వాడుకరి:రహ్మానుద్దీన్/పరీక్ష

వికీసోర్స్ నుండి

హైదరాబాద్‌ : డ్రగ్స్‌ వ్యవహారంలో విచారణ నియమ నిబంధనలకు లోబడి కొనసాగుతోందని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ చంద్రవదన్‌ తెలిపారు. అబ్కారీశాఖకు ఏ రంగం పట్లా ద్వేషం లేదని ఆయన అన్నారు. ఎక్సైజ్‌ కార్యాలయంలో అకున్‌సబర్వాల్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సినీరంగాన్ని లక్ష్యంగా చేసుకుని విచారణ సాగుతోందని వస్తున్న వార్తలను ఆయన తప్పుబట్టారు. కొందరు ట్వీట్ల ద్వారా విచారణను వక్రీకరించడం తగదని పేర్కొన్నారు. అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఎవరూ వ్యవహరించొద్దని సూచించారు. పిల్లలను కూడా ఇలానే ప్రశ్నిస్తారనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు విచారణకు సహకరిస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ఈ కేసును తీవ్రంగా పరిగణించి.. అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేపడుతున్నామని చంద్రవదన్‌ ఎక్సైజ్‌ శాఖ మాదకద్రవ్యాల కేసును విచారించడం కొత్తకాదని అన్నారు.

డ్రగ్స్‌ వ్యవహారంలో సినీ ప్రముఖుల విచారణ ఎక్సైజ్‌ కార్యాలయంలో కొనసాగుతోంది. నాలుగో రోజు సిట్‌ ఎదుట నటుడు తరుణ్‌ హాజరయ్యారు. నిన్న సిట్‌ ఎదుట హాజరైన సుబ్బరాజును 13 గంటలపాటు సుదీర్ఘ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.