Jump to content

వదరుబోతు/స్వకీయచరిత్ర

వికీసోర్స్ నుండి

స్వకీయచరిత్ర

9

'నేటి యుదయమున నా సంపాదకుఁడు నాకీ క్రిందిజాబు నొసంగెను.

"ఆర్యా! 'వధరుఁబోతు' పత్రికలఁజదివి యానందించు వారిలో నొక్కఁడనేను. కానీ మీరిట్లు వ్రాయస గాని కులగోత్ర నామాదుల మఱుఁగుపఱచియుం- డుట నాక కాదు పలువురకు రుచింపకున్నది. గ్రంథము విమర్శింపక మున్న గంధకర్త చరిత్రము. నెఱుఁగుటకై పాఠకలోకము కుతూహలపడుట యస్వాభావికముగాదు. కాక, యీయీ యజ్ఞాత వాసమునకుఁ గారణము, గూడ మాకు దురూ- హ్యము. ఈలోపము తొలగించితి లేని మీ లేఖలు మిగుల ప్రశ స్తిగాంచఁ గలవని,

విన్నవించు విధేయుఁడు,

అగస్త్య భ్రాత.

నిజమే! ఈ కాలమున గ్రంథముచేతఁ జిక్కి నంత గ్రంధకర్తయెవఁడో యేసీమవాఁడో, బా- లుడో, వృద్ధుఁడో, రూపసియో కురూపియో, వైదికుఁడో, నియోగియో, ఛాందసుడో, పట్టపరీక్షా సిద్ధుఁడో, మున్నగు విషయములఁ - గమనించుటే చదువరుల మొదటిపని, తరువాత గ్రంథకర్త లబ్ధప్రతిష్ఠుఁడుగానిచో గొప్పవారిచేతి పీఠికమైన యొక యోగ్యతాపత్రికయైన కంటబడనినాఁడు గ్రంథమెట్టిదైనను నిస్సారమే.

గ్రంథకగృత్వకీర్తి నాసించియున్నచో "నేనును దగురీతి నాశక్తిని భూతదర్పణమునఁ బ్రతిఫలింపఁ జేసి భేరీభాంకారములతో సాటించి, చాలమికి జమీందారుని కంకితమిచ్చియో, మహామహో

పాధ్యాయుల పీఠికను సంపాదించియో,రాయ బహదూరులచేతి యోగ్యతాపత్రికలను ముఖమున కతికించుకొనియో బయటఁగాన వచ్చుచుంటిని. మఱుఁగున నుండియే నాయనుభవములను, నా భావములను, నానిశ్చయములను హితార్థమై లోక మున కెఱిఁగించుటే నాసంకల్పము గాకున్నఁ. దొల్తనే నావ్రాతలు నవరసభరితములని, జాతీ- యాభ్యుదయ సంధాయకములని, అజ్ఞానతిమిర సూర్యోదయములని డబ్బిచ్చియైనఁ బతికలలోఁ బ్రకటించుకొనుచుంటిని. కాని నాయఙ్ఞాతవాస మనేకులకు రుచింప లేదగుటఁజేసి విధిలేక యిపుడు వృత్తాంత మొక్కింత వ్రాయవలసెను.

నేనొక్క త్రిదశుఁడను. విద్యాధర వంశ- జుఁడను. నాపూర్వులు హిమాలయ ప్రాంత దేశ విహారములు విడనాడి యిట్ల కరుదేరఁ గారణము లనేకములు సెప్పుదురుగాని వాని వివరములతోఁ జదువరుల నలయింపఁదలఁపలేదు. నాజన్మస్థానము వాఁగులేటి తీరమున, ప్రేలుకొండ చేరువనున్న గయ్యాళిపల్లియ. గట్టివాయి రాయఁడను విభు ధోత్తముఁడు నాతండ్రి! నాతల్లిని ఱాగమ్మ యం- దురు. మాయది గొప్ప పండితకవి వంశమని ప్రతీతి. ఆయూరి యవ్వలు కారణమునిట్లు చెప్పు . దురు. మునుపు సీతం గోల్పోయి యా ప్రాంతమునఁ దిరుగునాఁడొక కపి తన్నుస్తుతింపగా శ్రీరామ చంద్రుఁడు మెచ్చి యచటనివసించు వారండఱును మహావక్తలు కవులు నౌదురుగాత యని వరమిచ్చె నఁట! విజయనగరమున కరుగుచు నొకరాత్రి మా యూర నిద్రింపఁగలిగిన కారణముననే యల్లసాని పెద్దన యాంధ్రకవితాపితామహుఁడయ్యె నందురు. మనపాలిఁటి కివియన్నియుఁ బుక్కిటి పురాణములే, కాని యచట వాగ్మికానివాఁడు లేదు; కవికాని వాఁడరుదు. ఆయూరం జనించిన గ్రంథములసంఖ్య యింతయన నాతరముగాదు అచటి విదుషీమణులు రచించిన భారత భాగవత కావ్యములు చేట గంపలలోఁగూడఁ గానవచ్చును. పుస్తక రాశిలో సద్గ్రంధములు నేఱి యితరముల నచటి యవ్వలు వంట చెఱకుల కుపయోగింతురు. పోనిండు.

రాజస్థానములలోఁ బాండిత్యముచే నార్జిం చిన భూస్థితులును, అగ్రహారవృత్తులును, మావంశ మునకుఁ బెక్కులుగలవు. వానివలన వర్షమునకు వచ్చు మూడుముక్కాలు వరహాల యాదాయ ముచే నాజనకుఁడు దానధర్మాదులఁ జేయుచు శిష్యకోటి కొలువ మహా మహోపాధ్యాయ బిరుద మున సుఖముండును. నేను గర్భమున నున్న తఱి మాజనని దుర్ని రీక్ష్య ప్రభాభాసమానమై యద్వితీయవాగాటోప భీకరమై యుండెనఁట. ఆమె కప్పటి చిట్టములలోఁ బలుకుపండును బదరుకాయయును మాత్రమే రుచి కరములుగా నుండేనందురు. నేజనించిన నాఁటి రాత్రి నాజనకుని స్వప్నమున నొక సిద్ధుఁడు త్కరించి, నాకు వదరుబోతని నామకరణమొన రింప నానతిచ్చెనఁట. పెరిగి పెద్దయైనమీఁద నేఁ గొన్ని యద్భుత కార్యములఁ జేయగలనని యా మహాత్ముఁడనినట్లు మానాయన యపుడపుడు చె- ప్పుచుండునుగాని, నాకు విశ్వాసమున్నను లేకున్నను వానిఁ బ్రచురింప నాకిష్టము లేదు.

పసితనమందు సవయస్కుల గుమిగూర్చి వారి కేదేనియొక యంశము బోధించుచుంటినని మాయమ్మ చెప్పుకొనుచుండును. నాజననీజనకులే నాకు విద్యాభ్యాసముఁ గావించిరి. శాస్త్రకావ్యా దుల జనకునినుండియు ఉపన్యాస పద్ధతిని జనని నుండియు గ్రహించితిని. మోమోటములేక పరుల తప్పొప్పుల వారిసముఖముననే వెల్లడించుటయు, తలకువచ్చినను తథ్యమునే ఘంటా ఘోషముగాఁ బల్కుటయును జిన్న నాటినుండి నాయాదర్శములు. ఎంతటికష్టమైన వెనుకంజ వేయక తత్త్వమెఱుఁగఁ దివురుట నా కెక్కువ యభిమతము. ఒకనాడు వసుచరిత్ర పాఠముఁ జదువుచు,

"కంజనయ నావిలోచన!
   ఖంజనయుగ మెదకు వ్రాలఁగని వసు వాలో
   రంజిలుటఁ దెలిసి,.............."

యనుపద్యమున, కాటుకపిట్టల జంట వ్రా- లినచోట ధనముండునని భూగర్భశాస్త్ర రహస్య మిమిడ్చియుంటఁజూచి యందలి తత్వమరయఁ గోరి యప్పటికి పుస్తకముమూసి యరణ్యముల నంటి, కాటుకపిట్టల దాంపత్యమును వెదకుచు, మూఁడుమాసములు తిరిగితిని. తుదకొకనాఁడు నా కోరిక సఫలముకాఁగా నాచుట్టుప్రక్కల భూభా- గము-రమారమి, నాలు గెకరములు పట్టు- త్రవ్వించు నంతలో తళతళలాడుచు నొకరూక లభించినది. మహధానందమున “రామభూషణకవీ ధన్యుండవీ నన్నిఁటన్ ” అనుకొనుచు నూరుసేరి యొక గొప్ప వ్యాసము వాసి ప్రకటించితిని. నాటినుండి యనేక స్థలముల ననేకోపన్యాసము లీవలసిన చ్చెను. నా వ్యాసము లన్నియు, 'అముద్రిత గ్రంథపయోనిధి' లోఁ జూడఁదగు.

యుక్త వయస్సున నాకుఁ జరిణయ మొన రింపనెంచి నాజనకుఁడెంతో ప్రయత్నించెఁగాని కులరూప వయోవిద్యలచే నొప్పియున్నంగూడ నా నోటికి వెఱచి యెవ్వరును కన్య నిచ్చి పుణ్యము గట్టుకొనరైరి. ఈముష్టి యేమని, సత్యరాజాచా- ర్యుఁడు పోయిన మార్గమున స్త్రీ మళయాళమున కరిగితిని. అచటి నాపనులన్నియునుఁ జెప్పుచుండ నాకీది యదనుగాదు. కాని కొన్ని నాళ్ళలోనే నే నచట ప్రఖ్యాతిగాంచితిని. ఒకతూరి స్వయంవర విధిని గురించియు వివాహావశ్యకతఁ గూర్చియు నొక్క బిగిగా మూఁడుదినము లుపన్యసించు సంత- లో నచట కన్యలును, ప్రౌఢలును, అవ్వలును సభఁ జేసి యండఱు నొక్కమారుగా నన్నే పరి ణయనూడ నిశ్చయించుకొనిరఁట!. ఈమహిషీ సహస్రము నేలనోడి యా రాత్రియే తప్పించుకొని బ్రతికితినో భగవంతుఁడా యని యీ దేశమునకు వచ్చి యిఁక నెన్నఁడును వివాహము మాట యెత్త సని నిర్ధారించుకొంటిని.

కాని, రామేశ్వరమునకుఁ బోయినను శనై శ్చరుడు వదలలేదన్నట్లు, ఆకామినులలో గొందఱు నాయడుగుల జాడనంటి యీ దేశమున కరుదెంచి నన్ను వేటాడుచున్నారు. వారి బారికిఁ జిక్క కుండుటకై నాఁటినుండి నే నీయజ్ఞాత వాసమున నుండవలసివచ్చినది. నా యుపన్యాసము లన్నియు మూలఁబడినవి. నావాగ్ధోరణి చల్లారినది. కాని స్వభావము వదలలేక యీ లేఖల రూపమున నించుక వదరుచు నాయాత్మ తృప్తిఁగాంచు కొను చున్నాఁడను.

నేటికింత చాలును. మదీయములగు నితర విషయములఁ గూర్చి మఱియొక తూరి విన్నవించు కొనియెద.

__________