Jump to content

వాడుకరి చర్చ:Mssvas123

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

మొల్ల రామాయణమును మాకు అందించినందులకు Mssvas123 గార్కి నా కృతజ్ఞతలు. ఈ కృతి లోని అత్యంత గంభీర సుందర పద్యములలో, సీతా స్వయంవర ఘట్టమునందు శ్రీరాములవారు శివధనుస్సునెక్కుపెట్టుటకు ముందు లక్ష్మణులవారి చేత మొల్ల పలికించిన ఈ చంపకమాల పద్యము అత్యంత హృద్యము. ఇందలి కొన్ని కఠినపదములకు అర్థములు నాకు జ్ఞప్తికి తేవలసినదిగా విజ్ఞులకు సవినయ మనవి.

కదలకుమీ ధరాతలమ కాశ్యపి బట్టు ఫణీంద్ర భూవిషా -
స్పదులను బట్టు కూర్మమ రసాతలభోగిఢులీకులీశులన్
వదలక పట్టు ఘృష్టి ధరణీఫణికఛ్ఛపపోత్రివర్గమున్
బొదువుచు బట్టుడీ కరులు భూవరుడీశునిచాపమెక్కిడున్ | |

సందేహములు : కాశ్యపి అనగా భూమియా? 'భూవిషాస్పదులను పట్టు కూర్మమ' అన్న పదములనుజూడ కాశ్యపి = భూమి అని తోయుచున్నది (ఫణీంద్ర = విషాస్పదుడు కావున). భూదేవి కశ్యప ప్రజాపతి యొక్క కుమార్తె అని పురాణప్రమాణము ఏమైనా ఉన్నదా? (కశ్యపి అనగా గరుక్మంతుడను అర్థము ఉన్నప్పటికిన్నీ ఈ పద్యమునందు దానికి అన్వయించుట కష్టము కనుక ...)

రసాతలము అనగా భూమి అని, భోగియంటే సర్పము అని చెప్పవచ్చు. మరి ఢులి ఏవ్వరు? సందర్భానుసారము తాబేలును ఉద్దేశించి మొల్ల ఆ పదము వాడినట్లు తెలియుచున్నది. తాబేలుకు ఆ పేరు యే కారణము వలన వచ్చినది? కూర్మావతారమునకు ఈ పదము యొక్క వ్యుత్పత్తికి సంబంధము ఏమైనా ఉన్నదా?

అలాగే, ఘృష్టి = పోత్రి అని కనబడుతున్నది. కానీ వాని అర్థములేమిటి ? వ్యుత్పత్తులేమిటి ?

Mssvas123 తో చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి