వాడుకరి:వైజాసత్య/ప్రయోగశాల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
సంఖ్య పద్యం భావం
1

శ్రీ భూ నీళా హైమవ
 తీ భారతు లతుల శుభవ తిగ నెన్ను చు స
త్సౌభాగ్యము నీ కొసగంగ
లో భావించెదరు ధర్మ లోల కుమారీ!

ధర్మపరురాలైన ఓ కుమారీ! శ్రీదేవియు, భూదేవియు,నీళాదేవియు,పార్వతీదేవియు,సరస్వతీదేవియు, నిన్ను మిక్కిలి సుగుణవంతురాలిగా ఎన్నుకొని మంచి ముత్తైదవతనమును, మనస్సులందు తమ తమ ఆశీర్వచనములను నీకు ఇచ్చెదరు గాక.
2

చెప్పెడి బుద్ధులలోపల
దప్పకు మొక టైన సర్వ ధర్మములందున్
మెప్పొంది యిహపరంబులన్
దప్పింతయు లేక మెలగ దగును కుమారీ!

ఓ కుమారీ! నేను చెప్పునట్టి మంచి గుణములనొక్కటినైనను వదలక ఆచరింపుము. ధర్మయుక్తముగా మెప్పు

పొంది ఇహపర దోషమిసుమంతైననూ లేకుండా మసలుకొనుము. నీకు శుభములు కలుగును.

3.

ఆటల బాటలలోనే
మాటయు రాకుండన్ దండ్రి మందిరమందున్
బాటిల్లు గాపురములో
వాట మెఱిగి బాల! తిరుగ వలయున్ గుమారీ!

ఓ కుమారీ! ఆటపాటలయందు ఏ విధమైన పరుష వాక్యములు పలుకక, మాటపడక, పుట్తింట్లో ఉండేటపుడు

తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా నడచుకొనుము.

4.

మగనికి నత్తకు మామకున్
దగ సేవ యొనర్చుచోటన్ దత్పరిచర్యన్
మిగుల నుతి బొందుచుండుట
మగువలకున్ బాడి తెలిసి మసలు కుమారీ!

ఓ కుమారీ! మెట్టినింట్లో మగనికి అత్తమామలకు సపర్యలు జేయుచు, వారిచే మెప్పు పొందునట్లు స్త్రీలు నడుచుకోవాలి.

ఈ విషయము మదినందుంచుకొని మెలగుము.

5.

పెనిమిటి వలదని చెప్పిన
పని యెన్నడును జేయరాదు బావల కెదుటన్
కనబడగ రాదు కోపము
మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!

ఓ కుమారీ! భర్త చెప్పిన మాట జవదాటరాదు. ఆయన వద్దని జెప్పిన పనిని ఎన్నడునూ చేయరాదు. బావలకెదురుగా

కనబడరాదు. మనస్సునందు, కోపము ఉంచుకొనరాదు. ఎల్లపుడు అట్లే మెలగుము.