వాడుకరి:Rathnamsjcc

వికీసోర్స్ నుండి

మానవ దేహం’ ఏమీలేదు

                 వేమన యోగి  అచల పరిపూర్ణ రాజయోగము 

మానవ శరీరానికి ఇంద్రియాలు అన్నీ ఉండవలసినదే. అప్పుడే శరీరానికి చైతన్యం కలుగుతుంది. లేకపోతే జఢత్వంతో నశిస్తుంది. అయితే ఆ ఇంద్రియాల్ని ప్రేరేపించే మనస్సుని స్వాధీనంలో ఉంచుకోవడం ద్వారానే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈ మనసు అనే కనిపించని తత్వాన్ని బుద్ధి ప్రేరేపిస్తూవుంటుంది. ఆ బుద్ధి కర్మననుసరించి నడుస్తూవుంటుంది. అందుకే ‘బుద్ధీ కర్మానుసారిణీ’ అని పెద్దల ఉవాచ. దేహానికి శిరస్సు, ఇంద్రియాల్లో కళ్ళు, రసాల్లో లవణం, నదులకి నీరు ముఖ్యమైనట్టే మానవ జీవితానికి కొన్ని ఆచారవ్యవహారాలు, సంప్రదాయం, సాధన వంటి కొన్ని గుణాలు ప్రధానంగా ఉంటాయి. వాటిని అనుసరించే కర్మలు ముడిపడివుంటాయి మనకున్న ఇంద్రియాల్ని సక్రమంగా వినియోగించుకుంటూ, సత్కర్మల్ని ఆచరించడమే మానవ ధర్మం మరి దేహబ్రాంతిని విడిచిపెట్టమని పురాణాలు చెప్తున్నాయి. అంటే దేహాన్ని అలక్ష్యం చేయమని కాదు. దేహావసరాలు తప్పకుండా తీర్చవలసినదే. దేహాన్ని అనునిత్యం కాపాడుకుంటూ ఉండవలసినదే. దేహంలో జీవాత్మ ఉన్నంతకాలం దానిని పరిశుభ్రంగా ఉంచుకుంటేనే అది అందులో మనగలుగుతుంది. దేహం అపవిత్రమైనా, దానిని నిర్లక్ష్యం చేసినా దేహం అనారోగ్యానికి గురయ్యి, జీఆత్మ అందులో మనలేక కాలవ్యవధి తీరకుండానే తప్పుకుంటుంది. అందుకే దేహం దేవాలయంగా మార్చగలగాలి. అందుకు ఇంద్రియాల సహకారాన్ని తీసుకోవాలి. ఇంద్రియాలు సహకరించాలంటే మనస్సుని అదుపులో ఉంచుకోవాలి. బుద్దిని లాక్కుపోయే కోరికలనే గుర్రాల పగ్గాలు ఒడిసి పట్టుకుంటేనే మనసు అదుపులోకి వస్తుంది. ఇదంతా అంచెలంచెలుగా చేయవలసిన సాధన. ఈ సాధన సమకూడేది కేవలం ధ్యానం అనే ప్రక్రియ వల్లే సాధ్యం. దానినే నేడు మనం మెడిటేషన్‌ అని పిలుస్తున్నాం.

దీనిని బట్టి మెడిటేషన్లో మనం చేయవలసినదేమిటీ..? దాని ద్వారా మనంపొందవలసినదేమీటీ..? అనేది కొంతవరకూ తెలిసినట్టే. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేసే మెడిటేషన్‌ అనే ధ్యానం నిజమైన ధ్యానం కాదు. ధ్యాన యోగులు అరుదుగా ఉంటారు. వారిని అన్వేషించి వారి వద్ద ఈ క్రియని అభ్యసించవలసి వస్తుంది. అలా అసలైన ధ్యాన సముపార్జన కోసమే, శంకర భగవత్పాదులు, రామానుజులు, యోగివేమన వంటి మహనీయులు గురువుని వెతుక్కుంటూ దేశదేశాలూ తిరిగారు. గురుసుశ్రూషలు చేసారు. సంకల్పసిద్ధిని పొందారు. కనుక మానవ శరీరం, దానితో పాటు సకలేంద్రియాలు, కరణాలు అన్నీ జీవాత్మ ఉన్నంతకాలం ఉండవలసినదే. దేనినీ భక్తి పేరుతో పేరుతో విడిచిపెట్టకూడదు. అలాచేస్తే అది మూఢభక్తి అవు తుంది. శరీర ధర్మానికి అవరోధం కలిగించినా భగవంతుడు మెచ్చడు. అయితే ఈ శరీరం మాత్రం శాశ్వతం అనుకోవడమే పొరపాటు. ఇతర వ్యాపకాలకోసం దీనికి లేనిపోని హంగులు కూర్చడం దేహభ్రాంతి అవుతుంది. దేహం మీద వ్యామోహం లేకుండా ఈ దేహం అవసరాన్ని గుర్తెరిగిన వాళ్ళు దేహాన్ని దేవాలయంగా మలచుకోగలుగుతారు


ఆధ్యాత్మ సాధన మానవ జీవితాలకు సుఖశాంతులను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మ భావన దైవభావనయే. ఈ భావన స్థిరపడాలంటే సాధన ముఖ్యం. ఈ సాధన ప్రారంభానికి పలు విషయాలను సాధకులు తెలుసుకుని మసలాలి. లేకపోతే చెడు మార్గంలో పడిపోతారు. ఈ సాధనను పెద్దలైన మహనీయుల వలన అనుభవజ్ఞులైన గురువుల వలన ముఖ్యపద్ధతులను తెలుసుకోవాలి.

ఆధ్యాత్మిక సాధనకు ఇంద్రియ నిగ్రహం ఎంతో ఆవశ్యకమైనది. ఈ సూత్రాన్ని గమనించి మసలుకోవాలి. దీనిలోతుపాతులను తెలిసికొనలేకపోతే ఇంద్రియాలను అణచి లోపలి మనస్సుతో లోక వ్యవహారాలను, విషయభోగాలను చేయుచుండుట జరుగుతుంది. ఈ విషయాన్నే భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునునికి కర్మయోగంలో ఆరవశ్లోకంలో ఇలా తెలిపారు.

అనగా ఎవడు కర్మేంద్రియాలు-జ్ఞానేంద్రియాలను అణచి మనస్సు చేత ఇంద్రియాల శబ్దాది విషయాలను ఆలోచిస్తూ ఉంటాడో అట్టివాడు మూఢచిత్తుడుగా ఉంటాడు. కపటమైన ఆచరణ గలవాడనీ తెలిపారు. సాధకులు ఈ డంబాలకు తావివ్వరాదు. ఇలాంటి డంబాలు చేసే వారిని మిథ్యాచారులంటారు. ఉత్తమ సంయమము గలవాడు మిథ్యాచారిగా వేరడు, ధ్యానమందును మనస్సును దైవముపై నిలుపక కొందరు సాధకులు పలుదారులలో పయనిస్తూ ఉంటారు. పరమార్థ-పరమాత్మ తత్త్వాన్ని మరచిపోతుంటారు. ముముక్షువులైన వారు తమ మనస్సులను విషయములపై పరుగెత్తిననూ, దాని నుండి మరల్చి ఆత్మయందు అనగా దైవము నందు నిల్పుటకు సాధన చేస్తారు. మిథ్యాచారం గలవారు అలా చేయలేరు. సాధన ఆచరించే వారిది సదుద్దేశ్యం. మిథ్యాచారులది దురుద్దేశ్యం. కృత్రిమ ధ్యానం. లోకంలో యోగులవలె నటించే అజ్ఞానులుండవచ్చును. వారి మనస్సులు వాసనామయమై అనగా సాంసారిక విషయాలలో ప్రవర్తించుచుండుటచే ముల్లోకాలలో తిరుగుతూ ఉంటుంది. వారికి ప్రపంచ సుఖముగానీ, దైవ సుఖముగానీ ఉండవు. రెండింటికీ చెడిన వారగుదురు. పరమ్మాత ఇట్టి వారిని విమూఢులన్నారు. ఇంద్రియాలకు స్వతహాగా విషయాలు అనుభవించే శక్తిగానీ, తెలుసుకొను శక్తిగానీ ఉండదు. మనస్సు వాటితో చేరినపుడే నియత శక్తులేర్పడతాయి. కావున మనస్సుతో బాటు ఇంద్రియ నిగ్రహం కలిగినపుడే ప్రయోజనం సిద్ధిస్తుంది. కేవలం ఇంద్రియాలను నిగ్రహిస్తే సరిపోదు. విజ్ఞులైనవారు ఆ ప్రవర్తనను వదలిపెట్టాలి. మనస్సును కూడా నిగ్రహించాలి. అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే సాధన సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రయోజనం సిద్ధిస్తుంది. ఆధ్యాత్మ సాధనలో ఫలాపేక్ష రహితముగా కర్మలు చేయాలి. ఇంద్రియాలు చేసే పనులకు మనస్సు సంగమమే బంధనకారణం. అసంగమమే మోక్షకారణం. కావున అట్టి సంగము, విషయవాసన మనస్సు నుండి తొలగించి పిదప ఇంద్రియాలతో పనులు చేసినచో దోషం కల్గదని భగవానుడు గీతలో బోధించాడు. లోకహితార్థమే కర్మలు చేయాలి. అసక్త బుద్ధితో సాధకులు దైవభావనతో కర్మయోగాన్ని పరిశీలించాలి. ఆచరించాలి. శాస్త్ర నియతములగు కర్మలనే ఆచరిస్తూ ఉండాలి. అదే ఆధ్మాత్మిక సాధన. కర్మలు మానరాదు. కర్మలు చేయకుంటే చిత్తశుద్ధి కల్గదు. జ్ఞానం అంకురించదు. జ్ఞానం లేకుంటే మోక్షం అనగా పరమపదం సిద్ధించదు. దేహయాత్ర సక్రమంగా కొనసాగదు. అందుకే

అన్నారు. ఆధ్యాత్మ సాధకులు నియత కర్మలచే మనస్సును శుద్ధి పరచుకుంటే ఆత్మజ్ఞానోదయం కల్గుతుంది. సత్కర్మలు దైవార్పిత కర్మలుగా ఉంటే సాధకులకు ఎంతో మేలు శ్రేష్టము.

కర్మలచే జనులు బంధింపబడుదురుగాన సంగరహితులై కర్మలనాచరించాలి. ఆధ్యాత్మిక సాధనను ఒక యజ్ఞంగా భావించాలి సాధకులు. సకామముగా ఫలాసక్తితో చేయబడు కర్మలనాచరించక భగవద్విషయమైన కర్మలనే చేసుకుంటూ చిత్తశుద్ధిని బొంది, మోక్షప్రాప్తికి తమ మార్గాలను సులభరీతిలో మలచుకోవాలి. సత్కార్యాలు, దైవకార్యాలనే యజ్ఞాలని పేర్కొన్నారు. ఇవి జీవులకు ఆధ్యాత్మికాభివృద్ధినీ, శాంతిసౌఖ్యాలను, మోక్షాన్ని అందజేస్తాయి. దుఃఖరాహిత్యము పరమానంద ప్రాప్తి ఈ ఆధ్యాత్మిక యజ్ఞముల ద్వారా సాధకులు పొందగలరు. ఈ సాధనలే జీవుని నైతిక ఆధ్యాత్మికాభివృద్ధిని కలుగజేస్తాయని గీతలో పరమాత్మ చక్కని సందేశాన్ని అందించారు.