాత్మ నెట్టి సంశయమ్మును జెందక సలిపినాను నిన్ను యజమానిగా, మనూ! మన్ననలను. తే. అయిన నేటి నా యపరాధ మన్యమగుచు నిలిచియున్నది, యో ప్రభూ! నీదుదృష్టి 'ఔను' ‘చిత్తము' అనుచు నే ననకయున్న నదియె యొక దొడ్డ యపరాధ మగుచునుండె. తే. మనువ! ఈ భ్రాంత శార్వరీ మహిమ యెల్ల గడచిపోవుచునున్నది కనుమ! ఇదియె ప్రాస్దిశను నవోషస్విని క్రమ్మివచ్చి యిమ్ముగ జయించుచుండెఁ దమమ్ము నెల్ల. తే. సమయ మింకను గలదు ప్రజాధినేత! నా యెడలఁ గొంతగా నిల్పి నమ్మకమును గొంతగా ధైర్య మిపుడు చేకూర్చుకొన్న సర్వవిషయముల్ కొలఁదిలోఁ జక్కఁబడును.”
తే. పరమ దారుణము బ్రమాదభరితము నయి కడగి వచ్చె “ఆ మరియొక క్షణము” తిరిగి అప్పు డిట యటఁ దనదు పాదాబ్జములను ద్రిప్పి నడువసాగెను ద్వారదేశమునకు. తే. పడఁతి యాపఁబడియె మను పరుషబాహు దండముల నపు- డసహాయతా మనోజ్ఞ దీనదృక్కులఁ జూచుచు దెఱవ యామె యుదిలకొను నెదతో నటనుండి వెడలె. ఆంధ్ర కామాయని
75 621 తే. "దేవి! సకల సారస్వతదేశ మిద్ది నీది, రాజ్ఞివి నీవె యీ నిఖిలమునకు నీదు నుపకరణమ్ముగా నిలిపి నన్ను నిచ్చవచ్చినరీతిఁ గావించె దీవు. తే. ఇట్టి మోసమ్ము నడచుట కిపుడు, రాజ్ఞి! యింక శక్తివిహీనవం చెఱుఁగు మమ్మ! కోరి నీ వలనుండి ముక్తుండ నైతి- ఇద్దియును నీదు మనమున నెఱిఁగికొనుము. తే. సాజముగ నిప్పు డి మ్మహాశాసనంపు ప్రగతియును నాగిపోవును ప్రభ్విణీ! - ఇ దేల యనిన నా చేతఁగా దోలి నిట్టి దాసభావము గ్రహియించి తాల్చుటెపుడు. తే. సర్వ సమయమ్ములం దేను శాసకుఁడను జిరతర స్వతంత్రుఁ డను- నిస్సీమ మైన యాధిపత్యము నీ పయినైన నాకుఁ గావలె - బ్రతుకు సఫలమై కడఁగవలయు. తే. కానిచో రాజ్ఞి! మఱియొకక్షణములోన నీ వ్యవస్థ ఛిన్నాభిన్నమే యగు- నిది యఖిలమును నిల్వఁజాలక యతలమందుఁ గనుచు నుండగ వేగాన మునిగిఁపోవు. తే. గాఢభయమున నీ రత్నగర్భ యెల్ల నిటులఁ గంపించుటలను వీక్షించుచుంటి: మఱియు విపుల వియద్వీథి మహిత మమత వీడి క్రందించుటలను నే వినుచునుంటి. తే. అయిన నీవు బందీవి నా యప్రతిహత బాహుబంధాన, ఘన వజ్ర వక్షమందు” 622 అచటఁ గన్పట్టుచున్న యా యఖిల మపుడు పిదప మునై నిశ్వాసంపు వెల్లువలను. 80 85 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. 'ఫెళపెళ' లను సింహద్వారగళము పలికె ప్రజలు లోని కయ్యెడ సాగివచ్చినారు లజ్జగొను నిడను గని "మా రాజ్ఞి!" యనుచుఁ గడఁగి కావించినారు ఛీత్కారములను. తే. ఆత్మ దౌర్బల్యమున దోఁచి యపుడు మనువు రొప్పుచున్నట్టివాఁ డయ్యె గొప్పగ నట! స్థలన కంపితములు పదసారసములు తెప్పరిలక వణకుచుండె నిప్పుడైన.
తే. కరమునఁ గొని మనువు వజ్రఖచితమైన తే. రాజదండము నవధాన రమ్యుఁ డగుచు బిట్టరచె నిట్లు "ఐనచో వినుఁడు నేను చెప్పుచున్నది యెల్ల మీ చెవులు జొనిపి... సకల సుఖసాధనమ్ముల సరగఁ జూపి తృప్తులను జేసినాఁడ నే తివిరి మిమ్ము శ్రమవిభజనము సేసితి రమ్యఫణితి పిదప నే వర్గములను గల్పించినాను. తే. ఇదె ప్రతీకార మిటులఁ గావించుచుంటి మనయ మీ యిలలో మన మనుభవించు ప్రకృతి సేయు నత్యాచారబహుళమునకు - మౌనము సహించుటయె లేదు మనము నేఁడు. తే. కాము, మన మీ స్థితిని పశుగణము - కాము మూక కాననచారులము - నయిన నిటు మీర లెల్లరును మరచినారు కోరి యే నొనర్చిన యీ యుపకృతిని నిపుడు.”
ఆంధ్ర కామాయని 90 623 తే. గాఢ మానస గళిత దుఃఖమ్ముతోడ వారు క్రుద్ధులై యీ రీతి పలికినారు "కనుమ నీ, వియ్యెడను భవ న్ముఖము నుండి యే పలికె పాప మిట్లు మహీమహేంద్ర! తే. తలప మాకు యోగక్షేమములకు మించి సంచయము ప్రీతిమైఁ బూని సలుపు లోభ మొనరఁగా నేర్పి పడవైచి, తో యిలేశం? చారు ఘోర దారుణమైన సంకటమున. తే. అమిత సంవేదనా శీల మబ్బె మాకు అరయ నిర్దియే దొరికినదైన సుఖము ఏము కల్పిత దుఃఖాల నేర్పరించి కష్టముల్ గల్గె ననుకొనఁ గడఁగినాము. తే. యంత్రముల మూలమున, రాజ!, యఖిలజనుల ప్రాకృతిక శక్తి కర్షించి భయదరీతి జీవితము నెల్ల మివుల శుష్కింపఁజేసి శిథిలమును, నశక్తమ్మును జేసినావు. తే. ఏల యిట్టి యత్యాచార మీ వొనర్చి నాఁడ విటపయి ఓ జననాథ! - యిచట నందఱి బలాభిరక్షతో నిందుకొఱకె నీవు బ్రతికినాఁడవె మనూ, నిఖిలభర్త! తే. కడఁగి మా మహారాజ్ఞి యౌ నిడను దలఁప కిప్పు డిటుల బందీని గావించినావు ఇంకమఱి నీకు రక్షణ యేది యిచట? ఓయి యాయావరా! ఎటు లుండుఁ జెపుమ!" తే. "అయిన ప్రకృతి, పుత్తలికల యమిత భయద సముదయంబుల మధ్య నిశ్చలత జీవి 624 95 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తాహవమునందు నే నిపు డాత్మశక్తి నొంటి చరియింపఁ దలచిఁయే యున్నవాడ! తే. ఇదె శరీరముల పయి మీ రిపుడు కనెద రమిత సాహసికుని పౌరుషాప్తి యెదియొ కఠిన రాజదండమ్ము నిక్కముగ వజ్ర ఖచితమైనట్లు గమనింపఁగలరు మీరు. తే. తే.
అని పలుకుచును నిజభయదాస్త్ర మపుడు మనువు సవరించుకొనియె నమంద ఝడితి నంత దేవాగ్ని జనియించి యక్కజముగ పృథు కరాళ కీలాళుల వ్రేళ్ళఁగ్రక్కె. బయలు వెడలిన దీర్ఘచాపమ్ము నుండి దారుణాంచల నారాచ తతులు మెఱసి ఆకసమునుండి పడుచుండె నతివినీల పీతవర్ణ మహా ధూమకేతు చయము. తే. సాగుచుండె వాత్యావర్ష శౌర్యమంత ముందునకుఁ బ్రజాక్రోధమ్ము పోల్కి నొప్పి కడఁగి మెరయుచునుండె సంగ్రామవృష్టి యందు జంచలా గణము శాస్త్రాళి యగుచు. తే. కాని, క్రూరుడు, మనువు మార్గణము లెల్లఁ దెరలఁజేయుచు, నిశిత నిస్త్రింశ శక్తి నాహరించుచుఁ బ్రజల ప్రాణాశ లెల్ల బ్రగతి సాధించుకొనుచుఁ దాఁ బరగుచుండె. తే. తీవ్రగతిఁ దాల్చెఁ దాండవోద్వేగ మపుడు రమ్య పరమాణువులు వికలతను జెందె, తారుమారై నది నియతి దారిఁ దప్పి, అంద రొందుచుండిరి భయవ్యాకులతల. ఆంధ్ర కామాయని 100 625 తే. అప్పు డలాతచక్రము రీతి నచట భయద శుభ్రతిమిరానఁ జరియించుచుండె మనువు మమత విడిన కరము రక్తిమము వహించి నాట్య మొనరించుచుండె నున్మత్తగతుల. తుముల రణనినాద గరిమ దుర్బరముగ స్థితి భయానకతర పరిస్థితిని బొందె వచ్చె ముందుకు మౌనాన వైరిపృతన పదదళిత మయ్యె సర్వవ్యవస్థ యపుడు. తే. తే. గాఢహతి నొంది మనువు వెన్కకుఁ దొలంగె ఒక్క కంబము నాని నిట్టూర్చినాఁడు కఠిన లక్ష్య సంభేది యౌ కార్ముకమ్ము కడఁగి కావించెఁ జటులటంకార- మంత... తే. వికటములు, నధీరమ్ములు, విషమములును నైన బహువిధ వాయువు లలమి వీఁచె పరఁగె నపు డెల్ల మృత్యుపర్వమ్ము పగిది ఆకులి కిలాతులైరి నాయకులు కనఁగ. తే. "ఈయనను నెటకును వెళ్ళనీయవలదు. గట్టిగా హెచ్చరిక కేక పెట్టినారు " అంత సావధానత వచ్చి యనియె మనువు “పట్టుకొనుడు వీ రిరువురఁ బట్టుకొనుడు. తే. "మీర లిరువురె” యోరోరి భీరులార! ఇట్టి యుత్పాత మెల్లఁ గావించినారు తెలియకను దలఁచి మది నాత్మీయు లనుచు నిన్ని నాళ్ళుగ మిము స్వీకరించినాను. తే. అయిన మఱి రండు బలి యెట్టులగునొ కనుఁడు రండు, ఓ కిలాలూకులులార! రండు!! 626 ఓరి యజ్ఞపురోహితులార! రండు!! ఏమి యనుకుంటిరో మీర, లిది రణమ్ము” 105 110 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. తక్షణమ్మునఁ బడినారు ధరణిశయ్య యందు దనుజపురోహితు లార్తిగొనుచు “చాలు అపుడు సమరమ్ము చాలు, చాలు” ననుచు నయ్యెడ నిడ యిట్టులనియె నిచ్చ.
తే. "అతులమై భీషణ జనసంహార మెపుడు నాగక స్వయముగ సాగు నవనియందు పరఁగు చీరీతి నో వెట్టి ప్రాణులార! బ్రతుకుఁ బోగొట్టుకొన మీకు భావ్యమగునె? తే. ఓయి గర్విష్టి! ఇటు భయమొందఁజేసె దేల? నీ వాగిపొమ్ము- జీవింపనిమ్ము రమ్యముగఁ బ్రజ నీ ధరారాజ్యమందు - పడసి సౌఖ్యాల నీవును బ్రతుకుమయ్య!"
తే. కాని- యెవరు దీనిని వినఁగడఁగువారు? తే. రేగి వేదికాజ్వాల జ్వలించుచుండె మహితగతిని విలక్షణమార్గమందు మొదలుపెట్టెను సాగ సామూహికబలి. మను మహోదయుని క్షత జోన్మత్త హస్త మిప్పటికి నాగిపోవుట కిచ్చగింప దయిన నా ప్రజాపక్ష వీరాగ్రసరులు గొన్న సాహస మ్మేని వంగుటయె లేదు. తే. దీన యగుచు సారస్వత దేశరాజ్ఞి. ఇడయు నిల్చిన దవమానహేతి యొలయ వారు ప్రతిచర్యయందున వ్యగ్రులైరి నీటివలె నదించుచునుండె నెత్రుటేళ్ళు. ఆంధ్ర కామాయని 115 627 తే. రజ్య దుగ్ర ప్రతిభయ నారాచ మొండు పొలిచి ధూమకేతువు వలెఁ బుచ్చమందు నతిశయ లయంకర మ్మైన యగ్నికీలఁ దాల్చి రణభూమి వంకకుఁ దరలివచ్చె. తే. ఒక మహాశక్తి జగమెల్ల నుదిలపడఁగ నుప్పరమ్మున నయ్యెడ హుంకరించె తత మహోజ్వల ఘన శస్త్రధార లట న హీన భయద వేగమును వహించి మించె తే. విరుచుకొనిపడె నవి మనువరుని మీఁద అచటనె పడి ముమూర్ఖువై యాతఁ డుండె ఉండె వ్యాపించి యా ప్రథనోర్వి యందు నిరత కీలాల కల్లోలినీ జలమ్ము. 120 628 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 నిర్వేదము (ఆప్యాయము) తే. అట్టి సారస్వతనగర మప్పుడుండె క్షుభితమై, మలినమునై విశుద్ధ మౌన గరిమ - దానిపై వ్యాపించె గాఢ కర్మ రహిత విధుత విషాదావరణ పరిణతి. తే. ఉడుగణ గ్రహములు నింగి నుల్క లనెడి హస్తదీపికల్ గల ప్రతీహారు లటులఁ దిరుగు - నియ్యిల నిట్లేమి జరుగుచుండె - ప్రత్యణువు చంచలమ్మయి పరుగు లేల?
తే. "సత్య మీ జీవితమ్మున జాగరణమ? కాక యద్ధాన నంతమా గాఢనిద్ర? అతి భయానక రాత్రి యీ యఖిల భవము” - అనెడి యొక కేక విన్పించునప్పు డపుడు. తట తటలఁ బక్ష చలన ముద్దండరీతి సలుపు నాలోచనలు నిశాచరులు పగిది నిఖిల నిశ్శబ్ద కర్షణ నిరతిశయత దివ్య యరుగుచుండె సరస్వతీ స్రవంతి. తే. ఇప్పటికి క్షతగాత్రుల యెక్కిళులను మర్మ దుర్వ్యథ చెలరేగి మలఁగుచుండె ఖగరవమ్ముల మిషతోడ నగరలక్ష్మి యెద్దియో కరుణకథ విన్పించుచుండె. తే. మసక నీడల వెడలుచు నెసగుచుండె గొంత యస్పష్ట పురదీపకాంతి యపుడు ఆంధ్ర కామాయని 629 CT 5 ఆగుచును వీచుచున్నది యనిల మచట! సకలమును నిండె దుఃఖావసాద గరిమ. తే. పృథుల భయ మూకతా సునిరీక్షకు వలె నిత్య మౌనాన నిల్చె నన్నిద్ర యగుచు తిమిర నీలావరణ మట దృశ్యజగము కంటె నత్యంత విపులమై కానుపించె. లే తే. మంట పాయత్త సోపాన మహితతలము నచట శూన్యమైయుండె - లే రన్యు లెవరు? అతివ ఇడ ఉపవిష్టయై యచట నొంటి నుండె - అనిలశిఖ జ్వలించు చున్నదెదుట. తే. మనువరేణ్యుని క్షతగాత్ర మచట నెంతొ కదలఁజాలక పడియున్న కారణమున రాజచిహ్న శూన్యము మందిరమ్ము కనఁగ నొక సమాధి పోలిక పడియుండె నపుడు. తే. కాంత ఇడ కేవల గ్లాన కలిత కెరల గతవిషయముల యోజింపఁగడఁగె నపుడు విమల మమతా మహాఘృణ విసరములను బరఁగఁ గడచిన విట్టి శార్వరు ల వెన్నో. తే. అట్టి యంగనా హృదయము! అందు చెలఁగ సృష్టి గావించినది సుధాసింధు వలల బాడబజ్వాల జనియించి ప్రౌఢీ మెరసి జలములను జేసె సౌవర్ణ శబలితముగ. తే. అట్టి మధుర పింగళ తరళాగ్ని యందు శీతలతయె సృష్టిని విరచించుచుండె అహహ! ఆ క్షమా ప్రతిచర్య యగు ద్వయంపు మాయ స్థిరతర నృత్యము సేయుచుండె. 10 630 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. “నాతొ నాతఁడు స్నేహ మొనర్చినాఁడు అయిన లే దది కనఁగ ననన్యముగను అయ్యనన్యత సహజ సంప్రాప్త యగును ఇద్ది యుండు నే కడ నేని, ఎన్నఁ డేని. తే. ఎద్ది యవరోధ సముదయ మెల్ల దాటి పరుగునెట్టెనొ యా స్నేహభావమె యిపు డర్థి భేదించి సీమల, నఖిల మిటుల మారినది యొక యపరాధ ఘోరముగను. Gub తే. తే. Gilb తే.. ఔను, అపరాధ! మది, కాని అద్ది యొకటే యెంత భీప్రద మైన రూపెనయఁ గొనియె జీవితపు టొక కోణంపు సీమనుండి చెలఁగి జృంభించి నే డె ట్లసీమ మయ్యె! కనఁగ సర్వ మా ప్రచురోపకార చయము, నఖిల సహృదయతము మాయయా?, అహీన శూన్యమా? దానియందు నస్తోక మగుచుఁ గ్రీడసేయునే కపటమ్ము కేవలముగ. ఆ దినమ్మున బరదేశి యగుచు వచ్చి నప్పు డెంతటి దుఃఖార్తి నతఁడు తోఁచె అతని పదముల క్రింద లే దవని ఉన్న సకలమును నాల్గు దిక్కుల చాయ యొకటె. తే. శుభ్ర పాలన కతఁ డయ్యె సూత్రధారి తత నియమ చయమునకు నాధారుఁ డయ్యె తాను నిర్మించిన నవ విధానముననె అతఁడె సాకార దండన యయ్యె నిపుడు. తే. జలధిఁ దరగల వలె లేచి శైల శృంగ పాళికల కెక్కినాఁ డవలీల మెరసి ముందునకు విశ్రమస్థానములను గడచి య డ్డెరుఁగని నడల సాగి యరిగినాఁడు. ఆంధ్ర కామాయని 15 631 తే. ఉర్విని ముమూర్ఖువై పడియుండె నేఁడు తే.. గతము సర్వము నొక స్వప్నగాథ యయ్యె అతని నాత్మీయుగా హృదయాంతరములఁ గొన్న స్వజనులే యన్యులై యున్నవారు. ఆతఁ డెవ్వతె కుపకార మర్థి జేసె నట్టి నా కిపు డపకార మాచరించె ఎల్లరకు గుణి యౌచుఁ జరించె నెవ్వఁ డతని నుండి కలిగె దోష మతిశయముగ. తే. అరెరె! కందళిత నవ సర్గాంకురమునఁ బరగె నీ మంచిచెడులను పల్లవములు చెలఁగు నియ్యవి యన్యోన్యసీమ లగుచు ఏల యీరెంటి నిచ్చఁ బ్రేమింపరాదు. తే. తనదు సుఖమైన నది యన్యజనుల దైన " నదియె కడు వృద్ధిఁగొని దుఃఖమౌను తుదకు ఆగిపోవుట కెచట సీమాంత మెదియొ యించుకేనియు బుద్దికి నెరుకపడదు. తే. తవ భవిష్యముఁ గూర్చి చింతన యొనర్చు ప్రాణి వర్తమానసుఖము వదలుకొనును పరుగువెట్టుచు నుండు నేర్పరుచుకొనుచుఁ దానె తన మార్గమునకు నాతంకములను. 20 20
తే. "ఇటచఁ గూర్చుఁట శిక్ష విధించుకొరక- కాక యితనికిఁ గావలిఁగాయుకొరక! ఎట్టి విషమ సమస్య యౌ నిద్ది! ఎట్టి నవసమస్యా ప్రపూర్ణ వైనాను నేను. తే. ఎద్దియో శుభము జరుగు నిందువలన ఒక్క మధురకల్పన మిది- ఉండు నిద్ది 25 632 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. వాస్తవము కంటె కమనీయ వైఖరులను దీనినే సత్యము వరించుఁ దీపి నెరిఁగి." తే. అపుడు విని యెదొ దూరాగ తారవమ్ము విడ యోజనలలోన నులికిపడియె రమణి యెవతెయో, యా స్తబ్ధ రాత్రివేళ నిటకు వచ్చుచుండె నడచి, యిట్టు లనుచు "తెలియఁజేయుఁ డోహో దయోదీర్ణులార! నా ప్రవాసి యే కడన నున్నాఁడొ యేమొ! అట్టి యున్మత్తుని యనుషంగారమె యిటు నేను జగము నెల్లఁ బ్రదక్షిణించు చుంటి. తే. అతఁ డాత్మీయత యెడనె యలిగినాఁడు తెలియనైతిఁ జేయఁగను నాత్మీయు నతని నతఁడు నావాఁడె యై యున్న కతన నపుడు తెలిసి యే నెవ్వని యలుకఁ దీర్పవలయు? తే. అదియె పొరపాటు- ఇప్పుడ య్యదియె యొక్క కంటకము నా మనమ్మును గలఁతవెట్టు పురుషు నాతని నేనెట్లు పొందగలను? వచ్చి యెవరైన యీ యెడఁ బలుకుఁడయ్య. ” తే. లేచె ఇడ చూచె అస్పష్టరీతి నొక్క
ఛాయ రాజవీథి నడచుచాయఁగనియె వాక్కునం దున్నది కరుణావ్యథయె నిండి ఆ పిలుపు జ్వలియించు చున్నట్లు తోఁచె. శిథిల వపువు వసనము విశృంఖలమ్ము చెదరి విడివడ్డ చంచల చికులపాళి ఛిన్నపత్రమ్ము, విశ్లేథ స్నిగ్ధ మధువు మానరుచి యైన ప్రసవమ్ముమాడ్కి నుండె ఆంధ్ర కామాయని 30 633 తే. పట్టుకొని కరాంగుళి నొక బాలుఁ డుండె, రమ్య నవకోమలంపు టాలంబనముగ గట్టిగాఁ బట్టి తల్లి నా పట్టి యప్పు డటు నడచుచుండె మూకధైర్యమ్ము పగిది. తే. పరమ దుఃఖాకులత బాధపడుట వలన నధ్వగు లగు మాతాపుత్రు లలసినారు క్షతములను శయనించి, మార్గమ్ము తప్పి వెడలి చరియించు మనువును వెదకుచుండ్రి. తే. అప్పు డిడయు ద్రవీభూత యగుచు నుండె విశద దుఃఖార్తులగు వారి వీక్షసేసె చేరి వారిదగ్గరకుఁ బ్రశ్నించి రిటుల “మరచి మిమ్ముల విడినవా రెవరుతల్లి!” తే. తిరుగు చీ గతి నీ తీవ్ర తిమిరరాత్రి నెచటి కేగెదవమ్మ, ఓ యింతి! చెపుమ!! సాధ్వి! మిముఁ గని విచలిత స్వాంత నైతి కడఁగి విప్పుమ నీ వ్యథాగ్రంథి యెదియొ! తే. అమిత దీర్ఘ మీ జీవితయాత్రలోన నెంత దూరగులైన లభింత్రు, దేవి! ఒక్కయెడ నెప్తా బ్రతుకు సంయోగమొందు కడకు దుఃఖనిశీథముల్ గడచిపోవు. ”
తే. 'బిడ్డ యలిసెను శ్రాంతి లభించు నిచట' ననుచుఁ దలపోసి యటశ్రద్ధ యాగిపోయె వహ్నిశిఖయు నయ్యెడ నటఁ బ్రజ్వలించు నవని నిలిచిన ఇడ కడ కరిగె నామె. తే. ఎదుటి మంటపమెల్ల వెల్గించుచును గృ పీటయోని కుండజ్వాల పెల్లు రేగి 634 35 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 నది యదాటుగ - శ్రద్ధ యెయ్యదియొ చూచె అడుగులను వేయుచును దాని కడకుఁ జేరె.
ఆ మనువె నిక్కముగను గాయపడినాఁడు! అయిన స్వప్న మిటుల సత్యమైన యదియె? "అయ్యయో! ఓయి ప్రాణప్రియా! ఇదేమి? ఈవె- ఇటులనా...” ప్రవహించె నెద ద్రవించి, తే. చకితురా లయ్యె నిడ, వచ్చి శ్రద్ధ, చేరి నిజకరమ్మున మనువును నిమిరె నపుడు ప్రాపిత స్పర్శ మధులేప నోపమమ్ము! ఏల నిలచును వ్యథ యది యెట్టి దైన? తే. బహుళ మూర్ఛిత మా నీరవత్వ మందు వరలి మెలఁగెఁ గొలఁది లఘు స్పందనములు మించె కందోయి పొంది యున్మీలనమ్ము తోఁచి కోణాల నిండె బిందువులు నాల్గు. తే. మందిరమ్మును, మంటప మహిత వేది కలను పుత్రుఁ డయ్యెడ నటఁ గనుచునుండె “ఏమి యిదియెల్ల నా మది కిడుచుఁ బ్రీతి నిటుల మోహనాకృతిఁ గనుపించుచుండె!” తే. తల్లి అనియె “అరే! రమ్ము తడయ కీవు నాన్న! ఈ యెడనె పడియున్నాఁడు!!, చూఁడు!!" “నాన్నయా? ఇదె వచ్చుచున్నాను నేను” అటుల ననువేళ నొదవె రోమాంచితమ్ము. తే. "ఇమ్ము జలములఁ, కొనియుందురమ్మ డప్పి ఏ మొనర్తువె కూర్చుండి యిచట నీవు?" మొనసి శూన్యమంటప మయ్యె ముఖరితమ్ము ఈ సజీవత్వ మది కన నెచట నుండె? 40 45 ఆంధ్ర కామాయని 635 తే. ఆ గృహమ్మున నాత్మీయ తప్పుడు తోఁచె చిన్ని పరివార మేర్పడి చెలఁగుచుండె ఆ మహిత మందిరమ్మెల్ల నలముకొనియెఁ జేరి శ్రద్ధా మధురగీతికా రవమ్ము తే. "మనసా! ఓహో! ఓ మనసా!! అతిశయ తుముల రణోజ్జ్వల ఘనకో నే లాహల కలహ మ్మందున నే నౌ దును హృదిలోఁ గల వలపుల పలుకును ఓహో, ఓ మనసా! తే. వికలమ్మై చిరచంచల మై నిద్రాక్షణ తే. ముల నన్వేషణ చేసెడి చైతన్య మ్మల పొందిన రీతిగ దోచును - ఓ మన సా? నే మంజుల మలయానిలము నొహో! ఓహో ఓ మనసా! చిరదుః ఖావిల మానసబాధా తిమిర న దోషస్వినిఁ బోలెడు నొక జ్యోతిరేఖను నే నై యుందు నె వేళను గనఁగా-ఓ మన సా! సుమవికసిత ప్రాతఃకాలము నోహో! ఓహో ఓ మనసా! తే. మరుభూముల నగ్నిజ్వాలను గనలెడి చాతకి జలబిందువులకు వ్యాకులపడియెడి, జీవితత్రుటులను నే నౌ దోహో, ఓ మన సా! సుమనోహరఘన వర్షర్తువు నియ్యిల! ఓహో, ఓ మనసా! తే. పవన ప్రాచీరమ్మున నిలిచి జ్వలించెడి జీవన మిదె నమితమ్మై బ్రతుకుచు నున్నది కుమిలిన యీ విశ్వమ్మను పగటికి ఓ మన సా? నే నామని సొగసులు శార్వరి నోహో! ఓహో ఓ మనసా! తే. నిత్యనిరాశా నీరద గుచ్ఛాచ్ఛాదిత లోచన 636 బిందు సరోవర మందున షట్పద ముఖరిత మంజుల మాధ్వీ ముకుళిత మోహన హిమకరణ జలజాతమ్మును నే నోహో ఓ మనసా! ఓహో ఓ మనసా!" 50 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. ఆ స్వరలహరికా మంజు లాక్షరాళి మధుర సంజీవనఁపు రస మై నదించె. ఐనయది ప్రభాతము ప్రార్ధి శాంగణమున ముకుళిత మనులోచనములు వికసితములు. తే. లభ్యమయ్యె శ్రద్ద యను నాలంబనమ్ము మరల - నిండెఁ గృతజ్ఞ తా గరిమ నెడఁద మనువు కూర్చుండె గాద్గద్యము ననులేచి పలికెనొక్కింత యనురాగభరితుఁ డగుచు. తే.
"మంచి దో శ్రద్ధ! ఈవె యే తెంచినావు కాని-పడియున్న వాఁడను నేను, తన్వి?" - అదియె భవనము, స్తంభమ్ము లవియె! అచట ఘృణయె నాల్గుదెసలను వ్యాపించియుండె. తే. "క్షోభచే నయ్యెడను మూసికొనియె కనులు తీసికొనిపొ మ్మెదో దూరదేశమునకు ఈ భయంక రాంధ్యమ్మున నేను మరచి మరల పోఁగొట్టుకొనవచ్చు మగువ! నిన్ను. తే. పట్టుకొని చేయి నీ వెంట వత్తు నేను ఇంతి? ఆలంబన మ్మౌ, లభించె, నిదియు తోచునా నీ వెవర వోసి! తొలఁగిపొమ్ము! రమ్ము! వికసించును మనస్సుమమ్ము, శ్రద్ధ!”
తే. శ్రద్ధ నిశ్శబ్దముగ విలోచనములందు నింపి విశ్వాసము శిరము నిమురుచుండె “ఈవు నావాఁడ విపు డెవ్వరేని యేల యడలుగొనవలె”నని చెప్పునటులఁ దోఁచె.
ఆంధ్ర కామాయని 55 637 తే. తే.. జలము గ్రోలి పిదపఁ గొంత స్వస్తుఁ డైన మనువు కడు నెమ్మదిగ నిట్టు లనఁగసాగె "చెలియ! ఈ నీడ నిలువని సీమకిపుడె నీవు కొనిపొమ్మునను- ఉండనీయ కిటను. నాతి! మన మింక నిర్మేఘ నభము క్రింద నో మరెచటనో నొక గుహనో చరింత మనుభవించుచునే యుంటి మనుభవింత మెద్ది యేతెంచినను దాని నెల్ల వలచి”. తే. "కొంత యోపిక పట్టుము కొంచె మైన బలము రానిమ్ము అయ్యది వచ్చినంత నిన్నుఁ గొనిపోదు మరి మన నిన్ని క్షణము లైన నుండనీయదె యిట" - అనియె శ్రద్ధ.
తే. కుంచితాంగియై ఇడ నిల్చె- కోరి యిట్టి అధికృతిని లాగికొనఁ జాలదయ్యె నపుడు స్థిరత దోప శ్రద్ధ మనువు చెంత నుండె - 'అపుడు పల్కె నాతని వాణి యాగ కిటుల. తే. "నిండి జీవిత మందున నుండె నిచ్చ కొసరి స్వేచ్ఛానురోధమ్ము కూడియుండె అంతరంగాన నభిలాష అతిశయించె అమల మాత్మీయతాజ్ఞాన మర్ధి నిండె తే. ఉంటి నేను- సుందర కుసుమోజ్జ్వలముల దట్టమగు సువర్ణచ్ఛాయ తనరియుండె మలయ పవన తరంగాళు లొలయుచుండె ఉల్లసనముల ఘనమాయ యొప్పుమెరసె. తే. అరుణ సురభిళ చ్చాయోజ్జ్వ లాంతరమున కపు డుషాదేవి పాత్రిక నర్థి నింపి 60 638 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తెచ్చె- నా యౌవనము సుఖోదీర్ణమగుచుఁ ద్రావుచుండెను ముదిత నేత్రములు మూసి. తే. ఒంది నవ మరందము శరదు దయవేళ బహుళ బిందువుల్ రాల్చు శేఫాలికాళి అంత సంధ్యా రుచిర వలి తాలకములు సౌఖ్యములు నిలపయి వెదజల్లుచుండె. తే. కడఁగి క్షితిజమునుండి యాకస్మికముగఁ దెరలి జృంభించె వేగానఁ దిమిరవాత్య కలఁగె విశ్వము కల్లోలగరిమ వలన విమల మానసలహరి యుద్వేగమొందె. తే. వ్యథిత మానస మనెడి నీలాంబరమున కాంతిపథ మెపుడు జనించి కడు హసించె నప్పు డో దేవి! మంగళాయతన మైన నవ మధురహాసమును నీ వొనర్చినావు. తే. నీదు నమలిన నిర్జరీ నిత్య శోభ యింపుగా విలాసములఁ గ్రీడింపసాగె ఉజియిత మదీయ హృన్నిక షోపలమున లిఖితవైతివి నవహేమరేఖ వోలె. తే. అపుడు నేర్పసాగిన దరుణాద్రిఁ బోలు నా మనోగృహాన నిలచి మహిత ముగ్గ మా మధుర నవప్రతిమ సమాదరమున ప్రణయమయి వోలె సౌందర్యభావ మహిమ. తే. దేని సౌందర మనుచు నుతింతు మెపుడు, దేనికయి సుఖదుఃఖ సంతానమెల్ల ననుభవింతురో ప్రాణులు, కనుచు నేను దాని గుర్తింపఁగలిగితిఁ దన్వి! యపుడు.” ఆంధ్ర కామాయని 65 70 639 తే. యౌవనము జీవితమ్ముతో ననియె నిటుల: "ఓ మదించినదాన! నీ వోసి మత్తు రాల! చూచితే యేమైన" - యౌవనమ్ము పలికె నిట్టూర్చి: “నడువు సంబలము గొనుము.” తే. రక్తిమై చిత్ర మైనది శుక్తి పగిది స్వాతిబిందువు వైతివి చాన! నీవు నాదు నెదతమ్మి తూగె నానందమునను తెరవ! తమి నైతి వీవు పూఁదేనె వందు. తే. ఆకు రాలినకాలాన నతివ! యెంత చతురతను నింపితీవు పచ్చంద నమ్ము మాదకత్వ మటంచు నే మదిఁ దలంచి తిని- అదియె రూపుఁగొనె నింత తృప్తియగుచు. తే. ఎందు శోక వాత్యావర్ష మెసఁగు నెందుఁ బరమ పీడాతరంగముల్ ప్రభవమొందు, జీవిత మ్మెందు మృత్యువై చెలఁగు, నెందు బుద్బుదఁపు మాయ నాట్యముల్ పొనరఁజేయు- తే. అట్టి విశ్వము నిశ్వాస హసనములను లలిత శాంత్యుజ్జ్వలతలఁ గళ్యాణగరిమ కానుపించె - వర్షా నీప కానన మయి ఎ సృష్టి విభవము సెలఁగె నుజ్జీవనమున. తే. అట్టి పావన మధుధార నర్థిఁ జూచి భగవతీ! యమృతమె లోభపడును గాదె! పుణ్య సౌందర్య శైలమ్ముఁ బోలె నద్ది దానియందు జీవితము స్నాత మగుచుండె. తే. సంధ్య నాకడఁ దారకా సముదయముల యకథిత కథ గ్రహించి తా నరుగుచుండె అపుడు సకల శ్రమావిల వ్యథను నిద్ర సహజముగనె గ్రహింపఁగాఁ జాలి యుండె. 640 75 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. కమ్ర కౌతూహలమ్మును గల్పనమ్ము సుందరము లాచరణములఁ జుట్టికొనియె స్నిగ్ధసుమములు తోఁచె హసించినటుల - అద్ది జీవితమునకు ధన్యక్షణమ్ము. తే. స్మితము మధుర రాకా జ్యోత్స్నగతిఁ జెలంగె సరస నిశ్వాసములు పారిజాత వనమె! పుష్పరస మంథరమ్మయి పొలిచె నడక వంశీ స్వరమును జేరిన పగిది నెగడె తే. నాదు నిశ్వాస మను పవనమ్ము నెక్కి 80 బహుళ దూరాగత మురళీ స్వనము వోలె మొరసితిని - విశ్వ కుహరాన ముగ్ధ నవ్య దివ్యరాగిణి వలె నీవు తేజరిలితి. తే. జీవితపయోధి కడుగునఁ బ్రోవుఁ గొన్న మౌక్తికములు వెల్వడెను సమస్తమపుడు ఆలపింప నీ వట మంగళార్ధ గీతి మంజులమ్మయి యొదవె రోమాంచితమ్ము. తే. నాదు మోహన మధుర మానసము నుండి యమలి నాశా మయూఖాళి నర్థిఁ గొనియె శశికళా మంజుల పరివేషమును గొన్న స్నిగ్ధ లఘుతర జలధర సృష్టి జరిగె. తే. దానిపయి కాంతి సంభరిత వయి నీవు తూలిపడితివి హ్రాదినీమాల పగిది తే. జలజలలఁ గురిసె నపు డా జలధరమ్ము పరగ మానస వనభూమి పచ్చవడియె. "అఖిల మీ విశ్వ మొకయాట యాడుచుండు” మనుచు నవ్వుచు బోధించి తతివ! నాకు "అందరితొ నీవు నేస్తమ్ము నాచరింపు” మనుచును దెలియఁగాఁ జెప్పి తపుడు చేరి. ఆంధ్ర కామాయని 85 641 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/642 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/643 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/644 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/645 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/646 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/647 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/648 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/649 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/650 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/651 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/652 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/653 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/654 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/655 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/656 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/657 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/658 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/659 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/660 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/661 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/662 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/663 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/664 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/665 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/666 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/667 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/668 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/669 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/670 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/671 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/672 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/673 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/674 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/675 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/676 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/677 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/678 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/679 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/680