వసంత హేల (గేయం)
Jump to navigation
Jump to search
వసంత హేల (గేయం)
రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి
నా మనసులోని మనసా ఏమిటే నీగుసగుస
(1)
ప్రకృతి పరవిశించువేళ
చల్లగాలి వీచుచుండ
మందారపు మకరందం
భ్రమరమారగించువెళ
నా మనసులోని మనసా ఏమిటే నీగుసగుస
(2)
కొమ్మమీద కోయిలమ్మ
గున్నమామి చిగురుమేసి
కమ్మని కిలరావంతో
గళమెత్తి పాడుతుంటె
నా మనసులోని మనసా ఏమిటే నీగుసగుస
(3)
మధుమాసం వచ్చింది
అందాలను చిందింది
ప్రకృతిలో అణువణువు
పులకరింత నిస్తూంటె
నా మనసులోని మనసా ఏమిటే నీగుసగుస
నా మనసులోని మనసా ఏమిటే ..నీ .. గుస .. గుస