Jump to content

వాడుకరి:Architha Swetha/sand box/అధ్యాయం 2

వికీసోర్స్ నుండి

పంచములు మొదలగువారు

నాలుగుజాతుల హిందువులుతప్ప నితరులు గొండనెక్కఁగూడదు. అలిపిరివద్ద శిలామనుజుడు సాష్టాంగముగఁ బడియున్నాఁడు. అదిదాటి రాఁగూడదు. 1871-వ సంవత్సరములోని గవర్నమెంటువారి ఉత్తరవు ప్రకారము మెజస్టీరియల్, పోలీసు యూరోపియన్ ఉద్యోగస్థులప్పుడప్పుడు పోయెదరు. పంచములు గపిలతీర్థమునకు సమీపమున మాదిగవాని గుండములో స్నానముచేసి తిరుపతిలో దేవస్థానపు విచారణకర్తలవారి ఖచేరిలో ముడుపులఁ జెల్లించి రసీదుఁబొందెదరు. మహమ్మదీయులు గూడ నీ ఖచ్చేరీలో ముడుపులు చెల్లించుటగలదు.

అధ్యాయము II.

1.తిరుమల

తిరుమల అనగా శ్రేష్టమైనకొండ అని అర్ధము. ద్రావిడ భాషయందు శ్రీవైష్ణవసిద్ధాంతములో తిరు అనునది. శ్రేష్ఠ వాచకము. మలై అనుశబ్దమునకు పర్వతమనియర్ధము. ఈ పర్వతము తూర్పుకొండలలో నిది. 2500 అడుగులు యెత్తున్నది. తిరుమల అనెడి పేరుకంటె తిరుపతికొండనియు, తిరుపతి మలైయనియు విశేషముగ వాడబడును. ఉత్తర హిందుస్థాన్ దేశస్థులు త్రిపతి అని వాడెదరు. (ఈకొండకు కృతయుగములో వృషభాచలమనియు త్రేతాయుగములో సంజనాచలమనియు ద్వాపరయుగములో శేషాచలమనియు కలియుగములో వేంకటాచలమనియు పేర్లుగలవు. ఆపేర్లకు కారణలెవ్వన:



(1) వృషభాచలము.

వృషభాసురుడను రాక్షసుడు కృతయుగములో నీ పర్వత మందు తుంబురకోనలోనుండి మునులను బాధించుచుండెను. ఆ మునిశ్రేష్ఠులు తమ తపస్సునకు భంగము గలుగకుండునట్లు శ్రీ మహావిష్ణువును బ్రార్ధించిరి. ఈ వృషభాసురుడు తంబుర తీర్థములో ప్రతినిత్యము స్నానము చేయుచు శ్రీనృసింహసాలిగ్రామము నర్చించుచుఁ బూజానంతరంబున ఖడ్గముతోగ తన శిరము ఛేదించి యాశిరంబు నొక పుష్పంబుతోఁగూడ సమర్పించుచుండెను. ఛేదించిన వెంటనే శిరంతనికి యధాప్రకారంబు వచ్చుచుండెను. ఇటుల 5000 సంవత్సరంబు లారాధనము చేయ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షముకాఁగా నా యసురుడు దండ ప్రణామంబులుగావించి స్తుతించి తనకు మోక్షముగాని స్వర్గము గాని పరమపదముగాని అనవసరంబనుచు శ్రీ వారితో యుద్ధంబు చేయ నిచ్ఛగలదని విన్నవింపవల్లెయని యానతినిచ్చిరి. యుద్ధములో నీ రక్కసుడు శ్రీవారితోగూడ పోరాడుచు వారే రూపము దాల్చిన తానారూపము ధరించుచుండెను. విశ్వరూపము ధరించిన విశ్వరూపమును, గరుడవాహనారూఢుడుగనుండ తానునట్లుకాగా శ్రీవారు సుదర్శన ప్రయోగముచే శిరచ్ఛేదనం బొనర్చెనంత చక్రపాణికి నమస్కరించి సుదర్శన మహిమవింటిని చక్రహతులకు పరమపదము నిస్సంశయము. చక్రానలదగ్ధుడగు నే నామందిరమునకుఁ బోవుచున్నాను.

శ్లో|| ఏవముక్త్వాహరేఃపాదౌ పస్పర్శవృషభాసురః |
వరంయయాచేవృషభ శ్శైలో మదభిధోస్త్వితి||



శ్లో|| సమాలింగ్యభవేదేవ మిత్యుక్త్వాహరిణాధనః |
విసృష్టశ్చక్రసంఛిన్న స్త్యక్తవాంస్వకళేబరమ్ ||

అందుచే వృషభాచలమని పేరుపొందె.

(2) అంజనాచలము.

కేసరిభార్యయయిన అంజనా దేవి త్రేతాయుగములో పుత్రులు లేరను శోకముచే కన్నీళ్లతో శరీరమంతయు తడిసినదై మతంగమహర్షి వద్ద కేగి సాష్టాంగ నమస్కాముచేసి తనదుఃఖ కారణము జెప్పుకొన నా మునిపుంగవుండాలోచించి ఇట్లనియె “పంసాసరస్సునకుఁ బూర్వభాగమున 50 యోజనముల దూరముగ నృసింహ క్షేత్రముగలదు. దాని దక్షిణముగ నారాయణగిరికి నుత్తరముగనున్న శ్రీస్వామిపుష్కరిణికి క్రోశెడుదూరమున నున్న ఆకాశగంగకు బోయి 12 వత్సరములు తాపమాచరించిన నా పుణ్యఫలంబువలన సుపుత్రుండను బడయుదవు” అంత నామె మునివాక్యనుసారమునఁబోయి శ్రీస్వామి పుష్కరిణిలో స్నానమాచరించి అశ్వత్థవృక్ష ప్రదక్షణములుగావించి శ్రీవరాహ స్వామివారి దర్శనము చేసికొని యాకాశగంగకునేగి మునుల యొక్కయు భర్తయొక్కయు నానతి తీసికొని ఆహారవిసర్జన నియమముగలిగి తపమాచరించెను. కృశించిన శరీరముమాత్రముగలదై యీ ప్రకారము వ్రతముపూర్తియయినపిదప మహాబలుడైన వాయుదేవుఁడు వీర్యప్రపూరఫలం బొకటినియ్య నామె భక్షించె. అంత నామె గర్భవతియై 10 మాసములయిన తర్వాత పుత్రరత్ననుగు హనుమంతు డుద్భవించెను.

శ్లో|| హనుమంతమిమం ప్రాహుర్మునయోవీతకల్మషాః |
అంజనావ్రతమాస్థాయ పుత్రం ప్రాపగిరీశ్వరే ||

అందుచేత నీ పర్వత రాజంబున కంజనాచలమని పేరుగల్గె.

(3) శేషాచలము.

శ్రీవైకుంఠములో శ్రీమహాలక్ష్మీసమేత శ్రీమన్నారాయణుం డంతఃపురముననుండ శేషుడొక స్వర్ణవేత్తనంబు హస్తంబునఁబూని ద్వారము నావలియుండ మహాబలుఁడగు వాయుదేవుఁడు భగవంతునిఁజూడ వేగముగానేతెంచుచుండ నీసర్పరాట్టు తన బెత్తముతోఁ బోవలదని నిరోధించెను. కార్యారముగ శ్రీవైకుంఠాధిపుని జూడవచ్చుచుండ నభ్యంతపర్చినందుకు కోపావిష్టుఁడై “పోవలదనుటకు హేతువేమిరాముర్ఖా” అని పలుకగా శేషుడు “లక్ష్మీవల్లభుడంతఃపురముననుండ నేనాజ్ఞానుసారము నిచటనున్నాను” అని ప్రత్యుత్తరమియ్య నామాటలాలించి “పూర్వము జయవిజయ లహంకారపూరితులై ఇట్లు నిరోధించినందుకు మునిపుంగవుల శాపంబుచే కుంభకర్న రావణాసురులయిరను సంగతి తెలియునా?” అని వాయుదేవుడు జెప్ప నిరువురకు వాగ్వాదములు ప్రబలమాయె. అంత లక్ష్మిచేఁ బ్రబోధ గావింపబడి శ్రీలక్ష్మీపతి “ఆగర్వితో నీకుఁ గలహమేమి?” అని వాయువుతో జెప్ప నతఁడూరకుండెనుగాని సర్పరాట్టుమాత్రము తనతో సమానము లేదనియు తాను బహుపరాక్రమశాలియనియు ప్రగల్భములు బలుక నాత్రివిక్రముడు “నావాఙ్మాత్రేణ పారుష్యంక్రియా కేవలముత్తమం. మేరుపుత్రుఁడైన ఆనందుడుత్తరభాగముననుండె. ఆనగంబున నొక్కరు గట్టిగా బంధించి యింకొకరు కదల్చినంతట బలాబలంబు లేర్పడును” అని యానతినియ్య నా సహస్రాననుండుబోయి చుట్టుకొని శిరంబుల గట్టిన బట్టుకొనెను. వాయుదేవుడు దన పరాక్రమంబు చూపుచుండ లోకము లల్లకల్లోలముకా నారంభించెఁగాని పర్వత రాజంబు చలింపదాయె. అతడు బహు కోపావిష్టుఁడై ఇంకను తన బలంబు జూపుచుండవలదని యింద్రాది దేవతలు వేడిరిగాని నతఁ డొప్పమి శేషుని వేడనతడు లోకారాఢ్యు నిచ్ఛనను గుణ్యముగా నింద్రాదుల కోరినటుల బంధనము నొకతలతో వీడ నాభూధరంబెగురహిమవద్గిరి తన పుత్రుని విసత్తుచూచి వాయు భగవానుని వేడనతడు స్వర్ణముఖరి సమీపముననుంచె. వాయుదేవుడు సహస్రాననునికపచారము గల్గించినట్టు తెలిసికొని క్షమాపణ గోరెను. శేషపరివృతమై శేషాంశము గల యీ పర్వతారాట్టునక దాది శేషా చలమని పేరుగల్గె.

(4) వెంకటాచలము.

కాళహస్తి నగరమునఁ బురంధర సోమయాజియను నామంబునఁ బరఁగు నొక విప్రుండుండెను. అతడు వేద వేదాంగ పారంగతుఁడయ్యి పుత్రుఁడు లేనందుకు ఖేదము నొందకుండెను. అంతనొక పుత్రుండుగల్గె. ఆబాలునకు మాధవుండని నామంబిడి విద్యాబుద్ధులు గరపుచుండెను. కుమారుఁడునుఁ దండ్రివలె వేదశాస్త్ర ప్రవీణుఁడై పుత్రరత్నమని పేరొందెను. పాండ్య దేశములో పుత్రికరత్నమని పేర్గాంచి చంద్రలేఖ యను బాలికను నీమాధవునకు వివాహంబు జేసిరి. వారు నిత్యమగ్ని హోత్రములు జర్పుచు కర్మాను ష్ఠానము లాచరించుచు వేదశాస్త్రములు పరిశీలన జేయుచు నుండిరి. “బుద్ధిః కర్మానుసారిణి” అనునట్లు ఒక నాడు మాధవుఁడు సూర్యాస్తమయ ముకాక పూర్వమె భార్యతో సంగమించ వలెనని గోర నామె ఇట్లు చెప్పె. 

శ్లో. శరీర మస్థిమాంసాద్యైః పూరితం పురుషఋషభః,
శ్లో. శరీరేన శరీరశ్చసంగమస్సాధ్వసంమతః,
తద్రాపిదివసక్రీడామ యుక్తామునయోవీదుః.
శ్లో. నికేతనే పితామాతా చాగ్నిహోత్రశ్చ దేవరాట్,
ప్రభాకర ప్రభాంపశ్యత్యజకామంద్విజాత్మజ.

ఈవచనంబులాలించి మాధవుఁడు భర్తమాటవినినంతట నీకు శ్రేయస్కరమేగాక పుత్రుఁడుబడయునని చెప్పి భర్తవాక్య పరిపాలన చేయని భార్యకు దోషంబుగల్గునని వక్కాణించెను. “నేను నీరంబుకొనుటకు మిషచేసరస్సునకుఁ బోయెద నీవు కుశా న్వేషణార్థము రమ్ము, అట నీకోరిక నెరనేర్చు కొనవచ్చును.” అని చంద్రలేఖ సరస్సున కేగెను. మాధవుడు దనమిషను సరస్సు రానచట వనములో ధవళవస్త్రము ధరించిన కోమలాంగి నొక తెనుగని భార్యనింటికిఁ బొమ్మన నామె నీరంబుగొనిపోయె. వనములోనుండు సుందరాంగిని విచారించ నిచ్ఛగలిగి “నీవెవరు? ఎచటనుండి వచ్చితివి? నీకులమేమి?” అని ఆమోహనాంగి నడుగుచు దనమనోభిమతంబు తెల్లంబు చేయ “నేను మధ్యదేశ ముననుండి వచ్చిన పంచమజాతి స్త్రీని మద్యమాంసములు భక్షించుదానను వ్యభిచారిణి కుంతలయను పేరఁబరఁగెద. వేద వేదాంగ వేత్తవు నీకు దండమొనర్చెద, నన్ను జూడ నీవనర్హుడవు, క్రీడింప నేల గోరెదవు” అని యా స్త్రీ చెప్ప “శ్రీమహావిష్ణువునకు మూఢుఁడైన పుత్రుఁడు గల్గినందుకు విచారము. బ్రహ్మకుకన్నులు లేవుగాఁ బోలు” అను మొదలుగాగల పలుకు చెప్పుచు దనకోరిక నీడేరవలెనను తలంపుగల్గ నాకుంతల తన్ను దాకినంత మాత్రమున పదిపురుషాంతరములు దహించునని హితోపదేశం బొనర్ప నతడు సముద్రములో రత్నములు దేవతలు తీసికొనరా. అట్లనే రూపలావణ్యముచే నిన్ను గోరెదను. నరకంవచ్చినను సరే” అని చెప్ప నాకోకిలస్వర రంజితాంగి బ్రాహ్మణుడు బాపసంగమముచే నశింపకుండ రక్షించవల్సిన దని దేనతలను నవగ్రహములను ప్రార్థించి విష్ణునిగుఱించి యిట్లుపల్కె.

శ్లో. మాస్పృశాద్యమహీదేవ పాపినీం వ్యభిచారిణీమ్,
కస్స్పృశేదన్నిమార్తస్సన్ సర్పంవ్యాఘ్రంగజం ద్విజ,
పరపత్న్యోహిత త్తుల్యాః కిముచండాల కన్యకా,
ఉత్తమం పదమాస్థాయ నీచాయిచ్ఛంత్యధోగతిమ్.
జ్ఞానినోవతధా విప్రతవబుద్ధిస్తు తాదృశీ,
జాతీద్వే నిర్మితేపూర్వం విష్ణునాద్వి జసత్తమ.
స్త్రీత్వం పుంస్త్వం యధాతద్వచ్చాతుర్వర్ణంచ భూసుర,
బ్రాహ్మణస్య బ్రహ్మయోన్యాందంతు విచ్ఛం ప్రశస్యతే.
తధాద్యేషాంచ వర్ణానాం స్వస్వజాతౌ ప్రశస్యతే,
విపరీతమిమం మన్యేధర్మత్యాగం ద్విజన్మనామ్.
శరీరంత వవిప్రేంద్ర వేదపూతం విశేషతః,
ఋతుకాలేచ యన్మాతు స్తవపిత్రా సమాగమే.
రేతస్సృష్టం వేదపూతం గర్భాధానమి దవిదుః!
సీమంతం కల్పయామాసుర్మంత్రైర్వేదమయైర్ద్విజా.
దశ మేమాసినం ప్రాప్తే ప్రాసూతజన నీతవ,
తదాపిత్రా జాతకర్త కృతం నామచమంత్రవత్



అన్నప్రాశనచౌలాది బ్రహ్మవాచన వూర్వకమ్,
అగ్నిసాక్షివిదానేన ప్రాప్తదారః కృతోభవాన్.
అధిత వేదశాస్త్ర ప్సన్నాహితాగ్ని వృతేస్థితః,
ఏతదృశస్య దేహన్యమయానంగః కథం భవేత్.
కర్ణాహరికథా శ్రుత్వాపావితౌ నాసికాతవ,
హర్యర్హిత సుగంధేన పావితో జఠరంతవ.
వాసుదేవార్చి తాన్నేన పవిత్రం పురుషర్షభ,
కృష్ణార్చన ప్రసంగేనక రౌపావన తాంగతౌ.
హరినామ కలాపేన జిహ్వతేపావనాత్మికా,
పుణ్యక్షేత్రాను చారేణపాదౌతేపావ నీకృతౌ.

ఇంక తనకులము మహత్మ్యంబు సాంగత్యదోషము

శ్లో. అవ్యాచవచనైః క్రూరైర్జిహ్వా మెదహ్య తేసదా,
సురామం సాశనేనై వఠరే గుల్మమాగతమ్.
వ్యభిచార కథాలాపాత్కర్ణౌమే శిథిలీకృతౌ,
పాదౌజాగృహం గత్వాపాషాణ సద్శశౌమమ.
గోవధాన్మత్కరౌ క్రూరౌయమిదం దనమి ప్రభౌ,
ఏతాదృశస్య దేహస్య త్వయానంగః కథం భవేత్.
ఉత్తమోనీచతాం ప్రాప్య కథం స్వర్గ గమిష్యతి,
పర స్త్రీ, సంగదోషేణ బహవో మరణం గతాః

శ్లో. తస్మాదుత్తిష్ఠ భద్రం తేత వదాసీభ వామిభోః,

ఎంత చెప్పినను మాధవుఁడు వినక తనపూర్వ పుణ్యఫల నాకుంతల దొరకెనన నా స్త్రీ పలాయనం బాయెనంత నతడు, వెంబడించిచేకొని మన్మధహతుఁడై మీదఁబడెను. అది మొదలు యజ్ఞోపవీతముత్యజించి ముండనంబుగావించి అబ్రాహ్మణకృత్యమైన గోవధయు, గోమాంసభక్షణయు మద్యపానము చేయ చండాలత్వముబొంది కృష్ణవేణీతీరము నకుంతలతో 12 వత్సరంబులుండె. కుంతలపరలోక ప్రాప్తిఁబొంద నతఁడు పిచ్చివానివలె తిరుగుచుండ మార్గమున నుత్తరదేశపు రాజులు పరివారంబుతో వచ్చుచుండయుచ్చిష్ఠంబు భుజించుచుఁ గూడవచ్చెను. వార్లు కపిలతీర్థములో స్నానముచేసి పార్వణవిధానంబుగ పితృశ్రాద్ధముజేయ నితడు క్షవరంబు జేయించుకొని తీర్థములో మునిఁగి మృత్పిండములు పెట్టెను అంతపితృలు ముక్తినొందిరి. మరుదినము వార్లందరితో గొండకువచ్చెను. తనకువమనములు విశేషముగల్గె దుర్గంధము హెచ్చాయెను. అచ్చటి వారలేగాక యింద్రాదిదేవతలు గూడనేమి యీదుర్గంధమనుచు వచ్చిరి. అంతనొక యగ్నిపుట్టి యాదుర్గంధమును దహించె. దేవతలందఱా విప్రుని పాపంబులు బోవఁజూచి పుష్పవర్షము గురిపించి “నీవు గతపాపుఁడవైతివి. శ్రీస్వామిపుష్కరిణి స్నానముచేసి శ్రీవరాహస్వామి వారిదర్శన ప్రాప్తిఁబొంది దేహముత్యజింపుము. నీవు పాండవ దౌహిత్రకులంబున సుధర్ముని పుత్రుఁడవైపుట్టి తొండమాన్ దేశాధిపతివై నారాయణ పురమును బాలించుచు నీకుమార్తె జగన్మాతను జగత్పతికిచ్చి పరమపదము పొందెదవ”ని ఆపారునకు చెప్పెను. తదాది సర్వపాపములను హరించునదగుటచే నీ పర్వతంబునకు వేంకటాచలమని పేరు గలిగె.
21.శ్రీవారి బంగారు విమానము,తిరుమల
తిరుపతి కేడుమైళ్ల దూరమున నారుకొండలు దాటి ఏడవ కొండయగు వేంకటాచలము మీద శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానముగలదు. ఆ దేవస్థానమునకు బయట ప్రదక్షణము నాల్గువీధులవలె నున్నది. ఆ వీధులలో సుమారువెయ్యిమంది జనాభాగల గ్రామముగలదు. దీనికి తిరుమలని వాడెదరు.

2. శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానము

ఈ దేవస్థానము అనాది అని పురాణము వల్ల నేర్పడును. శ్రీవేంకటేశ్వరస్వామివారి మూర్తియందుండు చిహ్నములు జూచి శివుడా? విష్ణువా? శక్తియా? అను సంగతి పలువురకు తోఁపకమానదు. శ్రీవైకుంఠమునుండి కలియుగములో జనులనుద్ధరింపభూలోకంబునకే తెంచిన శ్రీమహావిష్ణువని చెప్పెదరు. విఘననమతస్థులు పూజనొనర్చెదరు. దక్షణ ఇండియా గెజెటీరులో (South India Gazettee) “గుడిపూర్వచరిత్ర సరిగా తెలియక బుక్కిట పురాణములతో నిండియున్నది. మిగుల ప్రాచీనమైనదనుటని స్సందేహము కలియుగమాదిలో గట్టబడినట్టును కలియుగాది 5000 సంవత్సరము లయినతర్వాత భూమిమీద విష్ణుపూజ తగ్గుననియు పురాణములో జెప్పబడినట్టు వ్రాయఁబడినది. హిందూరాజులు కాలములోని దేవస్థానపురాబడి గుడిలోనే మతసంబంధమై పనులకు (Ceremonies) వెచ్చింపబడుచుండెను. ముసలమానులకాలములో నీరాబడి రాజుల స్వప్రయోజనమునకు వెచ్చించబడుటకు ప్రారంభమాయెను.” అనువగైరాలు చెప్పబడినవి. ఇప్పటికి కలియుగము బుట్టి 5023 సంవత్సరంబులాయెను. మహిమతగ్గుటకు బదులు హెచ్చుచున్నది. దేవస్థానపు మహాద్వారమునకు పడికావలి అని పేరు. మహద్వారము మీద నొకగోపురముగలదు. ఇచ్చట దేవస్థానపు గుమాస్తా ఒకరును కావలిభటులు నుందురు. దేవస్థానము లోపలకును, లోపలనుండు బయటకును తీసుకొని పోబడువానిని తనిఖీచేయుదురు. పడికావలి బయటనుండి బంగారుమలాంచేయబడిన రేకుతో కప్పబడిన ధ్వజ స్తంభము మొదలగునవికనబడును. యాత్రికులాపడి కావలిగుండా గోవిందనామ సంకీర్తనము చేయుచు వెళ్లుటచూడగ నహ్లాదకరము ప్రతివానికి నుండక మానదు.

పడికావలి దాటగానె నొక ప్రదక్షణముగలదు. దానికి సంపగ ప్రదక్షణమని పేరు. ఈ ప్రదక్షణమునడిమి పడికావలి అను ద్వారముగుండా దాటగా విమానప్రదక్షణము గలదు. ఇదిగాక వైకుంఠ ప్రదక్షణముగలదు. ఇది ముక్కోటియేకాదశి అనఁగా ధనుర్మాసములో శుక్లపక్ష ఏకాదశి ఉదయమున తెరచిద్వాదశి సాయంకాలము మూయుదురు.

3. వెయ్యికాళ్ల మంటపము.

శ్రీవారి దేవస్థానము కెదురుగ నీమంటపమున్నది. మంటపములోనికి వెళ్లుటకు పశ్చిమపార్శ్వమునుండి మెట్లు కలవు. మంటపమునకు పశ్చిమభాగము అంగళ్ల వల్ల మూయబడినందున నుత్తరపార్శ్వమార్గము చాలయుపయోగింపఁబడుచున్నది. వెయ్యి స్తంభములున్నవని చెప్పుటయే కాని యిప్పుడంత సంఖ్యలేదు. యీమంటపములో కొంతభాగము శిధిలమై పడిపోయినందున కంబముల సంఖ్య తక్కువ. మంటపముకట్టిన కాలము సరిగా తెలియదు కాని నిండపురాతనమని చెప్పుటకు సందియ

23. ధర్మశాల. (పిలిగ్రింషెడ్).

ఇది ఆళ్వారుచెరువువద్ద నున్నది. ఇది నూతనముగా యాత్రీకులు చెట్టుక్రింద వంటచేసుకొనకుండ వుండునట్లు నిర్మించబడినది. ఇదేమాదిరిగా గ్రామమున కుత్తరపుతట్టు ఒకటి కట్టబడినది వెయ్యికాళ్ల మంటపముపైన ఒకటి కట్టబడుచున్నది. ఈ మూడున్ను వేలకొలది బీదయాత్రీకుల కుపయోగము. ములేదు. ఈమంటపము చాలభాగము యాత్రికులకొఱకు అరలుగా కట్టబడియున్నది. కొంతభాగము ధర్మశాలగా నున్నది. మంటపము యొక్క కొంతభాగము తగ్గుగాను కంబములన్నియు మోటుగాను మిగుల సమీపము గానుండుటవల్ల అంతబాగా తెలియదు. శ్రీవారిని వేంచేపు చేయుట కొక భక్తుఁడు దీనిని కట్టించినట్లు చెప్పుటయే కాని యెందుచేత వేంచేపు చేయుట లేదో కారణము తెలియదు.

4. శ్రీహత్తిరాంజీ మఠము.

ఆగ్నేయ మూల నెత్తైన స్థలమున నీమఠముకలదు. ఈ మఠమునకు మూలపురుషుఁడు శ్రీహత్తిరాంజీవారు. ఈయన వుత్తరహిందూ స్థానములో డిల్లీకి 24 మైళ్ల దూరములో నుండు కేడల్ క్రేల అను పురమునుండి వచ్చినవారు. వీరు అచ్చట మఠాధిపతియైన అనుభయనంద జీవారి శిష్యులలో నొకరు వీరు తీర్థయాత్రచేయుచు నీక్షేత్రమునకు వచ్చి తపస్సు చేయుచుండిరి. యిక్కాలమున విజయనగరం శాలువవంశపురాజు లీరాజ్యమును పాలించుచుండిరి. వీరును క్రీస్తుశకము 1500 సంవత్సరము లప్పుడు వచ్చినట్టు తెలియును. ఈయన మిగుల తపోనిష్టులు. వీరు శ్రీ వేంకటేశ్వరస్వామివారితో పాచిక లాడినట్లు చెప్పెదరు. వీరు ఆకులను భక్షించుచు నుదకము పానము చేయుచుండిరి. వీరికి జరామరణములు లేవనిన్నీ శరీరముతోనే కొంతకాములన కంతర్ధాన మయినట్లుగా చెప్పెదరు. వీరికి చంద్రగిరి రాజు తిమ్మ రాజుగారి కుమారుడు శిష్యుడై వీరి తర్వాత మఠాధిపతిగా వచ్చెను. ఈ రాచపుత్రుడు శ్రీహత్తిరాంజీ వారికి శిష్యుడగుటవల్ల అప్పటి రాజులు వీరి మఠమునకు ఒకసిం హాసనమును నింక రాజచిహ్నములగు నౌబత్ ఖానా ఘంట మొదలగునవి యిచ్చిరి. తిరుమలమీదనుండు రాజనగరు మఠముగా మారెను. వీరు జపముచేయుమాల యొకటి మఠములోకలదు.

ఈ మఠమునకు ఆదిస్థానము తిరుమల. శ్రీమహంతు వారు సంవత్సరములో కొంతకాలము తిరుపతిలో నుందురు. ఈ మఠమునకు తిరుచానూరు, చిత్తూరు, వేలూరు, షోలింగర్, వృద్ధాచలం, తంజావూరు, మధుర, నాసిక, పంచవటి, సుగూరు, బొంబాయి, భాగల్ కోట, కాన్పూరు జిల్లా, మున్జేరి జిల్లా, గుజరాట్, అయోధ్య, నాభా మొదలగు ప్రదేశములో శాఖలు కలవు.

తిరుమల తిరుపతి యందున్న నీమఠములలో నెంతమంది సాధువులు కయినను ఎన్ని దినములయినను బసయిచ్చి భోజన మిడెదరు. మరియు ననేకులకు సదావృత్తి నిచ్చెదరు. ఈ రెండు ప్రదేశములలోను పెక్కు సంఖ్య గల సాధువులు ప్రతి దినముందురు. శిష్యార్జితము కలదు. శిష్యులు పాదకానుకలకు నివేదనలకు సొమ్ము నిచ్చెదరు.

శ్లో. సతాంధనం సాధుభిరే నభుజ్యతే
దురాత్మ భిరుశ్చరితాత్మ నాంధనం
సుఖాదభి శ్చూత ఫలాది భుజ్యతే
భవంతినిం భాఃఖలుకాక భాజనం.

మఠమునకు శిష్యులు కానివారు సయితము పై శ్లోకార్థము ప్రకారము కొందరు సాధు సమారాధన మొదలగు వాటికి గాను సొమ్ము ఇచ్చెదరు. యిచ్చట నివేదనలు 5 విధములు.

డాల్ భాత్ ర్పు 30-0-0 + 3-8-0

ఖిచిడి (పొంగలి) 15-0-0

శీరా పూరీ. 60-0-0 + 3-8-0

మాల్ పూరి. 110-0-0 + 6-0-0

పంచ మీర్. 250-0-0 + 6-0-0

ఈ మఠములో గుడి దేవతార్చనలు గలవు. పూజారులు తెల్లవారు జామున 4, 5 గంటలకు లేచి స్నానము చేసుకొని పూజ చేయుదురు. ఈ గుడిలో సాలిగ్రామములు వందల కొలది గలవు. ఉదయము 6 గంటలకు బాల భోగము పొంగలిన్నీ మధ్యాహ్నము రాజ భోగమున్ను రాత్రి 8 గంటలకు తిరుగ నివేదనయు అగును. ఇచ్చట కర్పూర హారతిచేయించదలచిన వారు రు 1-4-0, వత్తి వెలగించి హారతి చేయించువారు రు 0-5-0 లున్నూ చెల్లించవలయును. ప్రతిదినము మధ్యాహ్నము 5 గంటలకు సాధువులకు ఒక్క పండితుడు సంస్కృతములో పురాణము చదివి హిందుస్థానీలో అర్థము చెప్పుచుండును. ఉదయము సాయంత్రము హారతి కాలమందు సాధువులు భజన చేయుదురు. ఈ మఠములో గాది అని వాడెడు సింహాసనములు గలవు. ఒకటి విజయనగరము రాజులకు నిర్మింపబడినది. రెండవది మఠము యొక్క మూల పురుషుని స్వంతమునై యున్నది. శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములో తేరుదినమునను మహంతు వారు ఉపవాస ముండి తేరు యధాస్థానమునకు వచ్చిన తర్వాత తేరువద్దనుండి మర్యాదతో దయచేసి పైన చెప్పిన గాదులం దాసీను లవుదురు. ఈ మఠములో తక్కిన మఠములోవలే విశేషోత్సవము లనేకము జరుగును. వానిలో మఠము యొక్క మూల పురుషుడంతర్థానమైన జాగాయందు వారి సమాధి కట్టబడినది. వారు వేసుకొనిన ధూనినింకను ఆరిపోకుండ కాపాడబడు చున్నది, అచ్చటనొక మఠముయొక్క సాధువుచేత ఆంజనేయ కృష్ణ విగ్రహములకును సమాధులకును ప్రతిదినము ఆకశగంగ తీర్థము తులసి మొదలగు వానిచే పూజచేయ బడి కిచిడి మొదలగు వానితో నివేదన జరుగుచున్నది. యిది తిరుమలకు మైలు దూరమున పాపవినాశని ఆకాశ గంగకుపోవు మార్గములో నున్నది.

సాధారణముగా యాత్రికులకు శ్రీ వేంకటేశ్వరస్వామి వారియందెట్టి నమ్మిక గలదో అట్లనే శ్రీహత్తిరాంజీవారియందు మఠం శిష్యులకు నమ్మిక విశ్వాసములు గలిగి కానుకలిచ్చెదరు. శ్రీహత్తిరాంజీవారు స్వప్నములో శిష్యులకు కనఁబడి తమ ప్రార్ధనలకు నుత్తరువు నిచ్చుచుండునని శిష్యులనేకులు చెప్పు చుందురు. దక్షిణహిందూ దేశమందు హెచ్చు సంఖ్యగల సాధువులను గలిగిన మఠమిది యొకటియే.

శ్రీ మహంతు సేవాదాస్ జీవారు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానమును బ్రిటిష్ గవర్నమెంటు స్వాధీనము నుంచి 1843 సం|| యేప్రియల్ తే 21 ది మద్రాసు గవర్నరు ప్రభువు గారి హుకుంను అనుసరించి జూలై తే 16 దిలో సంపాదించిరి. మనగవర్నమెంటు వారు దేవస్థానమును తమమేనేజిమెంటు నుండి ఇతరులకు నియ్య దలచు కొనునప్పుడు దేవస్థానములో నొక మిరాశిదార్ అయిన పెద్ద జియ్యంగార్ ఇంకను కొందరు జమిందార్లు మొదలగు వారు తమ స్వాధీనము చేయవల్శినట్లుగోరి దరఖాస్తులు చేసికొనినను వారి కొసగక నీనుహంతు లకిచ్చిరి. ప్రస్తుతము ఈ మఠమునకు శ్రీమహంతు ప్రయాగ దాస్ జీగారు మహంతుగా నున్నారు. వీరి ప్రతినిధి (Representative) అధికారి అను హోదాలో సదా తీరుమల మఠం లోనుందురు.

శ్రీచిన్న జియ్యంగార్ల వారి మఠము.

దక్షిణపు వీధిలో చిన్న జియ్యంగార్ల (ప్రస్తుతము అప్పన్ శ్రీనివాస చిన్న జియ్యంగార్ల వారు) మఠము గలదు. తిరుపతిలోను శ్రీగోవిందరాజస్వామి వారి దేవస్థానమునకు సమీపమున ఈ మఠముగలదు. చిన్న జియ్యంగార్లు తిరుమల మీదనున్నప్పుడు కొందఱు వైష్ణవులకు భోజనము పెట్టెదరు. ఈ మఠము ముందు చెప్పబోవు పెద్ద జియ్యంగార్ల వారి మఠము నకు జేరినది, చిన్న జియ్యంగార్లు పెద్ద జియ్యంగార్ల వారి శిష్యులు. పెద్ద జియ్యంగార్ల వారు పరమపదము పొందిన తర్వాత చిన్న జియ్యంగారు వారిని నామఠమున కధిఱతిగా జేసెదరు శ్రీభాష్య కార్ల వారి పరంపరలోని పెద్ద జియ్యంగార్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానములో చేయు కైంకర్యములు అవిచ్ఛిన్నముగా జరుగుటకు ఈమఠం శ్రీభాష్యకార్ల పరంపరలో 10 వ పురుషుడైన శ్రీతిరువెంగడ రామానుజ పెద్ద జియ్యంగార్ వారి కాలములో మనవాళ మహామునుల సలహామీద నేర్పాటు చేయబడినది. చిన్న జియ్యంగార్ వారు ఇచ్చట నున్నప్పుడు తదీయారాధనలు యాత్రికులు కొందఱు చేయించెదరు. సొమ్ము నుబట్టి వంటకము లుండును గానీ ఒక్క నిర్ధారణ రేట్లు లేవు. ఈమఠమును పెద్ద జియ్యంగార్ల మఠమున్ను దేవస్థానముకట్టడములు, వీర్లు కైంకర్యములు చేయుచు నుండుటకు ఏర్పాటు చేయఁబడినవి.

అధికారివారి తోట.

పశ్చమ వీధిలో పశ్చమ శ్రేణిలో మొదట వేంకటగిరి రాజాగారి తోట వగై రాలుండెను-ఆతోటలో శ్రీవారిని వేంచేపు చేసి వుత్సవము జరుగుచుండెను. ఆధర్మము నిలుపబడి ఆతోట వగైరాలు శ్రీ అధికారి రామలఖన్ దాసుజీ వారికి విక్రయింప బడినవి. వారు ఆతోటకు తమ మఠము తోటను కలిపి పెద్ద తోటగ జేసి ఒక మంటపమున్నూ సత్రమున్నూ కట్టించిరి. ఆ సత్రమున బసలిచ్చెదరు. శ్రీవారి బ్రహ్మోత్సవములో రాత్రి పూటయు శ్రీవారికి చైత్ర శుద్ధ త్రయోదశి మొదలు మూడుదినములు జరుగు వసంతోత్సవము రేయింబవళ్లు సత్రమున బ్రాహ్మణులకు ప్రతిపునర్వసు నక్షత్రమున శ్రీరాములవారు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతముగ దయచేసెదరు. వసంతోత్స ములో శ్రీవారు విచ్చేసెదరు.

మైసూరు గవర్నమెంటువారి సత్రము.

ఈ వీధిమధ్యను మైసూరు గవర్నమెంటువారి సత్రము వైశాల్యము గలిగియున్నది. ఇది చాలకాలమునుండి యున్నది. ఈ సత్రములో నేకాదశి రోజులు తప్ప తక్కిన దివసములు యాత్రికులయిన బ్రాహ్మణులకు మధ్యాహ్న మొకపూట శ్రీవారి దేవస్థానములో నివేదన అనంతరం భోజనము పెట్టె దరు. వంట చేసుకొనుటకు దిగుటకు స్థలము లిచ్చెదరు. ఈ సత్రములో పూర్వము కొంత కాలము భోజనము పెట్టక సామానుల నిచ్చు చుండిరి.

దేవ స్థానపు సత్రమ.

పై సత్రమునకు ప్రక్కన సత్ర మొకటిగలదు. ఇది శిధిలమైనందున దేవస్థానంవారు కట్టుటకు యేర్పాటు చేయబోవుచున్నారు.

శృంగగిరి స్వాములవారి మఠము.

యీ వీధిలో తూర్పు శ్రేణిలో చిన్నయిల్లు గలదు. ఉత్తరపు వీధిలో పూర్వము పెద్దమఠము పెరడు ఉండినది. అది శిధిలమైన తర్వాత నిది యేర్పాటయినది. ఈ మఠమునకు దేవస్థానంనుండి నిత్యము హోరవెచ్చము (బియ్యము మామూలు) గలదు.

గోసాయి మంటపము.

వాయువ్యమూలలో గోసాయి (అనగా రైలు లేని కాలమున దేశమంతతిరిగి దేవస్థానమునకు ముడుపులను జనమును తీసుకొనివచ్చెడివారు) మంటపము చిన్న గుంటగలవు. శ్రీవారి బ్రహ్మోత్సవమునకు గోసాయి జండాతో వచ్చును. ఈజండా వూరుబయటకురాగా దేవస్థానమువారు మేళ తాళములు పంపించి వూరు బయటనుండి యీ గోసాయి మంటపలో ప్రవేశించు వరకూ దేవస్థానం వాయిద్యములతో పిల్చుకొని రాబడును. 

ఉత్తరపు వీధి.

1. హిందూస్థాన్ రామాంజీ కూటము.

ఈ వీధిలోను పశ్చమవీధిలోను హిందూస్థాక్ రామాంజీకూటములు కలవు. ఉత్తర హిందూస్థానమునుండి వచ్చిన వైష్ణవులకు భోజనము పెట్టెదరు. హిందూస్తానీ షాహుకార్లు ఈ రామాంజీ కూటములకు నిండా ద్రవ్యసహాయము చేసెదరు.

2. వ్యాసరాయ స్వాములవారి మఠము.

ఇది నిండా శిధిలమైయున్నది. నివాస యోగ్యము కాదు.

3. అర్చకులు ఇండ్లు.

ఈవీధిలో అర్చకులు నివసించెదరు. శ్రీవారి బ్రహ్మోత్సవములో తప్ప తదితర కాలములలో అర్చకులయిండ్లు చాల భాగము ఖాళీగానుండును. పూజ చేయు వంతుగల అర్చక గుమాస్తాలు మాత్రము సదాయుండెదరు.

4. రాతి తేరు.

ఈశాన్యమూలలో రాతి తేరుగలదు. శిలాశ్వములు చక్రములు భూమిలో పూడియున్నవి. తేరునకు గోపురమువలె నుండు పై భాగము పడిపోయినందున ఇప్పుడు మంటపమువలె తెలియుచున్నది. ఈ తేరు పూర్వమెప్పుడో శ్రీవారి బ్రహ్మాత్సవములో నెనిమిదవరోజు ప్రస్తుతముపయోగించబడు కొయ్య తేరువలె నుపయోగింపబడుచుండె నని చెప్పెదరు.

తూర్పువీధి.

1. శ్రీ ఉత్తరాది స్వాములవారి మఠము.

ఇది యీవీథిలోనున్నది. ఉత్తరపు వీధిలోనున్న శ్రీ వ్యాసరాయ స్వాములవారి మఠమువలె నిండా శిథిలముగ నుండక పోయినను మరమ్మతుకు తగినదిగా నున్నది.

2. శ్రీ పరకాళ స్వాములవారి మఠము.

ఇది నూతనకట్టడము. ఉత్తరపువీధిలో పడిపోయిన పాత మఠముయొక్క జాగాగలదు. నిత్యము కొంచెముమంది శ్రీ వైష్ణవులకు భోజనము పెట్టుదురు. ఇచ్చటను తదియారాధనలుగూడ జరుగును. ఇది వడహలమఠము. దేవస్థానమునుండి నిత్యము బియ్యము వగైరా సామాను లిచ్చెదరు.

రథము

ఇది కొయ్యతో చేయఁబడినది. ఇందు మంచికొయ్య పని చేయఁబడియున్నది. శ్రీవారి బ్రహ్మోత్సవములో ఇది చక్కగా అలంకరింపబడి 8వ దినమున ఉదయము శ్రీవారు విజయం చేయగా నాలుగు వీధులు మనుష్యులవల్ల లాగబడి తిరిగి యథా స్థానమునకు చేర్పఁబడును. తేరుకుచేరి ఒక రాతి మంఠపము గలదు. తేరుమీదకు వేంచేయుటకు ముందు శ్రీవార్లు యీ మంటపములో విచ్చేయుదురు.

దివాణము

తేరుకు సమీపమున నొక చిన్న కట్టడము. ఇది యాత్రికులకు తగినంత కారణంమీద బసగా నియ్యనగును. తేరుకు సమీపమున నిదియొక దేవస్థానపు కట్టడము.

వాహన మంటపము.

ఇదియొక రాతిమంటపము. శ్రీవారు వాహనారూఢులగుటకు ముందు వాహన మిచ్చట నుంచబడును. శ్రీవారి బ్రహ్మోత్సవములో వాహనమునకు ముందు లాగబడే బ్రహ్మరధము ఈ మంటపములో నున్నది.

బజారు.

శ్రీవారి మహద్వారమునకు ఇరుప్రక్కల యెదురుగను అంగళ్లుగలవు. ఇచ్చట బియ్యం కూరగాయలు వంట చెరుకు మొదలు సామానులు వెలకు దొరుకును. బియ్యము మొదలగు సామానులు కొను యాత్రికులు పాత్ర సామానుకూడ బాడుగకు ఇచ్చెదరు.

తీర్థగట్టుసందు.

శ్రీవారి దేవస్థానపు ఉత్తర ప్రాకారమానుకొని తీర్థగట్టుసందు అను పేర రాజబాటగలదు. ఇది పశ్చిమవీధిలో శంకరమఠమువద్దయు పశ్చిను ప్రాకారము నానుకొని దక్షిణపు వీధిలో కలియును. ఈసందులో తీర్థ పురోహితులయిండ్లు గలవు. ఇది శ్రీ స్వామి పుష్కరిణి గట్టు నానుకొనినసందు గనుక తీర్థగట్టుసందు అను పేరుగల్గె. గోసాయి మంటప మొకటి గలదు. శ్రీహత్తిరాంజీమఠంయొక్క మంచికట్టడములు గలవు.


శ్రీవరాహస్వామివారి దేవస్థానము.

ఈ దేవస్థానము శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన మునకంటె పురాతనమయినదని పురాణములవల్ల తెలియు చున్నది.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనమునకువచ్చు వారందఱు మొదట శ్రీ వరాహస్వామివారి దర్శనము జేసిన తర్వాత శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనము చేయవల్సినది. నివేదన కూడ ప్రతిదినము శ్రీ వరాహస్వామి వారికి జరిగిన పిమ్మట శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి జరుగును. శ్రీవేంకటేశ్వరస్వామి వారిక్కడకు వచ్చినప్పుడు శ్రీవరాహస్వామివారు కలియుగము వచ్చుచున్నదని తెలిసికొని తన ప్రతాపమును తగ్గించుకొని “కలౌ వేంకటనాయకః” అనుటకు సరిగా శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సమస్తము నప్పగించెను.

ఘంట మంటపము.

ఇది వాహనమంటమ మానుకొని యున్నది. ఇందులో ఒక్క ఘంటగలదు. ఉదయము మధ్యాహ్నము అర్చకులు గుడికి వచ్చినప్పుడు అందఱికి తెలియునట్లు ఘంట కొట్టఁబడును.

పోలీసు స్టేషన్.

ఇది వెయ్యికాళ్లమంటపములో నున్నది. ఇక్కడకు తిరుపతి పోలీసుస్టేషనుకు టెలిఫోన్ కలదు.

పెద్దజియ్యంగారి మఠము.

యీమఠం వైష్ణవమతోద్ధారకులైన శ్రీరామానుజాచార్యులవారివల్ల నియమింపఁబడినది. ప్రస్తుతము శ్రీ అప్పన్ గోవింద రామానుజ పెద్దజియ్యంగారు వారు మఠాధిపతిగా యున్నారు. వీరు దేవస్థానంలో ననేక కైంకర్యములు నిత్యము చేయుచు దేవస్థానం నుండివచ్చు కొన్ని వరంబళ్ల ననుభవించుచున్నారు. ఈ కయింకర్యములు శ్రీ రామానుజులవారి నాట నుండి వచ్చుచున్నది. యతికి బిక్ష చేయుట మంచిదని అనేకులీ మఠములో తదీయారాధనలు చేయించెదరు. ఇంకను రొఖ రూపముగ కానుక లిచ్చెదరు. తదీయారాధనాలకు రేట్లు నిర్ధారణ లేదు. సొమ్మును బట్టి వంటకములుండును. ఈ మఠములో కొందరు వైష్ణవ బ్రాహ్మణులకు భోజన మిడెదరు. ఇది తెంగల మఠము. తిరుపతిలో కూడ నీ మఠము కలదు. సంవత్సరములో కొంత కాలము జియ్యంగార్లు తిరుపతిలోనే యుండెదరు. తిరుమల మీద నుండు ఈ మఠములో శ్రీకృష్ణుడు మొదలగు విగ్రహములు గల దేవతార్చన గలదు. ఈ మఠంలో మూల పురుషుని తిరునక్షత్రం చాతుర్మాన్య సంకల్పదివసము మొదలగునవి శోభస్కరముగా చేయుదురు.

ఆచార్య పురుషులు.

ఈ దేవస్థానమునకు ఆచర్య పురుషులు 7 మంది. శ్రీ వైకుంఠములో సప్తమ ఋషులజోలె ఇచ్చట వీరు ఏడు మంది అని చెప్పెదరు. వీరి వంశములో పూర్యులు శ్రీ వారికి భక్తి శ్రద్ధలతో కైంకర్యములు చేసిరి.

ప్రధమాచార పురుషులు.

వీరు తిరుమల నంచి వంశములోని వారు. ఈ కుటుంబమునకు తోళప్పాచార్యుల కుటుంబమని పేరు. తిరుమల నంబి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తిశ్రద్ధలతో కైంకర్యము చేసిరి. వీరు వడ హలవారు.

ద్వితీయాచార్య పురుషులు

ఈ కుటుంబమునకు పుర్శివారి కుటుంబమని పేరు. వీరి పూర్వులు అయిన ఆనందాళ్వార్ అను వారు శ్రీ వారిక్8ఇ మిగుల భక్తి శ్రద్ధలతో కైంకర్య్ము చేసీ. వీరు తెంగలవారు.

తృతీయాచార్య పురుషులు.

ఈ కుటుంబమునకు కందాళ కుటుంబని పేరు. కందాళ అన్నా అను వారు ఈ కుటుంభములోని వారు వీరు తెంగల వారు.

చతుర్ధాఅచార్య పురుషులు.

ఈ కుటుంబమునకు ప్రతి వాది భయంకరము కుటుంబమని పేరు. ప్రతివాది భయంకర అన్నా అనువారు ఈ వంశము లోని వారు. వీరు తెంగల వారు.

పంచమ ఆచార్య పురుషులు.

ఈ కుటుంబమునకు వీరపల్లి కుటుంబమని పేరు. వీరు తెంగలవారు.

షష్టమ ఆచార్య పురుషులు.

ధర్మపురి కుటుంబము వారు. అరవ వారు. వీరు వడ్ హలవారు.

సప్తమ ఆచార్య పురుషులు.

వీరు పరవస్తు కుటుంబము వారు. వీరు తెంగల వారు.

మంగలి కట్ట.

తిరుమల గ్రామమునకు ముందుండు రావి చెట్టుకు సమీపాన యాత్రికుల ప్రార్థనల ననుసరించి జుట్టు తీయుటకు పని చేయు ప్రదేశము కలదు. దీనికే మంగలి కట్ట యని పేరు. అట్టి ప్రార్థనలున్న వారు పుట్టు జుట్టు తీయుటకు రు.0-4-0 న్ను యిదివరలో పనిచేయబడి మొక్కుకు గాను పెంచబడిన జుట్టు తీయు టకు రు. 0-3-4 న్ను మనిశి 1-కి మంగళ్లకియ్యవలెను.

డిస్పెంసరి.

తిరుమల గ్రామమునకు ముందు మంచి కట్టడములు గలవు. అందులో నొకటి డాక్టరు ఉండుటకును ఇంకొకటి మందులు ఇచ్చుటకు హాసుపాత్రిగ నున్నది. ఇందులో ధర్మముగ మందులు అందరియ్యబడును. ఇది దేవస్థానం శ్రీ విచారణ కర్తల వారి వలన ఏర్పటు చేయ బడినది.

భోజనము.

1.దేవస్థానములో రేయింబగలు ఎందరు దేశాంత్రులకు అయినను ప్రసాదము భోజనమున కిచ్చెదరు. 2.మైసూరు గవర్నమెంటు వారి సత్రములో బ్రాహ్మణులకు మద్యాహ్నము ఒక్కపూట భోజనమిడెదరు.

హోటల్.

బొజనమిడు బ్రాహ్మణ హోటల్ ఒక్కటి గలదు. కాఫీ హోటల్సు అనేకము గలవు. అందులో నొకటి కొచ్చి సారస్వత బ్రాహ్మణులది గలదు.
36. శ్రీవారి పడికావలి గోపురము , తూర్పుభాగము
36. శ్రీవారి బంగారువాకిలి
37. శ్రీవారి పడికావలి గోపురము, దక్షిణ భాగము

బసలు.

పై వివరించినవి గాక ధర్మార్థముగా బసలిచ్చు చిన్న ఇండ్లు గలవు. బాడుగలకును ఇండ్లు దొరకును.


అధ్యాయము. III.

శ్రీవారిదర్శనము.

దేవస్థానము యొక్క పడి కావలి యనెడి సింహ ద్వారపు తలుపులు ప్రాతఃకాలమున హరి కొలువను మంగళవాద్యమైన పిదప తెరబడి అర్చకులు వచ్చు వరకు యాత్రికులను లోనికి వెళ్లనివ్వరు. (అనగా లోపల తుడుచుట లేక ఊడ్చుట, శుద్ది చేయుట వగైరా పనులు అయ్యే వరకు అని అర్థము) ఉదయము 6, 7 ఘంటలకు దేవస్థానపు గర్భాలయము యొక్క బంగారు వాకిలి అనే మొదటి ద్వారపు తలుపులు తీయిబడును. అర్చకులు వచ్చునపుడందరికి తెలియునట్లు ఒక ఘంట వాయింపబడును. దేవస్థానము పారుపత్య దారు ఉత్తరువు ప్రకారము బంగారు వాకిలి తలుపులు తీసిన వెంటనే గొల్ల, అర్చకులు, జియ్యంగార్లు లోపలికెళ్లి తలుపులు మూసుకొని శయనమునకు విజయం చేసిన శ్రీవారిని యధాస్థానాసీనులుగ జేసి హత్తీరాంజీమఠము వారు తెచ్చిన ధారోష్టము పాలు ఆరగింపు చేసి తలుపులు తిరిగి తీసెదరు.అంతవరకు లోపల అర్చకులును జియ్యంగార్లును, బయట ఇతర కైంకర్యములును, సుప్రభాతమనెడు మంగళశ్లోకములను చెప్పు చుందురు. తరువాత తలుపులు తెరువ లోపలకు వెళ్లి సుప్ర