వాడుకరి:Sagarraju.b

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నా పేరు బంధనాదం సాగర్ రాజు, నేను ఆంధ్ర లొయోల కళాశాలలో బి.ఏ.డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. నాకు కందుకూరి విరేశలింగం గారి రచనలు అంటే ఇష్టం.

పేజీ 8 గౌరవంలేదని,అటువంటిపరిస్థితితన కొడుక్కురాకూడదని అతడినియూనివర్సిటీకి పంపితే అక్కడి అగ్రవర్ణాలవారు అతడినిగొడవలలోఇరికించిఅరెస్టుచేయించినవిధానాన్నివర్ణించాడు.ఎండ్లూరి సుధాకర్ 'మల్లెమొగ్గలగొడుగుమాదినకతలూ(1999)లో పురాణాలనుండినేటివరకు చిత్రీకరించారు.మాదిగల వృత్తిలోను గొప్పతనాన్ని,సంస్క్రతినివర్ణిస్తూ చెప్పులు మాదిగలకు దేవతలని ప్రకటిస్తారురచయిత.చెప్పులుకుట్టినవాబులను మెప్పించిసన్మానాలు పొందారనని చర్మకారులవృత్తిలోనిప్రతిభాపాటవాలనుకళ్ళకుకట్టినట్టువర్ణించారు.మాదిగలసంస్క్రతినిఅర్ధంచేసుకోవటానికిఆత్మగౌరవంగమనించటానికి ఈకధలుసహాయపడుతాయి.ఈకధలుతెలుగుసాహిత్యంలో ఆత్మకధాప్రక్రియనుప్రవేశపెట్టాయనిచెప్పవచ్చు.దళితనాటకాలలో కొలుకులూరీనాక్ రాసిన 'నిర్భయం'నాటికకళాశాలలోచదువుకునేమాదిగవిధ్యార్ధికిసహవిద్యార్ధినుండి ఎదురైనకులపరమైన అవమానాలనుచిత్రీకరించిననాటకం.బ్రాహ్మణమాదిగవర్ణాలమధ్యజరిగిన ప్రేమ-పెళ్ళి,కులకట్టుబాట్లు వాటివల్లవచ్చేసంఘర్షణలు,వాటినిఎలా అధిగమించాలోతెలియచెప్పే 'హరిజనోద్ధరణానాటకంపార్ధసారధిరచించారు.'నీలిదీపాలు ' లో దళితస్త్రీనిబలాత్కరించబోయిన అగ్రవర్ణభూస్వామికొడుకుపైతిరగబడినందుకు ఆమెను,ఆ జాతివాళ్ళందరిపై అగ్రవర్ణభూస్వాములు దారుణకృత్యాలుచేయటాన్నివర్ణిస్తూకె.చిరంజీవి సాంఘికనాటకంగా మలచారు.తరతరాలుగా అక్షరాలు దళితులకు ఎలాదూరంగాఉంచబడ్డాయో 'నిషిద్ధాక్షరి ' లో పాటుబండ్ల పేజీ9

ఆనందరావువివరించారు.ఇలాఅస్పృశ్యత,ప్రేమ,కులాంతరవివాహాలు,మాల-మాదిగ అనైక్యతవంటి అనేకవిషయాలను నాటకాలలో రచయితలుచిత్రీకరించారు.దళిత నవలలో-దళితులసమస్యను సాముభూతితోవర్ణించిన నవల1910 లో తల్లాప్రగడసత్యనారాయణ 'హేలావతి ' దళిత తొలినవల అనిచెప్పవచ్చు.అంతకుముందు కందుకూరి రచించిన 'రాజశేఖరచరిత్ర '(1878) లో అస్పృశ్యతనుగురించినరేఖామాత్రాపరిచయంకనిపిస్తుంది.ఉన్నవరచించిన 'మాలపల్లి ' (1921) రంగనాయికమ్మ బలిపీఠం(1962) వేంకటపార్వతీశంకవుల మాతృమందిరం(1918) వంటినవలలు ఎన్నోతర్వాతికాలంలోదళిత సమస్యలపైవచ్చాయి.వేమూరి ఎల్లయ్యరచించిన 'కక్క '(2000), నవలలో తెలంగాణప్రాంతంలో అగ్రవర్ణభూస్వాములుమాదిగలనుపెట్టేకష్టాలను గురించివివరిస్తూవారిభాష,సంస్కృతి,ఆచారవ్యవహారాలనుచిత్రీకరించారు.(1998)చిలుకూరిదేవపుత్రపంచమం ' నవలసామిజికచైతన్యంలేని ఉన్నత ఉద్యోగాలు, రిజర్వేషన్ తో వచ్చిన రాజకీయ పదవులు మాదిగలను బాగు చేయ లేవని నిరూపిస్తుంది. వీరే కాక, సదానంద శారద, సన్నప రెడ్డివెంకట రెడ్డి, ఓల్గా, సి నాసరయ్య, బోయ జంగయ్య వంటి యెందరో దళితుల స్థితి గతులపై నవలలు రాశారు. దళిత వచన కవిత్వం గేయాలు రాసి పాడిన వాళ్ళే వచన కవిత్వాన్ని కూడా రాశారు. వర్గ స్పృహతో ప్రారంభమైన వచన కవితలు తరువాత కాలం లో ప్రధానం గా కుల సమస్యల పైనే దృష్టికేంద్రీకరించాయి.కత్తిపద్మారావునల్లకలువ(1996)ఎండ్లూరిసుధాకర్ వర్గీకరణీయం(2005) దార్లవెంకటేశ్వరరావుదళితతాత్వికుడు (2004)నాగప్పనారిసుందర్రాజుచండాలచాటింపు వంటిఎన్నో దళితవచనకవితలు వస్తు,శిల్పాలలో వైవిధ్యాన్నిప్రదర్శించాయి.ఇలా దళిత సాహిత్యలో సాహిత్యం విభిన్న ప్రక్రియలలో తన రూపాలను ప్రదర్శిస్తూ దళితుల గొంతును బలంగా

సమీక్ష

ఏడుతరాలు

పేజి 1అలెక్స్ హేలీ అమెరికా వాస్తవ్యుడు, నల్లజాతికి చెందినవాడు. ఆఫ్రికా నుండి బానిసలాగా అమెరికా వచ్చిన తన పూర్వీకుల కధను పరిశోధించి, " విజేతలే చరిత్ర విరచించే ఆనవాయితీని బద్దలుకొట్టడానికి" రాసిన పుస్తకం ఇది. ఈ కధ యాదృఛ్ఛికంగా తెల్లవాళ్ళ చేజిక్కి బానిసగా మారిన గాంబియా వాస్తవ్యుడు కుంటాకింటేతో మొదలయి, అలెక్స్ హేలీ వరకు నడుస్తుంది.

అన్యాయానికి , పీడనకు గురయినవాళ్ళ దృక్పధంలో అనివార్యంగా హేతువాదం , వాస్తవవాదం , భౌతికవాదం ఎంతోకొంత చోటు చేసుకుంటాయి.భావావాదం, ఆధ్యాత్మిక పీడకులకు , ఇటూ అటూ చెందక తప్పించుకు తిరిగే మధ్య రకపు ధన్యులకూ మాత్రమే సహజం. ఈ కారణం చేత నల్లవాడయిన హేలీ తన జాతికి జరిగిన అన్యాయాన్ని శ్వేతజాతి మానసిక రుగ్మతగానో, అస్తిత్వవాదం ఫక్కీలో మానవాళికి సాధారణమయిన సందిగ్ధతగానో, ( human predicament ) కాకుండా చారిత్రకంగా చూస్తాడు. అయితే మౌలికమయిన శ్రమదోపిడీ జాతిపీడనగా రూపాంతరం చెందినప్పుడు సహజంగా ఉత్పన్నమయ్యే, తప్పుడు చైతన్యం పుభావం చదిలించుకోనంత వరకు ఈ వాస్తవవాద దృక్పధం శాస్త్రీయత సంతరించుకోదు. హేలీతో అదే చిక్కు . ఆఫ్రికన్ల గురించి తెల్లవాళ్ళు చేసిన దుష్ర్పచారాన్ని వ్యతిరేకించే తపనతో తన ఆఫ్రికా పూర్వీకుల సమాజాన్ని , సాంకేతికంగా ఎంత వెనుకబడ్డదయినా సామాజిక మానవ సంబంధాల వరకు చాలా ఉన్నతమయినదని చూపించే ప్రయత్నంస్పష్టంగా కనిపిస్తుంది. మనకు మధ్యయుగపు ఆఫ్రికా సమాజం గురించి తెలిసిన విషయాల దృష్ట్యాచూస్తే ఇది పూర్తిగా అతిశయోక్తి గూడ కాదు. ఆఫ్రికాలో భూస్వామ్య విధానం అంతగా విస్తరించలేదు. దోపిడీవర్గం పల్లె ప్రాంతాల భూస్వామ్యవర్గంగా కాకుండ, రాజా స్థానాన్ని ఆశ్రయించి శిస్తుల ద్వారా అదనపు ఉత్పత్తిని చేజిక్కించుకొనే వర్గంగా వుండేది. పనిముట్లలో స్వంత ఆస్తి ఉన్నా, భూమి మాత్రం అధికంగా గ్రామ సభల పేజి 2ఆధీనంలో వుండేది. ఆ సభలు రైతులకు ' పట్టా' లిచ్చేవి. గ్రామీణ ప్రాంతాలలో ఈ సభాధికారులు, మతాధికారులు, తెగ పెద్దలు, ఇతర పెత్తందార్లు పాలక వర్గ ప్రతినిధులుగా వుండేవారు. ( ఇలాగంటే భూస్వామ్యం , బానిస-అర్ధబానిస సంబంధాలు, పెత్తందార్లకు వెట్టిచాకిరి చేసే పద్ధతి లేనేలేవని కాదు.ఇక్కడ ప్రధానమయిన దోపిడీ సంబంధాల గురించి చెప్పుకుంటున్నాం.) ఈ ఆర్ధిక విధానాన్ని ఆఫ్రికాకు చెందిన ప్రఖ్యాత మార్క్సిస్టు శాస్తవేత్త సమీర్ అమీన్ 'శిస్తువారీ వుత్పత్తి విధానం' ( tribute - paying mode of production) అంటాడు.

ఇటువంటి సమాజంలో హేలీ చెప్పేటంతటి సామూహికత, సమానత లేకపోవచ్చుగానీ, శ్రమజీవికి యూరప్ భూస్వామ్య సమాజంలోని ప్రత్యక్ష అర్దబానిస సంబంధాలలోను, మన దేశ వర్ణ వ్యవస్థలోని పరోక్ష అర్ధ బానిసత్వంలోను లేనటువంటి స్వతంత్రత, గౌరవం లభిస్తాయి. అటువంటి సామాజిక సంబంధాల మధ్య పెరిగినవాడను కుంటా అంటే. దానికి తగ్గటే అతడు స్వతంత్రుడు , అభిమాని , దాస్యాన్ని అసహ్యించుకునేవాడు.

నల్లబానిసల కధ అర్ధం చేసుకోవాలంటే ఆ బానిస విధానానికి ప్రోద్బలం యేమిటో చూడాలి. యూరప్ నుండి వలసవచ్చి విశాలమయిన అమెరికాఖండపు మైదానాలనుండి అక్కడి వాస్తవ్యులయిన ' ఎర్ర ఇండియన్ల 'ను హతమార్చి , తరినివేసిన తరువాత తెల్లవాళ్లకు తామాక్రమించుకున్న భూములను సాగుచేయడానికి , ముఖ్యంగా అధిక శ్రమశక్తి కావలసిన పత్తిపంట పండించడానికి అదనంగా శ్రామికుల అవసరం వచ్చింది. ఆ అవసరం ఆఫ్రికన్ల దిగుమతి తీర్చింది. దిగుమతి అయిన ఆఫ్రికన్లు స్వతంత్ర శ్రామికులుగాకాక బానిసలుగారావడం చవకగా పత్తి పండించడానికి, వస్త్ర ఉత్పత్తి సాంకేతికంగా అభివృద్ధి చెందిన తరువాత బ్రిటన్ కు చేసే పత్తి ఎగుమతి మీద గుత్తాధిపత్యం సంపాదించడానికి తోడ్పడింది.

ఈ చారిత్రక శక్తులు అనుకుంటే బానిసగా మార్చి గాంబియానుండి అమెరికా తీసుకుపోతాయి. అమానుషమయిన ఈ సరఫరాకు వ్యతిరేకంగా ఓడలోనే కుంటా, అతని తోటిబానిసలు తిరగబడడానికి ప్రయత్నం చేస్తారు. కాని సంకెళ్లను, తెల్లవాళ్ల తుపాకీలను ఓడించలేకపోతారు.