వాడుకరి:Shivakrishna1998

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నా పేరు శివ క్రిష్ణ. నేను ఆంధ్ర లొయోల కాలశాలలో డిగ్ర్గీ రెండవ సంవత్సరం ప్రత్యేక తెలుగు చదువుతున్నాను. నాకు వికీపీడియా అంటే చాలా ఆసక్తి.

యువత పై మాస్ మీడియా ప్రభావం

డా, ఐ.మంజుల

దేశ భవిష్యత్తులొ యువత పాత్ర ఎంతొ కీలకం.మనదేశంలొ యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు.కనుక మన దేశాన్ని"యువ భారతదేశం" అంటారు. అందువలన యువతపై మాస్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. నేడు మనదేశంలొ మాస్ మీడియా ఉపయెగించే వారి సంఖ్య అధికంగా ఉంది. యువత మాస్ మీడియాను ఎక్కువగా ఉపయెగించడమే కాకుండా దానికి బానిసలుగా మారుతున్నారు. దీనివలన ఉపయెగాలు మరియు అనర్ధాలు కూడా ఉన్నాయి.

మాస్ మీడియాను యువత ఉపయెగాని కన్నా నిరుపయోగానికే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. వాటి వల్ల యువత వారి సమయాన్ని వృదా చేస్తున్నారు. గంటలు తరబడి దీనిని ఉపయోగించడం చాలా ప్రమాదకరం ఫేస్ బుక్, ట్విట్టర్,వాట్సప్ వంటి వాటికి సమయాన్ని ఎక్కువ కేటాయిస్తున్నారు.

టెలివిజన్, న్యూస్ పేపర్లు చూడటం మానేసి ఫేస్ బుక్,వాట్సప్ అంటూ ఫొనులతొ జీవిస్తున్నారు. వాటి వల్ల సమయం వృదా కావటమే కాకుండా కుటుంబాలకు,కుటుంబ బాంధవ్యాలకు దూరమైపొతున్నారు. అదే విధంగా సినిమాల ప్రభావం కూడా అదే విధంగా ఉంది.

ఫేస్ బుక్ మరియు ఇతర మీడియా పై యువత ప్రభావం:

  • వీటి ద్వారా సమయాన్ని వృదా చేస్తున్నారు, కానుక యువత ఎన్నొ నష్టాలు అనుభవిస్తున్నారు.
  • వీటి వల్ల స్నేహభావాలు, మనిషికి, మనిషికి మధ్య బంధాలు దూరమైపొతుంది.
  • వీటిని ఉపయోగించటం వల్ల ఎన్నొ దారుణాలు జరుగుతున్నాయి, ఎన్నొ మోసపూరితమైన సంబంధాలు ఏర్పడుతున్నాయి.
  • సినిమాలు,సిరియల్ల ప్రభావం వలన యువత బాగా చెడిపొతుంది.

మాస్ మీడియా ద్వారా వచ్చె అనార్ధాలు:

  • యూట్యూబ్ ద్వారా అనేక చెడు వ్యసనాలకు లొనవుతున్నారు. ప్రస్తుత నెట్ వర్క్ విస్తరణ ద్వారా నీలిచిత్రాలు చూసే వారి సంఖ్య ఎక్కువైనది.
  • ఫేస్ బుక్ ద్వారా ఎంతొ మంది యువత తమతమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.తెలియని వ్యక్తుల పరిచయాల ద్వారా అనార్ధాలకు లొనౌతున్నారు.
  • వాట్సప్ లొ మనం పెట్టుకునే ఫొటో(profile picture) మన ఫొన్ నంబర్ ఉన్న ప్రతీ ఒక్కరికి కనబడుతుంది. వాట్సప్ గ్రుపులు సృష్టించేవారు రానున్న రొజులలొ ఎన్నొ ప్రమాదాలు ఎదుర్కొనే ప్రమాదం అధికంగా ఉంది.

నిర్మూలన;-

ఈ మాస్ మీడియాను ఉపయోగకరమైన విధంగా, అవసరం కోసం ఉపయోగించాలి. చెడుగా, నష్టాలు కలిగే విధంగ ఉపయోగించకూడదు అనవనర విషయాలను తొలిగించి, అవసరం కోసం ఉపయోగించేలా దీనిని అమలు చేయాలు వీటి వలన సమాజంలో జరిగే మోసాలు, దారూణాలు, ఇతరాత్ర సంబందాలు తొలిగి సమాజంలో ఎంతో మంది జీవితాలు మంచి మార్గంలో ప్రయాణించే అవకాసం ఉంది.

ముగింపు;-

ఇప్పటి వరకూ మనం మీడియా అంటే ఏమిటో తెలుసుకున్నాము వాటివల్ల ఉపయోగాలు, నష్టాలు, నిర్మూలన అనేక విషయాల గురించి తెలుసుకున్నాం. కనుక ఇప్పటికైనా యువత తమ తప్పులను తెలుసుకొని వారి జీవితాన్ని సరైన దారిలో పెట్టుకుంటారని కోరుకుందాం వీలైనంత వరకు ఫేస్ బుక్ వాట్స్ ప్ లకు దూరంగా ఉండి మంచి జీవితాన్ని సాగిద్దాం. దినపత్రికలు, వార్తలు చూడటం వంటి వల్ల మనం నేర్చుకోవచ్చు. మీడియాలను తప్పని సరిగా మంచికి మాత్రమే ఉపయోగించి, చెడుకి దూరం చేద్దాం. ఎంతో మంది మాస్ మీడియా పై ఎన్నో సూక్తులు. ఇచ్చారు వాటిలో అద్బుతమైన సూక్తి గై బర్గస్(guy burgess)చే వచ్చిన సూక్తి ఇదే.

the mass media is the days of newspaper
                                 and television its hard to be able
                                   to find a story thats about
                                   just what youre intrested in
                                   at the time youre intrested
                                     in it................

Dr,I.మంజుల
తెలుగు అద్యాపకులు
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్ద్ద మహిళా కళాశాల
ph.no.9440328638
mail:gudimellamanjuia@gmail.com


కుటుంబ జీవితంలో యువత బాధ్యత

భారతీయ వేదాంతము పురాణాలు తంత్రమూ తత్త్వశాస్త్రమూ వేద మూలములుగా భావింపబడుతాయి. వీని అన్నింటికీ మూల భూతమైనది వేదం.ఆ తత్త్వాన్ని అర్ధం చేసుకుంటేనే భారతీయ సంప్రదాయం తెలుస్తుంది. దీని వలన మన సారభూతంమైన జీవనంను ఎలా ఎలా మలచులకోవాలో తెలుస్తుంది. అసంఖ్యాకమైన ఆలోచనలతో నిత్యం పోరాటం చేసే మనం ఇలా ఎందుకు చేయవలసి వచ్చిందో వీటి అధ్యయనం వల్ల తెలుస్తుంది. మన జీవన నైపుణ్యాలకు మెదటి బీజం పడేది మన కుటుంబం నుంచే అభివృద్ధికి బాటలు వేసేది మన తల్లిదండ్రులే. ప్రతి వాడు కరచరణాద్యవయవాలతో ఒక ఆకారాన్ని ధరించి ఈలోకంలో ప్రవేశించడానికి తల్లి దండ్రులే ముఖ్యకారణం. నవమాసాలు మోపి కనిపెంచిన తల్లి బిడ్డకు మొదటి గురువు. మొదట ఉత్పత్తికి హేతువై పుట్టిన తరువాత పెంచి పెద్దజేసి విద్యాబుద్ధులను నేర్పి ఈ సమాజంలో మంచి పౌరడిగా తీర్చి దిద్దిన తండ్రి రెండో గురువు. అందుకే ఈ ఇద్దరు ప్రతి వానికి ప్రత్యక్ష దైవాలని మన వాజ్మయం చెబుతున్నది. మాతృదేవో భవ! పితృదేవో భవ అని ఉపదేశిస్తుంది.

ఎంత నేర్చుకున్నా ఎన్ని దేశాలు తిరిగినా ఉన్న ఊరును కన్న తల్లిని పెంచిన కుటుంబాన్ని మరిచిన వారిని కృతఘ్నుడు అని అంటారు. కాబట్టి బతికినంత కాలం మన శక్తికి మించి మన బాద్యతలను నిర్వర్తించాలి. మంచి స్ధానం వచ్చాక మన యొక్క విధి చక్కగా నిర్వర్తిస్తు మన గొప్పతనాన్ని ఉర్వికి చాటాలి.మన మీద ఉన్న అసంఖ్యాక బాద్యతలను పట్టించుకొకుండా అటు కుటుంబానికి ఇటు సమాజానికి ఎందుకు పని రాని వారి లో తయారవ్వడం ఎంత వరకు సమంజసం. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. మన స్ధితి గతులను సమస్యలను ఎదుర్కోకుండ జీవితాన్ని నిష్క్రవింపచేసుకోవడం తడని పని. సంద్రంలో అలలులా సమస్యలు వస్తాయి. కాని తొనకణి సముద్రంలో ధైర్యంగా ఉండాలి. అప్పుడే మనం అన్నింటిని సాధించగలం ఈ విషయాల మీద అవగాహ ఉన్నవారికి మనం చెప్పిదండగ కాని లోని వారు అందుకోని ఆలోచిస్తారని ఆశద్ధాం. దేశ భవిష్యత్తు మరుస్తారని యోచిద్దాం.

గణేశ్