Jump to content

వర్గం చర్చ:అకారక్రమమున రచయితలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

సత్యసాయి విస్సా; కవి, రచయిత;

[మార్చు]

సత్యసాయి విస్సా - పరిచయం పేరు: సత్యసాయి విస్సా; కవి, రచయిత; ధ్యేయం: తెలుగు భాషా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ. పదవులు: వ్యవస్థాపక అధ్యక్షులు-విస్సా ఫౌండేషన్; ఉపాధ్యక్షులు-గాయత్రి బ్రాహ్మణసమాఖ్య; కార్యదర్శి-నవ్యసాహితీ వేదిక. చదువు ; ఎం.ఎ. తెలుగు; (తెలుగు విశ్వవిద్యాలయం) వృతి: కేంద్ర ప్రభుత్వ రక్షణమంత్రిత్వ శాఖ లో ప్రవృత్తి: 1) ఆకాశవాణి హైదరాబాద్, దూరదర్శన్ హైదరాబాద్ లలో కవితా గానం, 2) అంతర్జాలం ద్వారా స్కైప్, మరియు పేస్ బుక్ మాధ్యమంగా దేశ, విదేశాల్లో తెలుగు భాషా సంతతి వారికి తెలుగు సాహిత్య బోధన ద్వారా వారికి తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన, ఆసక్తి, అనురక్తి కలిగేట్లుగా వారి వారి అవగాహనా స్థాయిలను బట్టి పద్యాలూ, పాటలు, కవితలు, రాగ, భావ యుక్తంగా ఆలపించి నేర్పించి ఇలా వ్యక్తి గత స్థాయిలో ప్రత్యెక శ్రద్ధతో ప్రత్యెక బోధనా పద్ధతులు అవలంబించడం. తెలుగు భాషా సాహిత్య బోధనా ద్వారా విద్యార్ధినీ విద్యార్ధులకు వ్యక్తిత్వ వికాస తరగతులను, గృహాలలో, దేవాలయాల్లో, ఉద్యానవనాలలో, పాఠశాలలో నిర్వహించడం. 3) అంతర్జాతీయ టోరీ (తెలుగు వన్) రేడియో లో ప్రతి శనివారం శ్రీ సంజీవ (మారిషస్) గారితో కలిసి కార్యక్రమములోపాల్గొనుట; 5) రేడియో కేక – అనంతపురం; SCUBE Radio TV లో'మణిసాయి సాహితీ యుగళ గీతిక" కార్యక్రమాల నిర్వహణ 6) అంతర్జాలం ఆసరాగా పేస్ బుక్, బ్లాగ్, యు ట్యూబ్ లో విస్సా ఫౌండేషన్ ఛానల్ నిర్వహణ. 7) జాతీయ అంతర్జాతీయ తెలుగు సాహిత్య కార్యక్రమాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనుట, విస్సా ఫౌండేషన్; గాయత్రి సమాఖ్య, నవ్య సాహితీ వేదికల ఆధ్వర్యములో స్వయముగా, సలహాదారుడుగా కార్యక్రమాల నిర్వహణ; 8) ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయా ప్రాంతాలలో వివధ పాఠశాలలకి వెళ్లి స్వచ్చంద తెలుగు ఉపాధ్యాయ పాత్రలో చిన్నారులకి శ్లోకాలు, పద్య శిక్షణ, మరియు తెలుగు భాష సంస్కృతులు పెంపొందేలా బోధించడం. 9) ఆలయాలలో, సభలలో వివిధ సందర్భాలు మరియు దైవ కళ్యాణమహోత్సవాలలో ఆ వైభవాన్ని వ్యాఖ్యానం చెయ్యడం, చిన్న చిన్న ప్రవచనాలు, ప్రసంగాలు. 10) కవిత, వ్యాసాలు, కధలు, వంటి ఇతర రచనా వ్యాసంగాలు. 11) వివాహాలకి పద్యరత్నాలు, ప్రముఖులకు సన్మాన పత్రాలు రాయటం, ఆలపించటం. 12) అవార్డులు, సన్మానాలు: TANA (Telugu Association of Narth America) సన్మానం, అవార్డులు (రెండుసార్లు); ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ; రసమయి; విశ్వసాహితీ; ఇంకా ఎన్నో జాతీయ అంతర్జాతీయ సంస్థల అవార్డులు, అనేకసన్మానాలు.