Jump to content

వాడుకరి:Roy.d

వికీసోర్స్ నుండి

నా పేరు దోమతోటి . రోయ్ కుమార్ . నేను ఆంధ్ర లయోల కళాశాలలో డిగ్రీ ద్వితీయ స్ంవత్సరము చదువుతున్నాను. నేను ఇప్పటికి ఈ వికి పీడియా/ వికీ సోర్స్ లో చాలా పేజీలను టైపు చెయటం జరిగింది . ఇది నాకు ఒక గొప్ప అనుభూతి మరియు అనుభవాన్ని ఇస్తుంది. నేను వుండేది గన్నవరం లోని బుద్దవరం అనే గ్రామం లో నివశిస్తున్నాను. నా కళాశాల విజయవాడ నందు కలదు మా కళాశాల స్వయంప్రతిపర్తి కలిగినది . సంస్కృతి

page-6 నిరసన, యజమాని అంటే ద్వేషం, స్వేచ్ఛాకాంక్ష వుంటాయి. అయితే అవి ఆ బానిస స్ంబంధాల వాస్తవ స్వరూపం నుండి పుట్టినవే గాని మాలీ సాంరాజ్యంలోని తన పూర్వీకుల ఘనత తాలూకు జ్ఞాపకాలనుండి కాదు. జార్జిలోనూ ఈ నిరసన, ద్వేషం, అకాంక్ష వున్నాయి.

అతితే ఇక్కడ జార్జీకీ అతని తాత అయిన కుంటాకు చాలా తేడా వుంది. ఇక్కడే హేలీ తన బూర్జువ వర్గదృక్పధాన్ని, సంస్కరణవాదతత్వాన్ని స్పష్టంగా చూపిస్తాడు. జార్జికి వర్గదృక్పధం లేక పోవడం అర్ధం చేసుకోవచ్చు- కాని అతనికి కనీసం జాతి దృక్పధం కూద లేదు. తన యజమానిని మెప్పించి కోళ్ళ పందేలలో నాలుగు రాళ్లు కూదబెట్టి తన స్వాతంత్ర్వం, తన భార్యా బిడ్డల స్వాతంత్ర్యం కొనుక్కుందామన్న ధ్యాసే తప్ప 'కోళ్ళజార్జి ' కి వేరే ఆలోచన లేదు. ఇంతకంటె మెరుగైన చైతన్యం అతనికి అలవడ్డానికి అవకాశం లేదనలేం. నిజానికి అమెరికా బానిస సమజంలో మొదటి నుండి గూడ బానిసల తిరుగుబాట్లు జరుగుతూనే వచ్చాయి. అందులో ఒక తిరుగుబాటుకు నాయకుడయిన ఫ్రెడరిక్ డగ్లస్ గురించిన వార్త జార్జి కొడుకు టాం స్వయంగా బానిదసవాడకు తెస్తాడు. అయితే తెల్లవాళ్ళతో "మీ ప్రార్ధనలు, మీ బైబిల్ ప్రవచనాలు, మీ కృతజ్ఞతార్పణం, మీ మతవిన్యసలు-అమ తా మోసం, దగా, నటన, కుళ్ళు" అని చెప్పిన డగ్లస్ ప్రభావం జార్జిమీద గాని, నాలుగవతరం వాడయిన టాం తన కుమ్మరి పనిద్వారా డబు కూడబెట్టి తమ కుటుంబం స్వేచ్ఛ కొనుక్కుందామని మాత్రమే పధకం వేసుకుంటారు.

కాని జార్జి యింతగా ప్రయాసపడవలసిన అవసరం లేదు. ఏ చారిత్రక శక్తులయితే కుంటాను బానిసగా మార్చాయో, ఆ శక్తులే యిప్పుడు అతని మనవడిని విముక్తుడ్ని చేయడానికి ఉద్యుక్తమయ్యాయి. గత శతాబ్దం మధ్యభాగానికి బ్రిటన్ లో పారిశ్రామిక విప్లవం ఒక స్ద్గాయికి చేరుకుంది. అమెరికాలోను అది బలం పుంజుకోనుంది. కోళ్ళపందేల కోసం ఊరూరూ తిరుగుతూ ప్రపంచపు వార్తలు బానిసవడకు మోసుకొచ్చే జార్జి ఈ విషయాన్ని గమనిస్తాడు. చార్ల్ స్టన్ పట్టణం నుండి తిరిగి వచ్చి, అక్కడ నల్లవాళ్లు "కాలువలు తవ్వుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, కంకర పోస్తున్నారు, రైలుమార్గాలు వేసున్నారు, తమ కండలు కరిగించి దేశాన్ని గొప్పగా

page-7 చేస్తున్నారు" అంటాడు. ఈ పరిణామానికి స్వతంత్రులయిన శ్రామికులు అధికంగా కావాలి. భూస్వాముల బానిసలయిన నల్లవాళ్ల శ్రమశక్తిని విముక్తి చేయాలి. అయితే పెట్టుబడుదార్లు అధికంగా ఉత్తరరాష్ట్రాలవారు కావడం చేత, యిది ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య అంతర్యుద్ధంగా పరిణమించింది. అయితే వర్గసమాజలు తమ అవసరాల్ని గూడ తిన్నగా గ్రహించవు, డొంకతిరుగుడుగానే గుర్తిస్తాయి. కాబట్టి మార్క్స్ చెప్పినట్లు ఈ అమెరికా అంతర్యుద్ధం "స్వతంత్ర శ్రామిక విధానానికి, బానిస విధానానికి మధ్య తగువే" అయినా ఇది వాస్తవంలో ముందుకొచ్చింది వేరేరూపంలో దక్షిణాదిరాష్ట్రాల భూస్వాములు తాము ఉత్తరాది పెట్టుబడిదార్ల మిల్లులకోసం, విదేశీ మారకం కోసం పత్తి పండించిపెట్టే వలస సంబంధాన్ని నిరసించి, 'మితిమీరిపోయిన ' , రాజ్యాధికారంలో భాగంకావాలని ముందుకు రావడాన్ని కోపగించుకొని , వారికి 'గుణపాఠం' నేర్పించడం కోసం ఉత్తరాది పెట్టుబడుదార్లు తమ ప్రతినిధి అయిన అబ్రహాం లింకన్ ద్వారా బానిసల్ని విముక్తి చేసారు. (ఇలాగనడం లింకన్ మీద బురదజల్లడం కాదు చరిత్రలో ఔనత్యమయినా సంకుచితత్వమయినా ఏదో ఒక చారిత్రకశక్తికి ప్రాతినిధ్యం వహించేది మాత్రమేనని చెప్పడం .)

అయితే ఈ విద్గంగా విముక్తులయిన బానిసలు వెనువెంటనే పారిశ్రామిక ఆర్ధికరంగంలోకి ప్రవేశించలేదు. నిజానికి ఆ మార్పు ఈ శతాబ్దం మొదటి భాగం వరకు గణనీయంగా జరగలేదు. అంతవరకు ఓకప్పటి బానిసలు తమ ఒకప్పటి యజమాన్ల భూముల్లోనే కూలీలుగా, కౌలురైతులుగా, ఆలేర్లుగా మారారు. జార్జి కుటుంబానికీ యిదే జరుగుతుంది. కొంతడబ్బు కూడబెట్టుకున్నాడు కాబట్టి భూమికొన్నుకుంటాడు. స్వతంత్రుడయిన రైతుగా మారతాడు. కొడుకు టాం తన కమ్మరివృత్తిని కొనసాగిస్తాడు.

క్రమంగా, ఈ శతాబ్దం మొదటిభాగం నుండి నల్లవాళ్లు పట్టణ ప్రాంత పారిశ్రామిక రంగంలోకి కార్మికులుగాను, "వైట్కాలర్ " శ్రామికులుగాను ప్రవేశించారు. 1910 లో నల్లజాతి జనాభాలో 75 శాతం గ్రామీణులుకాగా, 1970